Illu illalu pillalu : శోభని బలవంతంగా తీసుకెళ్లిన తన ఫ్రెండ్స్.. ధీరజ్ కాపడగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -296 లో.....శ్రీవల్లి బట్టలు ఆరెస్తూ.. ఈ అమూల్య నా గురించి ఆ ప్రేమకి చెప్పినట్లుంది.. ఇప్పుడు ఆ ప్రేమ నన్ను ఏం అడుగుతుందోనని టెన్షన్ పడుతుంది. అప్పుడే ప్రేమ పక్కన వచ్చి నిల్చుంటుంది. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. అక్కడికి కూడా ప్రేమ వెళ్తుంది. అమూల్యని జాతర లో ఎందుకు వదిలేసి వెళ్లావని ప్రేమ అడుగుతుంది. జాతర అంతా చూడమని వెళ్ళానని శ్రీవల్లి చెప్తుంది. దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందని తెలిస్తే మాత్రం ఊరుకోనని శ్రీవల్లికి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు శోభ తన ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్తుంది. గౌతమ్ వాళ్ళు ఎక్కడ అని శోభ తన ఫ్రెండ్స్ అయిన బాయ్స్ ని అడుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారని అబద్దం చెప్తారు. శోభతో వాళ్ళు తప్పుగా బెహేవ్ చేస్తూ ఉంటే అది ధీరజ్ చూసి కార్ ఆగిపోయినట్లు అబద్ధం చెప్తాడు. ఆ ఇద్దరు బాయ్స్ ని కార్ తోయమంటాడు ధీరజ్. వాళ్ళు తొయ్యగానే ధీరజ్ ఆ అమ్మయితో కలిసి వెళ్ళిపోతాడు. వాళ్ళని చుస్తే డౌట్ గా ఉంది. అందుకే అలా చేసానని ధీరజ్ చెప్పగానే థాంక్స్ అన్నయ్య నేను ఇంటికి వెళ్తానని కార్ దిగుతుంది. ఆ తర్వాత కాసేపటికి శోభని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బలవంతంగా కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ప్రేమ డ్రింక్ చేసి మళ్ళీ నన్ను ఎక్కడ కొడుతుందోనని శ్రీవల్లి ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ అన్నీ దాచేస్తుంది. మరోవైపు తిరుపతి, రామరాజు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : గాయపడిన అత్త మనసు.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -495 లో....సుమిత్ర గురించి దశరథ్ బాధపడతాడు. కార్తీక్ వచ్చి.. మావయ్య అత్త మనసు గాయపడింది. ఇప్పుడు రావడానికి ఇష్టపడడం లేదు.. కొంచెం అత్తకి టైమ్ ఇవ్వండి ఎక్కడున్నా వచ్చేస్తుందని కార్తీక్ దైర్యం చెప్తాడు. పాపం దశరథ్ ని చుస్తే జాలేస్తుంది. అయిన ఏదో కనుక్కుంటానని వెళ్లావు ఏమైంది అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. మమ్మీ దీప దగ్గర ఉందో చుడడానికి వెళ్ళాను కానీ అక్కడ లేదు. . బావ కొత్త గేమ్ స్టార్ట్ చేసాడు.. అదేంటో కనుక్కోవాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత అసలు అమ్మమ్మ ఇక్కడ ఎందుకు ఉంది.. జ్యోత్స్న వస్తే ఎందుకు చెప్పొద్దన్నావని దీపని శౌర్య అడుగుతుంది. ఇది దాగుడు మూతల ఆట జ్యోత్స్న వస్తే అమ్మమ్మ దొరికిపోతుంది కదా అని దీప అంటుంది. మరొకవైపు నేను వేరొక ఇల్లుకి షిఫ్ట్ అవుతానని శ్రీధర్ తో కాశీ చెప్తాడు. వద్దని అన్నా కూడా కాశీ వినడు.. దాంతో నీ ఇష్టం కానీ మంచి ఇల్లు తీసుకోమని శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణకి జ్యూస్ తీసుకొని వస్తుంది జ్యోత్స్న. వద్దని శివన్నారాయణ అంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని జ్యోత్స్నని దశరథ్ అంటాడు. అసలు మమ్మీ వెళ్లడానికి కారణం నువ్వే కదా డాడీ అని జ్యోత్స్న అంటుంది. ఇద్దరిని విడగొట్టింది. నువ్వే అని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. శివన్నారాయణ బీపీ పెంచుకుంటుంటే.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు జ్యోత్స్న అని పారిజాతం అక్కడ నుండి పంపిస్తుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి శౌర్య వచ్చి.. అమ్మమ్మ మీరు దాగుడుమూతలు ఆడుతున్నారంట కదా.. ఇందాక జ్యోత్స్న వచ్చింది..  నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పలేదు. తాత, ముద్దుల తాత కూడా వస్తాడా అని శౌర్య అనగానే నాకోసం ఎవరు రారని సుమిత్ర సమాధానం చెప్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి అమ్మమ్మ రెస్ట్ తీసుకుంటుందని శౌర్యని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : బిడ్డని కంటే ప్రాణానికే ప్రమాదం.. వెక్కి వెక్కి ఏడ్చిన కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -858 లో.....కావ్య టపాసులు కాల్చాలని రాహుల్, రుద్రాణి కలిసి టాక్సిక్ కెమికల్స్ కలిపిన టపాసులు తీసుకెళ్తారు. వాటిని రాజ్ తీసుకొని వచ్చిన టపాసులలో కలుపుతారు. ఆ టపాసులని అప్పు, కళ్యాణ్ ఇద్దరు తీసుకెళ్ళి కాలుస్తారు. కావ్య కదా అవి కాల్చాల్సినవి అనుకొని రాజ్ దగ్గరికి రుద్రాణి వచ్చి కావ్య దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి నీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నావ్ కదా.. మరి కావ్య దగ్గరికి వెళ్లి తీసుకొని వచ్చి తనతో సెలబ్రేట్ చేసుకోమని రుద్రాణి చెప్తుంది. దాంతో కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి రమ్మని పిలుస్తాడు. మరొకవైపు అప్పు టపాసులు కాలుస్తూ ఆ పొగకి కళ్ళు తిరిగిపడిపోతుంది వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. తను చెక్ చేసి మీరు కాల్చే టపాసుల్లో టాక్సీక్ కెమికల్ ఎక్కువగా ఉంది.. అవి ఎవరు వాడకూడదని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అదేంటీ రాజ్ అవి నువ్వే తీసుకొని వచ్చావ్ కదా అని రుద్రాణి అంటుంది. ఇక అందరు కావ్య కోసం తీసుకొని వచ్చాడని అపార్ధం చేసుకొని రాజ్ ని తిడతారు. నా బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నావని రాజ్ చొక్కా పట్టుకొని కావ్య నిలదీస్తుంది. ఎందుకంటే నువ్వు చస్తావని అని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఇది మరొక నాటకమా అని కావ్య అంటుంది. అప్పుడే అప్పు ఎంట్రీ ఇచ్చి బావ చెప్పింది నిజమని చెప్తుంది. నువ్వు బిడ్డని క్యారీ చేస్తే అది నీ ప్రాణానికి ప్రమాదమని అప్పు చెప్తుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ జరిగింది చెప్పడంతో కావ్య బాధతో బయటకు వెళ్లి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కోటి రూపాయల లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటున్న...బిగ్‌బాస్ బ్యూటీ

  బుల్లితెర మీద ప్రియాంక జైన్ - శివ్ కుమార్ గురించి తెలియని వారు లేరు. మౌనరాగం సీరియల్ తో ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ ఆన్ స్క్రీన్ జంట ఆఫ్ స్క్రీన్ లో కూడా జంట కాబోతున్నారు. వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళ కోసం ఒక కొత్త ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. కోటి రూపాయల లోన్ తో ఈ ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ డ్రీం హోమ్ విత్ కోటి రూపాయల లోన్ అనే వీడియోని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నాం అని చెప్పుకొచ్చారు. "ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మా ఫ్యూచర్ హోమ్ ని కట్టుకుంటున్నాం. ఇల్లంటే ఇటుకలు, దూలాలు, సిమెంట్ మాత్రమే కాదు మా ఆశలు, కలలతో నిర్మించుకుంటున్నాం. ఇది ఇంటిని నిర్మించడం కోసం ఉన్న స్థలం మాత్రమే కాదు జీవితకాల పునాది. మా జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది. ఇక్కడ  జ్ఞాపకాలను దాచుకోవడానికి మా సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాం. మన జీవితంలోని కొత్త అధ్యాయంలో మాతో కలిసి మీరు రండి. గణపతి బప్పా మోరియా" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని పెట్టారు. ఇక వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని తెలిసి బుల్లితెర వాళ్లంతా విషెస్ చెప్తున్నారు. ఆరియానా, కాజల్ ఆర్జే, లాస్య మంజునాథ్, యాక్టర్ గౌతమ్ కృష్ణ అందరూ కాంగ్రతులషన్స్ చెప్తున్నారు.

Bigg Boss 9 Telugu: సంజన వర్సెస్ తనూజ.. నీ యవ్వ తగ్గేదేలే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ అవ్వగానే తనూజ వైల్డ్ ఫైర్ అవతూ కన్పిస్తుంది. ఎంతలా అంటే ఎవరేమైనా తన గురించి మాట్లాడితే ఇచ్చిపడేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో మార్నింగ్ సాంగ్ అవ్వగానే.. సంజన,  మాధురి మాట్లాడుకున్నారు.  తనూజాను ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్ నన్ను నామినేట్ చేశాడు. నిఖిల్ నాయర్ వచ్చాక కళ్యాణ్ ను తనూజ పట్టించుకోవట్లేదని సంజన అనగానే... అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాటలు వెనక్కి తీసుకోమంటూ మాధురి అంది. దాంతో మాధురి- కళ్యాణ్ ఇద్దరూ సంజనతో పర్సనల్ ఎటాక్ కి దిగారు. ఈ హౌస్ లో.. నా ఇమ్మాన్యుయేల్ నా అబ్బాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. నిన్ను వైల్డ్ కార్డ్స్ లో ఎవ్వరూ పట్టించుకోలేదు. పట్టించుకున్న ఇద్దరినీ మోసం చేశావంటూ ఇంకా గొడవను పెద్దది చేసింది సంజన. కాసేపటిక సంజన దగ్గరికి తనూజ వెళ్ళింది. సంజన గల్రానీ గారూ ఒక స్టేట్ మెంట్ పాస్ చేసేముందు ఆలోచించాలి. ఇదే గల్రానీ ఆ హౌస్ లో కూర్చుని నాకు పెళ్లయ్యింది, పిల్లలు పుట్టారు కాబట్టి మాట్లాడట్లేదు అన్నది. నాకు నాన్న లేరు కదా అని సంజన సమాధానం చెప్పగా, నాకు అమ్మ లేదు కదా... మీరు నా దగ్గరకు వచ్చారా, నేను మీ దగ్గరకు వచ్చానా అంటూ నిఖిల్ ను మొహం మీదే అడిగేసింది తనూజ. మైండ్ యువర్ వర్డ్స్... మీకు కళ్యాణ్ తో పాయింట్ ఉంటే అతనితో మాట్లాడండి. నా పేరు ఎందుకు వస్తోంది. ప్రతిదానికి వాడొచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు. నేను వెళ్తున్నానని అంటారు. ఇది నా క్యారెక్టర్ ని తక్కువ చేసినట్టుగా ఉంది..  అనవసరంగా బయటకు వెళ్లిన ఆమెను తెచ్చి నెత్తిన పెట్టుకున్నామంటూ తనూజ ఎమోషనల్ అయ్యింది. నేను ఇమ్మాన్యుయల్ ను బయటకు పంపలేదు నీలాగా.. నీవల్లే భరణి బయటకు వెళ్ళాడు. నువ్వేం నాకోసం త్యాగం చేయలేదు. కాఫీ గటగటా తాగేశావని సంజన అంది. రీతూ హెయిర్ కట్ చేసుకుంది. తనకి నా సెల్యూట్ అని సంజన అనగానే అయితే రోజు చేయండి సెల్యూట్ అని తనూజ అంది. నామినేషన్ తర్వాత వీరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu:  తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్..నువ్వా నేనా అంటు ఆర్గుమెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-9 లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉండగా ఆరుగురు పాత కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే సోమవారం జరిగిన నామినేషన్ లో కళ్యాణ్ చేసిన నామినేషన్ ని ఇమ్మాన్యుయల్ తీవ్రంగా తప్పుబట్టాడు. నువ్వు తనూజని నామినేట్ చేస్తానంటేనే నీకు నేను టికెట్ ఇచ్చాను.‌ కానీ నువ్వు అది వదలేసి సంజనని నామినేట్ చేసావ్.. నమ్మకద్రోహం చేసావని ఇమ్మాన్యుయల్ అనగానే తనూజకి ఫుల్ కోపం వచ్చింది. ఇక దివ్యని వాష్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి తనూజ డిస్కషన్ పెట్టింది.  వాడు (కళ్యాణ్) నామినేట్ చేయలేదు అనిసి లేచి వాయిస్ రైజ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని దివ్యకు తనూజ చెప్పగానే నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్ అనేసరికి ఇమ్మాన్యుయల్ వచ్చి మాట్లాడతాటు. నో.. డా.. నువ్వు మాట్లాడకని తనూజ అంటుంది. దీంతో ఇమ్మూ.. ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు తనూజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్లు ఉన్నాయని అన్నాడు అందుకే ఇచ్చానంటూ దివ్యకి ఇమ్మాన్యుయల్ చెప్తాడు.  తనూజ నన్ను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరికి ఇచ్చాడంటూ అడిగేసరికి.. ఈ వారం నా నామినేషన్స్ పాయింట్ నీ మీదనే ఉంది. అందుకే ఇచ్చానంటూ ఇమ్మాన్యుయల్ చెప్పాడు. అదే చెప్పాల్సిందని తనూజ అడుగగా.. అదేగా ఇప్పుడు చెప్పాను.. నాకు నీ మీద ఒక్కటే పాయింట్ ఉంది ఈ వారం అంతా చూసి నిన్ను నామినేట్ చేస్తానని తనూజకి ఇమ్మూ చెప్తాడు. నాకు సేఫ్ గేమ్ అనిపించిదంటూ ఇమ్మాన్యుయల్ అనేసరికి.. నీది కూడా నాకు సేఫ్ గేమ్ అనిపిస్తుందని తనూజ చెప్తుంది. దానికి చేయి మరి నన్ను నామినేట్ చేయి అంటూ అడిగాడు ఇమ్మాన్యుయల్. అయితే గత ఆరువారాలుగా ఇమ్మాన్యుయల్ నామినేషన్స్​లో లేడు. దీంతో అతని ఓట్​ బ్యాంక్​పై చాలా చర్చలు ఆడియన్స్​లో జరుగుతున్నాయి. ఇప్పుడు అది ఆలోచించే.. ఇమ్మాన్యుయల్ ఇలా చేస్తున్నాడేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. తనకి రమ్యని చేయాలని.. రమ్యకి తినని చేయాలని ఉంది. ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే పార్షియాలిటీ చూపించినట్లు ఉంటుంది. అందుకే ఇచ్చానని దివ్యతో ఇమ్మాన్యుయల్ అంటాడు.  వాళ్లు వాళ్లు చూసుకుంటారు కదా నాకేంటని ఇమ్మాన్యుయల్ అంటాడు. అది విన్న తనూజ సూపర్ గేమ్ అంటూ క్లాప్స్ కొడితుంది‌. దాంతో ఇమ్మాన్యుయల్ కూడా అదే రిపీట్ చేస్తాడు. గో టూ హెల్ అని తనూజ అనగానే గో టూ హెల్ అని ఇమ్మాన్యుయేల్ అంటాడు. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చానని బాధేసిందని ఇమ్మాన్యుయల్ అనేసరికి ఎవరూ ఎవరికోసం నిలబడలేదని తనూజా అంటుంది. రింగ్స్ గేమ్ తర్వాత.. నాకు ఇమ్మూ తప్ప ఎవరూ లేరని చెప్పావ్.. వాటర్ పూల్ టాస్క్ లో కూడా భరణి అన్న పోసాకే నేను పోసాను.. నీకు సపోర్ట్ చేసి నేను అందరి దృష్టిలో విలన్ అయ్యానంటూ ఇమ్మాన్యుయల్ అనగానే.. సూపర్ సూపర్ అంటు తనూజ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక తన పాయింట్లు దివ్యతో ఇమ్మాన్యుయల్ చెప్పగానే తను కూడా వ్యాలిడే అంది. ఆ తర్వాత అదే పాయింట్ గురించి కళ్యాణ్ తో డిస్కషన్ చేసాడు ఇమ్మాన్యుయల్.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లో దొంగలు పడ్డారు.. సంజన సైలెన్సర్ వర్సెస్ మాస్ మాధురి!

  బిగ్‌బాస్ సీజన్-9 లో  ఏడో వారం కొత్త టాస్క్ మొదలైంది. హౌస్ లో ఈ వారం కెప్టెన్ అవ్వడానికి అందరికి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.  అయితే నిన్నటి ఎపిసోడ్ లో సంజన-తనూజ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరిగాయి. వాష్ రూమ్ దగ్గర ఇమ్మాన్యుయల్-తనూజ మధ్య కూడా నువ్వా నేనా అన్నట్టుగా గొడవ సాగింది. ఆ తర్వాత బిగ్ బాస్ అసలు గేమ్ మొదలెట్టాడు. అందరికి దొంగల గెటప్ ఇవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కో గెటప్ వేశారు. నా పేరు సైకో సాంబ.. అంటూ డీమాన్ జబ్బల బనియన్ వేసుకొని వచ్చాడు. ఇది చూసి ఎవరివల్ల ఇలా తయారయ్యావని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇక నేను టిల్లు బావా ఆడపిల్లలందరికీ బావ.. అంటూ మగరాయుడి గెటప్ వేసుకొని మాధురి నడుము గిల్లేసింది తనూజ. దీంతో టిల్లు బావా ఒకసారి గిల్లు బావా అంటూ తనూజ వెంటపడ్డాడు ఇమ్మాన్యుయల్. దీనికి తనూజ నవ్వుతూ ఇమ్మూ భుజం మీద చేయి వేసి మనకి మనకి వద్దురా.. అంటూ డైలాగ్ వేసింది. అది అందరూ ఇలా ఉండాలి కంఫర్ట్ జోన్‌లో అంటూ ముందు జరిగిన గొడవపైన కౌంటర్లు వేశాడు ఇమ్మాన్యుయల్. రమ్య కూడా మగ రౌడీలా రెడీ అయింది. ఎవరికన్నా మీసాలు మూతి మీద వస్తాయ్ దీనికేంటి గడ్డం మీద వచ్చినయ్.. మీసాలకి ఏం ఆయిల్ వాడతారు చెప్పరా అంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు. సుమన్ శెట్టి ఏమో లుంగీ కట్టుకొని పైన కర్చీఫ్ కట్టుకొని గట్టిగానే రెడీ అయ్యాడు. ఇది చూసి సర్ మీరు నాకు తెలుసు యుగానికి ఒక్కడు సినిమాలో విలన్ కదూ అంటూ ఇమ్మూ అన్నాడు. తర్వాత రెండు గ్యాంగ్‌లకి గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్.  డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తున్న మొదటి అవకాశం.. గోలిసోడా.. ఈ పోటీలో తమ గ్యాంగ్‌లో ఉంటూ తమ తరఫున పోటీ పడటానికి ప్రతి గ్యాంగ్‌స్టర్‌కి ఇద్దరు పోటుగాళ్లు అవసరం.. ఎందుకంటే వారిలో నుంచి ఒకరు యాభై సోడాలు కొడుతుంటే ఇద్దరూ కలిసి మొత్తం మొత్తం సోడాలి తాగాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. మాధురి టీమ్ నుంచి డీమాన్-రమ్య.. సంజన టీమ్ నుంచి ఇమ్మూ-కళ్యాణ్ ఈ టాస్కులో పోటీపడ్డారు. సోడాలు కొట్టడం ఓకే కానీ తాగేటప్పుడే అందరికి తీరిపోయింది. ముప్పై సోడాలంటే మాటలు కాదుగా. అయినా ఎలాగోలా ఇమ్మూ-కళ్యాణ్ అయితే సోడాలు బాగానే లేపారు. ఇద్దరూ కలిసి డీమాన్-రమ్య కంటే ఎక్కువగా మొత్తం ఇరవై రెండు సోడాలు తాగి ఈ టాస్కులో గెలిచారు. హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెడ్ టీమ్ లీడింగ్ లో ఉంది.

Jayam serial : రుద్రని సూర్య కలుస్తాడా..అకాడమీలో పారుని చూసి అతను షాక్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -89 లో......రుద్ర ఎలక్షన్ లో పోటీ చెయ్యడం నాకు ఇష్టం లేదు.. మన కుటుంబం తరుపున వీరు ఎన్నికల్లో పోటీ చేస్తాడు.. ఆ విషయం పార్టీకి చెప్పండని శకుంతల అదేశిస్తుంది. తనకి ఇష్టం లేదన్నట్లు వీరు యాక్టింగ్ చేస్తాడు. మీరు అయిన అత్తయ్యకి చెప్పండి అని వీరు అంటాడు. ఇప్పుడు రుద్రకి లేని టెన్షన్ వద్దు.. ఎవరైతే ఏంటి మన కుటుంబం తరుపున ప్రజలకి మంచి జరిగితే చాలు అని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు  బాక్సింగ్ అకాడమీలో కొంతమందికి ట్రైనింగ్ ఇస్తుంది. అక్కడ ఒకతను జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. మీరు మీ అకాడమీ కోసం నన్ను పిలిచారు కానీ నాకు నా రేంజ్ కి తగ్గ ఫెసిలిటీ ఇక్కడ లేదని అక్కడి వాళ్ళపై కోప్పడుతుంది. ఆ తర్వాత గంగ రాత్రంతా నిద్ర లేచి తెల్లవారి లేచి పనిచేస్తూ కళ్ళు తిరిగినట్లు అయి కూర్చుంటుంది. అప్పుడే మక్కం ముసలివాడి వేషంలో వచ్చి గంగ మొహంపై నీళ్లు కొడతాడు. ఎవరు మీరని గంగ అడుగుతుంది. వీధిలోకి కొత్తగా వచ్చాను. ఆ తులసి చెట్టుకి రోజు నీళ్లు పోయండి.. మీ కష్టం తీరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. గంగ తులసి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ డబ్బు ఉండటం చూసి అది తీసుకుంటుంది. హమ్మయ్య సర్ ఇచ్చిన డబ్బు గంగకు అందాయని మక్కం దూరం నుండి చూసి అనుకుంటాడు. మరొకవైపు స్నేహ రెడీ అయి రుద్ర వెళ్తుంటే తన దగ్గరికి వచ్చి నన్ను దార్లో ఉన్న అకాడమీ దగ్గర డ్రాప్ చెయ్యమని చెప్తుంది. అది వీరు విని తన మనుషులకి ఫోన్ చేసి రుద్రని ఫాలో అవ్వండి. ఒకవేళ సూర్య ని కలిస్తే సూర్య నిజం చెప్పే సిచువేషన్ ఉంటే అతన్ని చంపెయ్యాండి అని చెప్తాడు. నాకు ఫేవర్ గా ఉన్నంతవరకే ఏదైనా అని వీరు అంటాడు. తరువాయి భాగంలో స్నేహ వెళ్లే అకాడమీలో పారుని రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : శోభకి పొంచి ఉన్న ప్రమాదం.. ధీరజ్ కనిపెడతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -295 లో......ధీరజ్ మొదటి రోజు క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నానని ప్రేమకి చెప్తాడు. ఈ రోజు ఎందుకో నా కన్ను అదురుతుంది. ప్లీజ్ ఈ రోజు వద్దని ప్రేమ ఆపుతుంది. అయిన వినకుండా బయల్దేరతాడు. దాంతో ప్రేమతో పాటు ఈ ఇంట్లో అందరు ఆపుతారు. అప్పుడే రామరాజు ఎంట్రీ ఇస్తాడు. ఏమైందని అడుగుతాడు. నాన్న డబ్బు సరిపోవడం లేదని క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యానని చెప్తాడు. ఏ రాయి అయితే ఏంటి కొట్టుకోవడానికి నేను చెప్పినట్టు విని మిల్ కి వస్తే బాగు పెడతావని రామరాజు అనగానే ధీరజ్ వెళ్ళిపోతాడు. ఏంటి అండి ఆ మాటలు అని వేదవతి అంటుంది. వాడు బాధ్యతతో ఉంటే నాకు గర్వంగా ఉంది కానీ అలా నేను కఠినంగా లేకపోతే అలుసు అవుద్ది అందుకే ఇలా అని రామరాజు అంటాడు. ఆ తర్వాత శ్రీవల్లిని విశ్వ పిలిచి అమూల్యని బయటకు పంపించు అంటాడు. అమూల్య దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. నాకు కడుపులో మంటగా ఉంది కూల్ డ్రింక్ తీసుకొనిరా అని చెప్తుంది. దాంతో అమూల్య వెళ్తుంటే ప్రేమ ఎదురుపడుతుంది. శ్రీవల్లి వదినకి కూల్ డ్రింక్ అంట అని అమూల్య చెప్తుంది. ఏంటి అలా చూస్తున్నావ్ వదినకి ఆమాత్రం తీసుకొని రావద్దా ప్రేమ ఉంటే తీసుకొని వస్తుంది లేదంటే లేదని శ్రీవల్లి అక్కడ నుండి వెళ్తుంది. ప్రేమని చూసి విశ్వ లోపలికి వెళ్తాడు. అసలు మొన్న ధీరజ్ మా అన్నయ్యని కొట్టడానికి కారణం ఏంటని ప్రేమ అడుగుతుంది. ఈ మధ్య నాతో మాట్లడడానికి ట్రై చేస్తున్నాడని అమూల్య చెప్తుంది. మరొకవైపు క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయి క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. ఒకమ్మాయిని తన ఫ్రెండ్స్ తో వాళ్ళ నాన్న బయటకు పంపిస్తాడు. నా కూతురుని ఎప్పుడు ఎక్కడికి పంపలేదని ధీరజ్ గురించి తెలుసుకొని తనని ఫోటో దింపుకుంటాడు. ముందు జాగ్రత్త బాబు అని చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయి పేరు శోభ.. తన ఫ్రెండ్స్ ఇద్దరు బాయ్స్ కొంచెం దూరం వెళ్ళాక ఎక్కుతారు. వాళ్ళు శోభ గురించి ఏదో సైగ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్రని చూడలేక వెళ్ళిపోయిన జ్యోత్స్న.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -494 లో..... సుమిత్రకి దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. నేను తిననని అంటుంది. ఆ టిఫిన్ దీప చెయ్యలేదు నేనే చేసాననని కాంచన అంటుంది.ఆ తర్వాత సుమిత్రకి దీప టిఫిన్ తినిపిస్తుంది. దీప చాలా మురిసిపోతుంది. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. అవును అమ్మ వెళ్లడం నేను చూసానని జ్యోత్స్న చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. అమ్మ బావకి దొరికింది అందుకే అంత కూల్ గా ఉన్నాడు.. మమ్మీ కన్పించకపోతే దీప ఎలా వెతికేది.. అలాంటిది వంట చేస్తూ ఇక్కడికి క్యారియర్ పంపిస్తుందంటే అర్థం చేసుకో.. నేను ఇప్పుడు బావ ఇంటికి వెళ్తున్నానని జ్యోత్స్న వెళ్తుంది. అసలు ఇది ఏం చేస్తుందని పారిజాతం అనుకుటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. మా అమ్మ ఇక్కడ ఉందని అంటుంది. లేదని దీప చెప్తుంది. అక్కడే ఉన్న శౌర్యని అడుగగా.. అమ్మమ్మ ఉందని చెప్తుంది. నాకు చూపించు అనగానే శౌర్య తనని తీసుకొని వెళ్లి అంబుజవల్లి ఫోటో దగ్గరికి వెళ్లి ఆవిడే మా అమ్మమ్మ అని చూపిస్తుంది. శౌర్య నిజం చెప్పలేదని దీప, కాంచన హ్యాపీగా ఉంటారు. జ్యోత్స్న తిరిగి వెళ్తుంటే గదిలో నుండి దగ్గినట్లు సౌండ్ వస్తుంది. దాంతో జ్యోత్స్న గదిలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ ఎవరుండరు. దాంతో జ్యోత్స్న తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీప గదిలోకి వెళ్లేసరికి సుమిత్ర కింద పడిపోయి ఉంటుంది పైకి లేపి పైన పడుకోబెడుతుంది తనని ఆ సిచువేషన్ లో చూసి కాంచన బాధపడుతుంది. మరొకవైపు సుమిత్రని తల్చుకొని దశరథ్ బాధపడతాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ తెచ్చిన పటాసులు కాల్చిన కళ్యాణ్.. కళ్ళు తిరిగిపడిపోయిన అప్పు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -857 లో..... రాజ్ కి సపోర్ట్ చేస్తానని ఇందిరాదేవి చెప్తుంది. థాంక్స్ నానమ్మ నువ్వైనా సపోర్ట్ గా ఉన్నవని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి కలిసి టాక్సిక్ కెమికల్స్ తో ఉన్న టపాసులు రెడీ చేయించి తీసుకొని వస్తారు. అవి కాలిస్తే కావ్య బిడ్డకి ప్రాబ్లమ్ అయి అబార్షన్ అవుతుందని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత స్వరాజ్ ని పిలిచి ఆ టపాసులు ఇవ్వాలని ట్రై చేస్తారు కానీ స్వరాజ్ తీసుకోడు. మా మావయ్య కొనిస్తాడంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు రాజ్ కి కనకం వాళ్ళు బట్టలు తీసుకొని వస్తారు. కావ్యకి ఇచ్చి ఇవ్వమంటారు. నేను ఇస్తే అసలు తీసుకోడు మీరు ఈ బట్టలు ఇవ్వండి నేను పాత బట్టలు ఇస్తాను నాపై కోపంతో మీరు ఇచ్చిన బట్టలు వేసుకుంటారని కావ్య అనగానే ఇందిరాదేవి, కావ్య ఇద్దరు రాజ్ దగ్గరికి వెళ్తారు కానీ ఇందిరాదేవి తీసుకొని వెళ్లిన బట్టలు రాజ్ తీసుకుంటాడు. ఆ తర్వాత నేను చెప్పాను కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి స్వరాజ్ వచ్చి టపాసులు కొనివ్వమని అడుగుతాడు . అందరు రెడీ అయి వచ్చి టపాసులు పేలుస్తారు. రుద్రాణి, రాహుల్ వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చిన టపాసులు రాజ్ తీసుకొని వచ్చిన దాంట్లో కలుపుతారు. అప్పుడే అప్పు, కళ్యాణ్ బయటకి వచ్చి రాహుల్, రుద్రాణి వాళ్ళు తీసుకొని వచ్చినవి తీసుకుంటారు. అప్పు అవి పేల్చి కళ్ళు తిరిగిపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బుల్లితెర నటుడు కాళిదాసు మహేష్ బాబు - సాండ్రా పెళ్లి అక్టోబర్ 31 న

  బుల్లితెర నటుడు కాళిదాసు మహేష్ బాబు సాండ్రాతో తన పెళ్లి ముహుర్తాన్ని రివీల్ చేసాడు. సమ ప్రయాణం అనే యూట్యూబ్ ఛానెల్ లో వాళ్ళు ఈ గుడ్ న్యూస్ ని చెప్పారు.  "నిజానికి మా పెళ్లి ఈపాటికి ఐపోయి ఉండాలి. శ్రావణ మాసంలో చేసుకోవాల్సి ఉంది. ఐతే ఆగష్టు లో డేట్ సెట్ అయ్యింది. కానీ అప్పుడు షూటింగ్స్ ఉన్నాయి. అలాగే పెళ్లి అంటే చాలా చేయాలి. మినిమం ఒక పది రోజులు పడుతుంది. ఐతే సాండ్రాకి  కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకుంది. శ్రావణ మాసంలో మా ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక విషయం జరగాలని సాండ్రా కోరుకుంది. అందుకే శ్రావణ మాసంలో శ్రీశైలంలో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాం చేసుకున్నాం. అలా ఒక శుభకార్యం జరిగింది. కాబట్టి కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలి అనుకుని ముహూర్తాలు చూడమని చెప్తే ఒకే ఒక్క డేట్ వచ్చింది. మా నక్షత్రాలు, జాతకాల ప్రకారం రెండు మూడు ముహూర్తాలు పెట్టమని అడిగాం. సీరియల్ షూటింగ్స్ అవీ జరుగుతూ ఉంటాయి కదా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి అని అడిగాం.  ఐతే ఒకే ఒక్క ముహూర్తం తప్ప ఇంకేమీ లేవు కావాలంటే పెట్టుడు ముహుర్తాలు ఉంటాయి అని చెప్పారు. "చి ల సౌ. సాండ్రా సుహాసిని జయచంద్రన్ ని చిరంజీవి కాళిదాసు మహేష్ బాబు గారికి కార్తీక మాసంలో ఒక శుభ నక్షత్రంలో శుభ ముహూర్తం ఐన అక్టోబర్ 31 న ఆ పార్వతి పరమేశ్వరులు నిర్ణయించారు". ఈ డేట్ ఎందుకు స్పెషల్ అంటే ఆ రోజు నా పుట్టినరోజు...దాంతో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే నేను పుట్టింది తనను పెళ్లి చేసుకోవడానికే అని ఆ దేవుడు రాసిపెట్టేసాడు. ఒక పుణ్య క్షేత్రంలో మా పెళ్లి జరగబోతోంది"...అంటూ కాళిదాసు మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

నా వయసు 35  అంటున్న శరత్ కుమార్

  "డ్యూడ్" మూవీ ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. దాంతో హీరో ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్ ఇద్దరూ నెక్స్ట్ వీక్ జబర్దస్త్ షోకి గెస్టులుగా రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. వీళ్ళు స్టేజి మీదకు రాగానే రష్మీ అడిగింది. "ఈ అల్లుడు నుంచి ఎం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో " అంటూ ప్రదీప్ ని చూపించి శరత్ కుమార్ ని అడిగింది రష్మీ. "మంచి అల్లుడు అండి. నేను ఎం చెప్తానో అది చేస్తారు. ఇప్పుడు కాదండి పిక్చర్ లో చెప్తున్నాను " అంటూ చెప్పారు శరత్ కుమార్. ఇక ప్రోమో లాస్ట్ లో ఐతే రాంప్రసాద్ శరత్ కుమార్ తో ఇలా అన్నాడు. "శరత్ కుమార్ సర్ ఈ ఏజ్ లో కూడా మీ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సర్ దానికి హ్యాట్సాఫ్ సర్" అన్నాడు. వెంటనే ఆయన థ్యాంక్యూ అని చెప్పారు. "మీరు ఇప్పుడు కూడా రఫ్ గా 40 , 41 అని మీ వయసు చెప్పుకోవచ్చు సర్" అని మళ్ళీ రాంప్రసాద్ అనేసరికి దానికి శరత్ కుమార్ "లేదు 35 " అని కౌంటర్ వేసేసరికి రాంప్రసాద్ తలబాదుకున్నాడు. ఇక హీరో ప్రదీప్ రంగనాథ్ బులెట్ భాస్కర్ స్కిట్ లో వర్షకి అన్న రోల్ లో నటించి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక నెటిజన్స్ ఐతే "శరత్ కుమార్ గారు పెద్ద యాక్టర్ జబర్దస్త్ కి రావడం గ్రేట్" అంటున్నారు. ఇంకొంతమంది నెటిజన్స్ ఐతే "ప్రదీప్ రంగనాథన్ బెస్ట్ రెస్పెక్ట్, ఆయన టైమింగ్ బాగుంది" అంటూ కామెంట్ చేస్తున్నారు. "డ్రాగన్" మూవీతో హీరో ప్రదీప్ మీద ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఇక ఇప్పుడు డ్యూడ్ తో తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు. తమిళ్ లో కంటే ఈ మూవీకి తెలుగులోనే మంచి కలెక్షన్స్ ని అందుకుంటోంది.

నెలకు 2 లక్షలు సంపాదించాలి...కాబోయే భర్త క్వాలిటీస్ గురించి చెప్పిన శ్రీనిధి

  శ్రీనిధి శెట్టి రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ లోకి వచ్చిన హీరోయిన్. రీసెంట్ గా తెలుసు కదా అనే మూవీలో రాశిఖన్నాతో పాటు నటించింది. ఇక ఈమె ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి ఈ వీక్ వచ్చింది. అలాగే శ్రీనిధి తనకు కాబోయే ఫ్యూచర్ హజ్బెండ్ ఎలా ఉండాలో శ్రీముఖి ఇచ్చిన టాస్క్ లో చెప్పింది. "తెలుసుకోవాలి కదా" అనే గేమ్ లో అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది. అబ్బాయికి ఏజ్ వచ్చేసరికి మొదటి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంది కానీ తర్వాత అసలు విషయం చెప్పింది. 30  - 40 మధ్యలో ఉండాలని చెప్పింది. అలాగే ఇక అబ్బాయి హైట్ 5 ' 8 కి మించి ఉండాలని చెప్పింది. ముద్దు పెట్టడానికి నుదురు అందేలా ఉంటే చాలు అని చెప్పింది. ఇక వెయిట్ వచ్చేసరికి 70 - 80 మధ్యన ఉండి ఫిట్ గా ఉండాలని అలాగే మంచి మనసు ఉండాలని చెప్పింది. ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు అవసరం లేదు కానీ మంచి మనసు ఉండాలని చెప్పింది. ఇక అతను ఏ రంగానికి చెందకుండా నాన్-ఫేమస్ పర్సన్ అయ్యి ఉండాలని చెప్పింది. నెలకు 2 లక్షల సంపాదన ఉండడంతో పాటు ట్రావెలింగ్ చేయాలి అలాగే ఏదైనా స్పోర్ట్ లో ఇంటరెస్ట్ ఉండాలి ఇంకా ఇంట్లో ఇంట్లో ఉండి ఫుల్ ఛిల్ల్ అయ్యే పర్సన్ కావాలని చెప్పింది. ఇక అబ్బాయికి లైట్ గా గడ్డం ఉండాలని, మంచి స్మైల్ తో పాటు అందమైన కళ్ళు ఉండాలని కూడా చెప్పింది శ్రీనిధి. ఈమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి కేజిఎఫ్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే హిట్ 3 లో కూడా మంచి నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈమె 2015 లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ ని విన్ అయ్యింది. 2016 లో మిస్ సుప్రనేషనల్ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీనిధి రాసిన ప్రతీ ఆన్సర్ కి ఎగబడి మరీ ఎక్కువ చేసిన అవినాష్ కి, హరికి మాత్రం ఫుల్ కౌంటర్లు ఇచ్చి కంట్రోల్ చేసింది.

యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా పర్లేదు .. కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "తెలుసు కదా" మూవీ నుంచి రాశి ఖన్నా, శ్రీనిధి వచ్చారు. వీళ్ళు ఈ ఎపిసోడ్ కి అదనపు ఆకర్షణగా నిలిచారు. ఐతే వీళ్లకు ఫ్యూచర్ హజ్బెండ్స్ రావాలి అనే విషయం మీద శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ పేరు "తెలుసుకోవాలి కదా" అంది. అందులో రాశి ఖన్నా తన కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పిందిలా.  "35 - 38 మధ్య వయసు ఉండాలి, 5 '9 నుంచి 6 '3 మధ్య అబ్బాయి హైట్ ఉండాలి అలాగే 85 కిలోల లోపు ఉండాలి అలాగే బాడీ ఫిట్ గా ఉండాలి" అని చెప్పింది." ఇక ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు లేకపోయినా పర్లేదు అని చెప్పింది. అలాగే యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా కానీ పర్లేదని కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలని కండిషన్ పెట్టింది. ఇక హాబీస్ విషయానికి వస్తే ట్రావెలింగ్ అంటే తనకు ఇష్టం కాబట్టి ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి అలాగే ట్రావెలింగ్ చేయని టైములో రీడింగ్ కూడా హాబీగా ఉండాలని చెప్పింది. ఇక తనకు కాబోయే అబ్బాయి ఫేస్ ఫీచర్స్ స్మార్ట్ గా ఉనాడాలని కళ్ళు లోతుగా ఉండాలని షార్ప్ గా ఉండాలి అని చెప్పింది. ఆయన కళ్ళు చూస్తూ నేను అలా మైమరిచిపోవాలి అలాగే నాకు బ్యూటిఫుల్ బేబీస్ కావాలి అందుకే అని చెప్పింది రాశిఖన్నా.

Bigg Boss 9 Nominations: ఏడో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో కొన్ని ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటగా హౌస్ లో ఉన్న ఇద్దరు కెప్టెన్స్ కి ఓ పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో బ్లూ పిల్, రెడ్ పిల్ ఉంచారు. వారిలో ఎవరు ఏ పిల్ తీసుకుంటారో డిసైడ్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి రెడ్ పిల్, గౌరవ్ బ్లూ పిల్ తీసుకుంటాడు. అయితే బ్లూ పిల్ లో సేవ్ అదర్స్ , రెడ్ పిల్ లో సేవ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇక సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయ్యాడు. గౌరవ్ తన పవర్ ని ఎవరికి వాడాడో చూసేద్దాం. మొదటగా రీతూని అయేషా డైరెక్ట్ నామినేషన్ చేసింది. ఆ తర్వాత అయేషా, శ్రీనివాస్ సాయిని దివ్య నిఖిత నామినేషన్ చేసింది. రీతూ చౌదరి రాముని కూడా నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య కూడా గొడవ పీక్స్ లో‌ జరిగింది. రాము హౌస్ లో అసలు కనిపించడం లేదు, అతడు ఫేక్ అంటూ రీతూ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత తనూజని రమ్య మోక్ష నామినేట్ చేసింది. తనూజ సొంతంగా గేమ్ ఆడలేదు. తనూజ ఫేక్, ఆమె నటిస్తోంది. ఆమె చేసేది మొత్తం నటనే అనగా ఎవరేంటో హోస్ట్ సర్ చూపించారు.. నీలా బ్యాక్ బిచ్చింగ్ నేను చేయనంటూ తనూజ ఫైర్ అయింది. వీరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత సంజనని కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ హర్ట్ అయ్యాడు. తనూజని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను కళ్యాణ్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. కానీ తనపై నామినేషన్ అయిపోయిందని కళ్యాణ్ అన్నాడు. ఎవరో చెప్పడం వేరు.. కళ్యాణ్ అనేవాడు చెప్పడం వేరు.. నువ్వు తనని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను.. ఐ డిడ్ ఏ మిస్టేక్.. రేపు సంజన ఎలిమినేషన్ అవుతే నా తప్పు అవుతుంది. నీకు ఇవ్వడం నేను చేసిన తప్పు అవుతదని ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు. ఇక నామినేషన్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసే పవర్ గౌరవ్ కి ఇచ్చాడు బిగ్ బాస్. అయేషాని సేవ్ చేస్తున్నట్లు గౌరవ్ చెప్పాడు. రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్ పడాల, సంజన గల్రానీ, దివ్య నిఖిత వెలమూరు ఈ వారం నామినేషన్లో ఉన్నారు.  

Jayam serial : వీరు ఆడిన అబద్ధం.. అతడికి బలంగా మారిందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -88 లో.....సూర్య తన అన్న వీరు గురించి నిజం చెప్పబోతుంటే అప్పుడే వీరు మనుషులు వస్తారు. వాళ్ళని చూసి సూర్య అక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి టిఫిన్ సెంటర్ దగ్గరికి రుద్ర వస్తాడు. గంగ టవల్ తో తనని గుర్తు పట్టకుండా కవర్ చేస్తుంది. రుద్రకి టిఫిన్ సెంటర్ ఓనర్ సూర్య మాట్లాడిన వీడియో చూపిస్తాడు.  అందులో రుద్ర నేనొక విషయం చెప్పాలని మాత్రమే ఉంటుంది. దాంతో రుద్ర అక్కడి నుండి వెళ్తాడు. ఆ తర్వాత రుద్రని సూర్య చూసి వెళ్ళబోతుంటే.. వీరు మనుషులు అక్కడే ఉన్నారని ఆగిపోతాడు. సూర్య కోసం రుద్ర వెతుకుతుంటే అప్పుడే మక్కం కనిపిస్తాడు.. మీరేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు‌. గంగ ఆ టిఫిన్ సెంటర్ లో వర్క్ చేస్తుందని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తారు‌. అలా చెప్పగానే రుద్ర తన వంక చూస్తాడు. సరే మీరు తనని ఫాలో అవ్వండి.‌. తన సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పి రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు వీరు మనుషులు వీరుకి ఫోన్ చేసి రుద్ర తప్పించుకున్నాడని చెప్తాడు. అంతేకాకుండా రుద్రని కలవడానికి సూర్య ట్రై చేస్తున్నాడని చెప్తారు. దాంతో నో రుద్రని వాడు కలవడానికి వీల్లేదని వీరు అంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్లంతా వస్తారు. ఏంటి రుద్రని కలవకూడదంటున్నావని పెద్దసారు అడుగుతాడు. ఇప్పుడు పొలిటికల్ మూమెంట్ కదా పార్టీ తరుపున రుద్ర బావగారిని పోటీ చెయ్యమంటున్నారు.. ఎలాగా బాను బావ పాలిటిక్స్ ద్వారా ప్రజలకి సేవ చెయ్యాలని కోరిక కదా అని వీరు కవర్ చేస్తాడు. నా బాను కోరిక అదే అయితే పోటీ చేసేది రుద్ర కాదు వీరు అని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. వీరు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సర్లే ఇప్పుడు రుద్రకి ఈ టెన్షన్ వద్దని పెద్ద సర్ లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఆనందరావు మాటలకి కన్విన్స్ అయిన రామరాజు.. భాగ్యం కోపానికి బలి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -294 లో.....మొన్న పార్టీలో ధీరజ్, ప్రేమ ముద్దు పెట్టుకున్నారని నర్మద చెప్పగానే ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే అని వేదవతి అంటుంది. శ్రీవల్లిని అక్కడ నుండి పంపిస్తుంది వేదవతి. ఏంటే ధీరజ్, ప్రేమ మధ్య ప్రేమ మొదలు అయిందా అని వేదవతి అడుగుతుంది. అయింది పార్టీలో ముద్దు పెట్టుకున్నారట.. వాళ్ళ ఇద్దరిని ఒకటే చేసే బాధ్యత నాది అని నర్మద అంటుంటే.. ఓసిని గవర్నమెంట్ కోడలో అని నర్మదకి ముద్దుపెడుతుంది వేదవతి. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమ మాట్లాడకపోయేసరికి కావాలనే ఫోన్ లో మాట్లాడినట్లు నటిస్తాడు. చెప్పు బేబీ అంటూ మాట్లాడుతాడు. దాంతో ప్రేమ ఫోన్ లాక్కొని లాక్ చెప్పరా.. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. మీ అమ్మాయిలకి అందంతో పాటు అసూయ కూడా ఎక్కువేనని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు దగ్గరికి వస్తారు. ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారని రామరాజు అనగానే వాళ్ళు టెన్షన్ పడుతారు. మీరు బజ్జీలు చేసుకొని అమ్మాల్సిన అవసరమేంటి.. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయ్యొచ్చు కదా అని అంటాడు. చేస్తాం అండి నెల రోజుల్లో మంచి స్థాయికి వస్తామని ఆనందరావు అంటాడు. గుడ్ నేను ఇంకా పెట్టుబడికి డబ్బు ఇద్దామనుకున్న కానీ మీరు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు కదా అని బుజ్జీమ్మ ఈ డబ్బు లోపల పెట్టు అనగానే ఆనందరావు వంక భాగ్యం కోపంగా చూస్తుంది. బయటకు వెళ్ళాక ఆనందరావు పని చెప్తుంది. ఆ తర్వాత ధీరజ్ రెడీ అయి.. ప్రేమ దగ్గరికి వస్తాడు. నేను మొదటి రోజు క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నానని చెప్తాడు. వద్దని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : భార్య కోసం భర్త కలవరింత.. మాటిచ్చిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -493 లో...... సుమిత్ర స్పృహలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నానేంటని వెళ్లిపోతుంటే.. శౌర్య వచ్చి ఆపుతుంది. అమ్మమ్మ మీరు ఇక్కడే ఉండాలని అంటుంది. లేదు వెళ్ళాలని తను అంటుంది. అప్పుడే దీప వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండాలని దీప అంటుంది. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్లాలని దీప అంటుంది. అలా అయితే నా చావుతో సమానమని చెప్పాను.. అయిన సరే తీసుకొని వచ్చావ్ అంటే నీ ఉద్దేశ్యం ఏంటని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే కాంచన వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పలేదు అమ్మ అని దీప అంటుంది. నేను నమ్మనని సుమిత్ర అనగానే నిజం వదిన చెప్పలేదని కాంచన అంటుంది. నా కోసం నువ్వు ఎందుకు వెతకాలి అంటే ఒక మాట అన్నావ్ గుర్తు ఉందా అని సుమిత్ర అడుగుతుంది. అవును అన్నానని దీప అంటుంది. నువ్వు నా అమ్మవి అందుకే వెతుకుతున్నానని అంది. అలా ఎందుకు అన్నవని సుమిత్ర అడుగుతుంది. ఎందుకు అంటే మిమ్మల్ని నేను ఆలా ఫీల్ అవుతున్నానని దీప అంటుంది. మరొకవైపు సుమిత్ర గురించి దశరథ్ నిద్ర నుండి ఒక్కసారిగా ఉల్లిక్కిపడి లేస్తాడు. ఇంట్లో అందరు వస్తారు. మీరేం కంగారు పడకండి మావయ్య అత్త క్షేమంగా ఉందని కార్తీక్ చెప్తాడు. ఏ దైర్యం తో ఉండమంటావ్ రా అని శివన్నారాయణ అడుగుతాడు. నా మీద నమ్మకం ఉంచండి అని కార్తీక్ అంటాడు. మరొకవైపు సుమిత్ర కోసం దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. వద్దని అంటుంది. నేనే చేసాను వదిన అని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.