యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా పర్లేదు .. కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "తెలుసు కదా" మూవీ నుంచి రాశి ఖన్నా, శ్రీనిధి వచ్చారు. వీళ్ళు ఈ ఎపిసోడ్ కి అదనపు ఆకర్షణగా నిలిచారు. ఐతే వీళ్లకు ఫ్యూచర్ హజ్బెండ్స్ రావాలి అనే విషయం మీద శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ పేరు "తెలుసుకోవాలి కదా" అంది. అందులో రాశి ఖన్నా తన కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పిందిలా.  "35 - 38 మధ్య వయసు ఉండాలి, 5 '9 నుంచి 6 '3 మధ్య అబ్బాయి హైట్ ఉండాలి అలాగే 85 కిలోల లోపు ఉండాలి అలాగే బాడీ ఫిట్ గా ఉండాలి" అని చెప్పింది." ఇక ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు లేకపోయినా పర్లేదు అని చెప్పింది. అలాగే యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా కానీ పర్లేదని కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలని కండిషన్ పెట్టింది. ఇక హాబీస్ విషయానికి వస్తే ట్రావెలింగ్ అంటే తనకు ఇష్టం కాబట్టి ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి అలాగే ట్రావెలింగ్ చేయని టైములో రీడింగ్ కూడా హాబీగా ఉండాలని చెప్పింది. ఇక తనకు కాబోయే అబ్బాయి ఫేస్ ఫీచర్స్ స్మార్ట్ గా ఉనాడాలని కళ్ళు లోతుగా ఉండాలని షార్ప్ గా ఉండాలి అని చెప్పింది. ఆయన కళ్ళు చూస్తూ నేను అలా మైమరిచిపోవాలి అలాగే నాకు బ్యూటిఫుల్ బేబీస్ కావాలి అందుకే అని చెప్పింది రాశిఖన్నా.

Bigg Boss 9 Nominations: ఏడో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో కొన్ని ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటగా హౌస్ లో ఉన్న ఇద్దరు కెప్టెన్స్ కి ఓ పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో బ్లూ పిల్, రెడ్ పిల్ ఉంచారు. వారిలో ఎవరు ఏ పిల్ తీసుకుంటారో డిసైడ్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి రెడ్ పిల్, గౌరవ్ బ్లూ పిల్ తీసుకుంటాడు. అయితే బ్లూ పిల్ లో సేవ్ అదర్స్ , రెడ్ పిల్ లో సేవ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇక సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయ్యాడు. గౌరవ్ తన పవర్ ని ఎవరికి వాడాడో చూసేద్దాం. మొదటగా రీతూని అయేషా డైరెక్ట్ నామినేషన్ చేసింది. ఆ తర్వాత అయేషా, శ్రీనివాస్ సాయిని దివ్య నిఖిత నామినేషన్ చేసింది. రీతూ చౌదరి రాముని కూడా నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య కూడా గొడవ పీక్స్ లో‌ జరిగింది. రాము హౌస్ లో అసలు కనిపించడం లేదు, అతడు ఫేక్ అంటూ రీతూ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత తనూజని రమ్య మోక్ష నామినేట్ చేసింది. తనూజ సొంతంగా గేమ్ ఆడలేదు. తనూజ ఫేక్, ఆమె నటిస్తోంది. ఆమె చేసేది మొత్తం నటనే అనగా ఎవరేంటో హోస్ట్ సర్ చూపించారు.. నీలా బ్యాక్ బిచ్చింగ్ నేను చేయనంటూ తనూజ ఫైర్ అయింది. వీరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత సంజనని కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ హర్ట్ అయ్యాడు. తనూజని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను కళ్యాణ్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. కానీ తనపై నామినేషన్ అయిపోయిందని కళ్యాణ్ అన్నాడు. ఎవరో చెప్పడం వేరు.. కళ్యాణ్ అనేవాడు చెప్పడం వేరు.. నువ్వు తనని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను.. ఐ డిడ్ ఏ మిస్టేక్.. రేపు సంజన ఎలిమినేషన్ అవుతే నా తప్పు అవుతుంది. నీకు ఇవ్వడం నేను చేసిన తప్పు అవుతదని ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు. ఇక నామినేషన్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసే పవర్ గౌరవ్ కి ఇచ్చాడు బిగ్ బాస్. అయేషాని సేవ్ చేస్తున్నట్లు గౌరవ్ చెప్పాడు. రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్ పడాల, సంజన గల్రానీ, దివ్య నిఖిత వెలమూరు ఈ వారం నామినేషన్లో ఉన్నారు.  

Jayam serial : వీరు ఆడిన అబద్ధం.. అతడికి బలంగా మారిందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -88 లో.....సూర్య తన అన్న వీరు గురించి నిజం చెప్పబోతుంటే అప్పుడే వీరు మనుషులు వస్తారు. వాళ్ళని చూసి సూర్య అక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి టిఫిన్ సెంటర్ దగ్గరికి రుద్ర వస్తాడు. గంగ టవల్ తో తనని గుర్తు పట్టకుండా కవర్ చేస్తుంది. రుద్రకి టిఫిన్ సెంటర్ ఓనర్ సూర్య మాట్లాడిన వీడియో చూపిస్తాడు.  అందులో రుద్ర నేనొక విషయం చెప్పాలని మాత్రమే ఉంటుంది. దాంతో రుద్ర అక్కడి నుండి వెళ్తాడు. ఆ తర్వాత రుద్రని సూర్య చూసి వెళ్ళబోతుంటే.. వీరు మనుషులు అక్కడే ఉన్నారని ఆగిపోతాడు. సూర్య కోసం రుద్ర వెతుకుతుంటే అప్పుడే మక్కం కనిపిస్తాడు.. మీరేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు‌. గంగ ఆ టిఫిన్ సెంటర్ లో వర్క్ చేస్తుందని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తారు‌. అలా చెప్పగానే రుద్ర తన వంక చూస్తాడు. సరే మీరు తనని ఫాలో అవ్వండి.‌. తన సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పి రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు వీరు మనుషులు వీరుకి ఫోన్ చేసి రుద్ర తప్పించుకున్నాడని చెప్తాడు. అంతేకాకుండా రుద్రని కలవడానికి సూర్య ట్రై చేస్తున్నాడని చెప్తారు. దాంతో నో రుద్రని వాడు కలవడానికి వీల్లేదని వీరు అంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్లంతా వస్తారు. ఏంటి రుద్రని కలవకూడదంటున్నావని పెద్దసారు అడుగుతాడు. ఇప్పుడు పొలిటికల్ మూమెంట్ కదా పార్టీ తరుపున రుద్ర బావగారిని పోటీ చెయ్యమంటున్నారు.. ఎలాగా బాను బావ పాలిటిక్స్ ద్వారా ప్రజలకి సేవ చెయ్యాలని కోరిక కదా అని వీరు కవర్ చేస్తాడు. నా బాను కోరిక అదే అయితే పోటీ చేసేది రుద్ర కాదు వీరు అని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. వీరు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సర్లే ఇప్పుడు రుద్రకి ఈ టెన్షన్ వద్దని పెద్ద సర్ లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఆనందరావు మాటలకి కన్విన్స్ అయిన రామరాజు.. భాగ్యం కోపానికి బలి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -294 లో.....మొన్న పార్టీలో ధీరజ్, ప్రేమ ముద్దు పెట్టుకున్నారని నర్మద చెప్పగానే ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే అని వేదవతి అంటుంది. శ్రీవల్లిని అక్కడ నుండి పంపిస్తుంది వేదవతి. ఏంటే ధీరజ్, ప్రేమ మధ్య ప్రేమ మొదలు అయిందా అని వేదవతి అడుగుతుంది. అయింది పార్టీలో ముద్దు పెట్టుకున్నారట.. వాళ్ళ ఇద్దరిని ఒకటే చేసే బాధ్యత నాది అని నర్మద అంటుంటే.. ఓసిని గవర్నమెంట్ కోడలో అని నర్మదకి ముద్దుపెడుతుంది వేదవతి. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమ మాట్లాడకపోయేసరికి కావాలనే ఫోన్ లో మాట్లాడినట్లు నటిస్తాడు. చెప్పు బేబీ అంటూ మాట్లాడుతాడు. దాంతో ప్రేమ ఫోన్ లాక్కొని లాక్ చెప్పరా.. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. మీ అమ్మాయిలకి అందంతో పాటు అసూయ కూడా ఎక్కువేనని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు దగ్గరికి వస్తారు. ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారని రామరాజు అనగానే వాళ్ళు టెన్షన్ పడుతారు. మీరు బజ్జీలు చేసుకొని అమ్మాల్సిన అవసరమేంటి.. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయ్యొచ్చు కదా అని అంటాడు. చేస్తాం అండి నెల రోజుల్లో మంచి స్థాయికి వస్తామని ఆనందరావు అంటాడు. గుడ్ నేను ఇంకా పెట్టుబడికి డబ్బు ఇద్దామనుకున్న కానీ మీరు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు కదా అని బుజ్జీమ్మ ఈ డబ్బు లోపల పెట్టు అనగానే ఆనందరావు వంక భాగ్యం కోపంగా చూస్తుంది. బయటకు వెళ్ళాక ఆనందరావు పని చెప్తుంది. ఆ తర్వాత ధీరజ్ రెడీ అయి.. ప్రేమ దగ్గరికి వస్తాడు. నేను మొదటి రోజు క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నానని చెప్తాడు. వద్దని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : భార్య కోసం భర్త కలవరింత.. మాటిచ్చిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -493 లో...... సుమిత్ర స్పృహలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నానేంటని వెళ్లిపోతుంటే.. శౌర్య వచ్చి ఆపుతుంది. అమ్మమ్మ మీరు ఇక్కడే ఉండాలని అంటుంది. లేదు వెళ్ళాలని తను అంటుంది. అప్పుడే దీప వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండాలని దీప అంటుంది. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్లాలని దీప అంటుంది. అలా అయితే నా చావుతో సమానమని చెప్పాను.. అయిన సరే తీసుకొని వచ్చావ్ అంటే నీ ఉద్దేశ్యం ఏంటని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే కాంచన వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పలేదు అమ్మ అని దీప అంటుంది. నేను నమ్మనని సుమిత్ర అనగానే నిజం వదిన చెప్పలేదని కాంచన అంటుంది. నా కోసం నువ్వు ఎందుకు వెతకాలి అంటే ఒక మాట అన్నావ్ గుర్తు ఉందా అని సుమిత్ర అడుగుతుంది. అవును అన్నానని దీప అంటుంది. నువ్వు నా అమ్మవి అందుకే వెతుకుతున్నానని అంది. అలా ఎందుకు అన్నవని సుమిత్ర అడుగుతుంది. ఎందుకు అంటే మిమ్మల్ని నేను ఆలా ఫీల్ అవుతున్నానని దీప అంటుంది. మరొకవైపు సుమిత్ర గురించి దశరథ్ నిద్ర నుండి ఒక్కసారిగా ఉల్లిక్కిపడి లేస్తాడు. ఇంట్లో అందరు వస్తారు. మీరేం కంగారు పడకండి మావయ్య అత్త క్షేమంగా ఉందని కార్తీక్ చెప్తాడు. ఏ దైర్యం తో ఉండమంటావ్ రా అని శివన్నారాయణ అడుగుతాడు. నా మీద నమ్మకం ఉంచండి అని కార్తీక్ అంటాడు. మరొకవైపు సుమిత్ర కోసం దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. వద్దని అంటుంది. నేనే చేసాను వదిన అని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi :  డాక్టర్ అలా చెప్పడంతో రాజ్ చొక్కాపట్టుకున్న కావ్య.. నిజం చెప్పేశాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియస్ సోమవారం నాటి ఎపిసోడ్ -856 లో.... రాజ్ భోజనం చెయ్యకుండా నిరాహార దీక్ష చేస్తాడు. ఆయన అలా తినకుండా పడుకున్నాడు.. మీరు వెళ్ళి ఈ భోజనం ఆయనకి ఇవ్వండి అని కృష్ణమూర్తితో కావ్య అంటుంది. అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఈ గొడవలు అని కృష్ణముర్తి అడుగుతాడు. ఆ విషయం ఆయన దగ్గరికి వెళ్లి అడగండి అని కావ్య అంటుంది. రాజ్ కి కృష్ణమూర్తి భోజనం తీసుకొని వెళ్తాడు. ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చాను అల్లుడు పర్లేదు తిను అనగానే రాజ్ తింటాడు. నా కూతురు కోసం ఇంత చేస్తున్నావ్ అసలు నువు అబార్షన్ చేయించుకోమనడానికి కారణం చెప్పొచ్చు కదా అని కృష్ణమూర్తి అనగానే చెప్పలేను మావయ్య అని రాజ్ అంటాడు. రాజ్ ఆలా తనకోసం నిరాహార దీక్ష చేస్తుంటే కావ్య బాధబడుతుంది. భోజనం చేయకుండా ఉంటే కనకం వచ్చి భోజనం తినేలా చేస్తుంది. ఆ తర్వాత అపర్ణకి కనకం ఫోన్ చేసి అల్లుడు గారిని చూసి ఇది మనసు మార్చుకునేలా ఉందని కనకం చెప్పగానే అలా మారకుండా చూడమని అపర్ణ అంటుంది. రేపు దీపావళి కదా మీరు అందరు ఇక్కడికి వచ్చెయ్యండి అని కనకం అనగానే అపర్ణ సరే అంటుంది. అదంతా రుద్రాణి విని మనం కూడా వెళ్ళాలని రాహుల్ తో చెప్తుంది. మరుసటి రోజు రాజ్ లేచేసరికి దుగ్గిరాల కుటుంబం మొత్తం తన ముందు ఉంటుంది. స్వరాజ్ వెళ్లి రాజ్ తో మాట్లాడుతాడు. తరువాయి భాగంలో అప్పు స్పృహ తప్పి పడిపోతే డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. ఎందుకు టాక్సిక్ గల క్రాకర్స్ కాల్చారని డాక్టర్ అంటుంది. రాజ్ నువ్వే కదా కావ్య కోసం అలా చేసావని రుద్రాణి అంటుంది. ఎందుకు నా బిడ్డని చంపాలనుకుంటున్నారని రాజ్ చొక్కా పట్టుకొని కావ్య నీలదీస్తుంటే ఎందుకు అంటే నువ్వు చస్తావ్ కాబట్టి అని రాజ్ నిజం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Nominations:  అయేషాని నామినేట్ చేసిన దివ్య.. రీతు రివేంజ్ నామినేషన్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ అవ్వగా ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని కూడా నామినేషన్లో ఉంచేలా బిగ్ బాస్ పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చేశారు. ఆ ఇద్దరు ఎవరో.. ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దాం. బిగ్ బాస్ మొదటగా ఇమ్మాన్యుయల్, అయేషాలకు ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్ లో వందలకొద్దీ బెలూన్స్ ఉంచారు. వాటిని పగలగొడితే కొన్ని చీటీలు బయటపడతాయి. అవి నామినేషన్స్ కి సంబంధించిన చీటీలు. వాటిని ఇమ్మాన్యుయల్, అయేషా తము కోరుకున్న వారికి ఇవ్వొచ్చు. ఆ విధంగా చీటీలు పొందిన వారు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అందులో ఒక డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది.  అయేషా డైరెక్ట్ నామినేషన్ చీటీని తనవద్దే ఉంచుకుంది. దీనితో అయేషా ముందుగా రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది. దీనికి అయేషా చెప్పిన రీజన్ వ్యాలిడ్ అనిపించింది. రీతూ చేసే ఓవరాక్షన్ నాకు నచ్చట్లేదు.  రీతూ బిగ్ బాస్ కి వచ్చింది లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే. కెమెరాలో కనిపించడానికి అది చాలా సులభమైన మార్గం. ఎంతసేపు లవ్ ట్రాక్ లు నడుపుకుంటూ టైమ్ గడుపుతోంది. గేమ్ అసలు ఆడట్లేదంటూ అయేషా వ్యాలిడ్ రీజన్లు చెప్తూ నామినేషన్ చేయగా రీతూ కూడా చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది.  కాసేపటికి రీతూ కూడా తిరిగి అయేషాని నామినేట్ చేసింది.  ఈసారి వీరిద్దరు నువ్వా నేనా అన్నట్టుగా గొడవపడ్డారు. మొత్తంగా రీతూ చౌదరి డైరెక్ట్ గా నామినేట్ అయింది. ఆ తర్వాత అయేషా, సాయి శ్రీనివాస్ లని దివ్య నామినేట్ చేసింది. ఎవరి బలమేంటో.. ఎవరి బలహీనత ఏంటో మీకు తెలియదు.. ఫస్ట్ అవతలి వారి గురించి తెలుసుకొని మీరు మాట్లాడండి.. హైపర్ అవుతున్నారు.. అది తగ్గించుకోండి అని అయేషాని దివ్య అనడంతో తను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ సాయిని దివ్య నామినేట్ చేసి.. మీరు మానిప్యులేటర్.. మీ గేమ్ మీరు ఆడండి.. వాళ్ళవి వీళ్ళకి.. వీళ్ళవి వాళ్లకి చాడీలుగా చెప్పకండి అని శ్రీనివాస్ సాయిని దివ్య అనడంతో.. తనని తాను డిఫెండ్ చేసుకునే క్రమంలో ఈ హౌస్ లో ఫ్యామిలీని మెయిన్ టైన్ చేసింది నువ్వేనంటూ దివ్యని అన్నాడు. భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడంటూ శ్రీనివాస్ సాయి అనగానే దివ్య షాక్ అయింది. ఇక తనని తాను డిఫెండ్ చేసుకొని శ్రీనివాస్ సాయిని నామినేట్ చేసింది. అయితే వీరిద్దరిలో దివ్య వ్యాలిడ్ రీజన్లతో నామినేట్ చేసింది. 

 నామినేషన్ లో వైల్డ్ ఫైర్ చూపించిన అయేషా.. రీతుకి మైండ్ బ్లాక్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేట్ అయ్యాడు.‌ హౌస్ లో దివ్య, తనూజ అయితే ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళే అయిపోయాయి. ఇక హౌస్ లో ఏడో వారం నామినేషన్ లో ఎవరుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రతివారంలా కాకుండా.. ఈవారం నామినేషన్స్‌ హక్కుని పోరాడి గెలవాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో మొదటగా ఇమ్మాన్యుయల్, అయేషాలు ఈ నామినేషన్స్ హక్కుని పొందడం కోసం పోటీపడ్డారు. ఇందులో అయేషాకి డైరెక్ట్ నామినేషన్ కార్డ్ లభించింది. దాంతో తగిన కారణం చెప్పి.. వాళ్ల మొహంపై నురుగను పూసి నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో తన పవర్‌ని ఉపయోగించి రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది అయేషా. తను నామినేషన్‌కి రీజన్ చెప్తుంటే.. ఒక్కనిమిషం అని చెప్పి తన మొహంపై ఉన్న నురుగను తుడుచుకుంటుంది రీతు. తనని ఒక్క నిమిషం అని చెప్పడంతో.. నీకోసం అందరు వెయిట్ చేయాలా అని అయేషా అంది. మొహంపై ఉన్న నురుగను తీస్తేనే కదా మాట్లాడేదంటూ రీతు యాటిట్యూడ్‌తోనే సమాధానం చెప్పింది. నువ్వు నీ ఓవరాక్షన్ నాకు ఈ ఇంట్లో అస్సలు నచ్చలేదు.. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసమని అయేషా అంది. నీకు చెప్పానా.. నేను లవ్ చేస్తున్నానని.. లవ్ చేస్తూ తిరుగుతున్నానని నీకు చెప్పానా అంటూ రీతు అంది.  నేను డైరెక్ట్‌గా రీతూని నామినేట్ చేస్తున్నానంటూ అయేషా అంది. ఈ నామినేషన్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని రీతూని బిగ్ బాస్ అడుగగా.. నాకు ఆ అమ్మాయి ఏం చెప్పినా వినాలని లేదని, నాకు అనిపించింది నేను చెప్తా.. నాకు అనిపించింది నేను అనేస్తానని అయేషా అంది. నీకు అనిపిస్తే అనేస్తావ్.. అన్నంతమాత్రానా అదే కరెక్ట్ కాదని రీతూ అంటుంది. ఏయ్ ఎందుకే నీకు అంత యాటిట్యూడ్ అని అయేషా ఫైర్ అయ్యింది. నీకు ఎంత యాటిట్యూడ్ ఉంటే.. నాకు అంతే ఉంటుందంటూ రీతు ఫైర్ అయింది. నువ్వు నాకు నచ్చలేదు.. నీ గేమ్ స్ట్రాటజీ నచ్చలేదంటూ అయేషా ఫుల్ ఫైర్ అయింది.

బజ్ ఇంటర్వ్యూలో భరణి చెప్పిన నిజాలివే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం భరణి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో భరణి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఇక వచ్చీ రాగానే భరణి చేతిలో ఒక స్వీట్ పెట్టాడు శివాజీ. ఎలా ఉంది సర్ అని అడిగితే చాలా బావుందని భరణి చెప్పాడు. మీకే ఇస్తే సరిపోదు కాబట్టి ఇది మీ అమ్మాయికి అంటూ మరో స్వీట్ ఇచ్చాడు. అది కూడా నవ్వుతూనే తీసుకున్నాడు భరణి. కానీ శివాజీ అంతటితో ఆగకుండా ఇదెవరికి చెప్పండి అంటూ మరొకటి.. ఇదెవరికి అంటూ ఇంకో స్వీట్ ఇలా ఇస్తూ పోయాడు. ఇక సర్లే అని భరణి కూర్చున్న తర్వాత కుటుంబం అన్నగారి కుటుంబం.. అంటూ శివాజీ పాడాడు. దీనికి నాకు ఎక్కడా ఈ బాండ్స్ నా గేమ్ మీద ఎఫెక్ట్ పడిందని నేను అయితే అనుకోలేదని భరణి చెప్పాడు. మీరు గేమ్ ఆడానని అనుకుంటున్నారు కానీ మీరు గేమ్ ఆడలేదు.. బాండింగ్స్‌లో స్టక్ అయిపోయారు.. ఈ కలుపుకోవటాలు ఏంటి మనకి ఎందుకు అసలు అంటూ శివాజీ అడిగాడు. నేను కలుపుకోలేదు కదండి అని భరణి అన్నాడు. ఇమ్మాన్యుయల్ నీతో అంత బాగా ఉంటాడు కదా మరి.. ఎందుక‌ని పవరస్త్ర నీకు వాడలేదని శివాజీ అడుగగా.. అది అతడి స్ట్రాటజీ అని భరణి అన్నాడు. ఎక్కడ ఏం చేస్తే తనూజమ్మ ఫీలవుద్దో.. దివ్య ఫీలవుతుందోనని కంప్లీట్‌గా ఇలాగే ఉండిపోయారండి అని శివాజీ అనగానే.. పర్టికులర్‌గా వీళ్లిద్దరి దగ్గర అయితే నేను ఆగిపోలేదని భరణి అన్నాడు. ఆగిపోకపోతే ఇవాళ భరణి బయటికి రారు.. భరిణిని అన్ని మాటలంటే బయట ఊరుకుంటాడా అని శివాజీ ప్రశ్నించాడు. నిలబడాల్సిన చోట మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగానే మాట్లాడానండి అని భరణి తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు. సంజన నామినేషన్ వచ్చినప్పుడు మీరు చాలా గట్టిగట్టిగా నేను సాక్రిఫైజ్ చేస్తే నువ్వు ఇక్కడున్నావ్.. ఎందుకలా సడెన్‌గా రియల్ భరణి బయటికొచ్చాడని శివాజీ అన్నాడు. నేను మాములుగానే చాలా షార్ట్ టెంపర్డ్.. ఊరికే సమ్మని లెగుస్తుంది నాకు కానీ హౌస్ లో చాలా తగ్గి ఉన్నానని భరణి చెప్పుకొచ్చాడు.  ఆ తర్వాత సోషల్ మీడియలో పెట్టిన ఒక ట్వీట్ ని స్క్రీన్ మీద చూపించాడు శివాజీ. ఎందుకు అసలు అంత ఓవర్‌గా.. అంత బాండ్ ఉందా వీళ్ల మధ్య.. చాలా సెంటిమెంట్ ఉందిగా సింపథీ కోసమా అని ట్వీట్ ని చదివాడు భరణి. ఎవరన్నా వచ్చి నాకు బాధ చెప్పుకునేవారు తప్ప నేను బాధ చెప్పుకోవడానికి అక్కడ మనిషి ఎవరూ లేరు.. అని భరణి చెప్పాడు. ఈ హౌస్‌లో ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అంటాను.. అంటూ శివాజీ అన్నాడు. ఇక ఒక్కొక్కరికి ఒక్కో క్రాకర్ ని డెడికేట్ చేశాడు. భూచక్రం రీతూకి, డీమాన్ కు చిచ్చుబుడ్డి, కాకరపువ్వు సంజనకి, లక్ష్మీ బాంబు ప్రియకి ఇలా ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో క్రాకర్ డెడికేట్ చేశాడు భరణి.

భరణిని ఎలిమినేట్ చేయడానికి ఇమ్మాన్యుయల్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

బిగ్ బాస్ సీజన్-9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన భరణి నిన్న ఎలిమినేట్ అయ్యాడు. అయితే దీనికి ఆడియన్స్ ఓటింగ్ కారణమని నమ్మాలనిపచలేదు. ఎందుకంటే అతడికి సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు బాగానే పడ్డాయి. అయితే హౌస్ లో ఉన్న ఇమ్మాన్యుయల్ తన స్ట్రాటజీని వాడాడు అని తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ గేమ్స్ లో భరణితో ఆడాల్సి వస్తే తను కచ్చితంగా తప్పుకోవాల్సి వస్తుందని ఇమ్మాన్యుయల్ తన పవరస్త్రాని రాము కోసం వాడాడు. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. నిన్నటి ఎపిసోడ్‌లో సెలెబ్రిటీస్ తో మాటలు,  హైపర్ ఆది పంచ్ లు  , సింగర్ స్పూఫ్ పాటలు, అలాగేడ డ్యాన్స్ పర్ఫామెన్స్ లు జరిగాయి. వాటి తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ఇది మొదలయ్యే ముందు ఒక విషయం అడగాలని నాగార్జున అన్నాడు. ఈ హౌస్‌లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది. ఇమ్మాన్యుయల్ దగ్గర ఉన్న ఆ పవరస్త్రాకి మూడు పవర్స్ ఉన్నాయి. అది ఈ వీక్ యూజ్ చేయొచ్చు.. రెండోసారి మరికొన్ని వారాల తర్వాత వాడొచ్చు.. మూడోసారి.. ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి.. ఇక ఈ వారం ఆ పవరాస్త్రకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్.. ఇప్పుడు సేవ్ చేస్తే మళ్లీ సేవ్ చేసే పవర్ ఇక ఉండదని నాగార్జున చెప్పాడు.  ఇమ్మాన్యుయల్ ఈ వారం ఆ పవర్‌ని ఎవరికైనా యూజ్ చేస్తావా అంటూ నాగార్జున అడుగగా.. నేను పవరస్త్ర వాడదామనుకుంటున్నా సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఈ ఆరు వారాల గేమ్స్ చూసుకుంటే రాము స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నాడు సర్.. కానీ ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన భరణి అన్న మళ్లీ కనిపించలేదు.. ఎక్కడో బాండ్స్‌లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది.. కనుక నేను రాము కోసం ఇది ఉపయోగిస్తున్నానని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. దీంతో ఇమ్మాన్యుయల్ అతని పవరస్త్ర ఉపయోగించాడు.. కానీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్‌లో ఉన్నారో చూద్దాం.. ఇమ్మూ నీ పవరాస్త్ర తీసుకొని చేతిలో పట్టుకొని ఉండమని నాగార్జున చెప్పాడు. భరణి-రాము మీ ఎదురుగా ఉన్న క్రాకర్స్‌ని వెలిగించండి.. అది వెలిగి అందులో ఉన్న కలర్ మీరు ఎలిమినేటెడ్ ఆర్ సేఫ్ అని తెలుస్తుందంటూ నాగార్జున చెప్పారు. ఇక క్రాకర్ వెలిగించగానే రాము సైడ్ ఉన్న క్రాకర్ గ్రీన్ కలర్ రాగా భరణి వెలిగించింది రెడ్ కలర్ చూపించింది. దీంతో భరణి నువ్వు ఎలిమినేట్ అయ్యావ్.. స్టేజ్ మీదకి రా అంటూ నాగార్జున పిలిచాడు. ఇమ్మాన్యుయల్ నీ దగ్గరున్న పవర్ నువ్వు వాడావ్.. సేవింగ్ పవర్.. ఇంకా నీ పవరస్త్రాకి రెండు పవర్స్ ఉన్నాయి.. అవి ఎప్పుడు వాడాలనేది బిగ్‌బాస్ చెప్తారని నాగార్జున అన్నారు. కీలక టైమ్ లో ఓ స్ట్రాంగ్ ప్లేయర్ ని తీయడానికి ఇమ్మాన్యుయల్ తన స్ట్రాటజీని వాడాడని తెలుస్తుంది. ‌మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.

బిగ్ బాస్ సీజన్-9 లో టాప్ కంటెస్టెంట్ భరణి. ఆరో వారం ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు. 

భరణి ఎలిమినేషన్ అయి రావడానికి రెండు కారణాలున్నాయి..‌ ఒకటి అతనికి బాండింగ్స్ ఉన్నాయి.. రెండు ధర్మరాజు తప్పు చేయడు.. కానీ చేస్తే అది కురుక్షేత్రమే అన్నట్టుగా.. ఒక బెడ్ టాస్క్ లో అతని తప్పు ఉన్నా అది చెప్పకుండా గేమ్  లో నుండి తప్పుకోకుండా ఆడాడు.. దానివల్ల అతడికి ఆడియన్స్ లో నెగెటివ్ అయ్యాడు. అప్పటిదాకా జెన్యున్ గా ఆడిన భరణి ఆ ఒక్క టాస్క్ తర్వాత ఆడియన్స్ నమ్మడం మానేశారని తెలుస్తోంది. అందుకే ఓటింగ్ లో రాము ఉన్నా కూడా ఇతను ఎలిమినేషన్ అవ్వడమనేది నిజంగా అన్ ఫెయిర్. ఆరోవారం భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంతా ఓ పెద్ద దిక్కుని కోల్పోయిన వారిలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సీజన్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా భరణి నిలిచాడు. అతడు రోజుకి  యాభై వేలు తీసుకున్నాడని తెలుస్తోంది. అంటే ఒక్కో వారానికి మూడు లక్షల యాభై వేలు రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న మాట. ఈ లెక్క ప్రకారం ఆయన హౌస్ లో ఉన్న ఆరు వారాలకు గానూ ఇరవై ఒక్క లక్ష అందుకున్నట్టు తెలుస్తోంది.

భరణి ఎలిమినేషన్ కాకముందే వెక్కి వెక్కి ఏడ్చేసిన తనూజ !

నాన్న కూతురు బాండింగ్ ఎంత స్వచ్చమైనదో నిరూపిస్తు బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆటస్వభావమే మారిపోయింది. నిన్నటి సండే దీపావళి ఎపిసోడ్ లో భరణి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. దీపావళి ఎపిసోడ్ లో భాగంగా ఆటలు పాటలు డ్యాన్స్ లు అన్నీ చేయించాడు నాగార్జున. దానితో పాటుగా నామినేషన్లో ఉన్నావారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక అందరిని సేవ్ చేయగా చివరగా రాము రాథోడ్, భరణి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. దాంతో దివ్య, తనూజ ఇద్దరు ఏడపు మొహాలు పెట్టేసారు. ఓ వైపు ఎపిసోడ్ లో గేమ్ లు జరుగుతుంటే తనూజ ఏడ్చేసింది. దాంతో తనని కన్ఫెషన్ రూమ్ కు పిలిచాడు నాగార్జున. ఏం అయింది  ఎందుకు ఏడుస్తున్నావని నాగార్జున అడిగాడు. " నేను ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇప్పటి వరకూ జరగలేదు. హౌస్ లోకి రాగానే ఎక్కువగా కనెక్ట్ అయ్యింది భరణి గారితోనే. ఆయన ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, నాన్న లాగా కనెక్ట్ అయ్యారు. అందరు ఆయన వల్ల గేమ్ పోతుంది, ఆ బాండింగ్ వల్ల వెనక్కి వెళ్తున్నావు, ఆయన వల్ల గెలుస్తున్నావని చెప్పడంతో ఎంత ఇష్టం ఉన్నా దూరంగా ఉంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం చుట్టూ అందరు ఉన్నా హెవీగా ఉంది" అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. బంధాలు బర్డెన్ కావొద్దు. ముందుకెళ్తావా అక్కడే ఉంటావా.. అన్నది నీ ఇష్టం .  నీ ఆటతో పాటు మాట బిహేవియర్ క్యారెక్టర్ నిన్ను గెలిపిస్తుందంటూ నాగార్జున మోటివేట్ చేశాడు. తనూజ-భరణిల బాండింగ్ నిజంగా  ప్యూర్ బాండింగ్. తన ఆటకోసం దూరంగా ఉన్న తనూజ.. భరణి ఎలిమినేషన్ కాకముందే.. ఎలిమినేషన్ రౌండ్ లో రాముతో ఉన్నప్పుడే ఏడ్చేసింది. అంటే గేమ్ కోసం, హౌస్ మేట్స్ కోసం దూరంగా ఉన్నా.. భరణి బయటకు వెళ్తాడా అనే ఆలోచన రాగానే తను ఏడ్చేసింది. దీన్ని బట్టి తెలుస్తుంది వారిద్దరిది ఎంత ప్యూర్ బాండింగో.. ఈ ఎపిసోడ్ చూసిన ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు అనేంతలా తనూజ ఏడ్చేసింది. 

అన్షుపై విజయ్ బిన్నీ మాస్టర్ ఫైర్.. పండు గెలవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్!

  ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎక్స్-కంటెస్టెంట్స్ తో డాన్స్ చేశారు. అందరూ పోటాపోటీగా చేశారు. కానీ అన్షు రెడ్డి విషయానికి వచ్చేసరికి విజయ్ బిన్నీ మాస్టర్ ఆమె మీద ఫుల్ ఫైర్ అయ్యారు. "బొమ్మొలే ఉందిరా పోరి.." సాంగ్ కి డాన్స్ చేసింది. ఐతే అందులో ఆమె డాన్స్ అంతగా లేదని ఫీలయ్యాడు జడ్జ్. దాంతో "నాకు అసలు అన్షు ఎక్కువగా చేయలేదు అన్న ఫీల్ వచ్చింది" అన్నాడు. దాంతో డాన్స్ మాస్టర్ ఏదో చెప్పాడు. "బిహైండ్ కెమెరా సరిగా ప్రాక్టీస్ చేయలేకపోయారు. కాబట్టి ఇది చూడండి మీరు అంటే ప్రోపర్ గా ఉండదు. చాలా మంది ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు " అన్నారు.    లాస్ట్ జతిన్ అలాగే పండు వచ్చి పోటాపోటీగా డాన్స్ చేశారు. దాంతో జడ్జెస్ ఇద్దరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో పడ్డారు అసలు ఎవరికీ ఎం మార్క్స్ ఇవ్వాలా అని. జతిన్ పెర్ఫార్మెన్స్ కి సంకేత్ వచ్చి షూస్ పక్కకు తీసేసి వాళ్ళను విష్ చేసాడు. ఇక పండు ఐతే ప్రేమికుల రోజు మూవీ నుంచి వాలు కనులదాన అనే సాంగ్ కి చేసిన డాన్స్ ఐతే మాములుగా లేదు. విజయ్ బిన్నీ మాస్టర్ ఐతే స్టేజి మీదకు వచ్చి మెచ్చుకున్నాడు. ఇది చాలా టఫ్ డెసిషన్. ఇలా ఉండాలి పోటీ అంటే. మేమిద్దరం ఇలాంటి ఒక రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ చెప్పింది రెజీనా. ఇక నెటిజన్స్ ఐతే అందరూ పండు గెలవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.  

Bigg Boss 9: ఆ వీడియో చూసి తనూజ షాక్.. ఇకనైనా మారుతుందా?

  బిగ్ బాస్ సీజన్-9 లో కొత్త కంటెస్టెంట్స్ రావడంతో హౌస్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. ‌తనూజ, కళ్యాణ్ మొదటి వారం క్రేజ్ ఉన్న పెయిర్. అందరు కళ్యాణ్, తనూజ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ తనూజ కళ్యాణ్ కి ఛాన్స్ ఇవ్వలేదు. అలాగని కళ్యాణ్ కూడా అలాంటి అడ్వాంటేజ్ ఏం తీసుకోవడం లేదు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళందరు వీళ్లపై కాన్సన్ట్రేషన్ పెట్టారు.   తనూజని నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. మాధురి, రమ్య మాట్లాడకున్న వీడియో చూపిస్తాడు. అందులో తనూజ, కళ్యాణ్ కి అంత లీనియన్స్ ఇచ్చింది.. కళ్యాణ్ చెయ్యి వేస్తుంటే తను ఇబ్బంది పడుతుంది.. అయినా చెయ్యి వేస్తున్నాడు కళ్యాణ్. తను అలా చేస్తుండంటే అంత లీనియన్స్ ఇచ్చే ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని మాధురి, రమ్య మాట్లాడుకుంటారు. అది చూసి తనూజ షాక్ అవుతుంది. సర్ నేను అందరికి ముందే క్లారిటీ ఇచ్చాను సర్. కళ్యాణ్ రాగానే నేను అంటే ఇష్టమని చెప్పడంతో అందరు అలా అనుకుంటున్నారు.. నేను క్లారిటీ తో ఉన్నానని తనూజ చెప్తుంది.   ఆ తర్వాత కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని రమ్య, మాధురి మాట్లాడుకున్న వీడియోని కళ్యాణ్ కి చూపిస్తారు. చూసావా హౌస్ లో ఎలా అనుకుంటున్నారో నీ ముందు అనలేదు.. నీ వెనకాల మాట్లాడుకుంటున్నారని నాగార్జున చెప్తాడు. తనూజ క్లారిటీగా ఉందని పోలింగ్ చేస్తే అందరు తనూజకి సపోర్ట్ గా పోలింగ్ చేస్తారు. అందరి మాటలు దృష్టిలో పెట్టుకొని తనూజ ఆట మారుతుందో లేదో చూడాలి మరి.  

Bigg Boss 9: రీతూపై ఫీలింగ్ ఉందని చెప్పిన డీమాన్ పవన్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ సూపర్ క్రేజీగా సాగింది. నాగార్జున వీకెండ్ లో అందరి బండారం హౌస్ మేట్స్ ముందు కాకుండా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడుతున్నాడు. డీమాన్ పవన్, రీతూని కన్ఫెషన్ రూమ్ కి నాగార్జున పిలుస్తాడు. వాళ్ళిద్దరికీ ఒక వీడియో చూపిస్తాడు. రమ్య దగ్గరికి డీమాన్ పవన్ వెళ్లి మాట్లాడతాడు. రీతూతో ఎందుకుంటున్నావ్.. నీ గేమ్ స్పాయిల్ అవుతుందన్నట్లు డిస్కషన్ చేస్తుంది. నా గేమ్ ఫస్ట్ తర్వాతే ఎవరైనా అని డీమాన్ పవన్ అంటాడు.   అసలు మీకు ఇద్దరికి మీపై క్లారిటీ ఉందా అని నాగార్జున అడుగతాడు. ఉంది సర్ హౌస్ లో నేను వీడితో ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటాడు. నా గేమ్ నేను ఆడుకుంటానని రీతూ క్లారిటీగా చెప్తుంది. నాకు అంతే సర్ తనతో ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటానని డీమాన్ పవన్ అంటాడు. ఆ తర్వాత మరొక వీడియో అని ఇంకొక వీడియో ప్లే చేస్తాడు నాగార్జున. మళ్ళీ డీమాన్, రమ్య మాట్లాడుకుంటారు. నువ్వు తనని లవ్ చేస్తున్నావ్ కదా.. ఇందాక ఏడ్చావ్ నీ కళ్ళు చూస్తే తెలిసిపోతుందని రమ్య అనగానే.. అదేం లేదు.. నేను క్లారిటీగా ఉన్న అన్నాడు. అవతల వైపు జెన్యూన్ గా ఉందో మీకే తెలియాలని రమ్య అంటుంది. లవ్ అలాంటిది ఏం లేదు ఫ్రెండ్ అంతే ఇన్‌ఫాక్చువేషన్ అని డీమాన్ అంటాడు. అది చూసి నీ మీద నీకే క్లారిటీ లేదని నాగార్జున అంటాడు. నాకైతే క్లారిటీ ఉందని రీతూ అంటుంది. నాకైతే కంఫర్ట్ జోన్ తను.. తనపై ఫీలింగ్ ఉందని డీమాన్ చెప్తాడు. డీమాన్ చెప్పిన దానికి ఆడియన్స్ వంద శాతం నో అని పోలింగ్ చేస్తారు.   డీమాన్ బయటకు వెళ్ళాక రీతూ ఉంటుంది. సర్ అందరు కూడా ఇదే టాపిక్ గురించి మాట్లాడతున్నారని రీతూ చెప్తుంది. వాళ్ళు నీ బలహీనత గురించి చెప్పి.. నిన్ను డౌన్ చెయ్యాలని చూస్తారు కదా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా అని నాగార్జున అంటాడు. రీతూకి క్లారిటీ ఉందో లేదో పోలింగ్ చేస్తే 50 పర్సెంట్ మాత్రమే థమ్స్ అప్ చేస్తారు. ఇప్పటికైనా ఇద్దరు క్లారిటీకి వచ్చి గేమ్ పై ఫోకస్ చేస్తారేమో చూడాలి మరి.  

Bigg Boss 9:  కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూసి షాకైన ఆ ఇద్దరు!

  బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. ప్రతీ ఎపిసోడ్ కొత్తగా సాగుతోంది.  వీకెండ్ లో నాగ్ వైల్డ్ కార్డ్స్ మాటల దూకుడికి చెక్ పెట్టాడు. వారం రోజులుగా ఓల్డ్ కంటెస్టెంట్స్ ని తమ మాటలతో టార్చర్ చేసారు. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు మాట్లాడిన వీడియోని చూపించి అసలైన గేమ్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. రమ్య రావడంతోనే తను ఫుడ్ పవర్ తో ఎంట్రీ ఇచ్చింది. తను వచ్చి గేమ్ మీద కంటే అక్కడున్న జంటలపై ఫోకస్ పెట్టింది.    రమ్య, కళ్యాణ్ ని కన్ఫెషన్ రూమ్ కి నాగార్జున పిలుస్తాడు. మాధురి, రమ్య మాట్లాడుకుంటూ తనూజని కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడే టచ్ చేస్తున్నాడు.. నన్ను అలా టచ్ చేస్తే ఒక్కటిస్తానని రమ్య అంటుంది. ఆ వీడియోని చూపించగా కళ్యాణ్ షాక్ అవుతాడు. అలా అనడం కరెక్టేనా అమ్మాయిల పిచ్చి అని తన క్యారెక్టర్ పై ముద్ర వెయ్యడం తప్పు అని నాగార్జున చెప్తాడు. నా ఇంటెన్షన్ కరెక్టే కానీ ఆ మాట నేను వాడి ఉండకూడదు సర్ అని కళ్యాణ్ కి సారీ చెప్తుంది రమ్య. నేను అయితే ఏ ఉద్దేశ్యంతో అలా చెయ్యలేదు ఏదైనా తప్పుగా అనుకుంటే సారీ అని కళ్యాణ్ అంటాడు.    రమ్యకి ఇచ్చిన ఫుడ్ పవర్.. ఆ ఫుడ్ ని సుమన్ శెట్టితో షేర్ చేసుకోవడం సరైన నిర్ణయం కాబట్టి హౌస్ లో అందరు సరైన నిర్ణయం అంటారు. దాంతో తన ఫుడ్ పవర్ తనకే ఉంటుంది.  

Bharani Elimination: భరణి ఎలిమినేషన్.. బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్!

  భరణి ఎలిమినేషన్.. ‌ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్-9 సాగుతోంది. ఈ సీజన్ లో టాప్-5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా అనుకుంటున్న భరణి ఎలిమినేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   హౌస్ కి పెద్ద దిక్కుగా నిలిచిన భరణి ఎలిమినేట్ అవ్వడమనేది బిగ్ బాస్ ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. కథ అంతా మారిపోయింది.. ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న రాముని సేవ్ చేసి, భరణిని ఎనిమినేట్ చేశారనే వార్తల నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తనూజకి నాన్నగా, దివ్యకి అన్నగా, ఇమ్మాన్యుయల్ కి మామగా భరణి హౌస్ లో చక్కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హౌస్ లో అందరితో ప్రేమగా ఉంటూ గేమ్ లో తన వంద శాతం ఇస్తున్న భరణి ఎలిమినేట్ అవ్వడమనేది ఆడియన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత వారం శ్రీజని ఎలిమినేషన్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్.. భరణిని ఎలిమినేషన్ చేసి హౌస్ లోని కంటెస్టెంట్స్ కి పెద్ద షాకే ఇచ్చాడు.    సోషల్ మీడియాలో బిగ్ బాస్ షూటింగ్ కి సంబందించిన కొన్ని లీక్స్ వస్తుంటాయి. ‌అయితే శనివారం, ఆదివారం నాటి ఎపిసోడ్ లకి సంబంధించిన లీక్స్ అన్ని సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుండే అప్డేట్ చేశారు.‌ అన్ని సోషల్ మీడియా పేజీలలో భరణి ఎలిమినేషన్ అనే వార్తలే వస్తున్నాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భరణి హౌస్ లో కీ ప్లేయర్.. మన భాషలో చెప్పాలంటే దమ్మున్న కంటెస్టెంట్. మరి అతడిని నిజంగా ఎలిమినేషన్ చేశారా లేదా సీక్రెట్ రూమ్ లో ఉంచి వీక్ మిడిల్ లో హౌస్ లోకి తెస్తారా అనేది తెలియాల్సి ఉంది. నేడు(ఆదివారం) జరగబోయే ఎపిసోడ్ లో నిజంగానే భరణిని ఎనిమినేట్ అవుతాడా లేదా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  

Bigg Boss 9: మాధురికి ఇచ్చిపడేసిన నాగ్.. పవర్ తీసేసాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్స్ రాకముందు కంటే వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్ లో గందరగోళంగా ఉంది. వాళ్లు చేసే చేష్టలకి చిరాకు వచ్చిందనడంలో ఆశ్చర్యం లేదు. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా.. నాగార్జున వచ్చి అందరికి చివాట్లు పెడుతాడా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అనుకున్నదే అయింది.. వీకెండ్ వచ్చిరాగానే నాగార్జున అందరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు.   వైల్డ్ కార్డ్స్ కి ఇచ్చిన పవర్స్ కి  వాళ్ళు అర్హులో కాదో అని మిగతా కంటెస్టెంట్స్ లో ఇద్దరి ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ బట్టి ఆడియన్స్ పోలింగ్ ద్వారా పవర్స్ ని ఉంచాలో తొలగించాలో డిసైడ్ చేసారు. మాధురికి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యే పవర్ కి తను అర్హురాలో కాదోనని ఓల్డ్ కంటెస్టెంట్స్ లో సంజనని అడుగగా తను అర్హురాలని చెప్తుంది. దివ్య కాదని చెప్తుంది. ఆడియన్స్ కూడా దివ్యకి సపోర్ట్ చెయ్యడం తో మాధురి పవర్ తొలగించబడుతుంది.   పవన్, మాధురి కిచెన్ దగ్గర గొడవని నాగార్జున వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో మాధురి తప్పు ఉంటుంది. నీ ఇంటెన్షన్ కరెక్టే కానీ నువ్వు చెప్పే విధానం తప్పని నాగార్జున చెప్తాడు. నాకు అలా చెప్పే అలవాటు లేదు సర్ నాది అంతా కమాండింగే ఉంటుంది.. రిక్వెస్ట్ ఉండదని మాధురి పొగరుగా సమాధానం చెప్తుంది. అదే మార్చుకుంటే ఎంతో ఎత్తుకి వెళ్తావని నాగార్జున సలహా ఇస్తాడు. రాబోయే వారాల్లోనైనా మాధురి మాటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి మరి.  

Illu Illalu Pillalu: ముద్దు పెట్టాడని అరిచేసిన శ్రీవల్లి.. గాలి తీసిన నర్మద!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -293 లో.. ధీరజ్ కి ప్రేమ అన్నం తినిపిస్తుంది. మరొకవైపు సాగర్ ఇల్లరికం గురించి నర్మద వాళ్ళ నాన్న మాట్లాడడంతో రామరాజు బాధపడతాడు. నా కుటుంబం అంటే చాలా ఇష్టం.. అందరం ఎప్పుడు కలిసే ఉండాలని వేదవతితో రామరాజు చెప్తూ ఎమోషనల్ అవుతాడు.   మరొకవైపు నీ హ్యాపీనెస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను.. కానీ, నేను మీ ఇంటికి వెళ్లినందుకు మా నాన్నకి సారీ చెప్పావంటే.. నేను చేసింది తప్పు అని అనుకుంటున్నావని నర్మదపై సాగర్ కోప్పడుతాడు. దాంతో సాగర్ కి నర్మద ముద్దు పెడుతుంది. సాగర్ కూల్ అవుతాడు.    మరుసటిరోజు శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే విశ్వ పిలిచి అమూల్యని అలా పక్కకి తీసుకొని రా అంటాడు. నేను తీసుకొని రానని శ్రీవల్లి అంటుంది. పది లక్షలు ఇచ్చింది రాయబారం నడపడానికే అని భద్రవతి అంటుంది. శ్రీవల్లి సరే అని వెళ్లిపోతుంటే.. నర్మద ఎదురుపడి వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నావని అడుగుతుంది. వాళ్ళని మన జోలికి రావొద్దని తిడుతున్నానని శ్రీవల్లి చెప్తుంది.    ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. ఇప్పుడు అంతా సెట్ అయింది కదా నాతో బాగుండొచ్చు కదా అని శ్రీవల్లి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. చందు తనకి ముద్దుపెడతాడు. దాంతో మా అయన నాకు ముద్దు పెట్టాడని గట్టిగా అరుస్తుంది శ్రీవల్లి. దాంతో అందరు వస్తారు. ఎందుకు అలా అరుస్తున్నావ్ నిన్న మా ఆయన పెట్టాడు.. మావయ్య కూడా అత్తయ్యకి ఎన్నో సార్లు పెట్టాడు.. మొన్న ధీరజ్ కూడా ప్రేమకి ముద్దు పెట్టాడు.. మేం ఇలాగే అరుస్తున్నామా అని నర్మద అంటుంది.    తరువాయి భాగంలో ధీరజ్ క్యాబ్ డ్రైవర్ గా వెళ్తుంటే.. ఈ రోజు ఎందుకో నా కన్ను అదురుతుంది.. ఈ రోజు వద్దు అని ప్రేమ అంటున్నా కూడా ధీరజ్ వెళ్తుంటే ఇంట్లో అందరు ఆపుతారు. అప్పుడే రామరాజు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.