రష్మీకి పెళ్లిచూపులు..నచ్చలేదని అబ్బాయికి చెప్పిన రాంప్రసాద్

శ్రీదేవి డ్రామా కంపెనీ రాబోయే ఆదివారం ప్రోమో చూస్తే చాలు అంతా ఫ్రెండ్ షిప్ థీమ్ తో కనిపిస్తుంది. ఇక ఈ ఆదివారం 6  వ  తేదీ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం ఈ అంశంతో రూపొందించారు మేకర్స్. ఇక ఇందులో రాంప్రసాద్ పంచెస్ మాములుగా లేవు.  ఈ  షోకి నటుడు రవికృష్ణ, అంబటి అర్జున్ వచ్చారు. అర్జున్, రవికృష్ణ గొడవ పడుతూ స్టేజి మీదకు వచ్చేసరికి రాంప్రసాద్ "అసలు గొడవేమిటో చెప్పడం లేదు" అని ఆ గొడవేంటో తెలుసుకోవడానికి ట్రై చేసాడు. "వాడు ఫ్రెండ్ షిప్ కొద్ది ఒక అమ్మాయిని చూస్తే నేను వెళ్లి ముద్దు పెట్టాను" అని సీరియస్ గా చెప్పాడు రవికృష్ణ.."నేను లవ్ చేసిన అమ్మాయిని వాడు వెళ్లి ముద్దు పెట్టడమేమిటి" అని అంబటి అర్జున్ ఫైర్ అయ్యాడు. ఇదంతా ఓకే కానీ "ఇంతకు అమ్మాయి పేరేమిట్రా" అంటూ ఇద్దరినీ అడిగాడు. కానీ వాడిని అడుగు అంటే వాడిని అడుగు అంటూ ఇద్దరూ అసలు పేరు చెప్పకుండా ఆ విషయాన్నీ దాటేసారు. తర్వాత కమెడియన్ బాబు, లేడీ కమెడియన్ శ్రీవిద్యతో కలిసి "పొట్టి పిల్ల" సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక ఈ షోకి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు రాంప్రసాద్.."రష్మీకి పెళ్లి చూపులనుకోండి..రష్మీ పెళ్లి చూపులకు వచ్చింది..నచ్చలేదని చెప్పేయండి" అని రాంప్రసాద్ అతనికి కోరస్ అందించేసరికి రష్మీ షాకైపోయింది. "చెప్పండి నేను నచ్చలేదా మీకు" అని రష్మీ అనేసరికి "ఆలోచిస్తాను" అని అతను చెప్పాడు. దానికి వర్ష సుధీర్ కి ఫోన్ చేసి "బావ నువ్వే ఆలోచించలేదు..అందరూ ఆలోచిస్తున్నారు" అని చెప్పింది. తర్వాత అర్జున్ , రవికృష్ణ ఇద్దరూ కలిసి ఫ్రెండ్  షిప్ కాన్సెప్ట్ మీద స్కిట్ వేశారు. వీళ్లకు తల్లిగా ప్రీతి నిగమ్ చేశారు. ఈ స్కిట్ చాలా ఎమోషనల్ గా ఉండడంతో స్టేజి మీద ఉన్నవాళ్ళంతా కంటతడి పెట్టారు..    

హాట్ పెర్ఫార్మెన్సెస్ తో హీటెక్కించిన కంటెస్టెంట్స్..ఏడ్చేసిన సదా

"బీబీ జోడి" డాన్స్ షో హిట్ అయ్యిందో లేదో కానీ "నీతోనే డాన్స్" షోలో  మాత్రం ప్రతీ వారం అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి పెర్ఫార్మెన్సెస్. ఇక నెక్స్ట్ షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే అలా ప్రోమోని కట్ చేసారు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో మంచి జోష్ నింపడానికి బీబీ జోడి కంటెస్టెంట్స్ కూడా యాడాన్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు కలిసి దుమ్ము లేపేశారు. మంచి డాన్స్ తో పాటు అక్కడక్కడా క్రిస్పీగా గొడవలు, రొమాన్స్ మామూలే.. నెక్స్ట్ వీక్  'తీన్ కా తడ్కా' అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక స్టేజి మీద  మెహబూబ్  రాగానే శ్రీముఖి "విప్పెయ్, విప్పెయ్.. చొక్కా విప్పెయ్ సిక్స్ ప్యాక్ చూడాలి" అంటూ కామెడీ చేసింది. రాధ "నేను నీ సిక్స్ ప్యాక్ చూసాను" అంటే "అవునా నేను చూడలేదు..ఒన్స్ మరి" అంటూ డైలాగ్స్ వేశారు సదా. ఇక డాన్స్  పెర్ఫామెన్స్ విషయానికొస్తే నిఖిల్-కావ్య జోడి తేజస్వితో కలిసి మంచి రొమాంటిక్ పెర్ఫామెన్స్ చేశారు. అది చాలా హాట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆట సందీప్- జ్యోతి కలిసి శ్రీసత్యతో  చేసిన పెర్ఫామెన్స్ కూడా మంచి హిట్ కొట్టింది. ఇక షో మధ్యలో   'జాతిరత్నాలు' హీరో నవీన్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వచ్చాడు. రాధా మేడం "మా నాన్న మీకు మంచి ఫ్యాన్ కాదుకాదు క్రష్" అన్నారు అనేసరికి రాధ థ్యాంక్యూ చెప్పారు. తర్వాత "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి ఈ ఇద్దరూ డాన్స్ చేశారు. సదాతో కలిసి "రాను రానంటూనే చిన్నదో" సాంగ్ కి కూడా డాన్స్ చేశారు. తర్వాత అమర్ దీప్-తేజు కలిసి  అభినయశ్రీతో సుహాసిని డాన్స్  పెర్ఫామెన్స్ కి సదా కంట తడి పెట్టుకున్నారు. అడవుల్ని కొట్టేస్తుంటే అక్కడ ఉన్న జంతువులు తమ బాధను చెప్పుకోవడానికి మాటలు రావు కాబట్టి వాటి బాధను చెప్పుకోలేకపోతున్నాయి. వాటి బాధను మీరు చాలా బాగా చేసి చూపించారు అని చెప్పారు సదా. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పేరుతో అడవుల్ని, జంతువుల్ని ఇష్టపడే సదా వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి చాలా  ఎమోషనల్ అయిపోయారు.      

చచ్చేముందు కొన్ని రోజులైన ఎంజాయ్ చేయాలన్న గీతు రాయల్!

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.  ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లతో పాటు కొత్తగా థ్రెడ్స్ ఆప్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందులో గీతు రాయల్ తన అభిప్రాయాన్ని ఒక పోస్ట్ లో చెప్పింది. " లైఫ్ లో మనం అనుకున్నది, అనుకోనిది జరుగుతుంటుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇప్పటికిప్పుడు మనం పోతే, నరకం పోయే దారిలో.. ఇన్ని రోజులు మనం బ్రతికి ఏం పీకాం అనే ప్రశ్న మన మైండ్ లోకి వచ్చినప్పుడు.. చెప్పుకోడానికి ఒకటి, రెండైనా ఉండాలి కదా, ఒకవేళ ఇప్పటివరకు ఏం పీకకపోయిన, పోయేముందు కొన్ని రోజులన్నా ఎంజాయ్ చేసి చచ్చిపోయామనే తృప్తి ఉండాలి కదా" అని గీతు రాయల్ ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది.  

కళ్యాణ్ కవితలని ఆరాధిస్తున్న  రహస్య అభిమాని ఎవరు?

బ్రహ్మముడి సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో రోజు రోజుకి కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతటా ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియల్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ‌ధనవంతులు సమాజం ఎలా ఉంటారు.. వారి  అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని బాగా డబ్బున్నవాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది. అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికీ భారంగా ఉండాలనుకుంటుంది.    అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది. కళ్యాణ్ రాసిన కవిత పేపర్ లో వస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. తన కవితని చూసి కంటతడి పెట్టుకుంటాడు కళ్యాణ్.  అయితే మరొకవైపు ఒక అమ్మాయి కళ్యాణ్ కవితని చదువుతుంటుంది. తన కవితకి ఫిధా అయినట్టుగా ఫీల్ అవుతుంటుంది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి కళ్యాణ్ కి ఏమవుతుంది. ఇప్పటికే ఈ కథలో అప్పు కోసం కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు. మరి కళ్యాణ్ కోసం.. అతని కవితలని ఇష్టంగా చదివే ఆ అమ్మాయి కొత్తగా వస్తుంది. మరి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. మరి ఆ రహస్య అభిమాని ఎవరు? కళ్యాణ్ స్నేహితురాలా లేక రహస్య ప్రేమికురాలా అనే సస్పెన్స్ తో 'బ్రహ్మముడి' మరింత ఆసక్తిగా సాగుతుంది.  

పేపర్ లో వచ్చిన కళ్యాణ్ రాసిన కవిత.. వడ్డీ డబ్బుల కోసం కనకం ఫ్యామిలీ కష్టాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -162 లో.. కనకం, కృష్ణమూర్తిల కుటుంబానికి ఎలాగైనా రెండు రోజుల్లో వడ్డీ చెల్లించాలని సేట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. రెండు రోజుల్లో డబ్బులు ఎలా సర్దుబాటు అవుతాయని కనకం కృష్ణమూర్తి ఇద్దరు టెన్షన్ పడతారు. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని కాఫీ తాగుతుంటారు. అప్పుడే ఏదో ఒక కొరియర్ వస్తుంది. మళ్ళీ ఏం ఆర్డర్ చేసావని స్వప్నని అడుగుతాడు రాహుల్. నేనేం చేయలేదని స్వప్న అంటుంది.. నువ్వు వెళ్లి తీసుకో అని కళ్యాణ్ కి చెప్తుంది కావ్య. కళ్యాణ్ కొరియర్ తీసుకొని వచ్చి వదిన ఇది మీకే వచ్చిందని కావ్యకి చెప్తాడు. నాకు వచ్చింది కానీ అది మీకు సంబంధించినది ఓపెన్ చేసి చుడండని కావ్య అనగానే ఓపెన్ చేసి చూసేసరికి.. కళ్యాణ్ రాసిన కవిత మ్యాగజైన్ లో వస్తుంది. అది చూసి కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఏమైందని ఇంట్లో అందరూ కళ్యాణ్ ని అడుగుతారు. నా కవితని ఇంట్లో ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు వదిన నా కవితని గుర్తించి పేపర్లో ప్రింట్ చేయించిందని కళ్యాణ్ అందరికి చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ పేపర్ లో వచ్చిన కళ్యాణ్ కవితని చూస్తారు. అందరూ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెప్తారు. నా కొడుకు ఇంత వరకు ఇంత సంతోషంగా ఎప్పుడు లేడని ధాన్యలక్ష్మి అంటుంది.‌ నా కవిత ఇప్పుడు ఎంత మంది చూస్తారో అని కళ్యాణ్ అనుకుంటాడు.  మరొకవైపు ఒక అమ్మాయి పేపర్ లో వచ్చిన కళ్యాణ్ కవిత చదువుతూ కళ్యాణ్ గురించి ఆలోచిస్తుంటుంది. కళ్యాణ్ కోసం అప్పు వెయిట్ చేస్తుంటుంది. కళ్యాణ్ హ్యాపీగా పేపర్ లో వచ్చిన తన కవితని తీసుకొని అప్పు దగ్గరికి వచ్చి చూపిస్తాడు. కానీ అప్పు మాత్రం పెద్దగా పట్టించుకోదు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి.. సర్ మీ కవిత సూపర్.. ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా అని కళ్యాణ్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది. మరొకవైపు కావ్య దగ్గరకి‌రాజ్ వచ్చి.. మా కళ్యాణ్ కవిత పేపర్ లో ప్రింట్ వేయించావ్ అందుకు థాంక్స్ అని రాజ్ చెప్పగానే.. కావ్య షాక్ అవుతుంది. రేపు నువ్వు నాతో ఆఫీస్ కి రావాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ డిజైన్స్ రిక్వెర్ మెంట్ కోసం ఒక కంపెనీ వాళ్ళు మన ఆఫీస్ కి వస్తున్నారు. నీకైతే మిడిల్ క్లాస్ రిక్వైర్ మెంట్స్  గురించి బాగా తెలుస్తాయి కదా.. రేపు ఉదయం వెళ్ళాలని రాజ్ చెప్పగానే.. కొద్దీసేపు రాజ్ ని సరదాగా ఆటపట్టించిన కావ్య  వస్తానని చెప్తుంది.‌ మరొకవైపు కనకం, కృష్ణమూర్తి ఇద్దరు సేట్ కి ఇవ్వాల్సిన డబ్బుల గురించి బాధపడుతుంటే అప్పు వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భవానీతో ముకుంద నిజం చెప్పనీయకుండా చేసిన మధు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -223 లో.. పన్నెండు రోజుల్లో వెళ్ళిపోతానని మురారీతో కృష్ణ చెప్పి.. తనకి కొంత డబ్బు ఇస్తుంది. వాటిని తన జ్ఞాపకంగా దాచుకోమని చెప్తుంది. అయితే వాటిని కృష్ణకే తిరిగి ఇచ్చి.. నా జ్ఞాపకంగా నువ్వు దాచుకో అంటాడు. అది విని కృష్ణ.. నువ్వు నా దేవుడని అంటుంది. మురారి అలానే చూస్తుండిపోతాడు. మరుసటిరోజు ఉదయం కృష్ణ, మురారి ఇద్దరు వేరు వేరుగా ఒకరు బెడ్ పైన, ఒకరు కింద ఆ పడుకుంటారు. అయితే అప్పుడే భవాని వాళ్ళ గది దగ్గరికి వచ్చి డోర్ కొట్టగా.. నిద్రమత్తులో ఉన్న మురారి డోర్ ఓపెన్ చేస్తాడు. భవానిని చూసి షాక్ అవుతాడు. కృష్ణ బెడ్ మీద కాకుండా కింద పడుకోవడం గమనిస్తుంది భవాని. ఏంటి పెద్దమ్మ మీరు ఈ టైమ్ లో అని మురారి అడుగుతాడు. వెంటనే కృష్ణ లేచి.‌. పెద్ద అత్తయ్య అని అంటుంది. మీ మధ్య ఏదో సమస్య ఉందని తెలుస్తుందని భవాని అనగానే.. లేదు మేం బాగానే ఉన్నామని కృష్ణ, మురారి అంటారు. మీరు మన ఫామ్ హౌజ్ లో ఎన్ని రోజులు ఉన్నారని భవాని అడుగగా.. రెండు రోజులు ఉన్నామని కృష్ణ అనగా, మూడు రోజులని మురారి అంటాడు. భవాని అనుమానంగా చూస్తుంది. ఆ తర్వాత మురారి కవర్ చేస్తాడు. మీ మధ్య ఏదో సమస్య ఉందని తెలుస్తుంది కానీ ఇకనుండి మీరు నేను చెప్పినట్టు నడుచుకోవాలని భవాని చెప్పేసి వెళ్ళిపోతుంది. ముకుంద గదిలోకి అలేఖ్య వచ్చి.. షాంపూ కావాలని అడుగుతుంది. షాంపు తీసుకొచ్చిన ముకుంద.. నేను చెప్పిన విషయం ఎక్కడిదాకా ఆలోచించావని అలేఖ్యతో అంటుంది ముకుంద. ఇంకా పెద్ద అత్తయ్యతో చెప్పలేదని అలేఖ్య అనగా.. నువ్వు వద్దులే నేనే చెప్తానని ముకుంద అనగానే లేదు నేనే చెప్తానని అలేఖ్య ఫిక్స్ అవుతుంది.  భవాని హాల్లో కూర్చొని కృష్ణ, మధుల గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ముకుందని భవాని పిలిచి.. ఆ రోజు ఏదో చెప్పాలనుకున్నావ్ గా ఏంటది అని అడుగుతుంది. ఇదే రైట్ టైమ్ అనుకున్న ముకుంద.. లేనిపోనివన్నీ చెప్తుంటుంది. అప్పుడే మధు, అలేఖ్య చూస్తారు. ఎలాగైనా ముకుందని భవానికి చెప్పనీయకుండా చేయాలని మధు భావిస్తాడు. సారీ ఫర్ ది డిస్టబెన్స్ అని చెప్తూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లిన మధు.. టిఫిన్ చల్లారిపోతుంది, వేడిగా ఉన్నప్పుడే తినేయాలని మీరే చెప్పారు కదా అని భవానితో అనగానే.. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మధు కావాలనే చెప్పనీయకుండా చేశాడని ముకుంద అనుకుంటుంది. మరొకవైపు కృష్ణ, మురారిలు గదిలో రెడీ అవుతుంటారు. కృష్ణ నడుముని మురారి చూస్తు.. టెంప్ట్ అవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకున్న రిషి! ‌

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -829లో.. శైలేంద్ర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడని జగతి ఆగి చూస్తుంది. అక్కడే వసుధార, రిషిల ఎంగేజ్మెంట్ ఫొటోస్ కన్పించడంతో శైలేంద్ర ఏం చేస్తున్నాడు మళ్ళీ రిషికి ఏదైన ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడా అని ఎలాగైనా శైలేంద్ర ఏం చెయ్యబోతున్నాడో తెలుసుకోవాలని జగతి అనుకుంటుంది.  మరొకవైపు  పాండియన్, అతని ఫ్రెండ్స్ ని పిలిచి వసుధార మాట్లాడుతుంది. మీరు నాకు హెల్ప్ చెయ్యాలి. మిషన్ ఎడ్యుకేషన్ గురించి బస్తీలో విజిట్ చేశాను కదా అలా అన్ని బస్తీలలో విజిట్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పి వాళ్ళని చదువుకునేలా చెయ్యాలని వసుధార అంటుంది. సరే మేడమ్ మేం ఎలా హెల్ప్ చెయ్యగలమని పాండియన్ అనగానే రిషి సర్ ని మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకునేలా ఒప్పించండని వసుధార అనగానే.. వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత పాండియన్ , అతని ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా రిషి ని కలిసి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకోండని పేపర్ పై రాసి ఇస్తారు. రిషి మాత్రం అది సైలెంట్ గా చదివి వెళ్ళిపోతాడు. మరొక వైపు  శైలేంద్ర స్నానం చేస్తుండగా ధరణి ఫోన్ తీసుకొని వచ్చి జగతికి ఇస్తుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి నా ప్లాన్ ఏంటో మీకు తెలియదని, నీతో తర్వాత మాట్లాడుతా అని ధరణిని అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. ఆ తర్వాత జగతితో శైలేంద్ర మాట్లాడుతాడు. మీరు నాకు తెలియకుండా ప్లాన్ చేసినప్పుడు నేను కూడా మీకు తెలియకుండా ప్లాన్ చేస్తాను కదా.. రిషి ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసని శైలేంద్ర అనగానే.. తెలిస్తే ఏం చేస్తావని అప్పుడే అక్కడకు వచ్చిన మహేంద్ర అంటాడు... నాకు నీ కుట్రలు అన్ని తెలిసిపోయాయి కానీ మా అన్నయ్య వల్ల సైలెంట్ గా ఉన్నానని మహేంద్ర చెప్తాడు. రిషి వచ్చిన రాకున్నా DBST కాలేజీ నాది అని శైలేంద్ర చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడని జగతి అనగానే.. అర్ధం అవుతుంది కానీ ఎంగేజ్మెంట్ ఫోటోస్ తో ఏం చేస్తాడని జగతితో మహేంద్ర అంటాడు వసుధారకి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పమని జగతి అనగానే.. వసుధారకి మహేంద్ర ఫోన్ చేస్తాడు.  శైలేంద్రకి మీరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది. మీ ఎంగేజ్మెంట్ ఫోటోస్ తో ఏదో చెయ్యాలని ప్లాన్ చేశాడు జాగ్రత్త అని మహేంద్ర చెప్తాడు. అసలు ఆ శైలేంద్ర రిషి సర్ కి ఏదైనా ప్రాబ్లెమ్ క్రీయేట్ చెయ్యాబోతున్నడా? రిషి సార్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పి మెసేజ్ చేస్తుంది కానీ రిషి మెసేజ్ చూడడు కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ.. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకుంటామని ఆ కాలేజీ వాళ్ళకి చెప్పండని రిషి ప్రిన్సిపాల్ కి చెప్పి బయటకి వస్తాడు. బయట పాండియన్, అతని ఫ్రెండ్స్ కి రిషి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకున్నాడని అర్థం అయి హ్యాపీగా ఫీల్ అవుతూ రిషితో సంతోషంగా మాట్లాడతారు.   ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

రాబోయే బిడ్డ కోసం ఇప్పటినుంచి అన్నీ రెడీ చేసుకున్న నటి లహరి

బుల్లితెర ప్రేక్షకులకు లహరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో పద్ధతైన చీర కట్టుతో అత్తగారు మెచ్చుకునే  చక్కని పొందికైన  కోడలిగా కనిపించి అలరించింది. చిన్న చిన్న కళ్ళతో చాల ముద్దుగా ఉంటుంది లహరి. ఐతే ప్రస్తుతం లహరి నటనకు కొంచెం బ్రేక్ ఇచ్చింది.ఐతే తొమ్మిదో నెల గర్భంతో ఉన్న లహరి త్వరలో బిడ్డను కనబోతున్న టైం కాబట్టి  బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుంటోంది.  మరి లహరికి  కుటుంబ సభ్యులు,  స్నేహితులంతా కలిసి  సీమంతం  వేడుకను నిర్వహించారు. ఇక వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో సందడి చేశారు.  లహరి సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులోనే ఎక్కువగా కనిపించే ఈ ముద్దుల నటికి సోషల్ మీడియాలో క్రేజ్‌ బాగా ఉంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లహరి చక్రవాకం, మొగలిరేకులు, ముద్దుబిడ్డ, ఇంటింటి గృహలక్ష్మి వంటి పలు సూపర్‌హిట్‌ ధారావాహికల్లో నటించి మెప్పించింది. లహరికి  బుల్లితెర మీద శ్రీదేవి డ్రామా కంపెనీలో సీమంతం కూడా గతంలో  జరిగింది. ఇప్పుడు ఇంట్లో ఫామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఈ వేడుక సందర్భంగా అందరూ ఆమె విషెస్ చెప్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లహరి  ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను, ఫొటోస్, వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ తన హ్యాపీనెస్ ని అందరితో షేర్‌ చేసుకుంటుంది. తమ మధ్యకు త్వరలో రాబోయే  చిన్నారి కోసం ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు కూడా చేసుకుంది లహరి. బిడ్డ కోసం  చిట్టి చిట్టి దుస్తులు, చిన్న బెడ్డు, తలకు పెట్టుకునే కాప్స్, బాగ్  బెడ్‌.. అన్నిటినీ రెడీ చేసి పెట్టుకుంది. ఈ అప్ డేట్స్ అన్నిటినీ కూడా "ఓకే లహరి" అనే తన యుట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే మెటర్నిటీ డ్రెస్ కలెక్షన్ పేరుతో కూడా ఒక వీడియో చేసింది లహరి.  

ఆట సందీప్, జ్యోతి పెర్ఫార్మెన్స్ "రోమాంచమ్" అన్న కంటెస్టెంట్స్

నీతోనే డాన్స్ ఈ వారం ప్రసారమైన ఆదివారం ఎపిసోడ్ లో ఆట సందీప్, జ్యోతి చేసిన అమేజింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక అమరదీప్ - తేజు వీళ్లకు  9 ఇచ్చారు. అమరదీప్ మాట్లాడుతూ "సందీప్ మీరు బాగా చేశారు కానీ వదిన డాన్స్ మాత్రం అంతగా అనిపించలేదు , ఎనర్జీ తగ్గిపోయింది.. లిరిక్స్ కూడా పడలేదు" అని చెప్పేసరికి. జ్యోతి, సందీప్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. "చూడండి మీరు కూడా కావాలంటే నన్ను అనుమానించొద్దు" అన్నాడు. "ఎనెర్జీ గురించి జ్యోతితో ఎవరూ మాట్లాడొద్దు..ప్లీజ్  " అన్నాడు సందీప్ "తను ఎప్పుడూ చెబుతూ ఉంటుంది తానొక మ్యారీడ్ లేడీ, ఒక బాబు ఉన్నా కూడా ఇంకా ఆమె డాన్స్ చేస్తూనే ఉంది.. నేను తన ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పిన ప్రతీసారి ఆమె ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. నేను ఇంకా ఎనెర్జీగా చేయాలంటూ తిడుతూనే ఉన్నా.. ఈ రోజు మాత్రం జ్యోతి నాకన్నా ఎనర్జిటిక్ గా చేసింది. ఇది మాత్రం నా అభిప్రాయం..నువ్వు 9 మార్క్స్ ఇచ్చినా కూడా నేను 10 మార్క్స్ గానే అనుకుంటా.. ఆమె చేయగలదు, చేస్తుంది. ఈ వన్ మార్క్ కూడా నేను పట్టించుకోను" అని చెప్పాడు సందీప్. ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సాగర్ - దీప జోడి 10 మార్క్స్ ఇచ్చేసారు. ఫైనల్ లో శ్రీముఖి "గూస్ బంప్స్" అనే పదాన్ని మలయాళంలో ఎం అంటారు అని అడిగింది. గూస్ పింపుల్స్ అని చెప్పి అమరదీప్ రాధతో దెబ్బలు తిన్నాడు. "రోమాంచమ్" అని అంటారు. ఆ పేరుతో రీసెంట్ గా ఒక మూవీ కూడా వచ్చిందని గుర్తు చేశారు. నీతోనే డాన్స్ ప్రతీ వారం ఏదో ఒక టీమ్ మిగతా కంటెస్టెంట్స్ తో గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఈ వారం షోకి ప్రియాంక జైన్- శివ్ కుమార్ ఎంట్రీ ఇవ్వలేదు.. షో స్టార్టింగ్ లో ఈ విషయాన్నీ జడ్జెస్ కి చెప్పింది శ్రీముఖి. శివ్ కి ఫీవర్ వలన రాలేకపోయారని చెప్పింది.  

శ్రీహాన్, శ్రీసత్యల స్నేహాన్ని గుర్తుచేసుకుంటున్న రేవంత్!

      బిగ్ బాస్ సీజన్-6 లో సింగర్  కేటగిరీలో వచ్చిన రేవంత్ తన సత్తా చాటాడు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజు నుండి తనకున్న ట్యాలెంట్ తో , తను బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అదే విధంగా ఉన్నాడు. దాంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో కంటెస్టెంట్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ లో రేవంత్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. ఎల్.వి. రేవంత్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేపథ్య గాయకుడు. పలు సినిమాల్లో 200 కి పైగా పాటలు పాడాడు. ఎం. ఎం. కీరవాణి , కోటి, మణిశర్మ, చక్రి, థమన్ లాంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించిన ప్రముఖ పోటీ.. ఇండియన్ ఐడల్-9 లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్-6 లో టాప్ 5 కంటెస్టెంట్లుగా రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ నిలవగా.. నాగార్జున ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి శ్రీహన్ క్విట్ కావడంతో రేవంత్‌ విజేతగా నిలిచాడు. తాజాగా బ్రో సినిమాలోని 'మై డియర్ మార్కండేయ' పాట పాడిన రేవంత్.. ఈ సాంగ్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్, శ్రీసత్యలతో తన బాండింగ్ ఎలా ఉందో మరోసారి చూసుకుంటున్నాడు రేవంత్. తన ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళ ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లో కలిసి ఉన్న ఒక వీడియోని అప్లోడ్ చేశాడు రేవంత్. ఆ వీడియోకి హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు రేవంత్. కాగా బ్రో సినిమా హిట్ అవడంతో రేవంత్ పాడిన పాటకి మంచి స్పందన వస్తుంది. మిస్టేక్ సినిమాలోని పిల్లా అనే సాంగ్ బాగుందంటూ , డోంట్ మిస్ ఇట్ అంటూ మరొకటి షేర్ చేసాడు రేవంత్. కాగా బిగ్ బాస్ సీజన్-6 లో శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.  

బ్రో సినిమా చూసి లాస్య ఏడ్చేసిందంట!

యాంకర్ లాస్య.. అందరికి తెలిసిన సెలబ్రిటీ. ఒకప్పుడు అన్ని చానెళ్ళకి మోస్ట్ ఛాయిస్ లాస్య అని చెప్పొచ్చు. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలుసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య మళ్ళీ బిగ్ బాస్ సీజన్ -4 లో ఎంట్రీతో ఫామ్ లోకి వచ్చిందనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వంట చేస్తూ అందరి కడుపునింపిన లాస్య.. టైటిల్ గెలవకపోయినా చివరికి వంటలక్కగా బయటకొచ్చింది. లాస్య తను షోస్ చేస్తున్నప్పుడు ఏనుగు, చీమ జోక్ లు చెప్తూ ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అయితే లాస్య, రవి మధ్య ఏదో రిలేషన్ ఉందని అప్పట్లో పుకార్లు రావడంతో తను టీవీ రంగానికి దూరంగా ఉన్నాయనే అనుకున్నారు. కానీ అదేదీ కాదని వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని, రవి తన తప్పు తెలుసుకొని సారి కూడా చెప్పాడని లాస్య ఒక ప్రోగ్రామ్ లో చెప్పింది. ఆ తర్వాత మంజునాథ్ ని పెళ్ళిచేసుకొని కొన్ని సంవత్సరాల పాటుగా బుల్లితెరకు దూరమైంది లాస్య.  లాస్య-మంజునాథ్ లకి మొదట అబ్బాయి పుట్టగా తాజాగా మరో అబ్బాయికి జన్మనిచ్చింది లాస్య. అయితే తన ప్రతీ అప్డేట్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో, తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేస్తుంది లాస్య. తను రీసెంట్ గా రిలీజ్ అయి హిట్ టాక్ ని  సొంతం చేసుకున్న సాయి థరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమాకి వెళ్ళిందంట లాస్య. ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిందని, గుండె బరువెక్కిందని చెప్పింది. " లైఫ్ చాలా పరిమతమైనది. ప్రతీ నిమిషం లైఫ్ ని ఎంజయ్ చేయాలి. ఈ సినిమాకి నేను బాగా కనెక్ట్ అయ్యాను మరి మీరు " అంటూ తన ఫీలింగ్స్ ని షేర్  చేసింది లాస్య.  

దీప్తి సునైన, షణ్ముఖ్ లు కలిసి చేసిన మలుపు  సాంగ్ కి అవార్డు!

దీప్తి సునైనా.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది.  షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి దీప్తి సపోర్ట్ బాగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక షన్ను, దీప్తి సునైనా ఇద్దరు విడిపోయారు. వాళ్ళు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఉన్నప్పుడు.. సిరితో క్లోజ్ గా ఉండడం వల్లనే.. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు విడిపోయి.. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే రెండు మూడు సందర్బాలలో ఈవెంట్స్ లో ఎదురుపడినా పరిచయం లేనట్లుగా ఉన్నారు. కాగా ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఇండైరెక్ట్ గా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో మాట్లాడుకుంటున్నారు. అంటే సెటైరికల్ గా ఒకరి పోస్ట్ కి మరొకరు కౌంటర్లు వేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.  దీప్తి సునైన లవ్ బ్రేకప్ అయినప్పటి నుండి తన పరిధిలో తను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని గడుపుతుంది. తనకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫాన్స్ కి దగ్గరగా ఉంటుంది దీప్తి సునైన. కాగా తాజాగా ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీప్తి. షణ్ముఖ్, దీప్తి కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ' మలుపు'  కి అవార్డ్ వచ్చిందంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది దీప్తి సునైన. అవార్డియో సంస్థ వారు ఇచ్చి‌న అవార్డ్స్ లో ' బెస్ట్ మ్యూజిక్ ఆఫ్ ది ఇయర్ 2023 ' వీళ్ళిద్దరు కలిసి చేసిన మలుపుకి వచ్చింటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా ఈ పోస్ట్ చూసి దీప్తి, షణ్ముఖ్ ల కామన్ ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో మరోసారి వీరిద్దరు ట్రెండింగ్ లోకి వచ్చేసారు.

ఇన్ స్టాగ్రామ్ లో జీవిత పాఠాలు చెప్తున్న యాంకర్ రవి!

యాంకర్ రవి.. యాంకరింగ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన రవి అందరికి సుపరిచితమే. షోస్, ఈవెంట్స్ లలో బిజీగా ఉంటోన్న రవి.. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. 'సంథింగ్ స్పెషల్' అంటూ కెరీర్ స్టార్ట్ చేసిన రవి.. ఆ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో రవి ఫాలోయింగ్ బాగుండేది. రవి ఆ షో చేస్తుంటే లైవ్ లో తనకి కాల్ చేసి మరీ.. మ్యారేజ్ చేసుకోమని అడిగేవారు.. అప్పట్లో రవికి అంత క్రేజ్ ఉండేది. ఆ తర్వాత బిగ్ బాస్-5 లో ఎంట్రీ ఇచ్చిన రవికి.. హౌస్ లో పాజిటివ్ ఇంప్రషన్ కన్నా నెగటివ్ ఇంప్రెషనే ఎక్కువ వచ్చింది‌. ఏం వచ్చిన  ఫేమ్ అయితే వచ్చిందనే చెప్పాలి. రవి ఎంట్రీతో బిగ్ బాస్ విన్నర్ అతనే అని మొదట్లో అనిపించిన.. తను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బిహేవ్ చేసిన దానికి... అదంతా తలకిందులై.. అనుకోకుండా రవి బయటికొచ్చేసాడు. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఫ్యామిలీ వీక్ లో.. రవి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎమోషనల్ గా సాగిన ఎపిసోడ్.. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇన్ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. రవి యాంకరింగ్ అంటేనే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రేక్షకులను సైతం తన మాటలతో ఉత్తేజపరుస్తాడు. యాంకర్ రవి.. కొన్ని వారాల క్రితం శ్రీలంకకి షిప్ లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. అది వ్లాగ్ చేయగా ఫుల్ వైరల్ అయింది. అయితే తాజాగా అమెరికాకి ఒక షో కోసం వెళ్ళిన వ్లాగ్, వచ్చాక తన భార్య కోసం సర్ ప్రైజ్ అంటూ మరొక వ్లాగ్ చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు  యాంకర్ రవి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో జీవిత పాఠాలు చెప్తున్నాడు. " మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా.. మనం ఎవరికోసమైతే కష్టపడుతున్నామో వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోతే వాళ్ళ జుట్టు పట్టుకొనో, గల్ల పట్టుకొనో చెప్పాలి.. మేం మీ కోసమే కష్టపడుతున్నాము అని చెప్పాలి " అంటూ యాంకర్ రవి చెప్పాడు. అగస్ట్ మొదటి వారంలో రోహిణితో కలిసి ఒక షో స్టార్ట్ అవుతున్నట్టుగా చెప్పాడు రవి.  

లేడీ గెటప్ ఎంత కష్టమో చెప్పిన రాకింగ్ రాకేష్!

టీవీ రంగంలో జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, వేణు ఎల్దండి, అటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర, శకలక శంకర్ ఇలా చాలామంది జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశాలను పొందుతున్నారు. అదే బాటలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కూడా ఫేమస్ అయ్యారు. జోర్దర్ సుజాత తనకంటు సొంతంగా ' సూపర్ సుజాత' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంది. కాగా ఆ వ్లాగ్స్ అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో మొదటి నుండి పిల్లలతో ఎక్కువగా స్కిట్లు చేస్తూ ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత వీళ్ళ టీమ్ లోకి జోర్దార్ సుజాత వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. రాకింగ్ రాకేష్ సొంతంగా ' చంటబ్బాయ్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు. అందులో వీళ్ళిద్దరు కలిసి అమెరికా, యూకే వెళ్తున్న వ్లాగ్స్ చేశారు. అవి తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. పాస్ పోర్ట్స్ పోయాంటూ సుజాత మీద ఫ్రాంక్ చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అయింది. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ' లేడీ గెటప్ ఎంత కష్టమంటే' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు రాకింగ్ రాకేష్. ఈ వ్లాగ్ లో తను జబర్దస్త్ లో ఎదర్కున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి రాకేష్ చెప్పాడు. మా స్కిట్ లో లేడీ గెటప్స్ వల్లనే మేం పర్ఫామెన్స్ ఫ్రీగా చేయగలుగుతున్నామని రాకేష్ చెప్పాడు. ఈ వ్లాగ్ లో జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తున్న వినోదిని, శాంతి స్వరూప్ కూడా ఈ లేడీ గెటప్ కోసం ఎంత కష్టపాడుతున్నారో చెప్పారు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కి వచ్చిన మొదట్లో లేడీ గెటప్ లు వేసిన వీడీయోలు ఈ మధ్య యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. వాటిని దృష్ణిలో పెట్టుకొని తాజాగా జబర్దస్త్ లో చేస్తున్న స్కిట్ లో తన భార్య సుజాత మగవాడి గెటప్ లో, రాకేష్ ఆడవారి గెటప్ లో కన్పిస్తున్నట్టుగా ఈ వ్లాగ్ లో వివరించాడు రాకేష్. కాగా ఈ లేడీ గెటప్ ల గురించి ఎప్పటినుండో వ్లాగ్ చేద్దామని ఇప్పటికి చేయడానికి కుదరిందని మాకు సపోర్ట్ చేయండంటూ అందరికి థాంక్స్ చెప్పాడు రాకేష్.  

పాగల్ పవిత్ర కళ నెరవేరిందంట!

జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో అందరి ప్రశంసలు పొందిన పవిత్ర.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జబర్దస్త్ స్టేజ్ మీద తన సత్తా నిరూపించుకొని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. జీతెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జబర్దస్త్ ఎంతో మంది ఆర్టిస్ట్ లకి అవకాశం ఇచ్చింది. ఇందులో తమ కామెడీతో నవ్వించి, సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నవారు చాలామందే ఉన్నారు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో ధనరాజ్, వేణు, సుడిగాలి సుధీర్, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర లతో సూపర్ స్కిట్ లతో సక్సెస్ అయిన జబర్దస్త్.. ఇప్పుడు టీఆర్పీలోనూ వెనుకబడింది. అయితే కొత్తగా ఆర్టిస్ట్ లను తీసుకొని కొత్త టీం లీడర్స్, కొత్త టీమ్స్ ని తీసుకొని మళ్ళీ కామెడీని సరికొత్తగా తీసుకొస్తుంది జబర్దస్త్‌. ఇలా కొత్తగా వచ్చిన వారిలో నూకరాజు, ఇమాన్యుయల్, పవిత్ర లాంటి వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్లు ఉండేవాళ్ళు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీ చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది.  ఇమాన్యుయల్ తో కలిసి పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. కాగా ఆ వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది. అయితే పాగల్ పవిత్ర పేరుతో తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ అందరికీ దగ్గరవుతుంది. అయితే తాజాగా " నా కళ నెరవేరిన వేళ" అంటూ ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తను కార్ డ్రైవ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ రితన్య, మానసతో కలిసి లాంగ్ టూర్ కి వెళ్తుందంట.. కార్ కొని సంవత్సరం అయినా ఒక్కసారి కూడా డ్రైవ్ చేయలేదంట.. ఫస్ట్ టైమ్ సర్ ప్రైజ్ గా ఎయిర్ పోర్ట్ కి లాంగ్ డ్రైవ్ చేస్తూ వెళ్తుందంట.. అయితే తనని నమ్మి తన ఫ్రెండ్స్ వస్తున్నారని, చూడాలి మరి ఈ రోజు‌ ఎలా ఉంటుందో అంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది. తన యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబర్స్ కి థాంక్స్  చెప్పింది పవిత్ర. ఇదంతా తన వ్లాగ్ లో చెప్పింది పవిత్ర.. కాగా ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.  

కథక్ డాన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ అవమానించారు.. అందుకే చేయను

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం మంచి జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఇందులో పాత, కొత్త యాంకర్స్ కూడా వచ్చారు. అప్పట్లో యాంకర్ గా అలరించిన శిల్ప చక్రవర్తి కూడా వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసారు. అలాగే భావన కూడా తన స్టయిల్లో డాన్స్ చేసి చూపించారు. ఇక వీళ్ళ డాన్స్ చూసిన ప్రీతి నిగమ్ స్టేజి మీదకు వచ్చి శిల్ప చక్రవర్తి డాన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. "శిల్ప చాలా చిన్నప్పటి నుంచే డాన్స్ చేస్తోంది..ఇంకా వండర్ ఫుల్ కథక్ డాన్సర్ కూడా" అని చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొట్టారు.  తర్వాత శిల్ప చక్రవర్తి మాట్లాడుతూ "కథక్ డాన్సర్ అన్నారు కాబట్టి.. ఎప్పుడైనా.. ఎప్పుడు కథక్ టాపిక్  అనగానే నేను చాలా ఎమోషనల్ ఐపోతాను.. నేను ఫస్ట్ ప్రీతి గారిని డాన్స్ చేస్తూ చూసి ఇన్స్పైర్ అయ్యాను.. అలా నన్ను గురువు గారి దగ్గర పంపించారు. అలా నేను 8 ఏళ్ళ వయసప్పుడు నేను ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసాను. ఆ తర్వాత 17  ఏళ్ళ వయసప్పుడు నేను ఫస్ట్ టైం స్టేజి మీదకు డాన్స్ చేయడానికి వచ్చాను. నేను అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ టైములో మా గురువు గారు నాతో ఒక విషయం చెప్పారు. ఒక ఈవెంట్ అవుతోంది.. అందులో కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాలని అన్నారు. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను ఇది క్లాసికల్ డాన్స్..ఒక మాస్ ఈవెంట్ జరగబోతోంది. అందులో కథక్ పెర్ఫార్మెన్స్ ఎలా అని అడిగాను. దానికి వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. అలా నేను కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టి రెండు నిమిషాలు గడిచింది. ఇంతలో వాళ్లంతా  మ్యూజిక్ ఆపేసి గోలగోల చేసి, క్లాప్స్ కొట్టి నా పెర్ఫార్మెన్స్ వద్దని అరిచారు. అప్పుడు ఆ రోజు నేను కథక్ డాన్స్ చేయడాన్ని వదిలేసాను. ఆ క్షణంలో డిసైడ్ అయ్యా స్టేజి మీద కెమెరా ముందు నేను కథక్ డాన్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా. ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలియనివ్వను. కానీ ప్రస్తుతం నేను క్లాసికల్ డాన్స్ లో ఎంఏ పిహెచ్ డి చేసాను. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఒక పెర్ఫార్మెన్స్ ని అంతమంది మంది చేసేటప్పుడు అలా మ్యూజిక్ ఆపేసి వెళ్లిపొమ్మని అవమానించడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది" అని చెప్పి ఎమోషనల్ అయ్యారు శిల్ప చక్రవర్తి.

నెత్తి మీద కుండలతో డాన్స్ చేసి అలరించిన రాధ, సదా

నెత్తి మీద కుండల్ని పెట్టుకుని బాలన్స్ చేస్తూ డాన్స్ చేసి చూపించారు రాధ, సదా. ఈ శనివారం ఎపిసోడ్ "నీతోనే డాన్స్" లో ఒక్కో జోడి చేసిన పెర్ఫార్మెన్స్ ఒక్కోలా ఇరగదీసింది. ఫైనల్ గా మూడు జంటలు వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేసాక.. శ్రీముఖి ఒక కొంటె టాస్క్ ఇచ్చింది. లేడీ కంటెస్టెంట్స్ నెత్తి మీద కుండల్ని పెట్టుకుని లైట్ గా డాన్స్ స్టెప్స్ వేయాలని చెప్పింది. అలాగే వాళ్ళందరి నెత్తి మీద వాళ్ళ వాళ్ళ హజ్బెండ్స్ వచ్చి భార్యల నెత్తి మీద కుండల్ని బాలన్స్ అయ్యేలా నిలబెట్టారు. ఇంకా కావ్య నెత్తి మీద పెట్టుకున్న కుండల్లో ఒక కుండ పగిలిపోయింది. అంజలి, నీతూ కొన్ని డాన్స్ స్టెప్స్ వేశారు. ఐతే అంజలి కుండల మీద చేయి పెట్టుకుని డాన్స్ చేసింది. నీతూ మాత్రం కుండల్ని బాలన్స్ చేస్తూ వాటిని చేతులతో పట్టుకోకుండానే  డాన్స్ స్టెప్స్ లైట్ గా వేసింది. దాంతో శ్రీముఖి నీతూ విన్నర్ అని అనౌన్స్ చేసింది.  తర్వాత రాధ, సదాని స్టేజి మీదకు పిలిచి కుండల్ని పెట్టుకుని డాన్స్ చేయాలనీ చెప్పేసరికి వాళ్ళు కూడా చాలా బాలన్స్ గా నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేశారు. ఐతే సదా నెత్తి మీద కుండ పడిపోయింది కానీ రాధ మాత్రం "ఊ అంటావా మావా" సాంగ్ కి కుండతోనే డాన్స్ చేశారు. ఫైనల్ గా వాళ్ళను చూసాక తరుణ్ మాష్టర్ కూడా వచ్చి నెత్తి మీద కుండ బాలన్స్ చేస్తూ "ఉట్టి మీద కూడు " సాంగ్ కి డాన్స్ స్టెప్స్ వేశారు.  ఇక ఈ మూడు జోడీస్ లో ఈ వీక్ బెస్ట్ పెర్ఫార్మర్ గా కావ్య-నిఖిల్ నిలిచారు. వాళ్లకు గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ వచ్చింది. ఇలా ఈ శనివారం ఎపిసోడ్ కొంచెం కారంగా కొంచెం గారంగా పూర్తయ్యింది.

నేను నోరు విప్పితే అన్ని విషయాలు బయటపడతాయి.. అసలు తెర వెనక ఏం జరుగుతోంది?

"నీతోనే డాన్స్" షోలో పవన్, నటరాజ్ మధ్య ఫైట్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈ వారం ఒక జోడికి ఇంకో జోడి తక్కువ మార్క్స్ ఇచ్చుకుని కోట్ల మంది చూసే ఈ షోలో బాగా గొడవపడ్డారు. కొట్టుకునే  స్థాయి వరకు వెళ్ళిపోయింది. "అంజలి నీ పెర్ఫార్మెన్స్ బాలేదని నటరాజ్ మాస్టర్ అన్ని మాటలు అన్నారు" మరి నీ అభిప్రాయం ఏమిటి అని శ్రీముఖి అడిగేసరికి "డాన్స్ చేయడం కోసం వచ్చాము. ముందుగానే స్కెచ్ వేసుకుని, ప్లాన్ వేసుకుని వీళ్లకు ఇన్ని మార్క్స్ ఇవ్వాలి అని ఐతే రాలేదు ఎలా చేసినా అది అలాగే వస్తుంది" అని అంజలి నటరాజ్ మాస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేసేసరికి "అంజలి మాకు అనిపించింది చెప్పాం.. ఐనా పవన్ ఈ డిస్కషన్స్ ఏమీ వద్దు. నేను డాన్స్ కూడా చేయలేకపోతున్నా" అని నీతూ కొంచెం స్లో గానే చెప్పింది.  "నేను మాట్లాడ్డం మొదలుపెడితే అన్ని చెప్పేయాల్సి వస్తుంది..నేను గనక మీకు మార్క్స్ ఇచ్చి ఉండకపోతే మీరెప్పుడో ఇంటికి వెళ్ళిపోయేవారు.. " అని నటరాజ్ మాస్టర్ అనేసరికి పవన్ కి కోపం వచ్చేసింది. "నువ్వెవరయ్యా నాకు మార్క్స్ ఇచ్చేది..." అనేసరికి "ఏ ఏంటి..ఎం మాట్లాడుతున్నావ్..విశ్వాసం లేదు నీకు" అని నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు. "నటరాజ్ మాస్టర్ మీరు మార్క్స్ ఇస్తేనే వాళ్ళు ఉన్నారన్నది రాంగ్.. మీరు ఇచ్చిన స్కోర్ వల్లనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అనడం కరెక్ట్ కాదు.. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఉన్నారు" అని అన్నారు రాధ, సదా. "ఎవరో ఏదో చెప్తే వినటానికి షో చేయడానికి నేను రాలేదు. "ప్రతీది కూడా వాళ్లకు ఫోన్స్ చేసి మాట్లాడి వాళ్లకు మార్క్స్ తగ్గించేసి , వీళ్లకు తగ్గించేసి వాళ్ళను పంపించేయాలి అనే మనస్తత్వం నాది కాదు. ఈ విషయాలన్నీ బయట పెడితే చాలా ఉంటాయి. అందుకే మాట్లాడను" అని అన్నారు నటరాజ్ మాస్టర్. "ఇదిగో ఇది నాకు నచ్చదు...చేస్తే చేద్దాం..లేదంటే వెళ్ళిపోదాం.. ఎవడికి భయపడేది. ఊరికే మాటలు అనిపించుకుని ఉండమంటే ఉండను  తప్పు చూపిస్తే ఒప్పుకుంటా..లేనప్పుడు అస్సలు ఒప్పుకోను.. స్క్రీన్ ముందు, స్క్రీన్ వెనక కూడా ఒక్కలాగే ఉంటాను అదే నా క్యారెక్టర్ " అని నీతూకి స్టేజి మీదే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్.

అమ్మాయిల కోసం షీ టీములు ఉన్నాయి.. అబ్బాయిల కోసం ఏమున్నాయి?

"శ్రీదేవి డ్రామా కంపెనీ" షోలో ఈవారం ఆదిని సెంటరాఫ్ అట్రాక్షన్ గా చేసి గేమ్ ఆడేసుకున్నారు లేడీస్. పాత, కొత్త యాంకర్స్, లేడీ యాక్టర్స్ అంతా వచ్చి ఆదిని కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టారు. హాకీ స్టిక్స్, చీపుర్లు, క్రికెట్ బ్యాట్లు వంటివి తీసుకొచ్చి లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటూ కోటింగ్ ఇచ్చారు.  ఇక ఆ రోజుల్లో ఫేమస్ యాంకర్ శిల్ప చక్రవర్తి వచ్చి "ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తావా లేదా" అని గట్టిగా  అడిగేసరికి "ఆడవాళ్ళకు గౌరవం లేదా..ఎవరన్నారు ఆ మాట. బస్సుల్లో, రైళ్లల్లో స్త్రీలకు మాత్రమే కేటాయించిన సీట్లలో అన్నారు కానీ ఎక్కడైనా పురుషులకు మాత్రమే కేటాయించిన సీట్లు అంటూ మాకు ఒక్క సీటైనా ఇచ్చారా...ఏ అక్కడ ఆడవాళ్ళకు గౌరవం లేదా...భర్త పొతే భార్యకు పింఛన్ వస్తుంది కానీ భార్య పొతే భర్తకు పింఛన్ వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా...అమ్మాయిలను ఎవ్వరైనా అలా కదిలిస్తే షీ టీములు వచ్చేస్తున్నాయి. అబ్బాయిలకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎక్కడైనా ఒక్క హీ టీం వచ్చిందా..భార్యను భర్త జస్ట్ చిన్న దెబ్బ కొడితే చాలా భార్య బయటికెళ్లి నానా రచ్చా చేస్తుంది. కానీ భార్య భర్తను కుక్కను కొట్టినట్టు కొట్టినా మళ్ళీ టక్ వేసుకుని నీట్ గా బయటికి వెళ్తాం మా మగాళ్ళం..అక్కడ మీకు గౌరవం లేదా" అని ఆది చెప్పేసరికి "బయట ఆడవాళ్ళకు లైన్ వేయాలి కాబట్టి టక్ వేసుకుని  వెళ్తారు మరి" అని ఒక లేడీ ఆర్టిస్ట్ కౌంటర్ వేసింది.  "అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు...ఎందుకు మీకు సారీ చెప్పాలి...నేను డాన్స్ వేస్తా..సాంగ్స్ పాడతా..కామెడీ చేస్తా" అన్నాడు ఆది. "మేము కూడా డాన్స్ చేస్తాం, సాంగ్స్ పాడతాం, కామెడీ చేస్తాం, ఎంటర్టైన్ చేసి నీతో సారీ చెప్పించుకుని వెళ్తాం" అని శపథం చేసింది ఆరియానా.