చేస్తోంది గుప్పెడంత మనసు కానీ నా మనసంతా శ్రీముఖినే ఉంది

ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమోనే ఇంత రొమాంటిక్ గా హాట్ గా ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఎలా ఉంటుందో అనిపిస్తోంది. రీసెంట్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఈ ప్రోమో మొత్తం రొమాంటిక్ డైలాగ్స్ తోనే ఉంది. ఇక ఈ షోకి "ఉస్తాద్" మూవీ టీమ్ నుంచి ప్రొమోషన్స్ లో భాగంగా శ్రీ సింహ, కావ్య వచ్చారు. గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, నాగ పంచమి సీరియల్స్ హీరోహీరోయిన్స్ వచ్చారు అలాగే రవికృష్ణ-నవ్య స్వామి ఎంట్రీ ఇచ్చారు. క్యూట్ గా ఉన్న కపుల్ గా బ్రహ్మముడి సీరియల్ నుంచి మానస్-దీపికను నిలబెట్టింది శ్రీముఖి. రొమాంటిక్ జోడిగా నాగపంచమి సీరియల్ హీరోహీరోయిన్స్ నిలబెట్టింది. ఇక దీపికకు కోపం వచ్చేసింది "ఎందుకు నన్ను క్యూట్ సైడ్ పెట్టారు. నేను రెయిన్స్ లో ఫస్ట్ నైట్ చేస్తాను..ఎందుకు నన్ను రొమాంటిక్ సైడ్ పంపలేదు" అని అడిగింది. తర్వాత గుప్పెడంత మనసు టీం వచ్చింది. ఇక సీరియల్ హీరో రిషిని చూసేసరికి  శ్రీముఖి అలిగి బుంగమూతి పెట్టింది దానికి రిషి సర్ బుజ్జగిస్తూ "చేస్తోంది గుప్పెడంత మనసు కానీ నా మనసంతా మీరే ఉన్నారు .. రక్షా అప్పుడప్పుడు అంతే.. బోర్ కొట్టిన రోజుల్లోనే  " అన్నాడు. "రక్షా నువ్వు బ్లాక్ శారీలో కత్తిలా ఉన్నావు తెలుసా" అని అంది శ్రీముఖి ఆ మాటలకు  నవ్వేసింది రక్షా..తర్వాత రవికృష్ణకి కౌంటర్ వేసింది శ్రీముఖి "నువ్వు విరూపాక్షలో మంత్రాలు చదివింది నవ్య మళ్ళీ రావడానికా" అని అడిగేసరికి "ఏ కాదు" అన్నాడు రవి. ఇదంతా ఐపోయాక  రవికృష్ణ-నవ్య మంచి హాట్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. జోడీస్ హగ్ చేసుకోండి అని శ్రీముఖి చెప్పేసరికి "నా పక్కన మానస్, అవినాష్ ఇద్దరు ఉన్నారు.. ఎం చేయాలి" అని దీపికా అడిగేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఉస్తాద్ టీమ్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసింది.

యాక్టర్ ప్రభాకర్ బిగ్ బాస్ లోకి వెళ్ళనున్నాడా?

బుల్లితెర మెగాస్టార్ గా పిలువబడే  ఈటీవీ ప్రభాకర్ అందరికి సుపరిచితమే. తెలుగు టీవీ ఇండస్ట్రీలో మొట్ట మొదటగా ప్రభాకర్ తోనే చాలా సీరియల్స్ మొదలయ్యాయనడంలో ఆశ్చర్యం లేదు. ఈటీవీలో వచ్చిన చాలా సీరియల్స్  ప్రభాకర్ ద్వారానే మొదలయ్యాయి. చాలా కాలం పాటు ఆ ఛానెల్ లో వర్క్ చేశాడు ఫ్రభాకర్. అందుకే  అతనిని అందరు ఈటీవీ ప్రభాకర్ అంటారు. ప్రభాకర్ హైదరాబాద్ కి చదువుకోసం వచ్చి ఫ్రెండ్స్ ప్రోత్సహం వల్ల ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరలో కొన్ని సంవత్సరాల పాటు నటించి.. ఒకనొక దశలో బుల్లితెరని ఏలిన యాక్టర్ ప్రభాకర్. ఇతని మొదటి సీరియల్ చాణక్య. తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అంటే "ఋతురాగాలు" అని చెప్పొచ్చు. అప్పట్లో ఆ సీరియల్ కి ఉన్నా క్రేజ్ అంత ఇంత కాదు. ఆ తర్వాత పలు షోస్ కి వ్యాఖ్యతగా చేసి తనలోని మరొక ట్యాలెంట్ ని బయటకు తీసాడు. ఆ తర్వాత మలయజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభాకర్. ఇతను ఒక డైరెక్టర్ గా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. ఒక యాక్టర్ డైరెక్టర్, యాంకర్, ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్ నటించిన 'ఆపరేషన్ దుర్యోధన' లో పోలీస్ క్యారెక్టర్ చేసి ఉత్తమ సహాయ నటుడిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటుడిగా చేశాడు ప్రభాకర్. అయితే తాజాగా ప్రభాకర్ తన కొడుకు చంద్రహస్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాకర్ కొడుకు ఓవర్ యాక్షన్ చేశాడు. అది చూసిన నెటిజన్లు ఫుల్ ట్రోల్స్ చేసారు. దాంతో మీ ట్రోల్స్ కి దండం అంటూ అప్పట్లో ప్రభాకర్ ఒక వీడియోకి చేశాడు. అంతగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రభాకర్ భార్య మలయజ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు తన ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఒక సీనియర్ నటుడిని గానీ నటిని గానీ తీసుకోవడం జరుగుతుంది కానీ ఆ సీనియర్ నటులు హౌస్ లో ఎక్కువ రోజులు ఉండరు. మిగతా కంటెస్టెంట్ తో కలిసిపోలేక ఒకటి రెండు వారాల్లోనే బయటకు వస్తున్నారు. అయితే ఈ సీజన్ లో బుల్లి తెర మెగాస్టార్ అయిన ప్రభాకర్ బిగ్ బాస్ లోకి వెళ్ళనున్నట్లు సమాచారం. మరి ప్రభాకర్ హౌస్ లోకి వెళ్తే కొత్త కంటెస్టెంట్స్ తో ఉండగలడా? ఉంటే ఎన్ని రోజులు ఉంటాడనే సందేహాలు అందరిలోను నెలకొంది. బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి క్యూరియాసిటిని పెంచేస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రభాకర్ హౌస్ లోకి వెళ్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఏంజిల్, విశ్వనాథ్ లు ఎమోషనల్.. కారణం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -838 లో.. రిషితో వసుధార మాట్లాడుతూ.. మహేంద్ర ఫోన్ చేసిన విషయం చెప్తుంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మహేంద్ర సర్ చెప్పారని వసుధార అనగానే.. మరి నాకు చేసి చెప్పొచ్చు కదా అని రిషి అంటాడు. మీకు ఫోన్ చేస్తే మీరు చిరాకుపడి మాట్లాడుతారో లేదోనని వాళ్ళు మీకు చెయ్యలేదని వసుధార అంటుంది. మీరు ఇన్‌స్పెక్టర్ కి ఫోన్ చేసి ఎటాక్ కి సంబంధించి ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కోండని వసుధార అంటుంది. కనుక్కుంటాను.. ఏంటి నీ దబాయింపు‌. టెన్షన్ పడవద్దు బాగున్నాడని డాడ్ వాళ్ళకి చెప్పండని రిషి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు రిషిపై శైలేంద్ర ఎటాక్ గురించి దేవాయనికి చెప్తాడు. కొంచమైతే ఆ రిషిగాడికి దొరికిపోయేవాన్ని అని శైలేంద్ర  అంటాడు. నువ్వు అవన్నీ ఇక ఆపేసి ముందు కాలేజీ గురించి ఆలోచించు.. కాలేజీకి వెళ్ళమని దేవయాని అంటుంది. అప్పుడే వచ్చిన ఫణింద్ర మంచి మాట చెప్పావ్ దేవయాని అంటాడు. శైలెంద్ర మాత్రం వాళ్ళ మాటలు విన్నాడెమోనని టెన్షన్ పడుతాడు. నువ్వు కాలేజీకి వచ్చి కాలేజీ గురించి తెలుసుకుంటే.. అంతకంటే ఏం కావాలి. అది ఎందుకు.. ఇది ఎందుకు అంటావ్? అందుకే అందరికి నీపై చిరాకు వస్తుందని ఫణింద్ర అంటాడు. సరే డాడ్ కాలేజీ వస్తానని శైలేంద్ర అంటాడు. అప్పుడే అక్కడకి మహేంద్ర వస్తాడు. శైలేంద్ర కాలేజీ కి వస్తాను అంటున్నాడు.. నువ్వేమంటావని మహేంద్రని అడుగుతాడు ఫణీంద్ర. మీ ఇష్టం అన్నయ్య మీ మాట ఎప్పుడు కాదని అనలేదని మహేంద్ర అంటాడు. పిన్ని ఏమైనా అంటుందేమోనని శైలేంద్ర అంటాడు. అదేం లేదు ఎవరికి ఎలా నేర్పించాలో, అందరికి అలా నేర్పిస్తామని మహేంద్ర అంటాడు. నా ముందు ఎంత యాక్టింగ్ చేస్తున్నావని మహేంద్ర అనుకుంటాడు. మరొక వైపు రిషి ఇన్‌స్పెక్టర్ తో ఎటాక్ గురించి మాట్లాడుతాడు.  ఆ తర్వాత విశ్వనాథ్ కిందపడిపోతాడు. రిషి అంటూ ఏంజెల్ పిలుస్తూ ఏడుస్తుంది. రిషి వచ్చి.. డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. మరొక వైపు వసుధార కాలేజీకి వెళ్లి ఇంకా రిషి సర్ రాలేదని ఎదురుచూస్తుంది. మరొక వైపు విశ్వనాథ్ దగ్గరికి డాక్టర్ వచ్చి  ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత విశ్వనాథ్ కి అలా జరిగేసరికి ఏంజిల్ ఎమోషనల్ అవుతుంది. రిషికి ఏంజెల్ గురించి విశ్వనాథ్ చెప్తాడు. తనకి నేను తప్ప ఎవరు లేరు.. పెళ్లి చేసుకోమంటే.. నన్ను వదిలి వెళ్ళాల్సి వస్తుందని పెళ్లి వద్దని అంటుందని విశ్వనాథ్ రిషికి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు. నేను అనుకున్నది జరుగుతుంది అంటావా రిషి అని విశ్వనాథ్ అంటాడు. మీరు ఇప్పుడు అవన్నీ ఆలోచించకండని రిషి అంటాడు. మరొక వైపు రిషికి విశ్వనాథ్ గురించి ఏంజిల్ చెప్తూ.. ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

‘మీ కడుపునిండా’... శ్రీవాణి కొత్త బిజినెస్‌!

బుల్లితెర సీరియల్స్ లో కనిపించే శ్రీవాణి జంట త్వరలో హోటల్ స్టార్ట్ చేయబోతున్నారు. శ్రీవాణి ఆమె భర్త విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతీ ఈవెంట్ లో వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీళ్ళు ఫుల్ పాపులర్. వీళ్ళతో పాటు వీళ్ళ అమ్మాయి రాజ నందిని కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక వీళ్ళు హోటల్ కి కావాల్సిన సామాన్లు కొనే వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసింది శ్రీవాణి. ఇక హోటల్ పేరును విక్రమ్ పెట్టారట. అదే "మీ కడుపునిండా" అంట. విక్రమ్ వేరే పనుల్లో బిజీగా ఉండడంతో కిచెన్ కి సంబంధించిన వంట పాత్రలు కొనడం వంటి వాటి గురించి తాను చూసుకుంటున్నట్టు చెప్పింది శ్రీవాణి. అలాగే పెద్ద పెద్ద చిమ్నీలు, చిన్నవి వాటి సైజు , వాటి కాస్ట్ డిస్కౌంట్ ఇలాంటివి అన్నీ కూడా చూపించింది శ్రీవాణి. "చంద్రముఖి  నగల్ని చూసి ఎలా ఆనందపడుతుందో ఇంట్లో ఆడవాళ్ళకు వంట ఫాస్ట్ గా ఈజీగా ఐపోవాలంటే ప్రెజర్ కుక్కర్స్ ని చూస్తే వాళ్ళు కూడా  అంతే ఆనందంగా ఉంటారు" అంటూ లేడీస్ ని చంద్రముఖితో పోల్చింది శ్రీవాణి. రాబోయే రోజుల్లో పండగలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి.. ఇంట్లోకి కూడా పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కుంటే ఇంటికి వచ్చే చుట్టాలకు కూడా వండిపెట్టడానికి సరిపోతాయి అని చెప్పింది శ్రీవాణి. ఇక వీళ్లంతా సామానులు కొనే హడావిడిలో ఉంటే రాజా నందిని మాత్రం సెల్ఫీస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. అలాగే పూజా సామగ్రి, బ్లాంకెట్స్, కార్పెట్స్ అన్నిటినీ చూపించింది.  రీసెంట్ శ్రీవాణి- విక్రమ్ ఇద్దరూ వైల్డ్ కార్డు ఎంట్రీతో "నీతోనే డాన్స్" షోకి వచ్చారు చివరికి ఎలిమినేట్ ఇపోయారు. శ్రీవాణి కలవారి కోడలు, కాంచన గంగ, మావి చిగురు, మనసుమమతా ఇలాంటి ఎన్నో నటించింది.

మురారి ఇచ్చిన గిఫ్ట్ ని చూసి ఎమోషనల్ అయిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -232 లో.. కృష్ణ మెడలో మురారి తాళి కట్టింది ముకుంద గుర్తుచేసుకుంటుంది. అప్పుడే భవాని వచ్చి ఇంటి పెద్ద కోడలిగా అందరితో కలిసి నల్లపూసలు గుచ్చి మంచి పని చేశావని ముకుందతో భవాని అంటుంది. అవును అత్తయ్య అని ముకుంద అంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఎవరు కన్పించడం లేదు. ఎక్కడికి వెళ్లారని అంటుండగానే అప్పుడే మధు, ప్రసాద్ లు భవాని దగ్గరికి వస్తారు. వీళ్ళు అంత ఎక్కడ అని భవాని అడుగుతుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. వదిన ఫోన్ చూస్తూ రీల్స్ చేస్తుందని భవానితో ప్రసాద్ అంటాడు. అప్పుడే అందరు భవాని దగ్గరికి వస్తారు. కృష్ణ నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా.. నీ  డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా అని భవాని అడుగుతుంది. కృష్ణ మౌనంగా ఉంటుంది. మళ్ళీ ఏంటి నువ్వు ఇంకొకసారి ఇలా ఉంటే ఒక్కటిస్తానని భవాని అనగా.. సరే అత్తయ్య అని కృష్ణ అంటుంది. అందరం ఇక్కడే  ఉన్నాం కదా ఒక గ్రూప్ ఫోటో దిగుదామని గౌతమ్ అనగానే.. నేను మిమ్మల్ని అందుకే పిలిచానని భవాని అంటుంది. అందరూ గ్రూప్ ఫోటో దిగడానికి సిద్ధం అవుతారు. కొన్ని రోజుల్లో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. వెళ్లిపోయాక ఆ ఫోటోలో నన్ను చూసినప్పుడల్లా మోసం చేసిందని అనుకుంటారు. అందుకే ఈ గ్రూప్ ఫోటోలో నేను ఉండకూడదని కృష్ణ పక్కకి వెళ్ళిపోతుంది. భవాని కృష్ణ ఎక్కడ అని అడుగుతుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానని కృష్ణ దగ్గరికి రేవతి వెళ్తుంది. నువ్వు అక్కడ నుండి ఎందుకు వచ్చావో తెలుసు.. నీ కోసం అందరు ఎదురుచూస్తున్నారు పదా అని రేవతి అనగానే.. నా కోసం అందరిని బాధ పెట్టడం ఎందుకని.. సరే పదండి అని కృష్ణ వస్తుంది. ఆ తర్వాత అందరు గ్రూప్ ఫోటో దిగుతారు. ఎవరి జంటతో వాళ్ళు ఫోటో దిగుతారు. మళ్ళీ ఏసీపీ సర్ తో నన్ను ఫోటో దిగమంటారని కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు కృష్ణ వాళ్ళ నాన్న ఫోటో చూస్తు.. తన బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు ముకుంద దగ్గరికి అలేఖ్య వచ్చి.. ఇంట్లో అందరికి అగ్రిమెంట్ విషయం చెప్తానని అన్నావ్ చెప్పలేదు. మళ్ళీ మంగళ్యధారణ ఆపుతానని అన్నావ్ అది జరగలేదు .నీ ప్రేమ గెలవదని అలేఖ్య అనగానే.. అలేఖ్యపై ముకుంద కోప్పడుతుంది. మరొకవైపు కృష్ణ ఏడుస్తూ తన బ్యాగ్ లో బట్టలు సర్దుతుంటుంది. మురారి ఇచ్చిన గిఫ్ట్ ని చూసి ఎమోషనల్ అవుతుంది కృష్ణ. కృష్ణ గురించి మురారి ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ ఎండింగ్‌ను మార్చివేసిన ఒకే ఒక్క తుమ్ము!

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా - పుల్ట అని నాగార్జున చెప్తే ఏమో అనుకున్నాం కానీ ఈ కాన్సెప్ట్ ని ఒక డ్రామా క్రియేట్ చేసి అద్భుతంగా చెప్పారు బిగ్ బాస్ మేకర్స్. ఇక ఈ న్యూ బిగ్ బాస్ ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. చూస్తేనే నవ్వొచ్చిదిలా ఉంది. రాధా- రమేష్ క్యారెక్టర్స్ ని సృష్టించి చిన్న స్కిట్ ప్లే చేసింది. లోయలో పడిపోయిన తన లవర్ రమేష్ ని కాపాడడం కోసం  రాధ కొండ అంచుకు వచ్చి తన చున్నీ ఇచ్చి కాపాడడానికి ట్రై చేస్తుంది. ఇంతలో రాధకు తుమ్మొస్తుంది. దాంతో రాధ చున్నీ వదిలేయడంతో  రమేష్ అంత ఎత్తు నుంచి కిందకి పడుతూ ఉంటాడు. ఇంతలో నాగార్జున వచ్చి.. ‘ఇలాంటి క్లైమాక్స్‌లు బోలెడు చూశాం కదా.. ఎండింగ్ మార్చేద్దాం.. ఇది అంతం కాదు.. ఆరంభం’ అని చిటికె వేసేసరికి  రమేష్.. లోయలో పడిపోకుండా గాల్లో తేలుతూ కనిపిస్తాడు. ఇంతలో తుమ్ము నుంచి తేరుకున్న రాధ.. ఎక్కడున్నావ్ రమేష్ అంటూ చూసేసరికి గాల్లో తేలుతుంటాడు.  అప్పుడు హోస్ట్ నాగార్జున బొంగరాన్ని గాల్లోకి వేస్తూ అక్కడికి వచ్చినప్పుడు  ది ఎండ్ కార్డు కూడా రివర్స్ లో తిరిగిపోతాయి  "ఎవరి ఊహకి అందని సీజన్.. బిగ్ బాస్ 7. అంతా ఉల్టా పుల్టా’ అని బిగ్ బాస్ టైటిల్ గురించి చెప్పేసారు. సెప్టెంబర్ 3 న బిగ్ బాస్ స్టార్ట్ కాబోతోందంటూ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం బాగా జరుగుతోంది. ఇక ఈ షో కొత్త రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనేదే ఫుల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే కొన్ని సీజన్స్ మరీ బోరింగ్ గా కాంట్రోవర్సిగా మారేసరికి ఈసారి టోటల్ గా షో మొత్తాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేసాం అని నాగార్జున చెప్పడంతో ఆడియన్స్ లో కూడా హైప్ పెరిగిపోయింది. ఐతే ఇందులో అమ్మాయిలూ అబ్బాయిలుగా మారిపోతారా...అమ్మాయిలు ఆడే ఆటల్ని అబ్బాయిలతో ఆడిస్తారా..ఏంటో కొంచెం కూడా క్లూ మాత్రం ఇవ్వలేదు. కానీ కుడి ఎడమైతే అని చెప్తుంటే ఇలా ఉంటుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దుగ్గిరాల పరువుని నిలబెడతానని చెప్పిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -171 లో.. కావ్య తన పుట్టింట్లో వర్క్ చేయడం మీడియాలో రావడం అంతే కాకుండా దుగ్గిరాల ఫ్యామిలి గురించి న్యూస్ లో చెడుగా రావడంతో ఇంట్లో అందరు కావ్యని తిడతారు. నేను కష్టపడితే అది మీకు కష్టంగా ఉందా అయితే మీ పరువుకు నష్టం కలిగిందా అని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పుడే రాజ్ ఇంటికి వచ్చి నువ్వు కష్టం చేస్తున్నావ్ కానీ దానికి ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటున్నావ్ కదా.. ఎందుకు అలా చెప్పుకుంటున్నావ్.. నువ్వు చేసేది కష్టమే కావచ్చు కానీ నువ్వు చేసే పని వల్ల ఈ  సమాజం మమ్మల్ని వేలెత్తి చూపిస్తుంది. ఈ దుగ్గిరాల కుటుంబం పరువుపోతుందని రాజ్ అంటాడు. మీరు చెప్పేది నిజం. అంత దూరం అలోచించలేదు. అలా అని నేను చేసే పనిని ఆపలేనని కావ్య అంటుంది. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావ్. నిన్ను ఏదో ఈ ఇంట్లో కష్టపెట్టినట్లు.. నీ తిండి కోసం నువ్వే సంపాదించుకున్నట్లు.. ఈ సమాజం అనుకుంటుందని అపర్ణ అంటుంది. ఈ ఇంటి పెద్దగా చెప్తున్న నీ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చెయ్యడానికి ఈ కుటుంబం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఏం కావాలి చెప్పమని ఇందిరాదేవి అంటుంది. సారీ అమ్మమ్మ గారు నేను దానికి ఒప్పుకోను. నేను కష్టపడి సంపాదించన డబ్బులు మా ఇంట్లో ఇస్తేనే ఈ ఇంట్లో ఎలా మాట్లాడారో అందరికి తెలుసని కావ్య అంటుంది. ధాన్యలక్ష్మి కూడా కలుగజేసుకొని కావ్యకి నచ్చచెప్పాలని ట్రై చేసినా కావ్య తన మాట వినదు. నా వల్ల ఈ ఇంటి పరువు పోయింది కదా.. పోయిన పరువు నేనే నిలబెడతానని అందరితో కావ్య చెప్పేసి వెళ్లిపోతుంది. మరొకవైపు కృష్ణమూర్తి సంతోషంగా కనకానికి కిల్లి కొనుక్కొని తీసుకొని వస్తాడు. అది చూసిన కనకం.. ఎన్నడు లేనిది ఈ రోజేంటి.. కిల్లీ తీసుకొచ్చారని కృష్ణమూర్తిని కనకం అడుగుతుంది. నాకు రేపు అన్న భాధ లేదు. ఈ రోజు ప్రశాంతంగా ఉంది. సంతోషంగా ఉన్నాను. ఇదంతా కావ్య వల్లే అని చెప్పుకుంటూ కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు కళ్యాణ్ తన అభిమాన పాఠకురాలు అనామిక ఫోన్ నెంబర్ కనిపెట్టాడానికి నానా తిప్పలు పడుతుంటాడు. అప్పుకి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడుగుతాడు. తెల్లవారి చూసుకుందాం పడుకోమని అప్పు చెప్తుంది. మళ్ళీ కళ్యాణ్ కొన్ని నంబర్స్ ట్రై చేస్తాడు. రాంగ్ నంబర్స్ కి వెళ్తు ఉంటాయి, చివరగా ట్రై చెయ్యగా అది అప్పు ఫోన్ కే చేస్తాడు. కళ్యాణ్ అని తెలియక అప్పు కోప్పడుతుంది. నన్ను డిస్టబ్ చేయకని చెప్పి కళ్యాణ్ తో అప్పు  చెప్పేసి పడుకుంటుంది. మరొక వైపు కావ్య, రాజ్ మాట్లాడుకుంటారు. ఏదో పరువు మళ్ళీ తీసుకొస్తానని అందరి ముందు చెప్పావ్ కదా? ఏం చేస్తావని రాజ్ అడుగుతాడు. నేను చెప్పను. అయిన నేను ఇంకా ఏం అనుకోలేదని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

స్టేజి మీద ఎమోషనల్ ఐన కౌశల్ భార్య

జీ తెలుగు అంటే ఫామిలీకి ఎక్కవ వేల్యూ ఇస్తూ ఆ తరహా ప్రోగ్రామ్స్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే  సూపర్ క్వీన్, లేడీస్ & జెంటిల్మెన్ వంటి షోలతో అలరించిన జీ తెలుగు లాస్ట్ వీక్ నుంచి "ఫామిలీ నంబర్ 1 "షోని ప్రసారం చేస్తోంది. ఇందులో 8 ఫామిలీస్ మధ్య పోటీలు పెట్టి ఎంటర్టైన్ చేస్తున్నారు షో మేకర్స్. ఇక ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కౌశల్ ఫామిలీ వచ్చింది. "ప్రతీ భర్త తన భార్యలో తన తల్లిని చూసుకుంటాడు..నువ్వు అలాంటి లైఫ్ నాకు ఇచ్చినందుకు నీకు పాదాభివందనాలు" అని కౌశల్ చెప్పేసరికి అతని వైఫ్ నీలిమా స్టేజి మీదే కన్నీళ్లు పెట్టేసుకుంది. "ఈరోజు నీలిమ కౌశల్ అంటే అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు నీలిమ అంటే ఎవరికీ తెలీదు. ఎన్నో జన్మల పుణ్యం నాకు ఈయన దొరకడం" అంటూ కౌశల్ ని పట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో ఉంటాడు.. బిగ్ బాస్ సీజన్ 2  అంటే చాలు కౌశల్, కౌశల్ ఆర్మీని గుర్తొస్తుంది. ఇక ఈ 8 ఫామిలీస్ కు టాస్క్ లు ఇచ్చి ఆడిస్తున్నాడు హోస్ట్ రవి. అలాగే వాళ్ళు లైఫ్ లో పడిన కష్టాలు, సాధించిన విజయాలను కూడా ఈ షో ద్వారా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇక కౌశల్ బీబీ జోడిలో కంటెస్టెంట్ గా కూడా డాన్స్ చేసి చూపించాడు. అలాగే రీసెంట్ గా ప్రసారమైన బీబీ షైనింగ్ స్టార్స్ లో బీబీ పవర్ స్టార్ అవార్డు ని అందుకున్నాడు. ఈ ఫామిలీ నంబర్ 1 షో ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కాబోతోంది.

ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే పోలీస్ ని అయ్యేదాన్నేమో..త్వరలో సేవ్ ది టైగర్స్ సీజన్ 2

జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జోర్దార్ వార్తలు చదువుతూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఫుల్ ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ని పెళ్లి చేసుకుని మస్త్ లైఫ్ లీడ్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ ఐన "సేవ్ ది టైగర్స్" సిరీస్ లో నటించి ఫుల్ కామెడీ పంచింది. సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉండే సుజాత ఇప్పుడు "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అని అడిగింది. ఇక నెటిజన్స్ ప్రశ్నలు మాములుగా లేవు. "మీ వివాహ జీవితం ఎలా ఉంది" " చాలా బాగుంది".."అక్కా నువ్వు హీరోయిన్ లా ఉంటావ్ తెలుసా" అంటే అన్నావ్ కానీ ఆ మాట ఎంత బాగుందో..థ్యాంక్యూ" "హాయ్ అక్క..సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఎప్పుడొస్తుంది...మేమంతా దాని కోసం వెయిటింగ్".."ఆన్ ది వే..త్వరలో వస్తుంది" .."మళ్ళీ అమెరికాకి ఎప్పుడు వెళ్తున్నారు?" "ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియడం లేదు. అంతా రాకేష్ గారి మాయ".. "మీ అత్తగారు చేసే వంటల్లో  ఏది ఇష్టం" " అన్ని రకాల వెజ్ వెరైటీస్"..."హాయ్ అక్క మీరు ఇండస్ట్రీకి రాకపోతే ఎం అయ్యేవారు" " పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం మే బి పోలీస్ అయ్యేదాన్నేమో" అని టకటకా ఆన్సర్స్ ఇచ్చేసింది సుజాత.  ఇక తన సెల్ వాల్ పేపర్ మీద ఉన్న ఫొటోస్ ని అలాగే తన పెళ్లి ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో అడిగిన ఫాన్స్ తో షేర్ చేసుకుంది సుజాత. ఇక రీసెంట్ గా వరంగల్ కి  చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌.. లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు రాకింగ్ రాకేష్ సుజాతతో కలిసి వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.

క్యూరియాసిటిని పెంచేస్తున్న బిగ్ బాస్ కొత్త ప్రోమో!

బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ఈ సీజన్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  టెలివిజన్ చరిత్రలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గత కొన్ని సంవత్సరాలగా టెలివిజన్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. టీఆర్పీలో అత్యధిక రేటింగ్ తో  ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్డాగా మారింది బిగ్ బాస్. ఈ సీజన్ కి సంబంధించిన సెట్ పనులు, ఇంకా ప్రోమో షూట్ అంతా ఇప్పటికే మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ ని అప్రోచ్ అవడం కూడా జరిగిందంట. అందులో కొంతమందిని కన్ఫర్మ్ చెయ్యడం, వాళ్ళతో అగ్రిమెంట్ పూర్తిచేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి కేటగిరి నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తూ జరిగే ఈ ప్రక్రియలో.. ఒక రియల్ కపుల్ ని తీసుకుంటున్నారంటూ తెలుస్తుంది.  గత సీజన్ కి అవుటింగ్ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ శివ ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్-7కి బిబి కేఫ్ యాంకర్ గా అరియాన గ్లోరీ వ్యవహరిస్తుందంట.  బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన ప్రోమో షూటింగ్ ఈ నెల ఆఖరున మొదలవుతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్-7కి సంబంధించిన చాలా అనుమానాలు ప్రేక్షకులలో ఉన్నాయి. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎప్పుడు ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారా అనే క్యూరియాసిటి రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే అందరిలో ఉన్న సస్పెన్స్ కి తెరతీస్తూ స్టార్ మా ప్రతిష్టాత్మకంగా బిగ్ బాస్ లోగోని విడుదల చేసింది. ఇప్పటికే నాగార్జునకి సంబందించిన రెండు ప్రోమోలని విడుదల చేయగా.. ఈ సారి సీజన్ కొత్తగా, మునుపెన్నడు లేని విధంగా ఉంటుందని నాగార్జున మాటలని బట్టి తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో లో అన్ని క్లైమాక్స్ లలో లాగా కాకుండా ఈ సారి ఎండింగ్ నే మార్చేద్దామంటూ నాగార్జున అన్నాడు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే.. ఈ సారి మొత్తం ఉల్టా పుల్టా అని ప్రోమోలో నాగార్జున చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్ బాస్ సీజన్-7 పై ప్రేక్షకులలో మరింత క్కూరియాసిటి పెరిగింది.

బాస్ ఈజ్ బ్యాక్... సుధీర్ గుడెలపై వాలిపోయిన రష్మీ!

బుల్లితెర మీద ఫేమస్ ఐన రీల్ జోడి ఎవరు అంటే చాలు రష్మీ, సుధీర్ అని చెప్తారు. వీళ్ళు షోలో కనిపించారంటే చాలు ఆడియన్స్ లో ఆనందం ఉప్పొంగుతుంది. కొంతకాలం వీళ్ళిద్దరూ కలిసి షోస్ చేశారు తర్వాత సుధీర్ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు...రష్మీ మాత్రం హ్యాపీగా బుల్లితెర మీద, అవకాశం వచ్చినప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఐతే వీళ్ళ మధ్య గ్యాప్ ని మాత్రం ఆడియన్స్ భరించలేకపోతున్నారు. అలాగే బుల్లితెర మీద వీళ్ళ గ్యాప్ ని ఫుల్ గా కాష్ కూడా చేసుకుంటూ కౌంటర్లు కూడా వేస్తున్నారు.   ఇప్పుడు ఈటీవీ 28 ఇయర్స్ బలగం సెలెబ్రేషన్స్ పేరుతో ఒక ఈవెంట్ ని టెలికాస్ట్ కాబోతోంది. అందులో  మళ్ళీ రష్మీ, సుధీర్ కలిసి డాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసేసరికి ఆడియన్స్ ఆనందం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఈ ప్రోమో సుధీర్ - రష్మీ డైలాగ్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. “మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు ” అని సుధీర్ అనగానే  “ మరి నువ్వు వస్తావని ఇన్నాళ్లూ ఎదురుచూశాను” అంటూ రష్మి బుంగమూతి పెట్టుకుని చిరు కోపం ప్రదర్శిస్తూ ఆన్సర్ ఇచ్చింది. "ఇన్ని రోజులు ఎక్కడున్నావ్" అని మళ్ళీ రష్మీనే అడిగేసరికి .. “నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లో ఉన్నావ్” అని సుధీర్ చెప్పిన ఆ ఒక్క డైలాగ్ తో స్టేజి మొత్తం నవ్వులు పూశాయి. సుధీర్- రష్మీ ప్రేమ ఏమో కానీ వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఐతే సోషల్ మీడియా మాత్రం వీళ్లకు పెళ్లి కూడా చేసేసింది. వీళ్ళ పెళ్లి వీడియోస్ చూసుకుని వీళ్ళు కూడా  నవ్వుకున్నారు. ఐతే సుధీర్- రష్మీ మధ్య ప్రేమ గీమా లాంటిదేమీ లేదంటూ గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో సుధీర్ ఫ్రెండ్స్ రాంప్రసాద్, గెటప్ శీను చెప్పారు.

బిగ్ బాస్ 7 లో రచ్చకి రెడీ అంటున్న ఆర్జీవీ అప్సర!

బిగ్ బాస్ అంటే చాలా మందికి గుర్తొచ్చేవి హౌస్ లో  జరిగే గేమ్స్, ఫుడ్, మంచి వెదర్, బిగ్ బాస్ మాటలు అన్నీ గుర్తొస్తాయి. బిగ్ బాస్ తెలుగు ఇప్పటివరకు 6 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. త్వరలో అంటే ఈ నెలాఖరుకు కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ బిగ్ బాస్ సీజన్ 7 రాబోతోంది. ఐతే ఈ బిగ్ బాస్ సీజన్స్ లో కచ్చితంగా ఒక ఆర్జీవీ హీరోయిన్ ఉంటోంది. ఐతే ఇప్పటి వరకు ఉన్న ఆర్జీవీ హీరోయిన్స్ ని ఒకసారి పరిశీలిస్తే బిగ్ బాస్ సీజన్ 3 లో  అష్షు రెడ్డి వెళ్ళింది.  జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షు ఆర్జీవీ పెద్ద ఫ్యాన్. డేంజరస్ మూవీ ప్రొమోషన్స్ ని ఆర్జీవీ, అష్షు ఎలా చేశారో అందరికీ తెలిసిన విషయమే. అష్షు రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కూ తాను  క‌లిసిన వాళ్లలో  నిజాయితీగ‌ల అమ్మాయి అంటూ ఆర్జీవీ కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఇకపొతే ఆరియానా.. ఈమె ఆర్జీవిని బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరీ పేరు తెచ్చుకుంది. తనకు అరియానా బాడీ ఎంతో బాగా నచ్చింది అని కూడా చెప్పి… ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆర్జీవీ.  ఆరియానా బిగ్ బాస్ సీజన్ 4 లో సందడి చేసింది. మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ కాంపిటీటర్ గా మారిపోయింది. ఆరియానాకు ఆర్జీవీ అంటే ఎంత ఇష్టమో కూడా చెప్పింది.  రామ్ గోపాల్ వర్మని ఒక మాడ్రన్ ఋషి. ఆయన గురించి మనకేం తెలుసు ఆయన మన మధ్య ఉన్న ఋషి అంటూ పొగిడేసింది. ఇకపోతే ఇనాయ సుల్తానా..ఈమె కూడా ఆర్జీవీ హీరోయిన్... ఈమె బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి చేసింది. చాలామందితో ప్రేమాయణాలు నడిపింది. ఒక ప్రైవేట్ పార్టీలో ఆర్జీవీతో కలిసి డాన్స్ చేసిన ఇనాయ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఆమె వెళ్ళింది సరే బయట ఉన్న ఆర్జీవీ ఆమెను గెలిపించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టాడు. మరి వీళ్లంతా ఆర్జీవీతో ఇంటర్వ్యూస్ చేసి, ప్రైవేట్ పార్టీస్ లో డాన్సస్ చేసి ఆర్జీవీ హీరోయిన్స్ గా  ముద్ర వేయించుకున్నారు. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కి ఎవరు వెళ్ళబోతున్నారనే ప్రశ్న వేస్తున్నారు ఆడియన్స్ ...ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో కలిసి పని చేసిన అప్సర రాణి ఉంది. మరి చూడాలి ఎవరు వెళ్తారో అని.

పెళ్లి కూతురికి ప్రదీప్ బిస్కెట్... కన్నీళ్లు పెట్టుకున్న బాబూమోహన్!

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి శ్రీదేవి, జయప్రద, బాబుమోహన్ జడ్జెస్ గా ఉన్నారు. ఐతే ఈ వారం జడ్జెస్ విషయంలో ప్రదీప్ కి శ్రీదేవికి మధ్య చిన్న డిస్కషన్ సీరియస్ గా మొదలయ్యింది. చివరికి కూల్ ఐపోయింది. "ఇందాకటి నుంచి వీళ్ళే జడ్జెస్ వీళ్ళే జడ్జెస్ అని నన్ను ఫోర్స్ చేస్తున్నారు" అని ప్రదీప్ అనేసరికి "అంటే మీరు డిసైడ్ ఇపోయారా వాళ్ళే జడ్జెస్ మేము పార్టిసిపెంట్స్ అని" శ్రీదేవి అనేసరికి " దేవతలు కూడా అనుకున్నారు" అని ప్రదీప్ బిస్కెట్ వేసాడు. ఇక  శ్రీదేవి ఐస్ ఐపోయింది. దాంతో  జయప్రద ముఖం మాడిపోయింది. "అయ్యో మేడం మీరు అలిగారా..యాక్చువల్లీ నేను మేడం కోసం రోజా పువ్వు తెద్దామనుకున్నా..కానీ మేడమే రోజా పువ్వులా ఉంటే ఇంకా రోజా ఎందుకని తేలేదు" అని అనేసరికి జయప్రద నవ్వేశారు. "ఇదిగో నీకోసం అంటూ శ్రీదేవి ప్రదీప్ కి బిస్కెట్ ఇచ్చింది..ఎవరికీ లేదు నాకే " అని దాచుకున్నాడు ప్రదీప్.. "దాచిపెట్టావంటే కచ్చితంగా పెళ్లి కూతురు కోసమే" అంటూ పంచ్ వేశారు బాబూమోహన్. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో రవి, సుష్మ కిరణ్ చిన్నారులతో కలిసి చేసిన స్కిట్ కి బాబుమోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నాకు మా అమ్మ గుర్తొచ్చింది. 3 వ తరగతిలో మా అమ్మ చనిపోయింది. నాకు చిన్న చెల్లెలు ఉంది. ఆమెకు చిన్నప్పటి నుంచి తల దువ్వి, జడ వేసేవాడిని..మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు. మేము మా బాధను ఎవరికీ చెప్పుకోవాలో తెలియదు" అని చెప్తుండగా ఈ ప్రోమో ఎండ్ అయ్యింది. డ్రామా జూనియర్స్ లో  ప్రతీ వారం చిన్నపిల్లలు చేసే స్కిట్స్ మంచి హైలైట్ గా నిలుస్తున్నాయి. వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా అలరిస్తున్నాయి. జడ్జెస్ కూడా ఈ చిన్నారుల స్కిట్స్ ని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు బుల్లితెర నటీనటులు కూడా వచ్చి స్కిట్స్ వేయడం ఇంకా మంచి విషయం.

నిద్రపోతున్న వ్యక్తిని లేపి మరీ సుమ శాడిజం!

యాంకర్ సుమ వేసే పంచులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఆమె పంచ్ వేస్తే పేలాల్సిందే. సుమ లేకుండా ఏ మూవీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోదు..సుమ అసలెప్పుడూ ఖాళీగానే కనిపించదు. పొరపాటున ఖాళి దొరికితే మాత్రం అప్పుడప్పుడు టూర్స్ కి,  వెకేషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే కాదు ఈవెంట్ టైంలో ఖాళి దొరికితే అందరినీ ఏడిపిస్తూ శాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంది కూడా. గతంలో తన పర్సనల్ అసిస్టెంట్ గా ఉండే ఒక లేడీకి డాన్స్ నేర్పించింది. డాన్స్ చేయకపోయేసరికి కసురుకుంది. అలాగే తను పెంచుకునే కుక్కకు బిస్కెట్స్ పెట్టకుండా ఏడిపించింది. వీటిని రీల్స్ గా చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు షూటింగ్ లొకేషన్లో ఒక వ్యక్తిని ఏడిపించి ఆనందించింది సుమ. కుర్చీలో కూర్చుని అలిసిపోయి నిద్రపోతున్న ఒక వ్యక్తిని చూసి అతని చెవి దగ్గరకు వెళ్లి "హ్యాపీ బర్త్ డే టు యు" అంటూ గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి లేచి ముఖం తుడుచుకున్నాడు ఆ వ్యక్తి. సుమ మాత్రం హ్యాపీగా  ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయింది. ఆ షూటింగ్ లొకేషన్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనే విషయం వాళ్ళ నవ్వులను బట్టి తెలిసింది. దీన్ని వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి "నేను నిద్రపోను..ఎవరినీ పోనివ్వను..నాలో మరో కోణం" అంటూ కాప్షన్ పెట్టుకుంది. అలా అల్లరి చేస్తుంది సుమా. సుమ ఎక్కడ ఉంటె అక్కడ సందడే సందడిగా ఉంటుంది. టాలీవుడ్ లో చాలా మంది సుమ స్పాంటేనిటీని బాగా ఇష్టపడతారు కూడా. ఇక ఇండస్ట్రీలో సింగర్ సునీతా, యాంకర్ సుమ మంచి ఫ్రెండ్స్ కూడా..సునీత కొడుకు ఆకాష్ రీసెంట్ గా తెరంగేట్రం చేసాడు.

కృష్ణ, మురారీలకు మళ్ళీ పెళ్ళి.. మరి ముకుంద పరిస్థితేంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -231 లో.. కృష్ణకి భవాని ఏడువారాల నగలు వేసి రెడీ చేస్తుంది. కృష్ణని చూసి భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ మాత్రం నేను మోసం చేస్తున్నానని మనసులో అనుకొని ఏడుస్తుంది. ఏమైందని భవాని అడుగుగా.. మా అమ్మ నాన్న గుర్తుకువచ్చారని కృష్ణ అంటుంది. అప్పుడు భవాని కృష్ణని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఒక్కతే కూర్చొని ఇంట్లో వాళ్ళతో సరదాగా ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ గురించి ఆలోచిస్తుంటాడు మురారి. అందరికి అగ్రిమెంట్ విషయం చెప్పమని అంటుందంటే తనకి ఈ మాంగల్యధారణ ఇష్టం లేదు అన్నట్లే కదా.. నేను తన జీవితంతో ఆడుకుంటున్నా అనుకుంటుందని మురారి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి నందు వస్తుంది. నాకు కృష్ణపై చాలా కోపంగా ఉంది. నువ్వు ఒట్టేసావ్ కాబట్టి సైలెంట్ గా ఉంటున్నా లేదంటే అమ్మ కి చెప్పి మిమ్మల్ని ఒకటి చేసేదాన్ని  అని మురారితో నందు అంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి అలేఖ్య వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో పూజకి అంతా సిద్ధం చేస్తారు. నిండు మనసుతో నల్లపూసలు గుచ్చండి అని పంతులు గారు చెప్తారు. " వాళ్ళు నిండు మనసుతో దీవించి పూసలు గుచ్చితే, మరి నా ప్రేమ ఏం కావాలి అయిన వాళ్ళు విడిపోతున్నారు.. నేను వెళ్లి పూసలు గుచ్చుతాను" అని ముకుంద వెళ్లి పూసలు గుచ్చుతుంది. అది చూసిన రేవతి.. తను ఎందుకు పూసలు గుచ్చుతుంది. నేను అక్క ముందు అడగలేనన్న దైర్యంతో అలా చేస్తుందని రేవతి అనుకుంటుంది. రేవతి వైపు భవాని చూస్తూ.. ఏమైంది వీళ్ళందరికి రెండు మూడు రోజుల నుండి ఇలా ఉంటున్నారు. నా వెనకాల ఏదో జరుగుతుంది తెలుసుకోవాలని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు రెడీ అయి కిందకి వస్తారు. వాళ్ళని రేవతి బాధగా చూస్తుంటుంది. ఏమైంది రేవతి ఎందుకు అలా ఉన్నావ్? అందరు మొన్నటి వరకు బానే ఉన్నారు.. ఇప్పుడు ఏమైందని భవాని అడుగుతుంది. వాళ్ళ మధ్య సమస్య ఉంది. ఈ మంగల్యధారణతో అది తొలగిపోవాలని రేవతి అంటుంది. చూద్దామని భవాని అంటుంది.ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు మంత్రాలు చదువుతారు. మురారి, కృష్ణ మేడలో తాళి కడతాడు. ఆ తర్వాత కృష్ణ ఆ తాళిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఈ షూటింగ్ అంటే చాలు గుండెలు వణుకుతాయి!

టీవీ రంగంలో జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, వేణు ఎల్దండి, అటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర, శకలక శంకర్ ఇలా చాలామంది జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశాలను పొందుతున్నారు. అదే బాటలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కూడా ఫేమస్ అయ్యారు. జోర్దర్ సుజాత తనకంటు సొంతంగా ' సూపర్ సుజాత' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంది. కాగా ఆ వ్లాగ్స్ అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో మొదటి నుండి పిల్లలతో ఎక్కువగా స్కిట్లు చేస్తూ ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత వీళ్ళ టీమ్ లోకి జోర్దార్ సుజాత వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. రాకింగ్ రాకేష్ సొంతంగా ' చంటబ్బాయ్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు. అందులో వీళ్ళిద్దరు కలిసి అమెరికా, యూకే వెళ్తున్న వ్లాగ్స్ చేశారు. అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. పాస్ పోర్ట్స్ పోయాయంటూ సుజాత మీద ఫ్రాంక్ చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అయింది. తాజాగా రాకింగ్ రాకేష్ తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోని అప్లోడ్ చేశాడు. అందులో వాళ్ళు జబర్దస్త్ స్టేజ్ మీద చేసే పది నిమిషాల స్కిట్ కోసం ఎంత కష్టపడతారో చెప్పాడు రాకేష్. ఈ వీడీయోకి ' ఈ షూటింగ్ అంటే చాలు గుండెలు వణుకుతాయి' అనే టైటిల్ పెట్టగా, తంబ్ నెయిల్ లో రాఘవేంద్రరావు, హైపర్ ఆది, గెటప్ శీను, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లని ఆడ్ చేయడంతో చాలా మంది ఏం ఉందా అని చూస్తున్నారు. అయితే ఈ వీడియోలో తన టీమ్ అంతా స్కిట్ చేసే రెండు రోజుల ముందు నుండి ప్రాక్టీస్ చేస్తున్నట్టు రాకేష్ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

వాళ్ళ దృష్టిలో మనిమిద్దరం రిషీధారలమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -837లో.. రౌడీ ఫోన్ కి శైలేంద్ర ఫోన్ చెయ్యడం.. ఆ వాయిస్ గుర్తుపట్టారా అని ఇన్‌స్పెక్టర్, అలాగే అప్పుడే వచ్చిన రిషి కూడా వసుధారని అడగడంతో.. తను గుర్తుపట్టాను చెప్తుంది. ఆ వాయిస్ మీ అన్నయ్య శైలేంద్రని చెప్తుంది. అంతే కాకుండా వసుధార చెప్పిందేది రిషి నమ్మనట్టు, అదంతా వసుధార ఉహించుకుంటుంది. ఆ తర్వాత వసుధారని ఇన్‌స్పెక్టర్ వాయిస్ విన్నారా అని అడుగుతాడు. అప్పుడే రిషి వస్తాడు. ఏదో దగ్గర వాళ్ళ గొంతులాగా అనిపించిందని వసుధార చెప్తుంది. ఆ తర్వాత వసుధార వెళ్లిపోతుంటే.. మేడమ్ ఇక్కడ జరిగేది మీ మేడమ్, మా డాడ్ కి చెప్పకండి.. చెప్పి వాళ్ళని కంగారుపెట్టి ఇక్కడికి వచ్చేలా చెయ్యకండని రిషి అంటాడు. మరొకవైపు రౌడీ ఫోన్ రిషి దగ్గర వదిలేసి వెళ్లారు. ఇప్పుడు ఇదంతా నేనే చేశానని తెలుస్తే నా పరిస్థితేంటి.. వాడికి నిజం తెలియక ముందే వాన్ని లేపేయ్యలని శైలేంద్ర అనుకుంటాడు. మరొక వైపు రిషి క్లాస్ లో ఉండగా.. మీతో మాట్లాడాలని వసుధార మెసేజ్ చేస్తుంది. నాతో మాట్లాడేదేమీ లేదని రిషి ఆ మెసేజ్ కి రిప్లై ఇస్తాడు‌. అయిన సరే మీరు రావాలి. మీ కోసం వెయిట్ చేస్తున్నానని వసుధార అంటుంది. డోంట్ వెయిట్ నేను రాను, మాట్లాడనని రిషి అంటాడు. ఆర్డర్ వేస్తుందా తను చెప్పినట్టు నేనెందుకు వినాలని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్తుంటే సర్ మాట్లాడాలి ఆగండని వసుధార అంటుంది. అయిన కూడా రిషి వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏంటో ఇంత పట్టుదల మాట్లాడితే ఏం అవుతుందని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత రిషి వెళ్తు.. వసుధార, విశ్వనాథ్ ఇంటికి వెళ్లినట్టు, రిషితో కోపంగా మాట్లాడినట్లు, వాళ్ళ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిన విషయం విశ్వనాథ్,  ఏంజెల్ కి చెప్పినట్లు రిషి ఉహించుకుంటాడు. ఆ తర్వాత ఈ పొగరు అలానే చేస్తుందని అనుకొని  వసుధార కంటే ముందే రిషి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత వసుధార ఇంటికి వస్తుంది. చక్రపాణి వసుధారకి ఎదురుగా వచ్చి.. అల్లుడు గారంటూ చెప్తుండగా.. హా అల్లుడు గారే మాట్లాడాలి. అంటే అసలు వినరు. నేను ఏమైనా సినిమాకి రమ్మన్నానా, షాపింగ్ కి రమ్మన్నానా అంటూ లోపలికి వెళ్లేసరికి.. రిషిని చూసి షాక్ అవుతుంది. ఏదో మాట్లాడాలని అన్నావ్ ఏంటని రిషి అడుగుతాడు. మీ గురించి మహేంద్ర సర్ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు‌. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ దృష్టిలో మనమిద్దరం ఒకటే రిషీధారలమే.. మీరు ఇన్‌స్పెక్టర్ కి కాల్ చేసి మనం ఇచ్చిన ఫోన్ గురించి ఎంత వరకు వచ్చిందో కనుక్కోండి అని  రిషికి చెప్తుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఇంటి పరువు తీసిందని‌ కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -170 లో.. కావ్య తన పుట్టింట్లో వర్క్ చేస్తున్న వీడియోని రాహుల్ కి తన మనిషి పంపిస్తాడు. అది చూసిన రాహుల్.. ఈ వీడియోని ఎలాగైనా మీడియాలో వచ్చేలా చెయమని చెప్తాడు. అప్పుడే రుద్రాణి వచ్చి ఆ వీడియో చూపించమని అడుగుతుంది. ఆ వీడియో చూసిన రుద్రాణి.. ఈ వీడియో మీడియాలో వచ్చేలా నువ్వు చెయ్.. ఇంట్లో యుద్ధం నేను మొదలుపెడతానని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. మరొకవైపు కళ్యాణ్ తన అభిమాని పేరు కనుక్కోవాలని అప్పుతో చెప్తాడు. నా అభిమాని పేరు క్లూ ఇచ్చింది  చేతిలో ఉంటుందట. నువ్వు చెప్పమని అప్పుతో కళ్యాణ్ అంటాడు. నాకేం తెలియదని అప్పు అంటుంది. మరొక వైపు ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతుంటే.. రుద్రాణికి ప్లాన్ సక్సెస్ అని రాహుల్ సైగ చేస్తాడు. దాంతో రుద్రాణి టీవీ ఆన్ చేస్తుంది. కావ్య తన పుట్టింట్లో వర్క్ చేస్తున్న వీడియో న్యూస్ లో వస్తుంది.ఇంట్లో వాళ్ళు అందరూ అది చూసి షాక్ అవుతారు. దుగ్గిరాల ఇంటి కోడలు దయనీయ స్థితిలో ఉంటుంది. ఆ ఇంట్లో మానవత్వం కరువయి, ఆ ఇంటి కోడలు పుట్టింట్లో తన నాన్న షాప్ లో పని చేస్తుందంటూ న్యూస్ లో రావడం చూసిన అపర్ణ కోపంగా టీవీ ఆఫ్ చేస్తుంది. చూసారా మన ఇంటి పరువు ఎలా తీస్తుందోనని అపర్ణ అంటుంది. అసలు ఆ మీడియా కవరేజ్ కూడా కావ్య చేపించిదేమోనని రుద్రాణి అనగానే.. రానివ్వండి తన సంగతి చెప్తానని అపర్ణ అంటుంది. మరొక వైపు కళ్యాణ్ తన అభిమాని పేరు కనుక్కోవడం కోసం కష్టపడుతుంటాడు కళ్యాణ్మ అప్పుడే షాప్ అతను కళ్యాణ్ నీ పిలిచి మీకు ఫోన్ వచ్చిందని చెప్తాడు. కళ్యాణ్ వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు. నేను మీ మాటలు విన్నానని కళ్యాణ్ అభిమని మాట్లాడుతుంది. మళ్ళీ క్లూ ఇస్తుంది. కళ్యాణ్ తన పేరు అనామీకా అని కనిపెడతాడు. మీ నెంబర్ చెప్పండని కళ్యాణ్ అనగానే.. పక్కన ఉన్న అప్పు.. కళ్యాణ్ ని అదోలా చూస్తుంది. కానీ ఆ అభిమాని ఫోన్ నెంబర్ చెప్పి ఒక నెంబర్ కనుక్కోమని మళ్ళీ చెప్తుంది. మరొకవైపు రాజ్ కి కావ్య చేస్తున్న వర్క్ మీడియాలో వచ్చిన విషయం తెలుస్తుంది. రాజ్ కోపంగా బయల్దేరతాడు. మరొక వైపు కావ్య కూడా తన పుట్టింటి నుండి బయల్దేరుతుంది. తర్వాత కావ్య ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో సైలెంట్ గా కూర్చొని ఉంటారు. ఏమైందని కావ్య అడుగుతుంది. ఏమైంది అని తెల్వదా అని రుద్రాణి వీడియో చూపిస్తుంది. అందులో తప్పేముంది.. కష్టంపడడం తప్పు కాదు.. మీరు పరువు చూస్తున్నారు.. నేను కష్టం చూస్తున్నానని కావ్య అంటుంది. అలా కావ్య అనడంతో తనపై కోప్పడుతుంది అపర్ణ. అప్పుడే రాజ్ వస్తాడు. రాజ్ కూడా కావ్యనే తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వైఎస్ షర్మిలపై సెటైర్ పేల్చిన అదిరే అభి!

"సుమ అడ్డా" షో నెక్స్ట్ వీక్ ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఇందులో వైస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మీద సెటైర్స్ పేల్చారు. ఈ షోకి  అదిరే అభి, జోర్దార్ సుజాత, విద్యుల్లేఖ, కమెడియన్ సుదర్శన్ వచ్చారు. ఇక సుమ మధ్యలో "మై డియర్ ఈడ స్టూడెంట్స్, మై డియర్ ఆడ స్టూడెంట్స్" అని పిలిచేసరికి  "అసలు స్టూడెంట్స్ ని స్టూడెంట్స్ అని ఎందుకంటారో తెలుసా అండి" అంటూ అదిరే అభి కామెడీ పంచ్ వేసాడు. దానికి జోర్దార్ సుజాత మధ్యలో వచ్చి "వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి" అని రివర్స్ సెటైర్ వేసింది. దాంతో అభి ముఖం వంకరబోయింది. ఇక స్టార్టింగ్ లో అదిరే అభి సుమ మీద పంచులు వర్షం కురిపించేసరికి సుమ తెగ సిగ్గుమొగ్గలైపోయింది. "మీరు ఎందుకు ఈమధ్య హీరోయిన్ త్రిష గారిలా కనిపిస్తున్నారు" అని అభి సుమని అడిగాడు .."నువ్వెంత ఐస్ వేసినా పాయింట్ పాయింటే" అని విద్యుల్లేఖ అభికి కౌంటర్ వేసింది. "ఆయన ఐస్ వేసాడు కాబట్టే నేను త్రిషలా కనిపిస్తున్నా" అని కామెడీ కౌంటర్ పేల్చింది సుమ. దాంతో "అనవసరంగా వేసానండి పంచ్" అని ఫీలయ్యాడు అభి. "సుజాత మీ ఆయన బాగున్నాడా" అనేసరికి "చాలా బాగున్నాడు" అని చెప్పింది. "మీకు తెలుసా రాకేష్ ని ఎన్ని సార్లు పెళ్లి గురించి అడిగినా నేను చేసుకోను..కానీ చివరికి చేసుకున్నాడు"   అని అంది సుమా.. ఇక ఈ ప్రోమోలో స్టూడెంట్ మీద డైలాగ్ చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "ఇక్కడ కూడా షర్మిల అక్కను వదల లేదుగా..." అని అంటున్నారు. ఇక అదిరే అభి రిఎంట్రీ ఇవ్వడం పై నెటిజన్స్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.