దీప్తి సునైన, షణ్ముఖ్ లు కలిసి చేసిన మలుపు  సాంగ్ కి అవార్డు!

దీప్తి సునైనా.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది.  షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి దీప్తి సపోర్ట్ బాగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక షన్ను, దీప్తి సునైనా ఇద్దరు విడిపోయారు. వాళ్ళు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఉన్నప్పుడు.. సిరితో క్లోజ్ గా ఉండడం వల్లనే.. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు విడిపోయి.. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే రెండు మూడు సందర్బాలలో ఈవెంట్స్ లో ఎదురుపడినా పరిచయం లేనట్లుగా ఉన్నారు. కాగా ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఇండైరెక్ట్ గా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో మాట్లాడుకుంటున్నారు. అంటే సెటైరికల్ గా ఒకరి పోస్ట్ కి మరొకరు కౌంటర్లు వేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.  దీప్తి సునైన లవ్ బ్రేకప్ అయినప్పటి నుండి తన పరిధిలో తను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని గడుపుతుంది. తనకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫాన్స్ కి దగ్గరగా ఉంటుంది దీప్తి సునైన. కాగా తాజాగా ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీప్తి. షణ్ముఖ్, దీప్తి కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ' మలుపు'  కి అవార్డ్ వచ్చిందంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది దీప్తి సునైన. అవార్డియో సంస్థ వారు ఇచ్చి‌న అవార్డ్స్ లో ' బెస్ట్ మ్యూజిక్ ఆఫ్ ది ఇయర్ 2023 ' వీళ్ళిద్దరు కలిసి చేసిన మలుపుకి వచ్చింటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా ఈ పోస్ట్ చూసి దీప్తి, షణ్ముఖ్ ల కామన్ ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో మరోసారి వీరిద్దరు ట్రెండింగ్ లోకి వచ్చేసారు.

ఇన్ స్టాగ్రామ్ లో జీవిత పాఠాలు చెప్తున్న యాంకర్ రవి!

యాంకర్ రవి.. యాంకరింగ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన రవి అందరికి సుపరిచితమే. షోస్, ఈవెంట్స్ లలో బిజీగా ఉంటోన్న రవి.. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. 'సంథింగ్ స్పెషల్' అంటూ కెరీర్ స్టార్ట్ చేసిన రవి.. ఆ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో రవి ఫాలోయింగ్ బాగుండేది. రవి ఆ షో చేస్తుంటే లైవ్ లో తనకి కాల్ చేసి మరీ.. మ్యారేజ్ చేసుకోమని అడిగేవారు.. అప్పట్లో రవికి అంత క్రేజ్ ఉండేది. ఆ తర్వాత బిగ్ బాస్-5 లో ఎంట్రీ ఇచ్చిన రవికి.. హౌస్ లో పాజిటివ్ ఇంప్రషన్ కన్నా నెగటివ్ ఇంప్రెషనే ఎక్కువ వచ్చింది‌. ఏం వచ్చిన  ఫేమ్ అయితే వచ్చిందనే చెప్పాలి. రవి ఎంట్రీతో బిగ్ బాస్ విన్నర్ అతనే అని మొదట్లో అనిపించిన.. తను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బిహేవ్ చేసిన దానికి... అదంతా తలకిందులై.. అనుకోకుండా రవి బయటికొచ్చేసాడు. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఫ్యామిలీ వీక్ లో.. రవి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎమోషనల్ గా సాగిన ఎపిసోడ్.. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇన్ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. రవి యాంకరింగ్ అంటేనే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రేక్షకులను సైతం తన మాటలతో ఉత్తేజపరుస్తాడు. యాంకర్ రవి.. కొన్ని వారాల క్రితం శ్రీలంకకి షిప్ లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. అది వ్లాగ్ చేయగా ఫుల్ వైరల్ అయింది. అయితే తాజాగా అమెరికాకి ఒక షో కోసం వెళ్ళిన వ్లాగ్, వచ్చాక తన భార్య కోసం సర్ ప్రైజ్ అంటూ మరొక వ్లాగ్ చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు  యాంకర్ రవి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో జీవిత పాఠాలు చెప్తున్నాడు. " మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా.. మనం ఎవరికోసమైతే కష్టపడుతున్నామో వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోతే వాళ్ళ జుట్టు పట్టుకొనో, గల్ల పట్టుకొనో చెప్పాలి.. మేం మీ కోసమే కష్టపడుతున్నాము అని చెప్పాలి " అంటూ యాంకర్ రవి చెప్పాడు. అగస్ట్ మొదటి వారంలో రోహిణితో కలిసి ఒక షో స్టార్ట్ అవుతున్నట్టుగా చెప్పాడు రవి.  

లేడీ గెటప్ ఎంత కష్టమో చెప్పిన రాకింగ్ రాకేష్!

టీవీ రంగంలో జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, వేణు ఎల్దండి, అటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర, శకలక శంకర్ ఇలా చాలామంది జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశాలను పొందుతున్నారు. అదే బాటలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కూడా ఫేమస్ అయ్యారు. జోర్దర్ సుజాత తనకంటు సొంతంగా ' సూపర్ సుజాత' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంది. కాగా ఆ వ్లాగ్స్ అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో మొదటి నుండి పిల్లలతో ఎక్కువగా స్కిట్లు చేస్తూ ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత వీళ్ళ టీమ్ లోకి జోర్దార్ సుజాత వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. రాకింగ్ రాకేష్ సొంతంగా ' చంటబ్బాయ్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు. అందులో వీళ్ళిద్దరు కలిసి అమెరికా, యూకే వెళ్తున్న వ్లాగ్స్ చేశారు. అవి తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. పాస్ పోర్ట్స్ పోయాంటూ సుజాత మీద ఫ్రాంక్ చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అయింది. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ' లేడీ గెటప్ ఎంత కష్టమంటే' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు రాకింగ్ రాకేష్. ఈ వ్లాగ్ లో తను జబర్దస్త్ లో ఎదర్కున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి రాకేష్ చెప్పాడు. మా స్కిట్ లో లేడీ గెటప్స్ వల్లనే మేం పర్ఫామెన్స్ ఫ్రీగా చేయగలుగుతున్నామని రాకేష్ చెప్పాడు. ఈ వ్లాగ్ లో జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తున్న వినోదిని, శాంతి స్వరూప్ కూడా ఈ లేడీ గెటప్ కోసం ఎంత కష్టపాడుతున్నారో చెప్పారు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కి వచ్చిన మొదట్లో లేడీ గెటప్ లు వేసిన వీడీయోలు ఈ మధ్య యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. వాటిని దృష్ణిలో పెట్టుకొని తాజాగా జబర్దస్త్ లో చేస్తున్న స్కిట్ లో తన భార్య సుజాత మగవాడి గెటప్ లో, రాకేష్ ఆడవారి గెటప్ లో కన్పిస్తున్నట్టుగా ఈ వ్లాగ్ లో వివరించాడు రాకేష్. కాగా ఈ లేడీ గెటప్ ల గురించి ఎప్పటినుండో వ్లాగ్ చేద్దామని ఇప్పటికి చేయడానికి కుదరిందని మాకు సపోర్ట్ చేయండంటూ అందరికి థాంక్స్ చెప్పాడు రాకేష్.  

పాగల్ పవిత్ర కళ నెరవేరిందంట!

జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో అందరి ప్రశంసలు పొందిన పవిత్ర.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జబర్దస్త్ స్టేజ్ మీద తన సత్తా నిరూపించుకొని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. జీతెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జబర్దస్త్ ఎంతో మంది ఆర్టిస్ట్ లకి అవకాశం ఇచ్చింది. ఇందులో తమ కామెడీతో నవ్వించి, సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నవారు చాలామందే ఉన్నారు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో ధనరాజ్, వేణు, సుడిగాలి సుధీర్, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర లతో సూపర్ స్కిట్ లతో సక్సెస్ అయిన జబర్దస్త్.. ఇప్పుడు టీఆర్పీలోనూ వెనుకబడింది. అయితే కొత్తగా ఆర్టిస్ట్ లను తీసుకొని కొత్త టీం లీడర్స్, కొత్త టీమ్స్ ని తీసుకొని మళ్ళీ కామెడీని సరికొత్తగా తీసుకొస్తుంది జబర్దస్త్‌. ఇలా కొత్తగా వచ్చిన వారిలో నూకరాజు, ఇమాన్యుయల్, పవిత్ర లాంటి వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్లు ఉండేవాళ్ళు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీ చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది.  ఇమాన్యుయల్ తో కలిసి పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. కాగా ఆ వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది. అయితే పాగల్ పవిత్ర పేరుతో తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ అందరికీ దగ్గరవుతుంది. అయితే తాజాగా " నా కళ నెరవేరిన వేళ" అంటూ ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తను కార్ డ్రైవ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ రితన్య, మానసతో కలిసి లాంగ్ టూర్ కి వెళ్తుందంట.. కార్ కొని సంవత్సరం అయినా ఒక్కసారి కూడా డ్రైవ్ చేయలేదంట.. ఫస్ట్ టైమ్ సర్ ప్రైజ్ గా ఎయిర్ పోర్ట్ కి లాంగ్ డ్రైవ్ చేస్తూ వెళ్తుందంట.. అయితే తనని నమ్మి తన ఫ్రెండ్స్ వస్తున్నారని, చూడాలి మరి ఈ రోజు‌ ఎలా ఉంటుందో అంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది. తన యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబర్స్ కి థాంక్స్  చెప్పింది పవిత్ర. ఇదంతా తన వ్లాగ్ లో చెప్పింది పవిత్ర.. కాగా ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.  

కథక్ డాన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ అవమానించారు.. అందుకే చేయను

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం మంచి జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఇందులో పాత, కొత్త యాంకర్స్ కూడా వచ్చారు. అప్పట్లో యాంకర్ గా అలరించిన శిల్ప చక్రవర్తి కూడా వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసారు. అలాగే భావన కూడా తన స్టయిల్లో డాన్స్ చేసి చూపించారు. ఇక వీళ్ళ డాన్స్ చూసిన ప్రీతి నిగమ్ స్టేజి మీదకు వచ్చి శిల్ప చక్రవర్తి డాన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. "శిల్ప చాలా చిన్నప్పటి నుంచే డాన్స్ చేస్తోంది..ఇంకా వండర్ ఫుల్ కథక్ డాన్సర్ కూడా" అని చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొట్టారు.  తర్వాత శిల్ప చక్రవర్తి మాట్లాడుతూ "కథక్ డాన్సర్ అన్నారు కాబట్టి.. ఎప్పుడైనా.. ఎప్పుడు కథక్ టాపిక్  అనగానే నేను చాలా ఎమోషనల్ ఐపోతాను.. నేను ఫస్ట్ ప్రీతి గారిని డాన్స్ చేస్తూ చూసి ఇన్స్పైర్ అయ్యాను.. అలా నన్ను గురువు గారి దగ్గర పంపించారు. అలా నేను 8 ఏళ్ళ వయసప్పుడు నేను ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసాను. ఆ తర్వాత 17  ఏళ్ళ వయసప్పుడు నేను ఫస్ట్ టైం స్టేజి మీదకు డాన్స్ చేయడానికి వచ్చాను. నేను అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ టైములో మా గురువు గారు నాతో ఒక విషయం చెప్పారు. ఒక ఈవెంట్ అవుతోంది.. అందులో కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాలని అన్నారు. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను ఇది క్లాసికల్ డాన్స్..ఒక మాస్ ఈవెంట్ జరగబోతోంది. అందులో కథక్ పెర్ఫార్మెన్స్ ఎలా అని అడిగాను. దానికి వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. అలా నేను కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టి రెండు నిమిషాలు గడిచింది. ఇంతలో వాళ్లంతా  మ్యూజిక్ ఆపేసి గోలగోల చేసి, క్లాప్స్ కొట్టి నా పెర్ఫార్మెన్స్ వద్దని అరిచారు. అప్పుడు ఆ రోజు నేను కథక్ డాన్స్ చేయడాన్ని వదిలేసాను. ఆ క్షణంలో డిసైడ్ అయ్యా స్టేజి మీద కెమెరా ముందు నేను కథక్ డాన్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా. ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలియనివ్వను. కానీ ప్రస్తుతం నేను క్లాసికల్ డాన్స్ లో ఎంఏ పిహెచ్ డి చేసాను. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఒక పెర్ఫార్మెన్స్ ని అంతమంది మంది చేసేటప్పుడు అలా మ్యూజిక్ ఆపేసి వెళ్లిపొమ్మని అవమానించడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది" అని చెప్పి ఎమోషనల్ అయ్యారు శిల్ప చక్రవర్తి.

నెత్తి మీద కుండలతో డాన్స్ చేసి అలరించిన రాధ, సదా

నెత్తి మీద కుండల్ని పెట్టుకుని బాలన్స్ చేస్తూ డాన్స్ చేసి చూపించారు రాధ, సదా. ఈ శనివారం ఎపిసోడ్ "నీతోనే డాన్స్" లో ఒక్కో జోడి చేసిన పెర్ఫార్మెన్స్ ఒక్కోలా ఇరగదీసింది. ఫైనల్ గా మూడు జంటలు వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేసాక.. శ్రీముఖి ఒక కొంటె టాస్క్ ఇచ్చింది. లేడీ కంటెస్టెంట్స్ నెత్తి మీద కుండల్ని పెట్టుకుని లైట్ గా డాన్స్ స్టెప్స్ వేయాలని చెప్పింది. అలాగే వాళ్ళందరి నెత్తి మీద వాళ్ళ వాళ్ళ హజ్బెండ్స్ వచ్చి భార్యల నెత్తి మీద కుండల్ని బాలన్స్ అయ్యేలా నిలబెట్టారు. ఇంకా కావ్య నెత్తి మీద పెట్టుకున్న కుండల్లో ఒక కుండ పగిలిపోయింది. అంజలి, నీతూ కొన్ని డాన్స్ స్టెప్స్ వేశారు. ఐతే అంజలి కుండల మీద చేయి పెట్టుకుని డాన్స్ చేసింది. నీతూ మాత్రం కుండల్ని బాలన్స్ చేస్తూ వాటిని చేతులతో పట్టుకోకుండానే  డాన్స్ స్టెప్స్ లైట్ గా వేసింది. దాంతో శ్రీముఖి నీతూ విన్నర్ అని అనౌన్స్ చేసింది.  తర్వాత రాధ, సదాని స్టేజి మీదకు పిలిచి కుండల్ని పెట్టుకుని డాన్స్ చేయాలనీ చెప్పేసరికి వాళ్ళు కూడా చాలా బాలన్స్ గా నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేశారు. ఐతే సదా నెత్తి మీద కుండ పడిపోయింది కానీ రాధ మాత్రం "ఊ అంటావా మావా" సాంగ్ కి కుండతోనే డాన్స్ చేశారు. ఫైనల్ గా వాళ్ళను చూసాక తరుణ్ మాష్టర్ కూడా వచ్చి నెత్తి మీద కుండ బాలన్స్ చేస్తూ "ఉట్టి మీద కూడు " సాంగ్ కి డాన్స్ స్టెప్స్ వేశారు.  ఇక ఈ మూడు జోడీస్ లో ఈ వీక్ బెస్ట్ పెర్ఫార్మర్ గా కావ్య-నిఖిల్ నిలిచారు. వాళ్లకు గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ వచ్చింది. ఇలా ఈ శనివారం ఎపిసోడ్ కొంచెం కారంగా కొంచెం గారంగా పూర్తయ్యింది.

నేను నోరు విప్పితే అన్ని విషయాలు బయటపడతాయి.. అసలు తెర వెనక ఏం జరుగుతోంది?

"నీతోనే డాన్స్" షోలో పవన్, నటరాజ్ మధ్య ఫైట్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈ వారం ఒక జోడికి ఇంకో జోడి తక్కువ మార్క్స్ ఇచ్చుకుని కోట్ల మంది చూసే ఈ షోలో బాగా గొడవపడ్డారు. కొట్టుకునే  స్థాయి వరకు వెళ్ళిపోయింది. "అంజలి నీ పెర్ఫార్మెన్స్ బాలేదని నటరాజ్ మాస్టర్ అన్ని మాటలు అన్నారు" మరి నీ అభిప్రాయం ఏమిటి అని శ్రీముఖి అడిగేసరికి "డాన్స్ చేయడం కోసం వచ్చాము. ముందుగానే స్కెచ్ వేసుకుని, ప్లాన్ వేసుకుని వీళ్లకు ఇన్ని మార్క్స్ ఇవ్వాలి అని ఐతే రాలేదు ఎలా చేసినా అది అలాగే వస్తుంది" అని అంజలి నటరాజ్ మాస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేసేసరికి "అంజలి మాకు అనిపించింది చెప్పాం.. ఐనా పవన్ ఈ డిస్కషన్స్ ఏమీ వద్దు. నేను డాన్స్ కూడా చేయలేకపోతున్నా" అని నీతూ కొంచెం స్లో గానే చెప్పింది.  "నేను మాట్లాడ్డం మొదలుపెడితే అన్ని చెప్పేయాల్సి వస్తుంది..నేను గనక మీకు మార్క్స్ ఇచ్చి ఉండకపోతే మీరెప్పుడో ఇంటికి వెళ్ళిపోయేవారు.. " అని నటరాజ్ మాస్టర్ అనేసరికి పవన్ కి కోపం వచ్చేసింది. "నువ్వెవరయ్యా నాకు మార్క్స్ ఇచ్చేది..." అనేసరికి "ఏ ఏంటి..ఎం మాట్లాడుతున్నావ్..విశ్వాసం లేదు నీకు" అని నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు. "నటరాజ్ మాస్టర్ మీరు మార్క్స్ ఇస్తేనే వాళ్ళు ఉన్నారన్నది రాంగ్.. మీరు ఇచ్చిన స్కోర్ వల్లనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అనడం కరెక్ట్ కాదు.. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఉన్నారు" అని అన్నారు రాధ, సదా. "ఎవరో ఏదో చెప్తే వినటానికి షో చేయడానికి నేను రాలేదు. "ప్రతీది కూడా వాళ్లకు ఫోన్స్ చేసి మాట్లాడి వాళ్లకు మార్క్స్ తగ్గించేసి , వీళ్లకు తగ్గించేసి వాళ్ళను పంపించేయాలి అనే మనస్తత్వం నాది కాదు. ఈ విషయాలన్నీ బయట పెడితే చాలా ఉంటాయి. అందుకే మాట్లాడను" అని అన్నారు నటరాజ్ మాస్టర్. "ఇదిగో ఇది నాకు నచ్చదు...చేస్తే చేద్దాం..లేదంటే వెళ్ళిపోదాం.. ఎవడికి భయపడేది. ఊరికే మాటలు అనిపించుకుని ఉండమంటే ఉండను  తప్పు చూపిస్తే ఒప్పుకుంటా..లేనప్పుడు అస్సలు ఒప్పుకోను.. స్క్రీన్ ముందు, స్క్రీన్ వెనక కూడా ఒక్కలాగే ఉంటాను అదే నా క్యారెక్టర్ " అని నీతూకి స్టేజి మీదే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్.

అమ్మాయిల కోసం షీ టీములు ఉన్నాయి.. అబ్బాయిల కోసం ఏమున్నాయి?

"శ్రీదేవి డ్రామా కంపెనీ" షోలో ఈవారం ఆదిని సెంటరాఫ్ అట్రాక్షన్ గా చేసి గేమ్ ఆడేసుకున్నారు లేడీస్. పాత, కొత్త యాంకర్స్, లేడీ యాక్టర్స్ అంతా వచ్చి ఆదిని కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టారు. హాకీ స్టిక్స్, చీపుర్లు, క్రికెట్ బ్యాట్లు వంటివి తీసుకొచ్చి లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటూ కోటింగ్ ఇచ్చారు.  ఇక ఆ రోజుల్లో ఫేమస్ యాంకర్ శిల్ప చక్రవర్తి వచ్చి "ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తావా లేదా" అని గట్టిగా  అడిగేసరికి "ఆడవాళ్ళకు గౌరవం లేదా..ఎవరన్నారు ఆ మాట. బస్సుల్లో, రైళ్లల్లో స్త్రీలకు మాత్రమే కేటాయించిన సీట్లలో అన్నారు కానీ ఎక్కడైనా పురుషులకు మాత్రమే కేటాయించిన సీట్లు అంటూ మాకు ఒక్క సీటైనా ఇచ్చారా...ఏ అక్కడ ఆడవాళ్ళకు గౌరవం లేదా...భర్త పొతే భార్యకు పింఛన్ వస్తుంది కానీ భార్య పొతే భర్తకు పింఛన్ వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా...అమ్మాయిలను ఎవ్వరైనా అలా కదిలిస్తే షీ టీములు వచ్చేస్తున్నాయి. అబ్బాయిలకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎక్కడైనా ఒక్క హీ టీం వచ్చిందా..భార్యను భర్త జస్ట్ చిన్న దెబ్బ కొడితే చాలా భార్య బయటికెళ్లి నానా రచ్చా చేస్తుంది. కానీ భార్య భర్తను కుక్కను కొట్టినట్టు కొట్టినా మళ్ళీ టక్ వేసుకుని నీట్ గా బయటికి వెళ్తాం మా మగాళ్ళం..అక్కడ మీకు గౌరవం లేదా" అని ఆది చెప్పేసరికి "బయట ఆడవాళ్ళకు లైన్ వేయాలి కాబట్టి టక్ వేసుకుని  వెళ్తారు మరి" అని ఒక లేడీ ఆర్టిస్ట్ కౌంటర్ వేసింది.  "అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు...ఎందుకు మీకు సారీ చెప్పాలి...నేను డాన్స్ వేస్తా..సాంగ్స్ పాడతా..కామెడీ చేస్తా" అన్నాడు ఆది. "మేము కూడా డాన్స్ చేస్తాం, సాంగ్స్ పాడతాం, కామెడీ చేస్తాం, ఎంటర్టైన్ చేసి నీతో సారీ చెప్పించుకుని వెళ్తాం" అని శపథం చేసింది ఆరియానా.

అంజలి ఆ సాంగ్ వేల్యూనే పోగొట్టింది అన్న నటరాజ్ మాస్టర్

"నీతోనే డాన్స్" ఈ శనివారం షోలో ఒక్కొక్కళ్ళు అద్దిరిపోయేలా డాన్స్ చేశారు. ఐతే గత ఎపిసోడ్స్ నుంచి చూసుకుంటే అంజలి-పవన్ డాన్స్ కి నటరాజ్ మాస్టర్ జోడి తక్కువ మార్క్స్ ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్ వాళ్లకు వీళ్ళు తక్కువ మార్క్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ వారం కూడా అలాగే జరిగింది. అంజలి-పవన్ జోడికి 8 మార్క్స్ ఇచ్చారు నిఖిల్- కావ్య..తర్వాత నటరాజ్  మాస్టర్ జోడి 7 మార్క్స్ ఇచ్చారు.  "సాంగ్ సెలక్షన్ చాలా బాగుంది కానీ అంజలి ఎక్స్ప్రెషన్ కొంచెం కూడా నచ్చలేదు. ఫస్ట్ డే  డాన్స్ పెర్ఫార్మెన్స్ నుంచి ఈరోజు వరకు ఎక్స్ప్రెషన్స్ లో పెద్ద మార్పులేమీ లేవు" అని నటరాజ్  మాస్టర్ చెప్పేసరికి "మరి ఇంతకు ముందు ఒక సాంగ్ కి ఇంప్రూవ్ అయ్యారని చెప్పారుగా" అని పవన్ రివర్స్ లో అడిగారు. "సెమి ఫైనల్ ముందు వరకు నేర్చుకుంటూ నేర్చుకుంటూ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్రాఫ్ లో ఐపోయింది. ఎక్స్ప్రెషన్స్ అసలు నచ్చలేదు ..మీరు మళ్ళీ కూడా చూసుకోవచ్చు. అలాంటి ఎక్స్ప్రెషన్స్ కారణంగా ఆ సాంగ్ వేల్యూనే పోయింది" అని నాకు అనిపించింది చెప్పానన్నారు నటరాజ్ మాస్టర్.  తరుణ్  మాస్టర్ మరి మీకెందుకు అంజలి డాన్స్ నచ్చింది అని శ్రీముఖి అడిగేసరికి నటరాజ్ మాస్టర్ ఆయన అభిప్రాయం అది.. అంజలి కాస్ట్యూమ్ కి కరెక్ట్ గా న్యాయం చేసింది అని తనకు అనిపించింది అన్నారు తరుణ్  మాస్టర్. "నీతూ మరి మీ హజ్బెండ్ ఒపీనియన్ తో ఏకీభవిస్తావా" అని శ్రీముఖి అడిగేసరికి "ఆ సాంగ్స్ కి ఎక్స్ప్రెషన్స్ సరిగా చేయలేదు..ఆ సాంగ్ కి ఇంకా చాలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ మజా నాకు రాలేదు " అని చెప్పింది నీతూ. ఇక ఆ "ఊలాల..ఊలాల" సాంగ్ కి నీతూ డాన్స్ చేసి ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండాలి అని చేసి చూపించింది.. ఇక అప్పుడు పవన్ ఎంట్రీ ఇచ్చి "అలా అందరూ ఉండలేరు..అలా అందరూ ఉంటే ఇలా ఎందుకు విడివిడిగా ఉంటాం" అని అనేసరికి "పుట్టగానే అందరం డాన్సర్స్ ఐపోము..మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటాం" అని చెప్పారు నటరాజ్ మాస్టర్.

ప్రియాంక సింగ్ ఇష్టసఖుడు అతడేనా!

జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించిన ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ.. బిగ్ బాస్ -5 లో ఛాన్స్ కొట్టేసింది. జబర్దస్త్ కి ముందు నుంచే ఆమె ట్రాన్స్ జెండర్.. కాగా సొసైటీలో ట్రాన్స్ జెండర్ పై చిన్న చూపు అంటూ ఆమె చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయితే తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రియాంక సింగ్ ఇండస్ట్రీకి వచ్చింది. బిగ్ బాస్- 5 లో అవకాశం రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. అయితే తన బాడీని ఒక అమ్మాయిలాగా మేకోవర్ చేపించుకొని, హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియాంక సింగ్. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో బిగ్ బాస్ ప్రేక్షకులకు మరింత చేరువైన తను.. బిగ్ బాస్ లో తన హౌస్ మేట్ అయిన మానస్ తో సన్నిహితంగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక పలు టీవీ షోస్ లో మెరిసిన ప్రియాంక సింగ్.. చేసే ప్రతి పనిని వ్లాగ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటుంది. అలా తను సమాజంలో ట్రాన్స్ జెండర్స్ మీద ఉన్న చులక‌న భావాన్ని కాదని.. ఒక్కతే బ్రతికి చూపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. చాలా మంది ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ప్రియాంక సింగ్ మొదట్లో సింప్లిసిటీకి కేరాఫ్ గా ఉండేది. ఆమధ్య బోల్డ్ ఫొటోస్ పెట్టి నెగెటివ్ కామెంట్స్ ని తెచ్చిపెట్టుకుంది. తాజాగా ప్రియాంక ఒక హాట్ డాన్స్ వీడియోని షేర్ చేసింది. "సమ్మోహనుడా" అంటూ హాట్ గా డాన్స్ చేసింది. అయితే ప్రియాంక పక్కన ఒక అతను డాన్స్ చేశాడు. అతని మొహం మాత్రం కనిపించకుండా చూసేవాళ్ళకి ఎవరతను అనే క్యూరియసిటి పెంచింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మానస్ ని తన క్రష్ గా చెప్పిన ప్రియాంక.. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన వెంటే తిరిగేది. అయితే ఈ సమ్మోహనుడా పాటలో ప్రియాంకతో కలిసి డాన్స్ చేసింది మానస్ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనికి ప్రియాంక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

అప్పుడప్పుడు అన్ని మూసుకుని కూడా చేయాలి

"నీతోనే డాన్స్" షో ఈవారం శనివారం ప్రసారమైన ఎపిసోడ్ దుమ్ము లేపింది. "టాలీవుడ్  మీట్స్ బాలీవుడ్" థీమ్ తో ఈ వారం డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఇందులో నటరాజ్ మాష్టర్- నీతూ రోబోటిక్ గెటప్ లో వచ్చి పెర్ఫార్మ్  చేసి చూపించారు. ఐతే రోబోటిక్ గెటప్ అంటే డాన్స్ స్టెప్స్ చాలా తక్కువగా  చేయాల్సి వస్తుంది. ఐతే ఈ పెర్ఫార్మెన్స్ జడ్జెస్ కి పెద్దగా నచ్చలేదు. ప్రతీ వారం చాలా ఫ్రీగా డాన్స్ చేసే నటరాజ్ మాస్టర్-నీతూ డాన్స్ ఈ వారం తనకు పెద్దగా నచ్చలేదు అని చెప్పింది శ్రీముఖి. "ప్రతిసారి అన్నీ తెరుచుకుని చేస్తే బాగోదు..అప్పుడప్పుడు మూసుకుని కూడా చేయాలి..ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా కనిపిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉండాలి " అని కౌంటర్ వేశారు.  ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ మీద జడ్జెస్ కూడా కామెంట్స్ చేశారు. రోబో గెటప్ లో స్టెప్స్ వర్కౌట్ కాలేదని చెప్పారు. ఇక అంజలి-పవన్, నిఖిల్-కావ్య జోడీలు చెరో 6 మార్క్స్ ఇచ్చారు. వాళ్ళు మార్క్స్ ఇస్తుంటే నటరాజ్ మాస్టర్ కనీసం వాళ్ళ వైపు కూడా చూడలేదు. "వాళ్ళు చేసిన సాంగ్స్ లో మసాలా లేదనిపించింది. ఎనర్జీ డ్రాప్ ఐపోయింది. రోబో గెటప్ లో మాస్టర్ స్టెప్స్ చాలా తక్కువ చేసినట్టు ఉంది. కోరియోగ్రఫీ కాంప్లికేట్ అనిపించింది" అని చెప్పాయి మిగతా రెండు జంటలు. "వాళ్ళు కామెంట్స్ ఇస్తుంటే వాళ్ళ ముఖాల  వైపు కూడా చూడడం లేదు అని నటరాజ్ మాస్టర్ ని.. అంజలి- పవన్ మీరు కూడా నా వైపు చూసి మార్క్స్ ఇచ్చారు" అని అంది శ్రీముఖి. "మాట్లాడేప్పుడు మన వైపు చూస్తే చెప్పాలని ఉంటుంది. కానీ మేము వాళ్లనే చూస్తూ మార్క్స్ ఇచ్చాము" అన్నారు అంజలి. "నేను ఆడియన్స్ కోసం చేస్తున్న.. డాన్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్న" అన్నారు నటరాజ్ మాస్టర్. దానికి రాధ ,సదా మాట్లాడుతూ  "డాన్స్ కి మాత్రమే కాదు డాన్సర్స్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి...మంచిగా పెర్ఫార్మ్ చేసినప్పుడు మంచిగానే మార్క్స్ ఇచ్చారు కదా. ఈ స్టేజి మీదకు వస్తే అన్ని విషయాలు మర్చిపోవాలి..ఏదైనా ఉంటే అటో ఇటో తేల్చేసుకోండి..మనసులో ఉంచుకోకండి " అని సలహా ఇచ్చారు. "ఆయనకు ఎవరితో ఐనా గొడవైనప్పుడు వాళ్ళ మొహం చూసి మాట్లాడరు" అని చెప్పింది నీతూ. ఇద్దరి మధ్య ఏం గొడవలో కానీ నటరాజ్-నీతూ, అంజలి-పవన్ జంటల మధ్య ప్రతీవారం ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది.

ఆగస్టు 20న కీర్తి భట్ నిశ్చితార్థం.. ఇన్విటేషన్స్ ఇస్తున్న కీర్తి, విజయ్

కార్తీకదీపం సీరియల్ లో నటించిన కీర్తి భట్ కి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 6లో చక్కగా ఆడి ఫైనల్ వరకు వెళ్ళింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక అమ్మాయిగా నిలిచింది. ప్రస్తుతం ఈమె "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తోంది. అలాంటి కీర్తి భట్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది. ఆమె హీరో విజయ్ కార్తిక్ ని లవ్ మ్యారేజ్ చేసుకోనుంది. ఐతే విజయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కీర్తి విషయం తెలిసి చాలా హ్యాపీగా ఇద్దరికీ పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. కీర్తి భట్ తన కోడలు కాదని కూతురని విజయ్ వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో చెప్పారు. తనకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోవడం వాళ్ళ గొప్పతనానికి నిదర్శనం అంది కీర్తి భట్. కావాలంటే పిల్లల్ని దత్తత తీసుకుంటామని చెప్పింది కీర్తి.  ఈ సందర్భంగా వీళ్ళు  "రింగ్ ఫంక్షన్"ని సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. ఉంగరాలు మార్చుకునే వేడుక ఆగస్టు 20న బేగంపేటలో జరగబోతోందంటూ చెప్పారు ఈ జంట. ఇక  ఈ ఫంక్షన్ కి దగ్గర వాళ్ళను పిలుచుకుంటున్నారు. "జానకి కలగనలేదు" సీరియల్ సెట్ కి వెళ్లి అక్కడ షూటింగ్ లో ఉన్న ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరిని ఇన్వైట్ చేయడానికి వెళ్లారు  కీర్తి, విజయ్ . వారిని కలిసి ఇన్విటేషన్ అందించారు. ఇక ఈ హ్యాపీ మూమెంట్ ని ప్రియాంక జైన్  తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో  కీర్తి నిశ్చితార్థం విషయం గురించి అందరికీ తెలిసింది. ఇక ఈ రింగ్ ఫంక్షన్ కార్డు చూసాక "మీకు నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉందా" అంటూ రివర్స్ లో అడిగింది..పెళ్లి అంటేనే తనకు భయమేస్తోంది అని చెప్పింది ప్రియాంక. ఇక కార్డు అందుకున్న ప్రియాంక వాళ్లకు బెస్ట్ విషెస్ చెప్పింది. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంది. ఇక నెటిజన్స్ కూడా వీళ్లకు విషెస్ చెప్తున్నారు.

పన్నెండు రోజుల్లో వెళ్ళే కృష్ణకి మురారి తన ప్రేమ విషయం చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -222 లో.. కృష్ణ ఇంట్లో అందరి ముందు హ్యాపీగా ఉన్నట్లు నటిస్తుంది. ఆ తర్వాత తన గదిలోకి వచ్చి ఏడుస్తుంది. తన బ్యాగ్ లో బట్టలు సర్దుకుంటూ.. తనలో తనే మాట్లాడుకుంటుంది.  భర్త మనసులో ఇంకొకరు ఉన్నారు, అది నా తప్పా అని ఎమోషనల్ ఆవుతుంది. ఆ తర్వాత, ఎందుకు ఇలా చేశారు ఏసీపీ సర్ అని అడగలేను.. నాలో ఇంత ప్రేమని దాచుకోలేనని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు ముకుంద చాలా హ్యాపీగా ఉంటుంది. థాంక్స్ దేవుడా అంటూ హుషారుగా ఉంటుంది. కృష్ణ, మురారి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా లేనట్టు నమ్మించాను, ఇక టైమ్ చూసుకొని అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి పెద్ద అత్తయ్యకి చెప్తే పెద్ద అత్తయ్య కృష్ణ ని ఇంట్లో నుండి బయటకు పంపిస్తుంది. ఇద్దరు విడిపోతారు. కృష్ణ వెళ్ళిపోయాక తను డాక్టర్ కాబట్టి మంచి స్థాయిలో ఉంటుంది. మళ్ళీ  మా జీవితంలోకి రాకుండా చూడని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు మురారి ఒంటరిగా కూర్చొని కృష్ణ మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడే రేవతి మురారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఆ రోజు కృష్ణ స్టేజి పైకి రమ్మని పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు. మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని రేవతి అడుగుతుంది. లేదు అమ్మ నువ్వు అనుకున్నట్లు మా మధ్యలో ఏం లేదని మురారి అంటాడు. నాకు తెలుసు మీ మధ్య ఏం లేదు మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని రేవతి అనగానే.. మురారి షాక్ అవుతాడు. ప్రేమ వేరు పెళ్లి వేరు గతాన్ని గుర్తుచేసుకొని, భవిష్యత్తుని పాడు చేసుకోకని రేవతి అంటుంది. నేను ఇంకా ముకుందని మర్చిపోలేదని అమ్మ అనుకుంటుందా అని మురారి అనుకుంటాడు. నాకు తెలుసు కృష్ణకి నీకు.. ఒకరంటే ఒకరికి ఇష్టమని, మరి ఎందుకు ఇలా అయిపోతున్నారని రేవతి అడుగుతుంది. నీకెలా చెప్పాలి అమ్మ కృష్ణకి నేను అంటే ఇష్టం లేదని మురారి తన మనసులో అనుకుంటాడు. మీ అగ్రిమెంట్ మ్యారేజ్ ని రద్దు చేసుకొని భార్యాభర్తల లాగా ఉండండని రేవతి అనగానే.. అమ్మ ఇప్పుడు ఏం చెప్పలేను, తర్వాత అన్ని అర్థం అవుతాయని మురారి అంటాడు. ఏంట్రా ఇంకా నువ్వు ముకుందని మర్చిపోలేదా అని రేవతి అడుగుతుంది. నా గతానికి వర్తమానానికి ఎలాంటి సంబంధం లేదని మురారి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా‌ మురారి అనేసరికి రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి వెళ్తాడు. కృష్ణ కొంతడబ్బు మురారికి ఇచ్చి.. ఇది నా గుర్తుగా ఉంచుకోండి. ఎప్పటికి ఖర్చు చెయ్యకండని కృష్ణ అనగానే.. చదువు ఖర్చు కూడా ఇస్తున్నావా అని మురారి అనుకుంటాడు. నేను ఇంటి నుండి వెళ్లిపోవడానికి ఇంకా పన్నెండు రోజులే ఉందని మురారితో కృష్ణ చెప్తుంది. కృష్ణ చాలా క్లారిటీగా ఉందని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

శైలేంద్ర మాస్టర్ ప్లాన్ ని జగతి కనిపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -828 లో.. కాలేజీ మీటింగ్ లో తనకి జరిగిన అవమానం గుర్తుచేసుకొని శైలేంద్ర  కోపంగా ఉంటాడు. అప్పుడే ధరణి కాఫీ తీసుకొని వచ్చి శైలేంద్రకి ఇస్తుండగా.. కాఫీనీ గోడకి కొడతాడు. అప్పుడే జగతి వచ్చి.. నీ ఫ్రస్ట్రేషన్ కి నువ్వు బాధ్యుడివి, దానిని ధరణిపై ఎందుకు చూపిస్తున్నావని జగతి కోప్పడుతుంది. ఆ తర్వాత నీకు సంబంధం లేని విషయం నువ్వు కలుగజేసుకోకని శైలేంద్ర అంటాడు. మీరు అన్యోన్యంగా ఉంటే మీ విషయంలో ఎవరు కలుగజేసుకోరు.. ఇలా ఉంటేనే కలుగుజేసుకోవాల్సి వస్తుందని జగతి అంటుంది. ఒకసారి ధరణి నీకు ఎదురు తిరిగి మాట్లాడితే నీ పరిస్థితి ఏంటని శైలేంద్రతో జగతి అంటుంది. అలా జగతి అనేసరికి శైలేంద్ర సైలెంట్ గా ఉండిపోతాడు.  మరొకవైపు ఏంజిల్,  రిషి ఇద్దరు కార్ లో ఇంటికి వెళ్తు మాట్లాడుకుంటారు. నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని రిషితో ఏంజిల్ అంటుంది. చెప్పగలిగేలా ఉంటే చెప్తానని రిషి అంటాడు. నీకు వసుధారకి మధ్య ఏం ఉంది.. బద్ద శత్రుత్వమైనా ఉండాలి లేదా ప్రేమైనా ఉండాలని ఏంజిల్ అంటుంది. మిమ్మల్ని చూసిన ప్రతీసారి నాకు ఇదే డౌట్ వస్తుందని ఏంజిల్ అంటుంది. రిషి మాత్రం ఏం చెప్పడు. అది అనవసరమైన విషయం వదిలేయమని, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది అది బయటపెట్టవద్దని రిషి అంటాడు. నా పర్సనల్ అన్ని నీతో షేర్ చేసుకున్నా కదా అని ఏంజిల్ అంటుంది. నేను షేర్ చేసుకోను అనవసరమైన దాని గురించి అలోచించకని ఏంజెల్ తో రిషి అంటాడు. రిషి వాళ్ళ మధ్య ఏం లేదని చెప్పడం లేదు అంటే కచ్చితంగా ఉంది అన్నట్లే కదా అని ఏంజిల్ తన మనసులో అనుకుంటుంది. మరొక వైపు జగతి, మహేంద్ర‌ ఇద్దరు మీటింగ్ లో.. శైలేంద్ర పదే పదే వాళ్ళ పేర్లు చెప్పండని అడుగుతున్నాడని మహేంద్రతో అంటుంది జగతి. వాళ్ళ మాటలు చాటుగా శైలేంద్ర వింటాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శైలేంద్రకి కాలేజీ బాయ్ ఫోన్ చేసి.. కాలేజీలో వసుధార, రిషిల మధ్య గొడవ జరిగిన విషయం చెప్తాడు. కాలేజీలో వాళ్ళ మధ్య ఏదో ఉందనేలా డౌట్ క్రియేట్ చేసానని కాలేజీ బాయ్ చెప్తాడు. రాత్రి వసుధర దగ్గరికి రిషి వెళ్ళాడని చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషీల ఎంగేజ్మెంట్ ఫోటో ఒకటి కాలేజీ బాయ్ కి శైలేంద్ర పంపించి.. ఈ ఫోటోని కాలేజీలోని అన్ని గోడలపై అతికించు.. అందరి ముందు వాళ్ళ పరువు పోవాలని కాలేజీ బాయ్ కి శైలేంద్ర చెప్తాడు. అప్పుడే శైలేంద్ర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడని జగతి గమనించి తన దగ్గర ఉన్న వసుధార, రిషీల ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూసి.. ఆ ఆల్బమ్ అక్కడ ఎందుకు ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాహుల్ ని గాజులేసుకోమని చెప్పిన స్వప్న.. అంతా తనే చేసిందంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -161 లో.. అప్పు, కళ్యాణ్ ఇద్దరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే ఎదురుగా అప్పు వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. మీ అక్క పర్ఫ్యూమ్ యాడ్ లో సూపర్ ఉందని అనగానే.. నువ్వు పర్ఫ్యూమ్ ని చూడు, మా అక్కని కాదని అప్పు తన ఫ్రెండ్ పై కోప్పడుతుంది. మీ అక్క ఆ యాడ్ లో చేసి తప్పు చేసిందని కళ్యాణ్ అనగానే.. కళ్యాణ్ పై కోప్పడుతుంది అప్పు.  మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో అందరు సైలెంట్ గా కూర్చొని భోజనం చేస్తుంటారు. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారని రుద్రాణి అనగానే.. నీ కోడలు చేసిన పనికి కడుపు నిండిపోయిందని అపర్ణ అంటుంది. నా కోడలు నీ కోడలికి అక్కే కదా అని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఇక మనకి ఏ ప్రాబ్లమ్ లేదు స్వప్న చేసిన యాడ్ టెలికాస్ట్ కాకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి డిలీట్ చేపించానని రాజ్ అనగానే.. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే స్వప్న వస్తుంది‌. రాజ్ మాటలు విని రాజ్ దగ్గరికి కోపంగా వస్తుంది. ఆ యాడ్ ని ఎందుకు డిలీట్ చేయించావ్? నీకేం అవసరమని రాజ్ ని అడుగుతుంది. అలా రాజ్ పై స్వప్న కోపంగా అరిచేసరికి.. కావ్యకి కోపం వస్తుంది. స్వప్న నువ్వు నా భర్త గురించి తప్పుగా మాట్లాడకు.. నీ జీవితం నాశనం కాకుండా చేసిన నా భర్తపై కోప్పడుతున్నావేంటి.. నా భర్తని ఏమైనా అంటే పళ్ళు రాలగోడతా జాగ్రత్త అని స్వప్నకి కావ్య వార్నింగ్ ఇచ్చి.. రాజ్ కి  సారి చెప్పమని స్వప్నకి చెప్తుంది. దాంతో స్వప్న చేసేదేంలేక రాజ్ కి సారి చెప్పి వెళ్తుంది. కావ్య కోపం చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత స్వప్న గదిలోకి కోపంగా వెళ్లి .. గదిలోని వస్తువులని కింద పారేస్తుంటుంది. అది చూసిన రాహుల్ రుద్రాణి లు ఇదే మనకి మంచి టైం.. దీని కోపం మనకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది వెళ్ళమని రాహుల్ ని స్వప్న దగ్గరికి పంపిస్తుంది రుద్రాణి. సారి స్వప్న అని రాహుల్ అనగానే.. అయ్యో నువ్వేం చేస్తావ్ వాళ్ళు చేసిన దానికి నీకు కాఫీ తెస్తానని స్వప్న వెళ్తుంది. మరొక వైపు కావ్య రాజ్ దగ్గరికి వచ్చి.. మా అక్క చేసిన యాడ్ డిలీట్ చేయించినందుకు థాంక్స్ అని చెప్తుంది. నేనేం నీ కోసం, మీ అక్క కోసం చేయలేదు. ఈ ఇంటిపరువు కోసం చేసానని చెప్తాడు. మరొకవైపు రాహుల్ కి కాఫీ తీసుకొని వస్తానని వెళ్లిన స్వప్న.. గాజులు తీసుకొని వచ్చి ఇదిగో ఇవి వేసుకో అని అనగానే.. స్వప్నపై రాహుల్ సీరియస్ అవుతాడు. మరి ఏంటి వాళ్ళు నీ భార్యని అన్ని మాటలు అంటుంటే సైలెంట్ గా కూర్చొని ఉన్నావని స్వప్న అంటుంది. దీంతో కోపంగా కాకుండా నెమ్మదిగా డీల్ చెయ్యాలని రాహుల్ అనుకొని.. రాజ్ ఆ యాడ్ డిలీట్ చేయించడానికి కారణం మీ చెల్లెలు కావ్య అని స్వప్నని రెచ్చగొడుతాడు రాహుల్. స్వప్న నిజమే అనుకొని రాహుల్ మాటలు నమ్మేస్తుంది. మరొక వైపు కనకం ఇంటికి సేట్ కొంతమందిని తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు ఇవ్వాలని సేట్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ స్టార్ట్.. కోర్ట్ పిటిషన్స్ బిగ్ బాస్ ని ఏమీ చేయలేవు

బిగ్ బాస్ సీజన్ మీద ఇప్పటికే చాలా కామెంట్స్ వస్తున్నాయి. కోర్ట్ నోటీసులు కూడా వస్తున్నాయి. ఐతే ఆడియన్స్ లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఈ సీజన్ ఎలా ఉండబోతోంది. ఇందులో కొత్త రూల్స్ ఏమిటి ...ఎవరెవరు రాబోతున్నారు...అసలు ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది...కుడి ఎడమైతే అనే దానికి అసలు కరెక్ట్ మీనింగ్ ఏమిటి ? లాంటివి ఎన్నో  ఉన్నాయి. ఐతే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో బిగ్ బాస్ ఆఫీషియల్ పేజీ నుంచి కొన్ని ఆన్సర్స్ వచ్చాయి.  "బీబీ 7 గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న క్లారిఫై చేసుకోండి.." అనే అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి నెటిజన్స్ ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు. "బీబీ 7 రూల్స్ ఏమిటి"  "న్యూ రూల్స్ అంటూ ఏవీ ఉండవు...ఈ సీజన్ లో టోటల్ పవర్స్ నాగ్ సర్ చేతుల్లో ఉంటాయి. డైరెక్టర్స్ చెప్పేది నాగ్ సర్ వినాల్సిన అవసరం లేదు". "ఈ సీజన్ లో ఎంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు" అని అడగగా "సీజన్ స్టార్ట్ అయ్యే వారం ముందు వరకు కూడా వీళ్ళు ఎవరు కంఫర్మ్ అయ్యారో..ఎవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారో చెప్పలేము...ఆ కంటెస్టెంట్స్ కి కూడా క్లారిటీ ఉండదు అసలు వెళ్తున్నారో..లేదో కూడా వాళ్ళకే తెలీదు..కాబట్టి ఎంతమంది కంటెస్టెంట్స్ అనే విషయం మాత్రం చెప్పలేము" అని ఆన్సర్ ఇచ్చారు. "వర్షిణి ఉందా లేదా" "రావడం లేదు", " బీబీ 7 విన్నర్ అబ్బాయా అమ్మాయా" " ఏమో సర్ నాకు తెలీదు", "బీబీ 7 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది" " సెప్టెంబర్ 3 ..పక్కా ", "బీబీ 7 టీవీలో టెలికాస్ట్ అవుతుందా..ఎందుకంటే కోర్ట్ లో పిటిషన్స్ ఉన్నాయి కదా" " సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, మంచి రేటింగ్ వస్తున్నప్పుడు ఈ పిటిషన్స్ వేస్తూనే ఉంటారు. బిగ్ బాస్ కి ఇవో లెక్క కాదు...కోర్ట్ పిటిషన్స్ ఏమీ చేయలేవు", "నెక్స్ట్ ప్రోమో ఎప్పుడు వస్తుంది" " ఆదివారం నుంచి మంగళవారం మధ్యలో రిలీజ్ అవుతుంది" అంటూ బీబీ హౌస్ సెట్ కూడా రెడీ ఐపోయిందంటూ అఫిషియల్ పేజీ నుంచి ఆన్సర్స్ వచ్చాయి.

జబర్దస్త్ కి ఫైమా రీఎంట్రీ ఇవ్వనుందా!

ఫైమా‌ పటాస్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికీ సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తనేంటో నిరూపించుకుంది. అలా బుల్లితెరపై నవ్వులు పూయించిన ఫైమాకి బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం లభించింది.  బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా.. హౌస్ లో నవ్వులు పూయించింది. అయితే ఒకానొక దశలో తను వేసే పంచులు ఎదుటివారిని ఇబ్బంది పెడతాయని అప్పుడే తెలిసింది. దాంతో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఫైమాకి అలా వెటకారంగా మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయిన తను మారలేదు. దాంతో ప్రేక్షకులలో ఫైమాపై నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిందనే చెప్పాలి. దాంతో బిగ్ బాస్ వీక్లీ వైజ్ ఎలిమినేషన్ లో ఫైమా బయటకొచ్చింది. అయితే ఫైమా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఆ ఫ్యాన్స్ ఫైమా బయటకొచ్చాక గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అందరి దృష్టి ఫైమా మీద పడింది. అలా ఫైమా ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆ తర్వాత బిబి జోడీలో సూర్య తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. దీంతో ఫైమాకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అయితే ఫైమా తన గురించి ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది..  ఫైమా కొన్ని రోజులుగా జబర్దస్త్ కి దూరంగా ఉంది. దానికి కారణం ఏదైనా మళ్ళీ జబర్దస్త్ కి రీఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో తెలియజేసింది. ఆ వీడియోలో ఫైమాని బాగా మిస్ అవుతున్నట్టు కమెడియన్ నరేశ్, జిత్తు.. తన గురించి పాజిటివ్ గా చెప్పారు. ఒకవేళ మళ్ళీ నువ్వు జబర్దస్త్ లోకి వస్తే ఎవరి టీమ్ లో ఉంటావని ఫైమాని జిత్తు అడుగగా.. బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఉంటానని ఫైమా చెప్పింది. ఎందుకంటే తనకి లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న అంట. తనకి ఒక గుర్తింపు రావడానికి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది భాస్కర్ అన్నే అంటూ ఫైమా అంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు..  "కమ్ బ్యాక్ టూ జబర్దస్త్, నీ కామెడీని చాలా మిస్ అవుతున్నాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ లో కామెడీ ఎవరూ చేయట్లేదని, టీఆర్పీ కూడా తగ్గిపోతుంది. మరి ఒకప్పుడు నవ్వులు పూయించిన ఫైమా.. జబర్దస్త్ లోకి వచ్చి తన కామెడీతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తుందో లేదో చూడాలి.  

లైఫ్‌లో ప్రాబ్లెమ్స్‌తో పాటు పొట్ట కూడా పెరుగుతోంది!

రోహిణి.. టెలివిజన్ నటి.. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది హృదయాలకి సన్నిహితం అయింది. అయితే అంతకు ముందే "ఓరి నా కొడక" సీరియల్ లో రోహిణి యాక్టింగ్ కి ఫిధా అయిపోయారు. ఆ సీరియల్ లో తను వడ దెబ్బ తగిలి కోమాలోకి పోవడమనే సీన్ అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఈ సీన్ మీద ఎన్నో  కామెడీ ట్రోల్స్ కూడా వచ్చాయి.  జబర్దస్త్ లో మొదట్లో చమ్మక్ చంద్ర స్కిట్ లో, అడపాదడపా రాకెట్ రాఘవ స్కిట్ లో క్యారెక్టర్ గా కనిపించిన రోహిణి.. మెల్లిగా తనని తాను ప్రూవ్ వేసుకుంటు సత్తిబాబుతో కలిసి రౌడీ రోహిణిగా టీమ్ లీడర్ గా మారింది. కాగా రోహిణి టిక్ టాక్స్ కు అప్పట్లో ఫుల్ క్రేజ్ ఉండేది. 'మత్తు వదలరా' సినిమాలో‌ నటించిన రోహిణి.. కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. శ్రీనివాస కళ్యాణం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇన్ స్పెక్టర్ కిరణ్ సీరియల్స్ లో‌ నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. బిగ్ బాస్ తర్వాత బిజీ అయింది రోహిణి.  ప్రస్తుతం జబర్దస్త్ లో 'రౌడీ రోహిణి' అనే టీమ్ కి లీడర్ గా చేస్తూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రని పోషించింది. ఈ సిరీస్ లో తన కామెడీతో నవ్వులు పూయించింది. దాంతో తనకి మరిన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మధ్య తన కాలుకి ఆపరేషన్ చేసుకొని ఇబ్బంది పడుతున్న రోహిణి.. ఇప్పుడిప్పుడే మళ్ళీ నార్మల్ అవుతుంది‌. కాగా తన ప్రతీ అప్డేట్ ని అటు తన యూట్యూబ్ ఛానెల్ లోను, ఇటు ఇన్ స్టాగ్రామ్ లోను షేర్ చేస్తోంది. తన ఆపరేషన్ తర్వాత.. "స్టైల్ మారింది నా నడక మారింది" అంటూ ఒక చేతికర్రతో నడుచుకుంటూ వస్తూ చేసిన రీల్ ఈ మధ్యే వైరల్ అయింది. "లైఫ్ లో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. సరే గాని ప్రాబ్లమ్స్ తో పాటు పొట్ట కూడా పెరుగుతుంది" అంటూ చేసిన రీల్ కి విశేష స్పందన లభిస్తోంది. 

రీతూ చౌదరి తలలో తెల్ల వెంట్రుకలెన్ని?!

రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ.. తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా దాదాపు అందరూ.. 'ఆస్క్ మి క్వశ్చనింగ్' అంటూ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతుంటారు. వారు పంపే ప్రశ్నలన్నింటిలో కొన్నింటికి సమధానం చెప్తూ ఎప్పుడూ లైంలైట్‌లో నిలుస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు రీతూ చౌదరి చేసింది. తరచూ హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే రీతూ.. తాజాగా "నిజాలు మాట్లాడుకుందామని" పెట్టింది. దాంతో ఒక్కొక్కరు ఒక్కోలా క్వశ్చనింగ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఒకరు అడుగగా.. షూటింగ్ అంటూ తను ఉన్న షూటింగ్ లోకెషన్ వీడీయో పెట్టింది రీతూ చౌదరి. "పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు?" అని ఒకరు అడుగగా.‌. "డోంట్ మ్యారీ బీ హ్యాపీ" అంటు రిప్లై ఇచ్చింది రీతు. "బ్రతికేదే అబద్ధపు జీవితం.. నిజాలు అంటూ ఏం లేవు సిస్టర్" అని ఒకరు మెసేజ్ చేయగా.. "అది కూడా కరెక్టే" అని రీతూ చౌదరి రిప్లై ఇచ్చింది. "నీకు లవర్ ఉన్నాడా?" అని మరొకరు అడుగగా.. లేడని చెప్పింది. మీకు తెల్లవెంట్రుకలు ఎన్ని ఉన్నాయని ఇంకొకరు అడిగితే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే చిరాకు వస్తుందని, తనది కలర్ హేయిర్ అని రీతూ చౌదరి చెప్పింది. "ఎవరినైనా లవ్ చేస్తున్నారా? అని వేరొకరు అడిగితే.. "లవ్ కి ఒక దండం, కానీ నన్ను నేను బాగా లవ్ చేసుకుంటా" అని సమాధానమిచ్చింది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రీతూ చౌదరి.