నేను ఎప్పుడూ మా ఆయన ముందు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటా

ఆర్జే కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా తెలుసు కానీ  ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఈమె వాగుడుకాయ,  యూట్యూబర్‌, రేడియో జాకీ, వీడియో జాకీ, సింగర్‌, యాంకర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ , యాక్టర్ ఒక్కటేమిటి మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటుంది. ఈ టాలెంట్స్ అన్ని కాజల్ సొంతం. బిగ్ బాస్ హౌజ్ లో 17 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కాజల్ బుల్లితెర అభిమానుల మెప్పు పొందింది కూడా. ఈమె వాయిస్ కి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. అలాంటి కాజల్ సోషల్ మీడియాలో కూడా లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతూ ఉంటుంది. తన ఇంట్లో చేసే పనులు, ఫంక్షన్స్ గురించి అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు  కాజల్  లేటెస్ట్ గా ఒక అప్ డేట్ పోస్ట్ చేసింది  తన ఇన్స్టాగ్రామ్ లో. అందులో తన హజ్బెండ్ సోఫాలో కూర్చుని ఉండగా కాజల్ ఆయన ముందర డాన్స్ చేస్తూ ఉంది. "రోజూ మా ఇంట్లో ఇలానే ఉంటుంది. నేను ఇలా నా హజ్బెండ్ ముందు  డాన్స్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాను. నేను చేసే డాన్స్ ని నా కూతురు సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఇదిగో ఇలా వీడియోలు తీస్తూ ఉంటుంది. వీడియోస్ తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటుంది..కానీ నేను వాటిని నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాను" అంటూ ఒక కాప్షన్ కూడా ఫన్నీ ఎమోజిస్ తో  పెట్టింది. ఇక ఈ వీడియోకి నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవు. "పాపం ఆయన ఎలా భరిస్తున్నాడో...మీరు మీ అమ్మాయితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు కదా.. మీకు ఎంత పెద్ద నోరు ఉంటే మాత్రం ఆయనతో అలా ఆదుకోవడం కరెక్టేనా " అని కామెంట్స్ పెట్టారు ఇక సిరి హన్మంత్ "పాపం విజయ్" అంటే నటుడు ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ "క్యూట్" అని కామెంట్ చేసింది.  

అందరి ముందు వసుధారపై సీరియస్ అయిన రిషి.. టెన్షన్ పడుతున్న ఏంజిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -826 లో... వసుధార మిషన్ ఎడ్యుకేషన్ గురించి బస్తీలోని పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు శైలేంద్ర పంపిన కాలేజీ బాయ్ దగ్గర డబ్బులు తీసుకొని వసుధారని అవమానిస్తారు. అప్పుడే రిషి పాండియన్ వాళ్లతో వసుధార దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న వాళ్ళకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి గొప్పగా వివరిస్తాడు.  ఆ తర్వాత చదువు అంటే ఏంటి, దానికి సొసైటీలో దానికి ఉన్న విలువ గురించి రిషి అక్కడున్న వాళ్లకి చెప్తాడు. మీలాగే మీ పిల్లలు కావద్దని అనుకుంటే మీరు స్కూల్ కి పంపించండని రిషి చెప్తాడు. కానీ కాలేజీ బాయ్ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం రిషి ఎంత చెప్పిన రిషికి ఎదురు మాట్లాడతారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి చెప్తున్నామని రిషి అంటాడు. కొంతమంది రిషికి సపోర్ట్ చేసి మీరు మా గురించి ఇంత బాగా చెప్తున్నారు తప్పకుండా చదివిస్తామని చెప్తారు. రిషి అక్కడున్న బస్తీ వాళ్లకి తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అక్కడ నుండి బయలుదేరుతారు. రిషి వసుధార, ఏంజిల్ కార్ లో వెళ్తుంటారు. ఎందుకు వెళ్ళావని ఏంజెల్ ని తిట్టినట్లు‌ వసుధార ఊహించుకుంటుంది. ఆ తర్వాత రిషి, వసుధార, కాలేజీ ఫాకల్టీ ప్రిన్సిపల్ మాట్లాడుకుంటారు. మనం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకున్నామని వాళ్లతో చెప్పామా, మరి ఎందుకు వసుధార మేడం మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడానికి ఒంటరిగా వెళ్లిందని రిషి అందరికి చెప్తూ వసుధారపై కోప్పడతాడు. వసుధార అలా వెళ్లడం తప్పు అన్నట్లు అందరి ముందు వసుధారపై రిషి అరుస్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు వసుధారపై రిషి అరవడం చూసి.. అందరు చూసి షాక్ అవుతారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉందని అక్కడున్న కాలేజీ బాయ్ మిగత లెక్చరర్స్ తో అంటాడు. అది విన్న రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్లి కాలేజీలో వసుధారపై అరిచింది గుర్తు చేసుకుంటాడు.  ఆ తర్వాత రిషి దగ్గరికి ఏంజిల్ వస్తుంది. కాలేజీలో వసుధారపై కోప్పడ్డావట? తను చేసింది మంచి పనే కదా.. ఎందుకు అలా చేసావ్? వసుధార ఇంకా ఇంటికి రాలేదు.. నాకు టెన్షన్ గా ఉంది. ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యలేదని రిషితో ఏంజిల్ అంటుంది. వసుధారకి రిషి కాల్ చేస్తాడు. వసుధార ఫోన్ లిఫ్ట్ చెయ్యదు కానీ ఫోన్ ఎందుకు చేసారని మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

షాక్ లో కళ్ళు తిరిగిపడిపోయిన అలేఖ్య.. కృష్ణ, మురారీల మధ్య  పెరిగిన దూరం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-220 లో.. సన్మానం నుండి బయటకు వెళ్ళిపోయిన కృష్ణ అప్పడే ఇంటికి వస్తాడు. అక్కడ హాల్లో అందరు మురారి కోసం ఎదురుచూస్తుంటారు. రాగానే ఎక్కడికి వెళ్ళావ్ మురారి అని భవాని అడుగగా.. అర్జెంట్ కాల్ వచ్చిందని మురారి చెప్తాడు. అది విన్న ముకుంద.. అంత అర్జెంట్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏమైన గొడవలు ఉన్నాయా?  అంత అవసరమేంటి? మీ గొడవలని ఇలా బయటపెట్టుకోవడమెందుకని మురారితో అంటుంది. అప్పటికే మురారిలి డౌట్ వస్తుంది. కానీ అవన్నీ నీకెందుకు ముకుంద అని కవర్ చేయాలని చూస్తుంది.  కానీ భవాని గ్రహించి.. ముకుంద కరెక్ట్ గానే అడిగింది వాళ్ళ మధ్య ఏదో ఉంది. గొడవలేమైనా ఉన్నాయా? అసలు మీరిద్దరు బాగానే ఉంటున్నారా అని మురారిని భవాని అడుగుతుంది. అదేం లేదు పెద్దమ్మ కాల్ వస్తే, ఆ టెన్షన్ లో వెళ్ళిపోయానని మురారి అంటాడు. నాకు అబద్ధం చెప్పకు మురారి నేను సహించనని భవాని అంటుంది. దయచేసి  వదిలేయండి పెద్దఅత్తయ్య అని భవానీతో కృష్ణ అంటుంది. ‌నిజం చెప్పమని మురారిని భవాని బలవంతం చేస్తుంది. మురారి మౌనంగా ఉంటాడు. "ఏసీపీ‌ సర్ అలసిపోయి వచ్చినట్టున్నాడు. ఇక ఈ విషయాన్ని వదిలేయండి" అని భవానితో కృష్ణ అనగానే.. సర్లే వెళ్ళమని భవాని అంటుంది . దాంతో మురారి తన గదిలోకి వెళ్తాడు. ఆ తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. మధు, అలేఖ్య ఇద్దరు కృష్ణ, మురారిలు బయట ఎప్పుడు గొడవపడినట్టు కనపడలేదు వాళ్ళ మధ్యలో గొడవలేంటి? అసలెందుకని మురారి సన్మానంలో లేడని మధుతో అలేఖ్య అనగానే.. ముకుంద అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని  అలేఖ్య, మధులతో ముకుంద అంటుంది. అది వినగానే అలేఖ్య షాక్ లో కళ్ళు తిరిగి పడిపోతుంది. వీళ్ళిద్దరికి చెప్తే అందరికి తెలిసిపోతుందని ముకుంద అనుకొని వెళ్లిపోతుంది. ఇక కృష్ణ, మురారి ఇద్దరు గదిలోకి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉంటారు. కృష్ణ, మురారి ఇద్దరు ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఒకరికొకరు ఇద్దరు కలలు కంటూ ఒకరి ఫీలింగ్ ఒకరు షేర్ చేసుకుంటున్నట్టు భావిస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

స్వప్న బోల్డ్ యాడ్ తో దుగ్గిరాల ఇంట్లో రచ్చ.. కనకం ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -159 లో... స్వప్న చేసిన యాడ్ ని చూసిన ఇంద్రాణి.. ఇది చాలు ఆ స్వప్నని ఇంటి నుండి బయటకు పంపించడానికి అని రాహుల్ తో అంటుంది. అవును మమ్మీ అని రాహుల్ అంటాడు. ఆ సీతరామయ్య మాటకు ముందు పరువు మాట తర్వాత పరువు అని అంటాడు కదా ఇప్పుడు ఈ వీడియో చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని రుద్రాణి అంటుంది. మరొకవైపు కనకం, కృష్ణమూర్తి ఇద్దరు దుగ్గిరాల ఇంటికి వెళ్ళడానికి రెడి అవుతారు. మరొకవైపు స్వప్న ఆడ్ చేసిన వీడియో చూసి ఆ వీడియోని కావ్యకి చూపిస్తాడు రాజ్. కావ్య అ వీడియో చూసి షాక్ అవుతుంది. తన భార్య ఇలా రెచ్చిపోతుంటే నీ అక్క  మొగుడు ఏం చేస్తున్నాడని రాజ్ అంటాడు. మరొకవైపు స్వప్న ఇంటర్వ్యూ కోసం ప్రెస్ వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారో అపర్ణ, ఇందిరాదేవిలకు అర్థం కాదు. రాహుల్, కళ్యాణ్ మీడియా వాళ్ళని ఆగమని చెప్తారు. కానీ స్వప్న మాత్రమే బాగా రెడీ అయి ఇంటర్వ్యూ ఇవ్వడానికి బయటకు వస్తుంది. ఏం చేస్తున్నవ్ అక్క అని స్వప్నని కావ్య కోప్పడుతుంది. బయట స్వప్న మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తుంటే.. అసలేం జరుగుతుందని సీతారామయ్య ఇంట్లోకి వెళ్లి కళ్యాణ్ ని అడుగుతాడు. అప్పుడు స్వప్న ఆడ్ చేసిన వీడియోని టీవీ లో ప్లే చేస్తాడు కళ్యాణ్. ఇంట్లో వాళ్ళు అందరూ స్వప్న బోల్డ్ ఆడ్ ని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత స్వప్నని క్వశ్చన్స్ వేయండని మీడియావాళ్ళకి రాహుల్ సైగ చేస్తాడు. "మీరు ఇలా బోల్డ్ గా ఆడ్ చేస్తే, ఈ దుగ్గిరాల ఇంటి పరువు పోదా" అని ఒక రిపోర్టర్ అడగగా.. అది నా వ్యక్తిగతం అంటూ స్వప్న సమాధానం ఇస్తుంది. ఆప్పుడే అక్కడికి కృష్ణమూర్తి, కనకం వస్తారు. స్వప్నని కావ్య లోపలికి లాక్కొని వెళ్తుంది. రాజ్ మీడియా వాళ్ళని పంపించేస్తాడు. ఆ తర్వాత స్వప్న అంటే వేరే ఇంటి నుండి వచ్చింది. తనకి మన ఇంటి పద్ధతులు తెలియవు. నీకు అయినా తెలుసు కదా.. నువ్వు చెప్పాలి కదా అని రాహుల్ పై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత అందరు స్వప్నపై కోప్పడతారు. ఆ తర్వాత నువ్వైనా చెప్పాలి కదా రుద్రాణి అని ఇందిరాదేవి అంటుంది. నాకు అసలు ఏ విషయం తెలియదు. ఇలాంటి దాన్ని ఇంట్లో నుండి గేంటేయ్యలని రుద్రాణి అంటుంది. స్వప్న నేనేం తప్పు చెయ్యలేదు అన్నట్లుగా మాట్లాడుతుంది. అప్పుడే కనకం లోపలికి వచ్చి.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ స్వప్నపై చెయ్యి ఎత్తి కొడుతూ ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తనకు లవర్ లేడని చెప్పిన ఆరోహీ!

ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు.  ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహీ, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపిన ఆరోహీ.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ' ఆస్క్ మీ క్వశ్చనింగ్ ' స్టార్ట్ చేసింది. " హాయ్ అక్క.. మీ ఊరిలో వర్షం పడుతుందా" అని ఒకరు అడుగగా.. అయిపోయింది కదా బిగ్ బాస్. బాగానే ఉంది.. కొత్త ఎక్స్పీరియన్స్ అని ఆరోహీ అంది.  కీర్తిభట్ తో మాట్లాడుతున్నారా? తన ఎంగేజ్ మెంట్ కి వెళ్తున్నారా అని ఒకరు అడుగగా.. మాట్లాడుతున్నాను, నాకు చెప్పకుండా చేసుకుంటదా, అయినా నేను లేకుండా ఎంగేజ్ మెంట్ చేసుకునేంత దమ్ము ఉందా అని ఆరోహి అంది. బిగ్ బాస్ షైనింగ్ ఈవెంట్ కి వెళ్ళారా అక్క అని ఒకరు అడుగగా.. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నేను పోలేదని ఆరోహీ అంది. లైఫ్ బోర్ కొడుతుంది అక్క, ఏం చేద్దాం అంటారని ఒకరు అడుగగా.. ఎవరినైనా పిల్లని ప్రేమించు, రోజుకో కొత్త పంచాయితి, రోజుకో గొడవ.. అప్పుడు లైఫ్ కలర్ ఫుల్ గా ఉంటుందని ఆరోహీ అంది. ఫ్యూచర్ లో నీకు సినిమాల్లో అవకాశం వస్తే ఏ రోల్ చేస్తారు?   హీరోయిన్, విలన్ ,కామెడీయిన్ రోల్ చేస్తారా? అని ఒకరు అడుగగా.. నేను ఒక సాడిస్ట్ ని, సైకోని కాబట్టి నాకు హీరోయిన్, కమెడీయిన్ రోల్ నచ్చదు. విలన్ అయితే ఒకే అని ఆరోహీ అంది. నీ లవర్ ని పరిచయం చేయవా అని ఒకరు అడుగగా.. నాకు లవర్ లేదంటే  ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా అని ఆరోహీ చెప్పింది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.  

అలాంటి వీడియోస్ రాత్రి పెడితేనే బాగుంటాయన్న శ్రీసత్య!

శ్రీసత్య.. బిగ్ బాస్ ప్రియులకు సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-6 లో 'బ్యూటీ క్వీన్' అని  చెప్తారు. మొన్న జరిగిన శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ నడిపిన శ్రీసత్య.. ఆ తర్వాత రేవంత్, శ్రీహాన్ లతో కలిసి స్నేహమంటూ గ్రూప్ గా ఆడింది. హౌస్ లో ఫ్యామిలీ వీక్ ముందు వరకు శ్రీసత్య కచ్చితంగా వెళ్ళిపోతుందనుకున్నారంతా కానీ ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మనాన్న రావడంతో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తనకున్న నెగెటివ్ టాక్ కాస్త అమ్మ సెంటిమెంట్ తో పాజిటివ్ అయిపోయింది. ఎక్కువ రోజులు ఉన్న శ్రీసత్య ఫైనల్ కి వారం ముందు ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది.  బిబి జోడీ డాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఫుల్ క్రేజ్ లో ఉన్న బ్యూటి శ్రీసత్య. శ్రీసత్య తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన వాసంతిని పార్టీ అంటూ ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్-6 లో  గ్లామర్  క్వీన్ గా బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వాసంతి. హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. తాజాగా శ్రీసత్య, వాసంతి కలిసి ఒక డాన్స్ వీడియోని చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగ అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరు కలిసి " సమ్మోహనుడ "  అనే పాటకు డాన్స్ చేసి పోస్ట్ చేశారు. అయితే  వీళ్ళిద్దరితో పాటు గీతు రాయల్ కూడా కలిసింది. అయితే వీళ్ళు చేసిన డ్యాన్స్ ని వాసంతి ఎడిట్ చేసి రాత్రి అప్లోడ్ చేస్తుంటే.. గీతు వచ్చి ఇప్పుడెందుకు రేపు చేద్దామని అంటుంది. అది విని పక్కనే ఉన్న శ్రీసత్య.. అలాంటి వీడియోస్ రాత్రి పెడితేనే బాగుంటాయని అంటుంది. అలా అనగానే గీతుతో పాటు అక్కడున్న వాళ్ళు నవ్వుకున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో శ్రీసత్య, వాసంతి కలిసి చేసిన ఈ డాన్స్ వీడియోని చుసినవాళ్ళంతా సో హాట్ అంటు కామెంట్లు చేస్తున్నారు.  

ఈ పెర్ఫార్మెన్స్ కి కాస్ట్లీ బట్టలు అవసరమా అంటూ అఖిల్ మీద ఆది సెటైర్స్

ఢీ ప్రీమియర్ లీగ్ ఈ వారం షోలో ఆది మందు బాటిల్ పట్టుకుని చేసిన ఓవర్ యాక్షన్ మాములుగా లేదు. ప్రతీ వారం ఆది ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటాడు. ఈ వారం షో మొత్తం మందు తాగుతూ, చికెన్ పీస్ తింటూ కనిపించాడు.  ఈ షోలో అఖిల్ సార్థక్ దీపికా పిల్లికి బావ రోల్ లో వచ్చాడు. అఖిల్ సార్థక్ ని, శేఖర్ మాష్టర్ ని ఒక రేంజ్ మాటలతో ఆడేసుకున్నాడు. అఖిల్ బ్లాక్ కాలర్ థిన్ షర్ట్ తో వచ్చేసరికి "షర్టు, ఫాంటు ఎంత" అని అఖిల్ ని అడిగాడు ఆది. " ఎంతో కొంతలే" అని అఖిల్ రివర్స్ లో కౌంటర్ వేసాడు . "మనమిచ్చే 500 పెర్ఫార్మెన్స్ కి 10 వేల బట్టలు అవసరమా" అని ఆది అనేసరికి అఖిల్ సార్థక్ హార్ట్ అయ్యాడు. తర్వాత ఈ స్టేజి మీద మందు బాటిల్ పెట్టుకుని తాగుతూ "శేఖర్ ఒక సిప్పేస్తావేంటి" అని అడిగాడు.." సిగ్గులేదా" అని శేఖర్ మాష్టర్ అనేసరికి "అబ్బో అందరూ అడిగేవాళ్ళే అని కౌంటర్ వేసాడు..ఇంతలో పూర్ణ ఆది గారు అని పిలిచేసరికి "ఏరా దుబాయ్ చెప్పు" అన్నాడు. "మీరంతా మంచి వాళ్ళని చెప్పారు" అంది "ఎవరు మంచివాడు..ఎవరు చెప్పారు మీకు నేను మంచివాడినని" అని చెప్పాడు. ఇక బాటిల్ లో మందు తాగుతూ పక్కనే ఉన్న అఖిల్ ని చూస్తూ "ఏరా తాగుతావేంట్రా" అని అడిగాడు..అఖిల్ సైలెంట్ గా దీపికా వైపు చూపించే సరికి "అది బోటిల్ లేపితే దించదు..తెలీదా నీకు" అని అన్నాడు ఆది. ఇక ఈ షోలో రీసెంట్ గా ట్రైన్ యాక్సిడెంట్ మీద ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఈ యాక్సిడెంట్ లో సర్వైవ్ ఐన ఒక తల్లీ - కొడుకు వచ్చి తమ అనుభావాలను ఈ స్టేజి మీద షేర్ చేసుకున్నారు. ఇక ఆది మొదటి నుంచి వాగిన వాగుడికి లాస్ట్ లో అందరూ కలిసి కుమ్మేసారు.  

శివ్ కి డెంగీ పాజిటివ్..నీతోనే డాన్స్ నుంచి ఈ వారం బ్రేక్

"నీతోనే డాన్స్" నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోకి "బ్రో" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ  కూడా వచ్చారు. ఐతే ఈ ఎపిసోడ్ కి శివ్-ప్రియాంక రాలేకపోయారు. ఈ విషయాన్ని హోస్ట్ శ్రీముఖి జడ్జెస్ తో కూడా చెప్పింది. ఐతే వీళ్ళు ఎందుకు రాలేకపోయారు అనే విషయాన్ని ప్రియాంక ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. "శివ్ కి 103 ఫీవర్ ఉండేసరికి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఇక తనకు సెలైన్ కూడా పెట్టారు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తన హెల్త్ బాగా అప్సెట్ అయ్యింది అని చెప్పింది. ఇలా మాకే ఎందుకు జరుగుతోంది" అంటూ  ప్రియాంక చాలా ఎమోషనల్ అయ్యింది. "డాన్స్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక పెద్ద ఆపర్చునిటీ. నాకు గట్టిగా ప్రాక్టీస్ చేసి షోలో పార్టిసిపేట్ చేయాలనీ ఉంది. దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో అర్ధం కావడం లేదు... చాలా కస్టపడి ప్రాక్టీస్ చేసాను " అని ఎంతో  బాధతో చెప్పాడు  శివ్.. "సెలైన్ ఐపోయాక ఇంటికి తీసుకెళ్లిపోదాం అనుకున్నా. కానీ డాక్టర్స్ ఏం చెప్పారంటే ప్లేట్ లెట్స్  తగ్గిపోయాయని..డెంగీ పాజిటివ్ అని చెప్పారు. దాని కారణంగా మేము వచ్చి డాన్స్ చేసే పరిస్థితిలో లేము" అని చెప్పింది ప్రియాంక. "మా పేరెంట్స్ ని రమ్మని చెప్పాను. బయట ఫుడ్ అస్సలు తినకూడదు కాబట్టి..శివ్ కోసం వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. నాకు సీరియల్ షూటింగ్ ఉంది. నేను వచ్చి మద్యమద్యలో చూసుకుంటున్నాను.  శివ్ వాళ్ళ మదర్ కి ఫోన్ చేసాను ఐతే ఆమె చాలా కంగారు పడిపోయారు ...వెంటనే బెల్గాం వచేయమన్నారు. కానీ ఈ పరిస్థితిలో తీసుకెళ్ళడమంటే మాటలు కాదు కదా..కాబట్టి వెయిట్ చేయాలి..మా హెల్త్ గురించి మీరంతా ప్రే చేయండి" అని చెప్పింది ప్రియాంక.  

 ఆ మ్యూజిక్ ని మిస్ అయ్యాను...నాకు నిఖిల్ దొరికాడు

ఈ వారం "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోకి... మంచి రేటింగ్ తో నడిచిన ఒకప్పటి సీరియల్ హీరో హీరోయిన్స్ వచ్చారు. ఇక ఆ సీరియల్స్ వాళ్లకు ఎందుకు ఇష్టమో ఈ షోలో వాళ్ళ భావాలను షేర్ చేసుకున్నారు. "గోరింటాకు" సీరియల్ ద్వారా నిఖిల్-కావ్య జోడి తెలుగు ఆడియన్స్ కి బాగా పాపులర్ ఇపోయారు. "ఒక లైఫ్ టర్న్ ఐపోయింది. కన్నడ నుంచి వచ్చిన నన్ను తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చూసేసరికి నాకు బెంగళూరు కి వెళ్లాలని అనిపించేది కాదు. ఇంకా చెప్పాలంటే నాకు ఈ సీరియల్ ద్వారా నిఖిల్ దొరికాడు. నేను ఆల్రెడీ సగం ఇక్కడ సెటిల్ ఐపోయాను" అని చెప్పింది కావ్య. ఇక తరువాత "కోయిలమ్మ" సీరియల్ నుంచి మానస్ - తేజు మాట్లాడుతూ " మా సీరియల్ లో జనరేషన్ చేంజ్ అయ్యింది. ఐనా కూడా ఆడియన్స్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముందు కంటే కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఇంకా చెప్పాలంటే ఆ సీరియల్ కోసమే కంపోజ్ చేసిన 400 పాటలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రాజెక్ట్ మాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సీరియల్..ఈ ప్రాజెక్ట్ ఐపోయాక నేను మ్యూజిక్ ని చాలా మిస్సయ్యాను" అని చెప్పయింది తేజు. "మౌనరాగం" సీరియల్ లో నటించిన శివ్-ప్రియాంక మాట్లాడారు.."షూటింగ్ కోసం లంగా వోణిలో రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎవరో షూటింగ్ కోసం వచ్చారని అనుకున్నారంతా అక్కడి వాళ్ళు.. ఆ తర్వాత మరొకసారి  షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ నన్ను గుర్తు పట్టి అమ్ములు..అమ్ములు అని పిలిచేవారు..ఆ మాటలతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఆడియన్స్ అభిమానమే నన్ను ఇంతలా నిలబెట్టింది" అని చెప్పింది ప్రియాంక.  

బిగ్ బాస్ లోకి కార్తీక దీపం మోనిత...

బిగ్ బాస్ లోకి ఈ కొత్త సీజన్ లో అసలు ఎవరెవరు వెళ్తారు అనే విషయం మీద పెద్ద చర్చే జరుగుతోంది. బిగ్ బాస్ ని ఎవరు ఎంత మంది తిట్టుకున్నా ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళ సంఖ్య మాత్రం సీజన్, సీజన్ కి పెరుగుతూనే ఉంది. అందులో ఈ సీజన్ లో ఏవో కొత్త మార్పులు అంటూ హైప్ క్రియేట్ చేస్తుంటే ఆడియన్స్ లో ఊహాగానాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఎవరెవరు వెళ్తారో ఊహించి చెప్తూ సోషల్ మీడియాలో వాళ్ళను ఫుల్ వైరల్ చేసి పారేస్తున్నారు. అందులో భాగంగా కార్తీక దీపం మోనిత బిగ్ బాస్ హౌస్ లోకి  వెళ్ళబోతున్నారనే విషయం బయటకు వచ్చింది. కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా పాపులరైన మోనిత బిగ్ బాస్ సీజన్ 7 లో అలరించే అవకాశం ఉందనే విషయం తెలుస్తోంది. అయితే.. బిగ్ బాస్ సీజన్ 7 కోసం శోభా శెట్టి గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఈ లేడీ విలన్ వారం రోజులకు గాను లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. అయితే.. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆమెకు ఆడియన్స్ లో మంచి  డిమాండ్ ఉండడంతో.. ఆమె షోకి వస్తే సందడి కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందన్న ఉద్దేశంతో ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికే మొగ్గు చూపిస్తున్నట్లు  తెలుస్తోంది. అలా ఐతే గనక  ఈ బిగ్ బాస్ సీజన్  7   హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్స్ లో శోభాశెట్టి  ఒకరిగా ఉండబోతోంది.  బిగ్ బాస్  సీజన్ 6 బిగ్  డిజాస్టర్ కావడంతో సీజన్ 7 ని  ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ మంచి కసరత్తు చేస్తోందనే విషయం తెలుస్తోంది. అందుకే  ఎప్పుడూ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసే ఈ షోను ఈసారి జూలై నెలాఖరుకు కానీ  ఆగస్టు మొదటి వారంలో  ప్రారంభించాలని నిర్వహాకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  

సన్మానం నుండి వెళ్ళిపోయినందుకు ఇద్దరి మధ్య ముకుంద చిచ్చు పెట్టనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -219 లో.. కృష్ణ స్టేజి పైకి వెళ్లి మురారి గురించి గొప్పగా చెప్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి ఏసీపీ సర్ కారణమని చెప్తుంది. ఆ తర్వాత రేవతి గురించి చెప్తుంది. తను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుందని కృష్ణ చెప్పగానే రేవతి సంతోషపడుతుంది.  ఆ తర్వాత ముకుంద మురారి దగ్గరికి వెళ్లి.. చూసావా నువ్వు అంటే కృష్ణకి గౌరవం మాత్రమే.. ప్రేమ లేదు.. మిగతా వాళ్ళలాగే నీ గురించి కూడా అలాగే చెప్తుందని ముకుంద అనగానే.. మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ తన సన్మానం మురారి చేతుల మీదుగా జరగాలని అనుకుంటుంది. ఏసీపీ సర్ ఎక్కడ ఉన్న స్టేజి పైకి రండి అని మురారిని పిలుస్తుంది. అయిన మురారి రాడు ఏసీపీ సర్ లేని సన్మానం నాకు ఎందుకని కృష్ణ ఏడుస్తు స్టేజి కిందకి వస్తుంటే.. భవాని వెళ్లి నచ్చజెప్పుతుంది. సరే అత్తయ్య‌‌.. సన్మానం మీ చేతులు మీదుగా జరిపించండని కృష్ణ అనగానే.. సన్మానం భవాని చేతులమీదుగా జరిపిస్తారు. ఏసీపీ సర్ కి నేను ఇష్టం లేదు.. అందుకే ఇక్కడ లేరు. ఆ డైరీ అమ్మయి ఏసీపీ సర్ మనసులో ఉందని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ ఇంటికి వచ్చాక మురారి రాలేదని బాధపడుతుంది. అలాగే మరొకవైపు మురారి బయట ఉండి కృష్ణ గురించి బాధపడుతాడు. మరొక వైపు ఎందుకు మురారి ఇలా చేసాడని భవాని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత మురారి ఎక్కడ ఉన్నాడో ఫోన్ చెయమని రేవతికి భవాని చెప్తుంది.‌ ఫోన్ కలవటం లేదని రేవతి చెప్తుంది. అప్పుడే మురారి ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళవని మురారిని భవాని అడుగుతుంది. ఎమర్జన్సీ కాల్ వచ్చింది. ఒక అమ్మయి తనని సేవ్ చెయ్యమని ఫోన్ చేసిందని మురారి చెప్తాడు. ఏసీపీ సర్ ఇలా కవర్ చేస్తున్నారా అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు అక్కడ లేకపోయేసరికి కృష్ణ చాలా బాధపడిందని భవాని చెప్తుంది. అత్తయ్య వదిలేయండి ఏసీపీ సర్ ఎమర్జెన్సీ కాల్ వస్తేనే వెళ్లారు కదా అని కృష్ణ అంటుంది. కానీ ముకుంద మాత్రం ఏదో ఒక గొడవ చెయ్యాలని అనుకొని.. మీరు బానే ఉంటున్నారు కదా? మీ మధ్య గొడవలేం లేవు కదా? మరెందుకు కృష్ణకి జరిగే సన్మానంలో లేవని భవానికి అనుమానం వచ్చేలా ముకుంద మాట్లాడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వసుధారకి బస్తీవాసులు ఎదురుతిరగడంతో అడ్డుకున్న రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -825 లో.. శైలేంద్ర మీటింగ్ కి పిలవకుండానే వచ్చింది కాకుండ మీటింగ్ డిస్టబ్ చేసేలా అన్ని ప్రశ్నలు వేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పమని అడుగుతాడు. మీరు కూడా అడగండి డాడ్ అని ఫణింద్రకి చెప్తాడు. అసలు తప్పు చేసింది అంతా నువ్వే జగతి అసలు.. వీడు లోపలికి వచ్చినప్పుడే బయటకు పంపించాల్సింది. ఇలా మీటింగ్ డిస్టబ్ అయ్యేది కాదు వెళ్ళు ఇక్కడ నుండి అని శైలేంద్రని ఫణీంద్ర బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత మీరు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఏ నిర్ణయమైనా తీసుకోండి. మీకు ఎవరు అడ్డు చెప్పరు. ఎవరికి బాధ్యతలు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్పండని జగతి, మహేంద్రలతో ఫణీంద్ర అంటాడు. మరొక వైపు ఏంజెల్ ని వసుధార తీసుకొని వెళ్తుంది. వాళ్ళని ఫాలో అవుతూ కాలేజీ బాయ్ వెళ్తాడు. రిషి, వసుధార లకి సంబంధించిన ఏ విషయం అయిన నాకు అప్డేట్ ఇవ్వమని కాలేజీ బాయ్ కి కొంత డబ్బు శైలేంద్ర ఇస్తాడు. అందుకే కాలేజీ బాయ్ వసుధార వాళ్ళని ఫాలో అవుతాడు. మరొకవైపు వసుధార, ఏంజెల్ ఎక్కడికి వెళ్లారని విశ్వనాథ్ ని రిషి అడుగుతాడు. వాళ్ళ గురించి ఏం టెన్షన్ పడకు వసుధార ఎంత తెలివైన అమ్మాయని నీకు తెలుసు కదా అని విశ్వనాథ్ అంటాడు. తెలుసు కానీ నాకు చేసిన మోసం కూడా తెలుసని రిషి అనుకుంటాడు. మరొక వైపు బస్తీలో పిల్లలకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడానికి ఏంజెల్ ని వసుధార తీసుకొని వస్తుంది. అక్కడున్న పిల్లలతో మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధార మాట్లాడుతుంది. ఆ మాటలు కాలేజీ బాయ్ విని శైలేంద్రకి కాల్ చేసి చెప్తాడు. వసుధర ప్లాన్ ఫెయిల్ అవ్వాలి. బస్తీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్లకు ఏం చెప్తావో నాకు అనవసరం.. ప్లాన్ ఫెయిల్ అవ్వాలని కాలేజీ  బాయ్ కి శైలేంద్ర చెప్తాడు. తర్వాత కాలేజీ బాయ్ వెళ్లి బస్తీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వసుధారకి ఎదురు మాట్లాడేలా చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న బస్తిలోని పిల్లల తల్లిదండ్రులతో వసుధార మాట్లాడుతుంది. పిల్లలని స్కూల్ కి పంపించండని అడుగుతుంది... కానీ వాళ్ళు వసుధారని అవమానిస్తారు. వాళ్ళు వచ్చిన కార్ టైర్ గాలి తీసేస్తారు. అక్కడున్న వాళ్ళు చెయ్ చేసుకోబోతుంటే వసుధార ఆపుతుంది. అప్పుడే ఆగండని రిషి, పాండియన్ వాళ్ళు  అక్కడికి వెళ్తారు. ఏంటి మేడమ్? ఎందుకు గొడవ పడుతున్నారు. అసలు మీకు బుద్ధి ఉందా అని  వసుధారతో రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రాజ్ కి సాటిమనిషి విలువ తెలియజేసిన కావ్య.. స్వప్న సెలబ్రిటీ అయిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో.. కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నీకు రాజ్ సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని కావ్యతో అంటుంది.. ఆయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు సపోర్ట్ గా ఉండరని కావ్య అనగానే.. అప్పుడే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు రాజ్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ చిన్నప్పటి నుండి రాజ్ ని చూస్తున్న నాకు రాజ్ గురించి బాగా తెలుసు. రాజ్ లో మార్పు మొదలు అయిందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ మారిపోయాక రాజ్ చుట్టూ తిరుగుతావని ధాన్యలక్ష్మి అంటుంది. తిరుగుతాను సాటి మనిషికి భార్యకు తేడా ఏంటో తనకి తెలియజేస్తానని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్, ప్రకాష్ లకి కావ్య భోజనం వడ్డిస్తుంది. ఉపవాసం బ్యాచ్ కి టిఫిన్స్ అయ్యాయా అని ప్రకాష్ అడుగుతాడు. ఆ తర్వాత రాజ్ భోజనం చేయడానికి కూర్చుంటాడు. కావ్య కావాలనే సాటి మనిషి అనే పదాన్ని పదే పదే మాట్లాడుతుంది. అలా కావ్య ప్రతీసారి సాటిమనిషి అనేసరికి మీరు అలా సాటిమనిషి అనడం బాగోలేదు వదిన అని కళ్యాణ్ అంటాడు. సాటిమనిషి అనే పదం అంత అనకూడనిదా అని  కావ్య అడుగుతుంది. అయితే సాటిమనిషి మీద ఒక కవిత చెప్పండని కావ్య అనగానే కళ్యాణ్ చెప్తాడు. ఇక ఆపండని కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.‌ మరొకవైపు స్వప్న తన గదిలో ఉండగా.. ఇంట్లో అందరు అన్నదానికి తను ఫీల్ అవుతుందేమోనని స్వప్న దగ్గరికి వస్తాడు రాహుల్. కానీ స్వప్న బాధపడుతూ కాకుండా మాములుగా ఉంటుంది. ఏంటి ఇంట్లో వాళ్ళ అన్నదానికి బాధగా లేదా అని రాహుల్ అడుగుతాడు. దేనికి బాధ..  నా గొప్పతనం తెలిసి వాళ్ళే మెచ్చుకుంటారని స్వప్న అంటుంది. మరొకవైపు కావ్య ఏంటి ప్రతీదానికి సాటిమనిషి అని అంటుంది. నేను అమ్మతో మాట్లాడింది విన్నాదా అని రాజ్ అనుకుంటాడు. అపుడే కావ్య వస్తుంది. కావ్యకి కబోడ్ తియ్యడం రాకపోతే రాజ్ హెల్ప్ చేయబోతుంటే సాటి మనిషి సాయం వద్దని కావ్య అంటుంది. ఏంటి మా అమ్మతో అన్న మాట విన్నావా? ఆమాత్రం దానికే ఇలా చేస్తున్నావా అని రాజ్ అనగానే.. ఆ మాట మీకు చిన్నదే కావచ్చు. ఆ మాట విన్న నాకు గుండె పగిలిపోయిందంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రాత్రి రాజ్ కి వెక్కిళ్లు వస్తుంటే.. కావ్య లేచి వాటర్ ఇస్తుంది. రాజ్ వాటర్ తీసుకోడు. ఒక సాటిమనిషిగా ఇస్తున్నా తీసుకోండని కావ్య అనగానే .. అప్పుడు రాజ్ వాటర్ తీసుకుంటాడు. మరొకవైపు స్వప్న యాక్ట్ చేసిన ఆడ్ సోషల్ మీడియాలో వస్తుంది. ఆ వీడియోని తీసుకొని స్వప్న దగ్గరికి వస్తాడు రాహుల్. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇప్పుడు మనం సెలబ్రిటీ అయిపోయామని గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సుమ మెడలో పూల దండేసిన విరాజ్..."బేబీ"ని హగ్ చేసుకున్న కింగ్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు  బిగ్ బాస్ సీజన్ 7 కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సందడి వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ ఐపోయింది. "కుడి ఎడమైతే" అంటూ కింగ్ నాగార్జున చెప్పారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ బిబి హౌస్‌మెట్స్ తో కలిసి  ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో  ఒక ప్రోమో రిలీజ్ చేశారు. దానికి  మంచి రెస్పాన్స్ వచ్చింది.  బిగ్ బాస్‌లోని సిక్స్ సీజన్స్‌లో ఉన్న స్టార్స్ అందర్నీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సందడి చేయడానికి రెడీ ఇపోయారు.  ఈ షైనింగ్ స్టార్స్ ఎపిసోడ్ కి  ‘బేబి’ టీమ్, ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్ ’ టీమ్ వచ్చారు. అలాగే  అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ కూడా వచ్చి  సందడి చేశారు.   ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా  కూడా అద్భుతమైన సింగింగ్, డాన్సింగ్  పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు. సుమ హోస్టింగ్ అంటే మామూలు విషయం కాదు. ‘బేబి’ టీం వచ్చేసరికి సుమకి ఇంకా జోష్ ఎక్కువయ్యింది. హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న మూడో అతను ఎక్కడ అని అడిగేసరికి ఆనంద్ దేవరకొండ షాకయ్యాడు. ఎవరూ దానికి ఆన్సర్ చెప్పలేదు. ఇక విరాజ్ ఐతే పూల దండను తీసుకొచ్చి సుమ మెడలో వేసేసి ఆమెతో కలిసి డాన్స్ చేసాడు. ఆ హఠాత్పరిణామానికి సుమ కూడా షాకైపోయింది.  తేజస్వి, మెహబూబా ఓ పాట చేశారు. ఇక కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాక అందరిలో మరింత జోష్ వచ్చింది. కింగ్ నాగ్ కూడా అందరితో ఆడి పాడారు... ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్ ’ మూవీ హీరోయిన్ ప్రణవి మానుకొండ ‘సోగ్గాడే చిన్ని నాయన’ లో తన పక్కన బాలనటిగా చేసిందని చెప్పారు. వెంటనే సుమ " ఈ పిల్ల పెద్దగా అయిపోయింది కానీ మనమిద్దరం ఇంకా అలాగే ఉన్నామంటూ" ఫన్నీ కౌంటర్ వేసింది. తర్వాత వైష్ణవి చైతన్య "మీరంటే చాలా ఇష్టం’ అనేసరికి ఐతే ఒక హగ్ ఇవ్వు అన్నారు.  ‘‘బీబీ  7 టీజర్‌లో ‘కుడి ఎడమైతే’ అన్నారు. ఏంటి సార్?’’ అని సుమ అడిగింది. ‘ఓట్లు ఎలా కొట్టాలి, ఏంటి ? అని కంప్లీట్ గేమ్ ప్లే అంతా మైండ్‌లో సెట్ చేసుకుని వస్తున్నారు. ఈసారి అవన్నీ కుదరవ్. చూడు ఒకసారి.. చూసిన తర్వాత మాట్లాడదాం’ అన్నారు కింగ్ నాగ్..."మీ ఊహకు అందనివి ఇంకా ఉన్నాయి" అన్నారు అనిల్ రావిపూడి.

నేనే చిరుత అంటున్న గీతు రాయల్.. పిచ్చి ముదిరిందిగా అంటున్న నెటిజన్లు!

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు... బిగ్ బాస్ తర్వాత గీతూ షోస్ లో ఎక్కడ కన్పించలేదు కానీ రి యూనియన్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ లను తరచు కలుస్తూ ఉంటుంది. ఈ మధ్య శ్రీలంక కి షిప్ లో‌ వెళ్ళగా.. అక్కడ తను వ్లాగ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందింది. అలా గీతు ఈ మధ్య ఎక్కడికి వెళ్లిన చిరుత కాస్ట్యూమ్స్ లో దర్శనమిస్తుంది. తాజాగా గీతు తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. గీతు, వాసంతి కార్ లో వెళ్తున్న వీడియోని షేర్ చేసింది. అందులో మ్యూజిక్ ప్లే చేయగా చిరుత మూవీలోని చిరుత అనే సాంగ్ వచ్చింది. దాంతో గీతు కార్ డ్రైవ్ చేస్తూ.. నేనే చిరుతని నా డ్రెస్ చూడు చిరుత, నా వాచ్ చిరుత, నా హ్యాండ్ బ్యాగ్ చిరుత.. నా చెప్పులు చిరుత అంటూ  చూపించింది. కాగా ఈ వీడియో చూసిన ప్రేక్షకులు ఈ గీతూకి ఇంకా తగ్గలేదని అనుకుంటున్నారు. కాగా శ్రీసత్య, వాసంతి, గీతు ముగ్గురు కలిసారు. ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.

నువ్వు కావాలయ్య అంటూ స్టెప్పులేసిన వాసంతి కృష్ణన్, సుదీప!

బిగ్ బాస్ సీజన్-6 లో బ్యూటీ క్వీన్ గా వాసంతి కృష్ణన్ ని పిలుస్తారు‌. తన గ్లామర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వాసంతి. హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనుకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన 'మ్యాచ్ ఫిక్సింగ్ ' మూవీలో హీరోయిన్ గా చేసింది. దాంతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో తనలోని మరో కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది వాసంతి. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లతో ట్రెండింగ్ లో ఉండే వాసంతి.. తాజాగా  తన బిగ్ బాస్ హౌస్ మేట్ పింకీ అలియాస్ సుదీపతో కలిసి ట్రెండింగ్ రీల్ చేసింది. అందులో పింకీతో కలిసి కొత్త స్టెప్పులతో అదరగొట్టింది. పింకీ అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసినా పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకి అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప..బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్‌-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీ తో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.‌. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. కాగా   తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'జైలర్' లోని 'నువ్వు కావాలయ్య' పాటకి వాసంతి, సుదీప కలిసి డ్యాన్స్ చేశారు.  ఈ పాట ట్రెండింగ్ లో ఉండటంతో వీరిద్దరు ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. కాగా ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళిద్దరు చేసిన ఈ స్టెప్పులకి మంచి వీక్షకాధరణ లభిస్తుంది.  

పెద్దమ్మ తల్లికి యాటను కోసిన జ్యోతక్క!

జ్యోతక్క గా పిలుచుకునే శివ జ్యోతి అందరికి సుపరిచితమే. యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన శివ జ్యోతి.. అందులో తీన్మార్ వార్తలు చదువుతూ.. తీన్మార్ సావిత్రిగా అందరికి పరిచయమైంది. శివజ్యోతి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా  నాగంపేట గ్రామానికి చెందినది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమెకు గంగూలీ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఆ తర్వాత యాంకర్ గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో బిగ్ బాస్ లో అవకాశం దక్కింది. బిగ్ బాస్ షో తో మరింత గుర్తింపు తెచ్చుకున్న శివ జ్యోతి.. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ రీడర్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. ఇటు ఇన్ స్టాగ్రామ్ లోను తన సత్తా చాటుతుంది.  బిగ్ బాస్ షోకి వెళ్ళేకంటే ముందు సంప్రదాయంగా చీరకట్టులో కనిపించే శివ జ్యోతి.. ఆ తర్వాత మాడ్రన్ డ్రెస్ లు వేస్తూ లుక్ ని మార్చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది శివ జ్యోతి. మరొకవైపు యూట్యూబ్ లోని తన ఛానెల్ లో .. నెల క్రితం " మా‌ ఆయన లేకుండానే అమెరికాకి పోతున్నా" అనే వ్లాగ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి.  ఆ తర్వాత " అమెరికాలో ఈవెంట్స్ ఇట్లా జరుగుతాయా,  నయాగరా వాటర్ ఫాల్స్ చూసిన ,  కాలి నడకతో తిరుపతి దేవుని దర్శనం, మా కొత్త ఇంటింకేంచి భోనం తీసిన.. ఇలా శివ జ్యోతి చేసిన ప్రతీ  వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.  అయితే తాజాగా హైదరాబాద్ లో భోనాలు జరిగాయి. దాంతో  దాదాపు అందరు సెలబ్రిటీలు ఈ భోనాల జాతరలో పాల్గొన్నారు. అయితే అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్దమ్మ తల్లికి యాటను కోసి తన మొక్కుని తీర్చుకుంది శివ జ్యోతి. తను ఈ మొక్కు తీర్చుకోవడానికి ఏం చేసింది, ఎలా చేసిందంతా ఈ వ్లాగ్ లో వివరించింది శివజ్యోతి‌. " ప్రతీ సంవత్సరం లాగే పెద్దమ్మ తల్లికి  రెండు మేకలతో మొక్కు తీరుస్తాం. ఒక షెడ్ బుక్ చేసుకున్నాం. నాతో పాటు నవ్య, దీప్తి సునైన కోళ్ళని తీసుకొని వచ్చారు. దీప్తి నాన్ వెజ్ తినదు. కానీ ఇది మా ఆచారం. అమ్మవారికి మొక్కు ఇలానే తీర్చుకుంటామని చెప్పాను. వచ్చే సంవత్సరం వరకి కొడుకు పుడితే మళ్ళీ మొక్కు చెల్లించుకుంటాను " అని శివ జ్యోతి చెప్పుకొచ్చింది.  

ఇంకొన్ని స్టెప్స్ , డాన్స్ ఉంటే బాగుండు అన్న కామెంట్స్ కి సెట్ లో రచ్చరచ్చ...

"నీతోనే డాన్స్" ఈ వారం రెండు రోజులు జరిగిన షోలో రెండు జంటలు కొంచెం అగ్రెసివ్ గా ప్రవర్తించినట్టు అనిపించింది. నటరాజ్ మాష్టర్ - నీతూ రెట్రో రౌండ్ లో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ గెటప్స్ తో వాళ్ళ సాంగ్స్ కి డాన్స్ చేశారు..ఐతే వీళ్లకు అంజలి, పవన్ , కావ్య, నిఖిల్ జంటలు చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. "ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటే బాగుండు అని పవన్ నటరాజ్ మాష్టర్ కి చెప్పేసరికి ఇంకా స్టెప్స్ కావాలా..ఇప్పటికే చాలా స్టెప్స్ వేసాం..ఈ డాన్సస్ ని ఒరిజినల్ క్యారెక్టర్స్ లో ఉన్నవాళ్లు ఉంటే ఎలా చేస్తారో చేసాం" అని చెప్పారు. "అసలు వాళ్ళ సాంగ్స్ లో ఇన్ని మూవ్మెంట్స్ ఉండవు కానీ మేము ఇంకా ఇంప్రొవైజ్ చేసి చూపించాం" అన్నారు. "నాగేశ్వరావు గారి స్టెప్స్ వేసేటప్పుడు రెండు మూడు సార్లు నాగేశ్వరరావు గారు వచ్చారు" అని అంజలి అనేసరికి వీడియో చూపించు " అన్నారు నటరాజ్ మాష్టర్ జోడి...ఇక ఇక్కడ మార్క్స్ విషయంలో రచ్చ రచ్చ ఐపోయింది. ఇక నటరాజ్ కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది "థాంక్ గాడ్ వీళ్ళు నన్ను జడ్జ్ చేసే అవకాశం ఇచ్చినందుకు" అని కామెంట్ చేసేసరికి స్టేజి మొత్తం ఒక్కసారి షాకయ్యారు. ఇక రెండో రోజు ఎపిసోడ్ లో ఆట సందీప్ జోడి ఎన్టీఆర్ గెటప్ లో ఆయన సాంగ్స్ ని చేశారు. "రావోయి చందమామ" సాంగ్ కి "ఇంకా డాన్స్ ఎక్కడో తగ్గింది అనిపించింది" అంటూ శివ్ చెప్పేసరికి సందీప్ ఫైర్ అయ్యాడు. "ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు వేసాను అంతే కానీ డాన్స్ తక్కువ అనొద్దు"..అంటూ సీరియస్ గా మాట్లాడేసరికి అక్కడ వాతావరణం అంతా హాట్ గా మారిపోయింది. "రెట్రో థీమ్ కాబట్టి బోర్డర్స్ ని క్రాస్ చేయలేము కదా ..చెప్పిన రీజన్ కరెక్ట్ ఉండాలి " అన్నాడు సందీప్...    

సేవ్ ది టైగర్స్ సీజన్-2 గురించి రివీల్ చేసిన జోర్దార్ సుజాత!

జోర్దార్ సుజాత.. తన మాటతీరుతో  ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. తాజాగా విడుదలైన 'సేవ్ ది టైగర్స్' లో నటించి తనలోని మరొక కోణాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జోర్దార్‌ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కి వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది. ఈ క్రమంలోనే తనకి ఓ ప్రోగ్రామ్ లో తెలంగాణలో మాట్లాడే అవకాశం ఉందని అనడంతో తనకు అదృష్టం కలిసొచ్చింది. అలా తీన్మార్ వార్త‌లు చెప్తూ సుజాత‌గా పరిచయమైంది. ఆ తరువాత జోర్దార్‌ వార్తలతో 'జోర్దార్‌ సుజాత' గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఫేమ్ పొందిన తర్వాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఆమె బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చిన తర్వాత మాటీవీలో 'ఆహారం-ఆరోగ్యం' కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. అలాగే సుజాత జబర్దస్త్  కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది. అంతేకాదు ఆమె, రాకింగ్ రాకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి తమ అప్డేట్స్ ని ఇస్తుంటారు.  తాజాగా సుజాత తన అత్తమ్మతో కలిసి ఒక వ్లాగ్ చేసింది. సుజాత నటించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ గురించి వాళ్ళ అత్తమ్మ సుజాతని అడిగి తెలుసుకుంది‌. ఆ సిరీస్ నాకు చాలా గుర్తింపు ఇచ్చింది. నేను పెద్ద ఫ్యాన్. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా.. ఈ వెబ్ సిరీస్ చూసి మా ఇంట్లో మా అత్తమ్మ పొగిడారు. చుట్టు పక్కల వాళ్ళు వచ్చి బాగా చేసావని పొగుడుతుంటే అంతకన్నా సంతోషం ఉండదని సుజాత చెప్పుకొచ్చింది. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 లో ప్రతి ఒక్కరు ఇచ్చి పడేసారు. సిరీస్ ఎండ్ లో ఉంది కమింగ్ సూన్ అంటూ సుజాత చెప్పుకొచ్చింది.