సందీప్ కొంచెం ఎదుగు..అంత స్ట్రాటజీ ప్లే చేయాల్సిన అవసరం లేదు

"నీతోనే డాన్స్" షో ఈ వారం ఇంకా ఎక్కడా కాంట్రోవర్సి కంటెంట్ రాలేదు అంటుకుంటున్న టైంలో గొడవ జరిగిపోయింది. అమరదీప్ - తేజు - అభినయశ్రీ ముగ్గురూ కలిసి అడవిలో జంతువుల్ని మనుషులు ఎలా చంపేస్తున్నారో చెప్తూ ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసాక జడ్జెస్ అందరూ ఫిదా ఇపోయారు. యానిమల్ లవర్ ఐన సదా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఇక మార్క్స్ ఇచ్చేటప్పుడు సాగర్, ఆట సందీప్ మధ్య కాసేపు గొడవయ్యింది. "నా పెర్ఫార్మెన్స్ లో ఒక మూవ్మెంట్ తప్పొచ్చిందని మార్క్ కట్ చేశారు మరి అమరదీప్ వల్ల పెర్ఫార్మెన్స్ లో కూడా ఒక సందర్భంలో కంటెస్టెంట్ పడిపోయారు..మరి ఎందుకు ఫుల్ మార్క్స్ ఇచ్చారు" అని సందీప్ సాగర్ ని క్వశ్చన్ చేసేసరికి.."నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను" అని సాగర్ చెప్పేసారు..ఇక మధ్యలోకి రాధ ఎంట్రీ ఇచ్చారు .."సందీప్ కాస్త ఎదుగు..నీకు ఇంతకు ముందు ఈ విషయం గురించి చెపుదాం అనుకున్నా..కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీ జోడికి, అమరదీప్ జోడికి మధ్యన చిన్న గొడవ ఉంది. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు..లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ లో అమర్ దీప్ వాళ్లకు 9 మార్క్స్ ఇచ్చే అవసరం లేదు..కానీ మీరు ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే మీరు ఆ విషయాన్నీ వేలెత్తి చూపిస్తున్నారు. స్ట్రాటజీ ప్లే చేయొచ్చు.. కానీ కొన్ని పెర్ఫార్మెన్సెస్ లో అసలు తప్పులు వెతకాల్సిన అవసరం లేదు" అని చెప్పారు. మళ్ళీ వాళ్ళెక్కడ సీరియస్ అవుతారో అని రాధ మళ్ళీ వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేశారు. "డాన్స్ లో ఇవన్నీ కామన్..నేను చెప్పానని ఎవరూ ఫీల్ అవకండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి అస్సలు చేయకండి" అని గట్టిగా నవ్వేశారు రాధ. బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డేకి అమరదీప్-తేజు నిలిచారు. అలాగే గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ కొట్టేశారు.  

పెదవి కొరుక్కుపో అంటున్న మల్లి!

భావన లాస్య.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 'మల్లి' అంటే అందరికి సుపరిచితమే. ఎందుకంటే 'మల్లి' సీరియల్. స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి విశేష ఆదరణ లభిస్తుంది. మల్లి సీరియల్ లో అరవింద్ ని ఇష్టపడి, ఆ తర్వాత మాలిని కోసం తన ప్రేమను త్యాగం చేసి వదిలి వెళ్తుంది మల్లి. ఆ తర్వాత మల్లి చేస్తోన్న ఆఫీస్ లోనే అరవింద్ జాబ్ కి జాయిన్ అవుతాడు. మాలిని తనని జాబ్ మానేయమని, లేదా అరవింద్ ని జాబ్ మానేయమని చెప్తుంది. నేనెలా చెప్తానను మల్లి అంటుంది. ఇది భోనాల జాతరలో మల్లి, మాలినిల సంభాషణ. మరి మాలిని చెప్పినట్టు మల్లి చేస్తుందా.. దూరంగా వెళ్తుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది.‌ ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించని భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ట్రెండింగ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ అదరహో అనిపిస్తుంది భావన లాస్య. ట్రెండింగ్ లో ఉన్న 'సమ్మోహనుడ' పాటకి శ్రీసత్య, వాసంతి, ఇనయా చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది.  కాగా ఇప్పుడు లాస్య ప్రియ ఈ పాటకు అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది. మాములుగానే ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్, రీల్స్ తో బిజీగా ఉండే భావన లాస్య.‌. ఏం చేసిన ట్రెండింగ్ అవుతుంది. కాగా ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక రీల్ చేరింది. భావన లాస్యకి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు.  

వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని అనుకుంటున్న నందు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -229 లో.. కృష్ణ, మురారీలని తీసుకొని రండి అని భవాని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఒక వైపు కృష్ణని తీసుకొని, మరొకవైపు మురారి ని తీసుకొని కిందకి వస్తుంటారు. నా మొదటిసారి పెళ్లి మా నాన్న వల్ల జరిగింది. అప్పుడు మా నాన్న దూరం అయ్యారు. ఇప్పుడు రెండవ సారి మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఏసీపీ సర్ నేను దూరం అవుతారు. మురారి కూడా కృష్ణ గురించి ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఒక సంవత్సరంలో ఒక జంటకి రెండు సార్లు పెళ్లి జరుగుతుంది. వీళ్ళ అదృష్టం చూడండని సుమలత అంటుంది. అసలు వీళ్ళ మధ్య నిజంగానే  ఏం లేదా ఎందుకు ఇలా చేస్తున్నారని నందు అనుకుంటుంది. నందుకి ఎలాగైనా వాళ్ళ ఇద్దరి మధ్య ఎం లేదని అర్థం అయ్యేలా చెయ్యాలి... కృష్ణ అంటే అసహ్యం కలిగేలా చెయ్యాలి లేదంటే నందునే వాళ్ళని దగ్గర ఉండి ఒకటి చేస్తుందని ముకుంద అనుకుంటుంది. అందరూ కిందకి రాగానే.. ఆడవాళ్లు మగవాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుదాం ఎవరు గెలుస్తారో చూద్దామని గౌతమ్ అంటాడు. అందరూ దానికి సరే అంటారు. ఆ తర్వాత ఆడవాళ్లు మగవాళ్ళు రెండు గ్రూప్ లుగా విడిపోయి గేమ్ ని మొదలుపెడతారు. ఒక గ్రూప్ పొడుపు కథ అడగ్గానే వాటికి సమాధానం ఇంకొక గ్రూప్ చెప్పాలి. అలా కుటుంబం మొత్తం సరదాగా గడిపుతారు. కొన్ని రోజుల్లో ఈ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతున్నా ఈ సరదాలని మిస్ అవుతానని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ ఒక పొడుపు కథ అడుగుతుంది. తాళి కడతారు.. మెట్టెలు పెడుతారు కానీ భార్యకాదు ఎవరని అడుగుతుంది. కృష్ణ మా విషయం దీంతో చెప్పేస్తుందా అని మురారి అనుకుంటాడు. ఆ పొడపు కథ కి ఎవరు సమాధానం చెప్పకపోవడంతో కృష్ణనే సమాధానం చెప్తుంది. దానికి సమాధానం పూజరి అని వివరిస్తుంది. కృష్ణకి నాపై ఏ అభిప్రాయం లేదని ఈ పొడుపు కథతో క్లియర్ అయిందని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏంటి కృష్ణకి నిజంగానే మురారి అంటే ఇష్టం లేదా అని నందు అనుకుంటుంది. నేనే కృష్ణని తప్పుగా అర్థం చేసుకున్నానా కృష్ణకి మురారి అంటే ఇష్టం లేదా అని ముకుంద అనుకుంటుంది. రేవతి కూడా కృష్ణకి, మురారి అంటే ఇష్టం లేదా అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ భార్యలకి వాళ్ళ భర్తలు మెహందీ పెడుతారు. కృష్ణకి మురారి మెహందీ పెడుతాడు. ఆ తర్వాత కృష్ణకి ముక్కు దురద గా ఉంటే.. కృష్ణ మెహందీతో ఇబ్బంది పడుతుంది. అప్పుడే మురారి వస్తాడు. హెల్ప్ చెయ్యండంటూ ముక్కుపై దురద వస్తుందని అంటుంది కృష్ణ. అప్పుడు కృష్ణకి మురారి దగ్గరగా వచ్చి రొమాంటిక్ గా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషిని రౌడీల నుండి కాపాడిన పాండియన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -835లో.. రిషితో మాట్లాడి వసుధార వెళ్ళిపోతుంది. రిషి కార్ వెనకాలే వసుధార వెళ్తున్న ఆటో వెళ్తుంది. కొంతమంది రౌడిలు రిషి కార్ ని ఫాలో అవుతుంటే వసుధార చూస్తుంది. వీళ్ళు ఆ రోజు రిషి సర్ పై అటాక్ చేసిన వాళ్ళు కదా పోలీస్ లకి దొరకకుండా తిరుగుతున్నారా? ఇప్పుడు మళ్ళీ రిషి సర్ వెనకాలే వెళ్తున్నారేంటీ.. మళ్ళీ రిషి సర్ ని ఏమైనా చేస్తారా అని వసు బయపడుతుంది. రిషి వెనకాలే వసుధార వెళ్తుంది. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్ళాక వసుధార వెళ్తున్న ఆటో రిషి వెళ్తున్న కార్, రౌడీలని మిస్ అవుతుంది. అప్పుడు వసుధారకి ఏం చెయ్యాలో అర్థం కాదు. మరొక వైపు శైలేంద్రకి రౌడీలు కాల్ చేస్తాడు. రిషి ని ఫాలో అవుతున్నాం సర్.. ఈ సారి ప్లాన్ ఫెయిల్ అవ్వదు సర్ అని రౌడీలు చెప్తారు. ఆ తర్వాత రౌడీలు ఒక మహిళని తీసుకొని వచ్చి, ప్రెగ్నెంట్ అని చెప్పి రిషి వచ్చే దార్లో లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూన్నట్లు నటిస్తుంటారు. అప్పుడే రిషి కార్ వస్తుంది. ఆ రౌడీ కార్ ఆపి మా చెల్లి ప్రెగ్నెంట్ నొప్పులు వస్తున్నాయ్.. ప్లీజ్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలని అనగానే.. రిషి సరే అని కార్ దిగి వచ్చి ఆమెని పట్టుకొని తీసుకొని వెళ్తుండగా.. ఒక్కసారిగా ఆమె కత్తితో రిషిని పొడిచే ప్రయత్నం చేస్తుంది. రిషి తప్పించూకుంటాడు. రౌడీలందరూ ఒక్కసారిగా రిషిపై ఎటాక్ చేస్తారు. అప్పుడే పాండియన్ అతని ఫ్రెండ్స్ రిషి దగ్గరికి వచ్చి రౌడీల్ని కొడతారు. వసు కూడా వాళ్ళ దగ్గరికి వస్తుంది. దూరంగా నిల్చొని చూస్తుంటుంది.  మరొక వైపు రిషికి ఏదో జరిగినట్లు జగతికి పీడకల వస్తుంది. ఒక్కసారిగా నిద్ర నుండి లేచి ఏడుస్తుంది. రిషికి ఏం కాదని జగతికి మహేంద్ర చెప్తాడు. వసుధారకి మహేంద్ర ఫోన్ చేయగానే.. వసుధార కట్ చేస్తుంది. మరొక వైపు రౌడీ లు పారిపోతారు. మీరు ఇక్కడకి ఎలా వచ్చారని పాండియన్ వాళ్ళని రిషి అడగగానే.. వసుధార మేడమ్ చెప్పిందని అంటాడు. సరే మీరు వెళ్ళండని పాండియన్ వాళ్ళకి రిషి చెప్తాడు. ఆ తర్వాత రౌడీలకి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. రౌడీల ఫోన్ రిషి ని ఎటాక్ చేసిన ప్లేస్ లో వదిలేసి వెళ్తారు. రిషి ఫోన్ దగ్గరికి వెళ్ళగానే ఫోన్ కట్ అవుతుంది. మరొకవైపు వసుధారకి మహేంద్ర కాల్ చేస్తాడు. జగతి టెన్షన్ పడుతుందని చెప్పగానే రిషి సర్ బానే ఉన్నాడు.. వీడియో కాల్ చేస్తానని వసుధార చెప్తుంది. దూరంగా ఉండి రిషి ని చూపిస్తుంది వసుధార. ఆ తర్వాత వసుధారని చూసిన రిషి.. రమ్మని పిలుస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. మీకు ప్రాబ్లమ్ అయితే రాకుండా ఎలా ఉంటానని వసుధార అంటుంది. సరే పదండి డ్రాప్ చేస్తానని రిషి అంటాడు. వసు కార్ ఎక్కి రిషితో వెళ్తుంది. వసుధారని  ఇంటి దగ్గర దింపి ఈ రోజు నన్ను కాపాడినందుకు థాంక్స్ అని చెప్తాడు. వసుధార ఇంట్లోకి వెళ్లి చక్రపాణితో జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

రాజ్ ఇచ్చిన ఆఫర్ ని వద్దన్న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -168 లో... కళ్యాణ్ ఎలాగైనా తన అభిమాన పాటకురాలి అడ్రెస్ కనుక్కోవాలని అనుకుంటాడు. అదే విషయం అప్పుతో చెప్పగా.. దీన్నే పిచ్చి అంటారని అంటుంది. అలా అనగానే కళ్యాణ్ డల్ అవుతాడు.  మరొక వైపు తన వాళ్ళ పుట్టింటివాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చెయ్యాలని కావ్య ఆలోచిస్తుంది. అపర్ణ, రుద్రాణి అన్న మాటలు గుర్తుచేసుకుంటూ కావ్య  బాధపడుతుంది. అప్పుడే డిజైనర్ గా ఆఫర్ లెటర్ తీసుకొని వస్తాడు రాజ్. నీకొక గుడ్ న్యూస్ అంటూ రాజ్ కావ్యకి ఆఫర్ లెటర్ ఇస్తుండగా.. తను వద్దని అంటుంది. నేను ఆ ఉద్యోగం చెయ్యలేనని కావ్య చెప్తుంది. ఇన్ని రోజులకి నీ కళని గుర్తించి, నీకు ఈ అవకాశం ఇస్తే ఇలా మాట్లాడుతున్నావేంటి.. నేనే నిన్ను బ్రతిమిలాడాలనుకుంటున్నావా అని రాజ్ అంటాడు. అదేం లేదు నన్ను క్షమించండి.. మీ ఆఫర్ ని తిరస్కరిస్తున్నానని కావ్య  చెప్పేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలన్ని ధాన్యలక్ష్మి వింటుంది. విన్నావా పిన్ని మీ కోడలు ఎలా మాట్లాడుతుందోనని రాజ్ అనగానే.. ఇంట్లో జరిగిందంతా రాజ్ కి చెప్తుంది ధాన్యలక్ష్మి. మరొక వైపు కావ్య ఆలోచిస్తుంటుంది. నాన్న వాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కట్టాలని కావ్య టెన్షన్ పడుతుంది. మరొక వైపు రాజ్ అపర్ణ దగ్గరికి వెళ్లి కావ్య గురించి మాట్లాడతాడు. కావ్యకి డబ్బు నేనేం ఊరికే ఇవ్వలేదు.. తను డిజైన్స్ బాగా వేస్తుంది. మిడిల్ క్లాస్ డిజైన్స్ గురించి కాంట్రాక్ట్ వచ్చినందుకు తాతయ్య నన్ను మెచ్చుకున్నారు కదా.. ఆ కావ్య వల్లే ఆ కాంటాక్ట్ వచ్చింది. తనని డిజైనర్ గా మన కంపెనీ లో జాబ్ ఇచ్చి అందరి ముందు ఈ ఆఫర్ లెటర్ నీతో ఇప్పిద్దామనని అనుకున్న అని అపర్ణతో రాజ్ అంటాడు. ఆలా డబ్బులు తీసుకొని వెళ్లి ఇచ్చే సరికి నాకు కోపం వచ్చి తనతో అలా మాట్లాడాను. తనకి ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఆఫీస్ కి వెళ్ళామను అని అపర్ణ చెప్పగానే.. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు కావ్య తెలిసిన వాళ్ళకి ఏదైనా వర్క్ ఉందా అంటూ ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. మా అమ్మ నువ్వు ఆఫీస్ కి రావడానికి ఒప్పుకుందని చెప్తాడు. అయిన నేను ఈ జాబ్ చెయ్యను. మీ అమ్మ ఒప్పుకుంది కాబట్టి రమ్మంటున్నారు. వద్దంటే నేను ఆఫీస్ కి వెళ్ళాక, కొన్ని రోజులకు వద్దంటే అప్పుడు పరిస్థితేంటి.. మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకొని నా పుట్టింటికి ఇస్తున్నా అని అంటారని కావ్య చెప్పగానే.. ఎవరేం అనకుండా నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. అయిన కావ్య ఒప్పుకోదు. ఆ తర్వాత కావ్యకి  ఒకతను ఫోన్ చేస్తాడు. ఇందాక ఫోన్ చేసావ్ చూసుకోలేదు.. ఏంటి కాల్ చేసావని కావ్యని అడుగుతాడు. విగ్రహలు తయారు చేస్తానని కావ్య చెప్తుంది. నీ కోసం మీ ఇంటికి వెళ్ళాను నువ్వు లేవన్నాక ఆ కాంట్రాక్టు మీ నాన్నకి ఇవ్వలేదని అతను చెప్తాడు. నేను  వస్తాను చేస్తానని కావ్య అనగానే.. అతను సరే మీ నాన్న కి అడ్వాన్స్ ఇస్తానని అంటాడు. మరొక వైపు స్వప్న దగ్గరికి రాహుల్ డ్రింక్ చేసి వస్తాడు. రాహుల్ మత్తులో ఉన్నాడు.. నా అబద్దపు కడుపును నిజం చేసుకోవాలని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

అహా అనిపించిన సూపర్ వుమెన్... 9 కంపెనీల్లో రూ.3.9 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఏంజెల్స్

“ప్రశ్నించనిదే సమాధానం దొరకదు… ప్రయత్నించందే విజయము దక్కదు,” అన్నారు మన బి ఆర్ అంబెడ్కర్. ఆలా ప్రశ్నించి, ప్రయత్నించి మన ముందు స్టార్ మహిళగా నిలిచారు, మన ఆహా వారి 'నేను సూపర్ వుమెన్' యొక్క మహిళా వ్యాపారవేత్తలు. ఎంతో మందిని ఆకర్షించిన ఈ షో మూడో వారంలోకి అడుగుపెడుతుంది. ఈ వారంలో ఏంజెల్స్ 90 లక్షాలు ఇన్వెస్ట్ చేసారు. ఇప్పటికి వరకు మన వుమెన్ స్టార్ట్ అప్ కంపెనీస్ లో ఏంజెల్స్ 3 కోట్ల 90 లక్క్షలు (1 , 2 మరియు 3 వారాలు కలిపి) ఇన్వెస్ట్ చేసారు . లావణ్య సూన్కారి - ఫౌండర్ అఫ్ లారిక్ అమ్మ మొదటి గురువు. ఆలా అమ్మ చూపిన మాటలు విన్నీ, తనదైన దారిని తీర్చిదిద్దుకుంది లావణ్య. 26 ఏళ్లకే ఫార్చ్యూన్ 500 కంపెనీ కి మార్కెటింగ్ హెడ్ గా నిర్వహించి, ప్రస్తుతం 32 ఏళ్ళకి లారిక్ కంపెనీ ని స్థాపించింది. అమ్మ పాలు ఎంత స్వచ్ఛమైందో, లారిక్ యొక్క హెల్త్ సుప్ప్లీమెంట్స్ అంతే స్వచ్చమైనవి అంటుంది ఈ స్టాన్ఫోర్డ్ యూనివెర్సటి న్యూట్రిషన్ స్పెషలిస్ట్. 36 ,౦౦౦ కస్టమర్స్ ఉన్న ఈ కంపెనీ కి అమెరికా నుండి క్లీన్ లేబిల్ సర్టిఫైడ్ బ్రాండ్ అని కూడా పొందింది. ఆలా పొందిన కంపెనీస్ లో భారత దేశంలో మూడు మాత్రమే ఉన్నాయే. అందులో ఒకటి లారిక్. ఇపుడు ఆహా నేను సూపర్ వుమెన్ షో కి 70 లక్క్షలు 2 % వాటా కి అడుగుతూ వచ్చింది లావణ్య. తన పట్టుదల చూసి మెచ్చిన ఏంజెల్స్ రేణుక బొడ్ల మరియు కరణ్ బజాజ్ 50 లక్క్షలు 4 % వాటా అడిగారు. దానికి లావణ్య ఒప్పుకున్నారు.    మాధురి ఆకెళ్ళ - ఫౌండర్సె అఫ్ సెకండ్ ఇన్నింగ్స్ అమ్మ ఒడి, గుడి కన్నా చాల ప్రశాంతతను ఇస్తుంది. కానీ, అలాంటి తలితండ్రులని మనం ఒంటరిగా ఇంట్లో వదిలిసే బయటికి వెళ్లిపోతాం. అలాంటి వాళ్ళ ఒంటరి తనని దూరం చేయడానికి వచ్చిందే - ఈ సెకండ్ ఇన్నింగ్స్. మాధురి గారి ఈ సెకండ్ ఇన్నింగ్స్ కంపెనీ లో ప్రొద్దున 9 ఇంటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు , మరియు ఒక్క రోజు నుండి ఆరు మాసాలు వరకు వీరి దగ్గర ఉండచ్చు. ఇది వృద్ధాశ్రమం కాదు. ఒక డే కేర్ సెంటర్ ఇది. ఇక్కడ యోగ, ఇండోర్ గేమ్స్, మొబిలిటీ థెరపీ మరియు వృద్ధుల యొక్క హొబ్బిఎస్ ని కూడా వీలు చూసుకుంటారు. ఆలా మరోసారి వృధాప్యం లో అమ్మ వోడి ని చవిచూపిస్తున సెకండ్ ఇన్నింగ్స్ మాధురి గారు 40 లక్క్షలు 20 % వాటాకు అడగగా, Dr సింధూర నారాయణ 20 లక్క్షలు 15 % వాటా ఆఫర్ చేయగా, డీల్ ని ఇరువురు ఒప్పుకున్నారు. ప్రత్యూష - ఫౌండర్ అఫ్ గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్ "సర్వేంద్రి యానాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. అందుకే 26 ఏళ్ళ ప్రత్యూష గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్ తోటి మన ముందుకు వచ్చారు. చిన్నపుడు డిస్లెక్సియా తో ఆమె బాధపడ్డారు. ఆలా తనలా బాధ పడే వారికీ చేయూతగా నిలవాలి అని ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి లో వాలంటీర్ గా పనిచేసారు. అపుడే విజువల్ ఇంపైరెడ్ అయినా ఐశ్వర్య పరిచయమైంది. వారి స్నేహం నుండి వచ్చిన కంపెనీ గ్రెయిల్ మేకర్స్. ప్రత్యూష రెండు ప్రొడక్ట్స్ చేసారు - విసిఒన్ నానీ (చిన్నపిల్లలా కోసం) మరియు స్పేస్ ఫెల్ట్ (పెద్దవాళ్ళ కోసం). స్పేస్ ఫెల్ట్ ద్వారా, ఒక క్యూ ర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ రూమ్ లో లేదా ఒక ప్రోడక్ట్ గురించి వివరాలు వస్తాయి. ప్రత్యూష, నేను సూపర్ ఉమెన్ షో కి వచ్చి 50 లక్క్షలు 5 % వాటా కు కోరగా, ఏంజెల్ సింధూర నారాయణ 20 లక్క్షలు 20 % వాటాలు కు ఒప్పుకున్నారు.   నిష్క అగర్వాల్ - ఫౌండర్ అఫ్ సెప్టెంబర్ షూస్: పెళ్లి రెండు జీవితాలనే కాదు, రెండు కుటుంబాలని కూడా ఒకటి చేస్తాయి. అలాంటి ఒక సంబరానికి ఎంతో షాపింగ్ జరుగుతుంది. కానీ చెప్పుల షాపింగ్? మనం వేసుకున్న చెప్పులు డాన్స్ చేస్తూ విరిగిపోతే? అలాంటివి జరగకుండా, మన వెయిట్ మరియు మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొనే వెడ్డింగ్ ఫుట్ వేర్- సెప్టెంబర్ షూస్. ఇలాంటి ఒక ప్రోడక్ట్ భారత దేశంలోనే మొట్ట మొదటి సారి చేయబడుతోంది. నిష్క ఈ షో లో 50 లక్క్షలు 15 % వాటికి కోరగా, ఏంజెల్స్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మెంటార్ షిప్ అందించడానికి ఒప్పుకున్నారు. ఏంజెల్స్ సింధూర నారాయణ మరియు కరణ్ బజాజ్ మెంటార్ షిప్ ఇస్తానని చెప్పగా, నిష్క దానికి ఒప్పుకున్నారు.

ఈ వారం టీఆర్పీలో మొదటి స్థానంలో బ్రహ్మముడి సీరియల్!

బ్రహ్మముడి సీరియల్ ఈ వారం  టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో 'ప్రేమ ఎంత మధురం' ఉండగా, మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఉంది. బ్రహ్మముడి సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో రోజు రోజుకి కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతటా ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియల్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ‌ధనవంతులు సమాజం ఎలా ఉంటారు.. వారి  అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని బాగా డబ్బున్నవాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది. అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికీ భారంగా ఉండాలనుకుంటుంది.    అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది. దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు  రాజ్ కి కనకం కూతురు స్వప్న నచ్చి పెళ్ళిచేసుకుందామనేసరికి తను పెళ్ళిపీటల మీద నుండి లేచిపోతుంది. దాంతో రాజ్ మేనత్త రుద్రాణి కనకం రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి రాజ్, కావ్యలకి పెళ్ళి చేస్తుంది. ఈ విషయం భరించలేని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ చాలా కోపంగా ఉంటూ.. కావ్యని ఒక స్టోర్ రూమ్ లో ఉండమని చెప్తుంది. ఇక దుగ్గిరాల కుటుంబం యొక్క ఇంటిపెద్ద  సీతారామయ్య మాటకి కట్టుబడి కావ్యని ఏమీ అనలేకపోతుంటారు. స్వప్నని తీసుకెళ్ళింది రాహులేనని కావ్యకి తెలిసిపోతుంది. అయితే ఈ విషయాన్ని కావ్య నిరూపించడానికి తగిన ఆధారాలు సేకరించి అందరిముందు నిరూపిస్తుంది. ఆ తర్వాత స్వప్న, రాహుల్ ల పెళ్ళి జరుగుతుంది. అయితే స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం కావ్యకి తెలిసిపోతుంది. కావ్య పెళ్ళి ఆపాలని చూస్తుంది. కానీ అప్పటికే రాహుల్-స్వప్నల పెళ్ళి జరుగుతుంది. ఇక స్వప్నని ఒంటరిగా గదిలోకి తీసుకెళ్ళిన కావ్య ఎందుకు మోసం చేసావని నిలదీస్తుంది. ఆ తర్వాత కావ్యని స్వప్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. కావ్య తన కుటుంబానికి అండగా ఉండాలని రాజ్ కి తెలియకయండా డిజైన్స్ వేస్తుంటుంది. అయితే రాజ్ కావ్య వేసిన డిజైన్స్ చూసేస్తాడు. కావ్య డిజైన్స్ కి వచ్చిన డబ్బులను తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టకుండా అడ్డుకుంటుంది. కనకం, కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు కళ్యాణ్ రాసిన కవితలను ఇష్టపడుతున్న ఆ అజ్ఞాత అభిమాని ఎవరని ఇంకా తెలియకుంది. స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని ఇంట్లో చెప్పకుంటే కావ్య చెప్పేస్తానని చెప్పింది. మరి స్వప్న విషయం కావ్య ఇంట్లో చెప్పేస్తుందా? కళ్యాణ్ కవితలని ఇష్టపడే అభిమాని ఎవరో తెలుసుకుంటాడా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ అత్యంత వీక్షకాదరణ పొందుతూ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది.  

అఖిల్ కాకపొతే నిఖిల్..గతంతో నాకు పని లేదు

బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ షో "నీతోనే డాన్స్" ప్రతీవారం శని, ఆదివారాల్లో మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంటోంది. బీబీ జోడిని తలదన్నేలా ఉంటున్నాయి ఈ షోలోని డాన్స్ పెర్ఫార్మెన్సెస్..నీతోనే డాన్స్ షోలో బీబీ జోడిని ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇక వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ వారం వాళ్ళను కూడా తీసుకొచ్చారు. నిఖిల్-కావ్యకి జోడీగా తేజస్విని మాదివాడ ఎంట్రీ ఇచ్చింది. బీబీ జోడిలో తేజు-అఖిల్ జోడి చేసిన రచ్చని ఇప్పటికీ ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేదు. ఆ హాట్ డాన్స్   స్టెప్స్ ఇంకా గుర్తున్నాయి. జడ్జి రాధ ఐతే ఈ జోడి చేసే  పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఐపోయేవారు. అలాంటి తేజు ఈ వారం కావ్య-నిఖిల్ తో కలిసి డాన్స్ చేసింది. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ముగ్గురూ ముద్దులు పెట్టేసి కాయితాలు చింపేసారు. మిగతా కంటెస్టెంట్ జోడీస్ కి వీళ్ళ డాన్స్ స్టెప్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ తెగ నచ్చేసాయి. ఫుల్ మార్క్స్ ఇచ్చేసారు. సదా కావ్యని, తేజుని హగ్ చేసుకుంది కానీ హాట్ గా ఉన్న నిఖిల్ ని మాత్రం హగ్ చేసుకోను అని చెప్పేసారు. ఇక శ్రీముఖి తన ఇంటర్వ్యూ రౌండ్ మొదలుపెట్టింది. " ఏమనిపించింది మీ ఆయనతో కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేయడం" అని అడిగేసరికి కావ్య సిగ్గు పడిపోయింది. " ఆ కంఫర్ట్ ఉంది కాబట్టే డాన్స్ ఇంత బాగా వచ్చింది" అని కవర్ చేసాడు నిఖిల్. "తేజు ఈ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నీకు నీ అఖిల్ గుర్తొచ్చాడా" అని అడిగేసరికి " చెప్పాలంటే నేను ప్రెజంట్ సిట్యువేషన్ లో జీవిస్తాను.. నాకు ఫ్యూచర్ తో పాస్ట్ తో సంబంధం లేదు" అని చెప్పేసరికి శ్రీముఖి దాన్ని చాలా సింపుల్ గా "అఖిల్ కాకపొతే నిఖిల్ అనేగా నీ ఉద్దేశం" అని అడిగేసరికి "అవును కదా మరి అలాగే ఉండాలి" అని జడ్జి రాధా కూడా తేజుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.  

'నీతోనే' షార్ట్ ఫిల్మ్ లో బ్రహ్మముడి కళ్యాణ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ఈ సీరియల్స్ కి ఉండే క్రేజ్ మాములుగా లేదు. అందులోను గుప్పెడంత మనసు సీరియల్ కి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. కొత్తగా వస్తున్న సీరియల్ కోసం గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ మార్చొద్దని, పెద్దఎత్తున ట్రెండింగ్ క్రియేట్ చేశారు సీరియల్ ఫ్యాన్స్. స్టార్ మా యాజమాన్యానికి మెసెజ్, కాల్స్ కూడా చేశారు. ప్రస్తుతం బ్రహ్మముడికి, గుప్పెడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే రెండింటిలోను కథ బాగుంటుంది. అందులో రిషి-వసుధార, ఇందులో రాజ్-కావ్య.. ఆన్ స్క్రీన్ పై ఈ రెండు జంటల మధ్య బాండింగ్, లవ్ వల్లే ఈ రెండింటికి అంత క్రేజ్ లభిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీలో లో‌ నెంబర్ వన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో రాజ్ కి తమ్ముడిగా చేస్తోన్న కళ్యాణ్ అలియాస్ కిరణ్ ప్రేరణి కవిగా అందరికి సుపరిచితమే.. ప్రతీ సీన్ లోను కళ్యాణ్ తన కవిత్వంతో  తెలుగుని బ్రతికిస్తూ.. చుట్టూ ఉండేవారికి విసుగు తెప్పిస్తున్నట్టుగా మాట్లాడుతుంటాడు. దీంతో ఈ సీరియల్ లోని కావ్య కూడా కళ్యాణ్ ని 'కవి గారు' అని పిలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మముడి కవిగారు కొత్తబాట పట్టినట్టున్నారు. కళ్యాణ్ అలియాస్ కిరణ్ బ్రహ్మముడి సీరియల్ లో.. సాటి మనిషిగా ఇతరులు పడే కష్టాలు అర్థం చేసుకుని, తనకి చేతనైన సాయం చేస్తున్న కళ్యాణ్.. ఈ పాత్రలో ఒదిగిపోయాడు. కిరణ్ 'నీతోనే' అనే లఘుచిత్రంలో నటించాడు. తాజాగా దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. అలుగంటి ఫిల్మ్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ లఘుచిత్రంలో కిరణ్ కాంత్, రసజ్ఞ్య రితూ, అభిరామ్ అలుగంటి ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. అయితే ఇదే కిరణ్ మొదటి షార్ట్ ఫిల్మ్ అని తెలుస్తుంది. ఇందులో రాజ్ పాత్రలో కన్పిస్తున్న కిరణ్.. తన లవ్ ఎలా మొదలైందో.. ఫస్ట్ లవ్ లో ఉండే ఫీల్ ఎలాంటిదో చెప్తూ.. అలా ముగించేశాడు. దీంతో ఈ లఘుచిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. బ్రహ్మముడిలో కవిగా చేస్తున్న కళ్యాణ్.. 'నీతోనే' లఘుచిత్రంలో రాజ్ పాత్రలో ఎలా చేశాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ట్రెండింగ్ లో షణ్ముఖ్ 'స్టూడెంట్ యాంథమ్' సాంగ్!

కాలేజ్ లైఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ స్టోరీ అయినా దాదాపు హిట్టే.. అప్పుటి కొత్తబంగారు లోకం,  హ్యాపీ డేస్ ల నుండి ఇప్పటి బేబీ సినిమా వరకు అన్ని యూత్ ని ఆకర్షిస్తూ వెండి తెర మీద పేపర్లు విసిరేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తో షణ్ముఖ్ 'స్టూడెంట్' వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ని రెండు వారాల క్రితం రిలీజ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో 'ది స్టూడెంట్ యాంథమ్' లిరికల్ సాంగ్ కి షణ్ముఖ్ తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు. దాంతో ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్ కి విశేష స్పందన లభిస్తుంది. షణ్ముఖ్.. యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్.. ఆ తర్వాత 'సూర్య' వెబ్ సిరీస్ తో ప్రతీ మధ్యతరగతి కుర్రాడికి కనెక్ట్ అయ్యాడు. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి స్నేహితులుగా మారారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది.  ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -5 లో షణ్ముఖ్ ఎంట్రీ  ఇచ్చాడు.  అదే సీజన్ లో సిరి హనుమంత్ కూడా రావడంతో.. వారిద్దరి హౌస్ లో క్లోజ్ గా ఉండటం వల్ల దీప్తి సునైన, షణ్ముఖ్ ల మధ్య కథ మారింది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు వరకు షణ్ముఖ్, దీపు వాళ్ళిద్దరి చేతిపై టాటూస్ ఉండేవి.  బిగ్ బాస్ పూర్తయ్యాక వారిద్దరు విడిపోయారు. ప్రస్తుతం‌ ఎవరి బిజీలో వాళ్ళుంటున్నారు. షణ్ముఖ్  'స్టూడెంట్' అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం షణ్ముఖ్ చాలా వరకు బరువు తగ్గాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. 'స్టూడెంట్' వెబ్ సిరీస్ లోని ఈ లిరికల్ సాంగ్ లోని  లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. స్టూడెంట్ లైఫ్ అంటే ఇంతేనురా, ఫ్రీడమ్ కి లైసన్స్ వచ్చిందిరా అంటూ సాగిన ఈ పాట.. ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కాగా ఈ సాంగ్ కి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. దీంతో షణ్ముఖ్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాడు.

'ఐ హేట్ యూ కృష్ణ' అని చెప్పిన నందు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -228 లో..  కృష్ణ దగ్గరికి రేవతి వచ్చి బాధపడుతుంది. నిన్ను ఇన్నిరోజులు ఒక అమ్మలాగా చూసుకున్నా.. నాక్కూడా మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పాలని అనిపించలేదా అని కృష్ణని అడుగుతుంది. ఇన్ని రోజులు మాతో కలిసి మెలిసి ఉండి.. నువ్వు ఇలా సడన్ గా వెళ్ళిపోతే, మేం ఎలా ఉంటామని రేవతి ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే ఏసీపీ సర్ అంటే ఇష్టమని చెప్పేలా ఉన్నాను. ఇక్కడ నుండి వెళ్ళాలని కృష్ణ అనుకొని వెళ్ళిపోతుంది. మరొకవైపు కృష్ణ, మురారి, ముకుంద, రేవతి.. ఇలా ఎవరికి వారే ఆలోచిస్తూ బాధపడతారు. ఆ తర్వాత మురారి వైపు కృష్ణ కోపంగా చూస్తుంది‌. ఏమైంది కృష్ణకి.. నా వైపు కోపంగా చూస్తుందని మురారి అనుకుంటాడు. ఏమైంది కృష్ణ అంత కోపంగా ఉన్నావని అడుగుతాడు. అత్తయ్యతో ఏం మాట్లాడారు.. మన అగ్రిమెంట్ గురించి ఎందుకు చెప్పారని కృష్ణ అడుగుతుంది. లేదు కృష్ణ నేను చెప్పలేదు.. అమ్మకి ఎలా తెలుసో నాకు తెలియదని మురారి అంటాడు. ముకుందకి మురారి అగ్రిమెంట్ గురించి చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు. మరి మన మధ్య ఉన్న అగ్రిమెంట్ మ్యాటర్ అత్తయ్యకి ఎలా తెలుస్తుందని కృష్ణ అడుగుతుంది. నేనయితే అమ్మకి చెప్పలేదని మురారి అంటాడు. అయితే పెద్ద అత్తయ్యకి ఎప్పుడు చెప్తారని కృష్ణ అడుగుతుంది. టైమ్ చూసుకొని చెప్తానని మురారి చెప్పేసి వెళ్ళిపోతాడు. అసలు అత్తయ్యకి అగ్రిమెంట్ గురించి ఎలా తెలుసని కృష్ణ ఆలోచిస్తుంది. మరొక వైపు ముకుంద దగ్గరికి అలేఖ్య వెళ్లి.. కొన్ని రోజుల్లో కృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోతుందట అని ముకుందకి చెప్తుంది. తనకి వెళ్ళాలని ఉన్నా, ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వరు.. పైగా రేవతి అత్తయ్య, నందు తనకి సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. దానికి నీ సపోర్ట్ కావాలని అలేఖ్యతో ముకుంద అనగానే సరేనని అలేఖ్య అంటుంది. మరొక వైపు కృష్ణకి వాళ్ళ హాస్పిటల్ హెడ్ ఫోన్ చేసి.. ఒక విలేజ్ లో హెల్త్ క్యాంప్ ఉంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వెళ్ళమని చెప్పొచ్చు, రెడీగా ఉండమని చెప్పగానే కృష్ణ సరేనంటుంది. ఈ విషయం పెద్దత్తయ్య, ఏసీపీ సర్ కి చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి నందు వచ్చి.. మురారిపై నీ అభిప్రాయం ఏంటని నందు అడుగుతుంది. గౌరవమని చెప్తుంది. అప్పుడే మురారి అన్న మాటలు గుర్తుచేసుకొన్న నందు.. ఐ హేట్ యూ కృష్ణ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏంటి నందు అలా అందని కృష్ణ ఆలోచిస్తుంది. మరొకవైపు కృష్ణ తనను వదిలి వెళ్ళిపోతుందనే విషయం గుర్తుచేసుకుంటూ బాధపడతాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి-వసుధార ప్రేమ మళ్ళీ కొత్తగా మొదలయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -834 లో.. జగతితో జరిగిందంతా చెప్తాడు మహేంద్ర. అప్పుడు రిషిని గుర్తుచేసుకొని జగతి ఎమోషనల్ అవుతుంది. శైలేంద్ర, వదినపై రిషి చాలా నమ్మకం పెంచుకున్నాడు.. ఇప్పుడు మనం ఏది చెప్పినా వినే సిచువేషన్ లో లేడని మహేంద్ర అంటాడు. నువ్వు చెప్పినా రిషి వినిపించుకోడా అని జగతి ఏడుస్తుంది. ఆ తర్వాత దేవయాని అటుగా వెళ్తూ.. ఏడుస్తున్న జగతిని చూసి లోపలికి వచ్చి.. ఏమైంది ఏడుస్తున్నావ్? రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగి ఇంట్లో అందరిని పిలుస్తుంది. అందరూ రాగానే జగతి ఏడుస్తుంది. రిషి గురించి ఏమైనా తెలిసిందేమోనని దేవయాని అనగానే.. ఏమైంది జగతి.. రిషి గురించి తెలిసిందా అని ఫణీంద్ర అడుగుతాడు. లేదు తెలిస్తే మీకు చెప్తాం కదా అని మహేంద్ర అంటాడు. రిషి త్వరగా వస్తాడనిపిస్తుందని ఫణింద్ర అంటాడు. అవునా నాక్కూడా అనిపిస్తుందని జగతి అంటుంది. రిషి ఎక్కడ ఉన్నా బాగుంటాడు.. ఎవరు ఎన్ని చేసిన రిషికి మా ఆశీర్వాదం ఉంటుందని శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ జగతి అంటుంది.  మరొకవైపు రిషి మిషన్ ఎడ్యుకేషన్ గురించి స్టూడెంట్స్ కి చెప్తాడు. సోషల్ మీడియాని ద్వారా అందరికి అందుబాటులో ఉండాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వసుధార మేడమ్ ని అడగండని స్టూడెంట్స్ కి రిషి చెప్తాడు. ఆ తర్వాత స్టూడెంట్స్ తో రిషి మాట్లాడడం వసుధార చూస్తుంది. విశ్వనాథ్ వాళ్ళింటికి వసుధార వెళ్లి.. రిషి సర్ అంటూ కోపంగా అరుస్తుంది. ఏమైందని ఏంజిల్ అడిగినా సమాధానం చెప్పకుండా.. రిషి గదిలోకి డైరెక్ట్ గా వెళ్తుంది. ఏంటీ మేడమ్ ఇలా డైరెక్ట్ గదిలోకి వస్తున్నారని రిషి అంటాడు. మీరు మీ గురించి ఆలోచించారా? మీకు అంత పెద్ద అటాక్ జరిగింది.. అయినా మీరు ఒక్కరే కాలేజీకి ఎందుకు వచ్చారంటూ అడుగుతుంది. అది నీకు అవసరం లేదు వసుధార అని రిషి అంటాడు. అప్పుడే 'ఏమైంది వసుధార?' అని విశ్వనాథ్, ఏంజిల్ వస్తారు. నేను ఒక్కడినే కాలేజీ కి వెళ్ళాను కదా.. మొన్న ఎటాక్ జరిగింది.. ఎందుకు వెళ్తున్నారని అడుగుతుంది అని రిషి చెప్తాడు. వసుధార చెప్పింది కూడా నిజమే కదా కొంచెం జాగ్రత్తగా ఉండు రిషి.. నేను రిషి ని జాగ్రత్తగా చూసుకుంటా అని విశ్వనాథ్ అంటాడు. సరే మేడమ్ మీరు వెళ్ళండని వసుధారకి రిషి చెప్తాడు. ఆ తర్వాత వసుధార ఆటోలో ఇంటికి వెళ్తుంటుంది.‌ అప్పుడే దారికి అడ్డంగా రిషి కార్ ఆపుతాడు. రిషి కార్ లో నుండి బయటకు వచ్చి.. మేడం మీతో మాట్లాడాలని వసుధారతో అనగానే.. పక్కకి వెళ్లి మాట్లాడుతుంది. ఏంటి మేడమ్ మీరు నాపై ప్రేమ చూపిస్తున్నట్టు అందరికి గతం తెలిసేలా చెయ్యాలనుకుంటున్నారా అని అడుగుతాడు. లేదు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాని వసుధార అంటుంది. అయినా మీకెందుకని వసుధారతో రిషి అంటాడు. మరి మీరు నాకు దెబ్బ తాకినప్పుడు నన్ను జాగ్రత్తగా ఎందుకు చూసుకున్నారంటూ వసుధార ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మీకు నాపై ప్రేమ ఉందంటూ మాట్లాడి వెళ్ళిపోతుంది. పొగరు తగ్గదని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అపర్ణకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్  శనివారం నాటి ఎపిసోడ్ -167 లో... కాంట్రాక్టు వచ్చినందుకు రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడే ఉన్న మేనేజర్ ని పిలిచి.. ఆ కళావతికి కంపెనీ డిజైనర్ గా అఫీషియల్ లెటర్ ఇవ్వమని చెప్తాడు. అక్కడే ఉన్న శృతి.. మీ ఆవిడ పేరు కళావతి కాదు సర్ కావ్య అని అనగానే.. రాజ్ కోపంగా చూస్తాడు. మరొక వైపు కావ్య కోసం అపర్ణ కోపంగా ఎదురుచూస్తుంటుంది. అప్పుడే కావ్య వచ్చి లోపలికి వెళ్తుంటే అగమని అపర్ణ అంటుంది. ఎక్కడికి వెళ్ళావ్ అత్తగారి సొమ్ముని అమ్మ వాళ్ళింటికి జారవేసి వచ్చావా అని అపర్ణ అడుగుతుంది. అందరూ ఏమైందని  హాల్లోకి వస్తారు. మన ఇంటి డబ్బులు వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్ళిందని అపర్ణ వాళ్లతో చెప్తుంది. అవును వెళ్ళాను అందులో తప్పు ఏముందని కావ్య అంటుంది. తప్పు లేదు.. నా కొడుకుకి మాయమాటలు చెప్పి డబ్బులు అడిగి తీసుకుపోవడం తప్పని అపర్ణ అంటుంది.  దొరికింది ఛాన్స్ అన్నట్టుగా రుద్రాణి కావ్య పుట్టింటివారిపై పడుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా తీసుకున్నారు.. సిగ్గులేకుండా అని రుద్రాణి అనగానే.. సిగ్గు గురించి మీరు మాట్లాడుతున్నారా అని కావ్య అంటుంది. నేనేం డబ్బులు వట్టిగా అడిగి తీసుకొని వెళ్ళలేదు. నేను రాత్రంతా కష్టపడి డిజైన్స్ వేసి ఆ డిజైన్స్ నా భర్తకి అమ్ముకుంటే డబ్బులు ఇచ్చారు. నా కష్టార్జితం ఆ డబ్బు.. నేను ఖర్చుపెట్టుకుంటున్నా అని నా భర్తకి కూడా చెప్పానని కావ్య అంటుంది. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పాలని తెలియదా అని అపర్ణ అంటుంది. మీరు నన్ను ఒక మనిషిగా కూడా చూడనప్పుడు మీకెందుకు చెప్పాలి.. మా పుట్టింటికి సాయంగా ఉంటానని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. కావ్య మాటలకు అపర్ణకి కోపం వస్తుంది. మరొక వైపు కృష్ణమూర్తి బొమ్మలకు రంగులు వేస్తుంటాడు. ఒకతను కృష్ణమూర్తి ఇంటికి వచ్చి వినాయకుడి బొమ్మలు కావాలి. దుగ్గిరాల ఇంట్లో వినాయకుని పూజకి మీరు ఇచ్చిన వినాయకుడి బొమ్మలు చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు. అందుకే అలాంటివి కావాలని ఆ వచ్చిన అతను అంటాడు. సరే కానీ అప్పుడవి మా అమ్మాయి వేసినవి.. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించామని, నేను అలాగే వేస్తానని కృష్ణమూర్తి అంటాడు. అవునా వద్దని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఆ కృష్ణమూర్తి బాధపడతాడు. మరొకవైపు అప్పు తన కవిత్వాన్ని వెటకారం చేసిందని భావించిన కళ్యాణ్.. తన అభిమాన పాఠకురాలు రాసిన లెటర్ ని అప్పుకు చూపిస్తాడు. అది చూపించినా అప్పు అలాగే మాట్లాడుతుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రోజురోజుకి పెరుగుతున్న పల్లవి ప్రశాంత్ క్రేజ్.. బిగ్ బాస్ లోకి వెళ్తాడా?

     టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షోకి ఉన్నంత క్రేజ్ అంత ఇంత కాదు. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 3 గ్రాండ్ గా ప్రేక్షకుల ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అయింది. బిగ్ బాస్ ని ఇష్టపడే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుండగా.. ఈ సారి కంటెస్టెంట్స్ గా ఎవరిని తీసుకుంటున్నారన్నది అందరిలో ఉన్న క్వశ్చన్. కాగా గత సీజన్ లో పాపులారిటి లేని కంటెస్టెంట్స్ ని ఎక్కువగా తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ సారి జాగ్రత్తగా ఉంటున్నారని, కొత్తగా ఉంటుందనే టాక్ వినబడుతుంది. బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన కంటెస్టెంట్స్ చాలా వరకు ఓకే అయినట్లు సమాచారం. అయితే గత సీజన్ లో కామన్ మ్యాన్ కేటగిరిలో ఆదిరెడ్డిని తీసుకున్నట్లుగా.. ఈ సారి కామన్ మ్యాన్ కేటగిరిలో ఇద్దరికి అవకాశం కల్పిస్తున్నట్లుగా సమాచారం. కాగా గత నెల రోజులుగా సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు పల్లవి ప్రశాంత్. ఇతను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన రైతు. బిగ్ బాస్ లోకి ఎలాగైనా వెళ్తానంటూ.. మీ సపోర్ట్ కావాలని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో  చెప్తున్నాడు. అలాగే చాలా మందితో ప్రమోషన్ చేస్తూ కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లడం తన కల అంటూ చెప్పుకొచ్చాడు. మరి కామన్ మ్యాన్ కేటగిరీలో ఇతనికి అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ కి పలువురు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యక్తి పల్లవి ప్రశాంత్.. ఒక ఫార్మర్ గా తన చేసే పనులను వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళనున్నట్లు.. ఇన్ స్టాగ్రామ్ లోని పలు బిగ్ బాస్ కి సంబంధించిన పేజీలలో కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. మరి వీరు చెప్పే అంచనాలను దాటి మరెవరినైనా తీసుకుంటారా? లేక మోస్ట్ పాపులర్ గా మారిన కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని తీసుకుంటారా అనేది ప్రశ్నగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా పల్లవి ప్రశాంత్ కి సోషల్ మీడియాలో సపోర్ట్  పెరుగుతూ వస్తుంది. ఎక్కడివెళ్ళిన పల్లవి ప్రశాంత్ ని గుర్తిస్తున్నట్లుగా అతను తన సోషల్ మీడియా అకౌంట్ లలో ఇప్పటికీ వీడియోలుగా చేశాడు. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ తీసుకుంటుందా చూడాలి మరి.  

అగ్రిమెంట్ పూర్తయ్యాక కృష్ణ వెళ్ళకుండా రేవతి ఆపగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -227లో.. కృష్ణ,  మురారిల గదిలోకి రేవతి వస్తుంది. ఎక్కడ  చూసిన కృష్ణ మురారిలు కన్పించడం లేదేంటి, ఎక్కడికి వెళ్లారని రేవతి అనుకొని బయటకు వస్తుండగా కృష్ణ అగ్రిమెంట్ పూర్తి అయ్యేరోజును కృష్ణ క్యాలెండరు పై పెన్ తో మార్క్ చేసి పెట్టడం.. రేవతి చూసి షాక్ అవుతుంది. అంటే కృష్ణ అగ్రిమెంట్ డేట్ పూర్తి అవగానే వెళ్ళిపోతుందా అని రేవతి బాధపడుతుంది. అది ఎలా వెళ్తుంది.. వీడెలా పంపిస్తాడో నేను చూస్తానని రేవతి అనుకుంటుంది. మరొక వైపు మురారి మాట్లాడిన మాటలను నందు గుర్తు చేసుకొని బాధపడుతుంటుంది. ఏంటి నందు నువ్వు డల్ గా ఉన్నావ్.. ఇన్ని రోజులు మా వాళ్ళని మిస్ అవుతున్నా అన్నావ్. ఇప్పుడు మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా డల్ అయ్యవని గౌతమ్ అంటాడు. కృష్ణ మురారిల పేర్లు చెప్పకుండా ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారని చెప్తుంది నందు. వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళని నందు చెప్తుంది. ఎవరైనా సరే నువ్వు డల్ గా ఉంటే నచ్చదని గౌతమ్ అంటాడు. మరొక వైపు రేవతి మురారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ఒకవైపు కోపం మరొక వైపు బాధగా రేవతి మాట్లాడుతుంది. మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి నాకు తెలుసు.. అగ్రిమెంట్ పూర్తి కాగానే కృష్ణ వెళ్ళిపోతుందా? పెళ్లి అంటే ఏం అనుకుంటున్నారు.  కృష్ణ అంటే నీకు ఇష్టం లేదా అని మురారిని రేవతి అడుగుతుంది. ఇష్టం ఉందని చెప్తే అమ్మ నాకోసం కృష్ణని బలవంతంగా ఇక్కడ ఉండేలా చేస్తుంది. అసలు కృష్ణకి నాపై ప్రేమ లేదని ఎలా చెప్పాలని మురారి అనుకుంటాడు. అమ్మ నాకు కృష్ణ అంటే ఇష్టం లేదని మురారి చెప్పగానే.. మురారి చెంప చెల్లుమనిపిస్తుంది రేవతి. ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశారంటూ రేవతి బాధపడుతుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి రేవతి వెళ్తుంది. మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి నాకు ఎప్పుడో తెలుసని అనగానే, అందుకేనా మమ్మల్ని ఫామ్ హౌస్ కి పంపించారని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. కృష్ణ నువ్వు అగ్రిమెంట్ కాగానే వెళ్ళిపోతావా అని రేవతి అడుగుతుంది. కృష్ణ తన బాధని బయటకు చెప్పకుండా వెళ్ళిపోతానని అంటుంది. మురారి అంటే ఇష్టం లేదా అని రేవతి అడుగుతుంది. ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం కానీ ఇప్పుడు నా ప్రేమని మీకు చెప్తే ఏసీపీ సర్ తన మనసులో వేరొక అమ్మాయి ఉందని తెలుస్తుందని కృష్ణ మనసులో అనుకుంటుంది. కృష్ణ, రేవతి  మాటలన్ని చాటుగా అలేఖ్య వింటుంది. కృష్ణ చెప్పు ఇలా నాతో కూడా ఇదంతా చెప్పాలని అనిపించలేదా అని రేవతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషిపై ఎటాక్ చేసిన రౌడీలు తప్పించుకున్నట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -833 లో.. మహేంద్రకి‌ వసుధార ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది. సర్ నాకు రిషి సర్ ని చూడాలని ఉందని, ఒక్కసారి వీడియో కాల్ చేస్తారా అని అడుగుతుంది. నాకు తెలుసమ్మా.. నీకు రిషి అంటే ఎంత ఇష్టమో, ఇద్దరు ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. సరే వీడియో కాల్ చేస్తున్నా అని వసుధారకి మహేంద్ర వీడియో కాల్ చేసి రిషిని చూపిస్తాడు. రిషిని చూడగానే‌ వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత విశ్వనాథ్ ఇంటికి ఇన్‌స్పెక్టర్ వస్తాడు. థాంక్స్ సర్ నేను ఫోన్ చెయ్యగానే త్వరగా రెస్పాండ్ అయి వచ్చారని ఇన్ స్పెక్టర్ తో మహేంద్ర అంటాడు. మీరు రిషిపై ఎటాక్ చేసిందెవరో, పర్సనల్ గా తీసుకొని ఎంక్వయిరీ చెయ్యండని విశ్వనాథ్ అంటాడు. సరే సర్ మీరు టెన్షన్ పడకండి. ఆ రౌడీలను నేను పట్టుకుంటానని ఇన్‌స్పెక్టర్ అంటాడు. రౌడీలందరిని పిలిపిస్తాను, ఐడెంటిఫై చేస్తే రౌడీలు ఎవరో తెలుస్తుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. అయితే నేను, రిషి, వసుధర స్టేషన్ వస్తామని మహేంద్ర అంటాడు. మరొకవైపు శైలేంద్ర ప్లాన్ లు అన్ని ఫెయిల్ అవుతున్నాయని చిరాకులో ఉంటాడు. అప్పుడే ఒక రౌడీ ఫోన్ చేసి సర్ మేం ఇక్కడ నుండి దూరంగా వెళ్లిపోతున్నాం, పోలీసులు రౌడీలని ఐడెంటీఫై కి పిలిచి విచారిస్తున్నారంట, మేం గాని దొరికితే నిజమంతా బయటపడుతుందని ఆ రౌడీ అంటాడు. సరే మీరు వెళ్ళండి ఆ ఫ్యూన్ ని కూడా తీసుకొని వెళ్ళండని రౌడీకి శైలేంద్ర చెప్తాడు. ఇక నేనే రంగం లోకి దిగి, ఆ రిషి గాన్ని వేసేయాలని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు రిషి, వసుధార, మహేంద్ర స్టేషన్ కి వెళ్లి కొంతమంది రౌడీలను చూస్తారు. వాళ్లలో రిషి పై ఎటాక్ చేసిన వాళ్ళు లేరని ఇన్‌స్పెక్టర్ తో రిషి చెప్తాడు. ఆ తర్వాత స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత.. నువ్వు జాగ్రత్త అని రిషిని హగ్ చేసుకుంటాడు మహేంద్ర. మీరు వెళ్ళండి డాడ్ అక్కడ కాలేజీ ని చూసుకోవాలి కదా అని మహేంద్రతో రిషి చెప్తాడు. ఆ తర్వాత పాండియన్ అతని ఫ్రెండ్స్ రిషిపై ఎటాక్ జరిగిందని తెలిసి, రిషి సర్ కి ఇక మనం సెక్యూరిటీ లాగా ఉందామని అనుకుంటారు. అప్పుడే రిషి వస్తుఙటాడు రిషి వెనకాల సెక్యూరిటీ లాగా పాండియన్, అతని ఫ్రెండ్స్ వెళ్తుంటారు. ఇక నుండి మీకు సెక్యూరిటీ లాగా ఉంటామని పాండియన్ చెప్పగానే .. వద్దు మీరు చదువుకోవడానికి వచ్చారు. అది నా పర్సనల్ అంటూ పాండియన్ వాళ్ళకి రిషి చెప్తాడు. మరొకవైపు మహేంద్ర ఇంటికి వెళ్లి.. జగతికి జరిగిందంతా చెప్తాడు. రిషి  తన గురించి మాట్లాడిన మాటలన్నీ చెప్పగానే జగతి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇల్లుని అమ్మకుండా అడ్డుకున్న కావ్య.. స్వప్న తనని ఇరికించిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -166 లో.... రుద్రాణి ఈ టాబ్లెట్స్ ఎక్కడివని స్వప్నని నిలదీయడంతో తను టెన్షన్ పడుతుంది. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. ఈ టాబ్లెట్స్ కావ్యకి ఆర్డర్ చేశానని స్వప్న అనగానే.. కావ్య ఆశ్చర్యపోయి చూస్తుంది. స్వప్న చెప్పేది నిజమేనా అని కావ్యని రుద్రాణి అడుగుతుంది. స్వప్న నిజమే అని చెప్పమని కావ్యకి సైగ చేస్తుంది. దాంతో చేసేదేమీ లేక  నాకే టాబ్లెట్స్ ఆర్డర్ చేసిందని కావ్య చెప్తుంది. ఆ తర్వాత స్వప్నని కావ్య గదిలోకి తీసుకొని వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు చేసే తప్పులో నన్ను కూడా భాగం చేస్తున్నావ్.. అక్కడ మన వాళ్ళు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు అమ్మ దగ్గరికి డబ్బులు తీసుకొని వెళ్తున్నాను. నేను వచ్చేలోపు ఇంట్లో వాళ్లకి నువ్వు ప్రెగ్నెంట్ కాదన్న విషయం చెప్పు, లేదంటే నేనే వచ్చి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్తానని స్వప్నకి కావ్య వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరొక వైపు ఇల్లుకొని అడ్వాన్స్ ఇవ్వడానికి ఒక అతను, కృష్ణమూర్తి ఇంటికి వెళ్తాడు. అప్పుడే సేట్ కూడా అక్కడికి వెళ్తాడు. ఈ ఇంటి పత్రాల మీద సంతకం చెయ్యండని ఇంటిని కొన్న అతను అంటాడు. కృష్ణమూర్తి బాధగా పేపర్స్ పై సంతకం చేస్తుండగా.. అప్పుడే కావ్య వచ్చి, ఆగండి నాన్న అని అంటుంది. ఈ ఇల్లు మీకు అమ్మట్లేదని ఇల్లు కొన్న అతనికి కావ్య చెప్తుంది. మీకు డబ్బులు ఇవ్వడానికి ఇంకా ఆరు నెలల టైమ్ ఉంది కదా.. ఆ లోపు మీ డబ్బులు మీకు ఇస్తానని కావ్య సేట్ కి చెప్తుంది. నా వడ్డీ డబ్బులు అని సేట్ అడుగుగా.. ఇదిగో అని రాజ్ ఇచ్చిన డబ్బులు కావ్య తీసి ఇస్తుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి, కనకం ఇద్దరు ఏడుస్తుంటే, వాళ్ళకి బాధపడకండి.. నేను డిజైన్స్ వేస్తే మా ఆయన నాకు ఆ డబ్బులు ఇచ్చాడు. ఇంకా డిజైన్స్ వేసి మిగత డబ్బులు కట్టేస్తానని కావ్య చెప్తుంది. మరొక వైపు కావ్య వార్నింగ్ ఇస్తుందా? లేక అది వెళ్తు నాకు అవకాశం ఇచ్చి వెళ్ళిందా అని స్వప్న అనుకొని.. అక్కడే ఉన్న అపర్ణకి వినపడేల కనకంతో ఫోన్ మాట్లాడినట్లు యాక్ట్ చేస్తుంది. ఏంటమ్మా డబ్బులు కావాలా.. రాజ్ ని కావ్య డబ్బులు అడిగి ఇందాకే తీసుకొని బయలుదేరింది. ఇలా ప్రతిసారి అత్తింటి నుండి డబ్బులు పంపిస్తే.. మాకు ఇక్కడ విలువ ఉండదు. కావ్య తప్పు చేస్తే నన్ను అంటారంటూ అపర్ణకి వినపడేల స్వప్న మాట్లాడుతుంది. కావ్య నిజంగానే రాజ్ ని అడిగి డబ్బులు కనకానికి ఇస్తుందని అపర్ణ అనుకుంటుంది. మరొక వైపు కావ్య వేసిన డిజైన్స్ క్లయింట్స్ కి బాగా నచ్చుతాయి. కాంట్రాక్టు ఓకే అవుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు మీ డిజైనర్ ని తీసుకొని రండి అని క్లయింట్స్ రాజ్ కి చెప్తారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఫీమేల్ హైజీన్.. మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్న వితిక షేరు!

వితిక షేరు.. ఎన్నో ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న, సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. చాలా మందికి తెలియని నటి. బిగ్ బాస్ సీజన్-3 లో తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చి అందరిచూపు తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత వితిక మంచి క్రేజ్ సంపాదించుకొని బిజీ జీవితాన్ని గడుపుతుంది. వితిక షేరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒక సిరీస్ తో మొదలైంది తన కెరీర్. అలాగే చాలా సినిమాలలో నటించింది. వితిక తెలుగు, కన్నడ, తమిళ్ లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఝమ్మంది నాదం, భీమీలి కబడ్డి జట్టు,  పడ్డానండి ప్రేమలో, పెళ్లి సందడిలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత 'వితిక షేరు' అనే  యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది. వితిక, హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది. వితిక, వరుణ్ ఇద్దరు రియల్ కపుల్ గా బిగ్ బాస్ 3 లో అడుగుపెట్టి, తమలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.  హౌస్ లో వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ తో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. భార్యభర్తల గిల్లికజ్జల సీజన్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గా సాగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇద్దరు చాలా యాడ్స్ లో కలిసి నటించారు. వితిక అందరికంటే కాస్త భిన్నంగా, ఎప్పుడు కొత్తదనం కోసం ట్రై చేస్తుంటుంది. అలాగే ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. ఏదైనా విషయం చెప్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే విషయం పక్కన పెట్టి, ఎలా తీసుకున్నా మంచి విషయం షేర్ చెయ్యాలనే ఆలోచిస్తుంటుంది. అందుకే ఎప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో భిన్నమైన టాపిక్స్ తో వ్లాగ్ లు, వీడియోలు చేస్తుంది.  ' మా ఊరిలో'  అంటూ తన ఊళ్ళో ఎలా ఉండేదో చెప్తూ ఒక వ్లాగ్, ' స్కూల్.. టీచ్ ఫర్ చేంజ్ ' అంటూ మరొక వ్లాగ్.. ఇలా కొత్తదనంతో కంటెంట్ చేస్తూ యూట్యూబ్ లో టాక్ ఆఫ్ ది ట్రెండింగ్ గా మారింది వితిక. తాజాగా వితిక ఆడవాళ్ళ సేఫ్టీ గురించి కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ.. " ఫీమేల్ హైజీన్ " మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ ఒక వీడీయోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది.  ఆడవాళ్ళు ఆ  టైమ్ లో ఎలా ఉండాలో చెప్తూ, ఇది మహిళలకు చాలా ఇంపార్టెంట్ అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పింది వితిక. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

వెంగళప్పతో ఫైమా పెళ్లి... డిప్రషన్‌లో ప్రవీణ్!

బుల్లితెర మీద పటాస్ ఫైమా, ప్రవీణ్ గురించి తెలియని వారంటూ ఎవరూ లేదు. బుల్లితెర మీద లేడీ కమెడియన్స్ హవా ఈ మధ్య కాలంలో బాగా  నడుస్తోంది. జబర్దస్త్ లో  బులెట్ భాస్కర్ టీమ్ లో  కొంత కాలం చేసిన ఫైమా ఆ టీమ్ కి పిల్లర్ లా ఉండేది. ఆ టీమ్ బాగా హైలైట్ అవడానికి ఫైమా కూడా కారణం. అలాంటి ఫైమా తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ కూడా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీనే ఇచ్చింది. తన కామెడీతో అందరినీ అలరించింది.  అలాగే బీబీ జోడి డాన్స్ షోలో ఆర్జే సూర్యతో కలిసి పెర్ఫార్మ్ చేసి విన్ అయ్యింది. ఇప్పుడు శ్రీముఖితో కలిసి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపిస్తూ ప్రతీ వారం అలరిస్తోంది. ఫైమా, ప్రవీణ్‌ ప్రేమ గురించి కూడా అందరికీ తెలుసు. పటాస్ షో నుండే వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఫైమా కూడా చెప్పింది.  వీళ్ళ మధ్య ఇప్పుడు బేబీ మూవీ చిచ్చు పెట్టింది. "ఇక నుంచి మన ప్రేమ మొదలవుతుంది" అంటూ ఫైమా చెప్పాక ఇద్దరూ కలిసి రెస్టారంట్ కి వెళ్లారు. గిఫ్ట్ తెద్దామనుకున్న నీకోసం కానీ నేనే రావడమే పెద్ద గిఫ్ట్" అని తేలేదని చెప్పాడు ప్రవీణ్. "మూవీకి వెల్దామా" అనేసరికి "బ్రో మూవీ వచ్చిందిగా పదా వెళదాం"..అని ఫైమా అంది "కాదు ముందు బేబీ మూవీకి వెళదాం ఇద్దరికీ  కార్నర్ సీట్లు బుక్ చేశా" అని చెప్పాడు ప్రవీణ్. అలా మూవీకి వెళ్లి మధ్యలోనే లేచి వచ్చేసాడు ప్రవీణ్.. వెనకే ఫైమా వచ్చి ఏంటని అడిగేసరికి ఈ అమ్మాయిలను  ప్రేమించడంకంటే చచ్చిపోవడం బెస్ట్  అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వాళ్ళ మధ్య బ్రేకప్ ఐనట్టు తర్వాత ఫైమాకి వేరే అబ్బాయితో పెళ్లైనట్టు పెళ్లి కార్డు కూడా చూపించారు.