ప్రెగ్నెంట్ గా ఉన్న స్వప్నకి ఆ ట్యాబ్లెట్స్ ఎందుకని రుద్రాణి అనుమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నటి ఎపిసోడ్ -165 లో.. కళ్యాణ్ కి వచ్చిన కొరియర్ ఇవ్వనని కావ్య కళ్యాణ్ ని ఆటపట్టిస్తుంది. అందరూ ఆ లెటర్ లో ఏం ఉందో చదవమని కావ్యకి చెప్తారు. వద్దు వదిన ప్లీజ్ అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ కి కావ్య ఆ కొరియర్ ఇస్తుంది. కళ్యాణ్ ఆ కొరియర్ తీసుకొని వెళ్లి తన గదిలో కూర్చొని తన అభిమాన పాఠకూరాలు రాసిన లెటర్ ని చదువుతాడు. ఆ లెటర్ రాసింది ఎవరో కళ్యాణ్ కి అర్థం కాదు. మరొకవైపు స్వప్న కడుపునొప్పితో ఇబ్బంది పడుతుటుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే నాకు కడుపు లేదని తెలుస్తుంది. స్వప్న టాబ్లెట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తుంది. మరొకవైపు కనకం అప్పు ఇద్దరు కలిసి చీటి వేసే రంగమ్మ దగ్గరికి వెళ్తారు. చీటీ వేస్తాను ముందు డబ్బులు తీసుకుంటానని కనకం చెప్పగానే.. రంగమ్మ వాళ్ళని అవమానిస్తుంది. మీకు తిండికే గతి లేదు చీటీ డబ్బులు ఎలా ఇస్తావంటూ అవమానిస్తుంది. అప్పుడే రంగమ్మ భర్త వస్తాడు. ఇతనెవరు మొన్న సినిమాకి వెళ్లింది ఎవరితో అని అప్పు అంటుంది. అలా అని రంగమ్మకి వాళ్ళ భర్తకి మధ్య గొడవ పెట్టిస్తుంది అప్పు. మరొకవైపు స్వప్న ఆర్డర్ చేసిన టాబ్లెట్స్ వస్తాయి. కాగా అవి టెన్షన్ పడుతూ వెళ్లి తీసుకుంటుంది. ఏంటవి స్వప్న అంత రహస్యంగా టెన్షన్ పడుతూ తీసుకొని వెళ్తుందని రుద్రాణి చూస్తుంది. స్వప్న లోపలికి వెళ్లి టాబ్లెట్స్ వేసుకొని మిగతావి కబోడ్ లో పెడుతుంది. మరొక వైపు కావ్య డబ్బులు తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఒక మాట రాజ్ కి చెప్పాలని మెసేజ్ చేస్తుంది. ఈ డబ్బులు మా నాన్నకి ఇస్తున్న అని రాజ్ కి కావ్య మెసేజ్ చేస్తుంది. నీ డబ్బులు నీకు నచ్చినట్టు వాడుకో.. నాకు ఎందుకు చెప్తున్నావని రాజ్ అంటాడు.   మరొక వైపు స్వప్న రహస్యంగా తీసుకొని వచ్చిందేంటని రుద్రాణి అనుకొని, స్వప్న గదిలోకి వెళ్లి కబోడ్ లో ఉన్న టాబ్లెట్స్ చూసి ఇవి పీరియడ్స్ వస్తే వేసుకునే టాబ్లెట్స్ కదా ఇవి స్వప్నకి ఎందుకు? అంటే స్వప్న ప్రెగ్నెంట్ కాదా అని అనుకొని బయటకు వస్తుంటే.. రాహుల్ ఎదురుపడుతాడు. ట్యాబ్లెట్స్ చూసిన రాహుల్.. ఏంటవని అడుగుతాడు. అప్పుడు రుద్రాణి టాబ్లెట్స్ విషయం చెప్తుంది. అంటే ఆ స్వప్న మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకుందని రాహుల్ అంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. ఏంటి ఈ టాబ్లెట్స్ ఎందుకు? మమ్మల్ని ఎందుకు మోసం చేసావంటూ స్వప్నని నిలదీస్తుంది రుద్రాణి. దాంతో స్వప్న టెన్షన్ పడుతుంది. అప్పుడే కావ్య ఏమైందని అక్కడికి వస్తుంది. చూడే అంతా నీ వల్లే నీకు కడుపు నొప్పి అంటూ టాబ్లెట్స్ ఆర్డర్ చెయ్యమన్నావ్.. ఇప్పుడు వీళ్ళు ఇవి చూసి నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారని స్వప్న అంటుంది. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

విష్ణుప్రియకి అగస్ట్ నెల హార్ట్ అంట!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది. విష్ణుప్రియకి బిగ్ స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని ఆశంట.. ఎందుకంటే అది వాళ్ళ నాన్న డ్రీమ్ అంట. తనలోని నటనను ఎవరు గుర్తించకపోయేసరికి డ్యాన్స్ మీద దృష్టి పెట్టి కసరత్తులు చేస్తుంది. యోగాలు, జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ డ్యాన్స్ కోసం తన బాడీనీ మలుచుకుంటుంది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే విష్ణుప్రియ.. తనకి సంబంధించిన ఒక ప్రతీ విషయాన్ని అప్డేడ్ చేస్తుంది. సీనియర్ హీరో జెడీ చక్రవర్తి మొదటిసారి నటిస్తున్న వెబ్ సిరీస్ 'దయా' లో షబానాగా విష్ణుప్రియ చేస్తుంది. అయితే తను షబానాగా చేస్తున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పింది ' జరీ జరీ పంచె కట్టి ' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో మానస్ తో కలిసి చేసిన‌ విష్ణుప్రియ.. ఫుల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ట్రెండింగ్ కి తగ్గట్టుగా తనని తాను మల్చుకుంటూ వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది విష్ణుప్రియ. తాజాగా విష్ణుప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. " అగస్ట్ మంత్ యు హావ్ మై హార్ట్ " అనే కాప్షన్ తో తన డాన్స్ వీడియోని షేర్ చేసింది విష్ణుప్రియ. కాగా ఈ అగస్ట్ లో తను నటించిన ' దయా ' వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందనని సంతోషంలో ఈ మంత్ ని స్పెషల్ గా ట్రీట్ చేస్తోంది విష్ణు ప్రియ.   

బిగ్ బాస్ లోకి నటి సురేఖ వాణి ఎంట్రీ!

సురేఖ వాణి ప్రస్తుతం టాలివుడ్ లో మోస్ట్ ఫేవరెట్ ఆర్టిస్ట్. బ్లాక్ బస్టర్ సినిమాలో కచ్చితంగా హీరోకి ఒక అక్కగానో, వదినగానో ఇలా చెప్పుకుంటూ పోతే సురేఖ లిస్ట్ పెద్దగానే ఉంటుంది. ప్రస్తుతం సురేఖ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా తన కూతురితో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. తల్లి కూతుళ్లు ఇద్దరు.. అక్క, చెల్లెలు మాదిరిగా ఉండడం వాళ్ళకి ఫాలోయింగ్ మరింత ఎక్కవ అయ్యేలా చేస్తుంది. సురేఖ చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో స్కూల్ లో ఉన్నప్పుడే చిన్న చితక షోస్ కి యాంకరింగ్ చేసేదట. దాంతో మొదట్లో కొన్ని కామెడీ షోస్ కి యాంకరింగ్ చేసింది సురేఖ. ఆ తర్వాత సినిమాలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమాలు బాగానే ఉన్నాయి. బొమ్మరిల్లు, భద్ర, రెడీ సినిమాల్లో తన నటనకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా మ్యాచ్ ఫిక్సింగ్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది సురేఖ. ప్రస్తుతం సురేఖ వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సురేఖ వాణి.. ఆ ఫోటోలకి వచ్చిమ నెగెటివ్ కామెంట్లతో వైరల్ గా మారుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇటు ఇన్ స్టాగ్రామ్, అటు ఫేస్ బుక్ ఎటు చూసిన సురేఖ ఫాలోయింగ్ ఎక్కువే.. తను ఒక చిన్న ఫోటో పెట్టిన కామెంట్ల వర్షం కురుస్తుంది. అయితే ఎవరెన్ని కామెంట్లు చేసిన పట్టించుకోని సురేఖ.‌. తన పని తాను చేసుకుంటుంది. సురేఖ బిగ్ బాస్-7 లోకి వెళ్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం బిగ్ బాస్ టీమ్ సురేఖని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు సురేఖ బిగ్ బాస్ లోకి వెళ్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

డేంజరస్  మూవీ ఓటిటికి ఎప్పుడొస్తుందో చెప్పిన బికినీ భామ

ఆర్జీవీ మూవీస్ చూడడం అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మూవీ తీయడం ఒక ఎత్తైతే..దాని రిలీజ్ కి ముందు చేసే ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. ఆర్జీవీ మూవీ వస్తూనే కాంట్రోవర్సిని వెంటబెట్టుకుని మరీ వస్తుంది. ఎన్నో హిట్ మూవీస్ తీసిన ఆర్జీవీ లాస్ట్ ఇయర్ "డేంజరస్ " అనే మూవీని తీశారు. అది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. నైనా గంగూలి, అప్సరా రాణి కలిసి నటించిన ఈ లెస్బియన్ మూవీలో ఎక్కువ శాతం  అడల్ట్ కంటెంట్ తోనే ఉంటుంది. ఐతే ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యింది కానీ ఇంతవరకు ఓటిటి ప్లాట్ఫారం మీదకు మాత్రం రాలేదు. ఏ మూవీ ఐనా థియేటర్లో రిలీజ్ కాగానే ఒక నెలకో రెండు నెలలకో ఓటిటి మీదకు వచ్చేస్తోంది. కానీ డేంజరస్ మూవీ మాత్రం రిలీజ్ అయ్యి 8 నెలలు అయ్యింది. కానీ ఇంత వరకు ఓటిటి మీదకు రాలేదు. ఐతే నెటిజన్స్ ఈ మూవీ గురించి అడుగుతున్న ప్రశ్నలకు అప్సరరాణి తన ఆన్సర్ ని స్టేటస్ లో పోస్ట్ చేసింది. "డేంజరస్ మూవీ ఇంకా ఓటిటిలో విడుదల కాలేదంటూ చాలా మంది నన్ను అడుగుతున్నారు...ఐతే ఆ మూవీని చూడాలనుకునే మీ ఆసక్తి నాకు అర్ధమవుతోంది. కానీ ఈ మూవీలో నటించినందుకు, ఈ మూవీ టీమ్ లో ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీని రిలీజ్ చేసే సమయంలో పక్షపాత ధోరణితో ఉన్న వాళ్ళను ఎదుర్కొని మరీ ఈ మూవీని డిసెంబర్ 9 న రిలీజ్ చేసాం. ఇక ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకూ తెలీదు ఎందుకంటే మూవీని ఓటిటికి ఇవ్వాలా వద్దా అనేది  పూర్తిగా ఆ మూవీ మేకర్స్ డెసిషన్ ..లెస్బియన్ క్రైమ్ డ్రామా ఐనా కూడా నేను ఇద్దరి స్త్రీల మధ్య ప్రేమను నమ్ముతాను  " అని చెప్పింది అప్సర రాణి.  "క్రాక్" మూవీలో రవితేజతో స్టెప్పేసి ఆడియన్స్ కి  కిక్కిచ్చింది అప్సర. దీంతో హాట్ బ్యూటీగా  ప్రేక్షకుల మనస్సులో  చోటు సంపాదించుకుంది.. ఇక తన హాట్ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్రీ టైం దొరికితే చాలు బీచుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ భామ.  

బిగ్ బాస్ బిగ్ బాస్ కాంట్రావర్సి షో కాదు...దాని వలన మా జీవితాలే మారిపోయాయి

బీబీ షైనింగ్ స్టార్స్ పేరుతో రీసెంట్ గా స్టార్ మాలో జరిగిన కార్యక్రమం మంచి ఫన్నీఫన్నీగా సాగింది. ఇందులో బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 6 వరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి రకరకాల అవార్డ్స్ ని ప్రకటించి అందించారు. ఇందులో భాగంగా ఆదిరెడ్డి కూడా ఒక అవార్డుని అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మ్యాన్ కేటగిరీలో నెల్లూరు జిల్లా నుంచి ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌస్ లో గేమ్ చెంజర్ గా ఉన్నాడు. ఈ షోలో కూడా "గేమ్ చెంజర్ " క్యాటగిరి కింద అవార్డుని అందించారు. అవార్డు తీసుకున్న ఆది మాట్లాడాడు.  "అందరికీ చాలా ధన్యవాదాలు. నా లైఫ్ మొత్తం అందరికీ రుణపడి ఉంటాను. చాలామంది బిగ్ బాస్ ని ఒక కాంట్రవర్షియల్ షోగా చూస్తారు కానీ..కొన్ని వందల మందికి ఇది లైఫ్ ఇచ్చి, లైఫ్ మార్చిన షో అనే విషయాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు.. ఇక్కడ ఉన్న 100 మందికి పైగా జీవితాలను ఈ షో మార్చేసింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్..నాలాంటి వాళ్ళెందరి జీవితాలని మార్చేసింది ." అని చెప్పాడు ఆదిరెడ్డి. అలాగే ప్రియాంకకు కూడా "గేమ్ చెంజర్" అవార్డు ని అందుకుంది. "ప్రియాంక కంగ్రాట్స్.. బిగ్ బాస్ తర్వాత ప్రశాంత్ వర్మ గారి మూవీలో, ఒక తమిళ్ మూవీలో కూడా చేస్తున్నావ్..చాలా బిజీ ఐపోయావ్..చాలామందికి ఇన్స్పిరేషన్ గా కూడా మారావు" అని సుమ విష్  చేశారు. ఇక ప్రియాంక మాట్లాడుతూ "బిగ్ బాస్ కి ముందు నేను చాలా తక్కువ మందికి తెలుసు. బిగ్ బాస్ లోకి వెళ్ళాక నా జీవితమే మారిపోయింది. మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశారు, ఆడియన్స్ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు" అని చెప్పింది ప్రియాంక. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూయర్ గా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ బిగ్ బాస్ షోకి వచ్చాడు. ఇక ప్రియాంక సింగ్ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మూవీస్, షోస్, ఈవెంట్స్ తో చాలా బిజీగా మారిపోయారు.    

మణికొండ ఇల్లంటే ఒక వైబ్...కానీ అమ్మక తప్పడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న జ్యోతక్క

శివజ్యోతి అలియాస్ జ్యోతక్క మణికొండలో తన ఇంటిని అమ్మేస్తున్నట్టు చెప్పి ఎమోషనల్ అయ్యింది. రీసెంట్ గా తన ఛానల్ లో అప్ లోడ్ చేసిన ఒక హోమ్ టూర్ వీడియోలో ఈ విషయాన్ని చెప్పింది శివజ్యోతి. మణికొండలో ఉన్న ఆ ఇంటి వలన తనకు ఎంతో లాభం కలిగిందని.. ఆ ఇంట్లో అడుగుపెట్టాకే  కలిసొచ్చింది చెప్పింది. ఈ ఇంట్లోకి వచ్చాకే అవకాశాలు కూడా బాగా వచ్చాయంది. ఈ ఇల్లు చూపించినంత సక్సెస్, లవ్, గుర్తులు ఇంక ఏదీ ఇవ్వలేదు. ఐతే ఈ ఇంట్లో ఉన్నప్పుడే ఒక ఛానల్ ని స్టార్ట్ చేసింది జ్యోతక్క.. అది మూడు నెలలైనా పెద్దగా క్లిక్ అవ్వకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట. ఇంకా ఇతరత్రా కారణాల వలన ఆ ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నట్లు చెప్పింది. అమ్మేయగా వచ్చిన డబ్బుతో ఇంకా కొంచెం వేసి ఇంకో ఇల్లు చూసుకోవాలని చెప్పింది. ఈ ఇల్లు కొనే టైములో ఈవెంట్స్, యాంకరింగ్ చేస్తూ ఇల్లు కొన్నట్లు చెప్పింది. ఐతే ఈ ఇంట్లోకి వచ్చిన  ఒక నెలకే లాక్ డౌన్ వచ్చిందని చెప్పింది. ఎన్ని సమస్యలు ఉన్నా తనకు ఈ ఇల్లు ఎంతో ఇష్టమని.. బాగా కలిసి వచ్చిందని అంది. ఈ ఇల్లు అమ్మకుండా ఉంచేస్తే వేరే చోట ఉన్న ఇంటికి ఈఎంఐలు, దీని ఈఎంఐలు కట్టలేక బర్డెన్ ఐపోతుంది కాబట్టి తప్పక ఇల్లు అమ్మేస్తున్నా అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు బాగా కలిసొచ్చిన ఇంటిని అమ్మడం బాధగా ఉందంటూ ఏడ్చేసింది. లైఫ్ లో ఛాలెంజెస్ వస్తాయి ఫేస్ చేయాలి కాబట్టి సేల్ చేసేస్తున్నాను.. ఇలాంటి ఒక హోమ్ టూర్ చేసి ఇల్లు అమ్మేస్తున్నట్లు చెప్తానని అనుకోలేదంటూ చాలా ఫీలయ్యింది శివజ్యోతి . ఈ ఇంట్లోనే బుల్లితెర సెలబ్రిటీస్ ఛిల్ల్ అయ్యేవారని మణికొండలో ఈ ఇల్లంటే వాళ్లందరికీ ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పింది. ఇకపోతే  ఈ ఇంటిని కొనుక్కునేవాళ్లకు కూడా తనకు  ఇచ్చినంత సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పింది శివజ్యోతి .  

ఢీలో పుట్టినరోజు వేడుకలు..కంటెస్టెంట్ బర్త్ డే డిసైడ్ చేసి విషెస్ చెప్పిన శేఖర్ మాష్టర్

ఢీ షోలో మంచి డ్యాన్సులు చూసాం, మంచి స్కిట్స్ కూడా చూసాం..కానీ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ని ఈ వారం షోలో చూడొచ్చు. ఈ డాన్స్ జోడీస్ లో సైరా రాయలసీమ టీమ్ మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ప్రతీ వారం అలరిస్తూ ఉంటుంది. ఇందులో రాజశేఖర్, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ వారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ప్రదీప్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసేలా చేసాడు.. వాళ్ళను స్టేజి మీదకు పిలిచి వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అడిగాడు. "ఒక కాంపిటీషన్ లో ఇద్దరం కలిసాం .. ఢీ 14 , 15 లో కూడా ఆడిషన్స్ ఇచ్చాము ..ఐతే సెలెక్ట్ కాకపోయేసరికి మన ఫేస్ వల్ల మనం సెలెక్ట్ కావట్లేదని అనుకున్నాం. కానీ ఇప్పుడు అది అబద్దం అని తెలిసింది.. ఢీ 16 స్టేజి మీద ఈరోజు నిలబడ్డాం. సురేష్ కి ఇంగ్లీష్ రాదన్న విషయం నాకు తెలీదు. కానీ నాకు కొంచెం అర్ధమవుతుంది కానీ అంత బాగా రాదు. మాస్టార్లు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే చెప్పు అనేవాడు కానీ నాకు రాదు కాబట్టి అంతగా అర్ధమయ్యేది కాదు..కానీ ఎన్ని చేసినా ఫ్రెండ్ కదా" అనేసరికి సురేష్ మాట్లాడాడు "అన్నతో ఇన్నేళ్ళుగా ఉంటున్నా కానీ అన్న పుట్టినరోజు ఎప్పుడో తెలీదు నేను చేయడానికి. కానీ నా బర్త్ డే చాలా గ్రాండ్ గా చేస్తాడు" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. "సింహరాశి మూవీ టైములో పుట్టానని మాత్రమే తెలుసు" అని రాజశేఖర్  చెప్పేసరికి పూర్ణ, శేఖర్ మాష్టర్ వచ్చి కేక్ తెప్పించి స్టేజి మీద రాజశేఖర్ తో కట్ చేయించారు. ఇక నుంచి నీ పుట్టినరోజు ఆగష్టు 2 న అని చెప్పి అందరూ విషెస్ చెప్పి కేక్ తినిపించారు. తర్వాత కొరియోగ్రాఫర్ ఐశ్వర్య టీమ్ పెర్ఫార్మ్ చేసిన డాన్స్ పెద్దగా బాలేదని..నెక్స్ట్ టైం బాగా పెర్ఫార్మ్ చేయాలని, చెప్పిన థీమ్ కి చేసిన డాన్స్ కి పొంతన కుదరలేదని  జడ్జెస్ చెప్పారు.  

కృతి శెట్టితో డేట్ కి వెళ్తానని చెప్పిన యాంకర్ శివ!

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5  ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. ' క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్ ' లో అరియానా, దేత్తడి హారిక, రాహుల్ సిప్లిగంజ్, తేజస్విని- అమర్ దీప్ చౌదరి లని ఇంటర్వూ చేసి వారిని కొన్ని ఆసక్తికరమైన ‌ప్రశ్నలు వేసి ట్రెండింగ్ లో ఉంది. తాజాగా క్రేజీ టాక్స్ విత్ కాజల్ లో యాంకర్ శివని కొన్ని క్వశ్చన్స్ అడుగగా వాటికి సూటిగా సమాధానమిచ్చాడు. యాంకర్ శివ.. బిగ్ బాస్ తెలుగు ఓటిటి షోలో పాల్గొన్నాడు. దాంతో అందరికి పరిచయమయ్యాడు. బిగ్ బాస్ తర్వాత వివిధ చానెల్ లలో యాంకర్ గా చేసిన శివ, ఆ తర్వాత తన స్వంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి, ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఫేమస్ అయ్యాడు. అయితే జబర్దస్త్ షోకి గెస్ట్ గా వచ్చి, అనసూయ పొట్టి డ్రెస్ ఏంటని కామెంట్ చేయడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 ఎగ్జిట్ ఇంటర్వూ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అయితే తాజాగా కాజల్ లో జరిగిన ఇంటర్వ్యూలో.. డేట్ కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఎవరితో వెళ్తావని కాజల్ అడుగగా.. కృతి శెట్టి తో డేట్ కి వెళ్తానని శివ చెప్పాడు. యూట్యూబ్ ఛానెల్ వాళ్ళకి టిప్స్ చెప్పొచ్చుగా అని కాజల్ అడుగగా.. ఒక్కొక్కరికి ఒక్కో టిప్ చెప్పాడు శివ. కాగా ఈ వీడియోకి ' మంచి మంచి కోరికలే ఉన్నాయిగా' అని టైటిల్ తో కాజల్ ఈ వీడియోని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది.   

‘బలగం’ నటి రూపాలక్ష్మి వార్నింగ్ ఇచ్చిన ఆది!

ఢీ షో ఈ వారం బలగం నటి రూపాలక్ష్మి, ఆది కామెడీతో మంచిగా  ఎంటర్టైన్ చేసింది. ఈ షోలోకి దీపికా పిల్లి పెద్దమ్మగా వచ్చారు రూప..రావడంతోనే ఆది ఆమె మీద పంచులు వేసాడు. "ఏంట్రా నా కూతురి మీద డైలాగులు వేస్తున్నావ్ ...నువ్వు చెప్పిన అబద్దాలు వినడానికి నేను ఎలా కనిపిస్తున్నా" అని రూప అడిగేసరికి "మీకేం అత్తయ్య కత్తిలా ఉన్నారు..ఐనా మీ అమ్మాయే నా అందం చూసి లవ్ చేస్తోంది" అని అది అన్నాడు. "అసలు నువ్వెలా ఉన్నవో తెలుసా మా గొడ్ల సావిడిలో అప్పుడే ఈనిన గేదెలా ఉన్నావ్" అనేసరికి ఆమెను కూల్ చేయడానికి అన్నట్టు  "అత్తయ్య మీ బుగ్గల్ని ఎలా పెంచారు" అని అడగడంతో   రూప నవ్వేశారు. "అసలు వీడికి పనొచ్చో లేదో చూడాలి అని రూప ఆదికి ఒక క్లాత్ ఇచ్చి ఈ ఫ్లోర్ మొత్తం తుడువు..అందులో నా ముఖం కనిపించాలి" అనేసరికి "ప్రశాంతంగా పంచులేసుకునేవాడిని ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఐపోయింది" అన్నాడు ..ఇంతకాలో  దీపికా పిలిచి పెళ్లి చేసుకుందాం అనేసరికి ఆది రూప ముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడు.  "ఒసేయ్..ఒక ఆడదాన్ని ఢీ స్టేజి మీద తన్నానన్న అపకీర్తి నాకు రానివ్వకు" అనేసరికి దీపికా పిలిచి ఆదిని పెళ్లి చేసుకోనంటూ మాట మార్చింది. వెంటనే  ఆది రూప దగ్గరకు వచ్చి  పిల్లిలా వెళ్లి చేతులు కట్టుకుని నిలబడేసరికి "చేతికి చీపురు ఇచ్చి ఈ ఫ్లోర్ మొత్తం ఊడు" అని పనిష్మెంట్ ఇచ్చేసింది. ఇలా ఢీ స్టేజి మీద ఆది, రూప, దీపికా చిన్న స్కిట్ చేసి ఎంటర్టైన్ చేశారు. బలగం మూవీలో రూప లక్ష్మి నటన అద్భుతంగా ఉంటుంది. తన సహజ నటనతో ఆడియన్స్ ని అలరించారు రూప. అలాగే ఈ మూవీకి డైరెక్టర్ జబర్దస్త్ కమెడియన్ వేణు. బలగం మూవీ ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి.

పెళ్ళి తర్వాత మొదటిసారి వచ్చిన గౌతమ్, నందు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -225 లో.. భవాని సిద్ధాంతి గారు రాగానే.. రేవతిని తప్ప మిగత అందరూ ఇక్కడ నుండి వెళ్ళండని చెప్తుంది. కృష్ణ, మురారి గురించి సిద్ధాంతికి భవాని చెప్తుంది. అలా మంగళ సూత్రం తెగిపోయింది, దీని వళ్ళ ఏమైనా జరుగుతుందా అని అడుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండటానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమని భవాని చెప్తుంది. అలా జరగడం అనుకోకుండా జరిగింది. అంతే గాని దానివల్ల ఎవరికేం కాదని సిద్ధాంతి చెప్తాడు. వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలంటే మీరు రేపు పూజ జరిపించాలని సిధ్ధాంతి చెప్తాడు. ఆ తర్వాత రేపు వాళ్ళ ఇద్దరికి మళ్లీ మాంగల్యధారణ జరిపించాలని సిద్ధాంతి చెప్తాడు. దానికి భవాని సరేనని సంతోషపడుతుంది. రేవతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళని ఎవరు విడదీయ్యలేరని అనుకుంటుంది.. ముకుంద మాత్రం మళ్ళీ మాంగల్యధారణేంటి? మళ్ళీ ఇద్దరు కలిసిపోతారా అని టెన్షన్ పడుతుంది. సిద్ధాంతి వెళ్ళిపోయాక భవాని పూజకి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోమని రేవతి, ప్రసాద్ లకి చెప్తుంది. మరొకవైపు మేం సంతోషంగా ఉండాలని భవాని అత్తయ్య ఇలా చేస్తున్నారు.. మా మధ్య ప్రేమ లేదని తెలిస్తే ఎలా ఉంటుందోనని కృష్ణ బాధపడుతుంది. ఇన్ని రోజులు పెద్దత్తయ్య దృష్టిలో మంచి ఇంప్రెషన్ కొట్టేయలని ట్రై చేశాను, ఏకంగా ఇప్పుడు పెద్దత్తయ్య మనసులో స్థానం సంపాదించాను. ఇక నాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిస్తే  కోపంతో పాటు  బాధపడుతారని కృష్ణ అనుకుంటుంది. మరొకవైపు ఇంటికి ఎవరో వస్తున్నారని భవాని హడావిడి చేస్తుంది. అది చూసిన ప్రసాద్.. ఎవరు వస్తున్నారని భవానిని అడుగుతాడు. వస్తారుగా నువ్వే చూడని భవాని అంటుంది. ఆ తర్వాత మొదటిసారిగా నందు, గౌతమ్ ఇద్దరు భవాని ఇంటికి వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకోమని మురారిని పంపిస్తుంది భవాని. కృష్ణ నువ్వు హారతి తీసుకొని రా అని భవాని చెప్తుంది. ఆ తర్వాత నందు, గౌతమ్ లను గుమ్మం దగ్గర నిలుచోపెట్టి హారతి ఇస్తుంది కృష్ణ. ఇక మధు వాళ్ళని ఒకరి పేర్లు ఒకరు చెప్పండని సరదాగా అటపట్టిస్తాడు. వాళ్ళు ఇంట్లోకి రాగానే నందుని చూసి భవాని సంతోషపడుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. కృష్ణ మురారి ఏంటి డల్ గా ఉన్నారని నందు అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీలని భవాని పిలిచి.. ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని, రేపు పూజకి ఇద్దరు సిద్ధంగా ఉండమని చెప్తుంది. దానికి సరేనని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రౌడీల నుండి రిషిని కాపాడిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -831 లో.. రిషి ప్లెక్సీ షాప్ కి వెళ్లి అక్కడ తను, వసుధారల ఎంగేజ్మెంట్ ఫోటో చూసి షాక్ అవుతాడు. ఇక్కడ ఎందుకు ఉందని రిషి అడుగుతాడు. విష్ కాలేజీ బాయ్ వచ్చి ప్లెక్సీ కావాలన్నాడని అతను చెప్పగానే.. రిషి ఆలోచనలో పడతాడు. అంత అవసరం ఎవరికీ ఉంది నా గతం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత కాలేజీ బాయ్ ఫ్లెక్స్ షాప్ కి వస్తాడు. అక్కడ రిషి ని చూసి అక్కడే ఆగిపోయి శైలేంద్రకి ఫోన్ చేస్తాడు. శైలేంద్ర ప్లాన్ ఫెయిల్ చేసావని కాలేజీ బాయ్ ని తిడతాడు. కొందరు రౌడీలను పంపిస్తున్నాను. రిషి ని వాళ్లకి చూపించు అంతా వాళ్ళు చూసుకుంటారని శైలేంద్ర చెప్పగానే కాలేజీ బాయ్ సరేనని అంటాడు. మరొక వైపు వసుధార, మహేంద్ర కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఇప్పుడు రిషి ఎక్కడ ఉన్నాడని వసుధారని అడుగగా..  తెలియదని వసుధార చెప్పి .. ప్రిన్సిపల్ సర్ కి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది. రిషి ఫ్లెక్సీ షాప్ కి వెళ్ళాడని ప్రిన్సిపల్ చెప్తాడు. వాళ్ళిద్దరు ప్లెక్సీ షాప్ కి బయలుదేర్తారు. మరొక వైపు రిషి ప్లెక్సీ షాప్ ముందే కాలేజీ బాయ్ కోసం చూస్తుంటాడు. తనని ఈ పని ఎవరు చెయ్యమన్నారని అడిగి నిజం తెలుసుకోవాలని రిషి అనుకుంటాడు. అప్పుడే కొంతమంది రౌడీలు రిషి  దగ్గరికి వచ్చి కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ప్లెక్సీ షాప్ దగ్గరకి వసుధార, మహేంద్ర వస్తారు. అక్కడ ఉన్న అతను.. ఎవరో రౌడీలు తీసుకొని వెళ్తున్నారని చెప్పగానే.. ఆ రౌడీల వెనకాలే మహేంద్ర, వసుధార ఇద్దరు వెళ్తారు. వసుధార పోలిస్ లకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత  రౌడీలను రిషి కొడుతుండగా.. రౌడీ లు రిషి ముక్కుకి మత్తు ఇస్తారు. అప్పుడే వసుధార, మహేంద్ర లు రిషి దగ్గరికి వస్తారు. మహేంద్ర రౌడీలను కొడతాడు. పోలీసులు వచ్చే లోపు రౌడీలు పారిపోతారు. ఆ తర్వాత  మా ఇంటికి తీసుకొని వెళ్ళండి సర్ అని మహేంద్రకు వసుధార చెప్తుంది. సరే అని మహేంద్ర, వసుధార కలిసి ఇంటికి బయలుదేర్తారు. అప్పుడే మహేంద్రకి జగతి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది. జరిగిందేం చెప్పకుండా రిషి బాగున్నాడు. నువ్వు కంగారు పడకని జగతికి మహేంద్ర చెప్తాడు. మరొకవైపు శైలేంద్ర ప్లాన్ ఫెయిల్ చేసారని రౌడీలను తిడతాడు. ఆ తర్వాత రిషిని వసుధార ఇంటికి తీసుకొని వెళ్లి.. బెడ్ పై పడుకోబెట్టి రిషిని జాగ్రత్తగా చూసుకుంటుంది. కొద్దీ సేపటికి మైకం లో నుండి బయటకు వచ్చిన రిషి మహేంద్రని చూస్తాడు. డాడ్ మనం ఎక్కడ ఉన్నామని అడుగుతాడు. వసుధార వాళ్ళింట్లో అని మహేంద్ర అనగానే.. ఇక్కడ ఎందుకు ఉన్నాం వెళదాం పదండని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కావ్య వేసిన డిజైన్స్ కి డబ్బులు ఇచ్చిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -164 లో... రాజ్, కావ్య ఇద్దరు ఇంటికి రాగానే  కావ్యని కళ్యాణ్ పిలిచి తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉందని చెప్తాడు. ఆ తర్వాత కావ్య డల్ గా గదిలోకి వెళ్తుంది. ఏమైందని రాజ్ అడుగగా.. ఏం లేదని కావ్య చెప్తుంది. రాజ్ వెళ్లి ఏమైంది అని కళ్యాణ్ ని అడుగుతాడు. వదిన వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, ఇల్లు కూడా తాకట్టులో ఉందంట హెల్ప్ చేస్తానంటే వద్దంటుందని కళ్యాణ్ అంటాడు. ఎందుకు హెల్ప్ తీసుకుంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య రాత్రి డిజైన్స్ వేస్తుంటుంది కానీ డిజైన్స్ ఆలోచనలు రాక పేపర్స్ అన్ని వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ నిద్ర నుండి లేచి ఆ వేస్ట్ చేసిన పేపర్స్ చూసి చాలా బాగున్నాయి డిజైన్స్ అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. అసలేంటి ప్రాబ్లమ్ అని కావ్యని రాజ్ అడుగుతాడు. అయిన కావ్య చెప్పకుండా పడుకుంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కావ్య టీ కోసం వెయిట్ చేస్తుంటారు. కావ్య పరధ్యానంలో ఉండి ఒకరికి ఇచ్చేది మరొకరికి ఇస్తుంది. దాంతో అందరూ ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతారు. ఏం లేదని చెప్పేసి కావ్య వెళ్లిపోతుంది. అదంతా రాజ్ పై నుండి చూస్తాడు. మరొకవైపు కనకం కృష్ణమూర్తి ఇద్దరు ఇల్లు అమ్ముతున్నందుకు బాధపడుతుంటారు. సొంత ఇల్లు అనేది ఒక మధ్యతరగతి వాడి ఆశయమని కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు. మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొక వైపు రాజ్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే కావ్య వచ్చి.. మిడిల్ క్లాస్ కి అవసరమైన డిజైన్స్ ఎలా ఉండాలో ఇదిగొండని, తను వేసిన డిజైన్స్ చూపిస్తుంది. ఆవి చూసిన రాజ్ బాగున్నాయంటూ కావ్యకి చెప్తాడు. వీటి గురించి వివరించాలి ఆఫీస్ కి పదా అని రాజ్ అనగానే.. లేదు నాకు పని ఉందని కావ్య అంటుంది. రాజ్ వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి కావ్యకి ఇవ్వగా, ఎందుకని కావ్య అడుగుతుంది. డిజైన్స్ వేసావ్ గా అందుకే అని రాజ్ అంటాడు. అవి నేను ఫ్రీగా వేసానని కావ్య అనగానే.. ఫ్రీగా తీసుకొనే అలవాటు నాకు లేదని డబ్బులు ఇస్తాడు రాజ్. కావ్య ఆ డబ్బులు తన ఫ్యామిలీకి ఇవ్వాలని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కళ్యాణ్ కి ఒక కొరియర్ వస్తుంది. అభిమాన పాఠకురాలు అనే పేరుతో రావడంతో.. కావ్య ఆ కొరియర్ ని తీసుకొని చదువుతానని అటపట్టిస్తుంది. వద్దంటూ కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మావ-కోడళ్ల ఫైట్స్ తో కొత్త సీరియల్ త్వరలో స్టార్ మాలో  మావగారు

  స్టార్ మా అంటే చాలు కలర్ ఫుల్ ఈవెంట్స్ మాత్రమే కాదు మంచి జోష్ ఉన్న సీరియల్స్ అని కూడా తెలుసు. ఆడియన్స్ స్టార్ మా సీరియల్స్ ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ప్రసారమయ్యే సీరియల్స్ కంటెంట్ కావొచ్చు రేటింగ్ కావొచ్చు ఆ రేంజ్ లోనే ఉంటాయి మరి. ఇక ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి పట్టాలెక్కబోతోంది. అదే "మామగారు". దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో "దేవత" సీరియల్ ఫేమ్ లీడ్ రోల్ చేస్తోంది . అప్పట్లో  'దేవత' సీరియల్ ... అందులో నటించిన సుహాసిని ఎంతో మందికి నచ్చేసింది. ఈ సీరియల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సుహాసిని లీడ్ రోల్ లో చేసినా  లేడీ ఓరియెంటెడ్ సీరియల్ ని లైన్ లోకి తీసుకొస్తోంది స్టార్ మా.   ఇక ఈ మూవీ ప్రోమోలో ఉన్న కంటెంట్ ని పరిశీలిస్తే ప్రతీ ఇంట్లో జరిగే విషయాన్నే చూపించారు. ఇంటికి వచ్చే కోడళ్ళు ఇంటి పనులే చేయాలి తప్ప ఉద్యోగాలు చేయడానికి కాదు అనుకునే మావయ్యని ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలు సుహాసిని  ఎలా మార్చిందో చెప్పే  లైన్ తో ఈ స్టోరీ రాబోతోంది. "పెళ్ళైపోతే ఆడపిల్ల పుట్టింటికి ఏమీ చేయకూడదా" అని సుహాసిని అత్తగారిని ప్రశ్నించే లైన్ చాలా హైలైట్ గా ఉంది. ఇక పొతే ఈ సీరియల్ ఎప్పుడు, ఎన్నింటికి ప్రసారమవుతుంది అనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఇప్పటికే ఆడియన్స్ చూస్తున్న ఎన్నో సీరియల్ టైమింగ్స్ ని మార్చేసింది స్టార్ మా . ఇక ఇప్పుడు ఏ సీరియల్ ని ఏ స్లాట్ లోకి మార్చేస్తుందో..ఏ టైములో ఈ మావగారు సీరియల్ ని ప్రసారం చేస్తుందో అని ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. దేవత సీరియల్ తర్వాత సుహాసిని ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇన్ని రోజులకు తెర మీద కొత్త సీరియల్ తో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం తమ స్టయిల్లో  కామెంట్స్ చేస్తున్నారు. "అన్ని సీరియల్స్ లో అత్తా- కోడళ్ల గొడవలు ఐతే... ఈ సీరియల్ లో మామ- కోడళ్ల ఫైట్స్ అన్నమాట.. తెలుగు హీరోస్ ఎవరూ లేరా ? తమిళ్ హీరో ని తీసుకొచ్చారు. ఏ సీరియల్ అయ్యేటట్లు లేదు. మరి ఈ కొత్త సీరియల్ ని ఏ  టైం లో ప్రసారం చేస్తారో ?" అంటున్నారు.

ముందు ఫ్రెండ్..తర్వాత వైఫ్ అన్న అమర్ ..ఇంటికి రా నీ పని చెప్తా అన్న తేజు

'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి జోష్ తో కనిపిస్తోంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భాన్ని పురస్కరించుకుని "ఫ్రెండ్ షిప్ డే స్పెషల్" గా  ఈ ప్రోమోని డిజైన్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ కి  అమర్ దీప్  - మానస్ , తేజస్విని గౌడ - సుహాసిని , ముక్కు అవినాశ్-కెవ్వు కార్తిక్, అనపూర్ణమ్మ- శ్రీలక్ష్మీ, బేబీ క్రితిక- సహృద, నోయెల్- వితికా శేరు వచ్చి ఆడియన్స్ అలరించారు. ఈ సందర్భంగా అమర్‌ను సరదాగా ఆట పట్టించింది శ్రీముఖి. "నీ పెళ్లాం కోసం వచ్చావా నిజంగా నీ ఫ్రెండ్ మానస్ కోసం వచ్చావా" అని అడిగేసరికి "ఫస్ట్ అయితే ఫ్రెండ్ కోసం వచ్చా ఆ తర్వాతే పెళ్లాం" అని అమర్ అనేసరికి అక్కడే ఉన్న  తేజు " ఇంటికి రా చెప్తా" అని  సరదాగా ఆట పట్టించింది. తర్వాత సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ- శ్రీలక్ష్మి వచ్చారు. "రెండు కొప్పులు ఒక దగ్గర ఉండలేవు ..ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావు" అని అన్నపూర్ణమ్మను శ్రీముఖి  అడిగేసరికి "ఆమెది కొప్పు నాది ఇది" అని తన జుట్టును చూపించారు శ్రీలక్ష్మి. బుల్లితెర మీద నటించే  అమర్ దీప్, మానస్  మంచి ఫ్రెండ్స్. అమర్ వైఫ్  తేజు-మానస్ కలిసి  'కోయిలమ్మ' అనే సీరియల్ లో నటించారు. అలా వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. చాల సందర్భాల్లో వీళ్లంతా కలిసి కనిపిస్తూనే ఉంటారు. ఐతే మానస్ ఇప్పుడు  'బ్రహ్మముడి' సీరియల్ లో రాజ్‌గా నటిస్తున్నాడు. ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. అమర్ దీప్ మాత్రం ప్రియాంక జైన్ తో కలిసి  'జానకి కలలగనలేదు' సీరియల్ లో రామ రోల్ లో అమాయక భర్త పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అమర్ దీప్- తేజు జోడి 'నీతోనే డ్యాన్స్' షోలో ఇరగదీసే పెర్ఫార్మెన్సెస్ చేస్తూ ప్రతీ వారం టాప్ పొజిషన్ లో ఉంటున్నారు. అలాంటి ఈ ఫ్రెండ్స్ అంతా రేపు ఆదివారం రాబోయే షోలో ఎంటర్టైన్ చేయబోతున్నారు.  

ఈ భూమ్మీద అసలైన అప్సరస తనేనంట!

   బిగ్ బాస్ లో గ్లామర్ కి  కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచిన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ సీజన్-6 లో తన అందంతో ఆకట్టుకొని అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చిన ఈ గ్లామర్ క్వీన్ వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది...హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. ప్రస్తుతం బీబీ జోడీలో అర్జున్ కి జంటగా వాసంతి జత కట్టి అందరిని తన డాన్స్ తో తన వైపుకి తిప్పుకుంది. ప్రస్తుతం వాసంతి వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు"అనే సీరియల్ లో ముఖ్యమైన పాత్రలో చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇదే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటు వస్తుంది వాసంతి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా శ్రీసత్యతో, వాసంతి చేసిన డాన్స్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే వాసంతి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. నిన్న రాత్రి ఒక పబ్ లో ఇనయా, వాసంతి కలిసి ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరు కలిసిన వీడీయోలని ఇనయా, వాసంతి తమ తమ‌ ఇన్ స్టాగ్రామ్ లలో షేర్ చేశారు. అయితే తాజాగా వాసంతి తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫ్యాన్ తనని పొగుడుతూ  చేసిన  పోస్ట్ ని షేర్ చేసింది. " రంభ, ఊర్వశి, మేనకలను దేవతలంతా అప్సరసలని అంటారు. కానీ భూమ్మీద అసలైన అప్సరస ఉంది " అని ఒక ఫ్యాన్ వాసంతి ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడంతో.. ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది వాసంతి. ఇలా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది వాసంతి. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.   

ఇప్పుడు సోహెల్ ప్రెగ్నెంట్ అంట.. మరి డ్యాన్స్ చేయోచ్చా!

   జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లగ్స్  అప్లోడ్ చేయగా అత్యధిక వీక్ష ముక్కు అవినాష్ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. దాంతో అతనికి మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. దాంతో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ముక్కు అవినాష్, అతని భార్య కలిసి 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అని చేసిన వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వస్తువున్నాయి. తాజాగా తన ఫ్రెండ్ మెహబూబ్ బర్త్ డే వేడుకలలో సోహెల్ , అవినాష్  ఇంకా అతడి ఫ్రెండ్స్ సందడి చేశారు. అయితే ఈ పార్టీలో సోహెల్  డాన్స్ చేస్తూ ఉండడం చూసిన అవినాష్.. " సోహెల్ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా.. డాన్స్ చెయ్యొచ్చా "  అని అనగానే సోహెల్ షాకింగ్ ఎక్స్ప్రెషెన్ ఇచ్చాడు. ఇలా అవినాష్ అనడానికి కారణం లేకపోలేదు. అసలు విషయానికి వస్తే సోహెల్  నటించిన ' మిస్టర్ ప్రెగ్నెంట్ ' అనే మూవీ త్వరలో రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషనల్ లో భాగమో లేక సరదాగా ఆటపట్టించడానికి అవినాష్ అలా అన్నాడో  తెలియదు. కానీ సోహెల్ మాత్రం ఆశ్చర్యపోయాడు. అయితే వాళ్ళు డాన్స్ చేస్తున్న వీడియోని అవినాష్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అయితే సోహెల్ నటించిన ' మిస్టర్ ప్రెగ్నెంట్ ' సినిమా గురించి తెలియనివాళ్ళు.. ఏంటి సోహెల్ ప్రెగ్నెంటా అని ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

టమాటల కోసం కష్టపడుతున్న యాంకర్ రవి!

బుల్లితెర టీవీ యాంకర్స్ లో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని పంచ్ లకి, మాటలకి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉంది. రవి వేసే స్పాంటేనియస్ కామెడీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. యూత్ కి బాగా కనెక్ట్ అయి ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటాడు రవి.  బిగ్ బాస్-5 లో ఎంట్రీ ఇచ్చిన రవికి.. హౌస్ లో పాజిటివ్ ఇంప్రెషన్ కన్నా నెగెటివ్ ఇంప్రెషనే ఎక్కువ వచ్చింది‌. ఏం వచ్చిన  ఫేమ్ అయితే వచ్చిందనే చెప్పాలి. రవి ఎంట్రీతో బిగ్ బాస్ విన్నర్ అతనే అని మొదట్లో అనిపించినా.. తను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బిహేవ్ చేసిన దానికి అదంతా తలకిందులై అనుకోకుండా రవి బయటికొచ్చేసాడు. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఫ్యామిలీ వీక్ లో.. రవి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎమోషనల్ గా సాగిన ఎపిసోడ్, మోస్ట్ ఎమోషనల్ ఇన్ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. రవి యాంకరింగ్ అంటేనే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రేక్షకులను తన మాటలతో ఉత్తేజపరుస్తాడు. రవి తన యూట్యూబ్,ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. ఎవరైనా నెగెటివ్ కామెంట్లు చేస్తే ఘాటుగానే రిప్లై ఇస్తాడు. అమెరికాలో ట్రావెలింగ్ వ్లాగ్, ఫుడ్ వ్లాగ్ అంటు బిజీగా గడిపిన యాంకర్ రవి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. కాగా ఇండియాకి వచ్చాక కూడా అదే జోరుని కొనసాగిస్తున్నాడు. ట్రెండింగ్ లో ఏది ఉంటే దానికి సంబంధించిన రీల్స్, వ్లాగ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా రవి మార్కెట్ కి వెళ్లి మార్కెట్ మొత్తం తిరుగుతున్న ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. " నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను.. భయంకరమైన వేడి నుండి ప్రాణాలతో ఎలా బయటపడాలో, నేను మీకు చూపించబోతున్నాను " అంటూ ఎండలో తిరుగుతూ ఒక ఆడియో క్లిప్ కి యాక్ట్ చేసి చూపించాడు.  టమాటల ధర అధికంగా ఉండటంతో వాటి కోసం వెతుకుతున్నట్టుగా ఈ వీడియోకి సింక్ చేయడంతో.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి యాంకర్ రవి చేసిన వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. యాంకర్ రవి జీతెలుగులో ప్రసారం కానున్న ఒక కొత్త షోకి యాంకర్ గా చేస్తున్నట్టు, దానికి సంబంధించిన విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.  

ఎందుకంత ద్వేషం...అసలా గుంపును రెచ్చగొట్టిన వాళ్లెవరు...బాధపడుతున్న ఝాన్సీ

ఫస్ట్ జనరేషన్ స్టార్ యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. అప్పట్లో  సుమ, ఉదయభాను, ఝాన్సీ ఫుల్ ఫార్మ్ లో ఉండేవాళ్ళు. వీళ్ళను  చూస్తే చాలు ఆడియన్స్ లో ఫుల్ జోష్ వచ్చేది. "టాక్ ఆఫ్ ది టౌన్" షో ఝాన్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరించారు కూడా. యాంకరింగ్ చేస్తూనే నటిగా కూడా ఈమె మంచి సక్సెస్ ని అందుకున్నారు. అలాంటి ఝాన్సీ లైఫ్ లో కొన్ని ఇష్యూస్  కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆమె యాంకరింగ్ ఒకప్పుడు టాప్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియా వాడకం పెరిగాక ఝాన్సీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తనకు సంబంధించిన అప్ డేట్స్ ని  ఆడియన్స్ తో ఈ మాధ్యమం ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాంటి ఒక ఇష్యూ మీద ఇప్పుడు ఆమె స్టేటస్ పెట్టుకున్నారు. మణిపూర్ ఎంత అల్లకల్లోలంగా ఉందో అందరికీ తెలుసు..దాని మీద మోడీ ఒక్క మాట మాట్లాడకపోవడం పై విపక్షాలు కూడా రగడ చేస్తున్నాయి. రీసెంట్ గా విపక్షాల నుంచి కొంత మంది మణిపూర్ వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించిన  విషయం తెలిసిందే. అలాంటి ఇష్యూ మీద ఝాన్సీ "మణిపూర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో అసలెందుకు అంత ద్వేషం ? అసలెవరు ఈ గుంపును రెచ్చగొట్టింది. దీని వెనక వున్న రాజకీయ అజెండా ఏమిటి ..అసలు నేను ఈ విషయం మీద ఎలా స్పందించాలో తెలీడం లేదు ..ఆ ప్రాంతాల్లో శాంతి, సమానత్వం, ఓర్పు ఉండేలా ప్రార్ధించడం తప్ప" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తన లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు ప్రపంచ విషయాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు ఝాన్సీ. అలాగే తన ఇంటి పెరట్లో పండించే కూరగాయల గురించి ఎప్పుడెప్పుడు ఎం పండాయో కూడా చెప్తూ పోస్టులు పెడతారు ఝాన్సీ. జయం మనదేరా, సోంతం, యగ్నం, తులసి, అష్టా చెమ్మ మూవీస్ లో మంచి మంచి గుర్తుండిపోయే రోల్స్ చేశారు.  

జంతువుల్లా ప్రవర్తించాలి...

హంసానందిని కాన్సర్ ఫైటర్ గా అందరికీ తెలిసిన నటి. "లౌక్యం" మూవీతో  టాలీవుడ్‌కు పరిచయమై ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. రాజమౌళి మూవీ "ఈగ" తో ఓ రేంజీలో పాపులారిటీ తెచ్చుకుంది. పవన్‌తో "అత్తారింటికి దారేది" చిత్రంలో అదిరిపోయే స్టెప్పులతో తెలుగు ఆడియన్స్ ని బాగా అలరించింది. హీరోయిన్‌గా కాకపోయినా స్పెషల్ సాంగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హంసానందిని క్యాన్సర్ వ్యాధి బారిన పడి ప్రస్తుతం కోలుకుని మళ్ళీ కం బ్యాక్ ఇచ్చింది. అలాంటి హంసానందిని రీసెంట్ గా వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసిన హంసానందిని తన స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "సముద్రంలో కానీ బీచ్ లో కానీ జంతువులు ఎలాంటి వేస్ట్ ని వదిలేయవు. ఒక్క మనుషులే అలా చెత్తను వదిలి వెళ్తారు. మనుషుల్లా కాదు జంతువుల్లా ప్రవర్తించాలి" అనే కాప్షన్ పెట్టింది. అలాగే చందమామని ఫోటో తీసి ఆ చంద్రుడికి తనదైన స్టైల్లో వర్ణింస్తూ  పోస్ట్ పెట్టింది. "తనను ఫోన్ లో  బంధించడాన్ని చంద్రుడు అస్సలు ఇష్టపడడు. కానీ ఎందుకో తెలీదు అందరూ చంద్రుడిని చూడగానే మైమరిచిపోతారు ..మన ఎదురుగానే ఉంటాడు, మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు...కానీ అతన్ని మనం చేరుకోలేనంత దూరంలో ఉంటాడు" అని రొమాంటిక్ కాప్షన్ పెట్టింది. హంసానందిని ప్రస్తుతం తన మైండ్ ని, బాడీని ఇలా ప్రకృతిలో విహరిస్తూ రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.  హంసానందిని వంశీ డైరెక్షన్ లో  వచ్చిన 'అనుమానస్పదం' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మిర్చి, భాయ్, రామయ్య వస్తావయ్యా వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కొంత కాలం క్రితం  కేరళ మున్నార్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించింది హంస. ఇక ఇన్స్టాగ్రామ్ లో స్వాన్ స్టోరీస్ పేరుతో తన ఆలోచలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.