ఆదిని కిడ్నాప్ చేసిన లేడీస్...పెళ్ళెప్పుడు అని అడిగిన మహిళా రైతులు
బుల్లితెర అంటే చాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ కి అస్సలు కొదువే ఉండదు. ఎన్నో షోస్ ఉన్నాయి. కానీ వాటిల్లో సూపర్ గా కామెడీతో కలిపి ఎంటర్టైన్ చేసేది జబర్దస్త్ ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో ఆది చేసే కామెడీ పంచెస్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి ఆది మీద లేడీస్ వైపు నుంచి చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి లేడీస్ అంతా కలిసి ఆది మీద తిరగబడ్డారు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో చాలామంది సీనియర్ యాక్టర్స్ కనిపించారు. జయవాణి, ప్రీతి నిగమ్, శిల్పా చక్రవర్తి, భావన లాంటి సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తో పాటు ప్రస్తుతం చేస్తున్న యాంకర్స్ కూడా ఉన్నారు. వీళ్లందరితో కలిపి చేసిన ఈ షో నెక్స్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. అది కూడా ‘ఆది కిడ్నాప్’ అనే కాన్సెప్ట్ తో వస్తోంది.
ఆడవాళ్ల మీద పంచ్ లేస్తున్నాడని, ఆడవాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదని.. ఆడాళ్లంతా కలిసి ఆదిని కిడ్నాప్ చేసి, సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. చేతిలో చీపురు కట్టలు, కర్రలు కూడా తీసుకొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చేసారు. అది చూసిన ఆది " మీరంతా నిజంగా ఎంటర్‌టైన్ చెయ్యండి.. సారీ ఏంటి ?.. పొర్లుదండాలు పెడతాను" అంటూ వాళ్లకు రివర్స్ లో సవాలు విసిరాడు ఆది.. అలాగే ఈ షోలో శిల్పా చక్రవర్తి, భావన తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసాడు. డిఫరెంట్ టాస్కులు, పెర్ఫార్మెన్సులతో అదరగొట్టేసాడు. చిన్నప్పుడు అందరూ ఆడుకున్న "మా తాత ఉత్తరం" కాన్సెప్ట్ గేమ్ కూడా అలరించింది. ఇక ఫైనల్ గా పొలం పనులు చేసే మహిళలు కూడా "ఆది నీ పెళ్లెప్పుడు" అని అడగడం హైలెట్ గా నిలవబోతోంది ఈ షోలో .