దుగ్గిరాల కుటుంబ పరువు కోసం కావ్యకి అపర్ణ వేసిన శిక్షేంటి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌లో కావ్య వాళ్ళ అమ్మనాన్న(కనకం, కృష్ణమూర్తి) ల దగ్గరికి అపర్ణ వస్తుంది. కావ్య ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీరే ఆపాలి లేదంటే మీ కూతురిని మీ ఇంటికి తెచ్చి పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటివి జరిగితే నేను అస్సలు సహించను. ఇది బ్లాంక్ చెక్.. మీకు నచ్చినంత రాసుకోండి. కానీ కావ్య మాత్రం డబ్బు సమస్య అంటూ మళ్ళీ మీ ఇంటి గడప తొక్కకూడదని అపర్ణ చెక్ ఇచ్చేసి వెళ్తుంటే.. కనకం తనని ఆపుతుంది. మాకు కూటికి గతి లేకపోయినా పరాయి సొమ్ము గురించి ఆశపడం, కావ్య మీ ఇష్టంతోనే చేసిందని చెప్పడం వల్లే ఇక్కడికి రానిచ్చామని చెప్తుంది కనకం. ఇకపై మీ పరువు తీసే పని ఏదీ కావ్య చేయదని అపర్ణతో కనకం చెప్తుంది.
అపర్ణ వెళ్ళిన తర్వాత కనకం, కృష్ణమూర్తి బాధపడతారు. మరొకవైపు రాహుల్, రుద్రాణి కలిసి రాజ్, కావ్య, అపర్ణల మధ్య చిచ్చు పెట్టినట్టుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిల దగ్గరికి కావ్య పని చేయడానికి వస్తుంది. నువ్వు ఈ పని ఆపేసి మీ ఇంటికి వెళ్ళిపోమని, రేపటి నుంచి రావొద్దని కృష్ణమూర్తి అంటాడు. నేను ఇక్కడికి రావడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుందని కావ్య అడుగగా.. మీ అత్తగారి కుటుంబానికి పరువు నష్టం జరుగుతుందని కృష్ణమూర్తి అంటాడు. నేను మీడియా వాళ్ళని పిలిచి నిజమేంటని చెప్పేశాను, వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అని కావ్య అనగా.. అర్థం చేసుకోలేదు అపార్థం చేసుకున్నారని కనకం అంటుంది. అసలేం జరిగిందని కావ్య అడుగగా.. అపర్ణ వచ్చిందని, నువ్వు ఇక్కడ పనిచేయడం వల్ల వాళ్ళకి పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయని చెప్పిందని, చెక్ ఇచ్చిందని కావ్యతో కనకం చెప్తుంది. అప్పుడే కాంట్రాక్ట్ ఇచ్చిన అతను వచ్చి.. మీరు ఆ పనిని ఆపేయాలని ఆ కాంట్రాక్టర్ చెప్తాడు. మరి అడ్వాన్స్ అని కనకం అడుగగా.. అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అతను అంటాడు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని మీకు ఎవరు చెప్పారని కావ్య అడుగగా.. మీ ఆయన రాజే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడని అతను అంటాడు. ఆ తర్వాత కావ్య వాళ్ళింటి నుండి అత్తారింటికి వెళ్తుంది.
మరొకవైపు తన అభిమాన పాఠకురాలి కోసం కళ్యాణ్ వెతుకుంటాడు. అప్పుడే అప్పుకి అనామిక కాల్ చేస్తుంది. హలో బ్రో.. నువ్వు పక్కనుండి కూడా ఇంత కష్టపడాలా అని అనామిక అనగా.. నేను కనుక్కుంటానని అప్పు అంటుంది. మరొకవైపు కావ్య కోసం దుగ్గిరాల ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూస్తారు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యని అపర్ణ ఆపుతుంది. ఇదేనా సరిదిద్దుకోవడం అని అపర్ణ అడుగుతుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మాకొక విషయం చెప్పాలి కదా అని సుభాష్ అంటాడు. అంత భాద్యతగా ఆలోచించే మనిషే అయితే పుట్టింటికి వెళ్ళి మన పరువు ఎందుకు తీస్తుందని అపర్ణ అనగానే.. అందుకేనా మీరు మా ఇంటికి వెళ్ళి మా అమ్మవాళ్ళని బెదిరించారని, నన్ను అక్కడికి వెళ్ళవద్దని వాళ్ళని అవమానించారని కావ్య అంటుంది. మా పరువుతీసావ్ నాకెంత కోపం రావాలని అపర్ణ అంటుంది. ఈ ఇంటి కోడలిగా ఉండాలంటే ఇక్కడ ఉన్న అందరికి నచ్చినట్టే ఉండి తీరాలని అపర్ణ అంటుంది. నేను నా నిర్ణయాన్ని మార్చుకోనని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.