ఆ విషయం గురించి ఏంజిల్ ని అడగడానికి రిషి ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -843 లో... రిషి ఏంజెల్ కి టైమ్ కి తిని హ్యాపీగా ఉండమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏంజిల్ కి వసుధార ఫోన్ చేస్తుంది. పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? నీకు ఎవరైనా నచ్చారా అంటూ వసుధార అడుగుతుంది. మనకి నచ్చినట్టు ఎలా తెలుస్తుందని ఏంజిల్ అడుగుతుంది. మనల్ని అర్థం చేసుకునేలా ఉండాలంటూ కొన్ని విషయాలు వసుధార చెప్తుంది. సరే ఏదైనా ఉంటే నీకు చెప్తానని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరికి ఏంజిల్ వెళ్లి.. టాబ్లెట్స్ ఇస్తుంది. పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా అని  విశ్వనాథ్ అడుగుతాడు. ఆలోచిస్తానని ఏంజిల్ చెప్పగానే విశ్వనాథ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంజిల్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరికి రిషి వస్తాడు. ఏంజిల్ ఏంటో ఆలోచిస్తానని అంటుంది.. ఏంటని రిషి అడుగుతాడు. ఇన్ని రోజులు పెళ్లి టాపిక్ వస్తే కోప్పడేది కానీ ఇప్పుడు ఆలోచిస్తానని అంటుందని విశ్వనాథ్ హ్యాపీగా రిషికి చెప్తాడు. మరొకవైపు పాండియన్, అతని స్నేహితులు కలిసి కాన్ఫరెన్స్ లో రిషి చెప్పిన వర్క్ చేస్తూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. అప్పుడే రిషి వాళ్ళకి ఫోన్ చేసి.. మీరు పంపించిన వర్క్ బాగుందంటు చెప్తాడు. ఆ తర్వాత రిషి విశ్వనాథ్ మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎలాగైనా రేపు వసుధారతో ఏంజెల్ గురించి మాట్లాడాలని రిషి అనుకుంటాడు.. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం.. వసుధార క్లాస్ లో ఉండగా రిషి క్లాస్ ముందు నిలబడి.. వసుధారని చూస్తాడు. వసుధార చూడగానే వెళ్ళిపోతాడు.  మేడం మీతో మాట్లాడాలని వసుధారకి రిషి మెసేజ్ చేస్తాడు. వసు కావాలనే రిషితో ఇందాక మీరు క్లాస్ ముందు సైట్ కొట్టినట్లు చూస్తున్నారని వసుధార అనగానే.. సైట్ కొట్టడాలు, కన్ను కొట్టాడాలు, నాకేం తెలియవని రిషి అంటాడు. మీతో మాట్లాడాలి వెళ్ళేటప్పుడు కలవండని వసుధారకి మెసేజ్ చేస్తాడు రిషి.  ఆ తర్వాత వసుధార కాలేజీ అయిపోయాక బయటకు వస్తుంది. రిషి కార్ వసుధార ముందు ఆపి డోర్ తియ్యగానే వసుధార కార్ ఎక్కుతుంది. ఏంజిల్ ఎవరైనా ఇష్టపడుతుందా అని కనుక్కోండని వసుధారతో రిషి అంటాడు. ఏంజిల్ మీ ఫ్రెండే కదా ? మీరు అడుగవచ్చు కదా అని వసుధార అంటుంది. ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని నేను అడగలేనని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

నందు, గౌతమ్ ల మీద డౌట్ పడిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -237 లో.. కృష్ణ ఇంట్లో నుండి వెళ్లిపోతు అందరికి జాగ్రత్తలు చెప్తుంది. భవాని దగ్గర కృష్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామని కృష్ణ అంటుంది. మధు సెల్ఫీ తీస్తుండగా నందు ఎక్కడ అని గౌతమ్ అడుగుతాడు. నందు టాబ్లెట్స్ వేసుకోవడానికి వెళ్ళిందని మురారి చెప్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత ఫోటో గ్రాఫర్ వచ్చి కృష్ణకి ఫొటోస్ ఇస్తాడు. ఈ ఫోటోలు ఎందుకు ఆల్బమ్ చేయిస్తున్నాం కదా అని కృష్ణని భవాని అడుగుతుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను కదా అందుకే ఈ ఫోటోస్ తెప్పించుకున్న అని కృష్ణ అంటుంది. నువ్వు క్యాంపుకి పదిరోజులు మాత్రమే వెళ్తున్నావ్? ఎందుకు ఇంత హడావుడి అని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి వెళ్తున్నా అని ఎమోషనల్ గా ఇంటి నుండి బయల్దేరుతుంది. మరొక వైపు నందు డోర్ తియ్యండంటూ అరుస్తుంది. అప్పుడే భవాని వెళ్లి డోర్ తీస్తుంది. నిన్ను ఎవరు లోపల ఉంచి బయట గడియపెట్టారని నందుని భవాని అడుగుతుంది. నేనే పెట్టాను అత్తయ్య.. లోపల నందు ఉన్నది చూడలేదని గౌతమ్ అంటాడు. నేను వాష్ రూమ్ వాడుకోవడానికి లోపలికి వెళ్ళాను వచ్చేలోపు గౌతమ్ డోర్ పెట్టినట్టున్నాడని నందు అంటుంది. వాళ్ళిద్దరు చెప్పింది భవాని విని.. మీరు అబద్ధం చెప్తున్నట్లు అనిపిస్తుందని అంటుంది. లేదు అత్తయ్య నిజమే చెప్తున్నామని గౌతమ్ అంటాడు. కృష్ణ బ్యాగ్ కీ నా దగ్గరే ఉంది వెళ్లి ఇచ్చేసి వస్తానని నందు, గౌతమ్ లు బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత భవాని.. వీళ్ళు ఏదో నాకు అబద్ధం చెప్తున్నారా అని ఆలోచిస్తుంది. మరొకవైపు ఇదంతా నీ వల్లే.. మురారి విషయం కృష్ణకి చెప్పేటప్పుడు నా పక్కనే ఉండమాని చెప్పాను కదా అని గౌతమ్ పై నందు కోప్పడుతుంది. కృష్ణ నెంబర్ నీ దగ్గర ఉంటే ఫోన్ చెయ్ అని గౌతమ్ అనగానే.. నందు ఫోన్ లో ఛార్జింగ్ ఉండదు. మరొక వైపు నందుకి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పాను.. తను అసలు నమ్మట్లేదని కృష్ణతో మురారి చెప్తాడు.  ఆ తర్వాత కృష్ణకి నందు వాయిస్ మెసేజ్ చేస్తుంది. " నువ్వు వెళ్లిపోకు కృష్ణ.. నువ్వంటే మురారికి బాగా ఇష్టం" అని మెసేజ్ చేస్తుంది. మరొక వైపు కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో అందరని నేను మోసం చేశానని అనుకుంటారు. మన అగ్రిమెంట్ గురించి ఇంట్లో ఎవరికి చెప్పకుండా నన్ను ఇంట్లో వాళ్ళ దృష్టిలో మోసం చేసిందని అనుకునేలా చేశారని మురారితో కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఇటు అనామిక కోసం కళ్యాణ్ తిప్పలు.. అటు ప్రెగ్నెంట్ కావాలని స్వప్న తాపత్రయం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -176 లో.. కావ్య తన పుట్టింటికి వెళ్ళకూడదని, కావ్య వచ్చేముందు నూనె పోసిన వీడియోని రాజ్ కి చూపిస్తుంది. ఈ వీడియో బయటకు చూపించకుండా ఉండాలంటే.. ఏం చెయ్యాలని కావ్యని రాజ్ అడుగుతాడు. టైం వచ్చినపుడు చెప్తానని కావ్య అనేసి వెళ్ళిపోతుంది. అంటే అవసరం ఉన్నపుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందా అని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు అనామిక అడ్రెస్ వెతుక్కుంటూ.. అప్పు, కళ్యాణ్ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వస్తారు. ఇదేంటి అనామిక అడ్రెస్ ఇది చూపిస్తుందంటూ లోపలికి వెళ్తారు. లోపల ఉన్న డాక్టర్ కళ్యాణ్ ని చూసి తలతిక్కగా మాట్లాడి అనామిక ఇచ్చిన లెటర్ ని ఇస్తాడు. అందులో.. "నా లెటర్ వచ్చినట్లు, నా ఫోన్ నెంబర్ వచ్చేలా మీరే తెలుసుకోవాలి" అని అనామిక రాసిన లెటర్ లో ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఒక కవిత రాయాలన్నమాట అని కళ్యాణ్ అనుకుంటాడు. మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అయి కిందకి వచ్చి సీతారామయ్య, ఇందిరాదేవీల ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత ఫోన్ లో ఆటో బుక్ చేసుకుంటుండగా.. సీతారామయ్య చూసి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఆటో బుక్ చేస్తున్నానని కావ్య చెప్పగానే.. నువ్వు ఆటోలో వెళ్లడమేంటి? రాజ్ తీసుకెళ్తాడు అని చెప్తాడు. రాజ్.. నువ్వు రోజు కావ్యని తన పుట్టింట్లో దింపి ఆఫీస్ కి వెళ్ళాలని సీతరామయ్య చెప్తాడు. దానికి రాజ్ సరేనని చెప్పి, కావ్యని తీసుకొని బయల్దేరతాడు. ఆ తర్వాత రాజ్, కావ్యల మధ్య ఎప్పుడు జరిగే టామ్ అండ్ జెర్రీ మాటల యుద్ధం జరుగుతుంది. మరొకవైపు స్వప్న ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవడంతో తనకి ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసి కోపంగా టెస్ట్ కిట్ ని విసిరేస్తుంది. స్వప్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పగానే తన ఫ్రెండ్ ఇంకా టైమ్ పడుతది వెయిట్ చెయ్యాలి. నువ్వు తప్పు చేసావ్.. నీకు ఇష్టం అయినప్పుడు అవ్వాలంటే కాదు వెయిట్ చెయ్యాలని స్వప్నకి తన ఫ్రెండ్ చెప్తుంది. ఆ తర్వాత కొంపదీసి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే నా పరిస్థితి ఏంటని స్వప్న అనుకుంటుంది. అప్పుడే స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. విసిరేసిన టెస్ట్ కిట్ ని రాహుల్ చూడకుండా స్వప్న జాగ్రత్తపడుతుంది. మరొకవైపు కృష్ణమూర్తి ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకొని కనకానికి చెప్తాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కొట్టేచోట గట్టిగా కొడితే సక్కగైతది.. ఈ వీడియోకి బాగా కనెక్ట్ అయ్యారు!

సోషల్ మీడియాలో ట్రోల్స్ కి ఉండే క్రేజే వేరు. ఈ ట్రోల్స్ లో కొన్ని సినిమాల మీద, మరికొన్ని పొలిటికల్ మీద ఉంటాయి. అయితే స్టుడెంట్స్ ఫ్రస్టేషన్స్ తో చేసే కొన్ని రీల్స్, ట్రోల్స్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. అందులోను ఇన్ స్టాగ్రామ్ లో వచ్చే ట్రోల్స్ కి క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నవాటిల్లో.. ఆ కుర్చీని మడతబెట్టి.. అనేది ఒకటి ఉండగా, ఇప్పుడు తాజాగా ఒక స్టుడెంట్ న్యూటన్ ని తిడుతున్నది ట్రెండింగ్ లో ఉంది. దానికి సెలెబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్రోల్ కి బిగ్ బాస్ సీజన్-6 లో కంటెస్టెంట్ ఆరోహి రావు స్పందించింది. ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు  చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.  బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఆరోహి. హౌస్ నుండి బయటకొచ్చాక ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఒక స్టుడెంట్ న్యూటన్ ఎందుకురా ఆ 'న్యూటన్ లా' అని కనిపెట్టావ్.. నీ వల్ల మా చదువులు ఇలా తగలడ్డాయి అంటూ అతను తన ఫ్రస్టేషన్ ని ఆ వీడియోలో చెప్పాడు. దీంతో స్టుడెంట్స్ అంతా ఈ వీడియోకి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన న్యూటన్ ని తిడుతున్న ఈ వీడియోని చక్కర్లు కొడుతుంది. దానికి ఆరోహీ స్పందించి.. ఏం ఉన్నారబ్బా ఈ జనరేషన్ స్టుడెంట్స్.. ముడ్డి మీద నాలుగు సర్తే మాట సక్కగైతది. మిమ్మల్ని మట్టల మీద కొట్టే మాస్టర్లు తక్కువై ఇట్లా తయారయ్యారు. మా 90's జనరేషన్ వాళ్ళు అయితే డీసెంట్ గా ఉండేవాళ్ళమని చెప్తూ ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  

ఆడవాళ్లు పాడైపోతున్నారు..సిగరెట్, మందు తాగుతున్నారు

"సుమ అడ్డా షో నెక్స్ట్ " వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి బెదురులంక 2012 టీం నుంచి కార్తికేయ, నేహా శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, డైరెక్టర్ క్లాక్స్ వచ్చారు. "ఇండస్ట్రీకి ముందొచ్చింది మీరే కదా" అని సుమ శ్రీకాంత్ అయ్యంగార్ ని అడిగేసరికి "కాదు ఇండస్ట్రీకి ముందొచ్చింది మీరు" అన్నారు శ్రీకాంత్. "నాకంటే ఇండస్ట్రీకి ముందే వచ్చి నేను ఇండస్ట్రీలో ఏం చేస్తున్నానో చూస్తూ ఆ తర్వాత ఎంటరయ్యారు..నిజం చెప్పండి " అని సుమ అనేసరికి "కాదమ్మా నేను చెప్పింది ఇండస్ట్రీకంటే నువ్వు ముందొచ్చావ్" అని చెప్తున్నా  అన్నారు శ్రీకాంత్. తర్వాత ఒక స్టూడెంట్ వచ్చి "ఈమధ్య ఆడవాళ్లు పాడైపోతున్నారు..సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు" అనేసరికి "ఆ కుర్చీని మడత పెట్టి" అనే డైలాగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించేసరికి ఆ స్టూడెంట్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో హీరోయిన్ రాధికా అలియాస్ నేహా శెట్టి వచ్చి "కుర్చీ వ్వాట్" అని అడిగింది. "కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకోకు నువ్వు...నాలాగా ఉండడం నేర్చుకో.. అన్నీ తెలుసుకున్న తెలియనట్టు ఉంటాను కదా నాలాగా అన్నమాట" అని కామెడీగా చెప్పింది. తర్వాత కార్తికేయ గులాబీలు తీసుకొచ్చి రాధికాకు ప్రొపోజ్ చేసాడు "ఈ గులాబీలకు ముళ్ళు లేనట్టే నా లవ్ కి కూడా ముళ్ళుండవు" అని చెప్పాడు. "అంటే సంబంధం ఖాయం చేసేసినట్టేనా బాబు " అని అడిగింది సుమ. "అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా " అందుకే అని అన్నాడు. "వాళ్ళ నాన్న గడ్డపారలా ఉంటాడు" అని చెప్పింది సుమ. తర్వాత "ఆకు చాటు పిందె తడిసె" అనే సాంగ్ కి నేహా శెట్టి, కార్తికేయ ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఇక చివరికి ఇమేజెస్ చూపించి గేమ్ ఆడించింది సుమ.  

ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయిని పిలువు బ్రేక్ ఇచ్చేద్దాం... ఆదిని చెప్పుతో కొడతానన్న దీపిక

ఢీ షో ఈ వారం ఆది డైలాగ్స్ తో, పంచెస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా హైపర్ ఆది ఓవర్ యాక్షన్ కి దీపికా పిల్లి రివర్స్ కౌంటర్ వేసింది. దీపికా పిల్లి సింగర్ గా వచ్చింది. స్టేజి మీదకు ఆది రాగానే పక్కనే ఉన్న అజర్ తో " ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయిని పిలువు బ్రేక్ ఇచ్చేద్దాం" అని చెప్పేసరికి అజర్ దీపికాని పిలిచాడు "నీ పేరేంటి" అని ఆది అడిగాడు. "దీపికా" అంది. " పేరులోనే దీపం ఉంది..ఆర్పేద్దాం" అన్నాడు ఆది. చూడు దీపికా "నాకు ఈ శ్రుతులు, లయలు, గొళ్ళాలు, తలుపులు రావు స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేద్దాం..ఢీలో టీం లీడర్స్ మధ్య బంధం అనేది భార్యాభర్తల సంబంధం లాంటిది..అర్దమయ్యిందా" అనేసరికి "అర్ధమయ్యింది...నిన్ను చెప్పుతో కొట్టాలని అర్ధమయ్యింది" అంది దీపికా. "ఒక్కో స్వరానికి ఒక్కో నాదం ఉంటుంది.. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలని అనుకుంటాను..మీరు రారు ఇక్కడే ఉంటారు. నీ వస్త్రాలంకరణపై పెట్టిన దృష్టి కొంచెం నా మీద పెట్టి ఉంటే అప్పుడు" అని ఆది అనేసరికి దీపికా ఆ మాటకు షాకయ్యింది. ఆ తర్వాత మెహర్ రమేష్, వాళ్ళ అబ్బాయి సాగర్ ఈ స్టేజి మీదకు వచ్చారు.  ఆది వాళ్ళ మీద కూడా పంచులు వేసి నవ్వించాడు. ఇక ఇక్కడ ఆది చెప్పిన మాటలకు అందరూ నవ్వేశారు "నేను మెహర్ రమేష్ గారు భోళా శంకర్ మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్ కి కూర్చున్నాం.. ఏదేమైనా ఆది మ్యూజిక్ త్వరగా కంప్లీట్ చేయాలి అని అన్నారు..మనం ఎంత ఉల్లాసంగా ఉండాలి అంటే..జాంజాంగా చేసేయాలి అన్నారు.  జాంజాంగా చేసేయడమేంటండి జాంజాం చేసేద్దాం అని చెప్పా.. అలా వచ్చిందే  "జాంజాంజాంజాం జజ్జనక"  అనే సాంగ్ వచ్చింది..ఈ మొత్తం సాంగ్ నేనే కంపోజ్ చేశా. మధ్యలో కొంచెం బీట్ మార్చాలని నర్సాపెల్లె అనే ఫోక్ బీట్ పెడదామని చిరు గారిని అడిగాను. ఆయన చెయ్యెత్తారు..సరే మీరే డెసిషన్ తీసుకోండి" అని చెప్పా  అన్నాడు ఆది.    

పేపర్ లో వచ్చింది చూసి రిషి చేసిన పరిష్కారం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -842 లో.. మహేంద్ర, జగతిల దగ్గరికి శైలేంద్ర వచ్చి పేపర్ లో DBST కాలేజీ గురించి నెగెటివ్ గా వచ్చిందని చెప్తాడు. అయితే ఇప్పుడేమంటావని మహేంద్ర అనగా.. ఈ కాలేజీని ఎవరైన అప్పగించండని శైలేంద్ర అంటాడు. ఎవరికి అప్పగించాలి, నీకు అప్పగించాలా.‌. అది మా కంఠంలో ప్రాణం ఉండగా జరగదని మహేంద్ర అంటాడు. ఇది రిషి కట్డుకున్న సామ్రాజ్యమని జగతి అంటుంది. ఇది ఇలానే సాగితే కాలేజీ మూసేల్సి వస్తుందని శైలేంద్ర అనగానే.. శైలేంద్ర కొట్టడానికి మహేంద్ర చేతిని లేపుతాడు. అన్నయ్య కోసం ఆగిపోయా.. రిషిని చంపాలని చూసింది నువ్వేనని మాకు తెలుసు‌‌.‌ అన్నయ్యకి నిజం తెలిసేలా చేస్తానని మహేంద్ర అనగానే శైలేంద్ర షాక్ అవుతాడు. పేపర్ లో వచ్చినదానికి వెనుక నువ్వే ఉన్నావని నాకు తెలుసు, ఆధారాలు సేకరించి నిరూపిస్తానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు.  రిషి ఒంటరిగా ఉండటం చూసిన వసుధార.. ఏం అయింది సర్ డల్ గా ఉన్నారని అడుగగా.. నా వ్యక్తిగతం అని రిషి అంటాడు. అక్కడ జగతి మేడమ్ ఏం చేయలేకపోతుంది. ఎంతో మంది DBST కాలేజీ పతనమవ్వాలని ఎదురుచూస్తున్నారని వసుధార అనగానే.. జగతి మేడమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని రిషి అంటాడు. అక్కడ DBST కాలేజీకి సమస్య మీరే ఆలోచించాలి సర్ అని వసుధార అనగానే.. నేను ఏం చేయాలని రిషి అంటాడు. DBST కాలేజీకి వెళ్ళి స్టుడెంట్స్ అడ్మిషన్ స్ట్రెంత్ ని పెంచాలని వసుధార అనగానే.. నేను DBST కాలేజీకి వెళ్ళను. కానీ ఇక్కడ నుండి ఆ పని చేయగలనని వసుధారతో రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పాండియన్ ని రమ్మని పిలిస్తాడు రిషి. పాండియన్ రిషి దగ్గరికి వచ్చాక.. సర్ రమ్మన్నారంటా అని అడుగగానే.. అవును, మనం పవర్ ఆఫ్ స్టడీస్ తరపున ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్తాడు. గొప్ప కాలేజీలలో చదువుకోలేక చాలా మంది ఉంటారు. వారిని మీరంతా ఒక్కొక్కరు ఒక్కరు లేదా ఎక్కువ మందిని జాయిన్ చేయాలి. వారికి నాణ్యమైన చదువుని అందజేయాలని రిషి చెప్తాడు. దాంతో పాండియన్ సరేనని చెప్తాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వస్తాడు. ఏంజిల్ హాల్లో కూర్చొని ఆలోచిస్తుంటుంది. పెళ్ళిచేసుకోవాలని చెప్పిన విశ్వనాథ్ గురించి ఆలోచిస్తుంటుంది ఏంజిల్. రిషి చూసి పరధ్యానంలో ఉన్నావని అంటాడు. ఏం లేదని ఏంజిల్ అంటుంది. విశ్వనాథ్ గురించి మీరు మర్చిపోండి.. ఆయన గురించి నేను చూసుకుంటానని రిషి అనగానే.. సరేనని ఏంజిల్ అంటుంది. తిన్నారా అని ఏంజిల్ ని రిషి అడుగుతాడు. లేదని అనగా తిను తొందరగా అని రిషి అంటాడు. పదా ఇద్దరం తిందామని ఏంజిల్ అనగా‌‌.. వద్దు నాకు తినాలని లేదు నువ్వు తినేసెయ్ అని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కావ్య వాళ్ళింటికి వెళ్ళకుండా ఆపాలని చూసిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -175 లో.. కావ్య కావాలనే సీతరామయ్య దృష్టిలో పడి.. ఇంకా మీ పుట్టింటికి వెళ్లలేదా అని అడగాలని కావ్య సీతరామయ్య ముందే తిరుగుతుంటుంది. అప్పుడే రాజ్ నిద్ర లేచి వచ్చి హాల్లో కూర్చొని కావ్యని చుస్తాడు. ఇదేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉందని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత తాతయ్య గారు.. మీకు ఏదైనా అవసరం ఉంటే పిలవండి కిచెన్ లోనే ఉంటా వర్క్ చేసుకుంటూ అని కావ్య అనగానే.. అదేంటి మీ ఇంటికి వెళ్లట్లేదా అని సీతరామయ్య అడుగుతాడు. లేదు తాతయ్య ఈ రోజు మంచి రోజు కాదట అని రాజ్ అంటాడు. నీతో చెప్పినవాడు ఎవడు ఈ రోజు మంచి రోజని సీతరామయ్య అంటాడు. సరే ఈ రోజే వెళ్తుందని సీతరామయ్యకి రాజ్ చెప్పి.. కావ్యని గదిలోకి తీసుకొని వెళ్తాడు. కావాలని ఇదంతా చేస్తున్నావని రాజ్ అనగానే.. అదేం లేదని మీరు వెళ్ళమంటే వెళ్తానని, లేదంటే లేదని కావ్య అంటుంది. నీ పర్ఫార్మన్స్ చాలు. వెళ్లి రెడీ అవ్వని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి కాంట్రాక్టు మళ్ళీ కృష్ణమూర్తికి ఇవ్వని చెప్తాడు. శ్రీనివాస్ సరే అంటాడు. రాజ్ శ్రీనివాస్ తో కాంటాక్ట్ గురించి మాట్లాడింది  స్వప్న విని కావాలనే రాహుల్ దగ్గరికి వెళ్లి రాజ్ కి వినపడెలా.. మా చెల్లి కావ్యని రాజ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు తనకి నచ్చింది చేస్తున్నాడని, కావ్య చెప్పినట్లు వింటున్నాడని స్వప్న అనగానే నువ్వేం మాట్లాడుతున్నావని రాహుల్ అంటాడు. స్వప్న మాటలు విన్న రాజ్ ఇంట్లో అందరూ ఆ కావ్య చెప్పినట్లు వింటున్న అనుకుంటున్నారా అని  అనుకుంటాడు. మరొక వైపు కళ్యాణ్, అప్పు ఇద్దరు అనామిక నెంబర్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత రాజ్ ఎలాగైనా కావ్యని బయటకు పంపించకుండా చెయ్యాలని అనుకోని కావ్య స్నానం చేసి వచ్చేసరికి నేల మీద నూనెని పోస్తాడు. కావ్య బాత్రూం నుండి బయటకు వచ్చి కింద ఉన్న నునెని చూసి దాటుకొని వస్తుంది. నన్ను వెళ్లకుండా చేయడానికి నూనె పోశారు కదూ అని కావ్య అంటుంది. నేనే పోశాను అనడానికి సాక్ష్యం ఉందా అని రాజ్ అనగానే, ఉంది.. మీకు నేను పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేదు అందుకే ఏదైనా చేస్తారని డౌట్ వచ్చి నా ఫోన్ వీడియో ఆన్ చేసి పెట్టానని రాజ్ నూనె పోసిన వీడియోని రాజ్ కి చూపిస్తుంది. ఇంత ముందు చూపేంటని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిజం చెప్పకుండా నందుని కట్టిపడేసిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -236 లో.. కృష్ణ డ్రెస్ లో రావడం చూసిన ప్రసాద్.. నువ్వు ఈ డ్రెస్ లో చూడడానికి బాగానే ఉన్నా, మా కృష్ణ చీర లోనే మాకు అందరికి నచ్చుతావని అంటాడు. మీరందరు నాపై ఇంత అభిమానం పెంచుకున్నరా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. సక్సెస్ ఫుల్ గా నీ క్యాంపుని పూర్తి చేసి రా కృష్ణ అని భవాని అంటుంది. మరొకవైపు కృష్ణ వెళ్లేలోపల మురారి ప్రేమ విషయం చెప్పాలని నందు అనుకుంటుంది. నువ్వు మురారిని అబ్సర్వ్  చెయ్యి.. నేను కృష్ణకి మురారి ప్రేమ విషయం చెప్తాను. లేదంటే కృష్ణకి తన ప్రేమ విషయం మురారి చెప్పనివ్వడని గౌతమ్ తో నందు చెప్తుంది. ఆ తర్వాత అందరూ టిఫిన్ చెయ్యడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఈ రోజు మనమందరం కలిసే తిందామని కృష్ణ అంటుంది. మోచేయి మలవకుండా తినాలని కృష్ణ చెప్తుంది. అదేలా అని అందరూ కృష్ణని అడుగుతారు. ఎలాగో నేను చూపిస్తానని కృష్ణ అంటుంది టిఫిన్ ని రేవతి కి తినిపిస్తుంది. ఇలా ఒకరికొకరు తినిపించుకోవాలని కృష్ణ చెప్పగానే అందరూ ఒకరికిఒకరు తినిపించుకుంటారు. ఇది బాగుంది రోజు ఇలాగే చేద్దామని సుమలత అంటుంది. మరొక వైపు గదిలో కృష్ణ, మురారి ఉంటారు. అప్పుడే కృష్ణకి నిజం చెప్పడానికి నందు వస్తుంది. మురారి ఉన్నాడు ఎలా చెప్పాలని అనుకుంటునే లోపలికి వచ్చి కృష్ణకి మురారి ప్రేమ విషయం చెప్పే ప్రయత్నం నందు చేస్తుంది. కృష్ణ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని నందు అడుగుతుంది. నందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు.. నువ్వు చిన్న పిల్లవి అని మురారి అంటాడు. నందు ఏం చెప్పాలని అనుకుంటావని కృష్ణ అంటుంది. ఏం లేదని మురారి అంటాడు. కృష్ణ కోపంగా గదిలో నుండి లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. నందు నువ్వు కృష్ణకి ఎందుకు చెప్తున్నావని మురారి అంటాడు. లేదు నేను ఇప్పుడు కృష్ణకి నీ ప్రేమ విషయం చెప్పాలని నందు అంటుంది.  ఆ తర్వాత నందు ఎలాగైనా కృష్ణకి నిజం చెప్పి కృష్ణ వెళ్లకుండా నందు చేస్తుందని మురారి అనుకొని తన నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టివేస్తాడు. మురారి ఆ తర్వాత గదిలోపల ఉంచి బయట గడియ పెడుతాడు. మరొకవైపు కృష్ణ వెళ్తు అందరికి జాగ్రత్తలు చెప్తుంది. టైమ్ కి తిను జాగ్రత్తగా ఉండు, నీకేం ప్రాబ్లెమ్ అయిన నాకు ఫోన్ చెయ్యి అని  కృష్ణకి‌‌ రేవతి చెప్తుంది. కృష్ణ భవాని దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.. ఆ తర్వాత మధుని కృష్ణ పిలిచి.. నువ్వు ఇది నేను వెళ్లిపోయాక ఇంట్లో వాళ్ళకి ప్లే చేసి చూపించని ఒక పెన్ డ్రైవ్ ఇస్తుంది. అందులో ఏముందని రేవతి అడుగుతుంది. మీ కుకింగ్ వీడియోస్ అని కృష్ణ అనగానే.. తింగరి పిల్ల అని రేవతి నవ్వుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మెహబూబ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

మెహబూబ్.. ఒకవైపు డ్యాన్స్, మరొకవైపు జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ సిక్స్ ప్యాక్స్ తో కనిపిస్తుంటాడు. బిబిజోడీలో శ్రీసత్యతో కలసి జోడికట్టి అదరహో అనిపించేలా డ్యాన్స్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహబూబ్.. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. మెహబూబ్ హైదరాబాద్ లో పుట్టాడు. అనేక షార్ట్ ఫిల్మ్ లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇతనొక యూట్యూబర్, నటుడు, డ్యాన్సర్. అందరు ఇతడిని మెహబూబ్ దిల్ సే అని పిలుచుకుంటారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఇతడు చేసిన టిక్ టాక్ లకి ఫుల్ క్రేజ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అలాగే  మెహబూబ్ ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశాడు. అందులో అతని రీల్స్, వ్లాగ్స్ అన్నింటిని షేర్ చేయగా అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. బిగ్ బాస్ సీజన్-4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తనదైన శైలితో గేమ్స్ ఆడి, టాస్క్ లు పూర్తిచేసి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతడికి పలు సినిమాల్లో అవకాశం వచ్చింది. జబర్దస్త్ లో కూడా అప్పుడప్పుడు మెరిసి తనలోని కామెడీని కూడా పరిచయం చేశాడు. ఇలా మల్టీ ట్యాలెంట్ గా ఉన్న మెహబూబ్ సెలబ్రిటీ రేంజ్ ని పొందాడు. కాగా ప్రస్తుతం తన ఇన్ స్టాగ్రామ్ లో 999K ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. అటు యూట్యూబ్ లో పద్నాలుగు లక్షల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మెహబూబ్ వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఒక ఫోటోఫ్రేమ్ ని తీసుకొచ్చి చూపించగా.. తను ఎంతగానే హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట.. రెండు సంవత్సరాల క్రితం దిగిన ఫోటోని ల్యామినేట్ చేసి తీసుకొచ్చాడు మెహబూబ్. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో వీడియోగా పోస్ట్ చేశాడు మెహబూబ్. మనకి బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలుసు, డబ్బుల కోసం, మన లక్ష్యం కోసం మనం నిరంతరం పరిగెడుతుంటాం. కానీ కనీసం కొంత సమయం మన ఫ్యామిలీ కోసం కేటాయించండి. వారి ఆరోగ్యం గురించి టైమ్ టూ టైమ్ చూసుకోండి అంటూ ఈ పోస్ట్ కి జోడించాడు మెహబూబ్.

శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద కొట్టుకున్న మానస్, అర్జున్!

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ మొత్తం చిరుకి డేడికేట్ చేశారు. చిరంజీవి బర్త్ డే ఆగష్టు  22 న రాబోతున్న సందర్భంగా 20 వ తేదీన ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో అన్ని చిరంజీవి మూవీస్ నుంచే డాన్సస్ , స్కిట్స్ చేసి  ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రతీ షోలో ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ హైలైట్ అవుతున్నారు కొంతమంది. కానీ ఇంత వరకు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఐతే  నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో మాత్రం ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ ఇద్దరు బుల్లితెర నటులు ఫైట్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంబటి అర్జున్ వెర్సెస్ మానస్ మధ్య స్టేజి మీద పెద్ద గొడవే జరిగింది.  అందరి ఫోన్స్ ని ఒక దగ్గర పెట్టి రాండమ్ గా ఒక ఫోన్ తీసి అందులో ఉన్నవేంటో చూసే కాన్సెప్ట్ ని పెట్టారు ఆది, రష్మీ. ఇందులో రష్మీ అర్జున్ ఫోన్ తీసేసరికి అందులో ఎం కనిపించాయో కానీ ఆది మాత్రం నోరు మూసేసుకున్నాడు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి మానస్ మధ్యలో వచ్చి "ఆయన ఫోన్ ఓపెన్ చెయ్యి చాలా చాలా విషయాలు దొరుకుతాయి" అనేసరికి " పెళ్ళైన వాడిని నా ఫోన్ చూస్తే ఏముంటాయి...నీ ఫోన్ లోనే ఉంటాయి" అనేసరికి "అనవసరంగా ఎందుకు నన్ను కెలుకుతావు" అని మానస్ అనేసరికి "పేమెంట్ ఇచ్చేది పంచులు వేయడానికే తీసుకో" అన్నాడు అర్జున్. "అంటే ఏది బడితే అది అనేస్తావా" అని ఫైర్ అయ్యాడు. "నేను ఇక్కడ పంచ్ వేశానని ఫీల్ అవుతున్నావు నువ్వు బయట ఎన్నో షోస్ లో పంచెస్ వేయలేదు... నేనేమన్నా ఫీల్ అయ్యానా" అని అర్జున్ అనేసరికి " నేను ఎప్పుడు వేసానో చెప్పు అన్నాడు ... ఇలా ఐతే అసలు మానస్ ని షోకి రావొద్దని చెప్పు" అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు చేతులెత్తుకుని కొట్టుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ఈ ఇద్దరినీ స్టేజి మీద ఉన్న వారంతా కలిసి ఆపి పక్కకు తీసుకెళ్లారు. ఐతే ఇది ప్రాంకా లేదంటే నిజంగా ఇద్దరూ కొట్టుకున్నారా తెలియాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి.

గెస్ ది లొకేషన్ అంటున్న గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-6 లో బాగా గుర్తుండేది కొందరే ఉన్నారు. అందులో మొదటగా వినిపించే పేరు గీతు రాయల్. చిత్తూరు చిరుతగా హౌస్ లోకి అడుగుపెట్టిన గీతు.. తన మార్క్ గేమ్ ప్లాన్ తో, స్ట్రాటజీస్ తో కంటెస్టెంట్స్ ని ఒక ఆట ఆడుకుంది. తనకి గేమ్ రూల్స్ అన్నీ తెలుసు.. అందుకే మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేసేది. గీతు రాయల్ కి క్రేజ్ మాములుగా ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే తను ఎలిమినేషన్ అయిందో అప్పటినుండి తనని విమర్శించిన వారు కూడా పాజిటివ్ గా స్పందించారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ లో అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది గీతు రాయల్. 'బ్యూటీ క్వీన్' అని శ్రీసత్యని చెప్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ కళ్యాణ్.. శ్రీసత్య వెంటే ఉంటూ తన లవ్ కోసం చాలా ప్రయత్నించి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చేశాడు. ఇటీవల శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిబి జోడీ డాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ఈ సెలబ్రేషన్స్ లో రాజ్, గీతూ రాయల్, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, ఫైమా, రేవంత్, యాంకర్ శివ ఇలా చాలా మంది హాజరయ్యారు. అందరూ సరదాగా గడుపుతూ శ్రీసత్యతో సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో అందరి దృష్డి అర్జున్ కళ్యాణ్ మీదే ఉంది. అతనితో శ్రీసత్య ఎలా ఉంటుందా అని ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే శ్రీసత్య మాత్రం అందరితో ఉన్నట్టే మామూలుగా ఉంది. అయితే గీతు రాయల్.. ఈ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా ఉండి అందరిలో మంచి జోష్ ని నింపింది. శ్రీసత్య పుట్టిన రోజు వేడుకల్లో కలిసిన బిగ్ బాస్-6 కంటెస్టెంట్స్ అందరూ సరదగా ఎంజాయ్ చేశారు‌. అయితే బిగ్ బాస్ తర్వాత ఎవరి బిజీ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. రేవంత్ కొత్త ఆల్బమ్స్ కోసం బిజీ అయ్యాడు. శ్రీహాన్ యాక్టింగ్ లో బిజీ, ఆదిరెడ్డి ఎప్పటిలాగే వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. గీతు రాయల్, శ్రీసత్య, వాసంతి కృష్ణన్ కలిసి టూర్  కి వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది గీతు రాయల్. అయితే వాళ్ళు వెళ్తున్న లొకేషన్ ఏంటో చెప్పడంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో అడిగింది గీతు. కాగా శ్రీసత్య కూడా గీతుని ట్యాగ్ చేసి ... లవ్ యూ గీతు రాయల్ అని పోస్ట్ చేసింది. ఇలాగే వాసంతి కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళు ముగ్గురు కలిసి గడుపుతున్న మెమొరీస్ ని షేర్ చేసింది. కాగా బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ ఇలా కలవడంతో ఈ సీజన్ అభిమానులకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఈ ముగ్గురు చేసే పోస్ట్ లకి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఫహద్‌ ఫాజిల్‌ తన క్రష్ అంట!

ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు  చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.  బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఆరోహి. హౌస్ నుండి బయటకొచ్చాక ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా తను 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించింది. అందులో నీ సెలబ్రిటీ క్రష్ ఎవరని ఒకరు అడుగగా.. ఫహద్‌ ఫాజిల్‌ అని రిప్లై ఇచ్చింది ఆరోహి. 'కీర్తి భట్ పెళ్ళికి వెళ్తున్నారా? మిమ్మల్ని పిలిచిందా? డోంట్ స్కిప్‌' అని ఒకరు అడుగగా..  వెళ్తాను‌‌.. కీర్తి పిలిచిందని ఆరోహి చెప్పింది. 'వాట్ ఈజ్ యువర్ స్నాప్ ఐడీ' అని ఒకరు అడుగగా.. ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ వాడటానికే బద్ధకం అయితుందంటే ఇంక స్నాపా అని ఆరోహీ రిప్లై ఇచ్చింది. నీకు సూర్య అంటే లవ్ ఉందా? ఫ్రెండ్ షిప్ ఉందా? నీకు దమ్ముంటే నా క్వశ్చన్ కి రిప్లై ఇవ్వమని ఒకరు అడుగగా.. దీనికి దమ్ము, దగ్గు, ధైర్యం‌ ఎందుకండి.. కీబోర్డ్ ఉంటే చాలు.. నేను సూర్య ఫ్రెండ్స్ మాత్రమే అని రిప్లై ఇచ్చింది ఆరోహి.‌ 'మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తారా' అని ఒకరు అడుగగా.. "వద్దురా అయ్యా, టైమ్ వేస్ట్ పనులు చేసుకోను. ఎందుకంటే ఏం చేసిన అక్కడ ఉండేవాళ్ళే ఉంటరు, పోయేవాళ్ళే పోతరు" అని రిప్లై ఇచ్చింది ఆరోహి.

సదాని ఏడిపించిన పవన్, అంజలి!

"నీతోనే డాన్స్ రేస్ టు ఫినాలే" సెకండ్ పార్ట్ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ ఐపోయింది. నీతోనే డాన్స్ ఫైనల్స్ కి దగ్గర పడిపోయిందన్న విషయం దీన్ని బట్టి అర్ధమైపోతుంది. ఈ ప్రోమో చూస్తే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పిచ్చి పిచ్చిగా దుమ్ము రేపే డాన్స్ లు చేసి ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక జోడీస్ అన్ని కూడా ఈ ఫినాలే రేస్ లో స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతిబింబించే డాన్సులు చేసి అలరించారు.  ఇక ఆట సందీప్ - జ్యోతి డాన్స్ లో ఒక చోట స్లిప్ ఐన విషయాన్ని అమరదీప్ ఎత్తి చూపించేసరికి సందీప్, జ్యోతి ఇద్దరూ ఫైర్ అయ్యారు. "బ్రదర్ మాట్లాడేటప్పుడు కొంచెం బుర్ర వాడు..నేను గోల్డెన్ సీట్ లో కూర్చోవడానికి రాలేదు ఫైనల్స్ లో నేనేంటో చూపిస్తాను.. నాకు డాన్స్ అంటే ఎంత పిచ్చో నీకు చూపిస్తాను " అని అమర్ ని కామెంట్ చేసాడు ఆట సందీప్. "సందీప్ డాన్స్ తో ఆ స్టేజి మీద ఎలా సచ్చిపోతాడు నేను కూడా అదే స్టేజి మీద డాన్స్ కోసం చచ్చిపోతాను" అని రివర్స్ లో అదే స్పీడ్ తో కౌంటర్ వేసాడు అమరదీప్. అలాగే తర్వాత సాగర్- దీప జోడి కూడా ఆట సందీప్-జ్యోతి డాన్స్ లో ఒక చోట స్లిప్ అయ్యిందనే విషయాన్ని చెప్పారు. దానికి ఆట సందీప్ కి కోపం నషాళానికి అంటేసింది. వెంటనే తన భార్య జ్యోతిని అందరి ముందే తిట్టేసాడు "డాన్స్ సరిగా నేర్చుకో అర్దమయ్యిందా..సిగ్గుండాలి" అని అన్నాడు. "ఎప్పుడు మీరు చెప్తే మేము వినాలి మేము ఏమన్నా అంటే మాత్రం మీరు తీసుకోరా" అని ఎప్పుడూ మాట్లాడని సాగర్ కూడా ఫుల్ ఫైర్ ఐపోయాడు.  తర్వాత మిగతా జోడీస్ కూడా అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మ్ చేసాయి. తర్వాత అంజలి, పవన్ జోడి చేసిన హారర్ యాక్షన్ కి సదా భయపడిపోయి అంజలి మీద గట్టిగా గట్టిగా సరిచేసి ఏడ్చేసింది. ఇక ఈ డాన్సస్ లో యాక్షన్, డ్రామా, హారర్ చూడాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే.

కృష్ణని డ్రెస్ లో చూసి షాకైన భవాని.. డల్ గా మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -235 లో.. కృష్ణ నిద్ర లేచి మురారి దగ్గరకి వెళ్లి మురారిని చూస్తూ.. మీరు నా మనసులో ఉన్నారు. మీ తల రాతలో నేను ఉన్నానని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే మురారి నిద్ర నుండి లేస్తాడు. అప్పటికే కృష్ణ క్యాంపుకి వెళ్ళడానికి అన్ని సర్దుకుంటుంది. ఏసీపీ సర్ మీరు ఇక నుండి ఈ షాంపులు వాడండి అంటూ మురారికి ఇస్తుంది కృష్ణ. మురారి మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరొక వైపు కృష్ణ క్యాంపుకి వెళ్లే కంటే ముందే మురారి కృష్ణని ప్రేమించే విషయం తనకి చెప్పాలని గౌతమ్ తో నందు చెప్తుంది. మరొకవైపు కృష్ణ, మురారిల గురించి రేవతి ఆలోచిస్తుంటుంది. అప్పుడే రేవతికి భవాని కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి అక్క.. కాఫీ నువ్వు తెచ్చావని రేవతి అడుగుతుంది. ఎప్పుడు నువ్వే తేవాలా? నేను తేకూడదా అని భవాని అంటుంది. ఆ తర్వాత రేవతి డల్ గా ఉంటుంది. ఏమైంది రేవతి ఎప్పుడు డల్ గా ఉంటున్నావ్ అని భవాని అడుగుతుంది. కృష్ణ క్యాంపుకి వెళ్తుంది కదా.. అక్కడ ఎలా ఉంటుందో? ఏంటో అని రేవతి అంటుంది. కృష్ణ అమ్మ నాన్నల కలని మనము నేరవేరుద్దామని భవాని అంటుంది. నేను కృష్ణ కోసం హాస్పిటల్ కట్టిద్దామని అనుకుంటున్నాను.. పేదలకి కృష్ణ ఫ్రీగా ట్రీట్ మెంట్ ఇస్తుందని భవాని అనగానే రేవతి చాలా సంబరపడుతుంది. ఆ తర్వాత వాళ్ళు నిజమైన భార్యభర్తలు కాదని తెలిస్తే ఎంత బాధపడుతుందోనని రేవతి అనుకుంటుంది. మరొకవైపు కృష్ణ చీర కాకుండా డ్రెస్ వేసుకొని మురారి దగ్గరికి వస్తుంది. కృష్ణని అలా డ్రెస్ లో చూసి మురారి షాక్ అవుతాడు. ఇప్పటి నుండే తను మారిపోవడం మొదలు పెట్టిందన్నమాట అని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత మురారి కాళ్ళని కృష్ణ కడుగుతుంది. అప్పుడే కృష్ణ మురారి, ముకుందలని కిందకి రమ్మని భవాని పిలుస్తుంది. ఎప్పుడు చీరలో ఉండే కృష్ణ డ్రెస్ లో ఉండడంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి తీంగరిపిల్ల.. ఈ అవతారం మార్చేసావని భవాని అడుగుతుంది. క్యాంపు కదా అత్తయ్య కంఫర్ట్ ఉంటుందని వేసుకున్నానని కృష్ణ చెప్తుంది. క్యాంపు నుంచి రాగానే నీకొక సర్ ప్రైజ్ ఉందని కృష్ణతో భవాని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కావ్యకి స్వేచ్ఛనివ్వాలని చెప్పిన సీతారామయ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -174 లో.. ఇంట్లో అందరు నేను చేసేది తప్పని చెప్పినా, నేను చేసే పని మాత్రం ఆపనని కావ్య చెప్పగానే.. చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందోనని అపర్ణ అంటుంది. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినొచ్చు కదా కావ్య అని ఇందిరాదేవి అంటుంది. అంటే మీరు కూడా నేను చేసిన పని తప్పని భావిస్తున్నరా అని కావ్య అంటుంది. ఆ తర్వాత నీకు నచ్చింది నువ్వు చేసుకుంటానంటే, నువ్వు ఇక్కడ ఉండకూడదు మాకు నచ్చినట్టు నువ్వు ఉంటేనే ఈ ఇంట్లో స్థానం అని అపర్ణ చెప్పగానే.. కావ్య షాక్ అవుతుంది. నీకు ఈ కుటుంబానికి  ఎలాంటి సంబంధం లేదని అపర్ణ అనగానే.. అప్పుడే సీతరామయ్య వచ్చి కోపంగా.. ఇక ఆపండి అని అంటాడు. అందరు తను చేసింది తప్పని ఎందుకంటున్నారు. కావ్య మన ఇంటి పరువు తీసేలా ఏం పని చేసింది.. చెప్పాలంటే మన కుటుంబ పరువు నిలబెట్టింది. ఆ ఇంటి కోడలు ఏం చేసినా చేయనిచ్చే స్వేచ్ఛ ఇచ్చారని, మన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీడియా ముందు ఏం అని చెప్పింది. నా కుటుంబం నాకు సపోర్ట్ గా ఉందని చెప్పింది. మీరు అలా సపోర్ట్ ఇస్తున్నారా అంటూ సీతరామయ్య.. ఇంట్లో అందరిపై కోప్పడుతాడు. ఈ ఇంట్లో కావ్య ఏం చేసిన అడ్డు చెప్పకూడదు.. ఇంటి పెద్దగా ఇది నా నిర్ణయమని సీతరామయ్య అందరికి చెప్తాడు. మరొక వైపు కృష్ణమూర్తి ఆలోచిస్తుంటాడు. అప్పుడే కనకం వస్తుంది. మనం కష్టంలో ఉన్నామంటే మనం ఎంత ఆపినా కావ్య రాకమానదు. ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బులతో సేటు అప్పు తీర్చి మిగిలిన డబ్బుతో అప్పు పెళ్లి చేద్దామని కృష్ణమూర్తి అంటాడు. దానికి కనకం కూడా సరే అంటుంది. మరొక వైపు కావ్య, రాజ్ లకి చిన్నపాటి మాటల యుద్ధమే జరుగుతుంది. నువ్వు అసలు మీ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదని రాజ్ అంటాడు. సరే వెళ్ళనని కావ్య అంటుంది. ఏంటి ఇంత సింపుల్ గా ఒప్పుకుంది. దీని వెనకాల ఏదైనా కారణం ఉందా అని రాజ్ నిద్రపోకుండా ఆలోచిస్తుంటాడు. అదే విషయం కావ్యని నిద్ర లేపి అడుగుతాడు. ఏంటి ఇంత సింపుల్ గా ఒప్పుకున్నావని రాజ్ అనగానే.. కావ్య ఏం చెప్పదు. మరుసటి రోజు ఉదయం కావ్య లేచి పని చేస్తుంటుంది. ఎలాగైనా సీతరామయ్య దృష్టిలో పడి.. ఎందుకు ఇంక మీ ఇంటికి వెళ్ళలేదని సీతరామయ్య అడగాలని కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పేపర్ లో వచ్చిన న్యూస్ చూసి షాకైన రిషి.. అసలు నిజం తెలుసుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -841లో.. ఏంజెల్ గురించి విశ్వనాథ్ ఆలోచిస్తుంటాడు. నేను లేకపోతే ఏంజెల్ ని ఎవరు చూసుకుంటారు.. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉంది. తనకు అంటూ ఒక తోడు ఉండాలి కదా అని వసుధార, రిషిలతో విశ్వనాథ్ అంటాడు. ఏంజిల్ పెళ్లి చేసుకుంటే నాకు ఏ టెన్షన్ ఉండదు. నీకు నచ్చిన అబ్బాయి, అర్థం చేసుకొనే అబ్బాయిని వెతికి తీసుకొని వస్తాను. పెళ్లి చేసుకుంటావా అని ఏంజిల్ ని విశ్వనాథ్ అడుగుతాడు. ఏంజిల్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విశ్వనాథ్ వసుధార, రిషి చేతులని తీసుకొని మీ ఇద్దరికి ఏంజిల్ బాధ్యతలు అప్పజెప్పుతున్నానని అంటాడు. మరొకవైపు వసుధార వాళ్ళ ఇంటికి వెళ్లి చక్రపాణికి విశ్వనాథ్ గురించి చెప్తుంది. మరొక వైపు రిషి కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ సర్ తో మాట్లాడుతుండగా అప్పుడే ఇంకొక లెక్చరర్ వచ్చి.. ఒక పేపర్ తీసుకొని వచ్చి ప్రిన్సిపల్ కి ఇస్తుండగా రిషి ఆ పేపర్ తీసుకొని చదువుతాడు. పతనం దిశగా DBST  కాలేజీ అనే టైటిల్ తో ఆ కాలేజీ గురించి నెగెటివ్ గా రాస్తారు. అది చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. బయట కూర్చొని పేపర్ ని చూస్తూ ఆలోచిస్తుంటాడు. ఒకప్పుడు ఎలా ఉన్న కాలేజీ ఎలా అయిపోయింది. ఇదంతా డాడ్ వాళ్లకి తెలుసా? డాడ్, జగతి మేడమ్ ఏం చేస్తున్నారని రిషి బాధపడుతాడు. అప్పుడే పాండియన్ అతని స్నేహితులు వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి వచ్చామని వాళ్ళు చెప్పినా.. రిషి పట్టించుకోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత పాండియన్ పిలిచేసరికి వింటున్నా అంటూ ఏదో చెప్తుండగా.. అప్పుడే వసుధారని చూస్తాడు. వసుధారని చూసి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత వాళ్ళు మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధారతో మాట్లాడతారు. సర్ ఎందుకో ఈ పేపర్ చదివినప్పటి నుండి డల్ అయిపోయాడని చెప్పగానే.. వసుధార చూసి షాక్ అవుతుంది. మరొక వైపు పేపర్ లో  DBST కాలేజీ గురించి నెగెటివ్ గా వచ్చింది జగతి, మహేంద్రలు చూసి బాధపడుతారు. ఈ పని శైలేంద్ర చేసాడని అనుకుంటారు. అప్పుడే శైలేంద్ర పేపర్ తీసుకొని వచ్చి.. ఏంటి ఇదంతా అని అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారని అంటాడు. నువ్వు బోర్డు మెంబెర్ కాదు.. నిన్ను ఎందుకు అడుగుతారని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

టీఆర్పీలో దూసుకెళ్తున్న బ్రహ్మముడి.. మళ్ళీ మొదటి స్థానంలోనే!

బ్రహ్మముడి సీరియల్ ఈ వారం  టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంది. బ్రహ్మముడి సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో రోజు రోజుకి కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతటా ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియల్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ‌ధనవంతులు సమాజం ఎలా ఉంటారు.. వారి  అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని గొప్పింటి వావాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది. అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికీ భారంగా ఉండాలనుకుంటుంది.    అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది. దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు  రాజ్ కి కనకం కూతురు స్వప్న నచ్చి పెళ్ళిచేసుకుందామనేసరికి తను పెళ్ళిపీటల మీద నుండి లేచిపోతుంది. దాంతో రాజ్ మేనత్త రుద్రాణి కనకం రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి రాజ్, కావ్యల పెళ్ళి జరిపిస్తుంది. ఆ తర్వాత స్వప్న, రాహుల్ ల పెళ్ళి జరుగుతుంది. అయితే స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం కావ్యకి తెలిసిపోతుంది. కావ్య పెళ్ళి ఆపాలని చూస్తుంది. కానీ అప్పటికే రాహుల్-స్వప్నల పెళ్ళి జరుగుతుంది. ఇక స్వప్నని ఒంటరిగా గదిలోకి తీసుకెళ్ళిన కావ్య ఎందుకు మోసం చేసావని నిలదీస్తుంది. ఆ తర్వాత కావ్యని స్వప్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. కావ్య తన కుటుంబానికి అండగా ఉండాలని రాజ్ కి తెలియకయండా డిజైన్స్ వేస్తుంటుంది. అయితే రాజ్ కావ్య వేసిన డిజైన్స్ చూసేస్తాడు. కావ్య డిజైన్స్ కి వచ్చిన డబ్బులను తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టకుండా అడ్డుకుంటుంది. కనకం, కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు కళ్యాణ్ రాసిన కవితలను ఇష్టపడుతున్న ఆ అజ్ఞాత అభిమాని ఎవరని ఇంకా తెలియకుంది. స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని ఇంట్లో చెప్పకుంటే కావ్య చెప్పేస్తానని చెప్పింది. అయితే కావ్య దుగ్గిరాల ఇంటిపరువు తీసిందని అపర్ణ తిడుతుంది. అయితే కావ్య తన ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్తుంది. మరి అలా ఉండాలంటే ఈ ఇంట్లో ఉండకూడదని అపర్ణ తర్వాతి ఎపిసోడ్ లో అంటుంది‌‌‌. ఇదంతా ప్రోమోలో చూస్తే తెలుస్తుంది. మరి కావ్యని అపర్ణ ఇంట్లో నుండి పంపించేస్తుందా? తన కవితలని ఇష్టపడే అభిమాని ఎవరో కళ్యాణ్ తెలుసుకుంటాడా? కావ్య ఏం చేయనుంది.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ అత్యంత వీక్షకాదరణ పొందుతూ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది.

ఆఖరి నిమిషంలో బతికించమని అడిగాడు నాన్న..నా దగ్గర ఉన్నదంతా పెట్టేసాను

"నీతోనే డాన్స్ " షోలో  ఈ వారం ప్రతీ జోడీ అద్భుతమైన డాన్స్ చేసి అదరగొట్టారు. కనెక్షన్ రౌండ్ లో ఒక్కో పెర్ఫార్మెన్స్ ఒక్కో  లెవెల్ లో ఉంది. నటరాజ్ మాష్టర్- నీతూ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. జడ్జెస్ ఐతే ఫుల్ ఖుషీ ఇపోయారు. జడ్జ్ రాధా నీతూని హేట్ చేస్తున్నట్లు చెప్పారు. అద్భుతమైన ఫ్లోర్ మూవ్మెంట్స్ అసలు ఎలా చేసావ్ అని అడిగారు. ఇక అంజలి- పవన్ వీళ్లకు 5  మార్క్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రతీ షోలో వీళ్ళ మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి షో ఎండింగ్ కి వచ్చేసరికి నీతూ పెర్ఫార్మెన్స్ చూసి అంజలి వచ్చి గట్టిగా హగ్ చేసేసుకుంది. పవన్ మాత్రం నటరాజ్ మాష్టర్ సరిగా డాన్స్ చేయలేదని చెప్పాడు. కానీ నటరాజ్ మాష్టర్ మాత్రం అతని వైపు చూడలేదు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ఈ షోలో  కొరియోగ్రాఫర్స్ గా ఉన్న ఆట సందీప్- నటరాజ్ మాష్టర్ ఇద్దరూ లాస్ట్ లో వచ్చి డాన్స్ ఇరగదీసి చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ కి ముందు సాగర్ - దీప పెర్ఫార్మెన్స్ చూసాక నటరాజ్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నేను హీరోగా చేసాను, అన్ని చేసాను.. ఇండస్ట్రీకి వచ్చి 24 ఇయర్స్ అయింది. మా నాన్న మంచి ఆర్టిస్ట్. ఊర్లో డ్రామాలవి చేసేవారు. ఆయన మీద కోపంతో నేను హైదరాబాద్ పారిపోయి వచ్చేసాను. మేము ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. పెళ్లయ్యాకే మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మా మధ్య బాండింగ్ పెరిగే టైంలో నాన్నకు లివర్ ఫెయిల్ అయ్యింది. ఆ విషయం మాకు చెప్పలేదు. చివరికి ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఒక మాట అడిగారు. నాకు బతకాలని ఉంది..బతికించవా అని . నా డబ్బులు మొత్తం నాన్న వైద్యానికి ఖర్చు పెట్టేసాను. ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా షూటింగ్ చూస్తానని నాన్న అడగలేదు..నేను కూడా ఆయన్ని  ఎప్పుడూ స్టేజి మీదకు తీసుకురాలేదు. ఇప్పుడు తెలుస్తోంది నాకు ఆ బాధ" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నటరాజ్ మాష్టర్.