బిగ్ బాస్ 7 లోకి అబ్బాస్ ఎంట్రీ!

ప్రస్తుతం చాలా మంది సీనియర్ హీరోలు, హీరోయిన్స్ మొదట ఇన్నింగ్ పూర్తి చేసుకొని రెండవ ఇన్నింగ్ ని మొదలు పెడుతున్నారు. అయితే ఇందులో కొంతమంది బిగ్ బాస్ ని ఒక ప్లాట్ ఫామ్ గా ఉపయోగించుకుంటున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొని వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి చేరబోతున్నారు  హీరో అబ్బాస్.  హీరో అబ్బాస్ 90's లో  తన సినిమాలతో  అందరికి సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అబ్బాస్.. తెలుగు, తమిళ్ కన్నడలో సినిమాల్లో చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల పక్కన నటించి అందరిని మెప్పించాడు అబ్బాస్. విలక్షణ నటనతో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు అబ్బాస్. ' ప్రేమదేశం ' సినిమాలో హీరో వినీత్, టబులతో నటించి మెప్పించాడు. ప్రేమదేశం సినిమా అబ్బాస్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది. ఆ సినిమా ద్వారానే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు అబ్బాస్. ప్రియ ఓ ప్రియా, రాజహంస, రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, అల్లుడుగారు వచ్చారు, నీ ప్రేమకై, నరసింహ.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బాస్ నటించిన సినిమాల జాబితా బోలెడుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అబ్బాస్.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అబ్బాస్ బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వేళ అబ్బాస్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టినట్లే అబ్బాస్. అయితే ఇది ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోసారి అబ్బాస్ స్క్రీన్ మీద కనిపించి ఇంప్రెస్ చేస్తాడో లేదో చూడాలి మరి!

సీరియల్ ఐపోయింది.. ఆదాయం ఎలా?

ఒక సీరియల్ ఐపోయింది అంటే అందులో పని చేసే టీమ్ మొత్తానికి కూడా పని అక్కడితో ఐపోయినట్టే. ఆదాయం కూడా ఇక బ్రేక్ ఐనట్టే. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు  కూడా వెయిట్ చేయాల్సిందే . ఇక ఇప్పుడు ప్రియాంక జైన్ కూడా అలాంటి సిట్యుయేషన్ నే ఫేస్ చేస్తోంది. తాను నటిస్తున్న "జానకి కలగనలేదు" సీరియల్ ఎండ్ ఐపోయేసరికి తనకు ఆదాయం తగ్గిపోయిందని చెప్పుకుని బాధపడింది. ఐతే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి అప్పటి వరకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనీ చూస్తోందట. మరి నిత్యం ఆదాయం ఉండే బిజినెస్ ఎప్పటికీ రెండే రెండు అని అవే ఫుడ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్ అని చెప్పింది. ఐతే ఫుడ్ బిజినెస్ ఐతే చాలా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి టెక్స్టైల్ బిజినెస్ సెల్ ద్వారా రన్ చేయొచ్చు కాబట్టి అదే చేయడానికి రెడీ అయింది. ఐతే మంచి టెక్సటైల్స్ కి పెట్టింది పేరు సూరత్ కాబట్టి ఫ్లయిట్ లో  అక్కడికి వెళ్ళింది ప్రియాంక జైన్.  అలా అక్కడకి వెళ్లి శారీస్, లెహంగాస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంది. ప్రియాంకతో పాటు శివ్ కూడా వెళ్లి హెల్ప్ చేసాడు. అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ ని తీసుకురాబోతున్నట్లు చెప్పింది ప్రియాంక. తన హైదరాబాద్ లో స్టార్ట్ చేయబోయే కొత్త షాప్ కి రావాలని శివ్-పరి కోరారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి రీసెంట్ గా నీతోనే డాన్స్ షోలో  పార్టిసిపేట్ చేశారు. ఐతే శివ్ కి హెల్త్ ఇష్యూ రావడంతో ఈ షో నుంచి డ్రాప్ అయ్యారు. ఇక ప్రియాంక మాత్రం ఈసారి టెక్స్టైల్ షాప్ పెట్టి మంచి లాభాలు తెచ్చుకోవాలని చూస్తోంది.  ప్రియాంక జైన్, శివ కుమార్.. ‘మౌనరాగం’ సీరియల్ నుంచి రిలేషన్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు.

సుభాష్ రాకతో దుగ్గిరాల ఇంట్లోకి మళ్ళీ వెళ్ళిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -181 లో... కావ్యని రాజ్ ఇంట్లో నుండి గెంటేస్తే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కలిసి కావ్యని తీసుకొని లోపలికి వెళ్ళి దుగ్గిరాల ఫ్యామిలీని నిలదీసస్తారు. ఆ తర్వాత దుగ్గిరాల ఇంటి నుండి కావ్యని తీసుకొని బయలుదేరుతారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా సుభాష్ వస్తాడు. అసలు ఇంట్లో ఏం జరిగిందనే విషయం తెలియని సుభాష్.. నా కోడలిని ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారని అడుగుతాడు. వాళ్ళు మౌనంగా ఉంటారు.  ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రకాష్ ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తాడు. నా కోడలు ఎక్కడికి రాదు. మీరు ఈ ఇంటికి పంపించాక నేనే తనకి తండ్రి లోపలికి పదండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లిన సుభాష్.. రాజ్ అపర్ణలపై కోప్పడతాడు. ఈ ఇంటి కోడలిని అలా పంపిస్తారా అంటూ సుభాష్ విరుచుకుపడుతాడు. మధ్యలో మాట్లాడిన రుద్రాణికి సుభాష్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఎవరేం అన్నా.. నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళడానికి వీలు లేదు. ఈ ఇంటి కోడలిగా , ఇంట్లో ఉండే బాధ్యత నీది అని కావ్యని లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన దానిని గుర్తుచేసుకుంటూ అందరూ బాధపడుతారు‌. కానీ రాజ్ మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి సుభాష్ వెళ్తాడు. మీరు చేసింది నాకు నచ్చలేదని అపర్ణ అంటుంది. ఈ ఇంటి కోడలిని ఆలా చెయ్యడం నాకు నచ్చలేదని సుభాష్ అంటాడు. కావ్య ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే పోయేది మన ఇంటి పరువని సుభాష్ చెప్తాడు. కావ్య గురించి ఏం చెప్పినా అపర్ణ మాత్రం ఏం పట్టనట్లు ఉంటుంది. మరొకవైపు కావ్య పరిస్థితి చూసి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడతారు. అంత జరిగిన తర్వాత అక్కని అక్కడే ఎందుకు వదిలేసి వచ్చారని కనకం, కృష్ణమూర్తిని అప్పు అడుగుతుంది. అది తన అత్తారిల్లు.. తను అక్కడే ఉండాలని కనకం చెప్తుంది. మరొకవైపు కావ్య కోపంగా ఉన్న  రాజ్ దగ్గరికి వస్తుంది. మీరు నన్ను అవమానించారు. మీరు మాట్లాడించాలి అయిన నేనే మాట్లాడిస్తున్నాను. కనీసం నన్ను వివరణ అయిన ఇచ్చుకోనివ్వండని రాజ్ తో కావ్య అంటుంది. మీ అమ్మ గారిని నేను కావాలనేమీ అనలేదని కావ్య అనగానే.. రాజ్ కోపంగా చెయ్యిని గోడకేసి కొడుతాడు. చేతికి రక్తం కారుతుంది. అది చూసి కావ్య రాజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసిన.. రాజ్ కావ్యని దగ్గరికి రానివ్వడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ సీజన్-7 లోకి ఎంట్రీ ఇవ్వనుంది వీళ్ళేనా!

తెలుగు టెలివిజన్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. September 3న గ్రాండ్ గా మొదలు కాబోతుంది. ఇప్పటికే ప్రేక్షకులకు హైప్ క్రియేట్ చేసే ప్రోమోలు వదిలారు స్టార్ మా మేకర్స్. దాంతో ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరాయనడంలో ఆశ్చర్యం లేదు. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్-7 లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది వాళ్ళు,వీళ్ళు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినా అందులో కొంతవరకు మాత్రమే నిజం ఉంది. ఈ సీజన్ మొదలు కావడానికి ఇంక కొన్ని రోజుల టైమ్ మాత్రమే ఉండడంతో బిగ్ బాస్ టీమ్ కొంతమంది కంటెస్టెంట్స్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్లతో బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన అగ్రిమెంట్ , వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా అందినట్టు సమాచారం. వాళ్లకి సంబంధించిన AV షూటింగ్ కూడా పూర్తి అయిందట. అమర్ దీప్ (సీరియల్ యాక్టర్ ), అతని భార్యతో కలిసి జంటగా బిగ్ బాస్ కి ఎంట్రీ అంటూ అప్పట్లో వార్తలు వచ్చినా, అందులో నిజం లేదు అమర్ దీప్ సింగల్ గానే ఎంట్రీ ఇస్తుండట.. సింగర్ దామిని, బోలె షావలి (ఫోక్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ ), కాస్కో నిఖిల్ (యాంకర్ ), అనిల్ జీల (యు ట్యూబేర్ ), అర్జున్ అంబటి (సీరియల్ యాక్టర్ ), మహేష్ అచంట (కమెడియన్ ), శోభాశెట్టి (సీరియల్ యాక్టర్ ), శుభశ్రీ (హీరోయిన్ ), పూజా మూర్తి (సీరియల్ యాక్టర్ ), గౌతమ్ కృష్ణ (హీరో ),  ప్రిన్స్ యావర్ (మోడల్ ).. ఇలా ఇప్పటి వరకు వీళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్ లు పూర్తి అయినట్లు సమాచారం. మొత్తం హౌస్ లోకి 21 మంది వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ అందరి అంచనాలు తారుమరు చేస్తుంది. అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ ఉల్టా పల్టా అని నాగార్జున ప్రోమో లో ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు.ఇప్పటికి బిగ్ బాస్ సెట్ ప్రోమో షూటింగ్ అంతా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరున బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన అఫీసియల్ ప్రోమోని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ అన్ని సీసన్ ల కంటే బెస్ట్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.

కృష్ణ కోసం స్పెషల్ గా డ్యూటీ వేయించుకున్న మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -242 లో.. ముకుంద తనపై ఇంక ఆశలు పెంచుకుంటుందని భావించిన మురారి.. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది, తను త్వరలోనే వస్తున్నాడని మురారి చెప్పగానే.. ముకుంద షాక్ అవుతుంది. నేను నిన్ను తప్ప ఎవరిని నా భర్తగా ఉహించుకోలేనని ముకుంద ఖచ్చితంగా చెప్పి వెళ్తుంది. దాంతో మురారికి ఏం చెయ్యాలో అర్థం కాదు. మరొకవైపు మురారిని గుర్తు చేసుకుంటు కృష్ణ ఉంటుంది. మురారి క్యాంపు దగ్గరికి వెళ్తుంటే ముకుంద అడ్డుపడుతుంది. నీతో మాట్లాడాలని మురారితో ముకుంద చెప్తుంది. నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు. అయినా నాకు ఆదర్శ్ అంటే గౌరవం.. ఒక అమ్మాయి ప్రేమని అర్థం చేసుకుంటాడు. పెళ్లికి ముందు వరకు నేనే ఆదర్శ్ కి కాబోయే భార్య అని నీకు తెలియదు. నీ ప్రాణ స్నేహితుడు ఆదర్శ్ అని నాకు తెలియదు. మన ప్రేమ గురించి ఆదర్శ్ కి తెలియదు. ఇందులో ఎవరి తప్పు లేదు. మీ ఇద్దరి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఇన్ని రోజులు అందరికి  చెప్తానని వట్టిగనే బెదిరించాను.. నేను చెప్పను బలవంతంగా ప్రేమ ఉండకూడదు. స్వచ్ఛంగా ఉండాలని ముకుంద అంటుంది. నేను నిన్ను అర్థం చేసుకొవడం లేదో? నువ్వు నన్ను అర్ధం చేసుకోవడం లేదో అర్థం కావట్లేదు కానీ మన వల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదని మురారి మనసులో అనుకుంటాడు. నువ్వు  నా వాడివి.. నేను నీ దాన్ని అని ముకుంద చెప్తుంది. మురారి మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు కృష్ణ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే బయట ఒక పోలీస్ కి దెబ్బలు తాకాయని ఎవరో వచ్చి చెప్పగానే..  మురారి అనుకొని కృష్ణ కంగారుగా వెళ్తుంది కానీ అది మురారి కాదు. దెబ్బలు తగిలిన అతనికి కృష్ణ ట్రీట్మెంట్ ఇస్తుంది. మరొక వైపు మురారి క్యాంపు అంటు వచ్చింది కృష్ణ ఉన్న చోటుకె.. పై ఆఫీసర్ లను రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడికి డ్యూటీ వేయించుకుంటాడు మరారి. కృష్ణ కోసమే అయిన తనే తన దగ్గరికి రావాలని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషికి వసుధార అసలు నిజం చెప్పనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -848 లో.. మీ పెళ్లి ఎప్పుడు సర్ అని రిషికి వసుధార మెసేజ్ చేయగానే.. రిషి షాక్ అవుతాడు. వెంటనే వసుధారకి కాల్ చేస్తాడు. కావాలనే వసుధార ఫోన్ కట్ చేస్తుంది. అసలు ఏమైంది? ఎందుకు నన్ను ఇలా అడిగిందని, ఎలాగైనా వసుధారనే అడగాలని రిషి అనుకుంటాడు. మరొకవైపు ఫణింద్ర దగ్గరికి దేవయాని వచ్చి.. ఈ మధ్య మీరు చాలా కోపంగా ఉంటున్నారు. మన కొడుకుని తిడుతున్నారు, వాడు అమెరికా వదిలి మనతో ఉండడానికి వస్తే.. మీరు చీటికిమాటికి వాన్ని తిడుతుంటే, వాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. వాడిని సరైన మార్గంలో మీరే పెట్టాలి. వాడికి కాలేజీ పనులు దగ్గర ఉండి మేరే చెప్పాలని ఫణింద్రతో దేవయాని చెప్తుంది. అలాగే దేవయాని నేను కొప్పడను, అలా అని అలుసుగా తీసుకోకని చెప్పు. ఇది నీకోసం, నీ కొడుకు కోసం కాదు.. ఈ ఇంటి కోడలి కోసం వాళ్ళు సంతోషం ఉండాలి. అది నువ్వే చెయ్యాలని ఫణీంద్ర చెప్తాడు. మరొకవైపు వసుధార సుమిత్ర ఫొటోని తీసుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వచ్చిన చక్రపాణి.. ఎందుకు తీసావని అడుగుతాడు. రిషి సర్ వస్తే, అమ్మ ఫోటో చుస్తే అమ్మ చనిపోయినట్లు తెలుస్తుంది. అలా తెలిసి జాలితో నాకు దగ్గర కావడం ఇష్టం లేదు. అందుకే అమ్మ ఫోటోని నా గదిలో పెట్టుకుంటానని చక్రపాణితో చెప్తుంది వసుధార.. ఆ తర్వాత వసు డోర్ వేస్తుంటే రిషి వచ్చి ఆపుతాడు. రిషిని చూసి వసుధార ఆశ్చర్యపోతుంది. మీతో మాట్లాడాలని  వసుధరని రిషి అడుగుతాడు. ఈ టైమ్ లో ఇలా మీరు వచ్చి మాట్లాడితే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. మీరు వెళ్ళండి సర్ మీ మొహం పై తలుపు వెయ్యడం ఇష్టం లేదని వసు అంటుంది. ఆ తర్వాత రిషి వెళ్ళకపోయేసరికి తన మొహం పైనే డోర్ వేస్తుంది వసుధార. రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రిషిని బాధపెట్టినందుకు వసుధార కూడా తనలో తానే బాధపడుతుంది. మరొక వైపు రిషి ఒక దగ్గర ఆగి ఎమోషనల్ అవుతాడు. వసుధార ఎందుకు ఇలా చేస్తుంది. అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటే.. నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను. అన్నింటికి బాధ నాకేనా? అన్ని ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారని రిషి అనుకుంటాడు. అప్పుడే నేను చెప్తానంటూ రిషి దగ్గరికి వసుధార వస్తుంది. మీరు ఎంత బాధపడుతారో తెలిసి ఇక్కడికి వచ్చాను. అడగండి ఏం అడగాలి అనుకుంటున్నారని వసుధార అంటుంది. ఆ మెసేజ్ ఎందుకు చేసావ్ ? నేను వేరేవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటానని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆసక్తిని రేకెత్తిస్తున్న బ్రహ్మముడి ప్రోమో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ తో సినిమాని తలపిస్తున్న ఈ సీరియల్ కి విశేష స్పందన లభిస్తుంది. ప్రోమో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వస్తున్నాయంటే ఈ సీరియల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మముడి సీరియల్ లో ప్రధానంగా రెండు కుటుంబాల చుట్టూ సాగుతుంది. ఒకటి ధనవంతులైన దుగ్గిరాల కుటుంబం. మరొకటి మిడిల్ క్లాస్ అయిన కనకం, కృష్ణమూర్తి కుటుంబం. అయితే  మొదటి నుండి గొప్పింటికి తన కూతుళ్ళని ఇవ్వాలని కలలు కన్న కనకం కల నేరవేరింది. కావ్యని రాజ్ కి ఇచ్చి పెళ్ళి చేయగా, స్వప్నని పెళ్ళి రాహుల్ తో జరుగుతుంది. అయితే కావ్య దుగ్గిరాల ఇంట్లో ఉండటం ఇష్టం లేని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ.. ఎప్పుడు కావ్య దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటుంది. మరొకవైపు స్వప్నతో రాహుల్ పెళ్ళి ఇష్టం లేని రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి.. ఎప్పుడు స్వప్నని ఇరికించి పంపించేద్దామా అని ఎదురుచూస్తుంటుంది. అయితే స్వప్నకి రుద్రాణి, రాహుల్ ల నిజస్వరూపం తెలియదు. అలాగే స్వప్నకి తన సొంత చెల్లి కావ్య అంటే అస్సలు గిట్టదు. దాంతో కావ్యకి ఇంట్లో ఆదరణ కరువవుతుంది. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో.. కావ్య వాళ్ళింటికి రాజ్ వచ్చి మట్టి పిసుకుతుండగా మీడియా వాళ్ళు ఫోటో తీసి టీవిలో వచ్చేలా చేస్తారు. దాంతో అపర్ణ కోపంతో రగిలిపోతుంది. కావ్య దుగ్గిరాల ఇంటికి రాగానే అపర్ణ సూటిపోటి మాటలతో తిడుతుంది. అయితే అక్కడే ఉన్న ఇంటి పెద్దలు సీతారామయ్య, ఇందిరాదేవిలు కూడా ఏం చేయలేని పరిస్థితి.. అప్పుడు రాజ్ వచ్చి తన తల్లికి కావ్య ఎదురుతిరిగేలా మాట్లాడినందుకు ఇంటి నుండి గెంటేస్తాడు రాజ్. వర్షంలో తడుస్తున్న కావ్యని కనకం, కృష్ణమూర్తి ఇంట్లోకి తీసుకొచ్చి.. అందరిని అడుగుతారు. కొంచెం కూడా జాలి లేకుండా కావ్యకి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? ఇలా చేస్తారా? అంటూ కనకం ఏడ్చేస్తుంది. తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనకం మాటలు ప్రతీఒక్కరిని కదిలిస్తాయి. అయితే తాజాగా రిలీజ్ చేసిన బ్రహ్మముడి ప్రోమోకి విశేష స్పందన లభిస్తుంది. ఈ ప్రోమోకి కామెంట్ల వర్షం కురుస్తుంది. ఈ సీరియల్ చూస్తున్న ఒక్కో అభిమాని ఎమోషనల్ గా ఉంది ఎపిసోడ్ అంటూ.. కావ్యని కోడలిగా అంగీకరించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేస్తూ నిన్నటి ఎపిసోడ్ ని ముగించాడు డైరెక్టర్.

తన ఎంగేజ్ మెంట్ కి కీర్తి మాకిచ్చిన పెద్ద భాద్యత ఇదే!

మెరీనా, రోహిత్ సాహ్ని.. బుల్లితెర సీరియల్స్ చూసే ప్రేక్షకులకు సుపరిచితమే. మెరీనా అబ్రహం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో‌ జన్మించగా.. రోహిత్ ని పెళ్ళి చేసుకొని హైదరాబాద్ లో ఉంటుంది. అప్పట్లో జీ తెలుగులో ప్రసారమయైన 'అమెరికా అమ్మాయి' సీరియల్ లో కళ్యాణిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. రోహిత్ కూడా సీరియల్స్ లో నటించాడు. నీలి కలువలు, అభిలాష సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. రోహిత్-మెరీనా ఇద్దరు కలిసి 'డ్యాన్స్ జోడి డ్యాన్స్' లో కూడా  పాల్గొన్నారు. అలా బుల్లితెరపై ఫేమస్ అయిన వీరిద్దరికి బిగ్ బాస్ లో 'రియల్ కపుల్' కోటాలో అవకాశం లభించింది. మెరీనా రోహిత్ బిగ్ బాస్ లో జంటగా అడుగుపెట్టి.. ఇద్దరు మంచి ప్రవర్తనతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అయితే రోహిత్ ని ఫ్యామిలీ మ్యాన్ అని అంటారు. రోహిత్ లోని డీసెంట్ నెస్, కూల్ అండ్ కామ్ ప్రవర్తన వల్ల బిగ్ బాస్ సీజన్-6 లో  టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. బిగ్ బాస్ నుండి వచ్చాక బిబి జోడీలో కూడా డ్యాన్స్ చేశారు. అయితే వీరిద్దరు తమ డాన్స్ తో అందరిని అంతగా మెప్పించలేకపోయారు. దాంతో బిబి జోడి నుండి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ భార్యపై చూపించే ప్రేమ కేరింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. దాంతో అతడికి ఫ్యాన్ బేస్ పెరిగింది.  రోహిత్ సోషల్ మీడియాకి ఎప్పుడు దూరంగా ఉంటాడు. కానీ మెరీనా ఎప్పటికప్పుడు తమకి సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. నిన్న జరిగిన కీర్తిభట్, కార్తిక్ ల ఎంగేజ్ మెంట్ ని దగ్గరుండి ఫోటోలు, వీడియోలు తీసే భాద్యతని మెరీనా, రోహిత్ లకి అప్పగించింది కీర్తిభట్. దాంతో వీళ్ళిద్దరు కలిసి అటు ఎంగేజ్ మెంట్ కి వచ్చిన బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం.. ఇటు ఫోటోషూట్ చూసుకోవడం.. ఇలా ఫుల్ బిజీ అయ్యారు ఇద్దరు. అయితే కీర్తిభట్, కార్తిక్ ల ఎంగేజ్ మెంట్ వీడియోని మెరీనా తన యూట్యూబ్ ఛానెల్ ' మెరీనా వరల్డ్' లో అప్లోడ్ చేసింది. ఇలా అందరిని ఒకేసారి కలవడం హ్యాపీగా ఉందంటూ మెరీనా రోహిత్ చెప్పారు. ఎక్కడెక్కడో ఉన్న కంటెస్టెంట్స్ అందరిని ఒకేసారి చూడటం బిగ్ బాస్ సీజన్-6 అభిమానులకు కన్నుల పండుగలా అనిపిస్తుంది.  ఫైమా, రాజ్, ఆదిరెడ్డి, నేహా చౌదరి, మెరీనా-రోహిత్, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ ఇలా అందరు వచ్చి కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ లో సరదగా ఎంజాయ్ చేసారు. కాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ కి ఇప్పుడు విశేష స్పందన లభిస్తుంది.

తన భర్తని చాలా మిస్ అవుతుందంట నేహా చౌదరి!

నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు.  నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్  అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి. అయితే ఈ వ్లాగ్స్ ని తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి. ఈ మధ్యే జర్మనీ నుండి ఇండియాకి వచ్చింది నేహా చౌదరి. అయితే తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది నేహా.. 'జర్మనీ నుండి వచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు' అని ఒకరు అడుగగా.. ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ అనిల్ ని మిస్ అవుతున్నానని నేహా రిప్లై ఇచ్చింది. ఎన్ని రోజులు ట్రిప్ అని ఒకరు అడుగగా.. త్రీ ఆర్ ఫోర్ మంత్స్, వర్క్ ని బట్టి అని రిప్లై ఇచ్చింది నేహా. మీ ఇన్సిపిరేషన్ ఎవరని ఒకరు అడుగగా.. మా పెద్దనాన్న అని చెప్పి తను, వాళ్ళ పెద్దనాన్నతో కలిసి దిగిన ఫోటోని అప్లోడ్ చేసింది.  కీర్తి ఎంగేజ్ మెంట్ బాగా జరిగిందా? ఎంజాయ్ చేశారా అని ఒకరు అడుగగా.. 'యా చాలా బాగా ఎంజాయ్ చేశాం. కీర్తీ ఈజ్ ఏ స్వీట్ హార్ట్. షి డిసర్వ్ ఆల్ ది హ్యాపిమెస్ ఇన్ ది వరల్డ్. సో హ్యాపీ షి ఫౌండ్ హర్ పార్టనర్' అని రిప్లై ఇచ్చింది. పెళ్ళికి టైమ్ తీసుకోవాలా? లేక తొందరగా చేసుకోవాలా? ఏదైనా సలహా ఇస్తారా అని ఒకరు అడుగగా.. ' పెళ్ళికి టైమ్ తీసుకుంటే బెటర్. మీ రిలేటివ్స్ కోసం పెళ్ళి చేసుకోకు. నువ్వు పెళ్ళికి రెడీ అయితేనే చేసుకో, నీకు సరైన వాడిని నీ మిస్టర్ పర్ ఫెక్ట్ ని నువ్వే వెతుక్కో' అంటూ రిప్లై ఇచ్చింది నేహా చౌదరి.‌ ఇలా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది నేహా.. కాగా ఈ  ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో నేహా చౌదరి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

కావ్యకి వేసిన శిక్ష చూసి దుగ్గిరాల ఫ్యామిలీని నిలదీసిన కనకం!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -180 లో.. తన తల్లికి ఎదురు తిరిగిందని  కావ్యని బయటకు గెంటేస్తాడు రాజ్. నేను ఎక్కడికి వెళ్ళనంటూ కావ్య ఇంటి ముందు వర్షంలో నిల్చొని ఉంటుంది. కావ్యని ఆ పరిస్థితిలో చుసిన రాహుల్, రుద్రాణి సంబరపడతారు. కావ్యని ఇంట్లో నుండి గెంటేసారని ఆ తల్లి కొడుకులని అంటారు. అప్పుడు రాజ్ అవమానంతో ఆఫీస్ కి వెళ్ళడు. అప్పుడు ఆఫీస్ బాధ్యతలు నువ్వు తీసుకునేలా నేను  చేస్తానని  రుద్రాణి చెప్తుంది. మరొకవైపు కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి వర్షంలో తడవకుండా చూస్తాడు. కావ్య మాత్రం నాపై గౌరవం ఉంటే మీరు ఇక్కడ నుండి వెళ్ళండని కళ్యాణ్ తో కావ్య చెప్తుంది. అటు అన్నయ్య, ఇటు వదిన ఎవరు తగ్గేలాలేరు వదిన వాళ్ళ అమ్మానాన్నలకి చెప్తే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారని కనకంకి ఫోన్ చేసి కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు. కాసేపటికి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బయలుదేరి కావ్య దగ్గరికి వెళ్తారు. మరొక వైపు అపర్ణ దగ్గరికి ఇందిరాదేవి, సీతరామయ్య వచ్చి.. రాజ్ కి నువ్వు అయిన నచ్చజెప్పి కావ్యని ఇంట్లోకి తీసుకొని రమ్మని చెప్పమని అడుగుతారు. నేను అలా చెప్పలేను.. వాడు నా మాట కూడా వినే పరిస్థితిలో లేడని అపర్ణ చెప్పగానే.. ఏం మాట్లాడకుండా ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు కావ్య దగ్గరికి కనకం, కృష్ణమూర్తి వచ్చి.. నువ్వు ఏం తప్పు చేసావో వాళ్ళనే అడుగుతానని కనకం కోపంగా కావ్యని తీసుకొని వెళ్తుంది. తన కూతురికి ఇంట్లో అందరు ఉండి కూడా ఇంత పెద్ద శిక్ష వేశారు ఎందుకని కనకం నిలదీస్తుంది. మీ కూతురు చేసిన తప్పు తెలియకుండా మమ్మల్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదని అపర్ణ అంటుంది. తప్పు చేస్తే ఇలాగేనా శిక్ష వేసేదని కనకం ఎమోషనల్ అవుతుంది. కనకం అలా అనగానే పక్కనే ఉన్న స్వప్న.. అలా నిజం తెలుసుకోకుండా మాట్లాడకని అంటుంది. అలా స్వప్న అనగానే కనకం కోపంగా నువ్వు మాట్లాడుతూన్నావా? నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకు లేదని స్వప్నని తిడుతుంది కనకం. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కృష్ణమూర్తి వెళ్లి.. నా కూతురిని క్షమించండని బ్రతిమిలాడుతాడు. నేను క్షమించలేనని రాజ్ కచ్చితంగా చెప్తాడు. దాంతో నా ఇంటికి నా కూతురిని తీసుకొని వెళ్తానని కృష్ణమూర్తి చెప్తాడు. అందరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. సీతరామయ్య, ఇందిరాదేవిలకి రాజ్ చేస్తుంది తప్పని తెలిసిన రాజ్ ఎవరి మాట వినే స్టేజ్ లో లేడని సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కావ్యని తీసుకొని బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కోసం బంగారం కొన్నాం!

లాస్య మంజునాథ్.. ఇప్పుడు అందరికీ సుపరిచితమే. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న లాస్య ఈ మధ్యే తనకి కొడుకు పుట్టాడని చెప్పింది. ఆ తర్వాత వ్లాగ్ లు చేస్తుంది. పిల్లలు ఉన్న మదర్స్ కి  టిప్స్ చెప్తూ పలు వ్లాగ్ లు చేయగా అవి యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి. ఇలా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తూ లాస్య మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది. పలు టీవి కార్యక్రమాలకు యాంకర్ గా చేసిన లాస్య.. చీమ, ఏనుగు జోక్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలిసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో ఎంట్రీ ఇచ్చి విశేషంగా ఆకట్టుకుంది. పోస్డ్ డెలివరీ అంటూ తనకి బాబు పుట్టాక, తను ఎలా ఉంటుందో, పేరు పెట్టేప్పుడు ఒక వ్లాగ్, మదర్స్ డే వ్లాగ్, తనకి బాబు పుట్టాక తన దినచర్య ఏంటో ఒక వ్లాగ్ గా అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటూ వస్తోంది లాస్య. లాస్యకి రెండోసారి కొడుకు పుట్టాక.. తెగ వ్లాగ్స్ చేస్తుంది.  మా చిన్నోడి ఫస్ట్ ఫోటో షూట్, న్యూ బార్న్ తో ఫస్ట్ ఫ్లైట్ అంటూ వ్లాగ్స్ చేస్తూనే.. వంటల్లో మెలుకువలు చెప్తుంది లాస్య. బర్త్ డే షాపింగ్, కోడిగుడ్డు వెల్లుల్లి కారం, మేకింగ్ మెమోరీస్ ఫర్ లైఫ్ టైమ్, మటన్ కీమా రెసిపీ అంటూ వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది లాస్య. తాజాగా తను ' వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కోసం బంగారం కొన్నాం' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తన భర్త మంజునాథ్ మరియు బాబుతో కలిసి ఒక షాపింగ్ మాల్ కి వచ్చింది లాస్య. అందులో సెలబ్రిటీల కోస‌ం ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నాయని చెప్పడంతో తను అమ్మవారి కోసం బంగారం తీసుకుందామని వచ్చిందని ఈ వీడియోలో చెప్పింది లాస్య. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఫుల్ రష్ ఉన్నట్టుగా చెప్పిన లాస్య.. తన యూట్యూబ్ సబ్ స్జ్రైబర్స్ కి థాంక్స్ చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

మా పాపతో మాములుగా ఉండదు!

డైరెక్టర్ కుమార్ పంతం.. బ్రహ్మముడి సీరియల్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అంతకముందు గుప్పెడంత మనసు సీరియల్ తో పేరు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు స్టార్ మా టీవీ ఛానెల్ లో‌ ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలో టాప్ -5 లో ఈ రెండు సీరియల్స్ ఉండటం విశేషం. కుమార్ పంతం భార్య కిరణ్మయి కూడా పాపులర్ అయింది.  కిరణ్మయి.. బుల్లితెర సీరియల్ నటి. ఈవిడ అందరికి సుపరిచితమే. తనకి ఇద్దరు చెల్లెల్లు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్క కిరణ్మయి బాటలోనే నడుస్తూ సీరియల్స్ లో నటిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ లో 'జ్వాల' కి తల్లిపాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న 'పడమటి సంధ్యారాగం' సీరియల్ లో హీరోకి తల్లిపాత్రలో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తను 'మీ కిరణ్మయి' అని సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం 'ఫైనల్లీ నేనొచ్చేసా' అనే మూడు నిమిషాల వీడియోని అప్లోడ్ చేసి వెల్ కమ్ చెప్పింది కిరణ్మయి. తన మొదటి వ్లాగ్ లో కుమార్ పంతంని ఇంటర్వూ చేసినట్టుగా స్టార్ట్ చేసిన కిరణ్మయి.  మా శ్రీవారి చేతి చికెన్ బిర్యానీ వ్లాగ్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత 15mins లో సింపుల్ మేకప్, మా వరలక్ష్మి కోసం షాపింగ్, మా ఇంటికి నేనే మహారాణి, నా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతితో గుప్పెడంత మా మనసు అనృ వ్లాగ్ లు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా విశేష స్పందన లభించింది. కాగా ఇప్పుడు తాజాగా ' మా పాపతో మాములుగా ఉండదు'  అనే మరొక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది కిరణ్మయి. ఇందులో కిరణ్మయి తన కూతురితో కలిసి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలంటు ఒక గేమ్ ఆడారు. ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే ఆరెంజ్ జ్యూస్ లో చక్కెర, బాదం మిక్స్, ఐస్ మిక్స్ చేసి తాగాలని, తప్పు సమాధానం చెప్తే ఆరెంజ్ జ్యూస్ లో కారం, మసాలా, పసుపు, టమాట సాస్ వేసుకొని తాగాలనే షరతు పెట్టుకొని గేమ్ ఆడారు. అయితే ఇందులో ఎక్కువ తప్పు సమాధానాలు కిరణ్మయి చెప్పింది. అందుకే కిరణ్మయి మా పాపతో మాములుగా ఉండదు అని అంది. కాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

భవాని నిర్ణయం సరైనదేనా.. మురారి అలా చెప్పడంతో ముకుంద షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -241 లో.. తన ప్రేమ విషయం భవానికి చెప్పేస్తుంది ముకుంద. అయితే ఆ ప్రేమ ఇంక కంటిన్యూ అవట్లేదు, మర్చిపోయానని భవాని కాళ్లు పట్టుకొని చెప్తుంది. కానీ భవానికి ముకుంద వల్లే నా కొడుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడని తనపై కోపంగా ఉంటుంది. ఆ తర్వాత రేవతిని పిలిచి.. ఇక్కడ నుండి ముకుందని తీసుకొని వెళ్ళని చెప్పగానే.. ముకుందని రేవతి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత భవాని దగ్గరికి రేవతి వచ్చి.. అసలు ఏమైంది అక్క అని అడుగుతుంది. కల్నల్ ఫోన్ చేసిన విషయం గురించి భవాని చెప్తుంది. మరొకవైపు మురారి జ్ఞాపకాలతో కృష్ణ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.. తన ఫ్రెండ్ భోజనం చెయ్ అంటూ భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత మురారి వచ్చి తనని ఆటపట్టిస్తు భోజనం తినిపిస్తునట్లు  ఉహించుకుంటుంది కృష్ణ. మరొక వైపు రేవతి, మురారిలతో భవాని మాట్లాడుతుంది. ముకుంద పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందంట.. ఆవిషయం తెలిసే ఆదర్శ్ ఇంటికి రాలేదని మురారికి  భవాని చెప్తుంది. ప్రస్తుతం ఆ ప్రేమని మర్చిపోయానని చెప్తుంది కానీ అది అబద్ధమనిపిస్తుంది. ఇన్ని రోజులు ముకుంద బాధపడేది ఆదర్శ్ కోసం కాదు తను ప్రేమించిన వాడి కోసమని భవాని చెప్తుంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ముకుంద ఎవరిని ప్రేమించిందో తెలుసుకొని ఆదర్శతో విడాకులు ఇప్పించి అతనితో పెళ్లి చేస్తే ముకుంద హ్యాపీగా ఉంటుంది. ఆదర్శ్ కూడా ఇంటికి వస్తాడని అనగానే రేవతి, మురారి ఇద్దరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ముకుంద ఎవరిని ప్రేమించిందో నువ్వే కనుక్కోవాలని మురారికి‌ భవాని చెప్తుంది. లేదు పెద్దమ్మ నేను క్యాంప్ కి వెళ్తున్నానని మురారి చెప్తాడు. సరే ఆ విషయం నేను కనుక్కుంటానని భవాని అంటుంది. ఇన్ని రోజులు మీకు ఈ విషయం తెలియకుండా చేసింది ఇలా చేస్తారనే అని రేవతి మనసులో అనుకొని  బాధపడుతుంది. మరొకవైపు మురారితో ముకుంద మాట్లాడుతుంది. సంవత్సరం నుండి ఇద్దరం మన జీవితాలను త్యాగం చేసామంటూ.. వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతుంది ఆదర్శ్ ఆచూకి తెలిసిందని మురారి చెప్పగానే ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మీ పెళ్ళెప్పుడని అడిగిన వసుధార.. షాక్ లో రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -847 లో.. వసుధార డల్ గా ఉండడంతో ఏం జరిగి ఉంటుందని తెలుసుకోవడానికి చక్రపాణి దగ్గరికి రిషి వెళ్తుంటే.. అతనే దార్లో కన్పిస్తాడు. దాంతో ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా అని చక్రపాణిని రిషి అడుగుతాడు. అదేం లేదని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత మరి ఎందుకు మీ కూతురు డల్ గా ఉంది. ఏం జరిగిందని రిషి అడుగుతాడు. ఏం ఉంటుంది మీ గురించే అని చక్రపాణి చెప్తాడు. కాసేపటికి రిషి వెళ్లబోతుంటే.. ప్రొద్దున మా ఇంటికి ఏంజిల్ వచ్చింది. నేను పని మీద బయటకు వచ్చాను. వాళ్ళేం మాట్లాడుకున్నది నేను వినలేదని చక్రపాణి చెప్తాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏంజిల్ దగ్గరికి వెళ్తాడు. వసుధారని కలిసి ఏం మాట్లాడవని ఏంజిల్ ని అడుగుతాడు రిషి. వసుధార చెప్పేసిందా ఏంటని ఏంజిల్ టెన్షన్ పడుతుంది. ఎందుకు వసుధార ఏమైనా చెప్పిందా అని ఏంజెల్ అడగగానే.. ఆమె చెప్పలేదు అనే కదా నిన్ను అడిగేదని రిషి అంటాడు. ఈ రోజు వసుధార మేడమ్ ఎందుకు డల్ గా ఉన్నారని రిషి అంటాడు. తను డల్ గా ఉంటే నన్ను అంటావ్ ఏంటి.. నేను మాట్లాడిన దానికి తన డల్ గా ఉండడానికి సంబంధమేంటి? తన పర్సనల్ తనది అని ఏంజిల్ అంటుంది. మేరేం మాట్లాడుకున్నారో చెప్పమని ఏంజెల్ ని అడిగినా.. తను సమాధానం చెప్పదు. ఆ తర్వాత రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు రిషి  కలిసిన విషయం వసుధారకి చెప్పాలా వద్దా అని చక్రపాణి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార దగ్గరికి చక్రపాణి వెళ్లి.. రిషి కలిసి మాట్లాడిన విషయం చెప్తాడు. భోజనం చేద్దాం వసుధార అని చక్రపాణి పిలిచిన వసుధార వెళ్ళదు. ఆ తర్వాత ఏంజిల్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ వసుధార ఎమోషనల్ అవుతుంది.. ఇన్ని రోజులు మా మధ్య తాత్కాలిక దూరం ఉందనుకున్న కానీ మా మధ్య మూడవ వ్యక్తి వచ్చింది. ఎక్కడ ఏంజిల్ ప్రేమని రిషి అంగీకారిస్తాడో అని వసుధార బయపడుతుంది. మరొకవైపు ఎవరిని అడిగిన ఏం జరిగిందో చెప్పట్లేదని వసుధారకి మెసేజ్ చేస్తాడు రిషి. ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నారని రిషి మెసేజ్ చెయ్యగానే.. అది నా పర్సనల్ మన మధ్య ఏ బంధం లేనప్పుడు మీకు ఎందుకు చెప్పాలని వసుధార రిప్లై ఇస్తుంది. కొద్దిసేపు ఇద్దరు చాట్ చేసుకున్నాక.. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడని వసుధార మెసేజ్ చెయ్యగానే.. రిషి షాక్ అవుతాడు. వెంటనే వసుధారకి కాల్ చేస్తే వసుధార ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసిన మేకర్స్

ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.  సెప్టెంబర్ 3  నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని, డేట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన స్టార్ మా.  గత సీజన్స్ లానే  అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఐతే ఈ ఈ బిగ్ బాస్ సీజన్ మాత్రం  ముందు సీజన్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని నాగార్జున క్లారిటీతో చెప్పేసారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 3వ తేదీన అని ప్రోమోలో స్పష్టం చేశారు. నాలుగు సీజన్ల నుంచి బిగ్ బాస్‌కు హోస్ట్ గా చేస్తున్నారు  టాలీవుడ్ కింగ్ నాగార్జున. తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్  సీజన్‌కు జూనియర్ ఎన్‌టీఆర్‌  హోస్ట్ చేశారు. ఆ షోకి మాత్రం పిచ్చ పిచ్చ రేటింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత సీజన్ లో కూడా ఆయనే హోస్ట్ గా రావాలని ఆడియన్స్ కోరుకున్నారు. కానీ సీజన్ 2 లో మాత్రం  నాని హోస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. అయితే నాని హోస్టింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో, అదే రేంజ్‌లో నెగిటివిటీ కూడా ఎదురయ్యింది. అందుకే తరువాతి సీజన్‌కు హోస్టింగ్ చేయడానికి నేచురల్ స్టార్ నానిని తీసుకోలేదు. ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ సీట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు నాగార్జున స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ఐతే నాగార్జున హోస్ట్ గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నా ఇంకో వర్గం ప్రజలు మాత్రం సేమ్ హోస్ట్ నే చూడలేకపోతున్నాం....జూనియర్ ఎన్టీఆర్ లా బేస్ వాయిస్ లేదు, ఇంట్రోస్ అవి చెప్పకుండా సింపుల్ గా చిన్న ఇంట్రోతో సరిపెట్టేస్తున్నారు తప్ప ఒక సెన్సేషన్ ఉండడం లేదు కంటెంట్ లో అని కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రతీ సారీ షోకి ముందు హోస్ట్ మారుతున్నారని అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ చివరికి నాగార్జున మాత్రమే హోస్ట్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది.. ఏదేమైనా ఈ సారి బిగ్ బాస్ మొత్తం ఉల్టా పుల్ట అంటున్నారు అంత స్పెషల్ గా ఈ రాబోయే  షోలో ఏమేం మార్పులు చేశారో తెలియాలంటే ఇంకొక్క పది రోజులు ఆగితే తెలిసిపోతుంది.

చైనాలో ఫేమస్ పాట పాడి అలరించిన నవ్యస్వామి

శ్రావణమాసం వచ్చిందంటే చాలు బుల్లితెర మీద ఆ పాజిటివ్ వైబ్స్, స్పెషల్ ఈవెంట్స్ కి లెక్కేలేదు. ఎందుకంటే ఈ మాసం అంతా పండగలే  పండగలు కాబట్టి. ఇప్పుడు డ్రామా జూనియర్స్ 6 లో శ్రావణ మాసం కళకళలాడింది. నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి  "బెదురులంక" మూవీ టీమ్ "కార్తికేయ - నేహశెట్టి" ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఐశ్వర్య, అంజనా, నవ్య స్వామితో పాటు జడ్జెస్  శ్రీదేవి , జయప్రద, బాబుమోహన్ వచ్చి ఆడియన్స్ కి  శ్రావణమాస శుభాకాంక్షలు చెప్పారు. ఇక యాంకర్ ప్రదీప్ జోక్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు కదా " జయప్రద గారు మీరేమి కోరుకున్నారు" అని అడిగేసరికి "ప్రదీప్ గురించే కోరుకున్నా" అన్న ఆమె  మాటకు వచ్చిన ఫన్నీ కన్నీళ్లను తుడుచుకుని జోక్స్ వేసాడు. "నా గురించి కూడా కోరుకునే వాళ్లున్నారా అమ్మా" అని కౌంటర్ వేసాడు.  "శ్రీదేవి గారు మీకు శ్రావణ మాసం అంటే ఏం గుర్తొస్తుంది" అని ప్రదీప్ అడిగేసరికి. "హజ్బెండ్స్ వచ్చి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం" అనేసరికి "364 రోజులు భర్తలను పీక్కుతినేసి.. ఈ ఒక్కరోజు మాత్రం వాళ్ళు బాగుండాలని కోరుకోవడం బాగుంది" అని కౌంటర్ వేసాడు ప్రదీప్. "ఆవిడని చూడండి చాల పద్దతిగా రెడీ అయ్యి వచ్చారో ఎప్పుడూ లేనిది " అని నవ్యస్వామిని చూపిస్తూ ప్రదీప్ అనేసరికి "పద్దతి అంటే నవ్య. నవ్య అంటే పద్దతి" అని నవ్యస్వామి కూడా కౌంటర్ వేసింది. "జోక్ అంటే ఇది..ఇదే జోక్ అంటే" అని ప్రదీప్ కూడా రివర్స్ కౌంటర్ వేసాడు. "నేను ఐశ్వర్య రాయ్ కావాలనుకుంటున్నాను.. ఎలాగో తెలీడం లేదు " అని ఐశ్వర్య పిస్సే ప్రదీప్ ని అడిగింది "మీ పేరులో ఇలాగే ఐశ్వర్య ఉంది కాబట్టి చేతిలో ఒక రాయి పట్టుకుని తిరుగు" అని సలహా ఇచ్చాడు. తర్వాత పిల్లలంతా కలిసి ఈ బుల్లితెర హీరోయిన్స్ తో స్కిట్స్ వేశారు. భార్య భర్తల సంబంధం గురించి ఒక చైనా కవి ఏమన్నాడో తెలుసా అని నవ్యస్వామి తన భర్తను అడిగి చైనాలో ట్రెండింగ్ లో ఉన్న పాటను పాడి అందరిని నవ్వించింది. పెళ్ళైన వాళ్లంతా ఈ స్కిట్స్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని బెదురులంక మూవీ హీరోహీరోయిన్స్  కార్తికేయ-నేహ అన్నారు. ఇక లాస్ట్ లో చిన్నారులంతా అష్ట లక్ష్ములుగా రావడం నిజంగా ఈ షో మొత్తానికి హైలైట్ గా నిలిచింది.

కన్నీళ్లు పెట్టుకున్న డాన్సర్ చక్రపాణి...షూ గిఫ్ట్ గా ఇచ్చిన అతని వైఫ్

"ఢీ "  ప్రీమియర్ లీగ్ లేటెస్ట్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయింది. ఈ షోకి ఈ వారం  బిగ్ బాస్ సీజన్ - 4 లో అందరి మనసులను దోచుకున్న సయ్యద్ సోహల్  తన బ్లాక్ బస్టర్  మూవీ "మిస్టర్ ప్రెగ్నంట్"   ప్రోమోషన్స్ కోసం వచ్చాడు.  అలాగే  హైపర్ ఆది "పెద్దరాయుడు" గెటప్ వేసి అందరిని గుడుపుబ్బ నవ్వించాడు. కొరియోగ్రాఫర్ అభి వచ్చి "అదెంటీ ఆది అన్న మనం ఇద్దరం కలిసి ఎన్నో సీజన్స్ చేశాం కదా" అని అడిగితే, "మరి అన్నయ్య నాకోకటి దొరికింది, ఇద్దరం కలిసి తిందాం అని ఏరోజైనా పిలిచావా" అని  కామెడీ చేసేసరికి శేఖర్ మాష్టర్ పడీ పడీ నవ్వేసాడు. తరువాత  సైరా రాయలసీమ్ వెర్సెస్  బెజవాడ టైగర్స్ గ్రూప్స్ మధ్య  డాన్స్ కాంపిటీషన్ జరిగింది. రెండు టీమ్ డాన్సర్స్ ఇద్దరు పోటా పోటీగా చేశారు. ఇక ఈ షోలో హైలైట్ గా నిలిచాడు "చక్రపాణి". అతని గురించి ప్రదీప్ చెప్పేసరికి అందరికీ కన్నీళ్లు వచ్చేసాయి. చక్రపాణి కూడా ఏడ్చేశాడు.   "చక్రపాణికి డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. 22 ఏళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఫైనాన్షియల్ గా  ఇబ్బందులు వచ్చినా  వదలకుండా   ప్రయత్నిస్తునే ఉన్నాడు. అలా తన జర్నీని కంటిన్యూ చేస్తూనే ఇక్కడి వరకు వచ్చాడు" అని చెప్పాడు ప్రదీప్. అలా తర్వాత తన భార్య పిల్లల గురించి చెప్పాడు చక్రపాణి. "నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను" అని తన భార్య భరోసా ఇచ్చిందని చెప్పాడు. ఇంతలో స్టేజి మీదకు వచ్చారు చక్రపాణి భార్యాపిల్లలు. ఇక వస్తూనే ఆమె తన భర్త  చక్రపాణికి  మంచి కాస్ట్లీ షూ గిఫ్ట్ గా ఇచ్చారు. తరువాత నెల్లూరు నెరజాణలు వెర్సెస్  కొనసీమ పందెంకోళ్ళకి మధ్య పోటీ జరిగింది. ఇంతలో హైపర్ ఆది అదరిపోయే స్కిట్ చేసి, అందరిని నవ్వించాడు. ప్రైజ్ మీద ఉన్న ప్రదీప్ అలాగే డాన్నర్లు అందరూ ఆ స్కిట్లో మైద్యుడు. ఆ డాన్స్ పోటీలో ఎవరూ గెలుస్తారో వేచి చూడాలి. ఇక చివరిలో అన్ని గ్రూప్స్ కలిసి స్టేజి మీద డాన్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి.  

నడవలేని రష్మి... పొడవలేని సుధీర్!

ఈటీవీ 28 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక ఈవెంట్ చేస్తోంది. "ఈటీవీ బలగం" పేరుతో 27 వ తేదీన సాయంత్రం ప్రసారం కాబోతోంది. ఇప్పుడు ఈ ప్రోమో రిలీజ్ అయింది.  చాలా రోజుల తరువాత మనల్ని మళ్ళీ కామెడీతో  అలాగే తన మల్టీ టాలెంట్స్ తో  మెస్మోరైజ్  చేసిన సుడిగాలి సుధీర్ ఎంట్రీతో అందరిలో జోష్ వచ్చేసింది. రాగానే సుధీర్ ను తన స్నేహితులు గెటప్ శ్రీను అలాగే ఆటో రాంప్రసాద్ ఒక ఆట ఆడేసుకున్నారు. ఇంతలో హైపర్ ఆది వచ్చి మీరు చాలా రోజుల తరువాత వచ్చారు కదా ఇంకొక రెండు సంవత్సరాలు ఇలాగే ఉంటె నేనే మీ మీద సినిమా తీస్తా అని కామెడీగా చెప్పాడు. ఇంతలో ఏ  సినిమా అని రష్మీ అడిగేసరికి " నడవలేని రష్మి ,పొడవలేని సుధీర్"  అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు.  తర్వాత ఏక్ హరి జోడి వచ్చి తమ ఫస్ట్ లవ్ ఈటివిలో ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే దొరికిందని  చెప్పాడు. తర్వాత ఆమె తన వైఫ్ అయ్యిందన్నారు. వాళ్ళను చూసి ఆది కూడా రెండు పంచ్లు వేసేశాడు. "ఫస్ట్ టైం ఎవరు ఎవర్ని ప్రపోజ్ చేశారు" అని రష్మీ ఏక్ హరి జోడిని అడిగేసరికి  ఎలా చేశారో చూపిస్తూ "ఎర్లీ మార్నింగ్ 3 గం లకు కార్లో కిస్ చేసి ప్రొపోజ్ చేసా" అని చూపించాడు. తరువాత రౌడీ రోహిణి "శుభమస్తు" కార్యక్రమ యాంకర్ గా చేసింది.  శుభమస్తు ప్రోగ్రాంకి వచ్చే పండితులు రోహిణి  అడిగిన ప్రశ్నలకు చాలా కామెడీగా అందర్ని నవ్విస్తూ జోతిష్యం చెప్తారు. "సుడిగాలి సుధీర్ అడుగుతున్నారు నాది ఏ రాశి" అని అడిగేసరికి "12 రాశులలో  కన్య రాశి, మిదున్ రాశి తప్ప అని రాసులు ఆయనవే" అని కామెడీ చేశారు. తర్వాత గెటప్ శీను "సుధా ఈ ప్రేమ పక్షులు గాల్లోనే ఎగురుతాయా...గూటికేమన్నా వెళ్తాయా" అనేసరికి సుధీర్ ఏం ఆన్సర్ చేసాడో తెలీదు కానీ రష్మీ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ షోలో రైటర్  చంద్రబోస్, అలాగే బెదురులంక టీమ్ హీరో కార్తికేయ , నేహా శెట్టి ఈ షోని  చాలా ఎంజాయ్ చేసారు. "అసలు నేను గుర్తున్నానా" అని రష్మీ అడిగేసరికి "గుర్తున్నావ్ కాబట్టే  ఇలా ప్రాణాలతో బతికున్నా" అన్నాడు సుధీర్ . మరి ఇంతకు వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా ? లేదా అనే విషయం మీదా ఈ షోలో క్లారిటీ వచ్చేస్తుంది. 

గ్రాండ్ గా తరుణ్ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

తరుణ్ మాస్టర్ అంటే ఆయనలో మనకు గుర్తొచ్చే యాంగిల్ ఒకటి ఉంది... అదే కాయితాలు చింపి డాన్స్ బాగా పెర్ఫార్మ్  చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. డ్యాన్స్ షోలకు జడ్జిగా మంచి పేరు ఉంది తరుణ్ మాస్టర్ కి. రీసెంట్ గా  ఆయన 56వ జన్మదిన వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముందుగా ఆయన ఇంట్లో కేక్ కట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ కి పని చేసే సిబ్బందితో సెలెబ్రేట్ చేసుకున్నారు.   తర్వాత " నీతోనే డ్యాన్స్ " టీమ్ అంతా కలిసి డాన్స్ సెట్ లో మళ్ళొకసారి బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసి తరుణ్ మాష్టర్  కి మెమొరబుల్ డేగా మార్చారు. ఆయన సంతోషంతో "నీతోనే డాన్స్" షో సెట్ లో ప్రతీ ఒక్కరినీ తన వీడియోలో బందిస్తూ తన వ్యూయర్స్ కి వాళ్ళ గురించి చెప్తూ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.  హీరోయిన్ "రాధా" కూడా ఆ సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. ఇంకొక జడ్జి "సదా" కూడా అక్కడే  ఉన్నారు. తరుణ్ మాస్టర్ కేక్ కట్ చేస్తూ ఈరోజు తన  ఒక్కడి పుట్టిన రోజే కాదని "రాధ"గారి కుతురిది కూడా అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తారు.  అలాగే యాంకర్ శ్రీముఖి, యాదమ్మ రాజు భార్య కూడా అదే స్టేజ్  మీద డ్యాన్స్ లు వేస్తూ తరుణ్ మాష్టర్ కి  ఒక వండర్ఫుల్ మెమొరీగా మార్చారు. అలాగే తరుణ్ మాస్టర్ శ్రీముఖితో సరదాగా స్టెప్పులు కూడా వేసారు. కేక్ కట్ చేసిన తరువాత అలాగే సెట్లో పని చేస్తున్న వారితో కలిసి అక్కడ ఉన్న డాన్సర్స్ అంతా  కలిసి ఆయనకు కేక్ తినిపిస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. ఇంత మెమొరబుల్ డే గా మార్చిన తన బర్త్ డే ను తరుణ్ మాస్టర్ అందరికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే తన యూట్యూబ్ చానెల్ వ్యూయర్స్ కి బర్త్ డే విషెస్ చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు. తరుణ్ మాస్టర్ సెట్ లో ఎప్పుడూ జోష్ గా ఉంటూ మిగతా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ తో కలిసి స్టేజి మీద స్టెప్పులేసి జడ్జెస్ మనసు దోచుకుంటూ ఉంటారు.