వసుధార వాళ్ళింటికి వెళ్ళిన రిషి.. ఏంజిల్ కనిపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -854 లో.. రిషి అన్న మాటలు గుర్తుచేసుకొని ఏంజిల్  బాధపడుతుంటుంది. అప్పుడే తన దగ్గరికి విశ్వనాథ్ వచ్చి.. ఎందుకు అలా ఉన్నావని అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా నీకు టాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పి విశ్వనాథ్ కి ఇస్తుంది. ఆ తర్వాత రిషి ఇంకా ఇంటికి రాలేదేంటని తన కోసం ఎదురు చూస్తంటుంది ఏంజిల్. ఫోన్ చేస్తే కోప్పడతాడు అనుకొని ఫోన్ చెయ్యకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంజిల్‌. ఆ తర్వాత అసలు  రిషి, వసుధారల మధ్య ప్రేమ ఉందా? అందుకే అలా చేస్తున్నారా నాకు చెప్పట్లేదా? ఉంటే నేను పక్కకి జరిగేదాన్ని కదా అని ఏంజిల్ అనుకుంటుంది. ఒకవేళ అలాంటిది ఉంటే చెప్పేవాళ్ళు కదా? వాళ్ళ గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదని ఏంజిల్ అనుకుంటుంది. మరొక వైపు ఏంజిల్ తన పట్ల ప్రవర్తించే తీరుని రిషి గుర్తు చేసుకుంటాడు. అసలు ఇంటికి వెళ్ళాలని లేదు. అలా అని వెళ్లకుండా ఉండలేనని కాలేజీలోనే ఉంటాడు రిషి. అప్పుడే రిషి దగ్గరికి వసుధార వచ్చి.. ఇంకా ఇంటికి వెళ్ళలేదని అడుగుతుంది. ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి. నేను చేస్తానని వసుధార అంటుంది. అవసరం లేదని అక్కడ నుండి వెళ్ళిపొమ్మని రిషి చెప్తాడు.. వసుధార వెళ్తు వెళ్తు రిషి వైపు అదోలా చూసేసరికి.. ఆ కళ్ళతోటే నన్ను నీ ప్రేమలో పడేసావంటూ తనతో ప్రేమలో  ఉన్న రోజులని గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత వసుధార కళ్ళను పెన్సిల్ తో డ్రా చేస్తాడు రిషి. అప్పుడే కరెంటు పోవడం వల్ల డ్రాయింగ్ మధ్యలోనే పక్కకి పెట్టి రిషి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఇంకా రిషి రాలేదని ఏంజిల్ ఫోన్ చేస్తుంది.. కావాలనే ఏంజిల్ ఫోన్ ని రిషి లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత రిషి ఆలోచనలో పడి వసుధార ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతాడు. ఇప్పుడు వసుధారతో మాట్లాడి నా గుండెల్లో భారం దించుకోవాలని రిషి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత రిషిని చూసిన వసుధార లోపలికి పిలిచి భోజనం చెయ్యమని అడుగుతుంది. రిషి ఒప్పుకోడు చక్రపాణి రిక్వెస్ట్ చెయ్యగా.. రిషి భోజనం చేస్తాడు. వసుధార నీకు పెళ్లి చెయ్యాలని నా కోరిక అని చక్రపాణి అనగానే.. రిషి సైలెంట్ గా ఉంటాడు.  అప్పుడే వసుధార దగ్గరికి ఏంజిల్ వస్తుంది. ఏంజెల్ ని చూసిన రిషి.. నేను ఇక్కడ ఉన్నానని చెప్పకండని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. ఏంజిల్ లోపలికి వచ్చి రిషి ఇంకా రాలేదు. నీకు ఏమైనా తెలుసా అని వసుధారని ఏంజిల్ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అపర్ణపై ఇందిరాదేవీ ఫైర్.. స్పప్న దాచిన నిజం బయటపడనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-187 లో.. వాంతి చేసుకున్న స్వప్నని హాస్పిటల్ కి  తీసుకెళ్తామని రుద్రాణి, రాహుల్ రేడీగా ఉంటారు. స్వప్న టెన్షన్ తో వాళ్ల  ఫ్రెండ్ సాక్షికి కాల్ చేయగా.. 'ఈ రోజు నాకు వీలు కాదు. రోజంతా టెంపుల్ లోనే ఉంటాను.  మా అత్తయ్య మెక్కుకుందంట' అని స్వప్నతో సాక్షి అనగానే.. నువ్వు ఇలా చేస్తే నన్నెవరు కాపాడేదని స్వప్న ఫీల్ అవుతుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని రకాల టిఫిన్స్ చేసి వాటికి పేర్లు కూడా పెడుతుంది కావ్య. ఎందుకంటే ఎవరు తనతో మాట్లాడట్లేదని ఈ ఐడియా వేస్తుంది కావ్య. డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరిని పిలవడానికి ఒక గంటను కొడుతుంది. అది విని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రాగానే ఆ టేబుల్ మీద అన్ని టిఫిన్స్ కి పేర్లు ఉండటం చూసిన సుభాష్ .. ఏంటమ్మ కావ్య, కొత్తగా ఈ పేర్లేంటి అని అడుగుతాడు. కావ్య మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా మీ మామయ్య అడుగుతున్నాడు కదా మౌనంగా ఉంటావేంటి సమాధానం చెప్పమని సీతారామయ్య అంటాడు. అది విని ఇందిరాదేవి అందుకుంటుంది. తనేం మాట్లాడదు, తనే కాదు తనతో ఈ ఇంట్లో ఎవరూ మాట్లడట్లేదని ఇందిరాదేవి అంటుంది. ఎందుకని సుభాష్ అడుగుతాడు. నీ భార్య మాకు ఆంక్షలు విధిస్తుంది. తనతో ఎవరూ మాట్లాడకూడదని ఇంట్లో రూల్ పెట్టిందని ఇందిరాదేవీ అనగానే.. ఏంటిది, నేను వాళ్ళ అమ్మనాన్నలకి , ఇక ఇలాంటిది జరుగదని చెప్పి లోపలికి తీసుకొచ్చానని అపర్ణతో సుభాష్ అంటాడు. ఆ రోజు అంత గొడవ జరిగినా మళ్ళీ మట్టి పిసుక్కోవడానికి వెళ్ళిందని అపర్ణ అంటుంది. ఎహే ఆపు .. ఎంత సేపు ఆ మట్టిని మోస్తావని ఇందిరాదేవి అంటుంది. మిమ్మల్ని మాట్లాడొద్దనడం నా తప్పే, నన్ను క్షమించండి. కానీ ఈ మట్టి పిసుక్కోవడం మళ్ళీ జరుగకూడదని అపర్ణ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సుభాష్ కావ్యతో అందరూ మాట్లాడాలని అందరికి చెప్తాడు. ఆ తర్వాత రాజ్ ఇడ్లీ వద్దన్నట్టు హ్యాండ్ ని అడ్డుగా పెడతాడు. ఏంటి నువ్వు కూడా మాట్లాడట్లేదా? ఇంకో ఇడ్లీ వేసుకో అని రాజ్ తో సుభాష్ అనగానే సరేనని రాజ్ ఇడ్లీ వేయమంటాడు.  మరొకవైపు కావ్య కోసం కృష్ణమూర్తి వెయిట్ చేస్తుంటాడు. కనకం చూసి... ఏంటయ్యా తొందరగా వెళ్తానన్నావ్, ఇప్పుడేంటి గుమ్మం వైపు అలా చూస్తున్నావని కృష్ణమూర్తితో కనకం అంటుంది. అది విని కావ్య కోసం చూస్తున్నానని కృష్ణమూర్తి అంటాడు. అప్పుడే కృష్ణమూర్తికి కావ్య కాల్ చేస్తుంది. ఈ రోజు నాకు వీలవ్వదు నాన్న, రేపటిది ఈరోజుది కలిపి రేపే వర్క్ చేస్తానని కావ్య అంటుంది. లేదమ్మ ఇబ్బందిగా ఉందా అను కనకం అంటుంది. అదేం లేదమ్మా రాజ్ వాళ్ళ ఆఫీస్ వర్క్ చేస్తున్నా అని కనకంతో కావ్య అనగానే.. అవునా, నువ్వు ఆఫీస్ కి వెళ్లి హుందాగా ఉండాలని కనకం అంటుంది. నాకు అంతగా ఆశ లేదమ్మా, నన్ను గుర్తిస్తే చాలని కావ్య చెప్పేసి కాల్ కట్ చేస్తుంది.  కోట్ల విలువ కన్నా వ్యక్తిత్వం గొప్పదని కావ్య చెప్తుంది చూసావా కనకం అని కృష్ణమూర్తి అంటాడు. మరొకవైపు హాస్పటల్ లో స్వప్న, రాహుల్, రుద్రాణి వెయిట్ చేస్తుంటారు. దుగ్గిరాల ఇంటికి సబల అనే మహిళ హక్కుల గురించి పోరాడే మహిళా సంక్షేమ ట్రస్ట్ నుండి కొందరు వచ్చి.. మట్టి పిసుక్కునే అమ్మాయిని మీ కోడలిగా చేసుకొని బాగా చూసుకుంటున్నారని వాళ్ళు పొగుడుతుంటే.. అపర్ణ, రాజ్ ఏం మాట్లాడలేకపోతారు. రాజ్, కావ్యని పక్కపక్కకి నిల్చోబెడితే ఫోటో తీసుకొని వెళ్ళిపోతామని ఆ సంక్షేమ ట్రస్ట్ వాళ్ళు చెప్తారు. సరేనంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముకుంద చెప్పాలనుకున్నది భవాని తెలుసుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -248 లో... మురారికి కృష్ణ అంటే ప్రాణమని, కృష్ణ కోసమే క్యాంప్ కి వచ్చినట్టు, కృష్ణని ప్రేమిస్తున్నట్లు కృష్ణకి చెప్తుంది రేవతి. అది విని మొదట సంబరపడ్డ తర్వాత నేను వెళ్ళాకూడదని ఇలా చెప్పారు కావచ్చని కృష్ణ అనుకుంటుంది. అయిన ఏసీపీ సర్ నన్ను ప్రేమిస్తే తనే వచ్చి ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా అని కృష్ణ అంటుంది.  ఆ విషయం మీరు ఇంటికి వెళ్ళాక తెల్చుకోండని రేవతి చెప్తుంది. సరే అని కృష్ణ అంటుంది.  మరొక వైపు మురారి, కృష్ణల గదిలోకి ముకుంద వెళ్ళి.. కృష్ణ వస్తువులు ఏవి లేకుండా చేస్తుంది. మురారి నా వాడు. తన ప్రేమ నాకు మాత్రమే సొంతమని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు రేవతితో కృష్ణ కలిసి.. మురారి దగ్గరికి వస్తుంది మురారి సంతోషపడుతు.. నా అమ్మ ఏం చెప్పి తీసుకొని వచ్చిందో తెలియదు గాని నువ్వు మళ్ళీ వస్తున్నావ్ కృష్ణ అని మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నన్ను ప్రేమిస్తు ఆ విషయం నాతో చెప్పకుండా దాచరా ఏసీపీ సర్, నన్ను నిజంగానే ప్రేమిస్తే, ఆ విషయం తనతోనే చెప్పిస్తా..ప్రేమించడం లేదంటే ప్రేమించేలా చేసుకుంటా అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి బయలుదేర్తారు. ఇంటికి వెళ్ళిన తరవాత కృష్ణ అందరితో మాట్లాడుతుంది. నేను ఇచ్చిన గిఫ్ట్స్ అందరికి నచ్చాయా అని రేవతిని కృష్ణ అడుగుతుంది. కానీ ముకుందకి నచ్చకపోవచ్చని కృష్ణ అనగానే‌.. ముకుంద పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించింది. అది మర్చిపోయి పెళ్లి జీవితంలో హ్యాపీగా ఉండమని చెప్పానని కృష్ణ అనగానే.. అలా ఉచిత సలహాలు ఇంకొకసారి ఇవ్వకు అని కృష్ణని కోప్పడుతుంది. ఆ తర్వాత మీరు ఎవరినైనా ప్రేమించారా అని మురారిని కృష్ణ అడుగుతుంది. మరొక వైపు కృష్ణ, మురారీల గదిలో "ముకుంద, మురారి" అనే పేర్లతో డెకరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మురారికి ముకుంద ఫోన్ చేసి.. మన ప్రేమ గురించి పెద్ద అత్తయ్యకి చెప్తున్నా అని చెప్పగానే.. మురారి వద్దు అంటాడు. ఆ లోపే ముకుంద ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి ఏసీపీ సర్ ఎవరినైనా ప్రేమించారా? చెప్పట్లేదని కృష్ణ అడుగుతుంది. దాంతో అందరి ముందు అలాగేనా అడిగేది అని కృష్ణపై రేవతి కోప్పడుతుంది. మరొకవైపు ముకుంద తన ప్రేమ విషయం భవానికి చెప్పాలని అనుకొని డెకరేషన్ చేసిన దగ్గరికి భవానిని తీసుకొని వెళ్తుంది. అప్పుడే కృష్ణ, మురారి, రేవతి ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన మధు.. కృష్ణ వాళ్ళు వచ్చారంటూ అరుస్తాడు. భవాని లోపలికి వెళ్లకుండానే కృష్ణ వాళ్ళు వచ్చారని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక వెళ్లిపోద్ది అనుకున్న కృష్ణ మళ్ళీ వచ్చిందని తెలిసి ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!  

వర్షం వల్ల చందమామ బర్త్ డే?

వర్షం వల్ల చందమామ బర్త్ డే?ఏంటని అర్థం కాలేదు కదా.. చందమామ అనేది పాప పేరు.. అవును నిజమే అంజలి పవన్ వాళ్ళ పాప పేరు 'ఆద్య' ముద్దుపేరు చందమామ. అంజలి పవన్ తన కూతురికి ఇష్టంగా పెట్టుకున్న పేరు 'చందమామ'. అంజలి అత్తోట.. ఈ పేరు ఎవరికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అంజలి పవన్ అందరికి సుపరిచితమే. కారణం యాక్టర్ పవన్ ని పెళ్ళి చేసుకొని ఫేమస్ అయింది. టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు యాక్టర్ గా మరొకవైపు యాంకర్ గా కెరీర్‌ ని స్టార్ట్ చేసింది అంజలి పవన్. మొగలిరేకులు సీరియలో నటించిన అంజలి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తనకి బోలెడు సినిమాల్లో, టెలివిజన్ రంగంలో ఆఫర్లు వచ్చాయి. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలి హైదరాబాద్ లో జన్మించింది. తన వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను ఎంతో  ఉన్నంతంగా ఉంటుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లని చూస్తుంటేనే తెలుస్తుంది. అయితే జనవరి 24, 2015  న సినిమా రంగంలో పనిచేస్తున్న సంతోష్ పవన్ ని పెళ్ళిచేసుకుంది అంజలి. అప్పటినుండి తన పేరును అంజలి పవన్ గా మార్చుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అంజలి పవన్. అంజలి తన భర్త పవన్ తో కలిసి 'నీతోనే డ్యాన్స్ షో' లో పర్ఫామెన్స్ చేసింది. వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు రాధ, తరుణ్ మాస్టర్, సదా అంతా ఫిధా అయ్యారు‌. ఈ వయసులో ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం చాలా కష్టమంటూ రాధ కూడా తనని పొగిడారు. అయితే బిగ్ బాస్ సీజన్-7 కి తను సెలెక్ట్ అయినట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  అంజలి పవన్ యొక్క 'ఇట్లు మీ అంజలిపవన్' యూట్యూబ్ ఛానెల్ లో ఇప్పటికే చాలా రకాల వ్లాగ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా వాళ్ళ పాప పుట్టిన రోజు వేడుకని ఘనంగా చేసింది అంజలి పవన్.  ' వర్షం వల్ల చందమామ 3rd బర్త్ డే' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసింది అంజలి పవన్. అయితే ఈ వేడుకకి గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, పాగల్ పవిత్ర, జెస్సీ, ఇంకా చాలా సెలబ్రిటీలు వచ్చారు. అయితే అంజలి పవన్ వాళ్ళ పాప చందమామ బర్త్ డే ని 'సొసైటీ పార్క్' లో అవుట్ డోర్ లో చేశారు. అయితే వర్షం రావడంతో అదంతా ప్లాప్ అయిందని, మళ్ళీ బర్త్ డేకి చేసినవన్నీ వాళ్ళింట్లోకి  మార్చేసారని చెప్పింది అంజలి పవన్. బర్త్ డే కి వచ్చిన  గెస్ట్ లు అంతా ఎక్కడివాళ్ళు అక్కడే ఉన్నారని, సరిగ్గా పట్టించుకునేంత టైమ్ కూడా లేదని అంజలి పవన్ ఈ వ్లాగ్ లో చెప్పింది.  

ఎందుకయ్యా ఇలాంటి సినిమాలు తీసి జనాల్ని ఏడిపిస్తున్నారు!

బేబీ సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అయితే సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నట్టు చాలా మంది చెప్పారు ‌ తాజాగా గీతు రాయల్ ఈ సినిమా గురించి కామెంట్ చేసింది. బేబి సినిమా గురించి ఇప్పటికే మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇలాంటి సినిమాలు తీసి మనుషులను ఏడ్పించడం ఎందుకంటూ తిట్టేసింది గీతు రాయల్. గీతు రాయల్ తన ఇన్ స్టాగ్రామ్ లో 'బేబీ' సినిమా తీసిన డైరెక్టర్ ని ,హీరో హీరోయిన్ ని ట్యాగ్ చేస్తూ తిట్టింది. ఎందుకయ్యా జనాల్ని ఇలా ఏడిపిస్తున్నారని తిట్టింది. అసలు  విషయానికొస్తే గీతు రాయల్ భర్త వికాస్ బేబి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతూ ఏడ్చాడు. ఇతను తమిళ నేపథ్య కుటుంబానికి చెందినవాడు. ఇంజనీర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన వికాస్.. గీతు రాయల్ ని పెళ్ళి చేసుకున్నాడు. గీతు రాయల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో.. తన ఆటతీరు బాగుందంటూ చాలా సంతోషంగా ఉందంటూ చెప్పిన విషయం తెలిసిందే. వికాస్ ఎమోషనల్ అంటూ తన భార్య గీతు రాయల్ చాలా సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.

ట్రెండింగ్ లో హరిత జాకీ కొత్త వ్లాగ్ !

చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. అగస్ట్ 14, 2001లో హరిత జాకీని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి. హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. తన కొత్త సీరియల్ కోసం తీసుకున్న శారీస్ అని ఒక‌ వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కోసం తీసుకున్మ బంగారం అంటూ ఒక వ్లాగ్, షూటింగ్ నుండి వచ్చాక ఇది నా పరిస్థితి అంటూ మరొక వ్లాగ్ చేయగా అన్నింటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 'మా అబ్బాయితో ఒక రోజు' అంటూ వాళ్ళ కొడుకిని పరిచయం చేసిన హరిత జాకీ, ఆ తర్వాత బాలింతల కోసం 'బాలింతలకు భళే కూర' అనే వ్లాగ్ చేసి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు తాజాగా 'వరలక్ష్మి వ్రతం.. తాంబూలం.. పేరంటం' పేరిట వ్లాగ్ ని చేసింది. వరలక్ష్మి వ్రతం చేసిన హరిత.. ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుంది. విష్ణుప్రియ, శ్రీవాణి, ఇలా అందరు సీరియల్ యాక్టర్స్ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని వారికి తన ఆశీర్వాదం ఇచ్చి వచ్చింది హరిత. కాగా ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. పద్మావతి కళ్యాణం సీరియల్ అభిమానులు హరిత జాకీ నటనకి, ఆమె సింప్లిసిటీని విశేషంగా ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు యూట్యూబ్ లో తన ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ కి కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.  

మా కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం!

శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది. శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి, గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. అయితే తన యూట్యూబ్ ఛానెల్ లో 'పెద్దమ్మ తల్లికి యాటను కోసినం' అనే వ్లాగ్ వైరల్ అయింది.  తాజాగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం.. ఇలా జరుగుతుంటు శివజ్యోతి‌ వ్లాగ్ చేసింది. ఇందులో బుల్లితెర నటీ నటులు తమ తన భర్తలతో వచ్చి సర్ ప్రైజ్ చేసారు‌. కాగా వచ్చిన ప్రతీ ఒక్కరి కాళ్ళకి పసుపు రాసి, మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంది శివజ్యోతి‌. అలాగే కొత్త కొత్త రీల్స్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా  ఉంటుంది.

అసలు బ్యాంకాక్ ట్రిప్ లో ఏం జరిగిందంటే!

  సెలబ్రిటీలకి ఉండే క్రేజే వేరు. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సెలబ్రిటీకీ అయిన ఏదైనా ప్రదేశానికి వెళ్తే విఐపీ ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ఇనయా సుల్తానా తాజాగా బ్యాంకాక్ వెళ్ళి వచ్చింది. అయితే తను వెళ్ళే ప్రయాణంలో ఏం జరిగిందో వివరించింది ఇనయా సుల్తానా. ఇన్ స్టాగ్రామ్ లో  ఇనయా ఫాలోయింగ్ బాగానే ఉంది.   బాస్ సీజన్-6 తో ఫేమస్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత  క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పి‌న ఇనయా‌‌.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది.  కాగా రెగ్యులర్ గా తన ఫోటోలని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది ఇనయా. ఎప్పటికప్పుడు కొత్త ప్రయాణాలు, కొత్త ఫోటోలతో ట్రెండింగ్ లో ఉంటుంది ఇనయా. కాగా బ్యాంకాక్ వెళ్ళి అక్కడ జల్సా చేసి వచ్చింది ఇనయా. అదంతా ఒక వ్లాగ్ లో చెప్పింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ లో తనని సెలబ్రిటీగా గుర్తించిన విమానాశ్రయంంలోని ఒక మేనేజర్.. ఇనయాకి సెలబ్రిటీ హాదాని కల్పించి తన ప్రయాణానాన్ని సులభంగా చేసాడంట. ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళి, అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసి హోటల్ రూమ్ కి వెళ్ళింది. అక్కడ తను స్ట్రీట్ షాపింగ్ లో కొన్న రకరకాల డ్రెస్ లని వేసుకొని చూపించి, ఈ డ్రెస్ లలో మీకు ఏవి నచ్చాయో కామెంట్ చేయమని ఇనయా అంది. అలాగే అక్కడి నుండి పటాయా బీచ్ కి ట్యాక్సీ లో వెళ్ళినట్టుగా చెప్పింది. అక్కడ సరదాగా తనకిష్టమైన పనులు చేస్తుంది ఇనయా. పటాయా బీచ్ లోని సముద్రం, బీచ్,  అక్కడ ఫ్రూట్ షాప్ లో తనకెంతగానే ఇష్టపమైన మామిడిపండ్లను చూస్తూ మురిసిపోయింది‌‌. ఇలా బ్యాంకాక్ ట్రిప్ జరిగిందంటూ ఇనయా తన వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.

హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప...వెరైటీగా విష్ చేసిన షన్ను

  బుల్లితెర మీద సోషల్ మీడియాలో షన్ను, జెస్సి తెలియని వారంటూ ఎవరూ లేరు. నిన్న జెస్సి బర్త్ డే సందర్భంగా షన్ను సడెన్‌గా కేకు పట్టుకొచ్చి జెస్సికి  సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కేక్ పట్టుకురావడం వరకు ఓకే కానీ ...కేకు మీద ఎవరైనా పేర్లు రాయిస్తారు కానీ ఇక్కడ వెరైటీగా  ఎర్రిపప్ప అని రాయించాడు షన్ను. "హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప.. మనం కలిసాక ఇది ఫస్ట్ బర్త్ డే కదా.. హౌస్‌లో ఇద్దరం దొరికాంరా మనం ఒకరికి ఒకరు. పద నామినేషన్‌కి వెళ్దామా.. ఇంకా బిగ్‌బాస్‌లోనే ఉన్నావ్ కదా.. బయటికి రారా.." అంటూ జెస్సీని హగ్ చేసుకుని   కేక్ కట్ చేయించాడు షన్ను. "తినండి.. షన్ను ప్రేమగా తెచ్చిన కేకు మీ కోసం.." అంటూ నెటిజన్స్ కి కూడా ఒక కేక్ పీస్ పెట్టాడు  జెస్సీ. ఇలా వాళ్లిద్దరూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు జెస్సీ.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు ఇద్దరూ కలిశారు ఓకే కానీ  మరి సిరి ఎక్కడ.. వి వాంట్ సిరి , సిరి ఉంటే చాలా బాగుండేది  అంటూ కామెంట్లు పెడుతున్నారు. జెస్సీ బర్త్‌డేకి సిరి ఎందుకు రాలేదంటూ  జెస్సీని అడుగుతున్నారు. నిజానికి హౌస్‌లో ఉన్నప్పుడు సిరి-షన్ను- జెస్సీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు.  కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ  మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేసేసుకున్నారు. దీని గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జెస్సీ రియాక్ట్ అయ్యాడు. "వాళ్లు నన్ను ఎందుకు దూరం పెట్టారో నాకు తెలీదు కానీ.. నేనైతే వాళ్లను ఇప్పటికీ ఫ్రెండ్స్‌లానే చూస్తున్నానని" అంటూ ఎమోషనల్ అయ్యాడు జెస్సి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్దిరోజులకి జెస్సీని సిరి కలిసింది. కానీ షన్ను మాత్రం రాలేదు. ఇప్పుడు కూడా షన్ను-జెస్సీ కలిశారు కానీ సిరి రాలేదు.  మరి సిరి వస్తుందా వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలుస్తారా..చూద్దాం.  

ఆహాలో "ఫామిలీ ధమాకా"...హోస్ట్ గా విశ్వక్ సేన్...

ఆహా ప్లాట్ఫార్మ్ పై కొత్త షో త్వరలో ఆడియన్స్ ని పలకరించబోతోంది. అదే "ఫామిలీ ధమాకా".. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 8 నుంచి ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో స్ట్రీమ్ కాబోతోంది. ఐతే ఈ షోకి ఫస్ట్ టైం హోస్ట్ గా మన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చేసాడు. ఈ షోలో కొన్ని జనరల్ ఫామిలీస్ ని ఇన్వైట్ చేసి గేమ్ షో ఆడించాడు అందులో ఒక ఫామిలీని ఒక ప్రశ్న వేసాడు "తక్కువ బట్టలేసుకునే పబ్లిక్ ప్లేస్ ఏమిటి" అని అడిగేసరికి ఒక పెద్దాయన "గోవాలో తక్కువ బట్టలు వేసుకోవడం చూసాం..తగ్గేదేలే" అని ఆన్సర్ ఇచ్చేసరికి "అల్లు అర్జున్ గారు కూడా తగ్గేదేలే అనే పదం అన్ని సార్లు అనుండరు అనేసరికి మిమ్మల్ని చూస్తుంటే మూడ్ వస్తోందంటూ" కౌంటర్ వేశారు ఆ పెద్దాయన. "నన్ను చూస్తే మూడ్ రావడం ఏమిటా అని" రివర్స్ లో అడిగాడు మాస్ కా దాస్. తర్వాత కొంతమంది ఫేమస్ సింగర్స్ తో లడ్డులు తినిపిస్తూ పాటలు పాడించాడు. ఆ తర్వాత ఒక లేడీని "విశ్వక్ సేన్ ఎలా ఉంటాడు" అనేసరికి "మహేష్ బాబు బాగుంటాడు" అని చెప్పింది. ఇలా రాబోయే ఎపిసోడ్ ప్రోమోస్ ని బిట్స్ గా చూపించారు.. ఫైనల్ గా "ఫామిలీ ధమాకా... ఇది దాస్ కా ఇలాకా" అంటూ ఎండింగ్ చెప్పాడు విశ్వక్ సేన్. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్.  విశ్వక్సేన్ మూవీస్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కేవలం ఒక జానర్ మూవీస్ కె పరిమితం కాకుండా అన్ని రకాల మూవీస్ ని ఎంపిక చేసుకుంటాడు.  ప్రేమ కథ చిత్రాలతో పాటు మాస్ మసాలా సినిమాలు కూడా చేస్తున్నాడు. పాగల్, అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా.. లాంటి మూవీస్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి.  ఫలక్ నుమదాస్, దాస్ కా ధమ్మీ, ముఖచిత్రం, హిట్ లాంటి డిఫరెంట్ యాంగిల్ లో కనిపించే మూవీస్ లో కూడా నటించి తన సత్తా చాటాడు.  ఇక ఇప్పుడు ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ పైకి హోస్ట్ గా ప్రతీ వారం అలరించడానికి వచ్చేస్తున్నాడు.

సైంటిస్ట్ న్యూటన్ మీద జోక్ .. వార్నింగ్ ఇచ్చిన నెటిజన్

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఈ వారం షో మంచి ఎంటర్టైనింగ్ గా ఉండేట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఫుల్ వైరల్ అవుతోంది. ఇందులో నూకరాజు, నాటీ నరేష్ స్కిట్ లో డైలాగ్స్ ఫుల్ ఫన్నీగా ఉన్నాయి. "బయట యూత్ అంతా ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటే మీరేం కనిపెడుతున్నారు" అంటూ నరేష్ నూకరాజు మీద ఫైర్ అవుతాడు "మీరు ఆపిల్ చెట్టు కింద ఉన్నప్పుడు ఆపిల్ కింద పడినప్పుడు మీరేం చేస్తారు" అని నూకరాజుని అడిగాడు నరేష్ "తినేస్తాం" అని చెప్పాడు నూకరాజు. "న్యూటన్ అలా చేయడు" అని నరేష్ చెప్పేసరికి "ఎందుకు ఆయనకు షుగరా" అన్నాడు నూకరాజు అనేసరికి నరేష్ నవ్వేసాడు. తర్వాత హోస్ట్ సౌమ్య వచ్చి "రక్షా బంధన్ కదా నాకు రక్షా కావాలి" అనేసరికి "మాకు శిక్ష కాకూడదు" అని చెప్పాడు. "ఆసియాని పక్కన బెట్టుకుని ఏంటామాటలు" అని ఇంద్రజ నూకరాజుని అడిగారు "గుండెల్లో నాలుగు గదులు ఉంటాయి . ఒక గదిలో ఆసియా ఉంటుంది. మిగతా గదుల్లో వీళ్ళు ఉంటారు" అని చెప్పాడు. దానికి సౌమ్య, ఇంద్రజ షాకయ్యారు. ఇక నూకరాజు న్యూటన్ మీద వేసిన కౌంటర్ కి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు " న్యూటన్  గారి  మీద  జోక్స్  వెయ్యడం  కరెక్ట్  కాదు ...ఆయన ఒక గ్రేట్ సైంటిస్ట్..మీ మైండ్ లో పెట్టుకోండి మర్చిపోకండి. కామెడీ కామెడీలా  ఉండాలి వెటకారంగా కాదు" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక వెంకీ మంకీ వేసిన ఏ సర్టిఫికెట్ జోక్  అర్ధం కాలేదంటూ తాగుబోతు రమేష్ అనేసరికి " ఆ జోక్స్ అర్ధం కావాలంటే  మినిమం డిగ్రీ చేసి ఉండాలి కింది స్థాయి వాళ్లకు అర్ధం కాదు" అంటూ రివర్స్ కౌంటర్ లు వేశారు. చలాకి చంటి, సందీప్ ఇద్దరూ కలిసి చెంబులతో నీళ్లు తీసుకెళ్లే కాన్సెప్ట్ కొంచెం ఫన్నీగా అనిపించింది. అలాగే స్టార్టింగ్ లో రాకెట్ రాఘవ స్కిట్ కూడా వెరైటీగా ఉంది. తన భార్యకు జలుబు చేస్తుందని కాశ్మీర్ హనీమూన్ కి రాఘవ ఒక్కడే వెళ్లడం కాన్సెప్ట్ తో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు రాఘవ.

వాంతి చేసుకున్న స్వప్న.. కావ్య ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -186  లో.. తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం అందరికి తెలిసిపోయేలా ఉందని స్వప్న అనుకొని.. ఎలాగైనా పొట్ట పెంచుకోవాలనుకుంటుంది. స్వప్న బిర్యానీ ఆర్డర్ తెప్పించుకొని తింటుంది. అలా ఒకేసారి ప్లేట్ మొత్తం తినడం చూసిన ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోయి తన దగ్గరకి వచ్చి.. ఎందుకు ఇలా తింటున్నావని అడుగుతుంది. ఏదో ఒక సమాధానం చెప్పి ధాన్యలక్ష్మిని అక్కడ నుండి పంపిస్తుంది. మరొక వైపు కావ్య మనకు  సాయం చేస్తూ అతింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడుతారు. కావ్య సిచువేషన్ అత్తింట్లో ఎలా ఉందో తెలుసుకోవాలని కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది కనకం. వదినకి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పగానే కనకం కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు రాజ్ స్నానం చేస్తుండగా.. తను వేసిన రీడిజైన్స్ ఎక్కడ ఉన్నాయని కావ్య గదిలో వెతుకుతుంది. వాటిని చూస్తూ ఉండగా రాజ్ వచ్చి డిజైన్స్ లాక్కుంటాడు. మీరు వేసిన డిజైన్స్ చూపించండని కావ్య అడుగుతుంది.‌ నేను చూపించనని రాజ్ చెప్తాడు. మరొక వైపు బిర్యాని ఫుల్ గా తిన్న స్వప్న వాంతి చేసుకుంటుంది. అది చూసి ఇందిరాదేవి వచ్చి రుద్రాణి, రాహుల్ లకు స్వప్నని హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్తుంది. ధానికీ రాహుల్ రుద్రాణి సరే అంటారు. ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ఎవరికీ తెలియకుండా అబార్షన్ చెప్పిద్దామని రాహుల్ అనగానే.. ఖచ్చితంగా అందరూ మన మీద డౌట్ పడుతారు. ప్లాన్ ఇప్పుడు వర్క్ అవుట్ కాదని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రాజ్ బట్టలన్ని తీసి కావ్య ఐరన్ చేస్తుంటుంది. అలా చేయడం చూసి నా బట్టలు ఐరన్ ఎందుకు చేస్తున్నావని‌ రాజ్ అడుగుతాడు. మాటల్లో పడి తన తల్లి కావ్యతో ఎవరు మాట్లాడవద్దు అనే షరతుని మర్చిపోయి మాట్లాడతాడు. రాజ్ కి కావ్య మాటకి మాట సమాధానం చెప్పడంతో.. నేను నీ భర్తని నేను చెప్పినట్టు వినాలని రాజ్ అనగానే.. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య ఇంట్లో అందరూ నాతో మాట్లాడేలా చెయ్యాలని అనుకోని కిచెన్ లో వంట చేస్తున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. నాకు హెల్ప్ చెయ్యండి. మీకు వేలు కట్ అయినట్లు, కట్టు కట్టుకొని రండి. నేను వంట చేస్తానని కావ్య చెప్తుంది. అలా కాసేపటికి వంట చేస్తున్న కావ్యని అపర్ణ చూసి ధాన్యలక్ష్మిని పిలుస్తుంది. వంట తను ఎందుకు చేస్తుందని అడగ్గానే.. వేలు కట్ అయిందని ధాన్యలక్ష్మి చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వాడికి నువ్వంటే ప్రాణమని కృష్ణతో చెప్పిన రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ రోజు రోజుకి ట్విస్ట్ లతో ఆకట్టుకుంటుంది. సోమవారం నాటి ఎపిసోడ్ లకు-247 లో..  కృష్ణ అగ్రిమెంట్ పూర్తయిందని వెళ్ళిపోతానని రేవతితో చెప్పడంతో తను కోపంగా మురారి దగ్గరికి వచ్చేస్తుంది. మురారి దగ్గరికి వచ్చిన రేవతి.. మీకు నచ్చినట్డు చేయండి రా, నేను చెప్తే వింటారా, ఎన్ని రోజులని నేను మిమ్మల్ని కలపాలని చూస్తాను. ఎవరిదారి వారు చేసుకుంటున్నారు కదా, మీరిద్దరు విడిపోయి హ్యాపీగా ఉందామనుకుంటున్నారు కదా ఉండండి అని మురారితో రేవతి ఏడుస్తూ అంటుంది. కృష్ణ, మురారీలను కలపాలని చూస్తున్న రేవతిని చూసిన మురారి.. అమ్మ ఎందుమ్మా ఇలా మాడ్లాతున్నావ్ అని అడుగుతాడు. మరేంట్రా అగ్రిమెంట్ అంట విడిపోతారంట అని రేవతి అనగానే.. లేదు అమ్మ, తనంటే నాకు ఇష్టం, కాదు ప్రాణం అని మురారి చెప్తాడు. అది విని రేవతి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. అప్పటివరకు కంటతడిపెట్టుకున్న రేవతి.. ఎప్పుడైతే కృష్ణ లేకపోతే తను బ్రతకలేనని మురారి చెప్పగానే పొంగిపోతుంది. అయ్యో పిచ్చోడా.. నీ మనసులో ఉంది బయట పెట్టడానికి ఇదంతా చేసానని మురారీతో రేవతి అంటుంది. కృష్ణతో నేను మాట్లాడతా అని రేవతి తన దగ్గరికి వెళ్తుంది. కృష్ణ బ్యాగ్ లో బట్టలు సర్దుకొని ఒక దగ్గరికెళ్ళి ఏడుస్తుంది. అప్పుడే రేవతి తన దగ్గరికి వెళ్ళి.. ఏంటి కృష్ణ ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య అని అంటుంది. అన్నీ సర్దుకున్నావా? పదా మనింటికి వెళ్దామని రేవతి అనగానే కృష్ణ ఆశ్చర్యపోతుంది. అప్పుడే కృష్ణకి వాళ్ల బాబాయ్ కాల్ చేస్తాడు. బయల్దేరుతున్నాని కృష్ణ ఫోన్ లో చెప్తుంటే రేవతి ఆ ఫోన్ లాక్కొని.. మీరెవరో నాకు తెలియదు. నేను కృష్ణ వాళ్ల అత్తయ్యని, తనెక్కడికి రాదు మా ఇంట్లోనే ఉంటుందిని చెప్తుంది. ఆ తర్వాత ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు నేను మా ఇంటికి వెళ్తానని చెప్పాను కదా అని రేవతితో కృష్ణ అంటుంది. నువ్వంటే మురారికి ప్రాణం, నువ్వు ఎక్కడ దూరమవుతావేమోనని ఇక్కడికి డ్యూటీ వేయించుకున్నాడని కృష్ణతో రేవతి అంటుంది. లేదు అత్తయ్య తన మనసులో నేను లేనని కృష్ణ అంటుంది. వాడి మనసంతా నువ్వే ఉన్నావ్.. ఇంకెవరూ లేరు, పదా నువ్వు ఎక్కడ వెళ్లిపోతావేమో అని వాడు టెన్షన్ పడుతున్నాడని రేవతి అంటుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏంజిల్ ప్రేమని రిజెక్ట్ చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -853 లో.. ఏంజిల్ అందంగా రెడీ అయి రిషి కోసం ఎదురు చూస్తుంటుంది. అంతలోనే రిషి వస్తాడు. రిషి నీతో మాట్లాడాలి నీకోక సర్ ప్రైజ్ అని ఏంజిల్ చెప్తుంది. రిషి చెయ్యి పట్టుకొని మేడపైకి తీసుకొని వెళ్తుంది ఏంజిల్. మరొక వైపు ఏంజిల్ కి క్యాండీలైట్ డిన్నర్ ఐడియా ఇస్తుంది వసుధార. దాంతో వసుధార టెన్షన్ పడుతు ఉంటుంది. ఐడియా అయితే ఇచ్చాను. అసలేం జరిగి ఉంటుంది.. రిషి సర్ ఏంజిల్ తో డిన్నర్ కి వెళ్లాడా అని ఏంజిల్ కి ఫోన్ చేస్తుంది వసుధార. ఏంజిల్ ఫోన్ ఇంట్లో పనిమనిషి లిఫ్ట్ చేసి ఏంజిల్ రిషిని పైకి తీసుకొని వెళ్ళిందని చెప్పగానే వసుధార నిరాశ చెందుతుంది. మరొక వైపు  రిషి వెళ్లి చూసేసరికి క్యాండీలైట్ డిన్నర్ కి అంత రెడీ చేస్తుంది ఏంజిల్. ఏంటి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావ్? నాకు ఇలాంటివి నచ్చావ్. ఇలాంటి ప్రయత్నం చెయ్యకని చెప్పాను కదా అని ఏంజిల్ పై‌ రిషి అరుస్తాడు. ఏంటి రిషి అలా అంటావ్.. నీకోసం కష్టపడి ఇలా చేస్తే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని ఏంజిల్ అంటుంది. నీ హద్దుల్లో నువ్వు ఉండమని ఏంజిల్ ని రిషి అంటాడు. హద్దుల గురించి మాట్లాడుతున్నావ్ నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని ఏంజిల్ అడుగుతుంది. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. నీకు ఇంతకు మించి కోపంగా చెప్పలేను. నువ్వు నా ఫ్రెండ్ వి అని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. రిషి మాటలు తల్చుకొని ఏంజిల్ బాధపడుతుంది. ఆ తర్వాత క్యాండీలైట్ డిన్నర్ ఐడియా ఇచ్చిన వసుధారని రిషి కలిసి తన కోపాన్ని మొత్తం చూపిస్తాడు. ఎందుకిలా చేస్తున్నావని వసుధారతో రిషి అంటాడు. క్యాండీలైట్ డిన్నర్ చేసి వచ్చారా అని వెటకారంగా వసుధార అనగానే.. నేను ఎందుకు చేస్తాను. అక్కడ నువ్వు లేవు కదా అని రిషి అనగానే.. నేను ఉంటే చేస్తారా అని వసుధార సంతోషపడుతుంది. ఇకనైనా ఏంజిల్ కి అలా ఐడియాలు ఇవ్వడం మానేయ్యండని వసుధారకి  స్వీట్ వార్నింగ్ ఇస్తాడు రిషి. మరొక వైపు వసుధార దగ్గరికి ఏంజిల్ వచ్చి.. క్యాండీలైట్ డిన్నర్ ప్లాన్ ని రిషి అప్సెట్ చేసాడని చెప్తుంది. మరొక ప్లాన్ చేసి రిషి మనసులో ఏం ఉందో తెలుసుకుంటానని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత వసుధార కాలేజీకి వెళ్తుంది. అప్పుడు వసుధారకి మహేంద్ర ఫోన్ చేసి.. రిషి గురించి తెలుసుకుంటాడు. అప్పుడే రిషి వచ్చి ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడుతూన్నారని అడుగుతాడు. మహేంద్ర సర్ తో అని వసుధార చెప్పగానే.. ఇక్కడ విషయాలు అన్ని చెప్పకండని వసుధారకి‌ రిషి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కీర్తిభట్ ని గీతు రాయల్ పిలవలేదంట!

  కీర్తిభట్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి సుపరిచితమే. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 లో ఒక్కరిగా ఉన్న కీర్తిభట్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్-6 లో ఎంట్రీ ఇచ్చిన కీర్తిభట్ మొదటి నుండి ఒక్కతే గేమ్స్ ఆడేది. ఎవరి సపోర్ట్ ఉండేది కాదు. మొదటగా ఆరోహీ, ఇనయాలతో క్లోజ్ గా ఉన్న కీర్తిభట్ ఆ తర్వాత చిన్న చిన్న గొడవలతో వారికి దూరంగా ఉంది. ఆ తర్వాత అందరూ తనని కార్నర్ చేసి గేమ్ ఆడుతున్నారని ఫీల్ అయ్యేది. అయితే ఒకసారి తన ఫ్యామిలీ గురించి చెప్పమన్నప్పుడు.. తనకు ఎవరూ లేరని, అందరూ యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పడంతో హౌస్ లో ఉన్నవాళ్ళంతా తనపై జాలి చూపించారు. ఆ తర్వాత శ్రీసత్య, శ్రీహాన్ లతో ఎప్పుడూ గొడవల్లో నిలుస్తూ స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంది. ఇక ఫ్యామిలీ వీక్ లో అందరికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు వస్తుంటే.. కీర్తిభట్ కి మాత్రం ఎవరూ లేరని, ఎవరూ రారని బాధపడింది. దాంతో తన ఫ్రెండ్ మహేశ్ ని హౌస్ లోకి పంపించి తనకి హ్యాపీ నెస్ చేకూర్చారు బిగ్ బాస్ టీమ్. ఇక టాప్-5 లో ఒకరిగా నిలిచి అందరి అభిమానాన్ని దక్కించుకుంది కీర్తిభట్. కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. సొంతంగా ' మీ ఇంటి అమ్మాయి కీర్తి' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది‌‌. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ' ఆస్క్ మీ క్వశ్చనింగ్'  స్టార్ట్ చేసింది. అందులో ఒక్కో అభిమాని అడిగే ప్రశ్నలను సమాధానలు చెప్పింది కీర్తి. 'చల్లని రాతిరి వెన్నెల్లో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసే అనే పాట పాడింది ఆరోహీ'.. అది విని షాక్ అయిన కీర్తీ భట్ వామ్మో అని రిప్లై పెట్టింది. అయితే తాజాగా గీతు రాయల్ బర్త్ డే సందర్భంగా జరిగిన పార్టీకి శ్రీసత్య, వాసంతి హాజరయ్యారు. మీకు ఇన్విటేషన్ రాలేదా అని ఒకరు అడుగగా.. రాలేదని కీర్తిభట్ చెప్పింది. ఇ‌ంకా శ్రీహాన్, శ్రీసత్య వాళ్ళతో మాట్లాడట్లేదా అని ఒకరు అడుగగా.. లేదని , ఎవరి స్పేస్ వాళ్ళదని కీర్తిభట్ అంది. ఇలా కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ కి రిప్లై ఇచ్చింది కీర్తిభట్. ‌కాగా ఇప్పుడు ఇది ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.  

మెహబూబ్ చేసిన సర్ ప్రైజ్ కి కంటతడి పెట్టుకున్న లాస్య మంజునాథ్!

మెహబూబ్.. ఒకవైపు డ్యాన్స్, మరొకవైపు జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ సిక్స్ ప్యాక్స్ తో కనిపిస్తుంటాడు. బిబిజోడీలో శ్రీసత్యతో కలసి జోడికట్టి అదరహో అనిపించేలా డ్యాన్స్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహబూబ్.. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. మెహబూబ్ హైదరాబాద్ లో పుట్టాడు. అనేక షార్ట్ ఫిల్మ్ లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇతనొక యూట్యూబర్, నటుడు, డ్యాన్సర్. అందరు ఇతడిని మెహబూబ్ దిల్ సే అని పిలుచుకుంటారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఇతడు చేసిన టిక్ టాక్ లకి ఫుల్ క్రేజ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అలాగే  మెహబూబ్ ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశాడు. అందులో అతని రీల్స్, వ్లాగ్స్ అన్నింటిని షేర్ చేయగా అన్నీ అత్యధిక వీక్షకాధరణ పొందుతున్నాయి. బిగ్ బాస్ సీజన్-4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తనదైన శైలితో గేమ్స్ ఆడి, టాస్క్ లు పూర్తిచేసి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతడికి పలు సినిమాల్లో అవకాశం వచ్చింది. జబర్దస్త్ లో కూడా అప్పుడప్పుడు మెరిసి తనలోని కామెడీని కూడా పరిచయం చేశాడు. ఇలా మల్టీ ట్యాలెంట్ గా ఉన్న మెహబూబ్ సెలబ్రిటీ రేంజ్ ని పొందాడు. తాజాగా మెహబూబ్.. స్వీట్ సిస్టర్ గా భావించే లాస్య మంజునాథ్ పుట్టినరోజున  తనకి తెలియకుండా వాళ్ళింటికి వెళ్లి సడన్ గా డోర్ తీసి హ్యాపీ బర్త్డే అంటూ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అది చుసిన లాస్య ఫుల్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంది. ఇదంతా మెహబూబ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఈ పోస్ట్ కి లాస్య మంజునాథ్ ని ట్యాగ్ చేసాడు. దీంతో మెహబూబ్ అభిమానులు, లాస్య అభిమానులు చూస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీ ఇద్దరి బాండింగ్ బాగుంది. సొంత అక్క, తమ్ముడు కూడా ఇలా ఉండరంటూ అభిమానులు కామెంట్లు చేయగా, ఒక్కొక్కరికి లాస్య రిప్లై ఇస్తూ ఎమోషనల్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. 

పాత పాటలు పాడుతూ నెటిజన్లపై ఆరోహీ రావు దాడి!

ఇన్ స్టాగ్రామ్ లో పాత పాటల హవా నడుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా సెలబ్రిటీలంతా పాత పాటలకి ఫోటోలతో ,వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. కాగా ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పాత పాటలు పాడుకుందామా అంటూ ఆస్క్ మి‌ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో ఒక్కో అభిమాని ఒక్కోలా స్పందించగా వాటికి ఆమె తన గొంతుతో పాటలు పాడి వినోదాన్ని పంచింది. ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు.  ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహీ, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపిన ఆరోహీ.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.  బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో ఎక్కువ రోజులు ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడిపి ఎలిమినేషన్ అయిన ఆరోహీ.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అయితే హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆర్జే సూర్యతో రీల్ ని చేసింది. కీర్తిభట్ పెళ్ళికి అందరు కలిసి వెళ్ళి అక్కడ సరదాగా గడిపారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పాత పాటలు పాడుకుందామని స్టార్ట్ చేసింది..  నీ ఫేవరేట్ సాంగ్ ఏంటి అని ఒకరు అడుగగా..  ఓ నా రాజా అంటూ పాడింది ఆరోహి. ఆ తర్వాత వసంతం సినిమాలోని గాలి చిరుగాలి పాట పాడమని ఒకరు అడుగగా తను పాడి వినిపించింది. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అంటూ ఆరోహీ పాడింది.  'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదో' నుండి  మొదలుపెట్టి వరుసగా పాత పాటలు పాడుతూ తన అభిమానులకి వినోదాన్ని పంచింది ఆరోహీ రావు.  

మొసళ్లతో ఆడుకుంటున్న హిమజ!

హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో‌ నటించిన హిమజ..‌ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది. అయితే ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉంటోంది హిమజ. తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా విదేశాలలో ట్రావెల్ చేసి వచ్చి‌న హిమజ .. మూడు నెలల క్రితం పులులతో ఆడుకోవచ్చు అనే వ్లాగ్ చేయగా దానికి అత్యధిక వ్యూస్ వచ్చాయి. తన హోమ్ టూర్ కి ముప్పై నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయంటే తను ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలుస్తుంది. ఇప్పుడు మరొక వ్లాగ్ తో వచ్చింది. నీళ్లలోని మొసళ్లతో ఆడుకుంటూ కనిపించింది.  బ్యాంకాక్ లోని ' ది మిలియనీర్స్ స్టోన్ పార్క్ అండ్ క్రోకోడైల్స్ పార్క్' లోకి హిమజ వెళ్ళింది. అక్కడ మొసళ్ళకి ట్రెయినింగ్ ఇస్తుంటారంటూ చూపించింది హిమజ. ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది. కాగా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

నీతోనే డాన్స్ విజేతలు ఆట సందీప్-జ్యోతి జోడి...

నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలే పూర్తి చేసుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీని  ప్రైజ్ మనీ అందించనున్నారు. అమర్‌దీప్- తేజస్విని, నిఖిల్- కావ్య, ఆట సందీప్-జ్యోతి , సాగర్- దీప , నటరాజ్- నీతు టైటిల్ కోసం పోటీ పడ్డాయి. ఇక ఫైనల్ గా జడ్జెస్ ఒక్కొక్కొరు చెప్పలేక గెస్ట్ విజయ్ కి ఈ పని అప్పజెప్పి పక్కకు వచ్చేసారు. ఐతే ఇన్ని వారాలుగా గొడవలు పడుతూ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో పోటీ పడుతూ ఇప్పుడు ఫైనల్స్ కి వచ్చారు. ఇక ఫైనల్ లో ఆట సందీప్- జ్యోతి జోడి టైటిల్ విన్ అయ్యారు. అలాగే 20 లక్షల చెక్ కూడా అందుకున్నారు. ఐతే వీళ్లకు ట్రోఫీ రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నీతోనే డాన్స్ షోలో ఆట సందీప్ జంట ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్స్, నటరాజ్ మాస్టర్ కూడా ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్. ఈ రెండు జోడీలు తప్పించి మిగిలిన వారు సీరియల్ ఆర్టిస్ట్స్. అసలు మామూలు డాన్సర్స్ తో కొరియోగ్రాఫర్స్ ని మిక్స్ చేయడమే తప్పు అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐతే టైటిల్ కోసం ఈ అని  జంటలు ఏ వారానికి ఆ వారం ఫైనల్ అన్నట్టుగానే డాన్స్ చేశారు. ఆల్రెడీ కొరియోగ్రాఫర్ గా ఉన్న వాళ్ళు టైటిల్ గెలవడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు అని అంటున్నారు.  కేవలం డాన్స్‌ని మాత్రమే కాకుండా బిహేవియర్ కూడా చాలా అవసరం అంటున్నారు నెటిజన్స్. ఐతే  ఆట సందీప్ డాన్స్ పరంగా ఇరగదీస్తాడు కానీ  బిహేవియర్ విషయంలో మాత్రం అంత కరెక్ట్ కాదు అని డాన్స్ లవర్స్, నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐతే త్వరలో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 కి ఆట సందీప్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడికి వచ్చాక  రెండో వారంలోనే ఇంటికి పంపేస్తాం అని  అంటున్నారు.