ఆడాళ్ళు మీకు జోహార్లు అంటున్న సుమ కనకాల!

వరలక్ష్మి వ్రతమంటే ఆడవాళ్ళకి ఎంత స్పెషలో అందరికి తెలిసిందే. అందులోను సెలబ్రిటీలు చేసే హాడావిడి అంతా ఇంతా కాదు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరూ గ్రాంఢ్ గా జరుపుకుంటారు. ఇప్పుడు అదే కోవలో సుమ చేరింది. ఈ వరలక్ష్మి వ్రతానికి తను ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ ఎంత బిజీగా ఉంటారో దానికి సంబంధించిన ముచ్చట్లన్ని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది సుమ. అన్ని రకాల వంటలతో ఆ రోజంతా ఖాళీ లేకుండా ఉంటారని సుమ చెప్పుకొచ్చింది. బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.  అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ ' స్ట్రెస్ బస్టర్స్ ' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే  సుమ.. ' వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా  అది వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారు. ఎన్ని పనులు చేస్తారో తెలియజేస్తూ ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సుమ కనకాల. ‌ 'లేడీస్ ఆన్ పూజా డేస్' అనే క్యాప్షన్ తో అప్లోడ్ చేసింది సుమ. కాగా ఈ వీడియోకి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు  

ఎందుకు నవ్వుతానో, ఎందుకు ఏడుస్తానో తెలియదు.. నేను  కొంచెం తేడా!

  హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే హరితేజ గత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంబంధించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అలాగే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. సీరియల్స్ తో మొదలైన తన కెరీర్.. టీవీ షోస్, యాంకరింగ్ అంటూ బిజీ లైఫ్ ని  లీడ్ చేస్తుంది. ఇలా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మొదటి సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అందరి మెప్పు పొందింది. వీటితో పాటుగా డాన్స్ షోలలో సైతం తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది హరితేజ. నితిన్, సమంత నటించిన 'అఆ' మూవీ లో హరితేజ చేసిన కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో పలువురి ప్రశంసలు అందుకుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి కాంప్లిమెంట్ తీసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అవుటింగ్ కి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ ఫోటోలని వీడియోలని షేర్ చేస్తుంది హరితేజ. తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి పాటలు పాడుతూ కనిపించింది. అయితే ఒక పాట పాడటానికి ఎంత సాధన చేయాలో, ఎన్ని టేక్స్ అవుతాయో చెప్తూ తీసిన ఓ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఒక వీడియోకి .. " నేను ఎందుకు నవ్వుతానో తెలియదు, ఎందుకు ఏడుస్తానో తెలియదు.. నేను కొంచెం తేడా" అని  క్యాప్షన్ రాసింది హరితేజ. అయితే ఇది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతోంది. తనేం చేసిన వెరైటీగానే చేస్తానంటూ భిన్నమైన పోజ్ లతో ఫోటోలకి ఫోజులిచ్చే హరితేజ.. ఇలా తనని తాను ఎందుకు అందోనని నెటిజన్లు స్పందిస్తున్నారు.

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో శివాజీ!

హీరో శివాజీ.. ఈ పేరు అందరికి సుపరిచితమే. కొన్ని సినిమాలలో హీరోగా మారి కొన్ని సినిమాలలో సెకండ్ హీరో గా తన నటనతో అందరిని మెప్పించాడు శివాజీ. పాత్ర చిన్నదైన పెద్దదైన శివాజి తన పాత్రకి న్యాయం చేసి ప్రశంసలు పొందిన హీరో. శివాజీ గత కొంతకాలంగా తెర మీద కన్పించడం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శివాజి తన కెరీర్ నీ మొదటగా ప్రముఖ టీవీ ఛానల్ లో ఎడిటర్ గా మొదలుపెట్టి.. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి తో చాలా సినిమాల్లో నటించాడు. శివాజీకి నటుడిగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం 'మిస్సమ్మ' అని చెప్పొచ్చు. లయ, భూమిక ఇద్దరు హీరోయిన్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఆప్పట్లో హిట్ టాక్ ని తెచ్చుకుంది. ప్రియమైన నీకు, ఒట్టేసి చెప్తున్న, యువరాజ్, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియనేస్తం, ప్రేమంటే ఇదేరా, అమ్మాయి బాగుంది, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, అదిరింది అయ్యా చంద్రం.. ఇలా చెప్పుకుంటూ పోతే శివాజి నటించిన చిత్రాల  జాబిత ఎక్కువే ఉంది. అయితే గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటు వస్తున్నాడు శివాజీ.  అమాయాక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా 'జల్సా' సినిమాలో శివాజీ నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సారి ఎంట్రీతో మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే శివాజీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

తనకి బాధనిపిస్తే ఆ పాటలు పెట్టుకొని ఏడుస్తుందంట!

రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఇన్‌ స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా దాదాపు అందరూ.. 'ఆస్క్ మి క్వశ్చనింగ్' అంటూ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతుంటారు. తాజాగా రీతూ మాట్లాడుకుందామా అంటూ కాసేపు తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది...మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నామని ఒకరు అడుగగా.. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని రీతూ చెప్పింది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎనీ సజెషన్ అంటూ ఒకరు అడుగగా... బేసిక్ గా నేను డిప్రెషన్ పర్సన్. బాధ అనిపిస్తే బాధ పాటలు పెట్టుకొని ఏడుస్తాను.  ఆ సిచువేషన్ ఓవర్ కమ్ చెయ్యాలి. ఏది అనిపిస్తే అది చెయ్యాలి. ఆ తర్వాత ఆ సిచువేషన్ లో మనం హ్యాపీగా ఉండొచ్చని రీతూ రిప్లై ఇచ్చింది. మీలాగా క్యూట్ గా ఉండే అమ్మాయి దొరకాలని ఒకరు అడుగగా.. అందరు అమ్మాయిలు క్యూట్ గానే ఉంటారు. మనం చూసే చూపుని బట్టి ఉంటుందని రీతూ రిప్లై ఇచ్చింది.  

కావ్యతో ఎవరు మాట్లాడొద్దని అపర్ణ నిర్ణయం.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -183 లో.. రాజ్ కి క్లయింట్ ఫోన్ చేసి.. మీ డిజైన్స్ లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. మీ డిజైనర్ కావ్య గారికి చెప్పి సరి చేయించండి అని రాజ్ క్లయింట్ చెప్తాడు. ఈ డిజైన్ మళ్ళీ రీడిజైన్ ఎలా చేయించాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు రుద్రాణి, రాహుల్ ఇద్దరు కావ్య గురించి మాట్లాడుకుంటారు. ఈ కావ్య ఏది అనుకుంటే అది చేస్తుంది. ఎలాగైనా కావ్యని ఇంట్లో నుండి పంపించెయ్యాలని రుద్రాణి అంటుంది. అనామిక ఫోన్ నెంబర్ ఎలాగైనా కనుక్కోవాలని కల్యాణ్ అనుకొని.. అప్పు హెల్ప్ తీసుకోవాలనుకుంటాడు. అప్పు చిరాకుగా మాట్లాడుతుంది. ఎట్టకేలకు అనామిక ఫోన్ నెంబర్ కనిపెడతాడు కళ్యాణ్. మరొక వైపు రాజ్ దగ్గరకి శృతి వస్తుంది. డిజైన్స్ లో కొన్ని రీడిజైన్ చేసి పంపించమన్నారు. ఆ డిజైన్స్ నువ్వు వేయమని శృతికి రాజ్ చెప్తాడు. అవి కావ్య మేడమ్ వేసినవి, మేడమే చెయ్యాలని శృతి చెప్తుంది. రాజ్ కోపంగా ఎవరు వద్దు నేనే వేసుకుంటానని చిరాకు పడుతాడు. మరొక వైపు కృష్ణమూర్తి విగ్రహలకి కలర్లు వేస్తూ కావ్య కి ఫోన్ చేసి రావద్దని చెప్పేలోపే కావ్య వస్తుంది. నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కదా? ఎందుకు వచ్చావని కృష్ణమూర్తి అడుగుతాడు. మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చానని కావ్య చెప్తుంది.  మరొక వైపు అనామికకి కళ్యాణ్  ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత నా నంబర్ కనిపెట్టినందుకు మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని అనామిక ఒక చోటుకి రమ్మని చెప్తుంది. దానికి కళ్యాణ్ ఒకే అంటాడు. మరొక వైపు అపర్ణ తో ఇందిరాదేవి మాట్లాడదు. నేనేం చేసానని మీరు నాతో మాట్లాడడం లేదు. మీ మాట వినలేదని నాతో మాట్లాడడం లేదా? అలా అయితే ఎన్ని సార్లు ఆ కావ్య నా  మాట వినలేదు. అలాంటిది ఇప్పుడు నేను కూడా ఆ కావ్యకి శిక్ష  వేస్తున్నాను. ఈ ఇంట్లో ఎవరు ఆ కావ్యతో మాట్లాడడానికి వీలు లేదని అపర్ణ చెప్తుంది. ఒక హిస్టారీకల్ నిర్ణయం తీసుకుంది. మా వదిన అని  నువ్వు చెప్పినట్లు వింటాం. ఆ కావ్యతో మాట్లాడమని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గాయాలతో ఉన్న మురారిని కృష్ణ కాపాడుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -244 లో.. మురారితో ముకుంద కలిసి ఉన్న ఫోటోని ముకుంద అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి నందు వచ్చి.. నీ గదిలో ఆదర్శ్ ఫోటో ఒక్కటి కూడా లేదు కదా అని అడుగుతుంది. ముకుంద సైలెంట్ గా ఉంటుంది. మురారి, ముకుంద కలిసి ఉన్న ఫోటోని నందు తీసుకొని ఒకే ఇంట్లో ప్రేమించిన అతను, పెళ్లి చేసుకున్న అతను ఉన్నాడు. నీకు ఇబ్బందిగా అనిపించడం లేదా అని నందు అడుగుతుంది. ఇబ్బంది కాదు బాధగా ఉందని ముకుంద సమాధానం చెప్తుంది. ఆ తర్వాత నాకు ఒక హెల్ప్ చేస్తావా అని నందుని ముకుంద అడుగుతుంది. ఏంటని నందు అడుగగా.. మా ఇద్దరి ప్రేమ సంగతి పెద్దత్తయ్యకి చెప్తావా అని ముకుంద అడుగుతుంది. నేను చెప్పలేనని నందు అంటుంది. కృష్ణ మురారిన ఒకటి చేద్దామని నేను అనుకుంటే ముకుంద తనని మురారిని ఒకటి చెయ్యమని చెప్తుందేంటని నందు అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ పేటెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తుంటుంది. తనకి దూరంగా మురారి బట్టలు ఆరెస్తూ కన్పిస్తాడు. అది చుసిన కృష్ణ ఇంట్లో ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఎలా అయిపోయారనుకోని మురారి దగ్గరికి కృష్ణ వెళ్లి.. తను ఆరేస్తున్న బట్టలు తీసుకొని మురారిని దబాయిస్తూ కృష్ణ ఆరేస్తుంది. మీరు ముందు ఆ ఎక్స్ పోసింగ్ ఆపండి. వెళ్లి షర్ట్ వేసుకొని రండి అని మురారిని కృష్ణ పంపిస్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు మాట్లాడుకుంటుండగా క్యాంపు ఉన్న దగ్గర మంటలు అంటుకుంటాయి. అది చూసిన మురారి పరుగున వెళ్లి అందులో ఉన్న చిన్న పిల్లలను కాపాడతాడు. ఏసీపీ సర్ అంటూ కృష్ణ అరుస్తూ ఉంటుంది.. అందరిని మురారి కాపాడతాడు. చివరగా లోపల ఒక పిల్లాడు ఉంటాడు. అతనికోసం లోపలికి వెళ్లి తీసుకొని వచ్చేటప్పుడు మురారి గాయాలు అవుతాయి. ఒక్కసారిగా మురారి కిందపడిపోతాడు. మురారిని చూసి కృష్ణ ఏడుస్తుంటుంది. వేరొక డాక్టర్ వచ్చి మురారికి ట్రీట్మెంట్ ఇస్తాడు. మురారి కండిషన్ బాలేదని డాక్టర్ చెప్పగానే.. కృష్ణ ఏడుస్తూ నా భర్తని నేను కాపాడుకుంటానని కృష్ణ ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషికి తనపై మళ్ళీ మొదలైన ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -850 లో.. జగతి, మహేంద్ర ఇద్దరు కాలేజీ వర్క్ చేస్తుంటే చుసిన శైలేంద్ర.. కావాలనే ఫణింద్ర ముందు రాత్రంతా పిన్ని బాబాయ్ ఇద్దరే కాలేజీ వర్క్స్ చేస్తూ ఇబ్బంది పడుతున్నారని శైలేoద్ర అంటాడు. అవునా జగతి అలా మేరే కష్టపడడం దేనికి.. శైలేంద్రకి కూడా కొన్ని పనులు అప్పజెప్పవచ్చు కదా అని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత నేనేదో ఒకసారి తప్పుగా మాట్లాడానని, పిన్ని బాబాయ్ లు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నాకు కాలేజీ వర్క్స్ చెప్పడం వాళ్లకి ఇష్టం లేదని శైలేంద్ర కన్నింగ్ గా మాట్లాడుతాడు. మీరు కొన్ని పనులు చెప్తేనే కదా ఎలా చేస్తున్నాడని తెలుస్తుందని ఫణింద్ర చెప్తాడు. సరే చెప్తాం తనకు కూడా తెలుసుకోవలిసినవి చాలానే ఉన్నాయ్.. మెల్లి మెల్లిగా నేర్పిస్తామంటూ జగతి చెప్తుంది. మరొక వైపు విశ్వనాథ్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటే రిషి వస్తాడు. రిషి కాఫీ తీసుకుంటాడు. వసుధారతో ఉన్నప్పుడు రిషి కాఫీ ఎలా  సాసర్ లో పోసుకొని తాగేవాడో అలాగే వసుధారని గుర్తు చేసుకొని తాగుదామని అనుకుంటాడు. మళ్ళీ అలా రిషి తాగుతాడు. ఏంటి రిషి ఈ రోజు ఇలా చేస్తున్నాడని విశ్వనాథ్ అనుకుంటాడు. మరొక వైపు వసుధార కూడా చక్రపాణి ముందు రిషి మాదిరిగానే కాఫీని సాసర్ లో పోసుకొని తాగుతుంది. మరొక వైపు మహేంద్ర, జగతి ఇద్దరు కాలేజీకి వెళ్తూ దార్లో కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. శైలేంద్ర  మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు అర్థం అవుతుందని జగతి అంటుంది. మనం మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు రిషి వసుధారలకి ఇచ్చామని అందరికి చెబుదామని జగతి అంటుంది. లేదు ఇప్పుడు చెప్తే అన్నయ్యకి రిషి గురించి తెలిస్తుంది. ఆ తర్వాత తను వెళ్లి మాట్లాడితే మనపై రిషికి ఇంకా కోపం పెరుగుతుంది. రిషి పై పడ్డ మచ్చ పోగొట్టిన తర్వాత రిషి గురించి చెబుదామని మహేంద్ర అంటాడు. మరొక వైపు రిషిలో మళ్ళీ వసుధారపై ప్రేమ కలుగుతుంది. వసుధార వచ్చి తనతో మాట్లాడినట్టు ఉహించుకుంటాడు రిషి. అప్పుడే రిషికి ఏంజిల్ కర్చీఫ్ తీసుకొని వచ్చి ఇస్తుంది. రిషి దాన్ని తీసుకొడు. ఇలాంటివన్ని కూడా నువ్వు నాకు ఇవ్వకూడదు. నీకు కాబోయే భర్తకి ఇవ్వాలని ఇండైరెక్ట్ గా చెప్తాడు రిషి. ఏంజిల్ అంటే రిషి కి ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఏంజెల్ కి మాత్రం దేని గురించి చెప్పాడో అర్థం కాదు. మరొక వైపు దేవయాని శైలేంద్రతో మాట్లాడుతుంది. ఏంటి ఆ జగతి, మహేంద్రల ముందు అంత తగ్గి మాట్లాడుతున్నావని శైలేంద్రని దేవయాని అడుగుతుంది. డాడ్ నా టార్గెట్.. తన ముందు అలా నటిస్తే చాలని శైలేంద్ర అంటాడు. నువ్వు కాలేజీ MD సీట్ లో కూర్చోవాలి అది నా కోరిక అని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బ్యాడ్ గర్ల్స్ టు బ్యాంకాక్ అంటున్న గీతు రాయల్!

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు. గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. అయితే ఈ మధ్యే తను శ్రీలంక టూర్ కి వెళ్ళి వచ్చింది. అది పూర్తయిన నెలలోనే థాయ్ లాండ్ కి వెళ్ళింది. అయితే ఈసారి ఒక్కతే వెళ్ళకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీసత్య, వాసంతి కృష్ణన్ ని తీసుకెళ్ళింది గీతు రాయల్. అక్కడ వాళ్ళ హంగామా మాములుగా లేదన్నట్టుగా వీడీయోలతో ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నారు ముగ్గురు. వాసంతి కృష్ణన్ తన ఇన్ స్టాగ్రామ్ లో థాయ్ లాండ్ లోని పుకెట్ లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ప్రతీ చోటుని కవర్ చేస్తుంటే, శ్రీసత్య కూడా అందులో భాగమవుతుంది. అయితే గీతు రాయల్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఒకటే మ్యూజిక్ అంటూ డ్యాన్స్ స్టెప్స్ తో అదరగొడుతుంది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ట్రిప్ ప్లాన్ చేశారంట. అది అనుకోకుండా సక్సెస్ అయిందని గీతు రాయల్ తన ఇన్ స్టాగ్రామ్ లో అక్కడికి వెళ్ళేముందు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ -6 భామలు అలా బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్నారు.  

తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ చెప్పిన మల్లి!

భావన లాస్య.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 'మల్లి' అంటే అందరికి సుపరిచితమే. ఎందుకంటే 'మల్లి' సీరియల్. స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి విశేష ఆదరణ లభిస్తుంది. మల్లి సీరియల్ లో అరవింద్ ని ఇష్టపడి, ఆ తర్వాత మాలిని కోసం తన ప్రేమను త్యాగం చేసి వదిలి వెళ్తుంది మల్లి. ఆ తర్వాత మల్లి చేస్తోన్న ఆఫీస్ లోనే అరవింద్ జాబ్ కి జాయిన్ అవుతాడు. మాలిని తనని జాబ్ మానేయమని, లేదా అరవింద్ ని జాబ్ మానేయమని చెప్తుంది. నేనెలా చెప్తానను మల్లి అంటుంది. ఇది భోనాల జాతరలో మల్లి, మాలినిల సంభాషణ. మరి మాలిని చెప్పినట్టు మల్లి చేస్తుందా.. దూరంగా వెళ్తుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది.‌ ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించని భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ట్రెండింగ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ అదరహో అనిపిస్తుంది భావన లాస్య. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మి క్వశ్చనింగ్' స్టార్ట్ చేసింది. ఇందులో ఒక్కొక్కరు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది భావన లాస్య. ఇన్ స్టాగ్రామ్ లో పేరు ఎందుకు చేంజ్ చేశారు? వైరల్ అయ్యారనా అని ఒకరు అడుగగా.. లేదు. ఇది నా ఐడీ అని భావన లాస్య అంది. మీ ఫేస్ లో ఎప్పుడు నవ్వునిచ్చేదేంటని ఒకరు అడుగగా.. "ఫుడ్, మై ఫామ్, నన్ను అభిమానించే నా వాళ్ళు" అని రిప్లై ఇచ్చింది. నిన్ను బ్లాక్ సారీలో చూసాక ఇంకేం అడుగుతారు.. కవితలు రాయడం తప్ప అని ఒకరు క్వశ్చన్ చేయగా.. అంతే అంటావా అని నవ్వేసింది భావన లాస్య‌. బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ అని ఒకరు అడుగగా.. నెనెక్కడికి వెళ్ళినా అక్కడికి రావాలి.. నాతోనే ఉండాలి, ఎప్పుడైనా,ఎక్కడైనా   దగ్గరగా ఉండాలని రిప్లై ఇచ్చింది. నీ ఫస్ట్ మ్యారేజ్ గురించి గౌతమ్ సర్ కి తెలిస్తే ఏం జరుగుతుంది అని ఒకరు అడుగగా.. బ్లాస్ట్ అని రిప్లై ఇచ్చింది భావన లాస్య. ఇలా కాసేపు నెటిజన్లతో చిట్ చాట్ చేసింది భావన లాస్య.  

అది నా పిల్ల..డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

స్టార్ మాలో మంచి రేటింగ్ తో పాటు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న  ‘నీతోనే డాన్స్’ షోకు విజయ్ దేవరకొండ వచ్చి సందడి చేయబోతున్నారు. ఇప్పటికీ రేస్ టు ఫినాలే పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. దానికి సంబందించిన  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక అందులో సెలబ్రెటీల పర్ఫామెన్స్ మామూలుగా లేవు. ఒకరితో ఒకరు గట్టిగానే తలపడ్డారు. స్టెప్పులతో స్టేజిని అదరగొట్టేశారు. మధ్యలో శ్రీముఖి కూడా వాళ్ళతో కలిసి ఎంటర్టైన్ చేసింది. ఖుషి మూవీ ప్రమోషన్స్ భాగంలో విజయ్ దేవరకొండ కూడా ఈ షోకి వచ్చి బాగా సందడి చేశాడు. ఎంట్రీతోనే ‘‘అది నా పిల్ల’’ అని డైలాగ్ వేస్తూ వచ్చి ఖుషి మూవీలో సాంగ్ కి డాన్స్ చేశాడు. శ్రీముఖి అక్కడ పెర్ఫార్మ్  చేసిన సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇందులో వీళ్లకు పెళ్లిళ్లయ్యి ఎన్నేళ్ళయిందో చెప్పమని అడిగింది.  నటరాజ్ మాస్టర్ కు ఐదేళ్లు అయ్యింది అనడంతో వెంటనే మాస్టర్ అందుకుని  13 ఇయర్స్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక "మీ పెళ్లి ఎప్పుడు" అని శ్రీముఖి విజయ్ ని అడిగేసరికి " అందరితో మాట్లాడుతున్నాను" అని విజయ్ చెప్పడంతో "అందరిని చేసుకోవడం కుదరదు కదా" అంటూ శ్రీముఖి పంచ్ వేసింది. ఇక ఇంట్లో వాళ్లు పెళ్లి  చేసుకోమని అంటున్నారని, మా అమ్మ నాన్నకి  మనవాళ్ళు, మనవరాళ్లు కావాలట అని  తొందర పెడుతున్నారు అనేసరికి  రాధ వారి సంతోషం కోసం చేసుకోవాలి కదా అని అన్నారు. అందుకే వాళ్లనే మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పానని  విజయ్ అనటంతో అక్కడ అందరూ నవ్వేశారు. ఇక జోడి కంటెస్టెంట్స్ చేసిన డాన్స్ లు మాములుగా లేవు. ఇరగదీసే డాన్సులు చేశారు. మరి ఎవరు టైటిల్ విన్ అవుతారో కొద్దీ రోజుల్లో తెలిసిపోతుంది.    

లావణ్యనే నా ఫోన్ లో తన పేరు మార్చింది.. ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదన్న వార్న్

ప్రతీ శనివారం ‘సుమ అడ్డా’ షోలో  కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ శనివారం హీరో వరుణ్ తేజ్‌ను తీసుకొచ్చింది. వరుణ్ తేజ్ కొత్త మూవీ ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్స్ కోసం వచ్చారు.  తనతో పాటు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, హీరోయిన్ సాక్షి వైద్య కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ‘సుమ అడ్డా’లో వరుణ్ తేజ్‌ తో ఫేమస్ మూవీ స్ఫూఫ్ చేయించింది.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘గబ్బర్‌సింగ్’ మూవీ  స్ఫూఫ్‌ను చేయించింది. "నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది" అని డైలాగ్ చెప్పాడు. "సాక్షి వైద్య ... మీ అత్తారిల్లు ఎక్కడ అయితే బాగుంటుంది" అంటూ సుమ అడిగేసరికి  దానికి సమాధానంగా సాక్షి.. తనకు హైదరాబాద్ అంటే ఇష్టమని చెప్పింది. "ఎక్కడెక్కడి నుండో వస్తూ ఇక్కడ కోడళ్లు అయిపోతున్నారు"  అంటూ లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి సుమ కామెంట్ చేసేసరికి వరుణ్ తేజ్ నవ్వేసి "హైదరాబాద్ అబ్బాయిలు మంచోళ్లు కాబట్టి అలా అవుతున్నారు" అంటూ  కౌంటర్ ఇచ్చాడు.  ఫైనల్ గా చిరంజీవి పాటల్లో ఒకటైన ‘నవ్వింది మల్లెచెండు’ అనే సాంగ్ కి  సుమ డ్యాన్స్ చేసి నవ్వించింది.  వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫోటోలను చూపించింది. చిన్నప్పుడు రామ్ చరణ్.. వరుణ్ తేజ్‌ను ఎత్తుకున్న ఫోటోని చూపించేసరికి "అప్పుడు నన్ను చరణ్ ఎత్తుకున్నాడు... ఇప్పుడు నేను చరణ్‌ను ఎత్తుకోవాలి" అంటూ సరదాగా అన్నాడు వరుణ్.  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూపించేసరికి స్టూడెంట్స్ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి.  "మీ  ఫోన్‌లో లావణ్య గారి  కాంటాక్ట్ ఏమని ఉంటుంది" అని ఒక స్టూడెంట్ అడిగింది. దానికి ‘లావ్’ అంటూ సమాధానమిచ్చాడు ఈ హీరో. అప్పుడు సుమ  రిలేషన్‌షిప్ మొదలయ్యాక అలా జరిగిందా లేక ముందు నుండి అంతేనా అని అడిగేసరికి లావణ్యనే  ఫోన్ తీసుకొని కాంటాక్ట్ మార్చిందని వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. " లావణ్యకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏమిటి అని అడిగేసరికి" చాలా ఏళ్ళు ఐపోవడంతో  ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదన్నాడు వరుణ్.    

చమ్మక్ చంద్ర రి-ఎంట్రీ...చెల్లిని గుర్తుచేసుకుని ఏడ్చేసిన బబ్లూ

త్వరలో రాఖీ పండగ రాబోతున్న నేపథ్యంలో  శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం రాఖీ  స్పెషల్ ఈవెంట్ ఎపిసోడ్ ని రెడీ చేసింది. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన చమ్మక్ చంద్ర ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ రాఖీ స్పెషల్ ఈవెంట్ లో మెరిశాడు. అలాగే ఢీ షోలో కూడా రీసెంట్ గా ఒక ఎపిసోడ్ కి కూడా వచ్చాడు. తనకు బాగా పేరు తెచ్చిన ఫ్యామిలీ స్కిట్‌ చేసాడు.  కరుణ, ఐశ్వర్యకు అన్నగా నటించాడు. అలాగే వాళ్ళతో కలిసి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి  అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక ఈ  రాఖీ స్పెషల్ ఈవెంట్ లో ఒక టాస్కు  కూడా జరిగింది. మనుషులు కనిపించకుండా చేతులు మాత్రమే కనిపించేలా చేశారు. ఆ చేతులు ఎవరెవరివో గుర్తించి వాళ్ళ వాళ్ళ  చెల్లెళ్లు రాఖీ కట్టారు. ఈ టాస్క్ కొంచెం ఫన్నీగా, కొంచెం ఎమోషనల్ గా సాగింది. రామ్ ప్రసాద్, మహేశ్ విట్టా .. తమ తమ చెల్లెళ్లపై ఉన్న ప్రేమను గురించి చెప్పారు. ఇక రోహిణీ అయితే తన జీవితంలో జరిగిన ఆపరేషన్  సంఘటన గురించి షేర్ చేసుకుని ఏడ్చేసింది. అలాంటి సమయంలో తన తల్లి  తనకు సపోర్ట్‌గా ఉందని, ఆమె చాలా గ్రేట్ అని  గుర్తుచేసుకుంది. ఇక ఈ ఈవెంట్ కి  స్పెషల్ గెస్ట్‌గా  కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చాడు. గెస్ట్‌గా వచ్చిన కిరణ్‌కు జడ్జ్  ఇంద్రజ రాఖీ కట్టింది.  రాఖీ కట్టడం తన జీవితంలో ఇదే  మొదటిసారి అని ఇంద్రజ చెప్పగా.. కిరణ్ అబ్బవరం కూడా రాఖీ కట్టించుకోవడం మొదటిసారని అన్నాడు. తర్వాత కమెడియన్ బబ్లూ కూడా ఈ ఈవెంట్‌ లో కనిపించాడు. అయితే గతేడాది తాను తన చెల్లితో ఆ ఈవెంట్‌కు వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. ఐతే  ప్రస్తుతం తాను ఒక్కడినే వచ్చానన్నాడు. ఏమయ్యింది ? అని ఇంద్రజ అడిగేసరికి  తన చెల్లి చనిపోయిందని చెప్పాడు. మెదడులో బ్లడ్ క్లాట్ అవడంతో తన చెల్లి చనిపోయిందన్న విషయాన్ని చెప్పి కళ్ళు మూసుకున్నాడు.  అందుకే తను గతేడాది చెల్లితో కలిసొచ్చిన  ఈవెంట్‌ను మళ్లీ మళ్లీ చూసుకుంటున్నట్లు చెప్పాడు. అలా బాధపడుతున్న బబ్లూకు అక్కడ ఉన్న అమ్మాయిలంతా వచ్చి రాఖీ కట్టి అతన్ని ఓదార్ఛారు.    

మీ అందరి ప్రేమతో నాకేం అవ్వదు!

సీనియర్ నటి షానూర్ సనా బేగం. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించింది. ప్రతి ఇంట్లోని ఒక అమ్మలా కనిపించే సన.. అందరికి  సుపరిచితమే. వెండి తెరపై సపోర్ట్ రోల్స్, తల్లి పాత్రలలో ఇమిడిపోయి అందరిని మెప్పిస్తుంది సనా. తను ఇప్పటివరకు దాదాపు అందరు అగ్రహీరోల సినిమాలల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి పేరు సంపాదించుకుంది. సనా.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై నటించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటివరకు తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది సనా. అంతేకాకుండా బుల్లితెరపై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చక్రవాకం' సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సిరి సిరి మువ్వలు సీరియల్ లో.. ఉమెన్ లీడ్ రోల్ చేసింది సనా. తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి.. తన అప్డేట్స్ ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. సీరియల్ యాక్టర్ సమీరాని తన కొడుకుకి ఇచ్చి వివాహం చేసింది సనా. ఆ తర్వాత ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో మహిళలకు ఉపయోగపడే చిట్కాలు చెప్తున్నారు. తను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన.. కెరీర్ లో ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా ఇప్పటివరకు చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని తేడా లేకుండా దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సనా. తాజాగా 'మీ అందరి ప్రేమతో నాకేం అవ్వదు' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది సనా. ఇందులో తను గువ్వ గోరింక సీరియల్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్టుగా చెప్పింది. ఈ సీరియల్ ఒక హెవీ సోన్ చేసిందంట.. అదే ఏడ్చే సీన్ చేసానని సనా అంది. " నా చిన్నప్పుడు మా అమ్మ  చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినకూడదని చెప్పేది. ఇప్పుడేమో అందరూ వంట చేసేటప్పుడే పెరుగు కలుపుతున్నారు. అసలు చేపతో పెరుగు మనం తినొచ్చా? తినకూడదా ? ఏది కరెక్ట్ తెలిస్తే కామెంట్ చేయండి" అంటూ సనా ఈ వ్లాగ్ లో చెప్పింది.అందరూ తంబ్ నెయిల్ చూసి తనకేమో అయిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

ఆ ఇద్దరి మధ్య మౌన పోరాటం.. ఆదర్శ్ ఆచూకి భవాని కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -243 లో.. ఇంత దూరం వచ్చి నేనే వెళ్లి కృష్ణతో మాట్లాడితే మరి తగ్గినట్టు ఉంటుందని మురారి అనుకుంటాడు. మరొక వైపు మురారికి కృష్ణ ఎదురుగా వస్తుంది. మురారిని చూసిన కృష్ణ ఇదంతా భ్రమే అనుకుని మురారి ముందు నుండే వెళ్తుంది. ఆ తర్వాత కృష్ణ అలా వెళ్లడం చూసిన మురారి.. అదేంటి చూసి కూడా చూడనట్టు వెళ్తుంది.. మర్చిపోయిందా అని మురారి  అనుకుంటాడు. అయిన సరే నేను వెళ్లి మాట్లాడనని మురారి అనుకుంటాడు. మరొకవైపు భవాని దగ్గరికి శ్రీనివాస్ వస్తాడు. మీ అమ్మాయి పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందని భవాని అనగానే.. ఏమీ తెలియనట్టు షాక్ అవుతాడు శ్రీనివాస్. మీకు అంత తెలుసని నాకు తెలుసని భవాని అంటుంది. శ్రీనివాస్ మౌనంగా ఉంటాడు. మీ అమ్మాయి ఎవరిని ప్రేమించిందో, మీకు ఏమైనా తెలుసా అని శ్రీనివాస్ ని భవాని అడుగుతుంది. ఒకవేళ తెలియకపోయిన ముకుంద ద్వారా తెలుసుకొని నాకు చెప్పండని భవాని అంటుంది. సరే అని శ్రీనివాస్ బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత వెళ్తున్న శ్రీనివాస్ ని రేవతి ఆపి మాట్లాడుతుంది. ముకుంద ప్రేమించింది మురారిని అనే విషయం అక్కతో చెప్పకండని రేవతి చెప్తుంది. మరొక వైపు కల్నల్ తో భవాని ఫోన్ లో మాట్లాడుతుంది. నేను ఒకసారి ఆదర్శ్ తో మాట్లాడాలి.. వాడు నా మాట వింటాడని భవాని అంటుంది. లేదు ఆదర్శ్ మాతో నే డైరెక్ట్ కాంటాక్ట్ లేడని కల్నల్ చెప్తాడు. మరొక వైపు కృష్ణ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తూ బిజీ గా ఉంటుంది. ఒక పేషెంట్ కృష్ణ దగ్గరికి వస్తుంది. ఆమెని చూసిన కృష్ణ ఈ దెబ్బలు అన్ని ఏంటి? మీ ఆయన తాగి వచ్చి కొడుతున్నాడా అని ప్రశ్నలు అడుగుతుంది. లేదు నా భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అదేంటని అడిగితే ఇలా కొట్టాడు. అయిన తన మీద నాకు కోపం లేదు. నా భర్త ఎప్పటికైనా మారి నా దగ్గరికి వస్తాడని ఆ పేషెంట్ చెప్పగానే.. మురారిని గుర్తుచేసుకుంటుంది కృష్ణ. మరొక వైపు మురారికి రేవతి ఫోన్ చేసి.. టైమ్ కి తిను అంటూ జాగ్రత్తలు చెప్తుంటుంది. సరేనని చెప్పి మురారి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మురారికి కృష్ణ ఎదురుగా వస్తుంది. ఏంటి మళ్ళీ ఏసీపీ సర్ ల అనిపిస్తుందని మళ్ళీ భ్రమ అని అనుకుంటుంది కాని మురారి కృష్ణ వెళ్తుంటే చెయ్యి అడ్డం పెడుతాడు. ఏంటి కృష్ణ చూసి కూడా చుడనట్టు వెళ్తున్నావ్ అని అడుగుతాడు. ఏసీపీ సర్ నిజంగానే వచ్చారా అని కృష్ణ అనుకుంటుంది. కావాలనే మురారి వర్క్ ఉంది అంటూ వెళ్తాడు. కృష్ణ కూడా అలాగే వర్క్ ఉంది అంటూ వెళ్తు ఇద్దరు వెనక్కి తిరిగి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగలిసిందే.  

కావ్యకి స్వేచ్చనివ్వాలని చెప్పిన సీతారామయ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -182 లో.. కావ్య తనేం తప్పు చేయలేదని చెప్పడానికి రాజ్ దగ్గరికి వెళ్ళగానే.. రాజ్ కోపంగా చెయ్యిని గోడకేసి కొడుతాడు. కావ్య రాజ్ దగ్గరికి వెళ్తే రాజ్ రానివ్వడు. మరొక వైపు అపర్ణ గది దగ్గరికి కావ్య వెళ్తుంది. అత్తయ్య లోపలికి రావచ్చా అని అడుగుతుంది. వద్దని అపర్ణ అంటుంది‌ ఎందుకు వచ్చావ్ అని అపర్ణ అడుగుతుంది.  ఆ తర్వాత మీ అవధార్యo కావాలని కావ్య అడుగుతుంది. మీరు పెద్దవారు మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే చిన్న పిల్లలని క్షమించలేరా అని కావ్య అడుగుతుంది. క్షమించలేను.. ఎందుకు అంటే అసలు నిన్ను ఈ ఇంటి మనిషిగా కూడా చూడట్లేదని, నువ్వు గాలికి కొట్టుకొచ్చిన ఒక ధూళివని అపర్ణ అనగానే.. ఆ ధూళి అయిన కూడా ఎంత పెద్దగాలి వచ్చిన ఒక్కోసారి కదలదని కావ్య కౌంటర్ వేస్తుంది. కావ్య ఇలా అపర్ణకి కౌంటర్ వేయడంతో అపర్ణ ఇంకా కోపం పెంచుకుంటుంది..  ఆ తర్వాత కావ్య దేవుని దగ్గరకి వెళ్లి.. తన బాధని చెప్పుకుంటుంది. కాసేపటికి రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. మా పుట్టింటి వాళ్లకి సాయం చేస్తానని మాట ఇచ్చాను కదా.. నేను వెళ్ళన అని రాజ్ ని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ పట్టించుకోకుండా వెళ్తాడు. కావ్య ఇంట్లో పెద్ద వాళ్ళయిన సీతరామయ్య ఇందిరాదేవిలకి చెప్పి వెళ్దాం అనుకొని హాల్లో కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మా పుట్టింటికి వెళ్ళనా అని పర్మిషన్ అడుగుతుంది. మా పెద్దరికం.. ఈ ఇంట్లో మాకు ఎక్కడ ఉంచారని సీతారామయ్య అంటాడు. అపర్ణ వాళ్ళ మాటకి విలువ ఇవ్వలేదని సీతారామయ్య ఇండైరెక్ట్ గా కావ్యతో అంటాడు. ఈ ఇంటి కోడలిని అమానుషంగా బయట నిల్చొపెట్టారని ఇందిరాదేవి అంటుంది. ఆ పని చేసింది నేను కాదు రాజ్ అని అపర్ణ అంటుంది. రాజ్ తనకి నచ్చని పని చేస్తుందని అలా చెయ్యలేదు తన తల్లికి కావ్య ఎదురు చెప్పిందని రాజ్ ఆలా చేసాడు. అయిన నువ్వు రాజ్ ని ఎందుకు ఆపలేదని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఒక అమ్మాయికి నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ లేదా? ఎందుకు ఇలా అడ్డు చెప్తున్నారు.. కావ్య వెళ్లడం ఎవరికి ఇష్టం లేదో చెప్పండని సీతరామయ్య అడుగుతాడు. అందరూ మౌనంగా ఉంటారు. మీ మౌనం అంగీకారమని భావిస్తున్నాను.. కావ్య నువ్వు వెళ్ళు ఇక్కడ నిన్ను ఆపే వారు ఎవరు లేరని సీతారామయ్య చెప్తాడు. ఇద్దరు కలిసి కావ్యని తన పుట్టింటికి పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏంజిల్ ప్రేమను తెలుసుకున్న రిషి ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -849 లో.. రిషికి వసుధార అలా ఎందుకు మెసేజ్ చేసిందోనని అడుగుదామని వస్తాడు రిషి. అలా వచ్చిన రిషి మొహం పై తలుపు వేసి వెళ్లిపోయేలా చేస్తుంది వసుధార. ఆ తర్వాత రిషి బాధపడుతాడని తెలిసి రిషి దగ్గరికి వెళ్తుంది వసుధార. 'మీ పెళ్లి ఎప్పుడు సర్' అని ఎందుకు మెసేజ్ చేసావని వసుధారని రిషి అడుగుతాడు. వసుధార మాత్రం.. రిషి ప్రేమ ఉన్నట్లు మాట్లాడినట్లు, నా మనసులో నీకు తప్ప  ఇంకెవరికి స్థానం లేదని రిషి అన్నట్లు ఉహించుకుంటుంది. కాసేపటికి సమాధానం చెప్పు వసుధారా అని రిషి గట్టిగా అడుగుతాడు. మీ గతంలో నేను మీ మనసులో లేను. అలాంటప్పుడు నాకేం అవసరం లేదని వసుధార చెప్తుంది. ఆ తర్వాత నీకు అవసరం లేదంటే ఆ మెసేజ్ ఎందుకు చేసావని అడుగుతాడు. ఆ మెసేజ్ గురించి తప్ప వసుధార అన్ని మాట్లాడుతుంది. దాంతో రిషికి కోపం వచ్చి వెళ్లిపోతున్నా అని వెళ్తాడు. వసుధార వెళ్ళిబోతుంటే ఏంజిల్ వాయిస్ మెసేజ్ చేస్తుంది. నాకు రిషిని పెళ్లి చేసుకోవాలని ఉందని, రిషితో చెప్పవా అని ఏంజిల్ చేసిన వాయిస్ మెసేజ్ వసుధార వింటుంది. ఆ మాటలను రిషి వెనకాల నుంచి వచ్చి వింటాడు. కోపంగా ఏంజిల్ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడమేంటి? ఇందుకేనా ఇలా ప్రవర్తిస్తూన్నావని వసుధారతో రిషి అంటాడు. ఇది కూడా నా దగ్గర దాచావంటూ రిషి కోపంగా వెళ్ళిపోతాడు. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు కాలేజీకి సంబంధించిన వర్క్ చేస్తుంటారు. దూరంగా ఉండి శైలేంద్ర చూస్తాడు. నాకు తెలియనివ్వకుండా కాలేజీ పనులు చేస్తున్నారా? కాలేజీని మొత్తం నీ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని శైలేంద్ర అనుకుంటాడు. మరొక వైపు ఏంటి రిషి ఫోన్ లిఫ్ట్ చేయడు, వసుధార లిఫ్ట్ చెయ్యట్లేదని ఏంజిల్ ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన వసుధార.. ఏంజిల్ కి ఫోన్ చేస్తుంది. రిషిని కలిసావా నా మనసులో ఉన్నా దాని  గురించి చెప్పవా అని ఏంజిల్ అడుగుతుంది. చెప్పానని వసుధార అంటుంది. అవునా ఏం అన్నాడు? నాపై తనకు ఎలాంటి ఫీలింగ్ ఉందంటూ అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. వసుధార సైలెంట్ గా ఉంటుంది. సరేలే ఇప్పుడు రిషి వస్తాడు కదా నేనే తెలుసుకుంటానని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత రిషి ఇంటికి రావడంతోనే ఏంజిల్ ఎక్కడికి వెళ్ళవని రిషిని  అడుగుతుంది. ఏంజిల్ పై రిషి కోప్పడట్టు ఉహించుకుంటాడు. బయటకు వెళ్ళను.. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. మనం ఏది ఉహించుకున్నా? అది నిజం కాదంటూ ఇండైరెక్ట్ గా ఏంజిల్ అంటే ఇష్టం లేనట్లుగా రిషి మాట్లాడుతాడు. అయిన ఏంజిల్ కి అర్థం కాదు. రిషి గదిలో ఒక లవ్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ఏంజిల్ రాయమంటే వసుధార రాస్తుంది. అది చూసి వసుధారకి ఫోన్ చేస్తాడు రిషి. ఏంజిల్ రాయమంటే రాసానంతే మీరు మీరు తేల్చూకోండి. ఏ విషయమైన మీ ఫ్రెండ్ కి అర్థం అయ్యేలా మీరు చెప్పండని రిషికి వసుధార చెప్తుంది. నా నిర్ణయం ఎలా చెప్పాలనే దానికి టైం కావాలని రిషి అంటాడు. మరొక వైపు శైలేంద్ర వచ్చి.. రాత్రి మీరు కాలేజీకి సంబంధించిన వర్క్ చేశారేంటని అడుగుతాడు. అవునా ఏం చేశారని ఫణింద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

పబ్బులకు, బార్లకు వెళ్లాల్సిన టైములో ఈ గుళ్లేమిటండి

ఏదైనా ఒక సీరియల్ కొన్ని నెలలు,  కానీ సంవత్సరాలు కానీ నడిచినప్పుడు ఆ సీరియల్ కి పని చేసిన అందరి మధ్య అద్భుతమైన బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సీరియల్ ఐపోయినా వాళ్ళ స్నేహం అలాగే ఉంటుంది. ఇక సోషల్ మీడియా ఫుల్ ఫేమస్ అయ్యాక ఆ  సీరియల్ గ్యాంగ్స్ అన్నీ కూడా రీల్స్, వీడియోస్ చేస్తూ ఆడియన్స్ తో కనెక్ట్ అవుతూనే ఉన్నారు. అలాంటి ఒక సీరియల్ "జానకి కలగనలేదు" పూర్తైపోయినా కూడా ఆ టీమ్ మొత్తం కలిసే తిరుగుతున్నారు. ఈవెంట్స్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలోనే  ‘జానకి కలగనలేదు’ సీరియల్ టీం అందరూ కలిసి శ్రీశైలం వెళ్లారు. ఆ వీడియోను జెస్సి రోల్  నటించిన భవి యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ వీడియోలో రామ, అఖిల్, జెస్సి, మల్లిక ఇంకా కొంతమంది కూడా సందడి చేస్తూ కనిపించారు. అందరూ కలిసి శ్రీశైలం ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేశారు అనేది వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తే అర్థమైపోతుంది. కొన్ని పురాతన ఆలయాలను చూపిస్తూ వాటి గురించినే ఇంటరెస్టింగ్ విషయాలను కూడా ఈ వీడియోలో చెప్పారు. అయితే ఆ వీడియోలో జానకి అలియాస్ ప్రియాంక జైన్  , అత్తగారు, మావగారిగా చేసిన జ్ఞానాంబ, గోవిందరాజులు కూడా కనిపించలేదు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.. "పబ్బులకు, బార్లకు వెళ్లాల్సిన టైములో ఈ గుళ్లేమిటండి" అని సిద్దార్ధ సరదా సెటైర్ వేసాడు. అలా శ్రీశైలం ట్రిప్ కి వెళ్లి రిటర్న్ లో సాక్షి గణపతి స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారు. ఇక వాళ్ళు స్టే చేసిన కాటేజ్ చూపించారు...వాళ్ళ కార్లకు పూజలు కూడా చేయించుకున్నారు. అమరదీప్ కాసేపు భవికి డాన్స్ కూడా నేర్పించాడు.  ఇక ఈ టీమ్ మొత్తం  సోషల్ మీడియాలో సరదాగా వీడియోలు చేస్తూ ఉంటారు.  కాస్త బ్రేక్ దొరికితే చాలు ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేస్తుంటారు వీళ్ళు.

గ్రాండ్ గా విష్ణుప్రియ బర్త్ డేని సెలెబ్రేట్ చేసిన సిద్దార్ధ్

బుల్లితెర మీద నటించే విష్ణు ప్రియా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సిద్దార్ధ్ వర్మని లవ్ మ్యారేజ్ చేసుకున్న సిద్-విష్ణు అయ్యింది. సిద్దార్థ్ వర్మ కూడా నటుడే. బుల్లితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద నటిస్తాడు. వీళ్ళు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. యూట్యూబ్ లో కూడా రకరకాల వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు విష్ణు ప్రియా బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు సిద్దార్థ్. కేక్ తీసుకొచ్చి కట్ చేయించాడు. సిద్దార్థ్, విష్ణు ప్రియా వాళ్ల అబ్బాయి అయాన్ష్ వర్మ ముగ్గురు కలిసి వాళ్ల ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు జానకి కలగనలేదు టీమ్ మొత్తం వచ్చి బర్త్ డే బాష్ చేశారు. విష్ణుప్రియ ఫోటోని బ్యానర్  చేయించి ఇంటి ఎంట్రన్స్ లో పెట్టారు. అలాగే ఉప్మా కేక్ తెప్పించి ఆమెతో కట్ చేయించి తినిపించారు. తర్వాత ఫోటో షూట్ కి వెళ్లారు.  ఇక ఫామిలీ నంబర్ 1 షోకి మంచి రేటింగ్ వచ్చిందని వాళ్లకు ఇచ్చిన స్వీట్ బాక్స్ ని కూడా చూపించారు. ఇక ఫామిలీ నంబర్ 1 షూటింగ్ కి వెళ్లారు వీళ్లంతా కలిసి. ఇక ఆ సెట్ లో అందరూ కలిసి విష్ణు బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు. బర్త్ డే ఐపోయిన సెకండ్ డే కూడా శ్రీసత్య, భావన కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. రభస, రామయ్య వస్తావయ్యా వంటి మూవీస్ లో సమంత పక్కన నటించింది విష్ణు ప్రియా. "జానకి కలగనలేదు" సీరియల్ మెయిన్ రోల్ ప్రియాంక జైన్ కి తోటి కోడలి రోల్ లో నటించింది. విష్ణుప్రియ కెరీర్‌లో ఇప్పటివరకు 40 సినిమాల్లో నటించింది . నిజానికి వాటి తర్వాతే సీరియల్స్‌లోకి వచ్చింది. "త్రినయని" సీరియల్ కంటే ముందు 'ఇద్దరు అమ్మాయిలు ', "అభిషేకం" వంటి సీరియల్స్‌లో కనిపించి అలరించింది.   14 ఏళ్ల వయసులో విష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కెరీర్ మంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

మహేష్ వాయిస్ ని ఇమిటేట్ చేసిన నాటీ నరేష్.. వార్నింగ్ ఇచ్చిన నెటిజన్స్!

ఎక్స్ట్రా జబర్దస్త్ రాబోయే వారం స్కిట్ మాత్రం చాలా ఫన్నీగా ఉండబోతోంది. ఐతే ఈ మధ్య కొన్ని వారాల నుంచి మాత్రం అస్సలు స్కిట్స్ కాదు కదా ప్రోమోస్ కూడా బాగుండడం లేదనే విషయం పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వారం ప్రసారం కాబోయే స్కిట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నెటిజన్స్ చెప్పినట్టే స్కిట్స్ లో కంటెంట్ కూడా పెద్దగా ఉండడం లేదు. ఐతే  భాస్కర్, నాటీ నరేష్ స్కిట్ కలిసి "పోకిరి" మూవీ బిట్ ని స్పూఫ్ గా చేశారు. అందులో నాటీ నరేష్ మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ ని అలాగే ఆయన వాయిస్ ని ఇమిటేట్ చేసాడు. భాస్కర్ కి నరేష్ మాట్లాడిన వాయిస్ ఎవరిదో అనేది అర్ధం కాకా అడిగేసరికి మహేష్ బాబుది అని చెప్పాడు నరేష్. దాంతో భాస్కర్ షాకయ్యాడు. కానీ నెటిజన్స్ మాత్రం ఫుల్ వార్నింగ్ ఇచ్చిపడేశారు. "భాస్కర్ కొత్తగా ట్రై చెయ్యి.. ఎప్పుడూ మూవీ స్పూఫ్స్ చేస్తావా ...నరేష్ వాయిస్ ఇమిటేట్ చేయడం రాకపోతే చేయకు అంతే కానీ ఇలా చేస్తే బాగోదు...మహేష్ బాబు వాయిస్ ని ఇమిటేట్ చేస్తావా..మాములుగా ఉండదు" అంటూ ఫుల్  వార్నింగ్ ఇచ్చేసారు. ఈ మధ్య జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్స్ లో స్పూఫ్స్ బాగా ఎక్కువైపోయాయి. అందులో వచ్చేది నిజంగానే కామెడీనా కాదా అని కూడా తెలియకుండా జడ్జెస్ పడీపడీ నవ్వేస్తున్నారు. కానీ నెటిజన్స్ మాత్రం ఊరుకుంటారా. గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. జబర్దస్త్ భాస్కర్ కి నాటీ నరేష్ అంటే చాలా ఇష్టం. నరేష్ వల్ల తన స్కిట్స్ బాగా పేలుతుంటాయని చెప్తాడు.  నరేష్ వల్లే తమ టీంకు  మంచి పేరొచ్చిందని చెప్తుంటాడు..ఐతే నరేష్ మాత్రం ఒక్క టీమ్ అనే కాకుండా స్టాండ్ బైగా అందరి టీమ్స్ లో కనిపిస్తూ అన్ని టీమ్స్ కి సమన్యాయం చేస్తూ ఉంటాడు.