కొంచెం కొంచెం కొరుక్కుపోవయ్య అంటున్న దివి!

బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా.. ఈ పాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడున్న సెలబ్రిటీలు కొత్త కొత్త పాటలతో రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండగా దివి వాద్య మాత్రం పాత పాటలతో మ్యాజిక్ చేస్తుంది. భాను చందర్,  అర్చన కలిసి నటించిన 'నిరీక్షణ' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ' ఆనాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే'. ఈ సినిమాలో హీరోయిన్ అర్చన కాస్టూమ్స్ అప్పట్లో క్రేజ్ ఉండేది‌. కాగా ఇప్పుడు అదే కాస్టూమ్ తో దివి దర్శనమిచ్చింది. అందాలు ఆరబోస్తూ చీర, జాకెట్ లో కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.  అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. తాజాగా ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో నటించిన దివి.. అక్కడ అందాల ఆరబోతకే పరిమతమైంది. అయితే మంచి కంటెంట్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న దివికి, మరిన్ని అవకాశాలు రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో  హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ ఒక మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్న దివి.‌. తన అందంతో క్రేజీ పోస్ట్ లతో మరింత ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది‌. కాగా ఇప్పుడు తాజాగా కొంచెం కొంచెం కొరుక్కుపోవయ్యా అంటూ మరికొన్ని బోల్డ్ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది దివి. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది.  

కలుపు తీస్తూ ట్రెండింగ్ లోకి ఉదయభాను! 

యాంకర్ ఉదయభాను.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్కప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయినా ఉదయభాను ఉండాల్సిందే.‌ ఏ షో అయినా తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానల్స్ కు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో  ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరిసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా కొంత కాలం బుల్లి తెరకి దూరంగా ఉంది. ఉదయభాను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది. ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్, సండే చికెన్ వ్లాగ్ ఇలా అటు బ్యూటీ కేర్, ఇటు ఫుడ్ ఇలా అన్ని కవర్ చేస్తుంది ఉదయభాను. అయితే తాజాగా  'ఏది దేశం తమ్ముడా' అనే పాటని ఉదయభాను రాసింది. తనే పాడింది. కాగా ఈ పాట కూడా వైరల్ అయింది. స్టార్ మా టీవీ కార్యక్రమాల్లో భాగంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఒక ఈవెంట్ లో  పాల్గొంది ఉదయభాను. అయితే ఇప్పుడు తాజాగా వ్యవసాయం చేస్తున్నట్టుగా ఒక వీడీయోని తన‌ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఉదయభాను. కలుపు తీస్తున్నా అని ఉదయభాను పోస్ట్ చేయగానే తన అభిమానులు.. సూపర్ మేడమ్, మీరు గ్రేట్ అంటూ కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.  

బ్రేకప్ గురించి చెప్పి బాధపడిన రోహిణి...

ఫామిలీ నంబర్ 1 ఈ వారం షో చాలా సందడిగా సాగింది. స్టార్టింగ్ లో ఒక్కో కపుల్ ఒక్కో విధంగా ప్రొపోజ్ చేసుకుని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ సెగ్మెంట్ తర్వాత భార్యలను భర్తలు ఎత్తుకుంటే హోస్ట్ రవి కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాళ్ళు వాటికి సరైన ప్రశ్నలు చెప్పారు. ఇక థర్డ్ సెగ్మెంట్ లో పాట పాడే సెగ్మెంట్ లో హోస్ట్ రౌడీ రోహిణి వచ్చి అద్భుతంగా పాడి వినిపించింది. "నీతో ఏదో అందామనిపిస్తోందే" అనే పాట పాడింది. "నువ్వు ఇంతమందిని చూస్తున్నావు కదా నీకు కూడా ఎవరైనా లవర్ ఉండాలని అనిపించదా " అని రవి అడిగేసరికి "నాకు లవర్ ఉండేవాడు కానీ బ్రేకప్ అయ్యింది.. అతను నన్ను కాకుండా వేరే అమ్మాయిని  లవ్ చేస్తున్నాడు...చెప్పాలి కదా నీకు వేరే అమ్మాయి ఉంటే అని అతనితో అన్నాను...బ్రేకప్ అయ్యాక ఆరు నెలలు చాలా బాధపడ్డాను.. నా ఫ్రెండ్స్ అంత సపోర్ట్ చేసి ఆ బాధ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు  " అని చెప్పింది. తర్వాత మళ్ళీ రవి "నీకు పెళ్లి చేసుకోవాలని అనిపించదా" అని అడిగాడు .."ఇప్పుడు వున్న పరిస్థితిలో పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తోంది" అని రోహిణి అనేసరికి "అలా నాకు రోహిణి. మీ పేరెంట్స్ నీతో ఎంతో కాలం ఉండరు. లైఫ్ లాంగ్ ఉండేది నీ భర్త మాత్రమే..మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకో" అని సలహా ఇచ్చాడు కౌశల్. "నాకు నచ్చే అబ్బాయి వస్తే చేసుకుంటా. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు కనిపించిన వాళ్లంతా నన్ను లవ్ చేయడం లేదు వేరే వాళ్ళను లవ్ చేస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలి అంటే  నన్ను హర్ట్ చేయకుండా తనతో ఈక్వల్ గా చూసుకోవాలి. నేను చేస్తున్న ఈ ప్రొఫెషన్ ని యాక్సెప్ట్ చేయాలి. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ప్రాణం. పెళ్లయ్యాక కూడా ఈ ఫీల్డ్ ని క్విట్ చేయాలనుకోవడంలేదు.  అందులోనూ ఇండస్ట్రీ వాళ్ళు ఐతే అస్సలు వద్దు..ఇద్దరం ఇండస్ట్రీలో ఉంటె పిల్లల్ని చూసుకోవడం కుదరదు కదా..ఎలాంటి పరిస్థితిలో ఐనా సరే నాకు తోడుగా ఉండే అబ్బాయి కావాలి " అని చెప్పింది రోహిణి. దాంతో రవి అందరం తలా ఒక సంబంధం తీసుకొద్దాం అనేసరికి త్వరలో రోహిణి స్వయంవరం ఏర్పాటు చేద్దాం అని చెప్పింది మహి. ఇలా రోహిణి సెగ్మెంట్ కొంచెం ఫన్నీగా సాగింది.      

ఎయిర్ పోర్ట్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న పవిత్ర!

జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేసి తమ ట్యాలెంట్ తో ఎంతో‌ మంది సినిమాల్లో నటించారు. అలాంటి వారిలో గెటప్ శీను, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, వేణు వెల్దండి, ధనరాజ్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్టులో రోహిణి కూడా ఉంది. 'సేవ్ ది టైగర్స్' లో తను చేసిన నటనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. దాంతో తనకి సినిమా ఆఫర్లు పెరిగాయి. కాగా ఇప్పుడు తను రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. 'రౌడీ రోహిణీ' అనే యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తుంది. కాగా పవిత్ర గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది రోహిణి. జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జీ తెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జబర్దస్త్ పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ చేసిన కష్టాలని దగ్గరనుండి చూసిన పవిత్ర.. తన చదువు ఇంటర్మీడియట్ వరకే ఆపేసిందంట. తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అంట్లు తోమడానికి వెళ్ళినప్పుడు సాయం చేయడానికి తను కూడా వెళ్ళిందంట. జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమేడియన్లు ఉండేవాళ్ళు కాదు అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీని చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, హైపర్ ఆది టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది. ఇమాన్యుయల్ తో కలిసి మంచి బాండింగ్ ఉన్న పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. కాగా ఆ వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది. అయితే రోహిణి తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నారంట వాళ్ళు. అయితే అక్కడ పవిత్ర బ్లాక్ డ్రెస్ అండ్ క్యాప్ పెట్టుకుంది చూసి తను అక్కడ ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తుందంటూ ఫన్నీగా అనేసింది. ఇప్పటిదాకా కాఫీ షాప్ లో పనిచేసింది. ఇప్పుడే వచ్చిందని రోహిణి అనగా.. జోక్ చేయకు అక్క, నువ్వు నేను కలిసే కదా జాయిన్ అయిందని కౌంటర్ చేసింది పవిత్ర. అలా పవిత్ర, రౌడీ రోహిణి కలిసి సరదాగా మాట్లాడుకున్నారు.

మానవత్వాన్ని చాటుకున్న సుమ కనకాల!

'మానవ సేవే మాధవ సేవ' అని చాలా మంది నమ్ముతారు. కొందరు‌ సెలబ్రిటీలు పేరు కోసం, మనీ కోసం నటిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే తాము చేసే మంచి పనిలో‌ అందరిని భాగస్వాములని చేస్తారు. అలాంటి పని ఇప్పుడు సుమ కనకాల చేసింది. అనాథలుగా‌ మిగిలిపోతున్న వృద్ధుల కోసం 'ది నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని నిర్మించింది. ఈ ఓల్డేజ్ హోమ్ కోసం తనతో పాటు ఎంతో మంది విరాళాలు పంపించారని , విదేశాల నుండి కూడా భారీగా డబ్బులు పంపించారని సుమ అంది. అనాథల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఓల్డేజ్ హోమ్ ని సుమ తాజాగా ప్రారంభించింది.  బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.  అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ 'స్ట్రెస్ బస్టర్స్' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే  సుమ.. 'వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా  అది వైరల్ అయింది. అయితే తాజాగా సుమ 'ది‌ నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని ప్రారంభించి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ హోమ్ కోసం సాయమందించిన ప్రతీ ఒక్కరికి సుమ ధన్యవాదాలు తెలిపింది. కాగా ఎప్పుడు చమక్కులతో చక్కిలిగింతలు పెట్టే సుమ, మానవ సేవే మాధవ సేవ అనే గోల్డేన్ వర్డ్స్ ని నిజం చేసినందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఛీఛీ నువ్వు ఇంత చీపా.. ఇలాంటోడివనుకోలేదు నూకరాజు!

ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్య వీళ్ళిద్దరు కలిసి చేసిన "ఎంగేజ్ మెంట్ కోసం రెడీ అయ్యాం", " మా లవ్ మ్యాటర్ పైన క్లారిటీ", "బక్రీద్ స్పెషల్" వ్లాగ్స్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో వీళ్ళు తాజాగా మరొక వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. 'ఫోన్ లో దొరికిండు గుడ్డు పగిలింది' అనే వ్లాగ్ ని ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. ఇందులో ఆసియా చిన్ననాటి ఫోటోలని నూకరాజు చూపిస్తూ కామెంట్ చేసాడు. ఆ తర్వాత నూకరాజు ఫోన్ తీసుకొని చెక్ చేసిన ఆసియా.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. " ఏంది ఇది.. నువ్వు ఇంతా చీపా.. ఛీ ఛీ.. వీడియో ఆపన్నా.. నువ్వు ఇలాంటోడివనుకోలేదు రాజు " అంటూ ఆసియా అంటుంది. దానికి నూకరాజు షాక్ అవుతాడు. ఫోన్ లో ఏముందని అడుగగా.. తనేం మాట్లడదు. కాసేపటి తర్వాత ఫ్రాంక్ అని అనేస్తుంది ఆసియా. కాగా యూట్యూబ్ లో తమ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

గీతు రాయల్ బర్త్ డే వేడుకల్లో ఆ ఇద్దరు!

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు. గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. అయితే ఈ మధ్యే తను శ్రీలంక టూర్ కి వెళ్ళి వచ్చింది. అది పూర్తయిన నెలలోనే థాయ్ లాండ్ కి వెళ్ళింది. బ్యాడ్ గర్ల్స్ టు బ్యాంకాక్ అనే వీడియో వైరల్ అయింది. కాగా ఈ రోజు గీతు రాయల్ పుట్టిన రోజు కాబట్టి ఒక దగ్గర గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఆ పార్టీలో తన ఫ్రెండ్స్ తో పాటు, శ్రీసత్య, వాసంతి కృష్ణన్, యాంకర్ శివ కన్పించారు. శ్రీసత్య, వాసంతి ఈ ఇద్దరు తప్ప బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరూ రాలేదా అంటే రాలేదనే చెప్పాలి. కానీ అందరు తమ తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో గీతుకి బర్త్ డే విషెస్ చెప్పగా.. వాటన్నింటిని స్క్రీన్‌ షాట్స్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది గీతు రాయల్. కాగా ఇప్పుడు గీతు రాయల్  ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ప్రెగ్నెన్సీ కోసం స్వప్న చేసే పని సరైనదేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -185 లో.. కావ్య అందరికీ కాఫీ తోసుకొని వస్తుంది. అయితే ఎవరికిచ్చినా ఎవరూ తీసుకోరు. ఎందుకంటే కావ్యతో  ఎవరు మాట్లాడకూడదని అపర్ణ చెప్పింది. దాంతో అందరూ అలానే కావ్యతో మాట్లాడకుండా ఉంటారు. మరొకవైపు రోడ్డు మీద బైక్ వేలం పాట పెడుతుంది అప్పు. కళ్యాణ్ అక్కడికి వచ్చేసరికి అప్పు చుట్టూ జనాలను చూసిన కళ్యాణ్.. ఇక్కడేంటి ఇంతమంది ఉన్నారని వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి బైక్ వేలంపాట వేస్తుంటుంది అప్పు.   ఇది నా బైక్ అని కళ్యాణ్ అనగానే.. అది నువ్వు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేముందు ఆలోచించాలని అప్పు అంటుంది. బైక్ విలువ తెలిసినవాడివి నా విలువ తెలియదా.. మా గల్లీలోకి హీరో వచ్చిన హీరోయిన్ వచ్చినా దోస్త్ లతో కలిసి చూడాలనుకుంటాం, నీలాగా ఇలా వదిలేసి వెళ్ళిపోమని కళ్యాణ్ తో అప్పు అనగానే.. సారీ బ్రో వదిలేయ్ అని కళ్యాణ్ అంటాడు. మరి ఏమైంది నీ సువర్ణ సుందరి కథ అని అప్పు అడుగగా.. తను వేరొకరి భార్య అని కళ్యాణ్ అంటాడు. దాంతో అప్పు నవ్వేసి.. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నా, తను నీ సుందరి కాదు.. నిన్ను ఆడిస్తుందని, గిప్పుడేమైందని అప్పు అంటుంది. సర్లే అని కళ్యాణ్, అప్పు ఇద్దరు బయల్దేరతారు.  మరొకవైపు కావ్య కిచెన్ లో ఒంటరిగా ఆలోచిస్తుంటుంది. ధాన్యలక్ష్మిని మాట్లాడించాలని ప్రయత్నించిన తను మాట్లాడకుండా ఒక పేపర్ మీద రాస్తుంది. నీతో ఎవరూ మాట్లాడొద్దని అక్క అందరికి చెప్పిందని ధాన్యలక్ష్మి పేపర్ మీద రాసి కావ్యకి ఇస్తుంది. ఆ తర్వాత స్వప్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని తన ఫ్రెండ్ శిరీషకి కాల్ చేసి అడుగగా.. తను అన్నీ చూసి ఇక ఇప్పట్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు.. రెండే దార్లున్నాయి. ఒకటి రాహుల్ తో నువ్వు కలవడం, రెండవది ఎలాగైనా కడుపు పెంచుకోవడమని చెప్పేసి శిరీష కాల్ కట్ చేస్తుంది. దాంతో రాహుల్ తో అవ్వదు కానీ ఎలాగైనా బాగా తిని కడుపు పెంచుకోవాలని స్వప్న భావిస్తుంది. మరొకవైపు వాళ్ళ గదిలోకి కావ్య వెళ్ళగానే రాజ్ ఏదో పెయింటింగ్ వేస్తుంటాడు. అది చూసి ఏంటి కళాపతి ఏం పెయింటింగ్ వేస్తున్నారని అడిగినా రాజ్ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. తను వేసే పెయింటింగ్ కావ్యకి కనిపించకుండా చేస్తాడు. మరొకవైపు ఆఫీస్ లో పనిచేస్తున్న డిజైనర్ కి కావ్య కాల్ చేసి... మీ బాస్ ఏం పెయింటింగ్ వేస్తున్నాడు? ఏంటి అని అడుగుతుంది. అదేంటంటే మొన్న క్లయింట్ కాల్ చేసి, మీరు వేసిన డిజైన్స్ లో చిన్న కరెక్షన్స్ ఉన్నాయన్నారని కావ్యతో ఆ డిజైనర్ చెప్తుంది. అవునా అందుకేనా మీ బాస్ అంత కష్ట పడుతున్నాడని కావ్య అంటుంది. ఆ తర్వాత రుద్రాణి వచ్చి కావ్య ఒంటరిదని చెప్తుంది. దానికి కావ్య కౌంటర్ వేస్తుంది. నాకు సహనం ఉంది నాతో మాట్లాడితే అత్తయ్య చూస్తే అంతే అని రుద్రాణితో కావ్య అంటుంది. ఆ తర్వాత స్వప్న పొట్ట పెరగాలని బిర్యానీ తెప్పించుకొని తింటుంది‌. అది ధాన్యలక్ష్మి చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషికి ఏంజిల్ ఇచ్చే సర్ ప్రైజ్ ఏంటి.. శైలేంద్ర ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -852 లో.. జగతి, మహేంద్ర ఇంట్లో వాళ్లంత భోజనం చేస్తుంటారు. కూరలో ఉప్పు ఎక్కువ వేసావని ధరణిపై దేవయాని కోప్పడుతుంది. అక్కడే ఉన్న శైలేంద్ర గమినించి, ఫణింద్ర దృష్టిలో మంచివాడనిపించుకోవాలని కర్రీ బాగుంది మమ్మీ నువ్వు అలా అనకు.. ఈ కర్రీ నా కోసం చేసావా చాలా బాగుందని ధరణితో శైలేంద్ర చెప్తాడు. ధరణి ఆశ్చర్యంగా చూస్తుంది. సరదాగా ప్రేమగా మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటావేంటని శైలేంద్ర అంటాడు. మీకోసమే చేశానని ధరణి చెప్తుంది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గురించి ముందు తెలుసుకుంటానని ఫణింద్రకి శైలేంద్ర చెప్తాడు. దానికి సరేనంటాడు ఫణింద్ర. మరొక వైపు ఏంటి ఏదో మాట్లాడాలని అన్నావని ఏంజిల్ ని వసుధార అడుగుతుంది. రిషి ఎందుకో డల్ గా ఉన్నాడు. నువ్వు రాసిన లెటర్ తనకి కన్పించేలా పెట్టాను చూసి ఉంటాడా ఎలాంటి రియాక్షన్ లేదని వసుధారతో ఏంజిల్ అంటుంది. ఆ లెటర్ చూడలేదు అనుకుంటా అని వసుధార అనగానే.. చూసాడు చూసేలా పెట్టానని ఏంజిల్ చెప్తుంది. అసలు రిషి ఇంతక ముందు ఎవరినైనా ప్రేమించాడేమో అని ఏంజిల్ అంటుంది. నిన్ను ఒకటి అడగాలా అని ఏంజిల్ వసుధారని అంటుంది. నువ్వు రిషిని ప్రేమించావా? లేక నిన్ను రిషి ప్రేమించాడా? ఇద్దరు ప్రేమించుకుంటున్నారా... మీ మధ్య ఏదైనా గతమేమైనా ఉందా అని ఏంజిల్ అడుగుతుంది. అదేం లేదు లెక్చరర్ కి లెక్చరర్ కి మధ్య ఏముంటుంది.. ఏం లేదని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని ఏంజిల్ రిలాక్స్ అవుతుంది. మరొక వైపు శైలేంద్ర కాలేజీలో మేనేజర్ తో మాట్లాడుతాడు. అది చూసిన జగతి, మహేంద్ర ఇద్దరు మేనేజర్ ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడని అనుకుంటారు. శైలేంద్ర దగ్గరికి జగతి మహేంద్ర ఇద్దరు వచ్చి.. ఏం తెలుసుకుంటున్నారని అడుగుతాడు. అప్పుడే ఫణింద్ర వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీరు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ విషయాలు తెలుసుకోమన్నారు కదా తెలుసుకుంటుంటే.. పిన్ని, బాబాయ్ ఇద్దరు వచ్చి ఏం అడుగుతున్నావని అంటున్నారని శైలేంద్ర చెప్తాడు. ఇది వరకు శైలేంద్ర అలా మాట్లాడాడు కానీ ఇప్పుడు నేర్చుకోనివ్వండని ఫణింద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా ఇదే టాపిక్ గురించి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. మరొక వైపు రిషిపై ఉన్న ప్రేమ వసుధార గురించి గుర్తు చేసుకుంటుంది. ఏంజిల్ ఎప్పుడు లేనివిధంగా అందంగా రెడీ అవుతుంది. అప్పుడే రిషి వస్తాడు. రిషి నీతో మాట్లాడాలి, నీకొక సర్ ప్రైజ్ ఉందని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అగ్రిమెంట్ పూర్తయిందని చెప్పిన కృష్ణ.. రేవతి ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -246 లో.. మురారికి కృష్ణ తినిపిస్తూ తనకి దగ్గరగా ఉంటుంది. కృష్ణ చూపించే ప్రేమకి మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని నడిపిస్తూ మురారి పక్కనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు.  ఆ తర్వాత కృష్ణ కొద్ది దూరాన నిల్చొని.. మీరు మెల్లి మెల్లిగా నా దగ్గరికి రండి అని మురారిని నడవమని చెప్తుంది. మురారి దగ్గరగా వెళ్లిన కొద్ది కృష్ణ వెనక్కి జరుగుతుంది. ఈ ఆట కూడా నా జీవితం లాగే ఉంది కృష్ణ.. నేను నీకు దగ్గరగా వస్తుంటే నువ్వు దూరంగా వెళ్తున్నావని మురారి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత మురారి నడవడంలో ఎంకరేజ్ చెయ్యడానికి కృష్ణ కో డాక్టర్స్, కాని స్టేబుల్స్ వస్తారు. అప్పుడే రేవతి క్యాంపు దగ్గరికి వస్తుంది. మురారిని ఆ సిచువేషన్ లో చూసిన రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమైంది మురారి అంటూ బాధపడుతు వస్తుంది. ఒక డాక్టర్ జరిగిందంతా రేవతికి చెప్తుంది. మీరేం టెన్షన్ పడకండని రేవతికి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారిలది అగ్రిమెంట్ గడువు ఈ రోజుకే లాస్ట్ అని కృష్ణ బాధపడుతుంది. మురారి దగ్గరే కృష్ణ రేవతి ఉంటారు. మురారిని ఈ సిచువేషన్ లో చూస్తున్నందుకు  బాధగా ఉందని రేవతి అంటుంది. మా అగ్రిమెంట్ ఈ రోజుతో పూర్తి అవుతుందని అత్తయ్యకి చెప్పాలని కృష్ణ అనుకొని.. అత్తయ్య మీతో మాట్లాడాలని పక్కకి తీసుకొని వెళ్తుంది. మీకో విషయం చెప్పాలని కృష్ణ ఇబ్బంది పడుతుంటుంది. అగ్రిమెంట్ గురించి అని కృష్ణ అనగానే.. ఇంకా మర్చిపోలేదా.. అగ్రిమెంట్ లేదు, ఏం లేదు నేను ఉన్న కోపంలో నువ్వు అగ్రిమెంట్ అంటూ మాట్లాడితే చెంప చెళ్లుమనిపిస్తానని కృష్ణకి రేవతి వార్నింగ్ ఇస్తుంది. నాకు వెళ్ళాలని లేదు అత్తయ్య కానీ మీ అబ్బాయి మనసులో నేను లేనని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఈ రోజుతో నా అగ్రిమెంట్ పూర్తి అవుతుంది. నేను రేపు మా ఊరు వెళ్తున్నానని కృష్ణ చెప్పి వెళ్తుంది. మీ ఊరు వెళ్తే నేను రాలేనా వచ్చి నిన్ను తీసుకువస్తానని రేవతి అనుకుంటుంది. మరొక వైపు కృష్ణని పిలుస్తు మురారి వస్తాడు. కృష్ణ ఎక్కడ అని రేవతిని మురారి అడుగుతాడు. రేవతి పట్టించుకోనట్లు టిఫిన్ తీసుకొని రావాలా అని అడుగుతుంది. అమ్మా నేనేం అంటున్నాను, నువ్వేం అంటున్నావని మురారి అంటాడు. కృష్ణ అగ్రిమెంట్ పూర్తయిందట కదా, అందుకే ఊరు వెళ్తుందట అని రేవతి చెప్పగానే.. నీ కొడుకు భార్య అలా వెళ్ళిపోతే, నా కొడుకుని వదిలిపెట్టి వెళ్తున్నావ్ ఎందుకు అని నువ్వు అడగవా అని మురారి అంటాడు. మీకు ఒకరిపై ఒకరికి ఇష్టం లేనప్పుడు నేనెందుకు అడుగుతానని రేవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మురారిది ఓవరాక్షన్ అంటున్న కృష్ణ.. ముకుందే సాక్ష్యం!

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ఒక ప్రత్యేకత ఉంది‌. ఈ టీవిలో ప్రసారమయ్యే సీరియల్స్ లో టాప్ -5 లో రెండు ఉన్నాయి. మొదటిది బ్రహ్మముడి, నాల్గవ స్థానంలో కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్స్ కి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కథ రోజు రోజుకి చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకున్న కృష్ణ, మురారిల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వీరిద్దరి పెళ్ళి ముందు ముకుందని మురారి ప్రేమిస్తాడు. కాగా మురారి వాళ్ళ అన్న ఆదర్శ్ ని ముకుంద పెళ్ళిచేసుకొని అదే ఇంటికి వస్తుంది. దీంతో ఆదర్శ్ కి ముకుంద ప్రేమ విషయం తెలిసి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఇక ముకుంద ఒంటరిగా ఉంటూ మురారి తన ప్రేమను పొందాలని తపిస్తుంటుంది. కాగా కొత్తగా పెళ్ళిచేసుకొని వచ్చిన కృష్ణ ఇంట్లో అందరితో కలిసిపోయతుంది. మురారిని ప్రేమిస్తుంది కృష్ణ. అయితే తాజా ఎపిసోడ్‌లలో మురారి, కృష్ణలు చేసుకున్న అగ్రిమెంట్ పూర్తవడంతో.. మెడికల్ క్యాంప్ పేరుతో కృష్ణ ఇంటి నుండి బయటకొచ్చేస్తుంది. దాంతో మురారి ఒంటరి వాడవుతాడు. ఇక కృష్ణ కోసం మెడికల్ క్యాంప్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరుగగా ఏసీపీ మురారి  అక్కడ వాళ్ళందరిని క్షేమంగా కాపాడతాడు. ఆ కాపాడే ప్రాసెస్ లో మురారికి గాయాలవుతాయి. దాంతో కృష్ణ అతనికి ట్రీట్ మెంట్ చేస్తుంది. మురారిని కాపాడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేస్తూ మేకర్స్ ఈ సీరియల్ ని సరికొత్తగా చేస్తున్నారు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముఖ్య పాత్రలు చేస్తున్న మురారి(గగన్ చిన్నప్ప), కృష్ణ(ప్రేరణ కుంభం), ముకుంద( యశ్మీ గౌడ) ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. కాగా సీరియల్ లోని తాజా ఎపిసోడ్‌లలో మురారికి గాయం కాగా కృష్ణ తనకి ట్రీట్ మెంట్ చేసి కాపాడుతుంది. అయితే ఈ వీడియోలో రివర్స్ లో మురారికి గాయాలు చేస్తూ సరదాగా ఆటపట్టించింది కృష్ణ. ఇదంతా యాక్టింగ్ కాదు ఓవరాక్టింగ్ అంటూ మురారిని కృష్ణ అంటుంది. దెబ్బలు తాకిన వారు ఆ బ్యాండెడ్ కట్టుకుంటారు. కానీ యాక్టింగ్ చేసేవాళ్ళు ఇలా ఉంటారంటూ మురారి(గగన్) ని అంది కృష్ణ.  అలా సెట్ లో ఈ సీరియల్ టీమ్ అంతా కలిసి అలా సెట్ లో సరదాగా గడిపారు. ఇదంతా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో షేర్ చేసారు. అయితే వీళ్ళు చేసిన ఈ వీడియోని ముకుంద( యశ్మీ గౌడ) తీసింది. ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

బతికున్న కోరమీనుతో పాటు 40 గిఫ్టులు ఇచ్చిన శ్రీవాణి

బుల్లితెర నటి శ్రీవాణి గురించి ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఇంకా తన భర్త విక్రమ్ కలిస్తే ఇంకా ఫన్ ఉంటుంది. అలాంటి విక్రమ్ , శ్రీవాణి వాళ్ళ యుట్యూబ్ లో రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు విక్రమ్ బర్త్ డే సందర్భంగా శ్రీవాణి బోల్డు గిఫ్టులు ఇచ్చింది. విక్రమ్ 41 ఏళ్ళ సందర్భంగా 41 గిఫ్టులు ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. అందులో సోప్, బ్రష్, మగ్గు, షాంపూ, తల దువ్వెన, లాల్చీ పైజామా, చాక్లేట్లు, హ్యాండ్ వాచ్, షోలాపూర్ చెప్పులు, జుట్టుకు వేసుకునే రంగు,  ఉన్నాయి. తర్వాత విక్రమ్ కి ఎంతో ఇష్టమైన ఒక కోట్ తీసుకుంది. భోళా శంకర్ మూవీ చూసాక అందులో చిరంజీవి పైన వేసుకున్న కోట్ చూసాక అది తనకు ఎంతో నచ్చిందని చెప్పేసరికి శ్రీవాణి దాన్ని కుట్టించి గిఫ్ట్ గా ఇచ్చేసింది. అది చూసేసరికి విక్రమ్ శ్రీవాణిని ముద్దు కూడా పెట్టేసుకున్నాడు. మూవీలో చిరంజీవి కోట్ గ్రీన్ కలర్ ఇక్కడ నాది బ్లూ కలర్ అన్నాడు విక్రమ్. తినడానికి జీడిపప్పు బెల్లం చిక్కీని ప్యాక్ చేసి ఇచ్చింది. అలాగే నైట్ భోజనంగా ఈ మధ్య కొంత కాలం నుంచి జామకాయ, దానిమ్మ  మాత్రమే తింటున్నాడట అందుకే ఆ రెండు పళ్ళను  కూడా గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీవాణి. అలాగే కట్టుకునే పంచె కూడా గిఫ్ట్ చేసింది. విక్రమ్ కి ఎంతో ఇష్టమైన నైట్ కూల్ డ్రింక్ తాగే గ్లాస్ పగిలిపోయేసరికి మళ్ళీ అల్లాంటిదే కొని బహుమతిగా ఇచ్చింది శ్రీవాణి. దాన్ని చూసి చాల హ్యాపీగా ఫీలయ్యాడు విక్రమ్. ఈమధ్య ఫుల్ బిజీ ఐపోయిన విక్రమ్ కోసం డైరీ ప్రెజంట్ చేసింది. ఎక్కడెక్కడికి వెళ్ళేది డైరీలో రాయమని చెప్పింది శ్రీవాణి. తర్వాత బకెట్ లో బతికున్న కోరమీను చేపను కూడా ప్రెజంట్ చేసింది. ఇలా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయించి ఫన్ చేసింది శ్రీవాణి.

కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ రోజు ఏం జరిగిందో తెలుసా?

ఫైమా‌ పటాస్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికీ  సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తనేంటో నిరూపించుకుంది. అలా బుల్లితెరపై నవ్వులు పూయించిన ఫైమాకి బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం లభించింది.  బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా.. హౌస్ లో నవ్వులు పూయించింది. అయితే ఒకానొక దశలో తను వేసే పంచులు ఎదుటివారిని ఇబ్బంది పెడతాయని అప్పుడే తెలిసింది. దాంతో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఫైమాకి అలా వెటకారంగా మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయిన తను మారలేదు. దాంతో ప్రేక్షకులలో ఫైమాపై నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిందనే చెప్పాలి. దాంతో బిగ్ బాస్ వీక్లీ వైజ్ ఎలిమినేషన్ లో ఫైమా బయటకొచ్చింది. అయితే ఫైమా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఆ ఫ్యాన్స్ ఫైమా బయటకొచ్చాక గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అందరి దృష్టి ఫైమా మీద పడింది. అలా ఫైమా ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆ తర్వాత బిబి జోడీలో సూర్య తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. దీంతో ఫైమాకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అయితే ఫైమా తన గురించి ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది.. తాజాగా కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. దానికి బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. కాగా అందులో కొంతమంది తమ తమ పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ బిజీ ఉండగా, కీర్తిభట్ కి తల్లితండ్రులు స్థానంలో మెరీనా, రోహిత్ ఉండి ఎంగేజ్ మెంట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఫైమా తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో 'కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ రోజు ఏం జరిగిందో తెలుసా' అనే వ్లాగ్ ని చేసింది. ఇందులో ఫైమా ఎంగేజ్ మెంట్ కి లేట్ గా వెళ్ళిందంట. అక్కడ వాసంతి కృష్ణన్, రాజ్, ఆదిరెడ్డి, మెరీనా రోహిత్ లతో కాసేపు మాట్లాడుతూ వ్లాగ్ చేసింది. రాజ్ గురించి ఫైమా మాట్లాడుతూ.. మేమిద్దరం ఎప్పుడు గొడవపడుతుంటాం. ఒక నెల మాట్లాడుకుంటాం. మూడు నెలలు మాట్లాడుకోమని ఫైమా అంది. కాగా మా అందరిలో అటిట్యూడ్ ఎవరికి ఎక్కువ ఉంటుందనంటే అందరు ఫైమానే అంటారని రాజ్ అన్నాడు. ఇలా ఫైమా అక్కడ తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి సరదగా గడిపింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

ఇటు పూజ చేస్తాను, అటు పబ్బుల్లో డాన్స్ చేస్తాను!

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను  అలరిస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6 లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు. అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా‌ ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది.‌ అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ  బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది. రీసెంట్ గా ఒక కారు కూడా కొన్న ఇనయా.. గత వారం ఐకియా నుండి ఫర్నీచర్ ని ఆర్డర్ చేసి.. వాటి అన్ బాక్స్ చేసి చూపించింది. అయితే తన గురించి ప్రతీ విషయాన్ని అభిమానులకు తెలియాజేయాలనే ఉద్దేశంతో.. ప్రతీ అప్డేట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది ఇనయా.   ఎప్పుడు ట్రెండీగా కన్పించే ఇనయా తాజాగా తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.  ఇనయా ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో 1% పూజ చేస్తానని, మిగతా 99% పబ్బుల్లో డాన్స్ చేస్తానని ఇనయా చెప్పింది. 'I can do both ' అనే క్యాప్షన్ రాసి అప్లోడ్ చేసిన వీడియోని షేర్ చేసింది ఇనయ. దేవుడి ఫొటోలకి దండం పెడుతున్న ఫోటో ఒకవైపు, మరొకవైపు పబ్బుల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో.. రెండు కలిపి ఉన్న వీడియోని చూసి.. ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటావంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు తన హాట్ ఫోటోలతో ట్రెండింగ్ క్రియేట్ చేసే ఇనయా ఇలా వరలక్ష్మి పూజ చేయడంతో అందరు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

అనామికని గుర్తుపట్టని కళ్యాణ్.. అపర్ణ నిర్ణయాన్ని దుగ్గిరాల ఫ్యామిలీ నిలబెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -184 లో.. అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. మీరు నా అడ్రెస్ కనుక్కోవడానికి ట్రై చెయ్యొద్దు. నేను చెప్పిన దగ్గరికి రండి. మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని అనామిక అనగానే.. కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అయి సరే అంటాడు.  మరొకవైపు కావ్య వాళ్ళు అత్తింటికి వస్తుంటే కొందరు రౌడీలు కావ్యని ఏడిపిస్తారు. అప్పుడే అటుగా రాజ్ కార్ వెళ్తుంది రౌడీలను చూసిన రాజ్ కార్ ఆపి.. రౌడీలకి బుద్ది చెప్తాడు. మేడమ్ మీ భార్య నా సర్ అని రౌడీ లు అక్కడ నుండి పారిపోతారు. ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు కార్ లో ఇంటికి బయలుదేర్తారు. మరొక వైఫు అనామికని కలవడానికి అప్పుని కళ్యాణ్ తీసుకొని బయలుదేర్తాడు. అప్పుడే వాళ్ళు వెళ్తున్న బైక్ ఆగిపోతుంది. అప్పుకి మాత్రం చిరాకుగా ఉంటుంది. మరొకవైపు మీరు నన్ను భార్యగా ఒప్పుకోలేదని అన్నారు. మరి ఆ రౌడీలని ఎందుకు కొట్టారని కావ్య ప్రశ్నలు వేస్తుంటే రాజ్ వాటికి సమాధానం చెప్పకుండా తను చేసే పని చేసుకుంటాడు. మరొక వైపు బైక్ ని తోసుకుంటూ అప్పు, కళ్యాణ్ అనామికని కలవడానికి వెళ్తారు. మధ్యలో కళ్యాణ్ అనామిక వెళ్లే కార్ ని లిఫ్ట్ అడుగుతాడు. అది అనామిక అని కళ్యాణ్ కి తెలియదు. అప్పుని వదిలేసి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనామిక మాటల్లో తనే అనామిక అని గుర్తుపట్టలేదు కళ్యాణ్. మరొక వైపు కావ్య, రాజ్  ఇద్దరు ఇంటికి వస్తారు. కావ్య బ్యాగ్ కార్ లోనే మర్చిపోతుంది. బ్యాగ్ పట్టుకొని రాజ్ కావ్య వెనకాల రావడం చూసిన అపర్ణ.. రాజ్ వంక కోపంగా చూస్తుంది. చూసావా నీ కొడుకు ఎలా కావ్య వెనకాల వస్తున్నాడో మమ్మల్ని మాట్లాడద్దని అన్నావ్? నువ్వు నీ కొడుకు మాట్లాడకుండా చూసుకోమని అపర్ణతో రుద్రాణి చెప్తుంది. అలా చెప్పగానే అపర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు అనామిక తన ఫ్రెండ్ ని కళ్యాణ్ ముందుకు పంపిస్తుంది. తనే అనామిక అని యాక్ట్ చేపిస్తుంది. అనామిక ఫ్రెండ్ ని  చూసిన కళ్యాణ్ షాక్ అవుతాడు. మీకు పెళ్లి అయిందా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. అవును ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అని తను చెప్పగానే కళ్యాణ్ మరింత షాక్ అవుతాడు.. అదంతా దూరం నుండి చూస్తున్న అనామిక నవ్వుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ కి అనామిక ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తుంది. అది తీసుకొని కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు కావ్య అందరికి కాఫీ తీసుకొని వస్తుంది. అపర్ణ ఇంట్లో ఎవరిని కావ్యతో మాట్లాడొద్దని చెప్పిన మాటలు ఇందిరాదేవి గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమని రేవతి చెప్పగలదా.. ముకుంద ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -245 లో.. మురారిని కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంటుంది కృష్ణ. అయిన మురారి కళ్ళు తెరిచి చూడకపోయేసరికి.. కృష్ణ ఏడుస్తూ కళ్ళు తెరవండి ఏసీపీ సర్ అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత కృష్ణ ట్రీట్మెంట్ చెయ్యడం వళ్ళ మురారి స్పృహలోకి వస్తాడు. మరొక వైపు ముకుంద గదిలోకి భవాని వస్తుంది. గది ఎంత బాగా ఉంచుకుంది. మనసు కూడా అలాగే అదుపులో ఉంచుకుంటే బాగుండేదని భవాని అనుకుంటుంది. అప్పుడే భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. ఏంటి అత్తయ్య ఇలా వచ్చారని అడుగుతుంది. నువ్వు ఇంకా నీ ప్రేమలోనే ఉన్నావని అనిపిస్తుంది. నువ్వు నాతో అబద్ధం చెప్పావని భవాని అనగానే.. నా మీద నమ్మకం లేదా అని ముకుంద అంటుంది. లేదు.. నా దగ్గర నిజం దాచి తప్పు చేసావని భవాని అంటుంది. నాకు అర్థం అయింది మీరు నన్ను ఇంక ఎప్పుడు నమ్మరని ఈ గది అంతా చెక్ చేసుకొని చూడండి. నేను డిస్టబ్ చెయ్యను అని ముకుంద వెళ్తుంటే.. భవాని ఆపి నేనే వెళ్లిపోతున్నా అంటూ తన గదిలో నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు మురారికి కృష్ణ ట్రీట్ మెంట్ చేస్తుంటుంది. తగిలిన గాయాలకి కట్లు కడుతుంటుంది కృష్ణ. మరొక వైపు రేవతి ఎలాగైనా కృష్ణ, మురారి ఇద్దరు ఉన్నా క్యాంపు దగ్గరికి వెళ్లి వాళ్లకి అగ్రిమెంట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాలనుకుంటుంది రేవతి. మరొకవైపు మురారితో కృష్ణ మాట్లాడుతుంది. కృష్ణ పక్కకి వెళ్లగానే.. ఇద్దరు కానిస్టేబుల్స్  మురారి దగ్గరికి వచ్చి.. మేడమ్ మీ కోసం చాలా కష్టపడ్డారు సర్. మీ కోసం డాక్టర్ నే గల్లా పట్టి అడిగారని కానిస్టేబుల్ చెప్పగానే కృష్ణకి నేను అంటే ఇష్టం అన్నట్లు చూస్తాడు. మురారి కృష్ణ సపోర్ట్ తో నడుస్తాడు. మరొక వైపు రేవతి అత్తయ్య కన్పించడం లేదు ఎక్కడికి వెళ్ళిందని అలేఖ్యని ముకుంద అడుగుతుంది. కృష్ణ దగ్గరికి వెళ్లి ఉండవచ్చని అలేఖ్య అనగానే.. మళ్ళీ కృష్ణ ఇంటికి రాకూడదని ముకుంద అంటుంది. త్వరలోనే నిన్ను మురారిని పెళ్లి పీటలపై చూడాలని అలేఖ్య అనగానే.. థాంక్స్ అంటూ ముకుంద చెప్తుంది. మరొకవైపు మురారికి కృష్ణ దగ్గర ఉండి భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వాళ్ళిద్దరి మధ్య ప్రేమని ఏంజిల్  తెలుసుకోగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -851 లో.. రిషి కాలేజీ రాగానే పాండియన్, అతని స్నేహితులు సపోర్ట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు. క్లాస్ కి టైం అయింది తర్వాత మాట్లాడుతానని రిషి అంటాడు. అప్పుడే వసుధార వచ్చి గుడ్ మార్నింగ్ అని రిషిని పలకరిస్తుంది. ఏంటి సర్ ఎందుకు డల్ గా ఉన్నారని వసుధార అంటుంది. అదేం లేదు నాకు తలనొప్పి గా ఉందని రిషి అంటాడు.. ఆ తర్వాత రిషి కావాలనే వసుధార ఇచ్చిన బ్రేస్ లైట్ ని సరిచేస్తూ ఉంటాడు. అది చూసిన వసు మురిసిపోతుంది. ఆ తర్వాత రిషి తన క్యాబిన్ కి వెళ్లి వర్క్ చేసుకుంటుండగా.. పాండియన్ కాఫీ, ఒక టాబ్లెట్ తీసుకొని వస్తాడు. అది చూసిన రిషి‌‌.. ఈ కాఫీ ఎవరు పంపించారని అడుగుతాడు. వసుధార పంపిస్తుంది కానీ నేనే తీసుకొచ్చానని పాండియన్ చెప్తాడు. ఎవరు పంపించారో నాకు తెలుసు కానీ ఆ టాబ్లెట్ తీసుకొని వెళ్ళమని ఒక కాఫీ తాగుతాడు. అదంతా వసుధార చాటు నుండి చూస్తుంది. మరొక వైపు విశ్వనాథ్ కి ఏంజిల్ టాబ్లెట్ తీసుకొని వస్తుంది. రిషి ఎందుకో డల్ గా ఉన్నాడు. ఏమై ఉంటుందని ఏంజెల్ అనగానే.. నేను కూడా రిషిని గమనించాను కానీ నువ్వు పదే పదే రిషిని అడిగి ఇబ్బంది పెట్టకు తన పర్సనల్ తనది తనది, చెప్పాలనిపిస్తే చెప్తాడని విశ్వనాథ్ అంటాడు. నువ్వు నీ పెళ్లి గురించి నాకు చెప్తానన్నావ్ ఏమైందని వఏంజిల్ ని విశ్వనాథ్ అడుగుతాడు. చెప్తాను నాకు కొంచెం టైమ్ కావాలని ఏంజిల్ చెప్తుంది. మరోక వైపు రిషి దగ్గరికి వసుధార వస్తుంది. ఇద్దరు సరదాగా ఆర్గుమెంట్ చేసుకుంటూ ఉంటారు. థాంక్స్ కాఫీ పంపినందుకని రిషి అంటాడు. మీ క్కూడా థాంక్స్ కాఫీ తాగినందుకని వసుధార అంటుంది. మరొక వైపు ఏంజిల్ కాలేజీకి వస్తుంది వసుధార దగ్గరికి వెళ్లి.. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఎందుకని అడుగుతుంది. ఆ తర్వాత వసుధారని ఏంజెల్ బయటకు తీసుకొని వెళ్తుంది. అది రిషి చూస్తాడు. వసుధారని ఎలాగైనా ఏంజిల్ తో వెళ్ళనివ్వకుండా ఆపాలని వసుధారకి రిషి ఫోన్ చేస్తాడు.  రిషి ఫోన్ వసుధార కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ సీజన్-7 కి అంజలి పవన్ కన్ఫమ్.‌. ఇదే సాక్ష్యం!

అంజలి అత్తోట.. ఈ పేరు ఎవరికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అంజలి పవన్ అందరికి సుపరిచితమే. కారణం యాక్టర్ పవన్ ని పెళ్ళి చేసుకొని ఫేమస్ అయింది. టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు యాక్టర్ గా మరొకవైపు యాంకర్ గా కెరీర్‌ ని స్టార్ట్ చేసింది అంజలి పవన్. మొగలిరేకులు సీరియలో నటించిన అంజలి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తనకి బోలెడు సినిమాల్లో, టెలివిజన్ రంగంలో ఆఫర్లు వచ్చాయి. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలి హైదరాబాద్ లో జన్మించింది. తన వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను ఎంతో  ఉన్నంతంగా ఉంటుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లని చూస్తుంటేనే తెలుస్తుంది. అయితే జనవరి 24, 2015  న సినిమా రంగంలో పనిచేస్తున్న సంతోష్ పవన్ ని పెళ్ళిచేసుకుంది అంజలి. అప్పటినుండి తన పేరును అంజలి పవన్ గా మార్చుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అంజలి పవన్. అంజలి తన భర్త పవన్ తో కలిసి 'నీతోనే డ్యాన్స్ షో' లో పర్ఫామెన్స్ చేసింది. వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు రాధ, తరుణ్ మాస్టర్, సదా అంతా ఫిధా అయ్యారు‌. ఈ వయసులో ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం చాలా కష్టమంటూ రాధ కూడా తనని పొగిడారు. అయితే బిగ్ బాస్ సీజన్-7 కి తను సెలెక్ట్ అయినట్టు తను చెప్పకనే చెప్పింది. తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' స్టార్ట్ చేసింది. ఇందులో తన అభిమానుల్లో ఒకరు 'మీ ఫెవరేట్ డేట్ సెప్టెంబరు 3 నా' అని అడుగగా.. అవునని అంజలి అంది. అదే కాకుండా సెప్టెంబరు 3rd ఒక సర్ ప్రైజ్ ఉందంటూ ముందుగానే రివీల్ చేసేసింది అంజలి. దీంతో బిగ్ బాస్ గురించి అప్డేట్స్ ఇచ్చేవాళ్ళంతా అంజలి పవన్ బిగ్ బాస్ 7 కి కన్ఫమ్ అయిందని తెలియజేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఇలా అడిగిన క్వశ్చన్స్ ని తను చెప్పిన ఆన్సర్ అన్నింటిని డిలీడ్ చేసేసింది. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే బిగ్ బాస్ సీజన్-7 కి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇలాంటి ఊహగానాలు జరుగడం కామన్ మరికొంతమంది అంటున్నారు‌.  

ఆడాళ్ళు మీకు జోహార్లు అంటున్న సుమ కనకాల!

వరలక్ష్మి వ్రతమంటే ఆడవాళ్ళకి ఎంత స్పెషలో అందరికి తెలిసిందే. అందులోను సెలబ్రిటీలు చేసే హాడావిడి అంతా ఇంతా కాదు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరూ గ్రాంఢ్ గా జరుపుకుంటారు. ఇప్పుడు అదే కోవలో సుమ చేరింది. ఈ వరలక్ష్మి వ్రతానికి తను ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ ఎంత బిజీగా ఉంటారో దానికి సంబంధించిన ముచ్చట్లన్ని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది సుమ. అన్ని రకాల వంటలతో ఆ రోజంతా ఖాళీ లేకుండా ఉంటారని సుమ చెప్పుకొచ్చింది. బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.  అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ ' స్ట్రెస్ బస్టర్స్ ' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే  సుమ.. ' వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా  అది వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారు. ఎన్ని పనులు చేస్తారో తెలియజేస్తూ ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సుమ కనకాల. ‌ 'లేడీస్ ఆన్ పూజా డేస్' అనే క్యాప్షన్ తో అప్లోడ్ చేసింది సుమ. కాగా ఈ వీడియోకి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు