Krishna Mukunda Murari:కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో బిగ్ ట్విస్ట్.. అది జరిగేనా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -331 లో.. భవాని ముకుంద, మురారి కలిసి రెస్టారెంట్ నుండి ఇంటికి వస్తారు. మురారి మాత్రం కోపంగా వెళ్తాడు. ఆ తర్వాత హాల్లో కూర్చొని ఉన్న భవాని దగ్గరికి మధు వచ్చి.. వెడ్డింగ్ కార్డ్స్ మోడల్స్ తీసుకొని ఒకతను వచ్చాడని చెప్తాడు. ఆ తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ముకుంద సెలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత కార్డ్స్ బాగున్నాయా అంటూ భవాని రేవతిని అడుగుతుంది. రేవతి ఇష్టం లేకున్నా బాగున్నాయని చెప్తుంది. మరొకవైపు కృష్ణ ఇంటికి హ్యాపీగా రావడం చూసి.. ఏమైంది అంత సంతోషంగా ఉన్నావని శకుంతల అడుగుతుంది. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వస్తుందని కృష్ణ చెప్తుంది.  దానికి శకుంతల సంబరపడుతుంది. ఆ తర్వాత కృష్ణ జరిగింది అంతా కూడా శకుంతలతో చెప్తుంది. ఆ తర్వాత రేవతి దగ్గరికి కృష్ణ వస్తుంది. ఏసీపీ సర్ కీ గతం గుర్తుకు వస్తుందని కృష్ణ చెప్పగానే.. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీనివాస్ ఇంట్లో జరిగింది, రెస్టారెంట్ లో జరిగింది మొత్తం  కృష్ణ చెప్పగానే.. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు రెస్టారెంట్ లో జరిగింది గుర్తుకు చేసుకుంటుంది భవాని. అప్పుడే భవాని దగ్గరికి మురారి వస్తాడు. ఒక తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చినట్లు మీరు నన్ను చూస్తున్నారు. అసలు నేను గతంలో నేను ఏంటి అసలు? ఏం చేస్తూ ఉండేవాడిని అని భవానిని మురారి అడుగుతాడు. ఆ తర్వాత ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని భవాని అనుకొని.. నువ్వు ఇంతకు ముందు మన బిజీనెస్ లు అన్ని చూసుకునేవాడివని అనగానే.. మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారని మురారి అడుగుతాడు. మీ డాడ్ చూసుకుంటున్నాడని భవాని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వచ్చి మాట్లాడతాడు. మురారి గురించి కృష్ణ గొప్పగా చెప్తుంది. మరొకవైపు భవాని తన ఫ్రెండ్స్ కి పెళ్లి కీ రమ్మని ఆహ్వానిస్తుంది.. తరువాయి భాగంలో పెళ్లి పత్రికలు తీసుకొని భవాని కృష్ణ దగ్గరికి వచ్చి నీకే మొదటి శుభలేఖ అని ఇవ్వగానే కృష్ణ శకుంతల షాక్ అవుతారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దోశెకు కుట్లేసి అవార్డు అందుకున్న పటాస్ ఫైమా

ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ప్రతీ చిన్న విషయం కూడా పెద్ద టాపిక్ ఐపోతోంది. క్రియేటివిటీ ఉండాలే కానీ ప్రతీ విషయం కూడా క్లిక్ అవుతోంది...ఇక  వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఐపోతున్నారు.  అందులోనూ జబర్దస్త్ కడియన్స్ ఏది చేసిన అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ అటు అవార్డ్స్ ని ఇటు రివార్డ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి కమెడియన్స్ లో లేడీ కమెడియన్ గా బులెట్ భాస్కర్ టీమ్ ని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లి బిగ్ బాస్ ఆఫర్ తెచ్చుకున్న ఫైమా అంటే చాల మందికి ఇష్టం కూడా...చిన్నగా ఎదుగుతూ ఇప్పుడు ఒక సెలబ్రిటీ రేంజ్ కి వెళ్ళిపోయింది. తన కలర్ గురించి తన ఫేస్ గురించి ఎవరు కామెంట్ చేసిన పెద్దగా పట్టించుకోదు.. అలాంటి ఫైమా రీసెంట్ గా ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ వీడియొ చూస్తే తెలివి తెల్లారినట్టే ఉంది అనుకోక మానరు..ఎందుకంటే ఈ మధ్యకాలంలో అవార్డ్స్ కోసం, సెలబ్రిటీ స్టేటస్ కోసం, స్పెషల్ ఐడెంటిటీ కోసం చాలామంది క్రియేటివిటీ స్కిల్స్ ని పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫైమా కూడా పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద వయ్యారంగా ఒక అట్టు పోసింది. ఇక ఫైమా అమ్మ, అక్కా ఆ అట్టు పొయ్యడాన్ని చూసి మూతులు తిప్పుకుంటారు. ఐతే ఆ అట్టుకు మధ్యలో ఖాళి వచ్చేసరికి దానికి కుట్లేసింది...దాంతో వంటల పోటీలో ఫైమా గెలవడంతో చాలామంది వచ్చి అవార్డ్స్ ఇచ్చారు. ఈ వీడియో చూడడానికి చాల ఫన్నీగా ఉంది. ఇక కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇలాంటి వీడియోస్ చేయడం ఆపేయండి అంటే ఇంకొంతమంది మీరు చూడడం ఆపేయండి అంటూ కౌంటర్లు ఇచ్చారు.  వంట చేయడం కూడా ఒక పెద్ద క్రియేటివిటీ  ఐపోయిందనే విషయం అర్ధమవుతోంది అంటున్నారు నెటిజన్స్.  

బిటెక్ వర్సెస్ రైతుబిడ్డ నామినేషన్ రిపీట్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఎవరి ఊహకందని ట్విస్ట్ లు , ఆర్గుమెంట్స్ జరుగుతున్నాయి. పద్నాలుగవ వారం నామినేషన్ ల డిస్కషన్ చూస్తే బుర్రపాడవ్వాల్సిందే. ఎవరు ఎవరికి ఎలవేషన్ ఇస్తున్నారో, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రేక్షకులు. బిగ్ బాస్ మొదటి ప్రోమోలో యావర్, శోభాశెట్టి హైలైట్ గా నిలిస్తే.. సెకండ్ ప్రోమో రైతుబిడ్ వర్సెస్ బిటెక్ బాబు ఆర్గుమెంట్ తో హీటెక్కిపోయింది. ఎవర్రా నువ్వు అని అమర్ దీప్.. రా అనొద్దు అన్న అని ప్రశాంత్ అంటు నామినేషన్ ప్రక్రియ మొదలైనట్టుంది. మాటల తూటాలు బిగ్ బాస్ హౌస్ లో టాపాసుల్లా పేలినట్టు ఈ ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. నా తమ్ముడిని ఎలాగైనా పిలుస్తా.. నచ్చితే పలుకు లేకపోతే పో అంటూ అమర్ దీప్ హైపర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ అమర్ కోసం మాటిచ్చాడు.. అంటూ పాత విషయాలు తవ్వాడు అమరదీప్. అందుకే కదా అన్న నిన్ను నేను గేమ్‌లో కొట్టానా అంటూ ప్రశాంత్ డిఫెండ్ చేసుకున్నాడు. అయితే అమర్, ప్రశాంత్ నామినేషన్ మధ్యలో శోభా దూరి.. "ఆ రోజు చెప్పాను.. ఈ రోజు చెబుతున్నాను. హౌస్‌లో సేఫ్ ప్లేయర్ పల్లవి ప్రశాంతే" అంటూ శోభాశెట్టి అంది. అలానే ప్రశాంత్ చెప్పే డైలాగులు చెబుతు తనని వెక్కిరించింది శోభాశెట్టి. యావర్, అర్జున్ ల మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్టు తెలుస్తుంది. తన సెకెండ్ నామినేషన్ గా అమర్ దీప్ ని అర్జున్ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు అమర్, ప్రశాంత్ లు ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ డిస్కషన్ సాగుతుండగా.. అమర్ కి చిరాకేసి చేతిలో ఉన్న సుత్తి నేలకోసి కొట్టేసి.. ఛీ ఆపరా నీ అబద్ధాలు అంటూ పక్కకిపోయాడు. " నీ కోసం నిలబడినోళ్లని మోసం చేసే గుణం నీదే" అంటూ ప్రశాంత్ అన్నాడు. అమర్ అన్న నన్ను ఎట్లా చేశాడో మీరే చూశారంటూ ఆడియన్స్‌కి చెప్పుకున్నాడు ప్రశాంత్. అది విని అమర్ దీప్.. " అవును నన్ను బయటికి పంపించేయండి, వాడికి కప్పు ఇచ్చేయండి. మీరందరూ హ్యాపీగా ఉండండి" అంటూ హైపర్ అయ్యాడు అమర్ దీప్. మరోసారి రైతుబిడ్డ వర్సెస్ బిటెక్ బాబు నామినేషన్ అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ అవుతుంది.  

బిగ్ బాస్ దత్తపుత్రికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన శివాజీ!

బిగ్ బాస్ సీజన్-7 లో  నామినేషన్ ప్రక్రియ మాములుగా లేదు. ప్రతీ వారం ఒక ఎత్తు అయితే ఈ వారం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. గౌతమ్ ఎలిమినేషన్ అవ్వడం, అంబటి అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి నామినేషన్ నుండి సేవ్ అవ్వడంతో.. ఇక డైరెక్ట్ స్పై బ్యాచ్ కి స్పా బ్యాచ్ కి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నేటి ప్రోమోలో పద్నాలుగవ వారం చివరి నామినేషన్ ప్రక్రియ మొదలైంది.  ఇందులో యావర్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి నామినేట్ చేసినట్టు తెలుస్తోంది.  నువ్వు బ్లైండ్ గా వేరే వాళ్ళ మాట వింటావ్ అని శోభాని యావర్ అనగా.. శెట్టి యు ఆర్ ఫినిష్ అని నువ్వు రాయడం నాకు నచ్చలేదని శోభా అంది. అమర్ దీప్ బ్రెయిన్ వాడుతున్నాడా? నేను కిచెన్ లో తక్కువ యాక్టివ్ గా ఉన్నానా అని ప్రియాంకని యావర్ అడుగగా.. పని తక్కువ చేయడం అనడం వేరు అని ప్రియాంక డిఫెండ్ చేసుకోగా.. శోభా కూడా కిచెన్ లో తక్కువ పనిచేస్తుంది కదా అని యావర్ అన్నాడు. ఇక వీరిమధ్యలోకి శోభా దూరి.. డోంట్ కంపేర్ విత్ మి.. నువ్వేం చేస్తావ్ ? వస్తావ్ తింటావ్ వెళ్తావ్ అని యావర్ మీద అరిచేసింది శోభాశెట్టి.  శివాజీని  శోభాశెట్టి నామినేట్ చేసింది. రీజన్ చేస్తూ.. ‘ మీరు ఎందుకో ఒక చోట గివప్ ఇచ్చారనిపించింది ’ అని చెప్పింది. గివప్ ఇవ్వడం గురించి శోభా చెప్పడం భలే కామెడీగా అనిపించింది. అయిన తెలిసి గివప్ ఎందుకిస్తానమ్మ.. రేస్ లో ఉండాలనుకుంటా కదా అమ్మా అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత.. ‘అమర్ నిన్న ఫౌల్ గేమ్ ఆడాడని నాగార్జున గారు వీడియోలో చూపించారు కదా.. మరి అతన్ని ఎందుకు నామినేట్ చేయలేదు. అది నీకు తప్పనిపించలేదా' అని శివాజీ అన్నాడు. అంటే దానికి నేను నామినేషన్ చేయాలని అనుకోలేదు.. నేను ఇంతే అంటూ ఎప్పటిలాగే అడ్డదిడ్డంగా సమాధానం ఇచ్చింది శోభాశెట్టి. చివర్లో శివాజీ కొట్టిన డైలాగ్ అయితే నెక్స్ట్ లెవల్.. ‘చూడు శోభా.. నువ్వేదైన ఒలింపిక్ పర్ఫామెన్స్ ఇచ్చి నన్ను నామినేట్ చేస్తే డెఫినెట్ గా నీ నామినేషన్ ని యాక్సెప్ట్ చేసేవాడిని ’ అని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే నామినేషన్ లో స్పై వర్సెస్ స్పా మధ్య గట్టిగానే ఆర్గుమెంట్స్ జరిగినట్టున్నాయి.   

పొలిటికల్ గా ట్రోల్స్ చేయొద్దంటు సుప్రిత ఎమోషనల్ పోస్ట్!

తెలంగాణలో నిన్న జరిగిన ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలవడంతో అతడిని కలిసిన ఫోటోని సుప్రిత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో సురేఖావాణి, రేవంత్ రెడ్డి, సుప్రిత ఉన్నారు. అయితే ఆ తర్వాతి పోస్ట్ లో బీఆర్ఎస్ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ట్యాగ్ చేస్తూ.. మేం చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరే సర్ అనే మెమీ పోస్ట్ ని షేర్ చేసింది.  టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విష‌యాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె.  అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత ఇప్పుడు పొలిటికల్ గా వైరల్ అవుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విష్ చేసిన సుప్రితకి అనుకోని విధంగా.. విమర్శలు, ట్రోల్స్ వచ్చాయంట. దానికి సుప్రిత తీవ్రంగా భాదపడుతు ఒక పోస్ట్ ని అభిమానులతో పంచుకుంది.  " నేను మీకు ఏం చేశాను. ఎందుకు నన్ను‌ ట్రోల్స్ చేస్తున్నారు. నన్ను ఎందుకు ట్యాగ్ చేస్తూ పొలిటకల్ గా దూషిస్తూ ఇలా చేస్తున్నారెందుకు. నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశాను. ఆ పోస్ట్ లో పోస్ట్ కొత్త సీఎమ్ ని విష్ చేసానంతే. ఎందుకిలా చేస్తున్నారు. మీరు చేసే ఈ హరాజ్ మెంట్ వల్ల ఒక వ్యక్తి మెంటల్ హెల్త్ ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసా.. ఎంత‌ బాధపడుతున్నానో తెలుసా"  అంటూ పోస్ట్ ని షేర్ చేసింది సుప్రిత.‌ కాగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు.. నాకు హెయిర్ తప్ప ఏమీ ఇవ్వలేదు!

కొందరంతే ఏం చెప్పిన ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-7 ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే సీజన్-7 ఎంత ఫేమసో, కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలకి యాంకర్ గా గీతు రాయల్ చేస్తుంది. సీజన్-6 లో సూటిగా సుత్తిలేకుండా మాట్లాడేది తనే. ఎవరినైనా, ఏదైనా అడిగే గట్స్, దమ్మున్న ఏకైక కంటెస్టెంట్ గీతు రాయల్.  గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. గీతు రాయల్  హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.  అయితే గీతు హౌస్ నుండి బయటకొచ్చాక సీజన్‌-6 కంటెస్టెంట్స్ ని కలిసి థాయ్ లాండ్ ట్రిప్ వెళ్ళింది. రెగ్యులర్ గా బర్త్ డే పార్టీలంటు, వీకెండ్ లలో వాసంతి కృష్ణన్ లని కలుస్తూ ఉంటుంది గీతు. ప్రస్తుతం గీతు బిగ్ బాస్ సీజన్-7 కి కంటెస్టెంట్స్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేస్తుంది‌. అవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కాగా ఇన్ స్టాగ్రామ్ లో తను మాట్లాడకుందామా అని చిట్ చాట్ చేసింది గీతు. ఇందులో ఒకరు మీరు హౌస్ లో ఉన్నప్పుడు శత్రువుగా భావించి బయటకొచ్చాక ఫ్రెండ్ అయింది ఎవరైనా ఉన్నారా అంటే..  ఉన్నారు. ఇంకెవరు మన రాజాధి రాజా.. అంటు రాజ్ కి ట్యాగ్ చేసింది. మీ కుక్క  ఓరొయో మీ నాన్న ఎలా ఉన్నాడని ఒకరు అడుగగా.. తన నాన్న హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వీడియో పెట్టింది గీతు. మీ హెయిర్ చాలా బాగుంది. సీక్రెట్ ఏంటని ఒకరు అడుగగా.. సీక్రెట్ ఏం లేదు. చిన్నప్పటి నుండి అంతే. ఆయిల్స్ కూడా ఏం వాడను. జెనెటిక్ వల్ల అంతే. కానీ ఈ బజ్ ఇంటర్వ్యూల వల్ల రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సి వస్తుంది. దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు. నాకు జుట్టు తప్ప ఏం ఇవ్వలేదని గీతు రిప్లై ఇచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్-6 లో తను బయటకు వస్తున్నప్పుడు చెప్పిన కొన్ని మాటలని వీడియో రూపంలో పోస్ట్ చేసింది గీతు.  

చాల మంది వెంటపడుతున్నారు..కానీ ఈయన మీదే నా కళ్ళు

అలీతో ఆల్ ఇన్ వన్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ షోకి రౌడీ రోహిణ, కెవ్వు కార్తీక్ ఈ షోకి వచ్చారు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న కెవ్వు కార్తీక్ తో మాట్లాడాడు ఆలీ "ఎలా ఉంది లైఫ్ " అని అడిగేసరికి " బాగుంది సర్..అని చెప్పాలి కదా..అందుకే బాగుంది" అన్నాడు కార్తీక్..తర్వాత రౌడీ రోహిణి వచ్చింది స్టేజి మీదకు. "ఏంటి కొంచెం చిక్కినట్టున్నావ్" అని ఆలీ అడిగేసరికి "తెలుస్తోందా మీకు...కొంచెం చిక్కాను " అని రోహిణి చెప్పేసరికి "నీకే తెలియట్లేదు" అని కౌంటర్ వేసాడు కెవ్వు కార్తీక్. "బయట టాక్ ఏంటో తెలుసా..రోహిణి పెళ్ళెప్పుడు చేసుకుంటుంది అని అడుగుతున్నారు..వాళ్లకు నీ సమాధానం ఏమిటి" అని అలీ అడిగేసరికి "యాక్ట్యువల్ గా చాల మంది వెంటపడుతున్నారు" అని కామెడీ చేసింది రోహిణి.  తర్వాత రాకెట్ రాఘవ ఫుల్ గా డాన్స్ చేస్తూ వచ్చి స్టేజి మీద షర్ట్ విప్పేసి మరీ డాన్స్ చేసాడు. "ఈయన వచ్చిన దగ్గర నుంచి నాకు ఈయన మీదే కళ్ళు" అని రోహిణి రాఘవ మీద కామెంట్ చేసేసరికి "సర్ నాకు చాల సిగ్గేస్తోంది" అన్నాడు రాఘవ. ఇక రోహిణి షోలో ఇచ్చిన ఇమేజెస్ మీద ఒక కథ అల్లి చెప్పింది..."చేపలతో ఆడుకుంటూ పాపను పెట్టుకుంటున్నాడు" అనేసరికి ఆలీ అసలు ఊ కొట్టకుండా..అలా సైలెంట్ గా ఉండేసరికి "మీరు సరిగా ఫాలో అవ్వడం లేదు ..నాకు కథ చెప్పే ఇంటరెస్ట్ లేదు" అని రోహిణి చెప్పేసరికి "నాకు ఇప్పుడు అర్ధమయ్యింది టీం లీడర్ గా నిన్ను" అని ఆలీ కౌంటర్ వేసేసరికి రోహిణి నవ్వేసింది. ఏ షో చూసినా జబర్దస్త్ టీమ్ దుమ్ము రేపుతోంది.. అన్ని షోస్ ని చుట్టేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక లేడీ కమెడియన్స్ లో రోహిణి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.  

నాకన్నా డిజర్వింగ్ కానివాళ్ళున్నారు.. శోభాశెట్టి ఓవరాక్షన్!

బిగ్ బాస్ సీజన్-7 రోజ రోజుకి ఉత్కంఠభరితంగా మారుతుంది. ఒకవైపు స్పై బ్యాచ్ మరోవైపు స్పా బ్యాచ్ మధ్యలో ఒకే ఒక్కడు అర్జున్ మిగిలిపోయాడు. బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ పెరిగిందంటే.. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు అందరూ టీవీల ముందు వాలిపోయేంతలా ఉంది. ఎప్పుడూ వచ్చే సీజన్ల కంటే కూడా ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారం పద్నాలుగు మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. నాలుగు వారాల పాటు నలుగురిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత గౌతమ్ ఎలిమినేట్ అవుతున్నట్లుగా చెప్పి అతడిని సీక్రెట్ రూమ్ కు పంపించారు బిగ్ బాస్. ఆ తర్వాత ఒక్కరోజులోనే తిరిగి ఇంట్లోకి రప్పించారు. అసలు అతడిని ఎందుకు పంపారో, ఎందుకు తెచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ఇదిలా ఉండగా... ఐదో వారం గ్రాంఢ్ లాంఛ్ 2.0 లో భాగంగా ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకొచ్చారు. అది చాలదు అన్నట్లు గత వారాల్లో నామినేట్ అయిన రతిక రోజ్, శుభశ్రీ రాయగురు, సింగర్ దామినిలను స్టేజీపైకి తీసుకొచ్చి.. హౌస్ లోకి రీఎంట్రీకి ఓటింగ్ పెట్టారు. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని కాకుండా.. అతి తక్కువ ఓట్లు వచ్చిన రతిక రోజ్ ను ఎవరు ఊహించని విధంగా ఇంట్లోకి పంపి ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇలా ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తు షోను మరింత రసవత్తరంగా మలుస్తున్నారు. అలాగే అదిరిపోయే టాస్క్ లు ఇస్తూ ఫుల్లుగా కంటెస్టెంట్లతో ఆడుకుంటున్నారు. కేవలం వీకెండ్స్, నామినేషన్స్ టాస్క్ లను మాత్రమే చూసే బుల్లితెర ప్రేక్షకులు.. ప్రతిరోజు ఎపిసోడ్ చూసేలా చేస్తున్నారు. ఇప్పటికే పదమూడు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. పద్నాలుగవ వారంలోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా పదమూడవ వారం ఎవరు ఊహించని విధంగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి ఓవారాక్షన్ చేసింది. ఎస్.. నేను డెఫినెట్లీ ఉంటాను. ఎందుకంటే నా కన్న హౌస్ లో డిజర్వింగ్ కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కచ్చితంగా చివరి వరకు ఉంటానని శోభాశెట్టి అంది. ఇదిచూసిన అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ఆరువారాల ఓటింగ్ రిజల్ట్స్ ఆ దత్తపుత్రికకు ఒకసారి చూపించడయ్యా.. ఈ ఓవారక్షన్ తట్టుకోలేకపోతున్నాం. శోభాశెట్టి కోసం ఇంకా ఎంతమంది అమాయకులని బలి చేస్తారంటు ప్రతీ బిగ్ బాస్ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు.  

గౌతమ్ కృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 లో ఒక అన్ వాంటెడ్ , అన్ యూజ్ ఫుల్, అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ చివరి దాకా ఉన్నాడంటే అది గౌతమ్ కృష్ణ అని చెప్పొచ్చు.అశ్వగంధ అలియాజ్ గౌతమ్... హౌస్ లో మోస్ట్ అన్ డిజర్వింగ్ అని ఎవరైన ఉన్నారంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఈ గౌతమ్. హౌస్ లో పన్నెండు మంది హౌస్ మేట్స్ ఉన్నా, ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నా గౌతమ్ కి నామినేషన్ లో గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు శివాజీ. ప్రతీ వారం కారణం లేకుండా సిల్లీ రీజన్స్ తో శివాజీని నామినేట్ చేయడం, కంటెంట్ కోసం వాగ్వాదానికి దిగడం తప్ప ఒక్క గేమ్ లో కూడా గెలిచింది లేదు. ఆట ఆడింది లేదు, యాక్టివ్ పర్ఫామెన్స్ లేదు. ఇంకా ఎంచుకున్నాడంటే ఎలిమినేషన్ అవ్వడానికి ఇతర కంటెస్టెంట్స్ ఉండటమే కారణం లేదంటే నాలుగో వారంలోనే బయటకు వచ్చే కంటెస్టెంట్ గౌతమ్. ఇక ఈ వారం హౌస్ లో ఏ పర్ఫామెన్స్ లేనిది గౌతమ్. నామినేషన్ లో అతితక్కువ పాయింట్లతో లీస్ట్ లో ఉన్నాడు. అయితే శోభాశెట్టి, ప్రియాంక కూడా లీస్ట్ లోనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ కు ఫేవరిజం చూపిస్తాడని అందరికి తెలిసిందే‌. గత నాలుగు వారాల నుండి శోభాశెట్టి నామినేషన్ లో లీస్ట్ లో ఉన్న తనని బయటకి పంపివ్వలేదు బిగ్ బాస్. ఇక తన బదులు ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ బలైన విషయం తెలిసిందే. కాగా అనుకున్నట్టే గౌతమ్ కృష్ణని  ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సీరియల్ బ్యాచ్ కి ఫేవరిజం చూపించిన గౌతమ్ ఎలిమినేట్ అవ్వడంతో స్పై అభిమానులు ఆనందంగా ఉన్నారు.  వారానికి 1.5 లక్షల చొప్పున పదమూడు వారాలకి గాను 19.5 లక్షల రెమ్యునరేషన్ గౌతమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా శివాజీతో గొడవ పెట్టుకోవడం గౌతమ్ కి పెద్ద మైనస్ అయి బయటకొచ్చాడనేది అందరికి తెలిసిన విషయం.  

గౌతమ్ ఎలిమినేటెడ్ .. మరోసారి దత్తపుత్రిక శోభాశెట్టిని కాపాడిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పదమూడు వారాలు పూర్తిచేసుకుంది. ‌ప్రపంచంలోనే అత్యధిక టీఆర్పీ తెచ్చుకుంటున్న షో గా తెలుగు బిగ్ బాస్  షో నిలిచింది. ఇక సండే ఫన్ డే ఎపిసోడ్ లో గెస్ట్ నాని వచ్చాడు. తన ' హాయ్ నాన్న' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కి వచ్చిన నాని.. హౌస్ మేట్స్ తో చిట్ చాట్ చేశాడు. ఇక నాగార్జున తర్వాతి సినిమా ' నా సామి రంగ' మూవీ హీరోయిన్ స్టేజ్ మీదకి వచ్చింది. వచ్చి రాగానే అమర్ దీప్ కి ఓ కిస్ ఇవ్వగా.. గాల్లోకి ఎగిరి మరీ అందుకొని దాచుకున్నాడు. ఇక హౌస్ మేట్స్ తో కాసేపు చిట్ చాట్ చేసింది. ఇక హౌస్ లో ఎవరేంటని? ఎవరు అన్ డిజర్వింగ్ అంటూ ఫిటింగ్ పెట్టాడు నాగార్జున. హౌస్ లో ఇప్పటివరకు జరిగిన వారాల్లో ఎవరు మీకు అన్ డిజర్వింగ్ అనిపించిందో వారికి రీజన్ చెప్పి అన్ డిజర్వింగ్ బ్యాండ్ ఇవ్వమన్నాడు నాగార్జున. ఇక నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్. మొదట ప్రియాంక సేవ్ అయింది. ఆ తర్వాత అంబటి అర్జున్ సేవ్ అయ్యాడు. యావర్, శివాజీ ఇలా ఒక్కొక్కరు సేవ్ అవ్వగా.. లాస్ట్  ప్రశాంత్, శోభాశెట్టి, గౌతమ్ ఉన్నారు. వీరిలో ప్రశాంత్ సేవ్ అయ్యాడు. ఇక చివరగా శోభాశెట్టి, గౌతమ్ ఉండగా శోభాశెట్టి సేఫ్, గౌతమ్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పేశాడు. మరోసారీ ఓట్ చేసిన ప్రేక్షకులకు అన్యాయం చేశాడు బిగ్ బాస్. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న శోభాశెట్టిని ఎలిమినేట్ చేయకుండా గౌతమ్ ని ఎలిమినేట్ చేయడంపై బయట జనాలు విమర్శిస్తున్నారు. ఇంకా ఎన్ని, ఎన్ని దారుణాలు చూడాలి సర్ అంటూ కామెంట్లతో తమ నిరసనని తెలుపుతున్నారు. ఇప్పటికే సీరియల్ బ్యాచ్ కి బిగ్ బాస్ సపోర్ట్ అంటు విమర్శలు వస్తుంటే ఆ నమ్మకాన్ని ఋజువు చేస్తూ .. దత్తపుత్రిక శోభాశెట్టిని కాపాడే ప్రాసెస్ లో భాగంగా మరో గొర్రె బలైంది. ఓటింగ్ ఆర్డర్ లో శోభాశెట్టి అతితక్కువ ఓటింగ్ తో లీస్ట్ లో ఉంది. కానీ గౌతమ్ ని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఇది అన్ ఫెయర్ అంటూ కొందరు అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు.  

రైతులకే ప్రైజ్ మనీ ఇస్తానన్న పల్లవి ప్రశాంత్!

  బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతూ జనాల ఆదరణ పొందుతుంది. గతవారం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో గౌతమ్ ఎలిమినేట్ అయి ఇప్పుడు టాప్-7 మిగిలారు. వీరిలో ఒక్కొ కంటెస్టెంట్ ఒక్కోరకమైన ఆటతీరుతో, మాటతీరుతో స్ట్రాటజీలతో ఉంటు వస్తున్నారు. గతవారం టికెట్ టు ఫినాలే కోసం జరిగిన టాస్క్ లలో అంబటి అర్జున్ గెలిచి ఫైనల్ కి చేరుకున్నాడు. ఇక పద్నాలుగవ వారం నామినేషన్ లో లేకుండా సేవ్ అయ్యాడు. ‌అయితే వీకెండ్ లో వచ్చిన నాగార్జున ప్రైజ్ మనీని కంటెస్టెంట్స్ చెప్పాడు. ఈ సీజన్-7 విజేతకి 50 లక్షల డబ్బుతో పాటు మారుతి కారు,  15 లక్షల విలువైన జోయాలుకాస్ డైమండ్ నెక్లెస్ లభిస్తుందని నాగార్జున తెలిపాడు. ఇక ఈ వివరాలు చెప్పిన నాగార్జున.. మీరు 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని ఒక్కో‌ కంటెస్టెంట్ ని అడిగాడు ‌నాగార్జున. మా మేనకోడలికి మంచి లైఫ్ ఇస్తాను‌. కొన్ని లోన్లు ఉన్నాయని ఈ డబ్బులతో అవన్నీ చేస్తానని అంబటి అర్జున్ అన్నాడు. మా అమ్మనాన్నలకి ఇప్పటివరకు సొంతంగా ఏమీ లేదని, ఈ డబ్బులు గెలిస్తే సొంత ఇల్లు కొనిస్తానని ప్రియాంక అంది. అనంతపూర్ లో కాకుండా హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనిస్తానని అమర్ దీప్ అన్నాడు.  ఇక యావర్ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యాడు. మా అన్నయ్య మాకోసం చాలా కష్టపడుతున్నాడు. అసలు ఎలా బతుకుతున్నామో అర్థం కావట్లేదు. లోన్లు, EMI లు ఉన్నాయని, ఈ డబ్బులు కూడా సరిపోవు కానీ ఇవి హెల్ప్ అవుతాయని యావర్ అన్నాడు. ఆ తర్వాత శివాజీ వచ్చి.. అసలు ఇక్కడివరకు వస్తానని ఊహించలేదు. ఈ యాభై లక్షలు గెలిచాక ఏం చేస్తానో చెప్తానని, ఇది అందరికి రావాలని కోరుకుంటున్నానని శివాజీ అన్నాడు. ఇక ప్రశాంత్ వచ్చేసి.. రైతులకి ఇస్తాను సర్ అని అన్నాడు. ఎందుకని నాగార్జున అనగా.. ప్రతీ సంవత్సరం రైతులు పండించిన పంటకి సరైన ధర రావట్లేదు. అప్పులు పెరుగుతున్నాయి. ఇక పంట చేతికి వచ్చేసరికి ఏదో సమస్య వల్ల నాశనం అవుతున్నాయని, అలా చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అలాంటివారికి ఈ డబ్బులని ఇచ్చి సాయంగా ఉంటానని ప్రశాంత్ అన్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్-7 టోటల్ ఎపిసోడ్ లోనే హైలైట్ గా నిలిచింది. ఒక రైతిబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. రైతల వెంటే ఉంటానంటూ చెప్పడంతో గూస్ బంప్స్ వచ్చాయి.

సీరియల్ బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-7 లో రెండు బ్యాచ్ లుగా ఇప్పుడు నడుస్తుంది. ఒకటి అమర్ దీప్, ప్రియంక, శోభాశెట్టి లు కలిసి గ్రూప్ గా ఆడుతున్న సీరియల్ బ్యాచ్. మరొకటి స్పా బ్యాచ్.. ఏ కుళ్ళు, కుతంత్రాలు లేకుండా గెలుపు కోసమే ప్రయత్నిస్తూ ఒక్కొక్కరిది ఒక్కో గేమ్ ప్లాన్ తో, ఎవరి ఆట వారు ఆడుతూ అందరి అభిమానం సంపాదించుకున్న స్పై బ్యాచ్. ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో గౌతమ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే‌. అంబటి అర్జున్ ఫినాలే అస్త్రని గెలిచి ఫైనల్ వీక్ కి చేరుకున్నాడు.‌ ఇక పద్నాల్గవ వారం హౌస్ లో ఎవరు ఎలిమేట్ అయి బయటకు వస్తారనే ప్రశ్న అందరిలోను నెలకొంది. హౌస్ లో నెగెటివిటి ఉన్న కంటెస్టెంట్స్ శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియంక అయితే వీరిలో ఎక్కువ నెగెటివిటి ఎవరికు ఉందంటే శోభాశెట్టికే అని వందకి తొంభై శాతం మంది అంటారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లో శోభాశెట్టి మొదటి నుండి ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేస్తు ఉండటం ఒక కారణమైతే.. పల్లవి ప్రశాంత్ ని తక్కువగా చూస్తూ, యావర్ ని ప్రతీసారీ నామినేషన్ లో ట్రిగ్గర్ చేయడం.. ఇక ఎవరి దగ్గర ఏ పాయింట్లు లేకపోతే శివాజీని నామినేట్ చేసి మీరు ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం మరొకటి.  ఇక అసలు సూత్రధారి ప్రియాంక .. ఎంత కన్నింగ్ అంటే నాగార్జున ముందు‌ సింపుల్ గా స్మైల్ ఇస్తూ అదేం లేదు సర్ అంటు నిజాలని కప్పేస్తుంటుంది.‌ నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో అన్ డిజర్వింగ్ ఎవరని అడిగాడు నాగార్జున. యావర్, శోభాశెట్టికి అన్ డిజర్వింగ్ అనే ట్యాగ్ ఇచ్చాడు గౌతమ్. గౌతమ్, ప్రియాంకలకి అన్ డిజర్వింగ్ ట్యాగ్ ఇచ్చాడు ప్రశాంత్. అమర్ దీప్, గౌతమ్ లకి శివాజీ అన్ డిజర్వింగ్ ట్యాగ్ ఇచ్చాడు.‌ ఇలా ఒక్కొక్కరు కారణాలు చెప్తూ అన్ డిజర్వింగ్ ఇచ్చారు. యావర్, ప్రశాంత్ లకి అన్ డిజర్వింగ్ ట్యాగ్ ఇచ్చింది ప్రియాంక. కారణమేంటని నాగార్జున అడిగితే.. యావర్‌ గేమ్ తగ్గింది. ఇంకా హౌస్ లో పనులు చేయట్లేదు‌ ‌ ప్రశాంత్‌ హౌస్ లో ఎక్కువ పనులు చేయట్లేదు. ఏదైన టాస్క్ ఓడిపోతే తీసుకోలేకపోతున్నాడని ప్రియంక కారణాలు చెప్పగానే.. అవునా మరి అమర్‌దీప్ ప్రతీ టాస్క్ లో ఓడిపోతానని ఏడుస్తున్నాడని, పాయింట్ల కోసం అంత చేశాడు‌ కదా మరి అతడికి ఎందుకు అన్ డిజర్వింగ్ ఇవ్వలేదని నాగార్జున అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక ప్రియాంకకి మైండ్ బ్లాక్ అయింది. అలాంటిదేం లేదంటూ ఇది నా అభిప్రాయం అంటూ కవర్ చేసింది ప్రియంక. అయితే ఈ వారం నామినేషన్ లో సీరియల్ బ్యాచ్ నుండి ఒకరు కచ్చితంగా బయటకు వస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందులోను శోభాశెట్టి చేసిన ఓవారాక్షన్ వల్ల తనకి మరింత నెగెటివిటి పెరిగిందనేది వాస్తవం.  

గౌతమ్ కృష్ణకి షాకిచ్చిన గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-7 లో పదమూడవ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ లో శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ చివరగా ఉండగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు‌. అయితే శోభాశెట్టిని బయటకు పంపించకుండా, మరోకరిని పంపడమేంటి? ఇది అన్ ఫెయర్ ఎలిమినేషన్ అంటూ చాలా మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక గీతు రాయల్ తో జరిగిన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో గౌతమ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు. అశ్వద్దామ 2.0 అంటే ఏంటని అడుగగా.. చావులేదని నాకు నేను పెట్టుకున్నానని గౌతమ్ అన్నాడు. హౌస్ లోకి 2.0 గా రాకముందు శుభశ్రీతో క్లోజ్ గా ఉన్న నువ్వు లెటర్ సాక్రిఫైజ్ టాస్క్ లో ఎందుకు అలా చేసావని అడుగగా.. డెఫినెట్ గా తనని బయటకు వెళ్ళాక కలుస్తానని అన్నాడు. 2.0 తర్వాత శివాజీ గారి మీద టార్గెట్ గా నామినేషన్ చేస్తూ వచ్చారు కదా అని అడుగగా.. గౌతమ్ కాసేపు తత్తరపోయాడు. నాగార్జున గారు కూడా అదే చెప్పారు కదా అని అనేసరికి ఏం చెప్పాలా అన్నట్టు అయిపోయాడు‌ గౌతమ్. లాస్ట్ వీక్ నామినేషన్ లో పంచ ఊసిపోకుండా చూసుకో అనే ఒక మాట ప్రశాంత్ అన్నాడు కదా అని అడుగగా.. అవును. దానికి నేను బాగా ట్రిగ్గర్ అయ్యానంటూ గౌతమ్ చెప్పాడు. హౌస్ లో టాప్-7 ఉన్నారు. వీరిలో ముందుకు వెళ్ళేదెవరు? ఆగిపోయేదెవరని అడుగగా.. అర్జున్ ముందుకెళ్తాడు. శివాజీ మైండ్ గేమ్ , స్ట్రాటజీతో ముందుకెళ్తాడు. ప్రతీసారీ శివాజీ గారిని ప్రశాంత్ గుడ్డిగా నమ్మేస్తాడని, అందరిని అమర్ ఆడుక్కోవడమే సరిపోతుందని అది వాడికే మైనస్ అని గౌతమ్ అన్నాడు. శివాజీ గేమ్ గురించి హౌస్ లో చెప్పలేనది, నాగార్జున గారితో చెప్పలేనిది గౌతమ్ మనతో చెప్పాడంటూ గీతు చివర్లో చెప్పేసి ఈ బజ్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం అందరు ఎదురు చూసేలా చేసింది. కాగా ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.  

ఏంటి శ్రీముఖి నువ్వింకా ఇండస్ట్రీలో ఉన్నావా..గ్లామర్ బాగా పెంచావ్

కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ ఫస్ట్ సీజన్ ఆడియన్స్ ని అలరించి అలా వెళ్ళిపోయింది.  ఈ ఫస్ట్ సీజన్ కి సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి యాంకర్లుగా వ్య‌వ‌హ‌రించ‌గా, ఈ సీజ‌న్‌కి శ్రీముఖి హోస్ట్‌గా వచ్చేసింది. ఇక ఇప్పటినుంచి  సీజన్ 2 ఎంటర్టైన్ చేయబోతోంది. ఇందులో ఎపిసోడ్ 1 ఆల్రెడీ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి, సద్దాం, భాస్కర్-జ్ఞానేశ్వర్, ముక్కు అవినాష్ ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్ చేశారు. ఇక అనిల్ రావిపూడి మంచి సాంగ్స్ కి డాన్స్ వేస్తూ స్టేజి మీదకు వచ్చారు. ఇక ఎక్స్ట్రా కలర్ గా గుంటూరు కారం రౌడీ రోహిణిని ఇన్వైట్ చేశారు. ఈ షోలో అనిల్ రావిపూడి రెండు గుడ్ న్యూస్ చెప్పారు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 1  కి టాలెంట్ ట్రాక్ అనే అవార్డు వచ్చింది. ది బెస్ట్ డిజిటల్ షో ఇన్ కామెడీ...అలాగే ఈ షో ఆసియన్ టీవీ అవార్డ్స్ కి ఆసియా లెవెల్లో నామినేట్ అయ్యింది అంటూ చెప్పారు. లాస్ట్ సీజన్ లో ఇన్వెస్టర్స్ గా ఉన్న ఆడియెన్స్ స్టాక్స్ గా కమెడియన్స్ కి మార్క్స్ ఇచ్చారు..ఐతే ఈ సీజన్ లో ఇంకో చిన్న మార్పు కూడా చేశారు. ఎవరైనా స్కిట్ చెడగొడితే వాళ్లకు మార్క్స్ తగ్గించేసేలా ఒక రూల్ ని తీసుకొచ్చారు.   స్కిట్ బాగుంది అని ఎక్కువ ఓట్లు ఎవరైతే  వేస్తారో వాళ్లకు కూడా స్పెషల్ సర్ప్రైజ్ ఉందన్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ ఎపిసోడ్ లో ఎక్స్ ప్రెస్ హరి శ్రీముఖి గురించి కామెంట్స్ చేసాడు. "ఏంటి శ్రీముఖి నువ్వింకా ఇండస్ట్రీలో ఉన్నావా...ఈపాటికి పెళ్ళైపోయి సంకలో పిల్లలని ఎత్తుకుని వాళ్ళ ముక్కులు తుడుస్తూ ఎక్కడో ఒక మూల ఉంటావని అనుకున్నా " అనేసరికి చెంప మీద ఒక్కటిచ్చి "చూసి మాట్లాడు" అంది.."కొంచెం గ్లామర్ పెంచావ్ కానీ అంత కాదు" అంటూ సెటైర్ వేసాడు. ఇలా ఈ వారం ఎపిసోడ్ ఎంటర్టైన్ చేసింది. ఇక కామెడీ ఇండెక్స్ లో ఫన్నీయెస్ట్   స్టాక్ ఆఫ్ ది డేగా యాదమ్మ రాజు నిలిచాడు.

సాయిధరమ్ తేజ్ నన్ను గుర్తుపట్టారు..వర్ష డ్రీం హీరో ఆలీ

"ఆలీతో ఆల్ ఇన్ వన్" షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా  ఎంటర్టైన్ చేసింది. కానీ జబర్దస్త్ టీమ్ ఎంట్రీతో ఇంకా హుషారొచ్చింది ఆడియన్స్ కి. ఆలీ మీద వర్ష తెగ సెటైర్స్ వేసింది. "నాకు మీరు అలీ గారిలా కన్పించలేదు..నా డ్రీం హీరోలా కనిపించారు" అనేసరికి ఆలీ నవ్వేశారు. ఇక తర్వాత ఇమ్ముని స్టేజి మీదకు పిలిచారు. "ఆర్టిస్ట్ గా కాకుండా ఇంకేమన్నా చేయాలా అని ఎప్పుడైనా అనిపించిందా ? అని ఆలీ ఇమ్మానుయేల్ ని అడిగేసరికి "లేదు సర్ అనిపించలేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి రాక ముందు ఒక స్కూల్ లో నేను సిస్టమ్స్ ఆపరేటర్ గా జాబ్ చేసేవాడిని. జాబ్ ఐపోగానే నేను జబర్దస్త్, సినిమాలు బాగా చూసేవాడిని. ఒకరోజు నాకు ఆడిషన్స్ ఉన్నాయని యాడ్ వస్తే చూసి అప్లై చేసాను.. అలా పటాస్ స్టాండప్ కామెడీ షోకి సెలెక్ట్ అయ్యాను. అలా జబర్దస్త్ కి కూడా వచ్చాను.  ఎందుకంటే నేను గెటప్ శీను కామెడీ స్కిట్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని.. అలా జబర్దస్త్ కి వచ్చాక గెటప్ శీను అన్నకు కూడా  చెప్పాను ఆయన వల్లనే ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చానని...ఆయన కూడా నా స్కిట్ చూసి బాగుంటే ఫోన్ చేసి వెంటనే చెప్తారు. అలాగే నేను సాయి ధరమ్ తేజ్ గారితో విరూపాక్షలో చేసాను. ఫస్ట్ డే షూటింగ్ జరిగేటప్పుడు ఆయన షూటింగ్ లొకేషన్ కి వచ్చారు. ఆరోజు బ్రేక్ టైంలో అంత మందిలో కూడా నన్ను చూసి పిలిచి జబర్దస్త్ లో చేస్తావ్ కదా నువ్వు.. చాలా బాగా చేస్తావ్..ఐ లైక్ యువర్ స్కిట్స్ అని ఒక పావు గంట సేపు నాతో మాట్లాడ్డం..అంతమందిలో నన్ను గుర్తుపట్టారు అని అనిపించి  నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది" అని చెప్పాడు ఇమ్మానుయేల్. ఇక వర్ష, ఇమ్మానుయేల్, బులెట్ భాస్కర్ మల్లెమాల షోస్ లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కమెడియన్స్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.

అన్వికకు లవ్ ప్రపోజ్ చేసి రెడ్ రోజ్ ఇచ్చిన జబర్దస్త్ నరేష్

బుల్లి తెర మీద జబర్దస్త్ షో ఎంత పోపులరో అందరికీ తెలుసు. ఈ షోలో చాలా మంది ఆన్ స్క్రీన్ , ఆఫ్ స్క్రీన్ లవర్స్ ఉన్నారు. వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే చాలా మంది హీరోలు, డైరెక్టర్లు ఇలా అయ్యారు. అలాగే జబర్దస్త్ లో పొట్టి వాడైనా గట్టివాడుగా పేరు తెచ్చుకున్న నాటీ నరేష్ అంటే సెట్ లో అందరూ ఇష్టపడతారు. అలాంటి నరేష్ తన హైట్ ని పట్టించుకోకుండా ఎవరు ఎగతాళి చేసినా లైట్ తీసుకుంటూ ఆడియన్స్ ని నవ్విస్తూ ఉంటాడు. అలాంటి నరేష్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. బుల్లితెర మీద చాలా షోస్ చేస్తున్నాడు నరేష్... డబ్బు బాగానే సంపాదించాడు ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఇక పెళ్లే మిగిలింది అనుకుంటున్న టైములో ఆడియన్స్ కి గుడ్ న్యూస్ కూడా చెప్పేసాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వీక్ షోకి తన అందమైన లవర్ అన్వికను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసాడు. అలాగే వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి పువ్వు, రెడ్ హార్ట్ బెలూన్ ఇచ్చి ఐ లవ్ యు చెప్పాడు. ఈ రెండేళ్ల నుంచి తనకు అన్ లిమిటెడ్ లవ్ ని అందించాడంటూ ఆ అమ్మాయి కూడా నరేష్ గురించి సిగ్గు పడుతూనే చెప్పింది. ఇక నరేష్ వాళ్ళ నాన్నకు కూడా ఈ పెళ్లంటే ఇష్టం అని చెప్పాడు. ఇక నరేష్ తన కాబోయే వైఫ్ ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్న కాళ్ళకు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అలా వాళ్ళ లవ్ లైఫ్ జర్నీ గురించి చెప్పారు. ఐతే ఈ విషయాలన్నీ ఆ ఇద్దరూ చెప్పేసరికి అందరూ నమ్మేశారు. ఇక చివరికి నరేష్ ఎగతాళిగా నవ్వుతూ ఉండేసరికి రష్మీకి డౌట్ వచ్చి మళ్ళీ అడిగింది. అప్పుడు నరేష్ అసలు నిజం చెప్పాడు. ఇదంతా ప్రాంక్. మా మధ్యన ఏమీ లేదు. అసలు మాది ఇన్స్టాగ్రామ్ లవ్ కానీ కాదు. జస్ట్ ఒక రోజు పరిచయమే. ఇక్కడ సరదాగా ప్రాంక్ చేద్దామని తీసుకొచ్చాను అని చెప్పేసరికి అందరూ షాకయ్యారు.

నా కొడుకు వల్ల ఆ కడుపు రాలేదని తేల్చిచెప్పిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి. ఈ సీరియల్  శనివారం నాటి ఎపిసోడ్ -269 లో... రాజ్ దగ్గర సెక్రటరీగా వర్క్ చేసే శృతి ఫోటోని కావ్య చూపించి.. మీ ఇద్దరి మధ్య సంబంధమేంటని అడుగుతుంది. ఒక ఎంప్లాయ్ , బాస్ కి ఏం సంబంధం ఉంటుందో అదే ఉందని అంతకు మించి ఏం లేదని రాజ్ అంటాడు. మీ మధ్య ఏం లేదనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా అని కావ్య అడుగుతుంది. లేదంటే ఇంకా ఏం ఉంటుందని రాజ్ చిరాకు పడుతాడు. మరి మా అక్కని నిరూపించుకో అంటే తను ఎలా నిరూపించుకుంటుంది. మీరు ఒక ఫోటో చూసి అమ్మయిపై నిందలు వెయ్యవద్దని చెప్తున్నారు. మరి మీరు చేసిందేంటి? ఒక ఫోటో చూసి మా అక్కపై నిందలు వెయ్యడం లేదా అని కావ్య అంటుంది. శృతితో మీరు క్లోజ్ ఉంటే అది తప్పుకాదు. పైగా ఇలా అంటే మీకు కోపం వస్తుంది. మరి మా అక్కకి కోపం రాదా అని కావ్య అంటుంటే.. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. కాసేపటికి మీ అక్క డబ్బులు ఎందుకు ఇచ్చిందని అనగానే.. అది తింగరిది డబ్బుల కోసం వాడే బ్లాక్ మెయిల్ చేసాడని కావ్య చెప్తుంది. మరొకవైపు DNA టెస్ట్ చేసేవరకు ఎలాంటి గొడవలకి రాకూడదని చెప్పినా.. ఆ రుద్రాణి వినట్లేదు. శాంతని కాఫీ అడిగిందని అని స్వప్నతో గొడవపెట్టుకుంది రుద్రాణి. ఈ స్వప్న చెయ్యని తప్పుని నిరూపిస్తానని అంటుంది. తప్పు స్వప్న వైపు కూడా ఉందని ఏం అనలేక పోతున్నానని కావ్య దగ్గరకి ధాన్యలక్ష్మి వచ్చి చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి అరుణ్ ఉండే అడ్రెస్ తెలుస్తుంది. రాజ్ దగ్గరకి వెళ్లి.. మీరు నాతో పాటు అరుణ్ దగ్గరకి రావాలని రాజ్ తో కావ్య చెప్పగానే.. నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉందని అంటాడు. మీకు ఎప్పుడు ఆఫీస్ ఇంపార్టెంట్ అంటూ కావ్య కోపంగా వెళ్తుంది.  కాసేపటికి కావ్యతో పాటు రాజ్ వెళ్ళాలని డిసైడ్ అయి.. ఆ విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతు తన వెనకాలే తిరుగుతు ఉంటాడు. రాజ్ అలా తిరగడం మొత్తం.. ఇంట్లో వాళ్ళంతా చూస్తూ ఉంటారు. కాసేపటికి  నువ్వు బయటకి వెళదామని అన్నావ్ కదా? పదా అంటూ కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ తీసుకొని వెళ్తాడు. మరొకవైపు స్వప్న దగ్గరకి వెళ్లడనికి కనకం సిద్ధమవుతుంది. నిన్ను అందరి ముందు అవమానించకుండా చూసుకోమని కనకానికి కృష్ణమూర్తి చెప్తాడు. తరువాయి భాగంలో స్వప్న దగ్గరకి వచ్చిన కనకం.. నీ కూతురు తల్లి అవుతుంది కానీ నా కొడుకు తండ్రి అవట్లేదు. ఆ బిడ్డకి తండ్రి ఎవరో అని రుద్రాణి అనగానే.. కనకం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

తప్పు చేస్తే కన్నకొడుకుకైనా శిక్ష పడాల్సిందేనన్న తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -945  లో.. రిషి ఎక్కడికి వెళ్ళాడని చూడడానికి వసుధార బయటకు వస్తుంది. అప్పుడే వర్క్ ఉంటే బయటకు వచ్చానని వసుధారకు మెసేజ్ చేస్తాడు రిషి. కాసేపటికి వసుధార దగ్గరకు మహేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ‌ అని అడుగుతాడు. వర్క్ మీద బయటకు వెళ్ళారట అని వసుధార చెప్తుంది.. శైలేంద్ర ఇది కూడా డ్రామా చేస్తున్నాడేమోనని మహేంద్ర అనగానే.. ధరణి మేడమ్ ముందే ఇదంతా జరిగిందని  చెప్తుంది కదా అని వసుధార అనగానే.. ఇదంతా ధరణి నిజమే అనుకోవాలని అలా చేసాడేమోనని మహేంద్ర అంటాడు. రిషి సర్ ఇంక రావడం లేదని వసుధార టెన్షన్ పడుతుంటే.. అసలు దీనికి కారణం శైలేంద్ర అని వాయిస్ రికార్డింగ్ విని తట్టుకోలేక పోయాడు రిషి. అందుకే శైలేంద్ర దగ్గరకు రాలేదని మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత మహేంద్ర , వసుధారలు కలిసి ధరణి దగ్గరకి వెళ్లి.. అసలేం జరిగిందని కనుక్కోవాలనే ప్రయత్నం చేస్తారు. అసలు ఎలా జరిగింది ? వచ్చిన రౌడీలు శైలేంద్రతో ఎలా ఉన్నారని మహేంద్ర అనగానే.. శైలేంద్రపై డౌట్ పడుతున్నారని ధరణికి అర్థం అయి.. ఒక్కప్పుడు మా అయిన తప్పు చేసాడు కానీ ఇప్పుడు మారిపోయి మంచిగా ఉంటున్నాడని ధరణి అంటుంది. మరొకవైపు శైలేంద్రకి బ్లడ్ కావాలని డాక్టర్ చెప్తాడు. ఫణింద్ర ఎవరికి కాల్ చేసిన ముందుకు రాకపోవడంతో.. చివరగా నీది శైలేంద్రది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా ఇవ్వమని ఫణీంద్ర రిక్వెస్ట్ చెయ్యగానే.. మహేంద్ర బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత మహేంద్ర బ్లడ్ ఇస్తూ.. నీ కోసం నేను ఇవ్వడం లేదు. నువ్వు బతకాలి నువ్వు చేసిన  తప్పులు బయటపడాలని ఇస్తున్నానని మహేంద్ర అంటాడు. ఆ మాటలు అన్ని విని శైలేంద్ర కళ్ళు తెరిచి చూస్తాడు. మహేంద్ర చూస్తాడేమోనని మళ్ళీ నటిస్తాడు. మరొక వైపు ముకుల్ హాస్పిటల్ కి వస్తాడు. శైలేంద్రని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అనగానే కొంచెం బాగయ్యాక చేస్తే బెటర్ అని ఫణీంద్ర  అంటాడు. అలా అనగానే మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మీ కొడుకనా అని ముకుల్ అనగానే.. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

భార్య జ్ఞాపకాలలో మునిగిపోయిన భర్త.. గతం గుర్తుకు రానుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -330 లో.. కృష్ణని శ్రీనివాస్ ఇంట్లో చూసిన భవాని.. కృష్ణకి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఎలాగు అందరికి కృష్ణ వచ్చిన విషయం తెలుసు కాబట్టి అందరి ముందే కృష్ణ వచ్చినట్లు మాకు చెప్పలేదని శ్రీనివాస్ ని అడుగుతుంది భవాని. అయిన కృష్ణ వచ్చినట్లు శ్రీనివాస్ అంకుల్ ఎందుకు చెప్పలేదు? కిచెన్ లో కృష్ణ ఉంటే ఎందుకు మమల్ని అటు వైపు వెళ్ళనివ్వలేదు? ఎలాగైనా తెలుసుకోవాలని మురారి అనుకుంటాడు. మరొకవైపు భవాని తీసుకున్న నిర్ణయం గురించి రేవతి బాధపడుతుంటుంది. అప్పుడే శకుంతల వస్తుంది. అసలు ప్రభాకర్ అన్నయ్య ఎందుకు జైలు కి వెళ్ళాడని రేవతి అడుగుతుంది. అసలేం చెప్పలేదు. నేను ఇలా చేస్తేనే కృష్ణ, అల్లుడు హ్యాపీగా ఉంటారని చెప్పాడు. అంతకు మించి ఏం చెప్పలేదని శకుంతల చెప్తుంది. ఆ తర్వాత ఒక అతను రేవతి దగ్గరకి వచ్చి.. భవాని గారు కార్డ్స్ మోడల్స్ తీసుకొని రమ్మని చెప్పారని అనగానే రేవతి షాక్ అవుతుంది.  అప్పుడే మధు వచ్చి.. పెద్దమ్మ వచ్చేవరకు వెయిట్ చెయ్యమని చెప్తాడు. మరొకవైపు భవాని, ముకుంద మురారి అందరు శ్రీనివాస్ ఇంటి నుండి బయలుదేర్తారు. ఆ తర్వాత శ్రీనివాస్ ని కృష్ణ ఒక హెల్ప్ చెయ్యమని చెప్తుంది. దానికి శ్రీనివాస్ సరే అంటాడు. మరొకవైపు రేవతి ఏడుస్తు ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావని నందు వచ్చి అడుగుతుంది. కార్డ్స్ మోడల్స్ కోసం ఒక అతను వచ్చాడు. కృష్ణ గురించి ఆలోచిస్తున్నానని రేవతి అనగానే.. కృష్ణ గురించి ఏం టెన్షన్ పడకు. అంత తనే చూసుకుంటుందని నందు చెప్తుంది. మరొకవైపు ముకుంద, మురారి, భవాని కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ఒక భర్తకి భార్య వడ్డీస్తుంటే.. మురారికీ  గతంలో ఎవరో వడ్డీంచినట్లు గుర్తుకు వచ్చి.. వాళ్ళ దగ్గరకు వెళ్లి మీరు నాకు ఎప్పుడైనా వడ్డించారా అని అడుగుతాడు. దాంతో మురారి ఏం చేస్తున్నవంటూ భవాని టెన్షన్ పడుతుంది. అప్పుడే కృష్ణ కూడా అదే రెస్టారెంట్ కి వస్తుంది. వాళ్ళతో ఆర్గుమెంట్ చేస్తున్న మురారిని కృష్ణ సముదాయిస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి ఇంటికి వెళ్తారు. మురారి కోపంగా పైకి  వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో.. నేను గతంలో ఏం చేసేవాడినని భవానిని మురారి అడుగుతాడు. మరొకవైపు మురారికి గతం గుర్తుకు వస్తుందని రేవతి, కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.