అమ్మతో ఫస్ట్ రైడ్ లో ఎంజాయ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్

తన ట్రెండీ సాంగ్స్ తో యూత్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళను కూడా ఒక ఊపు ఊపేసే  రాహుల్ సిప్లిగంజ్ గురించి అందరికీ తెలుసు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తనకో సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రేంజ్ లో టాలీవుడ్ ని ఊపేసిన  ‘నాటు నాటు’సాంగ్  కు తన గాత్రం అందించి ఆస్కార్ కోసం హిస్టరీ క్రియేట్ చేయడంలో భాగమయ్యాడు కూడా. అలా రాహుల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అక్కడ కూడా హిస్టరీ క్రియేట్ చేసాడు. తెలుగులో మాస్ సాంగ్స్‌ ఎన్నో పాడాడు. రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్, మహర్షి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు.   బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను  గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. అలాంటి రాహుల్ టైం దొరికితే తన ఫామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. ఇక వాళ్ళ అమ్మను తీసుకుని ఛాపర్ లో రైడ్ కి తీసుకెళ్లాడు అలాగే ఆస్ట్రేలియా, మెల్బోర్న్ తిప్పి తీసుకొచ్చాడు. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్ మాత్రం "పేరెంట్స్ ని సంతోషపెట్టడమే నిజమైన సక్సెస్ , తల్లి తండ్రుల మీద  ప్రేమ,  గౌరవం ఎంత ఉందొ  తెలిపే రీల్ ఇది. ఇది  వారి పెంపకంలో ఉన్న గొప్పతనం. హాట్స్ ఆఫ్ టు ప్రౌడ్ పేరెంట్స్, సూపర్ వావ్ వేరీ నైస్ , ఇదే నిజమైన జీవితం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఐతే తాను రాజకీయాలకు చూలా దూరం..ఇండస్ట్రీలో చేయాల్సిన పని చాలా ఉంది అంటూ ఆ న్యూస్ నమ్మొద్దంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు.  

ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పై కోపం ? ఎవరికంటే ...

నటుడు, పాటగాడు, గుప్పెడంత మనసు సీరియల్ మెయిన్ రోల్ లో నటిస్తున్న మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ కి కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది. తెలంగాణ పాలిటిక్స్ మంచి హాట్ హాట్ గా సాగాయి నిన్న మొన్నటి వరకు.. ఎన్నికల ప్రచారం, ఫలితాలు, ఏ పార్టీ గెలుస్తుందా అంటూ ఎదురు చూపులు...చివరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని  తెలిసాక ఎవరు సీఎం కాబోతున్నారు అనే విషయం మీద  మంతనాలు...వీటికి తెర వేస్తూ రేవంత్ రెడ్డిని రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఐతే కాంగ్రెస్ పార్టీ మీద చాల మందికి అంత సదభిప్రాయం  లేదు..ఐతే కర్ణాటక సీఎం డికె శివకుమార్ మీద సాయి కిరణ్  కి కోపం వచ్చింది. "తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి తలదూర్చడానికి డికె శివకుమార్ అసలు ఎవరు ? కాంగ్రెస్ పార్టీతో వచ్చే పెద్ద సమస్య ఇదే. కాంగ్రెస్ పార్టీ ఉండే ఇతర  రాష్ట్రాల నేతలంతా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు" అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టారు.  కర్ణాటకలో కాంగ్రెస్  ఉప ముఖ్యమంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వ్యూహాలు తెలంగాణలో అద్భుతంగా పని చేశాయన్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోని  అసంతృప్తులను డీకే శివకుమార్ బుజ్జగించి ఎలా లైన్ లోకి తీసుకొచ్చారో మనం చూసాం. తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. బెంగళూరు వేదికగా పరిష్కరించడంలో డీకే మార్క్ ప్రభావితం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది మొదలు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవరకు డికె శివకుమార్ పాత్ర చాల ఎక్కువ...ఈ పాటి రాజకీయం చేయడం మన తెలంగాణ నేతలకు తెలీదా అన్నట్టుగా ఉంది  సాయికిరణ్  పోస్ట్.  

ఓటింగ్ లో ప్రశాంత్, శివాజీల దూకుడు!

బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి ఉత్కంఠ పెరిగిపోతుంది.  కంటెస్టెంట్స్ ఆటతీరు, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో హౌస్ లో డ్రామా నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో శోభాశెట్టి, యావర్ గెలిచిన ఓట్ అప్పీల్ లో కన్నింగ్ అర్జున్ సీరియల్ బ్యాచ్ కి చేసిన ఫేవరిజం వల్ల, ఇంత కుళ్లుని దాచుకున్నాడా అర్జున్ అంటు జనాలంతా తిడుతున్నారు. అర్జున్ నిన్నటి ఎపిసోడ్ లో యావర్ స్ట్రాంగ్ అంటునే శోభాశెట్టికి మద్దతు ఇవ్వడంపై వీడేంటి ఇంత దారుణంగా మోసం చేశాడని అనుకుంటున్నారు. ఫినాలే కి వెళ్ళాడనే ధీమాలో అర్జున్ నిజస్వరూపం బయటకొస్తుందని ఆడియన్స్ కి ఇప్పటికి అర్థం అవుతుంది. అర్జున్ కన్నింగ్ గేమ్ వల్ల గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు. గత ఆరు వారాల నుండి ప్రేక్షకులు శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలని ఓట్లు వేయకుండా ఉంటే బిగ్ బాస్ మామ.. దత్తపుత్రికని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ శోభాశెట్టి కోసం బిగ్ బాస్ చేస్తున్న హైటెన్షన్ డ్రామా చూసిన జనాలు.. ఏందిరా సామి ఈ రచ్చ.. ఏ కుళ్లు, కుతంత్రాలు తెలియని యావర్ ని టార్గెట్ చేస్తారా ఏంటని అనుకుంటున్నారు. అందుకేనేమో ఓటింగ్ లో యావర్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నాడు.  ప్రియాంక, శోభాశెట్టి అట్టడుగున ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. అయితే వారిద్దరి పైన అర్జున్, అమర్ దీప్ ఉన్నారు. అమర్ దీప్ కి పడే ఓట్లని చూస్తుంటే అవన్నీ పీఆర్ ఓట్లలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అమర్ దీప్ ఒక్క గేమ్ కూడా ఫెయిర్ గా ఆడింది లేదు. అయినా ఓట్లు పడుతున్నాయంటే అవి పీఆర్ స్టంట్సే అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ మామ ఈసారి అయిన ప్రేక్షకులు ఓసే ఓటింగ్ కి ప్రాముఖ్యత ఇచ్చి ప్రియంక, శోభాశెట్టిలలో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడా లేక వారిద్దరి కోసం యావర్ ని బలి చేస్తాడా చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో.. వంద శాతం ఓటింగ్ పడితే అందులో 40 శాతం ఓటింగ్ ప్రశాంత్ కి పడుతుంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న శివాజీకి ప్రశాంత్ కి 35 శాతం ఓటింగ్ పడుతుండగా.. మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్ కి 15 శాతం ఓటింగ్ పడుతుంది. ఇక ఆ తర్వాత 13 శాతం ఓటింగ్ తో యావర్ ఉన్నాడు. ఇక ప్రియాంక, శోభాశెట్టి లకి 4 నుండి 6 శాతం వరకు ఓటింగ్ పడుతుంది. అయితే బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్ తో ఎవరైతే టాప్ లో ఉంటారో వారే విజేత. ఇదే జరిగితే శివాజీ, ప్రశాంత్ లకే ఈ సారి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి లీస్ట్ లో ఉన్న శోభాశెట్టి, ప్రియాంక ఇద్దరిలో ఈ వారంలో ఎవరు బయటకు వస్తారో చూడాలి మరి.  

యానిమల్ మూవీ కొందరికే అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్-6 లో సాగిన ప్రేమ కథల్లో అర్జున్ కళ్యాణ్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీసత్యతో కలిసి లవ్ ట్రాక్ నడుపుతూ తన వెంటే ఉంటూ, ప్రతీ టాస్క్ లోను తనకి ఫేవరిజం చూపించడంతో.. అప్పట్లో వీరిద్దరి కలిస్తే చూడాలని బిగ్ బాస్ ప్రేక్షకులు భావించారు. అయితే బిగ్ బాస్ సీజన్-6 తర్వాత బిబి జోడి డ్యాన్స్ షో మొదలైంది. అందులోనైన శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ కలిసి నటిస్తారనుకుంటే .. వాసంతి, అర్జున్ జోడిలుగా వచ్చారు.  శ్రీసత్య, మెహబూబ్ కలిసి డ్యాన్స్ చేయడంతో‌ అర్జున్ కాస్త జెలస్ ఫీల్ అయ్యాడు. మీరిద్దరు కలిసి ఒక సినిమా తీయండి అని అభిమానులు ఎప్పుడు అర్జున్ కి సందేశాలని పంపిస్తూనే ఉంటారు. అయితే శ్రీసత్య మాత్రం తనని ఎప్పటికప్పుడు వదిలించుకోవాలనే ప్రయత్నిస్తుంది. అయితే అర్జున్ కళ్యాణ్ తాజాగా " యానిమల్ " మూవీని థియేటర్లలో చూసాడంట.  ఆ మూవీకి సంబంధించిన కొన్ని ఆలోచనలని సోషల్ మీడియా వేదికగా అర్జున్ కళ్యాణ్ పంచుకున్నాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'యానిమల్'. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగునాట కూడా అంచనాలకు మించిన వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాని చూసిన  అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసాడు. అందులో.. ఇది చాలా డిస్టబ్ చేస్తుంది. ఇది సెన్సిటివ్ పీపుల్ కోసం కాదు. కొన్ని మూవీలలోని వాయిలెన్స్ ని ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. చంపడం, రేప్, ఒక సైకోయిక్ క్యారెక్టర్ చేసే పనులని చూడాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సమాజం అలాగే తయారైంది. కామ్ అండ్ కూల్ గా మంచిగా ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు‌. ఇలాంటివాటినే సమాజం ఇష్టపడుతుంది. రూడ్ గా ఉండటం, కేర్ లెస్ గా ఉండటం ఇప్పుడు చాలా సాధారమైంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెరిగిపోతుంది. మనమే మాటలు అనడం, ఏమీ తెలియకుండా జడ్జ్ మెంట్ పాస్ చేయడం చేస్తుంటాం. ఇదంతా ఇప్పుడు జనాలకి అలవాటైంది. నా దృష్టిలో ఇది కొంతమందికే నచ్చుతుందని అర్జున్ కళ్యాణ్ తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు.

Brahmamudi:కూతురి ప్రేమ కోసం తల్లి తపన.. ఆ ప్లాన్ నెరవేరేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -271 లో.. స్వప్నని కనకం ఇంటికి తీసుకొని వెళ్తానని వాళ్ళముందు కావాలనే అంటుంది. ఎందుకంటే స్వప్న తో పాటు తనని కూడా ఆ ఇంట్లో ఉండమని చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత నా కూతురిని ఇక్కడ మీరు ఎలా చూసుకుంటారో తెలియదు. అందుకే తీసుకొని వెళ్తానని కనకం అనగానే.. నువ్వు కూడా ఇక్కడే ఉండు అని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత ఆ మాటకి కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పు పనులు మొదలు పెట్టాలని కనకo అనుకొని అన్నపూర్ణకి ఫోన్ చేసి.. నా బట్టలన్ని అప్పుతో పంపించు. రేపు తీసుకొని రమ్మని కనకం చెప్తుంది. రేపే ఎందుకని అన్నపూర్ణ అడుగుతుంది. రేపు పెళ్లి క్యాన్సిల్ అవ్వడం అప్పు చూడాలని కాన్ఫిడెంట్ గా కనకం చెప్తుంది. అ తర్వాత కనకం తెచ్చిన స్వీట్స్ స్వప్న తింటు.. కనకం, కావ్యల మీద సెటైర్ లు వేస్తుంటుంది. ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ లు బాగుంటున్నారా అని కావ్యని కనకం అడుగుతుంది. బాగుంటేనే కదా పెళ్లి చేసుకుంటున్నారని? అయిన అలా అడుగుతున్నావేంటని కావ్య అనగానే.. అంటే మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు గొడవ పెట్టుకున్నారని కనకం చెప్తుంది. ఆ తర్వాత కావ్య ద్వారా పంతులు గారు ఎవరో తెలుసుకొని అతని దగ్గరికి వెళ్తుంది కనకం. కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తున్న విషయం చెప్పి.. జాతకాలు కలవలేదని చెప్పమని కనకం అతనికి చెప్తుంది.  ఆ తర్వాత పంతులు దానికి ఒప్పుకోడు.. అలా ఒప్పుకొకపోవడంతో సూసైడ్ చేసుకుంటానని పంతులిని బెదిరించి చివరికి పంతులు చేత అబద్ధం చెప్తాను అనేలా చేస్తుంది. ఆ విషయం ఎవరికి చెప్పకని చెప్తుంది. దానికి పంతులు గారు ఒప్పుకుంటారు. మరొక వైపు కావ్య, రాజ్  ఇద్దరు సరదాగా కౌంటర్ వేసుకుంటూ ఉంటారు. మరి కనకం ప్లాన్ ప్రకారం పెళ్లి క్యాన్సిల్ అవుతుందా... అప్పు ప్రేమ కళ్యాణ్ కి ఎలా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:ఆ ఎటాక్ గురించే అనుపమ మిషన్.. వారి కుట్రని కనిపెట్టగలదా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -947 లో.. మహేంద్రకి అనుపమ ఫోన్ చేసి మాట్లాడుతుంది. " హాస్పిటల్ లో ఉన్నారని తెలిసింది. అసలు శైలేంద్రపై ఎటాక్ ఎవరు జరిపారు " అని మహేంద్రని అనుపమ అడుగుతుంది. నేను అయితే కాదంటు మహేంద్ర వెటకారంగా మాట్లాడతాడు.  అయిన అనుపమకి మహేంద్ర ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఇష్టపడడు. మరొకవైపు శైలేంద్ర దగ్గరకి దేవయాని వస్తుంది. అసలు ఏం జరిగిందో శైలేంద్ర స్పృహ లోకి వచ్చక తెలుసుకుంటానని దేవయాని వెళ్ళిపోతుండగా.. అప్పుడే దేవయాని చెయ్యి పట్టుకొని శైలేంద్ర ఆపుతాడు.. ఆ తర్వాత దేవయానికి జరిగిందంత చెప్తాడు. రిషి ఆ వాయిస్ రికార్డు విని సైలెంట్ అయిపోయాడు. అసలు నీకు ఇంత పెద్ద ఎటాక్ జరిగిన కూడా రిషి ఇంతవరకు నీ దగ్గరికి రాలేదని శైలేంద్రతో దేవయాని చెప్తుంది. ఇక మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందని దేవాయని అనగానే... మనకి ఏం ప్రాబ్లమ్ రాదని శైలేంద్ర అంటాడు. అసలు ఇదంతా కూడా నేనే అటాక్ జరిపించుకున్నానని శైలేంద్ర అనగానే.. దేవయాని షాక్ అవుతుంది.  నీకు నువ్వు ఇలా చేసుకోవడమేంటని దేవయాని అడుగగా.. జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ధరణి వస్తుంది. అదంతా ధరణి విందేమో అని శైలేంద్ర దేవయాని ఇద్దరు అనుకుంటారు. ఇక ఏమీ తెలియనట్టుగా ధరణి రాగానే తనతో ఇద్దరు ప్రేమగా నటిస్తారు. మరొకవైపు ముకుల్ ని అనుపమ కలిసి శైలేంద్రపై ఎవరు ఎటాక్ చేశారని అడుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలని ముకుల్ అంటాడు.. నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబెర్ ని కావాలంటే ఒకసారి మహేంద్రని అడగండని అనుపమ అనగానే.. మహేంద్రకి ముకుల్ ఫోన్ చేసి అనుపమ గురించి అడుగుతాడు. అనుపమ మా ఫ్యామిలీలో ఒక మెంబెర్ అని మహేంద్ర కూడా చెప్తాడు. కానీ తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకని మహేంద్ర అంటాడు. సర్ చెప్పకని అన్నాడని, చెప్పనని ముకుల్ అంటాడు. మహేంద్ర మాత్రం.. నువ్వు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని ఇలా చెప్పానని అనుపమ గురించి మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర దగ్గరికి ఫణీంద్ర వచ్చి మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:ప్రియురాలితో పెళ్ళి.. భార్యతో కొత్తగా మొదలైన జర్నీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -332 లో.. భవాని తన ఫ్రెండ్స్ కి  కాల్ చేసి పెళ్లికి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరికి పెళ్లి పనులు అప్పజెప్తుంది. కానీ ఇంట్లో అందరు డల్ గా ఉంటారు. ఇలా డల్ గా ఉండకండి అని భవాని చెప్తుంది. పెళ్లికి అన్ని సిద్ధం చేస్తున్నారు కానీ అసలు మురారికి ఈ పెళ్లి ఇష్టమో కాదో తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు మురారి ఆ కృష్ణ దగ్గరే ఉన్నాడని సుమలత చెప్తుంది. ప్రస్తుతం మురారి గతం మర్చిపోయి ఉన్నాడు ఈ పరిస్థితిలో ముకుందతో పెళ్లి చేస్తే కొన్ని రోజుల తర్వాత గతం గుర్తుకు వచ్చి కృష్ణ దగ్గరికి వెళ్తే ముకుంద పరిస్థితి ఏంటి అని ప్రసాద్ అంటాడు. ఇలా అందరూ తమ అనుమానాలు చెప్తుంటారు. అవన్నీ విన్న భవానికి కోపం వస్తుంది. ఆపండి అందరు.. అసలు కృష్ణ మురారిలది పెళ్లి కాదు.. అగ్రిమెంట్ మ్యారేజ్. అని వాళ్లకి అర్థం అయ్యేల భవాని చెప్తుంది. మరొక వైపు కృష్ణ దగ్గర మురారి మాట్లాడుతుంటాడు.‌ నేను ఎలా కృష్ణపై ఇష్టంగా ఉన్నానో తనకి కూడా నేను అంటే ఇష్టమని మురారి అనుకుంటాడు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంగా ముకుంద వచ్చి.. మీ పెద్దమ్మ పిలుస్తుందని మురారికి చెప్తుంది. మురారి హ్యాపీగా కృష్ణకీ గుడ్ నైట్ చెప్తూ వెళ్తాడు. ఏంటి మురారి ఇంత హ్యాపీగా ఉన్నాడని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత మురారి తన గదిలో కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్, నందు ఇద్దరు మురారి దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. నాకు ఈ మధ్య కొన్ని పదాలు గుర్తుకు వస్తున్నాయి. అవి నేను వాడాను అని అనిపిస్తుందని అనగానే నువ్వు మెల్లిగా అలోచించి.. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకోవడానికి నేను కృష్ణ ఉన్నామని గౌతమ్ చెప్తాడు. ఆ తర్వాత అందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. అందరికి రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత సందడిగా ఉందోనని భవాని చెప్తుంది. కాసేపటికి ముకుందని మురారి పక్కన కూర్చొమని భవాని చెప్తుంది. ముకుంద వెళ్లి మురారి పక్కన కూర్చొని ఉంటుంది. మురారి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. మురారి కాఫీ కప్ అక్కడే పెట్టావ్ అని రేవతి అనగానే.. మురారి లేచి వచ్చి కప్ రేవతికి ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వెడ్డింగ్ కార్డుని మురారికి చూపిస్తుంది భవాని. మీరు సింపతీతోనే ఈ పెళ్లి చేస్తున్నారా అని మురారి అనగానే.. అందరూ షాక్ అవుతారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ హౌస్ లో బాలకృష్ణ.. విజిల్ వేసిన శివాజీ!

బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. రోజు కొత్త టాస్క్ లతో  కంటెస్టెంట్స్ ని ఫుల్ ఆడేసుకుంటున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే పదమూడు వారాలు పూర్తిచేసుకొని పద్నాలుగవ వారంలోకి అడుగుపెట్టారు కంటెస్టెంట్స్. ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నారు. తెలుగు బిగ్ బాస్  చరిత్రలో ఎన్నడు లేనివిధంగా మొదటిసారి రెండువారాల పాటు టైటిల్ విన్నర్ కి ప్రేక్షకులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించాడు. ఇప్పటికే ఈ ఓటింగ్ లో శివాజీ నెంబర్ వన్, రెండవ స్థానంలో ప్రశాంత్ కొనసాగుతున్న విషయం తెలిసిందే‌. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రతీ వీకెండ్ ఎవరో ఒకరు గెస్ట్ లుగా వస్తుంటారు. ప్రతీ పండుగను సెలబ్రేట్ చేస్తారు బిగ్ బాస్. అలాగే మొన్నటి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా వరుసగా ఏడు మ్యాచ్ లు గెలిచిదంటూ.. బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ కి చెప్పి వారి చేత ఆల్ ది బెస్ట్ చెప్పించాడు బిగ్ బాస్. ఇలా ప్రతీ ఇంపార్టెంట్ రోజుని హౌస్ లో ప్రతిష్టాత్మకంగా ప్రదర్శిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లోకి బాలకృష్ణ వచ్చేశాడు. బాలకృష్ణని చూసి కేకలతో, అరుపులతో  హౌస్ అంత ' జై బాలయ్య' నినాదంతో మారుమ్రోగింది. ఇక శివాజీ అయితే విజిల్ వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలని ఇష్టపడే శివాజీ.. బాలయ్య బాబు ఫ్యాన్ అని దీన్ని బట్టే తెలుస్తుంది. అసలు హౌస్ లో ఏం జరిగిందంటే.. నేడు ప్రో కబడ్డీ లీగ్ లో కబడ్డీ మ్యాచ్  జరగబోతుంది.‌ ఇందులో మన తెలుగు టైటాన్స్ కి పట్నా పైరేట్స్ కి మధ్య మ్యాచ్ ఉంది. మన టీమ్ గెలవాలని కోరుకుంటున్నామంటూ బిగ్ బాస్ టీవీలో బాలయ్య బాబు అడ్విటైజింగ్ చూపించాడు. ఇక తెరమీద బాలయ్య బాబుని చూసిన హౌస్ మేట్స్  ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరు తెలుగు టైటాన్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ.. గెలవాలని విష్ చేసారు. ఇది నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది.  

ఓట్ ఫర్ మీ లో యావర్.. కన్నింగ్ అర్జున్ మద్దతుతో శోభాకి ఛాన్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో పద్నాలుగవ వారం నామినేషన్ లతో హౌస్ అంతా హీటెక్కింది. పల్లవి ప్రశాంత్ మరియు అమర దీప్ ల మధ్య తగ్గేదేలే అన్న రేంజ్ లో రివేంజ్ నామినేషన్ జరిగింది. ఇక హౌస్ లో ఉన్న ఏడుగురిలో ఇప్పటికే అంబటి అర్జున్ ఫైనల్ కి చేరుకున్నాడు. మరోవైపు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలనుకుంటే ఈ రెండు వారాలపాటు ప్రేక్షకుల ఓట్లే కీలకం అంటూ మెలిక పెట్టాడు. దీంతో హౌస్ మేట్స్ ఫన్ గేమ్ లని సైతం సీరియస్ గా తీసుకొని ఆడుతున్నారు.  అమర్ దీప్ నామమాత్రపు కెప్టెన్ గా ఉండి హౌస్ మేట్స్ పై పెత్తనం చెలాయించాలని .. నేను కెప్టెన్ ని, నేను చెప్తే వినాలి అంతే అన్నట్టు ప్రశాంత్ తో ప్రతీసారీ వాగ్వాదానికి దిగుతున్నాడు. ఇది ప్రేక్షకులు అందరు చూస్తున్నారు. ఇక హౌస్ లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ లు చేసే చిల్లర గొడవలకి బిగ్ బాస్ ఫుటేజ్ ఇస్తున్నాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ ల ఫుటేజ్ తగ్గించి ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇప్పటికే సగం వారం పూర్తయింది. హౌస్ మేట్స్ కోసం మొదటగా స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ప్రాపర్టీ తీసుకొని బజర్ మోగగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. ఎవరైతే చివరగా దూకుతురో వారు గేమ్ నుండి తప్పుకుంటారనే రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో మొదట అమర్ దీప్ అవుట్ అయి‌ రేస్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక అవుట్ అవ్వగా..‌చివరగా యావర్, శివాజీ ఉన్నారు. ఇక ఒక్క సెకండ్ తేడాతో యావర్ గెలిచి విన్నర్ గా, శివాజీ రన్నర్ గా నిలిచారు. యావర్ ఈ టాస్క్ గెలిచి 'ఓట్ అప్పీల్' చేసుకోవడానికి అర్హత సాధించాడు.  ఇక సెకండ్ టాస్క్.. రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ ఉంటాయి.. అందరు బిగ్ బాస్ ఒక కలర్ చెప్పినప్పుడు ఆ కలర్ ఉన్న వరుసలో జంప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే తప్పు వరుసలో అడుగుపెడతారో వాళ్ళు అవుట్ అని బిగ్ బాస్ చెప్పాడు. ‌ఇందులో వరుసగా‌ అర్జున్, యావర్, ప్రశాంత్, అమర్, ప్రియాంక అవుట్ అవ్వగా.. శివాజీ, శోభాశెట్టి మిగిలారు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఫైనల్ లో శివాజీ బ్యాలెన్స్ మిస్ అయి వరుసలో నుండి బయటకు వచ్చాడు. శోభాశెట్టి గెలిచింది. ఓటు అప్పీల్ కోసం యావర్, శోభాశెట్టి మిగిలారు. వీరిలో ఎవరు ప్రేక్షకులకు ఓటు అప్పీలు చేసుకోవాలో హౌస్ మేట్స్ ని సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. ఇక అంబటి అర్జున్ మొదటగానే శోభాశెట్టికి తన మద్దతుని ఇచ్చాడు‌. అంటే యావర్ గేమ్స్ బాగా ఆడతాడు. తనకి ప్రేక్షకుల సపోర్ట్ ఉంది‌ ఒకవేళ నామినేషన్ లో ఉన్నా తనతో ఫ్యాన్స్ ఉంటారు. కానీ శోభాశెట్టి బాటమ్ లో ఉంది. కాబట్టి తనకి ఓటు అప్పీల్ అవసరమని చెప్పి రేస్ నుండి యావర్ ని తప్పించాడు అర్జున్.  దీంతో అర్జున్ కన్నింగ్ మైండ్ గేమ్ బయటపడింది. యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతడు బయటకు వెళ్తే టాస్క్ లలో అర్జున్ ని ఎవరు డిఫెండ్ చేయలేరని, విన్ అవ్వొచ్చని భావించి తన సపోర్ట్ శోభాశెట్టికి ఇచ్చాడు కన్నింగ్ అర్జున్. ఇక ప్రియంక, అమర్ కలిసి తమ మద్దతుని శోభాశెట్టికి ఇచ్చారు. పల్లవి ప్రశాంత్, శివాజీ కలిసి వారి మద్దతుని యావర్ కి వేసారు. కానీ అత్యధిక సపోర్ట్ శోభాశెట్టికి రావడంతో తనే ఓటు అప్పీల్ కి అర్హత సాధించింది. ఆ తర్వాత ఓటు అప్పీల్ ని రిక్వెస్ట్ చేసింది శోభాశెట్టి. 

ప్రియాంక జైన్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. షాక్ లో హౌస్ మేట్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే ఉల్టా పుల్టా ట్విస్ట్ లతో ప్రేక్షకులకు కిక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి, వీకెండ్ లో శోభాశెట్టిని ఎలిమినేషన్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో‌ భాగంగా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న ప్రియంకని బయటకు పంపిస్తారనే వార్త తెగ వైరల్ అవుతుంది. యావర్, ప్రశాంత్, శివాజీ.. ఈ ముగ్గురిలోనే ఒకరు విన్నర్ అవుతారనేది అందరికి తెలిసిన విషయం. అయితే ఆ ఒక్కరూ ఎవరనేది చివరి వరకూ సస్పెన్సే. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం.. శివాజీ, ప్రశాంత్‌ లకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అఫీషియల్ ఓట్లలో శివాజీ నెంబర్ వన్ స్థానంలో ఉంటు దుమ్మురేపుతున్నాడు. టైటిల్ విన్నర్ శివాజీ అంటూ ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాస్‌ శోభాని సపోర్ట్ చేస్తూ.. ఇతర కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ చేయడంతో, ఈ సారి ఎవర్ని సపోర్ట్ చేస్తారో తెలియదు. తన దత్తపుత్రిక శోభాశెట్టి కోసం ఎవర్ని బలి చేస్తారనేది మాత్రం అంచనా వేయలేం. కాబట్టి.. ఈవారం ఓటింగ్‌లో అమర్, ప్రశాంత్, శివాజీలకు టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ ముగ్గురికీ పోటా పోటీగా ఓట్లు పడుతున్నాయి. అయితే ప్రియాంక, శోభాశెట్టిలు రేస్‌లో ఉన్నా.. వాళ్లకి విన్నర్ అయ్యే అవకాశం లేకపోవడంతో.. వాళ్లకి ఓట్లు వేసి తమ ఓటుని వేస్ట్ చేసుకోకుండా యావర్ కి ఓట్లు వేస్తున్నారు. చాలామంది సీరియల్ ఫ్యాన్స్ అంబటి అర్జున్ కి ఓటేస్తున్నారు. అయితే అమర్ దీప్  ఓటింగ్ శాతం రోజు రోజుకి పడిపోతుంది. నిన్న నాల్గవ స్థానంలో ఉన్న అమర్ ఈరోజు అయిదవ స్థానంలో ఉన్నాడు. ఇక ఓటర్ల మైండ్ సెట్‌ని మార్చడంలో భాగంగా  అమర్ దీప్ సెట్ చేసుకున్న పీఆర్ టీమ్ లు అతనే టాప్-3 అనే అపోహని ప్రేక్షకుల మీద రుద్దడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే ఈ వీకెండ్ శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి, మిడ్ వీక్ లో ప్రియాంకని ఎలిమినేషన్ చేస్తారనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అతి తక్కువ ఓట్లతో లీస్ట్ లో ఉన్న ప్రియాంక, శోభాశెట్టిలని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడా లేదా తెలియాలంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

ఓటింగ్ లో శివాజీ నెంబర్ వన్..  రెండో స్థానంలో ప్రశాంత్ !

  బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ డ్రామా నడుస్తుంది. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల‌ మధ్య నామినేషన్ లో జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో శోభాశెట్టి సిల్లీ నామినేషన్ చూసి జనాలంతా తిడుతున్నారు. అర్జున్ కన్నింగ్ గేమ్ వల్ల గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు. గత ఆరు వారాల నుండి ప్రేక్షకులు శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలని ఓట్లు వేయకుండా ఉంటే బిగ్ బాస్ మామ.. దత్తపుత్రికని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ శోభాశెట్టి కోసం బిగ్ బాస్ చేస్తున్న హైటెన్షన్ డ్రామా చూసిన జనాలు.. ఏందిరా సామి ఈ రచ్చ.. ఏ కుళ్లు, కుతంత్రాలు తెలియని యావర్ ని టార్గెట్ చేస్తారా ఏంటని అనుకుంటున్నారు. అందుకేనేమో ఓటింగ్ లో యావర్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నాడు. ప్రియాంక, శోభాశెట్టి అట్టడుగున ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. అయితే వారిద్దరి పైన అర్జున్, అమర్ దీప్ ఉన్నారు. అమర్ దీప్ కి పడే ఓట్లని చూస్తుంటే అవన్నీ పీఆర్ ఓట్లలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అమర్ దీప్ ఒక్క గేమ్ కూడా ఫెయిర్ గా ఆడింది లేదు. అయినా ఓట్లు పడుతున్నాయంటే అవి పీఆర్ స్టంట్సే అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ మామ ఈసారి అయిన ప్రేక్షకులు ఓసే ఓటింగ్ కి ప్రాముఖ్యత ఇచ్చి ప్రియంక, శోభాశెట్టిలలో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడా లేక వారిద్దరి కోసం యావర్ ని బలి చేస్తాడా చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో.. వంద శాతం ఓటింగ్ పడితే అందులో 60 శాతం ఓటింగ్ శివాజికి పడుతుంది. ఆ తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ కి 40 శాతం ఓటింగ్ పడుతుండగా.. మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్ కి 18 శాతం ఓటింగ్ పడుతుంది. ఇక ఆ తర్వాత 15 శాతం ఓటింగ్ తో యావర్ ఉన్నాడు. ఇక ప్రియాంక, శోభాశెట్టి లకి 5 నుండి 7 శాతం వరకు ఓటింగ్ పడుతుంది. అయితే బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్ తో ఎవరైతే టాప్ లో ఉంటారో వారే విజేత. ఈ విషయాన్ని నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు. ఇదే జరిగితే నెంబర్ వన్ గా ఉన్న శివాజీనే విజేత వస్తుంది. రన్నరప్ గా ప్రశాంత్ కి వస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ వారంలో ఎవరు బయటకు వస్తారో చూడాలి మరి.

గోవా బీచ్ లో కొత్త బ్యూటీ అందాల ఆరబోత!

సెలబ్రిటీలు ఏం చేసిన ట్రెండింగ్ అవుతాయి. అయితే వీరిలో కొందరు అందంతో, మరికొందరు రీల్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. సినిమా ఆడియో రిలీజ్ లకి, బుల్లితెరపై ప్రసారమయ్యే టీవీ షోలకి యాంకరింగ్ చేసే యాంకర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఫీమేల్ యాంకర్స్ లో సుమ, అనసూయ, రష్మి తర్వాత ఎవరు అంతగా పేరు తెచ్చుకోలేకపోయారు. అనసూయ ఎప్పుడైతే యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పేసిందో అప్పటి నుంచి కొత్త యాంకర్లకి ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. అందులో యాంకర్ స్రవంతి ఒకరు. యాంకర్ స్రవంతి.. పూర్తిపేరు  చొక్కారపు స్రవంతి. ఈ బ్యూటీ తాజాగా యాంకరింగ్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకి యాంకరింగ్ చేస్తుంది. అలానే అవకాశం ఉన్న ప్రతి సారి కొన్ని టీవీల పండగ షోస్‌లో కూడా మెరుస్తుంది. సంతోషం అవార్డ్స్ 2023'.. కి యాంకర్ గా చేస్తున్నట్టు ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా హీరో నానితో రీల్ చేసి మరో వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దానికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఎప్పుడు ఫోటో షూట్, రీల్స్ అంటూ ఏదో ఒకటి షేర్ చేస్తూ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా గోవా బీచ్ లో బ్యూటీ నెటిజన్లకి హాట్ ట్రీట్ ఇచ్చింది. వలలాంటి పొట్టి డ్రెస్ తో కుర్రకారుని వలలో పడేస్తుంది. గోవా బీచ్ లోని ఇసుకపై కూర్చొని అందాలు ఆరబోయడంతో.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. " జస్ట్ ఏ టాన్ టాస్టిక్ డే " అంటూ ఈ పోస్ట్ కి టైటిల్ కూడా ఇచ్చేసుకుంది ఈ బ్యూటీ. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ వైరల్ గా మారింది.  

చెన్నైలో ఏడాది మొత్తం నీటి సమస్య ... డిసెంబర్ వస్తే నీరే పెద్ద సమస్య

నటి కస్తూరి అంటే చాలు సోషల్ మీడియాలో చాలా మందికి భయం. ఎందుకంటే తన మీద కామెంట్స్ చేసేవాళ్లకు సూపర్ హాట్ గా చాలా ఘాటుగా నవ్వుతూ రిప్లై ఇచ్చిపడేస్తుంది. కస్తూరి డైలీ ఇన్సిడెంట్స్ మీద కచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వాటికి తగ్గ కామెంట్స్ కూడా పెడుతుంది. ఐతే ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ పెట్టింది. మిచాంగ్ తుపాను చెన్నైని చుట్టు పక్కల ప్రాంతాల్ని ఎంత అతలాకుతలం చేసేసిందో అందరికీ తెలిసిన విషయమే. చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీళ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కస్తూరి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో వర్షం ఫోటో పెట్టి దాని పైన "చెన్నైలో ఏడాది మొత్తం ...నీటి సమస్య ...అదే డిసెంబర్ నెల వస్తే నీరే పెద్ద సమస్య" అంటూ ఒక ప్రతీ ఏడాది జరిగే విషయాన్నీ చాల సింపుల్ గా రెండు వాక్యాల్లో అద్భుతమైన కోట్ ని పోస్ట్ చేసింది. ఇక ఆ రెండు లైన్లు చదివిన నెటిజన్స్ ఆమె రైటింగ్ స్కిల్స్ ని అభినందిస్తున్నారు. ఏముంది మీ రైమింగ్, పర్ఫెక్ట్ గా చెప్పారు...ప్రతీ సంవత్సరం డిసెంబర్ రాగానే ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. అలాగే మరో వైపు అనసూయ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో "చెన్నై..నీ గురించి చాలా ఆందోళనగా ఉంది.. ప్లీజ్ సేఫ్ గా స్ట్రాంగ్" గా ఉండు అని కామెంట్ పెట్టేసరికి నెటిజన్స్ రెచ్చిపోయారు. కొంతమంది ఆమె కామెంట్ కి థ్యాంక్స్ చెప్తే ఇంకొంతమంది మాత్రం ఆంధ్రాలో ఉన్న నెల్లూరు, తిరుపతి గురించి మీకు బాధగా లేదా.. హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఎందుకు కామెంట్ చేయలేదు ? అని క్వశ్చన్ చేస్తున్నారు.

సూర్యకాంతం కళ్ళ ముందుకు వచ్చినట్టే వుంది...రోహిణికి నరేష్ కాంప్లిమెంట్

కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ ఎప్పటిలాగే  అలరించడానికి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్ గా ఆ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ ఎపిసోడ్ కి సీనియర్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు నరేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ థీమ్ తో ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. ఇక నరేష్ వస్తూనే "ఆకాశంలో ఒక తార" అనే సాంగ్ కి కృష్ణ గారిలా డాన్స్ చేస్తూ వచ్చారు. ఇక శ్రీముఖి కూడా ఆయనతో జత కలిసి డాన్స్ చేసింది. శ్రీముఖి గెటప్ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కి చక్కగా సరిపోయింది. "నాకు అప్పుడప్పుడు మీ జంటను చూసిన ప్రతీసారి" అంటూ గట్టిగా అరిచి తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది శ్రీముఖి. ఇక నరేష్ ముఖంలో ఆనందం బాగా కనిపించింది ఆ కామెంట్ కి. తర్వాత సద్దాం, యాదమ్మ రాజు, రోహిణి కలిసి స్కిట్ వేశారు.."దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి" బాక్గ్రౌండ్ లో వస్తుంటే వీళ్ళు దానికి తగ్గ నటన చేసి స్కిట్ కి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సద్దాం చేతిలో మందు బాటిల్ పట్టుకుని తాగుతూ వచ్చి "ముందు నాకు 90 కి డబ్బులివ్వు" అని రోహిణిని అడిగేసరికి "నేను నైటీలు కొనుక్కోకుండా డబ్బులు పోగేస్తుంటే నీకు 90 కి ఇవ్వాలా" అని ఏడుస్తూ ఉన్న ఈ స్కిట్ చూసి అనిల్ రావిపూడి ఫుల్ ఎంజాయ్ చేసాడు. ఇంకో స్కిట్ లో రోహిణి అచ్చం సూర్యకాంతంలా నటిస్తూ కోడల్ని సాధించే రోల్ వేసి స్కిట్ ని బాగా పండించింది. ఈ స్కిట్ చూసిన నరేష్ ఫుల్ గా ఎంజాయ్ చేసి "ఆ అమ్మాయిని చూస్తే నిజంగా సూరేకాంతం గారు కళ్ళ ముందుకు వచ్చినట్టు ఉంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక నరేష్ వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ ని మ్యూజిక్ తో సహా ఇమిటేట్ చేసి అందరినీ తనదైన కామెడీ స్టైల్ చేసి చూపించి అందరినీ  ఎంటర్టైన్ చేశారు. ఇలా ఈ కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ ఈ వారం అలరించబోతోంది. ఇక ఈ షో ఛైర్మెన్ అనిల్ రావిపూడి, హోస్ట్ శ్రీముఖి కలిసి "ఒక లైలా కోసం" సాంగ్ కి డాన్స్ స్టేజిని మరింత కలర్ ఫుల్ గా చేశారు.  

Guppedantha Manasu:కొడుకు డ్రామా హిట్టు.. ఇంటరాగేషన్ ఫట్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -946 లో... శైలేంద్రని ఇంటరాగేషన్ చేస్తానని ముకుల్ వస్తాడు. ఈ టైమ్ లో ఎందుకని ఫణీంద్ర అనగానే.. మీరు ఇప్పుడు మీ కొడుకు అని ఆలోచిస్తున్నారా అని ముకుల్ అంటాడు. నేను ముందే చెప్పాను తప్పెవరు చేసిన శిక్ష పడాలి. అది నా కొడుకు అయిన సరే కానీ వాడి సిచువేషన్ బాగాలేదు. కొంచెం టైమ్ తీసుకొని మీ డ్యూటీ చెయ్యండి అని అంటున్నానని ఫణీంద్ర అంటాడు. మరొకవైపు శైలేంద్ర దగ్గరికి దేవయాని వచ్చి.. తనపై నిజంగానే ఎటాక్ జరిగిందని బాధపడుతు ఉంటుంది.  అప్పుడు శైలేంద్ర కళ్ళు తెరిచి చూడగానే.. ప్రశ్నల మీద ప్రశ్నలు దేవయాని అడుగుతుంటుంది. ఎటాక్ చేసింది ఎవరో గానీ కరెక్ట్ గురి చూసి కొట్టారని శైలేంద్ర అనగానే.. దేవయాని తన మాటలతో శైలేంద్రకి చిరాకు తెప్పిస్తుంది. ఆ తర్వాత అసలు విషయం చెప్దామని శైలేంద్ర అనుకుంటాడు. అప్పుడే బయట ఉన్న ముకుల్ ని చూసి మళ్ళీ శైలేంద్ర సైలెంట్ గా పడుకొని ఉంటాడు. ఆ ముకుల్ లోపలికి రాకుండా నేను ఆపుతానంటూ దేవయని బయటకు వెళ్తుంది. ఆ తర్వాత శైలేంద్రని ఇంటరాగేషన్ చేస్తానని ముకుల్ అనగానే.. వద్దు అంటూ దేవయాని అడ్డుపడుతుంది. ఈ సిచువేషన్ లో ఇంటరాగేషన్ ఏంటి? అని దేవయాని అక్కడ ఉన్నవాళ్ళని దబాయిస్తుంటుంది. ఆ తర్వాత దేవయాని మాటలని ముకుల్ పట్టించుకోకుండా లోపలికి వెళ్లి శైలేంద్రని మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర మెల్లిగా ముకుల్ తో మాట్లాడాలని ట్రై చేస్తాడు దాంతో శైలేంద్రకి ముకుల్ వాయిస్ రికార్డు వినిపిస్తానని అనగానే.. మళ్ళీ ఎదో అయినట్లుగా శైలేంద్ర యాక్ట్ చేస్తాడు.  దాంతో డాక్టర్ వచ్చి అందరిని బయటకు పంపిస్తాడు. శైలేంద్రపై జరిగిన ఎటాక్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తానని, రిషి వస్తే కాల్ చెయ్యమని చెప్పండి అంటూ ముకుల్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో... కీర్తిభట్ స్వీట్ వార్నింగ్

ఎన్నో కష్టాలను దాటిన బుల్లితెర నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తన కుటుంబ సభ్యులను కోల్పోవడమే కాక తాను పిల్లల్ని కనే భాగ్యానికి కూడా దూరమయ్యింది. ఐనా ఎక్కడా అధైర్యపడకుండా తన పని తాను చేసుకుపోతున్న టైంలో  తనకి కాబోయే వరుడు  కార్తీక్‌ని స్టార్ మా ఛానల్‌లో ప్రసారమయ్యే  'మా బోనాల జాతర' స్పెషల్ ఈవెంట్‌లో పరిచయం చేసింది అలాగే ఆ స్టేజి మీద నిశ్చితార్ధం చేసుకుంది. అలాంటి కీర్తి ఇప్పుడు ఒక నెటిజన్ అన్న మాటకు బాగా కోపం తెరుచుకుంది. నెటిజన్స్ ఆమెను కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి ఆన్సర్స్ ఇచ్చింది కీర్తి ఐతే అందులో ఒక వ్యక్తి మాత్రం "ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావ్" అని పేరు పెట్టకుండా అడిగేసరికి "ఫస్ట్ నీ పేరు పెట్టుకో నాన్న ఒక మంచి పేరు మీ నాన్న పెట్టి ఉంటారు కదా ..లేనిపోని ఓవర్ యాక్టింగ్ అంతా నీ పేరు పెట్టకుండా చేస్తున్నావ్...ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో" అంటూ నవ్వుతూ ముద్దుగా మొట్టికాయ వేసింది. "కార్తీక్ సర్ యాక్టర్ కదా" అనేసరికి "యాక్టర్ కం డైరెక్టర్" అని ఆన్సర్ ఇచ్చింది. "మీ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు" అని అడిగేసరికి "ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. డేట్ ఫిక్స్ చేసాక దాని మీద ఒక వ్లగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను" అని చెప్పింది. "మీ వయసెంత అక్క" అనేసరికి "1998 లో పుట్టాను లెక్కేసుకోండి" అని చెప్పింది. "అమర్ ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు" అనేసరికి "ఒక పోస్ట్ చూసి సపోర్ట్ చెయ్యట్లేదు అనుకోకండి.. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చింది కీర్తి భట్. "శ్రీహన్ కి నీకు మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ బాగుండేది బీబీ హౌస్ లో" అనేసరికి "రీసెంట్ గా మానస్ పెళ్ళిలో శ్రీహన్ ని కలిసాను అది గేమ్ కాబట్టి ఆ టైంకి సరదాగా అలా ఫైట్ చేసుకున్నాము అంతే ఇప్పుడంతా ఏమీ లేదు" అని చెప్పింది.  

Brahmamudi: నీ కూతురు తల్లి అయింది కానీ దానికి కారణం నా కొడుకు కాదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -270 లో...  స్వప్న దగ్గరికి కనకం వెళ్లడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. అయిన కనకం ఎలాగైనా స్వప్న వంకతో అప్పు కళ్యాణ్ లకి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకొని స్వప్న దగ్గరికి బయలుదేరుతుంది. తనతో పాటు అప్పుని తీసుకొని వెళ్ళాలని అనుకుంటుంది కానీ అప్పు వెళ్లడానికి ఇష్టపడదు. మరొకవైపు కావ్య, రాజ్ లు అరుణ్ ని వెతుక్కుంటు తన ఇంటికి వస్తారు. కానీ అరుణ్ తన మనిషితో కొన్ని రోజుల వరకు బయటకు వెళ్ళానని, ఎవరు వచ్చిన ఇంట్లో లేనని ముందే చెప్పి ఉంచుతాడు. ఇక రాజ్, కావ్య వచ్చి అతన్ని అడుగగానే.. ఇంట్లో అరుణ్ లేడని, బట్టలు సర్దుకుని ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్తాడు. ఎక్కడ ఉన్నాడో చెప్పమంటూ కావ్య అతన్ని ఒక ఆట ఆడుకుంటుంది. ఎంత అడిగిన అతను చెప్పకపోయేసరికి తిరిగి వెళ్ళిపోతారు. మరొకవైపు రాహుల్ కి అరుణ్ ఫోన్ చేసి.. రాజ్ , కావ్య వచ్చిన విషయం చెప్తతాడు. నేను చెప్పేంత వరకు బయటకు రాకు అంటూ రాహుల్ చెప్తాడు. అదే విషయం రుద్రాణికి చెప్తాడు. అప్పుడే అటో దిగి వస్తున్న కనకాన్ని చూసి టైమ్ కి వచ్చింది. కూతురు చేసిన గనకార్యం గురించి చెప్పాలని రుద్రాణి అనుకుంటుంది. మరొకవైవు రుద్రాణి వెళ్లి.. స్వప్నతో గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తుంది.  అప్పుడే స్వప్న దగ్గరికి వచ్చి కనకం వచ్చి.. నువ్వు తల్లివి కాబోతున్నావని చాలా సంతోషంగా ఉందని కనకం అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రుద్రాణి.. " నీ కూతురు తల్లి అవుతుంది. నా కొడుకు తండ్రి అవడం లేదు" ఇంకా ఎవడో తండ్రి అవుతున్నాడు" అని రుద్రాణి అనగానే.. కావ్య షాక్ అవుతుంది. అప్పుడే కావ్య ఇంట్లో జరుగుతున్న గొడవలు మొత్తం చెప్తుంది. నా కూతురు అసలు తప్పు చెయ్యదని కనకం చెప్తుంది. కావాలనే కనకం నటిస్తు స్వప్నని తీసుకొని వెళ్లిపోతానని అంటుంది. కానీ స్వప్న రానని అంటుంది. కనకం కూడా స్వప్న అత్తవారింట్లోనే ఉండాలని మనసులో అనుకుంటుంది. తరువాయి భాగంలో.. అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంట్లో వాళ్ళు కలిసి అనామిక, కళ్యాణ్ లకి పెళ్లి చెయ్యాలని జాతకాలు చూస్తారు.  అనామిక జాతకం కలవడం లేదని పంతులు గారు చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 7 రికార్డు.. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరుగలేదు!

బిగ్ బాస్ సీజన్-7 లో ఎవరు ఊహించని విధంగా చివరి నామినేషన్ ముగిసింది. కంటెస్టెంట్స్ మధ్య వాడీ వేడీ ఆర్గుమెంట్స్ జరిగాయి. హౌస్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్ లో ఉన్నారు. అమర్‌దీప్, ప్రశాంత్ ల మధ్య జరిగిన గొడవతో హౌస్ లో ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక, శివాజీల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నామినేషన్స్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. "ఈ ఫినాలే రేస్ మిమ్మల్ని ఒక ఫైనలిస్ట్‌ను చేస్తుంది లేదా ఫినిష్ లైన్ దగ్గర ఆపేస్తుంది. అది ప్రేక్షకుల చేతిలోనే ఉంది. వాళ్లు మీ ప్రతి ఆట, ప్రతీ మాట, ప్రతీ కదలికను చాలా దగ్గరి నుంచి గమనిస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని.. మీ గెలుపు, ఓటములను నిర్ణయిస్తుంది. బిగ్‌బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇప్పటి నుంచి ఫినాలే వరకు.. అంటే రెండు వారాల కోసం మీ అందరి ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఈ రెండు వారాల సమయంలో అందరికంటే ఎక్కువ ఓట్స్ పొందిన వారు సీజన్ 7 విన్నర్ అవుతారు" అంటూ బిగ్‌‍బాస్ ప్రకటించాడు. అలానే ఒక వేళ ఈ వారం ఎవరి ఓట్స్ మిగిలిన వారి కంటే తక్కువగా ఉంటాయో వారు ఎలిమినేట్ అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అర్జున్ ఓటింగ్ లైన్స్ కూడా ఇప్పటి నుంచే తెరుచుకున్నాయని కానీ ఫినాలే టికెట్ పొందడంతో ఎలిమినేషన్ నుంచి అర్జున్ సేఫ్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే దీన్ని బట్టి.. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఎవరు కావాలనుకుంటున్నారనేది జనాల చేతిలో ఉందని చెప్పారన్నమాట. ఇక నిన్నటి నుంచి డిసెంబర్ 15 అర్ధరాత్రి 12 గంటల వరకు రెండు వారాల పాటు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు.    

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆఖరి నామినేషన్స్.. ఎవరు తగ్గలేదుగా!

బిగ్ బాస్ సీజన్-7 లో పద్నాలుగవ వారం నామినేషన్  ప్రక్రియతో హీటెక్కిపోయింది. ఇదే మా చివరి పర్ఫామెన్స్ అన్న రేంజ్ లో ప్రతీ ఒక్క కంటెస్టెంట్స్ చెలరేగిపోయారు. యావర్, అర్జున్ ల మధ్య నామినేషన్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. గేమ్ లో ఫౌల్ చేసావని అర్జున్ ని యావర్ అనగా.. నువ్వు కూడా ఫౌల్ చేసావ్ కదా అని అర్జున్ ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకరు తీవ్రంగా అరుచుకున్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో అమర్‌ దీప్‌కి ఇచ్చిన మాట ప్రకారం ప్రశాంత్ తన మీద ఒక్క బాల్ కూడా విసరకుండా సపోర్ట్ చేశాడు. అయితే ఆ తరువాతి వారంలో కూడా.. అమర్ దీప్ ఫొటోని కాల్చకుండా వదిలేసి.. రైతు బిడ్డ మాటిస్తే తప్పడని మాట నిలబెట్టుకున్నాడు. కానీ.. అమర్ దీప్ నమ్మించి మోసం చేశాడు. ఆ తరువాతి వారంలోనే ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. తనని కెప్టెన్‌ని కాకుండా అడ్డుకున్న వాళ్లని వదిలేసి.. సపోర్ట్ చేసిన ప్రశాంత్ నామినేట్ చేయడంతో అమర్ సేఫ్ గేమ్ ఆడాడని ప్రశాంత్ నమ్మించి మోసం చేశాడని, బయట వాళ్లే కాదు.. హౌస్‌లో ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారు. " నేను అసలు నామినేషన్స్ గురించే మాట్లాడటం లేదన్నా.. నువ్వు చేసిన నమ్మకద్రోహం గురించి మాట్లాడుతున్నా " అని ప్రశాంత్ అన్నాడు. ‘పోరా’.. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా? అని అమర్ దీప్ అనగానే.. ‘‘చూడన్నా.. నన్ను రారా పోరా అనొద్దు.. నువ్వు నన్ను రా అని అనకు.. పేరు పెట్టి పిలువు" అని అన్నాడు. ఆ మాటతో అమర్ రెచ్చిపోయాడు. ‘నేను రా అనే అంటా ఏం చేస్తావ్?  నా తమ్ముడిని రా అనే అంటాను. పలికితే పలుకు లేదంటే లేదు" అని అమర్ దీప్ అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య కొట్టుకునేదాకా వచ్చారు. ఇక ప్రశాంత్ ని అమర్ దీప్ తిడుతుంటే శోభాశెట్టి మరింత రెచ్చగొట్టడానికి పుల్లలు పెట్టింది. మరోవైపు ప్రియాంక, శివాజీల మధ్య వాగ్వాదం జరిగింది.