అనుపమ మాటలకి కంగుతిన్న రిషి!

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘గుప్పెడంత మనసు’. ఈ సీరియల్‌ బుధవారం నాటి ఎపిసోడ్‌-933లో... వసుధారపై పడ్డ నింద తప్పని రిషి రుజువు చేస్తాడు. దాంతో వసుధార హ్యాపీగా ఫీల్‌ అవుతుంది. ఇంత పెద్ద సమస్యని మీరు పరిష్కరించారు. నాకు చాలా భయం వేసిందని వసుధార అనగానే.. నీకు భయమా? పొగరికి బ్రాండ్‌ అంబాసిడర్‌ వి. నీకు భయమేంటని రిషి అంటాడు.  నేను కూడా ఒక అమ్మాయినే కదా సర్‌.. ఇంకా ఆ అనుపమగారు అన్న మాటలకు తల తీసేసినట్టు అయిందని వసుధార బాధగా చెప్తుంటే.. తనకి మనం థాంక్స్‌ చెప్పుకోవాలి. బెయిల్‌ పై తీసుకొని వచ్చిందని రిషి చెప్తాడు. నీకు నీ జీవితాన్ని ఎప్పటికి ఎలాంటి ప్రాబ్లమ్‌ రాకుండ నేను అడ్డుగా ఉంటానని వసుధారకి రిషి ప్రేమగా చెప్తాడు. మరొకవైపు మహేంద్ర చాలా హ్యాపీగా అనుపమకి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. మరొకవైపు వసుధార జరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకొని అతను ఇదంతా చేయించింది. ఆ  వీూR అని చెప్పాడు కదా ఆ  వీూRకి అంత తెలివి లేదు. నాకు అతను కాదేమో అనిపిస్తుందని రిషితో వసుధార అంటుంది. అది ఎవరైనా వదిలి పెట్టేది లేదని రిషి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక టీ స్టాల్‌ దగ్గర ఆగుతారు. వసుధార టీ స్టాల్‌ అతన్ని పక్కకి జరగమని చెప్పి తనే టీ చేస్తోంది. ఆ తర్వాత టీ తాగిన రిషి బాగుందని అంటాడు. టీ స్టాల్‌ అతను వచ్చి.. మీరు రిషి సర్‌ కాదా మా పిల్లలు మీ గురించి గొప్పగా చెప్తారు. మీరు గ్రేట్‌ సర్‌. ఒక సెల్ఫీ కావాలి అంటూ రిషి వాళ్ళతో అతను సెల్ఫీ తీసుకుంటాడు. మరోకవైపు మహేంద్ర దగ్గరకి అనుపమ వస్తుంది. మహేంద్ర గర్వంగా నా కోడలు ఏం తప్పు చెయ్యలేదని రిషి నిరూపించాడు. తను జగతి స్టూడెంట్‌ తప్పు చెయ్యదని మహేంద్ర చెప్తాడు. అప్పుడే రిషి, వసుధారలు వస్తారు. రిషి కూడా వసుధార ఏం తప్పు చెయ్యలేదని నిరూపణ అయిందని అనగానే.. నీ భార్య విషయంలో ఒక్క రోజులోనే  ఏం తప్పు చెయ్యలేదని నిరూపించావ్‌ కానీ జగతిని ఎవరు చంపారో ఇంకా తెలుసుకోలేనుపోతున్నావ్‌. ఇంత లైట్‌గా ఎలా తీసుకుంటున్నావని రిషితో అనుపమ అనగానే.. మీరు అలా మాట్లాడకండి. నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు మీ ఫ్రెండ్‌ గురించి అంత ఉంటే, తను నా కన్నతల్లి. నాకు ఇంకా ఎంత బాధ్యత ఉంటుంది. నేను త్వరలోనే తెలుసుకుంటానని రిషి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.  

పెళ్ళికి ముందు అతనికి గతం గుర్తుకు రానుందా?

స్టార్‌ మా టీవీలో ప్రసామవుతున్న సీరియల్‌ ‘కృష్ణ ముకుంద మురారి’. ఈ సీరియల్‌ బుధవారం నాటి ఎపిసోడ్‌ -327 లో.. ముకుంద కావాలనే మురారితో కలిసి ఉన్న ఫోటోస్‌ తీసుకొని వచ్చి మురారికి చూపిస్తుంది. మనం ప్రేమించుకున్నప్పటి ఫోటోస్‌ ఇవి అని అనగానే మురారి షాక్‌ అవుతాడు. నీ రూపం మార్చి నువ్వు ఇలా కావడానికి కారణం అయి పుణ్యం కాదు పాపం మూట కట్టుకున్నారని మురారీతో ముకుంద అంటుంది. ఆ తర్వాత మురారి డిస్సపాయింట్‌ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు మధు, గౌతమ్‌  డ్రిరక్‌ చేస్తూ కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. కృష్ణ రిస్క్‌ చేసి నిన్ను, నందుని కలిపిందని మధు అనగానే.. అవును ఇప్పుడు కృష్ణకి మనం హెల్ప్‌ చెయ్యలేమా అని గౌతమ్‌ అంటాడు. పెద్దమ్మకి ఎదరు తిరగలేం. కన్విన్స్‌ చెయ్యడం తప్పని మధు అంటాడు. మరొకవైపు మురారికి నిద్రలో గతం గుర్తుకువచ్చినట్లు ఒక్కసారిగా లేచి కృష్ణ అంటాడు. అప్పుడే ముకుంద విని గతం గుర్తుకు వచ్చిందా అని టెన్షన్‌ పడుతుంది. ఇందాక నేను ఏం అని అరిచానని ముకుంద అనగానే.. అమ్మ అని అరిచావని అబద్ధం చెప్తుంది. నన్ను ఎవరో సర్‌ అని అబ్బాయి అని పిలిచినట్లు అనిపించిందని ముకుందతో మురారి చెప్తాడు. ఆ తర్వాత మురారిని ముకుంద డైవర్ట్‌ చేస్తుంది. మరొకవైపు భవానిని పట్టించుకోకుండా మురారి వెళ్తుంటే.. ఎక్కడికి అని అడుగుతుంది. కృష్ణ దగ్గరకు అని చెప్పి వెళ్లిపోతాడు. పూర్తిగా వాళ్ళ ఉచ్చులో పడకముందే మురారి, ముకుందలకి పెళ్లి చెయ్యాలని భవాని అనుకుంటుంది. ముకుందకి మధు, రేవతి కౌంటర్‌ వేస్తుంటారు.  కాసేపటికి కృష్ణ దగ్గరకు మురారి వెళ్లి.. రాత్రి నిద్రలో గతం గుర్తుకు వచ్చినట్లు అనిపించింది. ఎవరో సర్‌ అంటున్నట్టు అని మురారి అనగానే.. గుర్తుకు తెచ్చుకోండి అని హ్యాపీగా ఫీల్‌ అవుతుంది కృష్ణ. వాళ్ళ మాటలన్నీ ముకుంద వింటుంది. మరొకవైపు భవాని తన ఫ్రెండ్‌ తో.. ముకుంద, మురారిల పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఒక మాట శ్రీనివాస్‌ అన్నయ్య కూడా చెప్పి కనుక్కోండి అని రేవతి అనగానే.. ఎందుకు అతను పెళ్లికి అడ్డు చెప్తారన్న ఆశనా? అయినా కూతురు జీవితం హ్యాపీగా ఉంటుందంటే ఎందుకు వద్దు అంటారని భవాని అంటుంది. తరువాయి భాగంలో.. పంతులిని భవాని పిలిచి ముకుంద, మురారీల పెళ్లి ముహూర్తం పెట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

శోభాశెట్టి ఎలిమినేషన్‌.. డేంజర్‌ జోన్‌లో గౌతమ్‌, అర్జున్‌!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారింది. నామినేషన్‌లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్స్‌ బిగ్‌ బాస్‌ ఇచ్చే టాస్క్‌లలో సత్తాని చాటుతున్నారు. అమర్‌ దీప్‌ ఫ్యాన్స్‌ ఓటింగ్‌ షేర్‌తో ఈవారం ఓటింగ్‌ నిజంగానే ఉల్టా పుల్టా అయిపోయింది. అయితే గురు, శుక్రవారాల్లో జరిగే ఓటింగ్‌ కూడా ఎలిమినేషన్‌కి కీలకం కానుంది. ‘ఫినాలే అస్త్ర’ టాస్క్‌లో జరుగుతున్న హౌస్‌ మేట్స్‌ ఆటతీరు వల్ల ఓటింగ్‌లో కీలకమైన మార్పులు ఉండబోతున్నాయి. రోజు రోజుకి ఎలిమినేషన్‌ ఎవరనే లెక్కలు మారుతున్నాయి. ఫినాలే అస్త్రని గెలుచుకోవడానికి కంటెస్టెంట్స్‌ ఎంత కసిగా ఆడుతున్నారో అందరికి తెలిసిందే. అయితే ఇందులో శోభాశెట్టి ఆదిలోని అవుట్‌ అయింది.  ప్రియాంక అద్భుతమైన పర్ఫామెన్స్‌ ఇస్తుండటంతో ప్రియాంకకి ఓటింగ్‌ షేర్‌ పెరుగుతుంది.అయితే వీళ్ళిద్దరు ఎలిమినేషన్‌కి దగ్గరగా ఉన్నారు. ఒకవేళ ప్రియాంకకి ఓటింగ్‌ పెరిగితే శోభాశెట్టికి మూడినట్టే లెక్క. పైగా ఆమె ఈవారం ‘ఫినాలే అస్త్ర’లో డిస్‌ క్వాలిఫై అయ్యింది కాబట్టి.. టాస్క్‌లలో ఏదో పొడుస్తుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆ ఛాన్స్‌ కూడా ఇప్పుడు లేదు. అయితే శోభాశెట్టి ఎలిమినేషన్‌ అనేది ఆడియన్స్‌ చేతుల్లో లేనేలేదు. మేనేజ్‌మెంట్‌ కోటాలో ఆమెను బిగ్‌ బాస్‌ సేవ్‌ చేస్తూ వస్తున్నారు. టేస్టి తేజ కంటే ముందు నుండి వరుసగా ప్రతీవారం లీస్ట్‌లో ఉన్న శోభాశెట్టిని సేవ్‌ చేస్తూ వస్తూనే ఉన్నారు బిగ్‌ బాస్‌. ఈమె ఎలిమినేషన్‌ పై ఇప్పటికే ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  శోభాశెట్టికి అగ్రిమెంట్‌ ఎన్నివారాలిచ్చారో ఎవరికి తెలియదు కాబట్టి ఈవారం కూడా శోభాశెట్టిని ఎలిమినేషన్‌ చేయడమనేది డౌటే. ఇన్ని వారాలు శోభాని కాపాడిరది చాలని బిగ్‌ బాస్‌ అనుకుంటే ప్రేక్షకుల ఓటింగ్‌ ప్రకారం శోభాశెట్టిని ఎలిమినేషన్‌ చేస్తాడు. లేదంటే తనతో పాటు లీస్ట్‌లో ఉన్న అర్జున్‌  గౌతమ్‌లలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అవుతారు. అయితే బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఫినాలేకి రెండు వారాలే ఉండటంతో ఈ వారం బిగ్‌ బాస్‌ శోభాశెట్టిని ఎలిమినేట్‌ చేస్తాడని, లేదంటే డేంజర్‌ జోన్‌లో ఉన్న ప్రియంకని ఎలిమినేట్‌ చేస్తాడు.

అంబటి అర్జున్‌ ఫౌల్‌ గేమ్‌.. సంఛాలక్‌గా శోభాశెట్టి ఫెయిల్‌!

శోభాశెట్టి సంఛాలక్‌ అంటేనా సీరియల్‌ బ్యాచ్‌ కి ఫేవరిజమని మరోసారి బయటపడిరది. ఎంతసేపు ప్రశాంత్‌, యావర్‌, శివాజీల ఆట మీదే ఫోకస్‌ చేస్తూ.. అంబటి  అర్జున్‌, గౌతమ్‌, అమర్‌, ప్రియంకల గేమ్‌ పట్టించుకోవట్లేదు శోభాశెట్టి. దీంతో బుధవారం నాటి టాస్క్‌ జరిగిన ఎపిసోడ్‌లో సంఛాలక్‌గా శోభాశెట్టి ఫెయిల్‌ అయింది.  ఎత్తర జెండా టాస్క్‌లో ఇసుక తీసుకొచ్చి పడవలో ఒకవైపుకి పోయాలని బిగ్‌ బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో సంచాలక్‌ గా శోభాశెట్టి, శివాజీ ఉన్నారు. ఇక బజర్‌ మోగగానే.. వరుసగా.. యావర్‌, అర్జున్‌, అమర్‌, గౌతమ్‌లు తమ పడవలను ఇసుకతో నింపారు. గౌతమ్‌ ఫౌల్‌గా ఆడాడు తన పడవలో ఒకవైపు ఉన్న ఇసుకని తీసుకొని మరోవైపు పోసాడు. ఇదే తన స్ట్రాటజీ అంటూ గౌతమ్‌ అనగా.. శివాజీ, శోభాశెట్టి ఫౌల్‌ అని చెప్పిన వినట్లేదు. దాంతో బిగ్‌ బాస్‌ ఫౌల్‌ అని చెప్పేశాడు. ఇక గేమ్‌లో సూపర్‌ ఫాస్ట్‌గా ఇసుక నింపిన పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. ఇక ప్రశాంత్‌తో కావాలని గొడవ పెట్టుకుంది శోభా. ఈ టైమ్‌లో అర్జున్‌ ఒక ఫౌల్‌ చేసాడు. అది ఎవరు గమినించలేకపోయారు. అందరికంటే గేమ్‌లో మొదటి స్థానంలో ప్రశాంత్‌, రెండవ స్థానంలో యావర్‌, మూడవ స్థానంలో అర్జున్‌.. లాస్ట్‌లో ప్రియాంక తన పడవను ఇసుకతో నింపి చివర్లో గంట కొట్టింది. అయితే ఈ టాస్క్‌లో అందరికంటే ముందు జెండా ఎగరేసిన ప్రశాంత్‌కి అందరికంటే ఎక్కువగా 100 పాయింట్లు సంపాదించాడు. యావర్‌ 90, అర్జున్‌ 80, అమర్‌ 70, గౌతమ్‌ 60, ప్రియాంక 50 పాయింట్లను సాధించింది. అయితే గేమ్‌ మధ్యలో ప్రశాంత్‌  ఒక చేతితో ఇసుకని పట్టుకుంటున్నావంటూ తనని అపే ప్రయత్నం చేయగా.. శివాజీ మధ్యలో కలుగజేసుకొని అందరూ అలానే చేస్తున్నారంటూ శోభాకి చెప్పాడు. ఈ డిస్కషన్‌ టైమ్‌లో అర్జున్‌ ఫౌల్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు. అర్జున్‌ ఇసుక వేసే టైమ్‌లో తన పడవను టచ్‌ చేశాడు. అప్పుడు ఇసుక కూడా వేయడంతో ఆ ఫోర్స్‌తో అతని పడవ ఈజీగా పైకి లేచింది. అతను కావాలనే ఫౌల్‌ గేమ్‌ ఆడాడో.. లేదంటే అనుకోకుండా పడవకి తన చేయి టచ్‌ అయ్యిందో కానీ.. అతను పడవను టచ్‌ చేయడం అయితే కనిపించింది. బరువు నిండిన వైపు చిన్న టచ్‌ చేసినా కూడా ఈజీగా పైకి లేచిపోతుంది. అర్జున్‌ ఇదే స్ట్రాటజీ వాడాడు. అయితే దాన్ని సంచాలక్‌గా ఉన్న శోభాశెట్టి గమనించలేదు. మరి నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్‌లో అర్జున్‌, శోభాశెట్టిలకి వార్నింగ్‌ ఇస్తాడో లేదా చూడాలి మరి.

నా అనుకున్న వాళ్ళే నమ్మకద్రోహం చేశారు!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7లో ‘టికెట్‌ టు ఫినాలే’ కోసం టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇందులో కంటెస్టెంట్స్‌ తమ బలాన్ని నిరూపించుకుంటున్నారు. అయితే ఒక్కో గేమ్‌లో కంటెస్టెంట్స్‌ ఆటతీరుతో లెక్కలు మారిపోతున్నాయి. మొన్నటి ఎపిసోడ్‌లో లీస్ట్‌లో ఉన్న అమర్‌ దీప్‌.. శివాజీ, శోభాశెట్టి ఇచ్చిన పాయింట్లతో టాప్‌లోకి వచ్చాడు. అయితే నిన్నటి టాస్క్‌ ముగిసాక అమర్‌దీప్‌కు ప్రియాంక ఊహించని షాక్‌ ఇచ్చింది. అయితే ఎత్తర జెండా టాస్క్‌లో ఫాస్ట్‌గా బోటులో ఇసుక నింపి మొదటి స్థానంలో నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. ఇక ఇందులో ప్రియాంక లీస్ట్‌లో ఉంది. లీస్ట్‌లో ఉన్న ఒకర్ని తప్పించాలి కాబట్టి ప్రియాంకని ఫినాలే అస్త్ర రేస్‌ నుంచి తప్పించారు బిగ్‌ బాస్‌. అయితే తన పాయింట్లను హౌస్‌లో ఉన్న వాళ్లలో తనకి నచ్చిన వాళ్లకి ఇవ్వాలని బిగ్‌ బాస్‌ చెప్పాడు. అయితే ప్రియాంక.. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ అమర్‌దీప్‌ని కాదని, తన అన్న గౌతమ్‌ కృష్ణకి ఇచ్చేసింది. నిన్న బాల్‌ టాస్క్‌లో అమర్‌దీప్‌ కొట్టిన దెబ్బకి, గౌతమ్‌కి పాయింట్లను ఇచ్చేసింది ప్రియాంక. అమర్‌, ప్రియాంక, శోభా ఈ ముగ్గురూ స్పా బ్యాచ్‌ అని అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఒకరికోసం ఒకరు ఆడుతున్నారు. కానీ నిన్నటి టాస్క్‌తో అమర్‌, ప్రియాంకల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అమర్‌పై రివేంజ్‌ తీర్చుకుంటూ తన పాయింట్లను గౌతమ్‌కి ఇచ్చేసి గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది ప్రియాంక. అదే తన పాయింట్లను అమర్‌కి ఇచ్చి ఉంటే అమర్‌ దీప్‌కి ‘ఫినాలే అస్త్ర’ వచ్చేసేది కానీ గౌతమ్‌కి ఇచ్చి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది ప్రియాంక. ఇసుక టాస్క్‌ ముగిసాక అర్జున్‌ 360 పాయింట్లు, యావర్‌ 320 పాయింట్లు, ప్రశాంత్‌ 320 పాయింట్లు, గౌతమ్‌ 250 పాయింట్లతో ఉండగా అయితే ప్రియాంకకి 180 పాయింట్లు ఉన్నాయి. అవి గౌతమ్‌కి ఇవ్వడంతో గౌతమ్‌ పాయింట్ల సంఖ్య 430కి చేరింది. దీంతో గౌతమ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ 2కి వెళ్లిపోయాడు. దీంతో అమర్‌ దీప్‌ బాగా ఫీల్‌ అయ్యాడు. నేనే నిన్ను నమ్మి వెదవని అయ్యానని ప్రియాంకతో అమర్‌ దీప్‌ అన్నాడు. నా అనుకున్నవాళ్ళే నమ్మకద్రోహం చేశారంటూ శివాజీతో అనగా.. ప్రియాంక నీకే ఇస్తుందని అన్నావ్‌ కదరా అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత అమర్‌- ప్రియాంకల మధ్య జరిగిన గొడవని శోభాశెట్టి ఆపే ప్రయత్నం చేసింది. కానీ తనకి ఆకలి అవుతుందని ఏదైన వంట చేయమని ప్రియాంకకి ఎంత టైమ్‌ చెప్పినా తను బాధపడుతూనే ఉండటంతో శోభాశెట్టి అలిగి కోపంగా వెళ్లిపోయింది. ఇలా అమర్‌-ప్రియాంకల మధ్య గొడవ కాస్త.. శోభాశెట్టి-ప్రొయాంకల మధ్య గొడవకి దారితీసింది.

టాప్-5 లో ఉండే అర్హత లేదన్న రతిక!

బిగ్ బాస్ సీజన్-7 లో రెండుసార్లు హౌస్ లోకి ఎలిమినేట్ అయి వచ్చిన రతిక   బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. రెండో సారి వచ్చిన అవకాశాన్ని వాడుకోలేదని అనుకున్నాం మీరేమంటారని యాంకర్ అడుగగా.. అవును. గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయాను. యాక్టివిటీల పరంగా చిన్నప్పటి నుండి నేను వీక్. నాకు ప్రేక్షకులు బాగా సపోర్ట్ చేశారు. మొదటి సారి ప్రశాంత్, శివాజీలతో మాట్లాడకుండా బయటకు వచ్చేశారు ఎందుకని అడుగగా.. రతిక యూ ఆర్ ఎలిమినేటెడ్ అనగానే నా మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. ఏం మాట్లాడాలో కొద్దిసేపు తెలియలేదు. బయటకు వచ్చాక కొన్ని విషయాలు తెలిసి బాధపడ్డానని, అందుకే లోపలికి వెళ్ళగానే ఇద్దరికి సారీ చెప్పానని రతిక అంది. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాక ఎందుకో మీరు డల్ అయినట్టు అనిపించిందని యాంకర్ అడుగగా.. రెండో వారం యావర్ తో జరిగిన విషయాలని హౌస్ లోకి వెళ్ళాక చెప్పాను. అవి తీసుకొని నామినేషన్ లో అమర్ దీప్ కి చెప్పి నామినేట్ చేశాడు. ఇక బొమ్మల టాస్క్ లో గొడవ ఎందుకని అమర్ దీప్ ని బ్రతిమిలాడాను కానీ అతను వినలేదు.  కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్ కి కాకుండా ప్రియాంకకి సపోర్ట్ చేశారెందుకని యాంకర్ అడుగగా.. అతడికి సపోర్ట్ చేయకపోవడానికి రీజన్ ఉంది. అమర్‌ దీప్ నన్ను పర్సనల్ గా రెండు, మూడు మాటలు అన్నాడు. అవి చాలా భాదేశాయని అంది. యావర్ తో మళ్ళీ లవ్ ట్రాక్ ఎందుకు మొదలెట్టారని యాంకర్ అడుగగా.. నేను కావాలని చేయలేదు. 2.0 లో లోపలికి వెళ్ళిన వాళ్ళు నా గురించి నెగెటివ్ గా చెప్పారు. అయిన నా విషయాలు వాళ్ళకెందుకని రతిక అంది. టాప్-5 లో ఉంటావని అనుకున్నావా అని యాంకర్ అడుగగా.. టాప్-5 లో ఉండే అర్హత నాకు లేదు. తర్వాతి వారం బాగా ఆడతానని చెప్పడం ప్రతీ వారం చెప్పడం సరకాదని అనిపించింది. ప్రశాంత్ విషయంలో నేను చేసింది తప్పు అని అంగీకరిస్తున్నాని అంది. టాప్-5 లో శివాజీ, ప్రశాంత్ ఉంటారని అనుకుంటున్నాను. నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకి సారీ అనే చిన్నమాట చెప్పి వారిని  మభ్యపెట్టలేనని రతిక అంది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకుంది రతిక.

టికెట్ టు ఫినాలే గెలిచిందెవరో తెలుసా?

బిగ్‌బాస్ సీజన్-7లో ఇప్పటికే పన్నెండు వారాలు పూర్తయిన విషయం తెలిసిందే.‌ ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలుంది. పదమూడవ వారం నామినేషన్స్ లో చాలా హీటెడ్ ఆర్గుమెంట్ లు జరిగాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని హౌస్‌మెట్స్‌కి ఇచ్చాడు బిగ్‌బాస్.  ప్రతి సీజన్‌లో ఉండే 'టికెట్ టు ఫినాలే' పేరును కాస్తా మార్చి 'ఫినాలే అస్త్ర' అని పెట్టాడు. ఇక ఇది గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకి క్లాక్ వీల్ ఛాలెంజ్ పెట్టాడు బిగ్‌బాస్. మరి ఈ ఛాలెంజ్‌లో విన్ అయి ఈ అస్త్రాన్ని గెలిచేదెవరో‌ తెలియాలంటే  టాస్క్ లు గెలిచి ఎక్కువ పాయింట్లు సాధించాలి.  మొదటి టాస్క్ టిక్ టాక్ టిక్.. ఈ టాస్క్ లో  కంటెస్టెంట్స్ అంతా ఒక క్లాక్ వాచ్ మీద నిలబడి ఉంటారు. క్లాక్ లోని ముల్లు తిరుగుతూ ఉంటుంది. మొదటి బజర్ లో ఎవరు కిందబడతారో వాళ్ళు అవుట్, రెండవ బజర్ లో ఎవరికి తాకుతుందో వాళ్ళు అవుట్ అని చెప్పగా.. మొదట ప్రశాంత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి, గౌతమ్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత యావర్, శివాజీ, అమర్ దీప్, అవుట్ అవ్వగా.. ప్రియాంక, అంబటి అర్జున్ చివరగా ఉన్నారు. ఇందులో ప్రియాంక అవుట్ అయి అంబటి అర్జున్ ఉన్నాడు. మొదటి టాస్క్ లో అర్జున్ గెలిచి వంద పాయింట్లు సొంతం చేసుకున్నాడు. లీస్ట్ లో ఉన్నవారికి ముప్పై పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్. ఇక రెండవ టాస్క్.. పూలనే సేకరించాలంటే. యాక్టివిటి ఏరియాలో ఉన్న పూలని తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న తమ తమ ఏరియాలో పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో ప్రశాంత్ అత్యధిక పూలని తీసుకొచ్చి గెలిచాడు‌. అయితే లీస్ట్ లో శివాజీ, శోభాశెట్టి ఉన్నారు. దీంతో లీస్ట్ లో ఉన్నవారి పూలని మిగిలిన వారికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక శివాజీ దగ్గరికి అమర్ దీప్ వచ్చి.. నాకు ఫినాలేలో సపోర్ట్ చేస్తానని మాటిచ్చావ్ అనగా, నీకు శోభాశెట్టి ఇస్తుందని శివాజీ అన్నాడు. వీరి మాటలు విన్న బిగ్ బాస్.. ఇద్దరు ఒకే హౌస్ మేట్కి తమ పూలని ఇవ్వాలని అన్నాడు. దాంతో ఇద్దరు కలిసి అమర్ దీప్ కి ఇచ్చారు. ఇలా అమర్ దీప్ కి అత్యధిక పాయింట్లు వచ్చాయి.  ఇక మూడవ టాస్క్.. "గాలం వేయి బుట్టలో పడవేయ్" . ఇందులో గాలంతో మధ్యలో ఉన్న బాల్ ని తీసుకొని మీ దగ్గర ఉన్న బాస్కెట్ లో వేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో అర్జున్ మొదట గెలిచి వంద పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ గెలిచి తొంభై పాయింట్లు సొంతం చేసుకున్నాడు. లీస్ట్ లో ఉన్న అమర్ దీప్, ప్రియాంకల మధ్య తోపులాట జరిగింది. ఈ టాస్క్ లో.. అమర్ దీప్ గెలిచి, ప్రియంక అవుట్ అయింది‌.   

Krishna Mukunda Murari : కృష్ణతో ఉన్న బంధం ఏంటో మురారి తెలుసుకోనున్నాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -326 లో... నువ్వు మా అక్క మైండ్ చేంజ్ చేసావని రేవతి అనగానే.. అత్తయ్య ఒకరు చెప్తే వినేరకం కాదు. తనకి నచ్చింది చేస్తోందని ముకుంద అంటుంది. ఎప్పుడు బృందావనం లాగా మా ఇల్లు ఉండేది. నువ్వు వచ్చాకే ఇలా అయిందని రేవతి అంటుంది. నాకు మురారికి పెళ్లి ఐతే కూడా అలాగే ఉంటుందని ముకుంద అంటుంది. రెండు రోజుల తర్వాత అంతా చెప్తానన్న మాటలు మురారి గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే మురారి దగ్గరికి భవాని వచ్చి.. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు. నిన్ను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఆ విషయం చెప్పాలని వచ్చానని భవాని చెప్తుంది. నువ్వు గతంలో  ముకుందతో ప్రేమలో ఉన్నావని అనగానే మురారి షాక్ అవుతాడు. ముకుందతో నేను ప్రేమలో ఉన్నానా? నాకెప్పుడు అలా అనిపించలేదని మురారి అనుకుంటాడు. వాళ్ళ కుటుంబంతో కలిసి కృష్ణ కుట్రలు చేసి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని భవాని చెప్తుంది. " నీ మీదనే ఆశలు పెట్టుకొని ఉన్న ముకుందకి న్యాయం చెయ్యాలి. మీ పెళ్లి చెయ్యాలి" అని భవాని అనగానే.. మురారి ఎదో చెప్పబోతుంటే నువ్వేం మాట్లాడకు. ఆ కృష్ణని కలవకని భవాని చెప్పి వెళ్ళిపోతుంది. మురారికి మాత్రం ఏం అర్థం కాదు. మరొకవైపు కృష్ణ పెళ్లి ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద వచ్చి ఫోటో లాక్కొని కాల్చి వెయ్యాలని చూస్తుంటే కృష్ణ లాక్కుంటుంది.  మురారికి గదిలో గతానికి సంబంధించినవి ఏమైన దొరుకుతాయోనని వెతుకుతాడు. కానీ ఒక్కటి కూడా దొరకదు. మరొకవైపు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతానని‌ రేవతితో కృష్ణ చెప్తుంది. మురారి ఇప్పుడు కృష్ణ దగ్గర ఉంటాడు. ఇప్పుడు వెళ్లి ఈ ఫోటోస్ కృష్ణ ముందే మురారికి చూపించాలని ముకుంద అనుకుంటుంది. మురారి, ముకుంద ఇద్దరు ప్రేమించుకున్నప్పటి ఫోటోస్ లని వాళ్ళ దగ్గరికి వెళ్లి చూపిస్తుంది. ఇతను ఎవరని అనగానే.. కృష్ణకి బాగా తెలుసని ముకుంద అంటుంది. చెప్పు కృష్ణ ఎవరు నా పక్కన ఉన్నది ఎవరని ముకుంద  అనగానే.. కృష్ణ ఇబ్బందిగా మీరేనని చెప్తుంది. మురారి షాక్ అవుతాడు.. తరువాయి భాగంలో మురారి నిద్రలో కృష్ణని గుర్తుకు చేసుకొని ఒక్కసారిగా కృష్ణ అని లేచి అరుస్తాడు. దాంతో ఏంటి గతం గుర్తుకు వచ్చిందా అని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : ఆ క్రైమ్ నుండి అతను తప్పించుకున్నట్టేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -932 లో.. వసుధార ఏ తప్పు చెయ్యలేదని రిషి నిరూపించాలని అనుకుంటాడు. మరొకవైపు హాస్పిటల్ లో చిత్ర లేదు. వీళ్ళే కిడ్నాప్ చేశారని చిత్ర పేరెంట్స్ అంటారు. మా కూతురు ఎక్కడ అని వాళ్ళు అనగానే చూపిస్తానంటూ మహేంద్రని రిషి పిలిచి.. చిత్రని తీసుకొని రమ్మని చెప్పగానే మహేంద్ర చిత్రని తీసుకొని రావడం చూసి అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత నువ్వు ఎవరికి బయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ఈ వసుధార మేడమే కారణమా అని చిత్రని ఎస్సై అడుగగానే.. మేడమ్ కారణమని ఎవరు  చెప్పారు. అసలు నేను సూసైడ్ చేసుకోలేదని చిత్ర  అంటుంది. చిత్ర పేరెంట్స్ వీడియో కాల్ లో అక్కడ జరిగేదంతా చూస్తున్న దేవయాని వాళ్ళ గురించి ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతుంటారు. ఆ తర్వాత ఎస్సై లెటర్ తీసుకొని చూపించగా నేను రాయలేదు. వాల్లే బలవంతంగా ఖాళీ పేపర్ పై సంతకం పెట్టించారని చిత్ర చెప్తుంది. అసలేం జరిగిందని, మొత్తం క్లారిటీ గా చెప్పమని  ఎస్సై అనగానే.. చిత్ర జరిగింది మొత్తం చెప్తుంది. నా ఫోన్ నుండి మేడమ్ కి మెసేజ్ చేశారు కానీ మేడమ్ వచ్చి అక్కడ నాకు సపోర్ట్ గా మాట్లాడిందని, బెదిరించలేదని చెప్తుంది. ఆ తర్వాత సంతకం పెట్టించుకున్నారు. కొద్దిసేపటికి నా నోటి నుండి నూరగలు వచ్చాయని చిత్ర చెప్తుంది. అసలు వాళ్ళు నా పేరెంట్స్ కాదు. పిన్ని బాబాయ్ లు చిన్నప్పటి నుండి నన్ను టార్చర్ చేశారని చిత్ర అనగానే.. నా కూతురిని బెదిరించి ఇలా చెప్పిస్తున్నారని చిత్ర పేరెంట్స్ అని చెప్పుకుంటారు‌. ఆమె  అనగానే రిషి తన దగ్గర ఉన్న చిత్రని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న అబ్బాయిని తీసుకొని వచ్చి.. నిజం చెప్పమంటాడు. ఆ తర్వాత అతన్ని ప్రేమించలేదు. వాళ్ళు నా పేరెంట్స్ కాదు పిన్ని బాబాయ్. వాళ్ళు చిన్నప్పటి నుండి టార్చర్ చేస్తున్నారని చిత్ర చెప్తుంది. మరొకవైపు ఎక్కడ శైలేంద్ర పేరు చెప్తాడోనని కంగారుగా శైలేంద్ర కి దేవయాని ఫోన్ చేస్తే కలవదు.  ఆ తర్వాత అతను జరిగింది చెప్తాడు. చిత్రని చంపాలనుకున్నది కూడా చెప్తాడు. ఆ తర్వాత రిషి ఒక వీడియోని చూపిస్తాడు అందులో చిత్రని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న అతనే చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఎవరు చేశారని రిషి బెదిరించడంతో.. ఒకతను వచ్చి ఇలా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. అతని పేరు MSR అని చెప్పాడని అనగానే.. అందరూ షాక్ అవుతారు.  MSR ఇదంతా చేసాడు అనుకుంటాడు. తనకి మాకు కాలేజీ గొడవలు ఉన్నాయి. అందుకే ఇలా చేస్తున్నాడు. నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండని పోలీసులకి రిషి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళని పోలీసులు తీసుకొని వెళ్తారు. మరొకవైపు చిత్ర బాధ్యత మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ చూసుకుంటుందని రిషి చెప్తాడు. కాసేపటికి శైలేంద్రకి దేవయాని ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎంతసేపటికి ఫోన్ కలవదు. మరొకవైపు శైలేంద్రకి ధరణి షర్ట్ బటన్ సెట్ చేస్తుంటే.. ధరణిని శైలేంద్ర రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: ఆమెలో మొదలైన అనుమానం.. అతడి మోసం బయటపడుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -265 లో.... అప్పు, కళ్యాణ్ లని ఒక్కటి చెయ్యాలని కనకం అనుకొని.. ఏదైనా సలహా ఇవ్వొచ్చు కదా అని అన్నపూర్ణని అడుగుతుంది. నువ్వు నీ ఇద్దరు కూతుళ్లు ఆ ఇంట్లో ఉన్న విషయం మర్చిపోకని అన్నపూర్ణ అనగానే... మన అప్పు లాగే కళ్యాణ్ కూడా అప్పుని ప్రేమిస్తున్నడెమో అప్పు చెప్పలేదని బయటపడట్లేదు అనుకుంటా.. ఆ అనామిక ప్రేమిస్తున్నట్లు చెప్పగానే కళ్యాణ్ ఒప్పుకున్నాడని కనకం అంటుంది. మనం ముందు కళ్యాణ్ మనసులో ఏం ఉందో కనుక్కోవాలని కనకం అంటుండగా.. అప్పుడే కృష్ణమూర్తి వచ్చి నువ్వు ఇప్పటివరకు చేసిన తప్పులు చాలు. ఇక ఈ విషయంలో ఎం తప్పు చెయ్యకు. ఇప్పటికే ఆ ఇంటికి వెళ్తే మనకు విలువ లేదు. ఏం చేసిన నాకు చెప్పు. నాకు చెప్పకుండా ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో నుండి గెంటేస్తానని కనకానికి కృష్ణమూర్తి వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు స్వప్న దగ్గరికి కావ్య వచ్చి.. అరుణ్ కి సంబంధించిన విషయం ఏదైనా నాకు చెప్పమని చెప్పాను కదా ఎందుకు ఇలా చేసావని కావ్య అడుగుతుంది. నాకేం తెలుసు ఇలా చేస్తాడని ఇంత సపోర్ట్ చేసినవాడు ఇలా చేస్తాడని ఎవరైనా ఉహిస్తారా అని స్వప్న అనగానే.. అవును దీని వెనకాల ఎవరో ఉండి చేపిస్తున్నారని కావ్య అంటుంది. ఆ తర్వాత అమ్మకి నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పవా అని కావ్య అడుగుతుంది. చెప్పలేదు ఇప్పుడు ఇదంతా చెప్తే ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. నేను టైమ్ చూసుకొని చెప్తానని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత అరుణ్ గురించి కావ్య ఆలోచిస్తూ రాహుల్, రుద్రాణి ల దగ్గరికి వెళ్లి.. మీకు ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి? ఎవరు పంపించారని అడుగుతుంది. మాకేం తెలుసు నంబర్ పంపిస్తున్నాను ఎంక్వైరీ చేసుకోమని కావ్యకి రాహుల్ నెంబర్ పంపిస్తాడు. ఆ తర్వాత కావ్య ఆ నెంబర్ చూసి ఇది రాహుల్ నెంబర్ అని అనుకుంటుంది.. మరొక వైపు అనామిక, కళ్యాణ్ ఇద్దరు షాపింగ్ కి వెళ్తు.. అప్పు ని తీసుకొని వెళదామని అప్పు దగ్గరకు వస్తారు. అనామిక బయట ఉండి కళ్యాణ్ ఒక్కడే లోపలికి వస్తాడు. ఆ తర్వాత అప్పు బయటకు రావడం లేదు. దేని గురించో బాధపడుతుందని కళ్యాణ్ తో కనకం అనగానే.. నేను వెళ్లి కనుకుంటానని కళ్యాణ్ అంటాడు. అప్పు దగ్గరికి వెళ్ళిన కళ్యాణ్.. షాపింగ్ కి వెళదాం పద అని అనగానే అప్పు రానని చెప్తుంది. ఎందుకు ఇలా ఉంటున్నావ్? నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వే అప్పు గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు కళ్యాణ్.. అప్పుడే అనామిక లోపలికి వచ్చి.. కళ్యాణ్ పై అరుస్తుంది. బయట నన్ను ఉండమని చెప్పి నీ ఫ్రెండ్ తో కబుర్లు చెప్తున్నావా? నీ ఫ్రెండ్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న అంతగా నన్ను అర్థం చేసుకోవడం లేదని అనామిక  కోపంగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో అరుణ్ దగ్గరికి రాహుల్ వచ్చి.. ఇప్పుడు నీ దగ్గరకి కావ్య వస్తుందని చెప్పగానే అరుణ్ షాక్ అవుతాడు.  మరొకవైపు రాజ్ ని తీసుకొని కావ్య అరుణ్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శివాజీకి వెన్నుపోటు పొడిచిన అంబటి అర్జున్!

  బిగ్‌బాస్ హౌస్‌‍లో పదమూడవ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఎనిమిది మంది హౌస్‌లో ఉండగా ఇందులో ఏడుగురు నామినేషన్స్‌లోకి వచ్చారు. ఈ వారం కెప్టెన్ ఎవరు లేకపోయిన అమర్ దీప్ నామినేషన్స్‌ నుంచి సేవ్ అయ్యాడు. నిన్న జరిగిన నామినేషన్ లో అంబటి అర్జున్ చేసిన నామినేషన్ వల్ల అతనే ఈ వారం ఎలిమినేట్ అయ్యేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతవారం జరిగిన కెప్టెన్సీ రేస్ లో ఫైనల్ గా అంబటి అర్జున్, అమర్ దీప్ ఉండగా.. అర్జున్ కి సపోర్ట్ గా శివాజీ, అమర్ దీప్ కి సపోర్ట్ గా శోభాశెట్టి ఫైట్ చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టైమ్ లో ఇద్దరు డిసైడ్ కాలేకపోవడం వల్ల అది కాస్త ఫైనల్ గా బిగ్ బాస్ చేతికి వెళ్ళింది. దాంతో నో కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పేశాడు. ఇక్కడివరకు అంతా ఒకే కానీ.. అసలు విషయం ఏంటంటే నిన్నటి నామినేషన్ లో శివాజీని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. నామినేషన్ కి అర్జున్ కారణం చెప్తూ.. " నేను ఏదైతే రీజన్ రాకూడదని అనుకున్నానో అది నాగ్ సర్ దగ్గరి నుంచి వచ్చేసింది.. నేను పప్పీ రీజన్ చెప్పి కెప్టెన్ అవుదామనుకున్నానని నాగ్ సర్ అనేశారు" అంటూ అర్జున్ చెప్పాడు. దీంతో నాకు తెలిసి నువ్వు అడగలేదు నేనే వాలంటరీగా నీకు సపోర్ట్ చేశాను. ఒక ఆడపిల్ల విష్ కోసం నేను అలా నీ కోసం నిలబడ్డాను. నీకు నచ్చలేదంటే అప్పుడే చెప్పాల్సింది. దాదాపు మూడు గంటల పాటు శోభాశెట్టి, నేను ఫైట్ చేశాం. ఆ ఒక్క రీజన్ తో నేను రేస్ లో ఉండను అని నువ్వు చెప్పుంటే నేను అమర్ కి సపోర్ట్ చేసేవాడిని. ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా అని శివాజీ అన్నాడు. నచ్చలేదని కాదు.. ఇలాంటి పాయింట్ వచ్చినప్పుడు జనాలు ఆడింది కాకుండా ఇదే గుర్తుపెట్టుకుంటారని అర్జున్ అన్నాడు. దీంతో ఓకే వేసుకో నామినేషన్ అని శివాజీ చెప్పేశాడు. నామినేషన్ తర్వాత శివాజీ భోజనం చేస్తుండగా.. ప్రశాంత్  ఎమోషనల్ గా వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. దానికి ముందు.. " జీవితంలో ఫస్ట్ టైమ్ భళే జర్క్ తిన్నానే" అని శివాజీ అన్నాడు. నిన్నటి నామినేషన్ లో కూడా.. నేను అనవసరంగా నమ్మానురా అంటు అంబటి అర్జున్ ని శివాజీ అన్నాడు.  అర్జున్ చేసిన నామినేషన్ తో అతనిలోని కన్నింగ్ ప్రేక్షకులందరికి అర్థమైంది‌. గేమ్ బాగా ఆడతాడు. తప్పు చేయడని నమ్మిన శివాజీని వెన్నుపోటు పొడిచిన అంబటి అర్జున్ కి ఇది పెద్ద మైనస్ ‌అనే చెప్పాలి.   

డేంజర్ జోన్ లో శోభాశెట్టి, గౌతమ్, అర్జున్.. శివాజీ నెంబర్ వన్!

బిగ్ బాస్ సీజన్-7 లో పదమూడవ వారం నామినేషన్ ప్రక్రియలో ‌భాగంగా   కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగాయి. ఇందులో అందరితో పోలిస్తే గౌతమ్, అర్జున్, శోభాశెట్టిల నామినేషన్ సిల్లీగా అనిపించాయి.  పల్లవి ప్రశాంత్ ని శోభాశెట్టి సేఫ్ ప్లేయర్ అని నామినేట్ చేయడం చాలా సిల్లీ రీజన్ అని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే గత కొన్నివారాలుగా గౌతమ్ చేసే నామినేషన్ ఒకేవిధంగా ఉంటున్నాయి. ప్రతీసారీ రావడం ప్రశాంత్, శివాజీలని నామినేట్ చేయడం వెళ్ళిపోవడం ఇదంతా ఒక పగతీర్చుకుంటున్నట్టుగా కన్పిస్తుంది. అయితే అంబటి అర్జున్ చేస్తున్న ఇన్ ఫ్లూయన్స్ గౌతమ్ మీద గట్టిగానే ఉంది. అందుకే శివాజీ ఏం చేసిన, ఏం మాట్లాడిన అందులో తప్పు కోసం ఎదురు చూస్తూ తన ఆటని, తన స్ట్రాటజీని మర్చిపోయి హౌస్ లో వీక్ కంటెస్టెంట్ గా మిగిలిపోయాడు. దీంతో ఈ రోజు నమోదైన ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు. ప్రస్తుతం జరిగన ఓటింగ్ లో శోభాశెట్టి చివరి స్థానంలో ఉంది. ఓటింగ్ లో మొదటి స్థానంలో శివాజీ, రెండవ స్థానంలో ప్రశాంత్, మూడవ స్థానంలో యావర్ ఉండగా.. అంబటి అర్జున్, శోభాశెట్టి, గౌతమ్ ఈ ముగ్గురు లీస్ట్ లో ఉన్నారు. గత కొన్నివారాలుగా ఆడియన్స్ శోభాశెట్టిని ఎలిమినేట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. బిగ్ బాస్ తనకే ఫేవరిజం చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈసారి లీస్ట్ లో ఉన్న శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తాడా లేక అన్ ఫెయిర్ నామినేషన్ చేస్తున్న గౌతమ్, అర్జున్ లలో‌ఒకరు బయటకు వస్తారా తెలియాలంటే మరో అయిదు రోజులు ఆగాల్సిందే.  

అంబటి అర్జున్ కన్నింగ్ ప్లాన్.. శివాజీనే టార్గెట్!

బిగ్ బాస్ సీజన్-7 తుదిదశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఇక పన్నెండవ వారం రతిక, అశ్వినిశ్రీ ఇద్దరు ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక పదమూడవ వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర స్థాయిలో జరిగింది.  గతవారం వీకెండ్ లో.. చుక్క బ్యాచ్, మొక్క బ్యాచ్, తొక్క బ్యాచ్ అని నాగార్జున విభజించిన విషయం తెలిసిందే. ఇక దీన్నే సీరియస్ గా తీసుకొని ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్, యావర్ లని శోభాశెట్టి నామినేట్ చేసింది. శివాజీ, పల్లవి ప్రశాంత్ లని ప్రియాంక నామినేట్ చేసింది. శివాజీ, ప్రియాంకని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్ లని గౌతమ్ నామినేట్ చేశాడు. పల్లవి ప్రశాంత్, గౌతమ్ లని అమర్ దీప్ నామినేట్ చేశాడు.  అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలని శివాజీ నామినేట్ చేశాడు. " పన్నెండు వారాలు అయ్యిపోయాయి. ఇకనైన గ్రూపిజం, ఫేవరిజం వద్దు. ఫ్రెండ్స్ అయితే బయటకు పోయాక సపోర్ట్ చేసుకోండి. ఇకనైన ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడండి" అని ప్రియాంకని నామినేట్ చేశాడు అంబటి అర్జున్. "వారం మొత్తం గెలిచిన, మనవల్ల ఒక్క తప్పు జరిగిన అదంతా బయట వేరేలా కన్పిస్తుంది. పప్పీ కోసం మీరు నిలబడ్డారు కానీ అక్కడ ఇద్దరి సిచువేషన్ కంపేర్ చేస్తే బాగుండు. అలా జరుగుతుంద‌ని అనుకోలేదు " అని చెప్పి శివాజీని నామినేట్ చేశాడు అర్జున్. మొన్నటి గేమ్ లో అందరికన్నా సేఫ్ గా ఆడింది పల్లవి ప్రశాంత్ అని నాకు అనిపంచింది అందుకే నామినేట్ చేస్తున్నా అని శోభాశెట్టి అంది. శోభా.. యువర్ గేమ్ ఈజ్ ఫినిష్ అని బాత్ రూమ్ లో నా పేరు రాశావ్ అది నాకు నచ్చలేదని చెప్పి యావర్ ని  శోభాశెట్టి నామినేట్ చేసింది.  " తెలిసిన మిత్రుడి కంటే తెలియని శత్రువు బెటర్ అని ఆ రోజు నువ్వు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇక అనవరం. నేను నిన్ను ఇప్పటికి ఒక ఫ్రెంఢ్ గానే చూసాను. నువ్వు ఒక గేమర్ లా ఆలోచించావని ఇప్పుడే తెలిసింది. ఆ రోజు  అమర్ దీప్ కి శోభాశెట్టి సపోర్ట్ గా, నీకు నేను సపోర్ట్ గా ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు నువ్వు చెప్పినా నేను నీకు సపోర్ట్ చేసేవాడిని కాదు. అలా నువ్వు చేయలేదు. అది నీ స్ట్రాటజీ అని ఇప్పుడే తెలిసింది " అని చెప్పి అర్జున్ ని నామినేట్ చేశాడు శివాజీ‌.  

BiggBoss 7 Nominations : SPY వర్సెస్ SPA.. ఇది తీరని పగ!

బిగ్ బాస్ సీజన్-7 పూర్తి అవ్వడానికి మరికొన్ని వారాల ఉండటంతో ఆసక్తిగా మారుతుంది. అయితే ఇప్పటికే పన్నెండు వారాలు పూర్తిచేసుకుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ తో రతిక, అశ్వినిశ్రీ ఎలిమినేట్ అయ్యారు.‌ పదమూడవ వారం ఎమిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. వీరిమధ్య సోమవారం జరిగిన నామినేషన్ ల ప్రక్రియలో హీటెడ్  ఆర్గుమెంట్స్ జరిగాయి. ఈ వారం హౌస్ నుండి ఎవరిని బయటకు పంపించాలనుకుంటున్నారో తగిన కారణం చెప్పి వారికి రంగు పూయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ‌ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా... మొదట శోభాశెట్టిని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. వీఐపీ రూమ్ లోని బ్లాంకెట్ ని నువ్వు దోచుకున్నావ్. కానీ అక్కడ బ్లాంకెట్ లేక మేము చలిలో పడుకున్నామని శోభాశెట్టితో పల్లవి ప్రశాంత్ చెప్పి నామినేట్ చేశాడు. ప్రియాంక జైన్ ని పల్లవి ప్రశాంత్ రెండవ నామినేషన్ చేశాడు. మెన్నటి వారం టాస్క్ లో అందరు గేమ్ ఆడుతుంటే... మీరు శోభాకి క్లూ చెప్పేసి వీఐపీ బాత్ రూమ్ కి వెళ్ళమని చెప్పారు. మీరు కెప్టెన్ అయ్యి ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నాకు అది నచ్చలేదని నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత అమర్ దీప్ నామినేట్ చేయడానికి వచ్చి.. మొదటి నామినేషన్ గా పల్లవి ప్రశాంత్ ని, రెండవ నామినేషన్ గా గౌతమ్ ని చేశాడు. ఆ రోజు టాస్క్ లో నువ్వు శివాజీ అన్న చెప్పగానే స్టోర్ రూమ్ లోకి వెళ్ళావ్. ఆ తర్వాత మొక్క పోయింది దానివల్ల ఆ టాస్క్ లో నువ్వు తొందరగా డెడ్ అయ్యావ్.‌అలా కాకుంటే నీ గేమ్ ఇంకా ముందుకు వెళ్ళేదని నేను అనుకున్నాను. అదొక్కడే రీజన్ అని చెప్పి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు అమర్ దీప్. మొన్నటి కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు ముందు వెళ్ళినప్పుడు.. అర్జున్ ఫోటో వచ్చినప్పుడు తన ఫోటో కాల్చేస్తే ఆ తర్వాత నేను ఈజీగా గెలిచేవాడిని. కానీ నువ్వు అర్జున్ ను కాల్చకుండా చివరి వరకు తీసుకొచ్చావ్‌. నువ్వు నా గురించి స్టాండ్ తీసుకుంటే ఆ చివరి దాంట్లో అంత ఆర్గుమెంట్ జరిగేది కాదని అమర్ దీప్ అనగానే.. నాకు నీకంటే అర్జున్ అన్ననే కాస్త ఎక్కువ బెటర్ అనిపించింది. నీతో కంపేర్ చేస్తే అర్జున్ అన్న మీదే గ్రాట్రిట్యూడ్ ఎక్కువ. ఎందుకంటే నీ వల్ల నా గేమ్ ముందుకు వెళ్ళలేదు. అర్జున్ అన్న నాకు బాగా చెప్పాడు. అందుకే అర్జున్ అన్న వైపు ఉన్నానని గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు‌. ఇక అది నచ్చలేదని గౌతమ్ ని అమర్ దీప్  నామినేట్ చేశాడు.  

krishna Mukunda Murari : కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో అదిరిపోయే ట్విస్ట్.. 

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -325 లో..  కృష్ణని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచి ముకుంద, మురారీల పెళ్లి చేస్తున్నానని అనగానే.. కృష్ణ షాక్ అవుతుంది. ఇక అక్కడ ఉండలేక కృష్ణ తన ఇంటికి వస్తుంటే..  అప్పుడే కృష్ణ కోసం మురారి తన ఇంటికి వెళ్లి కృష్ణ గురించి అడుగుతుంటాడు. అప్పుడే బాధగా వస్తున్న కృష్ణని చూసి.. ఏమైంది మా పెద్దమ్మ నిన్ను ఎందుకు పిలిచిందంటు అడుగుతాడు మురారి. ఆ తర్వాత మీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి పిలిచిందని కృష్ణ చెప్పగానే.. మీరు అబద్ధం చెప్తున్నారని క్లియర్ గా అర్థం అవుతుంది. నేనే వెళ్లి అడుగుతానని మురారి అంటాడు. మరొకవైపు భవాని ఎలాగైనా పెళ్లి విషయం అర్థం అయ్యేలా మురారికి చెప్పాలని అనుకుంటుంది. వాని జీవితం కోసం రెండు మూడు అబద్ధాలు ఆడిన తప్పు లేదని భవాని అనుకుంటుంది. అప్పుడే భవాని దగ్గరికి రేవతి వచ్చి.. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో ఒకసారి అలోచించండని అనగానే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదంటూ మళ్ళీ కృష్ణ చేసిన తప్పుని గుర్తు చేస్తుంటుంది భవాని. అప్పుడే మురారి వచ్చి.. మీరు కృష్ణ ని ఏం అన్నారని అడుగుతాడు. మేం ఏం అనలేదని చెప్పగానే మరి నేను లేని టైమ్ లో తనని బ్రేక్ ఫాస్ట్ కి ఎందుకు పిలిచారని మురారి అడుగుతాడు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని మురారి అనగానే.. అవును దాస్తున్నాను. అది రెండు రోజుల తర్వాత చెప్తానని భవాని అంటుంది. మరొకవైపు మురారి కోపంగా వెళ్ళాడు. పెద్ద అత్తయ్యతో ఏమైనా గొడవ పడుతున్నడెమో అనుకొని కృష్ణ కంగారుపడుతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి మురారి వచ్చి. పెద్దమ్మ ఏం చెప్పలేదు. రెండు రోజుల తర్వాత చెప్తానని చెప్పిందని కృష్ణకి చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత కృష్ణకి మురారి టిఫిన్ తినిపిస్తాడు. మరొకవైపు కృష్ణ జీవితం అలా అయిపోతుందని నందు ఏడుస్తుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇంట్లో అందరిని ఎదురించి మన పెళ్లి చేసిందని నందు అనగానే.. మనం ఇక్కడే ఉండి కృష్ణ, మురారీలని కలపాలని గౌతమ్ అంటాడు. మరొక వైపు మురారి జీవితం గురించి రేవతి బాధపడుతుంటే, తనకి కోపం వచ్చేలా ముకుంద మాట్లాడుతుంది. అన్ని పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలు పెట్టండని ముకుంద చెప్పగానే రేవతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Guppedantha Manasu :  చిత్రని కాపాడిన‌ రిషి.. షాక్ లో  దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -931 లో.. వసుధారని బెయిల్ మీద అనుపమ విడిపిస్తుంది. ఆ తర్వాత వసుధార ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతుంటే.. నువ్వేం తప్పు చెయ్యలేదు. ఎందుకు బాధపడుతున్నావ్? నువ్వు తప్పు చేసావని మేం అనుకుంటున్నామని నువ్వు టెన్షన్ పడుతున్నావా? అలా ఏం కాదు. నువ్వు ఎప్పటికి తప్పు చెయ్యవ్. ఒకసారి నువ్వు తప్పు చేసావని పొరపాటు పడితే నీ దానికి శిక్ష అనుభవించానని రిషి అంటాడు. నేను తప్పు చేసానని కాదు సర్.. నా వల్ల DBST కాలేజీ పేరు ఇప్పుడు మీడియాలో వచ్చింది. అందుకే అని వసుధార అనగానే.. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పని వసుధారని రిషి అడుగుతాడు. ఆరోజు రాత్రి చిత్ర మెసేజ్ చెయ్యడంతో ఏదో ప్రాబ్లమ్ లో ఉందని వెళ్ళాను కానీ ఆ మెసేజ్ చిత్ర చెయ్యలేదు. తనని ప్రేమించమని వెంటపడుతున్న అబ్బాయి చేసాడని అక్కడ జరిగిందంత రిషికి చెప్తుంది వసుధార. మీకు జరిగింది చెప్తుండగా అప్పుడే ఇలా జరిగిందని మీకు ఫోన్ వచ్చిందని వసుధార చెప్తుంది. దీని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కనిపెడుతానని రిషి అంటాడు. మరొకవైపు శైలేంద్రతో ఫొన్ మాట్లాడుతుంది దేవయాని. నేను అక్కడ లేకున్న నాపై డౌట్ రాకుండా పని పూర్తి చేశానని దేవయానికి శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి రాత్రి ఇంట్లో లేకపోయేసరికి.. వసుధార కంగారుగా మహేంద్ర దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఏం కంగారు పడకు. రిషి వెళ్లిన పని పూర్తి చేసుకొని వస్తాడని మహేంద్ర చెప్తాడు. మరొకవైపు చిత్రని ప్రేమించిన అబ్బాయి రౌడీలని తీసుకొని చిత్రని చంపెయ్యాలని వస్తారు కానీ రిషి చిత్ర ప్లేస్ లో పిల్లోలు పెట్టి ఉంచుతాడు. అప్పుడే రౌడీలు చిత్ర అనుకొని కత్తితో పొడుస్తుంటారు. రిషి వచ్చి.. నాకు నీ మీద ముందే డౌట్ వచ్చింది అంటుంది. చిత్రని ప్రేమించిన అబ్బాయిని రిషి అంటాడు. ఆలోగా వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. రిషి వాళ్ళ వెనకాల వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు, చిత్ర పేరెంట్స్ కలిసి.. చిత్ర కన్పించడం లేదు.. నువ్వే కిడ్నాప్ చేసావంటూ నిలదీస్తారు. మరొకవైపు దేవయాని ఏర్పాటు చేసిన మనిషి ద్వారా అక్కడ జరిగేదంత వీడియో కాల్ లో చూస్తుంటుంది. ఆ తర్వాత చిత్ర ఎక్కడ ఉందని వాళ్ళ పేరెంట్స్ అడుగగా.. ఉంది చూపిస్తానని రిషి చిత్రని తీసుకొని రమ్మని మహేంద్రకి చెప్పగానే చిత్రని తీసుకొని వస్తాడు మహేంద్ర. అందరు షాక్ అవుతారు. ఆ  తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో అదిరిపోయే ట్విస్ట్.. వాళ్ళిద్దరిపై అనుమానం!    

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -264 లో... కావ్య గదిలోకీ రాగానే .. " ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు " అని రాజ్ చిరాకుగా అంటాడు. కాసేపటికి రాజ్  కోపంగా మీ అక్క తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడేసరికి.. మా అక్క శీలంపై అనుమానిస్తున్నారు శీలాన్ని ఎలా నిరూపించుకుంటారని కావ్య అంటుంది. ఆ తర్వాత నా అక్క తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను. ఒక ఆడది ఒక మగాడికి సులువుగా లొంగుతుందనే  నీ  లాంటి పురుషుడికి గుణపాఠం చెప్తాను. ఇది ఒక స్త్రీ, పురుషుడికి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధమని రాజ్ కి కావ్య సవాలు విసిరి వెళ్ళిపోతుంది. మరొకవైపు రాహుల్ అన్న మాటలు స్వప్న గుర్తుకు చేసుకొని బాధపడుతుంటుంది. అప్పుడే రాహుల్ వచ్చి.. మళ్ళీ స్వప్న తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడేసరికి స్వప్నకి కోపం వచ్చి.. ఇందాక అందరి ముందు చెంప దెబ్బ కొట్టిన సరిపోలేదా అని అనగానే.. రాహుల్ కీ కోపం వచ్చి నా కళ్ల ముందు కనిపించకని అనగానే రాహుల్ ని గదిలో నుండి బయటకు నెట్టివేసి డోర్ వేస్తుంది. ఎవరు చూడలేదు కదా అంటూ రాహుల్ అనుకుంటాడు. మరొక వైపు అప్పు తన తండ్రి అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే కనకం వచ్చి మీ నాన్న చెప్పింది చెయ్యడం  కరెక్ట్ అనిపిస్తుందని అంటుంది. ఆ తర్వాత అప్పు నేను ప్రేమించినట్లు, వాడు నన్ను ఎందుకు ప్రేమించలేదు. తిడితే పడ్డాడు. నా ప్రతి విషయంలో వాడు ఉన్నాడు. వాడికి నన్ను ప్రేమించాలని ఎందుకు అనిపించలేదు. ఆ అనామికతో క్లోజ్ గా ఉంటే నేను చూడాలేకపోతున్నానని అప్పు ఎమోషనల్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం రాజ్ నిద్రలేవగానే.. నన్ను ఆశీర్వదించండి. మా అక్క తప్పు లేదని నిరూపణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. రాజ్ ఆశీర్వదించే వరకు రాజ్ ని ఆటపట్టిస్తుంది. మరొకవైపు అప్పుని టిఫిన్ చెయ్మమని అన్నపుర్ణ పిలుస్తుంది. ఇంత విషం పెట్టు అని అప్పు కోపంగా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పు విషయంలో ఏదైనా సలహా ఇవ్వు అక్క అని కనకం అన్నపుడు.. ఏం సలహా నువ్వు ఏది చేసిన ఆ ఇంట్లో ఇద్దరు కూతుళ్లకి ఇబ్బంది అని అన్నపుర్ణ చెప్తుంది. తరువాయి భాగంలో.. నాకు అంత హెల్ప్ చేసినవాడు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తాడని ఎలా అనుకుంటానని స్వప్న అనగానే.. అరుణ్ వెనకాల ఉండి ఇదంతా ఎవరో చేయిస్తున్నారా అని కావ్యకి డౌట్ వస్తుంది. మా అక్క అరుణ్ కి డబ్బులు ఇస్తున్నప్పుడు తీసిన ఫోటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయని రాహుల్, రుద్రాణి ఇద్దరిని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై దాడి.. మరీ ఇంత దారుణమా!

బిగ్ బాస్ అనేది ఒక షో అయినప్పటికీ దానిని కొందరు సీరియస్ గా తీసుకుంటారు. కంటెస్టెంట్స్ గెలుపుని తమ గెలుపులా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎలిమినేట్ అయితే బాధపడతారు. ఇంకా కొందరైతే కంటెస్టెంట్స్ కి మద్దతుగా ర్యాలీలు కూడా చేస్తారు. అయితే ఇలాంటివన్నీ తెలుగు బిగ్ బాస్ విషయంలో చూశాం. కానీ తమిళ బిగ్ బాస్ ఇంతకు మించి అనేలా ఉంది. తమ అభిమాన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే తమిళ నటి వనితా విజయ కుమార్ గతంలో బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న తమిళ బిగ్ బాస్ సీజన్-7 లో ఆమె కుమార్తె జోవిక కంటెస్టెంట్ గా ఉంది. అయితే ఇదే సీజన్ లో కంటెస్టెంట్ అయిన ప్రదీప్ ఆంటోనీ బిహేవియర్ పై జోవికతో పాటు ఇతర ఫిమేల్ కంటెస్టెంట్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ప్రదీప్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేశారు. దీనిపై ప్రదీప్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వనితపై దాడి జరిగింది. తమిళ బిగ్ బాస్-7 గురించి యూట్యూబ్ వేదికగా రివ్యూలు ఇస్తోంది వనిత. అయితే ఆమె రివ్యూలు ప్రదీప్ కి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహించిన ఓ వ్యక్తి వనితపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ముఖ్యంగా కంటి దగ్గర తీవ్ర గాయమైంది. ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన వనిత.. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో మాత్రమే అని, ఇలాంటి దాదాలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది.

Rathika Remuneration: రతిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

బిగ్ బాస్ సీజన్-7 లో లవ్ ట్రాక్ నడిపిన వారిలో రతిక ఒకరు. మొదట పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపిన రతిక,ఆ తర్వాత యావర్ తో కొనసాగించింది. రతిక ఎలిమినేషన్ తో యావర్ కాస్త నిరాశ చెందినట్టు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ని  రతిక కోసం వాడనని , పద్నాలుగవ వారం వాడుతానని నిన్న నాగార్జున అడిగినప్పుడు చెప్పాడు. ఇక రతికని బిగ్ బాస్ యాక్టివిటి ఏరియాకి పిలిచి.. " ఉడతా ఉడతా ఊచ్  ఎక్కడికెళ్ళావోచ్ " అనే  పాటని చాలాసార్లు ప్లే చేసి వినిపించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ పాటని విన్న రతికకి.. ఇందులో ఉడతలు ఎన్ని ఉన్నాయని ఒకే ఒక క్వశ్చన్ వేయగా.. సరిగ్గా లెక్క చేసి చెప్పింది రతిక. దీంతో రతిక సో ఇంటలిజెంట్.. ఈ సీజన్-7 టాప్-5 లో ఉంటుందని అనుకున్నారంతా కానీ ఆ తర్వాత రతిక ఏ టాస్క్ లోను అంతగా రాణించలేకపోయింది. మొన్నటి డైస్ గేమ్ లో క్యూబ్స్ ని సెట్ చేసే టాస్క్ లో రతిక ఆలోచించే టైమ్ లోనే పల్లవి ప్రశాంత్ తన ఆటని ముగించాడు‌. ప్రతీదానికి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల తన గేమ్ లో వెనుకపడిపోయేది. ఇక టాస్క్ లో అనవసరపు కారణాలకు గాను తోటి హౌస్ మేట్స్ తో గొడవ పడుతుండేది రతిక. మొదట ఎలిమినేషన్ అయి బయటకు వచ్చిన రతికను ప్రేక్షకులు బాగా ట్రోల్స్ చేసారు.‌ ఇక గ్రాంఢ్ లాంచ్ 2.0 తర్వాత వారం స్పెషల్ ఎంట్రీగా వచ్చి‌న రతిక ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది. గతవారం జరిగిన నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ చాలా సిల్లీగా అనిపించింది. ఇక అమర్ దీప్ తో గొడవకి దిగడం అందులో అంత ఇంపార్టెంట్ అనిపించేదేది లేవడంతో తను కంటెంట్ కోసమే ఇదంతా చేస్తుందని తెలుస్తుంది. రోజుకి 28 వేల చొప్పున వారానికి 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. మొత్తం తొమ్మిది వారాలకి గాను 18 లక్షల వరకు  రతిక రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పన్నెండవ డబుల్ ఎలిమినేషన్ లో అశ్వినిశ్రీ తర్వాత రతిక ఎలిమినేట్ అయింది.  ఇక హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు.