దగ్గుపాటికి...వివాదాలు పరిపాటి?
Publish Date:Jan 14, 2026
పండగ పూట నారా వారి కుటుంబమంతా నారావారి పల్లెలో సంబరాల్లో మునిగి తేలుతుంటే.. అనంత ఎమ్మెల్యే వివాదం ఒకటి పండగ స్పెషల్ గా తెరపైకి వచ్చింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాన్రాను వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా ఆయనపై ఒకే సారి రెండు ఆరోపణలు. ఒకటి నంబూరి వైన్స్ యజమానిని డబ్బు కోసం పలు మార్లు ఫోన్లు చేసి బెదిరించడం మాత్రమే కాకుండా.. ఆయన వైన్స్ ని కూడా తగలబెట్టించారు.
నంబూరి నలభై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియర్ కార్యకర్తగా కొనసాగుతున్నారు. తనలాంటి టీడీపీ వారి మీదే దగ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధారణ మైన వారి పరిస్థితి ఏంటన్నది ఆయన ప్రశ్నిస్తున్న విధం. ఇక ఇదే దగ్గుపాటి పై రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ అయిన స్వప్న అనే మహిళ తన భూమి కబ్జా చేసినట్టుగా ఆరోపణలు చేశారు.
అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో దగ్గుపాటి మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అనవసరంగా రెచ్చగొట్టిన ఆరోపణలున్నాయి. ఆ ఆడియో కాల్ తో సహా బయట పడి నానా రభస కింద తయారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చరించారు కూడా. అయినా సరే దగ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక పరిపాటిగా మారింది. ఇప్పటికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేలతో అధిష్టానానికి తల బొప్పి కడుతోంది.
తాజాగా దగ్గుపాటి కూడా తయారయ్యారు. అయితే ఇవన్నీ ఆధారాలుండి బయట పడ్డ ఎమ్మెల్యే బాగోతాలనీ. ఇదే రాయలసీమలో ఒక కూటమి ఎంపీని కూటమి ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్రమంతా పాకింది. వీరే కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలను సాక్షాత్ చంద్రబాబే పిలిచి వార్నింగిచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వరకూ ఉన్నట్టు కొన్ని అంచనాలున్నాయి. కాబట్టి.. అధినేత చంద్రబాబు వీరందరిపై క్రమశిక్షణ చర్యలు తీస్కోకుంటే కష్టమేనని తెలుస్తోంది.
ఈటల వర్సెస్ మర్రి.. తెలంగాణలోనూ క్రెడిట్ వార్
Publish Date:Jan 13, 2026
స్కిల్ కేసు కొట్టివేత
Publish Date:Jan 13, 2026
కేసీఆర్ శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. విమర్శల దాడి పెంచిన సీఎం రేవంత్
Publish Date:Jan 13, 2026
మేడారంలో రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే?
Publish Date:Jan 13, 2026
తమిళనాట కొత్త పొత్తు పొడుపు?
Publish Date:Jan 14, 2026
జననాయకన్ సినిమా విడుదల, కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. ఇలా తమిళనటుడు, టీవీకే అధినేత విజయ్ ను కష్టాలు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా వెంటాడుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు చేసి, ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమౌతున్న వేళ విజయ్ ను నాన్ స్టాప్ గా కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విషయం కోర్టు మెట్లెక్కింది. దానికి తోడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది.
అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు. తమిళనాట ఇసుమంతైనా స్టేక్ లేని బీజేపీ విజయ్ తో పొత్తు ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా విజయ్ ను చక్రvgధంలో ఇరికిస్తోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇక విజయ్ కు కమలంలో దోస్తీకి సై అనక తప్పదన్న విశ్లేషణలూ వెలువెడ్డాయి. అయితే అనూహ్యంగా విజయ్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ మద్ద తుగా నిలిచారు. విజయ్ పై వేధింపులకు పాల్పడ్డం అది తమిళ సంప్రదాయాలను భంగప రచడమే అవుతుందని రాహుల్ విమర్శించారు.
దీంతో విజయ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపొడుపునకు అవకాశాలున్నాయా అన్న చర్చకు తెరలేచింది. ఇప్పటికే విజయ్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగానే రంగంలోకి దిగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమకు డీఎంకేతో స్థానిక రాజకీయ విబేధాలుంటే, కేంద్రంలోని బీజేపీతో సైద్ధాంతిక విబేధాలున్నాయని చెప్పారు. ఇప్పటి వరకూ డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్ సడెన్ గా విజయ్ కి మద్దతుగా గళం విప్పడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట కొత్త పొత్తు పొడుపునకు ఇది సంకేతమా అన్న చర్చా జోరుగా సాగుతోంది.
తొలి నాళ్లలో తమిళనాట కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నా.. ఆ తర్వాత డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో ఈ రెండు పార్టీలే ఇక్కడ అధికారం పాల్పంచుకుంటూ వస్తున్నాయి. కేసీఆర్ లాంటి వారికి ఈ డీఎంకే అన్నాడీఎంకే పాలసీ ఎంతో ఇష్టం. తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ కూడా ఇలాగే రెండుగా చీలి.. ఇక్కడ అధికారం ఎవరో ఒకరు పాల్పంచుకోవాలని ఆశిస్తారాయన.
అంతగా తమిళనాట స్థానిక రాజకీయాలు గత కొన్నేళ్లుగా పాతుకుపోయాయి. ఇప్పుడు డీఎంకే తర్వాతి తరానికి కూడా బలంగా కనిపిస్తున్నా అన్నాడీఏంకేకి జయలలిత తర్వాత ఒక దిక్కంటూ లేక పోయింది. శశికళ రూపంలో బలమైన నాయకురాలు ఉన్నా.. మోడీ కారణంగా ఆమె అన్నాడీఎంకేకీ ఏమీ కాకుండా పోయారు. ఈ స్థానంలో ఇక్కడ బీజేపీ పాతుకుపోవాలని తెగ ప్రయత్నిస్తుంటే మధ్యలో తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్. టీవీకే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ అంటే బీజేపీకి ఆగ్రహం. దానికి తోడు విజయ్ కూడా మెర్సల్ వంటి సినిమాల ద్వారా బీజేపీ వ్యతిరేక వాణి వినిపించిన పరిస్థితి గతంలో ఉంది.
వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే పోటీ చేయనుండటం.. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని విజయ్ ప్రకటించడంతో.. ఆయనను వీలైనంతగా తమ దారిలోకి తెచ్చుకోడానికి బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిని విజయ్ ఎలా ప్రతిఘటిస్తారు? రాహుల్ విజయ్ కు మద్దతుగా గళం విప్పడం వెనుక కారణమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది? తేలాల్సి ఉంది.
జేపీ, లక్ష్మీనారాయణ బాటలో ఏబీవీ!
Publish Date:Jan 13, 2026
తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే!
Publish Date:Jan 11, 2026
అమరావతి విషయంలో...జగనాసురుడి అసలు స్కెచ్ అదేనా?
Publish Date:Jan 11, 2026
చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ
Publish Date:Jan 10, 2026
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
కొత్త ఏడాదిలో అతిగొప్ప సంకల్పం.. మీరు బాగుండాలంటే ఇది చేయండి..!
Publish Date:Jan 13, 2026
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు, తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఎవరికి వారు బాగుండాలంటే దానికి కావాల్సింది తమ చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం లేదా వారు అర్థం చేసుకోవడం కాదు. ప్రతి వ్యక్తి తాము మారితేనే తమ జీవితం బాగుంటుందని అంటున్నారు లైప్ స్టైల్ నిపుణులు. కొత్త సంవత్సరంలో చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే దానికోసం మొదటగా ప్రతి ఒక్కరు తనకు తాను మారాలి అనే సంకల్పం చేసుకుంటే అదే గొప్ప మలుపు అవుతుంది. ఇది ఎందుకు మేలు చేస్తుంది? దీని కోసం ఏం చేయాలి? అనే విషయం తెలుసుకుంటే..
అహంకారం.. దూరం..
కుటుంబం అయినా, స్నేహం అయినా లేదా ఆఫీసు అయినా మనిషిలో ఉండే అహం సంబంధాలలో చీలికకు అతిపెద్ద కారణం అవుతుంది. చాలా సార్లు అవతలి వ్యక్తి సరైన విషయం చెబుతున్నా అది వినే వారి అహాన్ని దెబ్బతీస్తుంది. అందుకే అది నిజమైనా, అది మంచి విషయం అయినా దాన్ని అస్సలు అంగీకరించరు. ఈ చిన్న ఇగో కాస్తా క్రమంగా విభేదాలకు, దూరానికి కారణమవుతుంది. కొంతమంది ఎప్పుడూ తాము ఇతరులకన్నా గొప్పవారిగా భావిస్తారు. వారి మాటలే ఫైనల్ అంటుంటారు. అలాంటి మనస్తత్వం రిలేషన్స్ లో చేదు అనుభవాలను తెస్తుంది. బంధాలు కొనసాగాలి అంటే అహాన్ని పక్కన పెట్టడం, అవతలి వ్యక్తి స్థానాన్ని అర్థం చేసుకోవడం, చిన్న విషయాలను విస్మరించడం చాలా ముఖ్యం. ఈ చిన్న మార్పు పెద్ద వివాదాలను నిరోధించగలుగుతుంది.
ఇతరులను మార్చకండి..
రిలేషన్స్ లో అయినా ఇతర విషయాలలో అయినా చాలా మంది తమ సమయాన్ని, శక్తిని ఎదుటి వ్యక్తిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతారు. కానీ నిజం ఏమిటంటే ఇతరుల స్వభావాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మనం ఇతరులను మార్చడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తామో, అంతగా నిరాశ చెందుతాము. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఉండేవారు సమస్యలకు సులభంగా పరిష్కారాలను కనుగొంటారు. చాలా పాజిటివ్ గా, సంతోషంగా ఉన్న వ్యక్తులు ఒత్తిడి, నిరాశ, అధిక రక్తపోటు, ఆందోళన వంటి సమస్యలను రాకుండా చూసుకోగలుగుతారు. అందుకే ఇతరులను మార్చడం కంటే మనలో మార్పు కోసం కృషి చేయడం తెలివైన పని.
పాజిటివ్ గా ఉండాలి..
ఏ సంబంధం కూడా పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. మనం ఇతరుల కోణం నుండి విషయాలను అర్థం చేసుకోకపోతే చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. అంచనాలు ఉన్నప్పుడు ఇతరులలో తప్పులను వెతకుతుంటాము. ఇది అసంతృప్తికి గురిచేయడమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో.. అప్పుడు పరిస్థితులు కూడా పాజిటివ్ గా కనిపిస్తాయి. మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.
ఆత్మ పరిశీలన..
ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు.. అలాగే ఎవరూ అన్ని విషయాలలో కరెక్ట్ గా ఉండరు. మన బలహీనతలు, తప్పులు, తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. మొదట మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడం, మన లోపాలను అంగీకరించడం చాలా అవసరం. మన మనస్సును, తెలివితేటలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. మనం మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుంటే మన తప్పులను అంగీకరించడం సులభం అవుతుంది. ఎవరికి వారు మారితే ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది. జీవితాన్ని మరింత సమతుల్యంగా చేస్తుంది. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మనస్సు, సంబంధాల మధ్య సామరస్యం, మనలో సానుకూల మార్పులు చేసుకోవడం.. ఇవన్నీ సంతోషకరమైన జీవితానికి మొదటి అడుగు అవుతాయి.
కాబట్టి జీవితం బాగుండాలంటే.. ఎవరి జీవితం వారికి బాగుండాలంటే పైన చెప్పుకున్న మార్పులు వచ్చే విధంగా కొత్త ఏడాదిలో ఒక లక్ష్యం పెట్టుకుని వాటికి అనుగుణంగా మారాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు.
*రూపశ్రీ.
మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!
Publish Date:Jan 12, 2026
దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!
Publish Date:Jan 10, 2026
హెల్త్‌కు సైకిల్‌తో హైఫై కొట్టండి!
Publish Date:Jan 9, 2026
టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?
Publish Date:Jan 8, 2026
చదువుకీ గుండెపోటుకీ సంబంధం ఉంది!
Publish Date:Jan 13, 2026
బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది! అని చెబుతుంటారు తల్లిదండ్రులు. మంచిగా చదువుకుంటే నలుగురూ గౌరవిస్తారు అని హెచ్చరిస్తుంటారు శ్రేయోభిలాషులు. చదువుకుంటే విచక్షణ, విజ్ఞానం అలవడతాయి అని ఊరిస్తుంటారు పెద్దలు. కానీ బాగా చదువుకోండి నాయనా, మీకు గుండెపోటు రాకుండా ఉంటుంది అని చెబుతున్నారు పరిశోధకులు.
భారీ పరిశోధన
ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశమే కావచ్చు. కానీ అక్కడ గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. అక్కడ ప్రతి 27 నిమిషాలకీ ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. పరిస్థితి ఇలా అదుపు తప్పిపోవడంతో, గుండె ఆరోగ్యానికి సంబంధించి అక్కడ ఓ భారీ పరిశోధన మొదలైంది. ఇందులో భాగంగా 2,67,153 మంది ఆరోగ్యాలను పరిశోధకులు గమనించారు. వీరంతా కూడా 45 నుంచి 64 ఏళ్ల వయసువారే!
డిగ్రీ - గుండెపోటు
డిగ్రీ చదివినవారితో పోలిస్తే, హైస్కూలుతో చదువుని ఆపేసినవారు గుండెపోటుకి లోనయ్యే ప్రమాదం ఎక్కువని పరిశోధనలో తేలింది. వీరు గుండెపోటుకి లోనయ్యే అవకాశం, ఏకంగా 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఇక ఇంటర్మీడియట్ చదువుని ముగించినవారేమో దాదాపు 70 శాతం ఎక్కువగా గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు.
ఇవీ విశ్లేషణలు
చదువుకీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా తేలిపోవడంతో... అందుకు కారణం ఏమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటంతో పోషకాహారాన్ని, మెరుగైన వైద్యాన్ని స్వీకరించే అవకాశం ఉంది. ఇక చదువు వల్ల ఆరోగ్యపు అలవాట్ల మీద, రకరకాల వ్యాధుల మీదా ఓ అవగాహన ఏర్పడే సౌలభ్యం ఎలాగూ ఉంటుంది.
ప్రయోగం వల్ల ఉపయోగం
ఈ పరిశోధన ద్వారా చిన్నిపిల్లలకైతే ‘బాగా చదువుకోండిరా బాబూ! మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయట’ అని చెప్పగలం. కానీ ఓ నలభై ఏళ్లు దాటినవారికి ఏం చెప్పాలి. అందుకనే ఈ పరిశోధన లక్ష్యం చదువు ఆవశ్యకత గురించి చెప్పడమే కాదు. చదువుకోనివారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువని తేలితే... వారిలో తగిన అవగాహననీ, వైద్య సదుపాయాలనీ కల్పించే ప్రయత్నం చేయడం.
- నిర్జర.
చలికాలంలో నువ్వులు, అవిసె గింజలు తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!
Publish Date:Jan 12, 2026
సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!
Publish Date:Jan 10, 2026
ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం!
Publish Date:Jan 9, 2026
బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఈ మిస్టేక్స్ చేశారంటే మీ బాడీ డ్యామేజ్ ని ఎవరూ ఆపలేరు..!
Publish Date:Jan 8, 2026