Brahmamudi : రాజ్ కి నిజం తెలిసేలా చేసిన అపర్ణ.. భార్యని ఎత్తుకున్నాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -540 లో.....ఇందిరాదేవి, అపర్ణలు కనకం ఇంట్లో వంట చేస్తుంటే.. అప్పుడే కనకం వచ్చి‌‌.. మీరేంటి వంట చేస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి అని కనకం అంటుంది. నువ్వు క్యాన్సర్ అని యాక్టింగ్ చేస్తున్నావ్ మర్చిపోయావా అని అపర్ణ అంటుంది. అవును కదా అని మళ్ళీ దగ్గుతు ఉంటుంది. నీ యాక్టింగ్ మీ అల్లుడు ముందు చూపించమని అపర్ణ అనగానే.. అల్లుడు గారిని నమ్మిస్తానని కనకం అంటుంది. ఆ తర్వాత కనకం రెడ్ కలర్ బాటిల్ కోసం వెతుకుంటూ ఉంటే.. అప్పుడే రాజ్ వచ్చి అత్తయ్య గారు వచ్చి మిమ్మల్ని ఒకటి అడగాలని అంటాడు. మీ ప్రాబ్లమ్ డాక్టర్ కి చెప్పాను.. ఒకసారి రిపోర్ట్స్ పంపమన్నారు.. మీరు రిపోర్ట్స్ ఇవ్వండి అని రాజ్ అడుగుతాడు. నా దగ్గర రిపోర్ట్స్ ఎక్కడున్నాయని కనకం అనుకొని డైవర్ట్ చేస్తుంది. ఈ రోజు నాకు సంతోషంగా ఉంది మళ్ళీ ఈ రోజు వస్తుందో రాదో.. ఈ ఒక్కరోజు ఆగండి.. రేపు మీరేం అడిగినా ఇస్తాను.. డైరెక్ట్ నేనే వస్తానని కనకం అనగానే.. అవును ఈ రోజు అవన్నీ అని చెప్పి సంతోషంగా ఉండే రోజు డిస్టబ్ వద్దని రాజ్ అంటాడు. ఆ తర్వాత కనకం వస్తుంటే.. కావ్య ఎదురుపడి.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్? ఎప్పుడు రానీవాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి చేస్తున్నారని అడుగుతుంది. అప్పుడే అపర్ణ, ఇందిరదేవి లు వస్తారు. చేసింది కనకం కాదు నేనే ఈ పెళ్లి రోజు ద్వారా అయిన ఒకటి అవుతారని ఇలా చేసానని అపర్ణ అనగానే.. అయన మారారు అని కావ్య అంటుంది. రాజ్ మనసులో నువ్వున్నావ్.. ముందు రాజ్ కి ఇప్పటి రాజ్ కి తేడా గమనించలేదా అని అపర్ణ అనగానే.. అదంతా మీ కోసం చేసానని చెప్పారు కదా అని కావ్య వాదిస్తుంది. ఆ తర్వాత కావ్య వెళ్ళిపోయాక.. అసలు వీళ్ళు ఎలా ఒకటి అవ్వాలని కనకం ఇందిరదేవిలు అంటారు. నేనొక ప్లాన్ వేసాను.. ఏ విషయంలో కావ్యని అపార్థం చేసుకున్నాడు.. సేమ్ అలాగే ఇప్పుడు రాజ్ కి మేనేజర్ ద్వారా కాల్ చేయించి ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పిస్తాను అక్కడికి వెళ్ళాక అదంతా ఫేక్ అని తెలుస్తుంది. అప్పుడు కావ్య కి కూడా ఇలా జరుగిందని చూపొచ్చని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజ్ కి మేనేజర్ ఫోన్ చేసి.. ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుంది రమ్మని చెప్తాడు. రాజ్ వెంటనే వెళ్తాడు. అపర్ణ మేనేజర్ కి ఫోన్ చేసి రాజ్ వస్తుండు.. నేను చెయ్యలేదని చెప్పమని చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణి దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. అసలు ఎందుకు రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడని మాట్లాడుకుంటారు. అప్పుడే కళ్యాణ్, అప్పులు ఇంటికి వస్తారు. కళ్యాణ్ తో ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. అప్పుని తిడుతుంది. తరువాయి భాగంలో కావ్య కూడా ఇలాగే చేసిందని రాజ్ చేసినా తప్పుని అపర్ణ గుర్తుచేస్తుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ ఎత్తుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అటు అత్త ప్లాన్.. ఇటు భర్త మాజీ లవర్ కొత్త స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -226 లో... సీతాకాంత్ ముందు నందిని నటిస్తుంది. ఇక నిన్ను బాధపెట్టనని నందిని వెళ్లిపోతుంటే సీతాకాంత్ త‌న చెయ్యి పట్టుకొని ఆపుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదు.. ఇక్కడే ఉండు కలిసి వర్క్ చేద్దాం.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఇక మనం బిసినెస్ పార్టనర్స్ కాకుండా మంచి ఫ్రెండ్స్ కూడా అని సీతాకాంత్ అనగానే.. వద్దు సీతా మళ్ళీ ఏదైనా జరిగితే నన్ను అనుమానిస్తావని నందిని అంటుంది. అలాంటిదేం లేదని సీతాకాంత్ అంటాడు. దాంతో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. పానీగ్రహం అయింది ఇక పెళ్లి ఒకటే మిగిలి ఉందని నందిని తన మనసులో అనుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్ ఫొటోస్ చూస్తు ఉంటుంది రామలక్ష్మి. సీతాకాంత్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కట్ చేస్తుంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఓ ఎంప్లాయిని పిలిచి.. ఈ ఫైల్ లో ఏంటి ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయంటూ తిడతాడు. అప్పుడే మేనేజర్ వచ్చి.. మీకు చెప్పడం మర్చిపోయాను సర్ ఆల్రెడీ రామలక్ష్మి మేడమ్ మిస్టేక్స్ లేకుండా ఫైల్ ప్రిపేర్ చేసి పంపించింది.. మేడమ్ చాలా గ్రేట్ మీకు మాట రాకుండా చూస్తుందని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒక వీడియో పంపిస్తుంది. సీతాకాంత్ కాల్ చేసి లోపల ప్రేమ ఉన్నా బయటకు కోపంగా మాట్లాడుతాడు. భోజనం తీసుకొని రా అని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ మా అయన లంచ్ తీసుకొని రమ్మన్నాడని శ్రీవల్లి, శ్రీలతలకి చెప్తుంది. చూసారా అత్తయ్య బావగారు లంచ్ తీసుకొని రమ్మన్నాడంట అని శ్రీవల్లి అనగానే.. అది తీసుకొని వెళ్లకుండా నేను ప్లాన్ చేస్తానుగా అని శ్రీలత అంటుంది. ఆ తర్వాత డాక్టర్ ఇంటికి వస్తుంది. రామలక్ష్మి దగ్గరికి వచ్చి సీతాకాంత్ కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ ఇచ్చి ఒక విషయం చెప్పాలి.. నువ్వు సీతాకాంత్ కి కొన్ని రోజులు దూరం ఉండాలి. నువ్వు పొరపాటు నా దగ్గర అయిన ఆయనకి ప్రాబ్లమ్.. ఈ విషయం అతనికి చెప్పొద్దనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. డాక్టర్ వెళ్లిపోతు శ్రీలతకి సక్సెస్ అంటు సైగ చేసి వెళ్తుంది. ఆ తర్వాత శ్రీలత నందినికి ఫోన్ చేసి ఇలా ప్లాన్ చేసానని చెప్తుంది. గుడ్ నేను కూడా ఇక్కడ సీతాని నా వైపుకి తిప్పుకోవాలని ట్రై చేస్తున్నానని నందిని అంటుంది. ఆ తర్వాత నందిని సీతకాంత్ దగ్గరికి భోజనం తీసుకొని వెళ్లి.. కలిసి తిందామని అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కార్తీక దీపంలో కొత్త హీరో.. దీపని తిట్టేసిన జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -175 లో... కాంచన, కార్తీక్‌ల ముందు జ్యోత్స్న.. తాళి పట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడే ఈ క్షణమే తాళి కడతావా లేక.. చావమంటావా అంటు  జ్యోత్స్న విషం బాటిల్ తియ్యడంతో.. బిత్తరపోతారు తల్లీకొడుకులు. ఈ క్రమంలోనే.. జ్యోత్స్న ఏంటి ఈ పిచ్చి పని అంటూ కాంచన.. కార్తీక్ తిడుతున్నా.. జ్యోత్స్న మాత్రం విషం బాటిల్ ఒక చేతిలో.. తాళి బొట్ట మరో చేతిలో పట్టుకుని.. రెచ్చిపోతుంది. దాంతో కార్తీక్ నచ్చజెప్పలనే.. ఇటు ఇవ్వు తాళి.. కడతానని అందుకుంటున్నట్లుగా జ్యోత్స్న దగ్గరకు వెళ్తాడు. థాంక్యూ బావా అర్థం చేసుకున్నావ్ ఇదిగో తాళి, కట్టెయ్ అని జ్యోత్స్న అనేలోపు.. జ్యోత్స్న చేతిలోని విషం బాటిల్‌ని చేత్తో తీసి పారేస్తాడు కార్తీక్.  దాంతో అది ఓ మూలకు పడి పగిలిపోతుంది. వెంటనే తాళి ఉన్న జ్యోత్స్న చేతిని ఒకవైపుకు తోస్తాడు. ఆ తాళి ఎగిరి.. కొయ్యబొమ్మలపై పడుతుంది. జ్యోత్స్న ఆశ్చర్యంగా చూసే లోపు కార్తీక్ ఒక్కటి పీకుతాడు. ఆ దెబ్బకు జ్యోత్స్న కిందపడిపోతుంది. బావా అని ఆవేశంగా కిందపడే వేలు చూపిస్తుంది జ్యోత్స్న. నోరుముయ్.. మాట్లాడావంటే  రెండో చెంప కూడా పగలుతుంది. పెళ్లి అంటే ఆటలుగా ఉంది నీకు.. మీ తాతేమో ఇంటికి రావద్దు అంటాడు. నువ్వేమో తాళి కట్టు అంటున్నావ్.. ఏంటి తాళి కట్టకపోతే చస్తావా? ఎవరిని బెదిరిస్తున్నావ్? అందరూ బెదిరించే వాళ్లే అంటాడు కార్తీక్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావా.. నువ్వు నా మెడలో తాళి కట్టను అన్నావంటే.. నీ మనసులో నేను లేనని‌ జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నా ఏంటి ఆ మాటలు అంటుంది కాంచన. నిజమే అత్తా.. నీ కొడుకు మనసులో నేను లేను.. ఆ దీప ఉందని జ్యోత్స్న అంటుంది. నోటికి వచ్చినట్లు వాగవంటే అని కార్తీక్ ఆవేశంగా మళ్లీ కొట్టడానికి వెళ్తాడు. కార్తీక్ ఆగు అని కాంచన అరుస్తుంది. నేను అన్నది నిజం కాకపోతే.. నా మెడలో తాళి ఎందుకు కట్టనటున్నావో చెప్పమని జ్యోత్స్న అంటుంది. మా అమ్మలాగే నిన్ను కూడా అనాథను చేయడం ఇష్టం లేక.. మన పెళ్లి అయితే తాత నిన్ను కూడా దూరం చేసుకుంటాడు తప్ప.. కలుపుకోడని కార్తీక్ అంటాడు. కార్తీక్ మాటలకు జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. నిజమే.. నేను ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకుంటే ఆస్తి నాకు రాదు.. తాత దూరం పెడితే ఎలా? అని ఆలోచించుకుని.. సరే బావా.. లాగిపెట్టి కొట్టావ్ కదా.. నాకు ఇప్పుడు బుర్ర బాగా పనిచేస్తుంది. నేను ఇంటికి వెళ్లిపోతాను.. అందరి అంగీకారంతోనే పెళ్లి చేసుకుందామనేసి జ్యోత్స్న  వెళ్లిపోతుంది. మరోవైపు జ్యోత్స్న వెళ్తూ వెళ్తూ దారిలో గౌతమ్‌ని కలుస్తుంది. గౌతమ్ ఎవరో కాదు.. గతంలో జ్యోత్స్నకు పెళ్లి చేసుకుందామని జ్యోత్స్న కుటుంబం ముందే ప్రపోజ్ చేసిన వ్యక్తి. నాకు ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాణం అంటున్న బావ లాగిపెట్టి కొట్టాడంటున్నావ్.. మీ అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే.. దూరం పెట్టేవాళ్ల కోసమే పరితపిస్తారంటు గౌతమ్ అంటాడు. చూడు గౌతమ్.. ఏదో ఫ్రెండ్‌వి.. దారిలో కనిపించావు.. మనసులో భారం దించుకోవాలని జరిగింది నీకు చెప్పానంతే కానీ.. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు.. ఏది ఏమైనా నేను మా బావని దక్కించుకుని తీరతానంటూ అక్కడి నుంచి జ్యోత్స్న ఆవేశంగా కారు దాకా వెళ్తుంది. జ్యోత్స్న నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నా.. మీ బావ నిన్ను కొట్టాడంటే మీ బావ మనసులో నువ్వు లేనవనే కదా.. ఒకసారి ఆలోచించు అంటూ వెంటబడతాడు. జ్యోత్స్న వినదు. చూడు గౌతమ్.. మా బావతోనే నేను తాళి కట్టించుకుంటాను. త్వరలోనే పెళ్లి కార్డ్ పంపిస్తాను రెడీ ఉండు అనేసి కారులో వెళ్లిపోతుంది. చూద్దాం నీ ప్రేమ గెలుస్తుందా.. నా ప్రేమ గెలుస్తుందా అనేది అని గౌతమ్ అనుకుంటాడు. ఇక నరసింహాను చూసి.. తనని ఎత్తుకునిపోతున్నాడనే భయంతో శౌర్యకు జ్వరం వస్తుంది. దీప బాధగా బయటే కూర్చుని ఉంటే.. అనసూయ.. లేచి ముఖం కడుక్కోవే అని అంటుంది. దీప లేచి ముఖం కడుక్కుంటూ.. మెడలో తాళి చేతికి తగలకపోవడంతో గుర్తొచ్చి.. మళ్లీ ఏడుస్తుంది. మన ఆడవాళ్లకు ఓ వీక్‌నెస్‌లా మారిపోతుంది తాళి. శరీరంలో ఓ భాగం అయిపోతుందని దీప అనగానే.. నీ బాధ నాకు అర్థమవుతుంది దీపా.. కానీ ఇక వదిలెయ్.. వాడి సంగతి నేను చూసుకుంటానులే దీపా.. జరిగింది మరిచిపోమని అనసూయ చెప్తుంది. నువ్వు శౌర్యకు మందులు తే.. నేను ఆ నర్సిగాడికి ఇవ్వాల్సింది ఇచ్చే వస్తానని అనసూయ చెప్పేసి దీప వెళ్లిపోతుంది. అయినా ఆ నరసింహా అత్తయ్యకు కనిపించాలి కదా.. పారిపోయి ఉంటాడులే.. నేను వెళ్లి శౌర్యకు మందులు తీసుకొద్దామని దీప బయలుదేర్తుంది. అయితే అటే వచ్చిన జ్యోత్స్న.. కారు ఆపి.. దీపతో గొడవకు సిద్ధమవుతుంది. తెగించావే.. నా బావ ఉన్నాడుగా టాబ్లెట్స్ తెమ్మనకపోయావా? మెడలో తాళి ఏదే అంటూ దీప మాట్లాడిన ప్రతీ మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అరవడంతో చుట్టూ జనాలు వస్తారు. అప్పుడే దీప గురించి.. అక్కడున్న వాళ్లందరికి తప్పుడు మాటలు చెప్తూ రచ్చ చేస్తుంది జ్యోత్స్న.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

లైన్‌లోకి వచ్చిన చలాకీ చంటి... సర్వనాశనం ఐపోతారు!

సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం ఈ యుగాలన్నిటిలో స్నేహం, ధర్మం, నీతినిజాయితీ అనీ నాలుగు పాదాలా నడిచాయి కానీ ఇది కలియుగం ఈ యుగంలో డబ్బు మాత్రమే నడుస్తుంది..సో డబ్బుంటే బతుకు లేదంటే చచ్చిపో  అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసాడు చలాకి చంటి. చంటి అంటే చాలు ఒకప్పుడు జబర్దస్త్ షోలో చేసిన కామెడీ గుర్తు రాక మానదు. అలాంటి చంటి కొంతకాలం క్రితం గుండెపోటుతో హాస్పిటల్ లో చేరి తర్వాత కొంత రికవరీ అయ్యి మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. కానీ ఇంకా ఏ షోస్ లో కూడా కనిపించడం లేదు. అలాంటి చంటి ఒక ఇంటర్వ్యూలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరూ సాయం చేయరు అని చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక యూట్యూబర్స్ మీద కూడా ఫైర్ అయ్యాడు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ తాను అలా కూడా వాళ్లందరికీ ఉపయోగపడ్డానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు ఇగో అని తాను కోరుకున్నది జరగాలని తనకు జరగాల్సిన సమయాల్లో కొన్ని జరగకుండా అడ్డు పడినవాళ్లంతా సర్వనాశనం ఐపోవాలని ఆ దేవుడిని రోజూ కోరుకుంటున్నానని ఇదే తన శాపం అని మనసులో బాధను వెళ్లగక్కాడు. మనం నాశనం ఐపోవాలని ఎదుటి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళు నాశనం ఐపోవాలని ఎందుకు కోరుకోకూడదు.. మనం ఏమీ దేవుళ్ళం కాదు కదా...అందుకే తనను నాశనం చేసిన వాళ్ళను నాశనమయ్యేలా చూడాలని అది కూడా బతికుండగానే చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

రోడ్డు ప్రమాదంలో శ్రీవాణికి గాయాలు...టెన్షన్ లో భర్త విక్రమాదిత్య

బుల్లితెర నటి శ్రీవాణి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని శ్రీవాణి భర్త విక్రమాదిత్య ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. త్రి డేస్ బ్యాక్ శ్రీవాణి అండ్ ఫామిలీ చీరాల బీచ్ కి వెళ్తుండగా  శ్రీవాణి వాళ్ళ అమ్మ వెళ్తున్న కార్ కి యాక్సిడెంట్ ఐనట్టు చెప్పాడు. నుదిటి మీద చీరుకుపోవడంతో పాటు రైట్ హ్యాండ్ కి ఫ్రాక్చర్ ఐనట్టు చెప్పాడు. ఐతే శ్రీవాణిని గుంటూరు లోని ఒక హాస్పిటల్ లో చేర్పించామన్నారు. అలాగే ఆమె  నుదురు మీద బాగా డీప్ గా కట్ ఐపోవడంతో కుట్లు కాకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని  హాస్పిటల్ వాళ్ళను కోరామన్నారు. ఎందుకంటే షూటింగ్ టైం అక్కడ మార్క్ కనిపిస్తుంది కాబట్టి స్టిక్స్ వద్దు అన్నారట. ఐతే అంత డీప్ గా చర్మం తెగిపోయింది కాబట్టి వాటికి స్టిచెస్ మాత్రమే వేయాలని ప్లాస్టిక్ సర్జరీ పనికి రాదని డాక్టర్స్ చెప్పారంటూ విక్రమాదిత్య చెప్పారు. అలాగే శ్రీవాణి త్వరగా రికవరీ కావాలంటూ విష్ చేయాలంటూ అందరినీ ఈ వీడియో ద్వారా కోరుకున్నారు. ఐతే యాక్సిడెంట్ ఐనప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలన్నారు. అక్కడికి వెళ్తే తమ పరిధి కాదన్నారని చెప్పాడు. అలాగే తామిద్దరం కలిసి కొత్త కొత్త డెసిషన్స్ తీసుకున్నామని అలాగే ఇద్దరూ కలిసి భార్యాభర్తలుగా ఒక సీరియల్ లో నటించడానికి కమిట్ అయ్యామని చెప్పాడు. ఇలాంటి గుడ్ న్యూస్ లు విన్న ఈ టైములో ఇలాంటి ఒక సంఘటన జరిగింది అని బాధపడ్డారు. ఐతే తమ కష్టం చూసినవాళ్లంతా మీ మీద ఉన్న అందరి కూడా దిష్టి పోయింది..కాబట్టి కంగారుపడకండి అన్నారంటూ చెప్పాడు. ఆ వేంకటేశ్వరుడి దయ వలన ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు విక్రమాదిత్య, నందిని.

ఇది కామెడీ షో కాదు.. అశ్వత్థామ 2.0 అని అనొద్దు!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది.‌ ఇక ఇప్పుడు ఏడో వారం నామినేషన్లు నేటితో మొదలవ్వనున్నాయి.‌ ఇక తాజాగా వచ్చిన ఈ ప్రోమో ఇప్పుడు ఆకట్టుకుంటుంది. ఎవరు నామినేట్ అవుతారనేది ప్రేరణ, హరితేజ మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరుగెత్తుకుంటూ వెళ్ళి హ్యాట్ ని పట్టుకోవాలి. ఎవరైతే వెళ్లి పట్టుకుంటారో వారికి నామినేట్ చేసే , నామినేషన్ నుండి డ్రాప్ చేసే అవకాశం లభిస్తోందనే కండిషన్ పెట్టాడు బిగ్ బాస్. రోహిణి తన నామినేషన్ గా గౌతమ్ ని చేసింది. చక్కగా ఒక ప్లోలో వెళ్తున్న ఫన్ టాస్క్ లో గౌతమ్ అలా హర్ట్ చేయడం నాకు నచ్చలేదనే పాయింట్ ని రోహిణి చెప్తూ నామినేట్ చేసింది. ఇక గౌతమ్ రెచ్చిపోయాడు. కామెడీ అయిన ఏదైనా అది బుల్లీయింగ్ కిందకు వస్తుందని గౌతమ్ అనగా.. బుల్లీయింగ్ అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ గౌతమ్... వాడు చేయాలా వద్దా అనేది బిగ్ బాస్ అడిగే చేశాడంటూ నిఖిల్ అన్నాడు. బుల్లీయింగ్ అంటే ఒక మనిషికి నచ్చని విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్పడం అంటు గౌతమ్ అనగానే.. అది మాకు తెలియదంటూ అవినాష్.. నేను నిన్ను అశ్వత్థామ 2.0 అని అనను అంటు రిక్వెస్ట్ చేస్తూ  తన డిఫెండింగ్ ని చెప్పుకున్నాడు. ఇక మధ్యలో ఇది కామెడీ షో కాదు.. బిగ్ బాస్ షో అంటు అవినాష్ ని కించపరిచేలా గౌతమ్ మాట్లాడటంతో అతను హర్ట్ అయిపోయి చొక్కా తీసేశాడు.‌ ఇక రోహిణి కూడా తన వంతుగా మాట్లాడింది. కామెడీ షో చేసేవారికి ఎమోషన్స్ ఉండవా అంటు రోహిణి మాట్లాడింది. వీకెండ్ లో నాగార్జున సర్ కూడా ఇదే పాయింట్ చెప్పాడు కదా అంటు నిఖిల్ తో అవినాష్ చెప్పుకోగా.. టేస్టీ తేజతో గౌతమ్ చెప్పుకున్నాడు. ఈ ప్రోమోని ఇప్పుడు నామినేషన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ అలానే వారమంతా కొనసాగుతుందా.. అసలు నామినేషన్లో ఎంతమంది ఉన్నారు.. ఎవరు లేరో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

హౌస్ లో బ్లాక్ హార్ట్, వైట్ హార్ట్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఆరోవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరికి మెహబూబ్, సీత ఉన్నారు. ఇక కిర్రాక్ సీత ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చేసింది. తను ఎలిమినేషన్ అయి బయటకొస్తుంటే హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన సీత తన జర్నీ చూసుకొని ఎమోషనల్ అయ్యింది. ఇక హౌస్ లో ముగ్గురికి వైట్ హార్ట్, ముగ్గురికి బ్లాక్ హార్ట్ ఇవ్వాలని నాగార్జున చెప్పాడు. దాంతో విష్ణుప్రియకి వైట్ హార్ట్ ఇచ్చింది. తను చాలా ఇన్నోసెంట్ అని.. గేమ్ అసలు అర్దం కాలేదని చెప్పింది. బయటకు వెళ్లాక జీవితంలో మీ మమ్మీని మర్చిపోయేంత పెద్ద లవ్ దొరకాలి.. నీకొచ్చే పార్టనర్.. నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు.. అందరినీ మర్చిపోతావు… ఇది కృష్ణుడు నీకోసం నాతో పలికిస్తున్న మాట అంటూ సీత చెప్పగానే విష్ణు ఏడ్చేసింది. ఇక తర్వాత రెండో హార్ట్ నా తమ్ముడు నబీల్ అంటూ చెప్పింది. చాలా బాగా ఆడతావు రైడర్ నువ్వు.. నాకు రియాల్టీ షోలో రియల్ పీపుల్ విన్ కావాలని ఉంది.. సో నిన్ను విన్నర్ గా చూడాలని ఉంది అంటూ సీత చెప్పడంతో నబీల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. మూడో హార్ట్ ఎవరూ ఊహించని విధంగా అవినాష్ కు ఇచ్చింది.  రావడంతోనే హౌస్ లోకి ఏదో పాజిటివ్ ఎనర్జీ తీసుకోచ్చాడని..తను మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నానని తెలిపింది. ఐ లవ్ యూ అవి.. నువ్వు వచ్చి వారమే అయిన నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పింది.  ఆ తర్వాత మూడు బ్లాక్ హార్ట్స్ లో మొదటిది నిఖిల్ కు ఇచ్చింది. నిఖిల్ పక్కా హజ్బెండ్ మెటీరియల్ అని.. కానీ ట్రాన్స్ పరెంట్ గా ఉండాలని తెలిపింది. ఎవరో నిన్ను రైట్ అనాలని అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడ మాటలు అక్కడ చెప్పకు..నీకు నచ్చింది మాట్లాడు.. నీకు ఏది రైట్ అనిపించిందో అదే రైట్.. ఇది గుర్తుపెట్టుకో అంటూ చెప్పుకొచ్చింది. ఇక తర్వాత రెండో హార్ట్ గౌతమ్ కు ఇచ్చింది. గౌతమ్ వచ్చిన జోష్ నచ్చిందని.. కానీ చిన్న చిన్న వాటికి హార్ట్ కావొద్దని.. సేఫ్ గా ఆడకు అంటూ సలహా ఇచ్చింది. ఆ తర్వాత మూడో బ్లాక్ హార్ట్ నయని పావనికి ఇచ్చింది. ఈ వారం నువ్వు వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అని నామినేట్ చేశావ్.. కానీ వచ్చిన వారానికే నాకంటే ఎక్కువ ఏడుస్తున్నావంటూ చెప్పుకొచ్చింది.

బజ్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ నుండి ఆరో వారం సీత ఎలిమినేషన్ అయి బయటకొచ్చేసింది. ఇక బయటకొచ్చే ముందు బిబి బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో యాంకర్ అంబటి అర్జున్ అడిగిన కొన్ని ప్రశ్నలకి షాకింగ్ సమాధానాలిచ్చింది సీత. బిగ్‍బాస్ అనేది లైఫ్‍టైమ్ అవకాశం. దాన్ని సరిగా వాడుకున్నారా అని ప్రశ్నించగా.. ఎవరి ఆలోచన వారిదని, తను వంద శాతం ఇచ్చానని సీత చెప్పింది. టాస్కుల్లో తను కాకుండా ఇతరులను ముందుకు పంపడం తను డౌన్ అయ్యేందుకు కారణం అయి ఉండొచ్చని కిర్రాక్ సీత అంది. హౌస్‍లో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా అని అడుగగా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లను పుష్ చేయడం వల్ల డౌన్ అయ్యానేమోనని నేను అనుకుంటున్నానని, తన నిర్ణయాల మీద ఎక్కువసార్లు కాన్ఫిడెంట్‍గా ఉంటానని సీత చెప్పింది. మనకు అనిపించింది మనం రైట్ అనుకుంటాం. కానీ అది బయటికి అలా కనిపించదని యాంకర్ అనగా.. అది లెక్కలు వేసుకొని గేమ్ ఆడినట్టు. అది రియల్ గేమ్ కాదని సీత అంది. ఏడ్వడం స్ట్రాంగ్‍గా అని యాంకర్ అడుగగా.. మరి అరవడం స్ట్రాంగా.. మీరు స్ట్రాంగ్ అని ఏమనుకుంటున్నారో.. అది తప్పని నాకు అనిపిస్తోందని సీత చెప్పింది. మంచితనమే కొంప ముంచిందని అనిపించిందా అని అడుగగా.. అలాగని నా క్యారెక్టర్ మార్చుకోలేనని సీత సమాధానమిచ్చింది. సోనియాకు నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఏడ్చారని అడుగగా.. గేమ్ చూసి నిఖిల్ ఇస్తాడనుకున్నానని, కానీ పర్సనల్ ఎమోషన్లతో ఇచ్చారని సీత అంది. నిఖిల్‍ను హస్బెంజ్ మెటీరియల్ అని సీత అనడంపై ప్రశ్నించగా.. నిఖిల్ ఒకడే ఒకరి వెంట పడ్డాడని సీత అంది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన టేస్టీ తేజ తనకు చిరాకుగా అనిపించారని సీత చెప్పింది. టేస్టీ తేజ చిరాకు అనే అనిపించాడు. ఎందుకంటే వారంలో ఆమె పర్ఫార్మ్ చేసినట్టు, కాన్ఫిడెన్స్ కనిపించలేదని సీత అంది. గేమ్‍పరంగా నిఖిల్.. పారదర్శకంగా ఉండడని చెప్పారు. హజ్బెండ్ మెటీరియల్.. వేస్ట్ మెటీరియల్‍లోకి పంపండి అంటు జోక్ చేశాడు యాంకర్. హౌస్‍లో ఉన్నప్పుడు తన తల్లి పంపిన లెటర్ గురించి అడగగా.. సీత ఎమోషనల్ అయ్యింది.. హౌస్‍లో తనను ఆమె చూడాలనుకున్నారంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సీత హౌస్ లో జరిగిన కొన్నింటిని షేర్ చేసినట్టు తెలుస్తుంది.

Kirrak seetha elimination : కిర్రాక్ సీత ఎలిమినేషన్.. టేస్టీ తేజ నామినేషన్ వల్లేనా!

ఏదీ ఎక్కడ వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటుంది. ఏదీ ఎంతవరకు ఉంటుందో అంతే ఉంటుంది. అదే బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం ఆడియన్స్ కి హౌస్ మేట్స్ కి తెలుస్తుంది. ఈ సీజన్ మొదలవ్వడమే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ఇక గత వారం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు‌ హౌస్ లోకి వచ్చారు.‌ వారిలో టేస్టీ తేజ స్పెషల్. ఎందుకంటే టేస్టీ తేజ గత సీజన్ లో వేసిన ప్రతీ నామినేషన్ ఓ సెన్సేషన్. దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజా మూర్తి, సందీప్ మాస్టర్ వీళ్లంతా.. టేస్టీ తేజా బాధితులే. మనోడు నామినేట్ చేశాడంటే వాళ్లు ఎలిమినేట్ కావాల్సిందే. ఇతను ఎలిమినేట్ అయ్యేవరకూ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు హౌస్ నుంచి వెళ్లిపోయేవారు. టేస్టీ తేజా తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయితే అప్పటి వరకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం కిర్రాక్ సీతని, మణికంఠని నామినేషన్ చేశాడు టేస్టీ తేజ.  అయితే మణికంఠకి ఈ ఒక్క నామినేషన్ పడటంతో అతను నామినేషన్ లిస్ట్ లో లేడు. కిర్రాక్ సీత మాత్రం డేంజర్ జోన్ లో ఉంది. ఈ వారం నామినేషన్ లో మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా పృథ్వీ సేవ్ అవ్వగా, సెకెంఢ్ యష్మీ సేవ్ అయ్యింది. ఇంకా నామినేషన్ లో నలుగురు ఉన్నారు. నేడు జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలుస్తుంది. అయితే ఓటింగ్ ప్రకారం మెహబూబ్, కిర్రాక్ సీత నామినేషన్ లో లీస్ట్ లో ఉన్నారని వారిద్దరి మధ్య స్వల్ప తేడా ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికి వచ్చిన అప్డేట్ ప్రకారం కిర్రాక్ సీత ఎలిమినేషన్ అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే నేడు జరగబోయే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

డోంట్ ప్లే గేమ్స్ విత్ మి.. మణికంఠపై నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత టాస్క్ లతో ఎంటర్‌టైన్మెంట్ తో సూపర్ గా సాగుతుంది. ఇక వీకెండ్ లో వచ్చిన నాగార్జున అదిరిపోయే నాటుముక డ్యాన్స్ చేశాడు.‌ఇక వచ్చీరాగానే హౌస్ లో ఉన్నవారి గేమ్ ఎలా ఉందో చెప్పుకొచ్చాడు. హౌస్ లో ఆటతీరుని బట్టి ఎవరు రైజింగ్ స్టార్, ఎవరు ఫాలింగ్ స్టార్ అని చెప్తూ వారి ఫోటోలని అక్కడున్న బోర్డుకి పెట్టాడు నాగార్జున. హౌస్ లో నీ గేమ్ డౌన్ అయిందంటు టేస్టీ తేజని ఫాలింగ్ స్టార్ లిస్ట్ లో పెట్టాడు నాగార్జున. ‌ఇక విష్ణుప్రియని లేపి.. మొదటి వారం నుండి అందరు నిన్ను నామినేషన్ చేస్తున్నారు. నీ గేమ్ బాలేదు.‌. టాస్క్ లు సీరియస్ గా తీసుకోవడం లేదు.. ఇలానే ఉంటే నిన్ను జనాలు సీరియస్ గా తీసుకోరు అందుకే నీకు ఫాలింగ్ స్టార్ అంటు ఆ లిస్ట్ లో విష్ణుప్రియని చేర్చాడు నాగార్జున. ఇక కిర్రాక్ సీతని లేపి.. ఈ వీక్ నీ గేమ్ లేదు.. నీ దగ్గర ఉన్నవాటిని నువ్వు కాపాడుకోలేవ్ కానీ నీ స్ట్రాటజీ కరెక్ట్ అందుకే నిన్ను ఫాలింగ్ నుండి రైజింగ్ స్టార్ లిస్ట్ లోకి ఇస్తున్నానంటూ నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత మెగా ఛీఫ్ అయినందుకు మెహబూబ్ కి రైజింగ్ స్టార్ లిస్ట్ లో పెట్టాడు‌ నాగార్జున. ఆ తర్వాత అవినాష్ ఫన్ బాగుందని అతడికి రైజింగ్ స్టార్ ఇచ్చాడు. ఇక రోహిణి కూడా తన గేమ్ బావుందంటు ఆమెను రైజింగ్ స్టార్ లిస్ట్ లో చేర్చాడు. ఏంటీ రోహిణీ.. నీకు నోటి దూలా.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా అని నాగార్జున అనగానే.. నేను ఆ ఇంటెన్షెన్ తో అనలేదు సర్.. ఏం మణికంఠ ఫీల్ అయ్యావా అని రోహిణి అనగానే లేదని మణికంఠ అన్నాడు. చాలా ఫీల్ అయ్యాడు రోహిణి.. మణికంఠ అంటే ఫీలూ.. ఫీల్ అంటే మణికంఠ అని నాగార్జున అన్నాడు. అతన్ని నువ్వు అవమానించావని ఫీల్ అవుతున్నాడంటూ నాగార్జున అనగా.. అమ్మో అంతమాటా.. నేను అంత ఫీల్ అవ్వలేదు సర్ అని మణికంఠ అన్నాడు. ఫీల్ అయ్యావ్ కదా.. ఇప్పుడెందుకు కవర్ చేస్తున్నావ్.. డోన్ట్ ప్లే గేమ్స్ విత్ మీ.. నువ్వు ఫీల్ అయ్యావ్ అని చెప్పాను.. అయినట్టే.. అది అయిపోయింది. మళ్లీ ఫీల్ అవ్వలేదని అంటావ్ ఏంటని మణికంఠపై నాగార్జున సీరియస్ అయ్యాడు.

సీత స్టాండ్ తీసుకుంది కరెక్టే.. నబీల్ కి తెలియని స్ట్రాటజీ అదే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఆరో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారం మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. వారిలో కొత్త కంటెస్టెంట్స్ గంగవ్వ, మెహబూబ్ కూడా ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ ఫైర్ లో రాకుండా కూల్ గా కన్పించారు. దాంతో హౌస్ మేట్స్ కాస్త నార్మల్ అయ్యారు. ఇక వచ్చీ రాగానే మణికంఠను మెనీ కంఠ అంటూ ఏదో చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత విష్ణుప్రియ లేపి ఏదో అడుగబోతుంటే.. వారం మొత్తం టాస్క్‌లో ఇరగదీసి పర్ఫామ్ చేసేసరికి అలిసిపోయా సర్ అని విష్ణుప్రియ అంది. అబ్బో ఏం చేసి అలిసిపోయావని నాగార్జున అనగానే.. హోటల్ టాస్క్ లో మసాజ్ చేసి.. కాళ్ళు నొక్కాను సర్.. చాలా కంటెంట్ ఇచ్చాను సర్ అని విష్ణుప్రియ తన బాధ చెప్పింది. అంతేనా... లేదంటే పృథ్వీ మాల్దీవ్స్ ఆఫర్‌ రిజిస్టర్ కాలేదనా? అని నాగార్జున అడిగాడు. అప్పుడు పృథ్వీ లేచి నిలబడి.. విష్ణూ నీకు చెప్పాను కదా.. పెళ్లి చేసుకుని మల్దీవ్స్ వెళ్దాం అన్నా కదా అని విష్ణుప్రియకి నాగార్జున గుర్తుచేశాడు. ఆ తర్వాత.. అవినాష్, టేస్టీ తేజాలు గులాబ్ జామ్‌లు తిన్న వీడియోను చూపించి.. వాళ్లతో గులాబ్ జామ్‌లను తినిపించాడు నాగార్జున. కొన్ని తిన్నాక వాళ్ళు వదిలేశారు. ఇక వాళ్ళు గులాబ్ జామ్ లు దొంగచాటుగా తినకుంటే మీ టీమ్ గెలిచేది కదా అని నబీల్ ని నాగార్జున అడుగగా.. రెండు తిన్నామని చెప్పారు సర్ అని నబీల్ చెప్పుకొచ్చాడు. సీత రాయల్స్ టీమ్ దగ్గర దొంగతనం చేయడాన్ని.. తప్పు పట్టి ఆమెతో బలవంతంగా డబ్బులు ఇప్పించారు. ఆమె చేసింది తప్పే కాదని నాగార్జున అన్నాడు. సీత డబ్బులు ఇవ్వడం వల్లే.. ఆ టీమ్ గెలిచింది.. రాయల్స్ టీమ్ వాళ్లు ప్లాన్ చేసి.. సీత దగ్గర డబ్బులు తీసుకుంటేనే గెలుస్తామని వాళ్లకి తెలుసు.. అందుకే ఆ డబ్బులు తీసుకున్నారు. కానీ ఓజీ టీమ్ మాత్రం వాళ్లు అడగ్గానే ఇచ్చేశారు. అయిన సీత తీసుకున్న స్టాండ్ మీద నిలబడి ఉంటే.. ఆ టీమ్ గెలిచేది. నువ్వు మీ టీమ్ మాట విని మిస్టేక్ చేశావ్.. నీ స్టాండ్ మీద నిలబడి ఉంటే మీ టీమ్ గెలిచేది అని సీతతో నాగార్జున చెప్పి.. ఆ తర్వాత నబీల్‌‌కి నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ చెప్పనంతవరకూ అది ఫెయిర్ కిందే లెక్క.. ఇది గుర్తుపెట్టుకుని ఆట ఆడండి అని నాగార్జున గైడెన్స్ ఇచ్చాడు.

Eto Vellipoindi Manasu: ఎత్తుకు పైఎత్తు.. సవతి తల్లిని ఇంట్లో నుండి గెంటించేస్తా చూడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-225 లో నందిని తన పీఏ హారికతో మాట్లాడుతుంది. అదే సమయంలో సందీప్, శ్రీవల్లిలతో శ్రీలత మాట్లాడుతుంటుంది. ఎలాగైనా రామలక్ష్మిని ఇంట్లో నుండి గెంటేసి నందినిని ఇంట్లోకి రప్పించాలని శ్రీలత అంటుంది. మరి తను కూడా నా ఆస్తి, నా పిల్లలు అని ఉంటుంది కదా అని శ్రీవల్లి అనగానే..‌మన చేతులకి మట్టి అంటకుండా సీతా చేతులతోనే నందినిని బయటకు గెంటించేస్తా అయితే ఈసారి సీతా ఆస్తితో పాటు నందిని ఆస్తి కూడా వస్తుందని శ్రీవల్లి, సందీప్ లతో శ్రీలత అంటుంది. ఇక మరోవైపు హారిక, నందిని మాట్లాడుకుంటారు. అసలే ఆ శ్రీలత జిత్తులమారి నక్క.. రామలక్ష్మిని బయటకు గెంటేసినట్టుగా నిన్ను కూడా గెంటేస్తే ఎలా అని నందినిని హారిక అడుగుతుంది. సవతి తల్లిలా తను చేసే కుట్రలన్నీ సీతాకాంత్ కి సాక్ష్యాలతో సహా చూపించి వాళ్ళందరిని ఇంట్లో నుండి గెంటించేస్తా అని నందిని అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే.. శ్రీలత, శ్రీవల్లి వస్తారు. కాసేపు వాళ్ళిద్దరు రామలక్ష్మి మాటకి మాట అనేసుకుంటారు. ఇక రామలక్ష్మి అంటే సీతాకాంత్ కి ఇష్టమే అనేలా కవరింగ్ చేస్తుంది రామలక్ష్మి. ఇక ఆఫీస్ లో ఉన్న సీతాకాంత్ దగ్గరికి నందిని వస్తుంది. తన ఎమోషనల్  డ్రామా మొదలెడుతుంది. నేనంటే ఇష్టపడే వాళ్ళు లేరు.. నాకిష్టమైన వాళ్ళే నన్ను అవమానిస్తూ.. పదే ఒదే అనుమానిస్తుంటే నేనిక్కడ ఉండలేను ఫారెన్ వెళ్లిపోతా అని నందిని అంటుంది. ఏమైందని సీతాకాంత్ అడుగగా.. రామలక్ష్మిని , నిన్ను చంపాలని నేను చూసానా.. ఎందుకు నా మీద‌ స్పై చేశావని అంటుంది. అదేదో పారపాటున జరిగిందని సీతాకాంత్ అంటాడు. ఇక నందిని తన బాధనంతా చెప్పుకొని వెళ్ళిపోతుంటే సీతాకాంత్ తన చేతిని పట్టుకుంటాడు. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని నందిని మనసులో అనుకొని హ్యాపీగా ఉంటుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam 2: కీలక సాక్ష్యం కనిపెట్టిన దాస్.. ఓ చేతిలో విషం, మరో చేతిలో తాళి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-174 లో.. దీప మెడలోని తాళిని నరసింహా పట్టుకుని గొడవ పడుతుంటాడు. దీప తాళి ఊడి నరసింహా చేతికి రావడం.. నరసింహా చేతి నుంచి జారి మంటల్లో పడటం.. అది కాలిపోవడంతో దీప ఆవేశంగా నరసింహను కిందకు తోసేసి.. అక్కడే ఉన్న బండరాయిని కిందపడిన నరసింహా మీద ఎత్తేస్తుంది. వెంటనే నరసింహా పారిపోతూ పారిపోతూ.. ఒసేయ్ దీపా నిన్ను వదలనే అంటూ పారిపోతాడు. ఇక వెంటనే తన తాళిని తీసుకోవడానికి మంటలవైపు వెళ్ళి పుల్లల్ని లాగుతుంది దీప. అయితే అనసూయ వేగంగా వచ్చి ఆగమంటుంది. అత్తయ్యా నా తాళి.. నా తాళి అని దీప చాలా ఏడుస్తుంది. నీకు నా కొడుక్కి కోర్టు విడాకులు ఇచ్చింది కానీ.. ఈ రోజే అసలైన విడాకులు ఆ దేవుడు ఇచ్చాడే నీకు.. ఏడవకు.. పోనీ వదిలెయ్ అని అనసూయ ధైర్యం చెప్పి కోడల్ని, శౌర్యను ఇంటికి తీసుకెళ్తుంది.  మరోవైపు పార్క్ లో ఓ టేబుల్ మీద దాస్ కూర్చొని ఆలోచిస్తుంటాడు. జరిగిపోయిన దాన్ని, దేన్నీ మనం మార్చలేం.. కానీ తల్చుకుంటే జరగబోయేదాన్ని మార్చొచ్చు కదా.. నేను మా అమ్మతో అన్న మాటని ఎలాగైనా నిజం చెయ్యాలి.. ఆ వర్షం పడిన రోజు పాపని తీసుకుని వెళ్లిపోయిన మనిషి గుర్తున్నాడు కానీ అతను ఎవరో ఎక్కడుంటాడో.. ఏం చేస్తాడో కూడా తెలియదు.. మరి వారసురాల్ని ఎలా కనిపెట్టాలని అనుకుంటాడు. ఈలోపు పార్క్‌లో ఓ ఆర్టిస్ట్ దాసు దగ్గరకు వచ్చి.. కొంచెం సేపు అలానే చూసి మళ్లీ వెళ్లి బొమ్మ వేస్తుంటాడు. వీడు ఎవడు.. నన్నే చూస్తున్నాడు. నేను నిజం ఎవరికీ చెప్పకుండా మా అమ్మ ఎవరినైనా సెట్ చేసిందా ఏంటని దాస్ మనసులో అనుకుంటాడు. ఇంతలో ఆ ఆర్టిస్ట్ మళ్లీ రావడంతో ఈసారి గట్టిగా పట్టుకుని.. కాలర్ అందుకుని.. నిన్ను ఎవరు పంపారురా  అని దాస్ అంటాడు. సర్ ఆగండి.. నేను ఆర్టిస్ట్‌ని.. పార్క్‌కి వచ్చిన వాళ్ల బొమ్మలు గీయడం నా హబీ సర్.. కావాలంటే చూపిస్తాను రండి అని అతను అంటాడు. ఏది చూపించు అనడంతో కాస్త ముందుకు తీసుకెళ్లి, దాసు బొమ్మని చూపించి.. అద్భుతం అనిపించుకుంటాడు.  అవును నీకు అన్ని రకాల బొమ్మలు వచ్చా? అంటే నేను ఒక వ్యక్తి రూపురేఖలు చెబుతాను.. బొమ్మలా గియ్యగలవా అని దాస్ అడుగుతాడు. ఐదొందలు అవుతుంది సర్.. మీరు వారి రూపురేఖలు ఎంత క్లియర్‌గా చెబితే బొమ్మ అంత బాగా వస్తుందని అతను అంటాడు. చూసి పాతికేళ్లు దాటినా మరిచిపోలేదు నేను ఆ వ్యక్తిని  అనుకుంటూ వెయ్యి రూపాయలు తీసి.. మొత్తం 12 వందలు చేతికి ఇచ్చి.. బొమ్మ బాగా గియ్యి అంటూ కుబేర్ రూపు రేఖలు చెప్తాడు.  మరోవైపు నాకు బావ కావాలి, ఆస్తి కావాలంటూ పారిజాతంతో గొడవేసుకుంటుంది జ్యోత్స్న. ఇక కాశీ, స్వప్నల అన్యోన్యంగా ఉంటారు. నాన్న ఎక్కడ అని కాశీ అడగ్గా.. బయటకెళ్ళాడని స్వప్న చెప్తుంది. అప్పుడే దాస్ వస్తాడు. కుబేర్ ఫోటో చూస్తూ.. అసలైన వారసురాలు బయటపడే రోజు దగ్గర పడినట్లుంది.. లేదంటే నేను పోలికలు చెప్పడమేంటీ.. నా మనసులో ఉన్నట్లే ఈ బొమ్మ గీయడమేంటి.. నువ్వెవరో ఎక్కడుంటావో.. నీ వివరాలు ఏంటో వెంటనే కనిపెట్టాలని మనసులో ఫిక్స్ అవుతాడు దాస్.  ఏంటి నాన్నా అది అని కాశీ అడుగగా.. డ్రాయింగ్‌రా అంటూ తన బొమ్మను చూపిస్తాడు. అది చూసి‌ స్వప్న, కాశీలు బాగుందని అంటారు. పార్క్‌లో ఓ ఆర్టిస్ట్ వేశాడని దాస్ చెప్తాడు. మరి అదేంటని కాశీ అడగ్గా.. ఇది కూడా డ్రాయింగేరా‌ అని దాస్ అంటాడు దాసు. మరి అది ఎవరిదిని కాశీ అడుగుతాడు. ఈ కథను మలుపు తిప్పేవాడిది అనేసి.. స్వప్న చేతిలోని తన బొమ్మను తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు దాస్. కథను మలుపు తిప్పేవాడు అంటే అని‌ స్వప్న అనగానే.. నాన్న అంతేలా అప్పుడప్పుడు అలానే అర్థం కాకుండా మాట్లాడతాడు.. సరే దిల్ బై అని స్వప్నకి చెప్పేసి కాశీ వెళ్లిపోతాడు. నిజానికి దాసు గీయించిన బొమ్మ కుబేర్‌ది. కుబేర్ ఫొటో దీప ఇంట్లో దండేసి ఉంది. మరోవైపు ఓ చేతిలో విషం, మరో చేతిలో తాళితో.. కార్తిక్ దగ్గరికి వస్తుంది జ్యోత్స్న. ఈ క్షణమే తాళి కడతావా? లేక విషం తాగి చావమంటావా అని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:  అల్లుడు సూటిగా అడిగేసరికి అత్త షాక్.. ట్విస్ట్ మీద ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-539 లో.. ఇందిరాదేవి, అపర్ణ ఒకవైపు, ప్రకాశం, ధాన్యలక్ష్మి మరోవైపు.. ఆ పక్కనే సుభాష్ కూర్చుని ఉంటారు. ఆ వెనుక సోఫాలో స్వప్న కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజ్ బాధగా కనకం ఇంటి నుంచి వస్తాడు. రాజ్ రావడం రావడమే.. క్షమించడంలో మానవత్వం ఉంటుంది మమ్మీ అని రాజ్ అంటాడు. మానవత్వం ఉన్నవాళ్లే క్షమించగలుగుతారు నాన్నా అని అపర్ణ అంటుంది. మనిషికి, మానుకి తేడా అదేరా అని ఇందిరాదేవి అంటుంది. మిగిలిన వాళ్లకేం అర్థం కాదు. ఇంతలో పైనుంచి రుద్రాణీ, రాహుల్ కిందకు వస్తుంటారు. ఇప్పుడు నేను స్పందించకపోతే.. ఏ సహాయం అందికపోతే ఎలా అని రాజ్ కోపంగా అంటాడు. అక్కడున్న ఎవరికీ ఏమీ అర్థం కాదు. చాలు నాన్నా చాలు.. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయావో అందరికి తెలియాల్సిన అవసరం లేదు కదా అని అపర్ణ అంటుంది. రేపు మా అత్తగారైన శ్రీమతి కనకం.. మా మామగారైన శ్రీమాన్ కృష్ణమూర్తి గార్ల 25వ పెళ్లి రోజు.. నా చేతుల మీదగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చెయ్యాలనుకుంటున్నానని రాజ్ అంటాడు. అపర్ణా దేవి, ఇందిరాదేవి తమ ప్లాన్ ఫలించినందుకు సంతోషిస్తే.. మిగిలిన ప్రకాశం, సుభాష్, స్వప్న మరింత ఆనందంగా చూస్తారు.  ఇంతలో రుద్రాణి గిర్రున కళ్లు తిరిగి రాహుల్ మీద పడిపోతుంటే.. రాహుల్ పట్టుకుని మమ్మీ మమ్మీ అంటూ ఉంటాడు. రా కూర్చో కూర్చో అని పక్కనే సోఫాలో కూర్చోబెట్టి వాటర్ జల్లుతాడు. రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మి ముగ్గురు ఎన్ని అన్నీ రాజ్ పట్టించుకోడు. మంచి నిర్ణయమంటూ ఇటు అపర్ణాదేవి, ఇందిరాదేవి కూడా.. రుద్రాణికి, ధాన్యలక్ష్మికి చురకలు వేస్తారు. దాంతో రుద్రాణి మనసులో.. అమ్మో ఇప్పుడు కానీ నేను వీళ్లతో వెళ్లకపోతే.. రాజ్, కావ్య కలిసిపోతారు. అసలే గుడిలో కలిసిన కావ్య, అపర్ణ వదిన ఏదో ప్లాన్ చేసినట్లున్నారు. అదేంటో తెలుసుకోవాలి.. అందుకైనా నేను వెళ్లాలని మనసులో ఫిక్స్ అయ్యి.. సర్లే మీరంతా పెళ్లి రోజుకి వెళ్తుంటే నేను మాత్రం ఎందుకు ఆగుతాను.. పైగా ఆ ఇంటికి నేను కూడా వియ్యపురాలినే కదా.. వస్తానంటూ రుద్రాణి మాట కలిపేస్తుంది. ఇక రాజ్ ఫిక్స్ కావడంతో ఇంట్లో అంతా మరునాడు పెళ్లి రోజుకి వెళ్లాలని ఫిక్స్ అవుతారు. మరునాడు ఉదయాన్నే కావ్య.. తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తుంది. వాళ్లొస్తున్నారు.. ఈ రోజైనా అల్లుడు గారు ప్రేమని అర్థం చేసుకో.. అల్లుడిగారితో మంచిగా మాట్లాడమంటూ తెలివిగా ముందే కళావతిని హెచ్చరిస్తుంది కనకం. ఇక అనుకున్నట్లే వాళ్లు అంతా వస్తారు. పెళ్లిరోజు ఏర్పాట్ల గురించి రాజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కళావతి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా అన్నట్లు చూస్తుంది. ఇక రాజ్ ఫోన్ పెట్టెయ్యగానే.. అందరికి అందరూ మారిపోయి.. పండంటి కాపురం ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాలు చూపిస్తారేంటని కావ్య అంటుంది. ఇదేం చూశావ్ ముందు ఉంది అసలు పండుగ అనేసి రాజ్ వెళ్లిపోతాడు. ఇక తరువాయి భాగంలో.. కనకం దగ్గరికి రాజ్ వెళ్ళి.. క్యాన్సర్‌కి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. తన డాక్టర్ స్నేహితులకు పంపిస్తానంటాడు. రాజ్ అలా సూటిగా రిపోర్ట్స్ అడిగేసరికి కనకం షాక్ అవుతుంది. అది బాబు.. అది బాబు అంటూ నసుగుతుంది తప్ప... లేని రిపోర్ట్స్‌ని ఎక్కడి నుంచి తేను అని మనసులో అనుకుంటుంది. అయితే కనకం ఏం చెప్పి తప్పించుకుందో తెలియదు కానీ.. ఆ గదిలోంచి బయటికి వెళ్లేసరికి.. కావ్య చేతులు కట్టుకుని ఇదా నువ్వు ఆడే నాటకం.. ఇదా రాజ్‌లో వచ్చిన మార్పుకి కారణం అన్నట్లుగా చూస్తుంటుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అన్ స్టాపబుల్ కొత్త సీజన్ ట్రైలర్.. ఒక చిన్న సినిమా కథే!

తెలుగు ఓటీటీ టాక్ షోస్‌ లో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నది  ఆహా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ టాక్‌ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ లోకి ఎంట్రీ ఇస్తోంది. దసరా పండగను సందర్భంగా కొత్త సీజన్ ఫస్ట్ లుక్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదొక యానిమేషన్ ట్రైలర్.  ఇందులో బాలయ్య సూపర్ హీరోగా కనిపించాడు. సుమారు నాలుగు నిమిషాలు ఉన్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.  అక్టోబరు 24వ నుంచి అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్‌ కానుంది. ప్రతీ ఎపిసోడ్ పండగలా ఉండబోతోంది. ఈ షో దెబ్బకు థింకింగ్ మారి తీరాలా. వచ్చే అతిధులకు ప్రశ్నల ఘాటు పెంచుతాం అని బాలయ్య చెప్పారు. వాళ్లకు మర్చిపోలేని ఆతిథ్యం ఇస్తాం అని కూడా అన్నారు.  గత సీజన్ల కంటే సీజన్‌ 4 అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.  ఇక ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఒక రాజ్యం అందులో ..ఆ రాజ్యంలో కొంతమంది ప్రజలను బానిసల్లా చూస్తూ ఉంటారు. ఇంతలో మెరుపులు మెరవడం వాళ్ళను కాపాడడానికి బాలయ్య వస్తున్న ఇండికేషన్స్ ఇవ్వడం నిజంగా ఒక చిన్న సినిమా కథలా ఉంది ఈ ట్రైలర్.

భార్య కంటే మూడేళ్ళు చిన్న.. ట్విస్ట్ ఇచ్చిన మణికంఠ!

ఇదేందయ్యా ఇది.. మణికంఠ రోజుకో నాటకం ఆడుతున్నాడా లేక నిజంగా నిజమే చెప్తున్నాడా అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే హౌస్ లోకి వచ్చిన మొదటి వారంలోనే అందరికి సెంటిమెంట్ కార్డ్ చూపించాడు. ఇప్పుడేమో మరో కొత్త ట్రాక్ వేస్తున్నాడు మణికంఠ బాబు. హౌస్ లో ఎవరు? ఏంటనేది రోజులు గడిచేకొద్దీ అందరికి తెలుస్తుంది కానీ మన బాబు మణికంఠ ఇచ్చే ట్విస్ట్ లు ఏ సినిమాలోనూ ఉండవు.. ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉంటది.  నిన్నటి ఎపిసోడ్ లో నాగ మణికంఠ ఓ సీక్రెట్ రివీల్ చేశాడు. గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, హరితేజలతో తన భార్య తనకి పంపిన లెటర్ గురించి మణికంఠ చెప్పాడు. లెటర్‌లో హాయ్ జూనియర్ అంటూ రాసిందంటూ మణికంఠ చెప్పగానే.. అదేంటి జూనియర్ అని పిలిచిందంటు హరితేజ, టేస్టీ తేజ వాళ్ళంతా అడిగారు.  తను నన్ను కన్న, జూనియర్ అంటుంది.. తన ఫోన్‌లో నా నంబర్‌ను జూనియర్ అని సేవ్ చేసుకుంటుందని మణికంఠ చెప్పగా.. అంటే మీరు ఇద్దరూ సేమ్ కాలేజా అంటూ తేజ అడిగాడు. కాదు తనకంటే నేను మూడేళ్లు(3 Years) చిన్నోడిని అందుకని అలా జూనియర్ అంటుందని మణికంఠ చెప్తాడు. అది విన్న గంగవ్వ, టేస్టీ తేజ, హరితేజ షాకవుతారు. ఇక గంగవ్వ అయితే ఎవరికంటే చిన్నోడు వాళ్ల భార్య కంటేనా అని  అడుగగా.. అవునని తేజ చెప్తాడు. దాంతో గంగవ్వ నోరెళ్ళబెడతుంది. ఇక మొన్నటి వారంలో మణికంఠ బాబుకి వాళ్ళ ఆవిడ రాసిన లెటర్ ని బిగ్ బాస్ పంపించాడు. అందులో తనేం రాసిందో ఓసారి చూద్దాం...  హే జూనియర్ కంగ్రాట్యులేషన్స్.. ఈ సీజన్‌లో జైల్లోకి వెళ్లిన ఫస్ట్ పర్సన్ నువ్వే.. గేమ్ చాలా బాగా ఆడుతున్నావ్.. బయట ఏమనుకుంటున్నారో ఆలోచించి హౌస్‌లో డిస్ట్రబ్ అవ్వకు.. మహాభారతంలో అర్జునుడిలా ఉండు.. పక్షి కన్ను మీద మాత్రమే ఫోకస్ చెయ్.. బయట మేమంతా ఉన్నాం నీకు.. ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు.. ఇట్లు శ్రీప్రియ అంటు మణికంఠ భార్య రాసుకొచ్చింది. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఒక రకం.. మనోడు మరో రకం అని అందరికి తెలిసిందే. హౌస్ లో ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కానీ వాళ్ళ లిస్ట్ లో మణికంఠ బాబు ఉన్నాడు.   

విష్ణుప్రియ మాటలకి ఏడ్చేసిన రోహిణి.. అతనే కారణమా!

బిగ్ బాస్ సీజన్-8 యమ క్రేజ్ గా సాగుతుంది. హౌస్ లో ప్రేమ పక్షులు ఎవరంటే విష్ణుప్రియ, పృథ్వీ అని చెప్పొచ్చు. విష్ణుప్రియ ఎక్కవగా పృథ్వీతో ఉండడం.. నా మనసులో ఒకరున్నారంటూ ఇండైరెక్ట్ గా చెప్పడం.. ఇదంతా చూస్తుంటే విష్ణుప్రియ కంటెంట్ కోసం చేసినట్లు లేదు.. నిజంగానే ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తుంది.  ఇన్ని రోజుల నుండి హౌస్ మేట్స్ కే కాదు ఆదివారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి కూడా వాళ్లిదరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అనుకుంటున్నారు. రోహిణి దగ్గరికి విష్ణుప్రియ వచ్చి.. నాకు అతని నుంచి ఎనర్జీ వస్తుంది. హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి నేను ఎప్పుడైనా డౌన్ అయితే.. లో ఫీల్ అయితే అక్కడికి వెళ్తాను. కానీ నేను ఎప్పుడైనా అందరితో ఉంటానని విష్ణుప్రియ అంటుంది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మీరు ఏదైనా చేస్తే.. అందరి ముందు నేను చెప్తే అను.. మీరు అందరి ముందు క్లోజ్ గా ఉంటారు. క్లోజ్ మీన్స్ నువ్వు ప్రొద్దున ఆల్రెడీ స్పెషల్ పర్సన్ అని చెప్పావని రోహిణి అంటుంది. నువ్వు అవినాష్ ప్రొద్దున కూడా ఎదో అంటున్నారు.. నేను వర్డ్స్ గుర్తుపెట్టుకొను ఓన్లీ ఎమోషన్ గుర్తు పెట్టుకుంటా అని విష్ణుప్రియ అంటుంది. ఏదైనా ఫన్నీగా చేస్తాం అంతేగానీ మీ రిలేషన్ ని స్పెషల్ గా నేనేం రిజిస్టర్ చెయ్యట్లేదని రోహిణి అంటుంది. అర్ధం అయిందా... ఇక నుండి మీ మ్యాటర్ తియ్యను.. నేనే అందరి ముందు మీ గురించి రిజిస్టర్ చేసేలా అన్నానంటే సారీ అని విష్ణుప్రియకి రోహిణి చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోహిణి టాస్క్ నుండి బయటకు వస్తుంది. విష్ణుప్రియ, రోహిణి మాట్లాడుకుంటారు. నువ్వు చేసింది నాకు హర్టింగ్ గా ఉంది.. ఆల్రెడీ బాల్స్ నాకు ఎక్కువ అతుక్కున్నాయి. అందరు టార్గెట్ చేశారు. కానీ నువ్వు బాల్స్ ఉన్నాయా ఓహ్ ఓకే అంటూ నువ్వు అనుకోవడం.. నాకు హర్టింగ్ ఉందంటూ విష్ణుప్రియతో రోహిణి చెప్పేసి వెళ్లిపోతుంది.

రెండో మెగా చీఫ్ గా మెహబూబ్.. హరితేజకి బ్యాడ్ లక్!

బిగ్ బాస్ హౌస్ లో రెండు గ్రూప్ లకి మధ్య పోటాపోటీగా టాస్క్ లు జరుగుతున్నాయి. ఇక ఈ వారం హోటల్ టాస్క్ జరుగగా.. పాత కంటెస్టెంట్స్ హోటల్ స్టాఫ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్లు అందరూ హోటల్ కి గెస్ట్స్. అయితే గెస్ట్స్ అందరు కూడ హోటల్ స్టాఫ్ దగ్గర సర్వీస్ తీసుకొని వాళ్లకి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ వచ్చారు. టాస్క్ ముగిసే టైమ్ కి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందో.. వాళ్లే విన్ అన్నారు బిగ్ బాస్. అందులో వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లు విన్ అయ్యారు. హౌస్ లోకి వచ్చిన ఏనిమిది మందిలో ఆరుగురు మాత్రమే బిగ్ బాస్ కంటెండర్స్ అవుతారు. వాళ్ళెవరో మీరే డిసైడ్ అయి చెప్పండి అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో పాటు పాత కంటెస్టెంట్స్ లో ఎక్కువ స్టార్ లు వచ్చిన వాళ్లు ఎవరు అని అడుగగా.. మణికంఠ, నబీల్ లకి వచ్చాయని నబీల్ చెప్తాడు. మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అవుతారు. అది ఎవరో చెప్పమని అంటాడు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఏనిమిది మందిలో గంగవ్వ, టేస్టీ తేజ తప్ప మిగిలిన ఆరుగురు మెగా చీఫ్ కంటెండర్స్.. అయితే వాళ్లలో అందరు మణికంఠ అని చెప్పడంతో మణికంఠ కంటెండర్ అవుతారు. ఇక ఓ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. అదేంటంటే ఏడుగురికి స్టిక్కర్స్ ఉన్న కోట్ వేసుకొని మిగతా ఇంటి సభ్యులందరు ఒకేసారి బాల్స్ విసురుతారు. ఎవరికి ఎక్కువ బాల్స్ అతుక్కొని ఉంటాయో వాళ్ళు అవుట్ అఫ్ ది రేస్.. దీనికి సంచాలకుడిగా టేస్ట్ తేజ ఉంటాడని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో మూడు లెవెల్ లు ఉంటాయి. మొదటగా గౌతమ్, నయని పావని, రోహిణి లు అవుట్ అఫ్ ది రేస్.. ఇక మిగతా నలుగురికి చేత్తో బ్యాలెన్సింగ్ చేయాలని బిగ్ బాస్ చెప్తాడు. అలా బజర్ మొదలవ్వగానే బిగ్ బాస్  చెప్పినప్పుడు ఒక్కొక్క వస్తువు ఒకదానిఫై ఒకటి పెడుతూ ఉంటారు. ఈ టాస్క్ లో అవినాష్, మణికంఠ పక్కకి తప్పుకోగా చివరగా మెహబూబ్, హరితేజ ఉంటారు. అయితే బిగ్ బాస్ లాస్ట్ కి ప్లేట్ అని చెప్తాడు. హరితేజ ప్లేట్ పెట్టుకున్నాక కిందపడిపోతుంది. మెహబూబ్ ప్లేట్ పెట్టుకోడు కానీ హరితేజది పడ్డాక పడుతుంది. ఇక నబీల్ సంచాలకుడు. అతని నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి మెహబూబ్ విన్నర్ అని చెప్తాడు. ఎందుకంటే హరితేజ రెండుసార్లు చేత్తో సరిచేసిందని తన నిర్ణయం బిగ్ బాస్ కి చెప్తాడు నబీల్. ఆ తర్వాత నబీల్ గోల్డ్ బ్యాండ్ ని మెహబూబ్ కి పెడతాడు. ఇలా ఈ టాస్క్ లో మెహబూబ్ గెలుస్తాడు హరితేజ జస్ట్ మిస్ అవుతుంది.

ఫైమా మనసు ఎంత గొప్పదో...

పటాస్ ఫైమా గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎందుకంటే పటాస్ షో నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ కి కూడా వెళ్లొచ్చి మంచి పేరు సంపాదించింది. అలాంటి ఫైమాలో హ్యుమానిటీ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె కొంతమంది స్కూల్ పిల్లలకు యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేసింది. విషయం ఏమిటి అంటే ఫైమా-ప్రవీణ్ ని సోషల్ మీడియాలో ఒక అమ్మాయి కాంటాక్ట్ అయ్యింది. విశాఖపట్నం తాటిచెట్లపాలెంకి చెందిన ఆ అమ్మాయి కొంతమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లేదని దాని కారణంగా వాళ్ళు స్కూల్ కి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయారని చెప్పడంతో ఫైమా మనసు కరిగిపోయింది. ఆ పిల్లల పరిస్థితి చూసి  ఫైమా- ప్రవీణ్ స్పందించారు. ఇద్దరూ మాట్లాడుకుని ఆమెకు ఫోన్ చేసి యూనిఫామ్ కి కావాల్సిన డబ్బును అందించారు. దాంతో ఆమె అక్కడి పిల్లలకు యూనిఫామ్ ని తీసుకుని అందించింది. ఇప్పుడు ఆ వీడియోని ఫైమా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా మంది సాయం అడుగుతూ ఉంటారని కానీ పిల్లలు అనేసరికి తన చిన్నప్పుడు తాను యూనిఫామ్ లేక పడిన కష్టం గుర్తొచ్చి వెంటనే స్కూల్ పిల్లలకు యూనిఫామ్ అందించే ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చింది ఫైమా. ఇక ఆ యూనిఫామ్ అందుకున్న  స్టూడెంట్స్ అంతా కూడా ఫైమాకి థ్యాంక్స్ చెప్తూ ఒక వీడియోని పంపించారు.