రోహిణిని బాడీ షేమింగ్ చేసిన పృథ్వీ!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం నామినేషన్ లో వ్యాలిడ్ రీజన్స్ చెప్పిన వారు తక్కువే కానీ వారు వేసిన నామినేషన్ పాయింట్లని సరిగ్గా డిఫెండ్ చేసుకున్నవారిలో ప్రేరణ బెస్ట్ . ఎందుకంటే పృథ్వీ వేసిన నామినేషన్ లో అసలు పాయింటే లేదు. పృథ్వీ తన మొదటి నామినేషన్ గా ప్రేరణని చేశాడు. కిల్లర్ గర్ల్స్‌గా ఉన్నప్పుడు నువ్వు పర్సనల్‌గా తీసుకొని నన్ను నామినేట్ చేశావ్.. అలానే నీకు షార్ట్ టెంపర్ ఉందని ఒప్పుకున్నావ్.. అందుకే నామినేట్ చేస్తున్నానంటూ పృథ్వీ చెప్పాడు. టెంపర్ గురించి నువ్వు చెబుతున్నావా అంటూ ప్రేరణ నవ్వుకుంది. ఇక నామినేషన్ పాయింట్లో ఇద్దరూ సేమ్ అనిపించారు.. డిఫెన్స్ చూశాను.. నువ్వు వీక్ అనిపించి నామినేట్ చేశానంటూ ప్రేరణ చెప్పింది. అలా ఎలా చెప్తావంటూ పృథ్వీ అంటే నేనేమైనా కురిడీనా అంటూ కన్నడలో మాట్లాడింది ప్రేరణ. కురిడీనా అంటే గుడ్డిదాన్నా అని అర్థం. అయిన అగ్రెషన్ అయిన వ్యక్తి షార్ట్ టెంపర్‌కి నామినేట్ చేయడం వింతగా ఉందంటూ ప్రేరణ అంది. సెకెంఢ్ నామినేషన్ గా రోహిణిని చేశాడు పృథ్వీ . మీరు మనసు గెలిచేదే కాదు ఆట కూడా ఉండాలి.. మీరు ఆటలో వీక్‌గా ఉన్నారంటూ పృథ్వీ అన్నాడు. దీంతో ఏ టాస్కులో అంటూ రోహిణి అడిగితే.. బోన్ టాస్కులో.. మీరు వీక్ కాబట్టే లాస్ట్ వరకు ఉంచారు.. ఎఫెర్ట్ పెడుతున్నారు కానీ విన్ అవ్వడం లేదంటూ పృథ్వీ అన్నాడు. దీనికి నువ్వు ఒకసారైనా చీఫ్ అయ్యావా అంటూ రోహిణి అడిగింది. దీంతో మీరు గేమ్‌లో జీరో.. అలానే పని కూడా చేయడం లేదంటూ పృథ్వీ వాదించాడు. దీనికి నువ్వు నేనే కదా వాష్ రూమ్స్ క్లీన్ చేసిందని రోహిణి అంది. మీరు చేసింది అయితే నేను చూడలేదంటూ పృథ్వీ అన్నాడు. నువ్వు అడ్డదిడ్డంగా వాదిస్తానంటే వాదించు.. నీ దగ్గర అసలు మేటర్‌యే ఉండదు.. మాట్లాడే మేటర్‌యే ఉండదు.. మంచిగా రెడీ అవుతావ్.. అద్దం ముందుకెళ్లి ఇలా ఇలా చూసుకుంటావ్.. కాఫీ తాగేసి కప్పు ఆమెకిచ్చేస్తావ్.. ఆమె కడిగేస్తది.. అంటూ రోహిణి రెచ్చగొట్టింది. దీనికి నేను ఆడుతున్నాను కాబట్టే  ఎనిమిదవ వారానికి వచ్చానంటూ పృథ్వీ అన్నాడు. అదే ఎలా వచ్చావో నాకు తెలీడం లేదు.. ఎవరివల్లో నువ్వు ఉన్నావంతే.. ఏదో టాస్కుల్లో పరిగెట్టేశాను అంటే కాదంటూ రోహిణి అంది. దీనికి రన్నింగ్ కూడా ఉండాలి కదా.. అంత ఈజీ కాదు.. రన్నింగ్ అంటూ రోహిణిని పై నుంచి కిందకి చూశాడు పృథ్వీ. దీంతో ఏంటి ఆ లుక్కేంటి.. ఆ చూపేంటి.. ఆ చూడటమేంటి బాడీ షేమింగా.. నువ్వు చూసిన విధానం.. నాకు తెలుసు.. తొక్కలో నామినేషన్స్ చేయకంటూ రోహిణి ఫైర్ అయింది. ఇక కుండ పగలగొట్టేసిన తర్వాత కూడా రోహిణి తగ్గలేదు. ఆళ్లు.. ఇళ్లూ అన్నీ చేస్తే ఇంట్లో తినేసి కూర్చుంటాడు.. వెధవ లుక్కులు ఇస్తున్నాడు.. వెధవ లుక్కులు.. అంటూ తిట్టుకుంది రోహిణి. ఇలా మనిషిని కించపరిచేలా ఉన్న పృథ్వీ బిహేవియర్ ని వీకెండ్ లో నాగార్జున వచ్చి వార్నింగ్ ఇస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.  

పృథ్వీ కోసం విష్ణుప్రియ నామినేషన్.. ప్రేరణని బలిచేసిందిగా!

  బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం నామినేషన్ల‌ ప్రక్రియ మొదలైంది. ఎనిమిదో వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారో డిసైడ్ చేయండి అంటు ప్రతీ సీజన్ లో ఉండే కుండ పగులగొట్టే ప్రక్రియని ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ ప్రక్రియ విష్ణుప్రియతో మొదలైంది. ఫస్ట్ నామినేషన్ ప్రేరణకి వేసింది విష్ణుప్రియ. నువ్వు నీకు ఇచ్చిన కిల్లర్ గర్ల్ పవర్‌ను దుర్వినియోగం చేసుకున్నావ్.. సరైన వ్యక్తిని నువ్వు నామినేట్ చేయలేదు (ఇండైరెక్ట్‌గా పృథ్వీని నామినేట్ చేసినందుకు).. వీకెండ్ రివ్యూలో కూడా అదే చెప్పారు.. ఇక ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా.. కానీ నువ్వు ప్రతిదీ అంత కాలిక్యులేటెడ్‌గా ఉండటం నాకు నచ్చలేదు.. ఒక ఫ్యామిలీలో ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారంటూ విష్ణుప్రియ చెప్పింది. నువ్వు పెద్దపెద్ద పదాలు వాడకు విష్ణు.. ఇక్కడ ఎవరికీ అమ్మానాన్న తమ్ముడు అలా ఫ్యామిలీలా ఏం లేదు.. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకు తినాలి.. అందరికీ సేమ్ టాస్క్, సేమ్ ఎనర్జీ ఉంటుంది..కనుక ఒకలానే తినాలి అంటూ ప్రేరణ చెప్పింది. దీనికి నువ్వు చిరాగ్గా ఫేస్ పెడతావ్.. అది నాకు నచ్చదు.. అంటూ విష్ణు చెప్పింది. అలానే నాగార్జున సార్ చెప్పినా కూడా నీ తప్పు యాక్సెప్ట్ చేయవ్ అంటూ విష్ణు వాదించింది.అవును చేయను.. నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంది .. అది తగ్గించుకుంటున్నా.. అంటూ ప్రేరణ అంది. విష్ణుప్రియ తన రెండో నామినేషన్ గా నిఖిల్‌ ని చేసింది. నువ్వు చీఫ్ నుంచి దిగిపోయాకా నీలో ఫైర్ పోయింది.. నీ సిగరెట్ అలవాటు వల్ల ఛార్జింగ్ టాస్కులో పాయింట్ పోయిందంటూ విష్ణుప్రియ అంది. దీనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. అప్పుడు నేన చీఫ్ అందుకే అలా ఉన్నా.. నేను చీఫ్ కానప్పుడు నేను లీడర్ షిప్ చూపిస్తే అందరు ఊరుకుంటారా.. ఇక లైటర్ విషయానికొస్తే నేను ఫుడ్ కూడా త్యాగం చేసి ఉన్నా.. అలానే మిగిలిన వాళ్లు కూడా ఉన్నారు.. మరి నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేశావ్ కదా.. దానికి పాయింట్లు పోయాయ్‌ కదా అని నిఖిల్ అనగానే.. విష్ణుప్రియ మొహం వాడపోయింది. ఇక కవర్ చేసుకోడానికి నీ నోటిదూల కారణంగా నామినేట్ చేస్తున్నానంటు విష్ణుప్రియ అంది. అయితే ఇక్కడ విష్ణుప్రియకి ఎవరిని నామినేట్ చేయాలో క్లారిటీ లేదు. కానీ పృథ్వీని నామినేట్ చేసిన ప్రేరణని నామినేట్ చేసింది. ఆ తర్వాత నిఖిల్ ని నామినేట్ చేస్తే ఏం అనుకోడు.‌ అదే ఇంకెవ్వరిని నామినేట్ చేసిన విష్ణుప్రియ డిఫెండ్ చేసుకోలేదు‌ అందుకే చెత్త రీజన్స్ తో వారిద్దరిని నామినేట్ చేసింది. రోజు రోజుకి పృథ్వీకి సర్వెంట్ లా మారిపోతున్న విష్ణుప్రియ ఓటింగ్ గ్రాఫ్ పడిపోతుంది. హౌస్ లోకి వచ్చి ఎనిమిది వారాలు అవుతున్న ఒక్క గేమ్ లో యాక్టివ్ పర్ఫామెన్స్ లేదు.. ఎప్పుడు చూసిన పృథ్వీ వెనకాలే తిరుగుతూ వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంటుంది విష్ణుప్రియ.

శివాజీ క్లాస్ దెబ్బకి గట్టిగా అరిచిన రష్మీ!

  జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "జనక ఐతే గనక" మూవీ టీమ్ వచ్చింది. అలాగే ఈ షోలో సుహాస్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక జడ్జ్ గా వచ్చిన శివాజీ ఐతే రష్మీకి తెగ క్లాస్ పీకేసాడు. సుహాస్ స్టేజి మీద రాగానే "ఆడియన్స్ ఈ సినిమా నుంచి ఎం ఆశించవచ్చు" అని రష్మీ అడిగింది. "పిల్లల్ని ఎందుకు లేట్ గా కంటున్నారు..లేట్ గా సెటిల్ అవుతున్నారు" అంటూ ఆన్సర్ ఇచ్చేసరికి ఇక శివాజీ తగులుకున్నాడయ్యో. శివాజీ క్లాసులు పీకడంలో దిట్ట అని బిగ్ బాస్ లో ఆల్రెడీ చూసి ఉన్నాం కదా. ఇక ఇప్పుడు రష్మీకి ఇచ్చాడు క్లాస్. "సెటిల్ అనే పదానికి చాలామంది కరెక్ట్ మీనింగ్ తెలుసుకోలేకపోతున్నారు. సెటిల్ అంటే అప్పులు లేకుండా ఉండటం. కొంతమందికి ఎంత చెప్పినా వినరు..అర్ధం కాదు. వాళ్ళు అలాగే చేసుకుంటా పోతా ఉంటారు. రష్మీ లాగా" అనేసరికి అప్పటి వరకు చాలా సీరియస్ గా తిలకిస్తున్న రష్మీ ఒక్కసారిగా ఆ పంచ్ తన మీదకు వచ్చేసరికి "హలో" అని గట్టిగా అరిచింది.  

రోహిణి ఎవరిని నామినేట్ చేసిందంటే.. వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ!

  బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో కొంతమంది రివెంజ్ నామినేషన్ చేయగా మరికొందరు సిల్లీ రీజన్స్ చెప్తూ నామినేట్ చేశారు.  బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి చెప్పాడు. ప్రతి ఇంటి సభ్యుడు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేని ఇద్దరు సభ్యుల దిష్టి బొమ్మల మీద కుండలు పెట్టి కారణాలు చెప్పి వాటిని పగలగొట్టాల్సి ఉంటుంది.. మెగా చీఫ్ కారణంగా గౌతమ్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. గౌతమ్.. ఈ ఇంట్లో ఒక నామినేషన్ షీల్డ్ ఉంది.. ఆ నామినేషన్ షీల్డ్‌ని మీకు నచ్చినవారికి ఇవ్వండి.. అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సభ్యుడిని ఈ వారం నామినేట్ చేసిన ప్రతిసారి రూ.50 వేల రూపాయలు విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి డిడక్ట్ అవుతాయంటు చెప్పాడు. ఇక విష్ణుప్రియ చెత్త రీజన్స్ చెప్పి ప్రేరణ, నిఖిల్ లని నామినేట్ చేసింది. ఆ తర్వాత రోహిణి వచ్చింది. రోహిణి మొదటగా నిఖిల్‌ను నామినేట్ చేసింది. ఛార్జింగ్ టాస్కులో నువ్వు గౌతమ్‌పై ఫిజికల్ అయింది నాకు నచ్చలేదు.. గౌతమ్ కూడా చేశాడనుకో చీఫ్ అయిపోయాడు కాబట్టి బతికిపోయాడు.. సో అలా లాగడం, సోఫాపై విసిరేయడం నచ్చలేదు.. అలానే లైటర్ కోసం పాయింట్లు ఇచ్చేయడం కూడా ఓ రీజన్ అంటూ రోహిణి చెప్పింది. దీనికి నిఖిల్ డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత సెకెండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది రోహిణి. నువ్వు టాస్కుల విషయానికొస్తే చాలా అగ్రెసివ్ అవుతున్నావ్.. సెల్ఫిష్‌గా ఆడతావ్.. నువ్వు చెప్పింది వినవ్.. టాస్కు, నామినేషన్ తప్ప విష్ణు పక్కన కాకుండా ఎక్కడా కనిపించలేదు.. నీ బిహేవియర్ నాకు నచ్చలేదు.. ఓన్లీ బాడీ ఉంటే చాలదంటూ రోహిణి పాయింట్లు చెప్పింది. ఇక్కడ రోహిణి అపోజిట్ టీమ్ కాబట్టి నిఖిల్ ని నామినేట్ చేసింది. కానీ సొంత క్లాన్ మెంబర్ అయినటువంటి నిఖిల్ ని విష్ణుప్రియ నామినేట్ చేసింది. అలాగే పృథ్వీ కోసం ప్రేరణని నామినేట్ ని చేసింది విష్ణుప్రియ.

కావ్యతో నిఖిల్ బ్రేకప్.. బిగ్ బాస్ గేమ్‌లో ఏదో మిస్ అవుతోంది!

  బిగ్ బాస్ సీజన్-8 లో నిఖిల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్. అయితే ఈ మధ్య తన ఆట డల్ అయిందని ఎంతోమంది చెప్పారు. అదే విషయాన్ని తన మాజీ ప్రేమికురాలు కావ్యశ్రీ చెప్పుకొచ్చింది.  'గోరింటాకు' సీరియల్‌తో మొదలైన కావ్య-నిఖిల్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవాళ్లు.. షో నుంచి ఈవెంట్స్ వరకూ, పార్టీ నుంచి ఫంక్షన్ వరకూ ఎక్కడ చూసినా వీళ్లిద్దరూ జంటగానే కనిపించేవారు. ఇక వీళ్లు కలిసి చేసిన రీల్స్, యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు అయితే తెగ వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్‌కి కూడా బుల్లితెర బెస్ట్ పెయిర్స్‌లో వీళ్లు కూడా ఒకరు. అలాంటి ఈ జంట ఇటీవలే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో కొంతమంది కంటెస్టెంట్లతో చెప్పాడు. అందుకే నిఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా ఇప్పటివరకూ కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు కావ్యశ్రీ.  అయితే తాజాగా నిఖిల్ బిగ్‌బాస్‌కి వెళ్లాక కావ్య ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయింది. మరి ఏం చెప్పిందో చూద్దాం. ఇటీవల స్టార్ మాలో ప్రసారమైన పరివార్ అవార్డ్స్ ఫంక్షన్‌కి కావ్యశ్రీ కూడా వచ్చింది. ఈ సందర్భంగా కావ్యను ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అడిగింది అరియానా. "బిగ్‌బాస్ చూస్తున్నారా.. నిఖిల్ ఎలా ఆడుతున్నాడంటూ అరియానా అడుగగా.. చాలా బాగా ఆడుతున్నాడు.. నార్మల్‌గానే తను చాలా స్ట్రాంగ్.. బయట ఈవెంట్స్‌లో కూడా జరిగిన గేమ్స్, అన్నింట్లో తను ఎలా ఆడతాడో మనకు తెలుసు. కానీ కొంచెం ఎక్కడో ఏదో మిస్ అవుతుంది.. ఒక్కటి తక్కువ అయింది పుష్ప అనిపిస్తుంది.. తను తనలా లేడని నాకు అనిపిస్తుంది.. కొంచెం ఆ విషయం తెలుసుకుంటే బావుటుంది.. ఎందుకంటే తను ఏదైతే కాదో అలా బిహేవ్ చేస్తున్నాడు.. అది కరెక్ట్ చేసుకుంటే బావుంటుందంటూ కావ్య చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. నిఖిల్-కావ్య బ్రేకప్ మాట నిజమేనని ఫిక్స్ అయిపోయారు. అలానే వీళ్లిద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. నిఖిల్ మనసులో కావ్య ఇప్పటికీ అలానే ఉందని.. వాళ్లిద్దరూ ఖచ్చితంగా మళ్లీ కలుస్తారంటూ ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం కావ్య మాట్లాడిన ఈ వీడియో సోనియా ఎలిమినేషన్‌కి ముందు షూట్ చేసిందంటూ చెబుతున్నారు.  

Karthika Deepam2 : ఆ ఇంటికి వెళ్ళిన దీప.. తాళి తీసేయమన్న జ్యోత్స్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం '(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -181 లో......దీప బాధపడుతూ ఉంటే కార్తీక్ వస్తాడు కార్తీక్ చేసిన పనికి దీప చాలా కోపంగా ఉంటుంది. శౌర్య నాన్న కావాలని అడిగింది. దాంతో అలా చేశానని కార్తీక్ అంటాడు. అది చిన్న పిల్ల దానికేం తెలుసని దీప అంటుంది. అది మళ్ళీ ఆ నర్సింహా వస్తాడని బయపడుతుందని కార్తీక్ అనగానే.. భయపడితే ఏంటని దీప అంటుంది. చచ్చిపోతుందని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది. ఏంటని దీప అడుగుగా.. ఏం లేదని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. నీకు భర్తని అవ్వాలని ఆ తాళి కట్టలేదు.. కేవలం శౌర్యకి నాన్న కావాలని మాత్రమే చేసానని కార్తీక్ అంటాడు. దీన్ని ఎవరు మార్చలేరని కార్తీక్ అంటాడు. దీప తులసి చెట్టు దగ్గర దీపం పోతుంటే దీప చేతులు ఆడ్డు పెట్టి ఆపుతుంది. అది చూసి దీపం కోసం అలా చేసావ్.. ఒక పసిదాని కోసం ఇలా చేసానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర ఇంటికి దీప వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత దీపకి అనసూయ కాఫీ తీసుకొని వస్తుంది. వచ్చేసరికి దీప ఉండదు. దాంతో మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటూ శౌర్య ఏడుస్తుంది. దీపకి కార్తీక్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవదు. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఇంత మోసం చేసిన దీపని వెళ్లి అడగండి అని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. అవసరం లేదు దాని కోసం ఆ ఇంట్లో అడుగుపెట్టలేను. దాన్ని ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వనని శివన్నారాయణ‌ అంటాడు. అప్పుడే దీప వస్తుంది. ఎందుకు వచ్చావంటూ పారిజాతం తిడుతుంది. నా తప్పేం లేదని చెప్పడానికి వచ్చానని దీప అంటుంది. అయితే ఆ తాళి తీసేయ్ అంటూ జ్యోత్స్న అనగానే అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఈ దీపతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయ్ మమ్మీ .. మీ ఎమోషనల్ చూస్తుంటే దీపనే మీ కూతురు అనేలా ఉన్నాయని  సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భార్య పుట్టింటికి వెళ్ళిన భర్త.. ప్రేయసి రిక్వెస్ట్ తో అక్కడికి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -232 లో.....రామలక్ష్మి తన పుట్టింటికి వెళదామని అనడంతో సీతాకాంత్ త్వరగా ఇంటికి వస్తాడు. అప్పుడే రామలక్ష్మి, శ్రీలత ఇద్దరు ఆర్గుమెంట్ చేసుకుంటారు. మీరు పదండీ వెళ్లి త్వరగా రెడీ అవ్వండి అంటు సీతాకాంత్ ని పైకి తీసుకొని వెళ్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత రామలక్ష్మి బట్టలు సర్దుతుంది. సూట్ కేసు తనకి పెట్టడం రాకపోతే సీతాకాంత్ వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటుంటారు. రామలక్ష్మి సీతాకాంత్ లు తలలు డాష్ ఇచ్చుకోవడంతో కొమ్ములు వస్తాయని రామలక్ష్మి అనగానే మళ్ళీ డాష్ ఇస్తాడు. మరొకవైపు సీతాకాంత్ పై ప్రేమతో తన ఇంటికి తీసుకొని వెళ్ళింది రామలక్ష్మి. పూర్తిగా సీతాకాంత్ ని ఇక తనకి వైపుకి తిప్పుకుంటుందని నందినితో హారిక అంటుంది. అలా ఎప్పుడు జరగదు. నేను వాళ్ళని విడగొడతానని నందిని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వాళ్లు తన పుట్టింటికి వస్తారు. సీతాకాంత్, సిరి లు కూడా వస్తారు. వాళ్ళని సుజాత, మాణిక్యంలు అహ్వానిస్తారు. మాణిక్యం పై సీతాకాంత్ కాస్త కోపంగానే ఉండటంతో.. తనకి దూరంగానే ఉంటాడు మాణిక్యం. ఆ తర్వాత సీతాకాంత్ కి నందిని ఫోన్ చేసి ఆఫీస్ కి రమ్మని చెప్తుంది. ఇప్పుడు వీలు అవ్వదని సీతాకాంత్ చెప్తాడు. అయిన కూడా నందిని వదలదు.. ఫారేనర్ తో మీటింగ్ ఉంది.. అది ఓకే అయితే కంపెనీ కి చాలా బెన్ఫిట్ అని నందిని అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. అదే విషయం రామలక్ష్మి వాళ్లకి సీతాకాంత్ చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత మీటింగ్ నందిని ఇంట్లో జరుగుతుంది. అందరం డిన్నర్ చేద్దామని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని సీఈఓగా చూసి షాకైన రాజ్.. ఇక దేత్తడే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -546 లో.....అపర్ణ ఇందిరాదేవి, కనకంలు కలిసి మళ్ళీ కావ్య రాజ్ ని కలపడానికి ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా కావ్య దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇప్పడేం ప్లాన్ తో వచ్చారని కావ్య అంటుంది. వాళ్లు పట్టించుకోకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు. నీపై పడ్డ నిందని నిందగానే ఉంచుతావా దాన్ని పోగొట్టుకోవా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత నువ్వు ఎక్కడో పని చేస్తేనే కదా ఇదంతా.. అదే మన కంపెనీ లో వర్క్ చేస్తే అప్పుడు అందరూ అనుకున్నది అబద్దం అనుకుంటారు. అందుకే నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలని అపర్ణ అనగానే.. లేదు అక్కడికి వెళ్లినా ఏదో ఒక వంక చెప్పి పంపించాలని చూస్తారని కావ్య అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు చర్చించుకొని కావ్య దగ్గరికి వచ్చి.. నువ్వు కంపెనీలో ఎంప్లాయి అయితే తీసేస్తాడు.. అదే సీఈఓ అయితే తీసేయ్యడు. కంపెనీలో సీఈఓ గా ఉండమని అపర్ణ అంటుంది. వాళ్లు కావ్య ని ఒప్పింస్తుంటే.. అప్పుడే అనామిక వస్తుంది. కావ్య ఎక్కడ వర్క్ చెయ్యాలన్నా నా పర్మిషన్ కావాలి ఎందుకంటే నేనే అది ఈ అగ్రిమెంట్ ఇదిగో అని చూపిస్తుంది. అది అపర్ణ చదివి.. దీనికా నా కోడలిని బేదిరిస్తున్నావంటూ వెళ్లి యాభై లక్షలు చెక్కు.. ఇచ్చి ఇదిగో అందులో అనుకోకుండా వెళ్ళిపోతే ఇరవై అయిదు లక్షలు ఇవ్వాలని ఉంది ఎక్కువే ఇస్తున్నానని అపర్ణ అనగానే.. అనామిక డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి అప్పుడు రాజ్ రెండు కోట్లు ఇచ్చాడు.. అది కూడా ఇవ్వాలి నోటిసులు వస్తాయ్.. పిల్ల కాకి అని అనామికతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత అనామిక సిగ్గుతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక నీకు ఏ ప్రాబ్లెమ్ లేదని అపర్ణ, ఇందిరాదేవిలు చెప్పి కావ్యని ఒప్పిస్తారు. మరొకవైపు కళ్యాణ్ ఆటోలో ప్రొడ్యూసర్, రైటర్ ఎక్కుతారు. వాళ్ళు సాంగ్ గురించి మాట్లాడుకుంటుంటే.. కళ్యాణ్ సిచువేషన్ చెప్పినట్టు సాంగ్ పాడతాడు. దాంతో చాలా బాగా పాడావంటు ఇద్దరు మెచ్చుకుంటారు. తరువాయి భాగంలో రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. అది మీ రూమ్ కాదు సర్.. కొత్త సీఈఓ మేడమ్ వచ్చిందనగానే రాజ్ వెళ్లి చూసేసరికి కావ్య ఉంటుంది. తనని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నామినేషన్ లో పృథ్వీ, రోహిణి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్.. విష్ణుప్రియ సిల్లీ రీజన్!

  బిగ్ బాస్ సీజన్-8 తెలుగు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో అటు బిగ్ బాస్ కి ఇటు ఆడియన్స్ కి  షాకిచ్చాడు మణికంఠ. ఇక ఎనిమిదో వారం నామినేషన్లకి సంబంధించిన ప్రోమో రానే వచ్చింది. హౌస్ లో వారమంతా ఒక ఎత్తు.. నామినేషన్లు ఒక ఎత్తు.. ఎందుకంటే వారమంతా ఎవరేం చేసారో చూస్తూ.. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ తమ అభిప్రాయాలని చెప్తూ హౌస్ నుండి ఒకరిని బయటకు పంపడానికి నామినేషన్ చేస్తుంటారు. అలా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. అసలు ఇందులో ఏం ఉందో ఓసారి చూసేద్దాం.. మణికంఠ విషయంలో నువ్వు అసలు మెహబూబ్ కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సిందంటూ నిఖిల్ ని నామినేట్ చేసింది విష్ణుప్రియ. మరి నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేశావ్ కదా అని నిఖిల్ అనగా.. జస్ట్ వన్ పాయింటే ఇచ్చానని విష్ణుప్రియ అంది. నేను కూడా వన్ పాయింటే ఇచ్చానంటు నిఖిల్ డిఫెండ్ చేసుకున్నాడు. చెప్పిన రూల్స్ అసలు వినడం లేదు.. చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావని పృథ్వీని రోహిణి నామినేట్ చేసింది. నా అపోజిట్ టీమ్ నువ్వు నీ రూల్స్ నేనెందుకు ఫాలో అవ్వాలని పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు.  కేబుల్స్ ఇవ్వగానే అలా దాచుకుంటే ఎలా అని రోహిణి అనగా.‌. అది నా స్ట్రాటజీ అని పృథ్వీ అంటాడు. అసలు గేమ్ ఆడకుండా స్ట్రాటజీ ఏంటని రోహిణి అంది. ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్.. అల్రెడీ నీకు నాకు ఫుడ్ మీద వచ్చిందని ప్రేరణని విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఫస్ట్ నువ్వు పెద్ద పెద్ద పదాలు వాడకు‌. ఇక్కడ పెద్దగా ఎవరు లేరు.. అమ్మ, నాన్న, అక్క అంటు ఎవరు లేరు.. అందరం ఈక్వల్ గా ఉన్నామని విష్ణుప్రియతో ప్రేరణ అంది. గేమ్ లో నీ ఎఫర్ట్ కనపడట్లేదని రోహిణితో పృథ్వీ అనగానే.. గేమ్ లో ఎఫర్ట్ లేదా అని రోహిణి అనగానే.. ఉందని పృథ్వీ అన్నాడు. మరి ఇంకేం కావాలంటూ రోహిణి అంది. పృథ్వీ, రోహిణి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్టుగా ఉన్నాయి. ఇక మధ్యలో రోహిణిని పృథ్వీ కించపరిచేలా చూసినట్టుగా ఉంది. దాంతో తను రెచ్చిపోయింది. ఆ చూపేంటి.. నువ్వు నన్ను చూసిన విధానం.. దట్ ఈజ్ నాట్ రైట్ అంటు పృథ్వీతో రోహిణి వాదించింది. ఇక వీరిద్దరి నామినేషన్ ఈ వారం హైలైట్ గా నిలిచేలా ఉంది. యూట్యూబ్ లో ఉన్న ప్రోమో ఇప్పటికే అత్యధిక వీక్షకాధరణ పొందింది.  

రోజమ్మ నాకు అన్నం పెట్టింది..ఆమెను అనడానికి నోరెలా వస్తుందో ?

  కెసిఆర్ కేశవ చంద్ర రామావత్ మూవీ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ కి రాకింగ్ రాకేష్ వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. అలాగే రోజా గురించి కూడా ఎన్నో కామెంట్స్ చేసాడు.  జబర్దస్త్ ఆర్పి ఈమధ్య కాలంలో చూస్తే గనక రోజా మీద ఎంతలా ఫైర్ అవుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు రాకేష్ కూడా ఆమె గురించి మాట్లాడాడు. "ఎన్నికల సమయంలో రోజా గారికి సపోర్ట్ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ మూవీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా" అని అడిగిన ప్రశ్నకు రాకింగ్ రాకేష్ ఇలా చెప్పాడు.."పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకండీ. నేనేమి పెద్ద హీరోని కాదు. అందరి దగ్గరకు వెళ్లి నా సినిమా చూడమని అడుగుతాను అంతే. నా మూవీకి ఏ పార్టీకి సంబంధం లేదు. ఇక రోజా గారు అంటే..నాకు కూతురు పుట్టినప్పుడు ముందు రోజా గారే వచ్చి చూసారు. నా ఇంటికి వచ్చేటప్పుడు గడప బయటే రాజకీయాలు వదిలేసి వచ్చి ఇంటికొచ్చి నార్మల్ గా మాట్లాడతారు. గడప దాటి ఇంట్లోకి రాగానే మా అమ్మ..రోజమ్మ. ఆమె జడ్జ్..నాకు అన్నం పెట్టింది. డబ్బులు అడిగితే ఇచ్చింది. కొంతమందిని అధికారికంగా అడిగి డబ్బులు తీసుకునే చనువు ఉన్నవారిలో రోజమ్మ ఒకరు. అడగకుండా కూడా డబ్బు తీసుకోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజమ్మ..ఇంత చేసాక కూడా ఆమెను అనడం ఎంతవరకు కరెక్ట్...ఎవరెవరో ఏదో అంటారు..లబ్ది పొందినా కూడా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం..." అన్నాడు రాకేష్.

పవన్ కళ్యాణ్ గారి తాలూక.. గాజులేసుకోండి ఆది!

  శ్రీదేవి డ్రామా కంపెనీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి కమిటీ కుర్రాళ్ళు మూవీ టీమ్ సరదాగా ఫన్ చేయడానికి వచ్చింది. దాంతో ఇక్కడ రెండు వర్గాల మధ్య పోటీ గట్టిగా జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వెర్సెస్ కమిటీ కుర్రాళ్ళుగా ఈ షో మారిపోయింది. ఇక ఇందులో రెండు టీమ్స్ మధ్య డైలాగ్స్ వరద మాములుగా లేదు. రైటర్ త్రివిక్రమ్ కూడా తక్కువే. అన్ని డైలాగ్స్ వీళ్ళు చెప్పారు. "ఏమిటి మేము లేకుండా జాతర జరిపిస్తున్నారు..కమిటీ కుర్రాళ్ళు ఇక్కడ" అని ఆ మూవీ టీమ్ ఆదికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. " పది రోజుల క్రితం ఈటీవీ విన్ కి వచ్చిన మీకే అంత ఉంటే పదేళ్ల నుంచి ఈటీవీలో ఉన్న మాకు ఎంతుండాలి" అన్నాడు ఆది. తర్వాత కమిటీ కుర్రాళ్ళ నుంచి ఇంకో కుర్రాడు వచ్చి "నా పేరు ఆత్రం..నాకు అన్నిటికీ తొందరే" అనేసరికి.. " నా పేరు ఆది నేను ఆ ఒక్కదానిలోనే ముందర" అని సెటైర్ వేసాడు. మళ్ళీ ఇంకో కమిటీ కుర్రాడు వచ్చి "మేము కొణిదెల నిహారిక గారి తాలూకా ఇక్కడా" అన్నాడు. "మేము ఎవరి తాలూకానో తెలుసా..కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా" అని ఆది అన్నాడు. దాంతో స్టేజి మొత్తం ఈలలేసింది. తర్వాత సద్దాం స్టేజి మీద జాతర సందర్భంగా ఆడవాళ్ళ గాజులు అమ్ముతూ ఉంటాడు. ఇంతలో కమిటీ కుర్రాళ్ళు, ఆది టీమ్ వచ్చారు. "ఆ కమిటీ కుర్రాళ్ళు గాజులు కొంటె మేము కొనం" అన్నాడు ఆది. "సద్దాం ముందు ఆది గారికే గాజులమ్మేయ్..సర్ మీరు గాజులేసుకోండి" అన్నారు కమిటీ కుర్రాళ్ళు.

Naga Manikanta: హౌస్ లో ఎవరు ఏంటో చెప్పేసిన నాగ మణికంఠ!

  బిగ్ బాస్ ఇంట్లోంచి ఏడో వారం నాగ మణికంఠ(Naga Manikanta) బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఈ వారం అంతా కూడా మణికంఠ సరిగ్గా ఆడలేదు. ఇక్కడ ఉండలేకపోతోన్నాను.. బయటకు వెళ్తాను.. నన్ను పంపించేయండి.. నాకు ఓట్లు వేయకండి.. దండం పెడతానంటూ మాట్లాడేశాడు. దీంతో మణికంఠ చివరకు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆడియెన్స్ అతడ్ని సేవ్ చేసినా కూడా బయటకు వెళ్లిపోయాడు. నేను బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలియదు.. ఆడియన్స్ సపోర్ట్  ఇక్కడి వరకు వచ్చాను.. నా వల్ల కావడం లేదని బయటకు వెళ్తున్నా.. లవ్యూ ఫరెవర్ అంటూ ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు మణికంఠ. ఇప్పటి వరకు ఇంటి నుంచి బేబక్క, శేఖర్ బాషా, అభయ్, ఆదిత్య, నైనిక, సోనియా, సీతలు ఆడియెన్స్ ఓట్ల ద్వారా బయటకు వెళ్లారు. కానీ ఈసారి మణికంఠ తన మాత్రం సొంత నిర్ణయంతో బయటకు వెళ్లిపోయాడు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన మణికంఠ బాబు హౌస్ లో ఎవరు ఏంటో చెప్పుకొచ్చాడు. నయని పావని ఎమోషనల్ పర్సన్. నాలో ఉన్న చాలా లక్షణాలు ఆమెలోను ఉన్నాయి.  ఎదుటివారిని బాగా అర్థం చేసుకుంటుందని మణికంఠ చెప్పాడు. విష్ణుప్రియ నీళ్ళలాగా స్వచ్ఛమైనది. తనకేం చేయాలనిపిస్తే అది చేస్తుంది. నబీల్ ప్రతీ ఇంట్లో ఉండే ఒక సగటు అబ్బాయిలా ఉంటాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా ఆడాలన్న  తెలివి ఉన్న అబ్బాయి అని మణికంఠ చెప్పాడు. మెహబూబ్ చాలా సైలెంట్ గా ఉన్నాడు. విజేతకు ఉండాల్సిన లక్షణాల్లో ఇది ఒక్కటి. హౌస్ ని హ్యాండిల్ చేసే పద్దతి బాగుంది. ఇంకా చాలా ఉందంటూ మణికంఠ అన్నాడు. ఇక అవినాష్, రోహిణి, హరితేజ హౌస్ కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారంటు మణికంఠ బాబు అన్నాడు. టేస్టీ తేజ ఎనర్జీ కనపడటం లేదని చెప్పాడు. నిఖిల్ మొదటి వారాల్లో ఎనర్జీ ఇప్పుడు లేదు.. టాప్-5 ఉంటావని ఆశిస్తున్నానంటు మణికంఠ చెప్పాడు. పృథ్వీ మంచి గేమర్ చిన్న చిన్న పొరపాట్లని పక్కన పెడితే ముందుకెళ్తావని చెప్పాడు. గౌతమ్ ఇప్పుడే ఆట మొదలైంది. అవసరమైనప్పుడే మాట్లాడు. ప్రేరణ అవసరం లేని చోట కూడా తన పాయింట్ చెప్పాలనుకుంటుంది. నీ ఆట నువ్వు ఆడుకుంటే బాగుంటుందని మణికంఠ అన్నాడు. ఇలా బిగ్ బాస్(Biggboss 8 Telugu) హౌస్ లో ఎవరు ఏంటో నాగ మణికంఠ(Naga Manikanta) చెప్పుకొచ్చాడు.

మణికంఠ ముంచేసింది వీళ్లనే.!

  బిగ్ బాస్ సీజన్-8(bigg boss 8 telugu) లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంటెంట్  ఇచ్చింది మణికంఠే. ఓసారి ఇంటలిజెన్స్ చూపిస్తాడు. మరోసారి కన్నింగ్, మరోసారి లవ్, మరోసారి సింపథీ.. ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ని ఒకేసారి చూపించే నాగ మణికంఠ(Naga Manikanta ) నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు. కొన్ని కటౌట్ లు చూస్తే చాలు.. వాళ్ళేంటో అర్థమవుతుంది కానీ ఎవరికి అర్థం కానీ క్యారెక్టర్ బిగ్ బాస్ సీజన్-8(bigg boss 8 telugu) లో ఎవరైనా ఉన్నారంటే అది నాగ మణికంఠే... హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తనదైన శైలీలో ఆడుతూ వచ్చాడు మణికంఠ‌(Manikanta). బయట ఓటింగ్ కూడా చాలా గట్టిగానే ఉంది‌. అయితే ప్రతీవారం నామినేషన్ లో ఉన్న మణికంఠ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండేవాడు. ఈ వారం కూడా అతను టాప్ లోనే ఉన్నాడు కానీ అతనికి ఆడాలని ఉన్నా, హెల్త్ సపోర్ట్ చేయకపోవడంతో ఉండలేనని చెప్పేసాడు మణికంఠ. ఇక ఏడో వారం నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరగా నాగ మణికంఠ, గౌతమ్ మిగిలారు. ఇక ఎలిమినేషన్ ముందు నాగార్జున హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకున్నాడు. అందరు మణికంఠ వెళ్తేనే బాగుంటుందని అన్నారు. అదే విషయం చెప్తూ మణికంఠని అడుగగా.. నేను బిగ్ బాస్ ( bigg boss 8 telugu) హౌస్ లో ఉండను సర్.‌. నా వల్ల అవ్వడం లేదంటు మణికంఠ చెప్పడంతో మణికంఠ ఈజ్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పేశాడు. నిజానికి గౌతమ్ ఎలిమినేషన్ అవ్వాలి .. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం గౌతమ్ ఈజ్ ఎలిమినేటెట్ అని నాగార్జున చెప్పాడు. దాంతో గౌతమ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఇక బిగ్ బాస్ (bigg boss 8 telugu) హౌస్ లోని హౌస్ మేట్స్ అందరికి బై బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన నాగ మణికంఠ తన ప్రాబ్లమ్ చెప్పుకున్నాడు. ఇక హౌస్ లో ఎవరుండాలి.. ఎవరు మారాలంటూ.. ఓ షిప్ తీసుకొచ్చి.. ఎవరిని ముంచేస్తావ్.. ఎవరని షిప్ ఎక్కిస్తావ్ అని అడిగాడు నాగార్జున. ఇక గౌతమ్, పృథ్వీ, నిఖిల్, టేస్టీ తేజని ముంచేశాడు మణికంఠ. విష్ణుప్రియ, హరితేజ, నయని పావని, నబీల్, అవినాష్, రోహిణి, మెహబూబ్ లని షిప్ మీద పెట్టాడు. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్తూ మణికంఠ ఎమోషనల్ అయ్యాడు.  

బజ్ ఇంటర్వ్యూలో మణికంఠ చెప్పిన నిజాలివే!

  బిగ్ బాస్ సీజన్-8( Biggboss 8 Telugu) లో ఏడో వారం నాగ మణికంఠ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చాడు. గతవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అవ్వగా ఈ వారం మణి బాబు ఎలిమినేషన్ అయ్యాడు. ఇక ఎలిమినేషన్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. విన్ అవ్వాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. అసలు ఛీఫ్ అవ్వకుండానే బయటకెందుకు వచ్చారని యాంకర్ అడుగగా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని మణికంఠ చెప్పాడు. వాయ్యా.. అంటు యాంకర్ షాక్ అయ్యాడు. అది ఎంత పెద్ద కంటెంటో తెలుసా అంటూ.. నా పెళ్ళాం బిడ్డలు నాకు కావాలి.. నా రెస్పెక్ట్ నాకు కావాలి అంటు యాంకర్ చెప్తూ యాక్టింగ్ చేయగా మణికంఠ షాక్ అయ్యాడు. ఫస్ట్ వీక్ లో మీరు చెప్పిన ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ అయిదో వారం లేవు ఎందుకని అడుగగా.. బై డీఫాల్ట్ నేను ఇంతే అని మణికంఠ అన్నాడు.  గోరంత దాన్ని కొండంత చేస్తావని హౌస్ మేట్స్ అన్నారని యాంకర్ అడుగగా.. నేను రియాక్ట్ అయ్యే విధానం అలా ఉంటుంది. అసలు నువ్వు హౌస్ లో రామువో, రెమోవో, అపరిచితుడివో అర్థం కావట్లేదని యాంకర్ అనగానే.. మణికంఠ నవ్వేశాడు. ఇందాకటి నుండి పాజిటివ్స్ , పాజిటివ్స్ అంటున్నావ్.. నీ గురించి ఒక్క పాజిటివ్ థింగ్ చెప్పు అని యాంకర్ అడుగగా.. నేను నాలాగా ఉండటమే నా పాజిటివ్ థింగ్ అని మణికంఠ చెప్పాడు. నీకు సపోర్ట్ చేసిన వాళ్ళనే నువ్వు బ్యాక్ స్టాప్(వెన్నుపోటు) పొడిచావని కొందరు అన్నారని అడుగగా.. ఇదైతే నేను ఒప్పుకోను అని మణికంఠ అన్నాడు.  హౌస్ లో ఎవరికైనా డబుల్ స్టాండ్స్(ఒకేసారి రెండు మాటలు) ఉన్నాయా అని యాంకర్ అడుగగా.. నిఖిల్ అని మణికంఠ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ అగ్రీ చేస్తాడు తర్వాత నో అంటాడని మణికంఠ చెప్పాడు. ఇక విష్ణుప్రియ-పృథ్వీల మధ్య  ఏం ఉంది.. వన్ సైడ్ ఆ అని యాంకర్ అడుగగా.. టూ సైడెడ్ అని మణికంఠ చెప్పాడు. దాంతో అటు యాంకర్ తో పాటు ఇటు ఆడియన్స్ షాక్ అయ్యారు.

Naga Manikanta Remuneration: నాగ మణికంఠ రెమ్యునరేషన్ ఎంతంటే!

  బిగ్ బాస్ ( bigg boss 8 telugu) హౌస్ లో‌ కంటెంట్ స్టార్, సింపథీ స్టార్, పర్ స్పెక్టివ్ స్టార్ మణికంఠ నిన్న  ఎలిమినేట్ అయి బయటకొచ్చేశాడు.‌ ఏడు వారాలు హౌస్ లో తనదై‌న శైలీలో ఎంటర్‌టైన్ చేసిన నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు. తనకి చెస్ట్ లో పెయిన్ వస్తుందని, గత రెండు వారాల నుండి ఆరోగ్యం బాలేదని, అసలు‌ తనకి బాడీ సపోర్ట్ చేయట్లేదంటూ స్టేజ్ మీద నాగార్జునతో చెప్పేశాడు మణికంఠ.  హౌస్ లోకి వచ్చిన మొదటి వారమే తనలోని ఎమోషన్స్ ని బయట పెట్టేశాడు మణికంఠ. తన భార్యాబిడ్డలు కావాలని, తన స్టెప్ ఫాదర్ దగ్గర రెస్పెక్ట్ కావాలని , తన పాప కావలంటూ ఎమోషనల్ అయిన మణికంఠ హౌస్ లోని ఆడాళ్ళందరిని ఏడ్పించేశాడు. ఇక హౌస్ లో ప్రతీ దాంట్లో యాక్టివ్ గా ఉండాలనుకున్న మణికంఠకి ఆరోగ్యం బాలేదని చెప్పాడు. గత రెండు వారాలుగా బిగ్ బాస్(bigg boss 8 telugu) హౌస్ లో డల్ అయిపోయిన మణికంఠ.. ఆడియన్స్ ని ఓట్ వేయొద్దని రిక్వెస్ట్ చేశాడు‌‌. ఇక సెల్ఫ్ ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు. మణికంఠ రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి లక్ష ఇరవై వేల(1.20లక్షలు) చొప్పున ఏడు వారాలకు గాను ఎనిమిది లక్షల నలభై వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది.   

Naga Manikanta: బిగ్ బాస్ కే షాకిచ్చిన నాగ మణికంఠ.. సెల్ఫ్ ఎలిమినేషన్ తో ట్విస్ట్!

  బిగ్ బాస్ సీజన్-8 నిన్నటితో ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ ఏడు వారాలు ఫుల్ కంటెంట్ ఇస్తూ అత్యధిక ఓటింగ్ తో దూసుకెళ్తున్న నాగ మణికంఠ(Naga Manikanta) నిన్న ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు. సండే ఫన్ డే అంటు నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో వచ్చేశాడు. ఇక హౌస్ మేట్స్ తో ' చిత్రం భళారే విచిత్రం' అనే గేమ్ ఆడించాడు. ఇందులో బాయ్స్ అంతా ఓ వైపు, గర్ల్స్ అంతా మరోవైపు ఉంచి గేమ్ ఆడించగా బాయ్స్ గెలిచారు. ఇలా గేమ్ ఆడిస్తూ మధ్య మధ్యలో సేవింగ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక ఒక్కొక్కరికి ఒక్కో సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్ తెప్పించాడు నాగార్జున. అందులో అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు అనే ట్యాగ్ నిఖిల్ కి గౌతమ్ ఇచ్చాడు. నవ్వు ఆపుకుంటున్నావ్ కదా రా చారి విష్ణుప్రియకి నయని పావని ఇచ్చింది. నువ్వు ఊరుకో అమ్మ అన్నింటికి తుత్తు తూ అంటావనే ట్యాగ్ ప్రేరణకి నిఖిల్ ఇచ్చాడు. అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానని ట్యాగ్ అవినాష్ కి టేస్టీ తేజ ఇచ్చాడు. వాడిని అలా వదిలేయకండిరా .. ఎవరికైన చూపించండ్రా మణికంఠకి హరితేజ ఇస్తుంది. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనే ట్యాగ్ ని విష్ణుప్రియకి రోహిణి ఇస్తుంది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటు గంగవ్వకి ఇచ్చింది విష్ణుప్రియ. ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందామనే ట్యాగ్ గౌతమ్ కి నబీల్ ఇచ్చాడు నబీల్.  ఇక చివరగా మణికంఠ, గౌతమ్ ఉండగా.. నా వల్ల అవ్వడం లేదు సర్ నేను బయటకు వెళ్ళిపోతా అంటు మణికంఠ చెప్పగానే.. నీ మెడికల్  రిపోర్ట్స్ అన్నింట్లో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావనే వచ్చింది. మీ ఫ్యామిలీ కోసం ఆలోచించు అని నాగార్జున చెప్పిన మణికంఠ బాబు వినలేదు. ఫిజికల్ గా ఆడలేకపోతున్నానంటు చెప్పుకొచ్చాడు. ఇక ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చాక తన జర్నీ వీడియో కూడా చూపించలేదు బిగ్ బాస్ మామ. ఎందుకంటే వాళ్ళు గౌతమ్ ఎలిమినేషన్ అని కన్ఫమ్ అయి అతడి జర్నీ వీడియో రెడీ చేసి ఉంటారు కానీ మణికంఠ వారికి షాకిస్తాడని ఊహించలేదు. అందుకే అతని జర్నీ వీడియో కూడా ప్లే చేయలేదు..

గడ్డం తీసేస్తే మూడు వారాలు సేఫ్.. ఆఫర్ రిజెక్ట్ చేసిన పృథ్వీ!

బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం ఫుల్ ఛార్జ్ తో కంటెస్టెంట్స్ టాస్క్ ఆడారు. అయితే ఆ గేమ్ తో పాటు హెయిర్ కట్ ఛాలెంజ్ చేసుకోవాలంటూ పృథ్వీ, అవినాష్ లని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్క్ లో పృథ్వీ హెయిర్ కట్ ఛాలెంజ్ కి ఒప్పుకోలేదు.. అవినాష్ ఒప్పుకొని హెయిర్ కట్ చేయించుకున్నాడు.. అదే విషయం నాగార్జున స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అడిగాడు. నాకు ఇష్టం లేదు సర్ అని పృథ్వీ అంటాడు. ఇష్టం లేదా.. ఎవరైనా వద్దని చెప్పారా.. విష్ణుప్రియ నువ్వు ఏమైనా చెప్పావా అని నాగార్జున అడుగుతాడు. లేదు సర్ అని విష్ణుప్రియ అంటుంది. అవినాష్ చూడు ఎంత అందంగా ఉన్నాడోనని నాగార్జున అనగానే.. అంత అందం నాకు వద్దని పృథ్వీ అంటాడు. ఒక ఆఫర్ ఇస్తున్నాను.. నువ్వు ఓన్లీ గడ్డం తీసేస్తే ప్రైజ్ మనీకి నాలుగు లక్షలు ఆడ్ అవుతాయని నాగార్జున చెప్పగా.. పృథ్వీ నో అని అంటాడు. అయితే ఎనినిది లక్షలు  అని నాగార్జున అంటాడు. దానికి పృథ్వి నో చెప్తాడు. ఆ తర్వాత ఇప్పుడు మరొక ఆఫర్ ఆలోచించుకో.. టూ వీక్స్ నామినేషన్ నుండి సేవ్ అవుతావని నాగార్జున అంటాడు. అయిన పృథ్వీ దానికి నో అంటాడు. నిఖిల్ నువ్వు చెప్పు పృథ్వీతో డిస్కషన్ చెయ్.. తనకి చెప్పు.. ఇప్పుడు ఏడో వారం కదా.. డైరెక్ట్ పదో వారం వరకు నో నామినేషన్  పృథ్వీకి అని నాగార్జున అనగానే.. వాడు ఒప్పుకోడు సర్.. నాకు ఇవ్వండి ఇప్పుడే వెళ్లి షేవ్ చేసుకొని వస్తానని నిఖిల్ అంటాడు. అది నీకు కాదు ఓన్లీ పృథ్వీకి అని నాగార్జున అంటాడు. దానికి కూడా పృథ్వీ నో చెప్తాడు. ఈ లెక్కన హౌస్ లో ఉండడం కంటే కూడా తన గడ్డానికే పృథ్వీ ఎక్కువ విలువ ఇస్తాడన్నమాట. బిబి టైమ్స్ హెడ్ లైన్స్ లో భాగంగా.. కింగ్ అఫ్ డిస్ రెస్పెక్ట్ వాంట్స్ ఆల్వేస్ రెస్పెక్ట్.. ఆట కంటే నేనే ముఖ్యం.. అనే రెండు హెడ్ లైన్స్ ని పృథ్వీకి నాగార్జున ఇవ్వగా.. హౌస్ మేట్స్ అందరు ఒకే అంటారు. ఇచ్చిన టూ హెడ్ లైన్స్ లో మొదటిది అవినాష్ ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు.. పృథ్వి పై విరుచుకుపడతాడు నాగార్జున. 'ఒరేయ్ పృథ్వీ' అంటే ఎలా ఉంది బాలేదు కదా అని నాగార్జున అంటాడు.  అలా అనకు అని నాగార్జున చెప్తాడు. సెకెండ్ హెడ్ లైన్ లో టాస్క్ లో హెయిర్ కట్ చేసుకోకుండా తన కోసం మాత్రమే చూసుకున్నాడు. అందుకే టూ హెడ్ లైన్స్ పృథ్వీకి ఇచ్చాడు నాగార్జున.

భార్య ఇచ్చిన సర్ ప్రైజ్ కి కంటతడి పెట్టుకున్న అవినాష్!

బిగ్ బాస్ హౌస్ లో ఓల్ట్ కంటెస్టెంట్స్ కి వైల్డ్ కంటెస్టెంట్స్ కి మధ్య గేమ్ సూపర్ గా సాగుతుంది. అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులందరిని తన వైపుకి తిప్పుకున్నాడు. తన స్పాంటేనియస్ కామెడి పంచులతో హౌస్ లో.. మరొక జబర్దస్త్ షో చూపిస్తున్నాడు. హెయిర్ కట్ ఛాలెంజ్ ని ఒప్పుకొని కట్ చేయించుకొని.. ప్రైజ్ మనీ ఫిఫ్టీ థౌజెండ్ ఆడ్ చేసి నాగార్జునతో ప్రశంసలు పొందాడు. అంత డేర్ చేసి ఛాలెంజ్ ని ఒప్పుకున్నందుకు.. నీకొక సర్ ప్రైజ్ అంటూ నాగార్జున తన భార్య మాట్లాడిన ఆడియోని వినిపించాడు. అందులో ఏం ఉందంటే..  హ్యాపీ యానివర్సరీ అవి.. ఐ లవ్ యు ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం.. గేమ్ బాగా ఆడుతున్నావు.. ఇంకా బాగా ఆడు.. విన్నర్ అయి రావాలని ఉంటుంది. అది విని అవినాష్ ఎమోషనల్ అవుతాడు. తను కూడా లవ్ యూ టూ అను అంటూ గట్టిగా అరుస్తాడు. అవినాష్ ఎమోషనల్ అవుతుంటాడు. అందరిని నవ్విస్తాడు తను ఏడవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా అని నయని అనగా.. వాళ్లకు మనసు ఉంటుంది కదా ఎమోషనల్ అవుతారని నాగార్జున అంటాడు. అవినాష్ ఉంగరాల జుట్టు అంటే వాళ్ళావిడకి చాలా ఇష్టం‌.. అయిన గేమ్ కోసం సాక్రిఫై చేసాడని నాగార్జున చెప్తాడు. అయిన ఇలా బాగున్నావ్ అవినాష్ అని నాగార్జున అనగానే.. అదే సర్ హౌస్ లో అమ్మాయిలు అందరు.. నా వైపే చూస్తున్నారని అవినాష్ కామెడి చేస్తాడు. కానీ గేమ్ మాత్రం ఇరగదీసావంటు అవినాష్ ని నాగార్జున పొగుడుతాడు. ఆ తర్వాత బిబి హెడ్ లైన్స్ లో భాగంగా.. పైకి నవ్విస్తా వెనకాల ప్లాన్ వేస్తా అనే హెడ్ లైన్ అవినాష్ కి నాగార్జున ఇవ్వగా.. అందరు ఎస్ అనే చెప్తారు. టాస్క్ అది ఇలా.. ఇది ఇలా అంటూ తనే ప్లాన్ వేస్తాడని రోహిణి చెప్పుకొచ్చింది. ఈ టాస్క్ బిగ్ బాస్ సీజన్-4లో కూడా ఉంది సర్. అప్పుడు కూడా ఇలాగే తెలియకుండా ఛార్జింగ్ పెట్టుకున్నానంటూ గుర్తుచేసుకున్నాడు అవినాష్.

Eto Vellipoindi Manasu : అత్తకి షాకిచ్చిన కోడలు.. భర్తతో కలిసి అలా చేయనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -231 లో....రామలక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్స్ చూపిస్తుంది. డాక్టర్ సీతాకాంత్ కి ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పడంతో అదంతా శ్రీలత ప్లాన్ అని అనుకుంటుంది రామలక్ష్మి. ఇంటికి వెళ్లి కావాలనే టపాసులు కలుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావని సిరి అడుగుతుంది. నా మనసులోని భయాలు అనుమానాలన్నీ పోయి హ్యాపీగా ఉన్నానంటూ శ్రీలత, శ్రీవల్లిలకి కారం స్వీట్స్.. పెద్దాయన, సిరిలకి మంచి స్వీట్స్ ఇస్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత రామలక్ష్మి తన మాటలతో శ్రీలత, శ్రీవల్లిలని భయపెడుతుంది. దీనికి నిజం తెలిసిపోయిందా అని శ్రీవల్లీతో శ్రీలత అంటుంది. రామలక్ష్మి గదిలోకి వెళ్లి నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని బాధపెట్టాను.. ఇక ఎప్పుడు అలా చెయ్యనని రామలక్ష్మి అనుకొని ఆఫీస్ లో ఉన్న వర్క్స్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి నందిని వచ్చి పాత పెండింగ్ ఫైల్స్ చూడాలని అంటుంది. మేనేజర్ ని పిలిచి సీతాకాంత్ ఫైల్ తీసుకొని రమ్మని అనగానే.. అవసరం లేదు సర్ మీరు రామలక్ష్మి వాళ్ళ పుటింటికి వెళ్తారంట కదా.. ఏ డిస్టబెన్స్ ఉండకూడదని అన్ని వర్క్ రామలక్ష్మి మేడమ్ ఫినిష్ చేశారని మేనేజర్ అనగానే సీతాకాంత్, నందిని ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే  సీతాకాంత్ కి రామలక్ష్మి ఫోన్ చేసి.. వర్క్ అంతా చూసి షాక్ అయ్యారా.. మా పుట్టింటికి వెళదాం. త్వరగా రండి అని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నానని నందినికి చెప్పి బయల్దేరతాడు సీతాకాంత్. ఆ తర్వాత శ్రీలతకి నందిని ఫోన్ చేసి.. అసలేం జరుగుతుందని అడుగుతుంది. రామలక్ష్మికి నిజం తెలిసినట్లు ఉందని.. అందుకే ఇలా చేస్తుందని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత సిరిని కూడా రామలక్ష్మి తనతో ఇంటికి తీసుకొని వెళ్తానంటే శ్రీలత వద్దని ఆర్గుమెంట్ చేస్తుంది. నేను వెళ్తానని సిరి చెప్తుంది. త్వరలోనే ఈ ఇంటికి వారసుడిని ఇచ్చి.. ఈ ఆస్తులు అన్నింటికి వారసుడిని చేస్తానని రామలక్ష్మి అనగానే.. అప్పుడే సీతాకాంత్ రావడం గమనించి అలా ఏందుకు అంటావ్.. సరైన ప్రవర్తన, బుద్ది, ఉన్నవాళ్ళే వారసులవుతారని శ్రీలత అంటుంది. ఏం అంటావ్ సీతా అని శ్రీలత అనగానే.. అవును మంచి స్వభావం ఉన్నవాళ్లు ఆస్తులకి వారసులు అవుతారని సీతాకాంత్ అంటాడు. మీరు ముందు పదండి రెడీ అవ్వండి వెళ్దామని సీతాకాంత్ తో శ్రీలత అనగానే.. ప్రొద్దున డల్ గా ఉంది. ఇప్పుడు ఇలా ఉందని రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.