Hariteja elimination: ఈ వారం హరితేజ ఎలిమినేషన్ కన్ఫమ్.. నెటిజన్ల కామెంట్ల మోత!

  బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక ఆట మాములుగా లేదు. ఎంటర్టైన్మెంట్ కి, గేమ్స్ కి ఒక్కో కంటెస్టెంట్ తమ వంద శాతం ఇస్తున్నారు‌. అయితే హౌస్ లోకి వచ్చిన హరితేజ తీవ్రంగా డిస్సపాయింట్ చేస్తోంది. టాస్క్ లలో తనే ఉండాలని భావనతో మొన్నటి వారం జరిగిన టాస్క్ లలో నిఖిల్ కి అన్యాయం చేసింది. అదంతా చూసిన నెటిజన్లు ఈమెని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదంటూ నెగెటివ్ కామెంట్లు చేశారు. అసలెమీ ఆడటం చేతకాని వాళ్ళని హౌస్ లోకి తీసుకొచ్చారంటూ హరితేజ పేరు మీద పోస్టులు, ట్వీట్లు చేశారు. దాంతో గత మూడు వారాల నుండి నామినేషన్ల చివరన ఉన్నా‌‌.. వేరే వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు. లాస్ట్ వీక్ కూడా నయని పావని కంటే హరితేజ మధ్య ఓటింగ్ పెద్దగా డిఫరెన్స్ లేదు. దీనిని బట్టి తను హౌస్ లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదని తెలిసిపోతుంది. ఇక ఈ వారం నిఖిల్, గౌతమ్, యష్మీ, ప్రేరణ ఇలా స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. దాంతో హరితేజ ఎలిమినేషన్ కన్ఫమ్ అనేది తెలుస్తోంది. ‌తనేదైనా పర్ఫామెన్స్ ఇస్తేనే సేఫ్ అవుతుంది.‌ లేదంటే కచ్చితంగా ఈ వారం హరితేజ బ్యాగ్ సర్దుకోవాల్సిందే. అయితే ఈ సీజన్ లో హరితేజ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదనేది అందరికి తెలిసిన విషయమే.

బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసేది ఈ వారమే.. మరి మీ ఫేవరెట్ ఎవరు?

  బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని పదో వారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు అందరి ఆటతీరు చూసిన ప్రేక్షకులు.. ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ బయటకు రావడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. హౌస్ లోకి శేఖర్ బాషా ఎంట్రీ కాగానే అందరు తనే విన్నర్ అంటూ సోషల్ మీడియా వార్తలొచ్చాయి. అయితే అనూహ్యగా రెండవ వారమే బయటకు వచ్చాడు. ఇక మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కిర్రాక్ సీత టాప్-5 కంటెస్టెంట్ అనుకున్నారంతా కానీ తను కూడా అనుకోకుండా బయటకు వచ్చింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రతీ సీజన్ లో ఉండేదే. అదేంటంటే నామినేట్ చెయ్యాలనుకున్న వాళ్ళు తగిన కారణం చెప్పి పై నుండి మట్టి కలర్ పోస్తారు.. గత సీజన్ లలో రేవంత్, పల్లవి ప్రశాంత్ లకి ఎక్కువ నామినేషన్ లు పడటంతో.. ఎక్కవ మంది కలర్ పొయ్యడంతో ఒకరమైన అటిట్యూడ్ తో ఇద్దరు కనపడ్డారు. ముఖ్యంగా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ లాగా ఫోజులిచ్చారు. ఎక్కువ నామినేషన్ లు పడడంతో వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యారు. దాంతో పాటు విన్నర్ కూడా అయ్యారు. ఈ సారి నామినేషన్ లు ఎక్కువగా నిఖిల్, గౌతమ్ లకి పడినట్లు తెలుస్తుంది. ప్రోమోలో రోహిణి కలర్ పడి పుష్ప మాదిరి కూర్చొని ఉంటుంది. అచ్చం రేవంత్, ప్రశాంత్ ని కాపీ చేసినట్లు గా కన్పిస్తుంది. ఇక ఈ సీజన్ లో విన్నర్ ఎవరనే పాయింట్ లో మాట్లాడుకుంటే.. నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఈ వీక్ దాదాపు అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వస్తారు. ఎవరికి ఎంత ఓటింగ్ ఉందో దానిని బట్టి టాప్-5 లో ఎవరుంటారనే క్లారిటీ వచ్చేస్తుంది.

అశ్వథ్థామ ఈజ్ బ్యాక్..ఎగ్జిట్ గేట్ దగ్గరికి ఇద్దరు

  బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సోమవారం నామినేషన్ల ప్రోమో రానే వచ్చింది. ప్రేక్షకులలో ఇంకాస్త ఉత్కంఠని రెకేత్తించడానికి బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రోమోని వదిలాడు. ఇక అది ఈ సీజన్ లోనే నెక్స్ట్ లెవల్ నామినేషన్ అని చెప్పొచ్చు. నామినేషన్ లో  రోహిణిని పృథ్వీ ఒక బ్యాడ్ వర్డ్ వాడారంటూ నామినేట్ చేశాడు. నెక్  ఫాంటసీ అనేది బ్యాడ్ వర్డ్ అనే విషయం నాకు తెలియదని రోహిణి వివరణ ఇస్తుంది. ఆ తర్వాత ప్రేరణ, హరితేజ మధ్య తగ్గ ఫర్ వార్ నడిచింది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని హరితేజ అనగానే.. నేను ఎప్పుడు మిమ్మల్ని ఫేక్ అన్నాను.. రికార్డింగ్ తెచ్చి చూపించండని ప్రేరణ అంటుంది. అలా ఎలా మాట మారుస్తావ్.. అయ్యో దేవుడా అంటూ హరితేజ సాగదీస్తుంది. ఆ తర్వాత ఎవడు నన్ను ఏమన్న నాకు భయం లేదు.. ఏం లేదు.. ఇప్పటి నుండి అన్నీ తీసేస్తున్నాను.. అశ్వథ్థామ ఈజ్ బ్యాక్ అని గౌతమ్ గట్టిగా అరుస్తాడు. సరే నువ్వు బయటకు వెళ్ళడానికి రెడీ ఆ చూసుకుందామని నిఖిల్ అనగానే.. పదా చూసుకుందామంటూ గౌతమ్, నిఖిల్ ఇద్దరు బిగ్ బాస్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్తారు. అదంతా చూస్తున్న మిగతా హౌస్ మేట్స్ షాక్ అవుతారు. ఇలా మాటి మాటికీ గేట్ దగ్గరికి వస్తే బిగ్ బాస్ ఓపెన్ చేస్తే వాళ్ళ పరిస్థితేంటి.. ఒకసారి గేట్ ఓపెన్ చేసి ఇక వెళ్ళండి అంటే దూల తీరుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రోమోనే ఈ లెవల్ లో ఉందంటే పూర్తి ఎపిసోడ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Nayani Pavani:  హౌస్ లో ఆ అయిదుగురు డమ్మీ.. ముగ్గురే బెస్ట్!

  బిగ్ బాస్ సీజన్-8 లో తొమ్మిదో వారం నయని పావని‌ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో తొమ్మిదో వారం అరుగురు నామినేషన్లో ఉండగా వారిలో నుండి ఒక్కొక్కరిని‌ సేవ్ చేయగా.. హరితేజ, నయని పావని చివరి వరకు వచ్చారు. హరితేజ, నయని పావని ఇద్దరిని యాక్షన్ రూమ్ కు పిలిపించి.. రెండు గ్లాస్ లని బ్రేక్ చేయమనగా.. నయని పావని ఎవిక్టెడ్ అని రాసి ఉండడంతో నయని యూ ఆర్ ఎవిక్టెడ్ అని నాగ్ చెప్పేశాడు.‌ ఇక అందరితో మాట్లాడి హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇక స్టేజ్ మీదకి వచ్చిన నయనిని హౌస్‌లో ఐదుగురు డమ్మీ ప్లేయర్లు ఎవరో చెప్పాలంటూ నాగార్జున అడిగాడు. దీంతో గంగవ్వ పేరు మొదటిగా చెప్పింది. వయసు రీత్యా గంగవ్వ ఆడలేకపోతున్నారు.. కనుక డమ్మీ అని నయని అంది. ఆ తర్వాత రోహిణి పేరు చెబుతూ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.. గేమ్స్ పరంగా ఇంకా బాగా ఆడాలంటూ సలహా ఇచ్చింది. తర్వాత ప్రేరణ పేరు చెప్పి నీ కోపం వల్ల కొన్ని మాటలు వచ్చేస్తున్నాయ్.. అవి చూసుకమంటూ నయని చెప్పింది. తర్వాత గౌతమ్ గురించి చెప్తూ.. మనం ఒకరి దగ్గరి నుంచి ఏమైనా కోరుకుంటే మనం కూడా అది ఇవ్వాలంటూ నయని చెప్పింది. చివరిగా విష్ణుప్రియ కూడా డమ్మీనే కానీ నువ్వు ఇంకా గేమ్ బాగా ఆడగలవ్ ఆడాలి అంటూ నయని చెప్పింది. ఇక హౌస్ లో ఏ ముగ్గురు బెస్ట్? ఎందుకో తగిన కారణాలు చెప్పాలంటూ నాగార్జున అడిగాడు. దీనికి ముందుగా హరితేజ బెస్ట్ అంటూ నయని చెప్పింది. నీలో ఉన్న ఫైర్ నువ్వు నమ్మాలి.. ఇంకా బాగా ఆడాలక్కా అంటూ నయని అంది. తర్వాత నిఖిల్.. పేరు చెప్పి ఒక్కోసారి కోపంగా, ఆవేశంగా కనిపిస్తాడు కానీ తన చాలా స్వీట్..తన లోపల ఓ చిన్న పిల్లోడు ఉన్నాడంటూ నయని పొగిడింది. ఇక చివరిగా పృథ్వీ పేరు చెప్పేసింది. హౌస్‌లో నాకు జెన్యూన్ అనిపించిన ఒకే ఒక్క కంటెస్టెంట్ పృథ్వీ.. నువ్వు ఇలానే ఉండు.. నీ మాట మీదే నువ్వు నిలబడు అంటూ నయని చెప్పింది. అలానే చివరిలో పృథ్వీ చాలా నాటీ అంటూ నయని అనడంతో విష్ణుప్రియ ఫేస్ కాస్త ఛేంజ్ అయింది. మొత్తానికి ఇలా హౌస్ నుండి నయని పావని ఎలిమినేషన్ అయి బయకు వచ్చేసింది.

Nayani Pavani Remuneration: నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్ట్ లు , మరెన్నో టాస్క్ లు.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక నెక్స్ట్ లెవెల్ లో సాగుతున్న ఈ గేమ్.. ఇప్పుడు క్రైయింగ్ బేబీ నయని పావని ఎలిమినేషన్ తో మరో కొత్త ట్రాక్ లో వెళ్లనుంది. బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిదో వారం నయని పావని ఎలిమినేషన్ అయ్యింది. ఇక ఎలిమినేషన్ అయ్యాక హౌస్ లో కొంతమంది స్ట్రాంగ్ అని మరికొందరు ఫేక్ అని ఇంకా బాగా ఆడాలంటు కొన్ని సలహాలు ఇచ్చింది. ఇక హౌస్ లో మూడు వారాలు ఉండి నాలుగో వారం బయటకొచ్చేసింది నయని పావని. హౌస్ లో మొత్తం నెలరోజులు గడిపిన ఈ భామ.. రోజుకు లక్ష యాభై వేల చొప్పున నెలకు ఆరు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నయని పావని సీజన్-7 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి వారం రోజుల్లోనే బయటకి వచ్చేసింది. దాంతో తనకి చాలా సింపథీ వచ్చేసింది.‌ ఇక ఈ సీజన్ లో కూడ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం నామినేషన్ షీల్డ్ ద్వారా నామినేషన్ లో లేకుండా సేవ్ అయ్యింది.‌ ఇక హౌస్ లో ఒక్క గేమ్ కూడా గెలిచింది లేదు‌. ఎంతసేపు ఏడుపే.. ప్రతీ దానికి ఏడుపే.. హౌస్ లో క్రైయింగ్ బేబీ అనిపించిందని కిర్రాక్ సీతని నామినేషన్ చేసిన నయని పావని..చివరికి తనే క్రైయింగ్ బేబీగా మారిపోయింది. ఒకరకమైన విరక్తి తెప్పించేలా తన బిహేవియర్ ఉండటంతో జనాలు ఓటింగ్ లేక తొమ్మిదో వారం ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది.  

Biggboss Buzz Nayani Pavani : ఒకసారి చెప్తే ట్రోమా.. ఇన్ని సార్లు చెప్తే డ్రామా!

  బిగ్ బాస్ ఇంట్లో నయని పావని(Nayani Pavani) ఎలిమినేషన్‌ను అందరూ ముందుగానే ఊహించారు. నయని పావని నామినేషన్‌లోకి వస్తే బయటకు పంపేద్దామని జనాలు కూడా రెడీగానే ఉన్నారు. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన టైంలో నయని గనుక నామినేషన్‌లో ఉండుంటే మళ్లీ ఫస్ట్ వీక్ ఆటకే బయటకు వచ్చేది. కానీ అప్పుడు గౌతమ్ నామినేషన్ షీల్డ్ ఇచ్చి కాపాడేశాడు. నయని ఎప్పుడు డేంజర్ జోన్‌లోనే ఉంటూ వచ్చింది. ఈ సారి మాత్రం బయటకు వచ్చేసింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక బిగ్ బాస్ బజ్(Biggboss Buzz) ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది. ‌ఇందులో నయని(Nayani Pavani)రాగానే తనకి ఓ మెడల్ మెడలో వేసి బజ్ ఇంటర్వ్యూ మొదలెట్టాడు యాంకర్ అంబటి అర్జున్. ఇక హౌస్ లో తన పర్ఫామెన్స్ చూసి జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూపించారు. అందులో తన ఏడుపే జీవించడంతో తనకి కూడా సీన్ అర్థమైంది. ఇక ఏం చేయలేకపోయింది నయని. బిగ్ బాస్ సీజన్-7 లో ఉన్న నయనికి , సీజన్-8 లో ఉన్న నయనికి తేడా ఏంటని యాంకర్ అడుగగా.. అది వేరు వేరు అని చెప్పింది. ఏ సీజన్ సిమిలర్ గా ఉండదని యాంకర్ అన్నాడు. నాకైతే ఎందుకో నామినేషన్ లోనే ఎలిమినేషన్ అవుతానేమోనని మీరు భయపడ్డారని అనిపించిందంటూ యాంకర్ అనగా.. ఆశ్చర్యంగా చూసింది నయని.  హౌస్ లో టాస్క్ లు అర్థం కాని వాళ్ళని చూశాను కానీ నామినేషన్ లు అర్థం కానీ వాళ్ళని ఫస్ట్ టైమ్ చూస్తున్నానని యాంకర్ అనగానే.. నా నామినేషన్ ఏంటో నాకు క్లారిటీ ఉందని నయని పావని అంది. నీకేదైన ఒకే విషయాన్ని పది సార్లు చెప్పే అలవాటు ఉందా అని యాంకర్ అనగా తెలియదని నయని అంది. ఒక్కసారి చెప్తే ట్రోమా ఇన్ని సార్లు చెప్తే డ్రామా అని అర్జున్ అన్నాడు. క్లాన్ నయని గురించి ఆలోచించదు కానీ నయని ఆలొచిస్తుందని యాంకర్ అడుగగా.. నేను క్లాన్ కోసమే ఆడాను కానీ నా క్లాన్ వాళ్ళే వచ్చి నేనేం ఆడానని అన్నారంటూ నయని చెప్పుకొచ్చింది. మళ్లీ ఇంకో సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వెళ్తావా అని యాంకర్ అడుగగా.. లేదన్నట్టుగా తల ఊపేసింది నయని. ఇక నయని మీద వేసిన కొన్ని ట్వీట్స్ ని ప్లే చేసి చూపించారు.‌ ఇక హౌస్ లో ఎవరేంటో తెలియాలంటే నయని హౌస్ మేట్స్ గురించి చెప్పిన ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.  

Bigg Boss 8 Review: తొమ్మిదో వారం వీకెండ్ ఎపిసోడ్ రివ్యూ!

బిగ్ బాస్ సీజన్-8 లో అప్పుడే తొమ్మిది వారాలు గడిచిపోయాయి. ఈ వారం నాగార్జున ఎంట్రీలోనే సీరియస్ సింహంలాగా ఎంట్రీ ఇవ్వడంతో ఇక అందరికి మాస్ జాతరే అనుకున్నారంతా కానీ ఒక్క ప్రేరణ, గౌతమ్, నిఖిల్ కి తప్ప అందరికి కూల్ వార్నింగ్స్ తోనే సరిపెట్టేసాడు నాగ్ మామ. ప్రేరణ నువ్వు పుడింగివా అంటూ‌ మొదలెట్టాడు నాగార్జున. డిస్ రెస్పెక్ట్ గా మాట్లాడడం తప్పు అంటు వార్నింగ్ ఇవ్వగా తను ఎమోషనల్ అయింది. ఇక నిఖిల్, గౌతమ్ ల ఆటతీరుకి స్ట్రాంగ్ కోటింగే పడింది. నబీల్ అట తీరు బాగుంది కానీ నువ్వు నీ కోసం ఆడు.. నీ క్లాన్ వాళ్ళని కాకుండా అవినాష్ కోసం గేమ్ ఎందుకు గివ్ అప్ ఇచ్చావ్.. మెగా ఛీఫ్ టాస్క్ లో ఎందుకు ట్రై చేయలేదని అడుగగా.. నా వంతు ట్రై చేశానని కానీ మాటిచ్చాను సర్ అంటూ నబీల్ చెప్పాడు. కానీ నీ ఆట డ్రాప్ అవుతుంది. తొంభై శాతం ఇస్తున్నావ్ కానీ ఏదో మనసులో పెట్టేసుకొని నీ గేమ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావంటూ నబీల్ కి సలహా ఇచ్చాడు నాగార్జున. ఇక మెగా చీఫ్ గా పనిష్మెంట్ లు బాగా ఇస్తున్నాడంటూ అవినాష్ ని పొగిడేశాడు. నయని, పృథ్వీ, రోహిణి లు అసలేం ఆడారు.. ఏ టాస్క్ లో అయిన విన్ అయ్యారా అంటూ వాళ్ళ పరువు తీసేసాడు. ఇక ప్రతీ గేమ్ లో టేస్టీ తేజ ఆటతీరును చూసి.. చాలా బాగా ఆడావంటూ నాగార్జున మెచ్చుకోగా.. కొద్దీసేపటి వరకు నన్నేనా అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు టేస్టీ తేజ. ఆ తర్వాత హరితేజ బాగా ఆడావంటూ మెచ్చుకున్నాడు. యష్మీ ఆట బాగా ఆడుతుందని చెప్పాడు. విష్ణుప్రియ మెగా చీఫ్ గా బాగా చేసిందంటూ హౌస్ మేట్స్ నాగార్జునతో చెప్తారు. దాంతో నాగార్జున సైతం విష్ణుప్రియని మెచ్చుకుంటాడు‌. విష్ణుప్రియ మాట్లాడే మాటలకు నాగార్జున నవ్వుతుంటాడు. ఆ తర్వాత ఐదుగురు నామినేషన్ లో ఉండగా టేస్టీ తేజని శనివారం ఎపిసోడ్ లో సేవ్ చెయ్యగా.. యష్మీ, నయని, హరితేజ, గౌతమ్ లు మిగిలారు. మరి వీరిలో ఎవరు బయటకు వస్తారో తెలియాలంటే ఈరోజు(ఆదివారం) ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ జస్ట్ మిస్!

అదితి భావరాజు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పడింది. ప్లే బ్యాక్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఐతే అఖండ మూవీలో "జై బాలయ్య" సాంగ్ తో ఆమె పేరు టాప్ లోకి చేరిపోయింది. అలాగే తమిళ్ మూవీ 'ఎనిమి'లో "టంటం" సాంగ్ కూడా అదితి పాడింది. అది కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ఐతే తానెవరో ఆడియన్స్ కి నిరూపించుకోవడం కోసం అదితి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేసింది. ఐతే ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇక తరవాత ఆమెకు మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి.  ఐతే రీసెంట్ గా ఒక షోలో ఆమె తన మనసులోని కొన్ని మాటల్ని చెప్పారు. "నీ దగ్గర వరకు వచ్చి ట్రాక్ పాడాక మిస్సైన సాంగ్ ఏమిటి..అయ్యో ఈ సాంగ్ ఎందుకు మిస్సయ్యిందా అని రిగ్రెట్ ఐన సాంగ్ ఏమిటి ..? అని అడిగిన ప్రశ్నకు ఆమె "పాట అంటే ఆ ట్యూన్ పాడలేదు దానికి వేరే వెర్షన్ పాడాను. గుంటూరు కారంలో మూవీలో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ కి నేను రామ్ మిరియాల పాడాం. కానీ ఆ సాంగ్ వర్కౌట్ కాలేదు లాస్ట్ లో. షూటింగ్ వరకు వెళ్ళింది కానీ అక్కడితోనే ఆగిపోయింది." అంటూ కొంచెం ఫీలయ్యింది. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ లో నవీన్ పోలిశెట్టి మీద బిగ్ క్రష్ ఉందని.. కుదిరితే లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లాలనుంది అని చెప్పింది అదితి.

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఇంటి నుండి నయని అవుట్.. క్రైయింగ్ బేబీకి టాటా!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక హౌస్ లోని అందరి ఆటతీరే మారిపోయింది. ఓ రేస్ లో పాల్గొంటున్నట్టుగా రెండు క్లాన్ లు తమ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో మెహబూబ్ గతవారమే ఎలిమినేషన్ అయ్యాడు. ఇక అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ టాస్క్ లోను సూపర్ గా రాణిస్తున్నారు. అయితే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని పెద్దగా ఏం ఆడట్లేదు. హౌస్ లో ఇంతవరకు ఒక్క గేమ్ కూడా గెలిచింది లేదు. ఎప్పుడు చూసినా ఏడుపే.. ప్రతీదానికీ ఏడుపే.మ ఎవరేం అన్నా ఏడుపే.. అందుకే అందరు తనకి క్రైయింగ్ బేబీ అని అంటారు. ఇకనుండి ఆ క్రైయింగ్ కి టాటా చెప్పే సమయం వచ్చేసింది. మొన్నటి వరకు జరిగిన ఓటింగ్ పోల్స్ లో టేస్టీ తేజ, హరితేజ, నయని పావని డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక వీరిలో నుండి నయని పావని ఎలిమినేషన్ అయిందంటు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  గత సీజన్లో వారానికే ఎలిమినేట్ అయిందే పాపం.. ఈ పాప కాస్త యాక్టివ్‌గానే ఉంది.. జనాలే కాస్త తొందరపడి ఈమెను ఎలిమినేట్ చేసి ఉంటారు.. ఇంకొన్ని రోజులు ఉంటే ఆమె నిరూపించుకునేదేమో పాపం అని అప్పుడు జనం అనుకున్నారు. కానీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని మూడు, నాలుగు వారాలు ఉండటంతోనే ఆమె మీద నెగెటివ్ ఇంపాక్ట్  వచ్చేసింది. ఉన్న కాస్త పాజిటివ్ ఇమేజ్ కూాడా పోయింది. జనాల మనసు గెలవాలంటూ శివాజీ దగ్గర్నుంచి వీడియో సందేశాన్ని అందుకున్నా దానిని ఫాలో అవ్వలేదు. చివరకు మాకు వద్దురా బాబు అనేంతలా తన ఆటతీరు, మాటతీరు ఉంది. ఇక ఈ వారం నయని పావని ఎలిమినేషన్ అయినట్టు తెలుస్తోంది.

Eto Vellipoindi Manasu : అత్త ప్లాన్ సక్సెస్.. భార్యాభర్తలని దూరం చేయగలుగుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -243 లో... రామలక్ష్మి, సీతాకాంత్ లు స్కూటీ మీద రావడంతో శ్రీలత, శ్రీవల్లి ఇద్దరు కుళ్ళుకుంటారు. పెద్దాయన, సిరి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. రామలక్ష్మికి ఐస్క్రీమ్ తినిపిస్తూ లోపలికి తీసుకొని వెళ్తాడు సీతాకాంత్. రామలక్ష్మి సీతాకాంత్ బావ గారిని కొంగున కట్టేసుకుంది. ఇక వాళ్ళకి వారసుడు వస్తే.. మన పరిస్థితి ఏంటని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి పడుకున్న సందీప్ ని తీసుకొని వచ్చి.. రామలక్ష్మి కోసం బావగారు స్కూటీ కొన్నాడు. వాళ్ళు సరదాగా బయట తిరిగి వచ్చారు. మనం కూడా అలా సరదాగా బయటకు వెళదామంటూ సందీప్ ని బలవంతంగా బయటకు తీసుకొని వెళ్తుంది. తనే డ్రైవ్ చేస్తుంది. దాంతో ఇద్దరు కిందపడిపోతారు. మరొకవైపు రామలక్ష్మి చేతికి చిలకలు పెట్టుకొని సీతాకాంత్ కి తినిపిస్తుంది. రోజు ఇలాగే తినిపించమంటూ సీతాకాంత్ అంటాడు. అలా ఇద్దరు ఒకటి ఆయనట్లు శ్రీలతకి కల కంటుంది. ఒక్కసారిగా లేచి వాళ్ళు ఒకటి అవ్వకూడదనుకుంటుంది. మరొక వైపు సీతాకాంత్ దగ్గర కి రామలక్ష్మి వచ్చి.. థాంక్స్ చెప్తుంది. మీరు నాకు సపోర్ట్ గా ఉన్నారని అనగానే.. ఒక బంధం నిలబడాలంటే నమ్మకం, నిజాయితీ ఉండాలి.. దాపరికం ఉండకూడదు నేనే నీ విషయంలో అదే కోరుకుంటున్నానని సీతాకంత్ అనగానే..  అభి వచ్చిన విషయం చెప్పాలనుకుంటుంది రామలక్ష్మి. అటు వైపు తిరిగి అభి గురించి చెప్తుంది కానీ అప్పుడే సీతాకాంత్ కి ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. సీతాకాంత్ రావడం చూసి నేను చెప్పింది ఏది వినలేదా అని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు  సిరి గదిలోకి శ్రీలత వెళ్లి పూల స్టాండ్ ని కింద పడేస్తుంది. దాంతో సిరి భయపడి గట్టిగ అరుస్తుంది.అందరు వస్తారు. శ్రీలత కూడా ఏం తెలియనట్లు వస్తుంది. నాకు భయంగా ఉందని సిరి అంటుంది. నేను ఉంటానని సీతాకాంత్ అనగానే.. నేను ఉంటానని రామలక్ష్మి అంటుంది. వీళ్ళను విడగొట్టానని శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత శ్రీలత దగ్గరకి రామలక్ష్మి వచ్చి.. ఇదంతా నీ ప్లాన్ అని తెలుసని అంటుంది. అయితే ఏం చేస్తావంటు శ్రీలత అంటుంది. నువ్వు అనుకున్నదేం చెయ్యాలేవంటూ శ్రీలతకి రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నందినికి శ్రీలత ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. మీరు నాకు వదిలెయ్యండి. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇక నుండి సీతా నుండి రామలక్ష్మి పేరు వినపడదని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యష్మీ ఫ్లిప్పింగ్ స్టార్.... నాగార్జున ముందే నిజాలు బయటపెట్టిన ఫ్యాన్!

బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం వీకెండ్ వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కో కంటెస్టెంట్‌కు ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చాడు. అందులోను కన్నడ బ్యాచ్ కి గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది.‌ ముఖ్యంగా యష్మీకి గట్టిగా క్లాస్ పీకాడు నాగ్ మామ. యష్మీ కన్నడ కుట్టి.. తన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం అభినయంతో పాటు టాస్క్ లలో తనదైన శైలిలో దూసుకుపోతుంది కానీ ఈ అమ్మడు ప్లస్ పాయింట్ ల తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. తనకి నచ్చిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది. తనకి నచ్చని వాళ్ళు ఉంటే కన్నెత్తి అయిన చూడదు. హౌస్ లో యష్మీ తనకంటూ ఒక స్కోప్ క్రియేట్ చేసుకుంది. అందులో నిఖిల్, ప్రేరణ, పృథ్వీలు మాత్రమే ఉంటారు. మిగతా హౌస్ మేట్స్ తో ఒకరకమైన అటిట్యూడ్ తో ఉంటుంది. గత వారం నుండి ఈ అమ్మడు  నిఖిల్ తో ప్రేమాయణం కూడా నడిపిస్తుంది.  టాస్క్ లో అయితే తన డెసిషన్ అనేది స్టేబుల్ గా ఉండదు. ఈ వారం జరిగిన టాస్క్ లో యష్మీ, ప్రేరణ గౌతమ్ ముగ్గురు ఒక టీమ్ కాగా అందులో ఒకరు టాస్క్ నుండి బయటకు వెళ్ళాలని బిగ్ బాస్ చెప్పగా యష్మీ, ప్రేరణ ఇద్దరు కలిసి గౌతమ్ ని తొలగిస్తారు. అదే విషయం నాగార్జున యష్మీని అడుగుతాడు. సర్ తను మెగా చీఫ్ అయినప్పుడు అడినంత కసిగా ఇప్పుడు ఆడట్లేదు అందుకేనని యష్మీ చెప్తుంది.  అప్పుడే గౌతమ్ రియాక్ట్ అవుతు.. సర్ నన్ను తీసిసేటప్పుడు నాకు ఇది చెప్పలేదు. నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావ్ కదా మాకు ఛాన్స్ రావాలని అంటున్నానని అంది అని గౌతమ్ అంటాడు. అంటే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.. మీకే చెప్పాను తనకి అది చెప్పానని యష్మీ అనగానే అంటే హౌస్ లో ఒక్కొక్కరికి ఒక్కోలాగా చెప్తావా.. అందుకే నిన్ను ఫ్లిప్ యష్మీ అంటున్నారని స్టూడియోలో ఉన్న ఆడియన్స్ ని అడుగుతాడు నాగార్జున. యష్మీ గురించి ఏం అనుకుంటున్నారు చెప్పండి అని ఒక ఆడియన్ ని అడుగగా.. ఎక్కువ ఫ్లిప్ చేస్తుంది యష్మీ.. తను తప్పని అనగానే వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తుంది యష్మీ. ఇదిగో ఇదే వద్దని నాగార్జున చెప్తాడు.. నీకు ఏడుపు వస్తున్నప్పుడు.. నువ్వు తప్పు చేసినట్టే.. ఆ సిచువేషన్ లో ప్లిప్ అవ్వకుండా ఉండమని నాగార్జున సలహా ఇస్తాడు.  మరి నిజంగా యష్మీ ప్లిప్ అవ్వకుండా ఉండగలదా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

బ్యాడ్ వర్డ్ వాడిన గౌతమ్.. మదర్ ప్రామిస్ అలా అనలేదు!

బిగ్ బాస్ మెగా చీఫ్ అవ్వడానికి జరిగిన టాస్క్ లలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక సందర్భంలో నోరు జారుతూనే ఉంటారు. మళ్ళీ అది రియలైజ్ అయి సారీ చెప్తుంటారు. అయితే ఈ వారంలో టాస్క్ లో భాగంగా నిఖిల్, గౌతమ్ కి పెద్ద గొడవనే జరిగింది. అందులో గౌతమ్, నిఖిల్ ఇద్దరు నువ్వా నేనా అంటు గొడవకి దిగారు. అదే విషయమై గౌతమ్, నిఖిల్ ని నాగార్జున వివరణ అడుగుతాడు. సర్ తను సైలెంట్ గా ఎదో అబ్యూజ్ వర్డ్ వాడాడు. అందుకే నాకు కోపం వచ్చిందంటూ నిఖిల్ చెప్తాడు. ఆ కోపంలో కొంచెం గట్టిగా అరిచాను కానీ నేను అబ్యూజ్ వర్డ్ మాత్రం వాడలేదని గౌతమ్ అంటాడు. ఆ తర్వాత నాగార్జున వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో ఏదో వర్డ్ సైలెంట్ వాడినట్లు ఉంటుంది. అది చూసి సర్ నా మైండ్ లో ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ అయితే లేదు మదర్ ప్రామిస్ అంటూ గౌతమ్ అంటాడు. నువ్వు అన్నది అబ్యూజ్ వర్డ్ కాకపోతే.. నువ్వు ఎందుకు సైలెంట్ గా అన్నావ్. బయటకు అనొచ్చు కదా అని నాగార్జున అంటాడు. అది అబ్యూజ్ వర్డ్ వాడినట్లు అయితే ఈ క్షణమే ఇంటి నుండి వెళ్ళిపోతాను సర్ అంటాడు గౌతమ్. ఆ తర్వాత ఆ విషయం గురించి నాగార్జున హౌస్ మేట్స్ ఒపీనియన్ అడుగుతాడు. అందరు కూడా అలా సైలెంట్ గా ఆ వర్డ్ వాడాడు. కాబట్టి అది అనకూడని వర్డ్ అయి ఉంటుందని హౌస్ మేట్స్ అంటారు. నువ్వు ప్రామిస్ వేసావ్ ఒకవేళ అనవసరంగా నేనే ఉహించుకొని ఉంటే సారీ.. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మనే అని స్కిప్ చేస్తున్నట్లుగా నిఖిల్ ఆ విషయం గురించి చెప్పుకొచ్చాడు. దానికి గౌతమ్ సారీ చెప్తాడు. ఇక ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోమని నాగార్జున చెప్తాడు.

Karthika Deepam 2 :దీపని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్న కార్తీక్.. పారిజాతం ప్లాన్ ఫెయిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -192 లో..... దీపని చూసి కార్తీక్ ఫ్రెండ్స్ పనిమనిషి అనుకుంటారు. తను పనిమనిషి కాదు నా భార్య దీప అంటూ దీప భుజంపై కార్తీక్ చెయ్ వేస్తాడు. తను నా కూతురు శౌర్య.. ఇది నా కుటుంబమని కార్తీక్ అనగానే.. వాళ్ళు షాక్ అవుతారు. నీకు పెళ్లి ఎప్పుడైందంటూ అడుగుతారు.. అదో పెద్ద కథ అని కార్తీక్ అనగానే.. కానీ తనను చుస్తే అలా లేదని అంటారు. మరి ఎలా ఉంది పల్లెటూర్ లాగా ఉందా కానీ తన గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరని దీప గురించి గొప్పగా చెప్తాడు కార్తీక్. వాళ్ళు సారీ చెప్పి వీలైతే భోజనానికి రండి అని చెప్పి వెళ్ళిపోతారు. మరొకవైపు జ్యోత్స్నకి ప్లాన్ చెప్తుంది పారిజాతం. మీ తాత దగ్గరికి వెళ్లి.. కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు.. కార్తీక్ ని తప్ప ఎవరిని చేసుకునని సింపథీ వచ్చేలా మాట్లాడమని పారిజాతం చెప్తుంది. దానికి జ్యోత్స్న సరే అంటుంది. మరొకవైపు కాంచన, దీప, అనసూయ మాట్లాడుకుంటుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను మీ భార్య స్థానానికి పనికి రానని దీప అంటుంది. ఎవరేం అనుకున్నా నాకు అవసరం లేదు. అందరికి తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నావ్ కదా.. ఇక అందరికి తెలిసేలా చేస్తాను. నా భార్య గురించి కూతురు గురించి అని కార్తీక్ అంటాడు.ఆ తర్వాత నేను నాలాగే ఉంటానని దీప అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ‌ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. కాళ్ళు పట్టుకొని సారీ అడుగుతుంది. నువ్వు నాకు శత్రువు కాదు.. ఈ ఆస్తులకి వారసురాలివి.. నువ్వు చెప్పినట్టు వినాలని శివన్నారాయణ‌ అనగానే వింటానని జ్యోత్స్న అంటుంది. అయితే పెళ్లి చేసుకోమని శివన్నారాయణ అంటాడు. నేను బావని తప్ప ఎవరిని చేసుకోనంటూ జ్యోష్న కోపంగా మాట్లాడుతుంది. నేనేం చెప్పి పంపించాను ఇదేం చేస్తుందని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ ఇంటికి పారిజాతం వస్తుంది. పారిజాతం అందరి గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. కాశీ, స్వప్న ఇద్దరు తనపై కోప్పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ప్రేరణకి నాగార్జున వార్నింగ్..  నువ్వేదో పుడింగిలాగా అంటున్నావ్!

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. వీకెండ్ రానే వచ్చింది. నాగార్జున ఎంట్రీలోనే సీరియస్ గా కన్పించడంతో హౌస్ మేట్స్ కి టెన్షన్ మొదలైంది. ఇక రాగానే ప్రేరణ గురించి మొదలెట్టాడు నాగార్జున. (Bigg Boss 8 Telugu) నువ్వు ఏమైనా పెద్ద పుడింగివా అని ప్రేరణని అనగానే.. సర్ నేను రాంగ్ ఇంటెన్షన్ తో అన్లేదని ప్రేరణ వివరణ ఇస్తుంది. నయని నిల్చొని తనెప్పుడు అలాగే డిస్ రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడుతుంటుంది. ఒక్క నాతోనే కాదు సర్ దాదాపు అందరితో అలాగే ఉంటుంది. ఒక్క అటిట్యూడ్ చూపిస్తుందని నయని అంటుంది. నేనేం అలా రూడ్ గా అన్లేదని ప్రేరణ అనగానే నాగార్జున వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో ప్రేరణతో నయని నామినేషన్ గురించి మాట్లాడుతుంటే.. నువ్వేదో పుడింగిలాగా అంటున్నావని ఒక రకమైన సర్కాయిజం లాగా ఉంటుంది. ఆ తర్వాత ఆ వీడియో ప్లే చేసాక ప్రేరణ బిహేవియర్ ఎలా ఉందంటూ అటు హౌస్ మేట్స్ ఒపీనియన్.. ఇటు స్టూడియోలోని ఆడియన్స్ ఒపీనియన్ అడగ్గానే.. అందరు అది సర్కాయిజంలాగా ఉందని అంటారు. ఒక విష్ణుప్రియ మాత్రం డిస్ రెస్పెక్ట్ ఫుల్ అని అంటుంది. దానితో పాటు పానిపట్టు యుద్ధం టాస్క్ లో నిఖిల్ విషయంలో ప్రేరణ ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేసినందుకు నాగార్జున తనపై సీరియస్ అయ్యాడు. ఒకసారి పృథ్వీ అలా యూజ్ చేస్తే రీపీట్ అవ్వకూడదని చెప్పాను. ఇంతవరకు అలా పృథ్వి చెయ్యలేదు. ఒకరికి చెప్తే అది అందరూ ఫాలో అవ్వాలి.‌ఈ షోని పబ్లిక్ వాచ్ చేస్తారు. ఇంకొకసారి అలా యూజ్ చెయ్యకంటూ ప్రేరణకి నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో ప్రేరణ ఎమోషనల్ అవుతుంది.

Brahmamudi : భార్య తెలివికి జలస్ ఫీల్ అయిన భర్త.. ఆమెకి గుడ్ న్యూస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -557 లో....మీరు ఇలా ఫూల్స్ అవడానికి కారణం నేనే అని రాహుల్, రుద్రాణిలతో స్వప్న అనగానే వాళ్ళు కావాలనే స్వప్న మాట్లాడిన ఫోన్ కాల్ ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు గెలిస్తే నాకొచ్చిన నష్టం ఏంటని రుద్రాణి అంటుంది. నష్టం కాదు మా కావ్య ఇప్పుడు సీఈఓ గా సక్సెస్ అయిందంటు వాళ్ళకి ఇంకా కోపం వచ్చేలా స్వప్న మాట్లాడుతుంది. మరొకవైపు అపర్ణ పాలు వేడి చేస్తుంటే ఇందిరాదేవి వస్తుంది. అత్తయ్య ఇన్ని రోజులు తప్పు చేశాను.. మిమ్మల్ని, ఆయనను బాధపెట్టానంటూ ఇందిరాదేవిపై పడి అపర్ణ ఏడుస్తుంది. ఆ తర్వాత కావ్య టెన్షన్ పడుతుంటే.. ఇందిరాదేవి ఫోన్ చేసి నీకు గుడ్ న్యూస్ అంటూ అపర్ణ సుభాష్ లు కలిసిపోయారని చెప్తుంది. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మారాల్సింది రాజ్ ఒక్కడే అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. థాంక్స్ చెప్పాలని కాల్ చేశారు కదా అని కావ్య అనగానే.. ఏం చేసావని ఇలా మాయ చెయ్యడం నీకు అలవాటే కదా అని వెటకారంగా మాట్లాడుతాడు రాజ్. దాంతో కావ్యకి కోపం వస్తుంది. ఇంకొక సారి నాకు ఫోన్ చేస్తే డిస్మిస్ చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత అనామిక కోపంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుండి కావ్య లాంటి తెలివైన వాళ్ళను చూడలేదని సామంత్ అనామికపై కోపంగా ఉంటాడు. కావ్యని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు అంతకు రెట్టింపు లాభం తెస్తానది బంధానికి లొంగి పోయే మనిషి దానిపై దెబ్బ కొట్టాలని అనామిక అంటుంది. మరొకవైపు ఇందిరాదేవి, సీతారామయ్య ఇద్దరు కావ్య గురించి గొప్పగా మాట్లాడుతుంటే.. రాజ్ జెలస్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వద్దని వెళ్లిన క్లయింట్స్ అందరు రాజ్ కి ఫోన్ చేసి.. మళ్ళీ మీ కంపెనీతో డీల్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం.. కావ్య మేడమ్ తో అప్పాయింట్మెంట్ ఇప్పించండి అని అంటారు. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వచ్చి వెళ్లిన కంపెనీలు అన్ని మళ్ళీ వచ్చాయని అనగానే.. వెళ్లిన వాళ్ళు వద్దని అంటుంది. ఆ తర్వాత రాజ్ ని వాళ్లతో మీటింగ్ అరెంజ్ చేయమని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నీకు మ్యాటర్ లేదేమో.. కానీ నాకుంది : నయని పావని!

  బిగ్ బాస్ హౌస్ లో గత వారం రోజుల నుండి మెగా ఛీఫ్ కోసం ఆడిన టాస్క్ లో అవినాష్ గెలిచాడు.  అవినాష్ మెగా చీఫ్ అయ్యాక పొద్దు పొద్దున్నే అందరు కలిసి వేకప్ సాంగ్ కి డ్యాన్స్ వేసి.. గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఒక దగ్గర నయని పావని, హరితేజ వారికి కొంత దూరంలో టేస్టీ తేజ, గౌతమ్ కూర్చున్నారు. ఇక అవినాష్, టేస్టీ తేజలకి మధ్య చిన్నగా గొడవపెట్టాలని చూసింది నయని పావని. విష్ణుప్రియ మెగా చీఫ్ గా ఉన్నప్పుడు తేజ నీకు ఎక్కువ పని చెప్పొద్దన్నాడు ఓన్లీ కటింగ్,  అవినాష్ కి హెల్త్ బాగోలేదు కదా అన్నాడంటు అవినాష్ తో నయని అంది.  అదే విషయాన్ని కొంత దూరంలో ఉన్న తేజని పిలిచి మాట్లాడుతుంది నయని. అక్కడే ఉన్న గౌతమ్ అది విని ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ఎందుకని అడిగాడు. ఆ రోజు నువ్వు అవినాష్ కి ఒక కటింగ్ నే చెప్పాలి..హెల్త్ బాలేదు అన్నావ్ కదా అని నయని తేజని అడుగుతుంది. ఖచ్చితంగా తెలియదని తేజ అంటాడు. నేను నీతో అలా ఓన్లీ కటింగ్ ఇవ్వండి అని చెప్పానా అని తేజని అవినాష్ అడుగుతాడు. నేను అలా అనలేదు అన్నట్టుగా తేజ మాట్లాడేసరికి.. అంటే నేనే మాట మారుస్తున్ననా అని తేజపై కోప్పడుతుంది నయని పావని.  ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేసి గొడవ పడతారని గౌతమ్ అనగానే.. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు గౌతమ్ అని నయని కోప్పడుతుంది. మ్యాటర్ లేకుండా గొడవపడతారని గౌతమ్ అనగానే.. నీకు మ్యాటర్ లేదేమో కానీ నాకుందని నయని అంటుంది. దాంతో మ్యాటర్ లేదని అంటున్నావా అని గౌతమ్ సీరియస్ అవుతాడు. ఇలానే చిన్న ఇష్యూని పెద్దగా చేస్తుంటావని గౌతమ్ అంటాడు. ఇద్దరికి కాసేపు అర్గుమెంట్ జరుగుతుంది. మళ్ళీ కాసేపటికి ఫ్యామిలీ నుండి వీడియో వస్తుంది. అప్పుడు గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నయని, యష్మీ ఇద్దరిలో ఎవరికి వీడియో చూపించాలని అనుకుంటున్నారంటూ బిగ్ బాస్ అడుగగా.. నయని అని  గౌతమ్ చెప్తాడు. మరి నయని పావని-గౌతమ్ ల మధ్య జరిగిన ఈ ఆర్గుమెంట్స్ లో ఎవరిది తప్పు? ఎవరిది కరెక్ట్ కామెంట్ చేయండి.

లవ్ ట్రాక్ నడిపిస్తినే హౌస్ లో ఎక్కువ రోజులు..వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ!

  బిగ్ బాస్ హౌస్ గురించి అందరు తమకి నచ్చిన ఒపీనియన్ చెప్తుంటారు. ఓవరాల్ గా ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడమే మెయిన్ గోల్. ఆ ఎంటర్‌టైన్మెంట్ అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు.. టాస్క్ లు ఆడి.. ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వొచ్చు.. కామెడి చేసి గొడవలు పెట్టుకొని కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వొచ్చు.  ఇక ఇప్పుడు కొత్త అంశం బిబి లిస్ట్ లోకి వచ్చేసింది. అదేంటంటే ఎంటర్టైన్మెంట్, టాస్క్ లు ఇవి ఉంటే సరిపోదు.. హౌస్ లో లవ్ ట్రాక్ నడిపిస్తే చాలు ఈజీగా నెట్టుకొని రావచ్చు. అదే ఫాలో అయిన సోనియా ఫెయిల్ అయి బయటకు వచ్చేసింది. కానీ విష్ణుప్రియ ఇంకా ఉంది.  ప్రతీ సీజన్ లో కూడా లవ్ ట్రాక్ అనేది కామన్ గా మారిపోయింది. ఈ సీజన్ మొదటి వారం నుండి పృథ్వీ- విష్ణుప్రియ లవ్ ట్రాక్ అని న్యూస్ వైరల్ అవుతుంది. ఆ విషయం స్వయంగా విష్ణునే చెప్పింది కానీ అది వన్ సైడ్ లవ్ అని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నానంటూ పృథ్వీ అయితే చెప్తున్నాడు.  గత మూడు వారాలలో నామినేషన్లో ఉన్న పృథ్వీ.. ఓటింగ్ లిస్ట్ లో చివరగా ఉన్నా కూడా తను బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే విష్ణుప్రియ-పృథ్వీల లవ్ ట్రాక్ ద్వారా ఎంటర్టైన్మెంట్ వస్తుందని బిగ్ బాస్ మామ భావించాడు. అయితే హౌస్ మొత్తంగా మోస్ట్ అండ్ వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే తను విష్ణుప్రియే అని అందరు చెప్తారు. ఎందుకంటే నామినేషన్లో ప్రాపర్ రీజన్ చెప్పదు.. ఒక్క టాస్క్ ఆడదు.. అసలు విష్ణుప్రియకి ఏదైనా గెలవాలనో.. చీఫ్ అవ్వాలనో ఏం ఉండదు. ఎంతసేపు పృథ్వీ పక్కన కూర్చొని నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురి అవుతుంది. ఇక మరోవైపు యష్మీ- నిఖిల్ ల లవ్ ట్రాక్ సాగుతోంది. నిఖిల్ కి తన మనసులో మాట చెప్పేసిన‌ యష్మీ.. తనేం రియాక్ట్ అవ్వకపోయిన కూడా క్లోజ్ గా ఉంటుంది. అది చూసి తనకి ఇష్టమే అని అర్థమవుతుంది. వాళ్ళ ట్రాక్ కూడా మెల్లిగా సెట్ అయినట్లే. ఇక గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడ.  వచ్చి రాగానే యష్మీకి ప్రపోజ్ చేసాడు కానీ తను నిఖిల్ జలస్ ఫీల్ అవ్వాలని గౌతమ్ తో క్లోజ్ గా ఉంది‌. ఆ విషయం గత వారం వీకెండ్ లో నాగార్జున రీవీల్ చేసేసరికి గౌతమ్ కి బుర్ర పాడైంది. దాంతో యష్మీకి నామినేషన్ చేశాడు గౌతమ్. అక్క.. అక్క అంటు యష్మీకి చిరాకు తెప్పించాడు గౌతమ్. అయితే వీరిలో ఏ లవ్ ట్రాక్ చివరి వరకు వస్తుందో‌ చూడాలి మరి!  

ఫ్యామిలీతో కలిసి జానీ మాస్టర్ దీపావళి సెలబ్రేషన్స్.. ఇండస్ట్రీ షేక్ ఐపోవాలి

జీవితం అన్నాక అన్ని సందర్భాల్లో ఒక్కలాగే ఉండదు. గుక్క తిప్పుకోనివ్వని అదృష్టం ఉంటుంది కోలుకోలేని కష్టము ఉంటుంది. కానీ ఏది వచ్చినా తట్టుకున్న వాడు  ఎప్పటికీ ఓడిపోడు అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ విషయంలో అదే జరిగింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాష్టర్  జైలు నుంచి అక్టోబర్ 25 న చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి బయటకు వచ్చాడు. జానీ మాష్టర్ లైఫ్ లో  ఇదొక చీకటి కోణం అని చెప్పొచ్చు..నిజం ఎంతో, అబద్దం ఎంతో తెలీకపోయినా జైలు నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తన కుటుంబంతో దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నాడు. "ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచా లాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి." అంటూ విషెస్ మెసేజ్ పెట్టాడు. ఇక నెటిజన్స్ ఐతే వాళ్ళ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు.  "మాష్టర్ రాబోయే సినిమాలకు కోరియోగ్రఫీ చేయండి. మీ డాన్స్ అంటే మాకు ఇష్టం. ఈసారి జానీ మాష్టర్ దెబ్బకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షాక్ కావాలి..మీ కం బ్యాక్ కోసం మేమంతా వెయిటింగ్... అన్నా ఈ సారి నువ్వు సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే "బుట్ట బొమ్మ" పగిలిపోవాల..ఈ దీపావళి పండగతో మీకు ఉన్న ద్రుష్టి పోయి మంచి స్థానానికి వెళ్ళాలి ..నిజం ఒక్కటే మిగులుతుంది..కర్మ ఈ జీవితంలో ఎవరిదీ వాళ్లకు ఇచ్చేస్తుంది  " అంటూ మెసేజెస్ చేస్తున్నారు.  

బాయ్ ఫ్రెండ్ తో ఫైమా..అక్క కొంచెం ఓవర్ అయ్యింది

  పటాస్ ఫైమా ఒకప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యింది. పటాస్ షో ద్వారా పరిచయం ఐన ప్రవీణ్ తో కలిసి చేసిన వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో బాగా పేలాయి. దాంతో ఇద్దరూ కూడా మంచి పేరు సంపాదించారు. తర్వాత ఇద్దరూ కూడా జబర్దస్త్ వంటి షోస్ కి వెళ్లారు. ఇక ఫైమా జబర్దస్త్ షోకి కి పర్సన్ గా ఉంది. బులెట్ భాస్కర్ టీమ్ కి మంచి పేరు వచ్చిందే ఫైమా వల్ల అని చాలాసార్లు చెప్పాడు. అలాగే ఫైమా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి కూడా కొన్ని వారాలు పని చేసింది. అలాగే ఈ టాలెంట్ తో బిగ్ బాస్ కి కూడా వెళ్లి వచ్చింది. ఐతే అంతా బానే ఉంది కానీ బిగ్ బాస్ నుంచి వచ్చాక పటాస్ ప్రవీణ్ కి హ్యాండ్ ఇచ్చేసింది. కొన్ని రోజులకే ప్రవీణ్ నాయక్ అనే అతనితో కలిసి తిరగడం వీడియోస్ చేయడం రింగ్స్ మార్చుకోవడం వంటివి చేసేసరికి ఫాన్స్ అందరికీ అర్ధమయ్యింది. ఇక ఇప్పుడు దీపావళి సందర్భంగా పండగ చేసుకుంటూ డాన్స్ చేసిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి ఒక నెటిజన్ కి మండిందో ఏమో " అక్క కొంచెం ఓవర్ అయ్యింది" అని కామెంట్ పెట్టారు. దానికి ఫైమా రిప్లై ఇచ్చింది " పర్లేదురా నా బాయ్ ఫ్రెండ్ తోనేగా చేశా" అని చెప్పేసరికి సూపర్ గా చెప్పారు అంటూ మిగతా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.