కాస్ట్యూమ్ చేంజ్ చేసిన శౌర్య ...కార్తీక దీపం ఫ్యాన్స్ ఖుషీ!

  కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై ఒక చరిత్ర సృష్టించింది. ఒక సీరియల్ కి కూడా ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. ఏ మూవీకి లేనంత క్రేజ్ దీనికి ఉంటుంది. ఈ సీరియల్ లో కార్తీక్, దీప ఇద్దరిది పర్ఫెక్ట్ పెయిర్. కార్తీక దీపం సీరియల్ అయిపోవడంతో ప్రేక్షకులకు డిస్సపాయింట్ అయ్యారు. అందుకే ఇప్పుడు కార్తీక దీపం2 పేరుతో నవ వసంతం పేరిట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇక సీరియల్ లో గత వారమే శౌర్య కోసం కార్తీక్ దీప మెడలో తాళికట్టాడు. అప్పటి నుండి సీరియల్ కి టీఆర్పీ భారీ స్థాయికి చేరుకుంది. దీప మెడలో కార్తీక్ తాళి కట్టేటప్పుడు కొంతమంది ఫ్యాన్స్ టీవీ ముందుకొచ్చి హారతులు కూడా పట్టారు. మరికొందరు అయితే కట్ చేశారు. ఆ వీడియోలు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అయ్యాయి. అయితే ఈ కార్తీక దీపం రెండో భాగంలో కార్తీక్, దీపలతో పాటు శౌర్యకి కూడా అంతే రేంజ్ లో  ఫ్యాన్స్ ఉన్నారు.  ఈ సీరియల్ లో శౌర్య, దీపలది మొదటి నుండి ఒకటే రకం కాస్టుమ్ వేసుకుంటున్నారు. స్టార్ మా రిలీజ్ చేసే కార్తీక దీపం-2 ప్రోమో కింద చాలా మంది కార్తీక్ దీపం ఫ్యాన్స్.. " ప్లీజ్ కార్తీక్ బాబు ఇప్పుడు దీపని పెళ్లి చేసుకున్నారు కదా.. దీప, శౌర్యలకి కొత్త బట్టలు కొనియ్యండి"  అంటు తరచూ కామెంట్లు చేస్తుంటారు. అది కాస్త డైరెక్టర్ చూసాడేమో.. ఇప్పుడు శౌర్య కాస్ట్యూమ్ చేంజ్ చేసారు. తాజాగా వచ్చిన కార్తీకదీపం-2 ప్రోమోలో శౌర్య ఫ్రాక్ లో కనిపించేసరికి ఈ సీరియల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎప్పుడు లంగా జాకెట్ లో పేదింటి అమ్మాయిలా కన్పించే శౌర్య ఒక్కసారిగా రిచ్ కిడ్ లా కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక కార్తీకదీపం-2 అభిమానులకి మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తోంది.

పృథ్వీతో కలిసి బయటకొస్తానన్న విష్ణుప్రియ.. నెటిజన్లు షాక్!

  బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం నాడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఇందులో భాగంగా సెలెబ్రిటీలు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి సందడి చేశారు. సింగర్ సమీరా భరద్వాజ్ వచ్చి కంటెస్టెంట్ల మీద స్పెషల్ పేరడీ పాటలు పాడింది. చివరకి హైపర్ ఆదితో ఓ సెగ్మెంట్ పెట్టేశాడు. తన స్టైల్లో కంటెస్టెంట్లను ఆడుకున్నాడు ఆది. విష్ణుప్రియకి మంచి సలహాలు ఇచ్చాడు.  ప్రతీ సీజన్‌లో హైపర్ ఆది వచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరు మీద కౌంటర్లు వేస్తూ హింట్లు ఇస్తుంటాడు. ఈసారి కూడా ఆది అలానే కంటెస్టెంట్లకు మంచి సలహాలు ఇచ్చాడు. వైల్డ్ కార్డులు రాక ముందు.. బాహుబలి-1, వైల్డ్ కార్డుల ఎంట్రీ తరువాత బాహుబలి-2 లా ఉందని, ఈ సీజన్ పెద్ద హిట్ అయిందని చెప్పుకొచ్చాడు. సోనియా, నిఖిల్ పృథ్వీ ప్రేమ దేశం చూపించాడు. నిఖిల్.. ఏక్ నిరంజన్ చూపించాడు. ఆ తర్వాత విష్ణు, పృథ్వీ.. ప్రేమించుకుందాం సినిమా చూపించారని.. మధ్యలో నయని దూరి.. ఇంట్లో ఇళ్లాలు వంటింట్లో ప్రియురాలు చూపించిందని ఆది అన్నాడు. సీఎం, డీసీఎంలు పెద్ద పెద్ద స్పీచులు ఇవ్వలేదు కానీ నువ్వు మాత్రం మెగా చీఫ్ అయ్యేందుకు పెద్ద స్పీచ్ ఇచ్చావ్. అంత:కరణశుద్ది అంటూ పెద్ద పెద్ద పదాలు వాడావ్.. విష్ణుతో పాటుగా పృథ్వీ కూడా నిలబడాలి.. మీ ఇద్దరి పెయిర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.. విష్ణుప్రియ నవ్వులకు కుర్రాళ్లు భయపడుతున్నారు.. కాస్త మెల్లిగా నవ్వు. పతివ్రత, పుణ్య స్త్రీ, రాక్షసిదాన అనే పదాలన్నీ ఇప్పుడు నీ వల్లే ఫేమస్ అవుతున్నాయి.. పాత సినిమాల్లో వినిపించే టైటిల్, డైలాగ్స్‌తో ఈ పదాలు ఫేమస్ అయ్యాయి. నాగార్జున గారు ఉంటే ఆటకు హాయ్, పృథ్వీకి బై. నాగార్జున గారు లేకపోతే.. ఆటకు బై పృథ్వీకి హాయ్ చెబుతున్నావ్.. ఇంత వరకు బొమ్మరిల్లు ఫాదర్‌ను చూశాం.. కానీ నువ్వు మాత్రం బొమ్మరిల్లు లవర్. ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో అన్నీ నువ్వే పృథ్వీకి చెబుతున్నావ్.. ఇప్పటికీ నీ కన్ను పృథ్వీ మీదే ఉంది.. పృథ్వీని ప్రేమిస్తే.. పృథ్వీ మాత్రమే నిన్ను ప్రేమిస్తాడేమో.. కానీ ఆటని కూడా ప్రేమిస్తే.. ప్రేక్షకులందరూ నిన్ను ప్రేమిస్తారు.. బయట ఎలా ఉందో.. ఇంట్లో కూడా అలానే ఉంది.. చాలా చెప్పా.. నత్తి బ్రెయిన్‌కు అర్థమైతే.. సంతోషం అని అన్నాడు. నువ్వు బయటకు టైటిల్‌తో వస్తావా.. లవర్‌తో వస్తావా అని బయట నీ తమ్ముళ్లు వెయిటింగ్ అని ఆది అడుగుతాడు. రెండింటితో వస్తానని విష్ణు చెప్తుంది. మళ్లీ తన ప్రేమను వదిలి పెట్టడం లేదు. అసలు విష్ణు అర్థం చేసుకునే మూడ్‌లోనే లేనట్టుగా కనిపిస్తోంది. పృథ్వీతో లవ్ ట్రాక్ కి బ్రేక్ ఇస్తేనే విష్ణుప్రియ ఆట మెరుగుపడుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు.

అవినాష్ ఎలిమినేషన్.. షాక్ లో కంటెస్టెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ద్చారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఎలిమినేషన్ అయ్యాడు.‌ ఇది ఎవరు ఊహించనది. మొన్నటి ఎపిసోడ్ లో రాత్రి అవినాష్ కి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో అతను మెడికల్  రూమ్ కి వెళ్ళాడు. మెడికల్ రూమ్ లో డాక్టర్లు అన్ని టెస్ట్ లు చేసి అవినాష్ కి కడుపులో ఏదో ప్రాబ్లమ్ ఉందని తేల్చేశారు‌.‌ ఇక అవినాష్ అదే విషయం హౌస్ లోకి వచ్చి తోటి హౌస్ మేట్స్ తో చెప్పాడు. ఇక అందరు ఏదో ప్రాంక్ అనుకున్నారు. కానీ నిజంగానే అవినాష్ అందరికి బై చెప్పేసి మెయిన్ గేట్ నుండి బయటకి వెళ్లిపోయాడు. ఇక హౌస్ లోని విష్ణుప్రియ, రోహిణి, హరితేజ అందరు ఏడ్చేస్తున్నారు.‌ ఇది ఆదివారం నాటి ఎపిసోడ్ చివరలో వేయడంతో ఫుల్ వైరల్ గా మారింది.  అవినాష్ హౌస్ లో మోస్ట్ ఎంటర్‌టైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సందర్భాలలో అవినాష్- రోహిణి కలిసి చేసిన కామెడీ సూపర్ హిట్ అయ్యింది. ‌ఇక అవినాష్ ఇలా హెల్త్ పరంగా బయటకు రావడం బిబి ఆడియన్స్ కాస్త నిరాశమే మిగులుస్తుంది. అయితే అవినాష్ మళ్ళీ హౌస్ లోకి వస్తాడా రాడా అనేది మెడికల్ రిపోర్ట్స్ వచ్చాకే తెలుస్తుంది.   

మెహబూబ్ ఎలిమినేషన్.. అప్పుడు కూడా దీపావళికే బయటకొచ్చా!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిది వారాలు పూర్తయింది. ఇక ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ లో చాలా యాక్టివ్ ఉన్నాడు. అయితే గత వారం జరిగిన బ్యాటరీ టాస్క్ లో తమ క్లాన్ మెంబర్స్ అయినటువంటి హరితేజ, నయని పావనిలని పట్టించుకోలేదనే కారణంతో వాళ్ళిద్దరు మెహబూబ్ ని నామినేట్ చేశారు. దానివల్లే నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు.  వీకెండ్ ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ సెలబ్రిటీలతో నిండిపోయింది. సింగర్స్, డ్యాన్స్ పర్ఫామెన్స్, గేమ్స్, పాటలు డ్యాన్స్ ఇలా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ తో నిండిపోయింది. అయితే నామినేషన్ లో ఆరుగురిలో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేయగా నయని పావని, మెహబూబ్ చివరగా ఉన్నారు.‌ వీరిద్దరిలో మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యింది. హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చాడు మెహబూబ్. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే అయ్యా.. ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నానంటూ మెహబూబ్ బాధపడ్డాడు. ఇక ఎప్పటిలాగే హౌస్ లో ఎవరెంటో చెప్పమని నాగార్జున అన్నాడు.  థౌంజెండ్ వాలా అవినాష్ కి ఇచ్చాడు. గంగవ్వకి లక్ష్మీ బాంబ్ ఇచ్చాడు. లైఫ్ లో నీకేం కావాలన్నా నేనున్నా బాధపడకు.. నీ చిన్న బిడ్డకి నేను చేస్తా అనడంతో గంగవ్వ ఎమోషనల్ అయ్యింది. తారాజువ్వని నబీల్ కి ఇచ్చాడు.‌కాకరవొత్తి రోహిణికి ఇచ్చాడు. అవినాష్, రోహిణి పక్కపక్కనే ఉంటే ఫుల్ నవ్వుకుంటాం. ఫైర్  నీలో ఉందని గౌతమ్ తో మెహబూబ్ చెప్పాడు.   

బిగ్ బాస్-8 లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వారం ఎండింగ్ కి వచ్చేసింది. శనివారం, ఆదివారం అనగానే ఎలిమినేషన్ గుర్తొస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న క్యూరియాసిటి అందరిలో ఉంది. ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు బయటకు వచ్చేసారు. గత వారం గౌతమ్ లీస్ట్ లో ఉండగా అప్పటికే మణికంఠ నేను వెళ్ళిపోతా అని అనడంతో గౌతమ్ ని ఆపి మణికంఠని పంపించేశారు. బిగ్ బాస్ లో కొన్ని ఎలిమినేషన్స్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉండగా నిఖిల్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే లీస్ట్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఉన్నారు.. ఓజీ వాళ్ళు ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారం రాయల్స్ నుండి మెహబూబ్ ఎలిమినేషన్ అనేది మొదటిది. ఈ వారం హౌస్ లో మెహబూబ్ ఆటతీరు బానే ఉన్నా బయటకు వచ్చేసాడంటే నామినేషన్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడమే కారణం. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యాభై వేలకి యష్మీ, నిఖిల్ ల లవ్ స్టోరీ చెప్పేసిన పృథ్వీ!

బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం‌ వీకెండ్ వచ్చేసింది. యష్మీ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ వీళ్లంతా కన్నడ బ్యాచ్. అందుకే మొదట నుండి వీళ్ళు ఎవరితో కలవకుండా వీళ్ళే ఉంటు వస్తున్నారు. యష్మీ పాప నిఖిల్ ని లవ్ చేస్తున్నట్లు చెప్పేసింది. అయితే నిఖిల్ కి మాత్రం యష్మీ అంటే ఇష్టమున్నా కూడా బయట పడడం లేదు. కానీ యష్మీ మాత్రం తను అంటే ఇష్టమున్న గౌతమ్, నిఖిల్ లని ట్రాక్ లో పడేయ్యడానికి చూస్తుంది. యష్మీ ఏం చేసినా కూడా నిఖిల్ జలస్ ఫీల్ అవ్వాలని చేస్తుంది.. ఆ విషయం నాగార్జున చెవిన పడ్డట్టుంది. యష్మీకి గౌతమ్ తినిపిస్తున్నాడని మాట్లాడుతుంటే అది వండింది మేమ్.. గౌతమ్ రెడీ గా ఉంది తీసుకొని యష్మీ దగ్గరికి వెళ్ళడని నిఖిల్ అనగానే..అంటే గౌతమ్ తినిపిస్తున్నాడని జలస్ ఆ అది మీరు వండింది అని అలా అంటున్నావా అని నాగార్జున అడుగుతాడు. నిఖిల్ ప్రాబ్లమ్ అన్నం, పప్పు కాదు.. టీ షర్ట్ ప్రాబ్లమ్ అని నాగార్జున అనగానే.. రైట్ సర్ అని పృథ్వీ అంటాడు. టీ షర్ట్ తో తుపాన్ అనేది ఒక సామెత అని నాగార్జున అంటాడు. కావాలంటే పృథ్వీని అడగండి.. పృథ్వీ ఆ విషయం చెప్తే యాభై వేలు ప్రైజ్ మనీకి ఆడ్ చేస్తానని నాగార్జున అనగానే.. అందరు చెప్పు చెప్పు అని అంటారు. యష్మీ, నిఖిల్ మాత్రం వద్దని అంటారు. అయిన పృథ్వీ చెప్తాడు.  గౌతమ్ ని యష్మీ టీ షర్ట్ అడిగింది. నిఖిల్ టీ షర్ట్ లేదు కాబట్టి అడిగింది. నిఖిల్ కి మండుతున్నట్లు ఉంది.. నిఖిల్ జలస్ గా ఫీల్ అవుతాన్నాడు.. అక్కడ నుండి ఏదైనా ఫీలింగ్ ఉందా అని యష్మీ అడిగిందంటు పృథ్వీ చెప్పాడు. అప్పుడే నిఖిల్ వచ్చి ప్రాబ్లమ్ ఓన్లీ టీ షర్ట్ అని చెప్పాడు. దాని ముందు జరిగింది చెప్పురా ఎందుకు ఇలా మార్చి చెప్తున్నావని యష్మీ అంటుంది. ఇక పృథ్వీని నాగార్జున కంటిన్యూ చేయమంటాడు. నెక్స్ట్ డే నే సాంగ్ వచ్చింది సర్.. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే అని పృథ్వీ అనగానే సి వచ్చి మళ్ళీ బి పై వాలిందంటూ నాగార్జున అంటాడు. దీన్ని బట్టి ఆర్య-3 కూడా తీయొచ్చు అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

Karthika Deepam 2: దీప కండిషన్ అదే.. ఆ పూజ జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -186 లో.... దీపని తీసుకొని కార్తీక్ గదిలోకి వస్తుంది శౌర్య. నాతో ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ అంటాడు. మాట్లాడడానికి కాదు నాన్న ఇక్కడే పడుకోవడానికి అని శౌర్య అంటుంది. ఇబ్బందిగానే దీప పడుకుంటుంది. వాళ్ళ ఇద్దరిలో మధ్యలో శౌర్య పడుకుంటుంది. నాన్న నాకు కథ చెప్పు అనగానే.. దీప స్టోరీనీ చెప్తుంటాడు కార్తీక్. శౌర్య పడుకున్నాక దీప గదిలో నుండి వెళ్ళిపోతుంది. దీపని చూసిన అనసూయ.. శౌర్య కోసం, నా కోసం..  నువ్వు అక్కడికి వెళ్ళావ్.. ఇష్టం లేదు కదా అని అంటుంది. కాంచన అమ్మ మీ ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంటుందని అనసూయ అనగానే.. వద్దని దీప చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు దీప గుడికి వెళ్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతుంది. మరొకవైపు సుమిత్ర అదే గుడికి వెళ్తుంది. జ్యోత్స్న పేరున అర్చన చేయిస్తుంది. సుమిత్రకి ఒక పండుని ప్రసాదంలాగా ఇస్తాడు పూజారి. అది పట్టుకొని వెళ్తుంటే కిందపడిపోయి దీప దగ్గరికి వస్తుంది. దీపని సుమిత్ర చూస్తుంది. సుమిత్ర దీపతో బానే మాట్లాడుతుంది. జరిగింది.. జరిగిపోయింది దాన్ని ఎవరు మార్చలేరని అంటుంది. నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లనిపిస్తుంది. కార్తీక్ ని భర్త గా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. ఇష్టం లేకుండా జరిగింది నా కూతురికి నాన్న అవ్వాలని అలా చేసాడు కానీ నాకు భర్త అవ్వాలని కాదని దీప అంటుంది. పెళ్లి అయింది.. దీన్ని ఎవరు మార్చలేరు.. ఇది నా కూతురు కోసం పూజారి ఇచ్చిన ప్రసాదం.. ఇది ఇప్పుడు నీకు అవసరం అయ్యేలా ఉందని సుమిత్ర తనకి ఇచ్చి వెళ్తుంది. పూజ ఎలా ఆపాలి.. వాళ్ళంతట వాళ్లే ఆపేలా చెయ్యాలని దీప అనుకుంటుంది. తరువాయి భాగంలో పూజ తర్వాత మమ్మల్ని ఇద్దరు ఆశీర్వాదించాలి కానీ మీరు ఒక్కరే ఉన్నారు.. శ్రీధర్ గారిని కూడా రమ్మని చెప్పాలి.. అప్పుడే ఈ పూజ జరుగుతుందని దీప కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

హీరో సూర్యకి భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. డాన్స్ ల సందడి సండే రోజు ఉంటుంది లేదంటే ఫినాలే వీక్ ఉంటుంది. కానీ ఈ సారి స్పెషల్ గెస్ట్ ని తోసుకొచ్చాడు బిగ్ బాస్ మామ. అతనే హీరో సూర్య. సూర్య భాయ్ అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చాడు సూర్య. తన కొత్త సినిమా 'కంగువా' ప్రమోషన్ కోసం వచ్చిన సూర్య.. హౌస్ మేట్స్ ని ఉత్తేజపరిచాడు. సూర్య స్టేజ్ పైకి వచ్చి నాగార్జున తో ముచ్చటించాడు. కాసేపటికి ఆ మూవీ టీమ్ అంతా కూడా స్టేజ్ పైకి వస్తారు. ఇక మువీ ట్రైలర్ ని చూపించారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు కూడా సూర్యకి సర్ ప్రైజ్ గా తన సినిమాలోని పాటలని  ఇద్దరు జంటగా డాన్స్ వేస్తూ ఎంటర్‌టైన్ చేశారు. నిఖిల్-యష్మీ, పృథ్వీ-విష్ణుప్రియ, ప్రేరణ-నబీల్, మెహబూబ్-నయని, తేజ-హరి తేజ. అవినాష్-రోహిణి. గౌతమ్-నయని లు తమ డ్యాన్స్ స్టెప్స్ తో సూర్యని సర్ ప్రైజ్ చేశారు. ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ అందరిని పరిచయం చేశాడు. విష్ణుప్రియని పరిచయం చేస్తాడు. నిన్ను చూసి శృతి హసన్ లాగా ఉన్నావని సూర్య అంటున్నాడని నాగార్జున అనగానే.. విష్ణుప్రియ మురిసిపోయింది. నాకు తెలుసు ఇప్పుడు మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారని విష్ణుప్రియ అంటుంది. ఇక నయని,సూర్యకి పెద్ద ఫ్యాన్ అంట.. ముందు రోజే సూర్య వస్తున్నాడని తెలిసి ఎమోషనల్ అయిందట. ఆ విషయం సూర్యకి హరితేజ చెప్తుంది. అయితే నీకు ఒక ఆఫర్ నయని.. ఒక అయిదు నిమిషాలు నువ్వు ఇక్కడికి వస్తే సూర్య తో ఉండొచ్చు.. మళ్ళీ హౌస్ లోకి వెళ్ళకూడదని నాగర్జున అనగానే దానికి నయని ఒప్పుకుంటుంది. చూసావా సూర్య నీకు తెలుగులో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారోనని సూర్యతో నాగార్జున అంటాడు. ఇక హౌస్ మేట్స్ అంతా గ్రాంఢ్ గా ఆల్ ది బెస్ట్ చెప్తారు.

బెడ్ రూమ్ లో బొమ్మ బొరుసు ఆడుకుంటున్న భార్యాభర్తలు.. అత్త ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -237 లో.....రామలక్ష్మికి అభి ఎదరుపడి మాట్లాడితే సీతాకాంత్ కి డౌట్ వస్తుందని అనుకుంటాడు. అభి రామలక్ష్మి దగ్గరికి వస్తుంటే మాణిక్యం కన్పించడంతో అభి భయపడి వెళ్ళపోతాడు. ఆ తర్వాత సిరిని డిశ్చార్జ్ చేసి పంపిస్తుంటారు.  మరొకవైపు శ్రీలత చేస్తున్న కుట్ర మోసం గురించి శ్రీలతతో మాణిక్యం మాట్లాడుతాడు. నా కూతురు జోలికి రాకు అంటు మాణిక్యం వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏంటి ఏదో జాగ్రత్త అంటున్నావని సీతాకాంత్ అనగానే.. సిరి జాగ్రత్త అంటున్నానని మాణిక్యం కవర్ చేస్తాడు. ఎందుకు తనతో పెట్టుకుంటున్నావ్.. ఆవిడ బుద్ది అసలే మంచిది కాదని సుజాత అనగానే.. ఆ శ్రీలత కి నేను అంటే భయం పుట్టాలి.. లేదంటే కూతురు అల్లుడిని కలిసి ఉండనివ్వదని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత సిరిని సీతాకాంత్ జాగ్రత్త గా చూసుకుంటుంటే.. అపుడే రామలక్ష్మి వచ్చి నేను చూసుకుంటాను. మీరు మీ పని చూసుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత అభి ఎందుకు వచ్చాడని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అత్తయ్య చెప్పిన మాటలు నమ్మేసినట్లున్నాడని రామలక్ష్మి అనుకుంటుంది. నా గురించి తప్పుగా అనుకుంటున్నారా అని రామలక్ష్మి అడుగుతుంది. అదేం లేదు వేరే ఆలోచనలో ఉన్నా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నందినికి శ్రీలత ఫోన్ చేసి.. సందీప్ ని చైర్మన్ చెయ్ అని అంటుంది. ఇద్దరి అవసరం ఈక్వల్ గా ఉంది.మ టైమ్ వచ్చినప్పుడు చేస్తానని నందిని అంటుంది.ఆ తర్వాత ఆ శ్రీలతతో జాగ్రత్త అని నందినితో హారిక అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ దగ్గరికి పాలు తీసుకొని వస్తుంది. ఇద్దరు ఫన్నీ ఒక గేమ్ ఆడతాడు. బొమ్మ బొరుసు వేస్తుంది. బొమ్మ పడితే నేను చెప్పినట్టు చెయ్యాలని రామలక్ష్మి అంటుంది. బొమ్మ పడుతుంది నేను చెప్పినట్టు చెయ్యాలని రామలక్ష్మి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మిమ్మల్ని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ లో రామ్ భీమ్ ని చూసినట్టుంది!

బిగ్ బాస్ హౌస్ లో అందరు ఎంతగానో ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. నాగార్జున చీవాట్లు పెట్టే ఈ ఎపిసోడ్ కి వారమంతా ఎదురుచూస్తునే ఉంటారు. కానీ ఈ వారం స్పైసీ కొంచెం తగ్గినట్లుంది. ఆదివారం జరగాల్సిన ఫన్ డే కాస్త శనివారమే జరిగింది. ఈ వారం హౌస్ మేట్స్ అందరు బాగా పర్ఫామెన్స్ ఇచ్చారు. నాగార్జున మొదట కర్రతో వచ్చాడు కానీ తర్వాత కామెడీనే చేసాడు. హౌస్ మేట్స్ తో నాగార్జున ఒక్కొక్కరిగా తమ అటతీరు గురించి చెప్పుకొచ్చాడు. మొదటగా పృథ్వీ ఈ వారం ఫుల్ ఫైర్ తో ఆడావు.. నువ్వు టాస్క్ లో ఉన్నావంటే రాయల్స్ కి భయం పుట్టేలా చేసావంటూ పృథ్వీని మెచ్చుకున్నాడు నాగార్జున. కానీ నామినేషన్ అప్పుడు రోహిణిని నువ్వు చుసిన చూపు కొంచెం హర్టింగ్ గా ఉంటుంది. ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోమంటూ స్మాల్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతూ.. ఈ వారం చాలా బాగా అడావు. పృథ్వీది నీ కాంబినేషన్ సూపర్ మిమ్మల్ని చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ భీమ్ లా అనిపించిందని నాగార్జున వాళ్లకి బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ సంచాలకుడిగా ఉన్నప్పుడు.. తీసుకున్న నిర్ణయం సరైనదేనా అంటూ హౌస్ మేట్స్ ఓపీనియన్ అడుగుతాడు. ఆ తర్వాత మిగతా హౌస్ మేట్స్ ఆటతీరు.. వారు చేసిన మిస్టేక్స్ అన్నీ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈ వారం నిఖిల్, పృథ్వీలు ఇద్దరు నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళు పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ నుండి ఇద్దరు సేవ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Brahmamudi : క్లయింట్స్ రాకుండా ఆపేసిన అనామిక.. కావ్య ఏం చేస్తుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -551 లో....రాజ్ హాల్లోకి వస్తాడు. అందరు ఇప్పుడు నన్ను ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడుతారని అనుకుంటాడు. కానీ ఆవిషయం పక్కన పెట్టి ఖాళీగా ఉంటున్నావ్ కదా.. ఆ పని చెయ్.. ఈ పని చెయ్ అంటారు. ఇందిరాదేవి ఏకంగా కూరగాయలు తీసుకొని రమ్మని చెప్తుంది. రాజ్ తీసుకొని వస్తానని అనగానే అందరు షాక్ అవుతారు. దాంతో ఇందిరాదేవి లిస్ట్ ఇస్తుంది. అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అపర్ణ, కనకం ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. మీ అల్లుడు బయలుదేరాడని ఇందిరాదేవి చెప్తుంది.‌ మరొక వైపు కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ మేనేజర్ నుండి సెక్యూరిటీ షిఫ్ట్ చేసిన అతను కావ్యకి నమస్తే పెడతాడు. నీకు సెల్యూట్ ఎలా చేయాలో కూడా తెలియదా అని కావ్య అనగానే.. నేను ఏమైనా పుట్టుకతో సెక్యూరిటీనా అని అతను అంటాడు. ముందు సెక్యూరిటీ డ్యూటీ నేర్చుకోమని కావ్య కోప్పడి వెళ్ళిపోతుంది. కావ్య లోపలికి వెళ్లేసరికి.. శృతి ఇంకొక అమ్మాయి ఇద్దరు కూడా రాజ్ సర్ వస్తాడని ఒకరు.. కావ్య మేడమ్ వస్తారని ఒకరు పందెం కాస్తుంటారు. కావ్య వచ్చి వాళ్లపై కోప్పడుతుంది. ఆ తర్వాత అపర్ణకి కావ్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ మీ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడోనని కావ్య అనగానే.. అదేం లేదని అపర్ణ అంటుంది. మరొకవైపు రాజ్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు ఎక్కువ ధరకి కొంటాడు. అదంతా చూసిన కనకం.. నా అల్లుడుని మోసం చేస్తున్నావంటూ అడుగుతుంది. అయిన మీరు చేసిన మోసం ముందు ఇది ఎంత అన్నట్లు రాజ్ మాట్లాడతాడు. మిమ్మల్ని ఎప్పటికి క్షమించలేనని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి శృతి వచ్చి.. క్లయింట్స్ రానని చెప్పారని అంటుంది. అప్పుడే అనామిక ఫోన్ చేసి.. వాళ్ళని నేనే రాకుండా ఆపానని అంటుంది. తరువాయి భాగ లో రాజ్ ని ఆఫీస్ కి వెళ్ళమని అందరు ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటే.. రాజ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బాడీ షేమింగ్ పై పృథ్వీకి నాగార్జున వార్నింగ్.. గౌతమ్ కి షాక్!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే ఏడు వారాలు గడిచింది. ఇక అయితే ఎనిమిదో వారం వీకెండ్ కి వచ్చేసింది. శనివారం నాటి ప్రోమో కోసం జనాలు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. గత వారం ప్రోమో లేటుగా అప్లోడ్ చేశారంటు బిబి టీమ్ ని నెటిజన్లు ట్రోల్ చేయగా.. ఇప్పుడు పొద్దున్నే వదిలారు.  బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున వచ్చీ రాగానే ఓ కర్రతో వచ్చాడు. నామినేషన్ లో కుండలు పగులగొట్టినట్టు అందరి పర్ఫామెన్స్ చూసి ఈ వారం ఎవరు చెత్తగా ఆడారో వారి ఫోటో ఉన్న కుండని పగులగొడతాడన్న మాట. ఇక పృథ్వీని లేపి.. కింద నుండి పై దాకా చూశాడు నాగార్జున. నేనేం నిన్ను బాడీ షేమింగ్ చేయడం లేదు.. అలా చూశాను అంతే అని నాగార్జున అనగానే ఆ ఇంటెన్షన్ తో చూడలేదు సర్ అని పృథ్వీ అన్నాడు. నా ఇంటెన్షన్ కూడా అది కాదని నాగార్జున అన్నాడు.  ఆ పాయింట్ వినగానే రోహిణిని పృథ్వీ నామినేషన్ లో చూసింది అంతా గుర్తొచ్చింది. ఈ పాయింట్ మీద పృథ్వీకి గట్టిగానే వార్నింగ్ పడ్టట్టు ఉంది. ఇక నిఖిల్ సంఛాలక్ గా ఎలా ఉన్నాడో చెప్పుకొచ్చాడు నాగార్జున.   క్వశ్చన్ అంతా పూర్తయ్యాకే బజర్ నొక్కమని బిగ్ బాస్ చెప్పాడని టేస్టీ తేజ అనగానే.. మీ రాయల్స్ అంతా క్వశ్చన్ పూర్తయ్యాకే బజర్ నొక్కారా అని నాగార్జున అడిగాడు. క్వశ్చన్ రిపీట్ చేయదన్నారు చేయలేదు సర్ అని నిఖిల్ అనగానే.. తేజ ఈ కుట్ర నువ్వు పన్నావ్ అన్నమాట అని నాగార్జున అనగానే.. తేజ బిత్తరపోయాడు.  యష్మీ విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేశావని నాగ్ అడుగగా.. సెవెన్ వీక్స్ లో ఇండివిడ్యువల్ గేమ్ నాకు ఎక్కడ కనపడలేదని యష్మీ అంది.. మరి నీ ఇండివిడ్యువల్ గేమ్ ఏదని నాగార్జున క్వశ్చన్ చేసేసరికి.. తను షాక్ అయ్యింది.  నువ్వు మెగా ఛీఫ్ అయ్యాక లేడీస్ వీక్ అని డిక్లేర్ చేస్తున్నావ్.. కొన్ని వినడానికే బాగుంటాయి. ఆచరించడానికి బాగోవు.. కోపంలో ఓ మాట.. కోపం తగ్గాక ఓ మాట.. ఇష్టం ఉంటే ఓ మాట.. ఇష్టం లేకపోతే ఓ మాట మాట్లాడతావా అంటు గౌతమ్ ని నాగ్ అడిగాడు. ఏదో షార్ట్ టెంపర్ లో అలా అన్నాను అని గౌతమ్ అన్నాడు. ఇక ఈ ప్రోమోని బట్టి చూస్తే కొందరికి గట్టిగానే వార్నింగ్ వచ్చినట్టు ఉంది. యూట్యూబ్ లో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. 

తోప్ కంటెస్టెంట్ కి ఎలిమినేషన్ తప్పదు.. సీక్రెట్ రూమ్ ఆ డబుల్ ఎలిమినేషనా!

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో తమకంటూ ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండి ఎంట్రీ ఇచ్చినవాళ్లే. అయితే హౌస్ లో తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన వాళ్లే చివరి వరకు ఉంటారు. అయితే ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ప్రస్తుతం నామినేషన్ లో నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, మెహబూబ్, పృథ్వీ, నయని పావని మొత్తంగా ఆరుగురు ఉన్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ప్రేరణ ఉంది. నిఖిల్ సెకెండ్ ప్లేస్ లో ఉన్నారు. మూడో స్థానంలో విష్ణుప్రియ ఉండగా నాల్గవ స్థానంలో పృథ్వీ ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరున్నారు. ఇక ఈ వారమంతా హౌస్ లో మెహబూబ్ కాస్త గేమ్ ఆడాడు.‌ కానీ నయని పావని ఏం ఆడలేదు. ఎప్పుడు చూసిన ఏడుపే.. హౌస్ లో క్రైయింగ్ బేబీ అని పేరు తెచ్చుకున్న నయనికి ఈ వీకెండ్ లో క్రైయింగ్ తప్పదేమోననిపిస్తుంది. అయితే బిగ్ బాస్ మామ మరోలా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అదేంటంటే గంగవ్వ హౌస్ లో ఉన్నా పెద్దగా పర్ఫామెన్స్ లేదు పైగా తోటి కంటెస్టెంట్స్ మీద చిరాకు పడటం.. ప్రతీసారీ ఇదే రిపీట్ అవుతుంది. రాయల్స్ - ఓజీ క్లాన్ ల మధ్య టాస్క్ లు భారీగా జరుగుతున్నాయి. వాటిల్లో గంగవ్వ పార్టిసిపేషన్ లేదు కాబట్టి తనని ఎలిమినేషన్ చేసి.. ఈ వారం లీస్ట్ లో ఉన్న నయని పావనిని లేదా మెహబూబ్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే హౌస్ లో కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఫుడ్ దగ్గర టాస్క్ లలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. మరి మన బిగ్ బాస్ మామ డబుల్ ఎలిమినేషన్ చేసి అందరికి షాకిచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఈ రెండు కాకుండా పృథ్వీ-విష్ణుప్రియ మధ్య ఫేక్ లవ్ అనేది చాలా ఇబ్బందిగా మారింది. తోటి హౌస్ మేట్స్ అంతా వాళ్ళిద్దరి వల్ల టాస్క్ లో కూడా సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. మరి వీరిలో లీస్ట్ లో ఉన్న నయని, మెహబూబ్ లని పక్కన బెట్టి వారిపైన ఉన్న పృథ్వీని బయటకు పంపిస్తాడో లేదో చూడాలి మరి.

యష్మీ-గౌతమ్ ల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్.. నిఖిల్ కి జెలస్ అంట!

  బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ లోను ఆర్య-2 ట్రాయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తుంది. గౌతమ్ కి యష్మీ అంటే ఇష్టం అది స్వయంగా తనే యష్మీతో చెప్పుకొచ్చాడు. యష్మీకి నిఖిల్ అంటే ఆ విషయం కూడా తనే స్వయంగా చెప్పుకొచ్చింది. నిఖిల్ మాత్రం ఈ విషయంలో బయటపడడం లేదు.. యష్మీ తన మనసులో మాట చెప్పినప్పుడు నిఖిల్ ఏ సమాధానం చెప్పకుండా ఉన్నాడు. ఆ తర్వాత కిచెన్ లో ఉన్న యష్మీ దగ్గరికి వచ్చి నుదుటి పై ముద్దు పెట్టాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ నిఖిల్ లు సరదాగా గొడవ పడుతుంటారు. నాపై ఏ హోప్స్ పెట్టుకోకని నిఖిల్ అనగానే.. ఏంటి అలా అంటున్నావ్.. నాకేం తక్కువ.. నాకు ఎవరు దొరకరన్నట్టు ప్రతీసారీ హోప్ పెట్టుకోకు అంటున్నావ్.. నాకు పృథ్వీ ఎలాగో నువ్వు కూడా ఇక అంతే అంటూ కాస్త పొగరుగా చెప్పేసి యష్మీ అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత యష్మీ, ప్రేరణ ఇద్దరు ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు. అలా ప్రతిసారీ అంటే నాకు నిజంగా హర్టింగ్ గా ఉంటుందని యష్మీ అంటుంది. నబీల్ తో  నిఖిల్ అన్న విషయం ఏంటో తెలిసిందా అని ప్రేరణ అడుగుతుంది. హా తెలిసింది.. నేను గౌతమ్ తో డాన్స్ చేస్తుంటే నిఖిల్ జెలస్ గా ఫీల్ అయ్యాడంట అని యష్మీ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన గౌతమ్ తో యష్మీ ఉండడానికి కారణం నిఖిల్ జెలస్ ఫీల్ అవ్వాలనే అన్నమాట. మరొకవైపు యష్మీ, గౌతమ్ ల గొడవలో గౌతమ్ మాట్లాడుతుంటే.. యష్మీ వెళ్ళిపోతుంది. మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతుంది.. అదేనా రెస్పెక్ట్ అని గౌతమ్ తో తేజ అంటాడు. మనకి అవసరం లేదు.. రెస్పెక్ట్ లేనిది ఎవరు వద్దని యష్మీపై  గౌతమ్ కోపంగా మాట్లాడతాడు. అదంతా కంటెంట్ కోసమే.. నిజంగానే ఏం అర్థం అవ్వడం లేదు.. ఏ విషయం అయిన హౌస్ నుండి బయటకు వచ్చాకే క్లారిటీ వస్తుంది. 

మెగా ఛీఫ్ టాస్క్ లో పృథ్వీకి వెన్నుపోటు పొడిచిన హరితేజ!

  బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎవరంటే అందరు పృథ్వీ అనే అంటారు. అగ్రెసివ్ ఎవరంటే కూడా ఠక్కున పృథ్వీ అంటారు. హౌస్ లో తమ క్లాన్ లో తప్ప మిగతా హౌస్ మేట్స్ కి పృథ్వి నచ్చడు. నిన్న మొన్నటివరకు పృథ్వీ-విష్ణు అంటూ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. నీపై ఎలాంటి ఫీలింగ్ లేదని విష్ణుప్రియ మొహంపైనే పృథ్వీ చెప్పడంతో రెండు రోజులుగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. అయితే నిన్న జరిగిన మెగా చీఫ్ టాస్క్ లో రాయల్స్ నుండి ఇద్దరు ఓజీ నుండి నలుగురు కంటెండర్ షిప్ రేసులో నిలిచారు. ఇక చివరి మెగా చీఫ్ టాస్క్ లో.. టేస్టీతేజ ఉండగానే పృథ్వీని తీసేయాలంటూ హరితేజ తన క్లాన్ తో చెప్పింది. మనకి మెగా చీఫ్ గా ఫస్ట్ తేజ  అవ్వాలి..కానీ వాళ్లు ఎలాగైనా తనని తీసేస్తారు.. తేజని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అలాగే హౌస్ కి మంచి మెగా చీఫ్ ని సెలక్ట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.. ఈ పృథ్వీని మనం టాస్క్ లోనే భరించలేం.. ఇక మెగా చీఫ్ అయితే వారమంతా ఎలా భరిస్తామని తన క్లాన్ వాళ్ళని రెచ్చగొట్టింది హరితేజ. ఇక ఆ తర్వాత మిరపకాయని రాయల్ క్లాన్ లోని అవినాష్ పట్టుకోవడంతో.. పృథ్వీని తీసేశాడు. ఈ రకంగా పృథ్వీని మెగా ఛీఫ్ కాకుండా చేసింది హరితేజనే. పృథ్వీ ఈ వారమంతా హౌస్ లోని జరిగిన అన్నీ టాస్క్ లు సూపర్ గా ఆడావ్ అంటు మొదట మెచ్చుకున్న అవినాష్.. మా క్లాన్ నుండి మెగా ఛీఫ్ కావాలంటూ కవర్ చేసుకున్నాడు. దాంతో అసలు విషయం తెలియని పృథ్వీ సరేనని లైట్ తీసుకున్నాడు. అదే హరితేజ తనని తప్పించాలని తన క్లాన్ తో చెప్పిందని తెలిస్తే ఇక పృథ్వీ చేతిలో హరితేజ కథ కాస్త బుర్రకథ అవుతుందేమో. మరి తమ క్లాన్ లోని సీక్రెట్స్ అన్నీ పక్క క్లాన్ కి చేరవేసే నయని పావని ఈ విషయం ఎవరికైనా చెప్తుందా లేక మరెవరైనా పృథ్వీకీ తెలిసేలా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.  

మెగా చీఫ్ గా విష్ణుప్రియ.. అంతఃకరణ శుద్దితో ఉండగలదా!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎన్నడు లేని విధంగా టాస్క్ లు డిఫరెంట్ గా ఎంటర్‌టైన్మెంట్ తో ఉన్నాయి. మెగా చీఫ్ టాస్క్ కంటెండర్ షిప్ లో భాగంగా బీబీ రాజ్యంలో వారంలో ఏడు టాస్క్ లు జరిగాయి. అందులో ఎక్కువ టాస్క్ లు ఓజీ క్లాన్ వాళ్ళు గెలిచి ఒక్కొక్క టాస్క్ గెలిచి ఒక్కక్కరు గా కంటెండర్ షిప్ కి అర్హత సాధించారు. రాయల్స్ క్లాన్ నుండి రోహిణి, టేస్టీ తేజలు కాగా.. ఓజీ క్లాన్ నుండి పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ లు  అయ్యారు. అయితే చివరగా అందరి కంటెండర్స్ కి మెడలో పూలమాల ఉంటుంది. బజర్ మొగినప్పుడల్లా మిగతా హౌస్ మేట్స్ మిరపకాయని ఎవరైతే ముందుగా వెళ్లి పట్టుకుంటారో వాళ్ళు కంటెండర్ గా అనర్హులని భావించిన వారికి పూలదండ తీసీ మిరపకాయ దండ వేసి తొలగించాలని బిగ్ బాస్ చెప్పాడు. రాయల్స్ క్లాన్ వాళ్ళు ఓజీ వాళ్ళని.. ఓజీ క్లాన్ వాళ్ళు రాయల్స్ వాళ్ళని తొలగించగా చివరగా విష్ణుప్రియ, నిఖిల్ ఉన్నారు. ఆ తర్వాత గౌతమ్ మిరపకాయని పట్టుకొని.. నాకు ఈ వీక్ లేడీ మెగా చీఫ్ అవ్వాలని ఉందంటూ నిఖిల్ మెడలో ఉన్న పూలమాల తీసి మిరపకాయ దండ వేస్తాడు. విష్ణుప్రియని మెగా చీఫ్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియ ఎన్వలప్ లో రెండు లక్షల అమౌంట్ ఉంటుంది. అది ప్రైజ్ మనీ కి ఆడ్ అయ్యింది.  ఇక మెగా ఛీఫ్ అయ్యాక విష్ణుప్రియ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ' భరత్ అనే నేను ' సినిమాలోని డైలాగ్స్ కాపీ పేస్ట్ చేసింది. అటు రాయల్స్ క్లాన్, ఇటు ఓజీ క్లాన్ అని కాకుండా అందరికి సమన్యాయం చేస్తానని అంతఃకరణ శుద్దితో ప్రమాణం చేస్తున్నానని విష్ణుప్రియ అంది. ఇక హౌస్ మేట్స్ అంతా చప్పట్లోతో అభినందనలు తెలిపారు. ఇక ఈ వారం మెగా చీఫ్ గా విష్ణుప్రియ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Karthika Deepam2 : ఒకే బెడ్ పై కార్తీక్, దీప.. అంతా శౌర్య కోసమే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -185 లో......సుమిత్ర, దశరథ్ లు జ్యోత్స్న దగ్గరికి వస్తారు. ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ మనవడు ఉన్నాడు మంచి సంబంధం అంటూ పెళ్లి గురించి మాట్లాడుతారని జ్యోత్స్న అనగానే.. మరేం చేయమంటావని సుమిత్ర అంటుంది. నాకు ఆల్రెడీ బావ తో పెళ్లి అయింది. ఆ దీప బావతో నాకు పెళ్లి చేస్తానంది. ఆ మాట గుర్తు రాలేదా ప్రతీ దాంట్లో వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తుందని జ్యోత్స్న ఫ్రస్ట్రేషన్ అవుతూ మాట్లాడుతుంది. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ లు బయటకు వచ్చి.. తను బాధలో ఉంది కొన్ని రోజులు వదిలేద్దామని దశరథ్ అంటాడు. ఒరేయ్ కార్తీక్ నువ్వు దీప మెడలో తాళి కట్టబోయే.. ముందు నా కూతురు గురించి కాకపోయిన నా గురించి ఆలోచించలేదా అని సుమిత్ర అనుకుంటుంది. మరొకవైపు మనం అనుకున్నట్లు రెండు పనులు చేసాం.. ఒకటి దీపని వంట చేయమనడం.. ఇంకొకటి కార్తీక్, దీపలని పక్కపక్కన కూర్చొపెట్టాం.. ఇప్పుడు ఇంకొక పని చెయ్యాలని అనసూయతో కాంచన అంటుంది. ఏంటని అనసూయ అడుగుతుంది. కార్తీక్ తో పాటు నీకు అక్కడే చెప్తానని కార్తీక్ దగ్గరికి కాంచన వెళ్తుంది. మీరు ఎంత కాదనుకున్న ఇప్పుడు భార్యాభర్తలు కలిసి కొత్త జీవితం మొదలు పెట్టేవాళ్ళు.. తన గదిలో తను.. నీ గదిలో నువ్వు ఉంటే ఎలా పెళ్లి అయిన తర్వాత జరగాల్సినవి కొన్ని జరగాలి... కొత్త భార్యాభర్తలతో సత్యనారాయణ వ్రతం చేయించాలని  అనుకుంటున్నాను.. నీకు ఏ అభ్యంతరం లేదు కదా అని కాంచన అనగానే.. నాకేం లేదు కానీ దీపని ఏ ఇబ్బంది పెట్టకండి అని కార్తీక్ అంటాడు. అది మేమ్ చూసుకుంటాం.. నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని కాంచన అనగానే.. లేదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కుబేర్ ఫోటో చూస్తూ దీప బాధపడుతుంటే శౌర్య వస్తుంది. ఇక్కడ పడుకోమని దీప అనగానే.. నేను ఇక్కడ పడుకోను.. నాన్న గదిలో పడుకుంటానని శౌర్య మొండికేస్తుంది. అప్పుడే అనసూయ వచ్చి.. తను కూడా కార్తీక్ గదిలోకి వెళ్ళండి అని చెప్తుంది. దాంతో శౌర్య, దీప ఇద్దరు కార్తీక్ గదిలోకి వెళ్తారు. ఇబ్బందిగానే కార్తీక్ గదిలో పడుకుంటుంది దీప. తరువాయి భాగంలో దీప గుడిలో కూర్చొని బాధపడుతుంటే.. అప్పుడే సుమిత్ర వస్తుంది. తన చేతిలో ఉన్న పండు కింద పడిపోయి దీప దగ్గరికి వస్తుంది. నువ్వు కార్తీక్ ని భర్తగా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. లేదని దీప అంటుంది. ఇదిగో ఈ ప్రసాదం.. పంతులు నా కూతురు జ్యోత్స్న కోసం ఇచ్చారు.. ఇది ఇప్పుడు దాని కంటే ఎక్కువ నీకే అవసరం ఉండేలా ఉంది తీసుకోమని దీపకి సుమిత్ర ప్రసాదం ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రమాదమేమీ లేదు.. తల్లీ బిడ్డ క్షేమమే.. ఊపిరి పీల్చుకున్న కుటుంబం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -236 లో......సిరి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే రామలక్ష్మి హాస్పిటల్ కి తీసుకొని వస్తుంది. శ్రీలత, శ్రీవల్లి వాళ్ళంతా అక్కడికి వస్తారు. సిరికి ఏమవుతుందోనని శ్రీలత టెన్షన్ పడుతుంటే.. ఏం కాదు అత్తయ్య.. మీరు టెన్షన్ పడకండి అని రామలక్ష్మి అంటుంది. అంత మీరే చేశారు నా కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరేనని రామలక్ష్మిని శ్రీలత తిడుతుంటుంది  అప్పుడే సీతాకాంత్ వస్తాడు. వీళ్ళే ఏదో చేశారని రామలక్ష్మి కుటుంబంపై శ్రీలత నిందలు వేస్తుంది. మేమ్ ఏం చేస్తామని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఈ ఆస్తి కోసం ఇదంతా చేసావ్.. సిరికి పుట్టబోయే బిడ్డ నీకు అడ్డుగా ఉంటాడని ఇలా చేసావని శ్రీలత అంటుంది. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రామలక్ష్మికి ఇవ్వనన్న శ్రీలత మాటలని సీతాకాంత్ గుర్తుచేసుకుంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ప్రమాదమేమీ లేదు.  తల్లీబిడ్డ ఇద్దరు బాగున్నారు. ఇది మాములు కడుపు నొప్పి అని చెప్తుంది. దాంతో ఇప్పుడేం అంటావ్ చెల్లెమ్మ.. మేమ్ ఏదో విషమిస్తే ఇలా అయిందన్నట్లు మాట్లాడావని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత అందరు సిరి దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. సిరిని చూసి సీతాకాంత్ ఎమోషనల్ అవుతుంటే.. ఎందుకు అన్నయ్య భాదపడుతున్నావ్.. నువ్వు బాగా చూసుకుంటావ్.. వదిన తల్లి ప్రేమ మరిపించేలా చూసుకుంటదని సిరి అంటుంది. ఆ తర్వాత అభిని శ్రీలత హాస్పిటల్ దగ్గరికి పిలిచి మాట్లాడుతుంది. ఎంత వరకు వచ్చిందంటు అభికి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి అభి కన్పిస్తాడు. వాడు అభిలా ఉన్నాడు ఏంటని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతుంటే.. అప్పుడే అభి తనని చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కళ్యాణ్ కి సినిమాల్లో అవకాశం రానుందా.. ఆమెకు సవాల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -550 లో.....కావ్య ఇంటికి వస్తుంది. ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందని కనకం అడుగుతుంది. చంపలేదు కానీ అంత పని చేసాడని రాజ్ గురించి కావ్య చెప్తుంది. ఇప్పుడు తాతయ్య గారి దగ్గరికి గొడవకి వెళ్ళాడని కనకంతో కావ్య చెప్పేసి లోపలికి వెళ్తుంది. మరొకవైపు అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు రాజ్ లో ఎలా మార్పు తీసుకొని రావాలని ఆలోచిస్తుంటారు. అప్పుడే కనకం ఫోన్ చేస్తుంది. అందరు కలిసి రాజ్ ని తిరిగి ఆఫీస్ కి పంపించడం గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా పంపించాలని అపర్ణ అంటుంది.  ఆ తర్వాత రుద్రాణి దూరంగా ఉండి చూసి.. వీళ్ళేదో చేస్తున్నారని దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇందిరాదేవి ఇ‌ంకా వాళ్ళంతా కలిసి రుద్రాణికి చివాట్లు పెట్టి వెళ్ళిపోతారు. అసలు వీళ్ళేం చేయబోతున్నారో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది. వాళ్ళేం చేస్తున్నారో తెలుసా నిన్ను ఇంట్లో నుండి గెంటేయ్యాలని చూస్తున్నారని స్వప్న అంటుంది. నిన్నే కాదు మీ అబ్బాయిని కూడా పంపాలని చూస్తున్నారని అనగానే.. అలా అయితే నిన్ను కూడా పంపిస్తారని రుద్రాణి అంటుంది. నాకేం..తాతయ్య గారు ఇచ్చిన ఆస్తితో బతికేస్తానని స్వప్న అంటుంది. మరొకవైపు కళ్యాణ్ బాధపడుతుంటే అప్పు వస్తుంది. రైటర్ ఇలా అన్నాడని చెప్తాడు. దాంతో  అవేం పట్టించుకోకని అప్పు ఎంకరేజ్ చేస్తుంది. మరొకవైపు అసలు ఆఫీస్ లో ఏం జరుగుతుందో కనుక్కోవాలని రాజ్ ల్యాప్ టాప్ ఆన్ చేసి చూస్తాడు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడుగుతుంది. రాక్షసి పాస్వర్డ్ చేంజ్ చేసిందని అనుకుని కావ్యకి మెసెజ్ చేయగా..చెప్పనని కావ్య అనేస్తుంది. నేనే కనుక్కుంటానని రాజ్ అనుకొని ట్రై చేస్తుంటాడు. అప్పుడే కళ్యాణ్ ని అవమానించిన రైటర్ ఫోన్ చేసి.. నీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. నువ్వు ఒక పాట రాస్తే.. అది నాకు నచ్చితే నీకు ఆఫర్ ఇస్తానని అనగానే కళ్యాణ్ సరే అంటాడు. ఇక అప్పు, కళ్యాణ్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాజ్ హాల్లోకి వస్తాడు. అందరు తనని ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడతారని రాజ్ అనుకుంటాడు కానీ ఎవరు పట్టించుకోరు. తరువాయి భాగంలో కావ్యకి అనామిక ఫోన్ చేసి.. అక్కడికి వచ్చే క్లయింట్స్ ని రాకుండా చేశాను. ఒక్కొక్కరిని నీ కంపెనీకి దూరం చేస్తానని సవాలు విసురుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.