అశ్వత్థామ లవ్ స్టోరీ బిగిన్స్.. ఇక యష్మీలో ఆ కోణం బయటకురానుందా!

బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక మరింత రసవత్తరంగా సాగుతుంది. బిగ్ బాస్ హౌస్ కాస్త ప్రేమ జంటలకి అడ్డాగా మారింది. ఇప్పటికే హౌస్ లో లవ్ బర్డ్స్ విష్ణుప్రియ-పృథ్వీ ఉండనే ఉన్నారు. అయితే ఇప్పుడు హౌస్ లో కొత్తగా మరొక ప్రేమ చిగురించింది. గౌతమ్ అలియాస్ అశ్వథ్థామ యష్మీ పాప దగ్గరికి వచ్చి తన మనసులో మాట చెప్పేసాడు. నువ్వు అంటే నాకు ఇష్టం.. అందరిలో నువ్వే క్యూట్ గా ఉన్నావ్.. చూడగానే క్రష్ అనిపించింది. ఏదైనా సరే ఫర్ దర్ గా బయటకు వెళ్ళాక ప్రొసీడ్ అవుదామని గౌతమ్ అనగానే.. నీ ఇష్టం.. నేను తప్పు పట్టలేదు.. అది నీ ఒపీనియన్ కానీ ఏదైనా హర్టింగ్ గా ఉంటే చెప్పే రైట్ నాకుంది. డైరెక్ట్ చెప్పేస్తానని యష్మీ అంది. అయితే తను అంత రూడ్ గా కాకుండా కొంచెం స్మూత్ గానే డీల్ చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు పృథ్వీ, విష్ణుప్రియ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పొచ్చా వద్దా అనుకుంటూ చెప్పేస్తుంది. గౌతమ్ మాట్లాడాడు.. నేను అంటే ఇష్టమట అంటూ చెప్తుంది. ఇక ఇద్దరు యష్మీని ఆట పట్టిస్తారు. దాంతో ఎవరు పూర్తిగా వినరా అని యష్మీ అంటుంది. నిఖిల్ ఏమైనా ఫీల్ అవుతాడా అంటూ నిఖిల్ టాపిక్ అయితే తీసుకొని వస్తుంది. ఏదైనా ఉంటే బయటకు వెళ్ళక చూసుకుంటా.. ఇప్పుడు గేమ్ ని డిస్టబ్ కానివ్వనని యష్మీ అంటుంది. యష్మీకి మొదటి నుండి నిఖిల్ అంటే ఇస్టమే.. అది ఎప్పుడు బయటకు చెప్పకపోయిన అది మాత్రం వాస్తవమే. ఇక మన అశ్వథ్థామ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో శుభశ్రీ రాయగురుతో లవ్ ట్రాక్ ట్రై చేసాడు. ఇప్పుడు ఇలా ఇదంతా చూస్తుంటే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండేందుకు పెద్ద ప్లానే వేసినట్లు అనిపిస్తుంది. అయితే నాగార్జున కూడా యష్మీ గురించి మాట్లాడుతున్నప్పుడు.. యష్మీ గురించి చెప్పమన్నప్పుడు.. ఈ రోజు యశ్మీ బాగుందంటూ నవ్వేస్తాడు గౌతమ్. దాంతో యష్మీ ఒక స్మైల్ విసురుతుంది. ఆ సీన్ కి మన ఎడిటర్ మామ ఒక లవ్ సాంగ్ ఆడ్ చేసి మరింత క్రేజ్ పెంచేశాడు.

Brahmamudi : భార్య సీఈఓ.. భర్త ఎంప్లాయ్.. ఇదెక్కడి మాస్ రా మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -545 లో.....అందరు ఇంటికి వచ్చాక ఎందుకు అలా చేసావంటూ రాజ్ ని అపర్ణ, ఇందిరాదేవిలు తిడతారు. మీరు నన్ను అనే హక్కుని కోల్పోయారు. వాళ్ళతో కలిసి నాటకం ఆడి నన్ను మోసం చేశారు. ఇలాంటి ప్రయత్నం చెయ్యకండి.. నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. మీరు చేసేది న్యాయం అయినప్పుడు ఇలా నాటకం ఎందుకు నిజాయతీగా ప్రయత్నం చేయండి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందని ఇందిరాదేవి, అపర్ణలకి సీతారామయ్య చెప్తాడు. మరొకవైపు  కనకంతో కావ్య ఎందుకు ఇలా చేసావ్ అమ్మ అని అంటుంది. మీ అమ్మ కరెక్ట్ చేసింది మీరు దూరంగా ఉంటే అందరు సైలెంట్ గా ఉన్నారు కానీ మీ అమ్మ మిమ్మల్ని కలపాలని చూసిందని కృష్ణమూర్తి అంటాడు. ఇంకా అలాంటి ప్రయత్నం చెయ్యకు.. ఇక నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి లు కలిసి రాజ్, కావ్యలు దూరమైనందుకు హ్యాపీగా ఉంటారు‌. జరిగింది డిస్కషన్ చేసుకుంటుంటే... అప్పుడే స్వప్న వచ్చి మీరు గ్రేట్ అంటూ పొగిడినట్లే పొగిడి ఇద్దరికి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి, కనకం ముగ్గురు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. మా కంటే ఎక్కువ నీకే అవమానం జరిగిందని కనకంతో ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత అపర్ణ వాళ్ళని కలపడానికి మరొక ప్లాన్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఆఫీస్ లో కలుసుకోవాలి కావ్యని ఆఫీస్ కి పంపించాలి.. అందుకు ఒప్పించాలని అపర్ణ అంటుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. అందరిని వర్క్ సరిగా చెయ్యడం లేదని తిడతాడు. శృతిని పిలిచి డిజైన్ అడుగుతాడు.. డిజైన్ అవ్వకున్నా అయిందని చెప్పడంతో రాజ్ కోప్పడి.. నాకు వెంటనే డిజైన్ కావాలని అంటాడు. మరొకవైపు అపర్ణ, ఇందిరాదేవి, కనకంలు కావ్య దగ్గరికి వస్తారు. తరువాయి భాగంలో నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలని అపర్ణ అనగానే.. ఏ తప్పు వెతికి ఎప్పుడు పంపిస్తారో తెలియదని కావ్య అంటుంది. ఎంప్లాయిగా వెళ్తే అలా కానీ సీఈఓగా వెళ్తే తీసే ఛాన్స్ ఉండదని అపర్ణ అనగానే.. కావ్య షాక్ అవుతుంది. సీఈఓ చైర్.. అందులో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Manikanta Elimination : మణికంఠ ఎలిమినేషన్ కన్ఫమ్.. రీజన్ ఇదే!

బిగ్‌బాస్ ఏడో వారం ఎలిమినేషన్ లీక్ అయ్యింది. హౌస్ లో శనివారం, ఆదివారం నాటి షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక కొంతమంది నుండి స్ట్రాంగ్ లీక్స్ వచ్చాయి. మొదటగా పృథ్వీ ఎలిమినేషన్ అని కొంతమంది చెప్పగా.. ఇప్పుడేమో సోషల్ మీడియా మొత్తం మణికంఠ ఎలిమినేషన్ అనే వార్తలొస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న పృథ్వీ, నిఖిల్, మణికంఠ, నబీల్, యష్మీ, ప్రేరణ, గౌతమ్, తేజ, హరితేజల్లో ఓటింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్, నబీల్, ప్రేరణలకి ఓటింగ్ చాలా స్ట్రాంగ్‌గా పడింది. ఇక మిగిలిన వాళ్లలో తేజ, హరితేజ, పృథ్వీల ఓటింగ్ విషయానికొస్తే చాలా టైట్‌గా జరిగినట్లు తెలిసింది. కానీ ఈ వారం ఆటలో గౌతమ్ భారీ పెర్ఫామెన్స్ ఇచ్చి ఏకంగా మెగా చీఫ్ అయిపోయాడు. దీంతో గౌతమ్ ఓటింగ్ చివరి రెండు రోజులు భారీగా పెరిగింది. అలానే యష్మీ, టేస్టీ తేజ, హరితేజలు కూడా టాస్కుల్లో గట్టిగానే ఆడారు. కనుక వీరికి కూడా ఓటింగ్ బాగానే పడింది. అయితే ఈ వారం ఆట విషయానికొస్తే మణికంఠ ఏం ఆడలేదు. స్మార్ట్ ఛార్జింగ్ టాస్కులో.. నేను ఆడను.. బొక్కలు ఇరగ్గొట్టుకోలేను.. నేను ఎలిమినేట్ అయిపోయినా పర్లేదంటూ ఓ పక్కన కూర్చున్నాడు. ఇదే మణికంఠకి పెద్ద దెబ్బ. ఇన్ని వారాలు ఆట సరిగ్గా ఆడినా ఆడకపోయినా ఆడియన్స్ సింపథీ ఓట్లతో బతికిపోయాడు మణికంఠ. కానీ ఈ వారం కావాలని అందరితో గొడవ పెట్టుకోవడం.. ఆట ఆడకుండా కూర్చోవడం అన్నీ దెబ్బేశాయి. దీంతో ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే మణికంఠ ఎలిమినేషన్ కన్ఫమ్ అనే వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

పృథ్వీ గడ్డానికి ఆఫర్ ఇచ్చిన నాగార్జున.. నిన్న హీరో నేడు జీరో!

బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం క్లైమాక్స్ కి వచ్చేసింది. హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి పెరిగింది. ఎందుకంటే హౌస్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ కి ఓటింగే లేదు. శనివారం నాటి ప్రోమో కోసం బిబి ఆడియన్స్ తో పాటు కామన్ పీపుల్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందులోను ఈ వారం జరిగిన టాస్క్ లో చాలా గొడవలు జరిగాయి. నిఖిల్, గౌతమ్, పృథ్వీల ఇష్యూలు చాలా ఉన్నాయి. ఇక మణికంఠే అన్నీ గొడవలకి కారణమని అందరికి తెలిసిందే. అయితే శనివారం నాడు నాగార్జున ఎవరి మీద ఫైర్ అవుతాడనే క్యూరియాసిటితో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ప్రోమో రానే వచ్చింది. నాగార్జున రావడమే ఫుల్ ఫైర్ లో వచ్చాడు. ప్రోమోలో అసలేం ఉందంటే.. నిన్న హీరో నేడు జీరో అంటు మొదలెట్టాడు.  బిబి టైమ్స్ అంటు కొన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చాడు నాగార్జున. నిన్న హీరో నేడు జీరో ఎవరని అడుగగా.. హరితేజ తన పాయింట్లు చెప్పింది. ఆట అంటే అగ్రెసివ్ ఒక్కటే కాదంటూ హరితేజ అంది. ఇక బూడిదలా మారుతున్న నిప్పు అంటు మరో టైటిల్ ఎవరికో అడిగాడు నాగార్జున. ‌హౌస్ లో హెయిర్ కట్ గురించి అడిగాడు. అవినాష్ యాభై వేల గురించి చేసుకున్నాడని రోహిణి అడుగగా.. యాభై వేలు కాదు.. ముందుకు వచ్చాడు అది గ్రేట్ అంటూ అవినాష్ ని పొగిడేశాడు నాగ్ మావ. ఆ తర్వాత పృథ్వీ గడ్డం తీసుకుంటే మూడు వారాల పాటు నామినేషన్ లో ఉండవని నాగార్జున ఆఫర్  ఇవ్వగా.. ఆలోచనలో పడ్డాడు పృథ్వీ. అయితే ఇంకా హౌస్ లో  ఎవరికి కోటింగ్ ఇచ్చాడో.. ఎవరిని మెచ్చుకున్నాడో తెలియాలంటే మరో ప్రోమో కోసం చూడాల్సిందే.

పృథ్వీ ఎలిమినేషన్.. ఏడో వారం బిగ్ బాస్ ట్విస్ట్ ఇదే!

  శనివారం రాగానే హౌస్ లో ఎవరేంటనే లెక్కల చిట్టా బయటకొస్తుంది‌. అయితే అన్నింటికంటే ముఖ్యంగా చూసేదేంటంటే ఎలిమినేషన్.. ఈ వారం ఎవరు హౌస్ లో ఎవరేంటి? ఎవరెలా ఆడారనేది నాగార్జున వార్నింగ్ ఇస్తే చూడటానికి అందరు సిద్దంగా ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ గా మారింది. నామినేషన్లో ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ఓటింగ్ లో టేస్టీ తేజ, హరితేజ లీస్ట్ లో ఉన్నారు. వారిద్దరిపైన పృథ్వీ ఉన్నాడు. కానీ అనూహ్యంగా పృథ్వీ ఎలిమినేషన్ అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే దీనికి ఓ కారణం ఉంది. పృథ్వీ ఎంటర్‌టైనర్ కాదు.. కానీ టేస్టీ తేజ, హరితేజ ఎలాగోలో ఎంటర్‌టైన్ చేస్తారు. ఇంకా వారిద్దరు హౌస్ లో బాగా యాక్టివ్ మెంబర్స్ కానీ ఓటింగ్ లేదు. అందుకే బిగ్ బాస్ మామ మన విష్ణుప్రియ దోస్త్ పృథ్వీని బయటకి పంపించేశాడు. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. నెట్టింట ఇప్పుడు శనివారం నాటి ప్రోమో కోసం జనాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వేళ .. పృథ్వీ ఎలిమినేషన్ అనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది‌. మరోవైపు నాగార్జున ఎవరికి వార్నింగ్ ఇస్తాడో తెలుసుకోవాలని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.  

గెలిచి గంగవ్వ ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్.. వరాలిచ్చిన మెగా ఛీఫ్!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం ఎన్నో గొడవలు మరెన్నో స్ట్రాటజీలు మరెన్నో గాయాలు.. ఇలా ఎన్నింటినో చూపించిన సూపర్ స్మార్ట్ ఛార్జెస్, సూపర్ స్మార్ట్ ఫోన్స్ టాస్క్ పూర్తయింది. మెగా ఛీఫ్ కోసం మొదలైన ఈ టాస్క్ లో రోజు రోజుకి ఆట స్వభావమే మారిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నబీల్, నిఖిల్, పృథ్వీ మొదటగానే అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు. ఇక ఓజీ టీమ్ అంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. రాయల్ క్లాన్ సూపర్ పవర్ చూపించారు. నిన్న జరిగిన బొక్క టాస్క్ లో చివరిగా రోహిణి, గంగవ్వ , గౌతమ్, మణికంఠ మిగిలారు. ఇంకేముంది బజర్ మోగగానే వరుసగా రెండు సార్లు గౌతమ్ చేతికే దక్కింది బోన్. దీంతో మణికంఠను మొదట తర్వాత రోహిణిని రేసు నుంచి తప్పించేశాడు గౌతమ్. ఇక చివరిగా గంగవ్వ -గౌతమ్ మిగిలారు. గౌతమ్ దూకుడు చూసి గంగవ్వ ఆ బొక్కని పట్టుకోడానికి ప్రయత్నించలేదు. ఇక గౌతమ్ దూకేసి మరీ బోన్ పట్టుకొని గెలిచాడు. ఇక ఆ తర్వాత మెహబూబ్ తన మెగా ఛీఫ్ బ్యాండ్ ని స్టోర్ రూమ్ లో పెట్టేసి బిగ్ బాస్ పంపిచ్చిన కొత్త బ్యాండ్ ని తీసుకొచ్చి గౌతమ్ కి ధరింపజేశాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా గౌతమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఇక గంగవ్వ కాళ్ళు మొక్కి గౌతమ్ తన ఆశీర్వాదం తీసుకున్నాడు.  మెగా చీఫ్ అయిన తర్వాత గౌతమ్ హౌస్ మేట్స్ అందరితో అర్థరాత్రి ముచ్చటించాడు.  మన షో ప్రతి ఇంట్లో చాలామంది ఆడవాళ్లు చూస్తారు కాబట్టి వాళ్లందరికి ట్రిబ్యూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో హౌస్‌లో ఉన్న ఆడవాళ్లకి ఈ వారం వర్క్ హాలీడే ఇస్తున్నా.. మీరెవరూ ఇంటిపని, వంట పని, ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు.. మగాళ్లే బానిసల్లా పని చేస్తారు అంటూ గౌతమ్ మెగా ఛీఫ్ గా తన తొలి రిక్వెస్ట్ చేశాడు. ఇదే పని సీజన్-7 లో కెప్టెన్ అయిన తర్వాత కూడా గౌతమ్ చేశాడు. అయితే అక్కడ గేమ్‌లో మమ్మల్ని ఈడ్చి ఈడ్చి విసిరేసి ఇప్పుడు తీరిగ్గా విశ్రాంతి ప్రకటిస్తాడా అన్నట్లు లుక్ ఇచ్చారు లేడీ కంటెస్టెంట్లు. ఇక తను మెగా చీఫ్ కావడంతో తన కింద ఇద్దరు మినీ చీఫ్‌లను కూడా పెట్టుకున్నాడు గౌతమ్. గంగవ్వ-హరితేజ ఇద్దరూ మినీ చీఫ్‌లుగా చెప్పుకొచ్చాడు.  

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని మట్టికరిపించిన అశ్వత్థామ.. మెగా ఛీఫ్ గా గౌతమ్!

  బిగ్ బాస్ సీజన్ ఏడో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక హౌస్ లో నిన్నటి దాకా సాగిన టాస్క్ ముగిసింది. మెగా ఛీఫ్ కోసం సాగిన టాస్క్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది.  బిగ్‌బాస్ హౌస్‌కి న్యూ మెగా చీఫ్‌గా గౌతమ్ అయ్యాడు. టాస్క్ ఏంటో చూసేద్దాం. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే.. ఈ టాస్కులో గెలవాలంటే ప్లాజ్మాలో చూపించన బొమ్మలు ఏ తలగడ (దిండు)పై ఉందో వెతికి దాన్ని తీసుకొని ముందుగా బాక్స్‌లోకి వెళ్లాలి. ఈ టాస్కులో సరైన కుషన్‌ను తీసుకెళ్లే సభ్యుడిని బాక్స్‌లోకి వెళ్లే ముందు వరకూ ఆపొచ్చు.. తప్పు కుషన్ తీసుకెళితే మళ్లీ వెళ్లి తీసుకురావచ్చంటూ రూల్స్ చెప్పాడు బిగ్‌బాస్. ప్రతి రౌండ్‌కి ఎంతమంది సభ్యులు ఆడాలో బిగ్‌బాస్ చెబుతాడు.. దాని ప్రకారం ఎవరు ఎక్కువ రౌండ్స్ విన్ అయితే వాళ్లు టాస్కు గెలిచినట్లు. ఇక ఈ టాస్కు ఇలా మొదలైందో లేదో వరుసగా రెండు రౌండ్స్ గెలిచింది ఓజీ క్లాన్. కానీ ఆ తర్వాత మిగిలిన అన్నీ రౌండ్స్‌ను రాయల్స్ క్లాన్ గెలిచింది. ఇక ఈ టాస్కులో రాయల్ క్లాన్ విన్ అయినందున వారికి ఓ ప్రయోజనం ఇచ్చాడు బిగ్‌బాస్. రాయల్స్ గెలిచిన కారణంగా అడ్వాంటేజ్ పొందారు.. ఇప్పుడు ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఇద్దరి సభ్యుల్ని తొలగించండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాయల్స్ అంతా డిస్కషన్ పెట్టుకున్నారు. గంగవ్వ అయితే నిఖిల్‌ గాడిని తీసేయాలి.. వాడు పెద్ద డేంజర్ గాడు వాడు, అలానే నబీల్‌ను కూడా తీసేయాలంటూ చెప్పింది. ఇక అందరూ డిసైడ్ అయి నిఖిల్-నబీల్ ఇద్దరినీ తీసేశారు. వాళ్లు ఆల్ రెడీ చీఫ్ అయ్యారు కనుక వేరే వాళ్లకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే తీసేశామంటూ రీజన్ చెప్పారు. టాస్కు ముగిసే సమయానికి ఔట్ కాకుండా ఉన్న విష్ణుప్రియ, యష్మీ, మణికంఠ, ప్రేరణ, అవినాష్, గౌతమ్, నయని, హరితేజ, మెహబూబ్, గౌతమ్, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ.. మీరందరూ మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఎంపికయ్యారు.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక గేమ్‌లో అప్పటికే ఔట్ అయిన పృథ్వీ, నబీల్, నిఖిల్.. మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నారన్నమాట. అలానే పృథ్వీ-తేజ పనిష్మెంట్ కూడా పూర్తయిందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో వాళ్ల లగేజీ యాక్సెస్ తిరిగి ఇచ్చేశారు. ఇక 'పట్టుకో లేదా తప్పుకో' అనే టాస్క్ లో చివరి వరకు గౌతమ్, గంగవ్వ నిలిచారు.  వారిలో గౌతమ్ మెగా ఛీఫ్ గా  గెలిచాడు. 

Karthika Deepam2 : దీపకి కొత్త జీవితమిచ్చిన కార్తీక్.. ఇక కార్తీకదీపం సీరియల్ కి అన్నీ మంచి రోజులేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -179  లో.....నా కూతురిని నేను తీసుకొని వెళ్తానని దీప అనగానే.. శౌర్య హెల్త్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకొని వద్దని కార్తీక్ అంటాడు. ఇక్కడ ఎవరి గురించి నేను ఆగలేను.. ఎవరి నిర్ణయాల గురించి అవసరం లేదని దీప అంటుంది. నీకు సిచువేషన్ తెలియదు.. చెప్పిన అర్ధం కాదు.. నా మాట వినండి అంటూ కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే శౌర్య బయటకు వచ్చి.. అమ్మ అంటూ దీప దగ్గరికి వస్తుంది పదా వెళదాం ఊరికి.. బాయ్ చెప్పు అని దీప అనగానే.. నాకు కార్తీక్ కావాలి.. నాకు నాన్న కావాలని శౌర్య అంటుంది. మీ నాన్న ఎలాంటి వాడో తెలిసి ఇలా అంటున్నవా అని దీప అంటుంది. నేను బూచోడు అనట్లేదు.. నాన్నగా కార్తీక్ కావాలని శౌర్య అనగానే చిన్నపిల్లలాగా మాట్లాడు అని దీప కోప్పడుతుంది. పదా అంటూ దీప చెయ్ పట్టుకొని లాగుతుంటే.. శౌర్య కార్తీక్ చెయ్ వదలదు.. మీకేం అధికారం ఉందని నా కూతురిని పంపనని అంటున్నారని దీప కిందపడి ఏడుస్తుంది. అప్పుడే కార్తీక్.. అయితే నీకు అధికారం కావాలా అని పూజ రూమ్ దగ్గరున్న తాళిని తీసుకొచ్చి దీప మెడలో కడతాడు. అప్పుడే జ్యోష్న వస్తుంది. అదంతా చూసి తన మనసు ముక్కలవుతుంది. నా ఫ్రెండ్ మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు నాకు నాన్న అంటూ శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ కాంచన ఆశ్చర్యపోతుంది. మరొకవైపు జ్యోత్స్న అందరిని తీసుకొని ఇంటికి వస్తుందని సుమిత్ర వాళ్లు ఎదురుచూస్తుంటారు. అప్పుడే జ్యోత్స్న ఏడ్చుకుంటూ రావడం చూసి అందరు ఏమైందంటూ అడుగుతారు. నాకు బావ అన్యాయం చేసాడు.. పెళ్లి చేసుకున్నడు బావ.. ఆ దీప మెడలో తాళి కట్టాడని జ్యోత్స్న చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. మరొకవైపు కార్తీక్ ఇంటికి అనసూయ వస్తుంది. ఆ నర్సింహా గాడిని పోలీసులకి పట్టించానని అనసూయ అంటుంది. నువ్వు ఏంటి ఇలా ఉన్నావని దీపని అనసూయని అడుగగా.. నేను చెప్తానంటూ కార్తీక్ అమ్మని పెళ్లి చేసుకున్నాడని శౌర్య చెప్తుంది. తను చెప్పగానే అనసూయ మొదట షాక్ అయిన తర్వాత నా మేనకోడలికి మంచి జీవితం ఇచ్చారని కార్తీక్ కి కృతజ్ఞతలు చెప్తుంది. కాంచన కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భర్తకి ఏ ప్రాబ్లమ్ లేదు.. అత్త ప్లాన్ కనిపెట్టేసిన కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -230 లో....అందరు టిఫిన్ చేస్తుంటారు. అప్పుడే రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత.. సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది. అల్లుడు గారు దసరా పండుగకి ఇంటికి రండీ అని చెప్తుంది. నాదేం లేదు రామలక్ష్మి ఇష్టమే.. నా ఇష్టమంటూ సీతాకాంత్ రామలక్ష్మికి ఫోన్ ఇస్తాడు. ఇద్దరు పండుగకి రండి అనగానే.. అమ్మా.. ఆయన చాలా బిజీ.. ఒకవేళ వీలైతే వస్తానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళదామంటే నాకు ఇష్టమే కదా ఎందుకు ఇలా నన్ను అడగలేదని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత పాపం రామలక్ష్మి మనం చేసిన పనికి తనలో తనే బాధపడుతుందని సందీప్ శ్రీలత శ్రీవల్లిలు అనుకుంటారు. మరొకవైపు ఎందుకు రామలక్ష్మి నాతో అలా ఉంటుందని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు.  ఆ తర్వాత రామలక్ష్మి తన బాధని దేవుడికి చెప్తూ బాధపడుతుంది. అప్పుడే ఒకతను వస్తాడు. అతనికి బియ్యం ఇస్తుంది. పిల్ల పాపలతో బాగుండు అని అతను అంటాడు. అంత అదృష్టం లేదని రామలక్ష్మి అనుకుంటుంది. నువ్వు అనుకునేది తప్పు.. నువ్వు నమ్మేది తప్పని రామలక్ష్మి మనసులో మాటని అనగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి హాస్పిటల్ కి వెళ్లి సీతాకాంత్ కి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తుంది. ఏం ప్రాబ్లమ్ లేదు ఎవరు ఇలా చెప్పారని డాక్టర్ అంటుంది. నువ్వు నీ భర్తతో హాయిగా కాపురం చేసుకోవచ్చని డాక్టర్ చెప్పగానే రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఇదంతా తన అత్తయ్య శ్రీలత ప్లాన్ అని రామలక్ష్మి అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత శ్రీవల్లిలు మాట్లాడుకుంటుంటే రామలక్ష్మి వెళ్లి టపాసులు కాలుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ సిరి అడుగుతుంది. నాలో ఉన్న భయాలన్నీ పోయి నేను హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఒంటరిగానే ఉంటానన్న రాజ్.. కావ్య పయనం ఎటువైపు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -544 లో....కనకం ప్లాన్ ప్రకారం ముగ్గురు కూతుళ్లు అల్లుళ్ళతో దాంపత్య పూజ చేయిస్తుంది. అప్పుడే రుద్రాణి ఏం ప్లాన్.‌. ఏం నటన అని అంటుంది. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం.. ఇప్పుడు సైలెంట్ గా ఉండమని అపర్ణ అంటుంది. ఇక్కడ నటన జరుగుతుంది. ఇప్పుడే అడగాలని రుద్రాణి అంటుంది. మీకు ఎన్ని తెలివితేటలు.. మీకు మించి నాకు తెలివి ఉంది కాబట్టి మీ నటన కనిపెట్టానని రుద్రాణి అంటుంది. ఈ కనకం తనకి కాన్సర్ ఉంది త్వరలో చనిపోతానని చెప్పి రాజ్ ని మోసం చేసి ఇక్కడికి రప్పించిందని రుద్రాణి అనగానే.. అందరు షాక్ అవుతారు. అదేంటి అలా అంటున్నావ్.. ఆవిడకి నిజంగానే క్యాన్సర్ ఉందని రాజ్ అంటాడు. అయితే ఆ విషయం తననే చెప్పమను అని రుద్రాణి అనగానే.. చెప్పండి అని కనకంతో రాజ్ అంటాడు. నేను చెప్పింది అబద్దమని కనకం ఒప్పుకుంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. నా ఎమోషన్స్ తో ఆడుకున్నారంటూ కనకం, కావ్యలని రాజ్ తిడుతాడు. వాళ్ళ తప్పేముంది అంతా వెనక ఉండి మేమే నడిపించామని అపర్ణ, ఇందిరాదేవిలు చెప్తారు. ఈ విషయం కావ్యకి తెలియదని వాళ్ళు అంటారు. అయిన రాజ్ వినకుండా జీవితంలో తల్లి కూతుళ్ళను నమ్మలేనని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తుంది ఇందిరాదేవి. ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తే విడగొడతావా అని తిడుతుంది. అపర్ణ కూడా కొట్టబోయ్ ఆగిపోతుంది. ఇందులో  మీ అమ్మ తప్పు లేదు.. ఏం అనకని ఇందిరాదేవి, అపర్ణలు కావ్యకి చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. ఏంటి రాజ్ నువ్వు చేస్తుంది. ఏది చేసినా అది కావ్య తప్పు అంటున్నావేంటని అపర్ణ, ఇందిరదేవిలు రాజ్ పై కోప్పడతారు. మీకు మాట్లాడే హక్కు లేదు.. నన్ను మోసం చేశారని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఇక మీరు ఇలాంటి ప్రయత్నం చేయకండి. ఇక నేను ఒంటరిగానే ఉంటానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య కూడా అదే విషయం కనకం, కృష్ణమూర్తిలకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హెయిర్ కట్ ఛాలెంజ్ లో ఆ ఇద్దరు.. షాక్ అయిన కంటెస్టెంట్స్!

  బిగ్ బాస్ ప్రేక్షకులు శుక్రవారం నాటి ప్రోమో కోసం ఎంతో ఆత్రుతగా ఎదరుచూస్తుంటారు. అయితే రెండు ప్రోమోలు ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొదటి ప్రోమోలో మెగా చీఫ్ కంటెండర్ ఇంకా మెగా చీఫ్ ల టాస్క్ గురించి ఉంది. ఇక రెండవ ప్రోమో విషయానికొస్తే ఇరు క్లాన్స్ కి హెయిర్ కట్ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎలా హెయిర్ కట్ చేయించుకుంటే వాళ్ళకి ప్రైజ్ మనీలోకి డిస్‌ప్లే  ఉన్న అమౌంట్ ఆడ్ అవుతుందని బిగ్ బాస్ మామ తెలిపాడు. ఇక అప్పటికే పృథ్వీ గడ్డం తీసేస్తా అని నిఖిల్ తో అంటుంటే.. అబ్బా వద్దు ప్లీజ్ అని విష్ణుప్రియ అంటుంది. ప్లీజ్ బ్రో బ్రతకలేనని పృథ్వీ అంటాడు. టాస్క్ లో  భాగంగా ఓజీ క్లాన్ నుండి పృథ్వీ.. రాయల్ క్లాన్ నుండి అవినాష్ ల పేర్లు బిగ్ బాస్ చెప్తాడు. డిస్‌ప్లే లో ఉన్న హెయిర్ స్టైల్ ఇంకా అమౌంట్ చూసి అవినాష్, పృథ్వీ ఇద్దరు షాక్ అవుతారు. ఇక ఆ ఫోటోలని చూసి హౌస్ మేట్స్ మాత్రం ఫుల్ నవ్వుకున్నారు. బిగ్ బాస్ ఇద్దరికి మీరు ఎంత అమౌంట్ ప్రైజ్ మనీ కి ఆడ్ చెయ్యాలనుకుంటున్నారో బిగ్ బాస్ కి చెప్పండని బిగ్ బాస్ చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇద్దరు హెయిర్ కట్ ఛాలెంజ్ కి ఒప్పుకున్నారని తెలుస్తుంది కానీ ఎవరు ఏ హెయిర్ స్టైల్ చేయించుకొని ఎంత అమౌంట్ ఆడ్ చేశారనేది  తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అయితే ఈ హెయిర్ కట్ ఛాలెంజ్ ప్రతి సీజన్ లో ఉంటూ వస్తుంది. బిగ్ బాస్ మాములోడు కాదు.. ఎవరికి ఏది అంటే ఇష్టమో వాళ్ళనే ఈ ఛాలెంజ్ కి తీసుకుంటాడు. గత సీజన్ లలో దీప్తి సునైన, శివజ్యోతి,  దేత్తడి హారిక , వాసంతి కృష్ణన్, ప్రియాంక జైన్.. ఈసారి మాత్రమే ఈ ఆఫర్ అమ్మాయిలకి కాకుండా అబ్బాయిలకి ఇచ్చాడు బిగ్ బాస్. మరి నేటి ఎపిసోడ్ లో అటు మెగా ఛీఫ్ ఎవరని, ఇటు హెయిర్ కట్ ఎవరు చేయించుకుంటారనే ఆసక్తి అందరిలో మొదలైంది.

ఓటింగ్ లో భారీ మార్పులు.. జోకర్లుగా మారుతున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్ లో ఉన్నవారికి ఓటింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హౌస్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ ఓటింగ్ లేదు.. ఇక వీడెందుకు ఉన్నాడో తెలియదు అన్నవారికి ఓటింగ్ ఉంది. మొదట్లో మణికంఠ అంటే కాస్త సింపథీ ఉండేది జనాలకి.. అయితే వారాలు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా ఆ అభిప్రాయం మారుతుంది. ఎందుకంటే నామినేషన్స్‌లో కనిపించే మణికంఠ.. ఆ తర్వాత కనిపించే మణిబాబులో చాలా డిఫరెన్స్ ఉంది. గేమ్ లో డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. గేమ్ మొదలయ్యేముందు నేనేం ఆడను అన్నాడు.‌. గేమ్ మొదలయ్యాక తన స్ట్రాటజీతో ఆట స్వభావాన్ని మార్చేశాడు. దాంతో నామినేషన్ లో ఉన్న మణికంఠకి భారీ ఓటింగ్ పడుతోంది. మొదటి స్థానంలో నబీల్ , రెండో స్థానంలో నిఖిల్, మూడో స్థానంలో మణికంఠ కొనసాగుతున్నారు. ప్రేరణ, యష్మీలకి నామినేషన్ లో తక్కువ ఓటింగ్ పడుతోంది. ఇక చివరి నాలుగు స్థానాల్లో గౌతమ్ కృష్ణ, పృథ్వీ, టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ తన ఆటతీరుతో ఒక్కసారిగా టాప్ ఓటింగ్ వచ్చేసింది. ఇక యష్మీ, ప్రేరణలు గేమ్ బాగా ఆడుతున్నప్పటికి ఓటింగ్ తక్కువగా పడుతోంది. ఇక టేస్టీ తేజ, హరితేజ ఎంటర్‌టైన్మెంట్ చేస్తున్నా వారికి ఓటింగ్ పడట్లేదు. అయితే ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గరలో హరితేజ , టేస్టీ తేజ  ఉన్నారు. అయితే ఈరోజు వీరిద్దరిలో ఎవరికైనా ఓటింగ్ ఎక్కువ పడితే పృథ్వీ డేంజర్ జోన్ లోకి వచ్చేస్తాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే వార్తొలుస్తున్నాయి. అదే జరిగితే టేస్టీ తేజ , హరితేజ ఎలిమినేషన్ అవుతారు.  

వాటర్ మానిఫెస్టింగ్ గురించి మీకు తెలుసా ? ఇదొక సారి ట్రై చేయండి

  నటి మాధవి లతా నీళ్ల గురించి ఒక అద్భుతమైన అనాలసిస్ ఐతే ఇచ్చేసింది. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ భూమి మీద మన శరీరంలో సగం నీరే ఉంటుంది. అలాంటి నీటికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే వాటర్ మానిఫెస్టింగ్ చేయండి అని సలహా ఇచ్చింది. ఇదేంటంటే " వాటర్ మానిఫెస్టింగ్ గురించి మీకు తెలుసా ?? ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకుని చేతిని మూతలా అడ్డుపెట్టు 60  సెకెన్ల పాటు కళ్ళు మూసుకుని పాజిటివ్ గా మీరు ఏదైనా అనుకోండి. ఆ తర్వాత ఆ వాటర్ ని తాగేయండి. ఎందుకంటే వాటర్ కి యూనివర్స్ లో ఉన్న పవర్ అంతా ఉంటుంది. నీటితోనే ఏ రోగాన్నైనా నయం చేయొచ్చు అని డాక్టర్స్ అంటారు. అలాగే మన పెద్దవాళ్ళు కూడా పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని. దానికి కారణం అదే. ఈ మ్యానిఫెస్టేషన్ ని చాలా దేశాల్లో ట్రై చేశారు కూడా. ఎందుకంటే నీటికి ఒక నీతి ఉంటుంది. దాన్ని పాజిటివ్ గా ఆలోచనలతో ఆరాంగా తాగితే గనక అది మన శరీరంలో అన్ని భాగాలకు సక్రమంగా చేరి రోగాలను కూడా దూరం చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి." అంటూ మాధవీలత చెప్పింది. నిజంగా కదా..తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా, గాలి వీచకపోయినా కొన్ని గంటలు, కొన్ని రోజులు ఉండగలం కానీ వాటర్ లేకుండా నీళ్లు తాగకుండా ఒక్క రోజు కాదు కదా ఒక్క పూట కూడా బతకలేము.  

మెగా చీఫ్ గా గౌతమ్.... మినీ చీఫ్ లుగా హరితేజ, గంగవ్వ!

  బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ కోసం కంటెస్టెంట్స్ అందరు రెండు క్లాన్ లుగా విడిపోయి.. నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు. గత సీజన్ లో కెప్టెన్ ఇప్పుడు మెగా చీఫ్ అన్నమాట. మెగా చీఫ్ కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా నామినేషన్ నుండి మినహాయింపు ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ కి సంబంధించి హౌస్ లో వారం వరకు పవర్స్ ఉంటాయి. అయితే మొదటి మెగా చీఫ్ గా నబీల్, రెండవ మెగా చీఫ్ గా మెహబూబ్ అయ్యారు. ఇక ఈ వారం గౌతమ్ మెగా చీఫ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్ అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ వారం మెగాచీఫ్ తో పాటు మినీ చీఫ్ లుగా హరితేజ గంగవ్వ అయినట్టు తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఛార్జ్ లుగా కంటెస్టెంట్స్ గత మూడు రోజుల నుండి ఆడుతున్న ఈ టాస్క్ లో ఒక్కో కంటెస్టెంట్ తమ స్ట్రాటజీలతో ఆకట్టుకున్నారు. అయితే ఈ టాస్క్ లో నిఖిల్, గౌతమ్ , పృథ్వీల మధ్య జరిగిన ఆర్గుమెంట్స్ ఫిజికల్ గా అయ్యాయి. అయితే హౌస్ లో నిన్న మరో టాస్క్ జరిగినట్టుగా ఇందులో గౌతమ్, గంగవ్వ చివరి వరకు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మెగా ఛీఫ్ గా గౌతమ్ అయ్యాక‌‌.. తనకి సపోర్ట్ గా గంగవ్వ, హరితేజలని తీసుకున్నాడని తెలుస్తుంది. మరి టాస్క్ లో ఎవరు ఎలా ఆడారు.. అసలు గౌతమ్ మెగా ఛీఫ్ ఎలా అయ్యాడో  తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్.. ఇది కుక్కల వేట!

  బిగ్ బాస్ ఇప్పటివరకు జరిగిన సీజన్ లలో ఇంత వయిలెంట్ గా ఆడే కంటెస్టెంట్స్ లేరు. టాస్క్ లో భాగంగా జరిగిన తోపులాటలో ఒక్క నిమిషం పాటు ఏం జరిగిందన్న అనుమానం కలుగుతుంది. అసలు విషయానికి వస్తే ఓజీ క్లాన్ లోని మణికంఠ.. రాయల్ క్లాన్ వాళ్ళని అడిగి వాష్ రూమ్ కి హౌస్ లోపలికి వెళ్ళాలి. మణికంఠ అలా కాకుండా ఎవరిని అడగకుండా వాష్ రూమ్ కి వెళ్తాడు. ఇక రాయల్ క్లాన్స్ వాళ్ళు ఊరుకుంటారా అందరూ మణికంఠ లోపల ఉండగానే.. అందరు వచ్చి మూకుమ్మడిగా చుట్టుముడతారు. తన దగ్గరున్నా పిన్ తో ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి చూస్తారు. అలాగే ఓజీ క్లాన్స్ అందరు కూడా అక్కడికి వచ్చి మణికంఠ నువ్వు బయటకు రావొద్దంటూ గట్టిగా అరుస్తారు. అక్కడ ఒకరికొకరు నెట్టుకోవడం జరుగుతుంది. అక్కడున్న వస్తువులన్నీ కింద పడిపోతాయ్. గౌతమ్ నిఖిల్ మెడని గట్టిగా పట్టుకోవడంతో గౌతమ్ ని సోఫాలోకి నెడతాడు నిఖిల్. దాదాపు అయిదు నిమిషాల పాటు మినీ యుద్ధమే జరిగింది. ఇక్కడ గొడవ ఇక్కడే ఉంటే.. మరొకపక్క మణికంఠ వాష్ రూమ్ లో ఉండగా తేజ, అవినాష్ లు వెళ్లి ఛార్జింగ్ ఎక్కించుకుంటారు. మమ్మల్ని అడిగి మా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కదా అంటూ రాయల్ క్లాన్ వాళ్ళు గొడవపడతారు. ఇక ఆ గొడవ చుసిన వాళ్ళంతా ఇంత వయిలెంట్ గా ఉన్నారేంటి పొరపాటునా ఏదైనా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది.. అర్గుమెంట్ కాదు.. అది కొట్లాట అని చెప్పొచ్చు. నిఖిల్, గౌతమ్, పృథ్వీ ఫిజికల్ అయ్యారు. ఇక ఈ వీకెండ్ లో నాగార్జున మాత్రం అందరికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.  

నయని పావని ఎమోషనల్.. ఇమిటేట్ చేసిన టేస్టీ తేజ!

  నయని పావని.. గత సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అప్పుడు అందరు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అన్నారు. ఆమె ఎలిమినేషన్ అప్పట్లో వైరల్ అయింది. అయితే ఇప్పుడు నయని పావనికి సెకండ్ ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. నయని పావని గత వారం నామినేషన్ లోకి వస్తే మళ్ళీ లాస్ట్ సీజన్ లో జరిగినట్లు అవుతుందేమోనని రాయల్ క్లాన్స్ వాళ్ళు స్పెషల్ పవర్ ని వాడుకొని నయనిని నామినేషన్ లో లేకుండా చేశారు. అయితే లాస్ట్ సీజన్ లో నాకు ఛాన్స్ ఇచ్చి గేమ్ బాగా ఆడకుంటే.. అప్పుడు ఎలిమినేట్ అయిన పర్వాలేదు కానీ ఛాన్స్ ఇవ్వలేదని బాధపడింది నయని. కానీ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా కూడ ప్రూవ్ చేసుకోవడం లేదు. గత వారంలో నయని ఎమోషనల్ అయితే అలా అవొద్దని నాగార్జున చెప్పాడు. ప్రస్తుతం హౌస్ లో టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ప్రతి ఒక్కరు ఏదోవిధంగా ఛార్జింగ్ సంపాదించుకుంటున్నారు. కానీ నయని పావని తప్ప. నాకు ఎవరు ఛార్జింగ్ ఇవ్వట్లేదు.. టాస్క్ మొదట నుండి  ఎవరికి నాకు ఇవ్వాలనిపించడం లేదా.. మణికంఠ ఎప్పుడు నన్ను ఫ్రెండ్ అంటాడు.‌. అసలు ఇవ్వలేదని నయని అనగానే.. నువ్వు నయనికి ఇస్తా అన్నావ్ కదా అని  మణికంఠని హరితేజ అంటుంది. మెహబూబ్ దొంగతనం గా తీసుకున్నాడు. నాకే లేదని మణికంఠ అంటాడు.  ఇక నేను ఎవరిని అడగను.. ఇచ్చిన తీసుకోనని నయని రెండు, మూడు సార్లు రిపీట్ చేస్తుంది. దాంతో అది విన్న తేజ కోపంగా.. ఎన్నిసార్లు అంటావంటూ తనని ఇమిటేట్ చేస్తాడు. నువు అలా ఇమిటేట్ చెయ్యకు తేజ అంటూ నయని లోపలికి వెళ్లి హరితేజకి చెప్తూ బాధపడుతుంది. కానీ నయని పర్ఫామెన్స్ హౌస్ లో అంతగా లేదు కానీ బయట శివాజి సపోర్ట్ తో నెట్టుకొస్తుంది. మరి ఈ వీకెండ్ లో నాగార్జున తనకి వార్నింగ్ ఇస్తాడా లేదా చూడాలి మరి.  

దీప మెడలో తాళి కట్టిన కార్తీక్.. షాక్ లో జ్యోత్స్న!

కార్తీక దీపం-2 ప్రారంభం అయి రెండోందల ఎపిసోడ్ కి చేరువలో ఉంది. మొదటి నుండి ఈ సీరియల్ పై కొంచెం నెగటివిటి ఉంది. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ లు దీప, కార్తీక్ లు. అయితే దీపకి ఆల్రెడీ నర్సింహాతో పెళ్ళై ఒక పాప కూడా ఉంటుంది. హీరో, హీరోయిన్ తో పెళ్లి కాకుండా వేరొకరితో పెళ్లి ఏంటి? పాప ఏంటని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. దీప, నర్సింహాలతో గొడవలు నర్సింహాతో విడాకులు అవుతాయి. అది ఇలా ఉంటే కార్తీక్, శౌర్యలు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఎంతలా అంటే నాన్నగా కార్తీక్ ఉంటే బాగుండు అనేలా....క్లోజ్ అవుతుంది. శౌర్య మాటి మాటికీ కళ్ళు తిరిగి పడిపోవడంతో కార్తీక్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి శౌర్య హార్ట్ వీక్ ఉందని చెప్తాడు. ఆ విషయం దీపకి చెప్పడు కార్తీక్. మరోవైపు దీపతో గొడవపడుతుంది కార్తీక్ మరదలు జ్యోత్స్న. నా బావని నాకు కాకుండా చేస్తున్నావ్.. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోమని దీపని జ్యోత్స్న అంటుంది. దాంతో శౌర్యని తీసుకొని వెళ్తుంటే.. దీపకి శౌర్య తెలియకుండా కార్తీక్ ని కలుద్దామనుకొని వెళ్తుంది. కార్తీక్ కార్ వెంట శౌర్య పరిగెత్తి.. కింద పడిపోతుంది. అది చూసి శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు కార్తీక్. తనకి డీసెస్ ఉంది రెండు కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తాడు.  ఇక శౌర్యా కోసం దీప కార్తీక్ ఇంటికీ వస్తుంది. నేను శౌర్యని తీసుకొని వెళ్తానని దీప అంటుంటే.. కార్తీక్ వద్దని చెప్తాడు. శౌర్యని ఇప్పుడు హ్యాపీగా ఉంచాలని అనుకుంటాడు. తాజాగా వచ్చిన ప్రోమోలో కార్తీక్ దీప మెడలో తాళి కడతాడు. ఇక బావనే ప్రాణంగా బ్రతుకుతున్న జ్యోత్స్న అదంతా చూసి షాక్ అవుతుంది. అయితే కార్తీక్ మాత్రం శౌర్య కోసం అదంతా చేసాడు. ఇప్పటికి డైరెక్టర్ ప్రేక్షకులకు నచ్చేలా కథని మలిచాడు. ఇక నుండి ఈ సీరియల్ మరింత రసవత్తరంగా సాగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. మరి కార్తీక్ తన మెడలో కట్టిన తాళిని దీప యాక్సెప్ట్ చేయగలదా లేదా చూడాలి మరి.

Karthika Deepam2 : నాన్నగా నాతో ఉండు కార్తీక్.. దీపకి ఈ విషయం ఎలా చెప్తాడు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -178 లో... కార్తీక్ కి కాశీ ఫోన్ చేసి.. శౌర్య కన్పించడం లేదని చెప్తాడు. శౌర్య నా దగ్గరే ఉందని కార్తీక్ చేప్తాడు. అప్పుడే దీప ఫోన్ తీసుకొన..  శౌర్య మీ దగ్గరున్న విషయం చెప్పాలి కదా అని దీప అనగానే.. ఎవరికి చెయ్యాలి. నీ ఫోన్ స్విచాఫ్ వచ్చిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నేను శౌర్య దగ్గరికి వెళ్తానని కాశీకి దీప చెప్తుంది. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే.. మా ఇంటికి రా అక్క కానీ నువ్వు ఊరు వెళ్లొద్దని కాశీ అంటాడు. ప్లీజ్ కార్తీక్ అమ్మ వస్తే నన్ను ఊరు తీసుకొని వెళ్తుంది. నాకు అమ్మ కావాలి.. నువ్వు కావాలి.. ఇద్దరు నాతో ఉండాలి.. ఏం చెయ్యాలని శౌర్య అడుగుతుంది. నువ్వు నాన్నగా ఉంటే నాతో ఉంటావ్ కదా.. నా కోసం ఏదైనా చేస్తానన్నావ్ కదా.. నాన్న గా ఉండలేవా.. నాకు నీతోనే ఉండాలని ఉంది. మంచోడివి నాతో ప్రేమగా ఉంటావని కార్తీక్ పై తన ప్రేమని చెప్తుంది శౌర్య. మరొకవైపు మీ తాత మనసు మారక ముందే కార్తీక్ వాళ్ళింటికి వెళ్ళాలని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత కాంచన దగ్గరికి వెళ్లి మాట్లాడండి అని సుమిత్ర, దశరథ్ లతో శివన్నారాయణ‌ అంటాడు. నేనే వెళ్తానంటూ జ్యోత్స్న వెళ్తుంది. మరొకవైపు నరసింహ దగ్గరికి అనసుయ వస్తుంది. తనని పోలీసులకి పట్టిస్తుంది. దాంతో అనసూయని కర్రతో కొడతాడు నరసింహా. మరొకవైపు శౌర్య మాటలకి సమాధానం చెప్పకుండా వచ్చేసావ్ ఏంటని కాంచన అడుగుతుంది. అది చాక్లెట్.. బిస్కెట్.. అడుగుతలేదు.. నా జీవితం అడుగుతుందని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప వస్తుంది. శౌర్యని తీసుకొని వెళ్తానంటే..  కార్ వెనకాల పరిగెత్తి పడిపోయిందని దీప అనగానే.. హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చామని కార్తీక్ అంటాడు. లేట్ అయితే వెళ్లలేము శౌర్యని తీసుకొని వెళ్తానని దీప అంటుంటే కార్తీక్ కోప్పడతాడు. గొడవపడేలా ఉన్నారు.. శౌర్యకి ఆరోగ్యం బాలేదని వీడు చెప్పడు.. నన్ను వద్దన్నాడు.. ఇప్పుడేం చెయ్యాలని కాంచన అనుకుంటుంది. శౌర్య ఎక్కడికి రాదని దీపతో కార్తీక్ కోపంగా చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : అటు ప్రేయసి, ఇటు కసాయి తల్లి కన్నింగ్ ..  

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -229 లో.... రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. అప్పుడే నందిని వచ్చి రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవును రామలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళావా.. సర్ ప్రైజ్ ఇచ్చావా.. తను హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా అని నందిని అంటుంది. అవును నీ గురించి చెప్పు.. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లే.. నువ్వు కూడా ఎవరినైనా చేసుకోమని సీతాకాంత్ అంటాడు. లేదు నేను ప్రేమించింది ఒక్కరినే అంతే.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికి అర్ధం లేదని నందిని చెప్తుంది. ఫైల్ పై సంతకం చేయించుకొని నందిని వెళ్తుంటే.. నా మాటలతో హర్ట్ చేసుంటే సారీ అని సీతాకాంత్ చెప్తాడు.ఆ తర్వాత అభి, రామలక్ష్మిలు కలిసి ఉన్న ఫోటోని శ్రీలత తీసుకొని, శ్రీవల్లికి ఇచ్చి రామలక్ష్మి ర్యాక్ లో పెట్టమని చెప్తుంది. ఏం చేస్తున్నారని శ్రీవల్లి అడుగుతుంది. తర్వాత చెప్తానని శ్రీలత అంటుంది. శ్రీవల్లి వెళ్లి రామలక్ష్మి ర్యాక్ లో ఫోటో పెడుతుంది.ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఇలా ఉండొద్దని చెప్పాను కదా... నువ్వు ఇలా ఎందుకుంటున్నావో నాకు తెలుసని సీతాకాంత్ అనగానే నిజం తెలిసిపోయిందేమోనని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. త్వరగా వచ్చి నీతో కలిసి డిన్నర్ చెయ్యలేదని ఇలా ఉన్నావని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి నార్మల్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి కింద పడుకుంటుంది. ఎందుకు బెడ్ పై పడుకోవచ్చు కదా అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. మరొకవైపు నందిని దగ్గరికి అభిని తీసుకొని వస్తుంది హారిక. నందిని రామలక్ష్మి సీతాకాంత్ ల ఫోటోని చూపించి.. నాకు సీతా కావాలి. నీకు ఇంకా రామలక్ష్మి అంటే ప్రేమ ఉందని సీతాకాంత్ ని నమ్మించాలని అభికి నందిని డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత ఎందుకు రామలక్ష్మి ఇలా బెహేవ్ చేస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు. అప్పుడే శ్రీలత వచ్చి.. రామలక్ష్మికి చీర తీసుకొని వచ్చి ఇస్తానని అనగానే.. పడుకుందని‌ సీతాకాంత్ అంటాడు. సరే నువ్వు తీసుకొని వెళ్లి రామలక్ష్మి ర్యాక్ లో పెట్టమని శ్రీలత చెప్తుంది. దాంతో సీతాకాంత్ తన ర్యాక్ లో పెడతాడు. అప్పుడే రామలక్ష్మి, అభి ఫోటో కన్పిస్తుంది. అది చూసి ఈ ఫోటో రామలక్ష్మి చూస్తే బాధపడుతుందంటూ సీతాకాంత్ చింపేస్తాడు. అది చూసి శ్రీలత డిస్సపాయింట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం అందరు టిఫిన్ చేస్తుంటారు. సీతాకాంత్ రావడంతో.. రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకరికొకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.