Vishnupriya : పృథ్వీకి విష్ణుప్రియ కిస్ పెట్టిన వీడియో వైరల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

  బిగ్ బాస్ సీజన్-8 లో విష్ణుప్రియ బీబీ గర్ల్ అని నెటిజన్లు అంటున్నారు. అలా అనడానికి చాలా కారణాలే ఉన్నాయి. అసలు విష్ణుప్రియ మెగా ఛీఫ్ ఏంటి? మొన్న సండే ఎపిసోడ్ లో తన డెసిషన్ మార్చుకుంటున్నట్టు పృథ్వీని మార్చమని చెప్పగానే.. నిఖిల్-విష్ణు ఒక జోడీ, యష్మీ-పృథ్వీ ఒక జోడీగా మార్చి లెటర్ పంపించాడు బిగ్ బాస్.  ఇక తను తప్పులు చేసిన సరిచేస్తున్నాడంటూ లైవ్ చూసిన బిబి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.  ఈ సీజన్ ఇన్‌ఫినిటీ (అంతులేనిది) అని నాగార్జున ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఆడియన్స్‌కే అర్థం కాలేదు. అయితే ఈ ఇన్‌ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఏమో అనుకొని భ్రమ పడ్డ ఆడియన్స్‌కి అబ్బే కాదు కాదు.. రొమాన్స్‌లో అంటూ కళ్లు తెరిపిస్తున్నారు కొందరు కంటెస్టెంట్లు. ముఖ్యంగా విష్ణుప్రియ అయితో మాములుగా రెచ్చిపోవడం లేదు. వీకెండ్ ఎపిసోడ్‌లో అదీ నాగార్జున కళ్ల ముందే పృథ్వీ మీద పడి కిస్ ఇచ్చింది విష్ణు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. బిగ్‌బాస్ ఆదివారం ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లను సేవ్ చేసే క్రమంలో ఈ సన్నివేశం రికార్డ్ అయింది. నామినేనషన్స్‌లో ఉన్న పృథ్వీ సేవ్ అయిన వెంటనే వచ్చి విష్ణు పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో కంటెస్టెంట్ల చేతిలో ఉన్న బాక్సులను కలెక్ట్ చేయమని నబీల్‌కి చెప్పారు నాగార్జున. దీంతో తన చేతిలో ఉన్న బాక్స్‌ను నబీల్‌కి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది నయని. ఆ చిన్న గ్యాప్‌లో ఠక్కున పృథ్వీ బుగ్గపై ముద్దు పెట్టేసింది విష్ణు. యుద్ధం కూడా ఆరు తర్వాతే ఆపేస్తారు. కానీ విష్ణుప్రియ మాత్రం యుగాంతం వచ్చినా ఆపదు. హోస్ట్ చెప్పాడు.  వైల్డ్ కార్డులు చెప్పారు. కంటెస్టెంట్స్ చెప్పారు. సండే రోజు వచ్చిన హైపర్ ఆది చెప్పాడు. ఆఖరికి పృథ్వీనే వద్దని చెప్పినా మినిమమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఓ ఆడది అని కూడా మర్చిపోయి విష్ణుప్రియ రొమాన్స్ తో రెచ్చిపోతుంది. ఏంటో ఈ విష్ణుప్రియకి అంత కక్కుర్తి, నాగ్ చూసి వార్నింగ్ ఇవ్వాల్సింది, ఏందిరా ఇలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి హౌస్ లో విష్ణుప్రియ బిహేవియర్ మీకెలా అనిపిస్తోందో కామెంట్ చేయండి.  

Karthika Deepam2 : పూజలో శివన్నారాయణ‌ కోపం.. అంతా కార్తీక, దీపల మంచికేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -188 లో......దీప పెట్టిన కండిషన్ కి కాంచన ఒప్పుకొని శ్రీధర్ ని పిలవడానికి వెళ్తుంది. నేను రాకుంటే ఏం చేస్తావని శ్రీధర్ అనగానే.. కార్తీక్ తండ్రిగా మీరు వస్తారని కాంచన అంటుంది. మీరు ఒక్కరే రండీ రెండో భార్య అంటే చులకనగా చూస్తారని కావేరిని ఇండైరెక్ట్ గా రాకని అనసూయ చెప్తుంది. ఈవిడ ఎవరు ఇలా మాట్లాడుతుందని కావేరి అనగానే.. తనతో పెట్టుకోకు అని శ్రీధర్ అంటాడు. నువ్వు వెళ్తావా అని కావేరి అడుగుతుంది. వెళ్తావా కాదు కచ్చితంగా వెళ్ళాలని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత దీప దగ్గరికి శౌర్య బట్టలు తీసుకొని వస్తుంది. ఎవరు కొనిచ్చారని దీప అడుగుతుంది. నానమ్మ కొన్నది.. రేపు పూజ కదా... ఏది వేసుకోవాలని శౌర్య అనగానే.. రేపు పూజ జరగదని దీప అంటుంది. జరుగుతుందని శౌర్య అంటుంది. మరొకవైపు కుబేర్ ఫోటో పట్టుకొని వెతుకుతాడు దాస్. ఆ తర్వాత వీళ్లంతా ఎక్కడికి వెళ్లారని దీప అనుకుంటుంది. అప్పుడే కాంచన వాళ్ళు వస్తారు. రేపు పూజలో మీ దంపతులని ఆశీర్వదించడానికి మా దంపతులం వస్తున్నామని కాంచన అనగానే.. దీప షాక్ అవుతుంది. మీ అత్త కోపం పక్కన పెట్టి మీ కోసం వెళ్లి పిలిచిందని అనసూయ చెప్తుంది. దీప లోపలికి వెళ్తుంది . ఆ తర్వాత దీప బయట బాధపడుతుంటే అనసూయ వచ్చి.. మీ అత్త మీ కోసం ఇంత చేస్తుందంటూ కాంచన, కార్తీక్ ల గురించి గొప్పగా  చెప్తుంది. ఆ తర్వాత దాస్ కి ఫోన్ చేస్తుంది పారిజాతం. సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నామని దాస్ అంటాడు. అప్పుడే ఫోన్ తీసుకొని కార్తీక్, దీప అక్కలు పూజ చేస్తున్నారు. పిలిచారు వెళ్తున్నామని కాశీ చెప్తాడు. దాంతో పారిజాతం కోప్పడుతుంది. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి‌ దీప వచ్చి.. ఎప్పుడు మీ శ్రేయోభిలాషిని అంటారు కదా మీ పక్కన కూర్చొని పూజ చేయలేను.. ఆపండి అని దీప చెప్తుంది. తరువాయి భాగంలో పూజ జరిగాక జ్యోత్స్న వచ్చి దీపని తిడుతుంది. నా కొడుకు, కోడలిని ఆశీర్వదించండి నాన్న అని శివన్నారాయణ‌తో కాంచన అంటుంది. శివన్నారాయణ‌ కోపంగా అక్షింతలు విసిరేస్తాడు. అవి దీప, కార్తీక్ లపై పడతాయి. కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీసీటీవీలో భార్య మాజీ లవర్.. భర్తకి అంతా తెలిసిపోయిందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -239 లో....సిరి కోసం ఇంట్లో పూజ చేస్తుంటారు. పూజ జరుగుతుంటే అభి వస్తాడు. అభిని ఒక సీతాకాంత్ మాత్రమే చూస్తాడు. అసలు ఎందుకు వచ్చాడు. ఏం జరుగుతుందని సీతాకాంత్ ఆలోచిస్తాడు. అభి దగ్గరికి వెళ్ళబోతుంటే పూజ మధ్యలో లేవకూడదు బావగారు అని శ్రీవల్లి అంటుంది. ఏంటి సీతా ఏదో టెన్షన్ పడుతున్నవని శ్రీలత అనగానే.. ఏం లేదని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత పూజ పూర్తి అవుతుంది. శ్రీవల్లి నెక్లెస్ కోసం లోపలికి వెళ్లి నెక్లెస్ కన్పించడం లేదని అంటుంది. ఏమైందంటూ అందరూ అడుగుతారు. ఒకవేళ రామలక్ష్మి అక్క తీసిందేమో ఎందుకు అంటే నాకు ఇచ్చేటప్పుడు వద్దని అంది కదా అని శ్రీవల్లి అనగానే.. రామలక్ష్మి తనపై కోప్పడుతుంది. సీసీటీవీ చూస్తే తెలుస్తుంది కదా అని సందీప్ ఆన్ చేస్తాడు. అందులో అభి వచ్చినట్లు ఉంటుంది. తనని చూసి అందరూ షాక్ అవుతారు. మళ్ళీ వచ్చాడేంటి అని రామలక్ష్మి అనుకుంటుంది. వీడు అభి కదా ఎందుకు వచ్చాడని శ్రీవల్లి, సందీప్ లు అంటారు. ఎవరి కోసం వచ్చి ఉంటాడని శ్రీవల్లి అంటుంది. అభి గురించి రామలక్ష్మి నాకెందుకు చెప్పడం లేదని సీతాకాంత్ అనుకుంటాడు. నేను వెళ్లి చూసి వస్తాను వాడు ఇక్కడే ఉన్నాడేమో అని పెద్దాయన వెళ్తాడు. ఆ తర్వాత నెక్లెస్ బయట దొరికిందని వాడు తీసుకొని వెళ్తుంటే పడిపోయిందేమోనని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సిరికి  నెక్లెస్ ఇస్తాడు సీతాకాంత్. ఆ తర్వాత ఎలాగైనా రామలక్ష్మి సీతకాంత్ లని విడకొడతాను ఇక సీతాకాంత్ కి అనుమానం మొదలు అయిందని శ్రీవల్లి, సందీప్ లతో శ్రీలత అంటుంది. మరొకవైపు వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడని రామలక్ష్మి ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఎత్తుకు పై ఎత్తుతో కావ్య వారిని చిత్తు చేయనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మమూడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -553 లో....రాజ్ ఖాళీగా ఉన్నాడంటూ ఇంట్లో అందరు అంటుంటారు.. నువ్వు కావ్యకి భయపడి వెళ్ళట్లేదు.. అంతే కాకుండా బయట అందరు రాజ్ కి సామర్ధ్యం లేదా అందుకేనా మీ కోడలికి బాధ్యతలు అప్పజెప్పారని అంటున్నారంటూ రాజ్ తో‌ ప్రకాశ్ అంటాడు. ఇలా అందరూ ఒక్కొక్క మాట అనేసరికి రాజ్ ఇగో హర్ట్ అవుతుంది. సరే ఆఫీస్ కి వెళ్తానని అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు..అదంతా పై నుండి రాహుల్ చూస్తాడు. వెంటనే రుద్రాణి దగ్గరికి వెళ్తాడు. రాజ్ ఇగో హర్ట్ చేసి ఆఫీస్ కి వెళ్ళడానికి ఒప్పుకునేలా చేశారని చెప్పగానే.. మొన్నటి నుండి ప్లాన్ చేసి నడిపించేది ఇదా అని రుద్రాణి అంటుంది. ముందు ఆ మేనేజర్ కి ఫోన్ చెయ్ అని రుద్రాణి అనగానే రాహుల్ ఫోన్ చేస్తాడు. నేను చెప్పేది విను అని రాహుల్ మేనేజర్ కి ఫోన్ చేసి అంటాడు. మీరే నేను చెప్పేది వినండి అని మేనేజర్ తనని సెక్యూరిటీ చేసిన విషయం చెప్పగానే రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. ఇక నేను చూసుకుంటానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వచ్చి సెక్యూరిటీని చూసి నిన్ను ఇలా చేసింది ఏంటి అడుగుదాం పద అంటూ కావ్య దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ కావ్య లాజిక్ మాట్లాడగానే.. నువ్వు వెళ్ళిపోమంటూ సెక్యూరిటీని పంపిస్తాడు రాజ్. ఆ తర్వాత మీటింగ్ జరుగుతుంది. అందులో మీరు ఎంత కాలం సీఈఓ గా ఉంటారో తెలియదు.. మిమ్మల్ని నమ్మి మేమ్ పెట్టుబడి పెట్టలేమని‌ ఇమ్వెస్టర్స్ వెళ్ళిపోతారు. చూసావ్ కదా నీ స్థానం అది.. ఇంట్లో వాళ్లకు కూడా తెలుస్తుందని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి అరవింద్ వస్తాడు. తన కంపెనీ అప్పుల్లో ఉందని వేళం వేస్తున్నారు. మీరు తీసుకోండి అని చెప్తాడు. అలా ఎందుకు మీ కంపెనీ కి లాభం వచ్చేలా చేస్తాను.. ఫిఫ్టీ ఫిఫ్డీ లాభం అని కావ్య డీల్ కుదుర్చుకుంటుంది. తరువాయి భాగం లో రుద్రాణి పొగరు అనన్చాలని అనుకున్నావ్ కదా.. ఇప్పుడు ఛాన్స్ వచ్చిందని స్వప్నకి కావ్య ఫోన్ చేసి ఏదో ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత నష్టాల్లో ఉన్న కంపెనీని వేళంలో కొనడానికి రెడీ అయిందని సీతారామయ్యతో రాజ్ చెప్పగానే.. కావ్య అలోచించి చేస్తుంది తనపై నమ్మకం ఉందని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రెచ్చిపోయిన గౌతమ్.. అక్కా అంటూ యష్మిపై  రివేంజ్‌

  బిగ్ బాస్ సీజన్-8 రోజుకో మలుపు తిరుగుతుంది. నాలుగు రోజుల క్రితం ఎపిసోడ్ లో యష్మీ బాగుందంటు గౌతమ్ చెప్పగా.. తనకి పాజిటివ్ గా స్పందించింది. అయితే అలా ఎందుకు చేసిందో గౌతమ్ కి తెలిసింది.ఆ ట్రయాంగిల్ లవ్ నాకు వద్దంటు యష్మీ దగ్గరికి వెళ్ళి చెప్పేశాడు గౌతమ్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో యష్మీపై విరుచుకుపడ్డాడు గౌతమ్. విష్ణుప్రియ మొదటగా గౌతమ్‌ను నామినేట్ చేసింది. కొన్ని వారాల క్రితం అశ్వత్థామ 2.0 అన్నందుకు గౌతమ్ హర్ట్ అవ్వడం కరెక్ట్‌గా అనిపించలేదు.. అప్పుడు నువ్వు సీరియస్‌గా వెళ్లిపోయావ్.. అది ఒక పాయింట్.. అలానే నువ్వు ఆడవాళ్లకి గౌరవం ఇవ్వాలంటావ్ కానీ లేడీస్ మీదే అరిచావంటూ విష్ణుప్రియ చెప్పింది. ఇక దీనికి డిఫెండ్ చేస్తు యష్మీని మధ్యలోకి లాగాడు గౌతమ్. నేను ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మీ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడిందంటూ గౌతమ్ అన్నాడు. దీంతో హలో గౌతమ్.. నీ అభిప్రాయం నువ్వు చెబితే నా అభిప్రాయం చెప్పాల్సి ఉంటుందంటూ యష్మీ అంది. దీనికి చెప్పు యష్మీ.. చెప్పు ఏమైందంటూ గౌతమ్ అన్నాడు.  యష్మీ ఏదో చెప్తుంటే.. ఆగు అక్కా.. అంటూ గౌతమ్ అన్నాడు. రిపీటెడ్‌గా అలానే అక్కా అంటూ గౌతమ్ అనేసరికి యష్మీ కోప్పడింది. నన్ను అక్కా అనకు.. నువ్వు ఒకసారి క్రష్, ఒకసారి అక్కా అనకు.. అంటూ యష్మీ పిచ్చిగా అరిచేసింది. దీంతో నేను గౌరవం ఇస్తున్నా.. అక్కా అని పిలుస్తా.. అలానే పిలుస్తానంటు గౌతమ్ మరింతగా రెచ్చగొట్టాడు. దీంతో తనకి ఇష్టం లేనప్పుడు పిలవకు అంటూ ప్రేరణ, విష్ణుప్రియ గౌతమ్‌కి చెప్పారు. అయినా సరే నీకు దండం పెడతా ప్రతి ఒక్కటి చెప్పకు అక్కా.. నువ్వు ఏమన్నా లాయరా అంటూ గౌతమ్ రెచ్చిపోయాడు. ఆ తర్వాత విష్ణుతో మాట్లాడుతూ.. నాకు ప్రతి వీక్ ఇదే పాయింట్ చెప్పి నన్ను నామినేట్ చేస్తారా.. ఇక్కడ నా కంటే అన్ బ్యాలెన్స్‌డ్ పర్సన్ లేరా.. నా కంటే కోపం ఉన్నోళ్లు ఉన్నారంటూ గౌతమ్ అన్నాడు.  గేమ్ పరంగా కూడా నువ్వు ఇంకా ఆడాలి.. నువ్వు అబ్బాయిలతో మాట్లాడం నేను చూడలేదు.. ఎప్పుడూ అమ్మాయిలతోనే మాట్లాడతావ్. నువ్వు క్లీనింగ్ అయితే చేయనే లేదు.. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంటూ విష్ణు చెప్పేసింది. అంటే నా  కంటే ఇక్కడ తక్కువ పని చేసేటోళ్లు.. నా కంటే ఎక్కువ పాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా కూడా నువ్వు నామినేట్ చేయవు.. అదే ఫేవరిజమంటూ ఇండైరెక్ట్‌గా పృథ్వీ టాపిక్ తెచ్చాడు గౌతమ్. నేనేం చేశానో మాత్రమే నువ్వు చూడు.. ఎందుకంటే వచ్చే వారం.. నా పాయింట్లు చెప్తానంటూ గౌతమ్ జైల్లోకి వెళ్లాడు. 

Biggboss 8 Telugu: బజ్ ఇంటర్వ్యూలో మెహబూబ్ బయటపెట్టిన షాకింగ్ నిజాలివే!

  బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది.‌ మెహబూబ్ ఎనిమిదో వారం ఎలిమినేషన్ అయ్యాడు. ఇక బిబి బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు మెహబూబ్. నీకు దీపావళి అచ్చి రాలేదు అనుకుంటా.. ముందు సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. ఈ సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. దీపావళి నాకు అచ్చురాలేదని అనిపిస్తుందా అని యాంకర్ అడుగగా.. అదేం లేదని మెహబూబ్ అన్నాడు. సీజన్-4లో పది వారాలు ఉన్నావు. చాలా ఫేమ్ వచ్చింది. మళ్లీ ఎందుకు సీజన్ 8కు రావాలనుకున్నావని యాంకర్ అడుగగా.. నేను దీనిని ఒక అవకాశంలాగా చూశాను. ఇంకా ఎక్కువ ప్రేక్షకులకు తెలియొచ్చు అనుకున్నానని మెహబూబ్ అన్నాడు. తన నామినేషన్స్ గురించి అడిగాడు అర్జున్. మీరు ఈ వీక్ సేఫ్ అయ్యింటే వచ్చేవారం ఎవరిని నామినేట్ చేసేవారు’’ అని అడిగాడు అర్జున్. ‘‘నయని ప్రతీ గేమ్ నేను ఆడతాను అనేది’’ అని కారణంతో సహా తననే నామినేట్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు మెహబూబ్. టీమ్‌కు కావాల్సిన పాయింట్స్ నేను తెప్పిస్తున్నాను’’ అని గర్వంగా చెప్పాడు మెహబూబ్. ఏ కంటెస్టెంట్ గురించి అడిగినా పాజిటివ్‌గానే ఎందుకు చెప్తున్నావని అడుగగా.. పాజిటివ్, నెగిటివ్ రెండూ చూస్తానని మెహబూబ్ చెప్పాడు. అవకాశం వచ్చాక ఆరుబయట కూర్చున్నాడంట. అవకాశం రాలేదని చెప్పి మంచమెక్కి కూర్చుంటా అన్నాడంట అని అర్జున్ ఓ సామెత చెప్పగానే.. నచ్చలేదనేట్టుగా కనిపించేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు‌ మెహబూబ్. ‌ఇంకా బజ్ ఇంటర్వ్యూ(Biggboss 8 Telugu Buzz) లో హౌస్ లో తనకి ఎవరు బెస్ట్.. ఎవరు వరెస్ట్.. ఎలా ఉంటుందో అన్నీ చెప్పుకొచ్చాడు మెహబూబ్. 

యష్మీకి వెన్నుపోటు పొడిచిన ప్రేరణ.. నామినేషన్లో బిగ్ ట్విస్ట్‌ ఇదే!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఎవరు ఊహించని విధంగా తొమ్మిదవ వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో చెత్త రీజన్స్ తో విష్ణుప్రియ నామినేషన్ చేసింది. గౌతమ్, ప్రేరణ, తేజ, నయని, నబీల్‌లను తన కారణాలు చెప్పి నామినేట్ చేసింది విష్ణుప్రియ. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చాడు. విష్ణుప్రియ నామినేట్ చేసిన వారిలో నుండి సేవ్ చేసే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ప్రతిసారి పోలీస్ సైరన్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్లి జైలు కీ ని పట్టుకుంటారో వాళ్లు జైల్లో ఉన్న ఒక సభ్యుడ్ని విడిపించి.. నామినేషన్స్ నుంచి సేవ్ చేసి బయట ఉన్న సభ్యుల నుంచి ఒకరిని నామినేట్ చేసి జైల్లోకి పంపించాల్సి ఉంటుంది.. ఒకసారి కీ సంపాదించిన సభ్యుడు మరోసారి పట్టుకోవడానికి వీల్లేదు.. మెగా చీఫ్ విష్ణుప్రియను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు.. అలానే విష్ణు ' కీ' కోసం పరిగెత్తకూడదంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ముందుగా సైరన్ మోగిన వెంటనే పృథ్వీ కీ తీసుకున్నాడు. వెంటనే నబీల్‌ని సేవ్ చేసి ఆ ప్లేస్‌లో అవినాష్‌ను నామినేట్ చేశాడు.. మీరు స్పీడుగా ఉన్నారు.. తర్వాత కీ తీసుకొని మా వాళ్లను నామినేట్ చేసే అవకాశం ఉంది.. అలానే నా పాయింట్ ఏంటంటే బిగ్‌బాస్ అంటే పిచ్చి అని చెప్పి మీరు బస్తా టాస్కులో వెంటనే గివ్ అప్ ఇచ్చినట్లు అనిపించింది.. అంటూ పృథ్వీ చెప్పాడు. సైరన్ మోగగానే ఈసారి కీ యష్మీ దక్కించుంది. దీంతో తన ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసి హరితేజను నామినేట్ చేసింది. మీ పర్ఫామెన్స్ తగ్గిపోయింది.. ఫైర్ పోయిందంటూ యష్మీ కారణాలు చెప్పింది. ఆ తర్వాత రోహిణి 'కీ' పట్టుకొని అవినాష్‌ను బయటికి తీసుకొచ్చి పృథ్వీ‌ని నామినేట్ చేసి జైలుకి పంపింది.  ఆ తర్వాత అవినాష్ 'కీ' దక్కించుకొని తేజను సేవ్ చేసి.. యష్మీని నామినేట్ చేసి లోపలికి పంపాడు. ఆ తర్వాత ప్రేరణ 'కీ' తీసుకుంది. ఇక అందరు తను యష్మీనే సేవ్ చేస్తుందని అనుకున్నారు. కానీ పృథ్వీని బయటికి తీసుకొచ్చింది ప్రేరణ. ఇది ఊహించని పృథ్వీ.. థాంక్యూ మమ్మీ అంటూ ప్రేరణకి హగ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ ప్లేస్‌లో టేస్టీ తేజ‌ను స్వాప్ చేసింది ప్రేరణ. మరో రౌండ్ ఉంటుంది అప్పుడు యష్మీని సేవ్ చేస్తుంది తమ క్లాన్ అని ప్రేరణ అనుకుంది. కానీ ఇంతటితో నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో తనని కాపాడిన యష్మీని సేవ్ చేయలేకపోయానని ప్రేరణ ఏడ్చేసింది. గౌతమ్, నయని, హరితేజ, యష్మీ, టేస్టీ తేజ మొత్తం ఐదుగురు సభ్యులు ఈ వారం నామినేషన్స్‌ లో ఉన్నారు.  

Biggboss 8 Telugu: అయిదుగురిని నామినేట్ చేసి బకరా అయిన విష్ణుప్రియ.. ఏడ్చేసిన నబీల్!

  బిగ్ బాస్ సీజన్-8 లో తొమ్మిదవ వారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. సీజన్-5 లో మాదిరి నామినేషన్ చేసిన వారిని జైల్లో పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. విష్ణుప్రియ మెగా ఛీఫ్ కారణంగా అయిదుగురిని నామినేట్ చేయాలంటూ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అయితే ఇదే తనని హౌస్ లో బకరాని చేసిందని చెప్పాలి. ఇప్పటికి ఎనిమిది వారాలు గడిచినా ఓ క్లారిటీ లేకుండా.. అసలు ఆడది అనే విషయాన్ని మర్చిపోయి పృథ్వీకి బహిరంగంగా ముద్దులు ఇస్తూ, అతను ఎక్కడుంటే అక్కడ ఉండటం.. గంట ఎపిసోడ్ చూసే ఆడియన్స్ కంటే ఇరవైనాలుగు గంటలు హౌస్ లో ఉండే వాళ్ళే తనని ద్వేషిస్తున్న లెక్కచేయడంలేదు. దీనికి తోడు బిగ్ బాస్ సపోర్ట్ కూడా ఉండటంతో తనేం చెప్తే అదే చేస్తున్నారు. ఇక తన మాటలకి చేష్టలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. హౌస్ లో ఎవరేంటో కూడా తెలియని విష్ణుప్రియకి పగ్గాలు ఇచ్చారు. అది హౌస్ అందరిని చూసుకునే మెగా ఛీఫ్. దీనికి అర్హత కూడా లేని విష్ణుప్రియ.. తనని చీఫ్ చేసిన తన క్లాన్ సభ్యులని మర్చిపోయి.. మిగతా క్లాన్ వాళ్ళని నామినేట్ చేయకుండా సొంత క్లాన్ వాళ్ళని నామినేట్ చేసింది. ఇది నిజంగా చెత్త నామినేషనే. ఎందుకంటే తను చెప్పిన ఒక్క రీజన్ కూడా వ్యాలిడ్ లేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నీలో ఫన్ యాంగిల్ కనపడటం లేదంటు నబీల్ ని నామినేట్ చేసింది విష్ణుప్రియ. నువ్వు పృథ్వీతోనే ఉంటే నేనెక్కడ కన్పిస్తానంటూ గట్టిగా ఇచ్చి పడేశాడు నబీల్. అయితే నబీల్ జైలుకెళ్ళాల్సి వచ్చింది. ఇక లోపలకి వెళ్ళాక ఏడ్చేశాడు‌ నబీల్. దాంతో లోపల ఉన్న ప్రేరణ ఓదార్చింది. గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ లని విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఈ అయిదుగురి నామినేషన్ చేసిన చెప్పిన పాయింట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యాలిడ్ పాయింట్ లేదు. ‌దీంతో ఈ సీజన్ లోనే వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ ట్రోల్ చేసేవారికి కంటెంట్ ఇస్తుంది.

Mehaboob Remuneration: బిగ్ బాస్ హౌస్ లో మెహబూబ్ రెమ్యునరేషన్ ఎంతంటే!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు. నామినేషన్ చివరల్లో నయని పావని, మెహబూబ్ ఉండగా.. మెహబూబ్ ఎలిమినేటెడ్ అంటు నాగార్జున చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటికే బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నయని, సీత, మణికంఠ ఇలా అందరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇక ఈ ఎనిమిదో వారం మెహబూబ్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆటలు బాగానే ఆడినా కూడా ఇలా ఎలిమినేట్ అయ్యానంటూ ఫీల్ అయ్యాడు. మెహబూబ్ మూడు వారాలకు దిల్ సే రోజుకు సుమారుగా రూ. 42 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. అంటే, ఈ లెక్కన మెహబూబ్ ఒక్క వారానికి దాదాపుగా రూ. 3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8(Biggboss 8 Telugu) ద్వారా 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 9 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం.. ఆ తర్వాత అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నానంటూ మెహబూబ్ బాధపడ్డాడు.   

Karthika Deepam2 : ఆస్తులపై కన్నేసిన జ్యోత్స్న, పారిజాతం.. కార్తీక్ ఏం చేస్తాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -187 లో....పారిజాతం హాల్లో కూర్చొని టీ తాగుతుంటుంది. అప్పుడే గుడి నుండి సుమిత్ర ఇంటికి వస్తుంది. నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని పారిజాతం అనగానే.. ప్రశాంతత కోసం వెళ్ళాను. మీ ఆలోచనలతో నా కూతురు మనసు ని పాడుచేశారు. మీకు వయసు పెరిగింది అంతే అర్థం చేసుకునే మనసు పెరగలేదని సుమిత్ర అనగానే.. పారిజాతానికి కోపం వస్తుంది. ఎంత మాట అన్నావ్.. నీ సంగతి చెప్తానని అనుకుంటుంది పనిమనిషి వచ్చి పారిజాతానికి సెటైర్ వెయ్యడంతో పారిజాతానికి కోపం పెరుగుతుంది.  మరొకవైపు దీప ఇంటికి వస్తుంది. సత్యనారాయణ వ్రతం చేయాలన్నారంట కదా.. దానికి నేను ఒప్పుకుంటున్నాను కాకపోతే ఒక కండిషన్.. కండిషన్ కాదు రిక్వెస్ట్ అని దీప అంటుంది. పూజ తర్వాత అత్తగారిగా మీరున్నారు.. మీ పక్కన ఆశీర్వాదించడానికి శ్రీధర్ గారు కూడా ఉండాలని అనగానే.. సరే అని కాంచన అంటుంది. ఆ తర్వాత గుడిలో జరిగిన విషయం దశరథ్ కి సుమిత్ర చెప్తుంది‌ దీప బాధపడుతుందా.. నేను నమ్మను.. తనేం చిన్నపిల్ల కాదు కదా అంటూ దీపపై చిరాకుగా దశరథ్ మాట్లాడతాడు. అప్పుడే పారిజాతం వచ్చి.. ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.  జ్యోత్స్న కార్తీక్ ని తప్ప ఇంకెవరని చేసుకోనంటుందని పారిజాతం అనగానే.. ఇంకొకసారి వాళ్ళ టాపిక్ తియ్యొద్దని దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఇలా రెచ్చగొట్టేల మాట్లాడొద్దంటూ పారిజాతాన్ని సుమిత్ర తిడుతుంది. మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు ప్లాన్ చేస్తుంటారు. ఆస్తులన్నీ ముసలోడి పేరు మీద ఉన్నాయి. కాంచనకి ఆస్తులు ఇవ్వకుండా‌. ఛీ అనేలా చేస్తే వాళ్ళకి ఆస్తులు ఉండవు. అప్పుడు కార్తీక్ నీ దగ్గరికి వస్తాడని పారిజాతం అనగానే.. సూపర్ అని జ్యోత్స్న అంటుంది. కానీ ముందు దీపపై కార్తీక్ కి కోపం వచ్చేలా చెయ్యాలి.. నాపై సింపథీ రావాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాంచన శ్రీధర్ దగ్గరికి వెళ్లి ఆశీర్వదించడానికి రమ్మని చెప్తుంది. నేను రానంటే ఏం చేస్తావని శ్రీధర్ అనగానే.. కార్తీక్ తండ్రిగా మీరు వస్తారని కాంచన అంటుంది. తరువాయి భాగంలో శ్రీధర్ ని పిలవడానికి కాంచన వెళ్ళిందని దీపకి అనసూయ చెప్తుంది. రేపు మిమ్మల్ని దీవించడానికి మా దంపతులం వస్తాం.. ఇక నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంచన అంటుంది‌. ఆ తర్వాత కార్తీక్ రెడీ అవ్వుతుంటే తన దగ్గరికి వెళ్లి.. మీ పక్కన కూర్చొని వ్రతం చెయ్యలేను బాబు.. ఎలాగైనా ఆపండి అని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పూజకి వచ్చిన భార్య మాజీ లవర్.. భర్త ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -238 లో....రామలక్ష్మి బొమ్మ బొరుసు వేస్తుంది. తను అనుకున్న బొమ్మ పడుతుంది. దాంతో నేను చెప్పినట్టు చెయ్యాలని సీతాకాంత్ తో రామలక్ష్మి అంటుంది. చేస్తానని సీతా అనగానే.. ఈ పాలు తాగండి అని చెప్తుంది. నేను ఆకలితో పడుకోకూడదని ఇదంతా చేసావ్ కదా అని సీతాకాంత్ అంటాడు. అవునని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్ పాలు తాగి సగం రామలక్ష్మికి ఇస్తాడు. దాంతో రామలక్ష్మి ప్రేమగా తనని చూస్తు ఉంటుంది. మరొకవైపు శ్రీవల్లి టీ తాగుతూ శ్రీలతని ఇర్రిటేట్ చేస్తుంటుంది. అప్పుడే రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు పై నుండి వస్తుంటారు. సీతాకాంత్ ని శ్రీలత పిలిచి.. సిరికి బాగా దిష్టి తాకినట్లు ఉంది.. అందుకే ఇంట్లో పూజ చేద్దామనుకుంటున్నా అని అంటుంది. దానికి సీతాకాంత్ సరే అంటాడు. ఎలాగూ పూజ అంటున్నారు కదా సిరికి నెక్లెస్ తీసుకున్నాను.. దాన్ని కూడా అప్పుడే ఇస్తానని సీతాకాంత్ అంటాడు. నువ్వేం మాట్లాడడం లేదు.. నీకు పూజ చెయ్యడం ఇష్టం లేదా.. నెక్లెస్ ఇవ్వడం ఇష్టం లేదా అని రామలక్ష్మిని శ్రీవల్లి అంటుంది. నాకెందుకు ఇష్టం ఉండదంటు శ్రీవల్లికి రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అభికి శ్రీలత ఫోన్ చేసి రమ్మంటుంది. అప్పుడే రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతుంది. వెనకాల నుండి అభి వస్తాడు. తనని చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది. నువ్వెందుకు వచ్చావంటూ అభిని రామలక్ష్మి కోప్పడుతుంది. అదంతా పై నుండి సీతాకాంత్ చూస్తుంటాడు. రామలక్ష్మి చేతులు పట్టుకొని అభి సారీ రామలక్ష్మి అంటాడు. వాడెందుకు వచ్చాడు.. అసలేం జరుగుతుందని సీతాకాంత్ కిందకి వస్తుంటాడు. ఆ తర్వాత చెయ్ వదులు అంటూ అభి చెంప పగులగోడుతుంది రామలక్ష్మి. ఇంకొకసారి రాకని వార్నింగ్ ఇస్తుంది. అభిని పంపించి రామలక్ష్మి లోపలికి వస్తుంది. అభి గురించి చెప్పడం లేదని సీతాకాంత్ అనుకుంటాడు. అభి గురించి చెప్పి తనని డిస్టబ్ చెయ్యడం ఎందుకని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సేట్ వచ్చి.. నెక్లెస్ ఇస్తాడు. శ్రీలత వాళ్ళు వచ్చి చూసి.. బాగుందని అంటారు. ఈ నెక్లెస్ సిరి కి ఇచ్చేవరకు నా దగ్గర ఉంచుకుంటానని శ్రీవల్లి అనగానే.. రామలక్ష్మి వద్దని అంటుంది. ఎందుకు వద్దని అంటున్నావని శ్రీవల్లి, సందీప్ లు గొడవపెడుతుంటే.. సరే ఉంచుకోమని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత పూజ జరుగుతుండగా అభి వస్తాడు. అభిని చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మీటింగ్ కి వచ్చిన రాజ్.. చూసావా ఇది నీ స్థానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -552 లో.....రాజ్ కూరగాయలు పట్టుకొని ఇంటికి వస్తాడు. తనని చూసి రుద్రాణి భయపడి గట్టిగ అరుస్తుంది. దాంతో అందరు హాల్లోకి వస్తారు. ఏమైంది అత్త అలా అరిచావని రాజ్ అడుగుతాడు. నువ్వు కూరగాయల షాప్ ని పట్టుకొని వస్తుంటే.. భయమేసిందని రుద్రాణి అంటుంది. ఇక ఆ తర్వాత ఇదిగోండి.. మీరు చెప్పిన కూరగాయలు అని రాజ్ చెప్తాడు. ఒక కంపెనీకి సీఈఓ అయి ఉండి ఇలా చెయ్యడం బాధగా లేదా అని రుద్రాణి అనగానే.. ఎందుకు బాధ కన్నతండ్రికి తల్లికి లేని బాధ ఎందుకని రాజ్ అంటాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసని అపర్ణ అంటుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలుసని రాజ్ అంటాడు. ఆఫీస్ కి వెళ్ళమని ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు అంటారు. నేను వెళ్ళానని రాజ్ అంటాడు. నువ్వు ఆ కావ్య కింద పని చెయ్యడం ఏంటని రుద్రాణి అంటుంది. అయితే నీకు ఆఫీస్ వెళ్లడం ఇష్టం లేదు కాబట్టి  ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలని ప్రకాష్ అంటాడు. కార్ వాష్ చేసుకొని రా అంటూ కీస్ ఇస్తాడు. ఎందుకు చెయ్యను.. నేనే చేయింకకొని వస్తానని రాజ్ అంటాడు. మరొకవైపు కళ్యాణ్ పాట రాస్తు ఉంటాడు. సరిగ్గా లేదని చింపేస్తూ ఉంటాడు. అప్పుడే అప్పు వస్తుంది. అమ్మపై పాట రాయాలి. నాకు రాస్తుంటే మా అమ్మ చేసిన పనులు గుర్తు వస్తున్నాయని అంటాడు. తనకి బాధ ఉంటుంది కదా.. ధాన్యలక్ష్మి బాధని అప్పు అర్థం చేసుకొని మాట్లాడుతుంటే కళ్యాణ్ ఇంప్రెస్ అవుతాడు. నువ్వు మనుషులిని బాగా అర్థం చేసుకుంటావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ కార్ వాష్ చేసుకొని వస్తాడు. ఇంకా ఏమైనా పనులు ఉంటే చెప్పండి అనగానే ప్రకాష్ ఫ్యాన్ తీసుకొని వచ్చి.. రిపేర్ చేయించుకొని రా అనగానే తనే రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తాడు. మరొకవైపు కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. రారు అనుకున్న క్లయింట్స్ వస్తుంటారు. అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి మాట్లాడతాడు. దాంతో తను చేసిన మోసం గుర్తుచేస్తూ కోప్పడుతుంది. మరొకవైపు క్లయింట్స్ అలా ఎలా వచ్చారంటూ శృతి అడుగుతుంది. మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడాను.. రూల్స్ గురించి మాట్లాడానని కావ్య అనగానే మీటింగ్ కి వచ్చారు కానీ మనతో టై అప్ అవలేరు కదా అని శృతి అంటుంది. మరొకవైపు అందరు కలిసి రాజ్ ని ఆఫీస్ కి పంపించాలని తనని రెచ్చగొట్టేలా మాట్లాడతారు. తరువాయి భాగంలో మీటింగ్ కి రాజ్ వస్తాడు. అందరు మీరు ఎంత కాలం సీఈఓ గా ఉంటారు తెలియదు.. మీతో టై అప్ అవ్వలేమని  చెప్పి వెళ్ళిపోతారు. చూసావా నీ స్థానం అది.. నిన్ను ఎవరు నమ్మరని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కాస్ట్యూమ్ చేంజ్ చేసిన శౌర్య ...కార్తీక దీపం ఫ్యాన్స్ ఖుషీ!

  కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై ఒక చరిత్ర సృష్టించింది. ఒక సీరియల్ కి కూడా ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. ఏ మూవీకి లేనంత క్రేజ్ దీనికి ఉంటుంది. ఈ సీరియల్ లో కార్తీక్, దీప ఇద్దరిది పర్ఫెక్ట్ పెయిర్. కార్తీక దీపం సీరియల్ అయిపోవడంతో ప్రేక్షకులకు డిస్సపాయింట్ అయ్యారు. అందుకే ఇప్పుడు కార్తీక దీపం2 పేరుతో నవ వసంతం పేరిట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇక సీరియల్ లో గత వారమే శౌర్య కోసం కార్తీక్ దీప మెడలో తాళికట్టాడు. అప్పటి నుండి సీరియల్ కి టీఆర్పీ భారీ స్థాయికి చేరుకుంది. దీప మెడలో కార్తీక్ తాళి కట్టేటప్పుడు కొంతమంది ఫ్యాన్స్ టీవీ ముందుకొచ్చి హారతులు కూడా పట్టారు. మరికొందరు అయితే కట్ చేశారు. ఆ వీడియోలు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అయ్యాయి. అయితే ఈ కార్తీక దీపం రెండో భాగంలో కార్తీక్, దీపలతో పాటు శౌర్యకి కూడా అంతే రేంజ్ లో  ఫ్యాన్స్ ఉన్నారు.  ఈ సీరియల్ లో శౌర్య, దీపలది మొదటి నుండి ఒకటే రకం కాస్టుమ్ వేసుకుంటున్నారు. స్టార్ మా రిలీజ్ చేసే కార్తీక దీపం-2 ప్రోమో కింద చాలా మంది కార్తీక్ దీపం ఫ్యాన్స్.. " ప్లీజ్ కార్తీక్ బాబు ఇప్పుడు దీపని పెళ్లి చేసుకున్నారు కదా.. దీప, శౌర్యలకి కొత్త బట్టలు కొనియ్యండి"  అంటు తరచూ కామెంట్లు చేస్తుంటారు. అది కాస్త డైరెక్టర్ చూసాడేమో.. ఇప్పుడు శౌర్య కాస్ట్యూమ్ చేంజ్ చేసారు. తాజాగా వచ్చిన కార్తీకదీపం-2 ప్రోమోలో శౌర్య ఫ్రాక్ లో కనిపించేసరికి ఈ సీరియల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎప్పుడు లంగా జాకెట్ లో పేదింటి అమ్మాయిలా కన్పించే శౌర్య ఒక్కసారిగా రిచ్ కిడ్ లా కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక కార్తీకదీపం-2 అభిమానులకి మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తోంది.

పృథ్వీతో కలిసి బయటకొస్తానన్న విష్ణుప్రియ.. నెటిజన్లు షాక్!

  బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం నాడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఇందులో భాగంగా సెలెబ్రిటీలు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి సందడి చేశారు. సింగర్ సమీరా భరద్వాజ్ వచ్చి కంటెస్టెంట్ల మీద స్పెషల్ పేరడీ పాటలు పాడింది. చివరకి హైపర్ ఆదితో ఓ సెగ్మెంట్ పెట్టేశాడు. తన స్టైల్లో కంటెస్టెంట్లను ఆడుకున్నాడు ఆది. విష్ణుప్రియకి మంచి సలహాలు ఇచ్చాడు.  ప్రతీ సీజన్‌లో హైపర్ ఆది వచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరు మీద కౌంటర్లు వేస్తూ హింట్లు ఇస్తుంటాడు. ఈసారి కూడా ఆది అలానే కంటెస్టెంట్లకు మంచి సలహాలు ఇచ్చాడు. వైల్డ్ కార్డులు రాక ముందు.. బాహుబలి-1, వైల్డ్ కార్డుల ఎంట్రీ తరువాత బాహుబలి-2 లా ఉందని, ఈ సీజన్ పెద్ద హిట్ అయిందని చెప్పుకొచ్చాడు. సోనియా, నిఖిల్ పృథ్వీ ప్రేమ దేశం చూపించాడు. నిఖిల్.. ఏక్ నిరంజన్ చూపించాడు. ఆ తర్వాత విష్ణు, పృథ్వీ.. ప్రేమించుకుందాం సినిమా చూపించారని.. మధ్యలో నయని దూరి.. ఇంట్లో ఇళ్లాలు వంటింట్లో ప్రియురాలు చూపించిందని ఆది అన్నాడు. సీఎం, డీసీఎంలు పెద్ద పెద్ద స్పీచులు ఇవ్వలేదు కానీ నువ్వు మాత్రం మెగా చీఫ్ అయ్యేందుకు పెద్ద స్పీచ్ ఇచ్చావ్. అంత:కరణశుద్ది అంటూ పెద్ద పెద్ద పదాలు వాడావ్.. విష్ణుతో పాటుగా పృథ్వీ కూడా నిలబడాలి.. మీ ఇద్దరి పెయిర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.. విష్ణుప్రియ నవ్వులకు కుర్రాళ్లు భయపడుతున్నారు.. కాస్త మెల్లిగా నవ్వు. పతివ్రత, పుణ్య స్త్రీ, రాక్షసిదాన అనే పదాలన్నీ ఇప్పుడు నీ వల్లే ఫేమస్ అవుతున్నాయి.. పాత సినిమాల్లో వినిపించే టైటిల్, డైలాగ్స్‌తో ఈ పదాలు ఫేమస్ అయ్యాయి. నాగార్జున గారు ఉంటే ఆటకు హాయ్, పృథ్వీకి బై. నాగార్జున గారు లేకపోతే.. ఆటకు బై పృథ్వీకి హాయ్ చెబుతున్నావ్.. ఇంత వరకు బొమ్మరిల్లు ఫాదర్‌ను చూశాం.. కానీ నువ్వు మాత్రం బొమ్మరిల్లు లవర్. ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో అన్నీ నువ్వే పృథ్వీకి చెబుతున్నావ్.. ఇప్పటికీ నీ కన్ను పృథ్వీ మీదే ఉంది.. పృథ్వీని ప్రేమిస్తే.. పృథ్వీ మాత్రమే నిన్ను ప్రేమిస్తాడేమో.. కానీ ఆటని కూడా ప్రేమిస్తే.. ప్రేక్షకులందరూ నిన్ను ప్రేమిస్తారు.. బయట ఎలా ఉందో.. ఇంట్లో కూడా అలానే ఉంది.. చాలా చెప్పా.. నత్తి బ్రెయిన్‌కు అర్థమైతే.. సంతోషం అని అన్నాడు. నువ్వు బయటకు టైటిల్‌తో వస్తావా.. లవర్‌తో వస్తావా అని బయట నీ తమ్ముళ్లు వెయిటింగ్ అని ఆది అడుగుతాడు. రెండింటితో వస్తానని విష్ణు చెప్తుంది. మళ్లీ తన ప్రేమను వదిలి పెట్టడం లేదు. అసలు విష్ణు అర్థం చేసుకునే మూడ్‌లోనే లేనట్టుగా కనిపిస్తోంది. పృథ్వీతో లవ్ ట్రాక్ కి బ్రేక్ ఇస్తేనే విష్ణుప్రియ ఆట మెరుగుపడుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు.

అవినాష్ ఎలిమినేషన్.. షాక్ లో కంటెస్టెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ద్చారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఎలిమినేషన్ అయ్యాడు.‌ ఇది ఎవరు ఊహించనది. మొన్నటి ఎపిసోడ్ లో రాత్రి అవినాష్ కి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో అతను మెడికల్  రూమ్ కి వెళ్ళాడు. మెడికల్ రూమ్ లో డాక్టర్లు అన్ని టెస్ట్ లు చేసి అవినాష్ కి కడుపులో ఏదో ప్రాబ్లమ్ ఉందని తేల్చేశారు‌.‌ ఇక అవినాష్ అదే విషయం హౌస్ లోకి వచ్చి తోటి హౌస్ మేట్స్ తో చెప్పాడు. ఇక అందరు ఏదో ప్రాంక్ అనుకున్నారు. కానీ నిజంగానే అవినాష్ అందరికి బై చెప్పేసి మెయిన్ గేట్ నుండి బయటకి వెళ్లిపోయాడు. ఇక హౌస్ లోని విష్ణుప్రియ, రోహిణి, హరితేజ అందరు ఏడ్చేస్తున్నారు.‌ ఇది ఆదివారం నాటి ఎపిసోడ్ చివరలో వేయడంతో ఫుల్ వైరల్ గా మారింది.  అవినాష్ హౌస్ లో మోస్ట్ ఎంటర్‌టైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సందర్భాలలో అవినాష్- రోహిణి కలిసి చేసిన కామెడీ సూపర్ హిట్ అయ్యింది. ‌ఇక అవినాష్ ఇలా హెల్త్ పరంగా బయటకు రావడం బిబి ఆడియన్స్ కాస్త నిరాశమే మిగులుస్తుంది. అయితే అవినాష్ మళ్ళీ హౌస్ లోకి వస్తాడా రాడా అనేది మెడికల్ రిపోర్ట్స్ వచ్చాకే తెలుస్తుంది.   

మెహబూబ్ ఎలిమినేషన్.. అప్పుడు కూడా దీపావళికే బయటకొచ్చా!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎనిమిది వారాలు పూర్తయింది. ఇక ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ లో చాలా యాక్టివ్ ఉన్నాడు. అయితే గత వారం జరిగిన బ్యాటరీ టాస్క్ లో తమ క్లాన్ మెంబర్స్ అయినటువంటి హరితేజ, నయని పావనిలని పట్టించుకోలేదనే కారణంతో వాళ్ళిద్దరు మెహబూబ్ ని నామినేట్ చేశారు. దానివల్లే నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యాడు.  వీకెండ్ ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ సెలబ్రిటీలతో నిండిపోయింది. సింగర్స్, డ్యాన్స్ పర్ఫామెన్స్, గేమ్స్, పాటలు డ్యాన్స్ ఇలా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ తో నిండిపోయింది. అయితే నామినేషన్ లో ఆరుగురిలో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేయగా నయని పావని, మెహబూబ్ చివరగా ఉన్నారు.‌ వీరిద్దరిలో మెహబూబ్ ఎలిమినేషన్ అయ్యింది. హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చాడు మెహబూబ్. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే అయ్యా.. ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నానంటూ మెహబూబ్ బాధపడ్డాడు. ఇక ఎప్పటిలాగే హౌస్ లో ఎవరెంటో చెప్పమని నాగార్జున అన్నాడు.  థౌంజెండ్ వాలా అవినాష్ కి ఇచ్చాడు. గంగవ్వకి లక్ష్మీ బాంబ్ ఇచ్చాడు. లైఫ్ లో నీకేం కావాలన్నా నేనున్నా బాధపడకు.. నీ చిన్న బిడ్డకి నేను చేస్తా అనడంతో గంగవ్వ ఎమోషనల్ అయ్యింది. తారాజువ్వని నబీల్ కి ఇచ్చాడు.‌కాకరవొత్తి రోహిణికి ఇచ్చాడు. అవినాష్, రోహిణి పక్కపక్కనే ఉంటే ఫుల్ నవ్వుకుంటాం. ఫైర్  నీలో ఉందని గౌతమ్ తో మెహబూబ్ చెప్పాడు.   

బిగ్ బాస్-8 లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వారం ఎండింగ్ కి వచ్చేసింది. శనివారం, ఆదివారం అనగానే ఎలిమినేషన్ గుర్తొస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న క్యూరియాసిటి అందరిలో ఉంది. ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు బయటకు వచ్చేసారు. గత వారం గౌతమ్ లీస్ట్ లో ఉండగా అప్పటికే మణికంఠ నేను వెళ్ళిపోతా అని అనడంతో గౌతమ్ ని ఆపి మణికంఠని పంపించేశారు. బిగ్ బాస్ లో కొన్ని ఎలిమినేషన్స్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉండగా నిఖిల్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే లీస్ట్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఉన్నారు.. ఓజీ వాళ్ళు ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారం రాయల్స్ నుండి మెహబూబ్ ఎలిమినేషన్ అనేది మొదటిది. ఈ వారం హౌస్ లో మెహబూబ్ ఆటతీరు బానే ఉన్నా బయటకు వచ్చేసాడంటే నామినేషన్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడమే కారణం. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యాభై వేలకి యష్మీ, నిఖిల్ ల లవ్ స్టోరీ చెప్పేసిన పృథ్వీ!

బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం‌ వీకెండ్ వచ్చేసింది. యష్మీ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ వీళ్లంతా కన్నడ బ్యాచ్. అందుకే మొదట నుండి వీళ్ళు ఎవరితో కలవకుండా వీళ్ళే ఉంటు వస్తున్నారు. యష్మీ పాప నిఖిల్ ని లవ్ చేస్తున్నట్లు చెప్పేసింది. అయితే నిఖిల్ కి మాత్రం యష్మీ అంటే ఇష్టమున్నా కూడా బయట పడడం లేదు. కానీ యష్మీ మాత్రం తను అంటే ఇష్టమున్న గౌతమ్, నిఖిల్ లని ట్రాక్ లో పడేయ్యడానికి చూస్తుంది. యష్మీ ఏం చేసినా కూడా నిఖిల్ జలస్ ఫీల్ అవ్వాలని చేస్తుంది.. ఆ విషయం నాగార్జున చెవిన పడ్డట్టుంది. యష్మీకి గౌతమ్ తినిపిస్తున్నాడని మాట్లాడుతుంటే అది వండింది మేమ్.. గౌతమ్ రెడీ గా ఉంది తీసుకొని యష్మీ దగ్గరికి వెళ్ళడని నిఖిల్ అనగానే..అంటే గౌతమ్ తినిపిస్తున్నాడని జలస్ ఆ అది మీరు వండింది అని అలా అంటున్నావా అని నాగార్జున అడుగుతాడు. నిఖిల్ ప్రాబ్లమ్ అన్నం, పప్పు కాదు.. టీ షర్ట్ ప్రాబ్లమ్ అని నాగార్జున అనగానే.. రైట్ సర్ అని పృథ్వీ అంటాడు. టీ షర్ట్ తో తుపాన్ అనేది ఒక సామెత అని నాగార్జున అంటాడు. కావాలంటే పృథ్వీని అడగండి.. పృథ్వీ ఆ విషయం చెప్తే యాభై వేలు ప్రైజ్ మనీకి ఆడ్ చేస్తానని నాగార్జున అనగానే.. అందరు చెప్పు చెప్పు అని అంటారు. యష్మీ, నిఖిల్ మాత్రం వద్దని అంటారు. అయిన పృథ్వీ చెప్తాడు.  గౌతమ్ ని యష్మీ టీ షర్ట్ అడిగింది. నిఖిల్ టీ షర్ట్ లేదు కాబట్టి అడిగింది. నిఖిల్ కి మండుతున్నట్లు ఉంది.. నిఖిల్ జలస్ గా ఫీల్ అవుతాన్నాడు.. అక్కడ నుండి ఏదైనా ఫీలింగ్ ఉందా అని యష్మీ అడిగిందంటు పృథ్వీ చెప్పాడు. అప్పుడే నిఖిల్ వచ్చి ప్రాబ్లమ్ ఓన్లీ టీ షర్ట్ అని చెప్పాడు. దాని ముందు జరిగింది చెప్పురా ఎందుకు ఇలా మార్చి చెప్తున్నావని యష్మీ అంటుంది. ఇక పృథ్వీని నాగార్జున కంటిన్యూ చేయమంటాడు. నెక్స్ట్ డే నే సాంగ్ వచ్చింది సర్.. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే అని పృథ్వీ అనగానే సి వచ్చి మళ్ళీ బి పై వాలిందంటూ నాగార్జున అంటాడు. దీన్ని బట్టి ఆర్య-3 కూడా తీయొచ్చు అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

Karthika Deepam 2: దీప కండిషన్ అదే.. ఆ పూజ జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -186 లో.... దీపని తీసుకొని కార్తీక్ గదిలోకి వస్తుంది శౌర్య. నాతో ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ అంటాడు. మాట్లాడడానికి కాదు నాన్న ఇక్కడే పడుకోవడానికి అని శౌర్య అంటుంది. ఇబ్బందిగానే దీప పడుకుంటుంది. వాళ్ళ ఇద్దరిలో మధ్యలో శౌర్య పడుకుంటుంది. నాన్న నాకు కథ చెప్పు అనగానే.. దీప స్టోరీనీ చెప్తుంటాడు కార్తీక్. శౌర్య పడుకున్నాక దీప గదిలో నుండి వెళ్ళిపోతుంది. దీపని చూసిన అనసూయ.. శౌర్య కోసం, నా కోసం..  నువ్వు అక్కడికి వెళ్ళావ్.. ఇష్టం లేదు కదా అని అంటుంది. కాంచన అమ్మ మీ ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంటుందని అనసూయ అనగానే.. వద్దని దీప చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు దీప గుడికి వెళ్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతుంది. మరొకవైపు సుమిత్ర అదే గుడికి వెళ్తుంది. జ్యోత్స్న పేరున అర్చన చేయిస్తుంది. సుమిత్రకి ఒక పండుని ప్రసాదంలాగా ఇస్తాడు పూజారి. అది పట్టుకొని వెళ్తుంటే కిందపడిపోయి దీప దగ్గరికి వస్తుంది. దీపని సుమిత్ర చూస్తుంది. సుమిత్ర దీపతో బానే మాట్లాడుతుంది. జరిగింది.. జరిగిపోయింది దాన్ని ఎవరు మార్చలేరని అంటుంది. నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లనిపిస్తుంది. కార్తీక్ ని భర్త గా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. ఇష్టం లేకుండా జరిగింది నా కూతురికి నాన్న అవ్వాలని అలా చేసాడు కానీ నాకు భర్త అవ్వాలని కాదని దీప అంటుంది. పెళ్లి అయింది.. దీన్ని ఎవరు మార్చలేరు.. ఇది నా కూతురు కోసం పూజారి ఇచ్చిన ప్రసాదం.. ఇది ఇప్పుడు నీకు అవసరం అయ్యేలా ఉందని సుమిత్ర తనకి ఇచ్చి వెళ్తుంది. పూజ ఎలా ఆపాలి.. వాళ్ళంతట వాళ్లే ఆపేలా చెయ్యాలని దీప అనుకుంటుంది. తరువాయి భాగంలో పూజ తర్వాత మమ్మల్ని ఇద్దరు ఆశీర్వాదించాలి కానీ మీరు ఒక్కరే ఉన్నారు.. శ్రీధర్ గారిని కూడా రమ్మని చెప్పాలి.. అప్పుడే ఈ పూజ జరుగుతుందని దీప కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.