Karthika Deepam2 : నాన్నగా నాతో ఉండు కార్తీక్.. దీపకి ఈ విషయం ఎలా చెప్తాడు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -178 లో... కార్తీక్ కి కాశీ ఫోన్ చేసి.. శౌర్య కన్పించడం లేదని చెప్తాడు. శౌర్య నా దగ్గరే ఉందని కార్తీక్ చేప్తాడు. అప్పుడే దీప ఫోన్ తీసుకొన..  శౌర్య మీ దగ్గరున్న విషయం చెప్పాలి కదా అని దీప అనగానే.. ఎవరికి చెయ్యాలి. నీ ఫోన్ స్విచాఫ్ వచ్చిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నేను శౌర్య దగ్గరికి వెళ్తానని కాశీకి దీప చెప్తుంది. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే.. మా ఇంటికి రా అక్క కానీ నువ్వు ఊరు వెళ్లొద్దని కాశీ అంటాడు. ప్లీజ్ కార్తీక్ అమ్మ వస్తే నన్ను ఊరు తీసుకొని వెళ్తుంది. నాకు అమ్మ కావాలి.. నువ్వు కావాలి.. ఇద్దరు నాతో ఉండాలి.. ఏం చెయ్యాలని శౌర్య అడుగుతుంది. నువ్వు నాన్నగా ఉంటే నాతో ఉంటావ్ కదా.. నా కోసం ఏదైనా చేస్తానన్నావ్ కదా.. నాన్న గా ఉండలేవా.. నాకు నీతోనే ఉండాలని ఉంది. మంచోడివి నాతో ప్రేమగా ఉంటావని కార్తీక్ పై తన ప్రేమని చెప్తుంది శౌర్య. మరొకవైపు మీ తాత మనసు మారక ముందే కార్తీక్ వాళ్ళింటికి వెళ్ళాలని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత కాంచన దగ్గరికి వెళ్లి మాట్లాడండి అని సుమిత్ర, దశరథ్ లతో శివన్నారాయణ‌ అంటాడు. నేనే వెళ్తానంటూ జ్యోత్స్న వెళ్తుంది. మరొకవైపు నరసింహ దగ్గరికి అనసుయ వస్తుంది. తనని పోలీసులకి పట్టిస్తుంది. దాంతో అనసూయని కర్రతో కొడతాడు నరసింహా. మరొకవైపు శౌర్య మాటలకి సమాధానం చెప్పకుండా వచ్చేసావ్ ఏంటని కాంచన అడుగుతుంది. అది చాక్లెట్.. బిస్కెట్.. అడుగుతలేదు.. నా జీవితం అడుగుతుందని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప వస్తుంది. శౌర్యని తీసుకొని వెళ్తానంటే..  కార్ వెనకాల పరిగెత్తి పడిపోయిందని దీప అనగానే.. హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చామని కార్తీక్ అంటాడు. లేట్ అయితే వెళ్లలేము శౌర్యని తీసుకొని వెళ్తానని దీప అంటుంటే కార్తీక్ కోప్పడతాడు. గొడవపడేలా ఉన్నారు.. శౌర్యకి ఆరోగ్యం బాలేదని వీడు చెప్పడు.. నన్ను వద్దన్నాడు.. ఇప్పుడేం చెయ్యాలని కాంచన అనుకుంటుంది. శౌర్య ఎక్కడికి రాదని దీపతో కార్తీక్ కోపంగా చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : అటు ప్రేయసి, ఇటు కసాయి తల్లి కన్నింగ్ ..  

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -229 లో.... రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. అప్పుడే నందిని వచ్చి రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవును రామలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళావా.. సర్ ప్రైజ్ ఇచ్చావా.. తను హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా అని నందిని అంటుంది. అవును నీ గురించి చెప్పు.. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లే.. నువ్వు కూడా ఎవరినైనా చేసుకోమని సీతాకాంత్ అంటాడు. లేదు నేను ప్రేమించింది ఒక్కరినే అంతే.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికి అర్ధం లేదని నందిని చెప్తుంది. ఫైల్ పై సంతకం చేయించుకొని నందిని వెళ్తుంటే.. నా మాటలతో హర్ట్ చేసుంటే సారీ అని సీతాకాంత్ చెప్తాడు.ఆ తర్వాత అభి, రామలక్ష్మిలు కలిసి ఉన్న ఫోటోని శ్రీలత తీసుకొని, శ్రీవల్లికి ఇచ్చి రామలక్ష్మి ర్యాక్ లో పెట్టమని చెప్తుంది. ఏం చేస్తున్నారని శ్రీవల్లి అడుగుతుంది. తర్వాత చెప్తానని శ్రీలత అంటుంది. శ్రీవల్లి వెళ్లి రామలక్ష్మి ర్యాక్ లో ఫోటో పెడుతుంది.ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఇలా ఉండొద్దని చెప్పాను కదా... నువ్వు ఇలా ఎందుకుంటున్నావో నాకు తెలుసని సీతాకాంత్ అనగానే నిజం తెలిసిపోయిందేమోనని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. త్వరగా వచ్చి నీతో కలిసి డిన్నర్ చెయ్యలేదని ఇలా ఉన్నావని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి నార్మల్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి కింద పడుకుంటుంది. ఎందుకు బెడ్ పై పడుకోవచ్చు కదా అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. మరొకవైపు నందిని దగ్గరికి అభిని తీసుకొని వస్తుంది హారిక. నందిని రామలక్ష్మి సీతాకాంత్ ల ఫోటోని చూపించి.. నాకు సీతా కావాలి. నీకు ఇంకా రామలక్ష్మి అంటే ప్రేమ ఉందని సీతాకాంత్ ని నమ్మించాలని అభికి నందిని డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత ఎందుకు రామలక్ష్మి ఇలా బెహేవ్ చేస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు. అప్పుడే శ్రీలత వచ్చి.. రామలక్ష్మికి చీర తీసుకొని వచ్చి ఇస్తానని అనగానే.. పడుకుందని‌ సీతాకాంత్ అంటాడు. సరే నువ్వు తీసుకొని వెళ్లి రామలక్ష్మి ర్యాక్ లో పెట్టమని శ్రీలత చెప్తుంది. దాంతో సీతాకాంత్ తన ర్యాక్ లో పెడతాడు. అప్పుడే రామలక్ష్మి, అభి ఫోటో కన్పిస్తుంది. అది చూసి ఈ ఫోటో రామలక్ష్మి చూస్తే బాధపడుతుందంటూ సీతాకాంత్ చింపేస్తాడు. అది చూసి శ్రీలత డిస్సపాయింట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం అందరు టిఫిన్ చేస్తుంటారు. సీతాకాంత్ రావడంతో.. రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకరికొకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అత్త నాటకం తెలుసుకున్న అల్లుడు.. దాంపత్య పూజ నుండి లేచి వెళ్లిపోయాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -543 లో.....కావ్య, నేను దాంపత్య పూజలో కూర్చోనని చెప్పి వెళ్తుంది. దాంతో కనకం పక్కకు వచ్చి తన నటన మొదలుపెడుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. నాకు సంతోషపడే అదృష్టం లేదు.. మీరేం చేస్తారని కనకం అంటుంది. నేను ఒప్పిస్తానంటూ కావ్య దగ్గరికి రాజ్ వెళ్తుంటే.. ఇగోకి పోకుండా కావ్యని ఒప్పుకునేలా చెయ్యమని అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు చెప్తారు. ఆ తర్వాత నీతో మాట్లాడాలంటూ కావ్యని రాజ్ పక్కకి తీసుకొని వెళ్తాడు. పూజలో కూర్చవాలని చెప్తాడు. ఏ అర్హతతో కూర్చోవాలి మీ భార్యగానా.. కనకం కూతురిగానా.. దుగ్గిరాల కోడలుగానా అని కావ్య అడుగుతుంది. నా భార్యగా కూర్చో.. మీ అమ్మ కోసమో, మా అమ్మ కోసమో కాదు..మన గురించి మన జీవితం గురించి, ఇక నేను చెప్పను నీ ఇష్టమని రాజ్ అంటాడు. అదంతా అపర్ణ, ఇందిరాదేవి, కనకంలు చూస్తుంటారు. ప్లాన్ సక్సెస్ అనుకుంటారు. ఆ తర్వాత అప్పు గదిలో ఉన్నది చూసుకోకుండా.. పెద్దమ్మ అనుకున్నది చేసిందని బంతి అంటాడు. అది అప్పు విని ఏంటి అది అని బంతిని బెదిరిస్తుంది. పెద్దమ్మ కావ్య అక్కని బావని కలపడానికి తనకి క్యాన్సర్ అని డ్రామా ఆడుతుందని చెప్తాడు. ఈ విషయం బావకి తెలిస్తే పరిస్థితేంటి.. ఎవరికీ ఈ విషయం చెప్పకంటూ అప్పు అంటుంది. అదంతా రుద్రాణి వింటుంది. ఆ తర్వాత ముగ్గురు అల్లుళ్ళు పూజలో కూర్చొని ఉంటారు. స్వప్న, అప్పులు కూర్చొని.. కావ్య కోసం చూస్తుంటారు. అప్పుడే కావ్య వచ్చి పూజలో కూర్చుంటుంది. పూజ జరుగుతుండగా. తల్లి కూతుళ్ల నటన సూపర్ అంటుంది. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక  మాట్లాడుకుందామని అపర్ణ అనగానే.. నాటకం ఇక్కడ అయితే అక్కడికి వెళ్లి ఎందుకు మాట్లాడుకోవడమని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో కనకం ఆడింది నాటకమని రాజ్ కి తెలుస్తుంది. తల్లితో కలిసి కూతురు కూడా బాగా నటించింది. ఇక జీవితంలో కావ్యని, ఆమె కుటుంబాన్ని నమ్మనని రాజ్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఫుడ్ కోసం కోసం మణికంఠని కొట్టిన పృథ్వీ!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం టాస్క్ సూపర్ గా సాగుతుంది. రోజు రోజుకి ఒక్కో కంటెస్టెంట్ యొక్క అసలు రూపం బయటకొస్తుంది‌. అందులో నేడు రిలీజ్ చేసిన ప్రోమోలో మణికంఠ అసలు స్వభావం బయటకొచ్చింది. మణికంఠ ఫస్ట్ వీక్ లో వచ్చినప్పుడు సింపథీ కార్డ్ యూజ్ చేశాడు. అది చూసి అందరు అపరిచితుడు సినిమాలో రాము క్యారెక్టర్ అనుకున్నారు. ఇక ఆ తర్వాత హౌస్ లోని ఆడాళ్ళ దగ్గర హగ్  కోసం ఎప్పుడు వేచి చూస్తుంటే రెమో అని అనుకున్నారు. కానీ నేడు విడుదల చేసిన సెకెండ్ ప్రోమోలో మణికంఠలోని అపరిచితుడు బయటకొచ్చాడు. సూపర్ ఫోన్, సూపర్ ఛార్జింగ్ టాస్క్ లో భాగంగా ఓజీ అండ్ రాయల్ క్లాన్ ల మధ్య నిన్నటి నుండి టాస్క్ సాగుతుంది. ఇక ఈ టాస్క్ లో పృథ్వీ, నిఖిల్, నబీల్ మధ్య ఫుల్ గొడవ జరిగిందని వారు ఫిజికల్ అయినట్టుగా మొదటి ప్రోమోలో తెలిస్తోంది. ఇక సెకెంఢ్ ప్రోమోలో పృథ్వీకి, మణికంఠకి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం నాకు రాదంటూ మణికంఠ.. నేనేం అడిగానంటు పృథ్వీ ఇలా ఇద్దరి మధ్య గొడవ బాగా జరిగింది. అసలు ఇది నిజమేనా లేక ఫుడ్ కోసం వీరిద్దరి కలిసి ఇలా ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. అయితే మణికంఠ టాస్క్ మొదలవ్వగానే.‌. నేను గేమ్ ఆడను..‌ మైండ్ గేమ్ ఆడతాను.. ఇలా కాళ్ళు చేతులు విరగొట్టుకోను అని అన్నాడు. ఇప్పుడేమో పృథ్వీతో గొడవేసుకున్నాడు. నేటి ఎపిసోడ్ లో‌ ఇదే హైలైట్ అయ్యేలా కన్పిస్తుంది. పృథ్వీ, మణికంఠల మధ్య జరిగిన ఈ హీటెడ్ ఆర్గుమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  

మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు

  జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో పండు డైలాగ్స్ మాములుగా లేవు. ఈ మధ్య డాన్సర్ పండు జబర్దస్త్ స్కిట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక రాబోయే వారం షోలో వర్ష - పండు కలిసి స్కిట్ చేశారు. పండు స్టేజి మీదకు వర్షాతో పాడు తెగ సిగ్గుపడుతూ వచ్చాడు. "సర్ మేము మొగుడూపెళ్లాలం సర్" అన్నాడు శివాజితో. తర్వాత వర్ష వైపు చూస్తూ "మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు" అంటూ సిగ్గుమొగ్గలవుతూ అక్కడేదో వాళ్ళ మధ్య జరగకూడనిది జరిగిపోయినట్టు బిల్డప్ ఇచ్చి మరీ అడిగాడు. "పెద్ద ఏమీ అనిపించడం లేదు" అన్నాడు. ఇక జడ్జ్ శివాజీ ఐతే "పండు సూపర్ గా ఉంది కానీ" అని ఎంకరేజ్ చేసాడు. తర్వాత వర్షని హగ్ చేసుకున్నాడు పండు గట్టిగా. దాంతో వర్ష ఒక్కసారిగా షాకయ్యింది. "బాధపడకు" అంటూ ఓదార్చబోయాడు. "ఒరేయ్ నిన్ను డాన్సర్ అన్నారు కదరా..నువ్వెంటి ఇలా చేస్తున్నావ్" అని అడిగింది "వాళ్ళు ఇచ్చే రెండు మూడు వేలకు ఇక్కడికి వచ్చాననుకున్నావా ఇలాంటి కాన్ఫెరెన్సుల కోసం వచ్చాను" అని చెప్పేసరికి శివాజీ ఐతే చప్పట్లు కొట్టేసాడు. ఇక శివాజీని పొగిడేశారు కెవ్వు కార్తీక్ - పటాస్ ప్రవీణ్. "మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కి ఒక పేరు పెట్టా" అని కెవ్వు కార్తీక్ అన్నాడు. ఏమని అని పటాస్ ప్రవీణ్ అడిగేసరికి "శివాజీ" అని చెప్పాడు. "ఎందుకు ఆ పేరు పెట్టావ్ " అని అడిగాడు ప్రవీణ్ " నిస్వార్థంగా పది మందిని పైకి తీసుకొస్తుందిగా" అందుకే అన్నాడు కార్తీక్.  

కేరళలో సోహైల్...అప్పుడప్పుడు చిన్న బ్రేక్స్ అవసరం

    బిగ్ బాస్ ద్వారా పాపులరైన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ నేమ్ ని, ఫేమ్ ని సరిగ్గా వాడుకుని కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే. అలాంటి వారిలో సయ్యద్ సోహైల్ ర్యాన్ ఉన్నాడు. బిగ్ బాస్ తర్వాత చిన్నగా హీరోగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. హీరోగా సక్సెస్ కాకపోయినా ఒక మాదిరి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి సోహైల్ కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్ గా లేదనే చెప్పాలి. ఐతే రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాడు సోహైల్. "ఒకే ఒక్క జీవితం ఉంటుంది ఎవరికైనా అందులో అడ్డంకులు, సమస్యలు ఒక భాగం. ఐనా మనం ముందుకు సాగాలి. కొన్నిసార్లు, మనల్ని మనం రీసెట్ చేసుకోవడానికి రీఛార్జ్ కావడానికి  ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ అవసరం. నా కేరళ ట్రిప్ నన్ను ఎంతో రీఛార్జ్ చేసింది. , అది నాకు అవసరమైన విరామం ఇచ్చింది.." అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇక నెటిజన్స్ ఐతే "మీరు హ్యాపీగా ఉంటె అంతే చాలు అని...సూపర్ గా ఉంది కేరళ" అంటూ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ చేతిలో ఏమి లేదా.. అంతా గంగవ్వదేనా!

  బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ తర్వాత టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. ఎవరు చెయ్యని సీక్రెట్స్.. అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ నోటి దూలవల్ల బయటపడుతున్నాయి. అయితే బట్టలు పిండుకోవడం గురించి గంగవ్వ, నబీల్ , మణికంఠ మాట్లాడుకుంటు ఉంటారు. నేను అయితే ఒకటే చీర పిండుకుంటున్నా అరేసుకుంటున్నా అని గంగవ్వ అంటుంది. అప్పుడే నేను కూడా అని మణికంఠ అనగానే.. నీకు బట్టలు రాలేదు కాబట్టి పిండుకుంటున్నావ్.. నిన్న ఫోన్ మాట్లాడంగా చూడలేదా అని గంగవ్వ అంటుంది. అంటే కంటెస్టెంట్ లు తన ఫ్యామిలీ వాళ్ళతో ఫోన్ మాట్లాడతారా అన్న డౌట్ అందరిలోను వస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో నేను ఈ వారం హౌస్ నుండి వెళ్ళిపోకుంటే నీకు తులం బంగారం ఇస్తానని గంగవ్వతో మణికంఠ అంటాడు. నువ్వు తొమ్మిదో వారం వెళ్తావని గంగవ్వ అనగానే అందరు ఒక్కసారిగా నవ్వుతారు. నువ్వు అలా అనకు అవ్వ నేను ఉండాలని మొక్కుకో అని మణికంఠ అనగానే.. నాకు మల్లన్న దేవుడు సాయం అవుతాడని గంగవ్వ అంటుంది. నేను ఇక్కడ ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు అర్థ తులం బంగారం కొనిస్తానని గంగవ్వకి మణికంఠ ప్రామిస్ చేస్తాడు. ఈ లెక్కన గంగవ్వకి బిగ్ బాస్ తనకి డబ్బులు ఇస్తాడు. దాంతోపాటు మణికంఠ ఉంటే కూడ గంగవ్వకి బంగారం వస్తుందన్న మాట. బిగ్ బాస్ హౌస్ లో ఈ సీన్ చూసిన ప్రేక్షకులు భిన్నంగా స్పందిస్తున్నారు. అంటే ఎవరు ఉండాలి.. వెళ్ళాలనేది బిగ్ బాస్ ఇష్టం కాదన్న మాట.. గంగవ్వదేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంగవ్వ గత సీజన్ లో వచ్చినప్పటి కంటే.. ఇప్పుడు చాలా వరకు ఆటలో, మాటలో మార్పు వచ్చింది. దాంతోపాటు మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే టాప్-5 లో గంగవ్వ ఉండటమనేది గ్యారంటీ.

సోనియా రీఎంట్రీ కన్ఫమ్.. అడ్డుపడుతున్న తల్లిదండ్రులు!

  బిగ్ బాస్ సీజన్-8 లో నెగెటివిటి ఎక్కువగా సంపాదించుకున్నవారిలో సోనియా ఒకరు. పృథ్వీ, నిఖిల్ లని తన మాటతో మార్చేసిన సోనియా వరెస్ట్ గేమర్ గా బయటకొచ్చింది. అయితే సోనియా ఎలిమినేషన్ కి రెండు వారాల ముందు నుండి తను ఎలిమినేట్ అవ్వాలని మొత్తం సోషల్ మీడియా కోరుకుంది. అలాగే తను ఎలిమినేషన్ అయ్యాక చాలామంది హ్యాపీగా ఉన్నామంటూ కామెంట్లు కూడా చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి సోనియా ఆకుల రీఎంట్రీ ఇవ్వబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే చాలా మంది ఇది రూమర్ మాత్రమేనని.. సోనియా వచ్చే అవకాశం లేదంటూ కొట్టిపారేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం సోనియా రీఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ఫమ్ అయిపోయిందంట. అంతేకాకుండా ఆమె ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుందనే అప్డేట్ కూడా వచ్చేసింది. బయటకొచ్చాక నాగార్జున , బిగ్ బాస్ కలిసి తనని నెగెటివ్ గా చూపించారంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన సోనియా బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రాబోతుంది. సోనియా రీఎంట్రీ ఆల్‌మోస్ట్ కన్ఫమ్ అయింది. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ సోనియాను సంప్రదించారని‌ తెలుస్తోంది. అయితే రీఎంట్రీ ఇవ్వాలా అనే విషయంపై సోనియా క్లారిటీ ఇవ్వలేదంట. ఎందుకంటే సోనియా మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని.. అందుకే సోనియా కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సోనియాతో రీఎంట్రీ ఇప్పించేందుకు బిగ్‌బాస్ టీమ్ ట్రై చేస్తుందట. అన్నీ కుదిరితే ఎనినిదో వారం చివరిలో సోనియా హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

హరితేజ చెప్పిన హరికథకి చేతులెత్తేసిన మణికంఠ!

                     బిగ్ బాస్ సీజన్-8 ఏడో వారంలో నామినేషన్ల తర్వాత అసలు సిసలు గేమ్ మొదలైంది. సీజన్-4 లో అభిజిత్, అవినాష్ ఉన్నప్పుడు జరిగిన ఛార్జెర్స్, ఫోన్స్ టాస్క్ ని రిపీట్ చేశాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో కొత్త రూల్స్ పెట్టాడు బిగ్ బాస్. ఫ్యూచర్ లో స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ చార్జర్స్ మాత్రమే ఉంటాయని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చెప్పగానే అందరు షాక్ అయ్యారు. బిగ్ బాస్ ఇక రూల్స్ చెప్పాడు. ఓవర్ స్మార్ట్ ఫోన్‌లు బతకాలంటే ఛార్జింగ్ కావాలి.. కానీ స్మార్ట్ ఛార్జెస్ ఛార్జ్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు.. అందుకే అసలు గొడవ మొదలైంది.. ఇంటిని అధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఫోన్స్‌గా రాయల్స్ క్లాన్.. గార్డెన్ ఏరియాను తమ అధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌గా ఓజీ క్లాన్ ఉంటారు. ఓవర్ స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్ సమయం గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలానే ఓవర్ స్మార్ట్ ఫోన్స్ లక్ష్యం.. బ్యాటరీ ఎంప్టీ అయి చనిపోకుండా చూసుకోవడం.. ఓవర్ స్మార్ట్ ఫోన్‌కి ఛార్జింగ్ కావాల్సి వచ్చినప్పుడు.. ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌కి ఇంటికి కావాల్సినవి అనగా కిచెన్, బాత్రూం.. లివింగ్ ఏరియా, బ్యాడ్ రూంకి సంబంధించిన ఏ వసతి అయినా ఇచ్చి వారి సాకెట్‌లో మీ ప్లగ్‌ను పెట్టి ఛార్జ్ చేసుకోవాలి.. లేదంటే మీ సొంత తెలివితేటలు వాడి కూడా పొందొచ్చు.. ప్రతి ఐదు ఫోన్స్‌కి ఛార్జింగ్ ఇచ్చిన తర్వాత ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌కి ఒక బార్ ఛార్జింగ్ తగ్గుతుంది.. టాస్కు పూర్తయ్యే సమయానికి మీ రెండు క్లాన్స్ నుంచి బతికున్న సభ్యులే మెగా చీఫ్ కంటెండర్లు అవుతారంటూ బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు. మరోవైపు సోఫాలో విష్ణుప్రియ, మణికంఠ కూర్చొని మాట్లాడుకుంటారు. టాస్కు మొదలుకాకముందే.. నేను ఫిజికల్ టాస్కు కోసం బొక్కలు ఇరగ్గొట్టుకోలేను.. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది.. నేను గాయాలతో బయటికెళ్లలేను.. నాకు హెల్త్ ఇంపార్టెంట్.. కావాలంటే బ్రెయిన్ సపోర్ట్ ఇస్తానంటూ విష్ణుప్రియతో మణికంఠ చెప్పాడు.  ఇక గేమ్ లో భాగంగా నబీల్‌  గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటే అవినాష్ సైలెంట్‌గా వెనకాల నుంచి ఛార్జ్ పెట్టేసుకున్నాడు. కానీ ఒక నిమిషం కాలేదు కాబట్టి కౌంట్ చేయలేదు బిగ్‌బాస్. ఇక రాయల్ క్లాన్ పగలగొట్టాల్సిన పాట్స్‌లో ఒక దాన్ని ఆడుకుంటూ విష్ణు పగలగొట్టేసింది. ఇక ప్రేరణ కేబుల్ లాక్కొని అవినాష్ లోపలికి వెళ్లి ఛార్జ్ పెట్టుకోబోయాడు. కానీ డ్రెస్‌కి అటాచ్ అయినప్పుడు మాత్రమే ఛార్జింగ్ కౌంట్ అవుతుందంటూ క్లారిటీ ఇచ్చాడు బిగ్‌బాస్. మరోవైపు సైరన్ అనుకొని బ్యాటరీ సౌండ్ వచ్చినప్పుడు ఆయాసంగా కుండ పగలగొట్టేసింది రోహిణి. తర్వాత మణికంఠ దగ్గరికెళ్లి ఒక స్మార్ట్ డీలింగ్ చేసుకుంది హరితేజ. నీ గురించి పొగుడుతూ హరికథ చెబుతా ఒక నిమిషం ఛార్జింగ్ ఇస్తావా అని హరితేజ అడుగగా.. నాకు నచ్చితే ఇస్తానంటూ మణికంఠ చెప్పాడు. ఇక మణికంఠ వీరుడు శూరుడు అంటూ పొగుడుతూ బాగానే హరికథ చెప్పింది. దీనికి పొంగిపోయిన మణికంఠ ఒక నిమిషం ఛార్జ్ ఇచ్చేశాడు. దీంతో హరితేజ బ్యాటరీలో ఒక పాయింట్ పెరిగింది. మరోవైపు సైలెంట్‌గా యష్మీ దగ్గర దొంగతనంగా ఛార్జ్ పెట్టుకోవడానికి ట్రై చేసింది నయని. కానీ యష్మీ కింద పడేయడంతో ఆ తర్వాత ఓజీ క్లాన్ మొత్తం వచ్చి నయనీని కిందేసి లాగేశారు. దీంతో ముఖం మీద నయనికి గీసుకుపోయింది. ఇక తర్వాత సైరెన్ సౌండ్ రాగానే కుండ పగలగొట్టడానికి తెగ ట్రై చేశారు రాయల్ క్లాన్. కానీ పృథ్వీ, నిఖిల్ స్ట్రాంగ్‌గా ఆపడంతో ఆ కుండ కాస్త కొట్టాల్సిన చోట కాకుండా బయట కొట్టేశారు రాయల్ క్లాన్. ఇలా ఈ గేమ్ ఇంకా నడుస్తోంది. అయితే ఎపిసోడ్ మొదట్లోనే గంగవ్వని రాయల్ క్లాన్ అంతా కలిసి మెగా ఛీఫ్ కంటెండర్ కోసం ఎంపిక చేశారు. ఇక మిగిలిన వారిలో మెగా ఛీఫ్ కోసం కంటెండర్స్ ఎవరు అవుతారో .. రేపటి ఆటలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.  

Karthika Deepam2 : కార్తీక్ తో పెళ్ళికి ఒప్పుకున్న ఇంటి పెద్ద.. అది జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -177 లో.. శౌర్యని‌ దీప వెతుక్కుంటూ ఉంటే.. కాశీ ఎదురు పడతాడు. దాంతో శౌర్య కన్పించడం లేదని దీప చెప్తుంది దాంతో నానమ్మ కి ఫోన్ చేసి అడుగుతాను. అక్కడికి వచ్చిందేమోనని పారిజాతానికి కాశీ ఫోన్ చేస్తాడు. శౌర్య వచ్చిందా అని అడుగుతాడు. లేదు అవుట్ హౌస్ లో ఎవరు లేరు.. ఎందుకు అడుగుతున్నావని పారిజాతం అనగానే.. తర్వాత చేస్తానంటూ కాశీ ఫోన్ కట్ చేస్తాడు. మరొకవైపు శౌర్యని కార్తీక్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు శౌర్యని చెక్ చేసిన డాక్టర్ తనకి పెద్ద డిసీస్ ఉందని చెప్తాడు. ఆ డిసీస్ కి ట్రీట్మెంట్ ఉంది రెండు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పగానే కార్తీక్ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత సుమిత్రకి కార్తీక్ ఫోన్ చేసి దీప ఇంట్లో నుండి వెళ్ళింది.‌ తనని ఎవరు ఏమన్నారో తెలియదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర కోపంగా జ్యోత్స్నని పిలుస్తుంది. ఎందుకు దీపని పంపించావని అడుగుతుంది. అవును పంపించానని జ్యోత్స్న అంటుంది. అది అత్తయ్య వాళ్ళని పూజకి పిలిచి కుటుంబాల మధ్య దూరం పెంచిందని జ్యోత్స్న అంటుంది. నాకు బావకి పెళ్లి చెయ్యండని జ్యోత్స్న అంటుంది. అది జరగదని శివన్నారాయణ అనగానే.. అయితే నేను బ్రతకను అంటు గదిలో కి వెళ్లి డోర్ వేసుకుంటుంది జ్యోత్స్న. దాంతో అందరు టెన్షన్ పడతారు. నా కూతురిని వదులుకోను.. అలాగని మీ మాట కాదనలేను.. నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి అని దశరథ్ అనగానే.. సరే అని శివనారాయణ పెళ్లికి ఒప్పుకుంటున్నానని చెప్తాడు. ఆ విషయం డాడ్ కి చేతిలో చెయ్ వేసి చెప్పండని జ్యోత్స్న అనగానే శివన్నారాయణ అలాగే మాటిస్తాడు. దాంతో జ్యోత్స్న వచ్చి డోర్ తీసి.. నేనంటే ఎంత ఇష్టం తాత అని హగ్ చేసుకుంటుంది. మరొకవైపు శౌర్యని తీసుకుని ‌కార్తీక్  ఇంటికి వస్తాడు. అక్కడ ఏదో జరిగింది. అందుకే దీప వెళ్ళిపోవాలనుకుందని కార్తీక్ కాంచనతో అంటాడు. కార్తీక్ నాకు ఒకటి కావాలి ఇస్తావా అని కాంచన అడుగుతుంది. ఏంటని కార్తీక్ అనగానే.. నాకు నాన్న కావాలి అంటుంది. మీ నాన్న గురించి తెలుసు కదా అని కార్తీక్ అంటాడు. నాన్నగా నువ్వు కావాలని శౌర్య అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడే కార్తీక్ కి కాశీ ఫోన్ చేస్తాడు. శౌర్యా కన్పించడం లేదని చెప్తాడు. శౌర్య ఇక్కడే ఉందని కార్తీక్ అనగానే దీప ఫోన్ తీసుకొని.. శౌర్య ఉందని చెప్పాలి కదా అని దీప అంటుంది. నేను ఇక్కడున్నా అని అమ్మతో చెప్పకని శౌర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఆ సాకుతో భర్తకి దూరంగా భార్య..‌ ఇదేం ట్విస్ట్ !

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -228 లో... రామలక్ష్మిపై సీతాకాంత్ చెయ్ వెయ్యగానే.. ఇబ్బందిగా తీసేస్తుంది. నాకు కొంచెం నీరసంగా ఉందని రామలక్ష్మి అనగానే.. అయ్యో నాకు చెప్పలేదని, జ్వరం కూడ వచ్చినట్లుంది హాస్పిటల్ కి వెళదామని సీతాకాంత్ అనగానే.. వద్దు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని రామలక్ష్మి అంటుంది. సరే పడుకోమని సీతాకాంత్ సోఫాపై పడుకుంటాడు. ఆ తర్వాత నందిని దగ్గరికి హారిక వచ్చి.. సీతాకాంత్ ని వదులుకోవడం ఇష్టం లేని రామలక్ష్మి తనకి నిజం చెప్తే ఎలా అని హారిక అంటుంది. అప్పుడేఅభి ఫోటోని హారికకి చూపించి.. వీడు రామలక్ష్మి మాజీ లవర్ వీడిని అడ్డుపెట్టుకుని సీతాకి రామలక్ష్మి పై డౌట్ వచ్చేలా చెయ్యాలని నందిని అంటుంది. ఫోటో పంపిస్తున్న వీడి డీటెయిల్స్ కావాలని నందిని అనగానే.. హారిక సరేనంటూ ఎవరికో ఫోన్ చేసి పంపించిన ఫోటో అతనికి డీటెయిల్స్ కావాలి అంటుంది. దాంతో అతను కాసేపటికి ఫోన్ చేసి అభి డీటెయిల్స్ పంపిస్తాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ ల ఫోటోని పట్టుకొని అభి కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు రాత్రి ఇంటికి రాలేదని సిరి అనగానే రామాలక్ష్మిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లి ఉంటాడని పెద్దాయన అంటాడు. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. నైట్ లేట్ అయింది. అందుకే అక్కడే ఉన్నామని సీతాకాంత్ చెప్తాడు. మరొకవైపు మాణిక్యం దగ్గరికి సుజాత, పింకీ వచ్చి.. పండుగ వస్తుంది. అమ్మాయిని అల్లుడుని పిలువమని అంటుంది. అల్లుడు నాపై కోపంగా ఉన్నాడు.. నువ్వు పిలువు అని సుజాతకి మాణిక్యం ఫోన్ ఇస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ ని దూరం పెట్టినందుకు బాధపడుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి రామలక్ష్మికి ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్లి రామలక్ష్మి చేసిన పని గుర్తుచేసుకొని తన మనసులో ఏదైనా ఉందేమో.. అది చెప్తే నేను బాధపడతానని చెప్పట్లేదేమో.. ఇంకెప్పుడు రామలక్ష్మి ని బాధపెట్టొద్దని అనుకుంటాడు. అప్పుడే నందిని వచ్చి.. ఏంటి రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : పడుతోంది ఓ బ్రహ్మముడి.. కలిపేనా ఆ ఇరువురిని!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -542 లో....కనకం కృష్ణమూర్తిలు ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్య తినిపిస్తారు. అలా ఒక్కొక్కరు వెళ్లి కేక్ తినిపించి ఇద్దరిని విష్ చేస్తారు. మీకు పెళ్లి అయి ఇరవై అయిదు ఏళ్ళు గడిచింది. మాకు పెళ్లి అయి యాభై సంవత్సరాలు అవుతుంది. నా పెద్ద కొడుకు పెళ్లి అయి ముప్పై సంవత్సరాలు అవుతుంది. అబ్బాయి ఒక ఇంట్లో పుడతాడు అమ్మాయి ఒక ఇంట్లో పుడుతుంది ఆ ఇద్దరి కలిసి బ్రతకడం కోసం ఒకటి అయి ఒక దగ్గరుంటారని ఇందిరాదేవి అంటుంది. రాజ్ కి అర్థం అవ్వాలని.. ఒక మూడవ వ్యక్తి మూలాన మహాలక్ష్మి వైకుంఠం వదిలి అలిగి వెళ్ళింది. భార్యభర్తల మధ్య మూడవ వ్యక్తి వస్తే గొడవలు వస్తాయని, అప్పుడే బీజం పడింది.. భార్యపై భర్తకి నమ్మకం ఉండాలి.. భర్తపై భార్యకి గౌరవం ఉండాలి.. భార్య అలిగి వెళ్ళిపోతే భర్త ఒక మెట్టు దిగి వెళ్లడంలో తప్పేం లేదు యాభై ఏళ్ళు మేమ్ కలిసున్నా.. ముప్పై ఏళ్ళు నా కోడలు కొడుకు కలిసున్నా.. పాతికేళ్ళు కనకం, కృష్ణమూర్తి కలిసున్నా.. వాళ్ళు ఆ బంధం కి ఇచ్చే విలువ ఆ బ్రహ్మముడికి ఇచ్చే గౌరవమని ఇందిరాదేవి చెప్పగానే.. అందరు క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత అపర్ణ మాట్లాడుతూ.. నా భర్త క్షమించ రాణి తప్పు చేసిన అత్తింటిని ఎప్పుడు వదలలేదని అపర్ణ కొన్ని మంచి మాటలు చెప్తుంది. ఆ తర్వాత కనకం మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేసిన నా భర్త నన్ను దూరం పెట్టలేదు.. తను బాధ్యత వహించాడని కనకం వివాహ బంధం గురించి గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత అందరూ అలా తమ ఒపీనియన్ చెప్తారు. రాజ్ కూడా కావ్య గురించి చెప్తాడు. ఆ తర్వాత కావ్య తను బాధగా తన భర్త మనసులో చోటు లేనప్పుడు బంధం గురించి నేనెలా చెప్పగలనని అంటుంది. అప్పుడే పంతులు గారు వచ్చి.. దంపత్య వ్రతానికి ఏర్పాట్లు చేసారా అని అంటాడు. ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు కూర్చొని చేస్తారని కనకం అంటుంది. ఇక్కడ దాంపత్యం బాగోలేదు.. ఇక నేనేం చేస్తానని కావ్య కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ కనకం పక్కకు వచ్చి తన నటన మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కంటతడి పెట్టిస్తున్న విష్ణుప్రియ ఎమోషనల్ స్టోరీ!

  విష్ణుప్రియ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతుంది. బిగ్ బాస్ సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చి.. మరింత క్రేజ్ సంపాదించుకుంది. మొదట పద్నాలుగు మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ఒక్క కమెడియన్ కూడా రాలేదని బిబి ఆడియన్స్ డిస్సపాయింట్ అయ్యారు. అలాంటి టైమ్ లో నేనున్నానంటూ బిగ్ బాస్ ప్రేక్షకులకు తన కామెడితో ఊరటనిచ్చింది విష్ణుప్రియ. ఏ విషయం అయిన స్పోర్టివ్ గా తీసుకుంటూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది విష్ణుప్రియ. విష్ణుప్రియ వాళ్ళ అమ్మ రీసెంట్ గా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం అడ్డుపెట్టుకొని విష్ణు సింపథీ ట్రై చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు చలాకీగా నవ్వుతు నువ్విస్తూనే హౌస్ లో ఉంటుంది. ఇక వీకెండ్ లో అయితే చెప్పనవసరం లేదు.. వారం అంతా ఒక ఎత్తు, వీకెండ్ ఒక ఎత్తు అన్నట్టుగా.. వీకెండ్ లో ఏ టాస్క్ ఇచ్చిన తనదే పై చెయ్యి అనిపించుకుంటోంది. డాన్స్ లో తనని ఎవరు బీట్ చెయ్యలేరన్నట్టు ఎప్పుడు హ్యాపీగా ఉండే విష్ణు మనసులో ఎవరికీ తెలియని బాధ కూడా ఉందని తెలుస్తుంది. అయితే తాజాగా వచ్చిన బిబి ప్రోమో లో... మీ నాన్న ఎక్కడ ఉన్నాడని విష్ణుప్రియని గంగవ్వ అడుగుతుంది. నాన్న ఊళ్ళో ఉంటారు..  అమ్మనాన్నలకి గొడవలు కాబట్టి  అమ్మ కోసం నాన్న అంటే ఎంత ఇష్టమున్నా, ఎంత మిస్ అయిన మాట్లాడట్లేదని విష్ణుప్రియ అనగానే.. గంగవ్వ ఏడ్చేస్తుంది. దాంతో గంగవ్వని విష్ణుప్రియ హగ్ చేసుకొని విష్ణుప్రియా ఎమోషనల్ అవుతుంది. విష్ణుప్రియ మనసులో ఎంత బాధున్నా అది ఎక్స్ పోజ్ చేయకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ప్రోమో చూసిన వాళ్ళంతా విష్ణుప్రియ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పృథ్వీతో విష్ణుప్రియ క్లోజ్ గా ఉంటుంది. అది స్నేహమా లేక ప్రేమనా అన్న డౌట్ అందరిలోను ఉంది. అయితే తాజాగా రిలీజైన ఈ ప్రోమోలో విష్ణుప్రియ హైలైట్ అయ్యింది. ఇక నాగ మణికంఠ, గంగవ్వ, హరితేజ, రోహిణిల మధ్య సాగిన సీక్వెన్స్ కూడా కామెడీగా ఉంది. ఇక గౌతమ్-అవినాష్ మధ్య జరిగిన నామినేషన్, పృథ్వీ-అవినాష్ మధ్య జరిగిన నామినేషన్లని స్ఫూఫ్ లాగా చేశారు. దాంతో హౌస్ మేట్స్ అంతా ఫుల్ నవ్వేసారు. అయితే ఈ ప్రోమోని బట్టి చూస్తే నేడు జరగబోయే ఎపిసోడ్ ఇటు ఎమోషనల్, అటు ఎంటర్‌టైన్మెంట్ రెండు ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ.. కమ్యూనిటీ ఓట్ల గురించి సీక్రెట్‌గా మాట్లాడుకున్న నబీల్, మెహబూబ్!

  బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఊహించనది జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులని  అలరించే ఈ షోలో ఇప్పుడు కొన్ని మతపరమైన అంశాలు తెరమీదకి వచ్చాయి. నిన్నటి ఎపిసోడ్ లో అర్థరాత్రి ముచ్చట్లలో నబీల్, మెహబూబ్ మాట్లాడుకున్న కొన్ని మాటలు వీడియోగా బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనిటీ గురించి టాపిక్ సాగడం ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది. అసలేం జరిగిందంటే నిన్న రాత్రి మెహబూబ్, నబీల్ మాట్లాడుకున్నారు. మొదటగా నబీల్ హౌస్ లోకి వచ్చాక ఎలా ఉందో.. నామినేషన్ అంటే ఎలా భయపడ్డాడో చెప్తాడు. ఆ తర్వాత మొన్న నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు అందరు మనమిద్దరం ఒకటే కమ్యూనిటీ అని అనుకునే అవకాశం ఉంది కదా.. కానీ నేను అలా చేయలేదని నబీల్ అన్నాడు. దాంతో మెహబూబ్ అవును.‌. అయిన మనకి మన(కమ్యూనిటీ) ఓట్లు పడతాయి. అయితే మనమిద్దరం ఒకేసారి నామినేషన్ లో ఉండకుంటా చూసుకోవాలని నబీల్ తో మెహబూబ్ అంటాడు. దానికి ఊ.. ఊ.. అనుకుంటూ సరే అంటాడు నబీల్. " మనమిద్దరం ఉంటే అందరికి కాంపిటీషన్ లో మనం కొంచెం వీక్ అవుతాం.. మనమిద్దరం నామినేషన్ లో ఉంటే మనకి పడే ఓట్లు డివైడ్ అవుతాయి. నువ్వైనా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలి అప్పుడే మనం సేవ్ అవుతాం " అని మెహబూబ్ అంటాడు. నబీల్ హౌస్ లో ఇప్పటి దాకా హౌస్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఎవరేం చెప్పినా వింటాడు. అందులో ఏది మంచిదో అది తీసుకొని , చెడుని అది తప్పు అని చెప్తాడు. అయితే ఈ డిస్కషన్ లో నబీల్ అవునంటూ తల ఊపడం, సరే అనడం అనేది ముమ్మాటికే తప్పే.. దీంతో అన్నీ కమ్యూనిటీలు నబీల్, మెహబూబ్ ని వ్యతిరేకించే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే నబీల్, మెహబూబ్ దీని గురించి సరైన వివరణ ఇవ్వకపోతే అసలు ఓటింగే ఉండదనేది వాస్తవం. మరి వీకెండ్ లో నాగార్జున ఈ టాపిక్ గురించి ఆరా తీస్తాడో లేదో చూడాలి.

ఏడోవారం బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్.. నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది.‌ ఇక ఇందులో ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో ఆర్గుమెంట్స్ జరిగాయి. ఒక్కో కంటెస్టెంట్ తమ డిఫెండింగ్ ని, నామినేషన్ ని చేసిన తీరుతో ఏడోవారం రసవత్తరంగా సాగింది.  గౌతమ్ కృష్ణని అశ్వత్థామ 2.0 అనొద్దని చెప్పడం, అవినాష్ ని ఇది కామెడీ షో కాదని గౌతమ్ చెప్పడం, రోహిణి పర్సనల్ గా తీస్కోవడం హైలైట్ గా నిలిచింది. యష్మీని టేస్టీ తేజ నామినేట్ చేశాడు. మీది ఫ్రెండ్ షిప్ అన్నావ్. మళ్లీ ప్రేరణని నామినేట్ చేశావ్ అంటు టేస్టీ తేజ చెప్పడంతో.. తను నాకు పది సంవత్సరాల నుండి ఏం తెల్వదు..మా మధ్య ఫ్రెండ్ షిప్ లేదంటూ యష్మీ చెప్పడం తన కన్నింగ్ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక నబీల్ చేసిన నామినేషన్ వ్యాలిడ్ అనిపించింది. గౌతమ్ ఆటతీరు బాలేదంటూ చెప్పిన రీజన్స్ సరిగ్గా సరిపోయాయి. ఇక పృథ్వీని గంగవ్వ నామినేట్ చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్- పృథ్వీల మధ్య జరిగిన గొడవ పూర్తిగా పర్సనల్ అయిపోయింది. ఇక అంత గొడవపడి అవినాష్ ని నామినేషన్ లోకి తీసుకురాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ మామ. ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు.. గౌతమ్, పృథ్వీ, నిఖిల్ మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, ప్రేరణ, అవినాష్. అయితే రాయల్స్ మీ దగ్గర మీరు గెలుచుకున్న ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది.. దాన్ని మీరు వినియోగించుకోవచ్చు.. దాని ద్వారా నామినేషన్స్‌లో ఉన్న వారిని ఒకరిని సేవ్ చేయొచ్చు కానీ దానికి బదులుగా మీరు ఒకరిని స్వాప్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఆ షీల్డ్‌ను గంగవ్వ-అవినాష్ కలిసి గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవినాష్ ఆ పవర్‌తో తనని సేవ్ చేసుకొని ఆ ప్లేస్‌లో హరితేజను స్వాప్ చేశాడు. దాంతో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, మణికంఠ, యష్మీ, టేస్టీ తేజ, ప్రేరణ, నబీల్, హరితేజ ఈ వారం నామినేషన్లో ఉన్నారు. మరి వీరిలో మీ ఓటు ఎవరికి? ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటకి వస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఈ వారం యష్మీ గౌడ ఎలిమినేషన్.. కారణం టేస్టీ తేజ

  బిగ్ బాస్ హౌస్ లో మల్టీ టాలెంటెడ్ భామ ఎవరంటే ఠక్కున యష్మీ పేరు చెప్తారు. అందంతో పాటు అగ్రెసివ్.. సెల్ఫిష్.. కన్నింగ్.. స్ట్రాటజీ.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరు తనని చూసి సాఫ్ట్ గా ఉందనుకున్నారు కానీ నామినేషన్ వస్తే గాని తెలియలేదు ఈ అమ్మడు నిజస్వరూపం. హౌస్ లో చాలా మందికి యష్మీ అంటే నచ్చదు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఏనిమిది మందిలో దాదాపు ఏడుగురు యష్మీనే నామినేట్ చేసారు. అందరు కూడ యష్మీ హౌస్ మేట్స్ తో రూడ్ బిహేవియర్ గా ఉంటుందంటూ మళ్ళీ రెచ్చగొట్టేలే తన చేష్టలు ఉంటాయంటు ఒక నెగటివ్ ఉంది. తనకి నచ్చిన వాళ్ళు గెలిస్తే ఒకరకంగా.. నచ్చని వాళ్ళు ఓడిపోతే ఇంకా వాళ్ళని పోక్ చేసేలా బెహేవ్ చేస్తుంది. దాంతో ప్రేక్షకులకు సైతం యష్మీ బిహేవియర్ నచ్చలేదు. మధ్యలో రెండు వారాలు బానే ఉన్నా నామినేషన్ వచ్చేసరికి.. ఏదో శక్తి పూనుకున్నట్లు చేస్తుంటుంది. అయితే నామినేషన్ లో యష్మీని టేస్టీ తేజ నామినేట్ చేసాడు. తేజ యష్మీ డ్యూయల్ రోల్ గురించి చక్కగా ఎక్స్ ప్లెయిన్ చేశాడు. దాన్ని కవర్ చెయ్యడానికి ఈ భామ ఏడుపు మొదలు పెట్టింది. అయితే ఎప్పటినుండో యష్మీ పై నెగటివ్ ఉన్న ప్రేక్షకులు గత వారంలో తన కన్నా వీక్ కంటెస్టెంట్ ఉండడం వల్ల.. తను నెట్టుకొచ్చింది. అయితే ఇప్పుడున్న నామినేషన్ లో దాదాపు అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నిర్ణయం ప్రేక్షకుల చేతిలో ఉంది. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అవకాశం ప్రేక్షకులకు రానే వచ్చింది. యష్మీ ని సేవ్ చేస్తారో లేకపోతే ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని ఉంచేస్తారో చూడాలి మరి.  

నీ భార్య రావల్సింది నువ్వెందుకు వచ్చావ్.. పృథ్వీ వరెస్ట్ బిహేవియర్!

  బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఈ సీజన్ లో ఇదే హై ఓల్టెజ్ నామినేషన్ అని చెప్పొచ్చు. పృథ్వీ అవినాష్ ని నామినేట్ చేశాడు. అప్పుడు హ్యట్ హరితేజ దగ్గర ఉంటుంది. నువ్వు నన్ను బయట చూసి వచ్చి నేను గేమ్ ఆడట్లేదని లాస్ట్ వీక్ నామినేట్ చేసావ్. అందుకే ఇప్పుడు నిన్ను నామినేట్ చేస్తున్నానని పృథ్వీ అంటాడు. సీరియస్ గా చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్ లు మాత్రమే చూసాను.. షూటింగ్ బిజీ లో చూడలేకపోయానని అవినాష్ అంటాడు. కానీ నా భార్య రోజు చూసేది.. తనని అడిగాను.. ఎవరు... ఏంటని అవినాష్ అనగానే.. మీ భార్యనే రావచ్చు కదా.. నువ్వు ఎందుకు వచ్చావంటూ పృథ్వీ పొగతుగా అనేసరికి.. భార్య గురించి మాట్లాడకంటూ అవినాష్ సీరియస్ అయ్యాడు. నువ్వు అంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు రావడం.. తానే రావొచ్చు కదా అని పృథ్వీ అంటాడు. అంటే ఒక ఆడియన్ గా తన ఒపీనియన్ తెలుసుకోవాలి కదా.. కీ పాయింట్స్ అడిగి తెలుసుకున్నానని అవినాష్ అంటాడు. నువ్వు ఎపిసోడ్ లు చూడకుండా వచ్చి నేను గేమ్ ఆడలేదని ఎలా నామినెట్ చేసావ్ రా అని పృథ్వీ అనగానే.. రా అనకు అంటూ అవినాష్ సీరియస్ అవుతాడు. వాడు వీడు అంటూ పృథ్వీ కోపంగా మాట్లాడతాడు. అలా మాట్లాడకు సంస్కారం నేర్చుకోమని అవినాష్ టంగ్ స్లిప్ అవ్వకుండా మాట్లాడతాడు. ఆ తర్వాత అవినాష్ చేతులు కట్టుకొని.. ప్లీజ్ పృథ్వి నన్ను అలా వాడు వీడు అనకు అంటూ అవినాష్ అడుగుతాడు. ఇలా చెప్తే వింటారా అని అవినాష్ అనగానే.. హ వింటాను.. ఇక అననులే అంటు పృథ్వీ పొగరుగా మాట్లాడతాడు. అవినాష్ ని వాడు వీడు అంటుంటే హౌస్ మేట్స్ అందరు పృథ్వి ఆలా మాట్లాడకని అంటారు. ఆ తర్వాత పృథ్వీ పాయింట్ వ్యాలిడ్ గా ఉంది.. వాడు వీడు అనడం తప్పు కానీ మీరు మీ భార్య చేపిన దాన్ని పట్టుకొని వచ్చి నామినేట్ చెయ్యడం కరెక్ట్ కాదని అవినాష్ ని హరితేజ అంటుంది. మీరు అన్ని ఎపిసోడ్ లు చూసారా అని అవినాష్ అనగానే.. చూసానని హరితేజ అంటుంది. అయితే పృథ్వీ ఏ గేమ్ బాగా ఆడాడంటూ అవినాష్ అడగగా.. నాకు గుర్తు లేదని హరితేజ అంటుంది. మీరు నాతో కొన్ని ఎపిసోడ్ లు మాత్రమే చూసానని అన్నారని రోహిణి అవినాష్ లు అంటారు. అయిన కూడా పృథ్వీ పాయింట్ వ్యాలిడ్ గా ఉందని అవినాష్ ని నామినేట్ చేస్తుంది హరితేజ. అయితే అవినాష్ దగ్గర నామినేట్ స్టార్ ఉండడంతో అది యూజ్ చేసీ సేవ్ అయి ఇంకొకరి స్వాప్ చెయ్యాలి.. అవినాష్ సేవ్ అయి హరితేజ  ని స్వాప్ చెయ్యడంతో హరితేజ నామినేట్ అవుతుంది.  

ప్రేరణ నా ఫ్రెండ్ కాదు.... ఇది ఇంత లేటుగానా చెప్పాల్సింది!

  బిగ్ బాస్ లో నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. సోమవారం రోజు కొంతమంది నామినేట్ కాగా మిగతా హౌస్ మేట్స్ ని మంగళవారం నాటి ఎపిసోడ్ లో చేశారు. అయితే ఈ వారం నామినేషన్ రసవత్తరంగా సాగింది. నామినేషన్ కంటే ముందు ఈ వారం ప్రేరణని నామినేట్ చేస్తానని యష్మీ.. ఇద్దరు, ముగ్గురు హౌస్ మేట్స్ తో డిస్స్కస్ చేసింది. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే ముందు వెళ్లి హ్యట్ పట్టుకుంటారో వాళ్ళకి ఇద్దరిలో ఎవరివి వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే వాళ్ళని సెలక్ట్ చేసుకోవాలి. ఇంకా హ్యట్ తీసుకున్న వారిని నామినేట్ చెయ్యకూడదు. అయితే ప్రేరణ హరితేజ ఇద్దరు హ్యట్ తీసుకుంటున్నారు‌. ప్రేరణకి హెల్ప్ చెయ్యాలని యష్మీ ట్రై చేస్తుంది. అయితే హ్యట్ ఒకసారి పృథ్వి తీసుకొని.. హరితేజకి ఇవ్వగా యష్మీ ఏడుస్తుంది. దాంతో యష్మీని టేస్టీ తేజ నామినేట్ చేస్తాడు. నువ్వు ప్రేరణని నామినెటే చేస్తానని చెప్పావ్ కానీ ఇప్పుడు ప్రేరణ నామినేషన్ లోకి రావద్దని అనుకుంటున్నావు.. ఏడుస్తున్నావ్.. ఎందుకు ఒక ఫ్రెండ్ షిప్ మాస్క్ వేసుకోవడమని తేజ అంటాడు. ఒకరిని ఫ్రెండ్ అనుకుంటే నామినేషన్ చెయ్యరు ఎందుకంటే నామినేషన్ అనేది వాళ్ళని హౌస్ నుండి బయటకు పంపించాడానికే కదా అని తేజ అంటాడు. నాకు ప్రేరణ ఒక పది సంవత్సరాల నుండి ఏం ఫ్రెండ్ కాదు బెస్ట్ ఫ్రెండ్ కాదు.. అసలు ఫ్రెండ్.. కాదు యాక్షన్ రూమ్ లో ఫ్రెండ్ ఎవరని అడిగితే కూడా నేను తన పేరు చెప్పలేదు. మీరు ఫ్రెండ్ టాగ్ లైన్ యూజ్ చెయ్యకండి అని తేజపై యష్మీ అరుస్తుంది. ఆ తర్వాత ఇద్దరి నామినేషన్ ల రీజన్ విన్న హరితేజ‌‌.. తేజ ది వాలిడ్ అనిపించింది. ఫ్రెండ్ అని చెప్పి అలా చెయ్యడం కరెక్ట్ కాదని, అది నాకు నచ్చలేదని తేజ నామినేషన్ ని హరితేజ కన్సిడర్ చేస్తుంది.  ఆ తర్వాత ఇంకొకరి నామినేషన్ లో నేను మాట్లాడొచ్చా అంటూ ప్రేరణ కలుగుజేసుకొని మాట్లాడుతుంది. ప్లీజ్ యష్మీ ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడకండి. తను నాకు ముందే చెప్పింది సిచువేషన్ వస్తే నా గేమ్ నేను ఆడుతానని చెప్పింది కాబట్టి నేను తనని అర్థం చేసుకున్నానని ప్రేరణ అనగానే ఈ విషయం ఆ నామినేషన్ అప్పుడే చెప్తే నా ఆలోచన వేరే విధంగా ఉండేది కదా ఇప్పుడు చెప్పావ్.. ఆల్రెడీ యశ్మీ నామినేట్ అయ్యాక చెప్పావ్.. టూ లేట్ అని హరితేజ అంటుంది. ఇదేం ట్విస్టో ఏమో.. ప్రేరణ కోసం నిలబడ్డ టేస్టీ తేజ, హరితేజలు రాంగ్ అంటూ ప్రేరణ అనడంతో హౌస్ అంతా షాక్ అయ్యారు.  

Karthika Deepam2 : శౌర్యకి సీరియస్.. కార్తీక్ కాపాడగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. (karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -176 లో.. దీపని జ్యోత్స్న అందరి ముందు తిడుతుంది. నువ్వు నన్ను నా బావని విడదియ్యడం కోసమే ఇక్కడికి వచ్చావ్.. నా బావ కోసమే ఈ ఇంట్లో ఉంటున్నావని దీప గురించి తప్పుగా మాట్లాడుతుంటే దీప జ్యోత్స్న చెంపపగులగొడుతుంది. నన్నే కొడుతావా అని జ్యోత్స్న అనగానే.. కొట్టడం కాదు చెప్పుతో కొట్టాలని దీప అంటుంది. అసలు నీకేం కావాలి.. ఏం చేస్తే ఇలాంటివి మాట్లాడవని దీప అనగానే.. నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోమని జ్యోత్స్న అంటుంది. దాంతో సరే అంటూ దీప కోపంగా ఇంటికి వెళ్తుంది. దీని కోపం చూస్తుంటే ఇంట్లో నుండి వెళ్లేలా ఉంది. ఈ చెంప బావ కొట్టాడు.. ఈ చెంప ఇది కొట్టింది.. ఎవరితో అయిన చెప్తే పరువు పోతుంది.. ఛీ అందరితో దెబ్బలు తింటున్నానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత దీప ఇంటికి వచ్చి బట్టలు సర్దుకొని శౌర్యని తీసుకొని వెళ్తుంటే.. అమ్మ కార్తీక్ కి చెప్తానని ఫోన్ తీసుకుంటుంది. వద్దని దీప తీసుకోబోతుంటే ఫోన్ కిందపడిపోతుంది. ఆ తర్వాత శౌర్యని తీసుకొని దీప వెళ్తుంటే.. పై నుండి జ్యోత్స్న, పారిజాతంలు చూస్తారు. ఇప్పుడు అది వెళ్లడం కరెక్ట్ కాదని పారిజాతం అంటుంది. అయిన పర్లేదు అది వెళ్ళాలని జ్యోత్స్న కోపంగా అంటుంది. దీప బస్ కోసం చూస్తుంటే దీపకి తెలియకుండా.. శౌర్య కార్తీక్ ఇంటికి వెళ్తుంది. దాంతో శౌర్య గురించి దీప వెతుకుతుంది. కార్తీక్ ఇంటికి శౌర్య వస్తుంది. కార్తీక్ వెళ్లడం చూసి కార్ వెనకాలే పరుగెడుతుంది. మరొకవైపు శౌర్య కోసం దీప కాంచన దగ్గరికి వస్తుంది. శౌర్య రాలేదని తెలిసి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్య రావడం చూసిన కార్తీక్ కార్ ఆపుతాడు. అప్పుడే శౌర్య కింద పడిపోతుంది. వెంటనే కార్ లో శౌర్యని పడుకోబెట్టుకొని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు దీప శౌర్య గురించి చూస్తూ వెళ్తుంటే కాశీ ఎదరుపడతాడు. ఏమైంది అక్క అని అడుగగా.. శౌర్య కన్పించడం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.