హౌస్ లో కన్నడ బ్యాచ్ గ్రూపిజం.. అతనొక్కడే ఒంటరి పోరాటం!

  బిగ్ బాస్ సీజన్-8 పదో వారం టాస్క్ లతో మొదలైంది. హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాక చాలా రోజుల పాటు గ్రూప్ లుగా గేమ్ ఆడారు. ఓజీ, రాయల్స్ గా ఉన్న కంటెస్టెంట్స్ ప్రస్తుతం ఒక్కటే క్లాన్ అని బిగ్ బాస్ క్లాన్ మాత్రమే అని బిగ్ బాస్ చెప్పాడు కానీ హౌస్ లో అలా ఏం కన్పించడం లేదు. రెండు, మూడు గ్రూప్ లుగా ఫామ్ అయినట్టుగా అనిపిస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు కన్నడ బ్యాచ్ ఒకవైపు మిగతా వాళ్లంతా ఒక వైపు ఉండేది. ప్రస్తుతం హౌస్ లో కన్నడ బ్యాచ్ లో నబీల్ ఆడ్ అయ్యాడు. మరొకవైపు రోహిణి, అవినాష్, టేస్టీ తేజ ఒక గ్రూప్..  గౌతమ్ ఒక్కడు మాత్రం సింగల్ గా గేమ్ ఆడుతున్నాడు. యష్మీ తో క్రష్ అనడం.. మళ్ళీ అక్క అనడం అదంతా మనసు లో పెట్టుకుని.. కన్నడ బ్యాచ్ మొత్తం గౌతమ్ ని దూరం పెట్టింది. నిన్న జరిగిన ఓ టాస్క్ లో అది బయటపడింది. గౌతమ్-నబీల్ మధ్య టాస్క్ ఆడుతుంటే అందరు నబీల్.. నబీల్.. అలా ఆడు.. ఇలా ఆడు అంటూ అతనొక్కడికే సపోర్ట్ చేస్తుంటారు. గౌతమ్ కి ఎవరు సపోర్ట్ చెయ్యడం లేదని ఇది చూస్తే తెలుస్తోంది. ఇక హరితేజ, విష్ణుప్రియ విషయానికి వస్తే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటున్నారు. అలాగే నబీల్ పృథ్వీ, యష్మీ లు గేమ్ ఇలా ఆడాలి.. అలా ఆడాలంటూ మంతానాలు చేసున్నారు. ఇలా కన్నడ బ్యాచ్ అంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడుతుంటే వీకెండ్ లో నాగార్జున వీళ్ళకి వార్నింగ్ ఇస్తాడనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈ దేశానికి వెన్నుముక

  నటి మాధవి ఇటీవలి కాలంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుతూ జనాల్ని ఇన్స్పైర్ చేస్తోంది. అలాంటి మాధవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది. పిఠాపురంలో జరిగిన సమావేశంలో హోమ్ శాఖ మంత్రి అనితను ఉద్దేశించి బాగా పని చేయాలని చెప్పడం తనకు ఎంతో నచ్చిన అంశం అని చెప్పింది. ఆయన తలుచుకుంటే హోం శాఖ తీసుకోవడం పెద్ద లెక్క కాదు అని చెప్పారు. హోమ్ మినిస్టర్ ఇంకా బాగా పని చేయాలని, పోలీసులకు ఇంకా ఎక్కువగా పవర్స్ ఇవ్వాలి అని చెప్పడం మంచి విషయం అన్నారు. తన సొంత పార్టీని కూడా క్రిటిసైజ్ చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశం అన్నారు. ఎందుకంటే వేరే పార్టీలని అనడం ఈజీనే కానీ సొంత పార్టీ నేతల గురించి మాట్లాడేంత సాహసం ఎవరూ చేయరు కానీ పవన్ కళ్యాణ్ అది చేశారు అంది మాధవి. అంటే సొంత పార్టీని సెల్ఫ్ క్రిటిసిజమ్ చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ లోపల్లోపల మాట్లాడుకోకుండా ప్రెస్ మీట్ లో అంత గట్టిగా చెప్పడం తనకు ఎంతో నచ్చింది అన్నారు మాధవి. అవసరమైతే హోమ్ శాఖ తీసుకుంటాను , యోగి ఆదిత్యనాథ్ లా చేస్తాను అన్నారు కానీ సొంత పార్టీ వాళ్ళను ఆయన తిట్టనే లేదు అని చెప్పింది మాధవి. రేప్ చేయాలనుకున్న వాడు గత ప్రభుత్వాన్ని చూసి చేస్తాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. నేరస్తుడిని నేరస్తుడిలానే చూడాలి అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆహ్వానించదగ్గవి అని చెప్పింది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈ దేశానికి వెన్నుముక అంటూ చెప్పింది మాధవి.

హౌస్ అంతా నబీల్ కే సపోర్ట్.. గంగవ్వ మాత్రం!

  బిగ్ బాస్ సీజన్-8 అప్పుడే పదో వారంలోకి అడుగుపెట్టింది. ట్విస్టులు రోజు రోజుకి మాములుగా ఉండడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ మూడు సూట్ కేసు లు పెట్టి ఎవరు నన్ను పట్టుకుంటారని సూట్ కేసు పై రాసి ఉంచారు. మొదట ఎవరు ఆ సూట్ కేసుని పట్టుకొనే దైర్యం చెయ్యలేదు. కానీ ముగ్గురు మాత్రం ముందుకు వచ్చారు. మిగతా హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళకి ఏదో ఫిట్టింగ్ ఉంటుందని సంబరపడిపోతుంటారు. కానీ ఆ ముగ్గురిని డైరెక్ట్ గా మెగా చీఫ్ కంటెండర్స్ గా అనౌన్స్ చేసాడు బిగ్ బాస్. దాంతో సూట్ కేసులు తీసుకున్న పృథ్వీ, నబీల్, రోహిణి ఫుల్ ఖుషి కానీ మిగతా హౌస్ మేట్స్ మొహాలు మాత్రం మాడిపోయాయి. ఆ తర్వాత గేమ్ మొదలైంది. సూట్ కేసు తీసుకున్న వాళ్ళు కాకుండా సమయానుసరం బజర్ మోగగా ఒక టాస్క్ జరుగుతుంది. అక్కడ ఓ గంట ఉంది. దానిని ముందు వెళ్లి పట్టుకున్న వాళ్ళు సూట్ కేసు పట్టుకున్న వాళ్ళ తో పోటీ పడాలని బిగ్ బాస్ చెప్తాడు. అలా మొదటగా రోహిణితో హరితేజ పోటీపడగా రోహిణి విన్ అవుతుంది. సూట్ కేసు లో ఉన్నా అమౌంట్ ప్రైజ్ మనీకి ఆడ్ అవుతుంది. దానితో పాటుగా రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అవ్వడంతో పాటు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చి డైరెక్ట్ మెగా చీఫ్ కంటెండర్ ని చేస్తుంది. అలా సెకెండ్ టాస్క్ లో గౌతమ్ గంట పట్టుకొని నబీల్ ని సెలక్ట్ చేసుకుంటాడు. ఒక గంగవ్వ తప్ప అందరూ కూడ నబీల్ కి సపోర్ట్ చేస్తుంటారు. గేమ్ ఆడుతూనే నాకు ఎవరైన సపోర్ట్ చెయ్యండి అంటూ గౌతమ్ అడుగుతాడు. ఆ గేమ్ లో నబీల్ గెలుస్తాడు. తన సూట్ కేసు లోని అమౌంట్ ప్రైజ్ మనీకి ఆడ్ అవుతుంది. నబీల్ మెగా చీఫ్ కంటెండర్ అవుతాడు. అలాగే తన సూట్ కేసు యష్మీ కి ఇచ్చి.. తనని మెగా చీఫ్ కంటెండర్ ని చేస్తాడు నబీల్. కాసేపటికి గంగవ్వ దగ్గరికి గౌతమ్ వెళ్లి మాట్లాడతాడు. అందరు నబీల్ కే సపోర్ట్ చేశారు కానీ నా సపోర్ట్ నీకే అని గంగవ్వ అంటుంది. నాకు నువ్వు ఉంటే చాలు.. ఎవరు సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు. ఇంకా బిగ్ బాస్ చాలా అవకాశం ఇస్తాడని గంగవ్వతో గౌతమ్ చెప్తాడు.  

Karthika Deepam2 : రిసెప్షన్ కోసం విశ్వప్రయత్నం.. నచ్చదంటూ దీప పంతం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -194 లో.....దీపని రిసెప్షన్ కి ఎలా ఒప్పించాలని శౌర్య ఆలోచిస్తుంది. పక్కనే కాంచన అనసూయ ఇద్దరు ఉంటారు. శౌర్యకి చాక్లెట్ ఇస్తూ.. ఇప్పుడు ఆలోచన వచ్చిందా అంటూ కాంచన అడుగుతుంది. రెండు, మూడు చాక్లెట్ లు ఇవ్వగానే ఐడియా వచ్చిందంటూ దీప దగ్గరికి శౌర్యా వెళ్లి.. మా ఫ్రెండ్స్ అందరికి నాన్నని పరిచయం చేయాలి కదా అందుకే మీరు రిసెప్షన్ చేసుకోండి అని శౌర్య అంటుంది. దాంతో శౌర్యపై కోప్పడి పంపిస్తుంది దీప. అప్పుడు కాంచన అనసూయ ఇద్దరు వచ్చి అది అన్న దాంట్లో తప్పేముందని అంటారు. అప్పుడు కార్తీక్ బాబు ఫ్రెండ్స్ ఏమన్నారో మర్చిపోయారా.. అప్పుడు ఇద్దరే అన్నారు రిసెప్షన్ చేస్తే అందరు అంటారని దీప అంటుంది. ఆ తర్వాత ఎలాగైనా రిసెప్షన్ కి దీపని మనమే ఒప్పించాలని అనసూయ, కాంచన లు అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ వాకింగ్ కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ తో శౌర్య గురించి మాట్లాడతాడు. రిపోర్ట్స్ రావడానికి టైమ్ పడుతుంది కానీ శౌర్య హ్యాపీగా ఉండేలా చూసుకోండి అని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు దీపతో మాట్లాడడానికి వస్తారు. లోపలికి వెళ్తే గొడవ అవుతుందని దీపకి పారిజాతం ఫోన్ చేస్తుంది. శౌర్యా లిఫ్ట్ చేసి దీపకి ఇస్తుంది. బయటే ఉన్నాం.. మాట్లాడాలి రా అని పారిజాతం అనగానే దీప బయటకు వస్తుంది. దీప పొగరుగా మాట్లాడుతుంటే మెడలో తాళి పడేసరికి వంటమనిషి కాస్త ఇంటిమనిషి అయింది. ఇంకేంటి రిసెప్షన్ కూడా చేసుకుంటున్నావ్.. కాపురం కూడా చెయ్ అంటు జ్యోత్స్న అనగానే.. కొడితే గేట్ ముందు పడతావంటూ దీప అంటుంది‌. నా మనవరాలిని అంటావా అని పారిజాతం అనగానే.. మిమ్మల్ని కూడా అంటానని దీప అంటుంది. నేను రిసెప్షన్ చేసుకుంటున్నానని ఎవరు చెప్పారు. నాకు ఇష్టం లేదు. ఇదంతా భరిస్తుంది నా కూతురు కోసం మాత్రమే అని దీప అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటారు. వాళ్ళని సంతోషంగా ఉండనివ్వొద్దని జ్యోత్స్న అనగానే అప్పుడే సుమిత్ర వచ్చి.. ఎక్కడికి వెళ్లారని అంటుంది. దీప దగ్గరికి రిసెప్షన్ వద్దని చెప్పడానికి అని జ్యోత్స్న అంటుంది. వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలని సుమిత్ర అంటుంది. కాదు ఇప్పుడు బావ నా భర్త.. వాళ్ళది పెళ్లి కాదని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. కోడలికి అగ్నిపరీక్ష కానుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -245 లో... అభికి రామలక్ష్మి వార్నింగ్ ఇవ్వాలని వెళ్తుంది కానీ అభి మాత్రం తన ప్లాన్ ప్రకారం తనని ఫాలో అవుతూ వస్తుందని గెస్ చేస్తాడు. అలాగే రామలక్ష్మి వస్తుంది. ఇక అభి ఇంటిదగ్గరే డిటేక్టివ్ అభి కోసం వెయిట్ చేస్తుంటే అభి వస్తాడు.‌తన వెనకాలే రామలక్ష్మి వస్తుంది. ఎందుకు మళ్ళీ వచ్చావ్ కావాలని ఇదంతా చేస్తున్నావంటూ రామలక్ష్మి అభితో గొడవపడుతుంది కానీ దూరం నుండి వాళ్లు మాట్లాడుకోవడం డిటేక్టీవ్ చూస్తాడు. ఆ విషయం సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్పాలని ఫోన్ చేస్తాడు. ఏదో చెప్తూ డిటేక్టివ్ ఫోన్ కట్ చేస్తాడు. అది సీతాకాంత్ కి ఏం అర్ధం కాదు. అప్పుడే రామలక్ష్మికి మత్తు ఇవ్వాలని అభి అనుకొని తనని పట్టుకుంటాడు. ఇదంత అభిగాడు కావాలని చేస్తున్నాడేమో మేడమ్ ని కాపాడాలనుకోని అభి దగ్గరికి డిటెక్టివ్ వెళ్లి గన్ పెట్టి.. మేడమ్ మీరు వెళ్ళండి అని పంపిస్తాడు. రామలక్ష్మి వెళ్ళిపోయాక అభి డిటేక్టివ్ ని బంధీస్తాడు. తన చేతిలో ఉన్న కెమెరాని లాక్కొని నన్నే పట్టించాలని చూస్తావా అని అనుకుంటాడు.ఆ తర్వాత నందినికి అభి ఫోన్ చేసి రామలక్ష్మి తప్పించుకుందని జరిగింది చెప్తాడు. ఆ తర్వాత నందిని టెన్షన్ పడుతుంటే.. ఇప్పుడు రామలక్ష్మి వెళ్లి అభి గురించి సీతాకాంత్ కి చెప్తే.. ఆ అభి గాడు అంతా నువ్వే చేసావని చెప్తాడమోనని హారిక అంటుంది. అలా జరగకూడదు నేను అనుకున్నది జరగాలని నందిని అంటుంది. మరొకవైపు ఇదంతా అత్తయ్య వాళ్ళు నన్ను సీతాకంత్ సర్ ని విడగొట్టాలని చేస్తున్నారా అని రామలక్ష్మి అనుకుంటుంది. వెంటనే వెళ్లి సీతా సర్ కి చెప్పాలి అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఎందుకు అభి గురించి రామలక్ష్మి చెప్పడం లేదని కోపంగా ఉంటాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం శ్రీలతకి చెప్తుంది నందిని. ఇప్పుడు రామలక్ష్మి వస్తే.. జరిగింది చెప్తే పరిస్థితి ఏంటని శ్రీలత టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఫోన్ స్విచాఫ్ వస్తుందని అనుకుంటాడు. అప్పుడే ఒక కొరియర్ వస్తుంది. అందులో అభి రామలక్ష్మి ఫోటో ఉంటుంది. అవి చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. పెద్దాయన చూసి అలా చూసి ఒక అంచనాకి రాకూడదని చెప్తాడు. మీ కంటే ఆ అభి ఎక్కువనా అన్నట్లు శ్రీవల్లి, శ్రీలత నెగెటివ్ గా మాట్లాడి రామలక్ష్మిపై సీతాకాంత్ కి డౌట్ వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కళ్యాణ్ గురించి అనామిక... దుగ్గిరాల కుటుంబం చూడనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -559 లో....ఎందుకు కళ్యాణ్ పై డాక్యుమెంటరీ తీస్తున్నావని అనామికని సామంత్ అడుగుతాడు. దుగ్గిరాల వారసుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దాంతో ఇంట్లో వాళ్ళు గేంటెస్తే ఆటో నడిపి జీవనం కొనసాగిస్తున్నాడంటూ టీవీలో వచ్చేలా చేస్తే అప్పుడు వాళ్ళ పరువు పోతుందని అనామిక అంటుంది. నువ్వు వాళ్ళ కంపెనీకి నష్టం చేస్తాను అన్నావని సామంత్ అంటాడు. మనం ఒక సామ్రాజ్యo కావాలి అనుకుంటున్నాం.. అందుకు ఒక యుద్ధమే చెయ్యాలని అనామిక అంటుంది. అందులో నేను చావకుండా ఉంటే చాలని సామంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరికి వచ్చి.. వద్దని అనుకొని వెళ్లిన క్లయింట్స్ అందరిని కావ్య మళ్ళీ వచ్చేలా చేసి అగ్రిమెంట్ పెట్టుకుందని చెప్తుంది. ఈసారి ఎప్పటిలాగే దీపావళికి ఎంప్లాయిస్ కి బోనస్ ఇవ్వాలి కదా.. ఇప్పుడు మనం కావ్య చేత ఇప్పిద్దామని ఇందిరాదేవి అనగానే మంచి ఆలోచన అని సీతారామయ్య అంటాడు.‌ఆ తర్వాత ఇద్దరు హాల్లోకి వెళ్లి అందరికి ఈ విషయం చెప్తారు. అందరు ఆలోచన బాగుందని అంటారు. ఒక రుద్రాణి, ధాన్యలక్ష్మి తప్ప నా కొడుకు గురించి ఎవరు పట్టించుకోవడం లేదని ధాన్యలక్ష్మి అనగానే.. ఎందుకు పట్టించుకోవడం లేదు తీసుకొని వచ్చాం.. నువ్వే అవమానించి పంపించావ్.. ఇప్పుడు తీసుకొని వచ్చే బాధ్యత నీదే అని ఇందిరాదేవి అనగానే ప్రకాశ్ ధాన్యలక్ష్మిని తీసుకొని అప్పు, కళ్యాణ్ ల దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత కావ్యని ఒప్పించడానికి ఇందిరాదేవి వెళ్తుంది. కావ్య ఇందిరాదేవిని చూసి ప్రేమగా దగ్గరికి వస్తుంది. దీపావళికి ఇంటికి రావాలి.. బోనస్ నీ చేతుల మీదగా ఇవ్వాలనుకుంటున్నామని ఇందిరాదేవి అనగానే.. రానని కావ్య అంటుంది. ఆ తర్వాత కనకం, ఇందిరాదేవిలు కావ్య ని ఒప్పిస్తారు. మరొకవైపు ధన్యలక్ష్మి ప్రకాష్ లు అప్పు, కళ్యాణ్ ల దగ్గరికి వెళ్తారు. పండగికి రా కళ్యాణ్ అని ధాన్యలక్ష్మి అనగానే అప్పుని పిలవలేదని కళ్యాణ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య రావడం చూసిన రాజ్.. నువ్వెందుకు వచ్చవన్నట్లు మాట్లాడతాడు. ఆ తర్వాత నేను కళ్యాణ్ డాక్యుమెంటరీని న్యూస్ లో వచ్చేలా చేసాను. అది ఇంట్లో వాళ్ళు చూసేలా చెయ్ అని రుద్రాణికి  అనామిక ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఓటింగ్ లో గౌతమ్ కృష్ణ ఫస్ట్.. విష్ణుప్రియ లాస్ట్!

బిగ్ బాస్ సీజన్-8 లో నిన్నటి దాకా నామినేషన్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక ఓటింగ్ రోజుకో మలుపు తిరుగుతుంది. పృథ్వీ , నిఖిల్, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ ఇప్పుడు నామినేషన్ లో ఉన్నారు. ఇక నామినేషన్ లో ఓటింగ్ విధానం చూస్తుంటే బుర్రపాడు అంతే. అసలు లాస్ట్ లో ఉన్నవాళ్ళు ఫస్ట్ లో ఉన్నారు. గౌతమ్ కి అత్యధికంగా 27 శాతం ఓటింగ్ పడుతుండగా.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి నిఖిల్ కు 21 శాతం మాత్రమే ఓటింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ దత్తపుత్రిక విష్ణుప్రియకి అసలు ఓటింగే లేదు. జస్ట్ 8 శాతం ఓటింగ్ తో లాస్ట్ లో ఉంది. పృథ్వీ, హరితేజ, యష్మీ, విష్ణుప్రియ వీళ్లు నలుగురు సేమ్ ఎనిమిది శాతం ఓటింగ్ తో లీస్ట్ లో ఉన్నారు. ఇక ఈ ఓటింగ్ ని బట్టి ఈ వారం ఆ చెత్త లవ్ స్టోరీకీ  బ్రేక్ పడేలా ఉంది. అదే విష్ణుప్రియ-పృథ్వీలలో నుండి ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయ్యేలా ఉన్నారు. పృథ్వీ నామినేషన్ పాయింట్లు చూస్తే.. బానే ఎక్స్ ట్రాలు.. అన్నట్టుగా ఉంటుంది. ఇక మన నత్తి బ్రెయిన్ విష్ణుప్రియకి ఏ రీజన్ చెప్పి నామినేట్ చెయ్యాలో కూడా తెలియదు. మరి మన బిగ్ బాస్ మామ దత్తపుత్రిక విష్ణుప్రియని ఎలిమినేషన్ చేయగలడా లేక టాప్-5 లో ఉంచుతాడా చూడాలి మరి.

హౌస్ లో సూట్ కేస్ లు.. ఆ ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-8 రోజుకో ట్విస్ట్ తో దూసుకుపోతుంది. ఇన్ఫినిటీ సీజన్ అని దానికి తగ్గట్టుగానే ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. అందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఒక ఆఫర్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో మూడు సూట్ కేసు లని పెట్టాడు. అవి ఎవరు తీసుకుంటారో వాళ్ళ ఇష్టానికే వదిలేసాడు బిగ్ బాస్. అందరు ఆ సూట్ కేసు తీసుకుంటే ఏం ఎఫెక్ట్ ఉంటుందోనని, ఏముంటుందో అని హౌస్ మేట్స్ అందరు టెన్షన్ పడుతుంటారు. కానీ ఫైనల్ గా నబీల్, పృథ్వీ, రోహిణి ముగ్గురు ధైర్యం చేసి ఒక్కొక్కరు ఒక్కో సూట్ కేసుని తీసుకుంటారు. అంత ఆశ తోటి పట్టుకోకూడదని గంగవ్వ అంటుంటే.. ఏది అయితే అది అయింది అనే ధైర్యం చేసే పట్టుకున్నానని నబీల్ అంటాడు. ఈ రోజు మీ దైర్యం మీకేం ఇచ్చిందనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగగా.. మంచిని కోరుకున్నా మంచే జరుగుతుంది అనుకుంటున్నానని రోహిణి అంటుంది. మీ ముగ్గురు సూట్ కేసు పట్టుకున్నందున డైరెక్ట్ గా మెగా చీఫ్ కంటెండెర్స్ అయ్యారని బిగ్ బాస్ అనగానే.. ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు. కంటెండర్ అయినప్పటికి మీరు కొన్ని ఛాలెంజ్ ఫేస్ చెయ్యాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్తాడు. ఆ సూట్ కేసు ని తీసుకుంటే డైరెక్ట్ నామినేషనో లేక ఎలిమినేషన్ ఉంటుందోనని అందరు భయపడ్డారు. అందుకే ఆ రిస్క్ ఎందుకని హౌస్ మేట్స్ లైట్ తీసుకున్నారు. కానీ డేర్ చేసిన ముగ్గురికి బెన్ఫిట్ అని చెప్పాలి. వారమంతా జరిగే టాస్క్ లలో విన్ అయితే మెగా చీఫ్ కంటెండర్ చీఫ్ వస్తుంది. అలాంటది అలా ఓ సూట్ కేస్ తీసుకుంటే అవకాశం రావడం అనేది నిజంగా లక్ అనే చెప్పొచ్చు. మరి బిగ్ బాస్ మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడో లేదో చూడాలి మరి.

మాది 'వేరే లెవెల్ ఆఫీస్' అంటున్న అఖిల్!

బిగ్ బాస్ హౌస్ లో రెండు సార్లు రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్థక్ ఇప్పుడు ఒక కామెడీ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ ఐన అఖిల్‌కు ఆ తర్వాత  పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు రాలేదు. జిమ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉన్నాడు అలాగే ఒక సలోన్ ని కూడా ఓపెన్ చేసాడు. ఇక బుల్లితెర మీదా కొన్ని కొన్ని షోస్ లో కనిపిస్తున్నాడు తప్ప ఫుల్ ఫ్లెజెడ్ గా మంచి అవకాశాలు రాలేదు, అందిపుచ్చుకోలేకపోయాడు.  అలాంటి అఖిల్ తెలుగులో ఓ యూత్‌ఫుల్ కామెడీ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌కు "వేరే లెవెల్ ఆఫీస్" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధ‌క్‌, మ‌హేష్ విట్టా, రీతూ చౌదరితో పాటు ప‌లువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కూడా ఈ పోస్టర్ లో కనిపించారు.  వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ అటు స్టూడెంట్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని అఖిల్ సార్ధ‌క్ అన్నాడు. త్వ‌ర‌లోనే ఆహా ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది అని  ప్ర‌క‌టించాడు. మరి అఖిల్ అందులో ఎలా నటించాడు..అసలు ఈ సిరీస్ తో అఖిల్ ఖాతాలో మంచి హిట్ పడుతుందా లేదా చూడాలి.

గుప్పెడంత మనసు సీరియల్ టీంని మిస్సవుతున్నాం

గుప్పెడంత మనసు సీరియల్ ఓ రేంజ్ లో ఆడియన్స్ ని అందులోనూ లేడీ ఫాన్స్ ని ఆకట్టుకుంది. రిషి, వసుధారా, శైలేంద్ర, ధరణి జోడీలుగా నటించారు. ఇక ఈ సీరియల్ ఐపోయాక ఆడియన్స్ అంతా కూడా కొంచెం డల్ ఐనట్టే కనిపిస్తున్నారు. రిషి సర్ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. ఐతే ఇప్పుడు రిషి సర్ ఒక మూవీలో నటిస్తున్నాడు. అలాగే జగతి మేడం కూడా మూవీస్ లో నటిస్తోంది. ఇక ధరణి, సురేష్ బాబు, సాయి కిరణ్ వేరే సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇక వసుధారా ప్రస్తుతానికి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.  తాజాగా శైలేంద్ర అలియాస్ సురేష్ బాబు "ఏటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు" అనే సాంగ్ కి రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "ధరణి దగ్గరకు వెళ్ళిపోయుంటుంది మనసు...మిమ్మల్నందరినీ మిస్ అవుతున్నాం. మీరు గుప్పెడంత మనసు పార్టీ 2 తో వెంటనే వచ్చేయండి..సురేష్ బాబు గారు  గుప్పెడంత మనసులో మీ యాక్టింగ్ సూపర్ సార్ సీరియల్ అయిపోయాక తిరిగి సూర్యకాంతంలో కనబడడం చాలా సంతోషంగా ఉంది.." అంటూ మెసేజెస్ పెడుతున్నారు.

Gangavva Elimination : మిడ్ వీక్ ఎలిమినేషన్ గా గంగవ్వ.. బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వనున్నాడా!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. అసలు మాములుగా సాగుతున్న హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అనడంలో సందేహమే లేదు. (Gangavva Elimination) గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్ కృష్ణ, నయని పావని, మెహబూబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. ఇక గంగవ్వ అయితే వచ్చిన రోజు పెట్టిన టాస్క్ లో వహ్వా అనిపించింది. అరవై ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్ళకి పోటీ ఇచ్చారు. అవినాష్- గంగవ్వ జలిసి ఆడిన ఆట చూసి బిబి ఆడియన్స్ అంతా అవాక్కయ్యారు. అయితే ఆ తర్వాత తను ఏ గేమ్ ఆడలేదు. అదే కాస్త ఇబ్బంది. హౌస్ లో అందరికి ఓ అవ్వ లెక్క బాగానే హౌస్ మేట్స్ అందరితో బాగుంటుంది. ఇంట్లో అమ్మతో ఉన్న ఫీలింగ్ ని గంగవ్వ ఇస్తుందనడంలో సందేహమే లేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే అందరితో బాగుంటేనే సరిపోదు కదా టాస్క్ లలో కూడా ఆడాలి. అది లేకుండా ఓటింగ్ లో జనాలు ఓట్లు కూడా చేయరు. హౌస్ లో జరిగే ప్రతీ టాస్క్ లో గంగవ్వ ఓ సంఛాలక్ గా మాత్రమే కన్పిస్తుంది. అయితే సంఛాలక్ గా ఎన్ని టాస్క్ లని చేస్తుంది. ఇక బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కి కూడా ఆమెని ఎందుకు తీసుకొచ్చార్రా బాబు అని అనుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ కూడా అదే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. గంగవ్వని మిడ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకు పంపించాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మిగిలిన వాళ్ళలో ఎవరు బాగా గేమ్ ఆడతారో వాళ్ళు హౌస్ లో ఉంటారు. ఆడనివాళ్ళు ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేస్తారు. గంగవ్వ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ప్రతీ గేమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందనడంలో సందేహమే లేదు. మరి బిగ్ బాస్ మామ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు? ఎలా చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Singer Noel : బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ నోయల్!

తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్లలోనూ ది బెస్ట్ అంటే.. అభిజిత్ విన్నర్ అయిన సీజన్-4 అని చాలామంది అంటుంటారు. ఈ సీజన్‌ ప్రారంభంలో సింగర్ నోయల్ రెండుసార్లు హౌస్‌కి కెప్టెన్ అయ్యి దూసుకుని పోయాడు. ఆ తర్వాత నోయల్.. ఫిజికల్ టాస్క్‌లలో సరిగా పర్ఫామ్ చేయలేకపోయాడు. (Bigg Boss Telugu) నోయల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చాడు. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేసరికి నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ విషయం వాళ్లకి చెప్పేసరికి.. ఇంట్లోనే క్వారంటైన్ చేయమన్నారు. అలా నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నా. తిరిగి నాకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత.. హోటల్ రూంకి మూవ్ చేశారు. వాళ్లు మనల్ని హౌస్‌లోకి పంపేముందే.. షాక్ ట్రీట్ మెంట్స్ స్టార్ట్ చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే.. నేను హోటల్ రూంలో ఉన్నాను.. సడెన్‌గా స్టాఫ్ వచ్చి నా దగ్గర ఫోన్ లాగేసుకున్నారు. ఒక డ్రామా క్రియేట్ చేసి.. మనల్ని తీవ్రమైన ఒత్తిడిలో పెడతారు. అలా నా దగ్గర ఫోన్ లాగేసుకున్నారు. హౌస్‌లోకి ఎప్పుడు పంపిస్తారని.. అడిగితే వాళ్ల నుంచి నో రెస్పాన్స్. బిగ్ బాస్‌లోకి నా ఎంట్రీ షూట్ అయ్యి రోజున్నర తరువాత అప్పుడు హౌస్‌లోకి పంపారు. అప్పటికి నా కాలుకి ప్రాబ్లమ్ ఉంది.. మెడిసిన్ వాడుతున్నా. అది వాళ్లతో చెప్పినప్పుడు.. మందులు కంటిన్యూ చేసుకోవచ్చని చెప్పారు. నేను హౌస్‌లోకివెళ్లేముందు.. ట్రీట్ మెంట్ నిమిత్తం కావాల్సిన మందులన్నీ మా వాళ్లు పంపించారు. వాటిని హౌస్‌లోకి పంపిస్తాం అని బిగ్ బాస్ టీం చెప్పారు.  నేను హౌస్‌లోకి వెళ్లాను. ఆ ముందుల్ని నేను రాత్రి వేసుకోవాలి.. ఉదయాన్నే వేసుకోవాలి. కానీ.. రెండు రోజులుగా అడుగుతున్నా.. వాళ్లు మాత్రం మందులు పంపట్లేదు. నేను మందులు వేసుకోవాలి.. నా కాళ్లు పనిచేయడం లేదు.. మందులు పంపించండి బిగ్ బాస్ అని చాలాసార్లు అడిగాను. కానీ వాళ్లు అస్సలు పట్టించుకోలేదు. దాంతో నాకు పెయిన్ ఎక్కువ అయ్యింది. పైగా అవి మామూలు మందులు కాదు. స్టిరాయిడ్స్.. అవి వేసుకుంటేనే నా కాళ్లు పనిచేసేవి. వాటిని ఇవ్వకపోయేసరికి.. నా పెయిన్ ఎక్కువ అయిపోయింది. ట్యాబ్లెట్స్ మధ్యలో మానకూడదు.. కోర్స్ మధ్యలో బ్రేక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.. నా పెయిన్ ఎక్కువ అయిపోతుందని ఎంత చెప్పినా కూడా.. నాకు మందులు పంపించలేదు. బయటకు వచ్చిన తరువాత.. నన్ను ఎవరైతే కోఆర్డినేట్ చేశారో అతన్ని గట్టిగా నిలదీశా. ఇదే పని నేను నీకు చేస్తే ఎలా ఉంటుంది? నీపై హ్యూమన్ రైట్ కేసు వేస్తా అని అన్నాను. నేను వాళ్లని బెదిరించలేదు. నా బాధను వ్యక్తపరిచాను. కానీ వాళ్లు మాత్రం.. నోయల్ బెదిరించాడు అని అన్నారు. నేను బాధపడితే అది వాళ్లకి బెదిరింపులా అనిపించింది. నాకు బెదిరించాల్సిన అవసరం లేదు. నన్ను బిగ్ బాస్ హౌస్‌లో అంత బాధపెట్టినప్పుడు.. సాటి మనిషిగా నేను స్పందించాను. అది కూడా తప్పని అన్నారు. బెదిరించానని నాపైనే తిరగబడ్డారంటూ బిగ్ బాస్ వాళ్లు ఎలా ఉంటారో సింగర్ నోయల్ చెప్పుకొచ్చాడు.

అప్పుడు క్రష్ ఇప్పుడు అక్క.. ఇద్దరి మధ్య రివేంజ్ నామినేషన్!

  బిగ్ బాస్ సీజన్ -8 లో యష్మీ పాపకి ఉనంత క్రేజ్ మరి ఎవరికి లేదు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా యష్మీ ని నామినేట్ చేసాడు గౌతమ్. మిమ్మల్ని మేడమ్ అనొచ్చా అని గౌతమ్ మొదలెట్టగా.. కాల్ మీ యష్మీ అని తను అంటుంది. నువ్వు ఒక్కో చోట ఒక్కోలాగా మాట్లాడావ్.. ఫ్లిప్ అయ్యావని గౌతమ్ అనగా.. మరి నువ్వు కాదా.. ఒకసారి క్రష్ అంటావ్ మరోసారి అక్క అంటావ్.. నువ్వు ఫ్లిప్ అవ్వడం లేదా అని యష్మీ అంటుంది. ఆ తర్వాత యష్మీ ని రోహిణి నామినేట్ చేస్తుంది. గంగవ్వ కూడా యష్మీ నే నామినేట్ చేసి.. నువ్వు నీకు నచ్చినట్టు జరిగితే ఒకలా లేదంటే చిరాకుగా ఉంటావని అర్ధం వచ్చేలా గంగవ్వ అంటుంది. నువ్వు ఆ ప్రేరణ కలిసి గౌతమ్ పిలగాడి మీద పడతారు. ఏం అంటుండు ఆ పిలగాడు.. నువ్వు ఒక్కరితోనే ఉంటావని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత గౌతమ్ ని రివెంజ్ నామినేషన్ చేస్తుంది యష్మీ.. వీకెండ్ లో ఏదో జరిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చి అక్క అంటూ మాట్లాడడం నాకు నచ్చలేదు. అక్క అనే ఎమోషనల్ అక్కడ లేదు కాబట్టి నాకు ఇష్టం లేదని యష్మీ అంటుంది. ప్లీజ్ అక్క అనకు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. గౌతమ్  నామినేషన్ అంగీకరించి కలర్ నీళ్ళు పోసుకొని వస్తాడు. నేను అక్క అంటే ఇంత మంది హర్ట్ అవుతున్నారా సారీ అని గౌతమ్ అందరికి చెప్తాడు. గౌతమ్ కి యష్మీ టవల్ ఇస్తూ.. ఇక మన మధ్య ఏం గొడవలు వద్దని చెప్తుంది.

గౌతమ్, నిఖిల్ ల మధ్య ముదిరిన గొడవ.. అశ్వగంధ ఈజ్ బ్యాక్!

  బిగ్ బాస్ సీజన్-8 లో భాగంగా ఎన్నో వింతలు జరుగుతున్నాయి. మొదటగా ఓ మాస్క్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. అందరు గుర్తుపట్టి గౌతమ్ అన్నా మాస్క్ తీయలేదు. ఇక అశ్వథ్థామ అనగానే మాస్క్ తీసి .. ఐ ఆమ్ బ్యాక్ అన్నాడు మన గౌతమ్ కృష్ణ. ఇక అది చూసిన ట్రోలర్స్ వీడికి ఇంకా తగ్గలేదుగా అని అనుకున్నారు.  గత నామినేషన్ మళ్లీ చూస్తున్నామా అనేలా గౌతమ్ నిఖిల్ ల మధ్య మరో నామినేషన్ వేదిక అయింది. నువ్వా నేనా అంటూ ఇద్దరు పొట్లాడుకున్నారు. మొదటగా గౌతమ్ ని నిఖిల్ నామినేట్ చేస్తూ.. ఒక అమ్మాయి తనని అక్క అనడం ఇష్టం లేదని చెప్పినప్పుడు నువ్వు వదిలెయ్యాలి. కానీ నువ్వు అలా కాకుండా ప్రతిసారీ అలా అంటే తనకి ఎలా ఉంటుందని ఒక పాయింట్.. టాస్క్ సంబంధించిన టూ పాయింట్స్ చెప్పాడు. కానీ యష్మీ విషయం గురించి నిఖిల్ మాట్లాడడంతో గౌతమ్ కి కోపం వస్తుంది. నేను అక్క అనడం తప్పు కాదు అది రెస్పెక్ట్ అని గౌతమ్ అంటాడు. నీకు మొదట అశ్వథ్థామ అంటే ఎందుకు నచ్చలేదు. నువ్వు ఎందుకు తీసుకొలేదు. అక్క అంటే కూడా తను అలాగే తీసుకోలేదని నిఖిల్ అంటాడు. అశ్వథ్థామ అనాలని అనుకుంటే అను మచ్చా అంటూ గౌతమ్ అన్నాడు. బయట ట్రోల్స్ జరిగాయి అందుకే తీస్కో లేదు అక్క అంటే ఏం అయింది.. ఇప్పుడు చెప్తున్నా ఎవడికి భయపడేది లేదు అశ్వథ్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ గట్టిగా అరుస్తాడు. నీకు దమ్ముంటే బయటకు పదా చూసుకుందామని నిఖిల్ అంటాడు. పద చూసుకుందామంటూ ఎక్సైట్  గా ఇద్దరు గేట్ దగ్గరికి వెళ్లి.. గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇక ఎవరికి భయపడేది లేదు.. ఎవడు ఇష్టమున్నట్లు వాడు రాసుకొనియ్.. ట్రోల్స్ చేసుకొనియ్.. తగ్గేదేలే అంటూ కలర్ పడే స్థానంలో కూర్చొని ఉంటాడు అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణ!  

హరితేజ వరెస్ట్ నామినేషన్.. ప్రేరణ బెస్ట్ డిఫెండ్!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం నామినేషన్ల ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. ఈ వారం ఒక్కరినే బిగ్ బాస్ తగిన కారణం  చెప్పి నామినేట్ చెయ్యమని చెప్తాడు. దాంతో ప్రేరణని నామినెట్ చేస్తుంది హరితేజ. వాళ్లకి మొదటి నుండి రచ్చ నడుస్తుంది. ఇక హరితేజ తన మనసులో ప్రేరణపై ఉన్న ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కింది. ఇక ముందు మన మధ్యలో ఎలాంటి మనస్పార్ధలు ఉండకూడదు. ఏదైనా రీజన్ ఉంటే చేసుకోవాలి కానీ ఈ రీజన్ తో చేసుకోకూడదు ఇదే ఇక లాస్ట్ నామినేషన్ అని హరితేజ అంటుంది . నువు ఫస్ట్ నుండి నన్ను ఫేక్ అంటున్నావ్.. నీకు ఎందుకు ఆలా అనిపించిందో తెలియదు.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని హరితేజ అంటారు. నన్ను ఫేక్ అంటే అది తీసుకోవడానికి చాలా హర్టింగ్ గా ఉంది.. ఒక సిచువేషన్ లో జరిగింది చెప్పడం లో కన్ఫ్యూషన్ అయి ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయాను. దాన్ని నువ్వు ఫ్లిప్, ఫేక్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావ్.. మెల్లి ఉన్నోడోకి లోకమంత మెల్లి లాగా కన్పించినట్లు ఉంటుందని హరితేజ అంటుంది. నేను నిన్ను ఫేక్ అన్నట్లు ఏదైనా రికార్డింగ్ ఉంటే చూపించు.. అప్పుడు నమ్ముతానని ప్రేరణ అంటుంది. ఇన్ని మాటలా అంటూ హరితేజ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక ఆ తర్వాత ప్రేరణ నామినేషన్ కి అంగీకరించి కలర్ నీళ్ళు పోసుకుంటుంది‌. ఆ తర్వాత హరితేజని ప్రేరణ నామినేట్ చేస్తుంది. హరి తేజ చేసిన నామినేషన్ కి అన్ని పాయింట్స్ కి సరైన వివరణ ఇస్తుంది ప్రేరణ. కానీ హరితేజ వాటికి అగ్రీ అవ్వట్లేదు. ఆ తర్వాత హరితేజపై కలర్ వాటర్ పడ్డాక హరితేజకి ప్రేరణ టవల్ ఇస్తూ.. ఇక మన మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదని ప్రేరణ అనగానే..సరే అయితే హగ్ చేసుకోమని హరితేజ అంటుంది. వెంటనే కలర్ ఉందని చూడకుండా ప్రేరణ వెళ్లి హరితేజని హగ్ చేసుకుంది.

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ ని కలిసిన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్

  బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీత గురించి చెప్పక్కర్లేదు. ఆమె ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత ఆ తర్వాత హైదరాబాద్ ఉప్పల్ లో ఉంటోంది. ఆమె యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్ చేస్తూ ఉంటుంది. సీతకి 7 ఆర్ట్స్ లాంటి యూట్యూబ్ వీడియోల్లో అవకాశం వచ్చింది. సరయుతో కలసి చాలా వీడియోలు చేసింది.  అలాంటి సీత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. అక్కడ ఆమె మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇక సీత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా రూపొందిన 'బేబీ' మూవీలో వైష్ణవి చైతన్య లైఫ్ ని నాశనం చేసే ఫ్రెండ్ రోల్ చేసి  'కిరాక్' సీతగా  పాపులర్ అయ్యింది. అలాంటి సీతకు బిగ్ బాస్ లో సపోర్ట్ చేసే వాళ్ళు పెద్దగా ఎవరూ లేరు. దాంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బయటికి వచ్చిన సీత రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిశారు. బిగ్ బాస్ లో గేమ్  ఆడేటప్పుడు తన సపోర్ట్ చేసిన మంత్రి ఫరూక్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది సీత. అలాగే సీత ఇప్పుడిప్పుడే అటు మూవీస్ లో ఇటు యూట్యూబ్ వీడియోస్ లో కనిపిస్తోంది. అలాగే అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తానూ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఫార్మ్ హౌస్ కి, ఫారెన్ ట్రిప్ కి రావాలని చెప్తూ కొన్ని లక్షల ఆఫర్ తో ఒక మూవీ వచ్చినా తానూ రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.    

Brahmamudi : భార్య విజయానికి తన భర్తే కారణమంట.. దీపావళి బోనస్ ఆమె చేతుల మీదుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -558 లో.....కంపెనీని వద్దని వెళ్లిన వారందరు రాజ్ కి ఫోన్ చేసి.. కావ్య మేడమ్ అప్పాయింట్ మెంట్ కావాలని అడుగుతారు. దాంతో రాజ్ వాళ్లపై చిరాకుపడతాడు. రాజ్ ఆఫీస్ కి వెళ్ళాక శృతిని పిలిచి అందరు నాకు కాల్ చేస్తున్నారు ఎందుకని అడుగుతాడు. మేనేజర్ ని కదా సర్.. మేడమ్ అప్పాయింట్మెంట్ అన్ని చూసుకునేది నేనే కదా అని శృతి ఇంకా చిరాకు తెప్పించేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. ఇన్వెస్టర్స్ మళ్ళీ వస్తామని కాల్ చేస్తున్నారని రాజ్ అంటాడు. వెళ్లిన వాళ్ళు మనకి ఎందుకని కావ్య అంటుంది. వాళ్ళతో డీల్ చేస్తేనే కంపెనీ బాగుంటుందని రాజ్ అనగానే అయితే మీటింగ్ అరెంజ్ చెయ్యండి అని కావ్య చెప్తుంది. మరొకవైపు కళ్యాణ్ అటో నడపటం చూసి అనామిక, సామంత్ లు తన దగ్గర కి వెళ్లి తక్కువ చేసి మాట్లాడతారు. మీ ఫ్యామిలీకి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని సామంత్ అనగానే.. వాళ్లకి మంచి కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. కళ్యాణ్ వెళ్లిపోతుంటే అనామిక ఫోటో తీస్తుంది. ఎందుకు ఫోటో తీసావ్ అని సామంత్ అడుగుతాడు. దీంతో పని ఉందని అనామిక అంటుంది. మరొకవైపు కావ్య ని అన్ని కంపెనీ వాళ్ళు.. మీ కంపెనీ తో డీల్ పెట్టుకుంటామని రిక్వెస్ట్ చేస్తారు. వద్దు ఇప్పుడు వెళ్లినట్లే మళ్ళీ వెళ్లరని గ్యారెంటీ ఏంటని కావ్య అనగానే.మ అగ్రిమెంట్ రాసి ఇస్తామని వాళ్లు అనగానే కావ్య ఒప్పుకొని అగ్రిమెంట్ పై సంతకం చేయించుకుంటుంది. మీరు గ్రేట్ మేడమ్ అంటూ వాళ్ళు కావ్యని పొగుడుతుంటే ఇదంతా మా ఆయన వాళ్లే అని రాజ్ గురించి చెప్తుంది. దాంతో రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనామిక ఒకతన్ని పిలిచి ఒకరిపై డాక్యుమెంటరీ తియ్యాలి.‌ అతనికి తెలియొద్దని కళ్యాణ్ డీటెయిల్స్ ఇస్తుంది. దానికి అతను సరే అంటాడు. తరువాయి భాగంలో దీపావళికి కావ్య చేత ఎంప్లాయిస్ కి బోనస్ ఇప్పించాలని ఇందిరాదేవి, సీతారామయ్య ఇంట్లో వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్య కలిసి కావ్య దగ్గర కి వెళ్లి దీపావళికి రమ్మంటారు. నేను దీపావళికి వస్తే మీ మనవడికి కంట్లోనే టపాసులు పేలుతాయని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 :  కార్తీక్ దీపల శోభన ముహార్తానికి రంగం.. జ్యోత్స్న ఏం చేయనుంది?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -193 లో.. దాస్ ఇంటికి పారిజాతం వస్తుంది. అక్కడున్న కాశీ, స్వప్నలతో దీప, కార్తీక్ ల పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంది. జనాలకి చెప్పుకోరు. ఇంట్లో కాపురం తప్ప.. బయట ప్రపంచానికి వాళ్ళు భార్యాభర్తలని చెప్పుకోరని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంటే.. అలా ఏం కాదు.. వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేస్తానని స్వప్న అంటుంది. కరెక్ట్ చెప్పావ్ వాళ్లకి రిసెప్షన్ చేస్తామని పారిజాతంతో స్వప్న, కాశీ ఛాలెంజ్ చేస్తారు. ఆ తర్వాత దాస్, కాశీ, స్వప్న ముగ్గురు కలిసి కాంచన దగ్గరికి వెళ్తారు. దీప, కార్తీక్ లని హాల్లోకి పిలుస్తారు. అప్పుడే దాస్ కి ఫోన్ వస్తుంది. పక్కకి వెళ్లి మాట్లాడతాడు. అతని ఊరు ముత్యాలమ్మ గూడెమానని దాస్ ఫోన్ లో అంటుంటే.. అప్పుడే అనసూయ కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి బాబు ఆ ఊరు అని చెప్పబోతుంటే ఆమెకి నిజం తెలియకుడదని దాస్.. ఏం లేదమ్మ అని అంటాడు. మరోవైపు ఎవరికి తెలియకుండా పెళ్లి జరిగింది. అందరికి తెలిసేలా రిసెప్షన్ చేద్దామని అనుకుంటున్నామని దీపతో కాశీ అంటాడు. మంచి నిర్ణయం.. గుడిలో జరిగిన మీ పెళ్లి గురించి అందరికి తెలియాలని దీప అనగానే.. రిసెప్షన్ మాకు కాదు మీకు అని కాశీ అనగానే.. దీప షాక్ అవుతుంది. వెంటనే వద్దని చెప్తుంది. అందరి నోళ్లు మూయించాలంటే అందరికి మీ పెళ్లి గురించి తెలియాలని స్వప్న అంటుంది. థాంక్స్ స్వప్న.. నేను ఎలా అందరికి తెలిసేలా చెయ్యాలి అనుకున్న మంచి ఆలోచన అని కార్తీక్ అంటాడు. మీ అమ్మని రిసెప్షన్ కి ఒప్పించమని శౌర్యతో అందరు చెప్తారు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. దీప, కార్తీక్ ల ఇన్విటేషన్ పంపిస్తాడు కాశీ. అది చూసి పారిజాతం టెన్షన్ పడుతుంటే.. ఏంటి అది చూపించమని అంటాడు. శివాన్నారాయణ ఫోన్ తీసుకొని దశరథ్ ని చుడమని చెప్తాడు.‌ దీప, కార్తీక్ ల రిసెప్షన్ ఇన్విటేషన్.. తనకి ఎందుకు వచ్చిందని శివన్నారాయణ కోప్పడతాడు. రిసెప్షన్ స్వప్న, కాశీ ఇద్దరు చేస్తున్నారంట అని దశరథ్ చెప్పగానే.. శివన్నారాయణ కోప్పడతాడు. అక్కడికి వెళ్తే మళ్ళీ నీకు ఇంట్లోకి ఎంట్రీ లేదని పారిజాతానికి శివన్నారాయణ‌ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా వాళ్ళను ఆ విషయం గురించి అడగాలని వెళ్తుంటే.. ఇప్పుడే వద్దని పారిజాతం సముదాయించి లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మాజీ ప్రియుడు కాల్.. భర్తకి రాంగ్ నెంబర్ అని చెప్పిన భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -244 లో.....సిరి లేవగానే ఎదురుగా గోడపై చిన్న పిల్లల ఫొటోస్ ఉంటాయి. వాటిని చూసి సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి నీకు హ్యాపీగా ఉందా అని అడుగుతుంది. ధన తన సొంత టాలెంట్ తో పైకి రావాలని నీకు దూరంగా ఉంటున్నాడు. అంతే తప్ప కావాలని కాదు.. నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ ఫొటోస్ నేనే పెట్టానని రామలక్ష్మి చెప్తుంది. దాంతో సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా సీతాకాంత్ చూసి తను కూడా సంతోషపడతాడు. ఆ తర్వాత  సిరి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. నీకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేశానని అంటాడు. నీకెందుకు అన్నయ్య శ్రమా అని సిరి అనగానే.. నీ విషయంలో ఎప్పుడు అలా అనిపించదని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ వర్క్ చేస్తుంటే.. అప్పుడే అభి ఫోన్ చేస్తాడు  అభి నువ్వా అని రామలక్ష్మి మాట్లాడుతుంటుంది. అదంతా సీతాకాంత్ వింటాడు. నీతో మాట్లాడాలని అభి అనగానే.. రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఎవరు రామలక్ష్మి ఫోన్ అంటూ సీతాకాంత్ వస్తాడు. ఇప్పుడు అభి గురించి ఎందుకని రామలక్ష్మి చెప్పదు. రాంగ్ నెంబర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పడం లేదని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతున్నారని చెప్పగానే.. మన ప్లాన్ కి ఆ రామలక్ష్మి బలి అవుతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత నందినిని అభి కలిసి మాట్లాడతాడు. అదంతా డిటేక్టివ్ అభిని ఫాలో అవుతూ చూస్తాడు. నందినితో అభి మాట్లాడడం ఫోటో తీస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ తను రామలక్ష్మి దిగిన ఫోటోని చూస్తూ.. నాకు అభి గురించి ఎందుకు చెప్పడం లేదని అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి తను పంపిన కొటేషన్ ఒకే అయింది అని కాల్ వస్తుంది. దాంతో ఈ విషయం సీతా సర్ కి చెప్పాలని కార్ లో వెళ్తుంది. తనని ఫాలో అవుతు అభి వెళ్తాడు. కావాలనే అభి తన ముందు నుండి వెళ్తాడు. తను కచ్చితంగా అభినే వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నాడో ఇంకొకసారి రాకుండా చెయ్యాలని రామలక్ష్మి తన వెనకాలే వెళ్తుంది.. మరొక వైపు అభి ఇంటి దగ్గర డిటెక్టివ్ వెయిట్ చేస్తుంటాడు. అతి కష్టం మీద అభి అడ్రెస్ కనుకున్నానని అనుకుంటాడు. అప్పుడే అభి వచ్చి ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే రామలక్ష్మి కూడా అక్కడికి రావడంతో అక్కడే ఉన్నా డిటేక్టివ్ అభి దగ్గరికి రామలక్ష్మి రావడం చూసి సీతాకాంత్ సర్ భార్య ఎందుకు వచ్చారనుకుంటాడు..ఆ తర్వాత రామలక్ష్మి అభి దగ్గరికి వెళ్లి మళ్ళీ ఎందుకు వచ్చావంటూ కోప్పడుతుంది. అభి, రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు డిటెక్టివ్ ఫోటో తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.