యష్మీ ఎలిమినేటెడ్.. వెళ్తూ అతనిపై బిగ్ బాంబ్ పడేసింది!
బిగ్ బాస్ సీజన్-8 లో పన్నెండో వారం యష్మీ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ పన్నెండు వారాలు ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో సండే ఫండే అంటూ నాగార్జున ఆటలతో పాటలతో అలా సాగించారు.
నామినేషన్లో ఉన్మ ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరగా పృథ్వీ, యష్మీ ఉన్నారు. ఇక వారిద్ధిని గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు నాగార్జున. ఇక మెయిన్ గేట్ ఓపెన్ అయి యష్మీ ఎవిక్టెడ్ అనే బోర్డ్ ప్రత్యక్షమైంది. దాంతో యష్మీ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పేసి స్టేజ్ మీదకి రమ్మన్నాడు. ఇక స్టేజ్ మీదకి వచ్చాక యష్మీ జర్నీ వీడియోని చూపించాడు నాగార్జున. ఫ్యామిలీ వీక్ లో వాళ్ల నాన్న వచ్చినప్పుడు చెప్పినవన్నీ గుర్తుంచుకొని ఆడిన ప్రతీ టాస్క్ లో తన వంద శాతం ఎఫర్ట్స్ ఇచ్చానంటూ యష్మీ అంది. ఇక హౌస్ లో ఎవరు తన ఫ్రెండ్స్? ఎవరు ఎనిమీస్(శత్రువులు) బోర్డ్ మీద పెట్టమన్నాడు నాగార్జున.
ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియలని ఫ్రెండ్స్ బోర్డ్ లో పెట్టిన యష్మీ.. గౌతమ్, రోహిణి, అవినాష్, తేజలని ఎనిమీస్ లో పెట్టేసింది. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది యష్మీ. ప్రేరణ తన వంద శాతం ఇస్తుంది. చిన్న చిన్న కోపాలు తగ్గించుకుంటే లేడి విన్నర్ అవుతావని ప్రేరణతో యష్మీ అంది. నిఖిల్ తో కలిసి బడ్డీగా వచ్చాను. నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేస్తావో నీకు తెలుసు, అవి కరెక్ట్ చేసుకుంటే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతావంటు నిఖిల్ తో యష్మీ అంది. పృథ్వీది నా పక్క బెడ్. నా అన్ని విషయాలు షేర్ చేసుకుంటా..బయట కలుద్దామని పృథ్వీతో అంది. గౌతమ్ అందరితో కలిసి ఉండు.. అది నీ గేమ్ కి హెల్ప్ అవుతుంది. ఇండివిడ్యువల్ గా ఉండటం మంచిదే కానీ అందరితో నవ్వుతూ ఉండమని గౌతమ్ తో యష్మీ అంది. అవినాష్ ఎప్పుడూ నన్ను నవ్విస్తాడు. ఇంకా కొన్నిరోజులో మిగిలి ఉంది. కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకోమని అవినాష్ తో యష్మీ అంది. రోహిణికి కూడా తనని తాను నిరూపించుకోవాల్సి ఉందని యష్మీ అంది. ఇక హౌస్ నుండి వెళ్లే ముందు నిఖిల్, గౌతమ్ ఇద్దరిలో ఎవరో ఒకరిని నామినేట్ చేయాలంటు బిగ్ బాంబ్ పేరిట స్పెషల్ పవర్ ఇచ్చాడు నాగార్జున. దాంతో గౌతమ్ ని నామినేట్ చేసింది యష్మీ.