బిఆర్ఎస్ నేత హరీష్ రావుతో రాకింగ్ రాకేష్

కమెడియన్ రాకింగ్ రాకేష్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు మూవీస్ లో కూడా నటిస్తున్నాడు. ఐతే ఇప్పుడు తనే హీరోగా, నిర్మాతగా కెసిఆర్ ...కేశవ చంద్ర రమావత్  అనే సినిమా చేశాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కాబోతోంది.ఈ నేపథ్యంలో రాకేష్- సుజాత కలిసి తమ బిడ్డతో హరీష్ రావు దగ్గర వెళ్లారు. అక్కడ హరీష్ రావుకు ఈ మూవీ గురించి రాకేష్ ఎక్స్ప్లైన్ చేస్తూ ఉన్నాడు. చరిత్రలో కెసిఆర్ మూవీ ఒక భాగం కాబోతోంది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్న రాకేష్ కి కంగ్రాట్యులేషన్స్ అంటూ  హరీష్ రావు చెప్పారు. అలాగే ఈ మొయివే హిట్ కొట్టాలంటూ హరీష్ రావు రాకేష్ కి విషెస్ చెప్పారు. మూవీ  రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రాకేష్. తన సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికించుకున్నాడు. ఇక రాకేష్ ని హరీష్ రావుతో చూసిన నెటిజన్స్ మాత్రం ఆల్ ది బెస్ట్ ..ఇప్పుడు  ఈ మూవీ పరిస్థితి ఏమో కానీ రాబోయే రోజుల్లో బిఆర్ఎస్  సపోర్ట్  బాగా  ఉంటుంది  అని  కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ  కోసం తన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చానని, తాను సంపాదించింది మూవీ కోసమే పెట్టేశానని చెప్పుకొచ్చాడు.    

అమ్మాయిలని వాడుకొని వదిలేస్తున్నావ్ నిఖిల్...

  బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్లు ముగిసాయి. ఇక హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి చేసిన నామినేషన్లు హైలైట్ గా నిలిచాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ,  నైనిక వచ్చారు.  హౌస్ లోకి మొదటగా నైనిక ఎంట్రీ ఇవ్వగా నబీల్, యష్మీలని నామినేట్ చేసింది. ఆ తర్వాత నాగ మణికంఠ వచ్చి నిఖిల్, నబీల్ లని నామినేట్ చేశాడు. ఇక కిర్రాక్ సీత ఎంట్రీ ఇచ్చి కన్నడ బ్యాచ్ కి ఇచ్చిపడేసింది. ప్రేరణ ఫ్లిప్పింగ్ ని బయటపెట్టింది కిర్రాక్ సీత. నీకు ఇక చీఫ్ అవ్వాలనే కోరిక లేదా అంటూ సీత అడిగింది. దీనికి ప్రేరణ నవ్వింది. దీంతో నువ్వు చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యావ్.. ఒక డిక్టేటర్‌లా బిహేవ్ చేశావ్. నువ్వు చీఫ్ అయ్యాక నీ వెనుక హౌస్ మేట్స్ మాట్లాడే మాటలు విన్నాను.. నెక్స్ట్ నువ్వు చీఫ్ కాలేవు.. ఎందుకంటే చీఫ్ అయిన తర్వాత చాలా చేంజ్ అయ్యావ్. గౌతమ్ మీద చిరాకు పడటం బాలేదు. మీ భర్త నీకు కిచెన్ లో ఉండొద్దని మంచిగా మాట్లాడమని చెప్పాడు కానీ కాసేపటికే మళ్లీ కిచెన్ దగ్గర దోస గురించి తేజతో నువ్వు గొడవపడ్డావ్.. ఇవన్నీ బయటికి నెగెటివ్‌గా వస్తున్నాయ్.. ముఖ్యంగా నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయనంటూ సీత చెప్పగా.. నేను మార్చుకుంటానంటూ ప్రేరణ అంది. యష్మీకి తన సెకండ్ నామినేషన్ వేసింది సీత.. ఆల్‌మోస్ట్ నైనిక చెప్పిన పాయింట్లే చెప్పింది సీత. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్‌ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్.. అలా అని నువ్వు గేమ్ ఆడట్లేదా అంటే బాగానే ఆడుతున్నావ్.. కానీ నిఖిల్ అనే షాడోలో అది కనిపించట్లేదంటూ సీత చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే.. అటు వైపు నుంచి నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. నువ్వు ఆ ట్రాప్‌లో, నిఖిల్ గేమ్‌లో పడకు అంటూ సీత సలహా ఇచ్చింది. దీనికి ట్రాప్ అంటే ఏంటి నీ ఉద్దేశం అంటూ నిఖిల్ అడిగాడు. అదే స్ట్రాంగ్ ఉమెన్‌ని ఆడకుండా టార్గెట్ చేసి వాళ్లని డౌన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.. వాళ్లని వాడుకొని నీ గేమ్ సెట్ చేసుకున్నట్లు ఉందంటూ సీత కామెంట్స్ చేసింది. దీనికి రెయిజ్ అవ్వకుండా కాస్త ఆశ్చర్యంగా అది నీ అభిప్రాయమంటూ నిఖిల్ చెప్పాడు. అక్కడ నిఖిల్ ఒక్కసారిగా స్ట్రక్ అయినట్టు అనిపించింది. మొత్తానికి నిఖిల్ కి నిన్న ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. ఇక ఈ వారం పృథ్వీ, నిఖిల్, యష్మీ, ప్రేరణ, నబీల్ నామినేషన్లో ఉన్నారు.

Naga Manikanta: ఇలాగైతే కప్పు మర్చిపో నిఖిల్.. నువ్వే విన్నర్ కావాలి నబీల్!

  బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇక హౌస్ నుండి బయటకి వెళ్ళిన కంటెస్టెంట్స్ వరుసగా ఎంట్రీ ఇస్తూ నామినేట్ చేయడం ఈ సీజన్ కే హైలైట్ . ఇందులోని సోనియా నామినేషన్ ఫుల్ గూస్ బంప్స్ వచ్చాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో‌ మొదటగా  నైనిక వచ్చి నబీల్, యష్మీలని నామినేట్ చేసింది. ఆ తర్వాత హౌస్ లోకి మణికంఠ వచ్చాడు. వచ్చీరాగానే మొదటగా నిఖిల్ ని నామినేట్ చేశాడు. నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా.. కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్. అలానే నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెప్పకు.. అది రాంగ్‌గా పోట్రే అవుతుంది.. అందరు నీదే తప్పు అనుకుంటారు.. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పెయ్.. ఎవరో ఏదో అనుకుంటారు.. ఆడియన్స్‌లోకి ఎలా వెళ్తుందనే విషయాలు వదిలెయ్.. ఇలా అయితేనే నువ్వు టైటిల్ గెలుస్తావంటూ మణికంఠ సలహా ఇస్తూ నామినేషన్ చేయగా.. అసలు డిఫెండ్ కూడా చేసుకోలేకపోయాడు నిఖిల్. మణికంఠ తన రెండో నామినేషన్ నబీల్‌కి వేశాడు. నువ్వు మొదటి రెండు వారాలు మెత్తగా ఉన్నావ్.. తర్వాత షేర్ అంటూ రెయిజ్ అయి బాగా ఆడావ్.. కానీ నాలుగు వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావ్.. త్యాగాలు చేస్తున్నావ్.. సైలెంట్‌ అయిపోయావ్.. ఇవన్నీ ఎందుకు.. నిన్ను ఇష్టపడే వాళ్లు నీ గేమ్ చూడాలనుంకుంటారు.. నీ త్యాగాలు కాదు.. నామినేషన్ అంటే ఎందుకు భయపడుతున్నావని మణికంఠ అన్నాడు. ఖచ్చితంగా ఇక నా ఆట చూపిస్తానంటూ నబీల్ అన్నాడు. ఇక నామినేషన్ అయిపోయాక నబీల్‌కి హగ్గు ఇస్తూ చెవిలో ఓ విషయం చెప్పాడు మణికంఠ. నువ్వే విన్నర్ కావాలి.. నీకు చాలా ఛాన్స్ ఉంది.. ఇండివిడ్యువల్‌గా ఆడు అంటూ మణికంఠ చెప్పాడు.

యష్మీకి ఇచ్చిపడేసిన నైనిక.. నిఖిల్ వెనకాలే ఉన్నావ్!

  బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్స్ ముగిసేసరికి ఈ వారం ఐదుగురు సభ్యులు లిస్ట్‌లో చేరారు. అయితే నామినేషన్స్ సమయంలో ఎక్స్ కంటెస్టెంట్లు లేవనెత్తిన విషయాలు హౌస్‌మేట్స్ మధ్య పెద్ద చిచ్చే రేపాయి. ముఖ్యంగా యష్మీ-నిఖిల్ మధ్య గట్టిగానే దూరం పెరిగింది. ఇక మొదటిగా నబీల్‌ని నామినేట్ చేసింది నైనిక. నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ అన్నావ్ కదా. మరి ఆ షేర్ ఎక్కడికి వెళ్లిపోయింది. కొద్ది వారాలుగా నాకు నువ్వు అసలు కనిపించట్లేదు. ఇంకొకటి నువ్వు అందరి వెనకాల మాట్లాడుతున్నట్లు అనిపించింది. గౌతమ్ విషయంలో కూడా వాడికెందుకు ఓట్లు పడుతున్నాయన్నట్లు యష్మీకి నీకు మధ్య డిస్కషన్ జరిగిందంటూ నైనిక చెప్పింది. ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ నేను వచ్చిందే ఆ కప్పు కోసం. కచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే.. గౌతమ్ గేమ్ గురించి మాట్లాడా కానీ ఓట్లెందుకు పడుతున్నాయి అనే టాపిక్కే నేను తేలేదంటూ నబీల్ చెప్పాడు. ఆ తర్వాత తన రెండో నామినేషన్ యష్మీకి చేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు అసలు నాకు కనిపించట్లేదు. ఎప్పుడైతే నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టావో అప్పటి నుంచి యష్మీ మిస్ అయిపోయింది. ఎక్కడ చూసినా నిఖిల్‌తోటే కనిపిస్తున్నావ్.. అలా అని నువ్వు ఎఫర్ట్స్ పెట్టడం లేదా అంటే పెడుతున్నావ్.. కానీ అవి కనిపించట్లేదని నైనిక అంది. ఇక యష్మీ ఏడ్చేస్తూ తన డిఫెండ్ చేసుకుంది. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానంటూ యష్మీ మాటిచ్చింది. ఇక యష్మీ కపటనాటకం మొదలెట్టింది. నిజాలు మాట్లాడితే యష్మీ ఏడ్చేస్తుందనే విషయం ఆడియన్స్ అందరికి తెలిసిపోయింది.

Illu illalu pillalu : ప్రేమ పెళ్ళి చేసుకోవద్దని కొడుకుల దగ్గర మాట తీసుకున్న తండ్రి! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -07 లో....రామరాజు పెద్ద కొడుకు చందు గుడికి వచ్చి.. తన లవర్ సుభద్రకి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు గుడిలో కలిసి మాట్లాడుకుంటారు. రామరాజు వస్తాడేమోనని చందు భయపడతాడు. మన పెళ్లి విషయం గురించి ఇంట్లో మాట్లాడావా అంటూ సుభద్ర అడుగుతుంది. దాంతో చందు భయపడుతాడు. ఆ తర్వాత వేదవతి వంట చేస్తున్న వాసనా వచ్చి.. వాళ్ళ అమ్మ చిన్న పిల్లని కూర తీసుకొని రా అని పంపిస్తుంది దాంతో వేదవతి తన తల్లికి కర్రీ వేసి పంపిస్తుంది. ఆ తర్వాత వేదవతి చూసుకోకుండా తన అన్న సేనాపతి పై వాటర్ పోస్తుంది. అది చూసి సేనాపతి భార్య రేవతి వచ్చి మా అయన పై కావాలనే వాటర్ పోసావ్ అంటుంది. అదంతా పైనుండి భద్రవతి చూస్తూ వదిలేయండి. మెల్లగా ఈ కుటుంబంలోకి రావాలని చేస్తున్నా ప్రయత్నం అది.. కూరలు పంపివ్వడం.. ఇలా నీళ్లు పోయడమని వేదవతి బాధపడేలా మాట్లాడుతుంది భద్రావతి. వేదవతి వాళ్ల అమ్మ బాధపడుతుంటే  తన మనవరాలు వచ్చి మాట్లాడుతుంది. మరొకవైపు వేదవతి ఏడుస్తుంటే వాళ్లే కారణమంటూ చిన్నోడు ఇంటి వైపు చూస్తూ.. మా అమ్మ ఏం చేసిందని తనని బాధపెడుతున్నారని అంటాడుమ ఏం చేసిందా అంటూ సేనాపతి కూతురు చిన్నోడి పై నీళ్లు పోసి ఇది చేసిందంటూ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటుంటే.. పెద్దావిడ చూసి మీకు గొడవ కన్పిస్తుంది. నాకు మీ ప్రేమ కన్పిస్తుంది. మీ పెళ్లితో అయిన ఈ రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటాయని అనుకుంటుంది. తరువాయి భాగంలో ప్రేమ వివాహం చేసుకోవద్దంటూ రామరాజు తన ముగ్గురి కొడుకుల దగ్గర మాట తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శివన్నారాయణ‌కి ఎదురుతిరిగిన దీప.. భర్త కోసం తెగించేసిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -206 లో.. దీపని కార్తీక్ రెస్టారెంట్ కి తీసుకొని వచ్చి.. మెనూలో ఉప్మా బిర్యానీ రిసీపీనీ ఆడ్ చేస్తాడు. ఉప్మా బిర్యానీ రెసిపీ గురించి దీపని షెఫ్ కి చెప్పమంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా రెస్టారెంట్ కి వస్తుంది. అక్కడున్న మేనేజర్ తో మాట్లాడుతుంది. మెనూ ఎవరు చేంజ్ చేశారని జ్యోత్స్న అడుగగా.. కార్తీక్ సర్ పెట్టారు.. కార్తీక్ సర్ తన భార్య దీప మేడమ్ తో వచ్చారని  మేనేజర్ అనగానే.. అతని చెంప చెల్లుమనిపిస్తుంది. ఈ దెబ్బ నువ్వు దీపని మేడమ్ అన్నందుకని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ శౌర్యకి తినిపించడం జ్యోత్స్న చూసి.. ఇంకా మండిపోతుంది. ఇక కోపంగా దీప దగ్గరికి వెళ్తుంటే తనే షేప్ కి రెసీపి చెప్పి బయటకు వస్తుంది. జ్యోత్స్నని షాక్ అవుతుంది. వంట మనిషివి నువ్వేనా అని అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి కాస్త చదువుకున్న దానిలాగా మాట్లాడమని కార్తీక్ అంటాడు. మెనూ ఎందుకు మార్చావ్ బావ  ఇంతమంది షెఫ్స్ ఉండగా దీప ఎందుకని జ్యోత్స్న అడుగుతుంది. దీప అందులో స్పెషలిస్ట్ అందులో తప్పేముందని కార్తీక్ అంటాడు.  అప్పుడే శివన్నారాయణ‌ పేపర్ పట్టుకొని వస్తాడు. తప్పు చేసింది దీప కాదురా నువ్వే.. పేపర్ లో ఎందుకిలా వేయించావని అడుగుతాడు. అది ప్రశ్న కాదు అందరికి సమాధానమని కార్తీక్ అంటాడు. అయిన నీ పేరు వేయించుకో జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ ఇంకా నా కోడలు పేరు ఎందుకు వేసావని శివన్నారాయణ అడుగుతాడు. అది నా పొజిషన్.. అత్తయ్య నా మంచి కోరేది అని కార్తీక్ అంటాడు. ఇంకా కార్తీక్ మాటలకి శివన్నారాయణ‌ కోపంగా తన పైకి చెయ్ ఎత్తుతాడు. దాంతో కార్తీక్ చెయ్ ఆపుతుంది. నా భర్తని ఇలా తక్కువ చేసి మాట్లాడవద్దని కార్తీక్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది. అదంతా శౌర్యా చూస్తుంటుంది. ఇక కోపంగా శివన్నారాయణ‌ జ్యోత్స్నని తీసుకొని కోపంగా వెళ్లిపోతు.. ఇక నా పేరు గాని ఇంటిపేరు గాని ఇంట్లో వాళ్ళ పేరు గాని వాడడానికి వీల్లేదని శివన్నారాయణ‌ కోపంగా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఆస్తులని గెలిచినా భర్తని గెలవలేకపోయిన భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. (Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -257 లొ...... రామలక్ష్మి గదిలో ఉంటుంది‌. సీతాకాంత్ వచ్చి నేలపైన పడుకుంటాడు. అదేంటి అలా పడుకుంటున్నారని రామలక్ష్మి అంటుంది. నీకు నాపై ప్రేమ ఉందనుకున్న ఇదంతా ఆస్తుల కోసమని అంటాడు. రామలక్ష్మి కూడా నేలపైన పడుకుంటుంది. ఇక్కడ నుండి కూడా పొమ్మంటావా అంటూ చిరాకుగా మాట్లాడేసరికి.. రామలక్ష్మి వెళ్లి బెడ్ పై పడుకుంటుంది. ఆ తర్వాత ఆస్తులు నా పేరున రాసుకొని మిమ్మల్ని కాపాడుకున్నా కానీ మిమ్మల్ని గెలవడంలో ఓడిపోయానని రామలక్ష్మి బాధపడుతుంది. మరొకవైపు రామలక్ష్మి ఇంత మోసం చేసింది. నాపై చెయ్ ఎత్తిన కూడా సీతాకాంత్ తనని క్షమించాడంటే అది అంటే వాడికి ఎంత ఇష్టమో అర్ధమైంది. ఇప్పుడు రామలక్ష్మిపై కోపంగా ఉన్నాడు. ఇప్పుడే నందినికి ఫోన్ చేసి సీతాకాంత్ ని తనవైపుకి తిప్పుకునేలా చేయాలని శ్రీలత నందినికి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత, సందీప్ లకి శ్రీవల్లి కాఫీ తీసుకొని వస్తుంది కానీ రామలక్ష్మి రాగానే ఆ కాఫీలని తీసుకొని వెళ్లి రామలక్ష్మికి ఇస్తుంది. మీరు ఇక ఈ ఇంట్లో ఉండాలన్న ఆస్తులు మీ పేరున రాయలన్న కూడా ఇంట్లో పనులు అంత చెయ్యాలని చెప్తుంది. వాళ్ళని బట్టలు ఉత్తకమంటుంది వాళ్ళకి పనిమనిషిలు వేసుకునే బట్టలు వేసుకోమంటుంది. వాళ్లు పనిమనుషుల్లా అన్ని పనులు చేస్తుంటారు. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ కి ఆఫీస్ కి వెళ్ళడానికి అని సిద్ధం చేస్తుంటే సీతాకాంత్ చిరాకుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్యాభర్తలలో‌ ఎవరి డిజైన్స్ హిట్.‌ ఎవరివి ఫట్ ?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -571లో..... రాజ్  డిజైన్స్ చూసి మూర్తి మనకంటే కావ్య మేడం బాగేస్తుందని అనగానే.. తిట్టి పంపిస్తాడు. కావ్య, శృతిలు డిజైన్స్ బాగా వచ్చాయని మాట్లాడుకుంటారు. అదంతా చాటు నుండి రాజ్ విని వాటిని దొంగతనం చెయ్యాలని అనుకుంటాడు. కావ్య, శృతిలు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రాజ్ కావ్య క్యాబిన్ కి వెళ్లి డిజైన్స్ ఫోటో తీసుకుంటాడు. అప్పుడే కావ్య, శృతి లు బ్యాగ్ మర్చిపోయానంటూ వెనక్కి రావడం రాజ్ గమనించి టేబుల్ కింద దాక్కుంటాడు. కావ్య లోపలకి రాగానే డిజైన్స్ పేపర్స్ తారుమారుగా ఉండడంతో.. ఎవరో ఇక్కడికి వచ్చారనుకుంటుంది. రాజ్ సర్ డిజైన్స్ కోసం వచ్చారేమో ఈ మధ్య సర్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అర్థం కావడం లేదని శృతి అనగానే అయన అలా ఎప్పటికి చెయ్యరు తనకంటూ ఒక క్యారెక్టర్ ఉందని కావ్య అంటుంది. ఎదురుపడితే గొడవపడతారు. ఇప్పుడు సర్ ని ఒక్క మాట అననివ్వరని శృతి అంటుంది. పర్లేదు మనపై మంచి ఒపీనియన్ ఉంది అయినా ఈసారి ఇలా తప్పదని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య శృతిలు వెళ్లిపోయాక రాజ్ మిగతా ఫొటోస్ తీసుకొని వెళ్తాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి తనే స్వయంగా వంట చేసుకుంది. మీర మాట్లాడట్లేదు నాన్న అని రుద్రాణి అనగానే.. నా కోడలికి వంట చేసుకోవడానికి పాత్రలు సరిపోతాయో లేదో తీసుకొని వచ్చి ఇవ్వు అంటాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి సీతారామయ్య వెళ్ళగానే.. డిజైన్స్ దాచేసి.. రేపు మీ అందరికి సర్ ప్రైజ్ అంటాడు. రాజ్ ఎలాగైనా గెలవాలని కావ్య డ్రైవర్ కి ఫోన్ చేసి.. లేట్ గా తీసుకొని రమ్మని చెప్తాడు. మరొకవైపు కావ్య రెడీ అవుతుంటే పోటీలో నువ్వే గెలవాలని పూజ చేసి హారతి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Jabardast show : జబర్దస్త్ కామెడీ షోలో‌ బూతు పురాణం.. రోజురోజుకి దిగజారుతుందా!

ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఫ్యామిలీతో కలిసి కూర్చొని కాసేపు నవ్వుకునే షో.. మరి ఇప్పుడేమో బూతులతో నిండిపోయి అసలు చూడలేని పరిస్థితి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరీ ఎక్కువగా వాడుతున్న జబర్దస్త్ స్కిట్స్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ షో ప్రోమో వచ్చింది. అందులో మొదటగా బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో.. బాల్యం ఇచ్చావ్.. తీసుకుని పోయావ్.. యవ్వనం ఇచ్చావ్ తీసుకుని పోయావ్.. కానీ భార్యని ఇచ్చావ్ ఎందుకు మర్చిపోయావని బుల్లెట్ భాస్కర్ అంటాడు. ఇక అతని భార్యగా నటించిన ఫైమా అయితే.. ‘మొన్న పక్కింటి శాంతికి ఫోన్ తీసుకుని వచ్చారట కదా.. డబ్బులు ఇచ్చిందా?’ అని అడిగితే.. ‘హా లేదు.. రూంకి వచ్చింది’ అని అన్నాడు. రూంకి ఎందుకు అని అని ఫైమా అంటే.. ‘అదే డబ్బులు ఇవ్వడానికి’ అంటూ డబుల్ మీనింగ్ పంచ్ వేశాడు బుల్లెట్ భాస్కర్. తరువాత.. కెవ్వు కార్తీక్ స్కిట్‌లో.. ‘వీడు నా కొడుకు.. నీ కొడుకు ఎక్కడా ఫారిన్ పంపించావా? అని యాంకర్ రష్మిని అడుగుతాడు కార్తీక్. దానికి యష్మీ.. ‘నాకు అలాంటివి ఏమీ లేవు’ అని అన్నది. ‘అంటే నీకు పెళ్లి కాలేదా?’ అని కెవ్వు కార్తీక్ అంటే.. ‘పెళ్లి కావడానికి కొడుకుని కనడానికి ఏం సంబంధంరా ’అని రష్మీ అంది. ఇక ఇక్కడ డబుల్ మీనింగ్ కోటింగ్ మరీ పెరిగింది. అదేంటంటే.. ఆటో రాంప్రసాద్ స్కిట్ లో.. రాంప్రసాద్ హోమ్స్ నీడ్స్‌కి కస్టమర్‌గా వచ్చిన దొరబాబు.. మంచి చాప ఏదైనా ఉందా అని అడుగుతాడు. బెడ్‌లు తీసుకోండి సర్ అని రాం ప్రసాద్ అంటే.. బెడ్‌లు బెడ్ రూంలోనే ఉంటాయి.. చాప అయితే చుట్టబెట్టుకుని వెళ్లిపోవచ్చని దొరబాబు అంటాడు. సరేనని రామ్ ప్రసాద్.. చాప ఇస్తే.. ఇది మంచి చాపేనా?? లాస్ట్ టైం ఓ వెధవ చాప ఇచ్చాడు. రెండు మోకాళ్లు కొట్టుకుని పోయాయని దొరబాబు అన్నాడు. చాపకి మోకాళ్లు కొట్టుకునిపోవడానికి సంబంధం ఏంటండీ అని రామ్ ప్రసాద్ ఏమీ తెలియనట్టు అడిగితే.. ఆ మోకాళ్లు కొట్టుకుని పోవడం గురించి బాగా తెలిసిన యష్మీ.. హ హ హ అంటూ తెగ నవ్వేసింది. అంటే యష్మీకి అర్థమైన ఈ బూతుపురాణం జనాలందరికి అర్థమవ్వడానికి తెగ నవ్వేసింది. ఇది ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ అయ్యింది.  ఇక స్కిట్ లో సరే ఇంతకీ చాపపై మోకాళ్లు ఎందుకు కొట్టుకుని పోయాయి సర్ అని రాం ప్రసాద్ అడిగితే.. నేను యోగా టీచర్‌ని సార్.. పొద్దున్నే మోకాళ్లపైకూర్చుని యోగా చేస్తానని.. చాపపై చేసే ఆ భంగిమల్ని చేసి మరీ చూపించాడు దొరబాబు. ఇక ఆ భంగిమల్ని చూసి తెగ నవ్వుకుంది యాంకర్ యష్మీ. రోజు రోజుకి ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువవుతున్నాయంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ప్రోమోని మీరు చూశారా.. చూస్తే మీకనిపించిందో కామెంట్ చేయండి.

దేనికి బ్రో అంత మాటనేశావ్.. నాగార్జున సరే..మరి చిరంజీవి ఎవరు?

  బిగ్ బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోహైల్ చిన్న ఆర్టిస్ట్ గా మొదలై హీరోగా ఎదిగాడు. అలాగే బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు. ఇక రీసెంట్ గా నాగార్జునను కలిసిన ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. అందులో కింగ్ తో ఏదో సీరియస్ గా ఐతే డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోకి " కింగ్  నాగార్జున సర్, తెలుగు మూవీ  గ్రీకు గాడ్. వినయం, విధేయత ఆయన గుర్తులు. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన ఒక లెజెండ్ అంతేకాదు తెలుగు సినిమాకు దొరికిన వజ్రం" అనే రేంజ్ లో ఒక కొటేషన్ కూడా పెట్టాడు. దాంతో ఒక నెటిజన్ ఇలా అన్నాడు.."అలాంటప్పుడు చిరంజీవి ఎవరు ? ఆయన మూవీ ఇండస్ట్రీకి దొరికిన దేవుడు కాదా ? ఎవరిని కలిసినా ఇలా దేవుడు అంటావ్ ? ఎందుకు బ్రో ఇదంతా ?" అని ఘాటుగా ప్రశ్నించాడు. ఇక మరో నెటిజన్   గట్టిగానే రిప్లై ఇచ్చాడు.. "సరే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవుడు అన్నానని శ్రీశైలంలో శివుడుని దేవుడు అనడం మానేస్తారా బ్రో. మనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరు దేవుడే.   తెలుగు సినిమాకి ఒక్కరే హీరో వున్నారా..ఒక్కరినే దేవుడు అని పిలవడానికి.. నాగార్జున సర్, చిరంజీవి సర్ వీళ్ళే కాదు ప్రజల కోసం పాలిటిక్స్ లో కి వచ్చిన పవన్ కళ్యాణ్ సార్ కూడా దేవుడే, వరద సహాయం చెయ్యడానికి మొదటి ముందుకు వచ్చే ప్రభాస్ దేవుడే... చిన్నపిల్లలకు  హార్ట్ ఆపరేషన్ చేయించే  మహేష్ బాబు గారు కూడా దేవుడే యిలా చెప్తూ వుంటే టైం సరిపోదు బ్రో.. సోహెల్ సర్ నిజం మాట్లాడాడు.. తనకు సహాయం చేసిన వారిని దేవుడు అన్నారు..అది తప్పు కాదు కదా బ్రో...ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి బ్రో" అంటూ చెప్పుకొచ్చారు.

గ్రూప్ గేమ్ ఆడుతున్నారని తెలిసిపోయింది..పృథ్వీని బాడీ షేమింగ్ చేశావన్న బేబక్క!

  బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడు లేనివిధంగా పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సోనియా మొదటగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చింది. ఇక వచ్చీ రాగానే నిఖిల్, ప్రేరణనలని నామినేషన్ చేసి అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత శేఖర్ బాషా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ ప్రేరణను నామినేట్ చేశాడు. ప్రేరణలో రూడ్‌నెస్, అవతల వారిని కించపరిచేలా మాట్లాడటం, ఒక్కోసారి పురుగును చూసినట్లు చూడటం.. ఇవన్నీ జనాలు చూశారంటూ శేఖర్ బాషా అన్నాడు. ఆ తర్వాత పానిపట్టు టాస్కులో నిఖిల్ మీ ఇద్దరినీ రఫ్‌గా హ్యాండిల్ చేశాడని చెప్పి మీరు అనుకున్నారు.. అది మీకు బ్యాడ్ అనిపించింది కదా.. మరి ఆ పాయింట్‌తో నిఖిల్‌ని నువ్వు నామినేట్ చేసి ఉండొచ్చు కానీ నీ టీమ్ వాడైన గౌతమ్‌ని నామినేట్ చేశావంటూ శేఖర్ బాషా అన్నాడు. దీనికి నాకు గౌతమ్ మీద రీజన్ స్ట్రాంగ్‌గా అనిపించిందంటూ ప్రేరణ అనగానే.. మరి అంతే స్ట్రాంగ్ రీజన్ నిఖిల్ మీద ఉన్నప్పుడు ఎందుకు నామినేట్ చేయవని అనగానే.. ప్రేరణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత యష్మీని నామినేట్ చేశాడు బాషా. కిల్లర్ గర్ల్స్ నామినేషన్ లో నా ఫ్రెండ్ అయినా సరే ప్రేరణని నామినేట్ చేస్తా అని అన్నావ్.. ఒక్కసారి అయిన నామినేట్ చేశావా అని శేఖర్ బాషా అన్నాడు.‌ నాకు నామినేషన్ లో అప్పుడు వేరే వాళ్ళు స్ట్రాంగ్ అనిపించారని యష్మీ అనగానే.. అది కాదు మీరు ముగ్గురు నామినేషన్ ముందు ఎవరెవరికి వేయాలంటు డిస్కషన్ చేసుకుంటారు. ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాల్లోకి వెళ్లిపోయిందంటూ నిఖిల్-పృథ్వీ-యష్మీల గురించి  చెప్పుకొచ్చాడు. ఉదాహరణకు ఒక్కటి చెప్పాడు శేఖర్ బాషా.. రోహిణిని అవినాష్ సేవ్ చేసి నిఖిల్‌ని నామినేట్ చేసినప్పుడు.. అతను లైట్ తీసుకున్నాడు కానీ నీకెందుకు అంత పెయిన్ వచ్చిందంటూ యష్మీని కొశ్చన్ చేశాడు. ఇలా చాలా ఉదాహరణలు చూసిన తర్వాత మీది గ్రూప్ గేమ్ అని జనాలకి తెలిసిపోయిందంటూ బాషా చెప్పాడు. మరోవైపు బేబక్క వచ్చి నిఖిల్, పృథ్వీలను నామినేట్ చేసింది. ముఖ్యంగా తన ఎలిమినేషన్‌కి నిఖిల్ కారణమని.. సోనియా కుక్కర్ పాయింట్‌కి నిఖిల్ ఒప్పుకున్నాడంటూ బేబక్క అంది. ఆ రోజు నువ్వు చెప్పావనే నేను అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను.. అందువల్లే సీత ఎగ్ బుజ్జి చేసుకుంటా అంటే వద్దన్నా.. గ్యాస్ ఆన్ చేయనివ్వలేదు. ఒక్కసారే వంట చేద్దామని అని ఫిక్స్ అయి మనమంతా అనుకొని చేశాం‌. కానీ సోనియా నా మీద అదే పాయింట్ తో నామినేషన్ చేస్తే నువ్వు నాకు సలోర్ట్గా లేవు.. ఆమెకి బయాజ్(పక్షపాతం) గా ఉన్నావంటు బేబక్క సూపర్ పాయింట్ లాగింది. ఇక నిఖిల్ ఏదో కవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ ఒక మనిషిని ఎంత తక్కువ చేయాలో నీకు బాగా తెలుసు.. అప్పుడు నన్ను అలా చేసి పంపించావ్.. తర్వాత రోహిణిపై కూడా అలాంటి బాడీ షేమింగ్ చూపులు చూశావంటూ బేబక్క అంది. ఆ రోజు నువ్వు అలా చూసినందుకే నాకు సారీ చెప్పావ్.. టాస్క్ లు ఒక్కటే కాదు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలి. నీకంటే బలమైన ఆటగాడు నిఖిల్ మీద ఎప్పుడైన గెలిచావా అంటు పృథ్వీని బేబక్క నామినేషన్ చేసింది. ఈ వీక్ నామినేషన్లు సూపర్ గా సాగుతున్నాయి.

సోనియా దెబ్బకి అల్లాడిన నిఖిల్.. గ్యాప్ లేకుండా బాదుడే బాదుడు!

  బిగ్ బాస్ హౌస్ లో పన్నెండవ వారం నామినేషన్ల హవా మాములుగా లేదు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ ని లోపలికి తీసుకొచ్చి నామినేషన్ చేపించాడు బిగ్ బాస్. హౌస్ లోకి మొదటగా సోనియా వచ్చింది. వచ్చీ రాగానే నిఖిల్, పృథ్వీ వెళ్ళి సోనియాని హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత సోనియా మొదటి నామినేషన్ గా ప్రేరణని చేసింది. తన బిహేవియర్ బాలేదని, నబీల్ ని గౌతమ్ ని ట్రీట్ చేసిన విధానం బాలేదని చెప్పి నామినేషన్ చేసింది. కిల్లర్ గర్ల్ టాస్క్ లో పృథ్వీ గురించి మాట్లాడింది నచ్చలేదని చెప్పి ప్రేరణని నామినేషన్ చేసింది సోనియా. ఆ తర్వాత నిఖిల్ ని నామినేట్ చేసింది సోనియా. నేను ఫస్ట్ వీక్‌ నుంచి చెప్తున్నా.. నీకు ఇమ్యునిటీ లేకపోతే నా నామినేషన్ నీకే పడుతుందని.. తొలి నాలుగు వారాలు నువ్వు ఇమ్యునిటీలోనే ఉన్నావ్. అందుకే నామినేట్ చేయలేదని అన్నది. నీ నుంచి నేనే కాదు.. నీ ఫ్యాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేసేది ఏంటంటే.. జెన్యునిటీ అని అంటూ.. మొదటిగా పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్.. కేర్ లెస్.. కాఫీ కప్పు కోసం నామినేట్ చేశావ్. ఇప్పటి వరకు నువ్వు చేసిన నామినేషన్స్‌లో ఒక్కటైనా వ్యాలిడ్ రీజన్ ఉందా.. అసలు గమనించుకున్నావా అని సోనియా అడిగింది. నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేనని నిఖిల్ అన్నాడు. అనిపించడం కాదు.. పలానా వాళ్లని కరెక్ట్ రీజన్‌తో నామినేట్ చేశా అని చెప్పమని సోనియా అడిగింది. ఆ మాటతో నిఖిల్.. నన్ను కూడా సరైన రీజన్ లేకుండా నామినేట్ చేశారని నిఖిల్ అన్నాడు‌. నేను అడిగింది వేరు నువ్వు చెప్తున్నది వేరు.. ఎందుకు నేను ఈ మాట నీతో చెప్తున్నానంటే.. పృథ్వీ గురించి కూడా.. ముందు ఒకలా అంటావ్. అతని గురించి ఎవరైనా నెగిటివ్‌‌గా అంటే.. అవునురా వాడు అంతేరా అంటావ్. ఇదీ నీ ఫ్రెండ్ షిప్. ఇది గేమ్ షో కాదు.. గేమ్ షో అయితే విన్నర్ అవుతావ్. కానీ ఇది పర్సనాలిటీ గేమ్ షో. నువ్వు ఫస్ట్ వీక్స్‌లో చీఫ్ అయ్యావ్ కదా.. ఇన్ని వారాలు ఎందుకు అవ్వలేదు. నీలో అసలు జెన్యూనిటీ లేదు.. నువ్వు ఫెయిల్ అయితే దాన్ని అందరిపై నెట్టేస్తావని సోనియా అనగా.. నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావ్.. ఇవన్నీ చెప్తున్నావ్.. నాకు అర్థమవుతుంది.. నేను సేఫ్ గేమ్ ఆడటం లేదని నిఖిల్ అన్నాడు. దానికి పెద్దగా నవ్విన సోనియా.. అమ్మాయి.. నో అంటే నో అని చెప్పి గౌతమ్‌ని నామినేట్ చేయడం నామినేషన్ పాయింటా అని అన్నది. నో అన్నందుకు కాదు.. అతను డిస్ రెస్పెక్ట్ చేశాడు. అందుకే నామినేట్ చేశానని నిఖిల్ అన్నాడు. రెండు నెలల నుంచి ప్రేరణ డిస్ రెస్పెక్ట్ చేస్తుంటే నీకు కనిపించలేదా అని సోనియా అడిగేసరికి.. నేను ఈరోజు ఆమెనే చేద్దాం అనుకున్నానని నిఖిల్ అన్నాడు. అక్కా అని అన్నందుకు నువ్వు అతన్ని నామినేట్ చేశావ్. ప్రేరణ డిస్ రెస్పెక్ట్‌గా లేదా? ఆమెను ఎందుకు నామినేట్ చేయలేదు.. యష్మీ డిస్ రెస్పెక్ట్‌గా లేదా? ఆమెను ఎందుకు నామినేట్ చేయలేదు. తేజా చేసింది తప్పని చెప్పినప్పుడు.. యష్మీ చేసింది కూడా తప్పే కదా.. కానీ నువ్వేం అన్నావ్.. యష్మీది తప్పే కాదని చెప్పావ్ కదా అని సోనియా. అడిగేసరికి.. నేను అలా అనలేదే.. తప్పని అన్నానని నిఖిల్ అన్నాడు. అప్పుడు తేజా, రోహిణిలు తగులుకున్నారు.. తప్పు లేదన్నావ్ కదా అని.. దాంతో నిఖిల్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.‌గ్రూప్‌గా సేఫ్ గేమ్ ఆడుతున్నావ్.. ఇప్పుడే కాదు.. ఫస్ట్ వీక్ నుంచి ఇలాగే ఉంది నీ గేమ్.  అంటు సోనియా రఫ్ఫాడించగా నిఖిల్  అల్లాడిపోయాడు.

రెండు‌ కుటుంబాల మధ్య ప్రేమ నిలవగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -06 లో....చిన్నోడు దొంగతనం చేసాడని రామరాజు తిడతాడు. అయినా దొంగతనం చేసిన నడిపోడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత చిన్నోడు లోపలికి వెళ్లి బాధపడుతుంటాడు. ఎందుకు రా ఇలా దొంగతనం చేసావ్.. నాన్నని ఎందుకు బాధపెడుతావంటూ కోప్పడతాడు. అప్పుడే నడిపోడు చిన్నోడి దగ్గరికి వచ్చి సారీ అని చెప్తాడు. అక్కడ అదంతా జరుగుతుంటే సైలెంట్ గా ఉండి ఇక్కడ సారీ చెప్తున్నావా అని చిన్నోడు కోప్పడుతుంటే అప్పుడే వాళ్ళ మామ వచ్చి నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావ్.. అసలేం జరిగిందని అడుగుతాడు. ఆ దొంగతనం చేసింది నడిపోడని చెప్తాడు. మరి ఎందుకురా మీ నాన్న అంత తిడుతుంటే సైలెంట్ గా ఉన్నావ్.. ఇప్పుడే వెళ్లి మీ నాన్నకి నిజం చెప్తానని వాళ్ళ మామ అనగానే.. వద్దు మామ, వాడు చూడు ఎలా భయపడుతున్నాడో. వాడు తప్పు చేసాడని తెలిస్తే అసలు ఉండలేడని ఆపుతాడు. ఎందుకురా అన్ని మాటలు అంటున్నా కూడ మౌనంగా ఉన్నావని వాళ్ళ మామ అడుగుతాడు. నా కుటుంబం కోసమే కదా అని చిన్నోడు అంటాడు. ఆ తర్వాత వేదవతి చిన్నోడి దగ్గరికి వచ్చి.. నువ్వు మాట్లాడింది మొత్తం విన్నాను. ఎంత మంచి వాడివి అని అంటుంది. ఆ తర్వాత వేదవతి తన కుటుంబానికి దూరం అయ్యానని బాధపడుతుంటే చిన్నోడు లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. మరొక వైపు వేదవతి వాళ్ళ అమ్మ బాధపడుతుంది. ఆ తర్వాత వేదవతి బాధపడడం రామరాజు చూసి.. నాకు కుటుంబం ఉంది ఎందుకు నన్ను ఇంకా అనాథ అంటున్నారు.. మనలా మన పిల్లలు ప్రేమ వివాహం చేసుకోవద్దు.. నేనే సంబంధం కుదుర్చి పెళ్లి చేస్తానని అంటాడు. ఆ తర్వాత వేదవతి తమ్ముడు భద్రవతి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. భద్రవతి ఎందుకు వచ్చావ్ అంటుంది. నాకు హక్కు ఉంది నేను వస్తానని అతను అంటాడు. గంట సేపు ఉండి వెళ్ళమని భద్రవతి చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి.. మన పెద్దోడికి తెలిసిన వాళ్ళు సంబంధం తెచ్చారని అంటుంది. వాడికి నేను చూసి చేస్తాను అయిన నా పెద్ద కొడుకు నేను చెప్పింది చేస్తాడని రామరాజు అంటాడు. ఆ తర్వాత పెద్దోడు గుడిలో ఎవరికో  అమ్మాయికి రమ్మని కాల్ చేస్తాడు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భార్యని తప్పుగా అర్థం చేసుకున్న భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -256 లొ.....సీతాకాంత్ తన తల్లి పేరు పైన ఆస్తులు రాయాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో లాయర్ కి చెప్పి డాక్యుమెంట్స్ రెడీ చేయమంటాడు. అప్పుడే లాయర్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. దాంతో శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు ఆస్తి సొంతం కాబోతుందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క సంతకం చేస్తే ఆస్తులు తమ పేరున అయిపోతాయని లాయర్ అంటాడు. సీతాకాంత్ సంతకం చేస్తాడు. ఇక ఆస్తులు అన్నీ కూడా నా తల్లివే అని సీతాకాంత్ అంటాడు. ఇక నువ్వు ఇక్కడ ఎందుకు అక్కయ్య వెళ్ళిపోమని రామలక్ష్మిని  శ్రీవల్లి అనగానే.. వల్లీ అంటూ సీతాకాంత్ తనపై కోప్పడతాడు. అయినా నేను ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళాలి చెల్లి.. ఈ ఆస్తులకి యజమానిరాలిని నేనే అని రామలక్ష్మి అనగానే.. అప్పుడే డాక్యుమెంట్స్ అన్ని సందీప్ చూస్తాడు. అవన్నీ కూడా రామలక్ష్మి పేరున ఉండడంతో అందరు షాక్ అవుతారు. ఏంటి లాయర్ గారు నేను మా అమ్మ పేరున చెప్పను కదా అని సీతాకాంత్ అనగానే.. మీరు చెప్పినట్టే చేసానని లాయర్ అంటడు. లాయర్ బయటకు వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ రామలక్ష్మి మారుస్తుంది. లాయర్ గారు మీరు వచ్చిన పని అయింది వెళ్ళండి అని లాయర్ ని రామలక్ష్మి పంపిస్తుంది. ఆస్తుల కోసం ఇదంతా చేస్తావా అని శ్రీలత అంటుంది. నీకు ఆస్తులు ముఖ్యం అయితే నేనే రాసేవాడిని కదా ఎందుకు ఇలా మా వాళ్లపై నిందలు వేసావని సీతకాంత్ అంటాడు. నేనేం చేసినా మా ఆయన కోసమని రామలక్ష్మి అంటుంది. అలా అయితే ముందే చెప్పాలి కదా ఇలా చెయ్యడం ఏంటని పెద్దాయన, సిరి అంటారు. ఆ తర్వాత రామలక్ష్మి అక్క ఎంత మోసం చేసిందని శ్రీలత , సందీప్ లతో శ్రీవల్లి అంటుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి మాట్లాడుతుంది. నువ్వు గెలిచావనుకుంటున్నావ్ గనీ సీతా మనసులో నీపై నమ్మకం పోయిందని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. ఆ తర్వాత నువ్వు ఆస్తులపై ప్రేమ పెంచుకున్నావ్.. అందుకే ఇదంతా చేసావ్.. మోసం చేసావ్ రామలక్ష్మి అని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప చేసే ఉప్మా బిర్యానీకి క్రేజ్ పెంచడానికి కార్తీక్ ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -205 లొ....శివన్నారాయణకి తన ఫ్రెండ్ కాల్ చేసి పేపర్ లో వచ్చింది చూసాను. మీది ఇంత పరువు తక్కువ కుటుంబమని అనుకోలేదు. అలాంటి ఇంటి నుండి నేను సంబంధం కలుపుకోను. మీ మనవరాలికి వేరే సంబంధం చూసుకోండి అని అతను అంటాడు. పేపర్ లో ఏం వచ్చిందని శివన్నారాయణ చూస్తాడు. అందులో దీప కార్తీక్ ల ఫోటో వస్తుంది. అది చూసి వీడు ఇంటి పరువు తీస్తున్నాడని అంటాడు. అప్పుడే పారిజాతం అది చూసి వీడు నాతో అన్నంత పని చేసాడని అనుకుంటుంది . మీ పరువు తీసిన వాడిని వదిలిపెట్టవద్దని పారిజాతం అనగానే.. ఆ విషయం నువ్వు నాకు చెప్పనవసరం లేదు. వాడి సంగతి చెప్తానని శివన్నారాయణ బయలుదేర్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం పేపర్ చూస్తే కోపంగా.. ఆ దీప నేను అన్న మాటలన్ని చెప్పి రెచ్చగొట్టినట్లు ఉంది. అందుకే ఇలా చేసాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఇప్పుడు నేను బావతో మాట్లాడాలని జ్యోత్స్న ఆవేశంగా బయలుదేర్తుంది. మరొకవైపు న్యూస్ పేపర్ లో వచ్చింది దీపకి చూపించాలనుకొని ఇబ్బంది పడుతుంటాడు. అమ్మకి అయిన చూపిద్దామని అనుకుంటాడు. అప్పుడే స్వప్న, కాశీ లు వస్తారు. పేపర్ లో వచ్చిన న్యూస్ ని చూపిస్తారు. అప్పుడే కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్తుంటే.. శౌర్యని తీసుకొని వెళ్ళురా ఈ రోజు సెలవు కదా అని కాంచన అంటుంది.  వదినని కూడ తీసుకొని వెళ్ళమని స్వప్న అంటుంది. ఇక అందరు కలిసి శౌర్య, కార్తీక్ లతో పాటు దీపని కూడా పంపిస్తారు. ఆ తర్వాత దీపని తీసుకొని కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్ళాక.. అక్కడ మెను మొత్తం చేంజ్ చేస్తాడు. మొత్తం దేశీయ వంటకాలతో పాటు దీప చేసే ఉప్మా బిర్యానీని కూడా మెనూ లో ఆడ్ చేస్తాడు. ఉప్మా బిర్యానీ రెసిపీ చెప్పమని దీప నీ అడుగగా.. అది ఎందుకని దీప అంటుంది. ఇప్పుడు దాని స్థాయి పెంచుతున్నావ్ చెప్పమని కార్తీక్ అంటాడు. ఒక వైపు కార్తీక్ తో మాట్లాడాలని జ్యోత్స్న వస్తుంటుంది. కార్తీక్ తో గొడవ పడాలని శివన్నారాయణ‌ వస్తుంటాడు. అక్కడ పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతున్న రుద్రాణి.. కావ్య కనిపెట్టగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -570 లో.....కావ్య డిజైన్స్ వేస్తూ రాజ్ ఆఫీస్ లో తన నడుం పట్టుకున్న విషయం గుర్తుచేసుకొని మురిసిపోతుంది. కృష్ణమూర్తి ఏదో రిపేర్ చేస్తూ సౌండ్ చేస్తుంటే కనకం వచ్చి.. కావ్య డిజైన్స్ వేస్తుంది, సైలెంట్ గా ఉండండి సౌండ్ చెయ్యకని చెప్తుంది. ఇక భోజనం పట్టుకొని సైలెంట్ గా కావ్య దగ్గరికి వెళ్తుంది. నేను అక్కడికే వస్తానని కావ్య అనగానే డిస్టబ్ ఎందుకు నువ్వు డిజైన్స్ వెయ్ అని కనకం అంటుంది. ఎంత త్వరగా నన్ను నా అత్తింటికి పంపాలని చూస్తున్నావని కావ్య అనగానే.. కనకం తన నటనని చూపిస్తుంటే వద్దులే నేను డిజైన్ వేస్తాను వెళ్ళని అంటుంది. మరొకవైపు రాజ్ తన  అంతరాత్మతో మాట్లాడతాడు అంతరాత్మ కూడా కావ్యని పొగుడుతుంటే.. వెళ్ళమంటూ రాజ్ చిరాకుపడతాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరకి అపర్ణ వస్తుంది. ఇప్పుడు పోటీలో ఎవరు గెలిచిన సీఈఓ అవుతారు లేదా కావ్య ఇంట్లోకి వస్తుంది అంతే కానీ నా కొడుకుకి ఏం న్యాయం జరుగుతుందని ధాన్యలక్ష్మి అనగానే.. వాళ్ళిద్దరు కలిసిపోతే కళ్యాణ్ ని ఇంటికి తీసుకొని వస్తారని అపర్ణ అంటుంది. అదంతా రుద్రాణి వింటుంది. అపర్ణ వెళ్ళక మళ్ళీ రుద్రాణి వచ్చి.. ఇంకా ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి తనే వంట చేసుకుంటుంది. ఇక నుండి నా వంట నేనే చేసుకుంటా.. ఇక వేరే కాపురం అన్నట్టు ఇందిరాదేవి, అపర్ణలతో మాట్లాడుతుంది. రాత్రి అంత బాగా చెప్పానని ఇందిరదేవితో అపర్ణ అంటుంది. ఆ రుద్రాణి వల్లే ఇదంతా అని ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు కావ్య మేడమ్ లాగా డిజైన్స్ ఎవరు వెయ్యలేరని రాజ్ తో మూర్తి అంటాడు. దాంతో రాజ్ అతన్ని తిడుతాడు. కానీ ఆ తర్వాత అది కూడా నిజమే అనుకొని కావ్య డిజైన్ దొంగతనం చెయ్యడానికి వెళ్తాడు. మేడమ్ డిజైన్ బాగున్నాయని శృతి అంటుంది. ఇక కావ్య డిజైన్లు ఆఫీస్ లోనే పెట్టి వెళ్తుంది. కావ్య వేసిన డిజైన్స్ రాజ్ అన్ని ఫోటో తీసుకుంటాడు. అప్పుడే కావ్య బ్యాగ్ మర్చిపోయానని వచ్చేసరికి తనని గమనించి టేబుల్ కింద దాక్కుంటాడు రాజ్ కానీ పేపర్ అటు ఇటుగా ఉండడంతో కావ్యకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ హిస్టరీలోనే ఇదెప్పుడు చూడలే.. ట్విస్ట్ లతో హీటెడ్ నామినేషన్!

    బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్న నామినేషన్ ప్రోమో రానే వచ్చింది. గూస్ బంప్స్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు జరగలేదు. రోజుకో ట్విస్ట్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాడు. ఇప్పటి వరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి హౌస్ లోని వారిని నామినేషన్ చెయ్యాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటగా నాల్గవ వారం హౌస్ నుండి బయటకు వచ్చిన సోనియా హౌస్ లోకి మాస్ ఎంట్రీ ఇచ్చింది. తనని చూసి హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టిన సోనియా.. మొదటి నామినేషన్ ప్రేరణని చేసింది. వేరే వాళ్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అలా మాటలు వదిలేస్తావ్.. క్యారెక్టర్ లెస్ అన్నావ్.. కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు గౌతమ్ ని అన్నావని సోనియా అంటుంది. గౌతమ్ ఇర్రెస్ బాన్సిబుల్ గా ఉన్నాడని ప్రేరణ అంటుంది. ఇక మధ్యలో గౌతమ్ కలుజేసుకుంటాడు. నేను మాట్లాడుతున్నా ఇది నా నామినేషన్ డెఫిండ్ చేసుకోనియ్ అని ప్రేరణ అనగానే.. నీ నామినేషన్ డెఫెండ్ లో నా పేరు ఎందుకు తీస్తావని గౌతమ్ వాదిస్తాడు. ఆ తర్వాత ఫస్ట్ పృథ్వీనీ ఎందుకు నామినేట్ చేసావ్ నిఖిల్ అని నిఖిల్ ని సోనియా అడుగుతుంది. కేర్ లెస్ ఎక్కడ వస్తువులు అక్కడే పెడుతాడని నిఖిల్ అంటాడు. నీకు మంచి పాయింట్ పెట్టినా అని బెస్ట్ మూమెంట్ ఉన్నదా నీకు అని సోనియా అడుగుతుంది. నీకు యష్మీ ఏం చెప్పిందో నాకు తెలియదని సోనియా అనగానే.. నువ్వు చెప్పాక నేను ఐ కట్ ఇట్.. నేను ఆ అమ్మాయితో దీని గురించి మాట్లాడలేదని నిఖిల్ అనగానే.. యూ కట్ ఇట్.. నాకు చెప్పి ఉంటే నీ జోలికి వచ్చేది కాదు ఇక్కడ బ్యాడ్ అయింది ఎవరు నేనే అని యష్మీ అగ్రెస్ అవుతుంది. ఇక అల్ ది బెస్ట్ అంటూ సోనియా నిఖిల్ ని నామినేట్ చెయ్యడంతో అందరు షాక్ లో ఉంటారు.  

అవినాష్ ని సేవ్ చేసిన నబీల్.. టాప్-5 ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్-8 పదకొండు వారాలు పూర్తిచేసుకుంది. ఇక నిన్నటితో ఫ్యామిలీ వీక్ ముగించేశాడు బిగ్ బాస్ మామ. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌‌బాస్ స్టేజ్ మీదకి ముందుగా యష్మీ కోసం తన ఫ్రెండ్ సామ్, నటి శ్రీసత్య వచ్చారు. ఆ వెంటనే తేజ కోసం తన నాన్న, వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ కోసం తన బ్రదర్ అశోక్, రైటర్ కోన వెంకట్ రావడం విశేషం. ఇక చివరిగా నిఖిల్ కోసం తన తండ్రితో పాటు సీజన్ -7 రన్నరప్ అమర్‌దీప్   వచ్చారు. యష్మీ కోసం శ్రీసత్య, తన ఫ్రెండ్ వచ్చారు. యష్మీ నీకు ఫ్రెండా అంటూ శ్రీసత్యను నాగార్జున అడుగగా.. అవును సర్ ఆరేళ్లుగా ఫ్రెండ్.. వీళ్లది ఒక బ్యాచ్ ఉంటుందంటూ శ్రీసత్య అంటుంది. ఏంటా బ్యాచ్ అంటూ నాగ్ అడగగా... అంటే సాయంత్రం ఆరు తర్వాత యష్మీ ఇలా ఉండదు సర్ అని శ్రీసత్య చెప్పింది. రూ.3 లక్షల ప్రైజ్ మనీ పెంచుతా చెప్పేసేయ్ అంటూ నాగ్ అనగానే.. దీంతో సాయంత్రం 6 దాటితే మావా ఏక్ పెగ్ లా.. అంటూ కుమ్మేస్తామ్ అంటూ యష్మీయే మొత్తం బయటపెట్టేసింది. యష్మీ స్టెప్స్ కి శ్రీసత్య మాటలకి నాగార్జునే షాక్ అయ్యారు. గౌతమ్ కి మొదటి స్థానం ఇచ్చింది శ్రీసత్య. ఇక రెండు నిఖిల్, మూడు నబీల్, నాలుగు అవినాష్, అయిదవ స్థానం ప్రేరణకి ఇచ్చింది శ్రీసత్య. టేస్టీ తేజ కోసం అతని తండ్రి, విజే సన్నీ స్టేజ్ మీదకి వచ్చారు. ఇక హౌస్ లో ఒక్కొక్కరి గురించి ఒక్కోటి చెప్పుకొచ్చాడు. గౌతమ్ కి మొదటి స్థానం ఇచ్చిన విజే సన్నీ.. నిఖిల్ కి రెండు, నబీల్ కి మూడు,‌ ప్రేరణకి నాలుగు, అవినాష్ ని అయుదవ స్థానంలో ఉంచాడు విజే సన్నీ. ఆ తర్వాత అవినాష్ కోసం బ్రదర్ అశోక్, రైటర్ కోన వెంకట్ వచ్చాడు. హౌస్ లోని ఒక్కొక్కరికి తను రాసిన సినిమాలలో నుండి ఒక్కో టైటిల్ వచ్చాడు కోన వెంకట్. నిఖిల్‌కి బాద్ షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకి నిన్నుకోరి, యష్మీకి రెడీ, ప్రేరణకి గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కి శివమణి నాకు కొంచె మెంటల్, అవినాష్‌కి అదుర్స్, టేస్టీ తేజకి ఢీ, నబీల్‌కి దూకుడు అనే టైటిల్స్ ఇచ్చారు కోన. నబీల్ కి మొదటి స్థానం ఇచ్చిన కోన, రెండు నిఖిల్, మూడు రోహిణి, నాల్గవ స్థానంలో విష్ణుప్రియ, అయిదవ స్థానంలో గౌతమ్ కి ఇచ్చాడు.   నిఖిల్ కోసం అతని నాన్న,  ఫ్రెండ్ అమర్‌దీప్ వచ్చారు. ముందుగా నిఖిల్‌తో తన ఫ్రెండ్‌షిప్ గురించి అమర్‌ దీప్ చెప్పాడు. నిఖిల్ నేను ఎప్పటినుంచో ఫ్రెండ్స్ సర్.. వాడు టాస్కు కింగ్, బిగ్‌బాస్ బాద్‌షా.. ఇవన్నీ బయట చెబుతున్న మాటలే. రేయ్ ఎమోషన్స్‌ తగ్గించుకో.. నువ్వు స్ట్రాంగ్ మైండెడ్.. నువ్వు టఫ్ క్యాండేట్, వస్తే కప్పుతోనే రా అంటూ అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. ఇక విష్ణుప్రియకి మొదటి స్థానం ఇచ్చాడు అమర్ దీప్.. నబీల్ కి రెండు, రోహిణికి మూడు, గౌతమ్ కి నాలుగు, తేజని అయిదవ స్థానంలో ఉంచాడు అమర్ దీప్. ఇక నామినేషన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిని సేవ్ చేయగా..‌చివరగా టేస్టీ తేజ, అవినాష్ ఉన్నారు. ఇక ఇద్దరిని యాక్షన్ రూమ్ కి వెళ్ళమన్నాడు నాగార్జున. నబీల్ నీ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది.. అది ఇప్పుడు వాడతావా లేదా అంటూ నాగార్జున అడుగగా.. దీనికి నా దగ్గర షీల్డ్ ఉండటానికి అవినాష్ కూడా ఓ కారణం.. నేను జనాల వల్ల సేవ్ అయి వెళ్తానని నమ్ముతున్నాను.. అందుకే అవినాష్‌కి ఇద్దామనుకుంటున్నానంటూ నబీల్ చెప్పాడు. ఓటింగ్ ప్రకారం అవినాష్ ఎలిమినేట్ కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడాడు.. యూ ఆర్ సేఫ్.. అంటూ నాగార్జున అన్నాడు. కానీ తేజ నిన్ను జనాలు ఎలిమినేట్ చేయలేదు.. సేవ్ చేసేలానే ఓట్లేశారు.. కానీ అంటూ టెన్షన్ పెట్టాడు. కానీ చివరికి నువ్వు కూడా సేఫ్.. ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున చెప్పాడు.  

నిఖిల్ చేసిన మోసంపై కావ్యశ్రీ...స్పందించిన సోనియా

  బిగ్ బాస్ సీజన్-8 లో‌ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్ చేసిన కంటెస్టెంట్ సోనియా ఆకుల. ‌ఓ వైపు నిఖిల్, మరోవైపు పృథ్వీని ఇద్దరిని ఇన్ ఫ్లూయెన్స్ చేస్తూ హౌస్ ని తన గుప్పిట్లో పెట్టుకోగ అది నచ్చని ఆడియన్స్ ఓట్లు వేయకుండా తనని ఎలిమినేషన్ చేశారు.‌ ఇక బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ముగింపులో‌ సోమవారం నాటి నామినేషన్ ప్రోమో వేశాడు. అది చూసి ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయ్.‌ ఎందుకంటే ఎలిమినేషన్ అయి బయటకి వచ్చిన సోనియా తిరిగి హౌస్ లోకి వచ్చింది.‌ ఇక తను ప్రేరణ, నిఖిల్ లని నామినేషన్ చేయడంతో హౌస్ లో ఒక్కసారిగా నామినేషన్స్ లో ఫైర్ వచ్చేసింది.  ఇక బయట నిఖిల్ చేసిన మోసంపై కావ్యశ్రీ పెట్టిన పోస్ట్‌లు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఇప్పుడు సోనియా ఆకుల అందులో జాయిన్ అయ్యింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌.. దాదాపు కావ్యశ్రీ ఏ విషయాల గురించి ప్రస్తావించిందో.. సోనియా ఆకుల కూడా అదే విషయానికి రిలేటెడ్‌గా ఉంది. ఇద్దరూ కూడా.. నిఖిల్ నమ్మించి మోసం చేయడం గురించి.. అతని మాస్క్ గురించి.. ప్రేమ పేరుతో చేసిన మోసం గురించే ఉండటంతో.. టైమ్ చూసి గట్టిగానే కొట్టినట్టుగా అనిపిస్తుంది. అయితే సోనియా. నిఖిల్ పేరుని ప్రస్తావించకపోయినా అతని గురించే అని అందరికి తెలుసు. సోనియా తన ఇన్ స్టాగ్రామ్ లో నిఖిల్ ని ఉద్దేశించి పోస్ట్ చేయడంతో తనని కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇక సోనియా కూడా గట్టిగానే స్పందించింది. వాళ్ల ముసుగు చూసి మోసపోకండి.. ఫేక్ మనుషులు ఏదో ఒక సందర్భంలో వాళ్ల అసలు రంగుని బయటపెడతారు. వాళ్ల ముసుగు తొలిగేవరకూ వేచి చూడండి అని సోనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. కావ్యశ్రీ నిఖిల్ గురించి పోస్ట్ చేసింది. కొంతమంది చాలా గొప్పగా నటిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్లకి బాగా తెలుసు. పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు. వాళ్ల యాక్టింగ్ కారణంగా.. నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అలాంటి నటుల గురించి వాళ్లని నమ్మే జనాలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చలేం. ఎందుకంటే.. వాళ్లే బాధితులు అన్నట్టుగా నటిస్తారు.. నమ్మిస్తారు. నిజమైన బాధితుల్ని దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్లు మహా దిట్ట అంటూ కావ్య శ్రీ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. నిఖిల్ విషయంలో తనే నిజమైన బాధితురాలిని అని.. అతనో పెద్ద నటుడని.. ఇలాంటి వాడి నిజస్వరూపం జనానికి తెలియక నమ్ముతున్నారని ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టింది కావ్యశ్రీ. ఇద్దరి వల్ల నిఖిల్ కి ఓటింగ్ లో భారీగా నెగెటివ్ అయ్యేలా ఉంది.