టైటిల్ రేసులోకి దూసుకొచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. నబీల్ పరిస్థితేంటో!

  బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ మేట్స్ యొక్క అమ్మ, నాన్న, భార్య, అన్నయ్య.. ఇలా వస్తున్నారు. అయితే ఈ వీకెండ్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేదని కంటే కూడా టైటిల్ గెలిచేదెవరనేది సోషల్ మీడియా లో  డిస్కషన్ జరుగుతుంది. ఈవారం ఓటింగ్ లో అనూహ్యమైన మార్పులతో సాగుతుంది. నిన్న మొన్నటి వరకు నబీల్, నిఖిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని అనుకున్నారంతా కానీ అనూహ్యంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ టైటిల్ రేస్ లో‌ నిలిచాడు.  ఎప్పుడైతే హౌస్ లో   కన్నడ గ్రూపిజం బయటపడిందో.. నబీల్‌ని సైతం ఫినాలేకి రాకుండా చేయాలని నిఖిల్ కుట్రలు పన్నాడో.. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో నిఖిల్ వారితో అలా మాట మార్చేయడం.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇలాంటి వాడినా మనం విన్నర్‌ని చేసేదనే ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. ఇక ఫ్యామిలీ వీక్‌లో అతని తల్లి రావడం.. మనోడి గ్రూప్ గేమ్..  యష్మీతో డిస్టేన్స్ ఉండమని చెప్పడం.. 'జీ' తో నామినేషన్ వద్దని చెప్పడం.. ప్రేరణకి దూరంగా ఉండమనడం.. ఇదంతా చూడటంతో నిఖిల్ చాలా వరకు బ్యాడ్ అయ్యాడు.  ఇదే టైమ్ లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన గౌతమ్ పుంజుకోవడంతో అతను టైటిల్ రేస్‌లోకి వచ్చేశాడు. ఇక ఈవారం ఏ ఓటింగ్‌ పోల్ చూసుకున్నా గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. ఇక తన తప్పు లేకపోయిన శిక్షించబడ్డ టేస్టీ తేజా అనూహ్యంగా టాప్-5 రేస్‌లోకి వచ్చేశాడు. అతను ఓటింగ్ లో సెకెండ్ పొజిషన్‌లో ఉన్నాడు.. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 11వ వారం నామినేషన్స్ లిస్ట్‌లో యష్మీ ఉందనే విషయం బయటకు వచ్చిందో లేదో.. నో డౌట్ ఆమె ఎలిమినేషన్ గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మ రావడంతో యష్మీకి కాస్త ప్లస్ అయ్యింది. అయితే ఏ ఓటింగ్ పోల్ చూసిన యష్మీ రెండు లేదా మూడవ స్థానంలో‌ ఉంటుంది. ఇక అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ డేంజర్ జోన్ లో‌ ఉన్నారు. ఇక నామినేషన్ లో లేని నబీల్ కి విన్నర్ అవ్వడానికి ఓటింగ్ పడుతుందో లేదో అనిపిస్తోంది. కానీ గౌతమ్ కి పాజిటివిటి పెరిగింది. ఇక నిఖిల్ కన్నింగ్ గేమ్ చూసిన ఆడియన్స్ ఓటింగ్ వేయడం కష్టమే. అయితే చివరికి వరకు ఎవరు టైటిల్ గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.  

illu illalu pillalu : నేను అనాథ కాదు.. నాకు కుటుంబం ఉంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -03 లొ.....భద్రవతి, రామరాజులకి గొడవ అవుతుంది. దాంతో వాళ్లపై కోపంతో.. ఇన్ని రోజుల్లో ఎప్పుడు పెళ్లి రోజు జరుపుకోలేదు. ఈ సారి గ్రాండ్ గా పెళ్లి రోజు జరుపుకుంటామని భద్రవతితో ఛాలెంజ్ చేస్తాడు రామరాజు‌. దాంతో రామరాజు ముగ్గురు కొడుకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ తర్వాత రామరాజు పెద్ద కొడుకు అమ్మ నాన్నకి గిఫ్ట్ అంటూ రింగ్స్ ఇస్తాడు. నడిపోడు వాచ్ ఇస్తాడు. వేదవతికి తన కూతురు చెవికమ్మలు ఇస్తుంది. చిన్నోడు పట్టు పంచ తీసుకొని వస్తాడు. అప్పు చేసి తీసుకొని వచ్చాడని రామరాజు కోప్పడతాడు. చిన్నోడు అలిగి కూర్చొని ఉంటే వేదవతి బుజ్జగించి మీ నాన్న ఆ బట్టలు తీసుకునేలా నేను చేస్తానని వేదవతి అంటుంది. రామరాజు పెళ్లి రోజు గనుక వేదవతికి చీర ఇస్తాడు. మీరు ఈ పంచె కట్టుకుంటేనే నేను చీర కట్టుకుంటా అనగానే రామరాజు తప్పక పంచె కట్టుకుంటాడు. ఇక చిన్నోడు ఎదురు ఇంట్లో ఉన్న తన మామ కూతురిని డ్యాన్స్ చేస్తూ రెచ్చగొడతాడు. తను కూడా అలాగే చేస్తుంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు వేరువేరుగా గుడికి వెళ్తారు. మేమ్ ముందు వచ్చాము. మాకు అర్చన చెయ్యండి అంటూ పంతులిని అంటారు. ఇద్దరికి ఒకేసారి చేస్తానని పంతులు అంటాడు. ఆ తర్వాత భద్రవతి పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. పక్కనే రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న వేదవతిని కూడా వాళ్ళ అమ్మ ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత ఆ రామరాజు గాడు పెట్టే భోజనాలకి ఎవరు వెళ్లొద్దంటు సేనాపతికి భద్రవతి చెప్తుంది. అప్పుడే ఊళ్ళో కొంతమంది భద్రవతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు. ఇక రామరాజు గారి దగ్గరికి వెళ్తామని వెళ్తుంటే మీకు ఏర్పాట్లు చేసామంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు సేనాపతి. మరొక వైపు ఊళ్ళో వారికి భోజనాలు పెట్టడానికి రామరాజు ఏర్పాట్లు చేస్తాడు. తరువాయి భాగంలో నాకు ఒక కుటుంబం ఉంది. నా ఇల్లు, ఇల్లాలు, పిల్లలు.. నేను అనాధ కాదని రామరాజు అనగానే.. అయితే నీ ఇంటిపేరు చెప్పమని భద్రవతి అంటుంది. దాంతో రామరాజు తడబడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఒకే బెడ్ పై దీప, కార్తీక్.. ఆమె మాటని నెరవేరుస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -202 లో .....కార్తీక్ బాబు తో భార్యలాగా ఉంటానని నాకు మాటివ్వమని అనసూయ అంటుంది. దాంతో నేను ఉండలేనని దీప అనగానే.. అయితే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అనసూయ అంటుంది. ఏదో మీరు పెట్టె బుక్కెడు మెతుకుల కోసం నేను ఇక్కడ ఉండడం లేదు.. మీరు సంతోషంగా ఉంటే చూసి వెళదామని అనుకున్నానని అనసూయ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడే కాంచన వచ్చి అనసూయ మాట ఇవ్వమని అడిగిన దాంట్లో తప్పేముంది.. కార్తీక్ చేసింది మంచి పని అని కాంచన సమర్థిస్తుంది. దీపకి కాస్త సమయం ఇవ్వమని కాంచన అంటుంది. నువ్వు నాకు మాటివ్వకున్న సరే గాని నేను చెప్పినట్లు కార్తీక్ బాబు తో ఉండమని అనసూయ చెప్తుంది. మరొకవైపు తాతయ్య ఎందుకు చిన్న నానమ్మతో ఉన్నాడని శౌర్యా అనగానే.. చెప్తే అర్ధం చేసుకునే వయసు కాదని అనుకొని చిన్న నానమ్మకి హెల్ప్ చెయ్యడానికి ఉన్నాడని అంటుంది. అలా అనగానే మరి నువ్వు బాధపడడం లేదా అని శౌర్య అనగానే.. నాకు మీరందరు ఉన్నారు కదా అంటుంది. అయినా జ్యోత్స్న, గ్రానీ లు ఎందుకు వచ్చి గొడవ చేస్తున్నారు. మనం హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా అని అంటుంది. మనం దూరంగా వెళ్తే రారు కదా అని శౌర్య అంటుంది. అందరిలాగే మీరు ఉంటే చూడాలని ఉంది నాన్న అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది శౌర్య. ఆ తర్వాత పారిజాతం జ్యోత్స్న లు మాట్లాడుకుంటుంటే సుమిత్ర వచ్చి దీప కొట్టిన దాని గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది. నీకెలా తెలుసు అని జ్యోత్స్న అనగానే.. నేను వచ్చానని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న తనపై కోప్పడుతుంది. ఒక కార్తీక్ తప్ప ఏం అడిగినా చెయ్యడానికి రెడీ అని సుమిత్ర అనగానే.. దీపని బావ నుండి వేరు చెయ్ అని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది. జ్యోత్స్న వెళ్ళిపోయాక మీరు నా కూతురు నీ వదిలెయండంటు పారిజాతానికి వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. అదంతా విన్న దశరథ్ రిసెప్షన్ కి వెళ్లకుండా ఉండాల్సింది ఇంకెప్పుడు అలా వెళ్లకని అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. నా మెడలో తాళి తీసి జ్యోత్స్న మెడలో కట్టండి అని దీప అనగానే.. అలా జరగదన్నట్లు కార్తీక్ మాట్లాడతాడు. ఆ తర్వాత దీప నేలపై పడుకొని అత్తయ్య చెప్పినట్లే ఉండాలని ఉంది కానీ అన్నం పెట్టిన వాళ్లకు అన్యాయం చేసినట్లు అవుతుందని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తన ప్రాణాలు అడ్డు పెట్టి భర్తని కాపాడుకున్న భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -253 లొ.....సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తుంటే.. చూడు మీ అయన ఎలా చావుకి ఎదురు వెళ్తున్నాడోనని శ్రీలత అంటుంది. నా ప్రాణం అడ్డు పెట్టి అయినా నా భర్త ప్రాణాలు కాపాడుకుంటానని రామలక్ష్మి అంటుంది. మర్యాదగా నువ్వు ఎవరికి ఫోన్ చేసావో వాళ్ళకి ఫోన్ చేసి మా ఆయనని ఏం చెయ్యకని చెప్పు అనగానే.. నేను చెప్పను. నీ ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడావో సాక్ష్యం మా ఆయనకి చూపిస్తానని  సందీప్ ఫోన్ ని రామలక్ష్మి లాక్కోబోతుంటే శ్రీలత లాక్కొని కింద పడేస్తుంది. ఆ తర్వాత అయనని ఎలాగైనా కాపాడుకోవాలని సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. ఏమండి ఈ రోజు ఆఫీస్ కి వెళ్లకని అంటుంది. వెళ్తానని సీతాకాంత్ అనగానే నేను వస్తానని రామలక్ష్మి వెళ్లి కార్ లో కూర్చుంటుంది. అది చూసి ఇక ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని సందీప్ అనుకుంటాడు. ఆ విషయం శ్రీలత, శ్రీవల్లిల దగ్గరికి సందీప్ వచ్చి చెప్తాడు.మరొకవైపు రామలక్ష్మి అటు చుడండి ఇటు చుడండి ఆ వెహికల్ ఇటు వైపే వస్తుందని సీతాకాంత్ ని కంగారుపెడుతుంది. సందీప్ అరెంజ్ చేసిన రౌడీ వెహికల్ ని రామలక్ష్మి తప్పిస్తుంది దాంతో చెట్టుకి వెహికల్ తగలడంతో రామలక్ష్మి తలకి గాయం అవుతుంది.  మరొకవైపు వాళ్ళు చనిపోయారనే న్యూస్ తెలిసాక మనం సంబరాలు చేసుకోవాలన్నారు కదా స్వీట్ ఆర్డర్ చేస్తానని శ్రీవల్లి అనగానే.. తాతయ్య కి డౌట్ వస్తుందని సందీప్ అంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి..  ఏంటి డౌట్ వచ్చేది అనగానే డైవర్ట్ చేసి మాట్లాడుతాడు. ఆ తర్వాత గాయం అయిన రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకొని వచ్చి గదిలోకి వెళ్తాడు. దాంతో ఏమైందంటూ అందరు అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కీలకంగా మారిన ప్రాజెక్ట్‌.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -567 లో...కళ్యాణ్ దగ్గరికి అప్పు వస్తుంది. మీ వదిన తిరిగి మళ్ళీ మీ ఇంటికి వస్తుందట అని అనగానే.. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం పూర్తి అయ్యేవరకు నీ పోలీస్ ట్రేనింగ్ అయిపోవాలి.. నీకు కావాల్సింది నేను రైటర్ గా సెటిల్ అవడం కదా.. ఇప్పటి నుండి సీరియస్ గా ట్రై చేస్తానని అప్పుకి కళ్యాణ్ చెప్తాడు. మరోవైపు కనకంకి ఇందిరాదేవి ఫోన్ చేసి.. జరిగింది చెప్తుంది. త్వరలోనే కావ్య అక్కడికి రాబోతుందా అని కనకం మురిసిపోతుంది. అప్పుడే కావ్య వస్తుంది. పెద్దాయన పందెం కట్టాడట.. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తున్నావట అని కనకం అనగానే.. ఇప్పుడే అలా అని ఫిక్స్ కాకు అని కావ్య అంటుంది. నువ్వు గెలుస్తావని కనకం అంటుంది. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. నువ్వు చేసిన ప్లాన్ కి ఇక్కడ  రాజ్ , కావ్యలని ముసలోడు కలపాలని చూస్తున్నాడని జరిగింది మొత్తం రుద్రాణి చెప్తుంది. అయితే ఈ పందెంలో ఎవరు గెలిచిన మనకే నష్టం అన్నమాట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేస్తానని అనామిక అంటుంది. ఆ తర్వాత  ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. రాజ్, కావ్యల గురించి నెగెటివ్ గా చెప్తుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే ఎవరు అల్ ది బెస్ట్ చెప్పట్లేదని అడిగి మరీ అల్ ది బెస్ట్ చెప్తారు. కని ఇండైరెక్ట్ గా అందరు కావ్యకి అల్ ది బెస్ట్ చెప్తారు. రాజ్ ఆఫీస్ కి వెళ్లి ఎలాగైనా పందెంలో గెలవాలని ప్రయత్నం మొదలు పెడతాడు. తరువాయి భాగంలో ఎంప్లాయిస్ కి వర్క్ బాగా చెయ్యండి అంటూ ఆఫర్స్ ఇస్తాడు. ఆ తర్వాత అనామిక ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇద్దరు గోడవళ్ళో ఉన్నారు. అలాంటోళ్ళు ప్రాజెక్ట్ ఎలా బాగా చేస్తారని అనగానే.. అవునని అతను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్‌బాస్ హౌస్ లో అవినాష్‌ రొమాన్స్.. లైట్స్ ఆఫ్ చేసిన బిగ్‌బాస్

  బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వా ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. అందరు టైడ్ గా కన్పిస్తున్నారు. వెళ్లి అందరు ఒక గంట పడుకోండి అనగానే అందరు హ్యాపీగా వెళ్లి పడుకుంటారు. అందరు పడుకున్నాక అవినాష్ పక్కన తన భార్య అనుజ వచ్చి పడుకుంటుంది. దాంతో అవినాష్ ఒక్కసారిగా లేచి సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. బ్లాక్ డ్రెస్ వేసుకున్నావ్ నేను వేసుకొని వస్తానని డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు. ఆ తర్వాత అనుజ అందరితో మాట్లాడుతుంది. ఆ తర్వాత అనూజని పక్కకి తీసుకొని వెళ్లి తన పర్ఫామెన్స్ గురించి అడుగుతాడు. ఓల్డ్ వాళ్ళతో కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చెయ్.. మిగతా అంత ఒకే అని చెప్తుంది. అప్పుడే బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చెయ్యమన్నారు. కదా అవినాష్ యాక్షన్ రూమ్ కి రమ్మని పిలుస్తాడు. దాంతో ఇద్దరు యాక్షన్ రూమ్ కి వెళ్తారు. బిగ్ బాస్ వాళ్ళ కోసం క్యాండిలైట్ సెట్ ని అరెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేస్తాడు. లైట్స్ ఆఫ్ చేస్తే ఏంటి కెమెరాలు ఉన్నాయ్ కదా.. ప్లీజ్ బిగ్ బాస్ కాస్తా అటు తిప్పుకోండి అని అవినాష్ అంటాడు. ఆ తర్వాత నేను నిన్ను మిస్ అవుతున్నాను.. రోజు టీవీలో చూస్తున్నానని అనూజ అనగానే అవినాష్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత అనూజ ఒక టాస్క్ ఆడుతుంది. అందులో కొంత అమౌంట్ మరియు కిచెన్ టైమ్  అని ఉంటుంది. ఇక కిచెన్ టైమ్ తీసుకోకుండా  ప్రైజ్ మనీకి ఆడ్ అయ్యేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక అనూజ, అవినాష్ బయటకు వచ్చేటప్పుడు లోపల ఏదో జరిగినట్టుగా యాక్ట్ చేస్తుంటారు. అది చూసిన రోహిణి.. లోపల ఏం లేదు డొల్లా అంటుంది. ఇక అనూజ అందరి ముందు అవినాష్ ని హగ్ చేసుకొని.. అమ్మో అందరు చేస్తున్నారని అంటుంది. ఇక తన సమయం అయినందున అందరికి బై చెప్పేసి మెయిన్ గేట్ నుండి వెళ్తుంది అనూజ. తను బయటకు వెళ్తుంటే ఐ లవ్ యూ అనూ అంటు అవినాష్ గట్టిగా అంటాడు. ఇక ఇదంతా చూసిన టేస్టీ తేజ ఎమోషనల్ అవుతాడు.

తనకి దూరంగా ఉండమని నిఖిల్ కి చెప్పిన అమ్మ.. ఇండివిజువల్ గేమ్ ఆడు!

  బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా నిఖిల్ వాళ్ళ అమ్మ సురేఖ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తను రాగానే నిఖిల్ ఎమోషనల్ అవుతాడు. నిఖిల్ వాళ్ళ అమ్మ అందరినీ పరిచయం చేసుకుంటుంది. అందరి దగ్గరికి ఆప్యాయతగా వెళ్లి పలకరిస్తుంది. ఆ తర్వాత నిఖిల్ తో పర్సనల్ గా మాట్లాడుతుంది. హౌస్ మేట్స్ తో ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదని చెప్పింది. నువ్వు జెన్యూన్ గా ఉంటున్నావ్.. గ్రూప్ గేమ్ కాకుండా నీ గురించి మాత్రమే ఆడు 'y' కి దూరం గా ఉండని చెప్పింది. y అంటే యశ్మీ... ఇక 'G' తో ఎక్కువ గొడవ పెట్టుకోకు.. నామినేషన్ దగ్గర అని చెప్పుకొచ్చింది. g అంటే గౌతమ్.. ఇక 'p' తో జాగ్రత్త అని చెప్పింది. అమ్మాయా అబ్బాయా అని నిఖిల్ అడుగగా.. పీ అంటే ప్రేరణ అంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసింది. ఇక మనోడికి ఏం అర్ధం అయిందో ఏమో చూడాలి. ఆ తర్వాత సురేఖకి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో విన్ అయి హౌస్ మేట్స్ కి మటన్ ఇస్తుంది. దానితో పాటు మైసూర్ నుండి మైసూర్ పాక్ తీసుకొని వస్తుంది. దాంతో హౌస్ మేట్స్ ఖుషి అవుతారు. బిగ్ బాస్ హౌస్ లో వంట చేస్తుంది. సురేఖ ఒక్కొక్క హౌస్ మేట్ గురించి ఒక్క వర్డ్ లో వారి గురించి చెప్పేస్తుంది.

యష్మీ చేసిన తప్పుకి క్షమాపణ కోరిన తండ్రి.. 

  బిగ్ బాస్ పదకొండవ వారంలో గేమ్స్ ఏమీ లేవు.. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ వీక్ లో హౌస్ లోని వాళ్ళ అమ్మ, నాన్న, భార్య ఇలా ఎవరో ఒకరు వస్తుంటారు. ఇది మోస్ట్ ఎమోషనల్ గా సాగుతుంది. అయితే హౌస్ లోకి మొదటగా నబీల్ వాల్ల అమ్మ వచ్చింది. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ వచ్చింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ ఫాదర్ వచ్చాడు. యష్మీ తనని చూసి ఎమోషనల్ అవుతుంది. హౌస్ మొత్తం ఫ్ర్రీజ్ కాగా యష్మీ ఫాదర్ ఎంట్రీ ఇస్తాడు. తనని చూసి అవినాష్, తేజలు  ఏదో ఆఫీసర్ లాగా వున్నాడు భయమేస్తుందని అనుకుంటారు. ఆ తర్వాత అతను రావడంతోనే నిఖిల్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. అది చూసి నిఖిల్ చూడు రాగానే కాళ్ళ పై పడుతున్నాడని అవినాష్ తో రోహిణి అంటుంది. మగలే.. మై వారియర్ అనగానే యష్మీ మురిసిపోతుంది. ఇక యష్మీ తో వాళ్ళ నాన్న పర్సనల్ గా మాట్లాడుతూ.. ముందు ఆడినట్టు ఆడడం లేదు.. ఇండివిడ్యువల్ గా ఆడు.. గ్రూప్ గేమ్ వద్దు.. బయట బ్యాడ్ అవుతున్నావ్.. ఇంకా నెల రోజులు టైమ్ ఉంది. నీలా నువ్వు ఉంటే గెలుస్తావని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దాంతో యష్మీ అర్ధం అయింది ఇక నుండి అలాగే ఆడతానని అంటుంది. ఆ తర్వాత యష్మీ వాళ్ళ నాన్న అందరి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. తేజ తన ఫ్యామిలీని మిస్ అవుతూ ఎమోషనల్ అవుతాడు. మీరు పర్మిషన్ ఇస్తే బిగ్ బాస్ నా కూతురి కి భోజనం తినిపిస్తానని యష్మీ ఫాదర్ అంటాడు. యష్మీ కి భోజనం తినిపిస్తాడు.  ఇక హౌస్ అందరికి యష్మీ తరుపున సారీ అడుగుతాడు. తను చేసిన తప్పులకి నేను క్షమించమని అడుగుతున్నాను.. అందరు కలిసి ఉండండి అంటు యష్మీ వాళ్ల నాన్న అందరితో అంటాడు. ఇక  సరదాగా మాట్లాడి.. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ రాగానే వెళ్ళిపోతాడు. మా నాన్న అసలు ఎప్పుడు ఇలా లేడని యష్మీ ఎమోషనల్ అవుతుంది.  

illu illalu pillalu : తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడివి నీకు పెళ్ళి రోజా.. ఊరి వాళ్ళంతా వస్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Ilu illalu pillalu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -2 లొ.....వేదవతి వాళ్ళ అమ్మ వేదవతి ఫోటో చూస్తుంటుంది. అప్పుడే భద్రవతి వస్తుంది.. ఫోటో లాక్కొని రామరాజుని పెళ్లి చేసుకోవడం వళ్లే నాన్న చనిపోయాడు.. నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నానని.. నువ్వు ఇంకా ఆ మనిషిని మర్చిపోలేదా అని కోప్పడుతుంది. భద్రవతి ఇంటికి ఎదరుగానే వేదవతి ఇల్లు ఉంటుంది. వేదవతి ప్రొద్దున నిద్ర లేచి ఇంట్లో అందరిని లేపుతు నాన్న వచ్చే టైమ్ అయింది. త్వరగా లేవండి అంటు లేపుతుంది. వేదవతి, రామరాజులకి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉంటారు. వేదవతి మొదటి కొడుకు రెండవ కొడుకుని లేపి త్వరగా రెడీ అవ్వమని చెప్తుంది. చిన్నోడి దగ్గరికి వెళ్లేసరికి ఇంట్లో ఉండడు.. అయన వచ్చేసరికి ఇంట్లో లేకుంటే కోప్పడుతాడని అందరు భయపడతారు. మరొక వైపు రామరాజుకి రైస్ మిల్ ఉంటుంది. పని పూర్తి చేసుకుంటాడు. త్వరగా వెళ్ళాలి పిల్లల్ని చూసి టిఫిన్ చేసి వస్తానని రామరాజు అక్కడున్న అతనితో అంటాడు. పిల్లలు పెద్ద వారయ్యారు అయిన ఇప్పటికే కూడా క్రమశిక్షణలో ఉంచుతారని అతను అంటాడు. పిల్లలు తప్పు చేస్తే తల్లి, తండ్రినే అంటారు. అందుకే తప్పు చెయ్యకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలని అంటాడు. ఆ తర్వాత రామరాజు ఇంటికి వెళ్తాడు. చిన్నోడు లేడని తెలిసి కోపంగా ఉంటాడు. మరొకవైపు చిన్నోడు.. రామరాజు వేదవతిల ఇరవై అయిదవ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ కి ఫ్లెక్స్ రెడీ చేయిస్తు ఉంటాడు. వస్తుంటే భద్రవతి మేనకోడలు భద్రవతి బర్త్ డే కి కేక్ తీసుకొని వస్తుంది. కావాలనే తనని బయపెట్టిస్తాడు చిన్నోడు. ఆ తర్వాత రామరాజు ఫ్లెక్సీ చూసి ముందు అది పడెయ్.. ఈ పెళ్లి రోజు ఎప్పుడు చేసుకోలేదని కోప్పడతాడు. ఫ్లెక్సీ పడేయడంతో అది ఎదురుగా భద్రవతి కేక్ కట్ చేస్తుంటే అక్కడ పడుతుంది. దాంతో వాళ్ళు గొడవకి వస్తారు. రామరాజు ముందే ప్లెక్సీ కాల్చేస్తాడు. దాంతో సేనాపతి చొక్క పట్టుకుంటాడు రామరాజు. తిన్నింటికి ద్రోహం చేసే నువ్వు మాట్లాడుతున్నావా అని సేనాపతి అనగానే.. రామరాజు వదిలి పెడుతాడు. తరువాయి భాగంలో గ్రాండ్ గా పెళ్లి రోజు చేసుకోవాలని రామరాజు నిర్ణయం తీసుకుంటాడు. ఊళ్ళో వాళ్ళు వాళ్ళింటికి ఎవరు వెళ్లొద్దని సేనాపతితో భద్రవతి చెప్తుంది. ఊళ్ళో వాళ్ళు నా మాట వింటారు వస్తారని రామరాజు ఏర్పాటు చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కార్తీక్ కి భార్యగా ఉండమని దీపకి చెప్పిన అత్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -201 లో..... దీపని అవమానించాలని పారిజాతాన్ని తీసుకొని జ్యోత్స్న రిసెప్షన్ కి వెళ్తుంది. అక్కడ కార్తీక్, దీపలని జ్యోత్స్న అవమానిస్తుంది. అసలు ఈ శౌర్యని కూడా మా బావతోనే కని ఉంటావని జ్యోత్స్న అనగానే.. తన చెంప చెల్లుమనిపస్తుంది దీప. అయిన ఏ మాత్రం తగ్గకుండా తన రెచ్చిపోయి మాట్లాడుతుంది. అప్పుడే మహిళా సంఘం లీడర్ సరోజినీ దేవి స్టేజ్ పైకి వచ్చి అసలేం చేస్తున్నావని జ్యోత్స్న పై కోప్పడుతుంది. కార్తీక్ తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను అంటుంటే.. నీకు ఎక్కడ అన్యాయం జరిగింది.. కావాలని వాళ్ళను అలా చేస్తున్నావ్.. దీప జీవితానికి అండగా నిలబాడ్డాడు.. మీరే ఉద్దేశంతో వచ్చారో ఇక్కడ అందరికి అర్ధమైంది.. అంతే కాకుండ వాళ్ళ ఏవి రాకుండా అది వచ్చింది ఇది కూడ ఎవరు చేసారో అందరికి అర్ధం అవుతుంది.. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్తారా లేదా అందరు ఇక్కడ మిమ్మల్ని కొట్టడానికి రెడీగా ఉన్నారని సరోజినీ దేవి అనగానే.. పారిజాతం భయపడి జ్యోత్స్నని తీసుకొని వెళ్తుంది. అమ్మ అందులో నిజం లేదు.. దీప ముందు తెలుసు.. అంతే తప్ప తన గురించి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెలిసింది అంతే  అని కార్తీక్ అనగానే.. నాకు నీపై నమ్మకం ఉందని కాంచన అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతారు. మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న లు హాస్పిటల్ కి వెళ్లి వచ్చామని యాక్టింగ్ చేస్తుంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లారు కార్తీక్ డాక్టర్ దీప డాక్టర్ కాంచన డాక్టర్ దగ్గరికా అని శివన్నారాయణ‌ అంటుంటే.. పారిజాతం టెన్షన్ పడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మీ భార్య, మనవరాలు వచ్చారు.. మీరు రాలేదని అడిగారు. ఎందుకు వెళ్లారు అంటు శివన్నారాయణ వాళ్ళపై కోప్పడతాడు. అప్పుడే దశరత్ కూడా వస్తాడు. అతను కూడా ఎందుకు వెళ్లారంటూ కోప్పడతాడు. ఇంకా నయం నేను వెళ్ళానంటూ చెప్పలేదని సుమిత్ర అనుకుంటుంది. మరొక వైపు దీప జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటే.. అప్పుడే అనసూయ వస్తుంది. నీకేం అన్యాయం జరిగిందని భాదపడుతున్నావ్.. నువ్వు కార్తీక్ ని శౌర్యకి నాన్న మాత్రమే అనుకుంటున్నావ్ కని అతను నీకు భర్తగా ఉండాలనుకుంటున్నాడు.. భార్యగా ఉండు అలా ఉంటానని మాట ఇవ్వమని అనసూయ అనగానే.. నేను ఇవ్వలేనని దీప అంటుంది. అయితే నేను ఇంట్లో నుండి వెళ్లిపోతానని అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ ను చంపడం కోసం సందీప్ స్కెచ్.. ఆమె ఏం చేస్తుంది?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -252 లొ.....శ్రీవారు అలిగారు.. ఇంట్లో అయితే ఉండమన్నారు కని గదిలో ఉండమంటాడో లేదో అని సీతాకాంత్ కోసం రామలక్ష్మి వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రామలక్ష్మి గదిలో నుండి బయటకు వెళ్తుంటే వద్దని అంటాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు సందీప్ అప్పున్న అతనికి ఫోన్ చేసి.. ఇలా నీ దగ్గర అప్పు చెయ్యాల్సిన అవసరం లేదు.. ఇక నేను చెప్పినట్టు చేస్తే డబ్బులు రెట్టింపు ఇస్తానని సందీప్ అంటాడు. ఏం చెయ్యాలని అతన్ని అడగగా.. మా అన్నయ్య సీతాకాంత్ ని చంపెయ్యాలని చెప్పగానే అతను సరే అంటాడు. అదంతా రామలక్ష్మి విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక అన్నయ్యని చంపడానికి ప్లాన్ చేసాను మమ్మీ అని శ్రీలతకి సందీప్ చెప్తుంటే.. రామలక్ష్మి వచ్చి అతని చెంప చెల్లుమనిపిస్తుంది. శ్రీలత కోప్పడుతుంటే నీక్కూడా ఇదే జరుగుతుందని రామలక్ష్మి అంటుంది. మీరు అనుకుంటున్న ప్లాన్ విరమించుకోండి అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఆవిషయం సీతాకాంత్ కి చెప్పి మీ వళ్లే ఆస్తులు కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పడంతో సీతాకాంత్ కోపంగా రామలక్ష్మిని  ఇంట్లో నుండి బయటకు గెంటేసినట్లు ఉహించుకుంటుంది. ఇప్పుడు నేను చెప్తే జరిగేది ఇదేనని రామలక్ష్మి ఆలోచిస్తుంది. అప్పుడే సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తుంటే.. రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఏమైంది అని పెద్దాయన అడుగుతాడు. ఏం లేదని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్, పెద్దాయన ఆఫీస్ బయలుదేర్తారు. ఆ తర్వాత సందీప్ అన్నయ్య ఇంట్లో నుండి బయలుదేర్తాడని అతనికి చెప్తాడు. ఆ విషయం రామలక్ష్మి వింటుంది. సందీప్ ని తిడుతుంటే వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్య ఇంట్లోకి రావడం కోసం ఆ ప్రాజెక్ట్.. అతను అంగీకరించగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -566 లో.....కావ్య దగ్గరకి ఒక పెద్దాయన వచ్చి.. నాకు టెంపుల్ సంబంధించిన జ్యువలరీ డిజైన్స్ కావాలని  అంటాడు. దానికి కావ్య సరే అని చెప్తుంది. ఆ విషయం రాజ్ కి కావ్య చెప్పాలని వెళ్తుంది కాని రాజ్ ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విషయం శృతి చెప్పగానే కావ్య కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి రాజ్ ఎక్కడ అని అడుగుతుంది. దాంతో ఇందిరదేవి రాజ్ ని పిలుస్తుంది. మీరు చేస్తుందేంటి చెప్పకుండా ఇలా ఫైల్ తీసుకొని వస్తే ఏంటని కావ్య కోప్పడుతుంది. నీకు చెప్పేది ఏంటని రాజ్ పొగరుగా మాట్లాడతాడు. తాతయ్య గారు ఉమేష్ చంద్రగారి ప్రాజెక్ట్ వచ్చింది. అది రెండు రోజుల్లో ఇవ్వాలి.. నేను డిజైన్స్ వేస్తాను గనీ ఆయనకి ఉన్న అనుభవం సమర్థత లేదు.. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే బాగుంటుందని కావ్య అనగానే.. నేను చెయ్యనని రాజ్ అంటాడు. ఒక పని చెయ్యండి ఒకే ప్రాజెక్ట్ పై ఇద్దరు వేరు వేరుగా చెయ్యండి. ఎవరిది సెలక్ట్ అవుతుందో వాళ్లే సీఈఓ అని సీతారామయ్య అంటాడు. దానికి రాజ్ ఒప్పుకుంటాడు కానీ కావ్య గెలిస్తే నువు ఓడిపోతే కావ్యని భార్యగా ఒప్పుకొని తీసుకొని రావాలని సీతారామయ్య అనగానే దానికి రాజ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత కావ్య బయటకు వచ్చి ఆయన ప్రేమతో నన్ను తీసుకొని రావాలి గనీ ఇలా తీసుకొని వస్తే నాకు నచ్చదన్నట్లు కావ్య మాట్లాడుతుంది. ముందు నువ్వు ఇంట్లోకిరా అప్పుడు ప్రేమతో వాడే దగ్గర అవుతాడని ఇందిరాదేవి అంటుంది. ఇక కావ్య తప్పక సరేనని అంటుంది. నేను గెలవడానికి ట్రై చేస్తానని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్యపై రాజ్ గెలవడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రష్మీ మొగుడు వచ్చేది గుర్రం మీదనా ? గోట్ మీదనా ?

  బుల్లితెరకి రష్మీ పెళ్లి ఒక అసెట్ లాంటిది.. అలాగే మల్లెమాల టీంకి మంచి రేటింగ్స్ రావాలంటే రష్మీ పెళ్లి ఒక గొప్ప కాన్సెప్ట్ కూడా. ఇక ఒకప్పుడు రష్మీ పెళ్లి గురించి ఆడియన్స్ అంతా ఎన్నో ఊహించుకున్నారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే ఇంకేముంది. అలా రష్మీ పెళ్ళికి బ్రేక్ పడింది. ఇక రష్మీ మ్యారేజ్ మేనియా నుంచి ఇప్పుడిప్పుడే ఆడియన్స్ అంతా బయటపడుతూ ఉన్నారు. సుధీర్ రష్మిని వదిలి వెళ్ళిపోయాక చాలామంది బాధపడ్డారు. కానీ ఆ బాధను నెమ్మదిగా రష్మీ తన యాకరింగ్ తో తగ్గిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ రష్మీ పెళ్లి కాన్సెప్ట్ తెరమీదకు వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో లో కార్తీక పౌర్ణమి సందర్భంగా రష్మీ ఒక కోరిక కోరింది . "ఓ దేవుడా...నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే మొగుడుగా రావాలి" అని కోరుకుంది. దాంతో రామ్ ప్రసాద్ ఆగుతాడా . "ఎవరిని కోరుకున్నావ్ ..ఎవడు వాడు" అని అడిగేశాడు ఇక ఆగలేనట్టు నూకరాజు మిడిల్ ఎంట్రీ ఇచ్చి "ఎలా ఉంటాడో ఒక్క రెండు పోలికలు చెప్పవా" అని అడిగాడు "నాకు కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు" అంటూ గిర్రున తిరుగుతూ సిగ్గే సిగ్గు పడేలా సిగ్గుపడుతూ మరీ చెప్పింది రష్మీ. ఇక ఇంద్రజమ్మ ఊరుకుంటుందా "అంతా బానే చెప్పారు.. కానీ వచ్చేది గుర్రం మీదనా..గోట్ మీదనా" అని డౌట్ పెట్టింది. దాంతో రష్మీ మరీ సిగ్గుపడిపోయిందనుకోండి. అంటే త్వరలో సుడిగాలి సుధీర్ నటించిన "గోట్" మూవీ రాబోతోంది అని ఇన్డైరెక్ట్ గా చెప్తున్నట్లు ఉంది. అంటే ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసినట్టే కనిపిస్తోంది. ఎం ఐడియా గురు...  

ఓటింగ్ లో టేస్టీ తేజ టాప్.. డేంజర్ జోన్ లో విష్ణుప్రియ!

  బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం జరిగిన నామినేషన్ లో కన్నడ బ్యాచ్ ప్రేరణ, యష్మీ, నిఖిల్, పృథ్వీ కలిసి టేస్టీ తేజ, అవినాష్ ని టార్గెట్ చేశారు. ఇక దాని ఇంపాక్ట్ ఓటింగ్ లో తెలుస్తుంది. కన్నడ బ్యాచ్ కి అసలు ఓటింగే పడటం లేదు. టాప్ లో టేస్టీ తేజ ,గౌతమ్ ఉండగా.. లీస్ట్ లో పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ ఉన్నారు. ఇక బిగ్ బాస్ చూడటానికే అసహ్యం కలిగించేలా చేస్తున్న విష్ణుప్రియకి నెట్టింట రోజు రోజుకి ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పిన మారలేదు విష్ణుప్రియ.. రోహిణి పక్కకి పిలిచి చెప్పిన మారలేదు.. ఇక ఈ ఫ్యామిలీ వీక్ లో విష్ణుప్రియ వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పినా వింటదనే గ్యారెంటీ మాత్రం లేదు. ఎందుకంటే తను పృథ్వీకి బాగా కనెక్ట్ అయ్యింది. ఎంతలా అంటే మొన్న నామినేషన్ లో రోహిణి తనకి సపోర్ట్ చేయలేదని చెప్పగానే నాకు పృథ్వీకి ఎన్ని గొడవలున్నా అల్టిమేట్ గా నాకు పృథ్వీ అంటేనే ఎక్కువ ప్రియారిటీ అని అందరి ముందు చెప్పింది. అయితే ఇది బిగ్ బాస్ మామ ఎడిటింగ్ లో లేపేస్తాడేమో అని లైవ్ చూసిన వాళ్ళంతా అనుకున్నారు కానీ ఎడిటర్స్ విష్ణుప్రియ గురించి నెగెటివ్ కంటెంట్ ఎంత లేపేసిన తన బిహేవియర్ అలానే ఉండటంతో ఆమె చెప్పింది అలానే ఉంచేశారు.  ఇక హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు అవినాష్‌.. కానీ తనకే ఓటింగ్ పడటం లేదు. ఎందుకంటే విష్ణుప్రియ అందాలని ఆరాధించే కొంతమంది బ్యాచ్ అంతా కలిసి తనకి ఓట్ చేయడంతో హౌస్ లో జెన్యున్ గా ఉండే రోహిణి, అవినాష్, నబీల్, తేజ లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మరి బిగ్ బాస్ ఈ వారం కన్నడ బ్యాచ్ నుండి ఒక్కరినైనా బయటకి పంపిస్తాడా లేక ఎప్పటిలాగ తెలుగు కంటెస్టెంట్స్ ని బయటకు పంపిస్తాడో చూడాలి మరి. తేజ, గౌతమ్ అత్యధికంగా అరవై శాతంతో మొదటి, రెండు స్థానాలలో ఉండగా.. ఇక డేంజర్ జోన్ లో అవినాష్, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ ఉన్నారు.   

నా వల్ల కాదు బాబోయ్ ఇన్ని పేజీల డైలాగ్స్ చెప్పడం

  ఈ మధ్య సెలబ్రిటీస్ లో కొంతమంది మాత్రం డైలాగ్స్ చెప్పడానికి తడబడుతూ ఉండడం ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నవ్వడమే లేదా సైలెంట్ గా ఉండడంతో చేసి అక్కడితో మమ అనిపించేస్తున్నారు. బుల్లితెర మీద అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం కమెడియన్ ఉన్నారు. ఆయనే తాగుబోతు రమేష్. ఐతే ఆయన ఈ మధ్య బుల్లితెర మీద చేసే స్కిట్స్ లో కొన్ని డైలాగ్స్ మర్చిపోతూ ఆ మర్చిపోవడాన్ని కూడా కవర్ చేసేలా ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రాంప్రసాద్ ఇదే టాపిక్ మీద తాగుబోతు రమేష్ ని హైలైట్ చేశారు. ఎందులో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో. ఇక ఈ ఎపిసోడ్ కార్తీక పౌర్ణమి కాన్సెప్ట్ తో తీసుకొచ్చింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే రాంప్రసాద్ బావగా తాగుబోతు రమేష్ చేసాడు. "మా బావ సత్యం పండగకు ఊరు నుంచి వచ్చాడు. చిన్నప్పుడు సినిమాల్లో నటించేవాడు. మూడు పేజీలు డైలాగ్స్ ఇచ్చినా చెప్పేసేవాడు" అనేసరికి "ఎం చెప్పేవాడు" అంటూ నూకరాజు అడిగాడు "నా వల్ల కాదని"చెప్పేసేవాడు అని రాంప్రసాద్ ఆన్సర్ ఇచ్చేసరికి తాగుబోతు రమేష్ పరువంతా పోయింది. ఏదేమైనా ఇక మీదట రాంప్రసాద్ అన్నందుకైనా తాగుబోతు రమేష్ డైలాగ్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని చెప్పి ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేయాలని మనమంతా కోరుకుందాం.

Tasty Teja: అమ్మకోసం తేజ ఏడుపు.. రోహిణి వాళ్ళ అమ్మ అన్నీ చెప్పేసిందిగా!

బిగ్‌బాస్ సీజన్-8 లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. మొదటగా నబీల్ వాళ్ల అమ్మ రాగా.. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ గీవిందమ్మ హౌస్ లోకి వచ్చింది.   హౌస్‌లో ఎవడు ఎలా పోయిన పర్లేన్నట్టు విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, యష్మీలది వాళ్ల గోల వాళ్ళదే. నిఖిల్ గడ్డం తీసేశాకా అస్సలు బోగాలేదని.. పృథ్వీయే బావన్నాడంటూ యష్మీ అనగానే విష్ణుకి తెలిస్తే చంపేస్తదని నిఖిల్ అన్నాడు. మరోవైపు బిగ్‌బాస్ హౌస్ మేట్స్ అందరితో ఫ్రీజ్ గేమ్ ఆడించాడు. అదే ఎక్కడివాళ్ళు అక్కడే ఆగాలి..ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్ళాలి.. ఇలాంటివి బిగ్ బాస్ చేపించాడు. అవకాశం ఇచ్చాడు కదా అని పృథ్వీపై పడిపోయి మరీ రెచ్చిపోయింది విష్ణుప్రియ. మరోవైపు తేజ తెగ ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తారు.. కానీ నా కోసం మాత్రం ఎవరు రారు.. ప్లీజ్ బిగ్‌బాస్.. నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు.. కానీ అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు బిగ్‌బాస్.. ఇంకా కష్టపడి ఆడతా బిగ్‌బాస్ ప్లీజ్.. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు.. మీరు ఏదంటే అదే.. నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు.. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతానంటూ తేజ ఏడ్చాడు. ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజదే గిల్ట్ అవుతుంది.. మన ఫ్యామిలీ అందరూ వస్తారు.. వాడికి రారు అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నువ్వు వాడి పేరు చెప్పావా కన్ఫెషన్ రూమ్‌లో అంటూ అవినాష్ అడుగగా.. నాకేం తెలుసురా.. అలా అవుతుందని.. ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేనంటూ నిఖిల్ అన్నాడు. ఇదే విషయం తేజతో అవినాష్ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్ లో గౌతమ్ పెళ్ళికొడుకుగా, రోహిణికి పెళ్ళిచూపులు స్కిట్ చేపించాడు. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఎప్పటిలాగే ఈ స్కిట్ లోను ఆకట్టుకున్నారు. ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ ఏదైనా ఉందంటే అవినాష్, రోహిణిలకి మించి ఎవరు చేయరనేది వాస్తవం. ఇక హౌస్ లోకి వచ్చిన రోహిణి వాళ్ళ అమ్మ ఇదే విషయం చెప్పింది. నువ్వు, తేజ సోఫాలో కూర్చొని మనం జోక్స్ వేయడానికి సరదగా నవ్వించాడని మాత్రమేరా మనకి కప్పులు రావని రోహిణి, తేజ మాట్లాడుకున్నది చూశానని గోవిందమ్మ అంది. అలా ఎందుకు అనుకుంటున్నారు. మీ ఆట మీరు ఆడండి. మీరు హౌస్ లో బాగా ఎంటర్‌టైన్ ఇస్తున్నారు అలాగే ఉండండి.. ఎవరిని నమ్మకండి అంటూ రోహిణితో వాళ్ళ అమ్మ గోవిందమ్మ చెప్పుకొచ్చింది.

అమ్మ రాకతో నబీల్ హ్యాపీ...నీ ఆట నువ్వు ఆడు!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇక ఈ వీక్ అంతా హౌస్ మేట్స్ యొక్క అమ్మనాన్న, భార్య, ఫ్రెండ్స్ ఇలా ఎవరో ఒకరు వస్తారు. ఇదంతా ఫూల్ ఎమోషనల్ గా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి వాళ్ళ అమ్మ, ఆమె అల్లుడు హౌస్ లోకి వచ్చారు. అలాగే నబీల్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా నబీల్ ని కన్ఫెషన్ రూమ్‌కి రండి అని బిగ్ బాస్ పిలిచాడు. ఎదురుగా హల్వా పెట్టాడు. ఇది చూసి ఇక్కడ హల్వా ఉంది.. కానీ ప్రేరణ ఆంటీ చెప్పింది తినొద్దని.. తినాలా ఇది.. అంటూ నబీల్ అన్నాడు. దీనికి ఐదు వారాలు మాత్రమే ఆట మిగిలున్న కారణంగా స్వీట్స్ తినకుండా ఉండాలనే రూల్‌ను రద్దు చేస్తున్నా.. స్వీట్స్ మొత్తం ఇక్కడే తినండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో హల్వా మొత్తం లాగించేశాడు నబీల్. ఇది జరిగిన కాసేపటికే నబీల్ యాక్షన్ రూమ్‌కి రండి.. అంటూ అక్కడ మరో సెట్ స్వీట్లు పెట్టాడు. ఇది చూసి తినిపించి తినిపించి చంపేస్తారా నన్ను.. అంటూ నబీల్ జోక్ చేశాడు. మీరు స్వీట్లు తినడం బిగ్‌బాస్‌కి ఆనందంగా అనిపించింది.. అందుకే మీకోసం మళ్లీ  పంపించారంటూ అనౌన్స్ చేశాడు. దీంతో ఇదే లాస్ట్ కదా బిగ్‌బాస్.. తింటా అట్లేం లేదంటూ నబీల్ అవి తినే పనిలో పడ్డాడు. ఇక ఇక్కడ నబీల్ స్వీట్లు తింటుంటే మెయిన్ గేట్ నుండి నబీల్ వాళ్ళ అమ్మ హౌస్ లోపలికి వచ్చింది. ఇక నబీల్ అదంతా అక్కడ ఉన్న టీవీలో చూసి‌‌ అమ్మ అంటూ ఎమోషనల్ అయ్యాడు. డెబ్బై రోజులైంది బిగ్ బాస్ అమ్మని చూడక.. ఇప్పుడు చూస్తుంటే కన్నీళ్ళు ఆగుతలేవు బిగ్ బాస్ అంటూ నబీల్ చెప్పుకుంటూ ఏడ్చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.  ఇక నబీల్ మరియు వాళ్ల అమ్మ ఇద్దరే మాట్లాడుకున్నారు. నేనెలా ఆడుతున్నా.. ఏం అనిపిస్తుందని నబీల్ అడుగగా.. నీ ఆట నువ్వు ఆడు.. ఎవరి గురించీ పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కాకు.. అందరితో మంచిగానే ఉండు.. అంటూ ఇండైరెక్ట్‌గా కే (కన్నడ) బ్యాచ్ గురించి నబీల్‌కి హింట్ ఇచ్చింది. ఇక తన బెడ్ దగ్గర ఉన్న షీల్డ్ గురించి కూడా నబీల్ చెప్పాడు. ఎట్ల అనిపిస్తుంది బయట నా ఆట.. కనిపిస్తున్నానా నేను టీవీలో ఎక్కువ సేపు అంటూ నబీల్ అడిగితే.. బాగా ఆడుతున్నావ్.. రోజూ కనిపిస్తున్నావ్ అని చెప్పింది. ఇక నబీల్ వాళ్ళ అమ్మ హౌస్ మేట్స్ అందరికి గులాబ్ జామ్ లు తీసుకొచ్చింది‌. అందరు షేర్ చేసుకున్నారు. ఇక నబీల్ వాళ్ళ అమ్మ అతడి కోసం ఓ గేమ్ ఆడి బయటకొచ్చేసింది.  

illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లాంఛ్ ఎపిసోడ్ ఎలా ఉందంటే!

  ఒక కుటుంబం గొప్పతనం.. బంధాలు.. బంధుత్వాలు తెలియజేస్తూ కొత్త సీరియల్ స్టార్ మా టీవీలో మొదలైంది. ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్ళు దూరమైతే కుటుంబంలోని ఆ  వారు ఎంత బాధపడుతారో కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీరియల్ ఎపిసోడ్ -01లో ఏం జరిగిందో చూసేద్దాం. ఒక ఊరిలో పేరు ప్రతిష్టలు ఉన్న ఒక పెద్దాయన ఉంటాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉంటారు. ఇద్దరు అక్కచెల్లెల్లలో.. అక్క భద్రావతి.. చెల్లి వేదవతి.. చిన్నప్పటి నుండి ఇద్దరు ప్రాణంగా ఉంటారు. రోజు ప్రొద్దున లేచి వేదవతి మొహం చూస్తుంది భద్రావతి. చెల్లి అంటే భద్రావతికి అంత ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత రామరాజు వాళ్ళ ఇంట్లో ఉంటున్న నమ్మకమైన పనివాడు అతనికి వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఆ తర్వాత ఇద్దరు అక్కాచెల్లెలు కొలనులో దీపాలు వదులుతారు. వేదవతి తను ప్రేమించిన అబ్బాయి తో పెళ్లి జరగాలని మొక్కుకుంటుంది‌. దీపం కొండెక్కుతుంటే రామరాజు వచ్చి.. మీరు కోరుకున్న కోరిన నెరవేరుతుంది. ఈ దీపం కొండేక్కదని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి చెయ్యాలని ఇద్దరిని ఒక ఇంటికి ఇవ్వాలనుకుంటారు. పెళ్లి అయితే ఎక్కడ చెల్లి నేను విడిపోతామోనని అనుకున్నాను.. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటామని భద్రావతి సంతోషపడుతుంది. సీన్ కట్ చేస్తే వేదవతి, రామరాజులు పెళ్లి చేసుకుంటారు. అక్కడికి వేదవతి కుటుంబం వచ్చి రామరాజుని అవమానిస్తారు. ఇంట్లో పనివాడివి అంటారు. ఎప్పుడు అయితే పని వాడితో లేచిపోయిందో అప్పుడే అది మనకి లేదని భద్రావతి అంటుంది. దూరం గా వెళ్ళాలి అనుకుంటారు కానీ ఇక్కడే ఉంటే మీ వాళ్లని చూసుకుంటావ్ కదా అని వేదవతితో రామరాజు అంటాడు. ఆ తర్వాత భద్రావతికి సంబంధం వస్తుంది‌ మీ చెల్లి పనివాడితో లేచిపోయిందట.. నీకు అలాంటిది ఉంటే చెప్పమని అబ్బాయి అనగానే.. తనని కొట్టి భద్రావతి పంపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు వెళ్తుంటే రామరాజు ఆపి వాళ్ళు చాలా మంచి వాళ్లు అని వాల్ల కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకొమ్మంటాడు. అయిన వాళ్ళు వెళ్ళిపోతారు. అదంతా చుసిన వేదవతి వాళ్ల నాన్న.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.. అని రామరాజుని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వేదవతి దగ్గరికి వాళ్ళ నాన్న వెళ్తాడు. పెద్దాయన ఇంటికి వచ్చి రామరాజుని అల్లుడుగా ఒప్పుకొని ఇంట్లోకి పిలుద్దామని అంటాడు. అందుకు భద్రావతి ఒప్పుకోదు.. వాడు చచ్చిన రోజు నేను పెళ్లి చేసుకుంటా వాడిని క్షమించేది లేదు.. నా చెల్లి నా గుండెచప్పుడు అలాంటిది నా నుండి నా చెల్లిని దూరం చేసాడని భద్రావతి కోపంగా మాట్లాడతుంది. ఆ తర్వాత పెద్దాయన తన భార్యతో చెప్తూ బాధపడుతాడు. అప్పుడే చనిపోతాడు. ఇక వేదవతి, రామరాజులు వస్తుంటే.. వద్దని తన తమ్ముడు సేనాపతికి భద్రావతి చెప్పగానే డోర్ వేస్తాడు. మా నాన్నని చూస్తానంటూ వేదవతి ఏడుస్తుంటే.. రామరాజు కత్తి పట్టుకొని డోర్ నెట్టి వేదవతిని లోపలికి తీసుకొని వెళ్తాడు. నాన్న చావుకి కారణమైన నిన్ను వదలనురా అని భద్రావతి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : రిసెప్షన్ లో జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప.. నీకు బావేమో నాకు దేవుడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2'(Karthika Deepam2 '). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -200లో.... కాశీ, స్వప్న ఇద్దరు ప్రేమ తో కార్తీక్, దీపల ఏవి రెడీ చేసి ప్లే చేద్దామని అనుకుంటారు కానీ జ్యోత్స్న తో ఎంగేజ్మెంట్ అయినప్పుడు జరిగిన వీడియో వస్తుంది. ఆపేస్తుంటే ఆపకని జ్యోత్స్న అంటుంది. నాకు అన్యాయం జరిగిందని కార్తీక్ చెయ్ శౌర్యపై పెట్టి నిజం మాత్రమే చెప్పాలని అంటుంది. నీకు దీప ముందే తెలుసు కదా అని అడుగుతుంది. దాంతో అవును అని కార్తీక్ చెప్తాడు. చూసారా ముందే దీప పరిచయం ఉంది అయిన కూడ నాతో పెళ్లి వరకు వచ్చాడు. నాకు అన్యాయం చేసాడని జ్యోత్స్న కావాలనే అందరి ముందు దీపని బ్యాడ్ చెయ్యాలని ట్రై చేస్తుంది. నేను నీకు అన్యాయం చెయ్యడమేంటి.. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కార్తీక్ అంటాడు. ఈవిడ గారి మాజీ మొగుడు తనని చంపాలనుకుంటే ఆమెకి అడ్డు వెళ్లాడు.. పెళ్లి ఆగేలా చేసుకున్నాడు. ఆ తర్వాత అనసూయ శౌర్యని పక్కకి తీసుకొని వెళ్తుంది. జ్యోత్స్న కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే మాటలు మర్యాదగా రానివ్వండి అని శ్రీధర్ అంటాడు. మొదటి భార్య కొడుకు రిసెప్షన్ కి రెండవ భార్యతో వచ్చిన నువ్వు మాట్లాడుతున్నావా అని పారిజాతం అంటుంది. ఆ తర్వాత స్వప్న, కాశీ, దాస్ లు వాళ్లని అక్కడ నుండి వెళ్ళమని అంటారు. అయిన జ్యోత్స్న, పారిజాతం వినరు. నాతో పెళ్లికి ఒప్పుకున్నావంటే నేనంటే ఇష్టం ఉంది అయిన దీప కోసం ఇలా చేసావని జ్యోత్స్న అంటుంది. మా బావని కావాలనే నాకు దూరం చేసావ్.‌ అసలు శౌర్యని కూడా నా బావతోనే కని ఉంటావని దీపతో జ్యోత్స్న అనగానే.. జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది దీప. ఇంకొకసారి నా కూతురు గురించి మాట్లాడితే బాగుండదు.. నాకు సుమిత్ర గారు ఎలాగో కార్తీక్ బాబు అలాగే.. తను నీకు బావేమో నాకు దేవుడు.. నా మెడలో తాళి కట్టి నాకు భర్త అయ్యాడు.. తన గురించి తప్పు గా మాట్లాడితే ఇంకో చెంపపగులుతుందని జ్యోత్స్నకి దీప వార్నింగ్ ఇస్తుంది. అదంతా సుమిత్ర చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.