భార్యను కాపాడుకోవడానికి భర్త... సవతి తల్లి మరో ఎత్తుగడ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto   Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -251 లొ.....సీతాకాంత్ ఆఫీస్ కి వచ్చి రామలక్ష్మిని హగ్ చేసుకొని సారీ చెప్తాడు. నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను.. ఇక మనల్ని ఎవరు వేరు చెయ్యలేరని సీతాకాంత్ అన్నట్లు ఉహించుకుంటాడు. రామలక్ష్మి క్యాబిన్ ముందు ఆగి నేను రామలక్ష్మికి దూరంగా ఉంటేనే తనకి సేఫ్ అందుకే దూరంగా ఉండాలని సీతాకాంత్ అనుకొని.. కొన్ని రోజులు రామలక్ష్మి ఇంటి దగ్గర ఉండాలి. ఇంటిదగ్గర అందరు తనని క్షేమంగా చూసుకుంటారని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది.. నిన్ను కొన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నానని సీతాకాంత్ అనగానే.. నేనేం తప్పు చేసానని రామలక్ష్మి అడుగుతుంది. ఇంకేం మాట్లాడకు నేను చెప్తున్నా వినాలి అంతే అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అభి గాడు మన గురించి సీతాకి చెప్పేసి ఉంటాడని శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు టెన్షన్ పడుతుంటారు. అప్పుడే సీతాకాంత్ వచ్చి కోపంగా అమ్మ నీతో మాట్లాడాలి పైకి రా అనగానే ఇంకా టెన్షన్ పడతారు. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి సిరి వచ్చి వదిన ఈ న్యూస్ చూడమని ఇస్తుంది. అందులో అభి అనే వ్యక్తి ఆర్థిక పరిస్థితికి ఆత్మహత్య చేసుకున్నాడని ఉంటుంది. అది చూసి అభి అంత పిరికివాడు కాదని రామలక్ష్మి అంటుంది. వాడి గొడవ ఇంక లేదు మీరు హ్యాపీగా ఉండండి అని సిరి అనగానే.. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టేది ఎవరో.. ఒక అభికి మాత్రమే తెలుసు.. చెప్పకుండానే వాడికి అయిందని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు రామలక్ష్మిని ఎవరో చంపాలని చూసున్నారని శ్రీలతతో సీతాకాంత్ చెప్తాడు. ఆ విషయం అభి చచ్చిపోతు చెప్పాడు కానీ ఎవరో చెప్పలేదు.. నేను తెలుసుకుంటాను.. నువ్వు రామలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని శ్రీలతకి సీతాకాంత్ అంటుంది‌. హమ్మయ్య అభి గాడు నా పేరు చెప్పలేదని శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది.ఆ తర్వాత శ్రీలత సందీప్, శ్రీవల్లి దగ్గరికి వచ్చి మన గురించి వాడేం చెప్పలేదు కానీ సీతాకాంత్ తెలుసుకోవాలనుకుంటున్నాడని శ్రీలత అనగానే.. సీతా అన్నయ్య అడ్డు తొలగించి ఆస్తులు సొంతం చేసుకోవాలని సందీప్ అంటాడు. మరొకవైపు సీతాకాంత్ కోసం రామలక్ష్మి వెయిట్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : నువ్వు గుమాస్తా కూతురివి నీకెందుకు ఆస్తులు.. అత్తని నిలదీసిన కూతురు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -565 లో.....రుద్రాణి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. నువ్వు ఆస్తులు పంచమనగానే మా అమ్మ నాన్న పంచుతారు అనుకున్నావా అని రుద్రాణి అంటుంది‌. ఎందుకు పంచరు నా కొడుకుకి ఆస్తిలో సమాన వాటా ఉందని ధాన్యలక్ష్మి అనగానే.. నా కొడుకుకి కూడా ఉందని రుద్రాణి అంటుంది. కానీ కావ్య ఆస్తులు పంచనివ్వదు చూడమంటూ కావ్య గురించి నెగెటివ్ గా చెప్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి హాల్లో కి వచ్చి.. ఈ వంశ వారసుడు కళ్యాణ్. వాడికి ఏం న్యాయం చేస్తున్నారు ఇంటి పెద్దగా ఏం ఆలోచించారు మావయ్య అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఇంకాస్తా టైమ్ ఇవ్వమని అడగడం తప్ప ఏం చెయ్యలేని అని సీతారామయ్య అనగానే.. సీతారామయ్యపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. దాంతో ఏంటి నీ ఇంటి నుండి తెచ్చిన ఆస్తులు ఏమన్నా మా ఆస్తులలో కలిపివా అంటూ ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఇంకొకసారి ఈ విషయం గురించి తీస్తే.. ఏం చేస్తానో నాకే తెలియదని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత రుద్రాణి మధ్యలో దూరబోతుంటే స్వప్న ఆపి తనకి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత రాజ్ ఫైల్ పై సంతకం చెయ్యలేదని శృతి చెప్పగానే.. రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి సైన్ పెట్టమంటుంది. నేను పెట్టనని రాజ్ అనగానే‌. ఆర్డర్ వేస్తున్నానని ఫైల్ రాజ్ దగ్గర పెట్టి కావ్య వెళ్తుంది. ఆ తర్వాత నిన్ను కాదే అనాల్సింది అంటూ రాజ్ ఫైల్ తీసుకొని సీతారామయ్య దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత ఇదంతా మీ వళ్లే తాతయ్య.. నువ్వు కావ్యని సీఈఓ చేసావ్.. అప్పుడే కళ్యాణ్ ఆటో నడుపుతున్న విషయం తెలిసింది. అందుకే పిన్నికి కోపం వచ్చిందని రాజ్ అంటాడు. కానీ రాజ్ మాటలని సీతారామయ్య పట్టించుకోడు. తర్వాత ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి, రాహుల్ అనుకుంటుంటే అప్పుడే స్వప్న వచ్చి.. మీకెందుకు ఆస్తులు.. నువ్వు గుమస్తా కూతురివి.. తాతయ్య గారు పెంచుకున్నారు.. నీకు వాటా ఎక్కడిదని రాహుల్, రుద్రాణిలకి కోపం వచ్చేలా స్వప్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తెలుగు కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేసిన కన్నడ బ్యాచ్.. 

  బిగ్ బాస్ సీజన్-8 లో పదకొండో వారం కన్నడ బ్యాచ్ నామినేషన్ల గురించి మాట్లాడుకున్న వీడియోలు ఒక్కొక్కటిగా నెట్టింట బయటకొస్తున్నాయి. వారి మాటలు సోషల్ మీడియాలోని నెటిజన్లంతా మండిపడుతున్నారు. ఈ వారం పృథ్వీ, యష్మీలని డేంజర్ జోన్ లో ఉంచి ఎవరినో ఒకరిని బయటకు పంపాలని చూస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ పృథ్వీ, యష్మీ, ప్రేరణ, నిఖిల్ కలిసి నామినేషన్ల ముందు ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో మాట్లాడేస్తూ దొరికిపోయారు. ఇక ప్రతీవారం తెలుగు కంటెస్టెంట్స్ బయకు వచ్చేస్తున్నారు. హరితేజ, గంగవ్వ, నయని పావని, మెహబూబ్, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, అభయ్ నవీన్, శేఖర్ బాషా, బెజవాడ బేబక్క వీళ్లంతా తెలుగువాళ్లే. అయితే కన్నడ బ్యాచ్‌ లోని యష్మీ, పృథ్వీ ఓటింగ్ లో ప్రతీవారం లీస్ట్ లో ఉన్నా వారిని మాత్రం బయటకు పంపించడం లేదు.  వాళ్ళంతా ఫౌల్ గేమ్ ఆడినా.. పచ్చి అబద్దాలు ఆడినా.. గ్రూప్ గేమ్ ఆడినా.. హౌస్‌లో ఎన్ని వెధవ వేషాలు వేసినా.. ఎన్ని ఫ్లిప్‌లు చేసినా కూడా.. వీకెండ్‌ లో వాళ్ళనే పొగిడేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే కన్నడ వాళ్ళంతా గ్రూప్ కట్టి.. 12 మంది తెలుగు వాళ్లని హౌస్ నుంచి బయటకు పంపించేశారుమ ఇది ఇలానే సాగితే టాప్-5 మొత్తం వారే ఉంటారు. ఇక నిఖిల్ కి పోటీ నబీల్ కాబట్టి అతడినే టార్గెట్ చేశాడు నిఖిల్. అతన్ని ఫినాలేకి వెళ్లకుండా చేయడానికి తన కన్నడ బ్యాచ్‌తో కలిసి స్కెచ్ వేశాడు నిఖిల్. పదోవారం ఎలిమినేషన్‌లో గంగవ్వ, హరితేజలను ఎలిమినేట్ చేశారు. ఇక పదకొండవ వారం నామినేషన్స్‌లో కన్నడ బ్యాచ్ అంతా కలిసి గ్రూప్ నామినేషన్స్ చేశారు. నబీల్ టైటిల్ రేస్‌లో ఉన్నాడని.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా తెలుసుకున్నాడు. నిఖిల్ కి బాగా దగ్గరైన హరితేజ.. నబీల్ టైటిల్ రేస్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పేసినట్టుంది. దాంతో ఎలాగైనా నబీల్‌ని హౌస్ నుంచి బయటకు పంపాలని అతన్ని ఫినాలేకి రాకుండా చేయాలని తన కన్నడ బ్యాచ్‌తో కలిసి కుట్ర చేస్తున్నాడు నబీల్. ఇప్పటికే నబీల్ కి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది. మనం అలర్ట్‌గా లేకపోతే ఫినాలేకి వెళ్లిపోతాడు. కాబట్టి అతను ఫినాలేకి వెళ్లకుండా ఉండాలంటే.. మనమంతా కలిసి గ్రూప్‌గా అతన్ని నామినేట్ చేస్తుండాలి. లేదంటే అతను ఫినాలేకి వచ్చేస్తాడు అంటూ 'కే' బ్యాచ్‌ అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలాగే సాగిపోతూ నమ్మకంతో ఓట్లు వేసే అభిమానులని బిగ్ బాస్ మోసం చేసినట్టే అవుతుంది. ఈ వారమైన కన్నడ బ్యాచ్ లోని పృథ్వీ, యష్మీలలో నుండి ఎవరినో ఒకరిని బయటకి పంపిస్తారో లేదో చూడాలి మరి.  

రెండు వందల ఎపిసోడ్ లు పూర్తిచేసుకున్న కార్తీకదీపం-2.. 

  స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో చెప్పలేం.. ఏ మూవీకి లేనంత ఫాలోయింగ్ ఈ సీరియల్ కి ఉంది. కార్తీకదీపం మొదటి పార్ట్ విజవంతంగా పూర్తి అవ్వడంతో దర్శకుడు నవవసంతం అంటు కార్తీకదీపం-2 ని తీసుకొచ్చాడు. ఇక ఈ సీరియల్ తాజాగా రెండొందలు(200) ఎపిసోడ్ కి చేరుకుంది.  ఇక ఇందులోని పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్.. కార్తీక్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల.  బుల్లితెర శోభన్ బాబు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. కార్తీక దీపం-2 కథ ఇప్పటికే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కార్తీక్ దీపని శౌర్య కోసం పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మాములుగా లేవు టీవీలో పెళ్లి చేసుకుంటే.. టీవీ ముందు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. మరికొందరు అయితే హారతులు కూడా పట్టారు. ఈ వీడియోలని సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళకి పిచ్చి పీక్స్ కు పోయిందనిపిస్తుంది.‌ మరి ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. కార్తీక్ , దీప ఇద్దరు ఒకటయ్యారు. ఇక సీరియల్ మెయిన్ విలన్ జ్యోత్స్న ఎలాగైనా కార్తీక్ ని దక్కించుకోవాలని పారిజాతంతో కలిసి విశ్వప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతుంది. మరొకవైపు సుమిత్ర, దశరథ్ ల అసలైన వారసురాలు దీప అనే విషయం దాస్ కనిపెడతాడో లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దాస్ కూతురు జ్యోత్స్న.. ఆ విషయం పారిజాతం, జ్యోత్స్న, దాస్ లకి తెలుసు కానీ దీప అసలైన వారసురాలనే విషయం మాత్రం సస్పెన్సు. దీప దగ్గర ఉన్న కుబేర్ ఫోటోని దాస్ చూసినప్పుడే ఈ నిజం బయటకొస్తుంది‌. కానీ దీనిని మనకి ఏ వెయ్యో ఎపిసోడ్ లోనో రెండువేల ఎపిసోడ్ ల తర్వాతనో రివీల్ చేస్తాడు డైరెక్టర్. ఎందుకంటే ఈ సీరియల్ లో‌ ఇదే కీలకం. దీపే అసలైన వారసులు అని తెలిసాక శివన్నారాయణ‌, దశరథ్, సుమిత్ర అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇది ఇప్పట్లో రాదు కాబట్టి వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.  

నీకు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవు.. గౌతమ్ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో భాగంగా ప్రేరణ మెగా చీఫ్ అయినందుకు మొదట నామినేషన్ తననే చెయ్యమని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో  గౌతమ్ ని నామినేట్  చేస్తుంది ప్రేరణ. అసలు నువ్వు ఏంటో నీ గేమ్ ఏంటో అస్సలు అర్ధం అవట్లేదని ప్రేరణ అంటుంది. నా గేమ్ మీకు ఎందుకు అర్థం అవ్వాలంటూ గౌతమ్ మొదలెట్టాడు.. అవసరం ఏముంది.. మీరెప్పుడు ఒకరిని తక్కువ చేసేలా మాట్లాడుతారు.. సిగ్గులేదా అని మాటలు మీరు తీసుకుంటారేమో గాని నేను తీసుకోలేను.. మాటలు మర్యాదగా మాట్లాడాలి కంట్రోల్ లో ఉండాలని గౌతమ్ అంటాడు. ఒక మాటని గుచ్చి గుచ్చి మాట్లాడుతావు.. మీకు అసలు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవు.. ఇంకా మెగా చీఫ్ క్వాలిటీస్ లేవు.. అంత గ్రూపిజమని గౌతమ్ అంటాడు. దాంతో ప్రేరణ కూడా తగ్గకుండా మాట్లాడుతుంది. ఆ తర్వాత పృథ్వీని గౌతమ్ నామినేట్ చేస్తాడు‌. నువ్వు ఒకరికి ఇబ్బంది అవుతుందన్నా కూడా పట్టించుకోవు.. నీ వరకు వస్తే అది ప్రాబ్లమ్ లేదంటే లేదు.. నువ్వు హౌస్ లో చాలా మందికి డిస్ రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడావ్.. అవినాష్, రోహిణిలని తక్కువ చేసి మాట్లాడావ్.. అది నాకు నచ్చలేదని గౌతమ్ అంటాడు. గౌతమ్ గురించి టాపిక్ వదిలేయ్.. ఎందుకు అంటే సీతాఫలం తింటున్నానని కెమెరాకి ముందే చెప్పాడు.. జనాల ఫన్నీవేలో చేసాడని.. చూస్తారు నువ్వే ఎక్కువ చేస్తుందనుకుంటారని ప్రేరణతో రోహిణి అసలేం జరిగిందో చెప్తుంది.  

కన్నడ బ్యాచ్ గ్రూపిజాన్ని బయటపెట్టిన టేస్టీ తేజ!

  బిగ్ బాస్ సీజన్-8 సూపర్ ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ లో పదకొండవ వారం మొదలైంది. సోమవారం రానే వచ్చింది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న నామినేషన్ ప్రక్రియతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు రాజేసుకుంది. టేస్టీ తేజ గత వారం చేసిన ఒకే ఒక మిస్టేక్ తో కన్నడ బ్యాచ్ టార్గెట్ చేశారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియ డిఫరెంట్ గా జరిగింది. యాక్షన్ రూమ్ లో హౌసెమేట్స్ ఫొటోస్ ఉంటాయి. బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న బ్రష్ ఎవరు పట్టుకుంటే వాళ్ళు నామినేట్ చెయ్యాలనుకున్న వారి ఫోటోకి కలర్ వెయ్యాలి. దాంతో నిఖిల్, తేజని నామినెటే చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ టాస్క్ లో నువ్వు చేసింది తప్పు.. నీకు తప్పు అని తెలిసిన కూడ చేసావని నిఖిల్ రీజన్ చెప్తాడు. నాకు ముందు తెలియదు ఆ తర్వాత తప్పని తెలిసింది ఒప్పుకున్న నేను చేసింది తప్పు అయితే.. యష్మీ చేసింది కూడా తప్పే అని తేజ అనగానే.. అది నాకు తెలియదని నిఖిల్ అంటాడు.  భయపడుతున్నావని తేజ అంటాడు. ఆ రోజు నన్ను ముగ్గురు ఎటాక్ చేసి అడిగారు కదా అని తేజ అనగానే.. ముగ్గురు ఎవరు పేర్లు చెప్పే దమ్ము లేదంటు పృథ్వీ రెచ్చి పోయి తేజపై మీద మీదకి వెళ్తాడు. దమ్ము లాంటి మాటలు మాట్లాడకని పృథ్వీతో తేజ అంటాడు. ఆ తర్వాత తేజ యష్మీని తేజ నామినేట్ చేస్తాడు. ఆ రోజు నిఖిల్ కి సపోర్ట్ చేసావ్. మళ్ళీ రోహిణి, నబీల్, నిఖిల్ లు శనివారం నాటి ఎపిసోడ్ లో షీల్డ్ కోసం నిల్చున్నప్పుడు నబీల్ కి సపోర్ట్ చేసావ్.. అదే ముందు చేసి ఉంటే ఇదంతా అయ్యేది కాదని తేజ అంటాడు. ఆ తర్వాత తేజని యష్మీ ఇమిటేట్ చేస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది కానీ తేజ మాత్రం ఏం తగ్గకుండా మాట్లాడతాడు. ఆ తర్వాత అవినాష్, రోహిణి, నబీల్ గౌతమ్ కలిసి మాట్లాడుకుంటారు వాళ్ళు కావాలనే ఒక మాటని మళ్ళీ మళ్ళీ అంటూ తేజని రెచ్చగొడుతున్నారని అవినాష్ అంటాడు. వీళ్ళకి కన్నడ బ్యాచ్ అంతా కలిసే ఆడుతున్నారని అర్థమైంది.   

ఓయో రూమ్ లా మారిపోయిన బిగ్ బాస్ హౌస్...పృథ్వీకోసం విష్ణుప్రియ!

  బిగ్‌బాస్ సీజన్-8 కి విష్ణుప్రియ ఎందుకొచ్చిందో ఆమెకే తెలీదు.. ఓట్లు ఎందుకేస్తున్నారో విష్ణు ఫ్యాన్స్‌కి తెలీదు.. అసలు ఆమెను ఎందుకు హౌస్‌లో కొనసాగిస్తున్నారో జనాలకీ తెలీదు. నిజమే.. కానీ ఈ తెలీదు తెలీదు అన్న ప్రశ్నలకి ఓ క్లారిటీ అయితే ఇచ్చింది. తను కప్పుకొట్టడానికి రాలేదని పృథ్వీనే కావలని, అతనే హైఎస్ట్(ఎక్కువ) ప్రియారిటీ అని డైరెక్ట్‌గా చెప్పింది విష్ణుప్రియ. ఇది చూసిన నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో విష్ణుప్రియ చెప్పిన మాటలకి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు‌. నువ్వు హౌస్ లోకి ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్ళావా లేక పృథ్వీతో ఉండటానికి వెళ్ళావా అంటు ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇది బిగ్ బాస్ హౌసా లేక ఓయో రూమా విష్ణుప్రియ.. గేమ్ ఆడవు.. ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వవు.. అలా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే అవినాష్, రోహిణిలని టార్గెట్ చేస్తావ్.‌ అసలు నువ్వేం చేస్తున్నావని ఇంకా హౌస్ లో ఉంటున్నావంటు మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అసలు బిగ్ బాస్  హౌస్ లో ఓ వైపు కన్నడ బ్యాచ్ కన్నింగ్ స్ట్రాటజీ నడుస్తుంటే మరోవైపు విష్ణుప్రియ పృథ్వీతో చేసే ఛంఢాలం.‌‌. ఫ్యామిలీతో కలిసి చూడలేకుంటే చేస్తున్న విష్ణుప్రియని ఎలిమినేషన్ చేయాలంటూ నెట్టింట ఆమెపై తీవ్రంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే మన బిగ్ బాస్ మామ గురించి తెలిసిందే కదా‌‌.. విష్ణుప్రియకి సంబంధించిన ఒక్క నెగెటివ్ ఫుటేజ్ కూడా రాకుండా ఎంత జాగ్రత్త పడుతున్నాడో.‌‌. ఆమె వల్ల హౌస్ లో జెన్యున్ గా ఉండే అవినాష్, రోహిణి, నబీల్ , గౌతమ్ కృష్ణ లాంటి కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. అయితే ఈ వారం నామినేషన్లో కన్నడ బ్యాచ్ తో పాటు తెలుగు కంటెస్టెంట్స్ అవినాష్, గౌతమ్ నామినేషన్ లో ఉన్నారు. మరి బిగ్ బాస్ మామ వారిని కాకుండా వీళ్ళనే ఎలిమినేషన్ చేసి మరోసారి విష్ణుప్రియ బిగ్ బాస్ దత్తపుత్రిక అని నిరూపించుకుంటాడా లేక కన్నడ బ్యాచ్ కే ఫేవరెట్ గా నిలుస్తాడా చూడాలి మరి.  

Karthika Deepam2 : శౌర్య మీద ఒట్టేసి నిజం చెప్పమన్న జ్యోత్స్న.. షాక్ లో‌ దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -199 లో.....శ్రీధర్ తో స్వప్న గొడవపడుతుంది. దాంతో కార్తీక్ అలా అందరిముందు మాట్లాడవద్దని చెప్తాడు. శ్రీధర్ ని చూసి శౌర్య తాతయ్య ఊరు వెళ్ళాడన్నారు.. స్వప్న వాల్ల అమ్మ పక్కన కూర్చుని ఉన్నాడు. మీ నాన్నని స్వప్న నాన్న అని పిలుస్తుందని నాకు ఆవిడా ఏమవుతుందని శౌర్య అడుగుతుంది. అంత తర్వాత చెప్తాను.. ఆవిడ నీకు నానమ్మ అవుతుందని కార్తీక్ చెప్పగానే.. నాకు ముగ్గురు నానమ్మలు అంటూ మురిసిపోతుంది. ఆ తర్వాత దీప కార్తీక్ లు స్టేజి పైకి వెళ్తారు. అప్పుడే స్వప్న, పారిజాతం రిసెప్షన్ కి వస్తారు. వాళ్ళని చూసి ముందు దాస్ హ్యాపీగా ఫీల్ అయిన ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పిలిచారంటూ అడుగుతాడు. కాశీ పిలిచాడని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ లకి దండలు మార్చుకోమని స్వప్న కాశీ ఇద్దరు దండలు ఇస్తారు. కార్తీక్ దండ దీప మెడలో వేస్తాడు. దీప వాళ్ళ సంతోషం కోసం అయిన నేను హ్యాపీగా ఉండాలని నవ్వుతు కార్తీక్ మెడలో దండ వేస్తుంది. అది చూసి పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం స్టేజి మీదకి వెళ్లి మాట్లాడతారు‌ మిమ్మల్ని ఎవరు పిలిచారని కార్తీక్ అనగానే.. మేమ్ విష్ చెయ్యడానికి వచ్చమని విష్ చేస్తారు. ఆ తర్వాత దాస్ వచ్చి.. మహిళా సంఘం లీడర్ వచ్చింది మిమ్మల్ని విష్ చేస్తుందని అంటాడు. సరే అని ఆవిడని పిలుస్తారు. తను కార్తీక్ గురించి గొప్పగా మాట్లాడుతుంది దీపకి జీవితం ఇచ్చారని అంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ల స్పెషల్ ఏవి రెడీ చేసామని స్వప్న, కాశీ ఇద్దరు అంటారు. ప్లే చేస్తుంటే జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ అనుకున్న రోజు అయిన గొడవ వస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆపేయమని కార్తీక్ అనగానే‌‌.. ఎందుకు ఆపాలి. అది నిజమే కదా అని నాకు అన్యాయం చేసావని జ్యోత్స్న అనగానే.. కార్తీక్ చెయ్ శౌర్య తలమీద పెట్టి నేను అడిగే దానికి నీ కూతురు మీద ఒట్టేసి నిజం చెప్పమని జ్యోత్స్న అంటుంది. దాంతో కోపంగా అరుస్తుంది దీప. నువ్వు మాట్లాడకని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిజం తెలుసుకున్న భర్త.. అపార్థం చేసుకున్నానంటూ భార్యకి హగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -250 లొ......శ్రీలత ఎప్పటిలాగే రామలక్ష్మితో గొడవ పడుతుంది. నిన్ను సీతాకాంత్ ని విడగొడతానంటు శ్రీలత ఛాలెంజ్ చేయగా.. అది నీ వల్ల కాదని రామలక్ష్మి అంటుంది. మరోవైపు డిటెక్టివ్ దగ్గరికి నందిని వచ్చి.. నిజం చెప్పకని అంటుంది. ఒకవేళ నువ్వు నిజం చెప్తానంటే నీ కొడుకుని చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక వీడియో చూపిస్తుంది. అది చూసి భయపడి చెప్పనంటూ డిటెక్టివ్ వెళ్ళిపోతాడు. సీతా నా వాడు.. నా నుండి తనని ఎవ్వరు విడదియ్యలేరని నందిని అనుకుంటుంది. ఆ తర్వాత తన క్యాబిన్ కి సీతాకాంత్ వస్తాడు. డిటేక్టవ్ లేకపోయసరికి ఎక్కడికి వెళ్లాడనుకుంటాడు. అప్పుడే అతను ఒక పేపర్ పై అభి అడ్రెస్ ఉంది.. మీరు వెళ్ళండి అంటూ రాసి ఉన్న పేపర్ అక్కడ పెడుతాడు. అది చూసి అభి దగ్గరికి సీతాకాంత్ వెళ్తుంటే.. నందిని వచ్చి మాట్లాడాలని అంటుంది. వెళ్తున్నానంటూ సీతాకాంత్ వెళ్తాడు. అప్పుడే నందినికి డిటెక్టివ్ రాసిన పేపర్ కన్పిస్తుంది. వీడు ఎంత మోసం చేసాడని రౌడీకీ ఫోన్ చేస్తుంది. డిటెక్టివ్ వచ్చి వాళ్ళ బాబుని తీసుకొని వెళ్ళాడని ఆ రౌడీ చెప్తాడు. అభికి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. ఆ తర్వాత అభి దగ్గరికి వెళ్లిన విషయం హారికకి నందిని చెప్తుంది. దాంతో నందిని టెన్షన్ పడుతుంటే.. నన్ను కూడా ఏదైనా చేస్తాడేమో నందినితో కలిసి ఉన్నానని హారిక అనుకుంటుంది. అప్పుడే రామలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది. అనుకోకుండా రామలక్ష్మి సీతాకాంత్ లు డాష్ ఇచ్చుకుంటారు. చూసుకోవాలి కదా అని సీతాకాంత్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత శ్రీలతకి నందిని విషయం చెప్తుంది. సీతాకాంత్ అభి దగ్గరికి వచ్చి.. ఎందుకు ఇదంత చేస్తున్నావని కొడుతాడు. మీరు ఇద్దరు హ్యాపీగా ఉండడం నాకు నచ్చడం లేదు.. అందుకే నాతో పాటు మీరు హ్యాపీగా ఉండకూడదని ఇంకా కొంతమంది అనుకుంటున్నారని అభి అనగానే.. ఎవరు వాళ్లు చెప్పు అని సీతాకాంత్ కొడతాడు. అప్పుడే అభిని ఒక రౌడీ బయట నుండి షూట్ చేస్తాడు. అదంతా హారిక వీడియో తీస్తుంది. ఆ తర్వాత రౌడీ నందిని దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. అది కూడ హారిక చాటు నుండి వీడియో తీస్తుంది. ఆ తర్వాత శ్రీలతకి నందిని ఫోన్ చేసి నా గురించి నిజం చెప్పకుండా ఆపానని చెప్తుంది. ఇప్పుడు నా గురించి ఏమైనా అభి గాడు చెప్పాడా అని శ్రీలత టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. సారీ నిన్ను తప్పుగా అపార్ధం చేసుకున్నానని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: ఆస్తిని వాటాలు చేయమన్న ఇంటి కోడలు.. ఇంటిపెద్ద కండిషన్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -564 లో....జీవితంలో ఈ అప్పుని నా కోడలుగా ఒప్పుకోనని ధాన్యలక్ష్మి అనగానే.. నా జీవితంలో కూడా ఇంట్లో అడుగు పెట్టనని కళ్యాణ్ అంటాడు. ఇలా నన్ను పిలిచి అవమానించడం రెండవసారి అని కళ్యాణ్ అంటాడు. నాకేంటి రా దాన్ని వదిలి వచ్చేయ్ అని ధాన్యలక్ష్మి అనగానే.. అనామికలాగా నన్ను వదిలియమంటున్నారా.. పచ్చడి మెతుకలు తిన్నా సరే కానీ నాకు ఈ కోట్ల ఆస్తులు వద్దు. ఇంకోసారి పిలిస్తే కళ్యాణ్ వస్తానన్న కూడా నేను కళ్యాణ్ ని రానివ్వనని కళ్యాణ్ ని తీసుకొని వెళ్తుంది అప్పు. ఆ తర్వాత  ఎందుకు ఇలా చేస్తున్నావంటూ ధాన్యలక్ష్మిని ప్రకాష్ తిడతాడు. అసలేం కావాలని ఇదంతా చేస్తున్నావని అడుగగా.. నా కొడుకుకి న్యాయం కావాలి. అందుకే మీరు ఆస్తులు పంచాలని ధాన్యలక్ష్మి అంటుంది. ఇది ఉమ్మడి కుటుంబం అలా ఎప్పుడు జరగదని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణి మధ్యలో కలుగజేసుకొని ఎవరి వాటా వాళ్లకి ఇవ్వండి అని అనగానే.. నీ ప్లాన్ ఇదా అయిన నీకు వాటా ఎక్కడిదంటూ ఇందిరాదేవి తిడుతుంది. నన్ను పెంచుకున్నారు కదా వాటా వేస్తే మాకు వాటా వస్తుందని రుద్రాణి అంటుంది. ఎందుకు అత్తయ్య మీరు ఇలా అంటున్నారని కావ్య అనగానే.. నువ్వెవరు నాకు చెప్పడానికి భర్తని ఇల్లుని వద్దనుకొని వెళ్ళావని ధాన్యలక్ష్మి అంటుంది. నాకు కొంచెం టైమ్ ఇవ్వు ధాన్యలక్ష్మి అని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అయిందంటూ అనామిక, సామంత్ లు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ జరిగింది గుర్తుచేసుకుంటారు. వాళ్ళు నన్ను అర్ధం చేసుకోకుండా మాట్లాడారు.. నువ్వు అలా మాట్లాడితే నేను ఇంకా ఎక్కువ బాధపడతానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కావ్య జరిగిన దానికి బాధపడుతుంటే.. నువ్వెందుకు భాదపడుతున్నావని కనకం అంటుంది. అంటే అది నా కుటుంబమని కావ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఎలాగైనా అలా కుటుంబం విడిపోకుండా చూడాలని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. తరువాయి భాగంలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది మీ ఇద్దరిలో ఎవరు పర్ఫెక్ట్ చేస్తే ఇక వాళ్లే సీఈఓ అని రాజ్, కావ్యలకి సీతారామయ్య చెప్తాడు. ఒకవేళ రాజ్ చెయ్యకపోతే కావ్యని భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకొని రావాలని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హరితేజ నిజస్వరూపాన్ని బయటపెట్టిన యాంకర్!

  బిగ్ బాస్ సీజన్-8 లో నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ ఎలిమినేట్ అయ్యింది. ఇక బయటకొచ్చే ముందు బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసింది హరితేజ. సీజన్-8 లో ఇంత త్వరగా రావడానికి కారణం ఏంటిని యాంకర్ అడుగుగా.. సీజన్ 1తో సీజన్ 8 హరితేజను పోల్చీ పోల్చీ ఇలా అయ్యిందని హరితేజ చెప్పింది. హరితేజ గురించి బయట ఆడియన్స్ ఏ విధంగా అనుకుంటున్నారో.. ఆ కామెంట్స్‌ని హరితేజకి చూపించాడు యాంకర్. ఇంట్లో డస్ట్ బిన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో బిగ్ బాస్ హౌస్‌లో హరితేజ వల్ల కూడా అంతే యూజ్ ఉంటుందంటు ఓ నెటిజన్ ఫైర్ అయిన ట్వీట్‌ని చూపించాడు. ఏది పడితే అది మాట్లాడటం వాళ్ల హక్కుగా భావించినప్పుడు.. వాళ్లని మనం కన్వెన్స్ చేయడం కష్టమని చాలా హరితేజ కవరింగ్ మే దడ్ దడ్ చేసింది. మరో ట్వీట్‌లో బిగ్ బాస్ హిస్టరీలోనే వరస్ట్ కంటెస్టెంట్ హరితేజ అని మరో నెటిజన్ ఫైర్ అయిన ట్వీట్‌ని యాంకర్ చూపించగా. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి.. ఇన్నేళ్లు ప్రేక్షకులకు దగ్గరగా బతికిన హరితేజ.. నెల రోజుల్లో చెడ్డది ఎలా అయిపోతుందని  హరితేజ కవర్ చేసుకుంది.  కామెడీతో అలరిస్తున్న రోహిణి, అవినాష్‌లపై పడి ఏడ్వడంతోనే ఈ జర్నీ అయిపోయింది. నవ్వు అనే అద్భుతమైన మంత్రంతో లాక్కొచ్చేస్తున్నాడు అని అవినాష్ గురించి చెప్పింది హరితేజ. ఇక హౌస్‌లో ఉన్నప్పుడు.. విష్ణు ప్రియపై ప్రేమ కురిపించిన హరితేజ.. బయటకు వచ్చిన తరువాత.. హౌస్‌లో కళామ్మతల్లి ముద్దు బిడ్డ పృథ్వీపై చేస్తున్న పత్తేపారం గురించి మాట్లాడింది. ఇక ఈ ఫ్లిప్పింగ్ స్టార్ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. బాగా పర్ఫామెన్స్ ఇచ్చే నబీల్ , ప్రేరణ, అవినాష్, రోహిణి, తేజలని బ్యాక్ బిచ్చింగ్ చేసి వరెస్ట్ ప్లేయర్ అనిపించుకుందని హరితేజని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  

Nominations promo :  నామినేషన్లో తడపడ్డ నిఖిల్.. టేస్టీ తేజ వ్యాలిడ్ పాయింట్!

  బిగ్ బాస్ సీజన్-8 లో పది వారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ ఎలిమినేషన్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక పదకొండవ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చెప్తూ సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియ ప్రోమో రానే వచ్చింది. ఇందులో రెండు నామినేషన్లు హైలైట్ గా నిలిచాయి. నామినేషన్ల ప్రక్రియ ఏంటంటే.. హౌస్ మేట్స్ పెయింటింగ్స్ ఉంటాయి. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి పెయింటింగ్‌పై రంగు పూయాలి. ఇక తేజను నిఖిల్ నామినేట్ చేస్తూ తన రీజన్ చెప్పాడు. ఒక చిన్న డిస్ రెస్పెక్ట్ చేసినందుకే తేజ నన్ను నామినేట్ చేశాడు.. కానీ తను బిగ్‌బాస్ రూల్‌నే బ్రేక్ చేశాడు అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి డిఫెండ్ చేసుకుంటూ అది ఇంట్లో నుంచి పరిగెత్తి బయటికెళ్లిపోయేంత తప్పు కాదనేది నా ఉద్దేశం.. సరే నాది తప్పు బ్రో మరి తర్వాత జరిగింది తప్పా కాదా అంటూ యష్మీ ఇష్యూను లేవనెత్తాడు తేజ. దీనికి ఏం చెప్పాలో తెలీక నువ్వు చేసిన తర్వాత ఆమె చేసిందా.. ఆమెను అడుగు అయితే అంటూ తప్పించుకునేందుకు నిఖిల్ ట్రై చేశాడు. కానీ తేజ వదలకుండా భయం నీకు మాట్లాడటానికి, అది తప్పా కాదా చెప్పు అంటూ తేజ రెచ్చగొట్టాడు. దీనికి నేను చెప్పా అంటూ నిఖిల్ అడ్డంగా వాదించాడు. భయమా మరెందుకు చెప్పవంటూ తేజ అంటే నీదే తప్పు అంటూ  నిఖిల్ అరిచాడు. వీరిద్దరితో పాటు మరో నామినేషన్ హైలైట్ అయ్యింది. గౌతమ్‌ను నామినేట్ చేసింది ప్రేరణ. మొత్తం బయటి ప్రపంచాన్నే మైండ్‌లో పెట్టుకొని గౌతమ్ ఆడినట్లుంది.. తనకి క్లారిటీ అనేది ఎక్కువ లేదంటూ ప్రేరణ చెప్పింది. దీనికి ఎప్పటిలానే గౌతమ్ రెచ్చిపోయాడు. ఒక మనిషికి బ్రాండింగ్ వేయడమనేది డిస్ రెస్పెక్ట్.. అవమానానికి ఆచరించకపోవడానికి చాలా తేడా ఉంది.. ప్రతి దానికి అరె నువ్వు తప్పు చేసినవ్ నీ వల్లే ఓడిపోయినవ్.. నీ వల్లే ఓడిపోయినవ్.. అని గుచ్చి గుచ్చి చెప్పడం టీమ్ మెట్ లక్షణం కాదు.. మెగా చీఫ్ లక్షణం కాదంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు.

Hariteja Eliminated : ఆ అయిదుగురు మాస్క్ లు తీసేస్తే బెటర్.. హరితేజ ఎలిమినేటెడ్!

  బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మొదటి కంటెస్టెంట్ హరితేజ. తను నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యింది. శనివారం నాడు గంగవ్వ సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వగా నిన్న హరితేజ ప్రేక్షకుల ఓటింగ్ తక్కువగా ఉండటం వల్ల బయటకొచ్చేసింది. నిన్న సండే ఫండే కాబట్టి గేమ్స్ తో పాటు సేవింగ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. అలా ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరికి యష్మీ, హరితజ నిలిచారు. ఇక ఎవిక్షన్ షీల్డ్ ని సొంతం చేసుకున్న నబీల్ ని.. దీనిని ఇప్పుడు వాడతావా అని నాగార్జున అడుగగా.. తర్వాత వాడతాను సర్ అని నబీల్ అన్నాడు. దాంతో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం హరితేజ ఎలిమినేషన్ అయ్యింది. ఇక హౌస్ లో అందరికి బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన హరితేజ ఎమోషనల్ అయ్యింది. తను ఎలిమినేషన్ అయ్యినందుకు తన కూతురు భూమి ఒక్కతే హ్యాపీగా ఉంటుందని హరితేజ అంది. ఇక ఆ తర్వాత తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యింది. హరితేజ వెళ్ళే ముందు హౌస్ లో ఎవరు మాస్క్ తో ఉన్నారో చెప్పమని నాగార్జున అడిగాడు. నవ్విస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆటలో మీ స్వభావం ఏంటో అర్థం కావడం లేదని అవినాష్ ని మాస్క్ తీసేయమని హరితేజ అంది‌. తను ఎప్పుడు ఒక షీల్డ్ తోనే కన్పిస్తుంది. దాని బయటకు వచ్చి ఆడాలి. అన్నింటిని మనసుకు తీసుకొని ఎక్కువ ఏడ్వడం మంచిది కాదని రోహిణిని మాస్క్ తీసేయమంది హరితేజ. రూల్స్ చెప్పడం కాదు ఫాలో అవ్వాలి. కొత్త పర్సనాలిటీ తేజ ఎప్పుడు బయటకు వస్తాడో అర్థం కావడం లేదని, కిచెన్ లో ఎంత మనస్ఫూర్తిగా వంట చేస్తారో అలాగే ఆట ఆడి మీ నిజమైన వ్యక్తిత్వం చూపించండి అంటు టేస్టీ తేజని మాస్క్ తీసేయమంది. ఇక ప్రేరణ పేరు చెప్పింది.. తను మంచి అమ్మాయి. కొన్ని చెడు లక్షణాలు ఆ మంచిని కప్పేస్తాయి. వాటిని కవర్ చేసుకుంటే మంచిది అని హరితేజ అంది‌. ఆ తర్వాత నిఖిల్ పేరు చెప్పింది. హీరో కేవలం హీరోగానే ఉండాల్సిన పనిలేదు. భావోద్వేగాలని చూపించాల్సిన అవసరం ఉంది. అన్నింటిని లోపలే ఉంచుకోకు.. కోపం చూపించినట్టే నీ మనససులోని ఎమోషన్ ని చూపించు. చిన్నపిల్లాడిలా కూడా మారిపోవచ్చు. ప్రతీ ఎమోషన్ ని చూపించు అంటు నిఖిల్ తో హరితేజ అంది. ఇలా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, ప్రేరణ, నిఖిల్ పేర్లను చెప్పి వారిని మాస్క్ తీసేసి ఆడమని హరితేజ అంది. 

Sai Kiran Engagement: స్రవంతితో సాయి కిరణ్ ఎంగేజ్ మెంట్.. సోషల్ మీడియాలో వైరల్!

సీరియల్ నటుడు సాయి కిరణ్ తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తన సహనటి స్రవంతితో తాజాగా సాయి కిరణ్‌కి నిశ్చితార్థం అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి శుభవార్త చెప్పాడు. అయితే గతంలోనే సాయి కిరణ్‌కి పెళ్లి జరిగి విడాకులయ్యాయి. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉన్న సాయి కిరణ్ తాజాగా మరోసారి ఏడడుగులు వేయబోతున్నాడు. సాయి కిరణ్ వెండితెరతో పాటు బుల్లితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో పలు సినిమాల్లో హీరోగా చేసిన సాయి కిరణ్.. ప్రస్తుతం బుల్లితెరపై కీలక పాత్రలు పోషిస్తూ ఎన్నో హిట్ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో మహేంద్ర పాత్రలో సాయి కిరణ్ నటన ఆడియన్స్‌ను ఫిదా చేసింది. తాజాగా ఆయన తన అభిమానులకి ఓ శుభవార్త చెప్పాడు. చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న సాయి కిరణ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అదే విషయం చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో‌ పోస్ట్ చేశాడు.  కోయిలమ్మ సీరియల్‌లో తనతో పాటు నటించిన స్రవంతితో సాయి కిరణ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని సాయి-స్రవంతి ఇద్దరు కలిసి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. "నువ్వు + నేను = ఎప్పటికీ.. ఎంగేజ్‌మెంట్" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫొటోలు షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసి బుల్లితెర సెలబ్రెటీలు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. గుప్పెడంత మనసు రక్ష గౌడ, కీర్తి భట్, కరుణ భూషణ్, కార్తీక దీపం నిరుపమ్, ప్రియాంక జైన్ ఇలా పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెప్పారు.

జంబలకిడి పంబాలో మెరిసిన అవినాష్.. తేజ డ్యాన్స్ కి వరుణ్ తేజ్ ఫిధా!

  బిగ్ బాస్ పదోవారం వీకెండ్ సండే ఫన్ డే అంటు నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరు కూడా అమ్మాయిలు అబ్బాయిల గెటప్ లో.. అబ్బాయిలు అమ్మాయిల గెటప్ లో వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అవినాష్, తేజల గెటప్ చూసి నాగార్జున అవాక్కయ్యాడు. ఆ తర్వాత నాగార్జున హౌస్ లో జరిగిన మూమెంట్ లని ఒక్కొక్కరికి ఇస్తాడు. అవినాష్ ని పృథ్వీతో ఉన్నప్పుడు విష్ణు ఎలా ఉంటుందని ఇమిటేట్ చెయ్యమనగా.. అవినాష్ పర్ఫెక్ట్ గా చెస్తాడు. ఆ తర్వాత ప్రేరణ మెగా చీఫ్ అయ్యాక ఎలా బిహేవ్ చేస్తుందో చూపించాడు. విష్ణు, పృథ్వీలాగా, యష్మీని గౌతమ్ అక్క అని పిలిచిన సిచువేషన్ నిఖిల్ మధ్యలో ఎంటర్ అయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ తేజ్ తన 'మట్కా' మూవీ ప్రమోషన్ కి వస్తాడు. హౌస్ మేట్స్ గెటప్స్ చూసి నవ్వుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయిల గెటప్ లో ఉన్న అబ్బాయిలకి ఐటమ్ సాంగ్స్ అబ్బాయిల గెటప్ లో ఉన్న అమ్మాయిలకి బాయ్స్ మాస్ సాంగ్స్ చేస్తారు. వాటికి వరుజ్ తేజ్ మార్కులు ఇస్తాడు. ఆ తర్వాత హౌస్ లో ఎవరు ఎలాంటి వారో ఒక్కక్కరుగా ఒక్కొక్క హాష్ టాగ్ ఇవ్వాలి‌ ఇదంతా ఫన్నీగా జరుగుతుంది. రేషన్ తీసుకొని వచ్చేటప్పుడు హౌస్ మేట్స్ సరుకులు దొంగతనం చేసిన వీడియోని చూపించి ప్రైజ్ మనీ నుండి డబ్బులు కట్ చేస్తామని నాగార్జున అనగానే.. అందరు వద్దని రిక్వెస్ట్ చెయ్యడంతో మనీ కట్ చెయ్యరు. ఎలాగోలా సండే ఫండే ఫుల్ ఫన్నీ గా హౌస్ మేట్స్ కి బెస్ట్ మెమొరెబుల్ డే గా గడిచింది.  

Bigg Boss 8 : ఇది తెలుగు బిగ్ బాసా లేక కన్నడ బిగ్ బాసా?.. దుమారం రేపుతున్న ఇష్యూ!

బిగ్‌బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదే కన్నడ బ్యాచ్.. పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మీ.  సీజన్-8 మొదలైన రోజు హౌస్ లోకి ఎక్కువ మంది కన్నడ నటులను బిబి టీమ్ తీసుకుందంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అసలు ఇది తెలుగు బిగ్‌బాస్ షోనా లేకుంటా కన్నడా బిగ్‌బాస్‌ షో అన్నట్టు విమర్శులు చేశారు. హౌస్‌లోకి వెళ్లిన వారంతా ఫ్లూయెంట్‌గా తెలుగులో మాట్లాడుతుండటంతో.. ఫర్వాలేదు అనిపించారు. వారి ఆట తీరుతో కూడా ఆకట్టుకున్నారు.  అంతే కాకుండా వారికి ఉన్న సీరియల్‌ ఫాలోవర్స్ కూడా ఓట్లు వేస్తున్నారు. దీంతో వాళ్లను ఓ బ్యాచ్‌గా చూడటం మొదలు పెట్టారు పోటీదారులు. వాళ్ల బిహేవియర్‌ కూడా అలానే ఉండటంతో కొత్త వివాదానికి దారి తీసింది. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి, ఈ నలుగురు ఇటు సీరియల్‌ బ్యాచ్‌గానే కాకుండా కన్నడ బ్యాచ్‌గా ముద్రపడిపోయారు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరిగేదే. కానీ ఇప్పుడు ఈ విభేదాలు హౌస్‌లో కూడా వచ్చినట్టు స్పష్టమైంది. తాజాగా మెగా చీఫ్ కంటెండర్‌ టాస్క్‌లో నబీల్ గురించి ప్రేరణ డిస్కష్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించింది. పదోవారంలో నిర్వహిస్తున్న మెగా చీఫ్‌ కంటెండర్‌ టాస్క్‌లో ముందు యష్మీ బాక్స్‌లో ఎక్కువ మూటలు ఉన్నందున ఆమెను మొదట తప్పించారు. తర్వాత రౌండ్‌లో నబీల్‌ను తప్పించారు. ఇక్కడ వివాదం మొదలైంది. ప్రేరణ వెళ్లి తనకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. తన వాళ్లతో మాట్లాడి చెబుతానంటూ నబీల్ అనడాన్ని ప్రేరణ తప్పుపట్టింది. ఇక అక్కడే ఉన్న హరితేజ.. మా వాళ్లు అంటే అవినాష్, రోహిణి, గౌతమ్‌ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆ వివాదం అక్కడ ముగిసినట్టే కనిపించినా వారి మనసులో ఉన్న భావన మాత్రం బయటకు వచ్చిందని ప్రేకక్షలు భావిస్తున్నారు.  యష్మీ, పృథ్వీ, నిఖిల్ ఆట తీరు కూడా తమ నలుగురికి సపోర్ట్‌గానే ఉంటోంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన వివాదం నడుస్తోంది. రెండు భాషల మధ్య విభేదాలు సృష్టించే విధానం మంచిది కాదనే వాళ్లు ఉన్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతున్న ఈ ఇష్యూకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ ప్రేకక్షలు కోరుతున్నారు. దీనిపై నాగార్జున స్పందించి పరిష్కరిస్తాడో లేదో చూడాలి మరి.

వరెస్ట్ హౌస్ మేట్ గా విష్ణుప్రియ.. కానీ తేజకి అన్యాయం..!

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే పది వారాలు పూర్తయ్యాయి. వీకెండ్ రానే వచ్చింది. ఎప్పటిలాగే నాగార్జున హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇవ్వడానికి రానే వచ్చాడు. అయితే ఎప్పటిలాగా ఫుల్ ఫైర్ తో రాకుండా కామ్ గా వచ్చాడు. హౌస్ మేట్స్ అందరిని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తమ ఫోటో నీ తీసుకొని తమ అంతరాత్మ మీద ప్రమాణం చేసి హౌస్ లో ఎవరు వరెస్ట్ పర్ఫామరో చెప్పమన్నాడు. మొదటగా నబీల్ ని పిలవగా తను విష్ణుప్రియ అని చెప్తాడు. హరితేజని పిలవగా రోహిణి అని చెప్తుంది. ప్రేరణని పిలవగా.. విష్ణుప్రియ అని చెప్తుంది. ఇలా ఒక్కొక్కరు తమకి నచ్చని కంటెస్టెంట్ పేరు .. వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వాళ్ళు అని చెప్తారు. అలా ఎక్కువగా రోహిణి విష్ణుప్రియ, తేజల పేర్లు చెప్తారు. (Bigg Boss 8 Telugu) ఆ తర్వాత నాగార్జున అందరిని పిలిచి.. ఇప్పుడు వరస్ట్ హౌస్ మేట్ ఎవరవుతారో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ లొ ఫ్యామిలీ రారని నాగార్జున చెప్పి.. నేమ్ అనౌన్స్ చేస్తాడు. వరెస్ట్ హౌస్ మేట్ ఇన్ ది హౌస్ అని తేజ పేరు చెప్పగానే తేజ షాక్ అవుతాడు. నేను ఈ సీజన్ కి వచ్చిందే నా ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి సర్ అదే నా ఫస్ట్ ప్రియారిటీ సర్ అని తేజ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత మీరు చెప్పిన దానిని నేను ఆక్సెప్ట్ చేస్తున్నానని తేజ అంటాడు. ఆ తర్వాత గంగవ్వ వెళ్లిపోతుంటే.. నా ఫ్యామిలీ హౌస్ లోకి రావట్లేదు.. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా వెళ్తుందని తేజ ఏడుస్తాడు. ఆ తర్వాత నువ్వు నీ ఫ్యామిలీ రావాలని అనుకుంటున్నావు కదా.. నా ఫ్యామిలీ వద్దని చెప్పి నీ ఫ్యామిలీనీ రప్పించండి అని నేను రిక్వెస్ట్ చెయ్యనా అని రోహిణి అంటుంది. వద్దు బిగ్ బాస్ ఎవరి మాట వినడు అని తేజ అంటాడు. అసలు అందరు ఎలా నన్ను అలా అనుకున్నారో అర్ధం కావట్లేదు. ఆ రిజల్ట్స్ వచ్చినందుకు బాధ లేదు. దాని ఎఫెక్ట్ కి బాధపడుతున్నానని తేజ ఎమోషనల్ అవుతాడు.  తమ ఫ్యామిలీ హౌస్ లోకి వస్తే చూడాలనుకున్న తేజకి వెన్నుపోటు పొడిచింది హరితేజ. ఆ టాస్క్ లో తను అలా చేశాడని పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్, యష్మీలకి హరితేజ నెగెటివ్ గా చెప్పడం వల్లే అందరు తనకి వరెస్ట్ అని ఇచ్చారు. అసలు నిజానికి  హౌస్ లో వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని ఏ ఒక్కరిని అడిగినా విష్ణుప్రియ అనే సమాధానం చెప్తారు. ఇక బిగ్ బాస్ ఆటలో విష్ణుప్రియే టాప్.. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ బేబీ.

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ కి బ్యాడ్ టైమ్.. కొత్త సీరియల్  తెచ్చిన సమస్య!

తెలుగు ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇక కొంతకాలం క్రితం సూపర్ హిట్ అయిన 'గుప్పెడంత మనసు' సీరియల్ ముగిసింది. దాంతో ఆ సీరియల్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఇప్పుడేమో 'బ్రహ్మముడి' సీరియల్ ని మధ్యాహ్నం టైమ్ స్లాట్ లో ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా డైరెక్ట్ టీవీలోనే చూపించేస్తోంది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ 'బ్రహ్మముడి'ని పక్కనపెట్టి, అదే టైమ్ లో రాత్రి 7.30 గంటలకు సరికొత్త సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) అనే సీరియల్‌ని ప్రసారం చేయబోతున్నారు. నవంబర్ 12 నుంచి ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, ఆమనిలు జంటగా ఈ సీరియల్‌లో నటించారు. ఇక బ్రహ్మముడి సీరియల్‌ని రాత్రి 7.30 నుంచి మధ్యాహ్నం 1 గంటకు మార్చేశారు. దీంతో బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రైమ్ టైమ్ లో చూసే ఆడియన్స్ మధ్యాహ్నం చూడరు. అందరికి వీలు అవ్వదు. దాంతో బ్రహ్మముడి టీఆర్పీ భారీగా తగ్గే అవకాశం ఉంది. మరి కొత్త సీరియల్ రేటింగ్ ఎలా ఉంటుందో‌ చూడాలి మరి.

Hariteja Elimination: హరితేజ ఎలిమినేషన్.. కొంపలు కూల్చేసే కన్నింగ్ మెంటాలిటీ!

బిగ్ బాస్ సీజన్-8లోకి హరితేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తుంది అన్నప్పుడు.. ఆమె ఖచ్చితంగా టాప్ 5కి చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ.. సీజన్ 8లో ఆమె అసలు స్వరూపం చూసిన తరువాత.. వామ్మో ఈమె అసలు సీజన్ 1లో ఫినాలే వరకూ ఎలా వచ్చింద్రా బాబూ.. అని తలలు పట్టుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1లో తన బుర్రకథతో ఆకట్టుకుని మార్క్ చూపించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించిన హరితేజ.. సీజన్ 8 లో తేలిపోయింది. బిగ్ బాస్ 1 ద్వారా వచ్చిన పాజిటివిటీని చెడగొట్టేసుకుంది . వామ్మో.. హరితేజలో ఇంత కంత్రీ గేమ్ ఉందా? మరీ ఇంత కొంపలు కూల్చేసే కన్నింగ్ మెంటాలిటీనా? అని ఆడియన్స్ అనుకునేలా  ఆడింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చిన ఈ భామని ఇంటికి పంపేశారు ఓటర్లు. పదోవారంలో హోరాహోరీగా సాగిన ఓటింగ్ పోరులో హరితేజ ఎలిమినేట్ అయ్యింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో చివరికి ఈ హరితేజ ఎలిమినేట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఈవారంలో హరితేజ పర్ఫామెన్స్ చూస్తే మరీ ఘోరం. ఈమెలో ఇంత నెగిటివిటీ ఉందా అనేట్టుగా గేమ్ ఆడింది. ఆమెకి ఏ మాత్రం అనుకూలంగా లేరంటే వాళ్లపై కత్తి కట్టేస్తుంది. వాళ్ల ముందు ఒకలా వాళ్ల వెనుక మరోలా మాట్లాడి నెగిటివిటి మూటకట్టుకుంది హరితేజ. ఎవర్నైతే మినీ గ్రూప్ అన్నదో.. అదే మినీ గ్రూప్‌లో చేరిపోయింది. దాంతో ఓటింగ్ లో అట్టడుగున చేరింది. ఇప్పటికే సోషల్ మీడియాలో హరితేజ ఎలిమినేషన్ అంటూ వార్తలొస్తున్నాయి. శనివారం నాటి ఎపిసోడ్ లో గంగవ్వని ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న హరితేజని ఎలిమినేషన్ చేస్తారా లేదా చూడాలి మరి.