విష్ణుప్రియ గురించి  వెటకారంగా...టేస్టీ తేజ

  బిగ్ బాస్ సీజన్-8 లో టేస్టీ తేజ తను ఎంటర్‌టైనరే కాకుండా గేమ్స్ ఆడగలనని, తన అమ్మ కోసం బిగ్ బాస్ కి వచ్చానంటూ చెప్పడం.. ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మ ఎంట్రీ కోసం హౌస్ తో పాటు ఆడియన్స్ ఎదురుచూడటం గొప్పగా ఉంది‌. ఇక అతను ఎలిమినేషన్ తర్వాత బజ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని షేర్ చేసుకున్నాడు. హౌస్‌లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల ఫొటోలు వేసి వాళ్ల ఆటపై నీ అభిప్రాయమేంటి అంటూ యాంకర్ అడిగాడు. దీనికి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఆన్సర్ ఇచ్చిన తేజ.. విష్ణుప్రియ ఫొటో వచ్చినప్పుడు మాత్రం వెటకారంగా నవ్వాడు. విష్ణుప్రియ గురించి ఏం చెప్పాలి.. పాజిటివా నెగెటివా .. ఏం చెప్పాలో కూడా తెలీడం లేదు.. సూస్తా ఉన్నా నడుస్తా ఉంది బండి.. ఎందుకు నడుస్తుందో అర్థం కావట్లేదు.. ఎలా నడుస్తుందో అర్థం కావట్లేదు.. విష్ణుప్రియ అనే వ్యక్తి తెలీని పర్సనల్‌గా హౌస్‌లోకి వచ్చి ఉంటే నాలుగు లేదా ఐదో వారమూ నీ ముందుండేది.. జనాలకి తెలీడం వల్ల 13వ వారం దాకా ఉందంటూ తేజ అన్నాడు. దీంతో టాప్-5లో ఉంటుందా విష్ణు అంటూ యాంకర్ అడిగాడు. దీనికి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నా టాప్-5 అయితే గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్ అన్నా.. చివరి ప్లేస్ నాకు అయితే రోహిణి గారికి ఇవ్వాలనుంది.. పృథ్వీ టాప్-5లో ఉండడనేది నా గట్ ఫీలింగ్.. అంటూ తేజ బదులిచ్చాడు. మరి పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ ముగ్గురూ వచ్చేస్తారా బయటికి.. అంటూ అర్జున్ అడిగితే ముగ్గురు టాప్-5లో ఉండరనేది నా భావన.. ఆ ముగ్గురిలో మహా ఉంటే ఒక్కరికే ఛాన్స్ ఉంటది.. ఆ ఒక్కళ్లు ఎవరో నేను ఇప్పుడు చెప్పలేనంటూ తేజ అన్నాడు. టేస్టీ తేజ బిబి బజ్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు పృథ్వీ ఇంకా ఎలిమినేషన్ అవ్వలేదు. కానీ అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఊహించాడో తెలియదు. అందుకే హౌస్ లో కాస్త జీనియస్ ఎవరంటే తేజ అంటారు. టాప్-5 లో ఉండేవాళ్ళలో నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్ అని మాత్రం కరెక్ట్ గా ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూ లో‌ గెస్ చేశాడు తేజ. ఇక ఇతను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  

నబీల్ ఇచ్చిన ట్విస్ట్.. ఒక్కరు తప్ప అందరు నామినేషన్లో!

  బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం నామినేషన్ ప్రక్రియ వెరైటీగా సాగింది. బిగ్ బాస్ మొదటగా సెకెంఢ్ ఫైనలిస్ట్ ఎవరో చెప్పమని హౌస్ మేట్స్ కి చెప్పాడు. ఇక అందరు తమ ఫోటోలని కాల్చేసుకున్నారు.  చివరిగా ప్రేరణ-నబీల్ ఫొటోలు మాత్రమే మిగిలాయి. ఇక వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచి ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీ ఎదురుగా రెండు బ్లాంక్ చెక్‌లు ఉన్నాయి. మీలో ఒకరికి మాత్రమే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మీకు కావాలంటే బ్లాంక్ చెక్ మీద రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసివ్వండి.. ఎవరు అయితే ఎక్కువ అమౌంట్ రాస్తారో వాళ్లకి సెంకడ్ ఫైనలిస్ట్‌గా అయ్యే అవకాశం దక్కుతుంది. కానీ మీరు రాసిన అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందంటూ షాకిచ్చాడు బిగ్‌బాస్. దీంతో చాలా సేపు ఆలోచించి ఇద్దరూ వాళ్లకి నచ్చినట్లు అమౌంట్ రాశారు. అయితే అవినాష్, రోహిణి, నిఖిల్ అయితే నబీల్ ఏం రాయడని బెట్ వేసుకున్నారు.  నబీల్-ప్రేరణ ఇద్దరినీ హౌస్‌మేట్స్ ముందు నిల్చోబెట్టి మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీళ్లిద్దరిని ఒప్పించి ఆ చెక్కులను చింపించే అవకాశం మీకు ఇస్తున్నా.. ఎందుకుంటే వాళ్లు రాసిన అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో గౌతమ్, నిఖిల్ సహా అందరూ ప్రేరణ-నబీల్‌లను ఒప్పించే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ మీరు నామినేషన్స్ దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు.. ఇప్పుడు మత్రం ఆ ఫైనలిస్ట్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది.. మీరు స్ట్రాంగ్ ప్లేయర్లు ఓటింగ్ ప్రకారం ఫినాలేలోకి వస్తారని చెప్పడంతో ఇద్దరు ఒప్పుకొని చెక్కులు చింపేశారు. అయితే చింపేసే ముందు ఎవరు ఎంత రాశారో చూపించారు. ప్రేరణ 4 లక్షల 30 వేలు రాయగా, నబీల్ మొత్తం 15 లక్షలు రాసేశాడు. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు. ఇక నిఖిల్ అయితే చెక్ నబీల్ చేతిలో ఉన్నప్పుడు లవ్ యూ నబీల్ అని అన్నాడు. చెక్ గ్రైండర్ మిషన్ లో వేయగానే హేట్ యూ నబీల్ అన్నాడు. దాంతో నబీల్, ప్రేరణ ఇద్దరు కూడా నామినేషన్లోకి వచ్చేశారు. సెకెంఢ్ ఫైనలిస్ట్ ఇంకా ఎవరు అవ్వలేదు. దాంతో ఈ వారం అవినాష్ తప్ప హౌస్ మేట్స్ అంతా నామినేషన్లో ఉన్నారు.  

మూడ్ లేకపోతే మూస్కొని కూర్చో.. నోరు జారి‌న గౌతమ్!

  బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అనగానే నామినేషన్ ప్రక్రియ అనుకుంటారంతా కానీ సెకెండ్ ఫైనలిస్ట్ ఎవరు కావాలో వారిని సేఫ్ చేయండి.. వద్దనుకున్న వారి ఫోటోని కాల్చేయండి అని బిగ్ బాస్ చెప్పడంతో రచ్చ మొదలైంది. ఇక ముందుగా విష్ణుప్రియ ఫొటోని అవినాష్ కాల్చేసి రేసు నుంచి తప్పించాడు. ఆ తర్వాత గౌతమ్ ఫొటోని విష్ణుప్రియ కాల్చేసింది. ఇక్కడి దాకా సాఫీగానే సాగింది. ఇక ఆ తర్వాత నిఖిల్ ని గౌతమ్ సెకెంఢ్ ఫైనలిస్ట్ కి అనర్హుడు అని చెప్పి రీజన్స్ చెప్పాడు. నువ్వు నామినేట్ చేస్తున్నప్పుడు కానీ చాలాసార్లు నాకు వినిపించింది ఏంటంటే ఏం పోట్రే చేద్దామనుకుంటున్నావ్ అంటూ నన్ను అంటావ్.. నేను ఫ్యాక్ట్స్ పెట్టినప్పుడు.. అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి ఫ్యాక్ట్స్ కాదు.. పాయింట్స్.. అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. నా ఉద్దేశంలో కాదు.. ఇక్కడ ఎవరూ ఎవరినీ పోట్రే చేయలేరంటూ గౌతమ్ అన్నాడు. సో ఇక్కడ పోట్రే అన్న పదం వాడినందుకు నాకు ఫినాలేలో ఉండే అర్హత లేదా అంటూ నిఖిల్ కొశ్చన్ చేశాడు. అంటే పోట్రే అన్నది చాలా పెద్ద పదం.. నేను ఏదో నిన్ను బ్యాడ్ వేలో పోట్రే చేస్తున్నానని నువ్వు అన్నావంటూ గౌతమ్ చెప్పాడు. నేను ఆ పదం ఎందుకువాడానంటే ఎవరైనా నిన్ను నామినేట్ చేస్తే ఆ పాయింట్ వదిలేసి అందులోనుంచి ఒక పదం పట్టుకొని ఊరంతా తిరిగి 4-5 గంటలు మాట్లేడేసి 4 సినిమా డైలాగులు కొట్టేసరికి నా నామినేషన్ గట్టిగా చేసుకున్నా అని నువ్వు అనుకుంటున్నావేమో.. కానీ అందులో టైమ్ వేస్ట్ తప్ప ఏం లేదు.. నామినేషన్స్‌లో నేను పోట్రే అన్న పదం వాడినందుకే నేను ఫినాలేలో ఉండకూడదని నువ్వు అనుకుంటే నీ కంటే నాకే అక్కడ ఉండే అర్హత ఎక్కువుందని అర్థం.. అంటూ నిఖిల్ అన్నాడు. నిఖిల్ మాటలకి అవును ఆడపిల్లల్ని గుంజినవ్ తప్పు కాదా.. అంటూ ప్రేరణ టాపిక్ తెచ్చాడు గౌతమ్. దీంతో ప్రేరణకి నాకు ఉన్న ఇష్యూ నువ్వెందుకు తెస్తున్నావ్.. డిఫెన్స్ లాయరా ఆమెకి.. అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. కాదు నా పాయింట్ చెబుతున్నా.. అని గౌతమ్ అంటే నేను చేసింది నీకు ప్రాబ్లమ్ అయిందా నువ్వు చేసింది నాకు అయిందా.. మరి మధ్యలో వీడికేంటి ప్రాబ్లమ్.. అంటూ ప్రేరణతో నిఖిల్ అన్నాడు. నేను ఒకరితో ఉండాలంటే వాళ్లతో ఉంటా నీలాగ ఫ్రెండ్ అని మళ్లీ వాళ్లనే నామినేట్ చేసి నేను సోలోగా ఆడుతున్నానని చూపించుకోను.. ఫ్రెండ్ అయి క్లోజ్ అయి సోలో అని చూపించడానికి నామినేషన్ వేయనంటూ నిఖిల్ అన్నాడు. ఇక్కడ నువ్వు మాత్రం కాదు మేము కూడా సెల్ఫ్‌గానే వచ్చాం.. ఒకరి దగ్గర ఏం చెప్పావ్ ఇంకొకరి దగ్గర ఏం చెప్పావ్ మాకు తెల్సు.. మాకు తెల్సు భయ్.. అంటూ నిఖిల్ అన్నాడు.  చెప్పమంటూ గౌతమ్ అనగా.. నేను చెప్పను నాకు మూడ్ లేదంటూ నిఖిల్ అన్నాడు. మూడ్ లేకపోతే మూస్కొని కూర్చోమంటూ నోరు జారాడు గౌతమ్. నోరు జారకు.. ఏం మాట్లాడుతున్నావ్.. ఏంటి మూసుకొని కూర్చో.. ఇప్పటిదాకా ఎలా మాట్లాడా నేను.. ఏంటిది పెద్ద నోరుజారడం గురించి డిస్‌రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు.. మూస్కొని కూర్చో అంటున్నాడేందంటూ నిఖిల్ హౌస్‌మేట్స్‌తో అన్నాడు. దీనికి అంటే తప్పేంటి అంటూ గౌతమ్ రివర్స్ ఎటాక్ చేశాడు. మూస్కొని కూర్చో అంటే ఏంటంటూ నిఖిల్ అడుగుతుంటే.. గౌతమ్ అది తప్పంటూ అవినాష్, రోహిణి అన్నారు. నేను ఎలా మాట్లాడాను.. సరే అది నీకు డిస్‌రెస్పెక్ట్ ఫీల్ అయితే సారీ.. అంటూ గౌతమ్ చెప్పాడు. నాకేంటి అందరికీ అనిపించింది.. సారీ నాకు అవసరం లేదు పో.. నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడితే వినడానికి రాలేదు ఇక్కడికి.. నీ దగ్గర వినడానికి నేను రాలేదు.. ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటదంటూ నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలిచింది.

సోనియా షాకింగ్ పోస్ట్.. సైలెంట్ గా ఉండేవాడిలో వైల్డ్ ఫైర్ ఎందుకొచ్చిందో!

  ఇదే చివరి నామినేషన్స్ అని రెచ్చిపోయారో.. లేదంటే విన్నర్ నువ్వైనా అవ్వాలి.. లేదంటే నేనైనా అవ్వాలి కాబట్టి.. ఇద్దరిలో నువ్వోనేనో తేలాలనుకున్నారో ఏమో కానీ ఈ చివరి నామినేషన్స్‌లో నిఖిల్, గౌతమ్‌లు రెచ్చిపోయారు. నిన్నటి వరకు సైలెంట్‌గానే కనిపించిన నిఖిల్.. ఒక్కసారిగా గౌతమ్‌పైకి దూసుకుని వెళ్లాడు. ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుందని వైల్డ్ ఫైర్ చూపించారు. బిగ్ బాస్ సీజన్-8 లో సోనియా ఉన్నంతసేపు కథ వేరే ఉండేది. బయటకొచ్చాక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అది వేరే విషయం.. అయితే తను మళ్ళీ హౌస్ లోకి వచ్చి నిఖిల్ ని నామినేట్ చేయడంతో ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది సోనియా. ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్ లో గౌతమ్ మీదకి నిఖిల్ ఫుల్ ఫైర్ అవుతూ అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఇన్నివారాలలో ఒక్క వారం నామినేషన్ లో కూడా నిఖిల్ ఇంత అగ్రెసివ్ అవ్వలేదు‌. అంతలా రెచ్చిపోయిన నిఖిల్ గురించి సోనియా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం.. ఏదైనా సరే బారాబర్ ముఖం మీద చెప్పాలి.. కానీ కొంతమంది ఇండైరెక్ట్‌గా వెనకాల నెగెటివ్ చేస్తారు.. నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడా చెప్పే అలవాటు ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది.. కానీ అదే క్వాలిటీ మగాళ్లలో ఉంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే.. అలాంటి వాళ్లు వాళ్ల మనసులో ఉన్న చెడు కనబడకుండా పైకి ముసుగేసుకొని మోసం చేస్తారు.. అయిన ఎప్పుడూ సైలెంట్‌గా ఉండేవాడితో ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకొచ్చిందో అంటూ పోస్ట్ పెట్టింది సోనియా ఆకుల. నిఖిల్‌లో సడెన్‌గా వైల్డ్ ఫైర్ బయటకు రావడం.. సోనియా సడెన్‌గా ఈ వైల్డ్ ఫైర్ ఎందుకు బయటకు వచ్చిందో అని సందేహిస్తూ పోస్ట్ పెట్టడాన్ని బట్టి చూస్తే అర్ధమయ్యే ఉంటుంది కదా.. ఇది నిఖిల్ కోసమేనని. ఎందుకంటే ఆ పోస్ట్ లో అంత డెప్త్ ఉంది. ఇక ఈ పోస్ట్ లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Eto Vellipoyindhi Manasu: అత్తని బెదిరించిన కోడలు..చివరికి ఏం జరిగిందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -268 లో....‌ సందీప్ కి శంకర్ ఫోన్ చేసి మీ అన్నయ్యని కలిసి నిజం చెప్తానని అనగానే.. సందీప్ భయపడతాడు. ఇక బావగారికి నిజం తెలిస్తే మన పరిస్థితి అంతేనని శ్రీవల్లి కంగారు పడుతుంది. దాంతో శ్రీలత టెన్షన్ తో నందినికి ఫోన్ చేస్తుంది. కానీ నందిని ఫోన్ కట్ చేస్తుంది అయిన మళ్ళీ శ్రీలత చేస్తుంది. దంతో చిరాకుగా ఏంటి శ్రీలత గారు ఫోన్ చేస్తున్నారంటూ కోప్పడుతుంది. ఆ తర్వాత శంకర్ ఆఫీస్ కి శ్రీలత వెళ్లి.. సీతాని కలిస్తే పరిస్థితి ఏంటి.. కలవకుండా ఆపమని చెప్పగానే.. సరే నేను చూసుకుంటానని నందిని అంటుంది. మరొకవైపు శంకర్ ఆఫీస్ కి వస్తాడు. మాణిక్యాన్ని కలుస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి వస్తాడు. అయ్యో శంకర్ ని అపుదాం అంటే సీతా దగ్గరికి వెళ్లిపోయాడే అని నందిని అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ దగ్గరికి శంకర్ రావడం వీడియో కాల్ చేసి శ్రీలతకి చూపిస్తుంది రామలక్ష్మి. నేను ఒక సైగ చేస్తే నిజం చెప్తాడు. కానీ మీరు విడాకుల పత్రాలు నేనే పంపానని మీరు ఒప్పుకొని సీతా గారిని నన్ను ఒకటి చెయ్యాలి.. అప్పుడే శంకర్ నిజం చెప్పకుండా ఆగిపోతాడని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత అమ్మ ఏం చేసిన నా గురించే అన్నావ్ కదా.. ఇప్పుడు ఇది చెయ్ వాళ్ళని కలుపుతానని మాట ఇవ్వు అని సందీప్ అనగానే శ్రీలత సరే అంటుంది. దాంతో శంకర్ నిజం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీతాకాంత్ ని తీసుకొని ఇంటికి వెళ్తుంది రామలక్ష్మి. మీకు సర్ ప్రైజ్ అని సీతాకాంత్ ని ఇంట్లో కి తీసుకొని వస్తుంది. లోపలికి వెళ్లేసరికి అమ్మ ఏంటని సీతాకాంత్ అడగ్గానే.. తాతయ్యకి బాగోలేదని చెప్తుంది. ఇదేనా సర్ ప్రైజ్ ఇక నువ్వు మారవని రామలక్ష్మిపై సీతాకాంత్ చిరాకుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : తన వెనక ఏదో జరుగుతుందని‌ డౌట్ పడిన రామరాజు.. ఆ నిజం తెలుసుకోగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -18 లో.....అందరు భోజనం చేస్తుంటే.. మనం రేపు ఒక దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడాలి నాన్న అని సాగర్ అంటుండగా.. అప్పుడే చందు డ్రింక్ చేసి లోపలికి వస్తాడు. అందరు అతన్ని చూసి షాక్ అవుతారు. సాగర్, ధీరజ్ లు ఏదో ఫుడ్ పోయిషన్ అయి ఉంటుందని కవర్ చేయబోతుంటే.. వాడు తాగి వచ్చాడు అది క్లియర్ గా తెలుస్తుందని రామరాజు కోప్పడతాడు. చందు చెంప చెల్లుమనిపిస్తాడు రామరాజు. అసలు వీడికి ఈ తాగుడు అలవాటు ఎందుకని అంటాడు. అంత అయిపోయిందని.. చందు అంటుంటే..  ఏం లేదు నాన్న జాబ్ లో ప్రమోషన్ గురించి అని ధీరజ్ కవర్ చేస్తాడు. నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుందని రామరాజు అనుకుంటాడు. ఆ తర్వాత తన బామ్మర్దితో రామరాజు డ్రింక్ చేస్తూ అసలు పెద్దోడు ఎందుకు ఇలా చేస్తున్నాడు.. పెళ్లి అయితే వచ్చే భార్య ఏమనుకుంటుంది. వాడు ఏదో బాధపడుతున్నాడు.. ఏం జరిగిందో చెప్పట్లేదని రామరాజు బాధపడతాడు. మరొకవైపు రామరాజు పెద్ద కూతురు కామాక్షి తన భర్త సామానుకి వెళ్తుంటే రైస్ మాత్రం తీసుకొని రాకండి. ఎందుటే మ నాన్న కి రైస్ మిల్ ఉంది కదా ఎక్కువ తెచ్చుకొని, కొన్ని అమ్ముకుందాం అంటుంది. ఆ తర్వాత సాగర్, ధీరజ్ లు కామాక్షి ఇంటికి వస్తారు. సాగర్ ప్రేమ విషయం చెప్పి హెల్ప్ చేయమంటారు. నాన్న గురించి తెలిసే మీరు అంటున్నారా అని కామాక్షి భయపడి.. నాకు ఏ సంబంధం లేదని పంపిస్తుంది. ఆ తర్వాత నర్మద అదే పనిగా మా ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నారా అంటూ కాల్ చేస్తూనే ఉంటుంది. ధీరజ్ లిఫ్ట్ చెయ్యమనడంతో సాగర్ లిఫ్ట్ చేసి వస్తున్నామని అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీపే అసలైన వారసులైన విషయం తెలుసుకున్న జ్యోత్స్న.. ఏం చేయనుంది?

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -217 లో..... పారిజాతం ఇంటికి దాస్ వచ్చి సుమిత్ర దశరథ్ లు ఉన్నారా అని.. అడుగగా వాళ్ళ తో నీకేం పని.. వాళ్లు ఊళ్ళో లేరని శివన్నరాయణ తిట్టి పంపిస్తాడు. ఇతను ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నాడని జ్యోత్స్న తన వెనకాలే వెళ్లి మా మమ్మీ డాడ్ లని ఎందుకు కలవాలనుకుంటున్నావు.. ఆ కుబేర్ ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావంటూ జ్యోత్స్న అడుగుతుంది. నాకు నిజం తెలిసింది అందుకే అని దాస్ అనగానే.. ఏం నిజమని జ్యోత్స్న అడుగుతుంది. మరొక వైపు కార్తీక్ బుక్స్ సర్దుతుంటే చిన్నప్పుడు తన ప్రాణం కాపాడి చైన్ తన దగ్గర పడిసుకుంటుంది దీప. ఆ చైన్ కార్తీక్ చూసి ఎక్కడున్నావ్.. అప్పుడు నా ప్రాణాలు కాపాడావ్ ఇప్పుడు ఎక్కడున్నావ్ ఎప్పటికైనా నిన్ను కలుస్తానని కార్తీక్ చైన్ చూసుకుంటూ అంటాడు. అప్పుడే దీప రావడం చూసి వెనకాల చైన్ దాస్తాడు. మీరు ఎందుకు అత్తయ్య వాళ్ళకి నిజం చెప్పారని దీప అడుగుతుంది. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్పాలని కార్తీక్ అంటాడు. ఏంటి బాబు చేతిలో ఎప్పటికైనా కలుస్తాను అంటున్నారని దీప అడుగగా.. ఏదో ఫ్రెండ్ అని చెప్తాడు. దీప వెళ్ళిపోయాక ఇప్పుడు నీకు చెప్పొచ్చు.. మళ్ళీ జ్యోత్స్న అప్పుడు కాపాడలేదు ఈ అమ్మాయి కాపాడిందని చెప్పాల్సి ఉంటుంది. అదంతా ఇప్పుడు ఎందుకు నా ప్రాణలు కాపాడిన అమ్మాయి ఎదురుపడితే తనే నా ప్రాణం కాపాడిందని అప్పుడు నీకు పరిచయం చేస్తాను. నా రక్తం ఇచ్చి నా ప్రాణం కాపాడవంటూ నిన్ను తనకి చూపిస్తానని కార్తీక్ అనుకుంటాడు.  మరొక వైపు అసలైన వారసురాలు నాకు తెలుసని దాస్ అంటాడు. చెప్పమని జ్యోత్స్న అనగానే.. ఎవరో కాదు కుబేర్ కూతురు దీప... కుబేర్ కి దీప దొరికిన కూతురు మాట ఎంత బలమైందో చూడు.. కాంచన తన కోడలిని తన ఇంటికి కొడలిని చేసుకుంటా అంది.. అలాగే చేసుకుంది చూసావా అని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ విషయం ఎలాగైనా అన్నయ్య, వదినలకి చెప్తానని దాస్ అనగానే.. వద్దు నాన్న అంటూ జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడితుంది. లేదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. నా అంతటా నేను నిజం చెప్పను.. అలా అని దీపకి అన్యాయం చెయ్యనని దాస్ వెళ్ళిపోతాడు. నిజం చెప్పనన్నాడు.‌ అన్యాయం చెయ్యను అనడం ఏంటని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : స్టెల్లా చుట్టూ చేరిన రాహుల్, సుభాష్.. కావ్య ముందు  ఓడినట్టేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -582 లో.... కావ్య పై కోపంతో ఒక స్టార్ హోటల్ చెఫ్ ని ఇంట్లో కుక్ చెయ్యడానికి నెలకు లక్ష రూపాయలిచ్చి తీసుకొని వస్తాడు రాజ్. ఆ చెఫ్ పేరు స్టెల్లా.. తను ఇంటికి రాగానే అందరు తనని చూసి షాక్ అవుతారు. రాహుల్, ప్రకాష్ అయితే తన మీద మీద పడిపోతు పరిచయం చేసుకుంటారు. ఇంట్లో ఎవరికి ఏది కావాలన్న చిటికెలో చేస్తానని స్టెల్లా అంటుంది. ఆ తర్వాత అందరు తమకి నచ్చిన లిస్ట్ చెప్తుంటారు. నాకు ముగ్గురు అసిస్టెంట్స్ కావాలని స్టెల్లా అనగానే అందరు షాక్ అవుతారు. ఇక కావ్య ముందు ఏం అనలేక సరే మేం ముగ్గురం హెల్ప్ చేస్తామని రాజ్ అంటాడు. సరేనంటు రాహుల్, ప్రకాష్ అంటాడు. రాహుల్ ప్రకాష్ రాజ్ లు కూరగాయలు కట్ చేస్తు స్టెల్లా చెప్పినట్టు చేస్తుంటారు. అదంతా కావ్య, సీతారామయ్య ఇందిరాదేవి, సుభాష్ లు చూస్తూ నవ్వుకుంటారు. పెళ్ళాంకి సాయం చెయ్యడం తెలియదు గానీ చెఫ్ కి సాయం చెయ్యడం వచ్చు.. తిక్క బాగా కుదరిందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత స్టెల్లా అక్కడ నిల్చొని.. అది చెయ్యాలి ఇది చెయ్యాలని చెప్తుంది. మొత్తం వంట ముగ్గురే చేస్తుంటారు. ఇక వంట అయిపోయింది. మీరు సర్వ్ చేసుకొని తినండి అంటూ స్టెల్లా చెప్పగానే.. నీకు ఇంత జీతం ఇచ్చి రప్పించింది మేమ్ చేసుకోవడానికా అని రాజ్ అంటాడు. మరి నేను ఆలాగే చేస్తానని స్టెల్లా అంటుంది. కావ్య ముందు ఓడిపోయినట్లు అవుతుందని రాజ్ సైలెంట్ గా ఉంటాడు. ప్రకాష్ రాహుల్ లు స్టెల్లా చుట్టూ చేరి సెల్ఫీ లు తీసుకుంటు ఉంటారు. రాజ్ టేబుల్ పైకి భోజనం సర్వ్ చేస్తాడు. త్వరగా తినండి పది నిమిషల తర్వాత ఫుడ్ పాడవుతుంది. ఎందుకు అంటే నేను వాడిన ఇంగ్రీడియాంట్స్ అలాంటివని స్టెల్లా అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. మరొకవైపు ఇందిరదేవి సీతారామాయ్య ,సుభాష్ లకి కావ్య భోజనం వడ్డీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

prithvi remuneration: బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ రెమ్యునరేషన్ ఎంతంటే!

  బిగ్ బాస్ సీజన్-8 లో‌ కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియ గతవారం నుండే మొదలైంది. పన్నెండు వారాల వరకు వరుసగా తెలుగు కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్.. పన్నెండో వారం యష్మీని ఎలిమినేషన్ చేసి షాకిచ్చాడు. ఇక పదమూడో వారం శనివారం నాటి ఎపిసోడ్ లో టేస్టీ తేజని ఎలిమినేషన్ చేయగా, ఆదివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీని ఎలిమినేట్ అయ్యాడు. కన్నడ బ్యాచ్ కి చెందిన  పృథ్వీ ఎక్కువగా విష్ణుప్రియతో లవ్ ట్రాక్ నడిపాడు. అందుకే ఇప్పటి వరకు హౌస్ లో సర్వైవ్ అయ్యాడని అందరికి తెలుసు. ఇక హౌస్ లో 91 (అంటే 13 వారాలు) రోజులున్న పృథ్వీరాజ్.. రోజుకు రూ. 18,572 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే వారానికి రూ. 1లక్ష 30 వేలు అన్నమాట. ఈ లెక్కన చూస్తే.. 13 వారాలకు గాను పృథ్వీరాజ్ రూ.16 లక్షల 90 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే 13 వారాలకు గాను పృథ్వీరాజ్ శెట్టి రూ.19 లక్షల 50 వేలు తీసుకున్నట్లు కూడా మరో టాక్ వినిపిస్తోంది. ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ, విష్ణుప్రియల లవ్ ట్రాక్ చూసిన ఆడియన్స్.. ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అనుకున్నారు. అయితే హౌస్ లో ప్రతీ ఒక్కరిని చిన్నచూపు చూడటం.. ఎవరికి కనీస మర్యాద ఇవ్వకపోవడం..ఫుల్ అగ్రెసివ్ గా ఆడటం.. రౌడీయిజం చేయడం.. ఇవన్నీ పృథ్వీ యొక్క ప్రత్యేకతలు.. ఇక గత వారం గౌతమ్ జరిగిన గొడవలో పృథ్వీ బొచ్చు విసిరేయడం పెద్ద చర్చనీయాంశమైంది.  

బేబక్కలో ఇన్ని వేరియేషన్సా...వామ్మో

బిగ్‌బాస్‌ 8 తెలుగు సీజన్‌ లో బెజవాడ బేబక్క అలరించింది. ఆమె సోషల్ మీడియాలో తన స్టైల్ మోడ్యులేషన్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది. కరోనా టైంలో ఆమె రీల్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు కంటే వెళ్లొచ్చాక ఇన్స్టాగ్రామ్ లో బేబక్క ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఐతే రీసెంట్ గా ఒక ఫండ్ రైజింగ్ షోలో ఆమె ఎంటర్టైన్ చేసింది. దానికి సంబందించిన ఒక సాంగ్స్ రిహార్సల్స్ చేస్తూ ఒక వీడియొని పోస్ట్ చేసింది. ఇందులో మరో సింగర్ విఖ్యాత్ సాయిరాంతో కలిసి పాటలు పాడింది. ఇక నెటిజన్స్ చూడండి బేబక్కకు మాములుగా కామెంట్స్ పెట్టలేదు. "బేబక్క సాంగ్ ని బ్లాస్ట్ చేసింది. ఎందుకు అంత రఫ్ గ పాడుతున్నారు స్మూత్ గా పాడొచ్చు కదా...బేబక్క నీ దగ్గర ఈ కలలు కూడా ఉన్నాయా...ఎం చేస్తున్నారు మేడం మీరు. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త కొత్త అవతారంతో బయపెట్టిస్తున్నారు.  అక్క నువ్వు సింగర్ ఐపోవచ్చు..బేస్ వాయిస్ మీరు. సూపర్ సింగర్ మీరు" అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. బెజవాడ బేబక్క  సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్ గా , యూట్యూబ్‌ స్టార్‌గానే అందరికి తెలుసు . అంతే కాదు ఆమె ఒక యాక్టర్, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా.  బేబక్క తెలుగులో "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ", "24 కిసెస్‌", "మళ్లీ పెళ్లి" వంటి  20 సినిమాల్లో ఆమె నటించింది.  

హౌస్‌లో  విష్ణుప్రియతో చాలా ఎంజాయ్ చేశా...అన్నీ సూపర్ హిట్

బిగ్ బాస్ సీజన్-8 లో‌ పదమూడో వారం శనివారం నాటి ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ‌విష్ణుప్రియ-పృథ్వీల మధ్య ఎలిమినేషన్ రౌండ్ సాగగా తను(విష్ణుప్రియ) సేఫ్ అయ్యింది. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చాక పృథ్వీకి ఓ టాస్కు ఇచ్చారు నాగార్జున. హౌస్‌లో ముగ్గురు సూపర్ హిట్లు, ముగ్గురు సూపర్ ఫ్లాపులు చెప్పాలంటూ నాగార్జున అడిగారు. దీంతో ముందుగా నిఖిల్ సూపర్ హిట్ సర్.. టాస్కులు.. ఇంట్లో అన్నీ గుడ్ సో సూపర్ హిట్ అంటూ పృథ్వీ చెప్పాడు. తర్వాత నబీల్‌కి సూపర్ హిట్ ఇచ్చాడు. నబీల్ టాస్కులు, నామినేషన్స్ అన్నింట్లో చాలా ఇన్వాల్ మెంట్ ఉంది.. సో నబీల్‌కి కూడా సూపర్ హిట్ అంటూ చెప్పాడు. ఇక చివరి సూపర్ హిట్ విష్ణుప్రియకి ఇచ్చాడు. తను చాలా జోవియల్ అమ్మాయి.. హౌస్‌లో తనతో కలిసి చాలా ఎంజాయ్ చేశా.. తను కూడా సూపర్ హిట్ అంటూ పృథ్వీ చెప్పాడు. ఇక ఇందులో భాగంగా మొదటగా సూపర్ ఫ్లాప్ రోహిణికి ఇచ్చాడు. మీరు ఇంకా నామినేషన్స్‌లోకి రావాలి.. మీరు అక్కడ ఉండాలా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి.. మీరు ఇప్పటివరకూ ఒక్కసారే నామినేషన్స్‌కి వచ్చారు అందుకే మీకు సూపర్ ఫ్లాప్ ఇస్తున్నానంటూ పృథ్వీ చెప్పాడు. తర్వాత అవినాష్ బ్రో.. సేమ్ రీజన్ ఒకసారే నామినేషన్‌కి వెళ్లారు.. ఎలిమినేట్ అయ్యారు.. షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు.. కనుక మీరు జనాల్లోకి వెళ్లి ప్రూ చేసుకోవాలంటూ పృథ్వీ అన్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ అందరూ బాగా ఆడండి.. కానీ నేను నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియకి ఓటేస్తానంటూ పృథ్వీ అన్నాడు. ఇంతమందికి ఎలా వేస్తావయ్యా అంటూ నాగార్జున అడుగగా.. అవును సర్ నాలుగు మొబైల్స్ తీసుకొని ఓట్ చేస్తానంటూ పృథ్వీ చెప్పాడు.

Prithvi Elimination: పృథ్వీ ఎలిమినేషన్ తో విష్ణుప్రియ ఎమోషనల్..

  బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి సండే ఫండే ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో చివరిగా మిగిలి పోయిన పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్‌కి వచ్చేయండంటూ నాగార్జున చెప్పారు. ఇక ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు ఉన్నాయి. వీటిలో ముందుగా నెం 1 అని రాసిన లిక్విడ్ వేయాలంటూ నాగ్ చెప్పారు. అది వెయ్యగానే అక్వేరియంలో వాటర్ ఎల్లో కలర్‌లోకి మారిపోయింది. తర్వాత నెం. 2 లిక్విడ్ వేయాలి.. అది వేశాక ఆ నీళ్లు రెడ్‌లోకి మారితే వాళ్లు ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పగా.. పృథ్వీ వాటర్ రెడ్ కాగా విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా ఉన్నాయి. దీంతో పృథ్వీ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు. విష్ణుకి ఓ హగ్గు ఇచ్చి అక్కడి నుంచి పృథ్వీ బయటికొచ్చాడు. అందరికీ హగ్గు ఇచ్చి బైబై చెప్పాడు పృథ్వీ. అయితే నిఖిల్, నబీల్, ప్రేరణ హగ్గు ఇచ్చినప్పుడు పృథ్వీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక గేటు దగ్గరికి వెళ్లగానే విష్ణు మరోసారి పృథ్వీకి హగ్గు ఇచ్చి ఐయామ్ సారీ అంటూ చెవిలో చెప్పింది. పృథ్వీ వెళ్లిపోయిన తర్వాత ఏడుస్తూ ఐ మిస్ యూ.. యూ ఆర్ ఏ గ్రేట్ మ్యాన్.. పృథ్వీ అంటూ అరిచింది. స్టేజ్ మీదకి వచ్చీ రాగానే ఊహించావా ఎలిమినేషన్ గురించి అంటూ నాగార్జున అడిగారు. దీనికి లేదు సార్ కానీ ఐయామ్ ఫైన్.. నో రిగ్రెట్స్ అంటూ పృథ్వీ అన్నాడు. తర్వాత పృథ్వీ జర్నీ వీడియో ప్లే చేశారు నాగార్జున. ఇందులో పృథ్వీ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి జరిగిన ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అన్నీ కవర్ చేశారు. ముఖ్యంగా విష్ణుప్రియతో నడిచిన లవ్ ట్రాక్‌ని పాటలేసి మరీ గట్టిగానే ఎడిట్ చేశారు. అలానే సోనియా, యష్మీ, నిఖిల్, నబీల్‌లతో పృథ్వీ బాండింగ్‌ని బాగా చూపించారు. జర్నీ వీడియోలో తన తండ్రి ఫొటో ఇదొక్కటే ఉందంటూ చెబుతున్న సీన్ చూసి పృథ్వీ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఫ్యామిలీ వీక్‌లో వాళ్ల అమ్మ గారు లోపలికి వచ్చినప్పుడు జరిగిన ఎమోషనల్ సన్నివేశాలకి పృథ్వీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పృథ్వీ ఏడవడం చూసి నాగ్ కూడా కాస్త అవాక్కయ్యారు. జనరల్‌గా హౌస్‌లో ఇప్పటివరకూ పృథ్వీ ఒకే ఒక్కసారి ఏడ్చాడు. అది కూడా మెగా చీఫ్ అవకాశం కోల్పోయినప్పుడు మాత్రమే. ఇలా పృథ్వీ జర్నీ బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది.  

టేస్టీ తేజ రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయి బయటకొచ్చాడు. ఈ సీజన్ ముగియడానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలేని పొంది అవినాష్ ఫినాలేకి చేరుకున్నాడు. (Tasty Teja) ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ చివరల్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. దాదాపు 8 వారాల పాటు తేజ హౌజ్‌లో ఉన్నాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ ఎలిమినేట్‌ కావడంతో ఆయన ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడన్న చర్చ సాగుతోంది. టేస్టీ తేజ వారానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ సీజన్‌కు గాను తేజకు బిగ్‌బాస్‌ రూ.16 లక్షల పారితోషం తీసుకున్నట్లు సమాచారం. తేజ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇక నేటి ఆదివారం ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేషన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Priyanka jain : తిరుపతిలో జరిగిన ఇష్యూ మీద క్లారిటీ ఇచ్చిన ప్రియాంక జైన్!

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయినా బయట అయినా గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.  ప్రియాంక జైన్, శివ్ కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ‌‌అయితే కొన్ని నెలల క్రితం వీళ్ళు తిరుపతిలో చేసిన వ్లాగ్ వైరల్ అయ్యింది. ఆ వ్లాగ్ లో ఏం ఉందంటే.. ఓం నమో వెంకటేశాయ అని భక్తితో కొలవాల్సిన చోట.. వీళ్ల రీల్స్ పిచ్చి చూపించారు. మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. దీన్ని.. తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్?? అంటూ ఇద్దరూ షాక్ అయిన ఫొటోలతో తంబ్ నెయిల్ పెట్టి.. యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. వీడియో చివర్లో చిరుత లేదు ఏం లేదు అంతా ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని మొత్తం చూపించింది ప్రియాంక జైన్. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఈ ప్రాంక్ వీడియో వ్యవహారం టీటీడీకి కూడా చేరింది. ఇటువంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ సభ్యులు చెప్పారు. ఇక ఇప్పుడు తాజాగా దాని మీద క్లారటీ ఇస్తూ శివ్ తో కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో తిరుపతిలో జరిగిన ఇష్యూ మీద మా క్లారిటీ అంటు వ్లాగ్ చేసింది. శివ్ మాట్లాడుతూ.. తిరుపతి అనేది పవిత్రమైన స్థలం.. నాకేమైనా బాధ అనిపించినా , లో అనిపించినా నేను తిరుపతి దేవస్థానానికి వెళ్తాను. అక్కడ ఫ్రాంక్ లాగా చేసాం.. ఎవరిని బాధపెట్టడానికి ఆ వీడియో చేయలేదు. అందరికి క్షమాపణలు తెలుపుతున్నాం.. అలా చేసి ఉండాల్సింది కాదు.. ఇంకెప్పుడు అలాంటి ఫ్రాంక్ చేయం .. మమ్మల్ని క్షమించండి అంటు శివ్, ప్రియాంక జైన్ ఇద్దరు ఆ వ్లాగ్ లో చెప్పారు.

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలక మలుపు.. తను ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -17 లో.....రామరాజు ముగ్గురు కొడుకులు మంచిగ రెడీ అయి ఫొటోస్ తీసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోస్ ఇచ్చి.. పెళ్లి సంబంధం చూడమని చెప్తాడు రామరాజు. ఆ తర్వాత చందు, సాగర్, ధీరజ్ లు ఇంటికి వస్తారు. ముగ్గురు ఒకే డ్రెస్ లో ఉండడం చూసి ప్రేమ ఎగతాళి చేస్తుంది. దాంతో ప్రేమపై ధీరజ్ గొడవకి దిగుతాడు. మరొకవైపు నర్మద టీ తాగుతుంటే.. తన పేరెంట్స్ కి పెళ్లివారు ఫోన్ చేసి ముహూర్తం ఖాయం చేసామని అనగానే.. నర్మద టెన్షన్ పడుతుంది. వెంటనే ఆ విషయం సాగర్ కి ఫోన్ చేసి కలవాలని చెప్తుంది. ఆ తర్వాత సాగర్ ని నర్మద కలిసి.. రేపు మీ వాళ్ళని తీసుకొని వచ్చి పెళ్లి గురించి మాట్లాడమని నర్మద చెప్పి వెళ్తుంది. దాంతో సాగర్ టెన్షన్ పడుతాడు. మరొకవైపు కళ్యాణ్ ని ప్రేమ కలుస్తుంది. కళ్యాణ్ ఎలాగైనా ప్రేమ దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలనుకుంటాడు. అందుకు ఎగ్జామ్స్ ఫీజు కట్టాలని బాధపడుతుంటే.. నేను ఇస్తానంటూ ఫీజు ఇస్తుంది. ఇక కళ్యాణ్ మాత్రం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బెట్టింగ్ కి సిద్ధం చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత సాగర్ ఆలోచిస్తుంటే.. ధీరజ్ ఏమైందని అడుగుతాడు. దాంతో నర్మద చెప్పింది చెప్పగానే ఆ విషయం నాన్నతో చెప్పమని అంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. నాన్న రేపు ఒకరి ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడలని సాగర్ అనగానే.. ఏంటి అంటూ రామరాజు కోప్పడతాడు. తరువాయి భాగంలో సాగర్, ధీరజ్, నర్మద వాళ్ళింటికి వెళ్తారు. వాళ్ళ నాన్నతో నర్మద, సాగర్ ల ప్రేమ విషయం ధీరజ్ చెప్తాడు. దాంతో నర్మద వాళ్ళ నాన్న రామరాజు దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మాటతీరు మార్చుకోకపోతే స్టేజ్ మీద ఉంటావ్.. నామినేషన్లోకి రండి మేడమ్!

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం వీకెండ్ నాటి శనివారం ఎపిసోడ్ లో భాగంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లోని అందరికి బైబై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన తేజకి హగ్గు ఇచ్చి పలకరించాడు నాగార్జున. ఇక తేజ జర్నీ వీడియో ప్లే చేశారు. యష్మీ కిస్ ఇస్తానన్న సీన్, బస్తాల టాస్కులో తేజ ఇరగదీసిన తీరు, రోహిణి, అవినాష్‌లతో కలిసి చేసిన కామెడీ ఇలా జర్నీ వీడియోను బ్యూటిఫుల్‌గా ఎడిట్ చేశారు. ఇక హౌస్‌లోకి మీ పేరెంట్స్ రారు అన్నప్పుడు తేజ ఎమోషనల్ అయిన వీడియోలు.. తర్వాత వాళ్ల అమ్మ గారు లోపలికి వచ్చినప్పుడు ఎమోషన్స్‌తో జర్నీ వీడియోను పూర్తి చేశారు. అమ్మ వచ్చిన వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు తేజ. ఇక స్టేజ్ మీద కూరగాయల ఫొటోలు పెట్టి ఏది ఎవరికి డెడికేట్ చేస్తావో చెప్పమన్నాడు నాగార్జున. అవినాష్ అన్నా.. ఆటల్లో సూపర్ మాట పరంగా కూడా ఎక్కడా తగ్గకు.. ఇంత టఫ్‌ కాంపిటేషన్‌లో కూడా గెలిచాడు.. చాలా హ్యాపీగా ఉంది.. నాకు కిచెన్‌లో ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేశాడు. సో అన్నకి ఉల్లిగడ్డలు ఇస్తున్నానంటూ తేజ చెప్పాడు. ఇక రోహిణి మేడమ్ గెలిచి మెగా చీఫ్ అయినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను.. ఆవిడ గెలిచినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయ్.. మన టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు ఏడ్చా.. మళ్లీ రోహిణి గారు గెలిచాకే ఏడ్చా.. ఆవిడకి బంగాళదుంప ఇస్తున్నానంటూ తేజ అన్నాడు. కానీ నామినేషన్స్‌కి రాకపోవడమే మీకు మైనస్ మేడమ్.. వచ్చే వారం ప్లీజ్ రండి అంటూ తేజ అన్నాడు. ఆటల్లో కూడా పర్సనాలిటీని చూసుకోండి.. ఎందుకంటే అక్కడ కూడా ఫెయిర్‌గా ఆడటం ముఖ్యమంటూ విష్ణుప్రియకి కాకరకాయ ఇచ్చాడు తేజ. అయితే దీనికి కూడా విష్ణుప్రియ తనకి అనుకూలంగా చెప్పుకుంటూ చేదుగా ఉన్నా కాకరకాయ మంచిదంటూ చెప్పింది. ఆ తర్వాత పృథ్వీలో కూడా ఫన్ యాంగిల్ ఉంది.. కానీ మాకు అగ్రెషన్ ఏంగిల్‌యే ఎక్కువ చూపించాడు. విష్ణుప్రియని మధ్యలో వదిలేసినట్లు గేమ్స్ కూడా వదిలేయకంటూ పృథ్వీకి పచ్చి మిర్చి ఇచ్చాడు. ఆ తర్వాత మా వోడు గౌతమ్‌కి క్యాబేజ్ ఇస్తా సర్.. ఎందుకంటే పొర తీస్తే వస్తానే ఉంటుంది క్యాబేజ్‌కి అలానే గౌతమ్‌లో ఎంత తీసినా కొత్త యాంగిల్ ఉంటుంది.. మనోడు ఖచ్చితంగా టాప్-2లో ఉంటాడని నా గట్ ఫీలింగ్ అంటూ తేజ అన్నాడు. నువ్వు మాటతీరు మార్చుకోలేకపోతే వచ్చే వారం నాగార్జున సర్ పక్కన నువ్వుంటావ్.. సీరియస్‌గా చెబుతున్నానంటూ ప్రేరణకి బెండకాయ ఇచ్చాడు. నువ్వు కన్ఫ్యూజన్‌లో ఉన్నావ్.. వైల్డ్ కార్డ్స్ రాకముందు టాప్-3లో ఉండేవాడివి కానీ ఇప్పుడు టాప్ -5లోనే ఉన్నావ్ .. ఏమైందో చూసుకొని సరిచూసుకోమంటూ నబీల్‌కి టమాటా డెడికేట్ చేశాడు. ఎమోషనల్‌గా వీక్.. చాలా డౌన్ అయ్యావ్.. నువ్వు పుషప్ చేసుకొని ఇంకా ముదుకు రావాలంటూ నిఖిల్ కి సొరకాయ డెడికేట్ చేశాడు తేజ. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోటి డెడికేట్ చేసి అందరికి బై చెప్పి వచ్చేశాడు. 

Karthika Deepam 2 : గతం చెప్పేసిన కార్తీక్.. ఆ నిజాన్ని దాస్ చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -216 లో......దీపలో ఉందేంటి నాలో లేదేంటని  కార్తీక్ తో జ్యోత్స్న అనగానే.. గుణం, మంచితనం అని దీప గురించి గొప్పగా మాట్లాడతాడు. నీకోసం నా ప్రాణం అయిన ఇస్తాను బావ అని జ్యోత్స్న అనగానే.. నువ్వు ఇస్తావా.. చిన్నప్పుడు నేను కొలను లో పడిపోతే నువ్వు వదిలేసి వెళ్ళావ్ కానీ ఒక అమ్మాయి వచ్చి ప్రాణం కాపాడిందని కార్తీక్ చెప్తాడు. ఆ దీపని ఇక అడ్డు తొలిగించే పనిలో ఉంటానని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు అనసూయ కుబేర్ ఫోటో చూస్తూ.. నీకు దీప దొరికిందని దాస్ కి చెప్పాను.. ఎవరికి చెప్పొద్దూ అన్నావు కానీ చెప్పాను తమ్ముడు అని అనసూయ ఏడుస్తుంది. ఈ విషయం దీపకి తెలియొద్దని అనసూయ అనుకుంటుంది. ఏ విషయమంటూ కార్తీక్ అంటాడు. అప్పుడే కాంచన, దీప ఇద్దరు వస్తారు. మీకు అందరికి ఒక విషయం చెప్పాలని కార్తీక్ అంటాడు. దీప వాళ్ళ నాన్న చనిపోయింది నా వాళ్లే అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. అవును నేను లండన్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని వెళ్లినప్పుడు మా కార్ తాకి పడొపోయాడు. దీప దీప అన్నాడని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు.  దీప అసలు నిజం తెలుసుకుంది. ఎలాగైనా దీపకి సాయం చెయ్యాలనుకున్నానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత దీప అమ్మ నాన్న బతికే ఉన్నారని అనసూయ అంటుంది. ఏంటని దీప అనగానే అనసూయ డైవర్ట్ చేస్తుంది. ఎక్కడో ఉండి ఉంటారని ఉదేశ్యలో అన్నానని అనసూయ అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి కోపంగా వెళ్తుంది.. అప్పుడే దాస్ పారిజాతం ఇంటికి వెళ్తాడు. ఎందుకు వచ్చావని శివన్నారయణ కోప్పడతాడు. దశరథ్ అన్న సుమిత్ర వదిన కోసం అని దాస్ అంటాడు. వాళ్లు లేరు అనగానే దాస్ వెళ్లిపోతాడు. వీడు ఎందుకు వచ్చాడని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దమ్మున్న ప్లేయర్, దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 పదమూడో వారం వీకెండ్ లో నాగార్జున వచ్చీ రాగానే అవినాష్ ఈజ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హౌస్ లోని కంటెస్టెంట్స్ కి బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్ ఇచ్చాడు నాగార్జున. మొదటగా నిఖిల్ ని అడుగగా టేస్టీ తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చాడు.  గౌతమ్ ని అడుగగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగ్గా ప్రవర్తించలేదని ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడిన వీడియోని ప్లే చేసి చూపించాడు. పృథ్వీ ఫౌల్  గేమ్ ఆడాడంటూ అందుకే అతనికి బ్లాక్ టికెట్ ఇచ్చింది రోహిణి. నబీల్, విష్ణుప్రియ, తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చాడు అవినాష్. గౌతమ్ కి బ్లాక్ టికెట్ ఇవ్వాలని ప్రేరణ అంది. ఇక తనకి మద్దతుగా నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ చేతులు లేపారు. అప్పటి వరకు అందరికి బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటు పోయిన నాగార్జున.. గౌతమ్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అవినాష్, రోహిణి, నిఖిల్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు.  ఆ తర్వాత హౌస్ లో దమ్మున్న కంటెస్టెంట్? దుమ్ముదుమ్మయిపోయే కంటెస్టెంట్ ఎవరని అడిగాడు నాగార్జున. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని రోహిణి అంది. ఎంటర్‌టైనర్స్ కూడా గెలుస్తారని నిరూపించాడంటు అవినాష్ కి తేజ దుమ్మున్న ప్లేయర్ ఇవ్వగా విష్ణుప్రియ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని చెప్పాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ చెప్పారు. అలాగే తేజ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని చెప్పారు. రోహిణి దమ్మున్న ప్లేయర్, ప్రేరణ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని గౌతమ్ చెప్పాడు. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, పృథ్వీ ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ అతడికి దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని అవినాష్ చెప్పాడు . నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ అని ప్రేరణ, నిఖిల్ చెప్పారు.

Eto Vellipoindi Manasu : మాణిక్యం కొత్త ప్లాన్.. సీతాకాంత్ తెలుసుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -267 లో.....సీతాకాంత్ కావాలని చెయ్ కోసుకొని రామలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటుంది. తన తల్లి చిన్నప్పటి నుండి తనకి ఎంతగా ప్రేమ పంచిందో చెప్తాడు. అంటే మీరు కావాలని ఇలా చేసుకొని నీ తల్లి గురించి నాకు చెప్పాలని ట్రై చేస్తున్నారా అని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు సందీప్ కి శంకర్ ఫోన్ చేస్తాడు. సందీప్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసుకొని సందీప్ బయటకు వస్తాడు. ఇప్పుడు డబ్బులు లేవని సందీప్ రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో శంకర్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏం అంటుండు సందీప్.. నువ్వు ఇప్పుడు ఎంత అన్న కూడా వాడు ఒక్కరూపాయి ఇవ్వలేడు. నేను చెప్పినట్టు చేస్తే నీకు ఇరవై కాదు అరవై లక్షలు వస్తాయని మాణిక్యం అనగానే.. అతను సరే అంటాడు. మరోవైపు శ్రీలత , శ్రీవల్లి లు ఏదో ప్లాన్ చేస్తుంటే రామలక్ష్మి వెళ్లి వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ డల్ గా ఉంటాడు. తన చెయ్యి పట్టుకొని నందిని అడ్వాంటేజ్ తీసుకొవాలనుకుంటుంది కానీ ఆ ఛాన్స్ సీతాకాంత్ ఇవ్వడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి సర్ కి ఫైల్ ఇవ్వు.. సీఈఓ కదా చూస్తాడని నందినితో అంటుంది. రామలక్ష్మి ఏదో సర్దుతుంటే నెక్లెస్ కిందకి పడిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకుంటాడు. కొన్ని కొన్ని పడిపోకుండా పట్టుకోవాలని సీతాకాంత్ అంటాడు. మీ చేత్తో మీరే నెక్లెస్ పెట్టండి అని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ పెడతాడు. ఆ తర్వాత సందీప్ కి శంకర్ ఫోన్ చేసి.. మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్న అంటాడు. దాంతో సందీప్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.