వాట్సాప్ గ్రూప్ లో ఇంతమంది పెళ్లిళ్లు చేసేసుకున్నారా ? 

మింగిల్ కావొద్దు మావా సింగల్ లైఫ్ చాలా బాగుంటుంది...సోలో బతుకే సో బెటరు లాంటి కామెంట్స్ వింటూ ఉంటాం.. సింగల్ లైఫ్ మీద పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. ఐతే మన ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది సింగిల్స్ ఉన్నారు. సోలో లైఫ్ అనుకోండి అంతకంటే హ్యాపీ లైఫ్ అనేది ఇంకోటి ఉండదు అనుకుంటారంతా. ఇండస్ట్రీలో హీరో నవదీప్ కూడా ఎప్పుడూ ఇదే మాట అంటూ ఉంటాడు. ఇలా సింగిల్స్ ఉన్న ఫొటోస్, వీడియోస్ వంటివే ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సింగిల్స్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి  రీసెంట్ గా ఒక పిక్ పోస్ట్ చేసాడు. అందులో ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే సింగల్ కింగులం అనే ఈ వాట్సాప్  గ్రూప్ లో నవదీప్ తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఉన్నారు. ఇక్కడి వరకు ఒకే. కానీ సడెన్ గా ఒక్కొక్కరిగా లెఫ్ట్ ఐపొతూ కనిపించారు. ఎవరెవరంటే కిరణ్ అబ్బవరం, నారా రోహిత్, నాగ చైతన్య, శ్రీ సింహ, డాక్టర్ క్రిష్, అఖిల్, సుబ్బరాజు వీళ్లంతా ఒకేసారి లెఫ్ట్ ఇపోయారు...అంతమంది ఒక్కసారిగా లెఫ్ట్ ఐపోయేసరికి నవదీప్ కి పాపం బాధగా అనిపించి ఉంటుంది. ఏంటి బాబాయిలు అంతా అలా వెళ్లిపోయారు అంటూ ఆ వాట్సాప్ గ్రూప్ లో నవదీప్ రిప్లై ఇచ్చేసరికి సోలో బాయ్ సాయిధరంతేజ్ మాత్రం సోలో బతుకే సో బెటర్ అని రిప్లై ఇచ్చారు. ఇలా అందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు, త్వరలో పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు...వాళ్లంతా మింగిల్ ఇపోయారు కాబట్టి ఇంకెందులే ఈ వాట్సాప్ గ్రూప్ అనుకుని అందరూ లెఫ్ట్ ఇపోయారు.  మరి ఇంకా పెండింగ్ లో ఉన్న ఎలిజిబుల్ బాచిలర్స్ ఎప్పుడు చేసుకుంటారో చూడాలి.  

బిగ్ బాస్ సీజన్-8 గురించి శూభశ్రీ ఏం చెప్పిందంటే!

శుభశ్రీ రాయగురు గురించి టాలీవుడ్‌లో తెలియ‌నివారుండ‌రు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 7 ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఈ షో ద్వారా మంచి పేరు సంపాదించుకోవ‌డ‌మే కాకుండా సినిమాల్లో కూడా రాణిస్తుంది.  పవన్ కళ్యాణ్ గారి అప్ కమింగ్ సినిమా ' ఓజీ ' లో తను ఓ ముఖ్య పాత్రను చేస్తుమ్నట్టు శుభశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శుభశ్రీ ..ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. రీసెంట్‌గా కాకినాడ కాజా అంటూ తన వొంపు సొంపులు, డ్యాన్స్‌తో మాస్‌ను ఊపేసింది శుభశ్రీ.  ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్-8 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. మీ ఫేవరెట్ ఎవరు? విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారంటూ అడుగగా.. రోహిణి ఆట చూసి ఫిధా అయ్యాను.. తనని జీరో అని అన్నవాళ్ళకి గెలిచి చూపించింది. తను ఈ సీజన్ విన్నర్ అయితే బాగుంటుంది. రోహిణి ఆట చూసి చాలామంది ఇన్ స్పైర్ అవుతారు.‌నిజంగా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి. ఆమెకి ఓట్ చేయండి. అలాంటి జెన్యున్ కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చెయ్యండి. రోహిణి లాంటి వాళ్ళు ఇలాంటి షోలోకి రావాలి. అలాంటి వారిని గుర్తించాలని శుభశ్రీ అంది‌. ఇక నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని , గౌతమ్ కూడా బాగానే ఆడుతున్నాడంటు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో ఎంతో నేర్పిస్తుంది. జనాలకు తెలియాలంటే అది ఓ మంచి ప్లాట్ ఫామ్ అని శుభశ్రీ చెప్పుకొచ్చింది.   

Nabeel Elimination: నబీల్ ఎలిమినేషన్.. అట్టడుగున పడిపోయిన అతడి గేమ్!

  బిగ్ బాస్ సీజన్-8  క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక ఈ వారం రోహిణి తప్ప మిగతావరంతా నామినేషన్లో ఉన్నారు. ఇక వీరిలో నిఖిల్ టాప్ ఓటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా సెకెంఢ్ గౌతమ్ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో అవినాష్ ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 8లో టికెట్ టు ఫినాలే రేస్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి రేస్‌లో వరుస విజయాలను నమోదు చేసిన సీజన్-8 శివంగి రోహిణి.. టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్‌గా నిలిచింది. ఇక రెండో పోరుకి రంగం సిద్దం కాగా.. హౌస్‌లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌ మానస్, ప్రియాంక జైన్‌లు హౌస్‌లోకి వచ్చారు. అయితే ఈ రెండో టాస్క్ చాలానే ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇందులో రెండు రౌండ్ లలో అవినాష్ గెలిచి సత్తా చాటాడు. అయితే ఇందులో‌ నబీల్ ఒక్క గేమ్ లో కూడా సరైన ఆటతీరు కనబరచలేదు. దాంతో అతనికి ఓటింగ్ పడటం లేదని తెలుస్తోంది.  నామినేషన్లో ఉన్నవారిలో నబీల్, పృథ్వీ చివరి రెండు స్థానాలలో ఉన్నారు. వారిద్దరిపైన టేస్టీ తేజ ఉన్నాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని బయట టాక్ నడుస్తోంది. ఒకవేళ నిజమే అయితే నబీల్ ఎలిమినేషన్ గ్యారెంటీ. ఎందుకంటే నబీల్ కి సంబంధించిన ఫుటేజ్ రావడం లేదు.. పెద్దగా ఆటతీరు కూడా లేదు.. ఇంకా ఆ కన్నడ బ్యాచ్ కి  సపోర్ట్ గా ప్రతీ టాస్క్ లో‌ నబీల్ ఆడటం వల్ల అతని ఇండివిడ్యువల్ గేమ్ కనపడటం లేదు. దీంతో బిగ్ బాస్ మామ కన్నడ బ్యాచ్ ని వదిలేసి మరో తెలుగు కంటెస్టెంట్ ని బలిచేసేలా ఉన్నాడు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.  

విష్ణుప్రియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ .. వాడి హగ్గుకి అలవాటు పడిపోయా! 

బిగ్ బాస్ సీజన్-8 లో వేస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనగానే టపీమని విష్ణుప్రియ అని చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరంటే పృథ్వీ.. మరి వీళ్ళేం చేశారో వీరికి ఓట్లు వేసే జనాలకే తెలియాలి. బిగ్ బాస్ హౌస్ ని ఎంత ఛంఢాలం చేయాలో అంతా చేస్తున్న వీరిద్దరి గురించి బయటైతే మరీ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మన కళామతల్లి ముద్దుబిడ్డ , నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ తన మాజీ ప్రేమికుడి గురించి ప్రేమికుడు గాని ప్రేమికుడు పృథ్వీతో చెప్పుకొచ్చింది. అదేంటో ఓ సారి చూసేద్దాం.. నాకు లాస్ట్ కలలో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడంటూ విష్ణుప్రియ చెప్పగానే.. ఏంటి ఆ కల? చెప్పలేనంత కలా అని పృథ్వీ అడిగాడు. దీనికి నో ఎలా హర్ట్ అయ్యాడు.. అంటే ఇదంతా చూసి ఎంత బాధపడి ఉంటాడా అని వచ్చిందంటూ విష్ణు చెప్పింది. ఎందుకు అలాంటిది నువ్వేం చేశావంటూ పృథ్వీ అడిగాడు. దీనికి అంటే ఆ బ్రేకప్ నుంచి నేను మూ అయిపోయా కదా.. 1 పర్సెంట్ కూడా ఆలోచించకుండా పృథ్వీ పృథ్వీ అంటూ తిరగుతున్నా కదా.. అంటూ విష్ణు చెప్పింది. ఓకే నువ్వు అలా మూ ఆన్ అవుతున్నావనా.. బ్రేకప్ నువ్వే చేసుకున్నావా.. అంటూ పృథ్వీ అడిగాడు. దీనికి అందరితో నేనే చేసుకున్నానంటూ విష్ణు అనేసరికి ఆ అంటూ అవాక్కయ్యాడు పృథ్వీ. నేనే చేసుకున్నానంటూ మరోసారి విష్ణుప్రియ చెప్పింది. తనకి నువ్వు ఇంకా కావాలా.. అతను నిన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా.. అంటూ పృథ్వీ అడిగాడు. దీనికి పాపం తెలీకుండా రెండు తప్పులు చేశాడు.. నా మంచి కోసం చేశాడు నాకు తెలిస్తే భరించలేనని .. కానీ నాకు తెలిసింది నిజంగా భరించలేకపోయాను.. నా దగ్గర కొన్ని విషయాలు దాచాడు.. ఎందుకంటే అవి నాకు నచ్చవని.. అది ఒకసారి చేశాడు. మళ్లీ రెండోసారి చేశాడు. నా ముఖం మీద చెప్పే గట్స్ అతనికి లేవు.. అలా గట్స్ లేని వ్యక్తితో ఉండాలని నాకు అనిపించలేదు.. జనవరి నుంచి ఇంక వైబ్స్ వచ్చేస్తున్నాయ్ నాకు.. ఇక స్టాప్ చేసేయాలి ఇది అని.. ఇది ఇక వర్కవుట్ అవ్వదని తెలిసి బ్రేకప్ చెప్పేశానంటూ విష్ణు తన బ్రేకప్ స్టోరీ చెప్పసాగింది. నా తల్లి ప్లేస్ తీసుకున్నాడు కాబట్టి అతడ్ని చూడకుండా అయితే నేను ఉండలేకపోతున్నాను.. మా అమ్మ హగ్స్ తర్వాత మళ్లీ అలాంటి ప్రేమ తన హగ్స్ లోనే నాకు తెలిసింది..అతన్ని చూడాలని ఉంది.. అతనే నా బలం.. మా మమ్మీ ప్రేమించినంత ప్యూర్‌గా నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు. మొన్న నువ్వు నన్ను మూస్కో అంటే నాకు ఆయనే గుర్తొచ్చాడు.. అసలు నన్ను ఎలా ట్రీట్ చేసేవాడు.. ఇలా నువ్వు అనడం విన్నా కూడా వాడు చచ్చిపోతాడంటూ పృథ్వీతో విష్ణు చెప్పుకొచ్చింది.  

Ticket to Finale: సెకెంఢ్ కంటెండర్ గా అవినాష్.. షాక్ లో కన్నడ బ్యాచ్!

  బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ ఆటతీరు రోజు రోజుకి పెరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కన్నడ బ్యాచ్ గ్రూపిజానికి చెక్ వేస్తూ మొన్న రోహిణి, నిన్న అవినాష్ గుణపాఠం చెప్పారు. వీళ్లు కమెడియన్స్.. ఏదో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికిరారు. ముఖ్యంగా ఫిజికల్‌ గేమ్‌లలో అస్సలు ఆడలేరు. ఏదో అదృష్టం కలిసి వచ్చి హౌస్‌లో ఉంటున్నారు తప్పితే.. టోటల్‌గా వీళ్లు జీరో.. ఇవీ అవినాష్, రోహిణి, తేజాలను ఉద్దేశించి కన్నడ అండ్ కో బ్యాచ్‌లోని పృథ్వీ అన్నాడు. అయితే జీరో అన్న నోటితోనే హీరో అనిపించుకుని.. పృథ్వీ అహంకారాన్ని తన విజయంతోనే సమాధి చేసింది రోహిణి. బిగ్ బాస్ హౌస్‌కి చివరి మెగా చీఫ్ కావడమే కాకుండా.. వరుసగా రెండు టాస్క్‌లలో గెలిచి టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సెకెంఢ్ కంటెండర్ గా అవినాష్ నిలిచాడు. నబీల్, పృథ్వీ, ప్రేరణ లాంటి గేమర్స్ మీద అవినాష్ గెలిచి కామెడీన్ కాదు గేమర్ అని నిరూపించుకున్నాడు.  మానస్, ప్రియాంక జైన్ హౌస్ లోకి వచ్చి గేమ్ ఆడించాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో ఫస్ట్ డే ఆడిన వారు కాకుండా మిగిలినవారిలో పృథ్వీ, నబీల్, ప్రేరణ, అవినాష్ లతో మొదటి గేమ్ ' సుడోకు నెంబర్' గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ గెలిచాడు. ఆ తర్వాత సెకెండ్ టాస్క్ '   బోర్డ్ క్రికెట్ '. ఇందులో కూడా అవినాష్ గెలిచాడు. మొదట నబీల్ ఆడగా.. నాలుగు సిక్స్ లతో ఇరవై నాలుగు పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రేరణ, పృథ్వీ ముప్పై పరుగులు చేశాడు. ఇక వారి తర్వాత వచ్చిన అవినాష్ నలభై మూడు పరుగులు చేసి విజయం సాధించాడు. అవినాష్ ఈ గెలుపుతో కన్నడ బ్యాచ్ కి షాకిచ్చాడు. వారితో పాటే ఉన్న నబీల్ కి ఇది ఒక గుణపాఠంలా తీసుకొని ఇండివిడ్యువల్ గా ఆడతాడా లేదా చూడాలి. ఎంటర్‌టైనర్ అని అనుకున్న అవినాష్ హౌస్ లో ఉన్న మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ కి తన గెలుపుతో సమాధానమిచ్చాడు.

కావ్యశ్రీని పటాయిస్తున్న సుడిగాలి సుధీర్

  ఫామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర స్టార్స్ అంతా సందడి చేశారు. అమర్ దీప్, తేజస్విని గౌడ, రీతూ చౌదరి, మానస్, భానుశ్రీ, కావ్య, అష్షు రెడ్డి, భోలే షావలి, వర్ష, పాగల్ పవిత్ర వంటి వాళ్లంతా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక షో ఎంట్రీలో ఒక్కో లేడీ స్టార్ గురించి షో హోస్ట్ సుడిగాలి సుధీర్ తెగ బిల్డప్ ఇచ్చాడు. ఇక ఈ షోలో గోరింటాకు సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న కావ్యశ్రీని పటాయించాడు సుడిగాలి సుధీర్. ఇటు రండి అంటూ కావ్యశ్రీని స్పెషల్ గా పక్కకు తీసుకెళ్లి తన చేతిలోని సెల్ ని విసిరిపారేసాడు. దాంతో కావ్యకు ఏమీ అర్ధం కాక "ఏంటండీ లక్షలు లక్షలు పెట్టి ఫోన్ కొని యూజ్ లెస్ అని అలా పడేసారు" అని అడిగింది. "ఎన్ని లక్షలు పెట్టి కొన్నా అందులో మీ నంబర్ లేదు కదండీ" అంటూ కావ్యశ్రీకి పెద్ద క్రీం బిస్కెట్ వేసాడు. దాంతో ఇక కావ్యశ్రీ అలా ఫ్రీజ్ ఐపోయింది. ఐతే నెటిజన్స్ మాత్రం ఏమిటి కావ్యని ఫ్లర్ట్ చేస్తున్నావ్ మరి రష్మీ పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే కావ్య - నిఖిల్ జోడి ఒకప్పుడు సూపర్ హిట్ ..ఎక్కడైనా సరే వీళ్ళ పేరే వినిపించేది. కానీ నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లే ముందే వీళ్ళు విడిపోయారు. ఏమయ్యిందో సరైన రీజన్ మాత్రం ఫాన్స్ కి ఈ ఇద్దరూ చెప్పలేదు. ఒకప్పుడు సీరియల్స్ నటించడమే కావ్యకు తెలిసిన పని. షోస్ కి వచ్చినా కానీ ఎక్కువగా మాట్లాడేది కాదు కానీ నిఖిల్ తో వచ్చాక కొంచెం కొంచెం మాట్లాడ్డం అలవాటు చేసుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి నిఖిల్ వెళ్లేముందే  ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్ళిద్దరూ  అన్‌ఫాలో చేసుకున్నారు.    

Illu illalu pillalu : ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయ్యిందని చెప్పిన చందు.. రామరాజు ఏం చేస్తాడు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -14 లో.....అందరు టిఫిన్ చేస్తుంటే చందు, సాగర్ డల్ గా ఉండడంతో తినండి రా అంటూ రామరాజు భోజనం తినిపిస్తాడు. అలా అందరికి తినిపిస్తూ.. ధీరజ్ తో మాత్రం కోపంగా కలుపుకొని తిను అంటాడు. వాళ్ళ నాన్న తమపై చూపించే ప్రేమకి వాళ్ళ ప్రేమ విషయం చెప్పకుండా ఆగిపోతారు. గుడిదగ్గర జరిగే రిసెప్షన్ కి ఏ బియ్యం కావాలో తెలుసుకొని రండి అంటూ చందు, ధీరజ్ లని రామరాజు పంపిస్తాడు  ఆ తర్వాత ధీరజ్, చందు లు గుడికి వెళ్తారు. అక్కడ లిస్ట్ రాస్తుంటే.. చందు లవర్ సుభద్ర వేరొక అతన్ని పెళ్లి చేసుకొని ఉంటుంది. అది చూసి చందు మనసు ముక్కలవుతుంది. బయటకు వస్తాడు. వెనకాలే దీరజ్ వస్తాడు. తను కూడా సుభద్రని చూసి ఎంత పని చేసావురా నీ భయంతో అమ్మాయిని దూరం చేసుకున్నావని అనగాన్ ధీరజ్ ని చందు హగ్ చేసుకొని ఏడుస్తాడు. మరొకవైపు వేదవతి అతని తమ్ముడు బొమ్మరిల్లు సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతారు. ఇక ముగ్గురు కొడుకులకి ఇలాంటి అమ్మాయిలు వస్తే బాగుంటుందో రామరాజు వాళ్ళతో చెప్తాడు. మరొకవైపు చందు ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ డ్రింక్ చేస్తుంటాడు. ఆ తర్వాత అన్నయ్య ఎక్కడున్నాడు అనుకొని ఒక రెస్టారెంట్ దగ్గరికి ధీరజ్ వచ్చి కూర్చొని ఉంటాడు. వెనకాలే ప్రేమ,  కళ్యాణ్ లు ఉంటారు. కావాలనే ధీరజ్ ని రెచ్చగొట్టేల ప్రేమ మాట్లాడుతుంది. ధీరజ్ కూడా అలా మాట్లాడుతుంటే వచ్చి గొడవ పెట్టుకుంటుంది. ఆ తర్వాత బిల్ కట్టకుండా వెళ్ళిపోయి ధీరజ్ నా లవర్ అని చెప్పి అతనే బిల్ కట్టెలా చేస్తుంది. తరువాయి భాగంలో చందు డ్రింక్ చేసి భద్రవతి కార్ కి ఎదురుపడతాడు. ఆ తర్వాత భద్రావతి వెనకాల కూర్చొని ఉంటుంది. నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిందని చందు చెప్తాడు. అది అంత భద్రావతి వింటుంది‌. ఇక ఇంటికి వచ్చాక ధీరజ్, సాగర్ లు రామరాజు చూడకుండా ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలనుకుంటారు కానీ రామరాజు చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీప కోసం మల్లెపూలు తెచ్చిన కార్తీక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. (karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -213 లో.... కార్తీక్ ని సీఈఓ నుండి తప్పించారని దీప బాధపడుతుంటే.. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు.. వాడికి వున్నా తెలివికి వాడు సొంతంగా బిజినెస్ పెట్టుకొని సీఈఓ అవుతాడు. ఆ సలహా నేను ఇవ్వలేకనా కానీ కలిసి పనిచేసుకోవాలని కాంచన అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. అమ్మా కార్తీక్ ఎక్కడ అని అడగగానే.. శౌర్యాని దీప పక్కకి తీసుకొని వెళ్తుంది. ఏం జరుగుతుందోనని వెనకాల అనసూయ, కాంచన ఇద్దరు వెళ్లి వింటారు. నువ్వు ఎందుకు కార్తీక్ బాబుని పేరు పెట్టి పిలుస్తున్నావని దీప అడుగుతుంది. మరి ఎలా పిలవాలని శౌర్యా అడుగుతుంది. నిన్న మొన్న ఎలా పిలిచావ్.. అలా పిలువు అని దీప అనగానే.. అలా పిలిస్తే నీకు నచ్చదు కదా అని శౌర్య అంటుంది. లేదు నువ్వు అలాగే పిలువు అని దీప చెప్పగానే.. సరేనని శౌర్య అంటుంది. మన ప్లాన్ సక్సెస్ అని కాంచన అనసూయ ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు దశరత్ తో సుమిత్ర మాట్లాడుతుంది. మావయ్య గారు చేసిన పని నాకు నచ్చలేదు. ఏదో మనసులో పెట్టుకొని కార్తీక్ ని తప్పించడం బాగోలేదు.. జ్యోత్సకి ఏం తెలుసని సుమిత్ర అంటుంది. అప్పుడే శివన్నారాయణ‌ వచ్చి.. నేను నా మానవరాలిపై ప్రేమతో ఇదంతా చేసానని అంటాడు. వాడు వచ్చాకే మన కంపెనీకి లాభాలు వచ్చాయని సుమిత్ర అనగానే.. వచ్చాయి, వాటితో పాటు వ్యక్తిగతం జీవితానికి నష్టాలు కూడా వచ్చాయి.. వాడు వాడి తండ్రి చేసిన పనికి అని శివన్నారాయణ‌ కోప్పడతాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వస్తాడు. ఏం నిర్ణయం తీసుకున్నారని దీప అడుగుతుంది. ఇక ఏం చేస్తాం కలిసి పని చెయ్యడమే అని కార్తీక్ అంటాడు. కార్తీక్ మల్లె పువ్వులు తీసుకొని వచ్చి దీపకి ఇస్తాడు. దాంతో దీప ఆశ్చర్యంగా చూస్తుంది. అమ్మ తీసుకొని రమ్మంది పూజ కోసం అంట అయిన నువ్వు పెట్టుకుంటే ఏంటని దీపకి ఇస్తాడు కార్తీక్. మరొకవైపు జ్యోత్స్న రౌడీకి ఫోన్ చేసి దీపని చంపెయ్యమని చెప్తుంది. ఆ తర్వాత శౌర్యా కళ్ళలో నలక పడితే దీప, కార్తీక్ ఇద్దరు కలిసి కళ్ళలో పడిన నలకని తీసేయ్యాడని ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత దీప చీర కొంగు తీసుకొని ఆవిరి పట్టి నలకని తీసేస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ చేతులోని కొంగుని తీసుకుంటుంది దీప. పిల్లల కోసం పెద్దవాళ్ళు ఇలా చిన్న చిన్న ఇబ్బందులు భరించాలి.. దానికి మనం తప్ప ఎవరున్నారని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : విడాకులు పంపిన భార్య.. వారం గడువు అడిగిన భర్త

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -264 లో....రామలక్ష్మి పంపినట్లు విడాకుల నోటిస్ శ్రీలత ప్లాన్ చేసి పంపిస్తుంది. సీతాకాంత్ టిఫిన్ చేస్తుంటే కొరియర్ వస్తుంది. అందులో విడాకుల నోటిస్ చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. రామలక్ష్మి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుందని చెప్తాడు. దాంతో దొరికింది టైమ్ అనుకొని శ్రీలత వాళ్లు రామలక్ష్మిపై చెడుగా చెప్తారు. అక్కకి ఆస్తులతో అవసరం కానీ బావ గారి ప్రేమ అవసరం లేదని శ్రీవల్లి అంటుంది. అసలు అన్నయ్యని వదినా ఇలా మోసం చెయ్యడమేంటని సందీప్ అంటాడు. దాంతో సీతాకాంత్ కోపంగా రామలక్ష్మి దగ్గరికి బయలుదేర్తాడు. వెళ్తూ రామలక్ష్మితో ఉన్నా జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. ఇక ప్లాన్ సక్సెస్ అంటూ శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయం నందినికి చెప్పాలనుకొని నందినికి ఫోన్ చేసి చెప్తుంది శ్రీలత. దాంతో నందిని తన హ్యాపీనెస్ ని హారికతో షేర్ చేసుకుంటుంది. రామలక్ష్మి ఎంప్లాయిస్ తో మాట్లాడుతుంది. అప్పుడే సీతాకాంత్ కోపంగా లోపలికి వచ్చి నీతో మాట్లాడాలంటూ పక్కకి తీసుకొని వెళ్తాడు. నువ్వు చేస్తుందేంటి అంటూ విడాకుల నోటిస్ చూపిస్తాడు. అది చూడగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. నాకేం తెలియదని రామలక్ష్మి చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. సీతాకాంత్ వినిపించుకోడు. నిన్ను మొదట్లో అయిష్టంగా పెళ్లి చేసుకున్నాను కానీ తర్వాత నువ్వు అంటే చాలా ఇష్టం పెరిగింది. నువ్వు నా తల్లిని ఎంత బాధపెట్టినా, ఆస్తులు రాయించుకున్నా నేనేం అనలేదని సీతాకాంత్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. నువ్వు ఒక వారం టైమ్ తీసుకో అప్పుడు కూడా విడాకులు కావాలనిపిస్తే ఇస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా నందిని వింటుంది. రామలక్ష్మి బాధపడుతుంది. శ్రీలతకి నందిని ఫోన్ చేస్తుంది.సీతాకాంత్ రామలక్ష్మి చెంప పగులగొట్టాడా? ఇక నీ రూట్ క్లియర్ అయినట్లేనా అని శ్రీలత అనగానే.. నువ్వు చెప్పింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అని నందిని అంటుంది. సీతా వారం రోజులు టైమ్ అడిగాడు. ఈ లోపు సీతానీ రామలక్ష్మి మారుస్తుందని నందిని అనగానే.. ఆ లోపు మనమే ఏదైనా చేసి వాళ్ళని దూరం చెయ్యాలి.. అది నేను చూసుకుంటానని శ్రీలత అంటుంది. మరొకవైపు రామలక్ష్మి బాధపడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య ఇంటికి రావడంతో రాజ్  ఫైర్.. పెద్దాయన మాటతో సైలెంట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -578 లో.....ధాన్యలక్ష్మి కళ్యాణ్ గురించి పట్టించుకోవడం లేదని.. ప్రకాష్ ని గదిలో నుండి బయటకు పంపిస్తుంది. దాంతో రాజ్ గదిలోకి వెళ్తాడు. ఆల్రెడీ సుభాష్ రాజ్ గదిలో పడుకోవడానికి వస్తాడు. మరొకవైపు అపర్ణకి ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది.. అక్కడ కోడలు చేసిన వంటలు తింటూ హాయిగా ఉన్నావ్.. మా గురించి ఆలోచించావా.. త్వరగా మన ఇంటికి రండీ అని అపర్ణతో ఇందిరాదేవి చెప్తుంది. అక్కడే కావ్య కూడా ఉండి ఇందిరాదేవి మాటలు వింటుంది. మరొకవైపు ఇక ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిసి రాజ్ నిద్రని చెడగొడతారు. దాంతో రాజ్ నేలపై పడుకుంటాడు. అదేంటి వీడిని డిస్టబ్ చేస్తే కావ్యని తీసుకొని వస్తాడనుకుంటే ఇలా చేస్తున్నాడని శుభష్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సీతారామయ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది. లేదు పాలు తాగి వేసుకుంటా కదా ఎవరు పాలు తీసుకొని రాలేదనగానే ఇందిరాదేవి కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి పాలు వేడి చేస్తుంది. మీ మావయ్య గారికేనా అని ఇందిరాదేవి అనగానే.. లేదు నాకే అంటూ తీసుకుంటుంది. ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు ఇందిరాదేవికి ఎదురు మాట్లాడుతుంటే.. అప్పుడే రాజ్ వచ్చి చిన్న పెద్ద తేడా తెలియదా అంటూ కోప్పడతాడు. పనిమనిషి శాంత ఎక్కడ అని రాజ్ అనగానే మీ అత్త టార్చెర్ భరించలేక మానేసిందని స్వప్న అంటుంది. నేను పాలు వేడి చేస్తానని ఇందిరదేవి అంటుంటే.. నేను వేడిచేస్తానని స్వప్న అంటుంది. మరొకవైపు లక్ష్మీకాంత్ ఇచ్చిన చెక్ తీసుకొని వచ్చి అప్పుకి ఇస్తాడు కళ్యాణ్. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇందిరాదేవి కిచెన్ లో వంట చేస్తుండగా.. తనకి స్వప్న హెల్ప్ చేస్తుంది. తరువాయి భాగం లో కావ్య తన ఇంటి నుండి ఇందిరాదేవి, సీతారామయ్య లకి క్యారియర్ తీసుకొని వస్తుంది. ఎందుకు తెచ్చావని రాజ్ అనగానే తనని నువ్వు వద్దని అనుకున్నావ్ మేం కాదని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పాపం రాకేష్ ..సుజాత దెబ్బలకు భయపడిపోతున్నాడు

  సుమ అడ్డా షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి కపుల్స్ వచ్చి ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ అయ్యారు అందరినీ ఎంటర్టైన్  చేశారు. లాస్య - మంజునాథ్, రాకేష్ - సుజాత, జ్యోతక్క - గంగులు జంటలుగా వచ్చారు. ఐతే వీళ్లకు రకరకాల టాస్కులు ఇచ్చింది. ఎలా అంటే పుట్టినరోజులు, పెళ్లిరోజులు, మొదటిసారి కలిసి చూసిన సినిమా ఇలా అన్న మాట. ఐతే జ్యోతక్క అన్నీ తప్పులు చెప్పేసరికి గంగులు దబిడి దిబిడి బాదేశాడు. ఇక లాస్య ఆన్సర్ చెప్పడం లేట్ అయ్యేసరికి మంజునాథ్ లాస్య బుగ్గలు పుణికాడు. ఇక అప్పుడు గంగులు సుమని ఒక ఆఫర్ ఇవ్వాలని అడిగాడు లేడీస్ తప్పులు జెంట్స్ కొట్టుకోమంటారా అని అడిగాడు. దానికి సుమ నవ్వేసింది. ఇవన్నీ చూసాక పాపం రాకేష్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయి తలపట్టుకుని కూర్చున్నాడు. సుమ స్టేజి మీదకు రమ్మని పిలిచినా రాలేదు. "నన్ను ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ చేయకండి నేను రాను " అన్నాడు పాపం... ఐతే సుమ ఊరుకోకుండా " హే రా తొందరగా" అని తొందర పెట్టింది. "సుజాత కొడితే ఎలా ఉంటుందో నాకెరుకే" అంటూ సుజాత ఇంట్లో పాపం  రాకేష్ ని బతకనివ్వడం లేదేమో చితకబాదేస్తుందేమో అన్న రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసరికి అందరూ కాసేపు నవ్వుకున్నారు.

ఎంత మంది చెప్పిన తన వైఖరి మార్చుకోనంటున్న విష్ణుప్రియ!

  బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పుడు ఎంట్రీ ఇచ్చిన పద్నాలగు మంది కంటెస్టెంట్స్ లలో కాస్త కూస్తో విష్ణు ప్రియనే అందరికి సుపరిచితం. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. షోకి ఎంట్రీ ఇచ్చాక తనలోని మరోక కోణం బయటకు వచ్చింది. తన తోటి కంటెస్టెంట్ అయిన పృథ్వీరాజ్ శెట్టితో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. గేమ్ లో ఫోకస్ కంటే తనపై ఫోకస్ ఎక్కువ పెడుతుంది విష్ణుప్రియ. అయితే ఈ విషయన్ని హౌస్ మేట్స్ నామినేట్ చేస్తూ.. నీ గేమ్ నువు అడు, ఎవరికోసమో నువ్వు రాలేదంటూ చెప్పక వచ్చారు. మొన్న జరిగిన ఫ్యామిలీ వీక్ లో విష్ణుప్రియ ఫాదర్ వచ్చాడు. తను కూడా అదే చెప్పాడు. బయట బ్యాడ్ అవుతున్నావమ్మా మార్చుకోమని ఆది అన్నాడు. నాకూ అతనిపై ఫీలింగ్ ఉంది దాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకుంటా.. ఆ ఫీలింగ్ నాది నేను చూపిస్తానంటూ ఎవరు చెప్పినా వినకుండా విష్ణుప్రియ పెడచెవిన పెడుతూ వస్తుంది. అయితే విష్ణు, పృథ్వీతో క్లోజ్ గా ఉండడంతో పలు ట్రోల్స్ కూడా జరిగాయి. అయితే నిన్న హోస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ అలేఖ్య హారిక, అఖిల్ సార్థక్ లు ఎంట్రీ ఇచ్చారు. నీ గేమ్ చేంజ్ చెయ్యాలని విష్ణుప్రియతో అఖిల్ అంటాడు. తను నా ఆలోచన ప్రేక్షకులకి నేను నచ్చాను కాబట్టి ఇంత దూరం తీసుకొని వచ్చారని విష్ణుప్రియ అంటుంది. విష్ణుప్రియపై నీ అభిప్రాయం ఏంటని హారిక పృథ్వీని హారిక అడుగుతుంది. తను నాకు మంచి ఫ్రెండ్ అంతే.. తను చెప్పింది ఈ ఫీలింగ్ ఉందని కానీ నాకు అలా ఏం లేదు. నాకూ నా గోల్ కెరీర్ పై మాత్రమే ఫోకస్ ఉందని క్లారిటీ ఇస్తాడు పృథ్వీ. మరి పృథ్వీ కోసం విష్ణుప్రియ ప్రేక్షకుల దృష్టిలో బకరా కానుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

టికెట్ టూ ఫినాలే కంటెండర్ గా రోహిణి.. బ్లాక్ స్టార్ ఎవరికి వచ్చిందంటే!

  ఈ వారం హౌస్ లో టికెట్ టు ఫినాలే సందడి నడుస్తుంది. అందుకు బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎప్పుడు లేని విధంగా మాజీ కంటెస్టెంట్స్ వచ్చి టికెట్ టు ఫినాలే టాస్క్ లు కండక్ట్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ సార్థక్, హారికలు బిగ్ బాస్ లోకి ఎంట్రీకి ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్ ని ఈ థీమ్ తో ఆడించాలని సెలక్ట్ చేసుకొమ్మని చెప్తాడు. అందులో భాగంగా ఇద్దరు కలిసి స్పీడ్ బ్యాలెన్సింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తమని ఇంప్రెస్ చేసిన వారికి టాస్క్ ఆడే ఛాన్స్ ఇస్తారు. అందులో గౌతమ్ ని రోహిణి సెలక్ట్ చేసుకోగా వాళ్ళిద్దరు మరొక ఇద్దరిని బిగ్ బాస్ సెలక్ట్ చేసుకోమని చెప్తాడు. వాళ్లే విష్ణుప్రియ, తేజలు. ఇక మొదటి టాస్క్ స్పీడ్ లో బిగ్ బాస్ చెప్పిన కరెక్ట్ ఆర్డర్ తో ఒక వంతెన కట్టాలి. అందులో రోహిణి ఫస్ట్ గెలుస్తుంది. సెకండ్ గౌతమ్.. ఆ తర్వాత విష్ణుప్రియ, తేజ ఇద్దరు నిలిచారు. ఇక సెకెండ్ టాస్క్ బ్యాలెన్సింగ్ లో ఒక త్రాస్ లో బాక్స్ లతో రెండు ఈక్వల్ గా చెయ్యాలి. అందులో మొదట టాస్క్ గెలిచినందుకు రోహిణి కి బెన్ఫిట్ గా ఎనిమిది బాక్స్ లు తీసుకుంటుంది. గౌతమ్ ఆరు బాక్స్ లు తీసుకుంటాడు. విష్ణుప్రియకి నాలుగు, తేజకి రెండు బాక్స్ లు వస్తాయి. అఖిల్ హారికలకి ఒక పవర్ ఉంటుంది. దాంతో తేజకి రెండు బాక్స్ లు ఇస్తాడు. ఆ తర్వాత మిగతా బాక్స్ లు బజర్ మ్రోగాక ఎవరైతే ఫాస్ట్ గా తీసుకొని వచ్చి.. బ్యాలెన్సింగ్ చేస్తారో వాళ్ళు విన్ అందులో మొదటగా రోహిణి గెలుస్తుంది. ఆ తర్వాత గౌతమ్ గెలుస్తాడు. ఇక టికెట్ టు ఫినాలే మొదటి కంటెండర్ గా రోహిణి కి బ్యాడ్జ్ ఇవ్వగా.. ఇక టికెట్ టు ఫినాలే రేస్ నుండి ఎవరని తప్పిస్తారో వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇవ్వాలని బిగ్ బాస్ అఖిల్, హారిక లకి చెప్పగా... ఓవరాల్ పర్ఫామెన్స్ చూసి ఇద్దరు కలిసి విష్ణుకి ఇస్తారు. దాంతో విష్ణుప్రియ ఏడుస్తుంది. ఇక తను టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకుంది. 

Illu illalu pillalu : రామరాజుకి‌ సాగర్ తన ప్రేమ విషయం చెప్తాడా? లేదా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -13 లో..... నర్మద తనకి పెళ్లిచూపులు అన్న విషయం సాగర్ కి చెప్తుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు నాన్న కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు  సమాధానం చెప్పాలని నర్మద అంటుంది. కొంచెం టైమ్ కావాలి నర్మద ఇంటికి లేట్ గా వెళ్ళు అని సలహా ఇవ్వగా.. దానికి నర్మద సరే అంటుంది. మరొకవైపు కూరగాయలు అమ్మే అతను రామరాజు, భద్రవతిల ఇంటి ఎదురుగా వస్తాడు. ఒకవైపు వేదవతి, మరొకవైపు భద్రవతి ఉంటారు. వదిన, అమ్మ కూరగాయలు కొంటూ ఉంటారు. అది చూసిన వేదవతి వచ్చి.. మా వదిన కొంటున్న కూరగాయలు అటువైపు ఉన్నాయి.. బండి ఇటు తిప్పాలని తెలియదా అని భద్రవతి అనగానే..అతను బండి తిప్పుతాడు. నేను తీసుకునే కూరగాయలు అటు వైపు ఉన్నాయంటూ వేదవతి అంటుంది. ఇక ఇద్దరు కలిసి అతనితో గొడవపడి కూరగాయలు మొత్తం చెల్లాచెదురు చేస్తారు. మరొకవైపు నర్మద అంత లేట్ గా వచ్చిన సరే పెళ్లి చూపులకి వచ్చిన వాళ్లు ఉంటారు. వాళ్ళని చూసి నర్మద షాక్ అవుతుంది. నర్మదని చూసి అమ్మాయి నచ్చిందని త్వరలోనే ముహూర్తం పెట్టుకుందామని వాళ్ళు చెప్తారు. మరొకవైపు ధీరజ్ తన మామ వెళ్తుంటే.. ప్రేమ తన లవర్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది. అది ధీరజ్ తన మామకి చూపిస్తాడు. అతను వెళ్లగానే కళ్యాణ్ ని ప్రేమ పంపిస్తుంది. నీకు ఇంట్లో ఇలా చేస్తే గొడవలు జరుగుతున్నాయని తెలుసు కదా అయిన వాడు తాగుబోతోడు .. ఇంకొక సారి కన్పిస్తే అన్నయ్యతో చెప్తానని అతను అంటాడు.  ధీరజ్ ని ప్రేమ చూసి బాబాయ్ కి కళ్యాణ్ గురించి తప్పుగా చెప్పింది వీడే నా అనుకుంటుంది. ఆ తర్వాత నర్మద జరిగింది మొత్తం సాగర్ కి చెప్తుంది. దాంతో సాగర్ బాధపడుతుంటాడు. అప్పుడే ధీరజ్ వస్తాడు. నర్మదకి పెళ్లి అంట అని చెప్పగానే.. నీ ప్రేమ విషయం ఇప్పటికైనా నాన్నకి చెప్పమని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటారు. సాగర్ తన ప్రేమ విషయం రామరాజుకి చెప్తాడా లేదా తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కొత్త సీఈఓగా జ్యోత్స్న.. బాధలో దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -212 లో.....శివన్నారాయణ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. తన నిర్ణయం చెప్తాడు. సంస్థ అంటే ఒక రెవెన్యూ కాదూ విలువలు కూడా ముఖ్యం.. అందుకే జ్యోత్స్న గ్రూప్ సంస్థకి జ్యోత్స్న నే న్యూ సీఈఓ గా చేస్తున్నానని శివన్నారాయణ‌ అనగానే జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు తన నిర్ణయానికి సరేనంటారు. కార్తీక్ మాత్రం ఇది నా సీఈఓ గా రాజీనామా పత్రం అని ఇస్తాడు. అలా ఎలా చేస్తారు. నేను దాన్ని ఒప్పుకొని మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కార్తీక్ తో జ్యోత్స్న అంటుంది. ఎవరు లేకున్నా సంస్థ ఆగదంటు శివన్నారాయణ‌ కార్తీక్ ని ఉద్దేశించి మాట్లాడతాడు. మరొకవైపు దీప గది క్లీన్ చేస్తుంటే.. శౌర్యా మందుల చీటి కన్పిస్తుంది. అది తీసుకొని వెళ్లి కాంచనకి ఇచ్చి ఈ టాబ్లెట్ ఎందుకు వాడుతారని అడుగుతుంది. శౌర్య గురించి తెలిస్తే తట్టుకోలేదని బలానికి వాడతారు.. ఏ డాక్టర్ ని అడిగిన ఇదే చెప్తారని అనగానే.. ఏ డాక్టర్ ఎందుకు మీరు చెప్పారు కదా నేను నమ్ముతున్నానని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్, జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకు బావ రిజైన్ చేసావ్.. నేను సీఈఓ అవడం ఇష్టం లేదా అని జ్యోత్స్న అడుగుతుంది. అదేం లేదని కార్తీక్ అనగానే జ్యోత్స్న రాజీనామా పత్రాన్ని చింపిస్తుంది.మనం ఒక్కటిగా పని చెయ్యాలని జ్యోత్స్న అనగానే.. దీప అన్న మాటలు గుర్తు వచ్చి సరే అంటాడు. ఈ న్యూ సీఈఓకి కంగ్రాట్స్ చెప్పవా అని జ్యోత్స్న అనగానే కార్తీక్ కంగ్రాట్స్ చెప్తాడు. మరొకవైపు పారిజాతం స్వీట్ బాక్స్ తో దాస్ ఇంటికి వెళ్తుంది. మీ అన్న పోస్ట్ ఉడింది. సీఈఓ పోస్ట్ నుండి తీసేసారని పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతూ స్వప్నకి చెప్తుంది. ఏం జరిగిందని వాళ్లు అడుగగా.. జ్యోత్స్నని సీఈఓ చేశారని కార్తీక్ ని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంటే.. స్వప్న, కాశీలకి కోపం వస్తుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వస్తాడు. మీటింగ్ లో జరిగింది చెప్తాడు. కార్తీక్ బాబు నన్ను పెళ్లి చేసుకోవడం వళ్లే ఇదంతా అని దీప ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భార్య పంపిన విడాకుల పత్రాలు చూసి భర్త షాక్.. అత్త ప్లాన్ సక్సెస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -263 లో.....శ్రీలత, శ్రీవల్లిలు సీతాకాంత్ రావడం గమనించి.. తమ నటనని మొదలు పెడతారు. శ్రీవల్లి ఏడుస్తుంటే.. సీతాకాంత్ ఏమైందని అడుగుతాడు. ఎలా ఉండే అత్తయ్య ఎలా అయ్యారు చూడండి బావగారు అంటూ శ్రీలత నేలపైన పడుకున్న శ్రీలతని చూపిస్తుంది.  శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వెళ్ళగానే.. ఎప్పుడు వచ్చావ్ సీతా అంటూ నటిస్తుంది. రామలక్ష్మి అక్క వళ్లే అత్తయ్యకి ఈ పరిస్థితి అని శ్రీవల్లి అంటుంది. దాంతో కోపంగా సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్లి.. నీకు ఈ భోగభాగ్యాలు సరిపోతాయా.. మా అమ్మని మహారాణిలా చూసుకోవాలనుకున్నాను కానీ ఇలా చేస్తావనుకోలేదు.. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ సీతాకాంత్ అనగానే రామలక్ష్మి బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంటే.. శ్రీవల్లి పిలిచి ఇంత కష్టపడి టిఫిన్ చేశాను.. తిని వెళ్ళు అనగానే.. నువ్వు తిను.. నందిని గారు ఫోన్ చేశారు వెళ్తున్నానని రామలక్ష్మి వెళ్తుంది. అదేంటి తను ఉండట్లేదు.. మనం తను పంపినట్లు విడాకుల నోటిస్ బావకి పంపిస్తున్నాం కదా.. తను లేకపోతే ఎలా అని శ్రీవల్లి అనగానే.. మరీ మంచిది ఉంటే నేను పంపలేదంటూ ఆర్గుమెంట్స్ చేస్తుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్లి సీతాకాంత్ చైర్ దగ్గరికి వెళ్లి తన ప్రేమని చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే నందిని వచ్చి.. మన కంపెనీ షేర్ వాల్యూ పడిపోతుంది. అందుకే కాల్ చేశానని నందిని అనగానే.. ఆ విషయం సీతా సర్ కి చెప్పాలి కదా అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు నువ్వే కదా బాస్ వి అని నందిని అంటుంది. మరొకవైపు సీతాకాంత్ టిఫిన్ చేస్తుంటే.. అప్పుడే కొరియర్ వస్తుంది. అందులో రామలక్ష్మి విడాకుల నోటీసులు పంపినట్లు ఉండడంతో సీతాకాంత్ షాక్ అవుతాడు. శ్రీవల్లి వాళ్లు రామలక్ష్మి గురించి నెగెటివ్ గా చెప్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కొడుకు కోసం భర్తని బెడ్ రూమ్ నుండి పంపించేసిన భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -577 లో.....అపర్ణ ఇంటికి రానని చెప్పడంతో రాజ్ కోపంగా ఇంటికి వెళ్తాడు. అక్కడ ఎందుకు తీసుకొని రాలేదని వాళ్లు అడగడంతో.. రానని అంటుంది.. దానికి నేనేం చెయ్యాలి.. వెళ్లామన్నారు.. వెళ్ళాను ఇక నన్ను విసిగించకండి అని రాజ్ కోపంగా పైకి వెళ్తాడు. ఆ తర్వాత అపర్ణకి సుభాష్ ఫోన్ చేసి.. నువ్వు ఏదో అనుకుంటే ఏదో అవుతుందని అంటాడు. నేను అనుకున్నది జరుగుతుంది వాడు మళ్ళీ వస్తాడని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఇదంతా ఎందుకని కావ్య చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందరు చెప్పేవాళ్లే అంటు అపర్ణ కోప్పడుతుంది.. మరొకవైపు రుద్రాణి టైమ్ దొరికితే చాలు ధాన్యలక్ష్మిని రెచ్చ గొట్టడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లు సరదాగా బయటకి వెళ్తారు. పానీపూరి తింటుంటే అప్పుడే అనామిక చూసి పాపం మీకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది. నువ్వేం చెయ్యలేవు.. మీ అన్నని ఆస్తులు రాసి ఇవ్వమనంటూ కళ్యాణ్ ని చీప్ గా మాట్లాడుతుంటే అప్పు తనపై కోప్పడుతుంది. అనామిక వెళ్ళిపోయాక ఇలాంటి వాళ్ళకి మన గెలుపు సమాధానం కావాలని అప్పుతో కళ్యాణ్ అంటాడు. మరొకవైపు పనిమనిషికి రుద్రాణి అన్ని పనులు చెప్పి.. పనిమానెలా చేస్తుంది. ఇక రాజ్ బ్రతిమిలాడి తన తల్లిని ఇంటికి తీసుకొని వస్తాడని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ గదిలోకి సుభాష్ పడుకోవడానికి వస్తాడు. నా భార్య లేని గదిలో పడుకోను.. అందుకే వచ్చానని సుభాష్ అంటాడు. మరొకవైపు వెళ్లిపోయిన కావ్యని తీసుకొని రావడానికి ట్రై చేసున్నారు కానీ కళ్యాణ్ గురించి ఎవరు అలోచించడం లేదని ప్రకాష్ ని గదిలో నుండి పంపిస్తుంది ధాన్యలక్ష్మి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం.. ఎప్పుడంటే!

  బిగ్ బాస్ సీజన్- 8 ఇప్పటికే పన్నెండు వారాలు ముగిశాయి. ఇక ‌పదమూడో వారం కంటెస్టెంట్స్ తమ నామినేషన్లతో హీటెక్కించేశారు. చూస్తుండగానే ఫినాలే వీక్ రానే వచ్చింది. ఫినాలే కి మూడు వారాలే ఉన్నాయి.  ఈ సారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ గ్రాంఢ్ ఫినాలే డిసెంబరు15 న జరగబోతుందని దానికి సర్వం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే టాప్-5 కంటెస్టెంట్స్ తో అలరించబోతున్నారంట. స్పెషల్ పర్ఫామెన్స్ తో టాలీవుడ్ తారలు కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హౌస్ లో ఇప్పుడు తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరనేది ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. విన్నర్ రేస్ లో నిఖిల్, గౌతమ్, నబీల్ ల పేర్లు వినిపిస్తున్నాయి‌. ఫ్యామిలీ వీక్ తర్వాత కంటెస్టెంట్స్ అంచనాలకి అందని విధంగా తమ ఆటతీరుతో మెప్పిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా టాప్-5 ఫ్యామిలీ మెంబర్స్ ఫినాలే లో సందడి చెయ్యనున్నారు. విన్నర్ కి స్పెషల్ గెస్ట్ చేతుల మీదుగా ట్రోపీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారంట. అయితే గత సీజన్ లలో ఎక్కువ సీజన్ లకి మెగాస్టార్ చీరంజీవి వచ్చాడు. అయితే ఈ సీజన్ కి ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తారనేది అందరిలోను ఆసక్తి ఉంది.   

Ticket to Finale : టికెట్ టు ఫినాలే రేస్ లో గెలిచిన రోహిణి.. అడుగు దూరంలో మరో రికార్డు!

  బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఫైనల్ కి ఇంకో మూడు వారాలే మిగిలి ఉండటంతో కంటెస్టెంట్స్ ఆటతీరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఇక నిన్నటిదాకా నామినేషన్లు.. నేటి నుండి టికెట్ టు ఫినాలే రేస్.. ఇక ఈ వారం బిగ్ బాస్ ఆడియన్స్ కి పండగే. ఇక పన్నెండో వారం నామినేషన్లని భిన్నంగా చేసిన బిగ్ బాస్.. పదమూడో వారం జరుగుతున్న టికెట్ టు ఫినాలేని పాత కంటెస్టెంట్స్ తో జరిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. ఇందులో ఏం ఉందంటే.. బిగ్ బాస్ సీజన్-4 కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్, దేత్తడి హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే.. టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్‌ని ఈ సీజన్ 4 ఫైనలిస్ట్‌లు తేల్చబోతున్నారు. వీరితో పాటు.. మానస్, ప్రియాంక ఇలా చాలామంది హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక ప్రోమోలో అఖిల్ సార్థక్, దేత్తడి హారిక కలిసి ఓ టాస్క్ ఆడించారు. రోహిణిని చూసి.. నువ్వు నిజంగానే శివంగి అంటూ ఆమె ఆటపై పొగడ్తలు కురిపించాడు అఖిల్. ఇక పృథ్వీని చూసి.. ‘ఏంటి బ్రో.. నీ ఫొటో నా ఫొటో వేసి.. ట్రోల్ చేస్తున్నారు జనాలు’ అని అన్నాడు. ఆ తరువాత టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయ్యింది.  గౌతమ్, తేజా, రోహిణి, విష్ణు ప్రియ ఈ టాస్క్ లో పాల్గొనగా.. రోహిణి విజృంభించి ఆడింది. దాంతో టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది. నువ్వు ఆడలేవు.. గెలవలేవని హేళన చేసిన వాళ్లకి మరోసారి తన గెలుపుతో సమాధానమిచ్చింది రోహిణి. ఇప్పటి వరకు జరిగిన అన్నీ సీజన్లలో ఓ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నామినేషన్లోకి రాకుండా టికెట్ టు ఫినాలేకి రావడం ఇదే తొలిసారి. ఆ ఫీట్ కి మరో అడుగుదూరంలో నిలిచింది రోహిణి.