Tasty Teja elimination: టేస్టీ తేజ ఎలిమినేషన్.. బుగ్గ మీద కిస్ ఇచ్చిన రోహిణి!

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో హౌస్ లో ఎవరి పర్ఫామెన్స్ ఏంటో చెప్తూ దమ్ము, దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ ఎవరంటూ అడిగాడు నాగార్జున.  హౌస్ లో బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్ ఇవ్వమని చెప్పగా .. నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. టేస్టీ తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చారు. అవినాష్ ఇప్పటికే ఫైనలిస్ట్ కావడంతో నామినేషన్స్‌లో ఉన్నా ఏం సంబంధం లేదని ముందే నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్నవాళ్లంతా నిల్చోండి అంటూ నాగార్జున చెప్పగానే అవినాష్-రోహిణి తప్ప మిగిలిన వాళ్లంతా నిల్చున్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారని చెప్పేందుకు స్టేజ్ మీద ఉన్న ప్రింటర్ బటన్ క్లిక్ చేశారు నాగార్జున. అందులో నుంచి టేస్టీ తేజ ఫొటో వచ్చింది. దీంతో తేజ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున అనౌన్స్ చేశాడు. తేజ ఎలిమినేట్ అవ్వగానే కాస్త ఫీల్ అయ్యాడు. కానీ వెంటనే సార్ ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అంటూ నాగార్జునకి చెప్పి హౌస్‌మేట్స్ అందరికీ బైబై చెప్పాడు. నేను సీజన్ 7లో ఫ్యామిలీ వీక్‌లో మా అమ్మని తీసుకురాలేకపోయా.. కానీ ఈ సీజన్‌లో అది నెరవేర్చా అందుకు చాలా హ్యాపీగా ఉంది.. ఆ తర్వాత మరో రెండు వారాలు ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఆస్వాదించాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. చాలా హ్యాపీగా హౌస్ నుంచి వెళ్తున్నా అంటూ తేజ అన్నాడు.  ఇక తేజ ఎలిమినేట్ కావడంతో అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోహిణి కూడా బాధపడంది. మిగిలిన వాళ్లందరికీ కూడా హగ్గు ఇచ్చి తేజ గార్డెన్ ఏరియాకి వచ్చేశాడు. ఇక గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత టేస్టీ తేజకి రోహిణి బుగ్గ మీద ఓ ముద్దు పెట్టింది. కిస్ ఇచ్చినప్పుడు తేజ తెగ మురిసిపోయాడు. అలానే అవినాష్ కూడా ఓ కిస్ ఇచ్చి బైబై చెప్పేశాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు కూడా తేజకి గుడ్ బై చెప్పారు. ఇక వెళ్లేమందు అందరూ బాగా ఆడాలని.. అందరినీ ఫినాలేకి వచ్చి చూస్తానంటూ తేజ చెప్పుకొచ్చాడు. మరోసారి సీజన్-8కి అవకాశమిచ్చి ఇంతవరకూ తీసుకొచ్చిన ఆడియన్స్‌కి కూడా థ్యాంక్స్ చెప్పాడు.

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు.. మామకి విడాకుల నోటీసు పంపించిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -581 లో.....కావ్య భోజనం తీసుకొని రావడంతో కావ్యకి టిప్పు ఇస్తుంటాడు రాజ్. నేనేం పరాయి వాళ్లకి భోజనం వండుకొచ్చానా.. నా వాళ్ళకే కదా అని కావ్య తనపై కోప్పడుతుంది. ఇక నుండి మా వాళ్ళకి భోజనం తీసుకొని రావాల్సిన అవసరం ఇక నీకు లేదు. నేనే ఒక చెఫ్ మాట్లాడాను. రేపటి నుండి వస్తుంది తనకి నెలకు లక్ష రూపాయలని రాజ్ చెప్తాడు. రాజ్ ఆ షెఫ్ గురించి గొప్పగా చెప్తుంటే.. అది ఎవతో రానివ్వు దాని వయ్యారం ఏంటో తేలుస్తానని ఇందిరాదేవి అంటుంది.  మరొకవైపు కళ్యాణ్ , అప్పు లు భోజనం చేస్తుంటారు. అప్పు వంక కళ్యాణ్ ప్రేమగా చూస్తుంటే.. ఎందుకు అలా చూస్తున్నావంటూ అడుగుతుంది. అన్నీ వదులుకొని నా కోసం వచ్చావ్.. నా కష్టసుఖాలలో తోడుంటున్నావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ రుద్రాణిలు మాట్లాడుకుంటారు. ఆ కావ్యని ఎన్ని రకాలుగా ఆపాలని చుసినా వస్తూనే ఉందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి సీతారామయ్యలు భోజనం చేస్తుంటే.. రాజ్ నీక్కూడా కావ్య భోజనం తీసుకొని వచ్చింది. వచ్చి భోజనం చెయ్ అంటాడు. అవసరం లేదని రాజ్ అంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే రాజ్ వచ్చి భోజనం పెట్టుకుంటాడు. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వస్తారు. వాళ్ళని చూసి తినడం మానేస్తాడు రాజ్. ఆ తర్వాత కావ్య ఇంటికి వస్తుంది. వాళ్లేం మాట్లాడుకుంటన్నారని రాజ్ వింటుంటాడు. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే రాజ్ ఏర్పాట్లు చేసిన షెఫ్ వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో అమ్మ నీకు విడాకుల నోటిస్ పంపిందని సుభాష్ కి రాజ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఇదంతా నీ వళ్లేనే అని కావ్యపై రాజ్ కోప్పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దెయ్యాలను చూడడానికి చంద్రగిరి కోటకు వెళ్లిన గీతూ

గీతూ మోటివేషనల్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక ఇంకా ఫేమస్ అయ్యింది. అలాంటి గీతూ దెయ్యాలు సంబంధించి ఒక విషయం చెప్పింది. చిట్ చాట్ విత్ బిగ్ బాస్ టీం 2 పేరుతో వచ్చిన ఒక చాటింగ్ లో ఈ దెయ్యాల విషయాలను షేర్ చేసుకుంది. " నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చంద్రగిరి కోటకు స్కూల్ లో ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లారు. అప్పుడు నాకు దెయ్యాలని చూడాలనిపించింది. కోటలో దెయ్యాలు ఉంటాయని అప్పట్లో ఎవరో చెప్పారు అందుకే చూద్దామనిపించింది. అందుకే 4 గంటల తర్వాత దెయ్యాలుంటాయంట చూసి వెళదాం ఎవరికీ చెప్పొద్దూ మనం అని అక్కడ ఎవరికీ కనిపించకుండా ఒక చోట దాక్కుని ఉన్నాం నేను నా ఫ్రెండ్. ఆరోజు రాత్రి 7 గంటల వరకు అక్కడే దెయ్యాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ టైంకి కోట మొత్తం ఒక్కసారిగా చీకటైపోయింది. చుట్టూ అక్కడ ఎవరూ కూడా లేరు. మాకేమో టెన్షన్ వచ్చేసింది. భయమేసేసింది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. నిజంగానే దెయ్యాలు వచ్చేస్తాయేమొ అని భయపడ్డాం. ఫుల్ గా చెమట్లు పట్టేసాయి. ఈలోపు స్కూల్ వాళ్ళు గీతూ గీతూ అని అరుస్తూ పిలిచారు. ఎలాగో భయంతోనే మా వాళ్ళను వెతుక్కుంటూ నేను నా ఫ్రెండ్ బయటకు వచ్చాము.. అప్పుడు అక్కడున్న వాచ్ మ్యాన్ ని అడిగితే అదిగో మీ వాళ్ళు అక్కడ ఉన్నారు అంటూ పంపించారు. ఆ దెయ్యాల దెబ్బతో నాకు వారం రోజులు జ్వరం వచ్చేసింది. ఏదో దెయ్యాలను చూద్దామని ట్రై చేయబోయి జ్వరం తెచ్చుకున్నా. అప్పటి నుంచి దెయ్యాల జోలికి పోవడం లేదు. అప్పటి నుంచి దెయ్యాలంటే చాలా భయం నాకు" అని చెప్పింది గీతూ.  

Tasty Teja Elimination: టేస్టీ తేజ ఎలిమినేషన్.. కన్నడ బ్యాచ్ కి బయాజ్డ్ బిగ్ బాస్!

  బిగ్ బాస్ సీజన్-8 పదమూడో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఈ సీజన్ లో ప్రతీ వారం తెలుగు కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేషన్ అవుతూ వచ్చారు. కానీ ఫస్ట్ టైమ్ గతవారం యష్మీ ఎలిమినేట్ అయ్యింది. మరి ఈ వారం లీస్ట్ లో‌ ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడా లేదా అనేది క్యూరియాసిటిగా మారింది. కన్నడ బ్యాచ్ కి బిగ్ బాస్ బయాజ్ గా ఉంటూ వారిని ప్రతీవారం సేవ్ చేస్తూ వస్తున్నాడు. మరి ఈ వారం కూడా వారిని హౌస్ లో ఉంచి టేస్టి తేజని ఎలిమినేట్ చేస్తాడా లేదా అంటు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కమెడీయన్లు చీప్ గా చూసే పృథ్వీ లాంటి వారికి విష్ణుప్రియ సపోర్ట్ గా ఉండటం.. నిఖిల్ బ్యాక్ బిచ్చింగ్ కి మిగిలిన వాళ్ళు తోడవడంతో జెన్యున్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. అవినాష్ ప్రతీ వారం అటు టాస్క్ లలో ఇటు ఎంటర్‌టైన్మెంట్ లో వందకి వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. ‌కానీ బయట జనాలేమో గేమ్ చూడకుండా ఓట్లు వేస్తున్నారు. ‌ముఖ్యంగా విష్ణుప్రియ లాంటి వరెస్ట్ కంటెస్టెంట్ ని ఇంకా ఎందుకు సేవ్ చేస్తూ వస్తున్నారో అర్థం కావడం లేదు.‌ ఇది బిగ్ బాస్ షోనా లేక బయాజ్డ్ షోనా అంటు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో డస్ట్ బిన్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో విష్ణుప్రియ వల్ల కూడా అంతే యూజ్ అని ఒకరు, హౌస్ లో గ్రూప్ గా ఆడే వారికేమో ఓటింగ్ ఉంది. కానీ ఇండివిడ్యువల్ గా ఆడుతూ జెన్యున్ కంటెస్టెంట్స్ కి సరైన ఓటింగ్ లేదు. అయితే గౌతమ్ ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ కన్నడ బ్యాచ్ గ్రూపిజాన్ని బయటపెట్టాడు. బిగ్‌ బాస్ ఆదేశాల ప్రకారం హోస్ట్ నాగార్జున కూడా కన్నడ బ్యాచ్ గ్రూపిజాన్ని సపోర్ట్ చేశాడు. కానీ అది తప్పు అని ఆడియన్స్ కి తెలుసు. నబీల్ విన్నర్ అవుతాడని అనుకున్నారంతా కానీ అతడి గేమ్ రోజురోజుకి పడిపోయింది. అయిన సరే ఓటింగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే హౌస్ లో గేమ్ ని బట్టి కాకుండా ఫస్ట్ పది వారాల్లో ఆట చూసి ఓటింగ్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం నామినేషన్లో ఉన్నవారిలో అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ డేంజర్ జోన్ లో‌ ఉన్నారు.

Avinash in Finale : ఫినాలేకి చేరిన మొదటి కంటెస్టెంట్ అవినాష్..

  బిగ్ బాస్ సీజన్-8 లో ఫ్యామిలీ వీక్ లో టేస్టీ తేజ వాళ్ళ అమ్మ రావడం కోసం యావత్ బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురుచూశారు. ఇప్పుడు అవినాష్ గెలవాలని అందరు ఎదురుచూశారు. అదేవిధంగా తను నామినేషన్ లో నుండి సేవ్ అవ్వాలని కొన్ని లక్షల మంది కోరుకుంటున్నారు. బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో.. ఆటల్లో , పాటల్లో, కామెడీ చేయడంలో ఎందులోను తగ్గడం లేదు రోహిణి, అవినాష్, టేస్టీ తేజ.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తమ బెస్ట్ ఇస్తూ వస్తున్నారు. ఏ గేమ్ పెట్టినా గెలిచే వస్తున్నారు. తమ వందశాతం ఎఫర్ట్స్ పెడుతూ కసిగా గేమ్ ఆడుతున్నారు. దేనిలో తగ్గడంలేదు. ఎక్కడ రాజీ పడటం లేదు.. ప్రతీ గేమ్ లో కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని మరీ ఆడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా టికెట్ టు ఫినాలేకి  నాల్గవ కంటెస్టెంట్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అదేంటంటే.. ఇప్పటికే సెలెక్ట్ అయిన నిఖిల్, అవినాష్, రోహిణిలని .. గౌతమ్, పృథ్వీ, తేజలలో నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు బిగ్ బాస్. దాంతో ముగ్గరు కలిసి ఏకాభిప్రాయంతో తేజని సెలెక్ట్ చేసుకున్నారు. తేజ, అవినాష్, రోహిణి,  నలుగురు కలిసి టికెట్ టు ఫినాలేలో మొదటి టాస్క్ ఆడారు. గంట పట్టు ఫోటో కనిపెట్టు టాస్క్ లో భాగంగా డిస్ ప్లేలో చూపించిన ఫోటోని చూసి అది హౌస్ లో ఏదో చెప్పాలి. ఇందులో తేజ ఒక్క పాయింటే గెలిచి నాల్లో స్థానంంలో ఉండి. టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక నిఖిల్, రోహిణి, అవినాష్ చివరి గేమ్ ఆడారు. ' బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ ' అనే అక్షరాలని యాక్టివిటి ఏరియాలో ఒక టేబుల్ పై అమర్చి ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో స్టాండ్ మీద ఉన్న ఫైనలిస్ట్ అనే పేరు ఉన్న క్యూబిక్స్ ని బాల్స్ సహాయంతో పడేయాలి. ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి అటు ఇటు ఊగే స్టాండ్ మీద పెట్టి తాడు సహాయంతో బ్యాలెన్స్ చేయాలి. అలా చేసిన వారే టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఇందులో మొదటగా నిఖిల్ యాక్టివిటి ఏరియాలో సరైన క్రమంలో  పెట్టేసి గార్డెన్ ఏరియాకి వచ్చి అక్కడ క్యూబ్స్ ని పడేసి ఫైనల్ స్టాండ్ దగ్గరికి వచ్చాడు. సెకెంఢ్ అవినాష్ వచ్చాడు‌. కానీ ఊగే స్టాండ్ మీద క్యూబ్స్ ని పెట్టి తాడుతో బ్యాలెన్స్ చేయడంలో అవినాష్ గెలుపొందాడు. నిఖిల్ ఓడిపోయాడు. ఇదిదా సరైన గేమ్ అంటే అంటు నిరూపించాడు అవినాష్. హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉంటే అందులో ఆరుగురు నిఖిల్ కి సపోర్ట్ చేయగా ఒక్క తేజ మాత్రమే అవినాష్ కి సపోర్ట్ ఇచ్చాడు. అయినా సరే అవినాష్ బెస్ట్ ఇచ్చాడు.. గెలిచాడు. కెజిఎఫ్ సినిమాలోని రణరణ ధీర అంటూ సాంగ్ వేసేసరికి అవినాష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక శ్రీముఖి చేతుల మీదుగా టికెట్ ను అందుకున్నాడు అవినాష్. ఇక ఆ టికెట్ ని తన భార్య అను ఫోటోకి చూపిస్తూ మురిసిపోయాడు అవినాష్. లవ్ యూ అనూ..‌ఇది నీకే అనూ అంటు తన ఫొటో దగ్గరే పెట్టాడు అవినాష్. ఇది నిజంగా ప్రౌడ్ ఫీలింగ్ అంటూ అవినాష్ ఎమోషనల్ అయ్యాడు.  

Sreemukhi Biggboss8: నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు.. ఇంకా రెండు వారాలే ఉంది

  బిగ్ బాస్ సీజన్-8 లో టికెట్ టు ఫినాలే కోసం జరిగిన అన్ని టాస్క్ లలో టాప్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అవినాష్. ఇక అతను డైరెక్ట్ ఫినాలేకి చేరుకున్నాడు.  నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖి హౌస్ లోకి వచ్చింది. వచ్చీ రాగానే హౌస్ లోని కంటెస్టెంట్స్ చేత టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు ఆడించింది. ఇక హౌస్ లో విష్ణుప్రియ చేసే పత్తాపరం గురించి తనకి అర్థమయ్యేలా శ్రీముఖి ఓ పక్కకి తీసుకొని వెళ్ళి మరీ చెప్పింది. " ఇన్ని వారాలు గడిచిపోయింది. ఇక చాలు ఇంకా రెండు వారాలే ఉంది. ఇక పృథ్వీని విడిచిపెట్టు.. నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు. తన గేమ్ తను ఆడతాడు. అసలు నువ్వంటే ఫ్రెండ్ మాత్రమే అని చెప్పినా,  ఇష్టం లేదని అంత క్లారిటీగా ఉన్నా నువ్వు తనతో ఉండటం మానేయ్.. మిగిలిన హౌస్ మేట్స్ తో టైమ్ స్పెండ్ చెయ్ అని శ్రీముఖి అనగానే..తెలుసు కదా నాకు పృథ్వీ అంటే ఎంత కేరింగో అంటూ అదే సోది చెప్పుకొచ్చింది నత్తి బుర్ర విష్ణుప్రియ. హౌస్ లోకి టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఆడించడానికి వచ్చిన శ్రీముఖికి బిగ్ బాస్ ఓ స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు. అదేంటంటే.. అమ్మా కళామతల్లి ముద్దుబిడ్డ.. ఇక నీ ఆట నువ్వు ఆడు.. ఇన్ని రోజులు నువ్వు చేసిన పత్తాపారం బాగా సాగింది. మనకి ఫుల్ టీఆర్పీ కూడా వచ్చింది. ఇక హౌస్ లో ఎంటర్‌టైనర్స్ గా ఉన్నా అవినాష్, రోహిణి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటూ ఆడుతూ .. మెగా ఛీఫ్ లు అయ్యారు. నువ్వు ఇంకా ఆ పృథ్వీ చుట్టూ తిరగడం మానేయాలని బిగ్ బాస్ మామ చెప్పాడు. ఇదే స్క్రిప్ట్ ని విష్ణుప్రియని పక్కకి తీసుకొచ్చి మరీ చెప్పింది శ్రీముఖి. ఇక హౌస్ లో ఓ వైపు గేమ్స్ ఆడిస్తూ మరోవైపు వీరిద్దరికి జ్ఞానోపదేశం చేస్తోంది శ్రీముఖి. ఇక చాలు ఎవరి గేమ్ వారు ఆడండి. తనంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు నువ్వు క్లియర్ గా ఆమెకి చెప్పాలి కదా అంటూ పృథ్వీ అనగానే.. తనకు నేను చెప్పాను. ఫ్రెండ్ వరకే.. నా కోసం నువ్వు నీ గేమ్ ఆడకుండా ఉండకు అని చెప్పానంటూ పృథ్వీ అన్నాడు. విష్ణుప్రియకి వాళ్ళ నాన్న హౌస్ లోకి వచ్చి మరీ చెప్పాడు. మారలేదు.. యాంకర్ రవి చెప్పాడు మారలేదు. విష్వక్సేన్ వచ్చి చెప్పాడు మారలేదు. మానస్ చెప్పాడు మారలేదు. పునర్నవి చెప్పింది మారలేదు. ఇంకా తను మారదు అని తెలిసినా బిగ్ బాస్ మామ మాత్రం తనని సేవ్ చేస్తూ వస్తున్నాడు. టాప్-2 కి తీసుకొచ్చి విష్ణుప్రియకి సెకెంఢ్ ఇచ్చి నిఖిల్, గౌతమ్, నబీల్ లలో ఎవరికో ఒకరిని విన్నర్ చేసేలా ప్లాన్ చేసినట్టున్నాడు బిగ్ బాస్.  

పృథ్వీ ఎలిమినేషన్ కన్ఫమ్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

  బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీకెండ్ వచ్చేసింది. అదే బిగ్ బాస్ క్లైమాక్స్ కి వచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే ఉంది. ఈ తరుణంలో హౌస్ నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఈ వారం నామినేషన్స్‌లో రోహిణి తప్ప హౌస్ మొత్తం ఉన్నారు. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో టికెట్ టు ఫినాలేని అవినాష్ ని గెలిచాడు. కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు కంటెస్టెంట్స్ మధ్య సాగుతున్న ఈ సీజన్-8  ఎలిమినేషన్స్ లో గతవారం యష్మీ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం మాత్రం తెలుగు కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవుతాడా లేక బిగ్ బాస్ బయాజ్డ్ గా ఉంటూ పృథ్వీని సేవ్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిఖిల్, నబీల్, గౌతమ్ టాప్-3 లో ఉన్నారు. ప్రేరణ నాల్గో స్థానంలో ఉంది. ఇక డేంజర్ జోన్ లో టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ ఉన్నారు. అయితే హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అవినాష్, టేస్టీ తేజ, రోహిణిలు టాస్క్ లలో కూడా దుమ్ములేపుతున్నారు. బిగ్ బాస్ సీజన్-8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేదాకా సప్పగా సాగింది. ఎప్పుడూ అయితే వైల్డ్ కార్డ్ లు వచ్చారో ఎంటర్‌టైన్మెంట్ కి కొదవ లేదు. ముఖ్యంగా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ కామెడీతో తెగ నవ్వించేశారు. కానీ ఇలా రియల్ గా జెన్యున్ గా ఉండే వారికే ఓటింగ్ లేదు. జనాలు కామెడీ చేసే వాళ్ళని విజేతలు చేయ్యరని రోహిణి, తేజ మాట్లాడుకున్నారు. వారిని చూసి ఆడియన్స్ లో కూడా మార్పు వచ్చింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ అదే నిజమైతే పృథ్వీతో పాటు టేస్టీ తేజ ఎలిమినేషన్ అవుతారు. అలా కాకుండా సింగిల్ ఎలిమినేషన్ అయితే లీస్ట్ లో ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడు. విష్ణుప్రియ-పృథ్వీల లవ్ ట్రాక్ నడిపించాలని బిగ్ బాస్ చూస్తే పృథ్వీని సేవ్ చేసి తేజని ఎలిమినేషన్ చేస్తారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలక మలుపు.. అతని మీద కోప్పడ్డ రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -16 లో....భద్రవతి బాంబులు పేల్చుతూ హ్యాపీగా ఉంటుంది. అప్పుడే తన ఆనందానికి కారణం మా కుటుంబంలో ఏదో విషయం అయి ఉంటుందని రామరాజు అనుకుంటాడు. వాళ్ళ సంతోషానికి కారణం అన్నయ్య విషయమై ఉంటుందా అని ధీరజ్ అనుకుంటాడు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని రామరాజు ఆలోచిస్తుంటాడు. అప్పుడే వేదవతి వస్తుంది. ఎప్పుడు లేనిది భద్రవతి ఇంత సంతోషం ఉందంటే అందుకు కారణం కచ్చితంగా మన కుటుంబంలోని ఒక విషయమై ఉంటుందని రామరాజు అంటాడు. మన కుటుంబంలో ఏ సమస్య ఉంది. మన పిల్లలు ప్రతీ విషయం చెప్తారు. ఏ విధంగా సమస్యలు వస్తాయని వేదవతి అంటుంది. నా వెనకాల ఏదో జరుగుతుంది. నాకు అర్ధం కావడం లేదు. అది తెలుసుకోవాలని రామరాజు అంటాడు. ఆ తర్వాత వేదవతి చందు దగ్గరికి వచ్చి వాటర్ తాగించి.. తనను చూసి బాధపడుతుంది. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వేదవతి వచ్చి.. ఏదైనా అన్నయ్య గురించి దాస్తున్నావా అని అడుగుతుంది. అదేం లేదని ధీరజ్ అంటాడు. ఎన్ని రోజులు దాస్తావో చూస్తానని వేదవతి అంటుంది. మరుసటి రోజు ముగ్గురు రెడీ అవుతారు. వేదవతి పూజ చేసి ముగ్గురికి హారతి ఇస్తుంది. ఆ తర్వాత మీరందరు ఇంతకు ముందు సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు అలా లేదంటూ దిష్టి తీస్తుంది వేదవతి. ఆ తర్వాత రామరాజు వచ్చి ముగ్గురికి బట్టలు తీసుకొని వచ్చి రెడీ అవ్వమంటాడు. బయటకు తీసుకొని వెళ్లి ఫొటోస్ తీయిస్తాడు. ఆ తర్వాత ఆ ఫొటోస్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఇచ్చి ముగ్గురు కొడుకులకి మంచి సంబంధం చూడమని చెప్తాడు. తరువాయి భాగంలో రేపు మనం ఒకరి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడాలని రామరాజుతో సాగర్ అంటాడు. దాంతో రామరాజు ఏంటని కోప్పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : కపటప్రేమ చూపిస్తున్న సవతి తల్లి.. కొడుకు గుర్తించగలడా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -266 లో.....శ్రీవల్లి, శ్రీలత , సందీప్ లు వంట చేస్తుంటారు. ఏంటి రామలక్ష్మి, సీతా బావ గొడవ పడట్లేదని శ్రీవల్లి చిరాకు పడుతుంది. మరొకవైపు సీతాకాంత్ వెళ్తుంటే రామలక్ష్మి చెయ్ పట్టుకొని ఆపుతుంది. ఎలాగా మీరు బర్త్ డే కి తెచ్చారు కదా.. నాకు మీరే పెట్టండి అని రామలక్ష్మి అనగానే.. నెక్లెస్ పెడతాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మాణిక్యం వెళ్తుంటే.. శంకర్ కన్పిస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సందీప్ ని డబ్బులు ఇవ్వడంటూ సందీప్ గురించి నెగటివ్ గా చెప్తాడు. దాంతో సందీప్ పై శంకర్ కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అసలు ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నావని పెద్దాయన, సిరి అడుగుతారు. ఇప్పుడు నేను నిజం చెప్పిన కూడా అసలు మీరు నమ్మరు.. అందుకే నేను చెప్పట్లేదని రామలక్ష్మి అంటుంది. మీరు విడిపోతున్నారని తెలిసి నిన్ను నీ మాటలని ఎలా నమ్మమంటావని సిరి అంటుంది. నేను ఆ విడాకుల పేపర్ పంపలేదని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి టిఫిన్ చేస్తుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రామలక్ష్మి టిఫిన్ చేస్తుంటే శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు నిల్చొని ఉంటారు. దాంతో సీతాకాంత్ కి కోపం వస్తుంది. తినండి అని సీతాకాంత్ ని రామలక్ష్మి అనగానే.. తిననని సీతాకాంత్ కోపంగా మాట్లాడతాడు. నా తల్లి నాపై చూపించే ప్రేమని రామలక్ష్మికి చూపించాలనుకొని ఫ్రూట్ కట్ చేస్తు చెయ్ కట్ చేసుకుంటాడు. అయ్యో అంటూ శ్రీలత ప్రేమ నటిస్తుంది. సీతాకాంత్ ని రామలక్ష్మి తీసుకొని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: దీపే వారసురాలని కనిపెట్టిన దాస్.. నిజాన్ని అనసూయ తెలుసుకోగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-215 లో... దీపని వెతుక్కుంటూ దాస్ ఇంటికి వస్తాడు. దీప ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. నేను వెళ్లి కాంచనమ్మ గారిని పిలుస్తానంటూ దీప వెళ్తుండగా.. పర్వాలేదమ్మా.. అయినా నేను నా చెల్లెల్ని కలవడానికే రావాలా? నీ కోసం రాకూడదా అని దాస్ అంటాడు. అలా ఎందుకు అంటాను బాబాయ్.. ఈ రోజుల్లో ఆప్యాయంగా పలకరించే మనుషులు దొరకడమే ఎక్కువ అని దీప అంటుంది. అయితే అనసూయ అప్పటికే మరో గుమ్మం ముందు కింద కూర్చుని.. కుబేర్ ఫొటోకి ప్లాస్టర్ వేస్తూ ఉంటుంది. కుబేర్ ఫొటోని సగమే చూస్తున్న దాసు.. అది కుబేర్ ఫొటో అయ్యి ఉంటుందా? చూపించమని అడిగితే బాగోదు.. దీప ముందు అనసూయతో ఏం మాట్లాడలేను ఇప్పుడు ఎలా అని దాస్ అనుకుంటాడు. అమ్మా దీపా.. నలుగురికి వెలుగునిచ్చే పేరు నీది. ఈ పేరు నీకు ఎవరు పెట్టారమ్మా అని దాస్ అంటాడు. మా అమ్మ పెట్టిందంట బాబాయ్ అని దీప అంటుంది. అవునా.. పోనీలే.. నీకు అంత మంచి పేరు పెట్టిన మీ అమ్మ నాన్నల పేర్లు ఏంటమ్మా అని దాస్ అంటాడు. మా అమ్మ పేరు అంబుజావల్లి, నాన్న పేరు కుబేరుడు, అంతా కుబేర్ అని పిలుస్తారని దీప అంటుంది. వెంటనే అనసూయ చేతిలోని ఫొటో దాసుకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సీన్ అదిరిపోయింది. దాసుకి మరో అనుమానం వస్తుంది. మరి దీపకు తోబుట్టువులు ఉండి ఉంటే అని. వెంటనే.. అమ్మా నీకు తోబుట్టువులు ఎంత మంది అని దాస్ అడుగగా.. ఎవరూ లేరు బాబాయ్.. నేను ఒక్కదాన్నే అని దీప అంటుంది. అంటే.. దీపే వారసురాలు.. కానీ దీప కుబేర్ కూతురు కూడా అయ్యి ఉండొచ్చు కదా.. ఈ నిజాన్ని అనసూయనే అడగాలని దాస్ మనసులో ఫిక్స్ అవుతాడు. అమ్మా దీపా.. నాకు ఈ పక్క వీధిలో కొంచెం పని ఉంది. ఉంటానమ్మా అని కావాలనే తాను తెచ్చిన బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఇంతలో అనసూయ ఫొటో తీసుకుని లోపలికి రావడం.. దీప.. దాసు మరచిపోయిన బ్యాగ్ చూడటం రెండూ ఒకేసారి అవుతాయి. నేను ఇచ్చి వస్తానులే దీపా అంటూ దాసు వెనుకే అనసూయ బయలుదేర్తుంది. అయితే దాసు గేట్ దగ్గరే కాపలాగా ఉంటాడు. అనసూయ బయటికి వస్తే బాగుండని అనుకున్నట్లే బ్యాగ్ తీసుకుని వస్తుంది అనసూయ. మనం అనుకున్నదే జరిగింది. అనసూయ వస్తోందని కావాలనే ఎదురు వెళ్లిన దాస్.. అయ్యో బ్యాగ్ మరిచిపోయానంటూ అందుకుంటూ కావాలనే.. కుబేర్ డ్రాయింగ్‌ అనసూయ చూసేలా చేస్తాడు. కిందపడిన కుబేర్ డ్రాయింగ్‌ని అనసూయ చేతిలోకి తీసుకుని.. ఇది మా తమ్ముడు బొమ్మలా ఉందే.. మా తమ్ముడు బొమ్మే. ఎవరు గీశారు బాబు.. ఇది మీ దగ్గరుందేంటీ? అంటే మా తమ్ముడు మీకు ముందే తెలుసా? అంటూ ఆరా తీస్తుంది అనసూయ. తెలుసమ్మా అని దాస్ అంటాడు. మరి తెలిసినట్లు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు బాబు అని అనసూయ అంటుంది. నేను చెప్పాలనుకుంటే చాలా విషయాలు చెప్పాలి.. నేను నోరు విప్పడం మంచిది కాదని ఆగిపోయానని దాస్ అంటాడు. ఇంతలో అక్కడికి జ్యోత్స్న వస్తుంది.  అనసూయ, దాస్ మాట్లాడుకోవడం చూసిన జ్యోత్స్న.. వీళ్ళేం మాట్లాడుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటుంది. కాసేపటికి వారసురాలు దొరికిందని అనుకొని దాస్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి దాస్ ఆ నిజాన్ని దీపకి చెప్తాడా? జ్యోత్స్న వెతుకుతున్న వారసురాలు దీపే అని తెలిస్తుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Brahmamudi: పడి పడి నవ్విన కావ్య.. రాజ్ చేసిన ఆ పనికి రుద్రాణికి మంట!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-580 లో.. దుగ్గిరాల ఇంటికి క్యారేజ్ తీసుకొని వస్తుంది కావ్య. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర సీతారామయ్య, ఇందిరాదేవి కలిసి కావ్య తెచ్చిన ఇంటి భోజనం కూర్చొని తింటుంటారు. ఇంతలో రాజ్ వచ్చి.. మన కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టాను. స్పైసీ బిర్యానీ అని చెప్తాడు. ఇక ఓ వైపు సీతారామయ్య, ఇందిరాదేవి , సుభాష్ కలిసి కావ్య తెచ్చిన భోజనం తింటుంటే.. రాజ్ తెచ్చిన బిర్యానీ ఒక్క మద్ద రుద్రాణి తినేసరికి అలానే ఆగిపోతారు. ఫుల్ స్పైసీగా ఉండటంతో రాజ్, రుద్రాణి ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు. స్వప్న తన చెల్లెలు కావ్యతో.. ఏం బాలు మా అత్త బ్రెయిన్‌లా చెత్తగా ఉంది.. కావ్యా నాకు నువ్వు తెచ్చిందే పెట్టవే అంటుంది. ప్రకాశం కూడా అదే మాట అనడంతో.. బాబాయ్ నేను ఎంత మమగారంతో తెప్పించాను బాబాయ్ బిర్యానీ అని రాజ్ అంటాడు. కానీ ఇది యమకారంగా ఉందిరా.. నా వల్ల కాదని ప్రకాశం అనగానే.. సుభాష్ కూడా పార్టీ మార్చేసి కావ్యను రిక్వస్ట్ చేస్తాడు. కావ్య నవ్వుకుంటూ.. మావయ్యగారు ఇంట్లో అందరికి సరిపోయేలానే తెచ్చాను. అంతా తినొచ్చని రాజ్‌ని ఉద్దేశించి అంటుంది. టేస్టీ పప్పు అంటుంది కావ్య కావాలనే ఊరించడానికి.. పప్పుతో మమ్మల్ని కొనలేరని రాజ్ అంటాడు. మీ బిర్యానీ మనుషులతో తినిపించలేరని కావ్య అంటుంది. వెంటనే రాహుల్ తినలేక మంటలతో.. మమ్మీ నేను అటు మారిపోతానంటాడు. నోరుమూసుకుని తిను అని రుద్రాణి చంపేస్తానంటుంది. వెంటనే స్వప్న.. మీ మమ్మీ అలానే ఉంటుంది కానీ.. నువ్వు ఇది తిను.. నేను ఇంకో ప్లేట్ తీసుకుంటానులేనని తాను తినే కావ్య పప్పు అన్నం రాహుల్‌కి ఇస్తుంది. వెంటనే కావ్య.. అవును రాహుల్ నువ్వు తిను.. అక్కకి మరో ప్లేట్ ఇస్తానంటుంది. వెంటనే రాహుల్ నవ్వుకుంటూ హ్యాపీగా తినడం స్టార్ట్ చేస్తాడు.  ఇక ఇద్దరు ఫుల్ కారం అంటు రాజ్, రుద్రాణి నోటిని కడుక్కుంటారు. అది చూసి కావ్యతో పాటు మిగిలిన వాళ్ళంతా నువ్వుకుంటారు. ఇక దాని తర్వాత కాసేపటికి కావ్య.. అందరికి కాఫీ తెచ్చి పంచి.. కావ్య బయలుదేర్తుంటుంది. అప్పుడే రేపేం కావాలో లిస్ట్ చెబుతారు ప్రకాశం వాళ్లు. ఇంతలో రాజ్ కిందకు దిగుతూ.. ఆగు అంటాడు. కావ్యకు డబ్బు అందిస్తూ.. మీరు తెచ్చిన ఫుల్ మీల్స్‌కి నేను చెల్లిస్తున్న బిల్.. నువ్వు చేసిన సర్వీస్‌కి మొత్తం డబ్బులు.. తీసుకో.. మా వాళ్లంతా బాగా తిన్నారంటాడు. ఇక కావ్య ఊరుకోదు. ఏం అనుకుంటున్నారు నా గురించి.. గతంలో కూడా డబ్బు ఇస్తాను ఇంటికి కోడలిగా రా అన్నారు. ఇప్పుడు ఇలా.. అసలు ఏంటి మీ ఉద్దేశమంటూ అందరి ముందే కావ్య గొడవకు దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Ticket to Finale: అవినాష్ కి టికెట్ టు ఫినాలే.. ఎంటర్‌టైనర్ కాదు గేమర్!

  బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీక్ అంటే ఇదేనేమో. గత అయిదు రోజుల నుండి సాగుతున్న టికెట్ టు ఫినాలే క్లైమాక్స్ కి వచ్చేసింది. మొదటగా కంటెండర్ షిప్ సాధించిన అవినాష్ కే టికెట్ టు ఫినాలే వచ్చేసింది.  హౌస్ లో నిఖిల్, నబీల్, పృథ్వీ లాంటి గేమర్స్ ఉన్నప్పటికి అవినాష్ కు టికెట్ టు ఫినాలే రావటంతో అతను జస్ట్ కమేడియన్ కాదు గేమర్ అని అతని ఆటతో నిరూపించాడు. ఒక్కటి కాదు రెండు సార్లు మెగా ఛీఫ్ అయిన అవినాష్.. ఈ వారం జరిగిన రెండు టాస్క్ లో గెలిచి మొదటి కంటెండర్ గా నిలిచాడు. రోహిణి, అవినాష్, నిఖిల్, టేస్టీ తేజ టికెట్ టు ఫినాలేకి అర్హత ఫైనల్ బాటిల్ లో అవినాష్ గెలిచినట్టు తెలుస్తోంది. ఈ సీజన్-8 లో ఎవరి అంచనాలకి అందకుండా అవినాష్ ఆడుతున్నాడు.. హౌస్ లో ఏ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ అయిన అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఇరగదీస్తున్నారు. వీళ్ళ కామెడీ కోసం బిగ్ బాస్ సీజన్-8 కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే కొంతమంది అసలు బిగ్ బాస్ రెగ్యులర్ గా చూడకుండా అసలు గేమ్ ఆడని, ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వని పృథ్వీ, విష్ణుప్రియలకి ఓట్లు వేస్తున్నారు. ఇక నబీల్ గేమ్ లో అట్టడుగునకి చేరాడు. ఇమ ఈ వారం రోహిణి తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు. వారిలో నిఖిల్, గౌతమ్, నబీల్ టాప్ లో ఉండగా.. లీస్ట్ లో‌ అవినాష్, టేస్టీ తేజ ఉన్నారు. పృథ్వీ, విష్ణుప్రియల లవ్ ట్రాక్ కోసం బిగ్ బాస్ మామ ఫేక్ ఓటింగ్ వేస్తున్నాడనే అనుమానాలున్నాయి. మరి బిగ్ బాస్ సీజన్-8 లో‌ మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తూ అటు గేమ్స్ లో తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్న అవినాష్, రోహిణిలకి ఓటింగ్ రావడం లేదు. టికెట్ టు ఫినాలేకి చేరుకున్న అవినాష్.. ఈ వారం నామినేషన్ లో నుండి సేవ్ అయితేనే ఉంటాడు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే వార్తలు వినిపిస్తుండగా.. ఎవరు బయటకు వస్తారోనని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  

విష్ణుప్రియని వాడుకుంటున్నావ్.. సింపథీ కార్డ్ యూజ్ చేస్తున్నావా

  బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఠక్కున విష్ణుప్రియ అని చెప్తారు. మరి విష్ణుప్రియ ఇన్ని రోజులు ఎందుకు సేవ్ అవుతుందంటే.. అది బిగ్ బాస్ మామకే తెలుసు. ఓట్లు వేసే ఆడియన్స్ ని పిచ్చోళ్ళని చేస్తూ విష్ణుప్రియ-పృథ్వీలని సేవ్ చేస్తూ వస్తున్నారు. ఇక వీరి ఇష్యూ గురించి నిన్నటి ఎపిసోడ్ లో పునర్నవి మరోసారి అడిగింది. విష్ణూతో నీ రిలేషన్ గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది పృథ్వీ.. ఇప్పటివరకూ నేను బయట నుంచి ఏం చూశానో అదే అడుగుతున్నానని పునర్నవి అడుగగా.. నీకు విష్ణు ప్రియ అంటే ఇష్టమా అని సూటిగా అడిగేసింది పునర్నవి. ఫ్రెండ్‌గా ఇష్టమని పృథ్వీ చెప్పాడు. అనంతరం.. పునర్నవి విష్ణు వైపు చూస్తూ.. నీకు పృథ్వీ అంటే ఇష్టమా అని అడిగింది. అవును ఇష్టమని అంది. ఇష్టం అంటే ఏ ఇష్టం.. ఫ్రెండ్‌గానా? అని మళ్లీ పునర్నవి అడుగగా.. ఫ్రెండ్‌ కంటే ఎక్కువ ఇష్టమని విష్ణుప్రియ చెప్పింది. మీ ఫ్రెండ్ షిప్ వల్ల మీ గేమ్ నాశనం అవుతుందని అనుకుంటున్నారా అని పునర్నవి అడుగగా.. స్పాయిల్ ఎందుకు అవుతుంది.. ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటున్నామని పృథ్వీ అన్నాడు. నాకైతే సపోర్ట్‌గా కాదు.. విష్ణు ప్రియను సింపథీ కార్డ్‌గా వాడుకుంటున్నావని అనిపిస్తుందని అనేసింది. నో.. నో.. నేను సింపథీ కార్డ్‌గా వాడుకోవడమేంటి? నాకు ఆ అవసరం లేదని అన్నాడు. హో.. నీకు అవసరం లేదా అని పునర్నవి నవ్వితే.. అవును అవసరం లేదు.. సింపథీ కార్డ్.. నాట్ విష్ణు అని పృథ్వీ అన్నాడు.  సరే ఈ ఫ్రెండ్ షిప్‌ని బిగ్ బాస్ గేటు దాటిన తరువాత కంటిన్యూ చేస్తావా అని అడుగగా.. నేను ఫస్ట్ టైమ్ హౌస్‌లోకి వచ్చినప్పుడు విష్ణుకి ఇదే చెప్పాను. నువ్వంటే నాకు ఇంట్రస్ట్ ఉందని విష్ణు అన్నప్పుడు.. ఇక్కడ 16 మందే ఉన్నాం.. వేరే ప్రపంచం తెలియదు కాబట్టి.. బయటకు వెళ్లిన తరువాత అభిప్రాయం మారొచ్చని క్లారిటీ ఇచ్చాను. బయటకు వెళ్లిన తరువాత ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు. నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవని క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. సింపథీ కార్డ్ అని ఎందుకు అనిపించిందని పృథ్వీ అడిగితే.. ఎప్పుడూ విష్ణూనే తన రిలేషన్ షిప్ గురించి చెప్తుంది.. కానీ నువ్వు ఎలాంటి స్టాండ్ తీసుకోవు. అసలు మీ రిలేషన్ షిప్ ఏంటనేది కన్ఫ్యూజన్ ఉంది.. విష్ణు ప్రియ ఓవర్ ఎక్స్‌ప్లినేషన్‌ వల్ల తను బ్యాడ్ అవుతుంది.. నువ్వు ఫ్రెండ్ షిప్ అని అంటున్నావ్ సింపుల్‌గా. కానీ విష్ణు మాత్రం ఫ్రెండ్‌గా చూడటం లేదు. దాని వల్ల తనకి జరగాల్సిన నష్టం జరుగుతుందని పునర్నవి అంది. నేను కూడా పృథ్వీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఇక్కడేం జరుగుతుందో మనకి తెలియదు. బయటకు వెళ్లిన తరువాత చూస్తామని అంది.  సరే.. మీ ఫ్రెండ్ షిప్ మిమ్మల్ని టాప్ 2, టాప్ 3 వరకు తీసుకుని వెళ్తుందని అనుకుంటున్నావా అని పునర్నవి అడుగగా.. వెళ్లొచ్చు.. వెళ్లకపోవచ్చు.. బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇక్కడ మాత్రం మేమ్ హానెస్ట్‌గా ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటున్నాం. మాకు అనిపించింది చేస్తాం. ఏది ఎలా కన్వే అవుతుందో తెలియదు. అనుభవించే వాళ్లకే తెలుస్తుందని విష్ణుప్రియ అంది. నేను అడిగింది సింపుల్.. ఓవర్‌గా వివరణ ఇస్తున్నావ్.. టాప్‌లో మీరు ఉంటారా? ఉండరా? అని అడుగుతున్నా అని పునర్నవి అడుగగా.. అదే చెప్తున్నా.. వెళ్లొచ్చు.. వెళ్లకపోవచ్చని విష్ణుప్రియ అంది. మొత్తానికి విష్ణుప్రియ, పృథ్వీల భాగోతం మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

టికెట్ టు ఫినాలే లో నిఖిల్.. ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్!

  బిగ్ బాస్ సీజన్-8 లో గత నాలుగు రోజుల నుండి టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇక ఇందులో భాగంగా ఇప్పటికి రోహిణి, అవినాష్ కంటెండర్ షిప్ కి అర్హత సాధించిగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో నిఖిల్ కంటెండర్ అయ్యాడు. రోహిణి, అవినాష్, టేస్టీ తేజాలు కామెడీతో పొట్ట చెక్కలు చేశారు. ప్రకాష్ అండ్ పరిమిళగా అవినాష్, రోహిణిలు అద్దరగొట్టేశారు. పంచ్‌లు అయితే మామూలుగా పేలలేదు. ఆ వయసులో ముసలోడు గట్టోడే.. నలుగురు పిల్లలూ అని గ్యాప్ ఇచ్చి.. దత్తత తీసుకొచ్చేడని రోహిణి సిగ్గుపడే సీన్ పొట్ట చెక్కలు చేసింది. వీళ్ల కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవల్ అనేట్టుగానే ఉంది. ఇక్కడి వరకూ అంతా కామెడీగానే సాగింది. ఇక టికెట్ టు ఫినాలే రేస్‌లో భాగంగా.. మూడో పోటీదారుడ్ని ఎంపిక చేయడానికి హౌస్‌లోకి పునర్నవి, వితికలు వచ్చారు. టాస్క్‌లో ప్రతిభ చూపని వాళ్లకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చే విషయంలో రచ్చ రేగింది. అందరూ ఈక్వల్‌గానే ఆడారు.. ఇది టఫ్ డెసీషన్ కాబట్టి తప్పడం లేదంటూ ప్రేరణని రేస్ నుంచి తప్పిస్తూ ఆమెకి బ్లాక్ బ్యాడ్ ఇచ్చారు వితిక, పునర్నవిలు. దాంతో హర్ట్ అయిపోయింది ప్రేరణ. ఇది గేమ్.. అక్కడ నేను బాగానే ఆడానని ప్రేరణ అనడంతో.. మాకూ తెలుసు ప్రేరణా ఇది గేమ్ అని.. నువ్వు గౌతమ్ ఆడిన ఆటలో.. గౌతమ్ ఫెయిర్‌గా ఆడాడని తెగేసి చెప్పింది వితిక. దీంతో ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నిన్నటి టాస్క్ లో టేస్టీ తేజని మొదటనే తప్పించడంతో తను ఎమోషనల్ అయ్యాడు. ‌ఇక టాస్క్ లో పృథ్వీకి ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కానీ అతను ఫెయిర్ గా ఆడలేదంటూ నిఖిల్ ని విజేతగా ప్రకటించాడు బిగ్ బాస్. గౌతమ్, ప్రేరణ ఇద్దరిలో గౌతమ్ ఫెయిర్ గా ఆడినా మూడో స్థానంలో నిలిచాడు.

Illu illalu pillalu : ఇంటిగుట్టు బయటపెట్టిన చందు.. ఇక రామరాజు పరువు అంతే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -15 లో...... చందు తన లవర్ కి పెళ్లి అయిందని బాధలో డ్రింక్ చేస్తాడు. మరొకవైపు చందు కోసం ధీరజ్ వెతుకుతాడు. భద్రవతి కార్ కి చందు అడ్డువస్తాడు. చందుని చూసి వీడు రామరాజు పెద్ద కొడుకు కదా బుద్దిమంతుడు కదా ఇలా డ్రింక్ చేసాడేంటి అనుకొని డ్రైవర్ కి చెప్పి.. వాడిని ఎక్కించుకొని ఎందుకు తాగాడో చాకచక్యంగా అడుగమని భద్రావతి చెప్తుంది. ఆ తర్వాత అతను చందు ని ఎక్కించుకొని ఎందుకు తాగావని అడుగుతాడు. నా లవర్ కి పెళ్లి అయిందని చందు చెప్తాడు. మా నాన్న అంటే చెప్పలేని గౌరవం అంతకుమించి భయమని చందు చెప్తాడు. ఆ తర్వాత భద్రావతి సైగ చెయ్యగానే చందుని దింపేస్తాడు. ఆ తర్వాత చందు దగ్గరికి ధీరజ్, సాగర్ లు వెతుకుతూ వస్తారు. తనని ఇంటికి తీసుకొని వెళ్తారు సాగర్ లోపలికి వెళ్తుంటే.. నువ్వు ఎందుకు వెళ్తున్నావని అన్నయ్య నీ తీసుకొని వెళదామని ధీరజ్ అనగానే.. వాడితో పాటు నన్ను కూడ తాగానని అనుకుంటాడు అని సాగర్ అంటాడు. నీది భయమో, స్వార్థమో అర్ధం కాదని ధీరజ్ అంటాడు. ఇక లోపలికి వెళ్తుంటే రామరాజు చూస్తాడు. ఇక చందు నాన్నపై తనకి ఉన్న ప్రేమని చెప్తాడు. అయిన వీడు తాగడం ఏంటని రామరాజు అనగానే పెళ్లి లో కూల్ డ్రింక్ లో మందు కలిపారని ధీరజ్ కవర్ చేస్తాడు. అయినా నువ్వేం చేస్తున్నావని ధీరజ్ పై రామరాజు కోప్పడతాడు. ఆ తర్వాత భద్రావతి ఇంటి ముందు బాంబులు పేలుస్తుంది. అది చూసి మా అక్క ఎన్ని రోజులు అవుతుంది. ఇలా సంతోషం గా ఉండి అని రామరాజుతో వేదవతి అంటుంది. ఏంటి వదిన దీపావళి అయిపోయింది బాంబులు పేలుస్తున్నారని తన మరదలు అడగనే.. ఆ రామరాజు కొడుకులు తన బలం.. పరువు అంటాడు కదా తన పెద్ద కొడుకు వళ్ళ తన కుటుంబం పతనం మొదలవుతుందని భద్రావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం వేదవతికి చెప్పాలని తన తల్లి అనుకుంటుంది. తరువాయి భాగంలో సాగర్ దగ్గరికి నర్మద వచ్చి వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. రేపు మీ వాళ్లందరిని తీసుకొని రా మన పెళ్లి గురించి మాట్లాడుదామని సాగర్ కి నర్మద చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కుబేర్ గురించి నిజం తెలుసుకున్న దాస్.. దీపకి నిజం తెలిసేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -214 లో.....మన మనసులో తప్పు అభిప్రాయం లేదు.. శౌర్య అడిగిన ప్రతీది కాదంటే బాధపడుతుంది. అది మనల్ని కాకుండా ఎవరిని అడుగుతుందని కార్తీక్ అంటాడు. అనుబంధం ఏర్పడకపోయిన అనుబంధం ఏర్పడినట్లు చెయ్యాలి. ఉదాహరణకి రిసెప్షన్ లో నీ భుజం పై చేతులు వెయ్యడం లాంటివి. అలా తీసుకొని చొరవ అందరికి సమాధానం.. గది లోపల బయట మనం భార్యభర్తలమే మన దూరం మనకి తెలిస్తే చాలని కార్తీక్ అని వెళ్లిపోతాడు. మన బంధం అనుబంధంగా ఎప్పుడు మారుతుందో తెలియదు గానీ ఎప్పటికైనా మీ వాళ్ళతో మీరు కలిసి ఉండాలి. అప్పుడు కూడా మీ పక్కన చోటు ఇస్తే చాలు అని దీప అంటుంది.  మరొకవైపు జ్యోత్స్న రౌడీని కలవడానికి వస్తుంది. తనని దాస్ చూసి ఇక్కడికి ఎందుకు వచ్చిందనుకుంటాడు. మరొకవైపు శౌర్య గురించి డాక్టర్ తో కార్తీక్ మాట్లాడడం దీప వింటుంది. ఏమైంది శౌర్యకి అని అడుగగా.. ఏం లేదని కార్తీక్ అంటాడు. కార్తీక్ వాష్ రూమ్ కి వెళ్తాడు. కార్తీక్ ఫోన్ నుండి డాక్టర్ కి చేయాలని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను డాక్టర్ తో మాట్లాడాలని దీప అంటుంది. నా మీద నమ్మకం లేక చేస్తావా అని కార్తీక్ అనగానే వద్దు మీపై నమ్మకం ఉందని దీప అంటుంది. మరొకవైపు జ్యోత్స్న రౌడీ దగ్గరికి వెళ్తుంటే.. దాస్ వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ అడుగుతాడు. నీకెందుకు నన్ను వదిలేయ్ అంటూ అనగానే.. దాస్ కిందపడతాడు. అప్పుడే కుబేర్ స్కెచ్ ఆర్ట్ కింద పడుతుంది. అది చూసి నువ్వు ఇతని డ్రాయింగ్ పట్టుకొని తిరుగుతున్నవ్ ఏంటని జ్యోత్స్న అడుగుతుంది. నీకు ఇతను తెలుసా అని దాస్ అడుగుతాడు. తెలుసు దీప నాన్న, అనసూయ తమ్ముడు అని జ్యోత్స్న అనగానే.. దాస్ షాక్ అవుతాడు. అంటే అసలైన వారసురాలు దీపనా అని దాస్ అనుకుంటాడు. కుబేర్ కి ఇంకో కూతురు ఉండొచ్చు కదా ఏ విషయం అయిన అనసూయని అడగాలని దాస్ అనుకుంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా తాతయ్యకి ఫోన్ చెయ్యాలా అని దాస్ అనగానే.. జ్యోత్స్న వద్దని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.  నా కూతురు ద్వారా నీ అసలు నిజం బయటపడిందని దాస్ అనుకుంటాడు. ఆ తర్వాత అమ్మ అంటు కార్తీక్ పిలుస్తాడు. కానీ కాంచన వెళ్ళదు.. నువ్వు వెళ్ళు దీప అని కాంచన అంటుంది. నేను ఎందుకు వెళ్ళాలని పిలుస్తుందని దీప అనుకొని.. మిమ్మల్నే అని అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి.. ఆ షర్ట్ కుట్టాలని చెప్తాడు. మీరు రాకుంటే నేను కుడతానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భార్య బర్త్ డే కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -265 లో..... రామలక్ష్మి విడాకులు అడిగిందని లాగి పెట్టి కొట్టకుండా వారం రోజులు టైమ్ అడిగాడని శ్రీలతతో నందిని చెప్పగానే.. ఆ వారం రోజులు మనం యూజ్ చేసుకుని వాళ్ళని దగ్గర అవ్వకుండా చూడాలి. నేను చూసుకుంటా నువ్వు టెన్షన్ పడకని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని పెద్దాయన, సిరి ఆలోచిస్తారు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. వదిన ఎందుకు ఆ నిర్ణయం తీసుకందని సిరి అడుగుతుంది. అంటే నిన్న కోపంలో తనని ఒక మాట అన్నాను.. అందుకే అనుకుంటా అని సీతాకాంత్ అంటాడు. అసలు శ్రీలత, రామలక్ష్మిలకి పడట్లేదని పెద్దాయన అనగానే.. అమ్మ నన్ను ఇంకా అమ్మ సవతి తల్లిలాగే చూస్తుందని‌ రామలక్ష్మి అనుకుంటుందని సీతాకాంత్ అంటాడు. ఈ వారం రోజుల్లో ఆ ఆలోచన పోగొట్టి రామలక్ష్మి అంటే నాకు ఎంత ఇష్టమో తెలియజేయ్యాలని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి మాణిక్యం వచ్చి.. ఆస్తి అంతా నీ పేరున రాయించకొని మంచి పని చేసావని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత మాణిక్యానికి జరిగింది చెప్తుంది రామలక్ష్మి. ఈ నోటీసులపై లాయర్ నెంబర్ ఉంది. ఆ లాయర్ అడ్రెస్ కనుక్కో అలాగే శంకర్ అనే వ్యక్తి దగ్గర సందీప్ అప్పు చేసినట్టున్నాడు. అందుకోసమే సీతా సర్ ని ఎటాక్ చేసాడేమో.. అదంతా బయటపడుతుంది.. శంకర్ గురించి కనుక్కోమని రామలక్ష్మి చెప్పగానే.. మాణిక్యం సరే అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మిని కొట్టి బావగారు విడాకులు ఇస్తారనుకుంటే ఇలా చేశారని శ్రీవల్లి అనగానే.. వాళ్లు కలవకుండా నేను చూసుకుంటానని శ్రీలత అంటుంది. ఒక వైపు  రామలక్ష్మి మరొకవైపు సీతాకాంత్ లు తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి పడుకొని ఉంటుంది. సీతాకాంత్ బీరువా తీస్తుంటే అందులో బాక్స్ కింద పడుతుంది. ఏంటి అదని రామలక్ష్మి అనగానే.. నీ బర్త్డే కి గిఫ్ట్ ఇద్దామనుకున్నానని అనగానే రామలక్ష్మి ఓపెన్ చేస్తుంది. అందులో బ్యాంగిల్స్, పట్టీలు, నెక్లెస్, కుంకుమ ఉంటాయి. వాటిని చూసి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ వెళ్తుంటే రామలక్ష్మి తన చెయ్ పట్టుకొని ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అనామికకి చెంపదెబ్బ.. భార్యకి టిప్ ఇచ్చిన భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -579 లో.....ఇందిరాదేవి వంట చేస్తుంటే.. స్వప్న హెల్ప్ చేస్తుంది. ఇందిరాదేవి వంట చేస్తుంటే చెయ్ కాలుతుంది. దాంతో రాజ్ చూసి.. ఏంటి నానమ్మ నువ్వు ఎందుకు వంట చేస్తున్నావ్. నేను వద్దని చెప్పాను కదా అని అంటాడు. బయట ఫుడ్ మీ తాతయ్య తినడు అని ఇందిరాదేవి అంటుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు చెయ్యొచ్చు కదా అని రాజ్ అంటాడు. నాకు వంట రాదని రుద్రాణి అంటుంది. నువ్వు అయిన చెయ్యొచ్చు కదా పిన్ని.. నానమ్మ బాధ పడుతుంటే చూస్తున్నారని రాజ్ అడుగుతాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చేసినప్పుడు. ఎవరు నా కష్టం గుర్తించలేదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి రాజ్ కి ఎదురుమాట్లాడుతుంది. నువ్వు వెళ్లి కావ్య, అపర్ణలని తీసుకొని రా అప్పుడే ఈ ఇంటికి మంచిది అని సుభాష్ అంటాడు. అదేంటి అన్నయ్య ఇద్దరిని తీసుకొని రమ్మంటున్నాడని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి వెటకారంగా మాట్లాడతాడు. నువ్వు మా ఇంట్లో వాళ్ళని నీ వైపు కి తిప్పకున్నావ్.. ఇప్పుడు మా అమ్మ నీ నీ దగ్గరికి రప్పించుకున్నావ్. ఇంట్లో నానమ్మ తాతయ్యని చూసుకునే వాళ్లు లేరు.. నానమ్మ వంట చేస్తూ చెయ్ కాల్చుకుందనగానే ఇప్పుడెలా ఉందని కావ్య అడుగుతుంటే.. అంత నటించకని రాజ్ అంటాడు. అప్పుడే అపర్ణ ఫోన్ తీసుకొని.. ఏంటో బాధ్యతగల భర్తలాగా దబాయిస్తున్నావని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అనామిక దగ్గరికి అప్పు కళ్యాణ్ ని తీసుకొని వచ్చి.. నా భర్తకి ఏ టాలెంట్ లేదన్నావ్ కదా తను పాటలు రాస్తుండు.. అవి జనాలకి నచ్చుతున్నాయి.. సక్సెస్ కి దగ్గర లో ఉన్నామని అనామికకి చెంప దెబ్బ కొట్టినట్లు మొహంపై చెప్పి వెళ్తుంది అప్పు. ఆ తర్వాత కావ్య, ఇందిరాదేవి వాళ్ళకి క్యారెజ్ తీసుకొని వెళ్తుంది. ఎందుకు వద్దని అపర్ణ అంటుంది. అలా అయితే రాజ్ కి నీ విలువ ఎలా తెలుస్తుందని అంటుంది. అయిన కావ్య వినకుండా తీసుకొని వెళ్తుంది. రాజ్ ఎందుకు వచ్చవని అడుగుతాడు. నువ్వు వద్దని అనుకున్నావ్ కానీ మేమ్ కాదు అని సీతారామయ్య అంటాడు. తరువాయి భాగంలో కావ్య వంటలు.. మా ఇంట్లో బాగున్నాయన్నారు. అందుకే ఇదిగో టిప్పు అని కావ్యకి రాజ్ డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సూసైడ్ చేసుకోవాలనుకున్న డాన్స్ మాస్టర్

మణికంఠ మాష్టర్ అంటే ఢీ షో ఒక మంచి పేరు ఉంది. అలాంటి ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. వచ్చామా డాన్స్ చేశామా వెళ్ళిపోయాము అన్నట్టుగా తన పని తానూ చూసుకునే మణికంఠ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. "మా కుటుంబంలో అన్నీ మా అన్నయ్య , వదిన  చూసుకునే వారు. ఐతే   మా వదిన చనిపోయారు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న టైములో పాప ఉదయం, వదిన సాయంత్రం చనిపోయారు. తర్వాత మూడు నెలలకు రోడ్ యాక్సిడెంట్ లో మా అన్నయ్య చనిపోయారు.   ఐతే ఈ విషయాలు ఎక్కువగా ఎవరికీ చెప్పను. ఎందుకంటే వాళ్ళు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను... అంటే అందరికీ తెలియాలి అని.  నేనేమో డాన్స్ పేరుతో అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని. ఇక మా అమ్మ కూడా చనిపోయింది అని తెలిసాక నా మైండ్ అంతా ఏదోలా ఐపోయింది. ఆ టైంలో నేను ఎవరి దగ్గర పని చేసానో వాళ్ళు కూడా నాకు పని ఇవ్వలేదు. దాంతో ఎం చేయాలో తెలీక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా. ఇక ఆ టైములో నన్ను చేరదీసిన మా రేవతి మేడం, ఆనంద్ సర్ నన్ను తిట్టి జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పి నా మైండ్ మార్చారు. కష్టం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడం మాత్రమే పరిష్కారం కాదు అని చెప్తున్నా. నిజంగా ఆ స్ట్రెస్ లో డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుని ఉంటె గనక ఈరోజు మీ అందరి ముందు ఉండేవాడిని కాదు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కునే ధైర్యం అందరిలో రావాలని అనుకుంటున్నా. నాలాగా ఎవరూ ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని కోరుతున్నా. అందరూ నన్ను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ లా ఉన్నారు అని అనేవారు. ఆ మాట విన్నప్పుడు  నాలో ఫుల్ జోష్ వచ్చేస్తుంది. అలాగే అందరూ నన్ను జూనియర్ లారెన్స్ అంటారు. ఐతే ఆ పేరును ఢీ షోలో ప్రియమణి గారు పెట్టారు. లారెన్స్ గారు ఎవరికీ తెలీకుండా ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు. నాకు కూడా అది ఇష్టం. అందుకే నాకు ఎంత తోచితే అంత ఎవరికీ తెలియకుండా సాయం చేస్తూ ఉంటాను" అని డాన్స్ కొరియోగ్రాఫర్ మణికంఠ  చెప్పారు.