మగాళ్లకు అండగా  శేఖర్ బాషా...

  శేఖర్ బాషా ఆర్జేగా, వీజేగా, క్రికెట్ కామెంటేటర్ గా ఒకప్పటి ఆడియన్స్ కి, ఇప్పటి ఆడియన్స్ కి బాగా తెలుసు. 2007 నుండి 2019 వరకు మొత్తం 18 అవార్డులు అందుకున్న టాప్ ఆర్జే, విజెగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి శేఖర్ బాషా రీసెంట్ గ బిగ్ బాస్ లోకి వెళ్లి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. అలాంటి శేఖర్ బాషా ఇప్పుడు మగాళ్లకు అండగా నిలవాలని కోరుకుంటూ రకరకాల ఇంటర్వ్యూస్ లో మగవాళ్ళను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. "మగాళ్లు ఎలాగైనా బతికేస్తారు అనుకుంటున్నారు కానీ మగాళ్లు చాలా ప్రమాదంలో ఉన్నారు. అటు ఇంట్లో భార్యల వలన సమస్యలు పడే వాళ్ళు ఉన్నారు. పూలు తేలేదని, బయటకు తీసుకెళ్లలేదని కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరికీ తెలీకుండా  టార్చర్ భరిస్తున్న మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి సరైన ప్లాట్ఫార్మ్ లేదు. చట్టం కూడా చాలామటుకు స్త్రీల పక్షానే ఉంది. వాళ్ళు చెప్తే కేసులు పెడతారు..అదే ఒక మగవాడు వెళ్లి ఇలా టార్చెర్ పెడుతోందంటూ కేసు పెడితే దాన్ని పట్టించుకోరు. ఎన్ని సంఘాలు పెట్టుకున్నా ఎన్ని ఫారంస్ పెట్టుకున్నా ఢిల్లీ పెద్దల నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. జానీ మాస్టర్ కేసును తీసుకుంటే ఆ లేడీ టార్చర్ చేస్తోంది అని జానీ మాష్టర్ రివర్స్ లో కేసు పెడితే రిజిస్టర్ కాదు ఎఫ్ఐఆర్ కూడా రాయరు. ఎందుకంటే ఈ సిస్టం ఇలా ఉంటుంది అనేది దగ్గరుండి చూసాను నేను. అందుకే మగవాళ్ళను అలెర్ట్ చేస్తూ వాళ్ళల్లో చైతన్యం నింపుతూ మగాళ్ల తరపున పోరాడాలని నిర్ణయించుకున్నా. నాతో ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఢిల్లీ వెళ్లి ఒక ప్లకార్డు అన్న చూపించి వస్తా అప్పుడు ప్రభుత్వానికి సమస్య అర్ధమవుతుంది. ఆడవాళ్లకు అనుకూలంగా సెక్షన్స్ ఉన్నాయని కేసులు పెడుతున్నారు కానీ వాళ్లకు తెలియకుండా ఎదుటి వాళ్ళ ఇంటి ఆడవాళ్లను, పిల్లలను రోడ్డున పడేస్తున్నారు. అందుకే ఢిల్లీ పెద్దలకు వినిపించేలా మాట్లాడాలని అనుకుంటున్నా"  అన్నాడు విజె శేఖర్ బాషా.  

నేను మధ్యలో మాట్లాడతా నా ఇష్టం.. గౌతమ్ పై పృథ్వీ రౌడీయిజం!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం నామినేషన్లలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ కి గౌతమ్ కి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. పృథ్వీ చేసిన తప్పుకి వీకెండ్ లో వచ్చిన నాగార్జున గౌతమ్ దే తప్పంటూ చెప్పగా.. నిన్నటి నామినేషన్లో గౌతమ్ పై రెచ్చిపోయాడు పృథ్వీ. గౌతమ్ ని నిఖిల్ నామినేషన్ చేశాడు. ఫ్లిప్ అవుతున్నావంటూ రీజన్ చెప్పగా.. గేమ్ లో అలా జరిగిందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. వాటర్ ట్యాంక్ టాస్కులో మీద మీదకి వచ్చిందెవరు.. బీప్‌లో మాట్లాడిందెవరు.. అంటూ నిఖిల్ ఫైర్ అయ్యాడు. దీనికి నేను మాట్లాడకుండా మాట్లాడా అని నువ్వు ప్రొజెక్ట్ చేసినవ్ మచ్చా.. అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో నేను చేయలేదు.. చేయాలంటే నామినేషన్‌లోనే చేసేవాడిని.. అని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. అయినా నువ్వు చేసినవ్.. నన్ను చేయని తప్పుకి నిందించారు.. అబాండాలు వేసినవ్.. నేను అనని పదాన్ని అన్నావని నాపై అబాండం వేశారు.. అంటూ గౌతమ్ అన్నాడు. దాన్ని హౌస్‌తో పాటు ఆడియన్స్ కూడా ఎవరూ ఒప్పుకోలేదు.. అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో నీకు బయటికెళ్లి చూపిస్తా మచ్చా నేను ఆ పదం అని ఉంటే నేను కంఠం కోసుకొని చచ్చిపోతా నీ కంటి ముందు.. తల్లి ప్రమాణంగా నేను అనలేదంటూ గౌతమ్ అన్నాడు. తల్లి ప్రమాణంగా నేను అనలేదు.. అని గౌతమ్ అంటే అదే తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా నేను అలా పోట్రే చేయలేదు.. అంటూ నిఖిల్ అన్నాడు. వీళ్ల మధ్య డిస్కషన్ నడుస్తుండగా తేజ మాట్లాడటానికి ట్రై చేశాడు.  తేజ నీ డిఫెన్స్ లాయరా అంటూ గౌతమ్‌ని రెచ్చగొట్టాడు పృథ్వీ. దీంతో వద్దురా నువ్వు కూర్చోమంటూ తేజతో గౌతమ్ చెప్పాడు. అయినా సరే మాటిమాటికి వాడు నీ డిఫెన్స్ లాయరా అంటూ పృథ్వీ రెచ్చగొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ నడించింది. నేను నిఖిల్‌ని నామినేట్ చేస్తే నువ్వెందుకు మధ్యలో వస్తావంటూ గౌతమ్ అడిగాడు. అయిన సరే పృథ్వీ నేను మాట్లాడతా ఏం చేస్తావంటూ గౌతమ్ మీదకి వెళ్లాడు పృథ్వీ. అలా ఇద్దరి మధ్య కాసేపు హీటింగ్ డిస్కషన్ జరిగంది. ఇక జైలు నామినేషన్‌లో నాకు పృథ్వీకి గొడవ అయితే నువ్వు నా మీద రెయిజ్ అయ్యావ్.. ఎందుకంటూ గౌతమ్ అడిగాడు. దీనికి నా వాక్కు నా హక్కు.. మనోడు ఏం మాట్లాడతాడో తియ్ చూద్దాం అన్నానంటూ నిఖిల్ అన్నాడు.  

ప్రేమపక్షులని టార్గెట్ చేసిన తేజ.. నువ్వు ఫ్లిప్ అవుతున్నావ్ నిఖిల్!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం నామినేషన్లు చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. వీకెండ్ లో నాగార్జున స్నేక్ అండ్ లాడర్ ఇవ్వడం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఈ నామినేషన్లలో పడింది. గతవారం నుండి రోహిణి-విష్ణుప్రియ మధ్య ఓ గొడవ సాగుతుండగా.. పృథ్వీ-గౌతమ్ మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. అయితే ఈ రెండింటి వల్ల హౌస్ లో గందరగోళం జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్, విష్ణుప్రియలని నబీల్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రేరణ మొదటగా విష్ణుప్రియని, సెకెంఢ్ గౌతమ్ ని నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన టేస్టీ తేజ మొదటగా విష్ణుప్రియని నామినేషన్ చేశాడు. మెగా చీఫ్ టాస్కుల్లో తన గ్లాసులు కిందపడేసినందుకు ఫీల్ అయ్యానని.. అది ఎందుకు చేశావ్ అంటూ తేజ అడిగాడు. దీనికి అదే నా స్ట్రాటజీ అంటూ విష్ణు చెప్పింది. తర్వాత తేజ.. పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు మీ యాక్షన్స్, మాటలతో మనుషులను బాగా ట్రిగ్గర్ చేస్తారు.. అది కరెక్ట్ కాదు అంటూ తేజ అన్నాడు. అలానే తన గురించి సండే ఎపిసోడ్‌లో రాసిన కంప్లెయింట్‌కి కారణాలేంటి అంటూ తేజ అడిగాడు. దీనికి చెప్పను అంటూ పొగరుగా సమాధానమిచ్చాడు పృథ్వీ. ఎన్నిసార్లు తేజ అడిగిన కూడా పృథ్వీ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. ఇక గౌతమ్ తన మొదటగా నిఖిల్ ని నామినేట్ చేశాడు. కొన్ని సిచువేషన్స్‌లో నీ ఫ్లిప్పింగ్ నేచర్ కనిపించింది. మనం ఆర్టిస్టులం మచ్చా.. మనకి దెబ్బలు తగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్న నువ్వే.. మణికంఠను ఎగ్ టాస్కులో విసిరేశావ్.. యష్మీ-ప్రేరణలను గేమ్‌లో కాస్త హార్ష్‌గా డీల్ చేశావంటూ నిఖిల్ తో గౌతమ్ అన్నాడు. అది నేను కావాలని చేయలేదని, గేమ్ లో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అలా చేశానంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి ఇక్కడ ఎవరు ఏది కావాలని చేయరని గౌతమ్ అన్నాడు. నేను ఏం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావంటూ నిఖిల్ అడుగగా.. తప్పని ఒప్పుకుంటున్నావా లేదా అనేది నా మాట అంటూ గౌతమ్ అన్నాడు. నేను ఆవేశంగానే ఆడాను కానీ అంత స్రెంథ్‌గా నేను ఆడలేదంటు నిఖిల్ చెప్పుకొచ్చాడు. నో అంటే నో అని నన్ను నామినేట్ చేసినవ్.. అదే పృథ్వీ ఎన్నోసార్లు అవినాష్-ఆదిత్యలను అగౌరవంగా మాట్లాడాడు.. ఎందుకు నువ్వు స్ట్రాంగ్‌గా తనని నామినేట్ చేయలేకపోయావంటూ గౌతమ్ అడుగగా.. నేను పృథ్వీనీ పక్కకి తీసుకెళ్లి చెప్పానని నిఖిల్ అన్నాడు. మరి నాకు కూడా అలానే చెప్పొచ్చు కదా అంటూ గౌతమ్ అన్నాడు. నాకు కంఫర్ట్‌ ఉన్నవాళ్లతోనే ఉంటానని నువ్వే చెప్పావ్ కదా.. నీకు నచ్చదు ఇష్టం లేదన్నప్పుడు ఫ్రెండ్ అవ్వరా అని ఎందుకు అడుగుతానంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య నామినేషన్ జరుగుతుంటే పృథ్వీ ఓ వైపు నుండి, టేస్టీ తేజ మరోవైపు నుండి లేచి డిస్టబ్ చేశారు. అది కాస్త అనవరమనిపించింది. దీనిపై వీకెండ్ లో నాగార్జున ఫైర్ అయ్యే అవకాశం ఉంది.  

‘వేరే లెవెల్ ఆఫీస్’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది "వేరే లెవెల్ ఆఫీస్" వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సిరీస్ ట్రైలర్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అఖిల్ సార్థక్, నటి శుభశ్రీ, నటుడు మిర్చి కిరణ్, నటి స్వాతి చౌదరి, నటి వసంతిక, నటుడు మహేశ్ విట్టా, నటుడు అఖిల్ వివాన్, నటి రీతు చౌదరి, డైరెక్టర్ ఇ సత్తిబాబు, డైరెక్టర్ ఇ సత్తిబాబు, స్క్రిప్ట్ రైటర్ ఎన్ షణ్ముక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కృపాచంద్ మాట్లాడుతూ - వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ నిర్మించేందుకు ఆహా నుంచి మాకు కావాల్సినంత సపోర్ట్ లభించింది. సత్తి బాబు గారి లాంటి అనుభవం ఉన్న డైరెక్టర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి టీమ్ సపోర్ట్ తో వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ ను అనుకున్నట్లు నిర్మించగలిగాం. డిసెంబర్ 12 నుంచి ఆహాలో మా సిరీస్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు. ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ - ఆహాలో ఎన్నో జానర్స్ వెబ్ సిరీస్ లు,  షోస్ చేస్తున్నాం. ఒక ఆఫీస్ సిట్ కామెడీ సిరీస్ చేయాలని భావించాం. ఈ కాన్సెప్ట్ యూనిక్ గా ఉంటుందని అనిపించింది. అలా వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ కు ప్లానింగ్ మొదలైంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది. తమిళంలో సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ను మన తెలుగు ఆడియెన్స్ కు మరింత రీచ్ అయ్యేలా తీసుకొస్తున్నాం. ప్యాషనేట్ అండ్ టాలెంటెడ్ టీమ్ తో ఈ సిరీస్ సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు ఆహా తీసుకొస్తోంది. అన్నారు.

గౌతమ్, ప్రేరణల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

  బిగ్‌బాస్ ఈవారం నామినేషన్స్‌ ప్రక్రియని నబీల్ మొదలుపెట్టాడు. హౌస్‌లో ఎవరినైతే ఫినాలేకి చూడకూడదని భావిస్తారో ఆ ఇద్దరినీ నామినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక నబీల్ ముందుగా గౌతమ్‌ని నామినేట్ చేశాడు. ఆదివారం ఎపిసోడ్‌లో తన గురించి గౌతమ్ రాసిన కంప్లెయింట్ నచ్చలేదని నబీల్ అన్నాడు. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మేము టార్గెట్ చేశామని నువ్వు అనడం కరెక్ట్ అనిపించలేదు అంటూ నబీల్ అన్నాడు. ఇక దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటూ నబీల్ మధ్యలో మాట్లాడి వాదిస్తూనే ఉన్నాడు. ఇక చివరకి గౌతమ్ మాట్లాడి వేస్ట్ అన్నట్లు వెళ్లి మీద రంగు పోయించుకున్నాడు. ఇక నెక్ట్స్ తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు నబీల్. ఒక మనిషి మీద పెట్టే కాన్సట్రేషన్ గేమ్‌పై పెడితే బావుంటుంది.. నువ్వు ఇప్పటివరకూ ఒక్క టాస్కు కూడా గెలవలేదు అంటూ నబీల్ అన్నాడు. దీనికి విష్ణు ఏదో సోది చెప్పింది.  ఇక ప్రేరణ.. మొదటిగా విష్ణుప్రియను నామినేట్ చేసింది. సేమ్ నబీల్ చెప్పిన పాయింట్‌నే ఇంచుమించుగా ప్రేరణ రిపీట్ చేసింది. నీకు గేమ్‌ ఆడాలనే ఇంట్రెస్ట్ లేదు.. కసి లేదు అంటూ చెప్పింది. దీనికి విష్ణు ఒప్పుకోలేదు. తర్వాత తన సెకండ్ నామినేషన్ గౌతమ్‌కి వేసింది ప్రేరణ. నువ్వు కావాలని గ్రూప్ గేమ్ ఆడకపోయినా ఎక్స్‌పోజ్ చేయాలని ట్రై చేస్తున్నావ్.. మాట్లాడుతుంటే కెమెరాల వైపు చూసి చెప్తావ్. నీ దృష్టి ఎక్కువగా ఆడియన్స్‌లో మమ్మల్ని ఎలా బ్యాడ్ చేయాలనే దాని గురించే ఉంది అంటూ ప్రేరణ తన పాయింట్లు చెప్పింది. ఇక వీటిపై గౌతమ్-ప్రేరణ మధ్య చాలాసేపు గొడవ జరిగింది. మెగా చీఫ్ రోహిణి మినహా హౌస్ మొత్తం నామినేట్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా విష్ణుప్రియకి ఐదు ఓట్లు పడ్డాయి. ఇక గౌతమ్‌కి యష్మీ వేసిన బిగ్ బాంబ్‌తో కలిపి నాలుగు ఓట్లు పడ్డాయి. నిజానికి ఈ వారం నబీల్ నామినేషన్స్‌లోకి వస్తాడని చివరి నిమిషమే తెలిసింది. ఎందుకంటే అప్పటివరకూ నబీల్‌ని ఎవరూ నామినేట్ చేయలేదు. కానీ చివరిలో రోహిణి తనకి అవకాశం వచ్చినప్పుడు నబీ‌ల్ ని నామినేట్ చేసింది. 

ఆ ఆదిరెడ్డి గాడిని కాలబెట్టాల్రా.‌. నబీల్ ఫ్యాన్స్ సైకోయిజం!

  బిగ్ బాస్ సీజన్-8 పన్నెండు వారాల నుండి రసవత్తరంగా సాగుతుంది. ఆయితే లోపల కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ఎలా ఉన్నా వారి ఆటతీరుని చెప్పే రివ్యూయర్స్  చాలామందే ఉన్నారు. వారిలో ఆదిరెడ్డి ఒకడు. తన రివ్యూస్‌తో పాపులర్ అయిన సీజన్-6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి. ఈ మధ్య అతనికి వరుస బెదిరింపులు వస్తున్నాయంట. నబీల్ ఆఫ్రిది ఫ్యాన్స్ అయితే ఆదిరెడ్డిని తగలబెట్టేస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. నిజానికి అసలు నబీల్‌ని జెన్యూన్ పర్సన్ అంటు ఆదిరెడ్డి చెప్పాడు. గత వారం రోజులుగా నబీల్‌లో జెన్యునిటీ పక్కకిపోయి.. కుళ్ళు కుతంత్రాలు బయటకొచ్చాయి. దీంతో ఆదిరెడ్డి అతని తప్పుల్ని ఎత్తి చూపుతూ రివ్యూలు చేయడంతో.. నబీల్ అఫ్రిది ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. అయితే అయ్యారులే.. ఇలాంటి హర్టింగ్‌లు బిగ్ బాస్ రివ్యూస్ వల్ల కామనే కానీ.. మరీ ఇలా చంపేస్తాం.. తగలబెట్టేస్తాం లాంటి హెచ్చరికలు ఉన్మాదం కిందకే వస్తాయి. మెహబూబ్ హౌస్‌లో ఉన్నప్పుడు.. మైనారిటీ ఓట్లు గురించి నోరు జారాడు. మనకి ముస్లిం ఓట్లు పడతాయనే ఉద్దేశంలో మాట్లాడటంతో అది వివాదం అయ్యింది. దాన్ని కూడా తప్పు పడుతూ ఆదిరెడ్డి రివ్యూ చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న షఫీ అనే నబీల్ ఫ్యాన్.. బిగ్ బాస్ సీజన్-8 అవ్వగానే.. ఆ ఆదిరెడ్డి గాడ్ని కాలబెట్టాల్రా అంటూ కామెంట్ పెట్టాడు. దీన్ని బట్టి అతనిలో ఎంత పైశాచికత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్లకి ఇలాంటి బెదిరింపులు.. హెచ్చరికలు కామనే. ముఖ్యంగా ఆదిరెడ్డికి అయితే మరీ ఎక్కువ. ఎందుకంటే.. అతని రివ్యూలకు ఎక్కువ వ్యూవర్ షిప్ ఉండటంతో.. అతని వల్ల కూడా ఓట్లు ప్రభావితం అవుతాయని ఉద్దేశంలో అతను ఎవర్ని పొగిడినా తిట్టినా వివాదాస్పదం అవుతుంటాయి. గతవారం జరిగిన మెగా ఛీఫ్ టాస్క్ లో పృథ్వీకి సపోర్ట్ చేసిన నబీల్.. రోహిణి గెలవడాన్ని తీసుకోలేకపోయాడు. గేమ్ లో రోహిణి కుండని కిందపడేయానికి ఇసుకని ఫోర్స్ గా పోశాడు. తను కాలు సరిగ్గా పెట్టలేదంటూ పృథ్వీతో చెప్పుకొచ్చాడు నబీల్. గౌతమ్ ని కన్నడ బ్యాచ్ టార్గెట్ చేస్తూ నామినేషన్లు చేయడం వారికి సపోర్ట్ గా నబీల్ ఉండటంతో అతని గేమ్ కిందకి పడిపోతుంది. దాంతో గౌతమ్ ఒక్కసారిగా విన్నర్ రేసులోకి వచ్చాడు.  అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆదిరెడ్డిని నబీల్ ఫ్యాన్స్ ఇలా తిట్టడం చాలా దారుణమంటూ కొందరు విమర్శిస్తున్నారు. 

మహేష్ బాబు 1 నేనొక్కడినే మూవీకి ట్రాక్ చెప్పా..నన్నంతా రౌడీ అనుకునేవాళ్లు

  బర్దస్త్ లో బులెట్ భాస్కర్ టీమ్ అంటే చాలు ఆడియన్స్ పడీపడీ నవ్వుతారు. ఎందుకంటే ఆ టీమ్ లో పటాస్ ఫైమా, నాటీ నరేష్ ఉంటారు. వీళ్ళ టీమ్ చేసే స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ అవ్వొచ్చు. అందుకే జడ్జ్ ఖుష్బూకి కూడా వీళ్ళ టీమ్ మీద స్పెషల్ ఇంటరెస్ట్ ఉంటుంది. ఇక ఒక చిట్ చాట్ సందర్భంగా బులెట్ భాస్కర్ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇలా చెప్పుకొచ్చాడు."కాలేజీ చదివేటప్పుడు నా పర్సనాలిటీని చూసి అందరూ రౌడీని అనుకునేవాళ్లు కానీ అలా ఉండేవాడిని కాదు. ఇంద్రజ గారు, ఖుష్బూ గారు ఇద్దరూ పెద్ద లెజెండ్స్.. ఇద్దరిలో కూల్ ఎవరు, హాట్ ఎవరు అని చెప్పమంటే చాలా కష్టం.  ఇంద్రజ గారు హాట్, ఖుష్బూ గారు కూల్ ఎప్పుడు ఇలా ఉంటారంటే సెట్ బాయ్స్ ఎవరైనా అరిచినప్పుడు...మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే మూవీకి ఒక వారం రోజుల పాటు ట్రాక్ చెప్పాను. మూవీస్ లోకి ఇంకా వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే జబర్దస్త్ లో మిగతా ఈవెంట్స్ లో ఫుల్ బిజీ టీమ్ మాది. ముందు డబ్బులు సంపాదించి పక్కన పెట్టుకున్నాక అప్పుడు సినిమాల్లోకి వెళదామని ఆగా. నాకు హైదరాబాద్ అంటేనే భయం. వైజాగ్ లో మంచి శాలరీతో జాబ్ చేసుకునేవాడిని. ఎక్కువగా జీతం ఇస్తామని చెప్పినా హైదరాబాద్ వెళ్ళలేదు. కానీ దేవుడు ఇదంతా చేసాడు. హైదరాబాద్ కి తీసుకొచ్చాడు. దాంతో టీవీలోకి వచ్చాము..రేపు సినిమాల్లోకి వెళ్తాం.. అంతా ఆ దేవుడి మాయ. " అంటూ చెప్పుకొచ్చాడు బులెట్ భాస్కర్.. బులెట్ భాస్కర్ తానూ చేసే ప్రతీ ఈవెంట్ లో ఎవరు ఉన్నా లేకపోయినా నాటీ నరేష్ ఉండాల్సిందే. వీళ్ళ ఫ్రెండ్ షిప్ అలాంటిది.

బ్రహ్మముడి మానస్ కొడుకు పేరేంటో తెలుసా ?

బ్రహ్మముడి సీరియల్ రాజ్ అలియాస్ మానస్ నాగులపల్లి సెప్టెంబర్ 10 న ఒక మగబిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. రీసెంట్ గా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు మానస్ అండ్ శ్రీజ. ధ్రువ నాగుల పల్లి అనే పేరు పెట్టి ఆ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు మానస్. అలాగే నామకరణ మహోత్సవం ఫొటోస్ ని కూడా ఫాన్స్ కోసం పోస్ట్ చేసాడు. దీంతో వెండితెర, బుల్లితెర పాపులర్ పర్సన్స్, ఫాన్స్, నెటిజన్లు  శుభాకాంక్షలు చెబుతూ మెసేజెస్ పెడుతున్నారు. ఇక మానస్ ఐతే బిడ్డను చూసుకుంటూ తెగ బ్లష్ ఐపోతూ కనిపించాడు. లాస్ట్ ఇయర్  నవంబర్ లో మానస్, శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. ఇక మానస్ చైల్డ్  ఆర్టిస్టుగా స్క్రీన్ మీద అడుగుపెట్టాడు. ఇప్పుడు బ్రహ్మముడి రాజ్ గా సీరియల్ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. కార్తీక దీపం సీరియల్ కి  ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిన విషయమే.. ఆ సీరియల్ ఐపోయాక ఆ టైం స్లాట్ లో వస్తున్న ఈ బ్రహ్మముడి సీరియల్  కూడా అంతే టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక మానస్  ‘కోయిలమ్మ’, ‘మనసిచ్చి చూడు’ వంటి సీరియల్స్‌తో బెస్ట్ పెర్ఫార్మర్ గా మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. అదే స్పీడ్ తో  తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లి  గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాడు. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించాడు.

Illu illalu pillalu : వేరే అతన్ని పెళ్ళి చేసుకున్న ప్రేమించిన అమ్మాయి.. అతను ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -12 లో.. నర్మద సాగర్ కి ఫోన్ చేస్తుంది. రామరాజు లిఫ్ట్ చేయబోతుంటే.. అప్పుడే సాగర్ నేను మాట్లాడుతానంటు ఫోన్ తీసుకొనిమ. అన్న అంటూ మేనేజ్ చేస్తూ మాట్లాడతాడు. గంటలో నువ్వు ఇక్కడ ఉండాలని నర్మద అనగానే బిజీ ఉన్నానని రానని చెప్తాడు. మరొకవైపు ధీరజ్ తన మామ సరదాగా బయట తిరుగుతుంటే. అదే సమయంలో ప్రేమ ప్రేమించిన కళ్యాణ్ ఫుల్ గా తాగి పడిపోయి ఉంటాడు. మామ ఒక్కసారి వాడిని చూడు ఒకవేళ వాడికి మీ అన్న కూతురు ప్రేమని ఇచ్చి పెళ్లి చెయ్యమంటే.. ఏం చేస్తావని అంటాడు. అలా ఎందుకు అంటున్నావని అతను అనగానే.. మీ అన్న కూతురు ప్రేమ ప్రేమించింది వీడినే.. వద్దని చెప్పినా వినలేదని ధీరజ్ తన మామకి చెప్తాడు. మరొకవైపు సాగర్ కి నర్మద ఫోన్ చేస్తోంటే.. లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత నర్మదని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. దాంతో నర్మద నాన్న నర్మదకి ఫోన్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చెయ్యదు. ఇక ఆ తర్వాత నర్మదనే డైరెక్ట్ మిల్ దగ్గరికి వస్తుంది. తనని చూసి సాగర్ టెన్షన్ పడతాడు. ఎవరు కావాలని రామరాజు అడుగుతాడు. అతనంటు సాగర్ వంక చూపిస్తుంది. సాగర్ వచ్చి అదే రైస్ కావాలన్నారు కదా అంటూ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత సరే ఇచ్చి పంపించమని రామరాజు అంటాడు. ఎవరు రానట్టు ఉన్నారు. నువ్వే వెళ్లి వేసి రా అని రామరాజు చెప్తాడు. ఎవరి కూతురని రామరాజు అడుగగా.. ప్రసాద్ రావు గారి కూతురు.. అనగానే ఆయన నాకు తెలుసంటూ రామరాజు మాట్లాడుతాడు. ఇక ఆ తర్వాత సాగర్, నర్మద ఇద్దరు రైస్ బ్యాగ్ తీసుకొని ఆటోలో వెళ్తుంటారు. నర్మద సైలెంట్ గా ఉంటుంది. దాంతో ఇద్దరు ఆటో దిగి మాట్లాడుకుంటారు. నీకు చెప్పేది అర్ధం అవ్వడం లేదా ఇంట్లో పెళ్లి చూపులు అరెంజ్ చేశారని.. ఎలాగైనా మనం పెళ్లి చేసుకోవాలి.. మీ నాన్నతో మాట్లాడమని సాగర్ కి నర్మద చెప్తుంది. తరువాయి భాగంలో సుభద్ర చందుని కాకుండా వేరే ఒకతన్ని పెళ్లి చేసుకుంటుంది. అది చూసి ధీరజ్ ని హగ్ చేసుకొని ఏడుస్తాడు చందు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : బోర్డ్ మీటింగ్ కి పిలిచిన శివన్నారాయణ‌... సీక్రెట్ ప్లాన్ ని కార్తీక్ కనిపెట్టగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -211 లో.....దాస్ కుబీర్ గురించి ఆలోచస్తుంటే.. కాశీ వచ్చి చేతిలో ఉందేంటని అడుగుతాడు.ఏం లేదంటూ వెళ్ళిపోతాడు. మా నాన్న ఎవరినో వెతుకున్నాడని స్వప్నతో కాశీ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ‌ దగ్గరికి సుమిత్ర వచ్చి.. కార్తీక్ పెళ్లి చేసుకున్న నుండి అసలు జ్యోత్స్న నిద్ర పోయింది లేదు. ఎప్పుడు చూసిన గదిలో లైట్ వేసి ఉంటుంది. దీనికి మీరే పరిష్కారం చూపాలి.. త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించాలని సుమిత్ర అనగానే.. నేను తన గురించే ఆలోచిస్తున్నాను.. రేపు నిర్ణయం తీసుకుంటానంటూ శివన్నారాయణ‌ దశరథ్ ని పిలుస్తాడు. రేపు బోర్డు మీటింగ్ అరెంజ్ చెయ్ అందరికి మెసేజ్ పెట్టమని చెప్తాడు. మరొక వైపు కార్తీక్, దీప ఇద్దరు కలిసి భోజనం చెయ్యాలని అనసూయ, కాంచన ఇద్దరు ప్లాన్ చేస్తారు. ‌అందుకే ముందే భోజనం చేసి శౌర్యని పక్కకి తీసుకొని వెళ్లి భోజనం తినిపిస్తారు. కార్తీక్ ఒక్కడే భోజనం చేస్తూ బర్త్ డే రోజు కూడా ఒక్కడినే భోజనం చేస్తున్నానని కార్తీక్ ఫీల్ అవుతుంటే.. దీప పక్కన కూర్చొని భోజనం చేస్తుంది. దాంతో ప్లాన్ సక్సెస్ అంటూ అనసూయ, కాంచన ఇద్దరు అనుకుంటారు. దీపకి కార్తీక్ భోజనం వడ్డీస్తుంటే.. ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటారు. ఆ తర్వాత శౌర్యతో కార్తీక్ ని కార్తీక్ అని పిలువు.. నాన్న అని వద్దు అని కాంచన అంటుంది. మీ అమ్మ పిలవమని చెప్పేవరకు పిలవకు అని కాంచన, అనసూయ ఇద్దరు ప్లాన్ చెప్తారు. దానికి శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత మావయ్య మీటింగ్ అని మెసేజ్ చేశాడని కాంచనకి కార్తీక్ చెప్తాడు.  నేను సొంతంగా బిజినెస్ చేస్తాను. రేపు సిచువేషన్ బట్టి డిసైడ్ అవుతానని కార్తీక్ అనగానే.. వద్దు బాబు మీ తాతయ్య గారితో చెయ్యండి అని దీప అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి.. కార్తీక్ రేపు స్కూల్ కి నన్ను తీసుకొని వెళ్తావా అని అనగానే.. అడుగుతుంది శౌర్య.. కార్తీక్ అంటుంది. అమ్మ, అనసూయ గారు అక్క, చెల్లి అనుకుంటున్నారు. వీళ్ళేదో సీక్రెట్ మిషన్ చేస్తున్నారు. సైలెంట్ గా అబ్సర్వ్ చెయ్యడం బెస్ట్ అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అత్త ప్లాన్ ఫెయిల్.. ఆస్తి కోసం రామలక్ష్మిని చంపెయ్యాలనుకున్న సందీప్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -262 లో.....మీరు పనులు తప్పించుకోవాలని డాక్టర్ కి డబ్బులిచ్చి మీకు నచ్చినట్టు చెప్పామన్నారు.. అదే డాక్టర్ కి నేను చెక్ ఇచ్చి నాకు నచ్చినట్టు చెప్పమన్నానని రామలక్ష్మి అనగానే.. శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. దెబ్బ అదుర్స్ కదూ అని రామలక్ష్మి వాళ్ళకి కౌంటర్ వేస్తుంది. మరొకవైపు సీతాకాంత్ ఆఫీస్ లో డల్ గా ఉంటాడు. అప్పుడే నందిని వచ్చి ఏమైందంటు అడుగుతుంది. సీతాకాంత్ ఏదో చెప్పబోతు ఆగిపోతాడు. దాంతో ఏంటి సీతా  ఆ రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా.. అసలు ఆ రామలక్ష్మి ఆస్తి కోసమే ఇదంతా చేస్తుంది. మీ వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంది. నాకు అయితే ఆంటి వాళ్ళని తీసుకొని వచ్చి.. మా ఇంట్లో మహారాణిలా చూసుకోవాలని ఉంది.. ఇప్పకటికైనా అర్థమైందా ఎవరు ఎలాంటి వారోనని రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతుంది నందిని. దాంతో తనపై సీతాకాంత్ గట్టిగా అరుస్తాడు. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడడానికి వీలు లేదు. ఏదైనా మేం ఇద్దరం చూసుకుంటాం. నీకు అనవసరమంటూ సీతాకాంత్ అనగానే.. నీ మూడ్ ఏం బాలేనట్టు ఉందని చెప్పి తను వెళ్ళిపోతుంది. వర్క్ చెయ్యాలని అనిపించడం లేదు సీతాకాంత్ అలా కాసేపు తిరిగి వద్దామని బయటకు వెళ్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. సీతాకాంత్ వెళ్లడం చూసి తను కూడా తన వెంట నడుస్తుంది. మరొకవైపు రామలక్ష్మి మనల్ని ఇలా ఆడుకుంటుందని శ్రీలత వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడే నందిని ఫోన్ చేస్తుంది. ఇంత జరిగిన కూడా రామలక్ష్మిని సీతాకాంత్  ఏం అనట్లేదని నందిని అంటుంది. ఇక రామలక్ష్మిని చంపెయ్యాలని సందీప్ అనగానే ఆ మన అలా అయితే ఆస్తులు కూడా పోతాయ్.. ఏం చెయ్యాలో నాకు తెలుసంటూ రామలక్ష్మికి తెలియకుండా సీతాకి తను పంపినట్లు విడాకులు నోటిస్ పంపాలని నందినికి శ్రీలత చెప్తుంది. మరొకవైపు సీతాకాంత్ వెనకాలే రామలక్ష్మి వస్తుంటే.. రామలక్ష్మిని కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తుంటారు. సీతాకాంత్ వాళ్ళని కొట్టి  రామలక్ష్మిని తన పక్కన నడవమంటాడు. ఆటో పిలిచి ఆటోలో తనని పంపిస్తాడు. మరొకవైపు సీతాకాంత్ ఇంటికి వచ్చేసరికి శ్రీలత, శ్రీవల్లి తన ప్లాన్ ని అమలు చెయ్యడానికి ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆమె ప్లాన్ సక్సెస్.. ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చిన రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -576 లో... మా అమ్మని పంపించండని కనకంతో రాజ్ అనగానే.. ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమను కనకం అంటూ అపర్ణ అంటుంది. అది రాజ్ వింటాడు. నీ భార్యని వదిలేసినట్లు.. నా భార్యని వదిలేయ్యలేను నా భార్యని తీసుకొని రా అని రాజ్ తో సుభాష్ అంటాడు.  అలాగే మిగతా వాళ్లు కూడా రాజ్ తో అపర్ణని తీసుకొని రా అని అనగానే.. సరే అంటు రాజ్ కోపంగా వెళ్తాడు. ఆ తర్వాత అపర్ణకి ఇందిరాదేవి ఫోన్ చేసి.. నీ ప్లాన్ సక్సెస్.. వాడు కోపంగా బయల్దేరాడని చెప్తుంది. ఇక మన నాటకం మొదలు పెడదామని కనకంకి అపర్ణ చెప్తుంది. ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయో అన్ని తీసుకొని రా అని అపర్ణ అనగానే.. మీకెందుకు శ్రమ అని కనకం అంటుంది. ఇది మన ప్లాన్ లో భాగమేనని అపర్ణ అంటుంది. మరొకవైపు రాజ్ ఎక్కడ కావ్యని తీసుకొని వస్తాడోనని రాహుల్, రుద్రాణి ఇద్దరు టెన్షన్ పడతారు. కాసేపటికి కనకం ఇంటికి వస్తాడు రాజ్. ఎదురుగా కావ్య వస్తుంది. మా అమ్మ మీరు చెప్పినట్టు వినేలా చేసుకున్నారంటూ కావ్యపై రాజ్ విరుచుకుపడతాడు. నేనేం అత్తయ్యని రమ్మనలేదు.. మీరు అత్తయ్య వస్తే తీసుకొని వెళ్ళండి కానీ నన్ను మాత్రం ఏం అనకండని రాజ్ తో కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. రాజ్ వెళ్లేసరికి అపర్ణ కూరగాయలు కోస్తూ ఉంటుంది. కనకం పైన కూర్చొని అపర్ణకి పనులు చెప్తుంది. ఏంటి అమ్మ ఇలా అయ్యావ్ పదా మన ఇంటికి అని రాజ్ అనగానే.. నా కోడలు వస్తేనే వస్తానని అపర్ణ తెగేసి చెప్తుంది. దాంతో ఎలా రావో చూస్తానని రాజ్ కోపంగా వెళ్తాడు. మీరు యాక్టింగ్ చెయ్యమన్నారని చేసాను అంతే కానీ నాకు ఇష్టం లేదని కనకం అంటుంది. రాజ్ ఇంటికి వెళ్తాడు. అమ్మ రానని చెప్పిందని ఇంట్లో వాళ్లకు చెప్తాడు. తరువాయి భాగంలో ఇందిరాదేవి వంట చేస్తుంటే చెయ్ కాలుతుంది. దాంతో కావ్యకి రాజ్ ఫోన్ చేసి మా మమ్మీనీ పంపించమని అంటాడు. దాంతో అపర్ణ ఫోన్ లాక్కొని.. ఏంటి రా తనని దబాయిస్తున్నావంటూ రాజ్ పై అపర్ణ అరుస్తుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

టాస్క్ లు ఆడించాడనికి హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్.. బిగ్ ట్విస్ట్!

  బిగ్ బాస్ సీజన్-8 మొదట్లోనే ఈ సారి ఎంటర్‌టైన్మెంట్ ఇన్ఫినిటీ అన్నారు‌. ఇక  దానికి తగ్గట్టుగానే ఈ సీజన్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంది. అయితే ఇంకా మూడు వారాలే ఉండడంతో ఈ వారం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరగబోతుంది. ఈ టికెట్ ఒక్కరికే ఉంటుంది. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది ఉండగ.. టాప్-5 మాత్రమే ఫైనల్ లో ఉంటారు. ఈ టికెట్ టు ఫినాలే టికెట్ పొందిన వారు డైరెక్ట్ ఫినాలే వీక్ లో ఉంటారు. అన్ని సీజన్లలో కంటే డిఫరెంట్ థీమ్ తో ఈ 'టికెట్ టు ఫినాలే' జరగాలని బిగ్ బాస్ భావిస్తున్నాడంట. ఇందుకోసం టాస్క్ లు ఆడించడానికి బయటనుండి మాజీ హౌస్ మేట్స్ వచ్చి టాస్క్ లు ఆడిస్తారంట. అందులో భాగంగనే  బిగ్ బాస్ సీజన్-4 కంటెస్టెంట్స్ అయిన అఖిల్ సార్థక్, అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక ఇద్దరు మంగళవారం రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది. అయితే ఇలా ఒక్కో టాస్క్ కి ఇద్దరు మాజీ హౌస్ మేట్స్ రాబోతున్నారు. ఇలా వారంతం ఈ టాస్క్ జరుగుతుంది. ఇలా ఓల్డ్ కంటెస్టెంట్స్ కి కూడా బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్స్ కల్పిస్తున్నాడు బిగ్ బాస్. గతవారం ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి హౌస్ మేట్స్ ని నామినేషన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి ఫినాలే వీక్ ఆడించడానికి బిగ్ బాస్ మామ గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం జరిగే టికెట్ టు ఫినాలే టాస్క్ లలో గెలిచే ఫైనల్ కి వెళ్ళేదెవరో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.  

ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మముడి కావ్య!

  ఒక షోలో గానీ ఏదైనా సీరియల్ లో గానీ తమ నటనకి ఇంప్రెస్ అయితే బాగుందని నెటిజన్లు చెప్తారు. అదే బాలేదంటే ట్రోల్స్ చేస్తారు. అది బయట కామన్. కానీ అదే రిపీటెడ్ గా  జరిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి‌. ఇప్పుడు అదే విషయం తెలియజేస్తూ బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అసలు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసిందో ఓసారి చూసేద్దాం.. ప్లీజ్ డోంట్ మేక్ ఎనీథింగ్ సీరియస్(ఇన్ స్టా పోస్ట్ అండ్ కామెంట్స్). మేము ప్రతీ షోలో మా తోటి ఆర్టిస్ట్ లతో సరదగా ఉంటాం.. అందరం ఎంజాయ్ చేస్తాం.. మేం షోలో ఎంటర్‌టైన్మెంట్ కోసమే ఒకరినొకరం కామెంట్ చేసుకుంటాం.. కానీ మీరు దానిని నెగెటివ్ తీసుకోకండి.. నెగెటివ్ కామెంట్లు చేయకండి. మేము మీకు వినోదం పంచడం కోసమే ఇలా ఫన్ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ లు చేస్తాం.. అలా సరదాగా మాటలు మాట్లాడతామని దీపిక అంది. మీరు నిజంగా మా ఫ్యాన్స్ అయితే.. ప్లీజ్ ఎవరిని తక్కువగా చూడకండి(Please Don't Disrespect) అంటు దీపిక రాసుకొచ్చింది. మేమేదో సరదగా అలా మాట్లాడేవాటిని సీరియస్ చేయకండి. మీరు ఫ్యాన్స్ అయితే నా తోటి సీరియల్ ఆర్టిస్ట్ లని గౌరవించండి అంతే కానీ ఇలా ఫ్యాన్ పేజీలు పెట్టి వేరే వాళ్లని తిట్టకండి. సీరియల్ నటీనటులని తక్కువగా చూస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి పోస్ట్ లు చేయకండి అంటు కావ్య అలియాస్ దీపిక రంగరాజు పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  

డబుల్ ఎలిమినేషన్ కన్ఫమ్.. హౌస్ నుండి వెళ్ళేది వాళ్ళేనా!

  బిగ్ బాస్ సీజన్-8 లో మొట్టమొదటగా హౌస్ లోకి పద్నాలుగు మంది ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అయిదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ ద్వారా ఏనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు. ఫినాలే కి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. ఫినాలే వీక్ లో టాప్-5 లేదా టాప్-6 మాత్రమే ఉంటారు.  అయితే లెక్క ప్రకారం ఈ టూ వీక్స్ లో హౌస్ లో నుండి నలుగురు బయటకు రావాలి. ఈ వారం ఇద్దరు, తర్వాతి వారం ఇద్దరిని బయటకు పంపించాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వారం హౌస్ మేట్స్ ఒపీనియన్ తో ఒకరిని మిడ్ వీక్ లోనే బయటకు పంపించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే శనివారం నాటి ఎపిసోడ్ లో ఒకరిని, ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఒకరిని పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు హౌస్ లో ఉన్నవాళ్లంతా దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. ఇన్ని రోజులు హౌస్ లో నెట్టుకొచ్చారంటే తమ పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు ఓట్లు వేసి గెలిపించారనే అర్థం. ప్రతీ కంటెస్టెంట్ తమకంటు కొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు యష్మీ బయటకు వచ్చింది కాబట్టి తన ఓట్లు అన్నీ కూడా నిఖిల్, పృథ్వీ, ప్రేరణలకి పడతాయి. ఈ వారం నామినేషన్ లో రోహిణి, నబీల్ తప్ప అందరు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మిగతా  ఏడుగురిలో.. ప్రేరణ, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణు, పృథ్వి నిఖిల్ నామినేషన్ లో ఉన్నట్లే. ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయితే తేజ, పృథ్వీలు హౌస్ లో నుండి బయటకు వస్తారు.  సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ బయటకు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.   

హీటెడ్ ఆర్గుమెంట్స్ తో బిగ్ బాస్ ప్రోమో.. నామినేషన్లో ఎవరున్నారంటే!

  బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్లుగా బిగ్ బాస్ సీజన్-8 (Biggboss 8 Telugu)సాగుతుంది. పన్నెండో వారం యష్మీ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.. ఇక పదమూడో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే మరో వారం చూడాల్సిందే. తాజాగా బిగ్ బాస్ ప్రోమో వదిలాడు.  పదమూడవ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగిందని ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇంకా  ఫినాలేకి మూడు వారాలు మాత్రమే ఉండడంతో ఈ వారం ఎవరిని నామినేట్ చేస్తారనేది కీలకంగా మారింది. నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. ఎవరైతే నామినేట్ చేస్తారో వారికి రంగు పడుతుంది. మొదటగా గౌతమ్ ని నబీల్ నామినేషన్ చేశాడు. లాస్ట్ వీక్ లో కంటెండర్ షిప్ అప్పుడు వీళ్ళందరూ గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు.. వైల్డ్ కార్డు అందరిని పంపించాలనుకున్నారని అన్నావ్ ఆ పాయింట్ నాకు నచ్చలేదని చెప్పి గౌతమ్ ని నామినేట్ చేశాడు నబీల్. ఇక ఇద్దరి మధ్య హెటెడ్ అర్గుమెంట్స్ జరిగాయని తెలుస్తోంది. ఆ తర్వాత అవినాష్ ని పృథ్వీ నామినేట్ చేస్తూ.. విష్ణు, మరో అమ్మాయి గొడవ పడుతుంటే మీరు మధ్యలో నాకెందుకని వచ్చారు.. అది కరెక్ట్ కాదని పృథ్వీ అనగానే అది వాళ్ళ పర్సనల్ విషయం. అలా పర్సనల్ విషయాల్లో నేను కలుగుజేసుకోనని అవినాష్ అన్నాడు. ఇక ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. నువ్వు ఎలిమినేట్ అయితే నబీల్ ఏవిక్షన్ షీల్డ్ యూజ్ చేసాడని పృథ్వీ అనగానే.. నేనేం యూజ్ చెయ్యమని అనలేదని అవినాష్ అన్నాడు. ఇక వీరి మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయని తెలుస్తోంది. ఇక పదమూడో వారం నబీల్, రోహిణి ఇద్దరు తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారని ప్రోమోని బట్టి తెలుస్తోంది.

ఈఎంఐల కోసమే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు

  బుల్లితెర మీద జబర్దస్త్ ఎంతలా ఫేమస్ అయ్యిందో అందులో కమెడియన్స్ గా చేసే బులెట్ భాస్కర్ అండ్ నాటీ నరేష్ అంతకన్నా ఫేమస్. ఈ జోడిలో ఒక్కరు లేకపోయినా ఏదో వెలితిగానే ఉంటుంది. అలాంటి కమెడియన్స్ లో పొట్టివాడు కాదు గట్టివాడు అనిపించుకుని గర్వంగా తన టీమ్ ని తలెత్తుకునేలా చేసిన నాటీ నరేష్ ఒక చిట్ చాట్ లో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. "అందరూ నన్ను ఈఎంఐల కట్టుకోవడం కోసమే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు అనుకుంటున్నారు. కానీ చెప్పాలంటే ముందుగా నన్ను ఎవరూ చూడడం లేదు. నన్ను అందరూ ఎత్తుకుంటారు తర్వాత ఎవరూ చూడరు. అమ్మాయిలతో మాట్లాడ్డం అంటే నాకు సిగ్గు. ఒక వేళా నేను పెళ్లిచూపులకు వెళ్లినా, పెళ్లి చేసుకున్నా కూడా ముఖ్యంగా నాతో పాటు  బులెట్ భాస్కర్ కి మాత్రం చెప్పను, తీసుకెళ్లను. ఎందుకంటే ఇలాంటోడికి పిల్లనిస్తారా అని అడిగి మరీ నా పెళ్లి చెడగొడతాడు. నాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి ముందు జబర్దస్త్ కె ఫస్ట్ ప్రిఫెరెన్సు ఇస్తాను. జబర్దస్త్ మంచి గుర్తింపు ఇస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫైనాన్సియల్ గా బలాన్ని ఇస్తుంది. టీవీ షోస్ తో ఈవెంట్స్ తో చాలా బిజీగా ఉంటాను అందుకే మూవీస్ లోకి ఎక్కువగా రావాలని అనుకోవడం లేదు. ఐతే నాకు నటన అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. ఎందుకంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్సర్ అవడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఢీ జూనియర్స్ లో చేద్దామనుకున్నా వాళ్ళు నన్ను గ్రూప్ డాన్సర్స్ లో పెట్టేసారు. తర్వాత బులెట్ భాస్కర్ నాకు యాక్టింగ్ నేర్పిస్తా అన్నాడు. నాకు ఇష్టం లేదు అని చెప్పా. అలా డాన్సర్ ని అవడానికి ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్ ని అయ్యాను." అంటూ చెప్పుకొచ్చాడు.    

అతనికి జాబ్ లేకపోయినా నేను పెళ్లి చేసుకుంటా

  అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ తో అందరికీ బాగా దగ్గరయింది అనన్య శర్మ. ఈ సిరీస్ లో ఆమె నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాంటి అనన్య శర్మ ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది. తనకు  సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం అస్సలు  ఇష్టం  లేదు  అని  చెప్పింది. ఎక్కువగా ప్రైవేట్ లైఫ్ గడపడం ఇష్టం అని అంది. తాను పెద్ద ఫోన్ పర్సన్ కాదు అని ఎక్కువగా ఎవరికీ రిప్లై ఇవ్వనని అందుకే తనను అంతా ఆటిట్యూడ్ పర్సన్ అని అందరూ అనుకుంటూ ఉంటారట. అలాగే మొదట్లో తాను ఇండస్ట్రీలోకి రావడాన్ని ఎవరూ ఇష్టపడలేదని చెప్పింది. ఐతే తన పెళ్లి విషయం వచ్చేసరికి మంచి  మనసున్న, నిజాయితీ ఉన్న అబ్బాయి వస్తే చేసుకుంటాను అని ఒక వేళా అతనికి జాబ్ లేకపోయినా కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. జీవితంలో ప్రేమ ఉండాలి తర్వాత ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పింది అనన్య. ఇంజనీరింగ్ చేసిన అనన్య ఒక వేళా మూవీ అవకాశాలు లేనప్పుడు అప్లికేషన్ పెట్టుకుని జాబ్ చేసుకోవడానికైనా వెళ్ళిపోతా అని చెప్పింది. ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్‌ గా నటించిన అనన్య మంచి మంచి మూవీ ఛాన్సెస్ నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తోంది. బాయిస్‌ ఫార్ములా అనే యూట్యుబ్‌ చానెల్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. "బ్రదర్ అండ్ సిస్టర్ టేల్స్" అనే షార్ట్ ఫిల్మ్‌తో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఇక లక్కీ భాస్కర్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  

Yashmi Gowda Remuneration: యష్మీ రెమ్యునరేషన్ ఎంతంటే!

  బిగ్ బాస్ సీజన్-8 లో తొలి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన యష్మీ పన్నెండో వారం ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో తన ఆటతీరు, మాటతీరు పూర్తిగా అర్థం చేసుకున్న ఆడియన్స్ తనపై నెగెటివిటిని పెంచేసుకున్నారు. ప్రతీవారం తను నామినేషన్ కి రావడం ఆమె స్థానంలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయి బయటకు రావడంతో తను ఇన్ని వారాలు తప్పించుకుంది. ఇక ఈ వారం మాత్రం ప్రేక్షకుల పంతం నెరవేరింది. వారు కన్న కల నెరవేరింది. తను ఎలిమినేషన్ అయ్యింది. ఇక నుండి బిగ్ బాస్ హౌస్ ప్రశాంతంగా ఉంటుందంటూ నెటిజన్లు ట్రోల్స్ కూడా మొదలెట్టారు. యష్మీ గౌడ సుమారుగా వారానికి రూ. 2 లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. అంటే, రోజుకు దాదాపుగా రూ. 28, 571. సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగులోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ గౌడ 12 వారాలు (దాదాపుగా 83 రోజులు) హౌజ్‌లో ఉంది. ఈ లెక్కన 12 వారాల్లో యష్మీ గౌడ రూ. 24 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. అయితే, యష్మీ గౌడ వారానికి రెండున్నర లక్షల రూపాయల పారితోషికం అందుకుందని మరో టాక్ కూడా నడుస్తోంది. యష్మీ గౌడ ఎలిమినేషన్ అయ్యాక నెట్టింట మొదలైన టాపిక్ ఏంటంటే.. హమ్మయ్య కన్నడ బ్యాచ్ నుండి పెద్ద పాము బయటకొచ్చేసింది. ఇంకా మూడు పాములున్నాయంటూ తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. వీళ్ళంతా నామినేషన్ కి ముందు గ్రూప్ గా మాట్లాడుకొని ఒకరిని టార్గెట్ చేయడం ఆడియన్స్ దృష్టిలో నెగెటివ్ అయ్యారని తెలుస్తోంది.