విరిగిన కాలుతో‌ వీరోచిత పోరాటం.. లాస్ట్ మెగా ఛీఫ్ గా రోహిణి!

  బిగ్‌బాస్ సీజన్-8 లో నిన్నటి ఎపిసోడ్ ఫుల్ మీల్స్ లా అనిపించింది. హౌస్‌లో ఇప్పటివరకూ కన్నడ గ్యాంగ్ మధ్య సరైన గొడవ జరగలేదు. మొన్న సోనియా వచ్చి నిఖిల్-యష్మీ మధ్య మంట రాజేసిన ఒక్కరోజులో అది ఆరిపోయింది. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో కన్నడ బ్యాచ్ వాళ్లలో వాళ్లే మంట పెట్టేసుకున్నారు. దీంతో అటు పృథ్వీ, ఇటు యష్మీ ఇద్దరూ మెగా చీఫ్‌ రేసు నుంచి తుస్సుమనిపించారు. రోహిణి కొత్త మెగా చీఫ్ అయిపోయింది. అయితే పృథ్వీకి వచ్చిన అవకాశాన్ని యష్మీ చెడగొట్టింది. బిగ్ బాస్ మొదటగా 'ఆటో టాస్క్' ఇచ్చాడు. ఇందులో పృథ్వీ గెలిచాడు. ఇక రెండో టాస్క్ 'తెడ్డు మీద గ్లాస్'.  ఈ టాస్కులో గెలవాలంటే కంటెండర్లు తెడ్డుపై గ్లాసులు పెట్టి వాటిని జిగ్‌జాగ్‌గా ఉన్న స్టాండ్ నుంచి అటు తీసుకెళ్లి తమ వాటర్ కంటెనర్‌లో వెయ్యాలి. ఇలా ఎవరైతే ఎక్కువ నీళ్లు నింపుతారో వారికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇందులో రోహిణి గెలిచింది. ఈ గేమ్‌లో సరిగా పర్ఫామెన్స్ చేయకపోవడంతో మెగా చీఫ్ రేసు నుంచి విష్ణుప్రియ, యష్మీ ఇద్దరు తప్పుకున్నారు. ఇక మెగా చీఫ్ కోసం ఫైనల్ రేసులో రోహిణి, పృథ్వీ, తేజ నిలిచారు. ఇక వీరికి బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చాడు. ఒక స్టాండ్ ఉంచి వాటి చివరన కుండ ఉంచి.. బజర్ మ్రోగిన తర్వాత ఒక్కో కంటెస్టెంట్ రెండు సార్లు ఇసుక పోయాలని, పోటీదారులు కుండని ఒక్క కాలుతో మాత్రమే బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పాడు. ‌ఇక ఇందులో మొదట టేస్టీ తేజ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పృథ్వీ, రోహిణి ఉన్నారు. ఇద్దరు చివరిదాకా కష్టపడ్డారు. కానీ పృథ్వీ బ్యాలెన్స్ చేయలేక అవుట్ అయ్యాడు. రోహిణి చివరి వరకు ఉండి విజయం సాధించింది. జీరో జీరో అంటు రోహిణిని విష్ణుప్రియ అవమానించింది.. దాని వల్లే తను కసిగా ఆడి గెలిచానని రోహిణి అంది. ఇక ఈ పోటీలో నబీల్, నిఖిల్, విష్ణుప్రియ అంతా పృథ్వీకే సపోర్ట్ చేశారు. కానీ గెలవలేదు. రోహిణి మాత్రం తన కాలు విరిగినా సరే బ్యాలెన్స్ చేసింది. టాస్క్ ముగిసిన తర్వాత తను చాలాసేపటి వరకు కుంటుతూనే నడిచింది. రోహిణి అటు ఎంటర్‌టైన్మెంట్ ఇటు టాస్క్.. ఏదైనా ఇరగదీయగలదని ఆడియన్స్ కి ఈ విజయంతో అర్థం అయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్-8 లో రోహిణి ఆఖరి మెగా ఛీఫ్ గా నిలిచింది.

సోనియా ఆకుల ఎంగేజ్ మెంట్...వైరల్ అవుతున్న ఫోటోలు!

  సోనియా ఆకుల బిగ్ బాస్ సీజన్-8 తో ఫుల్ పాపులర్ అయ్యింది. తన నామినేషన్ చూస్తే అవతలి వాళ్ళు అసలు డిఫెండ్ చేసుకోలేరు.‌ నిజానికి సోనియాని సరిగ్గా డిఫెండ్ చేసే నబీల్ హీరో అయ్యాడు.  ఇక సోనియా హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఓ ఊపు ఊపింది.  నిఖిల్‌తో బాగా క్లోజ్‌గా ఉండటంతో వీళ్ల హగ్‌లు, రొమాన్స్‌ వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో దారుణంగా ట్రోల్ అయ్యింది. ఈ నెగిటివిటీతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది సోనియా. ప్రతి సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలై.. క్యారెక్టర్‌ని కోల్పోయే కంటెస్టెంట్స్ ఒకరిద్దరు ఉంటాడు. అలా ఈ సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలైంది సోనియా. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు నిఖిల్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న సోనియా.. బయటకు వచ్చిన తరువాత అతని నిజస్వరూపాన్ని తెలుసుకుని పన్నెండవ వారం నామినేషన్స్‌లో భాగంగా హౌస్‌లోకి వెళ్లి మరీ అతని గురించి బయటపెట్టేసింది. ఆడాళ్ల ఎమోషన్స్‌తో ఎలా ఆటలు ఆడుకుంటాడో.. అతను ఎంత మోసగాడో తెలియజేస్తూ నామినేట్ చేసింది. ఇక తాజాగా సోనియా ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ప్రేమించింది తన ప్రియుడు యష్ వీరగోని(Yashmi Veeragoni). బిగ్ బాస్ కి వెళ్లే ముందే వీరిద్దరు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ బిగ్ బాస్ అవకాశం రావడంతో మనసు మార్చుకుంది సోనియా. యష్, సోనియాలు డిసెంబర్‌లో నెలలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా.. సోనియా పెళ్లి చేసుకోబోతున్న యష్‌కి ఇది రెండో వివాహం కావడం విశేషం. అతనికి ఇంతకు ముందే పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే సోనియాతో పరిచయం తరువాత.. భార్యకి విడాకులు ఇచ్చాడనే విషయం బయటకు వచ్చింది. దీని గురించి అతను ఎక్కడా మాట్లాడలేదు కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సోనియా.. తన ప్రియుడు గురించి చెప్తూ అతనికి విడాకులు అయ్యాయనే విషయాన్ని ప్రేరణకి చెప్పింది. అలా వీరి వ్యవహారం బయటకు వచ్చింది. అయితే వీరి వివాహ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు కానీ.. వీడియోలో కానీ వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయకపోవడంతో.. అసలు ఇది రియలా ఫేక్‌నా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  

Ilu illalu pillalu :  తన ప్రేమ విషయం రామరాజుకి చెప్పాలనుకున్న చందు.. నర్మదకి పెళ్ళిచూపులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -10 లో.....నడిపోడు (సాగర్) తన లవర్ నర్మదని కలవడానికి వస్తాడు. మీ నాన్నతో మిల్ కి రాను గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తానని చెప్పవా అని అడుగుతుందిమ లేదని సాగర్ అంటాడు. ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నారని నర్మద అంటుంది. టైమ్ చూసుకొని చెప్తానని సాగర్ అంటాడు. మా నాన్నకి ప్రేమ వివాహం చేసుకోనని మాటిచ్చిన విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవని సాగర్ అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ తన లవర్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. ఎదురింట్లో ఉన్న చిన్నోడి (ధీరజ్ )ని చూసి బాగా అయింది. భళే ఇరికించానంటూ నవ్వుకుంటుంది. ఏదో ఆడపిల్లవి అందరిముందు పరువు తియ్యడం ఎందుకని ఆగిపోయానని ధీరజ్ అంటాడు. అప్పుడే ధీరజ్ వాళ్ల మామ వచ్చి.. మిమ్మల్ని ఎలాగైన కలుపుతానని అంటాడు. కాసేపటికి రామరాజు వస్తాడు. ఏదో అంటున్నావ్.. వాడు నాకు మాటిచ్చాడు.. నువ్వు వాడిని పాడుచేయ్యకని రామరాజు అంటాడు. మరొకవైపు పెద్దోడు (చందు) తన లవర్ సుభద్రని కలిసి తన నాన్నకి ఇచ్చిన మాట గురించి చెప్తాడు.. దాంతో సుభద్ర బాధపడుతుంది. ఆ తర్వాత సాయంత్రం ఇంట్లో కరెంటు లేదని రామారాజు కుటుంబం.. ఇంకా భద్రవతి కుటుంబం లు బయట పడుకుంటారు. చందు, సాగర్ లు డల్ గా ఉంటారు. తమ ప్రేమ విషయం రామరాజుకి చెప్పాలి అనుకుంటారు. కానీ భయపడతారు. వేదవతికి కాలు బెనుకుతుంది. రామరాజు తన కాళ్ళు పట్టుకొని మసాజ్ చేస్తుంటాడు. అది ఎదురింట్లో ఉన్న భద్రావతి కుటుంబం చూసి కుళ్ళుకుంటారు. తరువాయి భాగంలో చందు తన ప్రేమ విషయం రామరాజుకి చెప్పాలని అనుకుంటాడు. మరొకవైపు నర్మదకి పెళ్లి చూపులు అని తన పేరెంట్స్ చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 :  కార్తీక్ పుట్టిన రోజున గుడిలో దీప.. నెక్లెస్ ఇచ్చాడంటూ జ్యోత్స్న బడాయి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -209 లో.....జ్యోత్స్న కార్తీక్ బర్త్ డే అని కలిసి హగ్ చేసి విష్ చెయ్యాలి అనుకుంటుంది. అది కుదరకపోయేసరికి కనీసం ఫోన్ లో అయిన విష్ చెయ్ అని పారిజాతం సలహా ఇవ్వడంతో కార్తీక్ కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. అప్పుడే కాంచన లిఫ్ట్ చేస్తుంది. బావకి ఇవ్వు విష్ చేస్తానని అనగానే.. ముందు హ్యాపీ మారీడ్ లైఫ్ అని విష్ చెయ్ అని కాంచన అంటుంది. ఎక్కడ మళ్ళీ కార్తీక్ తో గొడవపడుతుందోనని మేమ్ గుడికి వెళ్తున్నామంటూ ఫోన్ కట్ చేస్తుంది. చూసావా ఇంట్లో వాళ్ళకే కాదు అత్త కి కూడా చులకన అయ్యానని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఆ దీప అందరిని మార్చేసింది. అది ఉండగా మనం అనుకున్నదేది జరగదు. ముందు నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళమని పారిజాతం అనగానే.. వాళ్లు గుడికి వెళ్లారని జ్యోత్స్న అంటుంది. అక్కడికి వెళ్తానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. దీప, కార్తీక్ లు ప్రదక్షిణలు చేస్తారు. ఇద్దరు ఒకేసారి గంట కొడతారు. దాని తర్వాత శౌర్యని ఎత్తుకొని గంట కొట్టిస్తారు. ఈ శౌర్యా నా కొడుకు కోడల్ని కలుపుతుందని కాంచన అనుకుంటుంది. ఆ తర్వాత మొక్కుబడి దారం దీపకి కాంచన ఇచ్చి మొక్కు చెల్లించుకొని రా అంటుంది. దాంతో దీప వెళ్లి మొక్కు చెల్లిస్తుంది. తాళిని మొక్కుతుంటే కార్తీక్ దూరం నుండి చూసి మురిసిపోతుంటాడు. ఆ తర్వాత చీరకట్టులో జ్యోత్స్న రెడీ అవుతుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. నేను గుడికి వెళ్తున్నాను.. ఇంట్లో మేనేజ్ చెయ్ అంటు జ్యోత్స్న వెళ్ళిపోతుంది. గుడికి వెళ్ళకు.. ఎందుకు వచ్చావంటూ కార్తీక్ కోప్పడతాడు. మీరు వెళ్ళమంటే వెళ్ళిపోతానని జ్యోత్స్న అనగానే.. ఉండనివ్వని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప బాధపడేలా బావ బర్త్ డే కి నాకు ఈ నెక్లెస్ ఇచ్చాడని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సవతి తల్లి మాయలో కొడుకు.. భార్య తెలిసేలా చేయగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -260 లో......సీతాకాంత్ ఇంటికి వచ్చేసరికి వంట చేసి చెయ్యి కాల్చుకున్నట్లు శ్రీలత సీన్ క్రియేట్ చేస్తుంది. దాంతో సీతాకాంత్ రామలక్ష్మిపై పట్టరాని కోపంతో ఉంటాడు. అసలు రామలక్ష్మి ఎందుకిలా చేస్తున్నావ్.. నాతల్లిని కష్టపెడుతున్నావని సీతాకాంత్ అంటాడు. పదా అమ్మ మనం ఇంట్లో నుండి వెళ్ళిపోదాం.. ఈ ఆస్తులు లేకుండా నువ్వు నాతో ఉండు.. అప్పుడు కొంతమందికి నువ్వేంటే ఏంటో అర్ధమవుతుందని సీతాకాంత్ అంటాడు. దాంతో వద్దు సీతా.. తనకి ఆస్తులు అంటే ఇష్టం అయింది. దాంతో మమ్మల్ని ఇలా కష్టపెడుతుంది కానీ నువ్వు అంటే తనకి ఇష్టమని శ్రీలత అంటుంది. చూసావా ఇప్పటికి కూడా మా అమ్మ మనం కలిసి ఉండాలని ఆలోచిస్తుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి శ్రీలత వెళ్లి.. ఏంటి రామలక్ష్మి నేను అనుకున్నది జరగాలంటే కొంచెం తగ్గాను చూసావ్ కదా.. సీతా ఎలా అంటున్నాడో.. ఆ ఆస్తులు ఇస్తే ఇదంతా ఉండదు కదా అని శ్రీలత అనగానే.. ఆస్తులు లేకపోతేనే ఇలా ఉన్నారు.. ఇక ఆస్తులు మీ చేతికి వెళ్తే సైలెంట్ గా ఎలా ఉంటారని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత శ్రీలత ఎవరికో ఫోన్ చేసి రామలక్ష్మి గురించి చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ ధ్యానం చేస్తుంటే రామలక్ష్మి పువ్వులు విసురుతుంది. అది చూసి ఎందుకు ఇలా చేస్తున్నావంటూ చిరాకు పడతాడు. రామలక్ష్మి పడిపోతుంటే సీతాకాంత్ పట్టుకుంటాడు. ఆ తర్వాత వదిన ఎందుకిలా చేస్తుందో కనుక్కో తాతయ్య లేదంటే మనం కలపాలనుకున్నా కలవనంత దూరం అవుతారని సిరి అంటుంది. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఎందుకిలా చేస్తున్నావ్.. సీతా బాధపడుతున్నాడని పెద్దాయన, సిరి అడుగుతారు. నేనేం చేసిన సీతా సర్ కోసమేనని రామలక్ష్మి అంటుంది. అదేంటో మాకు చెప్పమని పెద్దాయన అంటాడు. మీరు చెప్పిన నమ్మారు. నాపై నమ్మకం ఉంటే కొన్ని రోజులు ఆగండి అంతా తెలుస్తుందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కోడలి కోసం ఇంట్లో నుండి బయటకొచ్చేసిన అత్త.. ఆ లెటర్ లో ఏం ఉందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -574 లో..... రాజ్ ఇంటికి రాగానే స్వప్న వాళ్లు మా కావ్య ఎక్కడ అని అడుగుతారు. మీ ఇంటికి వెళ్ళిందని రాజ్ అంటాడు. అంటే ఇంకా అర్ధం కాలేదా ఈ పోటీలో నేనే గెలిచానని రాజ్ అంటాడు. అపర్ణ, ఇందిరాదేవి, స్వప్న లు డిస్సపాయింట్ అవుతారు. కంగ్రాట్స్ అంటూ రాజ్ కి రుద్రాణి చెప్తుంది. థాంక్స్ అత్త.. పాట పెట్టు డాన్స్ చేద్దామని అనగానే రుద్రాణి సాంగ్ పెట్టగానే రాజ్ డాన్స్ చేస్తుంటాడు. అప్పుడే సీతారామయ్య వస్తాడు. నీది ఒక గెలుపేనా అని.. రాజ్ మోసం చేసి గెలిచాడన్న విషయం చెప్పగానే అందరు షాక్ అవుతారు. మీరే కదా గెలవడానికి ఏదైనా చెయ్యొచ్చు అన్నారని రాజ్ అంటాడు. ఆ కావ్య అక్కడ సైలెంట్ గా ఉండి నీకు చెప్పిందా అని రాజ్ అంటాడు. నీకు రాహుల్ కి పెద్ద తేడా ఏముందని స్వప్న అంటుంది. నువ్వు ఇలా చేస్తావనుకోలేదని అపర్ణ అంటుంది. న్యాయంగా అయితే కావ్య గెలిచింది. వెళ్లి తనని తీసుకొని రమ్మని చెప్తారు. నేను విడాకులు అయిన ఇస్తాను కానీ తీసుకొని రానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య భోజనం చేస్తుంది. ఓడిపోయినందుకు నీకేం బాధ లేదా అని కనకం అంటుంది. అప్పుడే సీతారామయ్య ఫోన్ చేస్తాడు. కావ్య స్పీకర్ లో పెట్టి మాట్లాడుతుంది . గెలుపు నీది అయితే వాడు మోసం చేసి గెలవడం ఏంటని సీతారామయ్య అనగానే.. నేను పోటీలో ఓడిపోతే కంపెనీ నుండి ఆయన జీవితం నుండి వెళ్ళిపోతానని తెలిసి కూడా అలా చేశారంటే నేను అంటే ఇష్టం లేదని కదా.. నాకు డిజైన్ దొంగతనం చేసి టేబుల్ కింద ఉన్నప్పుడే తెలుసు కానీ ఆయనకి ఇష్టం లేకుండా నేనేం చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఇది జరిగిందని కనకానికి కావ్య చెప్తుంది.  మరొకవైపు అపర్ణ, ఇందిరాదేవి సుభాష్ లు మాట్లాడుకుంటారు. అప్పుడే కనకంకి ఫోన్ చేసి మీ మనవడు ఇలా చేసాడు. నా కూతురికి న్యాయం చెయ్యండని కనకం అనగానే.. అపర్ణ ఫోన్ తీసుకొని చేస్తానంటుంది. తరువాయి భాగంలో అపర్ణ కోసం ఇంట్లో వెతుకుతారు. తన లెటర్ రాసి పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే కావ్య వాళ్ళింటికి అపర్ణ బ్యాగ్ తో సహా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పట్టువదలని విక్రమార్కులు...కామెడీతో రోహిణి!

  బిగ్‌బాస్ హౌస్‌కి కొత్త, చివరి మెగా చీఫ్ అయ్యేందుకు తాజాగా ఓ టాస్కు జరిగింది. పోటీదారులు మెగా చీఫ్ అయ్యేందుకు 'పట్టువదలని విక్రమార్కులు' అనే టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఈ టాస్కులో గెలిచేందుకు కంటెస్టెంట్లు తమ పట్టు వదలకుండా రంగు ప్లాట్‌ఫామ్‌పై తాడును పట్టుకొని నిలబడాలి అంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఈ టాస్కులో చీఫ్ కంటెండర్లు అయిన టేస్టీ తేజ, రోహిణి, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మీ పోటీపడ్డారు. ఇక ఈ టాస్కుకి గౌతమ్‌ని సంచాలక్‌గా పెట్టాడు బిగ్‌బాస్. ఇక గౌతమ్ తన దగ్గర ఉన్న డైస్‌ని రోల్ చేశాడు. అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్‌పై ఉన్న వారికి పోటు పడినట్లే. అంటే వాళ్లు నిల్చున్న డ్రమ్‌ని గౌతమ్ పీకేస్తాడన్నమాట. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే.. అక్కడ ఐదుగురికి కలిపి రెండు కలర్ డ్రమ్స్ మాత్రమే ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో గౌతమ్‌ ఏ కలర్ వస్తే ఆ రంగు డ్రమ్‌పై ఉన్న వాళ్లని తీసేయొచ్చు. కానీ గౌతమ్ పక్షపాతం చూపించి ముందు మనల్నే లేపాస్తాడంటూ కన్నడ బ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. దీంతో వారందరికీ షాకిస్తూ డైస్ మీద నంబర్లు వేశాడు.  కానీ డైస్ తిప్పేసరికి మొదట పృథ్వీ నంబర్ వచ్చింది. దీంతో పృథ్వీ కిందున్న డ్రమ్ తీసేశాడు గౌతమ్. దీంతో గాల్లో కాసేపు తాడు పట్టుకొని వేలాడిన పృథ్వీకి యష్మీ తను నిల్చున్న డ్రమ్‌పై చోటిచ్చింది. దీంతో యష్మీని పట్టుకొని నిల్చున్నాడు పృథ్వీ. ఇది చూసి ఇదేనా యష్మీ నువ్వు చెప్పిన ఇండివీడ్యూవల్ గేమ్ అంటూ రోహిణి కౌంటర్ వేసింది. ఆ తర్వాత రోహిణి కింద డ్రమ్ పోయేసరికి వెళ్లి టేస్టీ తేజ పక్కన సెట్ అయిపోయింది. ఇక తేజ అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్లు తెగ ఫీల్ అయిపోయాడు.   బిగ్‌బాస్ నా కల నెరవేర్చినందుకు థాంక్యూ అంటూ తేజ అన్నాడు. ఇక టాస్క్ లో విష్ణు గేమ్ నుంచి ఔట్ అయింది. ఆ వెంటనే యష్మీ కిందున్న డ్రమ్ తీసేయడంతో పృథ్వీ-యష్మీ ఇద్దరూ కాసేపు వేలాడారు. కానీ ఇక ఉండలేక యష్మీ ముందు పడిపోయింది.. ఆ వెంటనే పృథ్వీ వదిలేశాడు. ఇక ఈ గేమ్‌లో తేజ విన్ అయ్యాడు. దీంతో తేజకి 50 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువసేపు ఉన్న రోహిణికి 40, నెక్ట్స్ ఉన్న పృథ్వీకి 30, యష్మీకి 20, విష్ణుప్రియకి 10 పాయింట్లు వచ్చాయి. ఇలా మెగా చీఫ్ టాస్కులో ఓ గేమ్ పూర్తయింది.  

పెద్ద పెద్ద మాటలొద్దు.. బెస్ట్ ఎవరు ఆడితే వాళ్ళే గెలవాలి!

  బిగ్ బాస్ సీజన్-8 లో అభయ్ నవీన్ ఫస్ట్ మూడు వారాలు ఇరగదీశాడు. ఇక టాస్క్ లలో తను బయాజ్ గా ఉన్నాడంటు ఏకంగా బిగ్ బాస్ నే తిట్టడంతో రెడ్ కార్డ్ తీసుకొని మరీ బయటకొచ్చాడు.  హౌస్ లో అభయ్ నవీన్ ఉన్నన్ని రోజులు అతనే విన్నర్ అనుకున్నారంతా కానీ చివరి వారం అతనికి బ్యాడ్ నేమ్ తెచ్చింది. ఇక గత ఆరు వారాల నుండి సాగుతున్న కన్నడ గ్రూపిజం గురించి అభయ్ నబీన్ మొదటిసారి నోరు విప్పాడు. అభయ్ నవీన్ తన ఇన్ స్టాగ్రామ్ లో  తెలుగు వర్సెస్ కన్నడ వివాదంపై ఓ వీడియో పెట్టాడు. నేను నిఖిల్‌, ప్రేరణలకి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు వచ్చే మాక్సిమమ్ మెసేజ్‌లన్నీ తెలుగోడివి అయి ఉండి తెలుగోళ్లని ఎందుకు సపోర్ట్ చేయట్లేదని అంటున్నారు. అన్నా ఫస్ట్ వారాల్లో ఎలిమినేటర్ అయినోళ్లంతా తెలుగోళ్లే మరి.. అప్పుడు మీరంతా ఎక్కడికి పోయారన్నా.. మీ సపోర్ట్ ఏడికి పోయింది.. మీరెవరికి ఓటేశారు.. ఎందుకు అదంతా జరిగింది.. ఇప్పుడెందుకు వస్తుందన్నా.. ఏదైనా మంచి మంచి అకేషన్లు ఉన్నప్పుడేమో మేమంతా ఇండియన్స్.. భారతీయులుగా గర్వపడుతున్నాం అంటాం.. కానీ ఇలా స్టేట్‌కి దీనికి సంబంధించిన విషయం అయితే నా రాష్ట్రం, నా ప్రాంతం, నా కులం, నా ఊరు అంటూ సెపరేట్ చేసుకుంటూ పోతామా అన్న అని అభయ్ నవీన్ అన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు.. తెలుగోళ్లు అందరినీ యాక్సెప్ట్ చేస్తారు.. అది మాత్రం మనందరికీ ఉన్న గొప్ప గుణం.. అందుకే తెలుగు సినిమాల్లో పక్క భాషల యాక్టర్స్ చాలా చాలా మంది పని చేస్తుంటారు.. అందుకు ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నా.. ఇది కేవలం ఒక గేమ్ అంతే.. గేమ్‌లో అవన్నీ తీసుకురాకండి.. బెస్ట్ ఎవడు ఆడితే వాడు గెలవని.. నాకు నచ్చినోళ్లని సపోర్ట్ చేయమని నేను అనను.. మీకు నచ్చినోళ్లని చేసుకోండి.. ఎవడు మంచిగా ఆడితే వాడు గెలవనీ అన్నా..అంటూ అభయ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఇష్యూ నెట్టింట వైరల్ గా మారింది.  

పృథ్వీ, గౌతమ్ ల మధ్య జరిగిన గొడవలో తప్పెవరిది?

  బిగ్ బాస్ సీజన్-8 పన్నెండో వారం మెగా ఛీఫ్ కోసం జరిగే టాస్క్ లలో‌ కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. హౌస్ మేట్స్ అందరికి మెగా చీఫ్ కంటెండర్ అయ్యో టాస్క్ ఇచ్చాడు.  ఇక నిన్నటి ఎపిసోడ్ లో విష్ణుప్రియ, యష్మీ, పృథ్వీ, తేజ కంటెండర్ షిప్ పొందుతారు రోహిణి, నిఖిల్ లలో  ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే కంటెండర్ షిప్ ని పొందుతారుని బిగ్ బాస్ చెప్పాడు. ఇద్దరిలో నుండి ఒకరిని హౌస్ మేట్స్ కంటెండర్ ని చెయ్యొచ్చని బిగ్ బాస్ మెలిక పెట్టాడు. ఆ తర్వాత రోహిణి నిఖిల్ లు ఇద్దరు కూడా మెగా చీఫ్ అవ్వాలని అనుకుంటున్నామని చెప్తారు. మొదటగా గౌతమ్ వస్తాడు‌. తనకి రోహిణి అవ్వాలని ఉందని చెప్తాడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు  అందరు కూడా వైల్డ్ కార్డ్స్ ని ఒక్కొక్కరిగా పంపించాలనుకున్నారు. అది గ్రూప్ గేమ్ అని గౌతమ్ అంటాడు.  ఇక ఇలా ఒక్కో హౌస్ మేట్ తమ సపోర్ట్ ఎవరికో చెప్తారు. ఇలా చెప్పిన వారిలో‌ మెజారిటీగా రోహిణికి సపోర్ట్ చేస్తారు. నబీల్ పృథ్వీ, విష్ణులు నిఖిల్ కి సపోర్ట్ చేస్తారు. పృథ్వీ తన ఒపీనియన్ చెప్తూ.. ఇందాక గౌతమ్ ఒక మాట అన్నాడు. అది కంప్లీట్ తప్పు ఎందుకంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీకి ముందే వైల్డ్ కార్డు అనే సునామినీ మీరు ఆపాలని చెప్పారంటు పృథ్వీ అందుకున్నాడు. ఒక సందర్బంలో అలా ఆడాము.. కానీ ఇప్పుడు అంతా ఒకటే అని పృథ్వీ వివరణ ఇస్తాడు. కానీ పృథ్వీ దగ్గరగా వెళ్లి మాట్లాడేసరికి గౌతమ్ కి కోపం వస్తుంది. అలా మాట మాట పెరిగిపోతుంది. ఇక గౌతమ్ ని ఇష్టమొచ్చినట్టు మాట్లాటతాడు పృథ్వీ. నా ఇష్టమంటు రెచ్చిపోతాడు పృథ్వీమ ఇక అదే హీటెడ్ ఆర్గుమెంట్స్ లో నువ్వే పీకలేవని గౌతమ్ అనగా.. అలా మాట్లాడొద్దని పృథ్వీ అంటాడు. ఆ తర్వాత పృథ్వి కూడా నా బొచ్చు కూడా పీకలేవని తన వెంట్రుక పీకి గౌతమ్ మీద పడేస్తాడు. ఇలా ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ సాగింది. ఎలాగైనా వీకెండ్ ల్ నాగార్జున ఇద్దరికి గట్టిగా వాయించేస్తాడని క్లియర్ గా అర్ధమవుతుంది.  

Illu illalu pillalu : తండ్రికిచ్చిన మాటకి కొడుకులు కట్టుబడి ఉంటారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -09 లో.. ప్రేమ వివాహం చేసుకోనని నాకు మాట ఇవ్వండని రామరాజు తన ముగ్గురు కొడుకులతో మాట తీసుకుంటాడు. మరొకవైపు వాడు మళ్ళీ చిన్న కొడుకుని అడ్డు పెట్టుకొని మన కుటుంబం పరువు తియ్యాలనుకున్నాడు. ఇంకొకసారి ఏమైనా నీ జోలికి వస్తే చెప్పు.. అప్పుడు వాడి సంగతి చెప్తానని ప్రేమకి భద్రవతి చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ నానమ్మ సిగ్గుపడుతూ నాకు తెలిసేలోవే మీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారని అంటుంటే.. ఛీ వాడితో నాకు ప్రేమ ఏంటని అంటుంది. మరొకవైపు పెద్దోడు తన ప్రేమించిన అమ్మాయిని గుర్తుచేసుకుంటూ ఉంటు ఏడుస్తుంటే.. చిన్నోడు వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. తను ప్రేమించిన అమ్మాయి ఫోటో చూపించి ప్రేమ విషయం చెప్తాడు‌. మరి ఎందుకు నాన్నకి చెప్పలేదని అంటాడు. నాన్న అంటే భయమని పెద్దోడు అంటాడు. ఆ తర్వాత చిన్నోడు నడిపోని దగ్గరికి వెళ్లి.. నీ ప్రేమ విషయం నాన్నకి ఎందుకు చెప్పలేదు. నాన్న అంటే భయమా కోపంలో నాకు భయమేసిందని అంటాడు. అయిన ఇదంతా నీ వళ్లే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం వాళ్లేనని నడిపోడు కోప్పడతాడు. నేను దాన్ని ప్రేమించడం ఏంటని చిన్నోడు అంటాడు. ఆ తర్వాత రామరాజు తన కొడుకులు చెప్పిన మాట విన్నరు మురిసిపోతాడు. మరొక వైపు తన ఇద్దరు అన్నలు బాధపడుతుండటం చూసి ఎలాగైనా వాళ్ళ బాధని పోగొట్టాలని చిన్నోడు అనుకుంటాడు. ఆ తర్వాత రామరాజు తన బామ్మరిదితో కలిసి డ్రింక్ చేస్తాడు. నువ్వు ఎందుకు బావ అలా నిర్ణయం తీసుకున్నావని అడుగుతాడు. కుటుంబానికి దూరమై మేం బాధపడ్డం.. అలా మా పిల్లలు పడకూడదు.. ప్రేమ పెళ్లిళ్లు మా ఇంట్లో జరగడానికి వీలు లేదని అంటాడు. తరువాయి భాగంలో వేదవతి కుటుంబం ఆరుబయట కూర్చొని ఉంటారు. వేదవతికి కాలు బెనుకూతుంది. దాంతో రామరాజు తన కాలుని పట్టుకొని ఆంటిమెంట్ రాస్తుంటే.. భద్రవతి కుటుంబం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అత్త ప్లాన్ కు కోడలు చెక్.. ఇంట్లో నుండి వెళ్లిపోదామన్న కొడుకు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -259 లో...సీతాకాంత్ ఆఫీస్ కి డల్ గా వస్తాడు. ఇక దొరికింది ఛాన్స్ అని నందిని ఏం జరిగిందని అడుగుతుంది. రామలక్ష్మికి ఆస్తులపై ప్రేమ పెరిగింది.. నా వాళ్ళు అంతా ఆస్తి కోసమే నాతో ఉంటున్నారని అనుకుంటుంది.. అందుకే ఇక ఇదంతా వదిలేసి మళ్ళీ నా తల్లితో ఉండి మళ్ళీ ఆస్తులు సంపాదించాలి. అప్పుడే ఏం లేకున్నా నా తల్లి నాతో ఉందని రామలక్ష్మికి నిరూపించాలని సీతాకాంత్ అంటాడు. నందిని తనకి హెల్ప్ చేస్తానని అంటుంది. స్టార్టప్ కంపెనీ ఇస్తుంది. దాంతో నందినికి సీతాకాంత్ థాంక్స్ చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఏంటి రామలక్ష్మి ఇలా చేస్తున్నావ్.. మోసం చేసి ఆస్తులు రాయించకొని సీతాని బాధపెడుతున్నావని నందిని అడుగగా.. తప్పట్లేదు అని రామలక్ష్మి అంటుంది. ఇక రామలక్ష్మికి సీతాకాంత్ సీఈఓకి రాజీనామా చేస్తున్న విషయం తెలిసి.. అప్పుడే లాయర్ రూల్స్ చెప్తాడు. సడెన్ గా ఇలా రాజీనామా చేస్తే కంపెనీకి పది కోట్లు ఇవ్వాలి లేదా.. జైలు శిక్ష ఉంటుంది.. అలా కాకుండా ఆరు నెలలు నోటిస్ పీరియడ్ ఉంటుందని లాయర్ అనగానే.. అంటే సీతాని జైల్లో కి పంపిస్తావా అని నందిని అడుగుతుంది. ఎక్కడికి వెళ్లాలో ఆయనే నిర్ణయం తీసుకోవాలని రామలక్ష్మి అంటుంది. నాకు తెలుసు నువ్వు ఇదంతా నేను ఆఫీస్ లో ఉండాలని కావాలనే చేస్తున్నావని సీతాకాంత్ అనుకుంటాడు. సరే నేను ఇక్కడే ఉండి నేను చెయ్యాలిసింది చేస్తానని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు ఇంట్లో పనులన్నీ చేసి అలిసిపోతారు. ఇక రామలక్ష్మి, సీతా బావని మనమే ఒకటి చెయ్యాలి. అప్పుడే రామలక్ష్మి అక్క మనల్ని వదిలేస్తుందని శ్రీవల్లి అనగానే.. అలా ఏం వద్దంటూ శ్రీలత మరొక ప్లాన్ వేస్తుంది. సీతాకాంత్ వచ్చేసరికి చెయ్యి, కాలి నొప్పితో బాధపడుతుంది. ఏమైంది ఎవరు వంట చెయ్యమన్నారని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి అక్క చేయమందంటూ శ్రీవల్లి చెప్పగానే.. రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. పదా అమ్మ ఇంట్లో నుండి వెళ్లిపోయి.. నువ్వు ఎలాంటి ఆస్తులు లేకున్నా నాతో ఉంటారని నిరూపిస్తానని సీతాకాంత్ అనగానే.. వద్దని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Karthika Deepam2 : కార్తీక్ బర్త్ డే  కోసం స్పెషల్ సెలెబ్రేషన్స్ చేసిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -208 లో.....శౌర్య కళ్ళు తిరిగి పడిపోవడంతో సిరప్, టాబ్లెట్ వేసారా అంటూ కార్తీక్ అడుగుతాడు. అవి వెయ్యగానే శౌర్య మాములుగా అయి పడుకుంటుంది. నా కూతురికి ఏమైంది బాబు ఇలా అంటున్నారని దీప అడుగుతుంది. ఏం కాలేదు అని కార్తీక్ చెప్పినా కూడా దీప నమ్మకుండా నాపై ఒట్టేయ్యండి అని కార్తీక్ చెయ్ తన తలపై పెట్టుకుంటుంది. ప్రాబ్లమ్ ఉంది అది నీ వల్లే.. అది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అలా ఉంచడం మన బాధ్యత కానీ నువ్వు అలా చేస్తున్నావా అని కార్తీక్ అంటాడు. బయటవారి గురించి పట్టించుకోకు మన కూతురు కోసం మనం ఉందామని కార్తీక్ అసలు నిజం చెప్పకుండా తప్పించుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు మీ మాటలు నమ్ముతున్న శౌర్యకి ఏం కాదని అనుకుంటుంది. ఆ తర్వాత కాంచన, అనసూయలు గదిలో మాట్లాడుకుంటారు. రేపు కార్తీక్ బర్త్ డే కానీ వాడికి సెలెబ్రేషన్స్ నచ్చవని కాంచన అంటుంది. ఆ మాటలు దీప వింటుంది. మరుసటి రోజు కార్తీక్ లేచేసరికి గది అంతా బెలూన్ లతో నింపేస్తుంది. కార్తీక్ లేచి ఇదంతా ఎవరు చేశారని అడుగగా.. దీప చేసిందని వాళ్ళు అంటారు. కార్తీక్ అంటే దీపకి ఎంత ఇష్టమోనని కాంచన, అనసూయ లు అంటారు. అమ్మకి నాన్న అంటే ఎంత ఇష్టమోనని శౌర్యా అంటుంది. కానీ దీప సైలెంట్ గా ఉంటుంది. ఇదంతా ప్రేమ కాదు అభిమానమని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు ఎలాగైనా బావని కలిసి హగ్ చేసుకొని విషెస్ చెప్పాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. సుమిత్రని అడుగు కార్తీక్ ఇంటికి వెళదామని అని పారిజాతం సలహా ఇస్తుంది. సుమిత్ర దగ్గరికి వెళ్లి జ్యోత్స్న మాట్లాడడం దశరథ్ విని కోప్పడతాడు. మరుసటి రోజు జ్యోత్స్న, పారిజాతం మాటలు విని  శివన్నారాయణ‌ కోప్పడతాడు. ఫోన్ చేసి అయిన విష్ చెయ్ అని పారిజాతం అనగానే.. జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. దీప, శౌర్యల సందడి వినపడి ఇంకా ఆవేశపడుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Brahmamudi : కళ్యాణ్ ట్యాలెంట్ ని తొక్కేస్తున్న లక్ష్మీకాంత్.. వైరల్ అవుతున్న అమ్మ పాట!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -573 లో......కళ్యాణ్ ఉదయాన్నే రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరికి వస్తాడు. లిరిక్స్ తెచ్చావా అని లక్ష్మీకాంత్ అడుగగా.. తెచ్చాను సర్ అని కళ్యాణ్ చెప్తాడు. నాకు తెలుసు అవకాశం ఇస్తే ఉపయోగించుకుంటావని అని అతను అంటాడు. నాలాంటి సరస్వతి పుత్రడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నీకు మంచిదని లక్ష్మీకాంత్ అనగానే పక్కనున్న మరొక వ్యక్తి.. నువ్వు సరస్వతి పుత్రుడివా అంటూ మనసులో తిట్టుకుంటుంటాడు. నాకు తెలుసు నువ్వేం అనుకుంటున్నావో అంటూ అతన్ని తిట్టి పంపిస్తాడు లక్ష్మీకాంత్. ఆ తర్వాత లక్ష్మీకాంత్ కాళ్ళు సరిగా పెడుతూ ఉంటాడు. దాంతో కళ్యాణ్ వెళ్లి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఇలాగే నాకు పాటలు రాస్తుండాలని లక్ష్మీకాంత్ ఆశీర్వదిస్తాడు. దాంతో కళ్యాణ్ తల ఎత్తి చూడగానే జీవితాంతం కాదులే.. ఒక మూడేళ్ల పాటు రాసి ఇవ్వని అంటాడు. అప్పుడే ఒక ప్రొడ్యూసర్ వస్తాడు. ఇప్పుడే మీరు చేపిన పాట అయిపోయింది మీరు వచ్చారంటూ కళ్యాణ్ రాసిన పాట ఇచ్చి చెక్ తీసుకుంటాడు. సర్ కి కాఫీ తీసుకొని రా అని కళ్యాణ్ ని పంపిస్తాడు లక్ష్మీకాంత్. ఇబ్బంది పడుతూనే కళ్యాణ్ వెళ్తాడు. మొన్న అమ్మ పాట రాసింది ఇతనే కదా  అని ప్రొడ్యూసర్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ కాఫీ తీసుకొని వస్తాడు. మీరు రాసిన అమ్మ పాట బాగుంది. వైరల్ అవుతుందని ప్రొడ్యూసర్ అంటాడు. అప్పుడే లక్ష్మీకాంత్ మధ్యలో కలుగజేసుకొని అతనేం రాసాడు అణువంతా.. మొత్తం నేనే కష్టపడి రాసానని లక్ష్మీకాంత్ చెప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ వెళ్ళాక టీ తీసుకొని రమ్మని చెప్పినందుకు ఫీల్ అయ్యావా అని కళ్యాణ్ ని అడుగుతాడు లక్ష్మీకాంత్. అదేం లేదని కళ్యాణ్ అనగానే.. పదివేల చెక్ ఇస్తాడు. అదేంటీ నేను లక్ష తీసుకొని నీకు ఇంత ఇస్తున్నానని అనుకుంటున్నావా.. నువ్వు రాస్తున్నావ్ ఎవరైనా రాస్తారు.. అది ఎవరి పేరు మీద వెళ్తుందని ముఖ్యమని లక్ష్మీకాంత్ అంటాడు. నా పాటలు జనాలకి నచ్చతున్నాయి. ఏదైనా సాధిస్తానన్న నమ్మకం కలిగిందని కళ్యాణ్ అంటాడు. నీకు ఇంకో ట్యూన్ ఇస్తాను.. రాయి అని లక్ష్మీకాంత్ అనగానే.. కళ్యాణ్ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బొచ్చు పీకి విసిరేసిన పృథ్వీ.. బిగ్ బాస్ హౌస్ లో రౌడీయిజం!

  అసలేం జరుగుతుంది హౌస్ లో.. నిన్న మొన్నటి దాకా ఫ్యామిలీ వీక్ లో అందరి ఫ్యామిలీలు వచ్చి గ్రూప్ గా ఆడొద్దని యష్మీ, నిఖిల్, పృథ్వీ, ప్రేరణలకి చెప్పినా వాళ్ళు మాత్రం మారట్లేదు. తాజాగా రిలీజైన ప్రోమోలో గౌతమ్ మీదకి హై టెంపర్ తో పృథ్వీ వెళ్ళడం చూస్తే.. ఏం చిల్లర గాడురా వీడు అని కామన్ ఆడియన్ ఎవరైనా అనుకుంటారు. పన్నెండు వారాల నుండి పృథ్వీది ఇదే బిహేవియర్.. అయిన సరే అతడికి సపోర్ట్ గా హౌస్ లో యష్మీ , నిఖిల్, ప్రేరణ ఉండగా.. బిబి టీమ్ ఎడిటింగ్ లో లేపేస్తున్నారు. ఇది కన్నడ బ్యాచ్ కి ఫేవరెటిజం అని స్పష్టంగా తెలుస్తుంది. అయిన సరే ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రోమోలో గౌతమ్ తన పాయింట్లు చెప్తున్నప్పుడు.. ఏం చేస్తావ్ రా నువ్వు.. నా బొచ్చు కూడా పీకలేవంటూ పృథ్వీ వెంట్రుకలు పీకి గౌతన్ మీదకి విసిరేయడం పెద్ద దుమారం లేపుతుంది. ఇది బిగ్ బాస్ షోనా లేక అల్లరి మూకలకి, కిరాయి గుండాలకి అడ్డానా అంటూ నెటిజన్లు కన్నడ బ్యాచ్ ని దూశిస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు. హౌస్ లో లాస్ట్ మెగా ఛీఫ్ కోసం జరుగుతున్న టాస్క్ లలో గౌతమ్ వర్సెస్ కన్నడ బ్యాచ్ గా మారిపోయింది. ఎంతలా అంటే గౌతమ్ ఏది మాట్లాడిన అతడి మీదకి యష్మీ, పృథ్వీ, నిఖిల్ వెళ్లడం అన్ ఫెయిర్ గా అనిపిస్తుంది. అంతకముందు నబీల్‌ని పృథ్వీ కొట్టడానికి వెళ్లినప్పుడు ఎవరు అడ్డుచెప్పలేదు. నీకు దమ్ము లేదు.. నేనే పెద్ద మొగాడ్ని అంటూ టేస్టీ తేజాని మీదకి వెళ్లినప్పుడు ఎవరు అడ్డుకోలేదు. నేను కొట్టడానికి వస్తా నువ్వు వెనక్కి వెళ్లిపోవాలి.. కాదని చేతులు అడ్డుపెడితే తొక్కిపడేస్తా అని వీధి రౌడీలా నిలువరించినప్పుడూ అడ్డు చెప్పలేదు. ఆడాళ్లని చూడకుండా బూతులు తిట్టినప్పుడూ కంట్రోల్ చేయలేదు.. నీ నోరు నీ ఇష్టం. ఎవడ్నైనా తిట్టు.. ఎవడ్నైనా కొట్టు అని యష్మీ, ప్రేరణ, నిఖిల్ ఎంకరేజ్ చేశారు. హౌస్ లో ఇప్పుడు ఎలా ఉందంటే ఇది తెలుగు బిగ్ బాస్ రా బై.. మీ కన్నడోళ్లకి నో ఎలిమినేషన్.. చేస్తే గీస్తే తెలుగోళ్లనే ఎలిమినేషన్ చేస్తాం. ఇప్పటికి పన్నెండు మందిని ఎలిమినేట్ చేశాం.. మిమ్మల్ని మాత్రం టచ్ చేయం.. చెలరేగిపోయండనే స్థాయిలో బిబి టీమ్ ప్రోత్సహిస్తున్నప్పుడు పృథ్వీ బొచ్చు పీకి గౌతమ్ మీద పారేయడంలో తప్పు లేదనిపిస్తోంది.  

నబీల్ ఎలిమినేషన్.. కన్నడ బ్యాచ్ కి ఫేవరెటిజం చూపిస్తారా!

  బిగ్ బాస్ సీజన్-8 మొదలై పన్నెండు వారాలు కావస్తోంది. అయితే ఇప్పటివరకు హౌస్ నుండి బయటకు వచ్చినవారంతా తెలుగువాళ్ళే.‌ కానీ కన్నడ బ్యాచ్ లోని ప్రేరణ, నిఖిల్,‌పృథ్వీ, యష్మీలు ఎన్నిసార్లు నామినేషన్ కి వచ్చిన ఎలిమినేషన్ దగ్గరగా వచ్చి సేవ్ అవుతున్నారు. అసలేం జరుగుతుంది. ‌ప్రతీవారం పృథ్వీ, ప్రేరణ, యష్మీ నామినేషన్ లోకి రావడం చివరికి తెలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవ్వడం ఇదే జరుగుతుంది. ‌దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ కన్నడ బ్యాచ్ కు ఫేవరెటిజం చేస్తున్నాడనిపిస్తోంది. అందుకే ఒక్కొక్కరికి పాజిటివ్ కంటెంట్ ఇస్తున్నాడు.  పృథ్వీ చేసే వరెస్ట్ గేమ్ ప్లేకి నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ సపోర్ట్ ఉండటంతో బిగ్ బాస్ పృథ్వీ జోలికి కూడా పోవడం లేదు. ఇక యష్మీ.. గత సీజన్ లో శోభాశెట్టి.. ఈ సీజన్ లోన యష్మీ ..‌ఇలా తగులుకున్నారేంటని ట్రోల్స్ మాములుగా లేవు. మరో ఢిఫరెంట్ కంటెస్టెంట్ ప్రేరణ. పన్నెండు వారాలలో‌ ఒక్కసారి కూడా యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు. అందుకేనేమో వీరిని గ్రూప్ గేమ్ అని అందరు అంటున్నారు. ప్రేరణ కనపడకుండా యష్మీతో స్ట్రాటజీ ప్లే చేస్తోంది.   నిఖిల్ విన్నర్ అవుతాడనే అనుకున్నారంతా కానీ‌ అతని స్ట్రాటజీలన్నీ‌ నాగ మణికంఠ(Manikanta) బయటపెట్టేశాడు. అతడి ఫ్లిప్పింగ్ అండ్ నామినేషన్ లో స్ట్రాటజీ ఇలా అన్నింటిని బయటపెట్టి అతడి గురించి అందరికి తెలిసేలా చేశాడు. ఇక సీత వచ్చి నిఖిల్ హౌస్ లోని కొందరిని ఎలా మానిప్యులేట్ చేశాడో చెప్పింది. ఇక దీనిని కవర్ చేసుకోడానికి నిఖిల్ సింపథీ స్ట్రాటజీ వాడాడు. మొదటగా ఓట్లు వేయద్దని  చెప్పి ఆ తర్వాత ఓట్లు చేయండి అంటు ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఇక అందరికి ఓటింగ్ భారీగానే ఉంది. కానీ తెలుగు కంటెస్టెంట్ నబీల్ కి ఓటింగ్  చాలా దారుణంగా ఉంది. డేంజర్ జోన్ లో ఉన్నాడు. అసలు నబీల్ కి సంబంధించిన ఫుటేజ్ కూడా టెలికాస్ట్ కావడం లేదు. హౌస్ లో నబీల్ పెద్దగా కంటెంట్ ఏం ఇవ్వడం లేదని , కన్నడ బ్యాచ్ విచ్చలవిడిగా కంటెంట్ ఇస్తున్నారని వారికే సపోర్ట్ చేస్తారని ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ వారం నబీల్ ని ఎలిమినేషన్ చేస్తారా  ఆడియన్స్ గత కొన్ని వారాలుగా ఎదురుచూస్తున్న యష్మీ(Yashmi Elimination)ని బయటకి పంపిస్తారా చూడాలి మరి.  

మెగా ఛీఫ్ రేస్ నుండి నబీల్ అవుట్.. 

  బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ ముగియగానే హౌస్ లో కంటెండర్ షిప్ కోసం టాస్క్ ఇచ్చాడు. ఇక ఇందులో ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ప్లే చేశారు‌. అయితే నబీల్ గేమ్ స్ట్రాటజీ అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే హౌస్ లో గెలవాలంటే అందరి సపోర్ట్ అవసరం. ఇండివిడ్యువల్ గా ప్లే చేస్తే నిలవడం గెలవడం రెండు కష్టమే. ఇక బిగ్ బాస్ ఈ సీజన్‌కి చివరి మెగా చీఫ్ అయ్యేందుకు టాస్క్ గురించి చెప్పాడు. హౌస్‌మేట్స్‌లో అప్పుడప్పుడు ఒక్కొక్కరి పేరు మీద టీ షర్ట్ లోపలికి వస్తుంది.. దాన్ని ఎండ్ బజర్ మోగే వరకూ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలి.. అనంతరం అక్కడ ఉన్న బొమ్మకి ధరింపజేయాలి.. అలా చేసినవాళ్లు మెగా చీఫ్ కంటెండర్లు అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలా ఐదుగురికి మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు బిగ్ బాస్. ఇక బజర్ మ్రోగగానే ప్రేరణ టీ షర్ట్ రాగా పోటీ పడి మరీ యష్మీ, పృథ్వీ చించిపారేశారు. అలానే గౌతమ్‌ది రాగానే నబీల్ ఆవేశంగా ఆ టీషర్ట్‌ను చించేశాడు. గౌతమ్‌ని పృథ్వీ, నిఖిల్ ఇద్దరూ హోల్డ్ చేయడంతో గౌతమ్ టీ షర్ట్ ని నబీల్ చించేశాడు. అయితే ఇలా వచ్చిన ప్రతి ఒక్కరి టీ షర్ట్‌ను చించేందుకు నబీల్ ట్రై చేశాడు. ఒక్క పృథ్వీ, యష్మీలది మాత్రమే కాపాడాడు నబీల్. కాసేపటికి నబీల్ టీ షర్ట్ రాగానే గౌతమ్, నిఖిల్, విష్ణుప్రియ, రోహిణి అందరూ చించేందుకు ట్రై చేశారు. నబీల్‌ని గౌతమ్ గట్టిగా పట్టుకొని వదల్లేదు.. దీంతో మిగిలిన పని రోహిణి, ప్రేరణ కలిసి నబీల్ టీ షర్ట్ ని చించేశారు. దాంతో నబీల్  కంటెండర్ రేస్ నుండి అవుట్ అయ్యాడు. సింగిల్‌గా ఆడమని మొన్నటి నామినేషన్ లో మణికంఠ చెప్పిన తర్వాత నబీల్ చాలా ఇండివిడ్యూవల్‌గా ఉండటం స్టార్ట్ చేశాడు. గేమ్‌లో కూడా ఎవరినీ సాయం అడగలేదు.. దీంతో మొదటికే మోసం వచ్చి కంటెండర్ రేసు నుంచే నబీల్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ వారం మెగా చీఫ్ కంటెండర్లుగా పృథ్వీ, యష్మీ, విష్ణుపియ, టేస్టీ తేజ, రోహిణి అయ్యారు.   

నాకు ఓట్లు వేయద్దొంటూ సింపథీ స్ట్రాటజీ ప్లే చేసిన నిఖిల్.. 

  బిగ్ బాస్ సీజన్-8 లో పన్నెండో వారం జరిగిన నామినేషన్లో కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేసి భారీగా ఓట్లు పడ్డాయి. అయితే వీటన్నింటికి మూల కారణం నిఖిల్, యష్మీ.. వీరిద్దరి స్ట్రాటజీల వల్ల పృథ్వీ, ప్రేరణ కూడా వరెస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకొ చేరిపోయారు.‌  నిఖిల్ ఒక్కొక్కరి నామినేషన్ ని తల్చుకొని భాదపడుతున్నాడు. సీత అసలు అలా ఎందుకు అందో అర్థం కాలేదంటూ యష్మీతో నిఖిల్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇక హౌస్‌లో ఉండాలని లేదని.. తాను బయటికి వెళ్లిపోతా అంటూ బిగ్‌బాస్‌కి చెప్పాడు నిఖిల్. తనకి ఇక ఆడియన్స్ ఎవరూ ఓట్లేయొద్దని.. ఈ వారం హౌస్‌ నుంచి వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నానంటూ నిఖిల్ చెప్పాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీతో చాలాసేపు మాట్లాడతాడు నిఖిల్. సీత అలా అన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని నిఖిల్ అడుగగా.. తను అలా మాట్లాడేసరికి నేను బ్లాంక్ అయ్యాను. అందుకే ఏం మాట్లాడలేదని యష్మీ అంది. ఇక యష్మీ కూడా తన తప్పు ఉందని అంది. ఇక తను వెళ్లిపోయాక నిఖిల్ బిగ్ బాస్ తో మాట్లాడాడు.‌ ఇక తనకి ఓట్లు వేసే వారికి ఓట్లు వేయకని చెప్పాడు. హౌస్ లో ఉండాలని లేదని నిఖిల్ అన్నాడు. ఇక హౌస్ లో గ్రూపిజం గురించి అందరు మాట్లాడేసరికి నిఖిల్ తీసుకోలేక అతని వరిజినాలిటి బయటపడిందనే భయంతో ఆడియన్స్ ఓట్లు వేయకండి అంటే సింపథీ వర్కవుట్ అవుతుందనే స్ట్రాటజీ ప్లే చేశాడు నిఖిల్. అయితే కాసేపటికి మళ్ళీ మనసు మార్చుకున్నట్టుగా నాకు ఓట్లు వేయండి నేను ఫైనల్ వరకు ఉండి కప్పుతో బయటకొస్తానని నిఖిల్ అన్నాడు.  మరి నిఖిల్ ఫ్లిప్పింగ్ గేమ్ ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి మరి.  

Illu illalu pillalu : కొడుకుల దగ్గర మాటతీసుకున్న తండ్రి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -08 లో....భద్రవతి మేనకోడలు ప్రేమ తన లవర్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది. ఏంటి ప్రేమ అసలు చెయ్యి కూడా పట్టుకొనివ్వవు.. నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ప్రేమిస్తున్నాను కాని ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉందని ప్రేమ అంటుంది. అప్పుడే రామరాజు చిన్న కొడుకు ధీరజ్ (చిన్నోడు). వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర కి వస్తాడు.‌ నువ్వు వీడిని ప్రేమిస్తున్నావా.. నువ్వు నాకు శత్రువు కని నీ గురించి చెప్తున్నా.. వాడు పెద్ద వెస్ట్ గాడు అని కళ్యాణ్ గురించి ప్రేమకి చెప్తాడు ధీరజ్. ఆ తర్వాత కళ్యాణ్, దీరజ్ లు గొడవ పడుతుంటారు. అప్పుడే దూరం నుండి ప్రేమ వాళ్ళ అన్నయ్య చూస్తాడు. దాంతో కళ్యాణ్ ని పంపిస్తుంది ప్రేమ. ప్రేమ యొక్క పెళ్లి వల్ల మా అమ్మ పరిస్థితి చూసావ్ కదా.. నీకు ఆ సిచువేన్ రావద్దంటే నువ్వు అలా చెయ్యకని ప్రేమకి ధీరజ్ చెప్పి వెళ్లిపోతుంటే.. నా చెల్లితో ఏం మాట్లాడావ్ రా అని అతన్ని అడుగగా.. నీ చెల్లినే అడుగమని ధీరజ్ అంటాడు. అతను తన చెల్లి ప్రేమ దగ్గరికి వచ్చి..వాడేం అంటున్నాడని అడుగుతాడు. కళ్యాణ్ తో తన ప్రేమ విషయం భయటపడకూడదని చాలా తెలివిగా.. ధీరజ్ నన్ను ప్రేమించమంటూ వెంటపడుతున్నాడని అంటుంది. దాంతో అతను వెళ్లి భద్రవతికి చెప్తాడు. ఇక భద్రవతి, సేనాపతి లు రామరాజు ఇంటికి గొడవకి వెళ్తారు. నీ కొడుకు నా కూతురు వెంట పడుతున్నాడని సేనాపతి అంటాడు. అవునని ప్రేమ అంటుంది.  అప్పుడే దీరజ్ వస్తాడు. ఆ అమ్మాయి గురించి ప్రేమ గురించి మాట్లాడావా అని రామరాజు అడుగగానే.. అవునని అసలు విషయం చెప్తుంటాడు. కానీ అంతలోనే లోపలికి లాక్కొని వెళ్లి రామరాజు కొడతాడు. అసలు చెప్పేది కూడా వినడు. ఆ తర్వాత ఇక నేనొక నిర్ణయం తీసుకున్నా నాలా నా కొడుకులు ప్రేమ వివాహం చేసుకొని బాధపడకూడదు. మీరు ఎవరిని ప్రేమించనని మాట ఇవ్వండి అనగానే ధీరజ్ మాటిస్తాడు. పెద్దోడుణ నడిపోడు తమ ప్రేమించిన అమ్మాయిలని గుర్తు చేసుకుంటూ భయంగా మాటిస్తారు. తరువాయి భాగంలో నా కొడుకులు నేను అడగ్గానే మాటిచ్చారని వేదవతికి రామరాజు చెప్తాడు. ఆ తర్వాత చిన్నోడితో పెద్దోడు, నడిపోడు తమ ప్రేమ విషయం చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కళ్ళు తిరిగి పడిపోయిన శౌర్య.. కార్తీక్ నిజం చెప్పనున్నాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -207 లో.. దీపని రెస్టారెంట్ కి తీసుకొని వస్తాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న ఒకవైపు.. శివన్నారాయణ‌ మరోవైపు వస్తారు. నా పేరు గానీ, ఇంట్లో వాళ్ళ పేరు గానీ ఎక్కడ వాడకని శివన్నారాయణ కార్తీక్ కి చెప్పి జ్యోత్స్నని తీసుకొని వెళ్తాడు. చూసావా తాతయ్య ఆ దీపకి ఎంత పొగరో అని జ్యోత్స్న అంటుంది. ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసని శివన్నారాయణ అనగానే.. తాతయ్య ఏం చెయ్యబోతున్నారని జ్యోత్స్న ఆలోచిస్తుంది. ఆ తర్వాత దీపని తీసుకొని ఇంటికి వస్తాడు కార్తీక్. వాళ్లు డల్ గా రావడంతో ఏదో జరిగిందని అనసూయ, కాంచనలు అనుకుంటారు. శౌర్యకి చాక్లెట్ ఇచ్చి ఏం జరిగిందని ఇద్దరు అడుగుతారు. జ్యో ఇంకా తాతయ్య వచ్చాడని శౌర్య చెప్తుంది. అప్పుడే దీప రాగానే శౌర్య లోపలికి వెళ్తుంది. నాన్న వచ్చాడా అని కాంచన అనగానే.. ఓనర్స్ కదా వస్తారని దీప అంటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి కార్తీక్ వెళ్లి.. జ్యోత్స్న ఏంటో ఈ పొగరు.. నా బావ నీ మొగుడు అయ్యాడనా అని అంటే అవుననుకో అన్నావ్ కదా.. అది మనస్ఫూర్తిగా అన్నావా అని కార్తీక్ అడుగుతాడు. అవునని దీప అనగానే.. కార్తీక్ మురిసిపోతాడు. ఆ తర్వాత కాంచన, అనసూయ లు ఏం జరిగిందని కార్తీక్ ని అడుగుతారు.