Karthika Deepam2: కార్తిక్ కోసం ప్రేమగా వండిన దీప.. పరుగులు పెట్టించిన జ్యోత్స్న!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-223లో.. మీతో నేను గెలవలేకపోతున్నాను కార్తీక్ బాబు.. నేను ఆలోచించేది రెండు కుటుంబాలు కలవాలని. మీరు, మీ అమ్మగారు బాధపడకూడదని.. కానీ మీరు నా మాటే వినడం లేదని అని మనసులో అనుకుంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనసూయతో కలిసి కాంచన ప్లాన్ వేస్తుంది. దీప ఆలోచనలు వదిలేసి మామూలుగా అవ్వాలంటే వంట చేయించాలి.. కార్తీక్ ఇష్టాలు తెలుసుకునేలా చెయ్యాలని. అనుకున్నట్లే దీపను పిలిచి.. ఈరోజు కార్తీక్‌కి ఏమి ఇష్టమో అదే చెయ్.. వాడికి ఏమిష్టమో వాడినే అడిగి తెలుసుకోమని దీపకి చెప్తుంది కాంచన. దాంతో దీప కార్తీక్ గదికి వెళ్తుంది.
అప్పటికి కార్తీక్, శౌర్యతో వైకుంఠపాళి ఆడుతుంటాడు. ఏం వండమంటారని కార్తీక్‌ని దీప అడుగగా..గుత్తివంకాయ కూర ఇష్టమని కార్తీక్ చెప్పడంతో అదే వండుతానంటుంది. అయితే ఆమె అడగటం, అతడు చెప్పడం అంతా కాంచన, అనసూయలు చాటుగా చూస్తారు. దీపా నువ్వు నా ఇష్టాల గురించి తెలుసుకుంటున్నావంటే.. నీ మనసు మారుతుంది. త్వరలోనే నువ్వు పూర్తిగా మారితే నా జీవితం నవవసంతంగా మారుతుంది.. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా దీపా అని తనలో తానే మురిసిపోతాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న అందంగా రెడీ అవుతుంది. తలకు తగిలిన గాయానికి కూడా మేకప్ వేసుకుని.. కవర్ చేసేస్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఎక్కడికి నేను కూడా వస్తాననగా.. జ్యోత్స్న వద్దని చెప్తుంది.
అసలు ఆ రోజు సైదులు గాడ్ని చంపేటప్పుడు వారసురాల్ని ఏం చేశాడో వివరంగా తెలుసుకోవాలి కదా అంటూ పారిజాతాన్ని జ్యోత్స్న తిడుతుంది. ఏంటే నిన్న కూడా ఇదే విషయం గురించి తిట్టావ్.. ఎంతకు అంత భయపడుతున్నావ్.. వారసురాలు రాదు. దొరకదు.. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావంటూ గట్టిగానే పారిజాతం అడుగుతుంది. ఏం లేదులే అంటూ మాట మార్చేస్తుంది జ్యోత్స్న. ఇక ఇప్పుడు ఎక్కడికి బయలుదేరావని జ్యోత్స్నని పారిజాతం అడిగితే.. ఇప్పటి దాకా జరిగింది ఓ లెక్కా.. ఇక మీదట జరిగేదే అసలు లెక్క.. నేను చూపించేది టీజర్ కాదు.. సినిమా రిలీజ్ కాబోతుంది. వెయిట్ అండ్ సీ అనేసి జ్యోత్స్న వివరంగా చెప్పకుండానే ఆఫీస్‌కి వెళ్తుంది. కార్తీక్ ఇంటికి కాశీ, స్వప్నలు వస్తారు. దీప వంట చేస్తూ ఉంటే హాల్లో అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దీప వచ్చి.. కార్తీక్ బాబు మీకిష్టమైన గుత్తివంకాయ కూర రెడీ అంటుంది. కార్తీక్, కాంచనలు చెప్పడంతో తినడానికి కాశీ, స్వప్నలు కూడా కూర్చుంటారు. దీప కూడా కూర్చుని అందరికీ వడ్డిస్తూ తింటూ ఉంటుంది. నాకు ఈ కూర చాలా ఇష్టం.. బాగా లాగిస్తానని సంబరంగా అన్నం పెట్టించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫోన్ మోగుతుంది. తినేటప్పుడు ఫోన్ ఎందుకురా అని కాంచన, స్వప్న ఇద్దరూ కార్తీక్‌తో అంటారు కానీ వినకుండా లిఫ్ట్ చేస్తాడు. హలో ప్రభాకర్ చెప్పమని అంటాడు కార్తీక్. మేడమ్ గారు అర్జెంట్‌గా ఆఫీస్‌కి రమ్మంటున్నారు సర్ అని అంటాడు. ఆ క్యాబిన్‌లో జ్యోత్స్న కూర్చుని పొగరుగా ప్రభాకర్ ఫోన్‌లో కార్తీక్ మాటలు వింటూనే ఉంటుంది. నాకు ఇంటికి రిలేటివ్స్ వచ్చారు.. రావడానికి టైమ్ పడుతుందని చెప్పమని కార్తీక్ అనగా.. వెంటనే ప్రభాకర్.. జ్యో వైపు చూస్తాడు. నో.. ఇప్పుడే రమ్మని చెప్పమని ప్రభాకర్‌కి సైగ చేస్తుంది జ్యోత్స్న. సారీ సర్ మేడమ్ గారు మిమ్మల్ని అర్జెంట్‌గా రమ్మంటున్నారు. మీరు రావడం 5 నిమిషాలు లేట్ అయిన మేడమే మీ ఇంటికి వస్తారట అని అంటాడు. అంత అర్జెంటా అని కార్తీక్ అనగా... వెంటనే జ్యోత్స్న వైపు తిరుగుతాడు. అవునన్నట్లుగా తలాడిస్తుంది జ్యోత్స్న. అవును సర్.. మేడమ్ గారికి ఏమని చెప్పమంటారని ప్రభాకర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.