Brahmamudi: హాస్పిటల్ బెడ్ పై పెద్దాయన.. ఎస్సై ట్రైనింగ్ కి అప్పు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్  శుక్రవారం నాటి ఎపిసోడ్- 586 లో.. సీతారామయ్య హాస్పిటల్ లో ఉండగా.. అందరు బయట ఉంటారు. కావ్యని లోపలికి రమ్మని పిలుస్తాడు సీతారామయ్య. తను రాగానే..  అమ్మా కావ్యా అంటూ ఆక్సిజన్ మాస్క్ తీసి మాట్లాడటం మొదలుపెడతాడు సీతారామయ్య. తాతయ్యా మీకు ఆక్సిజన్ అందకపోతే మళ్లీ ఇబ్బంది అవుతుందని కావ్య అంటుంది. పర్వాలేదమ్మా.. కూర్చో.. నేను మళ్లీ నీతో మాట్లాడతానో లేదో ఏం చెప్పినా ఇప్పుడే చెప్పనివ్వు అమ్మా అని సీతారామయ్య అంటాడు. అలా మాట్లాడకండి తాతయ్యా.. మీకు ఏదైనా అయితే మీ చిట్టీ (ఇందిరా దేవి) ఏమైపోతుంది? ఇప్పటికే ఈ బావ కోసం గుండె గుప్పెట్లో పెట్టుకుని బయట ఏడుస్తూ కూర్చుందని కావ్య అంటుంది. మేము ఆకలిగా ఉన్నామని తెలిసి వాడు మాట్లాడకపోయినా అన్నం తెచ్చి పెట్టిన దానివి.. నేను లేకపోయినా నువ్వు చిట్టీని చూసుకోగలవు కదమ్మా అని సీతారామయ్య అనగా.. మీరు అలా మాట్లాడకండి తాతయ్యా. మీరు మీ చిట్టి కోసమే కాదు.. ఈ మనవరాలి కోసం మీ మనవడి కోసం క్షేమంగా తిరిగి వస్తారని కావ్య అంటుంది. అమ్మా.. నేను ఇప్పుడు చెప్పే మాటలు బాగా విను.. ఇప్పటి నుంచి ప్రతి రోజు నీకో పరీక్షలా ఉండొచ్చు.. రాజ్ నీ విషయంలో కాస్త దురసుగా ప్రవర్తించొచ్చు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు ఇల్లు దాటిన రోజు ఇల్లు చీకటి అయిపోతుంది. ఎవరికి వారు అయిపోతారు. ఇల్లు ముక్కలైపోతుంది. అలా జరగకుండా చేస్తానని నాకు మాటివ్వమ్మా అని సీతారామయ్య అంటాడు. ఇంతపెద్ద బాధ్యతను నేను ఎలా మోయగలను తాతయ్యా అని కావ్య అంటుంది. చేయగలవమ్మా.. నీ సహనమే నీకు శ్రీరామరక్ష.. ఇదే నా ఆఖరి కోరిక అనుకోమ్మా అని సీతారామయ్య అనగానే.. సరేనని కావ్య మాటిస్తుంది. ఇంతలో సీతారామయ్యకి ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో నర్స్ వచ్చి కావ్యని బయటికి పంపిస్తుంది. ఇక కావ్య బయటకు రాగానే ఏం అన్నాడని రుద్రాణి అడుగుతుంది.  లోపల తాతయ్యగారు నాతో చెప్పింది చెప్పినట్లుగా చెబుతున్నాను. కొంత మందికి నచ్చకపోవచ్చు.. అయినా చెబుతున్నాను.. తాతయ్యగారు కోలుకుని ఇంటికి తిరిగి వచ్చే దాకా కుటుంబంలో గొడవలు పడకూడదు అని అన్నారు.. ఆయన తిరిగి వచ్చాక ఎవరికి ఎలా న్యాయం చెయ్యాలో అలా చేస్తాను అని అన్నారని కావ్య అంటుంది. ఇక ఇందిరాదేవి అయితే.. బావా అంటూ ఐసీయూ గేట్ నుంచి లోపలికి చూస్తూ ఏడ్చే సీన్ మాత్రం మనసుల్ని మెలిపెట్టేస్తుంది.  మరోవైపు కళ్యాణ్ ఇంటికి ఓ పోస్ట్ వస్తుంది. అది చూసి కళ్యాణ్ సంబరపడి.. అప్పుని పిలిచి ఇస్తాడు. వావ్ కూచీ.. నేను గెలిచాను.. పోలీస్ అయ్యాను.. ట్రైనింగ్‌కి లెటర్ వచ్చేసిందని అప్పు అంటుంది. అవును నా పొట్టీ పోలీస్ అయ్యిందని కళ్యాణ్ అంటాడు. అవునురా భయ్.. ఇక నుంచి నేను నీ పోలీస్ పెళ్లాన్ని.. నువ్వు నా పాటల మొగుడివి అంటూ గుండెలపై వాలిపోతుంది అప్పు. పొట్టీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం మనం ఎంతో ఎదురు చూశాం.. ఈ విషయం వెంటనే తాతయ్య వాళ్లకు చెప్పాలి.. తాతయ్య అయితే చాలా సంతోషిస్తారని అంటాడు కళ్యాణ్. ఇంతలో ఆ లెటర్ లో ట్రైనింగ్ ఈ రోజే అని ఉండటంతో.. తొందరగా బ్యాగ్ తెచ్చుకో , నేను మా ఫ్రెండ్ కి చెప్పి టికెట్ బుక్ చేస్తా అని అంటాడు కళ్యాణ్. ఇంతలో కావ్య ఫోన్ చేసి.. తాతయ్య గారిని హాస్పిటల్ లో జాయిన్ చేశామని జరిగిందంతా చెప్తుంది. సరే వదినా వస్తామని చెప్పి కళ్యాణ్ ఫోట్ కట్ చేస్తాడు. ఇంతలో అప్పు రెడీ అయి వస్తుంది. సారీ అప్పు నేను రావడం లేదు.. లిరిక్ రైటర్ రమ్మన్నాడు.. నువ్వు ఒక్కదానివే వెళ్ళాలని కళ్యాణ్ అనగా.. కాబోయే ఎస్సై ని నాకేం భయం.. నేను వెళ్తానని అప్పు వెళ్తుంది. సారీ అప్పూ.. తాతయ్యకు బాలేదని తెలిస్తే నువ్వు ఆగిపోతావ్.. నువ్వు ఆగిపోకూడదు.. అందుకే చెప్పడం లేదని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చావు గురించి ఆర్జీవీ ఎనాలిసిస్ మాములుగా లేదు భయ్యో

  రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సెన్సేషన్ గా ఉంటుంది. ఇక తన చావు గురించే మాట్లాడితే ఎలా ఉంటుంది. దానికి కూడా సరైన ప్లాన్ చేసుకునే పెట్టుకున్నాడట రాము. ఒక ఇంటర్వ్యూలో చాలా ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. "చావు అనేది అందరికీ సహజం. కానీ నా ఎండ్ స్టేజి ఎలా ఉంటుంది అంటే నేను నా పనులు చేసుకోలేని రోజు నేను బతికుండి కూడా ఏమీ చేసుకోలేని రోజు వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. నా ఐడియాస్ నాకు ఉన్నాయి. మోస్ట్ పెయిన్ ఫుల్ డెత్ ఏంటి అనే రీసెర్చ్ చేశా. ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు బతకడం ఎందుకసలు. బతుక్కి అర్ధం లేదు కదా. ఊరికే చెట్టు లాగ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం అంతే కదా. జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతే బతకడం వేస్ట్.. చావు అనేది వేరే వాళ్లకు ఎక్స్ట్రీమ్ ఐనప్పుడు నాకు అది చాలా ఈజీగా ఉండొచ్చు. నేను ఈజీగా పెయిన్లెస్ గా చనిపోయే విధానాలను కూడా రీసెర్చ్ చేస్తున్నా. ఏ పని చేస్తున్నా స్మూత్ గా ఈజీగా ఐపోవాలి అని ఎలా అనుకుంటామో చావులో కూడా అలాగే స్మూత్ గా ఈజీగా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాం. కానీ ఎంతో కొంత పెయిన్ ఐతే ఉంటుంది. ఆ కొంత పెయిన్ కూడా స్మూత్ గా చేసుకోవాలి అంటే ఎంతో కొంతం మన జ్ఞానాన్ని, థింకింగ్ ని యూజ్ చేసి చనిపోవచ్చు. ఈ చావు అనేది ఏజ్ తో సంబంధం లేకుండా మనం మన పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు. అలాగే నాకు అవయవ దానం మీద పెద్దగా ఇంటరెస్ట్ లేదు అవయవ దానం కూడా చేయను. ఎందుకు ..ఇంకో లైఫ్ అనేది ఉండదు కదా. కళ్ళు దానం చేశాననుకోండి దేవుడు ఇంకో జన్మ ఇస్తే ఒకవేళ నీ కళ్ళు దానం చేసావ్ కదా గత జన్మలో...కాబట్టి ఈ జన్మలో కళ్ళు లేకుండా పుట్టు అని చెప్పాడే అనుకోండి నేను డిజప్పోయింట్ అవుతాను. అందుకే నేను ఎవరికీ అవయవ దానం చేయను. నేను నా కోసమే బతుకుతా..అన్ని అవయవాలు  నాతో పాటే తీసుకెళ్ళిపోతా. నేను ఇంతవరకు ఏదీ డొనేట్ చేయలేదు. ఎవరైనా డబ్బులు కావాలని అని అడిగినా అప్పటికి వాళ్ళ మీద నా ఫీలింగ్ ని బట్టి ఇస్తాను లేదంటే లేదు. " అంటూ వెరైటీగా  అనుకున్నది చెప్పుకొచ్చాడు రాము.  

మేకప్ తీసేసాను...చూసారా ఎలా ఉన్నానో  

  ఆట సందీప్ వైఫ్ జ్యోతి రాజ్ గురించి అందరికీ తెలుసు. ఆమె కూడా డాన్సర్ ..ఆట సందీప్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి రకరకాల షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. జ్యోతి రాజ్‌పై  ఈమధ్య బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్స్..మీది నాచురల్ బ్యూటీ కాదు. మీరు అందంగా ఉండరు అంటూ ఇలా అన్నమాట. ఐతే జ్యోతి దీని మీద ఒక వీడియో చేసింది. వీడియోలోనే తన మేకప్ ని తీసేస్తూ అలాగే ఫేస్ మొత్తాన్ని రబ్ చేస్తూ చూసారా..మేకప్ లేకుండా చూడలేము అన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. పర్లేదు..కొంచెం బాగుంటాను కాబట్టే మా ఆయన చేసుకున్నాడు. కొంచెం అంతో ఇంతో పర్లేదు. యావరేజ్ గా ఉంటాను అందరూ అంటున్నట్టు మరీ ఘోరంగా ఉండను. చూసారు మేకప్ లేకుండా ఫిల్టర్ కూడా లేకుండా ఎలా ఉన్నానో అంటూ తన ఫేస్ ని చూపించింది. ఇది చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "మా డాన్స్ మాస్టర్ సెలక్షన్ అద్భుతంగా ఉంటది మా మాస్టర్ గారి సెలక్షన్ సూపర్ ...మీరు ఏ లెవెల్ లో ఉంటారో  మా మాస్టర్ కి తెలుసు మిగతా వాళ్ళకి అవసరం లేదు.. మీ మనసు మంచిది మీకు ఏ మేకప్ అవసరం లేదు. యావరేజ్ ఫేస్ కాదు నాచురల్ అండ్ పాజిటివ్ ఫేస్ మీది. మీరు యావరేజ్ కాదండి ట్రెడిషనల్ గా చాలా బాగున్నారు. నిజం చెప్పాలంటే ఇలాగే మీరూ చాలా అందంగా వున్నారు.." అంటూ జ్యోతిరాజ్ కి బూస్ట్ ఇస్తూ కామెంట్స్ పెట్టారు.  

Vishnupriya: మీ ప్రేమ, ఆదరణ, టైమ్ నాకిచ్చి నన్ను విజేతగా చేస్తారని ఆశిస్తున్నా

  బిగ్ బాస్ సీజన్-8 చివరి దశకు చేరుకుంది. ఇందులో ఇప్పటికే ప్రేరణ, నబీల్ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి, విష్ణుప్రియ చెరో టాస్క్ గెలిచారు‌. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ కి అర్హులు కాదని అనుకుంటున్నారో చెప్పమని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చెప్పగా.. అవినాష్ మినహా అందరు విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు. ఇక తను ఓట్ అప్పీల్ కి సెలెక్ట్ అయ్యింది. ఓట్ అప్పీల్ లో తనేం మాట్లాడిందో ఓసారి చూసేద్దాం. ఓట్ అప్పీల్ కోసం ఇన్‌ఫినిటీ రూమ్‌కి వెళ్లింది విష్ణుప్రియ. ఇప్పటివరకు చాలా షోలలో నన్ను చూసి ఆదరించి ఈ స్థాయి వరకూ నన్ను తీసుకొచ్చినందుకు థాంక్యూ.. ఇప్పటివరకు నన్ను మెచ్చి నా గురించి కొంచెమే తెలుసుకున్నారు.. బట్ ఈ షోకి వస్తే నా మొత్తం స్వభావం మీకు తెలిసి నచ్చినవాళ్లకి ఇంకా చేరువవుతాను.. ఇప్పటివరకు నన్ను మెచ్చి ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.. నా బిహేవియర్ నచ్చని వాళ్లకి ఐయామ్ సారీ.. బట్ నన్ను నన్నుగా ప్రేమించి ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఈ పద్నాలుగు వారాలు ఈ షోలో ఇక్కడి వరకు తెచ్చినందుకు థాంక్యూ.. ఇంకా ఒక్క వారం దగ్గరిలో ఉన్నాను.. మీ ప్రేమ, ఆదరణ మీ టైమ్ నాకు ఇచ్చి నన్ను విజేతగా చేస్తారని ఆశిస్తున్నానంటూ విష్ణుప్రియ చెప్పింది. నాకు వీలైనంత నిజాయితీగా వంద శాతం ఇవ్వడానికి నేను ట్రై చేశాను.. అలానే ఈ సీజన్‌కి నేను ఓ మహిళా విజేతగా నిలవాలనుకుంటున్నాను.. ఇప్పటివరకు బిగ్‌బాస్‌లో అవ్వలేదు.. ఆ కోరిక తీసుకొని ముందుకొచ్చాను.. నేను విజేత కావాలని కోరుకుంటున్నాను.. నా కోరిక మీరు మనస్ఫూర్తిగా తీరుస్తారని ఆశిస్తున్నాను.. మీ ఓట్ నా గెలుపు అవుతుంది.. ఇక్కడి వరకూ తీసుకొచ్చినందుకు థాంక్స్.. ఇంకా ఒక్క వారమే ఉంది.. మీ టైమ్ నాకు ఇవ్వండి అంటూ విష్ణుప్రియ రిక్వెస్ట్ చేసింది.  

టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ టు జబర్దస్త్...అక్కడి నుంచి బిగ్ బాస్...టేస్టీ తేజ జర్నీ ఇదే...

  కమెడియన్ గా తేజ గురించి అందరికీ తెలుసు మరి ఏంటి అందరూ టేస్టీ తేజా అంటారు..ఎలా ఆ పేరు వచ్చింది అని అడిగేసరికి దాని హిస్టరీ మొత్తం చెప్పుకొచ్చాడు తేజ ఒక ఇంటర్వ్యూలో. "టేస్టీ తేజ అనేది నా యూట్యూబ్ ఛానల్ పేరు. ఇందులో సినీ సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను షెఫ్ ని కూడా.. రకరకాల ఫుడ్ కూడా వండుతాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం నాలుగు భాషలకు సంబంధించి 150 కి పైగా యాక్టర్స్ తో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ ని నేను. డైరెక్టర్స్, యాక్టర్స్, కమెడియన్స్, సింగర్స్ తో అందరితో ఇంటర్వ్యూస్ చేశా. అలాగే తెలుగు ఇండస్ట్రీ 90 ప్లస్ మూవీస్ ని ప్రమోట్ చేశా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. అసలు ఈ ఐడియా నాకు రావడం నేను దాన్ని అమలు చేయడం అది క్లిక్ అవడం లక్ అని చెప్పాలి. మొదట్లో నాకు జబర్దస్త్ లో అదిరే అభి ఒక అవకాశం ఇచ్చారు. అన్న టీమ్ లో 8 వ వాడిగానో 9 వాడిగానో ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత కమెడియన్ గా తేజ అనే వాడు జబర్దస్త్ లో చేస్తున్నాడు అనే విషయం జనాలకు తెలియడానికి రెండేళ్లు పట్టింది. 2016 లో అభి అన్న టీమ్ లో చేశా. 2018 లో తేజ అంటూ నేనొకడ్ని ఉన్నాను అనే విషయం అందరికీ తెలిసింది. ఒక టీమ్ లో చేస్తున్నప్పుడు నేను జనాలకు తెలియడానికి రెండేళ్లు పట్టింది అప్పుడు నాకు ఇండివిడ్యువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెంత టైం పడుతుందో అనుకున్నా. ఆ టైంలో కూడా నేను టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా జాబ్ చేస్తూ ఉన్నాను. అలా జాబ్ చేస్తూ జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ మేనేజ్ చేసేవాడిని. అప్పుడు నా  ఇండివిడ్యువల్ ఐడెంటిటీ కోసం ఎం చేయాలా అని ఆలోచిస్తుండగా అప్పుడే యూట్యూబ్ బూమ్ కొంచెంకొంచెంగా  స్టార్ట్ అయ్యింది. నాకు యూట్యూబ్ ఫ్రెండ్ మహీధర్ అని వున్నాడు. యూట్యూబ్ లో ఏదో ఒకటి చెయ్యమని చెప్పాడు. అప్పుడు ఫుడ్ వీడియోస్ చేద్దామని ఐడియా వచ్చింది. నేనొక్కడినే తింటూ వీడియోస్ చేస్తే ఎవరూ చూడరు అనిపించి మొదట నా ఫ్రెండ్స్ ని అటు ఇటు కూర్చోబెట్టుకుని వీడియోస్ చేయడం స్టార్ట్ చేశా. అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యువి క్రియేషన్స్ నుంచి గీత ఆర్ట్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి వాళ్ళ మూవీ ప్రమోషన్స్ చేయాలనీ పిఆర్వోలు అడగడం అలా స్టార్ట్ అయ్యింది నా యూట్యూబ్ జర్నీ. అది కాస్తా బిగ్ బాస్ 7 వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా అవకాశం ఇచ్చేలా చేసింది." అని చెప్పాడు తేజ.

రోహిణిని కాదని విష్ణుప్రియకే ఓటు.. బిగ్ బాస్ మ్యాజిక్ అంటే ఇదే!

  సీజన్-8 లో ఓట్ అప్పీల్ లో భాగంగా మొదటి రోజు ప్రేరణ అర్హత సాధించగా, రెండో కంటెస్టెంట్ నబీల్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఓట్ అప్పీల్ కోసం రెండు టాస్క్ లు జరిగాయి. మొదటిది రోహిణి గెలవగా.. రెండో టాస్క్ విష్ణుప్రియ గెలిచింది. రెండవ ఓట్ అప్పీల్ కంటెండర్ అయ్యేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ఇస్తున్న ఛాలెంజ్.. నిలబెట్టు పడగొట్టు.. ఈ ఛాలెంజ్‌లో భాగంగా పోటీదారులు ప్లాట్ ఫామ్ మీద ఉడెన్ బ్లాక్స్‌ని నిలబెట్టి వాటి చివర ఓట్ అప్పీల్ చేయడానికి అర్హత లేదనుకున్న సభ్యుని ఫొటోని పెట్టి కింద ఉన్న వేస్ట్ బాక్స్‌లో పడేయాల్సి ఉంటుంది.. చివరి వరకూ వేస్ట్ బాక్స్‌లో ఫొటో పడకుండా ఉన్న సభ్యులు ఓట్ అప్పీల్ చేసుకునే రెండో సభ్యుడు అవుతారు.. రోహిణి ఇప్పటికే ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కంటెండర్ కావడంతో ఆమె సంచాలక్.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక బజర్ మోగగానే ఫస్ట్ విష్ణు ఫొటో పడేశాడు అవినాష్. ఆ తర్వాత అవినాష్ ఫొటోని ప్రేరణ పడేసింది. వెంటనే గౌతమ్‌ది నిఖిల్.. ప్రేరణది నబీల్.. నిఖిల్‌ది విష్ణు.. కూడా పడేశారు. చివరిగా నబీల్ ఫొటో మిగిలింది.. దీంతో విన్నర్ నబీల్ అంటూ రోహిణి చెప్పింది. కానీ ఇక్కడ బిగ్‌బాస్ కలుగజేసుకొని అందరు రూల్స్‌తో పాటు ఆడారా అంటూ అడిగాడు. అయితే ఇందులో రూల్స్ ప్రకారం నలుగురు ఫౌల్ గేమ్ ఆడారు. దీంతో అన్నీ ఆలోచించి విష్ణు ఫొటో చివరి వరకు ఉందంటూ విన్నర్‌ ని చేసింది రోహిణి. దత్తపుత్రిక అని విష్ణుప్రియని ఎందుకు అంటారో మరోసారి ఋజువు చేస్తూ బిగ్ బాస్ ఆట మధ్యలో కలుగచేసుకున్నాడు. ఇక గేమ్ లో నేనే రైట్ ఆడా.. నేనే రూల్స్ ఫాలో అయ్యానంటూ ప్రేరణ అంది. అంతేకాకుండా నీ గేమ్ నీకు లేదా అంటూ నబీల్‌ని రెచ్చగొట్టింది. దీంతో నబీల్‌కి చిరాకొచ్చి ఎందుకు కావాలని ట్రిగ్గర్ చేస్తావ్.. నేనేం చేసినా అంటూ నబీల్ అడిగాడు. అయినా సరే ప్రేరణ ఆపకుండా అలా వాదిస్తూనే ఉంది. దీంతో నీకు దండం పెడతా ఊకో ప్రేరణ అంటూ నబీల్ అన్నాడు. అప్పుడు కూడా నీకే పెట్టుకో దండం అంటూ ప్రేరణ అంది. మొదటి టాస్కులో గెలిచి రోహిణి, రెండో టాస్కులో గెలిచి విష్ణు ఓట్ అప్పీల్ కంటెండర్లుగా నిలిచారు. కానీ రోహిణి- విష్ణుప్రియలలో ఒకరికి మాత్రమే ఓట్ అప్పీల్ చేసే అవకాశం ఉంది.. అది ఎవరో ఇంటి సభ్యులు నిర్ణయించండి.. అర్హత లేదు అన్నవాళ్లకి బ్యాడ్జ్ ఇవ్వండి.. ఎవరికి తక్కువ బ్యాడ్జెస్ వస్తాయో వాళ్లకి ఓట్ అప్పీల్ అవకాశం.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో విష్ణుప్రియ హౌస్‌మేట్స్ అందరిని రిక్వెస్ట్ చేసింది. ఇక ఈ ఓటింగ్‌లో కేవలం అవినాష్ తప్ప మిగిలిన వాళ్లంతా విష్ణుకే సపోర్ట్ చేశారు. దీంతో విష్ణు ఓట్ అప్పీల్ చేసేందుకు సెలక్ట్ అయింది.

కన్నీళ్ళు పెట్టుకున్న రోహిణి.. అవినాష్ త్యాగం చూసి ఆడియన్స్ ఫిధా!

  బిగ్ బాస్ సీజన్-8  క్లైమాక్స్ చేరింది‌. హౌస్ లో నబీల్, నిఖిల్, అవినాష్, గౌతమ్, రోహిణి, ప్రేరణ, విష్ణుప్రియ మొత్తంగా ఏడుగురు మాత్రమే ఉన్నారు.  కంటెస్టెంట్స్ మధ్య ఓట్ అప్పీల్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో రోహిణి, అవినాష్ ల ఆటతీరు ఆకట్టుకుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ముందుగా ఓ టాస్కు పెట్టాడు. ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి మూడో అవకాశాన్ని కల్పిస్తూ ఆడియన్స్‌తో కనెక్ట్ అయి మీరు విన్నర్ అవ్వడానికి ఒప్పించేందుకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్ పవర్ ఫ్లాగ్.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా లైన్స్ లోపల ఉన్న ఫ్లాగ్స్‌ని తీసుకోవడానికి ప్రయత్నించడం.. ప్రతీసారీ బజర్ మొగగానే ముందుగా ఎవరైతే ఫ్లాగ్‌ని పట్టుకొని ఆ రౌండ్ ఎండ్ బజర్ మోగేవరకూ తమ దగ్గర ఉంచుకుంటారో వాళ్లు ఆ రౌండ్‌లో ఒకరిని ఛాలెంజ్‌ నుంచి తప్పించాల్సి ఉంటుంది.. చివరికి మిగిలిన సభ్యుడు ఈ ఛాలెంజ్ విజేతగా నిలిచి ఓట్ అప్పీల్ కంటెండర్‌గా నిలుస్తారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. మొదటి రౌండ్‌లో గౌతమ్ తల.. విష్ణుప్రియ ముక్కుకి తగలడంతో కాసేపు సైలెంట్ అయిపోయింది విష్ణు. ఇక ఫస్ట్ రౌండ్‌లో నబీల్‌ని, తర్వాత ప్రేరణని.. మూడో రౌండ్‌లో నిఖిల్‌ని తప్పించేశాడు గౌతమ్. అసలు గౌతమ్ ఆట చూస్తే ఖచ్చితంగా తనే గెలుస్తాడని అనిపించింది. ఆ తర్వాత గౌతమ్ చేతిలో నుంచి ఎలాగోలా రోహిణి ఫ్లాగ్ లాక్కుంది. దీంతో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన గౌతమ్‌ని తప్పించింది రోహిణి. ఆ తర్వాత అవినాష్ ఫ్లాగ్ అందుకొని విష్ణుని రేసు నుంచి తప్పించాడు. ఇక చివరిగా రోహిణి- అవినాష్ ఇద్దరూ మిగిలారు. అవినాష్ చేతికి ఫ్లాగ్ దొరికిన వెంటనే రోహిణికి ఇచ్చేశాడు. ఎందుకురా ఆడు అంటూ రోహిణి అన్నా కుడా నీ చేతులు బాగోలేదని అన్నావ్‌గా తీసుకో.. నా ఫ్రెండ్ గెలవాలి అంతే.. అంటూ అవినాష్ ఇచ్చేశాడు. దీనికి రోహిణి బాగా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. 

Illu illalu pillalu : ప్రేమించిన అమ్మాయితో లేచిపోడానికి కొడుకు ప్లాన్.. నాన్న గుర్తించగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -21 లో....వేదవతి ఏడుస్తుంటే ప్రేమ చూస్తుంది. నీ కూతురు ఏడుస్తుందని వాళ్ళ నానమ్మకి చెప్తుంది. దాంతో తను తన కూతురు దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతుంది. నా కొడుకులు సంతోషంగా లేరని బాధపడుతుంది వేదవతి. నిన్ను బంగారంలా చూసుకునే నీ భర్త ఉండగా.. నీకు ఎందుకు బాధ అంటూ వాళ్ళ అమ్మ దైర్యం చెప్తుంది. అదంతా ప్రేమ చూస్తుంది. అప్పుడే ధీరజ్ కూడా వస్తాడు. ధీరజ్ , ప్రేమ లు ఒకరినొకరు చూసుకొని చిరాకు పడుతారు.  ధీరజ్ దగ్గర ప్రేమ ఫోన్ తీసుకొని కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరొక వైపు నర్మద సాగర్ ని కలిసి మాట్లాడుతుంది. మీ అమ్మ, నాన్న నీ తీసుకొని రమ్మంటే నువ్వు మీ తమ్ముడు వచ్చారని కోప్పడుతుంది. మా వాళ్లని ఎదురించి అయిన సరే నిన్ను పెళ్లి చేసుకుంటా.. నువ్వు అలా రాగలవా అని నర్మద అనగానే సాగర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేమ రాత్రి వస్తుంటే తను స్కూటీ పాడవుతుంది. అప్పుడే రామరాజు వెళ్తు.. ప్రేమ దగ్గర ఆగి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అదంతా వాళ్ళ బాబాయ్ చూసి బావ ఎంత మంచోడు.. నువ్వు శత్రువు కూతురు అయినా సరే వదిలెయ్యకుండా తీసుకొని వచ్చాడని ప్రేమతో అంటాడు. మరొకవైపు సాగర్, నర్మద మాటలు గుర్తుచేసుకుంటాడు. నర్మద ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యడు. డైరెక్ట్ ఇంటికి వచ్చినా వస్తుందని ధీరజ్ అంటాడు. నిజంగానే నర్మద ఇంటి ముందు ఉంటుంది. అది చూసి సాగర్ త్వరగా బయటకు వెళ్తాడు. ఇక్కడ నుండి వెళ్ళు అంటాడు. నాకు సమాధానం చెప్పే వరకు వెళ్ళనని నర్మద అంటుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ ని  తీసుకొని ధీరజ్ ఇంట్లో నుండి వచ్చేస్తాడు. నర్మద ఇంటి ముందు ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్ పై దీపకి డౌట్.. శౌర్యకి  నాన్నవే కదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -220 లో.... జ్యోత్స్నని దీప కాపాడుతుంది. దాన్ని కూడా శివన్నారాయణ తప్పుగా అర్థం చేసుకొని దీపని తప్పు పడతాడు. దాంతో కార్తీక్ ఇంటికి వచ్చాక దీప సాయం చేసింది మర్చిపోయి తిడుతున్నాడు. ఆ విషయం కూడా వాళ్లకి ఫోన్ చేసి చెప్పింది దీపే.. అలాంటిది తననే అంటున్నాడని కాంచనతో కార్తీక్ అంటాడు. చెప్పింది విన్నాక అర్థం చేసుకున్నాడు బాబు.. మీరు ఆవేశపడకండి అని దీప అంటుంది. ఆ తర్వాత శౌర్యా ఆరోగ్యం గురించి తెలుసుకోవడం వీలు కాలేదని దీప అనుకుంటుంది. డాక్టర్ ఏమన్నాడు శౌర్య అని దీప అడుగుతుంది. నాన్న మాట్లాడాడని శౌర్యా చెప్తుంది. అయిన దీపకి డౌట్ ఉంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి ఎందుకు అలా చేస్తున్నావ్ దీప.. ఇంకా ఆ భయం ఎందుకని కార్తీక్ అంటాడు. బాధ్యత మొత్తం తండ్రి పైనే ఉంటే ఎలా అని దీప అనగానే.. థాంక్స్ దీప నన్ను శౌర్యకి తండ్రి అన్నందుకు అని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి దాస్ వస్తాడు. పారిజాతాన్ని బయటకు పంపించి.. నువ్వు కావాలనే దీపని చంపాలనుకున్నావంటూ నిలదీస్తాడు కానీ జ్యోష్న ఏదో డైవర్ట్ చెయ్యాలని అనుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కి దాస్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే కాశీ కూడా జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. శివన్నారాయణ వచ్చేసరికి అందరు ఉండడంతో వాళ్ళని పంపించమని కోప్పడతాడు. ఆ తర్వాత దీప అసలు అయిన వారసురాలని నీకు చెప్పడం అనవసర..  అందుకే చెప్పడం లేదని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ దగ్గరికి దీప వచ్చి.. బాబు ఒకసారి జ్యోత్స్నకి ఎలా ఉందో కనుక్కోండి అని అంటుంది. నేను అడగనని కార్తీక్ అనగా.. అడుగు రా అని కాంచన అంటుంది. నువ్వు అడుగు అని కార్తీక్ అంటాడు. మీ పిన్ని అక్కడే ది కదా అడుగమని కాంచనతో అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu: సవతి తల్లి ఎత్తుగడని చిత్తుచేసిన కోడలు.. కొడుకుకి నిజం తెలిసేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -271 లో.....మాణిక్యాన్ని రామలక్ష్మి కలుస్తుంది. ఇక ప్లాన్ ప్రకారం లాయర్ , శంకర్ లని తీసుకొని వచ్చి శ్రీలత చేస్తున్న కుట్ర గురించి చెప్పించాలని మాణిక్యం అనగానే వద్దు నాన్న సీతా సర్ కి తన తల్లి గురించి తెలిస్తే తట్టుకోలేడు. అందుకే తన తప్పు తానే తెలుసుకునే విధంగా చెయ్యాలని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి ఇల్లు క్లీన్ చేస్తుంటుంది. అప్పుడే శ్రీలత పై నుండి కిందకి వస్తుంటే రామలక్ష్మి బకెట్ పడేస్తుంది. దాంతో శ్రీలత కింద పడిపోతుంది. అది విని అందరు వస్తారు. శ్రీలత కాలు బెనకడంతో సీతాకాంత్ మసాజ్ చేస్తాడు. అప్పుడే పంతులు వస్తాడు. శ్రీలత గారి జాతకం చూసాను. కొన్ని దోషాలున్నాయి. ఇంకా ఇలాంటివి జరుగుతుతాయి. అందుకే గుడిలో పూజ చెయ్యాలని పంతులు అనగానే.. చేస్తామని సీతాకాంత్ అంటాడు. అందుకు రామలక్ష్మి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత పంతులు బయటకు వెళ్ళాక.. థాంక్స్ పంతులు గారు నేను అడిగానే హెల్ప్ చేశారని రామలక్ష్మి అనగానే మంచి పని కోసమే కదమ్మా అని పంతులు అంటాడు. ఆ తర్వాత శ్రీలత వాళ్ళ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. నేనే కావాలని బకెట్ తన్నానని చెప్పగానే వాళ్లు షాక్ అవుతారు. ఆ తర్వాత అందరు గుడికి బయల్దేరుతారు. రామలక్ష్మి, సీతాకాంత్ లు కలిసి వస్తారు. వాళ్లు ఆలా రావడం శ్రీలత చూడలేకపోతుంది. శంకర్ , లాయర్ లని తీసుకొని మాణిక్యం వస్తాడు. అందరు గుడికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆస్తిని ముక్కలు చేయాలన్న కోడలు.. కుప్పకూలిన ఇంటి పెద్దాయన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -585 లో....కళ్యాణ్ బయటకు వెళ్తుంటే.. అప్పు దగ్గర ఉండి రెడీ చేస్తుంది. అప్పుడే అనామిక వస్తుంది. టీ, కాఫీ లు అందించడానికి వెళ్తున్న భర్తని బానే రెడీ చేస్తున్నావని అనామిక అనగానే.. అప్పు ఆశ్చర్యంగా చూస్తుంది. కళ్యాణ్ రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర పని చెయ్యడానికి వెళ్తున్నాడని అనామిక చెప్తుంది. అప్పుకి కళ్యాణ్ చెప్పిన అబద్ధం అనామిక చెప్పి వెళ్ళిపోతుంది. నీకు ఆ విషయం చెప్తే బాధపడతావని చెప్పలేదు కానీ నీకు అబద్దం చెప్పాలని కాదని కళ్యాణ్ అనగానే.. అప్పు అర్ధం చేసుకుంటుంది. మరొకవైపు ఇంట్లో ఎవరు లేరని ధాన్యలక్ష్మిని రుద్రాణి రెచ్చగొట్టే పనిలో పడుతుంది. ఇప్పుడు వెళ్లి అందరూ కావ్యని తీసుకొని వస్తారు. ఇక ఆస్తులు ముక్కలు చేసి.. నీ కొడుకు న్యాయం ఎలా చేస్తారంటూ ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత కావ్య, అపర్ణలని తీసుకొని సీతారామయ్య, ఇందిరాదేవిలు వస్తుంటారు. అప్పుడే హాల్లో ధాన్యలక్ష్మి ఊరేసుకోవాలని ట్రై చేస్తుంది. కావ్య, అపర్ణ ఇద్దరు ధాన్యలక్ష్మిని దింపుతారు. ధాన్యలక్ష్మి చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. ఈ రుద్రాణి మాటలు విని ఇదంతా చేస్తున్నావా అంటూ ఇందిరాదేవి, అపర్ణ కలిసి ధాన్యలక్ష్మిని తిడతారు. ఆ తర్వాత ఆస్తులు ముక్కలు చెయ్యాలని ధాన్యలక్ష్మి డిమాండ్ చెయ్యడంతో సీతారామయ్య కింద పడిపోతాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా అంటూ ధాన్యలక్ష్మిని ఇందిరదేవి తిడుతుంది. తరువాయి భాగంలో సీతారామయ్య కావ్య దగ్గర ఇంట్లో నుండి బయటకు వెళ్లొద్దంటూ మాట తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వైల్డ్ ఫైర్ తో కిర్రాక్ సీత...

  కిర్రాక్‌ సీత బేబీ మూవీతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళొచ్చింది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఇంకా పాపులర్ అయ్యింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.  7ఆర్ట్స్ యూట్యూబ్‌ చానెల్‌లో  తనదైన కామెడీ, ఫన్నీ వీడియాలతో ఆకట్టుకునేది సీత..ఈ ఛానెల్ ద్వారా ఆమెకు కొంత గుర్తింపు వచ్చింది. కానీ బేబీ మూవీతో ఇప్పుడు జనాలందరికీ తెలిసింది. అలాంటి సీత వైల్డ్ ఫైర్ తో ఫోటో దిగి ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. "ఐకానిక్ స్టార్ తో ఫోటో దిగడం నిజంగా అనుకోలేదు. ఎం నటించారు సర్ మూవీలో.. బేబీ మూవీలో నా యాక్టింగ్ బాగుంది అని మీరు చెప్పడం నిజంగా ఐకానిక్ మెమరీ నాకు. ఈ సందర్భాన్ని నేనెప్పుడూ మర్చిపోను" అంటూ పోస్ట్ పెట్టింది. ఇక నెటిజన్స్ ఐతే ఫైర్ ఎమోజిస్ పెట్టి సీతను ఎంకరేజ్ చేస్తున్నారు. సీత పుట్టింది నంధ్యాలలో. అక్కడే స్కూలింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌ ఉప్పల్లో సెటిల్ అయ్యింది. ఐతే అనూహ్యంగా బేబీ మూవీతో ఆమె క్రేజ్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. బేబీ సినిమా తర్వాత మళ్లీ అంతటి గొప్ప అవకాశం సీతకు రాలేదు.. మరి బిగ్ బాస్ కి వెళ్లివచ్చిన వాళ్లకు ఎంతో కొంత లక్ కలిసి వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. మరి సీత విషయంలో ఎలాంటి అవకాశాలు భవిష్యత్తులో వస్తాయో చూడాలి.  

అమ్మ కల కోసం బిగ్ బాస్ కి నబీల్.. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదేనంట!

  బిగ్ బాస్ సీజన్-8 లో రోజుకొకరు ఓట్ అప్పీల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక నిన్నటి టాస్క్ లో నబీల్ గెలిచి ఓట్ అప్పీల్ కి అర్హత సాధించాడు. ఓట్ అప్పీల్ లో నబీల్ ఏం చెప్పాడో ఓసారి చూసేద్దాం. నేను మీ నబీల్ అఫ్రిది.. నేను ఒక సామాన్యుడిని సినిమాల్లో యాక్టర్ అవ్వాలి స్టార్ అవ్వాలని కలలు కన్నా.. చాలా ఆడిషన్స్ ఇచ్చా కానీ ఎక్కడా అవకాశం రాలే.. వీళ్లు వాళ్లు ఏంది నాకు అవకాశం ఇచ్చేదని నా అవకాశం నేనే క్రియేట్ చేసుకున్నా.. మా అమ్మ ఫోన్‌తో వీడియోలు చేయడం స్టార్ట్ చేశా సోషల్ మీడియాలో.. మా అమ్మ నాన్న అన్నలు ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల కష్టపడి మస్త్ వీడియోలు చేశా.. ప్రతివారం వీడియోలు చేశా.. దాని వల్ల నాకు కొంచెం డబ్బులు, కొంచెం ఫేమ్ కొంచెం నేమ్ వచ్చింది.. కానీ అప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు.. 2016 నుంచి ఇప్పటివరకూ అంటే 9 ఏళ్ల నుంచి వీడియోలు చేస్తనే ఉన్నా.. నా మొత్తం లైఫ్‌లో నాకు దొరికిన ఏకైక అవకాశం.. పెద్ద అవకాశం బిగ్‌బాస్ అంటూ నబీల్ చెప్పాడు. ఇక్కడకి అడుగుపెట్టేటప్పుడే అనుకున్నా విన్నర్ అయ్యే బయటికి వెళ్లాలి.. ట్రోఫీ కొట్టే బయటికెళ్లాలని.. మా అమ్మ కోరిక.. నువ్వు ఒకవేళ ఆ హౌస్‌లో నుంచి బయటికి అడుగుపెడితే నాగ్ సార్ చేయి పట్టుకొని ఆ హౌస్‌లో లైట్లు బంద్ అయినప్పుడే అడుగుపెట్టాలని అన్నది.. నేను బయట లైఫ్‌వో ఎలా ఉన్నానో నా పర్సనాలిటీ ఎట్లనో అలానే ఉందాం.. తప్పయితే తప్పు కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తాదమని చెప్పి.. నిర్భయంగా నిర్మొహమాటంగా నిష్పక్షపాతంగా నేను నాలాగ ఉన్నా నా డెసిషన్స్ నేను ఇండివీడ్యూవల్‌గా తీసుకున్నా అండ్ ప్రతి టాస్కులో నా 100 పర్సంట్ ఇచ్చినా.. ప్రాణం పోతే పోనీ కానీ టాస్కు గెలవాలని ఆడా.. ఇక్కడ 14వ వారం నుంచి 15వ వారంలోకి వెళ్తున్నా అంటే నా కృషితో పాటు మీ అందరి లవ్, సపోర్ట్, ఓట్స్ వల్లే.. మరోసారి అందరికీ థాంక్యూ.. మీ అందరికీ ధన్యవాదాలు.. పాదాభివందనాలు.. అందరికీ.. ప్రస్తుతం నేను విన్నర్ ట్రోఫీకి ఒకే ఒక్క మెట్టు దూరంలో ఉన్నాను.. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయండి.. నాకు మీ సపోర్ట్ చాలా ముఖ్యం.. నా లైఫ్‌లో ఇదే బిగ్గెస్ట్ అచ్చీవ్‌మెంట్ అవుతుంది.. అంటూ నబీల్ చెప్పాడు.  

చెఫ్ సంజయ్ రాకతో హౌస్ లో పాజిటివ్ వైబ్స్.. ఫుడ్ గొప్పతనం ఇదే!

  బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఓట్ అప్పీల్ చేసుకునేందుకు హౌస్‌మేట్స్‌కి టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న టాస్కుల్లో గెలిచి ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక ఈరోజు పెట్టిన టాస్కుల్లో నబీల్ అద్భుతంగా ఆడాడు. కానీ సంచాలక్‌గా ఉన్న ప్రేరణ కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు నబీల్ ఆటలో మిస్టేక్స్ వెతుకుతూ తప్పించే ప్రయత్నం చేసింది. కానీ నబీల్‌కి రోహిణి, అవినాష్ సపోర్ట్ చేయడంతో ప్రేరణ ఇరుక్కుంది. ఇక తాను గెలిచినా ఇన్ని లాజిక్కులు మాట్లాడిన ప్రేరణను తర్వాతి టాస్కులో తోసిపారేశాడు నబీల్.  నేటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి చెఫ్ సంజయ్ తుమ్మా ఎంట్రీ ఇచ్చారు. పలు టీవీ ఛానల్స్, యూట్యూబ్‌లో కూడా ఆయన వంట ప్రోగ్రామ్స్ చేసి ఫేమస్ అయ్యారు. ఆయన్ను చూడగానే ఆహా ఈరోజు రుచిగా తినొచ్చు అంటూ తెగ గెంతులేశారు హౌస్‌మేట్స్. మంచి ఫుడ్ మీ చేత వండించాలని ఈరోజు వచ్చేశా అంటూ సంజయ్ చెప్పాడు. ఇక హౌస్‌మేట్స్‌తో వంట చేయిస్తూ ఫుడ్ గొప్పతనం గురించి సంజయ్ చెప్పారు. ప్రపంచంలో ఏ వస్తువయినా సరే మంటల్లో వేస్తే కాలిబూడిద అయిపోతుంది.. కానీ కేవలం బంగారం, ఆహారం మాత్రమే అద్భుతంగా బయటికొస్తుంది అంటూ చెప్పారు.  మొన్నటి ఎపిసోడ్‌లో గొడవపడిన నిఖిల్-గౌతమ్ ఇద్దరిని ఫుడ్‌తో కలిపేశారు సంజయ్. వీళ్ల మధ్య మొన్న రేగిన మంటను తియ్యగా చేసేద్దామంటూ గౌతమ్-నిఖిల్ చేత ఒకరికి ఒకరు తినిపించుకునేలా చేశారు సంజయ్. ఇక ఎవరికి మటన్ అంటే ఇష్టం అనగానే అవినాష్ పైకి లేచి నల్లి బొక్క, బీరు పక్కన ఉంటే ఆహా అంటూ డైలాగ్ కొట్టాడు. ఇక తర్వాత కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ఫన్నీఫన్నీగా టేస్టీ ఫుడ్ చేయించి అందర్నీ సంతృప్తిగా తినేలా చేశారు సంజయ్. చెఫ్ సంజయ్ రాగానే హౌస్ లో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే అప్పటిదాకా గొడవపడ్డ నిఖిల్, గౌతమ్ లని తన వంటరుచితో కలిపేసాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలిచింది.

Illu illalu pillalu : కొడుకుల మనసులో ఏం ఉందో తెలుసుకున్న తండ్రి.. ఏం చేయగలడు?

  స్టార్ మా టీవీలో ప్రసారమావూతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -20 లో.....రామరాజు దగ్గరికి ప్రసాదరావు వెళ్లి.. మీ కొడుకులు మా ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఎంత దైర్యం ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోమంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో రామరాజు వీర ఆవేశంతో ఇంటికి వెళ్లి ఇద్దరి కొడుకులని చితక బాదుతాడు. మీరు నాకు తెలియకుండా ఇలా చేస్తున్నారంటూ కోప్పడతాడు. ఏంటి రా మీ నాన్న చెప్పేది నిజమేనా అని వేదవతి.. ఇద్దరి కొడుకులని అసలేం జరిగిందని అడుగుతుంది. దాంతో సాగర్ ప్రేమ విషయం ఇంట్లో చెప్తాడు ధీరజ్. అంటే నాకు విలువ లేదా నాకు చెప్పాలిసిన అవసరం లేదా అంటూ రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఇక మీదట అలాంటివి చెయ్యమని అందరు అంటారు కానీ ధీరజ్ మాత్రం మీరు కొడుకుల మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలని అంటాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వాళ్ళ మామ వచ్చి.. ఇలా చేశారేంట్రా.. బావ ఎప్పుడు బాధ పడలేదు. ఈ రోజు బాధపడ్డారని అంటాడు. అదంతా ఎదురింట్లో ఉన్న ప్రేమ చూసి చెంపకి వాతలున్నాయంటూ ధీరజ్ ని ఏడిపిస్తుంది. ఆ తర్వాత నర్మద ని తన పేరెంట్స్ తిడతారు. వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకంటూ వార్నింగ్ ఇస్తారు. మరొకవైపు వేదవతి గుడికి వెళ్లి ఏడుస్తుంటే.. ప్రేమ చూస్తుంది. వాళ్ళ నానమ్మకి చెప్తుంది. నీ చిన్న కూతరు ఎందుకు ఏడుస్తుంది కనుక్కో అంటుంది. తరువాయి భాగంలో నర్మద వచ్చి సాగర్ ని తిడుతుంది. ఇంత పిరికి వాడివి ఎందుకు ప్రేమించావని అంటుంది. దాంతో అతను కోపంగా రేపు మన పెళ్లి జరుగుతుందని మాటిస్తాడు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీపని చంపాలనుకున్న జ్యోత్స్న.. చెట్టుకి ఢీ.. తలకి గాయం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -219 లో... దీపకి తెలియకుండా శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు కార్తీక్. కానీ దీప కూడా కార్తీక్ తో హాస్పిటల్ కి వెళ్తుంది. దీప, కార్తీక్ లు హాస్పిటల్ కి రావడం చూసిన జ్యోత్స్న కోపంతో ఉంటుంది. డాక్టర్ దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. అప్పుడే  దీపకి ఎవరో చేసినట్టుగా జ్యోత్స్న గొంతు మర్చి ఫోన్ చేస్తుంది. సరిగ్గా వినపడకపోవడంతో అప్ప్పుడే కార్తీక్ వచ్చి సిగ్నల్ లేనట్టుంది బయటకు వెళ్లి మాట్లాడమని అనగానే దీప వెళ్తుంది. దాంతో  శౌర్యని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్. దీప బయటకు వెళ్లి మాట్లాడుతుంటే తను రావడం చూసి జ్యోత్స్న కార్ తో డాష్ ఇవ్వాలి అనుకొని వస్తుంది. దాంతో అప్పుడే దాస్ అక్కడ ఉంటాడు. దీప అని గట్టిగా అరవడంతో దీప పక్కకు అవుతుంది. జ్యోత్స్న చెట్టుకి డాష్ ఇచ్చి తలకి గాయం అవుతుంది. తనని చూసిన దాస్ అంటే నా కూతురు అసలైన వారసురాలిని చంపాలనుకుందా అని దాస్ అనుకుంటాడు. ఇక జ్యోత్స్నని దాస్, దీప లు హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. మరొకవైపు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ తో కార్తీక్ మాట్లాడుతాడు. శౌర్య గురించి అడుగగా పాపకి ప్రాబ్లమ్ ఉంది. తనని ఇబ్బంది పెట్టె విషయాలు చెప్పొద్దని అంటాడు. దాంతో కార్తీక్ కంగారు పడతాడు. మరొకవైపు శివన్నారాయణకి దీప ఫోన్ చేసి జ్యోత్స్న కి దెబ్బ తగిలిందని చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్, శౌర్యలకి జరిగింది మొత్తం దీప చెప్తుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నా మనవరాలిని ఏం చేశారంటూ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి విడాకుల గురించి నిజం తెలుస్తుందా.. సవతి తల్లి మరో ప్లాన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -270 లో.. శ్రీలతకి నందిని ఫోన్ చేసి.. మీరు ఇలా ఏం ప్లాన్ చెయ్యకుండా ఉంటే ఎలా? నా సీతా నాకు దూరం అవుతున్నాడనిపిస్తుంది.. రామలక్ష్మి వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ లో ఉన్నట్టు ఉంది అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రామలక్ష్మి ని లేకుండా చేస్తానని నందిని అంటుంది. శ్రీవల్లి ఫోన్ లాక్కొని నీకంటే ఆస్తులున్నాయ్. మాకు బావ గారి ఆస్తులు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఆస్తులన్నీ రామలక్ష్మి పేరు మీదే ఉన్నాయ్ తనని చంపేస్తే ఆస్తులన్నీ ఎలా అని శ్రీవల్లి అంటుంది. శ్రీలత ఫోన్ తీసుకొని.. శ్రీవల్లి చెప్పింది కరెక్టే.. రామలక్ష్మిపై సీతాకాంత్ కి విరక్తి పుట్టి సీతా నే విడాకులు ఇచ్చేలా చేస్తానని శ్రీలత అంటుంది. దానికి నందిని సరే అంటుంది. మరొక వైపు రామలక్ష్మి మాణిక్యంలు విడాకుల నోటిస్ పంపిన లాయర్ దగ్గరికి వచ్చి మీరు నాకు ఇష్టం లేకుండా ఎందుకు పంపారని రామలక్ష్మి అడుగుతుంది. మీ అత్తయ్య గారు మీకు విడాకులు ఇష్టమే.. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇలా చేసానని లాయర్ అనగానే.. ఇప్పటికి అయినా అర్ధం అయింది కదా నాకు న్యాయం చెయ్యండి  అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడే మీ అత్త గారిపై కేసు పెడుతానంటాడు వద్దు మళ్ళీ మా ఆయన నన్ను అపార్ధం చేసుకుంటాడు. నేను పంపలేదు అని మా అయనతో చెప్పండి చాలని రామలక్ష్మి అనగానే.. లాయర్ సరే అంటాడు. మరొకవైపు రాత్రి అయినా సందీప్ వాళ్లు వర్క్ చేస్తుంటే.. సీతాకాంత్ వచ్చి పడుకోండి అంటాడు. రేపు పని త్వరగా అయిపోతుంది అంటాడు. మీకు ఇలా పని చేస్తుంటే  ఏం అనిపించడం లేదా అని సీతాకాంత్ అనగానే.. ఆస్తులు లేవనీ నిన్ను వదిలేసి వెళ్ళలేము అన్నయ్య అని సందీప్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ గదిలోకి వెళ్లి.. చూసావా వాళ్ళను ఎలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావో అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సందీప్, శ్రీవల్లి లు బిర్యానీ తింటుంటే రామలక్ష్మి వచ్చి చూస్తుంది. వీళ్లేమో ఇలా ఉన్నారు సీతా సార్ వీళ్ళని నమ్ముతున్నాడనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం మాణిక్యాన్ని కలుస్తుంది రామలక్ష్మి. ఇక శంకర్ లాయర్ అల్లుడు ముందు నిజం చెప్తే శ్రీలత అట కట్టియోచ్చని మాణిక్యం అనగానే.. వద్దు నాన్న సీతా సర్ వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిస్తే తట్టుకోలేడని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : పెద్దాయన మాటతో ఇంటికి రావడానికి ఒప్పుకున్న కావ్య.. రాజ్ చెంప చెల్ళుమనిపించిన సీతారామయ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -584 లో......కావ్య ఇంటికి వస్తుంది. మీరేం చేస్తున్నారు మావయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటని అపర్ణపై కావ్య కోప్పడుతుంది. ఏంటి దబాయిస్తున్నావ్.. ఇంట్లో నుండి వెళ్ళమంటావా ఏంటని అపర్ణ అంటుంది. మిమ్మల్ని ఏంటి నన్ను కూడా వెళ్ళమంటుందని కనకం అంటుంది. అంత నేను చూసుకుంటానని అపర్ణ అంటుంది ఆ తర్వాత నా మెడకి చుట్టుకుంటే మాత్రం నీ సంగతి చెప్తానని కనకంతో కావ్య అంటుంది. మరొకవైపు రాజ్ తన ఫ్యామిలీ ఫొటో చూస్తూ.. మా డాడీకి మమ్మీ విడాకులు ఇవ్వడానికి వీలు లేదని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య పూజ చేసి అపర్ణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడే రాజ్ ఇంటికి కోపంగా వస్తుంటాడు. నేను చేసిన ప్లాన్ కి రాజ్ చూడు ఎలా వస్తున్నాడోనని అపర్ణ అనగానే.. ఆవేశంతో వస్తున్నడని కావ్య అంటుంది. ఎందుకు వచ్చావని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. ఎందుకు వచ్చానో నీకు తెలియదా అని రాజ్ అంటాడు. ఇవి నేను కావ్యకి ఇస్తున్న విడాకుల పత్రాలు అనగానే అందరు షాక్ అవుతారు. రాజ్ కావ్య గురించి తప్పు గా మాట్లాడుతుంటే.. రాజ్ పై అపర్ణ చెయ్ చేసుకోబోతుంది. కావ్యకి రాజ్ విడాకుల పత్రాలు ఇచ్చి నిర్ణయం తీసుకోమని చెప్తాడు. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు వస్తారు. రాజ్ చెంప చెల్లుమనిపిస్తాడు సీతారామయ్య. నిర్ణయం తీసుకో అంటున్నావ్ ఎందుకు. మీ అమ్మ మీ కాపురం బాగుండాలని ఇక్కడికి వచ్చింది అయినా నీలో మార్పు రాలేదు.. ఎవరు ఏమన్నా సరే కావ్య దుగ్గిరాల ఇంటికి కోడలని రాజ్ ని తిట్టి పంపిస్తాడు సీతారామయ్య. ఆ తర్వాత కావ్యని ఇంటికి రమ్మని సీతారామయ్య అడుగుతాడు. వాడు చేసిన తప్పుకి నేను నీ కాళ్ళు పట్టుకొని అడుగుతానని సీతారామయ్య అనగానే అంత పెద్ద మాట అంటున్నారు.. మీరు ఆలా అనొద్దు నేను వస్తానని కావ్య అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సీతారామయ్యకి మూర్తి కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అవార్డులు, అవకాశాలు పక్క రాష్ట్రాల నటీనటులకు...చప్పట్లకు మాత్రమే తెలుగువాళ్లు

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా తెలుగు వాళ్ళే నటించేవాళ్ళు. తర్వాత టాలీవుడ్ లో ఎన్నో మార్పులు వస్తూ వచ్చాయి. దాంతో అటు మూవీస్ లో కావొచ్చు ఇటు సీరియల్స్ లో కావొచ్చు అంతా వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే దేశాల వాళ్ళు వచ్చి నటించడం స్టార్ట్ అయ్యింది. లోకల్ వాళ్ళు మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సంస్కృతీ మరీ  ఎక్కువైపోయింది. ఐతే రీసెంట్ గా ఈ అంశం మీద టీవీ సీరియల్స్ లో నటించే శ్రావణి కూడా ఈ విషయాలను చెప్పుకొచ్చింది. ఐతే ఇక్కడ తెలుగు వాళ్లకు వేరే భాషల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళను తీసుకొచ్చి నటింపజేసే వాళ్ళు ఉంటారు అని చెప్పింది. మనల్ని వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళను మన సీరియల్స్ లోకి పిలిచినప్పుడు వెళ్లి చేయడం వరకు ఓకే కానీ తేడా ఎక్కడ వస్తోంది అంటే మనవాళ్ళు వెళ్లి మరీ వాళ్ళను పిలుస్తారు.. వాళ్ళు మాత్రం మనవాళ్లను పిలవరు. తెలుగు వాళ్ళను పెట్టొచ్చుగా అని మన డైరెక్టర్స్ ని అడిగితే ఎక్కడున్నారు అని మనల్నే అడుగుతారు..పొరపాటున ఏదైనా ఇలాంటివి  అడిగితే వాళ్ళను తీసేసి పక్కన పెట్టేస్తారేమో అని భయంతో ఎవరూ ఏమీ అడగరు. మనవాళ్ళు వేరే ఇండస్ట్రీస్ కి వెళ్తే అక్కడ ఆఫర్స్ ఇవ్వరు..అసోసియేషన్ కార్డు లేదు అని అంటారు. కొత్త ప్రాజెక్ట్ వస్తోంది అని ఎవ్వరైనా చెప్పినప్పుడు కాస్టింగ్ ఎవరు అని అడిగితే చాలు బెంగుళూరు, పూణే, చెన్నై వెళ్లి వెతకాలి అంటారు అంతే కానీ లోకల్ గా ఉండే తెలుగు వాళ్ళను చూడరు. ఇక బుల్లితెర మీద వచ్చే రకరకాల షోస్ కి కూడా లోకల్ వాళ్ళను అస్సలు కన్సిడర్ చేయరు. అవార్డ్స్ కూడా బయట స్టేట్స్ నుంచి వచ్చి నటించేవాళ్లకే ఇస్తారు లోకల్ గా ఉండే తెలుగు నటులంతా కూడా చప్పట్లు కొట్టడానికి అవార్డ్స్ ఫంక్షన్స్ కి వెళ్తాము. తెలుగు ఆర్టిస్టులకు డబ్బులు పెంచమని అడిగితే అంత బడ్జెట్ లేదు అంటారు కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చే ఆర్టిస్టులకు మాత్రం ఫ్లయిట్ టికెట్ వేసి, వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూసి రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకొస్తారు అంటూ చెప్పుకొచ్చింది శ్రావణి. జెమిని  ప్రసారమైన కల్యాణ తిలకం సీరియల్ తో బుల్లితెరకు  ఎంట్రీ ఇచ్చింది శ్రావణి ప్రియా. అభిషేకం, ఆడదే ఆధారం,భార్యామణి,ఆకాశగంగ,అగ్ని సాక్షి,మూగమనసులు,స్వాతి చినుకులు,గిరిజా కళ్యాణం వంటి ఎన్నో  సీరియల్స్ లో నటించింది.