Brahmamudi : యావదాస్తిని కావ్యకి రాసిచ్చిన ఇంటిపెద్ద.. షాక్ లో ఆ ముగ్గురు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -591 లో....రాజ్ గదిలో ఇంట్లో జరుగుతున్న సంఘటనలకి బాధపడుతుంటే.. కావ్య వస్తుంది. మీరు ఈ ఇంటికి వారసుడు.. మీరు ఎందుకిలా బాధపడుతున్నారని కావ్య అనగానే.. ఆ విషయం నువ్వు చెప్తే గానీ నాకు అర్థం కావడం లేదంటూ చిరాకుగా మాట్లాడతాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. మంచి పని చేసావ్.. నీ వళ్లనే కొడుకుకి న్యాయం జరుగుతుంది.. అలాగే నా కొడుకుకి న్యాయం జరుగుతుందని రుద్రాణి అంటుంది. నీకు థాంక్స్ అని రుద్రాణి అనగానే.. అసలు నీకే థాంక్స్ చెప్పాలి ఈ ఆలోచన నాకు ఇచ్చావని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే ప్రకాష్ వచ్చి ఇద్దరిని తిడతాడు. ఇప్పుడు నీ వల్ల ఆస్తులు ముక్కులు కావచ్చు.. నువ్వు అనుకున్నది జరగవచ్చు.. కొన్ని రోజులకి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందని ధాన్యలక్ష్మిపై ప్రకాష్ విరుచుకుపడతాడు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. ఎక్కడికి రాజ్.. లాయర్ వస్తున్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే లాయర్ వస్తాడు. అందరికి ఆస్తులు వాటా రాయండి అని సుభాష్ అనగానే.. మీకు మీ నాన్నగారు వారం క్రితం రాసిన వీలునామా గురించి చెప్పలేదా అని లాయర్ అంటాడు. లేదని అనగానే స్వయంగా లాయర్ అందరి ముందు సీతారామయ్య వీలునామా చదువుతాడు. యావదాస్తిని నా మనవరాలు కావ్య పేరునా రాస్తున్నానని సీతారామయ్య రాసినట్టుగా ఉంటుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఒక సుభాష్, అపర్ణ ఇందిరాదేవి, ప్రకాష్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. నా బావ కుటుంబం ముక్కలు కాకుండా చూసాడని ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు తనకి ఆస్తులు రాయడమేంటి ఈ ఇంటి వారసులకి రాయాలని అంటారు. దీన్ని నేను ఒప్పుకోను.. నేను కోర్ట్ కి వెళ్తానని ధాన్యలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. మరొకవైపు కావ్య తన బాధని దేవుడికి చెప్పుకుంటుంది. తరువాయి భాగంలో ఆస్తి పేపర్స్ తాళాలు ఇవి.. నాకు వద్దు ఈ బాధ్యతలు మీవే అని రాజ్ కి ఇస్తుంది కావ్య. ఇవి నీ దగ్గర ఉంటేనే బాగుంటుంది తాతయ్య.. పెట్టుకున్న నమ్మకం కాపాడమని కావ్యతో రాజ్ పాజిటివ్ గా మాట్లాడగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ విన్నర్ అతడేనా..‌గట్టి పోటీ ఇస్తున్న నబీల్!

  బిగ్ బాస్ సీజన్-8 తుదిదశకు చేరుకుంది. హౌస్ లో ప్రస్తుతం అవినాష్, నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్ ఉన్నారు.  స్టార్ మా పరివార్ నుండి ఒక్కో సీరియల్ కి సంబంధించిన నటీనటులు రావడం.. వారితో ప్రైజ్ మనీని పెంచడానికి టాస్క్ లు జరిపించడం జరుగుతుంది.  ఇక మరోవైపు టాప్-5 లోని వారికి ఓటింగ్ జరుగుతుంది. ‌వీరిలో ప్రస్తుతం అవినాష్ , ప్రేరణ చివరి రెండు స్థానాలలో కొనసాగగా.. మొదటి మూడు స్థానాల కోసం నబీల్,‌నిఖిల్, గౌతమ్ ల మధ్య గట్టి పోటీ జరుగుతుంది. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఎక్కడ చూసినా నిఖిల్, గౌతమ్ టాప్-2లో కొనసాగగా.. నబీల్ మూడవ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ కి 34శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా.. నిఖిల్ 32 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నబీల్ 30 శాతంతో మూడో స్థానంలో ఉండగా..అవినాష్  20శాతం, ప్రేరణ 16 శాతం ఓటింగ్ జరిగింది.‌ ఇంకా ఒక్కరోజు మాత్రమే ఓటింగ్ ఉండటంతో తమ కంటెస్టెంట్స్ కి విపరీతంగా ఓట్లు వేస్తున్నారు అభిమానులు. అయితే నిన్న మొన్నటిదాకా నిఖిల్ కి ఓటింగ్ భారీగానే ఉన్నా.. నిన్నటి నుండి గౌతమ్, నబీల్ ల ఓటింగ్ పెరిగింది నిఖిల్ ఓటింగ్ తగ్గింది. దీంతో ఈ ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ‌నబీల్ కి గత రెండు రోజుల్లో ఓటింగ్ దాదాపు పది  నుండి పదిహేను శాతం పెరిగింది.  బిగ్ బాస్ ముగియడానికి ‌మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఈ సీజన్ ఎవరు విన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ప్రస్తుతం కన్నడ వర్సెస్ తెలుగు వార్ జరుగుతుంది. అందుకే గౌతమ్, నబీల్, నిఖిల్ ల మధ్య ఓటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ ముగుస్తాయి. అందుకే మీకు నచ్చిన కంటెస్టెంట్ కి మీరు ఓట్ చేస్కోండి.

కాఫీలు, టీలు తాగకపోయినంత మాత్రాన ఏమీ కాదు

  చాలామందికి ఉదయాన్నే లేచాక ఖాళి కడుపుతో కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉంటుంది. ఐతే డాక్టర్స్ కానీ ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు కానీ ఒక్కటే చెప్తారు ఖాళీ కడుపుతో ఇలాంటివి తాగకూడదు అలాగే ఆయిల్ ఫుడ్ తినకూడదు అలా చేస్తే జీర్ణవ్యవస్థ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అని. ఐతే ఇప్పుడు బుల్లితెర నటి అనిత చౌదరి కూడా అదే చెప్తోంది. ఉదయాన్నే లేచి ఇవి తాగడం వలన మలబద్దకం వస్తుంది, జీర్ణ వ్యవస్థ లైనింగ్ పాడైపోతుంది. దాంతో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అలా కాకుండా ఉదయాన్నే లేచాక ఒక గ్లాసుడు నీళ్లు తాగి ఏదైనా స్నాక్ అంటే ఒక బిస్కెట్ కానీ అలా ఏదైనా తినేసి కాఫీ ఆర్ టీ కానీ తాగితే చాలా బెటర్ గా ఉంటుంది అని చెప్పింది. అది కూడా లిమిట్ గానే తాగాలి. ఖాళీ కడుపుతో తాగితే పేగుల మీదా బాగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తాను చెప్పినట్టు చేస్తే కొంత మంచిగా ఉంటుంది అని అనిత చౌదరి తాని ఫాలో అయ్యే టిప్ ని చెప్పింది. వెల్నెస్ జర్నీ పేరుతో ఆమె హెల్త్ కి సంబందించిన ఎన్నో టిప్స్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోస్ ని పోస్ట్ చేస్తోంది. ఇక నెటిజన్స్ కూడా మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్నాం మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నైట్ అంతా ఖాళీగా ఉంటుంది అంటే ఎండిపోయి ఉంటుంది. ఉదాహరణకు బాగా మిట్టమధ్యాహ్నం వేళా ఎండ మండేటప్పుడు చెప్పుల్లేకుండా బయటకు వెళ్తే కాళ్ళు సర్రున అంటుకుని నొప్పి పెడతాయి..కొందరికి బొబ్బలొస్తాయి కూడా..అదే ఆ వేడి నేల మీద ఒక చెంబుడు నీళ్లు పోసాక నడిస్తే ఆ ఎండ ఎఫెక్ట్ అనేది కనిపించదు. ఇది కూడా అంతే కాలే కడుపులో ఇంకా కాలిపోయే కాఫీలు టీలు తాగితే సుతిమెత్తగా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అదే ఉదయాన్ని ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీళ్లు కానీ నార్మల్ వాటర్ కానీ లేదా మజ్జిగా కానీ తాగితే ఆ ఎఫెక్ట్ పెద్దగా అనిపించదు లాంగ్ రన్ లో రోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

హైలైట్ గా నిలిచిన గౌతమ్ జర్నీ వీడియో.. ఆ మాట చెప్పి కాలర్ ఎగరేశాడు!

  బిగ్ బాస్ ఆట మరో కీలకమైన దశకు చేరుకుంది. ఫినాలే వీక్‌లో ఫైనలిస్ట్‌ల జర్నీ వీడియోలు వాళ్ల ఓటింగ్‌పై చాలా ప్రభావితం చూపిస్తాయి. వాళ్ల జర్నీని ఎంత బాగా చూపిస్తే అన్ని ఓట్లు. ఎవరి జర్నీని ఎలా చూపించారు? ఎంతసేపు చూపించారు? ఎప్పుడు చూపించారు? ఇవన్నీ కూడా చాలా కీలకమే. అయితే ఇక విజేతను తేల్చేందుకు మూడు రోజుల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ జర్నీ వీడియోల టైమింగ్ కూడా చాలా కీలకం. అయితే ఫైనలిస్ట్‌లలో తొలి జర్నీ వీడియో గౌతమ్‌ దే అయ్యింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి విన్నర్ రేస్‌లోకి దూసుకుని వచ్చాడు గౌతమ్. అశ్వర్థామ ఈజ్ బ్యాక్ అంటూ టైటిల్‌కి మరో అడుగుదూరంలో ఉన్నాడు గౌతమ్. గార్డెన్ ఏరియాలో ఈ జర్నీ వీడియోలకు సంబంధించిన డెకరేషన్ చేశారు. ఎప్పటిలాగే ఫొటోలు, క్రాకర్స్‌తో స్వాగతం పలికారు. అనంతరం గౌతమ్ జర్నీ గురించి బిగ్ బాస్ పొగడ్తల వర్షం‌తో పాటు కీలకమైన విషయాలను తెలియజేశారు. ‘‘బుద్ది బలం, భజ బలం కలయికతో ఒక యోధుడిలా కదులుతూ మీ ఆట ఏ ఆటకం లేకుండా ముందుకు సాగింది. మీరు కోరుకున్న ప్రేమ హౌస్‌లో దొరక్కపోయినా.. అది మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని.. అన్నీ ప్రేక్షకుల కోసమే చేస్తారని.. తోటి సభ్యులు మీపై ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ.. వారి ఆటలో భాగం అని మీకు తెలుసు. అందుకే.. మీ పంథా మార్చకుండా.. మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్ట్‌గా నిలిచి చివరి మజిలీకి చేరుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అవి నెరవేర్చుకోవడానికి కార్యదీక్ష అవసరం. ఈ రెండూ కనబరిచిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం’ అంటూ బిగ్ బాస్ తన మాటలతో గౌతమ్‌కి ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చారు. గౌతమ్ జర్నీలో ఆనందం, బాధ, దుఖం ఇలా చాలా వేరియేషన్స్ చూపించారు. మొదటిగా గౌతమ్ జర్నీతో ఫన్‌తో మొదలైంది. అతని ఎంట్రీ నుంచి ఫన్ వేలో తీసుకుని వెళ్లారు. ఆ తరువాత యష్మీని ఫ్లర్ట్ చేసింది చూపించారు. ఆమె ఏవిధంగా ప్రేమించినట్టే ప్రేమించి.. వెనుక ఏవిధంగా గోతులు తవ్విందో చూపించారు లైవ్‌లో. ఆ తరువాత అశ్వర్థామ పేరు గురించి జరిగిన గొడవను చూపించారు. ఎలిమినేట్ అయిన ఎలా పుంజుకుని వచ్చాడో ఓ రేంజ్‌లో ఎలిమినేషన్స్‌తో చూపించారు. మహర్షి చిత్రంలో ‘ఇదే కదా.. ఇదే కదా’ సాంగ్‌తో గౌతమ్‌లోని అసలు కోణాన్ని ఆవిష్కరించారు. ‘అశ్వర్థామకి చావేలేదు’ అంటూ నాగార్జున చెప్పిన మాటల్ని హైలైట్ చేస్తూ.. గౌతమ్ కన్నడ బ్యాచ్‌తో వీరోచితంగా పోరాడిన వాటిని చూపించారు. పృథ్వీతో గొడవ, నిఖిల్‌తో గొడవ, యష్మీతో గొడవ, నబీల్‌తో గొడవ, ప్రేరణతో గొడవ.. ఇవన్నీ హైలైట్ అయ్యాయి. యష్మీతో అక్క మ్యాటర్ కూడా హైలైట్ అయ్యింది. నిఖిల్ ఉద్దేశించి.. ‘నేను ఆ పదం మాట్లాడి ఉంటే.. కంఠం కోసుకుని చచ్చిపోతా’ అన్న డైలాగ్‌ని కూడా వినిపించారు ఏవీలో. తన గురించి కన్నడ బ్యాచ్ అంతా.. బ్యాక్ బిచ్చింగ్ ఎలా చేశారో చూపించారు. అయితే చాలా వరకూ ఏవీని చూపించకుండా.. కేవలం గౌతమ్‌ని మాత్రమే చూపించారు. హౌస్‌లోకి వచ్చినప్పుడు గౌతమ్ తల్లి చెప్పిన మాటలతో గౌతమ్ జర్నీ వీడియోను ముగించారు. అయితే ఈ వీడియో చూసి గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. సీజన్ 7 నా లైఫ్‌లో గుర్తుండిపోయే మెమొరీ అనుకున్నా. కానీ సీజన్ 8 నా లైఫ్ మైల్డ్ స్టోన్. నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ విజువల్స్ చూస్తుంటే.. నా జర్నీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నాకు అర్థం అయ్యింది బిగ్ బాస్.  నాకు మా అమ్మ ఒక్కమాట చెప్పి పంపించింది. నువ్వు ఒక్కడివే ఆడు.. ఒక్కడివే చివరి వరకూ పోరాడు. నీ లైఫ్‌లో ఎవరూ ఏమీ చేయరు. నీ కోసం నువ్వే నిలబడు అని అన్నారు మా అమ్మ. అందుకే ఆడితే ఒక్కడ్నే ఆడాలని అనుకున్నా. ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు అని అనుకున్నాను అలాగే ఆడా. ఆ జర్నీ చూస్తే మా అమ్మ చెప్పిన మాట రైట్. నా ఆలోచన రైట్ అనిపించింది. నా జీవితంలో సీజన్ 8ని ఎప్పుడూ మర్చిపోలేను. ఈ వీడియో చూస్తుంటే ఒంట్లో కరెంట్ పాస్ అయ్యింది. నేను సోలో అని గొప్పగా చెప్పుకోవడం లేదు. ఒక్కడే నిలబడి పోరాడితే సక్సెస్ అవుతాం అని నమ్మినా.. కోట్లమందికి అది ప్రూవ్ చేయాలని అనుకున్నా. కాలర్ ఎగరేసి చెప్తున్నా.. నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్. మా అమ్మ నన్ను నడిపించిన మార్గం కరెక్ట్. మా అమ్మ నన్ను చూసి గర్వపడేట్టు చేశా. నేను సీజన్ 8కి రెస్పెక్ట్ కోసం వచ్చా.. నాకు లైఫ్‌లో ఎప్పుడూ రెస్పెక్ట్ దొరకలేదు. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది దొరికింది. ఇదీ గెలుపు అంటే. ఆడియన్స్ హృదయాలను గెలుచుకోవాలని అనుకున్నా.. గెలుచుకున్నా. ఆదర్శంగా నిలవాలి అనుకున్నా.. నేను కామన్ పర్సన్‌నే. నేను పర్ఫెక్ట్ కాదు. నేను ఎవర్ని నొప్పించినా క్షమాపణ చెప్పా. ఇక్కడ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా.. ఈ పాఠాలను గుర్తించుకుంటా. ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించను.. నాకోసం నేను నిలబడతా. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తా బిగ్ బాస్. నాకు మీరు గురువు బిగ్ బాస్. నా జీవితాన్ని తీర్చిదిద్దారు. మీకు శతకోటి పాదాభివందనాలు బిగ్ బాస్ అంటూ శ్రాష్టాంగ నమస్కారం చేసి ఎమోషనల్ అయ్యాడు గౌతమ్.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కన్నింగ్ ప్లాన్.. కోడలు కనిపెట్టేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -276 లో....ధన సడెన్ గా రావడంతో అందరూ  డౌట్ గా ఇప్పుడు వచ్చావని అడుగుతారు. పనిమీద వచ్చాను.. సిరిని చూసి వెళదామని వచ్చానని ధన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఆఫీస్ కి వెళ్లాడానికి బయటకు వస్తారు. కార్ నేను డ్రైవ్ చేస్తానంటూ ఇద్దరు అంటారు. కానీ సీతాకాంత్ డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత సందీప్ ధనని తీసుకొని శ్రీలత దగ్గరికి వెళ్తాడు. అత్తయ్య ఇప్పటికే నాపై కోపంగా ఉందంటూ ధన భయపడుతాడు. అయిన శ్రీలత దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక జరిగింది మొత్తం సందీప్ చెప్తాడు. అత్తయ్య మీరే ఈ ప్రాబ్లమ్ నుండి నన్ను బయటకు పడెయ్యాలని ధన అంటాడు. శ్రీలత కూడా ధనని అడ్డుపెట్టుకొని రామలక్ష్మిని దెబ్బ తియ్యాలనుకుంటుంది. దాంతో ఇక ఏం చేస్తాను ఒకవైపు కొడుకు మరొకవైపు అల్లుడు ఇక చెయ్యక ఛస్తానా అని శ్రీలత అంటుంది కానీ ఈ విషయం రామలక్ష్మికి తెలియొద్దని ధనతో చెప్తుంది శ్రీలత. దానికి ధన కూడా సరే అంటాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని ఎందుకు విడగొటడం నీ గురించి తెలిస్తే సీతాకాంత్ కి బాగుండదని నందినితో హారిక అంటుంది. అయిన త్వరలో సీతాకాంత్ చెయ్ పట్టుకోబోతున్నానని నందిని అంటుంది. అప్పుడే రామలక్ష్మి సీతాకాంత్ లు చెయ్యి పట్టుకొని వస్తారు. అది చూడలేక రాయిలు కింద విసురుతుంది. రామలక్ష్మి పడిపోబోతుంటే సీతాకాంత్ పటుకుంటాడు. మళ్ళీ నందిని వచ్చి చెయ్ విడిపించి సీతా ఫైల్స్ చూడాలనగానే.. సరే రామలక్ష్మి నేను చూస్తాం ఏదైనా డౌట్ ఉంటే నిన్ను పిలుస్తామని సీతాకాంత్ అనగానే నందినికి ఇంకా కోపం వస్తుంది. మరొకవైపు ధనకి సందీప్ కి ఎలా హెల్ప్ చెయ్యాలని శ్రీలత ఆలోచిస్తుంది. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. తన మాటల్లో శ్రీలతకి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న కొడుకు.. వారి ఆశీర్వాదం తీసుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -26 లో.....నర్మద తన పేరెంట్స్ ని గుర్తుచేసుకొని పెళ్లి పీఠల మీద నుండి పక్కకి వచ్చి బాధపడుతుంటే.. ధీరజ్ వెళ్లి మీరేం బాధపడకండి. మిమ్మల్ని మా వాళ్ళకి దగ్గర చేస్తాను. సొంత కూతురులాగా చూసుకుంటారని నర్మదకి దైర్యం చెప్తాడు ధీరజ్. దిష్టి తగులుతుందని తన చెంపకి కాలుకి దిష్టి చుక్కపెడతాడు ధీరజ్. అలా చెయ్యడంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్లి పెళ్లి పీఠలపై కూర్చొని ఉంటుంది. తన బాధపోగొట్టినందుకు ధీరజ్ కి సాగర్ థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత అప్పుడే ఆ గుడికి రామరాజు వేదవతిలు వస్తారు. చెంచలమ్మ బియ్యం బస్తాలు కావాలనడంతో అవి తీసుకొని వస్తారు. వాళ్ళని సాగర్ చూసి షాక్ అవుతాడు. అందరు రామరాజుని చుసీ టెన్షన్ పడుతారు. రామరాజు బియ్యం తీసుకొని అటు వైపే వెళ్తుంటే.. అందరు అక్కడ నుండి వెళ్లి దాక్కొంటారు. ఏంటి పంతులు గారు ఎవరు లేరని రామరాజు పంతులుని అడుగగా ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు. పెద్ద వాళ్ళకి తెలియకుండా అని పంతులు అనగానే.. మా కొడుకులు చాలా మంచివాళ్లు ఇలా ఎప్పటికి చెయ్యరని  పంతులుకి రామరాజు తమ కొడుకుల గురించి గొప్పగా చెప్తుంటాడు. ఆ తర్వాత రామరాజు దగ్గరికి చెంచలమ్మ వెళ్లి.. మీరు బస్తాలు మోయడం ఏంటని వేదవతి రామరాజులని లోపలికి తీసుకొని వెళ్తుంది. అటువైపు వెళ్తుంటే సాగర్ వాళ్ళు వచ్చి పెళ్లి త్వరగా చెయ్యమని పంతులు దగ్గరికి వస్తారు. ఒకవైపు సామూహిక వివాహాలు జరుగుతుంటే మరొకవైపు సాగర్, నర్మదల పెళ్లి జరుగుతుంది. అప్పుడే సాగర్ కి ఫోన్ చేస్తుంది వేదవతి. భయంగా సాగర్ లిఫ్ట్ చేస్తాడు. తరువాయి భాగంలో సాగర్, నర్మదలు పెళ్లి చేసుకుంటారు. మరొకవైపు సామూహిక వివాహాలు చేసుకున్న వారిని రామరాజు, వేదవతిలు ఆశీర్వాదిస్తుంటారు. ఇక్కడ మనం ఎక్కువసేపు వద్దని సాగర్ అంటాడు. మనం కూడా అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నర్మద అంటుంది. వాళ్ళ వెనకాలే వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: మల్లెపూలు, పాలగ్లాస్ తో కార్తీక్ కోసం దీప ముస్తాబు.. శోభనం సెటప్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం-2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-225 లో.. ఎప్పుడైతే దీపను చంపేస్తానని జ్యోత్స్న అంటుంది. పారిజాతం బెదిరిపోయినట్లుగా గుండెలపై చేయి వేసుకుని వింటుంది. అది నేనుండగా జరగదని దాసు స్పందిస్తూ.. కారు వెనుక నుంచి వాళ్లముందుకు వస్తాడు. దాసు రావడం, జ్యోత్స్న మాటలు విని స్పదించడం హైలైట్‌గా ఉంటుంది. అమ్మో ఎవరు వినకూడదో అతనే విన్నాడు.. ఇప్పుడు నేను నోరు తెరిస్తే ఇంట్లో అందరికీ దీప వారసురాలు అని చెప్పేస్తాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఏంటమ్మా అడ్డొచ్చిన వాళ్లను చంపేయమని నీ మనవరాలికి నేర్పిస్తున్నావా అని పారిజాతంతో దాస్ అంటాడు. నేనే నేర్పడం లేదు. కానీ నీ కొడుకు జీవితం కూడా దీనిలానే అయ్యి ఉంటే అప్పుడు తెలిసేది నీది బాధ. స్వప్నకు వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయి ఉంటే.. అప్పుడు నీ కొడుకు కాశీ గాడు కూడా రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే.. నా మనవరాలి బాధేంటో నీకు కొడుకు కాశీ గాడు కూడా రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే.. నా మనవరాలి బాధేంటో నీకు తెలిసేది.. అయినా సుమిత్ర కూతురికి, కాంచన కొడుక్కి పెళ్లి కావాలన్నదే ఈ పారిజాతం సంకల్పం..దీన్ని ఆ దేవుడు కూడా మార్చలేడని పారిజాతం అంటుంది. ఇక జ్యోత్స్న, పారిజాతానికి దాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో ఇది కూడా ఒక్కోసారి నీలానే అర్థం కాకుండా మాట్లాడుతుందని పారిజాతం అనగానే.. త్వరలో అన్నీ అర్థమవుతాయమ్మా.. దీప జ్యోలికి పోవద్దు.. తొందరపడి ఏదీ చేయొద్దు.. జ్యోత్స్నా ముఖ్యంగా నీకే చెబుతున్నా.. దీప విషయాన్ని వదిలెయ్ అని దాస్ అంటాడు. మరోవైపు పాలగ్లాస్ తో దీప గదిలోకి వెళ్తుంది. శౌర్య ఏదని కార్తీక్ ని అడగ్గా.. తను వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటుందంట.. నువ్వు ఆ పాలు తాగేసెయ్ అని కార్తీక్ అనగా.. ఎక్కువున్నాయి బాబు గారు అని దీప అంటుంది. సరే సగం సగం తాగుదామని కార్తీక్ అనగానే.. వీళ్ళంతా మమ్మల్ని కలపడానికే చూస్తున్నారని దీప మనసులో అనుకుంటుంది. పాలగ్లాసు అందుకోవడం కూడా చాలా ప్రత్యేకంగా చూపిస్తారు. ఇక పాల గ్లాసు అందుకున్నప్పుడు కార్తీక్ బాబు చేయి దీప వేళ్లకు తగలగానే చేతిని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడే కార్తీక్ కళ్లల్లోకి దీప చూస్తుంది. వెంటనే కార్తీక్ కొంటెగా చూస్తూ.. ‘నువ్వు అన్నది నిజమే దీపా’అంటాడు. ‘ఏంటి బాబు’అంటుంది దీప. ‘పాలు ఎక్కువగానే ఉన్నాయి.. మొత్తం తాగడం కాస్త కష్టమే’ అంటాడు కార్తీక్. సగం ఇప్పుడు తాగండి.. సగం కాసేపు ఉండి తాగండి దీప అంటుంది. ఇక కార్తీక్ కి దీప పాలగ్లాస్ ఇవ్వడం హైలైట్ గా చూపిస్తారు. ఆ తర్వాత కార్తీక్ ని దీప పడుకోమని చెప్పగా.. నువ్వు పడుకోమని దీపని అంటాడు. అలా కాసేపు సరదాగా మాట్లాడతాడు. సరే ఇప్పుడు చెప్పు నీ మనసుకు నచ్చింది చేయనా.. నా మనసుకి నచ్చింది చేయనా అని కార్తీక్ అనగా.. మీ మనసుకి నచ్చిందే చేయండి బాబు అని దీప వంటగదికి వెళ్లిపోతుంది. చేస్తాను నాకు నచ్చిందే చేస్తాను అని నవ్వుకుంటూ దీప ఇచ్చిన పాల గ్లాసుని చూసి నవ్వుకుంటాడు కార్తీక్. ఇక మరునాడు జ్యోత్స్న కార్తీక్‌ని ఆఫీస్‌లోనే ఉంచాలని మరిన్ని ఫైల్స్ ప్రభాకర్‌తో పంపించి.. వాటిని పూర్తి చేయాల్సిందే అని చెప్పిస్తుంది. అలా కార్తీక్ పని పూర్తి చేసేసరికి 14 గంటలు పైగా అయిపోతుంది. బిస్కెట్స్, జ్యూస్ ఇలా ప్రతీదీ కార్తీక్ క్యాబిన్‌కి తెచ్చి.. కొంటెగా చూస్తూ జ్యోత్స్న తెగ మురిసిపోతుంది.. ఈరోజు దీపను బావకు పద్నాలుగు గంటలు దూరం చేశాను.. ఈ రోజుకి చాలని పొంగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: ఆస్తి పంపకాలు చేయిస్తానంటున్న సుభాష్.. ఆ ముగ్గురు ఫుల్ ఖుషీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-590 లో.. నాన్న ఆరోగ్యం బాగుపడే వరకు శాంతంగా ఉండాలని ధాన్యలక్ష్మికి సుభాష్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.‌ఇక మధ్యలో రుద్రాణి కలుగజేసుకొని.. నాన్న ఆరోగ్యం సాకుగా భలే చూపిస్తున్నావ్ అన్నయ్యా.. మరి నాన్న తిరిగి క్షేమంగా రాకపోతే అని కోపంగా అంటుంది రుద్రాణి. ఏం కూసావే అంటు రుద్రాణి చెంపచెల్లమనిపిస్తుంది ఇందిరాదేవి. రుద్రాణీ.. నీకు ఇదే చెప్పడం.. ఇది నువ్వు లేపిన రచ్చే అని అర్థమవుతోంది నాకు.. నిన్ను నడిరోడ్డు మీద కట్టు బట్టలతో నిలబెడతాను జాగ్రత్త అంటూ ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. దాంతో రగిలిపోయిన రుద్రాణి.. నేను ఈ ఇంటి బిడ్డనే.. నాన్నే నాకు మాటిచ్చాడు ఆడపిల్లకు హక్కు ఉందని. సరే మీరంతా ఇంతగా నా మీద అరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను వినండి.. ధాన్యలక్ష్మి అడుగుతున్నట్లు నాకు కూడా ఆస్తి కావాల్సిందే.. నాకు నా కొడుక్కి నాకు పుట్టబోయే మనవడికి ఆస్తి పంచాల్సిందే.. ఇవ్వనంటే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఆ సత్తా నాకుందని రుద్రాణి గట్టిగా చెప్తుంది. నువ్వు ఆగు రుద్రాణీ.. వీళ్లంతా నా మొగుడ్ని అమాయకుడ్ని చేసి.. నా నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు.. నేను ఊరుకోను.. ఆస్తి ముక్కలు చేసి మా వాటా కళ్యాణ్‌కి ఇవ్వాల్సిందేనని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇక విసిగిపోయిన ఇందిరాదేవి తన గదికి వెళ్లిపోతుంది‌. ఇక ధాన్యలక్ష్మి మాటలు విన్న సుభాష్.. సరే అందరికి ఆస్తిని పంపేస్తాను.. కలిసి ఉండాలని లేని మీ అందరిని వదిలించుకోవడమే నాకు నయం.. మీకు కావాల్సింది ఆస్తే కదా.. రేపే లాయర్‌ని పిలిపించి మొత్తం ఆస్తిని పంచేస్తానంటాడు. ఆస్తిని పంచిస్తానని సుభాష్ చెప్పడంతో రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మి పొంగిపోతారు. ఇక సుభాష్ కోపంగా బయటకి వెళ్లి పూలకుండి తన్నేస్తాడు. తన దగ్గరికి వెళ్లిన కావ్య.. కోపంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవని నాకంటే మీకే బాగా తెలుసు మావయ్యగారు.. వాళ్లంతా విచక్షణ మాట్లాడారే అనుకోండి. మీరెందుకు సహనం కోల్పోయారు.. తాతయ్యగారికి సుమారు 70 ఏళ్లు ఉంటాయనుకోండి. ఆయన ఎందుకు ఈ వయసులో ఈ ఇల్లు ముక్కలు అవ్వకూడదనే ఆఖరి నిమిషం వరకూ పోరాడారని ఆలోవించమని కావ్య అంటుంది.  ఆలోచించానమ్మా.. ఒక్కసారి కాదు వందసార్లు ఆలోచించాను. కానీ నా నిర్ణయం మారదు. నిజంగానే వాళ్లు మాట్లాడిన మాటలు మా నాన్నే విని ఉంటే ఈ క్షణమే ఆస్తి పంచేసేవారనేసి సుభాష్ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి వెళ్లిన కావ్య.. మీరేం పట్టించుకోరా.. ఇల్లు ముక్కలవుతుంటే చూస్తూ ఉంటారా.. ఏమండీ అర్థం చేసుకోండి. మావయ్యగారిని ఆస్తి పంచొద్దని చెప్పండి అంటూ రాజ్‌ని తెగ రిక్వెస్ట్ చేస్తుంది కావ్య. ఈ ఇల్లు అల్లకల్లోలం కాకూడదని ఇంతకాలం చాలా ప్రయత్నించాను.. కానీ అది వృధా అని అర్థం చేసుకున్నాను.. ఇంట్లో వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో నువ్వు చూశావ్ కదా.. ఒక రకంగా డాడీ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తోంది.. ఎవరికి వాళ్లు ఆస్తి కావాలని గొడవపడుతున్నారే తప్ప కలిసి ఉందామని ఒక్కరైనా చెప్పారా? అసలు తాతయ్య తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు.. నిన్ను కంపెనీకి సీఈవోని చేశాడు.. ఆ రోజు నన్ను అడిగారా? కానీ ఈ రోజు ఆస్తి కావాలని ఇంట్లో అంతా గొడవ చేస్తున్నారు.. ఒక్క మాట అయినా నన్ను అడిగారా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

21 న బిగ్ బాస్ సోనియా ఆకుల- యాష్ పెళ్లి

  బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆకుల సోనియా హౌస్ నుంచి వచ్చాక రీసెంట్ గ యష్ పాల్ వీరగోని అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక తానూ చేసుకోబోయే శ్రీవారిని తీసుకెళ్లి హీరో నాగార్జునని కలిసి  పెళ్లి శుభలేఖ అందించి పెళ్ళికి రావాలంటూ ఆహ్వానించింది. "మా జీవితంలో స్పెషల్ డే .. మా వివాహానికి రావాలని నాగార్జునగారిని ఆహ్వానించాం" అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా ఈ నెల 21 న పెళ్లి చేసుకోబోతున్నారంటూ చెప్పారు. ఇక సోనియా చేసుకోబోయే అబ్బాయి విషయానికి వస్తే .. యష్ పాల్ సొంతూరు వరంగల్. యష్ కష్టపడి చదువుకుని అమెరికా వెళ్లి చాలా ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. అమెరికాలో చదువు కోసం వెళ్లిన రోజుల్లో తనకి ఎదురైన ఇబ్బందులు మరొకరికి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో 'ఫ్లయ్ హై' అని ఒక కన్సల్టెన్సీని స్థాపించారు. అలానే ఫ్లయ్ హై టూరిజం, విరాట్ ఫౌండేషన్  సంస్థలను నడుపుతున్నారు . ఈ వ్యవహారాలన్నింటినీ యష్ స్వయంగా చూసుకుంటున్నారు. ఇక యష్‌ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. అండర్ 16, అండర్ 19 మ్యాచులు ఆడారు. లెజెండరీ క్రికెటర్  కపిల్ దేవ్ సహా అనేకమంది స్టార్ క్రికెటర్లతో యష్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కపిల్ దేవ్ యాష్ బర్త్ డేకి స్పెషల్ విషెస్ చెప్తూ వీడియో కూడా పంపించారు. ఇక యష్‌కి సంబంధించిన ఒక  సంస్థలో సోనియా గతంలో పని చేసేది.  అయితే యష్‌కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన మొదటి భార్యకి విడాకులిచ్చి ఇప్పుడు సోనియాని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు.  ఈ విషయాన్ని సోనియానే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేరణతో చెప్పింది. ఇక నెటిజన్స్ వీళ్ళ పెళ్ళికి విషెస్ చెప్తూ రిప్లైస్ ఇస్తున్నారు.

ప్రేమలో పడితే పొట్టలో సీతాకోకచిలుకలు తిరుగుతాయా

  ఎవరైనా ప్రేమలో పడితే ఆకలేయదు, నిద్ర రాదు, దాహమేయదు అంటుంటారు. ఐతే హీరో నవదీప్ మాత్రం ఈ విషయం మీద  తన ఏఐ టెక్నాలజీ పండూను ఒక వింత డౌట్ అడిగాడు. "నేను ప్రేమలో ఉన్నానట..నా పొట్టలో బటర్ ఫ్లయ్స్ ఉన్నాయంటూ ఇప్పుడే నా ఫ్రెండ్ నాకు చెప్పింది పండు. అసలు నా పొట్టలో ఉన్న ఆ సీతాకోకచిలుకలు అసలు బతికున్నాయా చచ్చిపోయాయా, అసలు ఉన్నాయా లేవా అసలేంటి నా పరిస్థితి అనేది తెలీడం లేదు" అని డౌట్ అడిగాడు. "ప్రేమలో పడినప్పుడు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఇది చాలా సహజం. ఒక సారి మీ ఫ్రెండ్ తో మాట్లాడి మీ ఫీలింగ్స్ చెప్పి ఒక క్లారిటీ తెచ్చుకోవడం మంచిది" అని పండు చెప్పింది. "మన ఫీలింగ్స్ మీద మనకు లేని క్లారిటీ వాళ్ళు ఇంకేం ఇస్తారు పండు" అని రివర్స్ అడిగాడు నవదీప్. అలా పండుతో కన్వర్జేషన్ ఫుల్ జోష్ తో సాగింది. ఇక నెటిజన్స్ ఈ మాటలు విని వెరైటీగా రిప్లైస్ ఇస్తున్నారు. "మనుషులు ప్రేమలో పడితే పొట్టలో సీతాకోక చిలుకలా ఉన్నాయని అనిపిస్తుంది..అదే . సీతాకోకచిలుకలు ప్రేమలో పడితే మనుషులు తమ కడుపులో ఉన్నారని భావిస్తారా ? మీరు మీ పండు ఎపిసోడ్స్ ని ఒక సిరీస్ గా చేయండి...ఆ సీతాకోక చిలుకలు ఎప్పుడో మళ్ళీ గొంగళి పురుగులు ఐపోయాయి మావ. మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. సమయం లేదు మిత్రమా పెళ్లి చేసుకో. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అనగానే ముందుగా వినిపించే కొంతమంది పేర్లలో నవదీప్ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తూ ఉంటుంది.

సుమ అడ్డానా...బిగ్ బాస్ కి జూనియర్ షోనా ?

    ఓడియమ్మ ఇది సుమ అడ్డానా లేదంటే బిగ్ బాస్ బజ్ కి మరో జూనియర్ షోనా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో జరిగే గందరగోళాలు ఒకరి మీద ఒకరు ప్రశ్నలతో దాడులు చేసుకోవడాలు చూసాం.. ఇప్పుడు సుమ అడ్డాలో కూడా అలాగే జరుగుతోంది. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆర్జేలు చైతు, సూర్య, యాంకర్ శివ వచ్చారు. అలాగే లేడీస్ లో అష్షు రెడ్డి, రీతూ చౌదరి, నేహా చౌదరి వచ్చారు. వీళ్లకు రకరకాల టాస్కులు పెట్టింది సుమ. ఇక ప్రోమో ఫైనల్ లో మాత్రం రకరకాల ప్రశ్నలు అడిగేసుకుని తెగ ఫీలైపోయారు ఒకరికొకరు. "ఎక్స్పోజింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యావు అని చెప్పి ఆడియన్స్ ఒపీనియన్" అని యాంకర్ శివ అడిగేసరికి "నేనసలు ఎక్కడా ఉండను" అని చెప్పింది. "ఆర్జే చైతు ఒక యాంకర్ తో రిలేషన్ లో ఉన్నావు అని అది బ్రేకప్ అయ్యిందని" అంటూ యాంకర్ శివ అడిగాడు "అది నా ఇష్టం, నా జీవితం, నేను ఏదనుకుంటే అది చేసుకుంటా ఎవరికీ సంబంధం" అన్న రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు. "ఎదుటి వాళ్ళ ఫామిలీస్, వాళ్ళ ఎమోషన్స్ తో నాకేం సంబంధం లేదు అన్నట్టు క్లబ్బులో జరిగే సీన్స్ మీద, పోలీసు కేసుల మీద నువ్వు ప్రశ్నలు అడుగుతావు కదా ..ఒకవ్వేలా నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటే ..ఎం చెప్తావ్ ..అప్పుడు నీకు కూడా బుర్ర ఉండాలి కదా  " అంటూ అష్షు రెడ్డి ఘాటుగానే అడిగింది యాంకర్ శివని.."నేను సమాధానం చెప్తా" అని చెప్పాడు శివ. ఇలా వీళ్ళ మధ్య ఘాటుగా ఒక ప్రస్నోత్తరాల పరంపర కొనసాగింది. ఇక ఈ షో ఎంట్రీలో ఆర్జే చైతుని చూసి సుమా ఒక పాటేసుకుంది. "ఎన్నాళ్ళయింది ఈ అడ్డాకి వచ్చి" అని చైతు అనేసరికి "ఎన్నాళ్లకు పెద్దపండగ వచ్చే" అని పాడింది. "ఎన్నాళ్లకు పెద్దమ్మను కలిసే" అంటూ సుమని పట్టుకుని చైతు పెద్దమ్మ అనేశాడు. దాంతో సుమ కూడా షాకైపోయింది.

రెండో రోజు ఓటింగ్ తారుమారు.. ఆ ఇద్దరిలోనే విన్నర్!

  బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5  నామినేషన్లో ఉండగా.. ఎవరు విన్నర్ అనేది తెలియడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక రోజురోజుకు ఓటింగ్ లో భారీ మార్పు వస్తుంది.  అఫీషియల్ ఓటింగ్ ఏంటనేది ఫినాలే నాడు ప్రకటించనుండగా.. అన్ అఫీషియల్‌ తొలిరోజు ఓటింగ్‌లో నిఖిల్ కొన్ని పోల్స్‌లో పైచేయి సాధిస్తే.. గౌతమ్ మరికొన్ని పోల్స్‌లో పైచేయి సాధించాడు. మొత్తం ఓటింగ్‌లో దాదాపు 80 శాతం ఓటింగ్ వీళ్లిద్దరే షేర్ చేసుకుంటున్నారంటే.. వార్ వన్ సైడ్‌గా వీళ్లిద్దరూ ఓట్లను షేర్ చేసుకుంటున్నారు. 80 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతుంటే.. ప్రేరణ, నబీల్, అవినాష్‌లు మిగిలిన 20 శాతం ఓట్లతో నామమాత్రంగా రేస్‌లో ఉన్నారు. తొలిరోజు ఓటింగ్‌లో గౌతమ్‌పై నిఖిల్ పైచేయి సాధించినట్టుగా కనిపించాడు. కానీ.. రెండో రోజు ఓటింగ్‌లో అనూహ్యంగా వీళ్లిద్దరూ 34 శాతం ఓట్లతో టై అయ్యింది. బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్ లైప్ పోల్‌లో ఓటింగ్ లెక్కలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.  తొలిరోజు నిఖిల్ 33 శాతం ఓట్లతో టాప్‌లో ఉంటే.. గౌతమ్ 25 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో కనిపించాడు. కానీ రెండోరోజు చూస్తే లెక్కలు తారుమారు అయ్యాయి. గౌతమ్ 34 శాతం ఓట్లతో టాప్‌లోకి వచ్చాడు. నిఖిల్‌కి కూడా 34 శాతం ఓట్లే వచ్చినా.. 67,270 ఓట్లు గౌతమ్‌కి పడితే.. నిఖిల్‌కి 67, 200 ఓట్లు పడ్డాయి. ఈ ఇద్దరికీ కేవలం 70 ఓట్ల వ్యత్యాసంతో గౌతమ్ టాప్‌లోకి వచ్చేశాడు. దీన్ని బట్టి చూస్తే.. గంటగంటకూ లెక్కలు ఎలా మారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. నిఖిల్, గౌతమ్‌లో విన్నర్ ఎవరనేది మాత్రం.. చివరి క్షణం వరకూ ఉత్కంఠే. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. బట్ విన్నర్ మాత్రం ఈ ఇద్దరిలో ఒకరేననేది మాత్రం పక్కా. మరో మూడు రోజుల్లో ఓటింగ్ లైన్స్ పూర్తి కానున్నాయి. ఆదివారం నాటి ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగియనుంది. మరి ఈ సీజన్-8 విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.  

నాగార్జునకి పెళ్ళి శుభలేఖ ఇచ్చిన సోనియా ఆకుల!

  బిగ్‌బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా ఆకుల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సోనియాకి నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. బిజినెస్‌మ్యాన్ యష్ పాల్ వీరగోనితో సోనియా ఏడడుగులు వేయబోతుంది. తాజాగా కింగ్ నాగార్జునని కలిసి శుభలేఖ అందజేసిన ఈ జంట. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  మా జీవితంలో స్పెషల్ డే అయిన మా వివాహానికి తప్పకుండా రావాలని నాగార్జున గారిని ఆహ్వానించామంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు యష్. నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా. ఈ నెలలోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. అయితే పెళ్లి తేదీ ఎప్పుడనే విషయం మాత్రం తెలీలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-8 ముగిసిన తర్వాతే పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. యష్ పాల్ సొంతూరు వరంగల్. యష్ కష్టపడి చదువుకుని అమెరికా వెళ్లి చాలా ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. అమెరికాలో చదువు కోసం వెళ్లిన రోజుల్లో తనకి ఎదురైన ఇబ్బందులు మరొకరికి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో 'ఫ్లయ్ హై' అని ఒక కన్సల్టెన్సీని ఆయన స్థాపించారు. అలానే ఫ్లయ్ హై టూరిజం, విరాట్ ఫౌండేషన్ అనే సంస్థలను కూడా ఆయన స్థాపించారు. ఈ వ్యవహారాలన్నింటినీ యష్ స్వయంగా చూసుకుంటున్నారు. వీటితో పాటు అమెరికాలో దావత్ పేరుతో యష్‌కి పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. యష్‌కి సంబంధించిన సంస్థలోనే సోనియా కూడా గతంలో పని చేసేది. అలా వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అయితే యష్‌కి అప్పటికే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఇప్పడు సోనియాని వివాహం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోనియానే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేరణతో చెప్పింది. అలా సోనియా లవ్, పెళ్లి విషయం ఆడియన్స్‌కి లీకైంది. ఇక బిగ్‌బాస్ ద్వారా సోనియా బ్యాడ్ అయిన సమయంలో కూడా యష్ చాలా సపోర్ట్ చేశారు.  

ప్రేమ ఉందంటే ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తానన్న నిఖిల్.. కావ్య క్వశ్చన్ కి అందరు షాక్!

  బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. హౌస్ లో ఇప్పటికే అయిదుగురు కంటెస్టెంట్స్ ఉండగా బిబి పరివార్ వర్సెస్ స్టార్ మా పరివార్ అంటూ ఈ వీక్ మొదలైన నుండి సీరియల్స్ సెలబ్రిటీలని హౌస్ లోకి తీసుకొస్తూ వారిచేత గేమ్స్ ఆడిస్తూ ప్రైజ్ మనీని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్.‌ ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక రంగరాజు (కావ్య) హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వచ్చీ రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు, తింగరి మాటలతో కావ్య కామెడీ చేసింది. ముఖ్యంగా బిగ్‌బాస్ కనిపించలేదు కానీ ఖచ్చితంగా కావ్య దెబ్బకి దండం పెట్టేసి ఉంటాడు.  అందరినీ చాలా సిల్లీ కొశ్చన్స్ అడిగిన కావ్య.. నిఖిల్‌ని మాత్రం సీరియస్‌గా ఓ ప్రశ్న వేసింది. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది.. తనకి గతంలో నువ్వంటే చాలా ఇష్టం.. కానీ ఇప్పుడు ఇష్టం కాదు.. ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉంది అనుకోండి.. అయినా కానీ నాకు నువ్వు వద్దు నిన్ను పెళ్లి చేసుకోను అని చెబుతుంది.. అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు.. మరోవైపు మీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది.. అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తారా.. లేకపోతే డౌన్ ఫీల్ అయి ఇంక వర్కవుట్ అవదని మూ ఆన్ అయి వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారా.. అంటూ కావ్య అడిగింది. ప్రేమ ఉందంటే నేను నిజంగా వెయిట్ చేస్తా.. ఎన్ని ఏళ్లయినా ఖచ్చితంగా వెయిట్ చేస్తా.. అమ్మవాళ్లు చెప్పిన సంబంధం చేసుకోను.. నేను మూ ఆన్ అవ్వలేదు ఆ అమ్మాయిపైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తా కదా.. అంటూ సమాధానమిచ్చాడు. ఈ మాటలకి కావ్య క్లాప్స్ కొట్టింది. ఇలా నిఖిల్ లవ్ స్టోరీని గట్టిగానే బిగ్‌బాస్ టీమ్ వాడేస్తుంది. ఆ తర్వాత కావ్య.. హౌస్‌మేట్స్‌లో ఒకరిని సెలక్ట్ చేసుకొన ఒక గేమ్ ఆడాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అవినాష్‌తో ఒక గేమ్ ఆడింది. ఇందులో అవినాష్ ఈజీగా గెలిచాశాడు. ఇక వెళ్లేముందు నిఖిల్‌కి ఒక టైట్ హగ్ ఇచ్చి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక దక్కుతుంది అంటూ దీపిక చెప్పింది. దీంతో నిఖిల్ నవ్వుతూ థాంక్యూ బయటికొచ్చాక తప్పకుండా కలుస్తా అంటూ బైబై చెప్పేశాడు.  

కోటి రూపాయల అప్పు తీసుకున్న ధన.. ఆడుకుందామనుకున్న సందీప్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -275 లో......రామలక్ష్మి సీతాకంత్ ఆఫీస్ కి వెళ్తుంటే ఆటపట్టిస్తుంది. మరొకవైపు శంకర్ తో ధన మాట్లాడుతుంటాడు. నా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నావ్ ఇంకా ఇవ్వలేదంటూ కోప్పడతాడు. అప్పుడే సందీప్ వచ్చి వీడెవడో ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నాడని అతన్ని సందీప్ చూస్తాడు‌‌. అలా చూసేసరికి ధన తనని చూసి సందీప్ షాక్ అవుతాడు. నువ్వేంటని సందీప్ అడుగుతాడు. అతను నీకు తెలుసా అని శంకర్ అడుగగా.. తను నా బావ అని సందీప్ అంటాడు. బావ, బామ్మర్ది ఇద్దరు అప్పు చేసి నా దగ్గర ఎగ్గొడ్దామనుకున్నారా అని శంకర్ అనగానే.. సందీప్ కూడా తీసుకున్నాడా అని ధన షాక్ అవుతాడు. ఇద్దరికి వరకు టైమ్ ఇస్తున్నా నాకు కచ్చితంగా కావాలని శంకర్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత శ్రీలత అందరికి టిఫిన్ వడ్డీస్తుంది. అత్తయ్య మీరు కూర్చోండి.. నేను వడ్డీస్తానని శ్రీలతని కూర్చోపెట్టి రామలక్ష్మి వడ్డీస్తుంది. అలా అత్తాకోడళ్ళు ప్రేమ గా ఉండడం చూసి సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని రామలక్ష్మిని ఒకవైపు శ్రీలతని ఒకవైపు పెట్టుకొని ఒక ఫోటో తీసుకుంటాడు సీతాకాంత్. మరొకవైపు అసలేం జరిగిందని ధనని సందీప్ అడుగుతాడు. ముంబైలో ఒక కంపెనీతో కంపెనీ స్టార్ట్ చేశాను. మొదట్లో లాభం వచ్చింది. నేను అతనికి వదిలేసి జల్సాలకి అలవాటు పడి శంకర్ దగ్గర అప్పు చేసాను. లాభం వస్తుంది కదా అని తీర్చేయొచ్చనుకున్న ఇంకా నష్టం వచ్చింది అని చెప్తాడు. ఆ తర్వాత నేను కూడా నీలాగే చేసానని సందీప్ అంటాడు. దొరికింది మంచి ఛాన్స్.. వీడిని అడ్డు పెట్టుకొని సీతాకాంత్ ని ఆడుకోవాలని సందీప్ అనుకుంటాడు. మన సిచువేషన్ చెప్పి మమ్మీని హెల్ప్ చెయ్యమందామని సందీప్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ లు ఆఫీస్ కి వెళ్తుంటే.. సందీప్, ధన ఇద్దరు ఇంటికి వస్తారు. తనని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సడెన్ గా వచ్చవ్ ఏంటని ధనని అడుగగా.. డాక్యుమెంట్స్ కోసం వచ్చానని, అలాగే సిరిని చూసి వెళదామని వచ్చానని ధన అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: జ్యోత్స్నకి చురకలు వేసిన దీప.. భార్యకి సపోర్ట్ గా కార్తీక్!

  కార్తీక్ ను తినకుండా చేసి ఆఫీస్ కి రప్పించి.. కొన్ని ఫైల్స్ చేతిలో పెడుతుంది జ్యోత్స్న. ఇవన్నీ నీ ఆధ్వర్యంలో నడిచిన ఫైల్స్ వీటిలో క్లారిటీ లేకే నిన్ను రమ్మన్నానని జ్యోత్స్న అంటుంది. వెంటనే కార్తీక్ బెల్ కొట్టి ఆఫీస్ బాయ్‌ని పిలిచి.. ప్రభాకర్‌ని రమ్మను అంటాడు. వెంటనే ప్రభాకర్ రాగానే.. ఇవన్నీ నీ ఆధ్వర్యంలో అంటోంది. అప్పుడు నువ్వు చూసిన ఫైల్సే కదా ఇవి. నీకు తెలియదా.. నువ్వు చెప్పొచ్చు కదా.. ముందు మేడమ్ గారికి నువ్వు వివరించు. డౌట్ వస్తే అప్పుడు నా దగ్గరికి రా.. తినకుండా రప్పించారు.. ఈ ఆఫీస్‌లో కొందరికి బుర్ర సరిగా పని చేయదనుకుంటా అని తన క్యాబిన్‌కి వెళ్లిపోతాడు కార్తీక్. కాసేపటికి ప్రభాకర్ వచ్చి.. సర్ మిమ్మల్ని డైనింగ్ హాల్‌కి రమ్మంటున్నారు మేడమ్.. అక్కడ మాట్లాడతారట అని కార్తీక్ తో అంటాడు.  ఏం తింటూ మాట్లాడతారా అని కార్తీక్ అనగా... అప్పటికే అవసరం లేని దాని కోసం రప్పించి తినకుండా చేసిందన్న కోపంలో ఉన్నాడు కార్తీక్. తీరా కార్తీక్ డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్లేసరికి.. రా బావా తినకుండా వచ్చావని తెలిశాకా నువ్వు తినకపోతే నాకు నీరసం వచ్చేలా ఉంది. కూర్చో తింటూ మాట్లాడుకుందామని జ్యోత్స్న అంటుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లొచ్చా.. నాకు ఇల్లు ఉంది. అందులో వండి పెట్టే పెళ్లాం ఉందని కార్తీక్ అంటాడు. నిన్ను పిలిపించిన పని పూర్తి కాకుండా ఎలా వెళ్తావ్ బావా.. ఇక్కడ తినొచ్చు కదా అని జ్యోత్స్న అనగా.. కావాలనే తనని ఆపుతుందని అర్థం కావడంతో కార్తీక్.. ఇంటికి వెళ్లి తింటానని అంటాడు. చంటి పిల్లాడిలా మాట్లాడకు బావా.. ఇప్పుడు నీకు ఆకలేస్తుంది. కళ్లముందు మంచి ఫుడ్ ఉంది.. తినొచ్చు కదా? ఏం నీకోసం ఎవరైనా స్పెషల్‌గా ఫుడ్ తీసుకొస్తాననుకుంటున్నావా? ఈ క్షణం నీకోసం ఆలోచించే మనిషిని నేను తప్ప ఎవ్వరు లేరు బావా.. పంతానికి పోయి పస్తులుండొద్దు.. నువ్వు తింటేనే నేను తింటాను.. ఇది పంతం కాదు ప్రేమ అని జ్యోత్స్న అంటుంది. అలాంటి ప్రేమ చూపించడానికి నాకో మనిషి(దీప) ఉందిలే అని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప భోజనం తీసుకొని వస్తుంది. మీకోసం భోజనం తీసుకొచ్చాను మేనేజర్‌గారిని అడిగితే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారని దీప అంటుంది. ఏం కాలేదులే దీపా.. నువ్వు క్యారేజ్ తెస్తావని అనుకోలేదు.. అందుకే చూడగానే సర్ప్రైజ్ అయ్యానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నా.. ఇప్పుడు నీకు ఎలా ఉందంటూ దీప పలకరించగా.. వచ్చి ఇంత సేపు అయినా నీకు ఇది కూడా అడగాలని అనిపించలేదు కదా బావా అని జ్యోత్స్న అంటుంది. దీప మౌనంగా ఉంటుంది. అబ్బా భార్య అంటే నీలా ఉండాలి దీపా అంటూ గుత్తివంకాయ కూర కార్తీక్ తినబోతూ.. జ్యోత్స్నా.. నీకు కూడా కావాలా? గుత్తివంకాయ కూర.. మా ఆవిడ నాకోసం చాలా ప్రేమగా చేసిందని అంటాడు. ఆ ప్రేమ నాకొద్దులే.. నువ్వు తిను అని జ్యోత్స్న అంటుంది. కొన్నింటికి అదృష్టం ఉండాలిలే అంటూ మళ్లీ తినబోతూ.. నువ్వు తిన్నావా దీపా అంటాడు కార్తీక్. లేదనగానే.. తన కుర్చీని పక్కకి జరుపుకొని అన్నం వడ్డిస్తాడు కార్తీక్. దీప కూర ఎంత బాగా చేశావో తెలుసా.. ఇది ఆఫీస్ అయ్యింది కానీ.. అదే ఇంటి దగ్గరైతే నిన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పేవాడ్ని తెలుసా అని జ్యోత్స్నకి మండేలా దీపని కార్తీక్‌ పొగిడేస్తాడు. ఇక అది తట్టుకోలేక జ్యోత్స్న.. మేనేజర్ ను పిలిచి ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా రానివ్వకని అంటుంది. అయిన సరే దీప, కార్తీక్ తినడం ఆపరు. చక్కగా తిని చేయి కడుక్కుంటాడు కార్తీక్. వెంటనే దీప కొంగుతోనే చేయి మూతి తుడుచుకుని.. పైకిలేస్తాడు. జ్యోత్స్న అలా రగిలిపోతూ నిలబడే ఉంటుంది. నా మీద కోపంతోనే కదా ఆ మేనేజర్‌ని కొట్టావని కార్తీక్ అంటాడు. అది నీ మీద కోపం కాదు బావా అని దీపను చూస్తూ జ్యోత్స్న అంటుంది.  నేను, నా భార్య ఒక్కటే.. నన్ను అన్నా నా భార్యను అన్నా ఒక్కటే. ఇద్దరం వేరు కాదని కార్తీక్ అంటాడు. ఇంతలో దీప బాక్స్‌లు సర్దుకుంటుంది. నువ్వు ఇంటికి వెళ్లు దీపా.. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను.. బయట వరకూ రానా అని కార్తీక్ అనగానే.. పర్వాలేదు బాబు అని దీప అంటుంది. జాగ్రత్త దీపా అని కార్తీక్ అంటాడు. ఇంకా ఇంకా రగిలిపోతుంది జ్యోత్స్న. దీప అలా వెళ్లగానే.. నా భార్య జోలికి వస్తే మర్యాదగా ఉండదు.. జాగ్రత్త అంటూనే.. వెంటనే స్వరం మార్చి.. భోజనం చేయండి సీఈవోగారు‌ అనేసి కార్తీక్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రెండు కోట్లకి స్కెచ్ వేసిన రుద్రాణి.. ధాన్యలక్ష్మిని బలిపశువుని చేస్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-589లో.. కావ్య కిచెన్ లో నేలమీద పడుకోవడం చూసిన అపర్ణ.. రాజ్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళమంటుంది. ఇక ఏం చేయలేక గదిలోకి కావ్యని రమ్మంటాడు రాజ్. తీరా కావ్య గదికి వెళ్లేసరికి రాజ్.. బెడ్ మధ్యలో ప్లాస్టర్ వేస్తూ ఉంటాడు. కావ్య దాన్నే చూస్తూ.. ఏంటండీ ఇది అని అడుగుతుంది. ఇది ఒక గీత అని రాజ్ అనగా.. ఏంటీ గీతా? ఎందుకింత రోత.. నా తలరాత.. నా గుండె కోత అని కావ్య అంటుంది. హలో హలో ఇది రాజ్ రేఖ.. ఈ గీత దాటి నువ్వు ఇటు పడుకోకూడదు.. నేను అటు రాను.. హేయ్ మా మమ్మీ చెప్పింది.. నీకు నా గదిలో స్థానం ఇవ్వమని.. మా మమ్మీ మాట కాదనలేను. ఆ సగం నీకు ఈ సగం నాకు.. నా భాగంలోకి రాకు అనేసి రాజ్ వాటర్ తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. మీరు ఇంతగా బాధపడి ఇబ్బంది పడి కష్టపడి గీత గీయాల్సిన అవసరం ఏం లేదు.. మీరు మనస్పూర్తిగా నన్ను భార్యగా ఒప్పుకున్నరోజే నేను ఈ రెండు ముక్కల బెడ్ మీద పడుకుంటానని కావ్య శపథం చేసి మరీ.. చాప, దిండు తెచ్చుకుని కింద వేసుకుని పడుకుంటుంది. హమ్మయ్యా.. సరే అయితే నేను పిలిచే వరకూ నా బెడ్ ఎక్కకని రాజ్ అంటాడు. అంటే ఏదో ఒకరోజు పిలుస్తారని కావ్య అనగానే.. అంతలేదు. కలలు కనకుండా పడుకో అనేసి రాజ్ కళ్లుమూసుకుంటాడు.  రుద్రాణి దగ్గరికి రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావ్ అంటాడు. ప్లాన్ బీ సెట్ చేశానురా.. రేపు నువ్వు రాజ్ దగ్గరకు వెళ్లి.. కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను రెండు కోట్లు కావాలి సైన్ చేయమని అడుగమని రాహుల్ అంటుంది. మమ్మీ.. నిద్రలేమితో నీకు బుర్ర పోయినట్లు ఉంది.. రెండు కోట్ల చెక్ రాసి ఇవ్వమంటే రాజ్ ఎందుకు సంతకం చేస్తాడని రాహుల్ అంటాడు. ఓరినా పిచ్చి సన్.. వాడు సంతకం పెట్టకపోవడమే రా మనకు కావాల్సింది. నిన్ను నమ్మి నేనే డబ్బులు ఇవ్వను అలాంటిది రాజ్ ఎందుకు ఇస్తాడు. ఇవ్వడు కానీ.. ఇవ్వకపోవడమే మనకు కావాలి. మనం అదే చెక్ తీసుకెళ్లి ధాన్యలక్ష్మిని రెచ్చగొడతాం.. ఇగో దెబ్బ తింటే ధాన్యలక్ష్మి ఆస్తి కావాలని గొడవ చేస్తుంది. మన టార్గెట్ అది అని మొత్తం వివరంగా చెప్తుంది రుద్రాణి.  ప్లాన్ ప్రకారం రాజ్ దగ్గరకు చెక్‌తో వెళ్తాడు రాహుల్. రెండు కోట్లా ఎందుకని రాజ్ అడుగుతాడు. ఇది నీకొచ్చిన ఆలోచనేనా.. లేక రుద్రాణి మాయా అని ప్రకాశం అని అడుగుతాడు. నిన్ను నమ్మి అంత డబ్బు ఇవ్వడం కుదరదనేదాకా మెట్ల మీద ఉండి చూస్తున్న రుద్రాణి రంగంలోకి దిగుతుంది. వాడు మారతాననేగా అడుగుతున్నాడు. మాకు ఈ ఇంట్లో ఆ మాత్రం విలువ లేదా అంటూ గొడవ చేస్తుంది. అయిన సరే రాజ్ ఇవ్వనంటాడు. కాసేపటికి రాహుల్, రుద్రాణీలు. అనుకున్నట్లే ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి.. నువ్వే గతి.. నువ్వే మాకు 2 కోట్లు ఇప్పించాలి.. అలా ఇప్పిస్తే ఈ కొత్త బిజినెస్‌లో కళ్యాణ్‌ ని కూడా పార్టనర్‌ని చేస్తాం.. మనం కూడా ఎదగొచ్చు.. ఆస్తులు కూడగట్టుకోవచ్చంటూ ఆశ చూపిస్తారు. రాజ్ నీ మాట కూడా వినడేమో.. నీకు కూడా నో చెబుతాడేమో అంటూ రాజ్ ని బాగా రెచ్చగొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: సీక్రెట్ గా పెళ్ళి చేసుకోవాలనుకున్న కొడుకు.. అక్కడికే వస్తున్న తల్లిదండ్రులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -25 లో..... సాగర్, నర్మదల పెళ్లి చెయ్యడానికి గుడికి తీసుకొని వస్తాడు ధీరజ్. వెళ్లేసరికి ధీరజ్ ఫ్రెండ్స్ అంతా సిద్ధం చేస్తారు. లోపలికి వెళ్తుంటే ప్రేమ, కళ్యాణ్ లు కన్పిస్తారు. వాళ్ళని చూసి అది ఇక్కడ ఉందేంటి.. ఇప్పుడు చూస్తే ఊరంతా చెప్తుందనుకొని సాగర్, నర్మదలని కార్ లో కూర్చోమని చెప్పిన ధీరజ్.. ప్రేమ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతు ఫోటోస్ తీస్తాడు. ఈ ఫోటోస్ అందరికి పంపిస్తానని చెప్పగానే ప్రేమ, కళ్యాణ్ లు వద్దని భయపడి అక్కడ నుండి వెళ్తారు. మరొకవైపు సాగర్, నర్మద లు లోపలికి వస్తుంటే.. నర్మద చెంచలమ్మకి చూడకుండా డాష్ ఇస్తుంది. చూసుకోవాలి కదా అని చెంచలమ్మ అంటుంది. ఆ తర్వాత నర్మద, సాగర్ లు రెడీ అవ్వడానికి వెళ్తారు. ఆ ధీరజ్ గాడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు తెలుసుకోవాలంటూ ప్రేమ గుడి లోపలికి వెళ్తుంటే నాతో మాట్లాడడం కంటే వాడితో గొడవకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని కళ్యాణ్ అనగానే.. ప్రేమ లోపలికి వెళ్లకుండా కళ్యాణ్ తో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నర్మద సాగర్ లు రెడీ అయి వస్తారు. మరొకవైపు రామరాజు వెళ్తుంటే వేదవతి క్యారేజ్ తో రెడీగా ఉంటుంది. మీరు పక్క ఊరి గుడికి వెళ్తున్నారంట నేను వస్తానని వేదవతి అనగానే.. మొదట వద్దన్నా ఆ తర్వాత సరేనని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు పెళ్లి జరుగుతుంటే నర్మద పక్కకి వెళ్లి బాధపడుతుంటుంది. ధీరజ్ వెళ్లి మాట్లాడి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ నన్ను రూమ్‌కి పిలిచాడు అంటూ గోల చేసిన కావ్య!

  బిగ్ బాస్ సీజన్-8 ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ సీజన్ ముగియడానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ లో అవినాష్ , నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రభాకర్-ఆమని, అర్జున్ కళ్యాణ్-అనుమిత హౌస్ లోకి రాగా వారితో కలిసి హౌస్ మేట్స్ టాస్క్ లు ఆడారు. ప్రైజ్ మనీ పెరగవచ్చు, తగ్గవచ్చు అని , ట్విస్ట్ లు టర్న్ లు ఉంటాయని వీకెండ్ లో నాగార్జున చెప్పకనే చెప్పారు. ఇక నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది . ఇందులో బ్రహ్మముడి కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. లేడీ లక్కు లేడీ లక్కు సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన కావ్య అలియాస్ దీపిక.. హౌస్‌మేట్స్ అందరితో తనదైన డ్యాన్స్ స్టెప్స్ తో అదరగొట్టేసింది. వెంటనే అందరిపై ఓ డైలాగ్ వేసేసింది. ఏంట్రా మీరందరూ బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చారా లేక వెయిట్ లాస్ థెరపి సెంటర్‌కి వచ్చారా అంటూ దీపిక అడగ్గానే హౌస్‌మేట్స్ తెగ నవ్వుకున్నారు. ఆ తర్వాత బేస్ వాయిస్‌తో కావ్య మీకు బిగ్‌బాస్ పరివారంలోకి స్వాగతమంటూ బిగ్‌బాస్ అనగానే.. అసలు మీ లైఫ్‌లో రొమాన్స్‌యే ఉండదా.. కావ్య నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌కి వచ్చావ్ కదా అంటూ ప్రేమగా పలకరించరా అంటూ దీపిక వాయించేసింది. ఇంతలో కావ్య కన్ఫెషన్ రూమ్‌కి రండి అంటూ బిగ్‌బాస్ అనగానే.. హేహే నన్ను బిగ్‌బాస్ రూమ్‌కి రమ్మని పిలిచారంటూ గెంతులేసింది దీపిక. ఆ తర్వాత ఒక అమ్మాయితో ఫ్యూచర్‌లో నీకు పెళ్లి అవుతుంది.. పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు.. అప్పుడు ఏం చేస్తావ్.. తనని అక్కా అని పిలిచి వచ్చేస్తావా అంటూ గౌతమ్ ని దీపిక అడిగి తెగ నవ్వేసుకుంది. దీనికి గౌతమ్ నవ్వుతూ కవర్ చేశాడు.  ఆ తర్వాత హౌస్ లో గేమ్స్ ఆడింది కావ్య. ఇక ప్రోమో చివరిలో కావ్య మీరుండే సమయం పూర్తయింది.. ఇక బయలుదేరండి అంటూ బిగ్‌బాస్ చెప్పగా.. ఎక్కడైనా గెస్టు వస్తే వాళ్లు పని ఉందని వెళ్లాలి.. ఇలా పిలచి పొమ్మాంటారా అంటూ డైలాగ్ వేసింది కావ్య. దీంతో వామ్మో అలా అనకూడదంటూ అవినాష్ తో పాటు హౌస్‌మేట్స్ అంతా దండం పెడుతూ సారీ బిగ్ బాస్ అని అన్నారు.