నువ్వే కావాలి హీరోతో సీరియల్ నటి పెళ్లి!
టాలీవుడ్ లో పెళ్లిళ్ల జాతర జరుగుతోంది. రీసెంట్ గా నటుడు సుబ్బరాజు, హీరో అక్కినేని నాగ చైతన్య వంటి వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. ఇక ఇప్పుడు సింగర్ సాయి కిరణ్ కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఈయన ఒకప్పటి టాలీవుడ్ సింగర్ రామకృష్ణ తనయుడు. ఆయన 'నువ్వేకావాలి' సినిమాలో నటించాడు. అలాగే ఆ సినిమాలోని "అనగనగా ఆకాశం ఉంది" అనే పాట పాడి యూత్ ని మస్మోరైజ్ చేసిన నటుడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రేమించు, దేవి, మనసుంటే చాలు, ఎంత బావుందో, డార్లింగ్ డార్లింగ్ సహా దాదాపు 25 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి సీరియల్స్ నటిస్తూ మెప్పిస్తున్నాడు.
ఇక సాయి కిరణ్ కి బ్రేక్ ఇచ్చిన సీరియల్, సోషల్ మీడియాలో సాయికిరణ్ కి మంచి హైప్ తెచ్చిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది "గుప్పెడంత మనసు" సీరియల్ . ఇందులో మహేంద్రగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సీరియల్స్ ఆర్టిస్టుల్లో ఇప్పుడు టాప్ యాక్టర్స్‌లో ఎవరైనా ఉన్నారు అంటే అది సాయికిరణ్ మాత్రమే. గుప్పెడంత మనసు కంటే ముందు మౌనరాగం, ఇంటిగుట్టు, అభిలాష, కోయిలమ్మ, శివలీలలు, వెంకటేశ్వర వైభవంతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సీరియల్స్‌లో సాయికిరణ్ నటించాడు. కోయిలమ్మ సీరియల్ లో సింగర్ గా నటించాడు. ప్రస్తుతం పడమటి సంధ్య రాగం అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అలా వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు సాయి కిరణ్. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైములో రెండో వివాహం చేసుకున్నాడు. అది కూడా చాలా సింపుల్ గా జరిగిపోయింది. కోయిలమ్మ సీరియల్ లో వదిన రోల్ లో చేసిన స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్య వైష్ణవితో మ్యూచువల్ డివోర్స్ తీసుకుని కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు తన సహనటిని పెళ్లి చేసుకున్నాడు. తెలుగుతో పాటూ మలయాళం సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు సాయికిరణ్. సాయి కిరణ్ ని పెళ్లి చేసుకున్న స్రవంతి.. కళ్యాణం కమనీయం, నాగపంచమితో పాటు పలు సీరియల్స్ నటించింది. కోయిలమ్మ సీరియల్‌లో నటిస్తున్నప్పుడే సాయికిరణ్, స్రవంతి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. సాయి కిరణ్.. గోపి, సప్తగిరి ఎల్ఎల్‌బీ, నక్షత్రంతో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు కానీ అంతగా క్లిక్ కాలేదు. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే సాయికిరణ్ కి ఎక్కువగా గుర్తింపు వచ్చింది.