కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్
Publish Date:Dec 29, 2025
నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది. అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు. ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?
Publish Date:Dec 29, 2025
సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం
Publish Date:Dec 29, 2025
అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?
Publish Date:Dec 28, 2025
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?
Publish Date:Dec 28, 2025
140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?
Publish Date:Dec 29, 2025
దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు. స్వాతంత్యోద్యమ కాలం నుంచీ ఉన్న ఈ పార్టీ ఈ క్రమంలో అనేక విజయాలు, అపజ యాలను చవి చూసింది. అయితే ఇప్పటి వరకూ దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా రికార్డు కూడా సృష్టించింది. అయితే గత కొన్నేళ్ల నుంచీ, అంటే దాదాపుగా దశాబ్ద కాలం నుంచీ ఆ పార్టీ వరుస పరాజయాలతో కూనారిల్లుతోంది. కాంగ్రెస్ చరిత్రలో ఇంతటి పతనావస్థ ఆ పార్టీకి గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయం తరువాత నుంచి ఈ పార్టీ కోలుకోలేదనే చెప్పాలి. ఈ పరిస్థితి చాలదన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది.
పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కీలక రాష్ట్రాలలో కనీస స్థానాలను కైవసం చేసుకోవడంలో విఫలమౌతున్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్ట సాధ్యమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది.
ఇవన్నీ పక్కన పెడితే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 140వ ఆవిర్బావ దినోత్సవాన్ని ఆదివారం (డిసెంబర్ 28) జరుపుకుంది. అయితే 140 ఏళ్ల కాంగ్రెస్ లో ఆ సందర్బంగా ఎలాంటి ఉత్తేజం కానీ, జోష్ కానీ కనిపించలేదు. వరుస పరాజయాలతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాల పట్ల ఉదాశీనంగా ఉన్నాయి. వీటన్నిటికీ మించి పార్టీలో కీలక నేతలు బీజేపీ, ఆ పార్టీ మెంటార్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ అనుకూల ప్రకటనలు చేస్తుండటం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆదివారం (డిసెంబర్ 28) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వినా మరెక్కడా వేడుకలు జరగలేదు. పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణల్లో కూడా ఆ సందడి కనిపించలేదు. కనీసం ఆయా రాష్ట్రాలలోని కాంగ్రెస్ కార్యాలయాలలో కూడా ఎటువంటి కార్యక్రమాలూ జరిగిన దాఖలాలు లేవు.
ఇక పార్టీ ఎంపీ శశిథరూర్ వంటి వారు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం పార్టీ అధిష్ఠానాన్ని మరింత ఇరుకున పెడుతోంది. అలా పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో కాంగ్రెస్ కోలకుంటుందన్న భావన నెమ్మదిగా పార్టీ శ్రేణులలోనే అడుగంటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నాయకుల జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేరడం పార్టీ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేసింది. దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రధాని మోడీపై ప్రశంసిస్తూ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ లను ప్రస్తుతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానిగా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగత బలమే కారణమని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా తన పోస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కీలక నేతలు ప్రియాంక వధేరా గాంధీ, రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు. అయితే ఆ తరువాత తన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని చెప్పడానికే కానీ, ఆ సంస్థను కానీ, మోడీని కానీ ప్రశంసించడానికి కాదనీ కాంగ్రెస్ కు కూడా ఇలాంటి బలమైన వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని చెప్పడమే తన ఉద్దేశం వివరణ ఇచ్చారు. ఆ వివరణలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడిందనీ, అధికారం కేంద్రీకృతమై ఉందన్న సంకేతాలు ఉండటం గమనార్హం. దీంతో పార్టీలోని సీనియర్లు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ గ్రాండ్ ఒల్డ్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!
Publish Date:Dec 26, 2025
క్రిస్మస్ వేడుకలకూ జనసమీకరణేనా జగన్?
Publish Date:Dec 26, 2025
మోడీ మౌనం దేనికి సంకేతం?
Publish Date:Dec 24, 2025
జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ?
Publish Date:Dec 23, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
మనసులోని మాటను దైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారా... ఈ నిజం తెలుసుకోండి..!
Publish Date:Dec 27, 2025
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో, నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి. వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది. ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది. దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు. కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల తరువాత చాలా బాధపడతారు కూడా. అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే..
నమ్మకం, సాన్నిహిత్యం..
ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి. నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల వ్యక్తులు పారదర్శకత, పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం..
మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు.. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు.
తేడాలు, పరిష్కారాలు..
జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా, ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది.
ఆత్మవిమర్శ..
ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది.
మానసిక ఒత్తిడి, ఆందోళన..
భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది.
శారీరక ఆరోగ్యం..
స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
సక్సెస్ కోసం..
స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా, కుటుంబంలో అయినా, బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది అన్ని చోట్ల విజయాన్ని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం అవుతుంది. కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.
*రూపశ్రీ.
ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..!
Publish Date:Dec 26, 2025
క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?
Publish Date:Dec 25, 2025
ఐస్లాండ్ దేశంలో ఆశ్చర్యపోయే నిజం.. ఇక్కడ శాంతా క్లాజ్‌ల గురించి తెలుసా?
Publish Date:Dec 24, 2025
తెలివైన వాళ్లమని మిడిసిపడుతున్నారా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వెంటే షాకవుతారు..!
Publish Date:Dec 23, 2025
వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!
Publish Date:Dec 27, 2025
ఆరోగ్యం కోసం, శరీరానికి కావలసిన ప్రోటీన్, పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు. వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి. ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే..
వాల్నట్స్ లో పోషకాలు..
వాల్నట్స్ లో అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి.
గుండె ఆరోగ్యం..
వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట.
రక్తపోటు..
రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.
బరువు..
బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
మానసిక ఆరోగ్యం..
మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థ..
జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది.
వాపులు, నొప్పులు..
వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!
Publish Date:Dec 26, 2025
రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా?.. అయితే ఈ నిజం తెలుసుకోండి!
Publish Date:Dec 25, 2025
ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!
Publish Date:Dec 24, 2025
ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..!
Publish Date:Dec 23, 2025