ఫైమా కాళ్ళు పట్టుకున్న హైపర్ ఆది...

  "ఈ సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ఒక షో త్వరలో సంక్రాంతి పండగకి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఈ షోకి సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమోలోనో షో మొత్తం చూపించేసారు మేకర్స్. ఇక హైపర్ ఆది మాత్రం ఎక్కడా తగ్గేదెలా అన్నట్టు చేసాడు. ట్రెండింగ్ లో ఉన్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ గెటప్ తో వచ్చి ఆడియన్స్ కి కనువిందు చేసాడు. అల్లు అర్జున్ లా ఆది నటిస్తే శ్రీవల్లి రోల్ లో ఫైమా చేసింది. ఆదిని సర్ప్రైజ్ చేయడానికి ఫైమా వెనక నుంచి వచ్చి సామి..అంటూ హగ్ చేసుకుంది. ఆ హగ్ కి ఆది షాకైపోయాడు. "నెలకోసారి నాలుగు ఈవెంట్లకు వెళ్లి బాగా అలవాటైపోయింది నీకు ఇలా అందరినీ హగ్ చేసుకోవడం" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక మూవీలో  పుష్ప రాజ్ శ్రీవల్లి కాళ్ళను మూవీలో పట్టుకోవడం చూసాం. ఆది అదే ఇక్కడి షోలో దించేసాడు. "ప్రేమలో ఐనా, పౌరుషంలో ఐనా తగ్గేదెలా" అంటూ ఆది ఫైమా కాళ్ళు పట్టుకునేసరికి అందరూ షాకైపోయారు. శేఖర్ మాష్టర్ ఐతే గట్టిగా అరిచేసాడు. ఇక నెటిజన్స్ ఐతే హైపర్ ఆది నటన చూసి కేక..ఫైమా కాళ్ళు కూడా పట్టుకున్నాడు  అసలు...స్టేజి మీద ఎంతమంది ఉండనీ కానీ..అందరికీ  రిజిస్టర్ అయ్యేలాగా స్కిట్ చేయాలి అంటే అది ఆదికే సొంతం"  అంటూ కామెంట్స్ పెడుతున్నారు. . ఇక షెకావత్ గెటప్ లో ఆటో రాంప్రసాద్ వచ్చాడు. అతన్ని చూసిన ఆది "దమ్ముంటే పట్టుకోరా ఆటోగాడా...పట్టుకుంటే వదిలేస్తా తుక్కుగూడ...మళ్ళీ భుజాన బ్యాగేసి, సాఫ్ట్ వేర్ జాబ్ కెళ్తా ఆఫీస్ కేసి" అంటూ పాటపాడేశాడు ఆది. ఇదొక్కటే కాదు గంగానమ్మ గెటప్ లో సిల్వర్ స్క్రీన్ మీద  అల్లు అర్జున్ రికార్డ్స్ బద్దలు కొడితే ఇక్కడ స్మాల్ స్క్రీన్ మీద ఆది రికార్డ్స్ బద్దలు కొట్టాడు.

Brahmamudi : కిరిటాన్ని మార్చేసిన కావ్య.. డెమో పీస్ అంటూ కొత్త ప్లాన్ రివీల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -613 లో.... రాజ్ ని నిద్రలేపడానికి వస్తుంది కావ్య. దాంతో తన మీద పడిపోతుంది. కావ్య రొమాంటిక్ గా రాజ్ ని చూసేసరికి.. పదా ఆఫీస్ కి లేట్ అవుతుందంటూ కంగారుపడతాడు. మార్పు మొదలైంది ప్రేమ మొదలు అయిందని కావ్య మురిసిపోతుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య ఆఫీస్ కి బయల్దేర్తారు. దారిలో కావ్య ప్రెజెంటేషన్ ఫైల్ మర్చిపోయానని గుర్తుకు వచ్చి తీసుకొని రావడానికి కార్ దిగి ఆటోలో వెళ్తుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి కి వెళ్లి నగలన్నీ జగదీష్ చంద్ర ముందు పెట్టేస్తాడు. ఆ తర్వాత కావ్య మేడమ్ రాలేదని అనామికకి సెక్యూరిటీ ఫోన్ చేసి చెప్తాడు‌. అదేంటి ఎందుకు రాలేదని అనామిక టెన్షన్ పడుతుంది. రాజ్ ఒక్కడే అవమానపడడానికి వీలు లేదు కావ్య కూడా అందులో భాగంగా ఉండాలని అనామిక అనుకొని.. కావ్యకి ఫోన్ చేసి నీ భర్త అక్కడ అవమానపడుతుంటే నువ్వేం చేస్తున్నావ్.. నువ్వు అందులో భాగం ఉండాలి కదా అంటూ మాట్లాడుతుంది. కావ్యకి ఏం అర్ధం కాదు.. దాంతో రాజ్ కి ఫోన్ చేస్తుంది. రాజ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు అన్ని నగలు ఒకే గానీ ఈ కిరీటం బంగారం కిరీటం కాదని క్వాలిటీ చెక్ వారు జగదీశ్ చంద్రతో అంటారు. నా ఫ్రెండ్ మనవడివి అని నమ్మితే ఇంత మోసం చేస్తావా రాజ్ అని జగదీశ్ చంద్ర కోప్పడతాడు. అప్పుడే కావ్య వచ్చి.. ఏమైందని అడుగుతుంది. ఏం జరిగిందో నీకు తెలియకుండా ఉంటుందా అని జగదీశ్ చంద్ర అంటాడు. ఈ కిరీటం బంగారం కిరీటం కాదని అంటాడు. అవును అది డెమో పీస్ అయిన మర్చిపోయినట్లున్నాడు. అది సెక్యూరిటీ పర్పస్ ఇలా పెడుతామని కావ్య ఒరిజినల్ కిరీటాన్ని ఇస్తుంది. దాంతో తప్పుగా అర్ధం చేసుకున్నానని జగదీశ్ చంద్ర అనగానే.. నాకు కాదు మా అయన కి చెప్పండి అని కావ్య అంటుంది. అదంతా విన్న సెక్యూరిటీ అంటే నేను తీసుకొని వెళ్ళింది కూడా డెమో పీస్ ఆ.. నా యాభై లక్షలు పోయే అంటూ అనామికకి ఫోన్ చేసి మేడమ్ కొంప మునిగింది. అది ఒరిజినల్ కిరీటం కాదని చెప్పగానే అనామిక షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

Illu illalu pillalu : ఆమెను అమ్మాలనుకుంటున్న కళ్యాణ్.. ధీరజ్ కాపాడగలడా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -49 లో..... నువ్వు ఇప్పుడు నాతో రాకుంటే చచ్చిపోతానని ప్రేమని కళ్యాణ్ బెదిరించడంతో ప్రేమ వస్తానని చెప్తుంది. బట్టలు సర్దుకుని మొహం కడుక్కోవడానికి వెళ్తుంది. ఆ లోపు కళ్యాణ్ తన గదిలో ఉన్న డబ్బు నగలు బ్యాగ్ లో సర్దుతాడు. ఆ తర్వాత ప్రేమని తీసుకొని బయటకు వస్తాడు. ప్రేమ తన ఇంటిని చూస్తూ తన జ్ఞాపకాలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు ధీరజ్ ఒక షాప్ దగ్గర ఆపి కూల్ డ్రింక్స్ తీసుకుంటాడు. నేను తాగానని వేదవతి అనగానే.. నువ్వు తాగకుంటే నేను తాగనని ధీరజ్ అంటాడు. దాంతో వేదవతి తాగుతుంది. ఆ తర్వాత ధీరజ్ నర్మద, వేదవతి లు ఒక హోటల్ దగ్గర ఆగి రూమ్ తీసుకుంటారు. నేను తినడానికి ఏమైనా తెస్తానంటూ ధీరజ్ వెళ్తాడు. నేను సాగర్ తో ఫోన్ మాట్లాడి వస్తానంటూ వేదవతికి చెప్తుంది నర్మద. మరొకవైపు ప్రేమ ఏడుస్తూనే ఉంటుంది. తనని ఇంకా ప్రేమిస్తున్న అంటు ఎంత మంది ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదని ప్రేమకి మాయ మాటలు చెప్తుంటాడు కళ్యాణ్. అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే తనని తీసుకొని వస్తున్న ఏర్పాట్లు చేసుకోండి అంటాడు. ఏం ఏర్పాట్లు అని ప్రేమ అనగానే.. మన పెళ్లికి అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్, ప్రేమ ఇద్దరు వస్తున్న కార్ పంచర్ అవుతుంది. దాంతో ప్రేమని అమ్మే అతనికి ఫోన్ చెయ్యగా అక్కడ ఒక హోటల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. నేను అక్కడికి వస్తానని చెప్తాడు. దాంతో ప్రేమని తీసుకొని ధీరజ్ వాళ్ళున్న హోటల్ కి వెళ్తాడు కళ్యాణ్. మరొకవైపు సాగర్ తో ఫోన్ మాట్లాడుతుంటుంది నర్మద . మరొకవైపు ప్రేమని తీసుకొని కళ్యాణ్ హోటల్ కి వస్తాడు. ధీరజ్ బయట సోఫాలో పడుకొని ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్.. కార్తీక్ వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -248 లో..... సుమిత్ర తెచ్చిన టిఫిన్స్ అందరు బాగున్నాయంటూ మెచ్చుకుంటారు. అవి దీప చేసిన టిఫిన్స్ అని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ మనిషే పడదంటే తను చేసిన టిఫిన్ ఎలా తింటారనుకున్నావని శివన్నారాయణ వెళ్లిపోతాడు. ఎందుకు తీసుకొని వచ్చావంటూ దశరథ్ అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పటివరకు చాలా బాగున్నాయన్నారు కదా అంటే.. దీప చేత రెస్టారెంట్ పెట్టిస్తావా అని జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది. మమ్నీ నువ్వు వెళ్లి దీప టిఫిన్స్ తేవడం ఏంటి.. ప్రొద్దున దాస్ వచ్చాడు. మమ్మీని కలిసాడు అంటే దీప గురించి ఏమైనా చెప్పి ఉంటాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు ఈ రోజు సుమిత్ర గారు వచ్చారు కదా అని కార్తీక్ ని దీప అడుగుతుంది. ఇంతవరకు వచ్చి ఎందుకు రాలేదని దీప బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం దీప, కార్తీక్ లు టిఫిన్ చేస్తుంటే.. ఫుడ్ ఆఫీసర్స్ వచ్చి మీ టిఫిన్ సెంటర్ పై కంప్లైంట్ ఇచ్చారు. మేము చెక్ చెయ్యాలి ఏదైనా తేడా వస్తే సీజ్ చేస్తామని అంటారు. అప్పుడే ఒకతను వస్తాడు. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్తాడు. వాళ్లు వినకపోవడంతో నేను రిటైర్ కలెక్టర్ అని చెప్పగానే వాళ్లు సారీ సర్ అంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అతనికి దీప, కార్తీక్ లు థాంక్స్ చెప్తారు. ఛ ఈ ప్లాన్ కూడా మిస్ అయిందని జ్యోత్స్న అక్కడ నుండి వెళ్లిపోతుంటే.. కార్తీక్ చూసి ఇదంతా జ్యోత్స్న పనా అని అనుకుంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న ఆఫీస్ కి వెళ్లి డిస్సపాయింట్ అవుతుంటే.. అప్పుడే మేనేజర్ వచ్చి జీతాలు అంటాడు. ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొని రా అందరిని జాబ్ లో నుండి తీసేస్తా అంటుంది. ఆ తర్వాత కార్తీక్ భోజనం చేస్తుంటే జ్యోత్స్న రెస్టారెంట్ నుండి కొంతమంది వస్తారు. సర్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళని జాబ్ నుండి తీసేసారు. ఇప్పుడు మా పరిస్థితేంటి అంటూ బాధపడుతుంటే.. మీ హక్కు కోసం మీరు పోరాడండి.. రేపు వెళ్లి మాట్లాడుదామని కార్తీక్ వాళ్ళకి మాటిస్తాడు. ఆ తర్వాత నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని దీపని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

Eto Vellipoyindhi Manasu : నిండా ముంచనున్న భద్రం.. సీతాకాంత్, రామలక్ష్మిలకి అడుగడుగునా అవమానం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -298 లో......సందీప్, ధనలు భద్రం చేసే ట్రాప్ లో ఈజీగా పడిపోతారు. ఈ వెంచర్ పూర్తి కాకుండానే మనం ఇంకొక వెంచర్ మొదలు పెట్టాలని భద్రం అంటాడు. ఇది ఇంకా కన్‌స్ట్రక్షన్ కాలేదు కదా అని సందీప్ అనగానే.. అది అయ్యేసరికి టైమ్ పడుతుంది. అంతసేపు ఖాళీగా ఉంటామా.. అందుకే ఈ లోపు ఇంకొకటి మొదలు పెట్టాలని భద్రం అంటాడు. దానికి వాళ్ళు కూడా సరే అంటారు. మనం కూడా ఇక కొత్త కంపెనీ పెట్టాలని ధన అంటాడు. మిమ్మల్ని మోసం చేసి ఈ డబ్బుతో పారిపోతానని భద్రం మనసులో అనుకుంటాడు. మరొకవైపు సీతాకాంత్ కి సిరి ఫోన్ చేసి.. తన సీమాంతానికి రమ్మని చెప్తుంది. వస్తామని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నా చెల్లికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ నేనేం లేని వాడిని అయిపోయనని సీతాకాంత్ బాధపడుతుంటే రామలక్ష్మి గల్లా పగులగొట్టి డబ్బులు ఇస్తుంది. దీంతో మీ చెల్లికి సారె తీసుకోండి అంటుంది రామలక్ష్మి. దానికి సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటిరోజు ఉదయం రామలక్ష్మి, సీతాకాంత్ లు సిరి శ్రీమంతానికి వస్తారు. అక్కడున్న సెక్యూరిటీ మీరున్నప్పుడే బాగుండేది సర్ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు.. జీతం కూడా సరిగా ఇవ్వడం లేదని సీతాకాంత్ కి చెప్తూ బాధపడుతుంటాడు. దాంతో తన చేతిలోని డబ్బు సీతాకాంత్ సెక్యూరిటీకి ఇస్తాడు. ఆ తర్వాత వాళ్లు రావడం చూసి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ శ్రీవల్లి, శ్రీలతలు అడుగుతారు. సిరి పిలిచింది అందుకే వచ్చామని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి సీతాకాంత్ లని అడుగడుగునా అవమానం చేస్తుంటారు. సోఫా లో కూర్చోబోతుంటే కింద కూర్చొమని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వడ్డించ నేను చాల నీకు అంటూ దివి అర్థనగ్న ప్రదర్శన!

  దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెరపై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.  అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. ఇక తాజాగా పుష్ప-2 సినిమాలో మీడియా రిపోర్టర్ గా స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన వారిలో అరియాన, అనసూయ, అషురెడ్డి అయితే వారితో పాటు దివి వాద్య కూడా తనవంతుగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. తాజాగా ఓ నాలుగు ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. 'ఒకే ఒక్కడు' సినిమాలోని ఉట్టి మీద కూడు వడ్డించి చూడు అనే పాటని ఆ ఫోట ఇప్పటికే ఈ పోస్ట్ ని 34K ఫాలోవర్స్ లైక్ చేయగా రెండొందల పైన కామెంట్లు వచ్చాయి. ఇందులో తన అందాన్ని వర్ణిస్తూ నెటిజన్లు రాసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.  

Naga Manikanta: మణికంఠకి సూపర్ పవర్ వస్తే ఆ పని చేస్తాడంట.. లైవ్ లో ఆమెతో హగ్గు వద్దంట!

  మణికంఠ అనగానే అందరికి బిగ్ బాస్ సీజన్-8 గుర్తొస్తుంది. అలాంటి మణికంఠ హౌస్ లో ఉన్నప్పుడు అతని గురించి పాజిటివ్ గా మాట్లాడిన వారే పవిత్ర, షబీనా షేక్. ఇద్దరు మణికంఠకి బెస్ట్ ఫ్రెండ్స్. ఇక మణికంఠక, షబీనా షేక్ కలిసి ‘కస్తూరి’ సీరియల్‌లో నటించారు. షబీనా కస్తూరి సీరియల్‌తో పాటు.. నాపేరు మీనాక్షి, అత్తారింటికి దారేది, గృహలక్ష్మి వంటి సీరియల్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో ఫేమస్ అయ్యింది. అప్పట్లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసి.. ‘పెళ్లి చూపులు’ కార్యక్రమంలో మెరిసింది షబీనా బేగం. బిగ్ బాస్ సీజన్-8 జరుగుతున్న సమయంలో షబీనా మణికంఠ గురించి మాట్లాడి నెట్టింట వైరల్ అయింది. మణికంఠ గురించి నాకు బాగా తెలుసు. తను నేను కలిసి ‘కస్తూరి’ సీరియల్‌లో వర్క్ చేశాం. నాకు మా అన్నయ్య ఎలాగో తను కూడా అలాగే. మణికంఠ చాలా సెన్సిటివ్, ఎమోషనల్ పర్సన్. తను బిగ్ బాస్ హౌస్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి ఏదైతే మాట్లాడాడో.. అవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్న మాటలే. అతను ఎంత సెన్సిటివ్ అంటే.. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఏడ్చేసేటంత ఎమోషనల్ పర్సన్ అంటు షబీనా అంది. ఇక షబీనా తాజాగా పవిత్ర, మణికంఠలతో ఓ వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్  ' Shabeena Sheik' లో అప్లోడ్ చేసింది. ఈ వ్లాగ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది మణికంఠేనా లేక యాక్ట్ చేశాడా? నీకు ఎవరంటే ఇష్టం? జంతువులా మారితే ఏం అవుతావ్ ఇలాంటి భిన్నమైన ప్రశ్నలకి సమాధానాలిచ్చాడు మణికంఠ. ముప్పై ఆరు నిమిషాలుంది ఈ వ్లాగ్. ఇందులో మణికంఠ బయట ఎలా ఉండేవాడో  లోపల కూడా అలానే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా తను ఓ పక్షిలా మారి ఎక్కడికైనా ఎగిరిపోవాలానుకుంటున్నాడంట... ఇంకా సూపర్ పవర్ వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారని షబీనా అడగ్గా మాయమైపోయి తనకి ఎక్కడ కావాలంటే అక్కడ దూరిపోవాలనుకుంటున్నాడంట మణికంఠ. పవిత్ర తనకు మంచి ఫ్రెండ్ అని ప్రతీ దానికి ఎమోషనల్ అవుతుందంటూ.. అందుకే తనని క్రైయింగ్ బేబి అని అంటామంటు మణికంఠ అన్నాడు. ఇంకా హగ్గు కావాలా అని పవిత్ర అనగా అమ్మో వద్దని మణికంఠ చెప్పాడు. దాంతో షబీనా, పవిత్ర ఇద్దరు షాక్ అయ్యారు. ఏంటి హగ్గు స్టార్ హగ్గు వద్దంటున్నాడా అంటు ఇద్దరు కాసేపు ఆశ్చర్యంగా చూశారు.  ఇక బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడలేదని, కోపం వచ్చినా చాలావరకు కంట్రోల్  చేసుకున్నానంటూ మణికంఠ ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్లాగ్ కింద మణికంఠ డై హార్డ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్ లో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

నన్ను ట్రోలింగ్ చేయడం వల్లనే నా కెరీర్ నాశనమయ్యింది..

సయ్యద్ సోహైల్ రీసెంట్ గా కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు అక్కడ ఫుడ్ తినడానికి వెళ్లే వాళ్లంతా కూడా సోహైల్ చూసే అవకాశం వస్తోంది. ఐతే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద ఒక పాయింట్ గురించి చెప్పుకొచ్చాడు. "నేను సినిమాలు చేస్తున్నానని బయటకు రాకూడదు అంటే అది జరగని పని. కంటెంట్ ఉంటే టికెట్స్ తెగుతాయి. నేనేమీ రోడ్డు మీద తిరగడం లేదు. నా రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకుంటున్నా. నా కోసం నేను చేసిన మూవీ కోసం సినిమా థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళ కోసం నేను రెస్టారెంట్ దగ్గర రిసీవ్ చేసుకోవడం తప్పేం లేదు కదా. సెలెబ్రిటీ అంటే ఇంట్లోనే కూర్చోవాలా..అమ్మ మా ఎదుగుదల చూడాలనుకుంది కానీ ఆమె బతికి ఉండగా మేము సెటిల్ కాలేదు. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టా..అమ్మతో కూర్చుని తినాలని అనుకున్నా..ఇప్పుడు అవకాశం లేదు. పెద్దవాళ్ళు బతికి ఉన్నప్పుడు వాళ్ళ వేల్యూ తెలీదు. అమ్మకు డయాలసిస్ చేస్తున్నారు నేను తమ్ముడు కూడా కిడ్నీ ఇద్దామని అనుకున్నాం..కానీ సడెన్ గా ఫిట్స్ వచ్చేసాయి. దాంతో బ్రెయిన్ డామేజ్ అయ్యింది. అలా ఆమె దూరమైపోయింది. నేను నా  సినిమా చూడండి అని చెప్పిన డైలాగ్స్ చాలా ట్రోలింగ్ కి గురయ్యాయి అప్పట్లో  మా అమ్మ అవి చూసి బాధపడింది. ఇలాంటి ట్రోలింగ్స్ వస్తే చిన్న హీరోల కెరీర్ స్టాప్ ఐపోతుంది. అదే ఒక చిన్న బాబుకు హెల్త్ ఇష్యూ వస్తే నాతో సహా ఇంకొంతమందిమి కలిసి నాలుగు లక్షలు ఇచ్చాము ట్రీట్మెంట్ కి. కానీ అదెందుకు ట్రోలింగ్ చేయరు.  ఈరోజున మంచి చేస్తే గడప బయటకు కూడా వెళ్ళదు. కానీ చెడు మాత్రం ఆ మనిషిని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తుంది. " అంటూ ఆవేదనగా చెప్పాడు సోహైల్.

నిఖిల్ : మన దగ్గరకు రావాలని రాసి పెట్టి ఉంటే కచ్చితంగా వస్తుంది 

బిగ్ బాస్ సీజన్ 8 ఐపోయాక విన్నర్ నిఖిల్ బాగా ఆడిన పృద్వి బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ అలాగే ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు నిఖిల్. " బిగ్ బాస్ కి వెళ్లే ముందు నేను చేయలేనేమో అనుకున్నా..కానీ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక నేను ఏదైనా చేయగలను అనుకున్నా. బిగ్ బాస్ కి ప్రజల ప్రేమ పొందడానికి  వెళ్లాను. చిన్నపిల్లలు కూడా నన్ను ప్రేమించడం చూస్తున్నా. అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం అదృష్టం. నా ఒపీనియన్ లో లవ్ అంటే యాక్సెప్టెన్స్. ఎక్స్పెక్టేషన్స్ కన్నా యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉంటే బెటర్. సోనియాకి మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పుష్ప మూవీ చూసా. ఐతే నాకు బిగ్ బాస్ నుంచి ఇంకా రెమ్యూనరేషన్ రాలేదు. వచ్చాక ఒక్కరికి ఛారిటీ ఇద్దామనుకుంటున్న ఆ డీటెయిల్స్ ఇప్పుడు చెప్పను.. అలాగే అమ్మ నాన్న కోసం ఒక ఇల్లు కొని ఇద్దామనుకుంటున్నా. ఇప్పటి వరకు కొన్ని యూట్యూబ్ చానెల్స్  మా పేర్లతో మా ఫొటోస్ తో ఇంటర్వ్యూస్ చేసింది చాలు..ఎవరితో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ థంబ్ నెయిల్స్ , ఫొటోస్ పెట్టుకోండి. మా పేర్లు, మా ముఖాలు వాడుకున్నది చాలు..ఇంతవరకు బతికేసారు చాలు గాని..ఇక కట్ చేసుకోండి..మీ టాలెంట్ చూపించుకోండి. నేను చేసే మటన్, సాంబార్ హౌస్ లో చాలామందికి ఇష్టం. త్వరలో ఒక సీరియల్ , ఒక వెబ్ సిరీస్, ఒక మూవీ చేసే అవకాశం  ఉంది. చూసుకుని నెమ్మదిగా చేద్దామనుకుంటున్నా. పెళ్లి ప్రొపోజల్స్ వస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ట్రై చేస్తాం కానీ ప్రతీసారీ మనమే వెనక వెళ్లడం తప్పు. మన దగ్గరకు రావాలని రాసి పెట్టి ఉంటె కచ్చితంగా వస్తుంది. అంతేకాని మనం ఎంత ట్రై చేసినా రాదు" అని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.

Illu illalu pillalu : నాతో వస్తావా చనిపోవాలా అంటూ బ్లాక్ మెయిల్ చేసిన కళ్యాణ్.. సరేనంటూ తనతో వెళ్ళిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -48 లో..... వేదవతి నర్మద, దీరజ్ లని రామరాజు దగ్గరుండి గుడికి పంపిస్తాడు. అది చూసి మేము పెళ్లికి పిల్వలేదు కాబట్టి వచ్చిన వాళ్లందరు పెళ్లికి పిల్వలేదా అంటారు కాబట్టి మొహం చెల్లక వెళ్లిపోతున్నారని భద్రవతి అంటుంటే.. వేదవతి బాధపడుతుంది. భద్రవతికి ధీరజ్ ఎదురు సమాధానం చెప్తుంటే రామరాజు ఆపి వాళ్ళని పంపిస్తాడు. మరొకవైపు కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే ప్రేమ లిఫ్ట్ చెయ్యదు. దాంతో  ప్రేమ గదిలోకి వెళ్తాడు కళ్యాణ్. అతన్ని చూసి ప్రేమ భయపడుతుంది. ఎవరైనా చూస్తే బాగోదు వెళ్ళిపోమంటుంది. నేను వెళ్ళనని కళ్యాణ్ అంటాడు. అప్పుడే సేనాపతి ప్రేమ గది డోర్ కొడతాడు దాంతో కళ్యాణ్ దాక్కుంటాడు. సేనాపతి వచ్చి ప్రేమతో మాట్లాడతాడు. తన కూతురిపై ఉన్న ప్రేమని చెప్పి ఎమోషనల్ అవుతాడు సేనాపతి. ఆ తర్వాత సేనాపతి వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు. దాంతో ప్రేమ టెన్షన్ పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావని సేనాపతి అడుగగా ఏదో ఒకటి చెప్పి ప్రేమ కవర్ చేస్తుంది. సేనాపతి వెళ్ళిపోయాక కళ్యాణ్ వస్తాడు. నువ్వు ఇప్పుడు నాతో రా ఇద్దరం పెళ్లి చేసుకుందామని కళ్యాణ్ అనగానే.. నేను రాను ఇప్పటికే మా చిన్నత్తయ్య చేసిన పనికి ఇప్పటికి బాధపడుతున్నారని ప్రేమ అంటుంది. నువ్వు నాతో వస్తావా ఇప్పుడు చనిపోవాలా అని కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేసి గాజు ముక్కతో చిన్నగా చెయ్ పై కట్ చేసుకుంటాడు. దాంతో ప్రేమ భయపడుతుంది. ఆ తర్వాత ప్లీజ్ అలా చేయకు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. వస్తానని ప్రేమ అనగానే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ చేతికి ప్రేమ కట్టుకడుతుంది. ఇక ప్రేమని తీసుకొని కళ్యాణ్ బయటకు వస్తాడు. తరువాయి భాగంలో ఇంటిని చూస్తూ తన జ్ఞాపకాలు గుర్తుచేసుకొని బాధపడుతుంది ప్రేమ. కాసేపటికి ప్రేమని తీసుకొని కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 :  కూతురికిచ్చిన మాట కోసం దాస్ వెనుకడగు.. సుమిత్ర ఇచ్చిన షాక్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -247 లో..... కార్తీక్ సైకిల్ పై వస్తుంటాడు. అప్పుడే శ్రీధర్ కార్ లో వస్తాడు. సైకిల్ కి డాష్ ఇవ్వబోతుంటే.. కళ్ళు కన్పించడం లేదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే శ్రీధర్ కార్ లో నుండి దిగి.. న్యూ లుక్ బాగుంది రా నేను చెప్పినట్టు వింటే ఈ పరిస్థితి రాదు కదా అని అంటాడు.  కార్తీక్ పరిస్థితిని చూసి శ్రీధర్ ఒకవైపు జాలి చూపిస్తూనే మరోవైపు ఎగతాళి చేస్తాడు. దాంతో కార్తీక్ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరొకవైపు సుమిత్రని దాస్ తీసుకొని దీప టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తాడు. కాంచనని చూసి ఎలా ఉండేవాళ్లు ఎలా అయిపోయారని సుమిత్ర బాధపడుతుంది. వాళ్లకి కనిపించకుండా ఆటోలో కూర్చొని ఉంటుంది. దీపని చూసి సుమిత్ర బాధపడుతుంటే.. తనే నీ కూతురు అని చెప్పలేకపోతున్నాను.. ఎందుకంటే జ్యోత్స్నకి మాటిచ్చాను.. అది తప్పి జ్యోత్స్నని దూరం చేసుకోలేనని బాధపడతాడు. నాకు దీప చేసిన టిఫిన్ తినాలని ఉందని సుమిత్ర అనగానే.. దాస్ ఆటో డ్రైవర్ తో టిఫిన్స్ తెప్పిస్తాడు. అప్పుడే కార్తీక్ వచ్చి ఏంటి అత్త ఇక్కడి వరకు వచ్చి అమ్మని కలవకుండా వెళ్తున్నావని కార్తీక్ అనగానే నేను ఎదురుడలేనని సుమిత్ర అంటుంది. మళ్ళీ అందరం కలిసి ఉండాలని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత సుమిత్ర వెళ్ళిపోయాక దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. ఎవరితో మాట్లాడారని అడుగగా కావలసిన వారు అని కార్తీక్ అంటాడు. మరొకవైపు పారిజాతం రెడీ అవుతుంటే.. గ్రానీ టిఫిన్ చేద్దాం అని జ్యోత్స్న అంటుంది. పదా అని  ఇద్దరు టిఫిన్ చెయ్యడానికి వస్తారు. వాళ్లు వచ్చేకంటే ముందు సుమిత్ర తెచ్చిన టిఫిన్స్ అన్నీ సెట్ చేస్తుంది. అందరు టిఫిన్ చేస్తూ టిఫిన్ ఈ రోజు బాగుందని అంటుంటే.. నిజంగా బాగున్నాయా.. ఇలాంటివి టిఫిన్ సెంటర్ లో ఉంటాయి అంటారా అని సుమిత్ర అంటుంది. ఇలాంటి టేస్ట్ వి టిఫిన్ సెంటర్ లో ఉండే ఛాన్స్ లేదని జ్యోత్స్న అంటుంది. ఇలాంటి టిఫిన్ చేసిన వారిని మన రెస్టారెంట్ కి తీసుకొని రావాలి లేక వాళ్లకు మన ప్రాంచైజీ ఇవ్వాలంటూ గొప్పగా పొగుడుతారు. అవునా అది దీప చేసింది అని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : వెంచర్ పై తన పేరు చూసి సీతాకాంత్ షాక్.. రామలక్ష్మి ఏం చేయనుంది?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -297 లో....శ్రీవల్లి, శ్రీలతకి కాఫీ తీసుకొని వచ్చి ఇద్దరికి షేర్ చేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావని శ్రీలత అడుగగా.. ఇంట్లో పాల ప్యాకెట్ లేదు.. పైగా డబ్బులు కూడా లేవని అంటుంది. రాను రాను మన పరిస్థితి ఏంటోనని శ్రీవల్లి అంటుంది. అప్పుడే సందీప్, ధన లు వచ్చి ఇంట్లో అందరిని పిలుస్తారు. మేము సంపాదించలేమన్నారు కదా.. మా తెలివితో ఎంత సంపాదించామోనని సందీప్, ధనలు గొప్పగా చెప్తూ డబ్బు చూపిస్తారు. అది చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఇంత డబ్బా అని మురిసిపోతుంది. చూసావా సిరి ఎంత సంపాదించానో.. ఏం చేసిన నీ కోసమేనని సిరితో ధన అంటాడు. మరొకవైపు ఒక పెద్దావిడ సీతాకాంత్, రామలక్ష్మి దగ్గరికి వచ్చి మీరు దాచుకున్న డబ్బు ఉంటే  ఇందులో వెంచర్ తీసుకోండి.. వీళ్ళు తక్కువ డబ్బుకే ఇస్తున్నారంటు ఒక పేపర్ చూపిస్తుంది‌ అది చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు‌ తన పేరు వాడుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని సీతాకాంత్ కి అర్థమవుతుంది. అదేంటి మీ పేరు వాడుకొని అలా చేస్తున్నారు అని రామలక్ష్మి అంటుంది. అదేంటో తెలుసుకుంటా మనం గుడికి వెళదామన్నావ్ కదా పదా అని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు ధన, సందీప్ , భద్రం ఆఫీస్ లో ఉంటారు. కస్టమర్స్ వస్తుంటారు.. ఫ్లాట్స్ సేల్ చేస్తుంటారు. అదేసమయంలో సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు ఒక పాసింజర్ ని హాస్పిటల్ కి తీసుకొని వస్తారు. అప్పుడే హాస్పిటల్ లో చెకప్ చేయించుకొని సిరి, శ్రీలత, శ్రీవల్లి లు వస్తారు. సీతాకాంత్ ని చూసి అన్నయ్య అంటూ సిరి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మేము రిచ్ అయ్యామంటూ శ్రీవల్లి డబ్బులు తీసి చూపిస్తుంది. మరొకవైపు అసలేం జరుగుతుందని సీతాకాంత్ ఆఫీస్ లో తెలిసిన అతన్ని పిలిపించుకొని ఆఫీస్ లో ఏం జరుగుతుందని అడుగగా.. కొత్తగా వెంచర్ మొదలు పెట్టారు. ఎవరో భద్రం వస్తున్నాడని చెప్తాడు. మరొక వైపు రామలక్ష్మి కూడా వెంచర్ లో ఫ్లాట్ తీసుకున్న వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అసలు విషయమేంటో కనుక్కుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మిలు ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఆఫీస్ లో జరిగేదాని గురించి మాట్లాడుకుంటారు. ఆ భద్రం గాడు చాలాసార్లు నా దగ్గరికి వచ్చాడు.. నేను తిట్టి పంపించాను.. ఇప్పుడు వాళ్ళని మోసం చేస్తున్నాడని సీతాకాంత్ అంటాడు. మరుసటి రోజు సందీప్, ధనలు భద్రం చెప్పినట్టు వింటూ ఈజీగా మోసపోతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అనామిక మాస్టర్ ప్లాన్.. డూప్లికేట్ కిరీటం అని రాజ్ కి అవమానం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -612 లో.....రాజ్, కావ్య రాత్రి ఇంటికి వస్తారు. భోజనం చేయండని అపర్ణ పిలుస్తుంది. ఆకలిగా లేదు బిజీ ఉండి మధ్యాహ్నం తినలేదు.. ఈవ్ నింగ్ తిన్నామని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు. దాంతో వాళ్లు బయట ఇష్టమైన ఫుడ్ తిని వస్తున్నారు. మనం ఈ గడ్డి తినాలా అని ధాన్యలక్ష్మి అంటుంది. వాళ్ళు బిజీ ఉండి తిని వచ్చారని చెప్పారు కదా అని ప్రకాష్ అనగానే.. వాళ్ళ గురించి ఎవరికి అర్ధమవ్వడం లేదని ధాన్యలక్ష్మి కోప్పడి వెళ్ళిపోతుంది. మా బావకి ఆ సిచువేషన్ వచ్చినప్పటి నుండి అందరు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు రాజ్, కావ్య అయిన అర్ధం చేసుకొని ఉంటారంటే వాళ్లు అలాగే ఉన్నారని ఇందిరాదేవి అంటుంది. మరుసటి రోజు ఉదయం జగదీశ్చంద్ర చెయ్యమన్న నగలు తయారు చేసి వచ్చినవి చూసి చాలా బాగున్నాయి.. ఇదంతా నీ వళ్లే అని కావ్యని రాజ్ పొగుడుతాడు. ఆ తర్వాత సెక్యూరిటీని పిలిచి నగలు లాకర్ లో పెట్టి లాక్ వేసి రాజ్ తీసుకుంటాడు. సెక్యూరిటీలని అందరిని జాగ్రత్తగా ఉండమని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్యని తీసుకొని రాజ్ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత రాజ్ కంపెనీలోని సెక్యూరిటీకి అనామిక ఫోన్ చేసి.. నీకు లైఫ్ సెటిల్ అయ్యే డబ్బు ఇస్తాను.. నేను చెప్పినట్టు చెయ్ ఒక డూప్లికేట్ కిరీటం పంపిస్తాను. అది అక్కడ పెట్టి వొరిజినల్ ది నేను పంపినా.. నాకు పంపివ్వమని అనామిక చెప్తుంది. దానికి సెక్యూరిటీ సరే అంటాడు. మరొకవైపు రాజ్ పడుకుంటే రేపు మిగతా నగల గురించి ప్రెజెంటేషన్ ఉంది.. అది ప్రిపేర్ అవ్వమని కావ్య లేపుతుంది కానీ రాజ్ లేవడు. ఆ తర్వాత సెక్యూరిటీ మిగతా సెక్యూరిటీలకి కాఫీలో ఏదో కలిపి ఇవ్వడంతో అందరూ మత్తులోకి వెళ్ళిపోతారు. అనామిక పంపిన వ్యక్తి వచ్చి డూప్లికేట్ కిరీటం సెక్యూరిటీకి ఇస్తాడు. అతను లాకర్ దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న డూప్లికేట్ 'కీ' తో లాకర్ తీసి కిరీటం అందులో పెట్టి వెరిజినల్ ది అనామికకి పంపిస్తాడు. ఆ తర్వాత సెక్యూరిటీ ఆ విషయం అనామికకి ఫోన్ చేసి చెప్తాడు. మరుసటి రోజు నిద్ర లేవండి అంటూ రాజ్ ని నిద్రలేపుతుంది కావ్య. తరువాయి భాగంలో కావ్యకి అనామిక ఫోన్ చేసి.. నీ భర్తతో పాటు నీకు అవమానం జరగాలి కదా అంటుంది. అసలేం జరిగిందని రాజ్ కి కావ్య ఫోన్ చేస్తుంటే అతను ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత జగదీశ్ చంద్ర వాళ్లు కిరీటం చూసి.. ఇది డూప్లికేట్ ది ఇంత మోసం చేస్తారా అని రాజ్ పై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

 సెక్యూరిటీచే డీల్ కుదుర్చుకున్న అనామిక.. రాజ్, కావ్యలకి కోట్లలో నష్టం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -611 లో.....కావ్య, రాజ్ ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి రుద్రాణి మంచిగా కార్ లో షికారుకి వెళ్లి వస్తున్నారా అని అడుగుతుంది. కార్ లో వెళ్ళాం షికారుకి కాదని రాజ్ అంటాడు. వెళ్ళింది భార్య భర్తలం కదా ఎందుకంతా వెటకారంగా మాట్లాడుతున్నారని రుద్రాణితో కావ్య అంటుంది. మీరు వెళ్ళడానికి కార్ కావాలి. ఇంటి దగ్గర ఏదైనా అవసరం వస్తే వెళ్ళడానికి కార్ ఉండాలి కదా.‌. అసలు కార్లని వద్దని పంపే అధికారం ఎవరిచ్చారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నాకు సర్వహక్కులు తాతయ్య గారు ఇచ్చారు.. నేను చెప్పిందే వినాలని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. కావ్య అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటని ప్రకాష్ అనగానే.. నాకు పాకెట్ మనీ కావాలన్నా కూడా కావ్యని అడుగుతున్నాను.. నేను ఎవరికి చెప్పుకోవాలని రాజ్ అంటాడు. ఇప్పుడు కావ్య మాట్లాడిన విధానం నాకు నచ్చలేదని సుభాష్ తో ప్రకాష్ అంటాడు .ఆ తర్వాత ఎందుకు అంత దురసుగా మాట్లాడావని రాజ్ అంటాడు. కానీ ఇప్పుడు నిజం చెప్పలేను తప్పలేదు కానీ వాళ్ళకి ఇంకా శత్రువుగా మారిపోతున్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత సుభాష్, అపర్ణ, ఇందిరాదేవిలు కావ్య ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. ఇలా కావ్య మాట్లాడుతుంటే.. ప్రకాష్ కి ధాన్యలక్ష్మి నూరిపోస్తుంది. దాంతో కుటుంబం ముక్కలవుతుందని ఇందిరాదేవి అంటుంది. మీరే కావ్యతో తన ప్రవర్తన గురించి మార్చుకోమని చెప్పండి అని అపర్ణ, సుభాష్ లకి ఇందిరాదేవి చెప్తుంది. మరొకవైపు నందగోపాల్ ని కొడుతుంది అనామిక. నిన్ను ఎవరికి కన్పించిద్దన్నాను కదా ఎందుకు రాజ్ కంటపడ్డావని అడుగుతుంది. నేను చెప్పినట్టు వినమని అనామిక చెప్తుంది. రాజ్ వాళ్ళ డిజైన్స్ నాకు కావాలని సామంత్ కి అనామిక చెప్తుంది. ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేస్తుంటుంది. రాజ్ తన భుజంపై పడుకోవడంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు అందరు టిఫిన్ చేస్తుంటే కావ్య నీతో మాట్లాడాలని అపర్ణ అనగానే.. నాకు ఇప్పుడు టైమ్ లేదని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది. రాజ్ నీతో మాట్లాడాలని సుభాష్ అనగానే.. నాకూ టైమ్ లేదని రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆఫీస్ లో రాజ్, కావ్య ఇద్దరు నగల డిజైన్స్ చూస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరు భోజనం చేస్తుంటే రాజ్, కావ్య వస్తారు. రండీ భోజనం చెయ్యండి అని అపర్ణ అనగానే టైడ్ అయ్యామంటూ రాజ్, కావ్య వెళ్ళిపోతారు . తరువాయి భాగం లో నగలన్ని రాజ్, కావ్యలు సెక్యూరిటీచే లాకర్ లో పెట్టిస్తారు. ఆ తర్వాత సెక్యూరిటీతో అనామిక డీల్ మాట్లాడుకొని అనామిక నగలు తీసుకొని రమ్మని చెప్తుంది. ఆ ప్లేస్ లో డూప్లికేట్ నగలు పెట్టమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీతాకాంత్ కి రామలక్ష్మి భరోసా.. భద్రం చేసే మోసంలో వాళ్లు బలి అవుతారా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -296 లో... శ్రీలతతో సారీ చెప్పుంచుకుంటుంది రామలక్ష్మి. త్వరలో సీతా సర్ కి సారీ చెప్పిస్తానని శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది రామలక్ష్మి. మరొకవైపు సీతాకాంత్ ఒక దగ్గర టీ తాగుతుంటే.. అప్పుడే ఒకతను చూసి.. సర్ మీరా? ఇలా అయ్యారేంటి? మీరు ఒక్కప్పుడు బిజినెస్ గురించి యూత్ కి స్పీచ్ ఇచ్చారు.. ఆ స్పీచ్ విని ఇన్ స్పైర్ అయి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాను. ఆ ప్రాజెక్ట్ లో సక్సెస్ కాలేకపోతున్నా.. ప్లీజ్ నాకు సజెషన్ ఇవ్వండి అని అంటాడు. దాంతో సరే అని అతన్ని సీతాకాంత్ ఇంటికి తీసుకొని వెళ్లి ఆ కంపెనీ గురించి తెలుసుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి ఇంటికి వస్తుంది. అతన్ని చూసి ఎవరని అడుగుతుంది. ఫ్రెండ్ అనుకో బిజినెస్ లో హెల్ప్ కావాలంటే చేస్తున్నానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత థాంక్స్ సర్ నాకూ ఏ డౌట్ ఉన్నా మీ దగ్గరికి వస్తాను.. మీరు ఈ సిచువేషన్ కి రావడానికి కారణం నాకు తెలియదు కానీ మళ్ళీ మీరు తల్చుకుంటే ఆ స్థాయి కి రాగలరంటూ సీతాకాంత్ గురించి గొప్ప గా మాట్లాడి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అతని మాటలకి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు శ్రీవల్లి చేసిన పనికి నేను ఆ రామలక్ష్మికి సారీ చెప్పాలిసి వచ్చిందని శ్రీవల్లిపై కోప్పడుతుంది శ్రీలత. ఇప్పుడు మనమే గెలిచాం అత్తయ్య మనం లగ్జరీగా ఉన్నాము.. తను చూసారా కష్టపడుతుందని శ్రీవల్లి అనగానే అవునంటూ శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు రామలక్ష్మికి సీతాకాంత్ గోరింటాకు పెడతాడు. మరుసటి రోజు ధన, సందీప్, భద్రం కలిసి ఆఫీస్ కి వెళ్తారు. ఏంటి రియల్ ఎస్టేట్ గురించి ఆడ్ ఏపించినా కూడా ఒక్కరు కూడా ఫ్లాట్ కొనడానికి ముందుకు రావడం లేదని ధన, సందీప్ లు డిస్సపాయింట్ అవుతుంటారు. అప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి ఫ్లాట్ కొంటూ ఉంటారు. ఆ డబ్బులో కొంత డబ్బు భద్రం తీసుకొని ఇది మీకు అని చెప్పగానే ధన, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు నన్ను ఎంత నమ్మితే నాకు అంతే లాభమని భద్రం అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శౌర్యని సైకిల్ పై తీసుకెళ్తున్న కార్తీక్.. పాపం సుమిత్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -246 లో.....కార్తీక్, దీపలు కూరగాయలు తీసుకొని వెళ్తుంటే పారిజాతం వస్తుంది. కార్తీక్ ని ఆ సిచువేషన్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ నష్టజాతకురాలు దీప అని దీప గురించి పారిజాతం తప్పుగా మాట్లాడుతుంటే.. కార్తీక్ వినలేకపోతాడు. దీప నా అదృష్టదేవత తన వల్ల నాకూ ఈ సిచువేషన్ రాలేదు.. నా వల్ల తనకి వచ్చింది. అసలు దీనంతటికి కారణం నువ్వేనని పారిజాతం పై విరుచుకుపడుతాడు కార్తీక్. నేనేం చేసానని పారిజాతం అడుగగా జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ముందు నీకే చెప్పాను కానీ నువ్వు పెళ్లి వరకు తీసుకొని వచ్చావంటూ కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పారిజాతంతో కార్తీక్ గొడవ పెట్టుకొని దీపని తీసుకొని వెళ్ళిపోతాడు. వీడేంటి ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. అయిన వాళ్లు విడిపోయే దాకా వదిలిపెట్టనని పారిజాతం అనుకుంటుంది.ఆ తర్వాత దాస్ ఏదో ఆలోచిస్తుంటాడు. కాశీ వెళ్లి కాఫీ ఇస్తాడు. దాస్ ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతుంటే కాశీకి ఏం అర్థం కాదు ఎందుకు మావయ్య ఎప్పుడు అలా మాట్లాడుతాడని కాశీతో స్వప్న అంటుంది. మరొకవైపు శివన్నారాయణ‌ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. రెస్టారెంట్ ప్రాఫిట్ తగ్గిందని అనగానే దానికి సంబందించిన నిర్ణయం సీఈఓగా నువ్వు తీసుకోవాలని శివన్నారాయణ‌ అంటాడు. ఒక మాట మీకు చెప్దామని ఆగానని జ్యోత్స్న అనగానే.. అవసరం లేదు ఏ నిర్ణయమైనా నువ్వే తీసుకో అని శివన్నారాయణ అంటాడు. సరే అని జ్యోత్స్న వెళ్తుంది. అదేంటి నాన్న అన్నీ ఆలా తనకి వదిలేస్తే ఎలా అని దశరథ్ అనగానే.. అప్పుడే కదా తనకి బిజినెస్ గురించి తెలుస్తుంది కార్తీక్ ని మర్చిపోతుందని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత శౌర్యని కార్తీక్ స్కూల్ కి సైకిల్ పై తీసుకొని వెళ్తుంటే.. కాంచన, దీప ఇద్దరు చూసి బాధపడతారు. మరొకవైపు శివన్నారాయణతో గుడికి వెళ్తున్నానని సుమిత్ర చెప్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి నేను వస్తానంటుంది. అవసరం లేదని శివన్నారాయణ‌ అంటాడు. మరోకవైపు దాస్ ఇంటికి వస్తాడు. జ్యోత్స్న ఆపి ఎందుకిలా వస్తున్నావంటూ అడుగుతుంది. అప్పుడే సుమిత్ర వస్తుంది. ఎందుకు వద్దని అంటున్నావని జ్యోత్స్నని సుమిత్ర అడుగగా.. తాతయ్య ఉన్నాడు కదా గొడవ అవుతుందని జ్యోత్స్న అంటుంది. అలా అలోచించినందుకు సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న వెళ్ళిపోయాక జ్యోత్స్న ఏమైనా అందా అని దాస్ ని అడుగుతుంది సుమిత్ర. అదేం లేదని దాస్ అంటాడు. నాకు దీప, కార్తీక్, శౌర్యలని చూడాలని ఉంది తీసుకొని వెళ్తావా అని సుమిత్ర అనగానే.. పదండి అంటూ దాస్ తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పెళ్ళికూతురు గదిలోకి కళ్యాణ్.. తనని ట్రాప్ చేస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -47 లో..... ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది కానీ తన పెళ్లి విషయం చెప్పలేకపోతుంది. అప్పుడే ధీరజ్ ఫోన్ చేసి ఈ టైమ్ లో కూడా నువ్వు ఆ కళ్యాణ్ తో మాట్లాడమేంటి వాడు ఏదో ఆశించి నిన్ను ట్రాప్ చేసాడు. వాడితో లేచిపోవడం లాంటివి పెట్టుకోకు.. ఎందుకంటే నువ్వు ఒక్క కూతురువి నిన్ను మీ నాన్న చాలా గారాభంగా పెంచాడు. మీ అత్తయ్య కి నువ్వు అంటే ప్రాణం బుద్దిగా పెళ్లి చేసుకోమని ధీరజ్  చెప్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రేమ. నాకు పెళ్లి అని చెప్తంది. దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. నువ్వు రా పెళ్లి చేసుకుందామని కళ్యాణ్ అంటాడు. నేను రానని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ప్రేమ ఫోన్ కట్ చేసాక.. నిన్ను ఎలా తీసుకొని రావాలో తెలుసని కళ్యాణ్ అనుకుంటాడు. మరొకవైపు వేదవతి బాధపడుతుంటే.. నువ్వు ఇక్కడ వద్దు.. పెద్దోడి పెళ్లి జరగాలంటే పంతులు పూజ చెయ్యాలన్నాడు. వెళ్లి రెండు రోజులు గుడిలో ఉండి పూజ జరిపించిరా అని రామరాజు అంటాడు. నేను వస్తానని నర్మద అనగానే.. సరే అంటాడు. ఆ తర్వాత రామరాజు బాధపడతాడు. నా వల్ల మీ అమ్మ ఎన్నింటికి దూరం అయిందని ధీరజ్ తో రామరాజు చెప్తూ బాధపడతాడు. అందుకే ఇలా లేచిపోయి చేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుందంటే మీరు వినరని రామరాజు అనగానే మిమ్మల్ని బాధపెట్టే పని చేయనని ధీరజ్ అంటాడు. రామరాజు డబ్బులు ఇస్తూ వాళ్ళతో వెళ్లి పూజ దగ్గరుండి చేయించమని అనగానే.. ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాగ్ చేసుకొని నన్ను నమ్మి డబ్బు ఇస్తున్నారా అంటూ ఎమోషనల్ అవుతూ సరే అంటాడు ధీరజ్. మరొకవైపు నర్మద దగ్గరికి సాగర్ రాగానే.. ఇలా అత్తయ్యతో ఊరు వెళ్తున్నానని చెప్తుంది. దాంతో సాగర్ డిస్సాపాయింట్ అవుతాడు. ఆ తర్వాత విశ్వ వాళ్లు ధీరజ్ ని చుసి కావాలనే డాన్స్ చేస్తుంటారు. కానీ ధీరజ్ కూడా డాన్స్ చేస్తాడు నువ్వెందుకు చేస్తున్నావని విశ్వ అనగానే.. నేను చాలా హ్యాపీగా ఉన్నానని ధీరజ్ చెప్తాడు. అప్పుడే ధీరజ్ ని పిలుస్తాడు రామరాజు. వేదవతి వాళ్లు బయటకు రావడంతో వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారని భద్రవతి ఆశ్చర్యంగా చూస్తారు. తరువాయి భాగంలో పెళ్లి పనులు జరుగుతుంటాయి. ప్రేమ గదిలోకి కళ్యాణ్ వచ్చి.. పదా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రియల్ లైఫ్ లో చాలామంది విలన్స్ ని చూస్తున్నాను

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. అలాగే కావ్య కూడా వచ్చింది. శ్రీముఖి కావ్యని ఒక ప్రశ్న అడిగింది "సీరియల్స్ లో విలన్స్ ని చూసినప్పుడు ఎందుకురా వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తారు వీళ్ళను చంపేస్తాను అనిపించిందా" అని అడిగింది. దానికి కావ్య "రియల్ లైఫ్ లో చాలా మంది విలన్స్ ని చూస్తున్నాను కాబట్టి సీరియల్స్ లో విలన్స్ ని చూసాక పెద్దగా ఏమీ అనిపించదు" అని రిప్లై ఇచ్చింది కావ్య. ఈ ఆదివారం రాబోయే ఎపిసోడ్ ని హీరోయిన్స్ వెర్సెస్ విలన్స్ థీమ్ తో తీసుకొచ్చారు. ఇందులో హీరోయిన్స్ అంతా రకరకాల సెక్సీ భంగిమలు పెట్టారు. కావ్య, దీపికా రంగరాజు, సుహాసిని, అమూల్య గౌడా అందరూ కూడా ఈ భంగిమలు పెట్టి ఎంటర్టైన్ చేశారు. ఇక నెటిజన్స్ అంతా కూడా నిఖిల్ ని కావ్యని జోడిగా పిలవండి..." అంటూ కోరుతూ మెసేజెస్ పెడుతున్నారు. ఐతే నిఖిల్ - కావ్యకి కొన్ని నెలల నుంచి ఇద్దరికీ సరిగా కెమిస్ట్రీ కుదరడం లేదు. నిఖిల్ ని కావ్య వదిలేసింది అలాగే నిఖిల్ మాస్క్ మ్యాన్ ,  విలన్ అంటూ చెప్తోంది. నిఖిల్-కావ్య మధ్య ఏడేళ్ల రిలేషన్‌ ఒక్కసారిగా బ్రేక్ అయ్యింది . నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు కావ్యతో బ్రేకప్ చెప్పేసి  తాను సింగిల్ అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. నిఖిల్, కావ్య  మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు కచ్చితంగా కలవాలి అని కోరుకుంటున్నారు.  

హైపర్ ఆది  : కావ్య కాలేజీలో నేను ఉండి ఉంటే 500 ల సార్లు నేనే ప్రపోజ్ చేసేవాడిని

బుల్లితెర మీద చాలా షోస్, ఈవెంట్స్ ప్రసారమవుతూ ఉంటాయి. వీటి షూటింగ్ టైమ్స్ లో ఆఫ్ స్క్రీన్ లో మంచి కామెడీ నడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక షో రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా  ప్రసారమయ్యింది. అదే న్యూ ఇయర్ దావత్ లొకేషన్ హోమ్ టూర్ షో. అందులో కావ్య, రీతూ చౌదరి, ఆది మధ్య మంచి కామెడీ జరిగింది. రీతూ చౌదరి వచ్చి "హాయ్ కావ్య..వాట్సాప్..ఎలా ఉన్నావ్" అని అడిగింది. "ఇలా ఉన్నా" అని కావ్య చెప్పేలోపు ఆది వచ్చేసాడు. "హాయ్ కావ్య..ఎలా ఉన్నావ్" అని అడిగాడు. " బాగున్నాను" అని చెప్పింది కావ్య. "ఆది నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పవు కానీ కావ్యను అడిగినప్పుడు మాత్రం వచ్చేస్తావ్" అంటూ రీతూ చౌదరి ఆది మీద అరిచింది. "కావ్య నచ్చని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరూ" అని ఆది కావ్య గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు. "నా లైఫ్ లో కావ్య అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సీరియస్ గానే చెప్తున్నా ఈ విషయం. అందరికీ చెప్పేది బిస్కెట్..కానీ కావ్య విషయంలో చెప్పేది రియల్. ఇలా ఎలా ఇంత అందంగా పుట్టావ్. నీకు ఇప్పటి వరకు నీ లైఫ్ లో కాలేజ్ డేస్ లో ఎన్ని ప్రొపోజల్స్ వచ్చాయి." అని ఆది అడిగాడు. "నాలుగైదు వచ్చి ఉంటాయి " అంది కావ్య. "అరేయ్ ఇలాంటి అందమైన అమ్మాయికి కాలేజీలో నాలుగైదు ప్రొపోజల్స్ మాత్రమే వచ్చాయా ...ఒకవేళ ఆ కాలేజీలో నేను ఉంటే 400 ,500 ల సార్లు నేనే ప్రొపోజ్ చేసేవాడిని" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్స్ ఐతే క్రీమ్  బిస్కెట్, నిఖిల్ వింటే ఈ మాటలు ఇక ఆది పని అంతే" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.