కళ్యాణ్ కొత్త పాట రెడీ.. కావ్యనే కావాలనే చేసిందని తెలుసుకున్న అక్క!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-617 లో.....రుద్రాణి రాహుల్ లు కలిసి స్వప్న శ్రీమంతానికి అవసరమయ్యే లిస్ట్ ప్రిపేర్ చేసి ఇదిగో ఇరవై లక్షలు అయిందంటూ కావ్యకి ఇస్తారు. నాకు తెలుసు.. అందుకే ముందే చెక్ రాసి పెట్టమని చెప్పాను.. ఏవండీ ఆ చెక్ ఇవ్వండి అని రాజ్ తో కావ్య అనగానే.. అకౌంట్ లో ఇరవై వేలు కూడా లేవ్ ఈ చెక్ ఎందుకు పనికి రాదని రాజ్ అనుకోని కావ్యకి ఆ చెక్ ఇస్తాడు. కావ్య ఆ చెక్ ని రుద్రాణికి ఇస్తుంది. చెక్ తీసుకొని రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. స్వప్న శ్రీమంతం రుద్రాణి చేయాలనుకుంటుందని అపర్ణ చెప్తుంది. దాంతో వీలు లేదు మా కూతురు శ్రీమంతం మా ఇంట్లో జరగాలి.. అది పూర్వీకుల తీర్మానం అని కనకం అంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ఎందుకు.. మాకు ఉన్నంతలో నేను చేసుకుంటానని కనకం తన నటనతో అందరిని ఒప్పిస్తుంది. సరే అని ఇందిరాదేవి అంటుంది. ఇక స్వప్నకి చిన్నగా శ్రీమంతం చేసుకోవడం ఇష్టముండదు కానీ కనకం తనని ఒప్పిస్తుంది. ఇక ఈ చెక్ తో అవసరం లేదంటూ రుద్రాణి చేతిలో నుండి కావ్య చెక్ తీసుకొని చింపేస్తుంది. మరొకవైపు కళ్యాణ్ పాట రాస్తుంటే అప్పుడే అప్పు ఫోన్ చేస్తుంది. కరెక్ట్ టైమ్ కి చేసావంటూ ఆ పాటని అప్పుకి వినిపిస్తాడు కళ్యాణ్. తను చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఆ తర్వాత కనకం వల్ల ప్లాన్ ఫెయిల్ అయిందంటూ రుద్రాణి, రాహుల్ లు కోపంగా ఉంటారు. తరువాయి భాగంలో కావాలనే నువ్వు అమ్మకి ఈ ఆలోచన కలిపించి ఇలా చేసావ్ కదా అని కావ్యతో కావ్య అంటుంది. అది తెలుసుకున్న దానివి.. ఎందుకు ఇలా చేసానో అర్థం చేసుకోవా అని కావ్య అనగానే.. అక్క సంతోషంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదంటూ స్వప్న కోపంగా వెళ్లిపోతుంది. అదంతా అపర్ణ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జ్యోత్స్న మీద ఫైర్ అయిన శివన్నారాయణ‌.. దీపకి ఆయిల్ మసాజ్ చేస్తూ కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -252 లో..... శౌర్య లాకేట్ అడుగుతుందని కార్తీక్ తన మెడలో వేసుకుంటాడు. చూసావా అమ్మ నా కంటే కూడా ఆ లాకెట్ ఎక్కవ అని శౌర్య అనగానే.. ఈ టాపిక్ ఎక్కడికో పోయేలా ఉందనుకోని లాకెట్ తీసి ఇది ఎవరికి కన్పించకుండా దాచేస్తానని కార్తీక్ అంటాడు. అది నాకూ కావాలని శౌర్య అంటుంది. అది నీ మెడలో వేసే రోజు త్వరగా రావాలని అనుకుంటున్నానని దీప అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న చేసిన తప్పుకి ఇంట్లో పెద్ద రచ్చ అవుతుంది. నువ్వు ఇక సీఈఓగా పనికి రావని శివన్నారాయణ అంటాడు. తనకు సీఈఓగా బాధ్యతలు ఇవ్వడం తప్పు అనడం లేదు కానీ తను నిర్ణయం తీసుకునే రైట్ ఇవ్వడం కరెక్ట్ కాదని సుమిత్ర అంటుంది. నా పరువు తీసావ్ ఆ కార్తీక్, దీపల ముందు నా పరువు పోయిందని జ్యోత్స్నని శివన్నారాయణ కోప్పడతాడు. తాత ఒక్క ఛాన్స్ ఇవ్వు ఇక ఈ తప్పు రిపీట్ అవ్వదని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో సరే అని శివన్నారాయణ ఒక ఛాన్స్ ఇస్తాడు. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం ప్రతిదీ నాకు తెలియాలని దశరథ్ అంటాడు. దానికి జ్యోత్స్న ఒప్పుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వెనకాలే పారిజాతం వెళ్తుంటే.. నువ్వు జ్యోత్స్నతో మాట్లాడడానికి వీలు లేదని పారిజాతంపై శివన్నారాయణ విరుచుకుపడతాడు. మరొకవైపు శివన్నారాయణ‌ పరువు పోయిందని శ్రీధర్ డాన్స్ చేస్తుంటే.. కావేరి వచ్చి ఏమైందని అడుగగా జరిగింది చెప్తాడు. ఆ తర్వాత దీప చేసిన అవమానం గుర్తుకుచేసుకొని జ్యోత్స్న ఆవేశంతో రగిలిపోతుంటే.. పారిజాతం వచ్చి ఇంకా రెచ్చగొడుతుంది. ఆ తర్వాత దీప అంతు చూస్తానంటూ ఎవరికో జ్యోత్స్న ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరొక వైపు దీప కి చెయ్ నొప్పిగా ఉంటే కార్తీక్ ఆయిల్ మసాజ్ చేస్తాడు. నీ కళ్ళు బాగుంటాయి.. నీ కంటి రెప్పలు అందంగా ఉంటాయంటూ దీప అందాన్ని కార్తీక్ వర్ణిస్తూ ఉంటే దీప మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ధీరజ్ నీ జీవితాన్ని కాపాడాడు.. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తారు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -53 లో...... వేదవతి తన మేనకోడలని కాపాడమని ధీరజ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు ప్రేమ మెడలో తాళి కట్టమని ధీరజ్ కి చెప్తుంది. అందుకు ధీరజ్ ఒప్పుకోడు.. ఈ తల్లి కోసం ఇది చెయ్ రా అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ధీరజ్ ఇక చేసేదేమీ లేక ప్రేమ దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు పోలీసులు డోర్ కొడతారు. అప్పుడే వెనకాల నుండి ధీరజ్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ప్రేమ కట్లు విప్పి తన మెడలో బలవంతంగా తాళి కడతాడు. అప్పుడే పోలీసులు లోపలకి వస్తారు. ధీరజ్ ని అరెస్ట్ చెయ్యమని కానిస్టేబుల్ కి ఎస్సై చెప్తాడు. ఎందుకు సర్ అని ధీరజ్ అడుగుతాడు. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని కంప్లైంట్ వచ్చిందని చెప్పగానే.. అలాంటిదేనీ లేదు సర్.. మేము భార్యాభర్తలమంటూ ధీరజ్ చెప్తాడు. అందరు అదే చెప్తారని పోలీస్ అంటాడు. లేదు సర్ అని ధీరజ్ అంటుండగా.. అప్పుడే నర్మద, వేదవతిలు వస్తారు. మొన్న పెళ్లి జరిగింది. గుడికి వచ్చామని వాళ్లు చెప్పగానే.. పోలీసులు వెళ్ళిపోతారు.ఆ తర్వాత ప్రేమ చచ్చిపోవడానికి వెళ్తుంటే ధీరజ్, ప్రేమ, వేదవతి వాళ్లు ఆపుతారు. ఆ తర్వాత నా మెడలో తాళి ఎందుకు కట్టావని ధీరజ్ ని కొడుతుంది ప్రేమ. నీకు ఏమైనా పిచ్చా.. ఎందుకు నా కొడుకుని కొడుతున్నావ్.. నీ జీవితం కాపాడాడు.. నిన్ను తీసుకొని వచ్చినవాడు.. నిన్ను ప్రాస్టిట్యూషన్ కేసులో కళ్యాణ్ ఇరికించాడు. నిన్ను కాపాడడం కోసం వేరే దారి లేదని వేదవతి అంటుంది. అయిన వీడు నన్ను పెళ్లి చేసుకోవడమేంటి అంటూ ధీరజ్ పై కోపంగా ఉంటుంది ప్రేమ. ధీరజ్ మంచోడు నీ లైఫ్ బాగుంటుందని నర్మద అంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది.. అసలు ప్రాబ్లమ్ ఇప్పుడు ఉంది.. ప్రేమని ఇప్పుడు ఎలా ఇంటికి తీసుకొని వెళ్తామని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మా ఆయన మామూలుగానే ఏమీ చేయడు..ఇంకా పండగకు ఎం చేస్తాడు 

  ఢీ జోడి సంక్రాంతి స్పెషల్ థీమ్ తో రాబోతోంది. ఇందులో డాన్స్ లు మాములుగా లేవు. అందరూ అద్భుతంగా డాన్స్ చేశారు. ఇందులో ఆది ఐతే ముగ్గు వేయడానికి చుక్కలు పెట్టాడు. తరవాత సోనియా వచ్చి ముగ్గు వేసింది. దాంతో "అరె సిద్దు..నువ్వు మంచి భార్యనే పట్టావురా..మా ఆవిడకు ఏమీ రాదు అంటూ" అశ్విని గురించి అనేసరికి అశ్విని షాకైపోయింది. తర్వాత సోనియా అశ్వినితో "మీ ఆయన పండగ ఏమీ సెలెబ్రేట్ చేయట్లేదా అండి" అని అడిగింది. దానికి సోనియా "మా ఆయన మామూలుగానే ఏమీ చేయడు..ఇంకా పండగకు ఎం చేస్తాడు" అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఆ మాటలు హైపర్ ఆది వినేసి "అవును మరి మీ ఆయన పెద్ద పోటుగాడు" అంటూ గట్టిగా అరిచాడు. తర్వాత ఆది మాఫ్ పెట్టి స్టేజి మొత్తం క్లీన్ చేస్తూ కనిపించాడు. వెంటనే హన్సిక చెత్త కాగితాలన్నీ వేసేసి తుడువు అంటూ అరిచింది. ఆది హన్సిక దగ్గరకు వచ్చి "మా సంక్రాంతి మామూలు ఇవ్వలేదు" అనేసరికి అందరూ నవ్వుకున్నారు. ఇక ఫైనల్ గా సంక్రాంతి పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక హన్సిక వచ్చి సోనియాతో కలిసి డాన్స్ చేసేసింది. ఇక నెటిజన్స్ ఐతే హన్సిక చాలా బాగుంది అంటుంటే ఇది ఢీ షో కాదు కామెడీ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

Illu illalu pillalu : తప్పించుకున్న కళ్యాణ్‌‌.. ప్రేమని కాపాడేందుకు తాళి కట్టిన ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -52 లో......వేదవతి, ధీరజ్, నర్మద లు పూజ పూర్తి చేసి బయటకు వస్తారు. అప్పుడే ధీరజ్ కి రామరాజు ఫోన్ చేసి అమ్మకి ఫోన్ ఇవ్వమంటాడు. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను ధైర్యంగా ఉండమని ప్రేమ విషయం చెప్తాడు. దాంతో పాటు సేనాపతి గురించి మొత్తం చెప్తాడు. దాంతో వేదవతి టెన్షన్ పడుతుంది. నా కోడలు వెళ్లిపోవడమేంటి అంటూ బాధపడుతుంది. మీరు త్వరగా రండీ అని రామరాజు వాళ్లకి చెప్తాడు.  మరొకవైపు కళ్యాణ్ దగ్గరకి ప్రేమని అమ్మాలనుకుంటున్న అతను, కొంతమంది రౌడీ లతో వస్తాడు. డబ్బులు ఇంకా ఎక్కువ కావాలని కళ్యాణ్ అనగానే తన పీకపై కత్తి పెట్టి అతను బెదిరిస్తాడు. దాంతో కళ్యాణ్ అతనిపై కోపం తో పోలీసులకి ఫోన్ చేసి హోటల్ లో ఒక అమ్మాయితో ప్రాస్టిట్యూషన్ చేపిస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత ధీరజ్, నర్మద, వేదవతి లు వస్తుంటారు. అప్పుడే సడన్ గా ధీరజ్ కి కళ్యాణ్ డాష్ ఇస్తాడు. నువ్వేంటి ఇక్కడ ప్రేమ ఎక్కడ అంటూ కొడతాడు. దాంతో కళ్యాణ్ భయపడి ప్రేమ హోటల్ లో ఉంది. ఇప్పుడే పోలీసులకి ప్రాస్టిట్యూషన్ జరుగుతుందంటూ చెప్పానని చెప్పి కళ్యాణ్ తప్పించుకుంటాడు. వెంటనే ధీరజ్ వాళ్ళు హోటల్ కి వెళ్తారు. అప్పుడే పోలీసులు కూడా వస్తారు. ఇప్పుడు ప్రేమని కాపాడలేం పోలీసులు స్టేషన్ కి తీసుకొని వెళ్తే తన జీవితం స్పాయిల్ అవుతుందని నర్మద అంటుంది. అప్పుడే వేదవతి దగ్గరున్న అమ్మవారి దగ్గర తాళిబొట్టు తీసుకొని వెళ్లి ప్రేమ మెడలో కట్టమని వేదవతి చెప్తుంది. మరొక వైపు రౌడీలు ప్రేమ దగ్గరికి వెళ్తుంటారు. పోలీసులని చూసి పారిపోతారు. ఆ తర్వాత ఇక వేరే దారి లేక ధీరజ్ వెనకాల నుండి గదిలోకి వెళ్లి ప్రేమ వద్దంటున్నా తన మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీప, కార్తీక్ లకి ఒకే పూలదండ.. ఆమెని తాకుతుంటే మురిసిపోయిందిగా! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -251 లో..... కార్తీక్ చేసిన ధర్నాకి ఎంప్లాయిస్ కి సారీ చెప్తుంది జ్యోత్స్న. తిరిగి మళ్ళీ ఆఫీస్ కి రండి అని ఎంప్లాయిస్ కి చెప్తాడు దశరథ్. దాంతో ఎంప్లాయిస్ కార్తీక్  మెడలో పూలమాల వేస్తారు. దీప గురించి ఎంప్లాయిస్ అంతా పొగుడుతుంటే.. జ్యోత్స్న ఓర్వలేకపోతుంది. ఇక దీపని కార్తీక్ సైకిల్ పై ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత కార్తీక్, దీపలు వెళ్తుంటే జ్యోత్స్న అడ్డుపడుతుంది. ఏంటి మమ్మల్ని ఫాలో అవుతున్నావా అని కార్తీక్ అంటాడు. దీప వల్ల ఎలా ఉండేవాడివి ఎలా అయ్యావని జ్యోత్స్న అంటుంటే కార్తీక్, దీపలు జ్యోత్స్నపై విరుచుకుపడతారు. ఆ తర్వాత కార్తీక్ , దీపలు ఇంటికి వస్తారు. అనసూయని ఎప్పుడు వచ్చావని అడుగుతారు. ఆ తర్వాత ఆఫీస్ దగ్గర జరిగిందంతా కార్తీక్, దీప లు చెప్తారు. మెడలో ఈ మాల ఏంటి అని శౌర్య అడుగగా ఫ్యాన్స్ వేశారు.. ఇది మీ అమ్మ మెడలో ఉండాలని దీపకి వేస్తాడు కార్తీక్. ఆ తర్వాత శౌర్య ఇద్దరికి కలిపి వేసి తను కూడా మధ్య లో ఉంటుంది. ఆ తర్వాత ఒక ఫోటో తీసుకుంటారు. కాసేపటికి దీప దగ్గరికి అనసూయ వచ్చి.. కార్తీక్ గురించి మాట్లాడుతుంది. కార్తీక్ బాబుకి నాపై అభిమానం మాత్రమే ఉందంటూ కార్తీక్ గురించి గొప్పగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కార్తీక్ జ్ఞాపకం అయిన చైన్ ని శౌర్య వేసుకుంటుంది. ఏంటని కార్తీక్ అడుగగా చూపిస్తుంది. దాంతో శౌర్య పరిగెడుతుంది. తన వెంట కార్తీక్ పరిగెడుతాడు. దీప దాన్ని పట్టుకోమంటూ దీపని తాకుతూ ఉంటే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ కి చైన్ ఇస్తుంది శౌర్య. నువ్వు దీన్ని తీస్తావ్.. అందుకే మెడలో వేసుకుంటానని చైన్ ని తన మెడలో వేసుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : మరొక ప్రాజెక్ట్ ఉందంటూ వారిని మోసం చేసిన భద్రం.. సీతాకాంత్ కొత్త ఐడియా అదుర్స్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -301 లో.....సీతాకాంత్ వాటర్ తీసుకొని రావడానికి వెళ్తుంటే రామలక్ష్మి వద్దని తను వెళ్తుంది. అక్కడ అందరు లైన్ లో ఉంటారు. ఒకావిడ చిన్న బాబుని వదిలిపెట్టి వచ్చాను వాటర్ పట్టుకొనివ్వండి అని అక్కడున్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒప్పుకోకపోగా ఆవిడని తోసేస్తారు. దాంతో రామలక్ష్మికి కోపం వస్తుంది. అక్కడున్న వాళ్ళపై కోప్పడి తనకి రామలక్ష్మి వాటర్ పట్టిస్తుంది. ఆ గొడవ అంత శ్రీలత, శ్రీవల్లిలు చూసి నవ్వుకుంటారు. రామలక్ష్మి దగ్గరికి వచ్చి నవ్వుకుంటారు. పాపం నీ దగ్గర డబ్బుంటే ఇవ్వమని శ్రీవల్లితో శ్తీలత అనగానే శ్రీవల్లి డబ్బు ఇవ్వబోతుంటే.. మీరు కష్టపడి సంపాదిస్తే ఆ విలువ తెలిసేదని వాళ్ళపై కోప్పడుతుంది రామలక్ష్మి. సీతాకాంత్ అదంతా చూసి రామలక్ష్మి వచ్చేసరికి చూడనట్టుగా ఉంటాడు. రామలక్ష్మి నువ్వు నా వాళ్ళ గురించి చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళను అందలం ఎక్కించాను.. నిన్ను ఈ పరిస్థితిలో ఉంచాను.. అయినా నాపై కోపం లేదని సీతాకాంత్ మనసులో అనుకుంటాడు. మరొకవైపు సందీప్, ధనల దగ్గరికి భద్రం వచ్చి.. ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అది లాభం వస్తే వంద కోట్లు కానీ ఇప్పుడు అయిదు కోట్లు కావాలని భద్రం అంటాడు. మా దగ్గర ఉన్నాయి అయిదు కోట్లని సందీప్ ధనలు అనుకుంటరు. మీరు కాకపోతే వేరొకరు రెడీగా ఉన్నారని భద్రం అనగానే.. మా దగ్గరున్న డబ్బు ఇస్తామని అన్ని డబ్బులు భద్రంకి ఇస్తారు. ఈ డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోతాను అందరు వచ్చి మిమ్మల్ని అడుగుతారని భద్రం తన మనసులో అనుకుంటాడు. మరొకవైపు సీతాకాంత్ ఒక ప్లాన్ వేస్తాడు. సమస్య మీది పరిష్కారం మాది.. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక తోచిన డబ్బు ఇవ్వండి అని ఒక పేపర్ పై రాస్తాడు. అది చూసి రామలక్ష్మి ఐడియా బాగుంది అంటుంది. ఆ తర్వాత  ఒక ఫామ్ ప్లేట్ రెడీ చేయించి ఆటోలకి అంటిస్తాడు. అది ఆటోలో ఎక్కిన వారందరు చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్య ఇచ్చిన జలక్ తో రుద్రాణి షాక్.. ఆ చెక్ చించేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -616 లో..... స్వప్నకి శ్రీమంతం చెయ్యాలని కావ్యతో రుద్రాణి చెప్తుంది. మన కుటుంబం పెద్దది కాబట్టి గ్రాండ్ గా చెయ్యాలని రుద్రాణి అంటుంది. నువ్వేం అనడం లేదేంటి కావ్య.. కొంపదీసి నీకు ఇష్టం లేదా అని రుద్రాణి అడుగుతుంది. అక్కకి శ్రీమంతం అంటే నాకు సంతోషమే కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ గదిలోకి తీసుకొని వెళ్లి.. ఏంటి శ్రీమంతం చేస్తానంటున్నావ్.. ఇప్పుడు ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని రాజ్ అంటాడు. ఇప్పుడు నేను వద్దనంటే మా అక్కకి శత్రువుని అవుతానని కావ్య అంటుంది. ఇదంతా రుద్రాణి కావాలని చేస్తుంది.. నా ప్లాన్ నాకుందని రాజ్ తో కావ్య అంటుంది. ప్లాన్ రివర్స్ అయి ఇంట్లో వాళ్లు నీపై దండెత్తితే నేనేం చేయలేనని రాజ్ అంటాడు. మరొకవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. చూసావా ఆ కావ్యని ఎలా ఇరికించానో అని హ్యాపీగా చెప్తుంది. నువ్వు నీ కోడలికి శ్రీమంతం చేస్తున్నావ్. ఇందులో నాకేంటి లాభమని ధాన్యలక్ష్మి అంటుంది. అంటే ఇప్పుడు అన్నింటికి కావ్య రిస్ట్రిక్షన్ పెడుతుంది కదా.. చెల్లి విషయం వచ్చేసరికి ఖర్చు అయిన చేస్తానంటుంది కదా ఈ విషయంతో అక్కకి ఒకలా మాకు ఒకలా అని గొడవ చెయ్యొచ్చని రుద్రాణి అంటుంది. ఒకవేళ కావ్య శ్రీమంతం సింపుల్ గా చేద్దామంటే ఏం చేస్తావని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఏం ఉంది అసలు కావ్యకి మనసు లేదు ఇలా అంటుంది అంటూ మనమే రివర్స్ అవుదామని రుద్రాణి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి లిరిక్ రైటర్ ఫోన్ చేసి.. ఇంకా సాంగ్ పంపలేదని తిడుతాడు. దాంతో కళ్యాణ్ పంపిస్తానని చెప్తాడు. మరొకవైపు కనకం ఇంటికి వెళ్తుంది కావ్య. కావ్య రావడంతో మళ్ళీ రాజ్ గెంటేసాడేమోనని కనకం భయపడుతుంది. అదేం లేదు అమ్మ.. అక్కకి శ్రీమంతం చేయాలనుకుంటున్నారు కానీ అక్కడ వద్దు ఇక్కడ చెయ్యాలని చెప్పు.. నన్ను అర్థం చేసుకోమని కనకాన్ని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఇంతలా అంటున్నావంటే ఏదో కారణం ఉంటుంది. సరే రేపు వచ్చి మాట్లాడుతానని కనకం అంటుంది. మరుసటిరోజు రుద్రాణి రాహుల్ లు శ్రీమంతానికి లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. తరువాయి భాగంలో రుద్రాణి లిస్ట్ ఇవ్వగానే కావ్య ఇరవై లక్షల చెక్కు రుద్రాణికి ఇస్తుంది. అప్పుడే కనకం వస్తుంది శ్రీమంతం విషయం అపర్ణ చెప్పగానే.. నా కూతురు శ్రీమంతం నా ఇంట్లో చెయ్యాలి.. ఇది వారసత్వంగా వస్తుందని కనకం చెప్పగానే.. రుద్రాణి దగ్గర నుండి కావ్య చెక్ తీసుకొని.. ఇప్పుడు ఇది అవసరం లేదని చింపేస్తుంది. దాంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భార్య కాళ్ళు కడిగిన పంచ్ ప్రసాద్...

  జబర్దస్త్ షోలో కామెడీతో ఎంతోమందిని అలరించిన పంచ్ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగా నవ్విస్తూ ఉంటాడు.   కానీ రియల్ లైఫ్‌లో పంచ్ ప్రసాద్  కిడ్నీ సంబంధిత సమస్యలతో తరచూ ఆస్పత్రులకు వెళ్తూనే ఉండేవాడు. ఎందుకంటే రెండు కిడ్నీలు పాడైపోవడంతో వెంటనే కొత్త కిడ్నీని అమర్చాలని డాక్టర్స్ చెప్పడంతో ప్రసాద్ ఎంతో స్ట్రగుల్ అయ్యాడు. ఇక అతనికి డయాలసిస్ చేస్తున్నా కూడా రకరకాల ఇంఫికేషన్స్ తో ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి చూడలేక భార్య సునీత తన కిడ్నీని దానం చేస్తానని ముందుకు వచ్చింది. అయితే చిన్న వయసు కావడంతో వైద్యులు కుదరదని చెప్పేశారు. భర్తను బతికించుకోవడానికి ఆమె ఎన్నో  కష్టాలు పడింది. ఈ విషయాన్ని పంచ్ ప్రసాద్ నే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఐతే ఫైనల్ గా  కిడ్నీ  డోనర్ దొరకడంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని మళ్ళీ షోస్ కి వస్తున్నాడు పంచ్ ప్రసాద్. ఈ విషయాన్నీ చెప్తూ ఫామిలీ స్టార్స్ లో షోలో ప్రసాద్ తన భార్య కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నాడు. తల్లీ తండ్రులు జన్మనిస్తే.. తన భార్య తనకు పునర్జన్మనిచ్చిందన్నాడు ప్రసాద్. తన భార్య తనతోనే ఉంటూ కుటుంబాన్నికంటికిరెప్పలా చూసుకుంటోంది అన్నాడు ప్రసాద్ . ఈరోజు ఇలా తాను ఆరోగ్యంగా లేచి తిరగడానికి కారణం తన భార్య అంటూ.. ఆమెకు తాను చేసే ఈ పని చాలా చిన్నదంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది.  

సౌమ్య రావు అంటే ఫ్లవర్ అనుకుంటిరా ఫైర్...

  రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా బుల్లితెర మీద ఒక షో ప్రసారమయ్యింది. అందులో నూకరాజు యాంకర్  సౌమ్య రావు తెలుగు మీద రకరకాల కామెంట్స్ చేసాడు. ఆమెకు తెలుగు రాదనీ చెప్పాడు. దాంతో ఆమె కూడా కొంచెం ఫీల్ అయ్యింది. కన్నడ వాళ్ళను ఇక షోస్ కి పిలవకండి మీ తెలుగు వాళ్లనే పిలుచుకోండి అంటూ పాపం కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది.  కానీ ఆ ఇన్స్పిరేషన్ తో ఆమె పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నట్టు ఉంది. రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే అందులో డైలాగ్స్ చించేసింది. బులెట్ భాస్కర్ , సౌమ్య స్కిట్ లో ఆమె చెప్పిన డైలాగ్ వైల్డ్ ఫైర్ లా ఉంది. "భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలను తెగనరికి కిట్టూర్ లో విజయపతాక ఎగరవేయకపోతే నేను కిట్టూర్ చెన్నమ్మనే కాను..ఇంకోసారి పన్ను అనే పదం నీ నోటి నుంచి వినిపిస్తే నీ నాలుక చీరేస్తా..జాగ్రత్త" అంటూ పేల్చిన డైలాగ్ బాంబుతో స్టేజి మొత్తం షాకైపోయింది. సౌమ్య నేనా ఈ డైలాగ్స్ తెలుగులో చెప్పింది అంటూ ఆశ్చర్యపోయారు.  సౌమ్య కన్నడ అమ్మాయి. కన్నడ నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో షోస్ చేస్తోంది. జబర్దస్త్ యాంకర్ గా వచ్చినప్పుడు ఆమెను అందరూ కూడా చాలా ఎగతాళిగా ఆమె తెలుగును కామెంట్ చేశారు. కానీ అందరినీ ఓడించి తెలుగులో ఇప్పుడు చెప్పిన డైలాగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. సౌమ్య అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు వైల్డ్ ఫైర్ అన్న రేంజ్ లో ఆ పవర్ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ డైలాగ్స్ చెప్పి భేష్ అనిపించుకుంది.

బావ లిప్స్ దగ్గర ఫింగర్ పెడితే కరెంటు షాకే..

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో ఒక్క కార్తీక దీపం షో స్పెషల్ గా మారిపోయింది. ఇక పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేక సంక్రాంతి పండగ చేసుకోలేకపోతున్నారంటూ హోస్ట్ హరి చెప్పేసరికి రోహిణి, శ్రీముఖి పాపం కన్నీళ్లు పెట్టుకుని కార్తీక దీపం ఫామిలీ మొత్తాన్ని స్టేజి మీదకు పిలిచారు. ఇక ఇందులో డాక్టర్ బాబు అలియాస్  నిరుపమ్ పరిటాల కోసం ఒక పక్క జ్యోత్స్న మరో పక్క దీప పోటీ పడ్డారు. తనను పెళ్లి చేసుకుని ఉంటే మంచి పిండి వంటలు ఉంటాయి అంటూ జ్యోత్స్న చెప్పేసరికి తనకు ప్రేమ అభిమానం ఇంపార్టెంట్ అంటూ దీప పక్కన నిలబడ్డాడు డాక్టర్ బాబు. ఇక జ్యోత్స్నకి, దీపాలకు పిండి వంటలు చేసే కాంటెస్ట్ పెట్టింది శ్రీముఖి. "అక్కా..పిండి వంటలు చేసే పోటీలో గెలిస్తే బావని నాకు ఇచ్చేస్తావా" అని జ్యోత్స్న దీపాని  అడిగింది. "లేదు మేము వేసిన చేగోడీలు ఇస్తాం" అంటూ దీప బదులు డాక్టర్ బాబు ఆన్సర్ ఇచ్చాడు. "బావకు నా జంతికలు ఇష్టం" అని జ్యోత్స్న చెప్పేసరికి "అదంతా కాదులే కానీ..జంతికలు ఏ పిండితో చేస్తారు" అనేసరికి నటకుమారి మధ్యలో వచ్చి "జంతికలు మైదా పిండితో చేస్తారని చెప్పింది" దానికి దీప షాకైపోయింది. ఇక జ్యోత్స్నకి, దీపకి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టింది. జ్యోత్స్న డాక్టర్ బాబు బొమ్మ గీసింది. తర్వాత బొమ్మ లిప్స్ దగ్గర చెయ్యి పెట్టి మరీ ఓవర్ యాక్షన్ చేసింది. "బావ లిప్స్ దగ్గర ఫింగర్ పెడితే కరెంటు షాకే" అంటూ కొంటెగా రొమాంటిక్ డైలాగ్ చెప్పేసరికి నిరుపమ్ నిజంగా షాకైపోయాడు. ఇక దీపా వేసిన బొమ్మను చూసి శ్రీముఖి కౌంటర్ వేసింది. " మీరు ఎక్కడ ఉన్నా వెతుక్కోవాల్సి వస్తోంది" అంటూ చెప్పింది. కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్. అందులో మోనిత రోల్ కేక. ఇక దీపకి మోనితకి మధ్యలో నలిగిపోయే డాక్టర్ బాబు రోల్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సీజన్ 2 వచ్చింది కానీ అనుకున్నంత రేటింగ్ ఐతే రావడం లేదు. ఆడియన్స్ ఐతే చూస్తున్నారు. "దీపక్క..డాక్టర్ బాబు వచ్చారుగా సంక్రాంతి పండగ ఇక అదిరిపోద్ది" అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 కాఫీ అఫైర్స్ తో బిజినెస్ లోకి బిగ్ బాస్ హౌస్ మేట్

  గౌతమ్ కృష్ణ ఒక డాక్టర్. అతని గురించి  అతను బిగ్ బాస్ సీజన్ 7 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తన ఆట తీరును ప్రదర్శించాడు. అలాగే సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లి ఆడాడు. రన్నరప్‌గా నిలిచాడు.  అయితే బిగ్ బాస్‌కి వచ్చేముందు.. గౌతమ్ హీరోగా ‘ఆకాశవీధుల్లో’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. కేవలం హీరోగానే కాకుండా ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్, ప్రొడ్యుసర్ కూడా గౌతమ్ కృష్ణ కావడం విశేషం. ఐతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన వాళ్లంతా మూవీస్ లో ఇతరత్రా ఆఫర్స్ కోసం వెయిట్ చేయకుండా సొంతంగా బిజినెస్ లు  పెట్టుకుని ఎదుగుతున్నారు. రీసెంట్ గా  సయ్యద్ సోహైల్ కళింగపట్నం అనే రెస్టారెంట్ ని ప్రమోట్ చేస్తూ కనిపించాడు. అలాగే టేస్టీ తేజ ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో సెటిల్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా గౌతమ్ కృష్ణ కూడా "మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫైర్స్" పేరుతో ఒక కాఫీ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు. ఎవ్వరైనా సరే తన రెస్టారెంట్ ని విజిట్ చేయొచ్చని అక్కడ మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంటుందని చెప్పాడు. ఐతే ఇది తన ఫ్రెండ్ నిర్వహిస్తూ ఉండగా..తనతో అసోసియేట్ అయ్యాయని చెప్పాడు. ఈ బ్రాండ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నాడు. బిగ్ బాస్ చూసిన వాళ్ళు , చూడని వాళ్ళు ఎవ్వరైనా సరే తన రెస్టారెంట్ ని విజిట్ చేయొచ్చని చెప్పాడు అలాగే మరో బ్రాంచ్ ని కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం అని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఇంకా రాలేదని చెప్పాడు. త్వరలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ నాగార్జునను పిలవడానికి ట్రై చేస్తానని చెప్పాడు. ఇక తన రెస్టారెంట్ లో హెల్తీ బాయ్ మెనూ అనేది స్టార్ట్ చేసినట్లు చెప్పాడు. రామ్ చరణ్ అంటే తనకు నటనలో ఇన్స్పిరేషన్ అన్నాడు. త్వరలో తాను నటించిన "సోలో బాయ్" మూవీ రిలీజ్ కాబోతోంది అని దానిని అందరూ ఆదరించాలని చెప్పాడు. సయ్యద్ సోహైల్ కూడా తన ఫ్రెండ్ పెట్టిన కళింగపట్నం రెస్టారెంట్ కోసం తన ఫ్రెండ్ తో అసోసియేట్ అయ్యి ఆ రెస్టారెంట్ ని ప్రోమోట్ చేస్తున్నాడు. ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంలో తమను తాము నిరూపించుకుంటున్నారు. ఇక గౌతమ్ కృష్ణ కాఫీ అఫైర్స్ రెస్టారెంట్ కి బెజవాడ బేబక్క, రౌడీ రోహిణి, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, సయ్యద్ సోహైల్, విజె సన్నీ, శేఖర్ బాషా, ముక్కు అవినాష్, మెహబూబ్ వంటి వాళ్లంతా వచ్చి విష్ చేశారు.

Karthika Deepam2 : జ్యోత్స్న నిర్ణయం తెలుసుకొని షాక్ అయిన శివన్నారాయణ‌.. కార్తీక్ పంతం గెలిచింది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -250 లో.....జ్యోత్స్న ఆఫీస్ లో ఉన్న యాభై ఏళ్లకు పైబడిన వారిని తీసేయ్యడంతో వాళ్ళందరూ కార్తీక్ దగ్గరకి వెళ్లి సాయం అడుగుతారు. అసలు విషయం చెప్పడానికి వెళ్లిన కార్తీక్ ని విషయం చెప్పనివ్వకుండా శివన్నారాయణ‌ అడ్డుపడతాడు. ఇక చూసుకుందాం అన్నట్లు కార్తీక్ వెళ్ళిపోతాడు. మరొకవైపు అనసూయ ఊరు నుండి వస్తుంది. ఇల్లు అమ్మకానికి పెట్టి వచ్చానని కాంచనకి చెప్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న తన క్యాబిన్ లో ఉండగా.. సీఈఓ డౌన్ డౌన్ అంటూ కార్తీక్ తో పాటు ఉద్యోగం నుండి తీసేసిన వారు వచ్చి నినాదాలు చేస్తుంటారు. అప్పుడే జ్యోత్స్న వచ్చి మీరేం చేసుకుంటారో చేసుకోండి తగ్గేదేలే అన్నట్లు జ్యోత్స్న పొగరుగా ఉంటుంది. కాసేపటికి శివన్నారాయణ‌కి తన లీగల్ అడ్వైజర్ ఫోన్ చేసి ఆఫీస్ దగ్గర జరుగుతున్న పరిస్థితి చెప్తాడు. దాంతో శివన్నారాయణ‌ షాక్ అయి.. కోపంగా జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. అనుభవమున్న వాళ్ళను తీసేసి ఏం చేయాలనుకుంటున్నావు.. ఇక నోరు ముయ్ అంటూ జ్యోత్స్న పై విరుచుకుపడుతాడు శివన్నారాయణ‌. ఆ తర్వాత నువ్వు జ్యోత్స్న వెళ్లి సారీ చెప్పి తిరిగి ఉద్యోగంలోకి రమ్మని చెప్పండి అని దశరథ్ తో శివన్నారాయణ‌ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ చెప్పాలని వచ్చింది ఈ విషయమే అనుకుంటా అని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత కార్తీక్ వాళ్లు ధర్నా చేస్తున్న దగ్గరికి జ్యోత్స్న, దశరథ్ లు వస్తారు. తిరిగి ఉద్యోగంలోకి రండి అని వాళ్ళు చెప్తారు. దాంతో కార్తీక్ జిందాబాద్ అంటూ కార్తీక్ ని వాళ్లు ఎత్తుకుంటారు‌‌. దాంతో దీప మురిసిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఒకరు.. మీ భార్య ఉంటే మీరు ఏదైనా చెయ్యగలరు సర్ అని అంటాడు. ఆ మాట జ్యోత్స్న వినేలా మళ్ళీ అనండి సర్ అంటూ కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకున్న ప్రేమ.. తన మెడలో తాళి కట్టింది ఎవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -51 లో.....ప్రేమ లేచిపోయిందన్న విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళ మాటలు తట్టుకోలేక సేనాపతి గదిలోకి వెళ్లి గన్ ని తల దగ్గర పెట్టుకుంటాడు. ఆ విషయం తిరుపతి వెళ్లి రామరాజుకి చెప్తాడు. వెళ్లి కాపాడని తిరుపతిని పంపిస్తాడు రామరాజు. తిరుపతితో పాటు అందరు డోర్ ని నెట్టి లోపలికి వెళ్తారు. నేను ఈ అవమానం భరించలేనని సేనాపతి అంటాడు. ఆ తర్వాత వేదవతి విషయంలో రామరాజుని వదిలిపెట్టి తప్పు చేసాం కానీ ఇప్పుడు ప్రేమ విషయంలో ఈ తప్పు జరగడానికి వీలు లేదు గంటలో తనని తీసుకొని వెళ్ళిన వాడు ఇక్కడ ఉండాలని భద్రవతి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి ప్రేమ అమ్మాలనుకుంటున్న అతను ఫోన్ చేసి వచ్చామని చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ బాధపడుతుంటే.. పదా ఇక వెళదాం.. ఇంత దూరం వచ్చాక ఆగడం.. ఎందుకంటూ నగలున్న బ్యాగ్ ని తీసుకొని పదా అని కళ్యాణ్ అంటాడు. ఈ బ్యాగ్ ఏంటి అని ప్రేమ చూడగా.. అందులో నగలు ఉంటాయి. ఇవి ఎందుకు తెచ్చావని అడుగుతుంది. అయిన ఎప్పుడు తీసావ్ అంటుంది నువు ఫ్రెషప్ అవుతున్నాప్పుడని కళ్యాణ్ అనగానే.. అంటే నా కంటే నీకు నగలు ఎక్కువనా అని ప్రేమ అంటుంది. అవును ఎక్కువే నిన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చింది.. పెళ్లి చేసుకోవడం కోసం కాదు అమ్మడానికి అని కళ్యాణ్ అనగానే.. ప్రేమ షాక్ అవుతుంది. కళ్యాణ్ గురించి ధీరజ్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ప్రేమని కళ్యాణ్ కాళ్ళు చేతులు కట్టి బంధిస్తాడు. మరొకవైపు భద్రవతి కుటుంబాన్ని పెళ్లి కూతురు లేచిపోయిందంటూ పెళ్లి కొడుకు వాళ్లు అవమానిస్తారు. దాంతో ఎందుకు అలా అంటున్నారు.. వాళ్లే బాధలో ఉన్నారని భద్రవతికి సపోర్ట్ గా రామారాజు మాట్లాడి.. వాళ్ళని పంపిస్తాడు. తరువాయి భాగంలో  ప్రేమ మెడలో తాళి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అమ్మ తిడితే నువ్వు తట్టుకోలేవ్ అన్నయ్య.. అందుకే నేను అలా చేశాను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -300 లో..... సిరి అవమానించి పంపించడంతో సీతాకాంత్ ఒక దగ్గర ఆటో ఆపి తన మాటలు గుర్తుచేసుకుంటాడు. నేను ఎవరికి ఏ అన్యాయం చేసాను.. అందరు నన్ను ఇలా బాధపెడుతున్నారని సీతాకాంత్ బాధపడుతుంటే.. మీరు ఆ మాటలకి బాధపడకండి అంటూ రామలక్ష్మి దైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తారు. మరుసటిరోజు ఉదయం భద్రం దగ్గరికి ఫ్లాట్ తీసుకున్న వారు వస్తారు. ఏంటి ఇన్ని రోజులు అవుతుంది. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చెయ్యలేదని అడుగుతారు. వాళ్ళతో భద్రం దురుసుగా మాట్లాడతాడు. మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటూ అందరు వెళ్తారు. వీళ్ళతో ప్రాబ్లమ్ అయ్యేలా ఉంది.. డబ్బు తీసుకొని నేను జంప్ అవ్వాలని భద్రం అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సిరిని ఒక రామలక్ష్మి దగ్గరికి తీసుకొని వస్తుంది పెద్దావిడ. మీ గురించి చూస్తుంటే నేనే తీసుకొని వచ్చానని పెద్దావిడ అంటుంది. సిరిని చూసి రామలక్ష్మి లోపలికి తీసుకొని వెళ్లి సీతాకాంత్ ని పిలుస్తుంది. సిరిని చూసి సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. నిన్న అంత అవమించాను.. నీకు కోపంగా లేదా అని సిరి అంటుంది. నిన్న అన్ని మాటలు అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్.. ఏదో కారణముందని రామలక్ష్మి అనగానే.. సిరి ఎందుకు అలా మాట్లాడిందో చెప్తుంది. అమ్మ, వదిన కలిసి మిమ్మల్ని అవమానించాలనుకున్నారు.. అది నేను విన్నాను.. అమ్మ నిన్ను అవమానిస్తే నువ్వు భరించలేవు.. అందుకే అమ్మ ఏం అనకముందే నిన్ను తిట్టి పంపించానని సిరి అంటుంది. నిన్న నాకు చీర ఇస్తే తీసుకోలేదు కదా ఇప్పుడు ఇవ్వండి అనగానే ఇద్దరు సిరికి చీర పెడుతారు. ఆకలిగా ఉందని సిరి అనగానే.. రామలక్ష్మి వెళ్లి వంట చేస్తుంది. రామలక్ష్మి కిచెన్ లోకి వెళ్లేసరికి అక్కడ సరుకులేం ఉండవు కానీ ఏదో ఒకటి చేయాలని వంట చేస్తుంది. సీతాకాంత్ వచ్చి సరుకులు లేవ్ కదా ఏం చేస్తున్నావని అంటాడు. నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వంట చేసి తీసుకొని వస్తుంది. ఇద్దరు బాగుంది అంటారు. మరొకవైపు ఈ డబ్బు మీకు.. ఇది నాకు అని భద్రం సందీప్ వాళ్ళతో అనగానే అంత డబ్బు ఎందుకని సందీప్ అడుగుతాడు. పని మొదలు పెట్టాలి కదా అంటూ తీసుకొని వెళ్తాడు. మళ్ళీ వచ్చి ఆ డబ్బు కూడా తీసుకొని వెళ్తానని భద్రం మనసులో అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి పనులు చేస్తుంటే సీతాకాంత్ హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : స్వప్న శ్రీమంతానికి అరవై లక్షల ఖర్చు.. రుద్రాణి కొత్త ప్లాన్ !

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -615 లో.... ప్రకాష్ దగ్గరికి సుభాష్ వస్తాడు. ఈరోజుతో ఇంట్లో నా విలువ తెలిసిందని బాధపడుతుంటే.. కావ్య ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కుంటాను.. నువ్వేం బాధపడకు కొంచెం టైమ్ ఇవ్వమని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ దగ్గరికి కావ్య వస్తుంది. సారీ మావయ్య మీతో అలా మాట్లాడాల్సి ఉండకూడదని చెప్తుంది‌. నేను కంపెనీకి లాభం తెచ్చే పని చేసినా కూడా నువ్వు వద్దని అపావంటూ కఠినంగానే ప్రకాష్ మాట్లాడతాడు. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా మావయ్య అంటూ కావ్య బాధపడుతుంది. ధాన్యలక్ష్మి వచ్చి ఏం నటిస్తున్నావ్.. అందరి ముందు అలా మాట్లాడి ఇప్పుడిలా చెప్తున్నావా అంటు కావ్యపై కోప్పడుతుంది. మీరెందుకు రాను రాను ఇలా మాట్లాడుతున్నారు చిన్న అత్తయ్య అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఏడుస్తుంది. కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. మొదటిసారి నీ కంట్లో కన్నీరు చూడడం ఇప్పుడు జరిగిందంతా చూసాను.. ఇదంతా ఎందుకు తాతయ్య మాట విషయం ఇంట్లో చెప్పేద్దామని రాజ్ అనగానే.. వద్దు ఈ విషయం తెలిస్తే ఆస్తుల కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మి లు కోర్ట్ కి వెళ్తారని కావ్య అంటుంది. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు ప్రకాష్ ని పూర్తిగా తన వైపుకి తిప్పుకోవాలనుకుంటారు. స్వప్నకి శ్రీమంతం చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది రుద్రాణి. మరుసటి రోజు ఉదయం శాంత వచ్చి.. ఏం టిఫిన్ చెయ్యాలని రుద్రాణిని అడుగుతుంది. నన్నెందుకు అడుగుతున్నావని రుద్రాణి అనగా.. ఇకనుండి ఇంట్లో అందరికి నచ్చినవి వండమని కావ్య మేడమ్ చెప్పిందని శాంత అంటుంది.  నేను స్వప్నకి శ్రీమంతం చెయ్యాలనుకుంటున్నానని రుద్రాణి అనగానే.. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ అంటూ స్వప్న ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును చేద్దామనుకుంటున్నా ఒక ప్లాన్ కూడా వేసుకున్నానని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో శ్రీమంతానికి కావల్సిన లిస్ట్ రుద్రాణి రాస్తుంది. అది మొత్తం ఇరవై లక్షల ఖర్చు ఉంటుంది. అది రాసి కావ్యకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : అతనితో వెళ్ళిపోయిన కూతురు.. బాధ తట్టుకోలేక గన్ గురిపెట్టుకున్న తండ్రి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -50 లో..... వేదవతి నర్మదలని మీరు రూమ్ లో పడుకోండి.. నేను బయట పడుకుంటానని చెప్పి ధీరజ్ బయటపడుకుంటాడు. అప్పుడే ప్రేమని తీసుకొని అదే హోటల్ కి వస్తాడు కళ్యాణ్. ధీరజ్ పక్క నుండే లోపలికి వెళ్తారు. వాడికి ఫోన్ చేయాలంటూ ప్రేమని అమ్మే అతనికి ఫోన్ చేసి డబ్బు పట్టుకొని రమ్మని చెప్తాడు. ఎలాగూ అమ్ముతున్నాం కదా.. ఇంత అందాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకనుకుంటూ ప్రేమపై చెయ్ వేస్తాడు. దాంతో కళ్యాణ్ పై కోప్పడుతుంది ప్రేమ. ఆ తర్వాత ప్రేమ తన కుటుంబాన్ని వదిలేసి వచ్చినందుకు బాధపడుతుంది. నేను వచ్చేసానని ఇప్పటికి ఇంట్లో వాళ్లకి తెలిసిపోయిందా అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుంది. రేవతి ప్రేమ గదిలోకి వెళ్తుంది అక్కడ ఒక లెటర్ ఉంటుంది. అది చూసి రేవతి వచ్చి భద్రవతికి చూపిస్తుంది. అది చూసి భద్రవతి షాక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మన ఇంటి పరువుపోయిందని భద్రవతి బాధపడుతుంది. మరొకవైపు వేదవతి వాళ్లు గుడికి వెళ్తుంటారు. కళ్యాణ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చి పెళ్లికి అంతా సిద్ధం చేశారని అంటాడు. మరొక వైపు బయట సేనాపతి మైక్ లో పెళ్లి గురించి మాట్లాడుతుంటే.. రేవతి వచ్చి అసలు విషయం చెప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఏంటి కంగారుగా వెళ్తున్నారని రామరాజు, తిరుపతి అనుకుంటారు. తిరుపతి భద్రావతి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన సేనాపతికి ప్రేమ లేచినపోయిన విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఊళ్ళో పెళ్లికి వచ్చిన వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటారు. దాంతో సేనాపతి గదిలోకి వెళ్లి గన్ తీసుకొని.. తల దగ్గర పెట్టుకుంటాడు. దాంతో అందరు డోర్ తియ్యమని అరుస్తారు. మరొకవైపు తిరుపతి వెళ్లి జరిగింది మొత్తం రామరాజుకి చెప్తాడు. అన్నయ్య డోర్ వేసుకున్నాడని  తిరుపతి చెప్పగానే.. వెళ్లి కాపాడు అని రామరాజు అంటాడు. రామరాజు వెళ్ళబోతు ఆ గీత దగ్గర ఆగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : మూర్ఖుడిలా తాత.. ఛాలెంజ్ లతో మనవడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -249 లో..... సుమిత్ర అందరికి భోజనం వడ్డీస్తుంది. ఇవి అయిన ఇంట్లో చేసినవా లేక మళ్ళీ ఎక్కడ నుండి అయినా తెచ్చావా అని పారిజాతం అడుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుండి నా వంట తింటున్నారు.. తెలియడం లేదా అని సుమిత్ర అంటుంది. అంటే కొన్ని వంటలు ఆ దీప నువ్వు సేమ్ వండుతారని పారిజాతం అనగానే.. తనపై శివనారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత ఆఫీస్ లో నేను ఒక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న చెప్పగానే.. ఏదైనా తీసుకో అది మనకు పేరు తెచ్చేదిగా ఉండాలని శివన్నారాయణ‌ అంటాడు. మరొకవైపు మీరు రేపు వెళ్లి మీ తాతయ్యతో గొడవ పడకండి.. జ్యోత్స్న తీసుకున్న నిర్ణయం తాతయ్యకి తెలిసి ఉండదని దీప అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి మాట్లాడుతుంది. ఆఫీస్ లో ఏదో నిర్ణయమన్నావ్ ఏంటని పారిజాతం అడుగగా.. ఆఫీస్ లో నీలాంటి వాళ్ళందరిని తీసేసానని జ్యోత్స్న అంటుంది. దాంతో పారిజాతం షాక్ అవుతుంది. వచ్చిన ఛాన్స్ ని ఇలా చెడగొట్టకుంటున్నావ్ ఏంటి? ఆ నిర్ణయం మార్చుకో మీ తాతయ్యకి తెలిస్తే బాగోదని పారిజాతం భయపడుతుంది. అదేంటి తాతయ్య నిర్ణయం నాకు నచ్చినట్ల తీసుకొమ్మని చెప్పాడని జ్యోత్స్న అంటుంది. మరుసటి రోజు ఉదయం శివన్నారాయణ ఇంటి ముందుకి కార్తీక్ వచ్చి శివన్నారాయణ‌ గారు అంటూ పేరు పిలుస్తాడు. దాంతో అందరు బయటకు వస్తారు. పేరు పెట్టి పిలుస్తున్నావంటూ శివన్నారాయణ అడుగుతాడు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను. ఆఫీస్ లో నిర్ణయలా గురించి అని కార్తీక్ అనగానే.. సీఈఓగా నా మనవరాలు నిర్ణయాలు తీసుకుంటుంది. తనేం చేసిన ఆ నిర్ణయం నేను సమర్థిస్తాను.. నువ్వు అడగాల్సిన అవసరం లేదని శివన్నారాయణ‌ అంటాడు. అయితే నేను మాట్లాడడానికి వచ్చాను.. మీరు మాటలు వద్దు యుద్ధనే కావాలంటున్నారు తేల్చుకుంటానని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు. కార్తీక్ ఏం చెప్పే వాడో వినాల్సింది నాన్న అని దశరథ్ అంటాడు. వాడు అన్ని మనతో కలవడానికి చేస్తున్న ప్రయత్నమంటూ శివన్నారాయణ అంటాడు. అసలు బావ ఏం చేయబోతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : శ్రీమంతానికి వచ్చిన అన్నయ్య.. మీది నా స్థాయి కాదంటూ అవమానించిన చెల్లెలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -299 లో.....రామలక్ష్మి, సీతాకాంత్ లు సిరి శ్రీమంతానికి వస్తారు. ఇక వాళ్ళు వచ్చాక అవమానించడమే పనిగా పెట్టుకుంటారు. సీతాకాంత్, రామలక్ష్మి సోఫాపై కూర్చోబోతుంటే అవి మీకు కాదని , కింద కూర్చోమని అనగానే సీతాకాంత్ బాధపడతాడు. రామలక్ష్మి వాళ్లకు సమాధానం చెప్తుంటే.. వదిలేయమని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు కింద కూర్చొని ఉంటారు. శ్రీలత, శ్రీవల్లి ఇద్దరు సోఫాపై కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటారు. రామలక్ష్మికి కోపం వచ్చి ఒక్కసారి పైకి లేస్తుంది. దాంతో అందరూ భయపడి నిల్చుంటారు. ఎందుకు నిల్చొని ఉన్నావని సీతాకాంత్ అడుగగా.. కాలు తిమ్మిరి ఎక్కిందని రామలక్ష్మి అంటుంది. నేను అంటే నన్ను కొడుతుందని భయపడ్డా.. మీరెందుకు లేచారని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత సిరి వస్తుంది. తనకి ముందుగా ధన అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. అలా అందరు ఆశీర్వాదిస్తారు. సిరి దగ్గరికి రామలక్ష్మి, సీతాకాంత్ వెళ్ళబోతుంటే.. మీరు అవసరం లేదని సిరి అంటుంది. దాంతో సీతాకాంత్, రామాలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు. మీరు నా స్థాయి కాదు.. ఇంత చీప్ సారీ పట్టుకొని వస్తారా అని సిరి వారిద్దరిని అవమానిస్తుంది. నేను ఎంత చేసానో గుర్తు లేదా అని సీతాకాంత్ అనగానే.. అదంతా గొప్పలు చెప్పుకోవడానికి అని సిరి అంటుంది. చాలా బాగా అంటున్నావ్.. ఇన్ని రోజులు వాడి పార్టీ అనుకున్నాను కానీ నా పార్టీనే అని శ్రీలత మురిసిపోతుంది. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావ్.. ఇలా అంటున్నావని రామలక్ష్మి అంటుంది . మీరు నా భర్తని చేతకాని వాడు అంటూ తిట్టారు కదా అని సిరి అంటుంది. వచ్చాం కదా మీరు ఆశీర్వాదించండి అని సీతాకాంత్ కి అక్షింతలు ఇస్తుంది రామలక్ష్మి. సీతాకాంత్ ఆశీర్వదించబోతుంటే వద్దు ఇక వెళ్ళండి అని సిరి అంటుంది. దాంతో బాధపడుకుంటూ ఇద్దరు వెళ్తారు. సీతాకాంత్ ఒక దగ్గర ఆగి సిరి అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.