పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ళ నటుడు మృతి!

అతని వయసు కేవలం 22 సంవత్సరాలు. నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అతని ప్రతిభను చూసి దర్శకనిర్మాతలు కూడా అవకాశాలు ఇస్తున్నారు. కెరీర్‌ పరంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్న అతన్ని మృత్యువు కబళించింది. అతని పేరు అమన్‌ జైస్వాల్‌. శుక్రవారం రాత్రి ముంబైలోని జోగేశ్వరి హైవేలో బైక్‌పై వెళుతున్నాడు అమన్‌. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళిన అరగంటకే అమన్‌ మృతి చెందాడు. ఓ సీరియల్‌ ఆడిషన్‌ కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అమన్‌ ‘ధర్తిపుత్ర నందిని’ సీరియల్‌ ద్వారా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సోనీ టీవీలో ప్రసారమైన ‘ పుణ్యశ్లోక్‌ అహల్యాబాయి’ సీరియల్‌లో యశ్వంత్‌రావు పాత్రను అమన్‌ పోషించారు. 2021లో ప్రారంభమైన ఈ సీరియల్‌ 2023లో ముగిసింది. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన అమన్‌ ఆ తర్వాత సీరియల్స్‌తో బాగా పాపులర్‌ అయ్యాడు. అతను నటుడే కాదు, మంచి గాయకుడు కూడా. అతని మరణం పట్ల టీవీ రంగానికి చెందిన సహ నటీనటులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Illu illalu pillalu : ఆ ఇంట్లో మనుషులు కరుగరు.. నీకు అలాంటి ప్రేమ దొరుకుతుంది!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -58 లో.... భద్రవతి, సేనాపతి ఇద్దరు ప్రేమ చేసిన పనిని గుర్తుచేసుకొని బాధపడతారు. మరొకవైపు ప్రేమ కిటికీలో నుండి తన ఇంటికి చూస్తూ బాధపడుతుంటే.. వేదవతి వస్తుంది. నేను ఇలాగే చూసాను కానీ ఆ ఇంట్లో మనషులు మాత్రం కరుగరు. నేను ఆ బాధని అనుభవించాను.. ఇప్పుడు నా ప్లేస్ లో నువ్వు ఉన్నావ్. నా భర్త ప్రేమ తో నేను మర్చిపోయాను.. నీకు అలాంటి ప్రేమ దొరుకుతుందనుకుంటున్నానని వేదవతి అంటుంది. ఆ తర్వాత తిరుపతి, చందు ఇద్దరు బయటకు వచ్చి పడుకుంటారు అసలు ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకోవడం ఏంటని తిరుపతి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి వాష్ రూమ్ ఎక్కడ ఉందని అడుగుతుంది. బయటుంది వెళ్ళమని అంటాడు. నాకు తెలియదని ప్రేమ అనగానే.. ధీరజ్ తీసుకొని వెళ్తాడు. అది చూసిన నర్మద, వేదవతి ఇద్దరు.. వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుంటారన్న హోప్ వస్తుందని అనుకుంటారు. ఆ తర్వాత నాకు ఆకలిగా ఉంది అత్తయ్య అని నర్మద అనగానే.. నీకు నాకు మాటలు లెవ్వు కానీ తిందాం పదా అని వేదవతి అంటుంది. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ లు.. ఇన్నిరోజులు గొడవపడ్డ విషయలు గుర్తుచేసుకొని ఇద్దరు ఒకరికొకరు కోపంగా చూసుకుంటారు. మరుసటిరోజు ఉదయం కామాక్షి చిన్నోడి పెళ్లికి కూడా ఆడపడుచు కట్నం రాలేదని ఫీల్ అవుతుంది అసలు ప్రేమని ప్రేమించిన విషయం ఎందుకు చెప్పలేదని ధీరజ్ ని చందు, సాగర్ అడుగుతారు. ఎక్కడ జరిగింది చెప్తాడోనని నర్మద వచ్చి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శౌర్య ఆపరేషన్ కోసం అయిదు లక్షలు కావాలన్న డాక్టర్.. కార్తీక్ కి సాయం చేసేదెవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -257 లో.... దశరథ్ ఇంటికి వస్తాడు. ఎవరో నా గదికి గడియ పెట్టారని సుమిత్ర అనగానే.. ఇది జ్యోత్స్న పని అయి ఉంటుందని దశరథ్ అనుకుంటాడు. దశరథ్ జరిగిన విషయంతో ఇంకా షాక్ లోనే ఉండి ఏదో ఏదో మాట్లాడుతుంటే.. నేను చేసిన పనిని డాడ్ చూసాడా ఏంటని జ్యోత్స్న కంగారుపడుతుంది. దశరథ్ షర్ట్ కి రక్తం ఉంటుంది. అది చూసి ఏమైందని సుమిత్ర కంగారుపడుతుంటే దారిలో ఒకరికి హెల్ప్ చేసానని దశరథ్ చెప్తాడు. ఆ హెల్ప్ చేసింది దాస్ కి అయితే కాదు కదా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శౌర్యని తీసుకొని వెళ్ళడానికి దీపని ఎలా ఒప్పించాలని కార్తీక్ కంగారుపడతాడు. నా ఫ్రెండ్ అర్జెంట్ గా బెంగళూరు వెళ్లాడు తనకి ఓ పాప ఇంకా అమ్మ ఉంది.. వాళ్ళ పాప దగ్గర శౌర్యని వారం రోజులు ఉంచమన్నాడు.. నేను ఉంచుతానని మాటిచ్చానని కార్తీక్ అంటాడు. మొదట దీప వద్దని అంటుంది కానీ ఆ తర్వాత కార్తీక్ దీపని ఓప్పిస్తాడు. మరుసటిరోజు ఉదయం డాక్టర్ తో కార్తీక్ మాట్లాడతాడు. అయిదు లక్షలు అడ్వాన్స్ కట్టాలని డాక్టర్ చెప్పగా.. సరేనని కార్తీక్ అంటాడు. అయిదు లక్షలు ఎలా ఏర్పాటు చెయ్యాలని కార్తీక్ అనుకుంటుండగా.. అప్పుడే దీప వచ్చి.. ఎందుకు అంత డబ్బు అని అడుగుతుంది. రెస్టారెంట్ కి అని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. కానీ దీపకి మాత్రం డౌట్ వస్తుంది.  కాసేపటికి కార్తీక్ తన ఫ్రెండ్ ని డబ్బు అడుగుతాడు. నువ్వు ఇగోకి వెళ్లి ఈ పరిస్థితికి వచ్చావ్.. మీ తాతయ్యకి సారీ చెప్పమని అతను అంటుంటే.. కార్తీక్ తనపై కోప్పడతాడు. దాంతో అతను వెళ్లిపోతాడు‌. అదంతా కాశీ చూసి.. ఎందుకు బావ నీకు అంత డబ్బు అని అడుగుతాడు. దాంతో శౌర్య గురించి కాశీకి చెప్తాడు కార్తీక్. ఈ విషయం అక్కకి తెలియదా అని కాశీ అడుగగా.. తెలియదని కార్తీక్ చెప్తాడు. మరి నన్నెందుకు అడగలేదని కాశీ అనగానే.. పరిస్థితి చూసి ఎలా అడుగుతానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : నా కూతురిని కష్టపెడుతున్నావ్.. మామ మాటలకి బాధపడ్డ అల్లుడు! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -304 లో.....శ్రీవల్లి జీన్స్ వేసుకొని స్టైల్ గా మోడ్రన్ గా తయారవుతుంది. తనని చూసి ఏంటే ఈ అవతారమని శ్రీలత అడుగగా.. రిచ్ వాళ్లు ఇలాగే ఉంటారంటూ మాట్లాడుతుంది శ్రీవల్లి. తన అవతారం చూసి సిరి నవ్వుకుంటుంది. మరొకవైపు సీతకాంత్ వస్తుంటే మాణిక్యం కన్పిస్తాడు. అల్లుడు ఎక్కడకి వెళ్లారంటూ అడుగుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారని సీతాకాంత్ , రామలక్ష్మిలని మాణిక్యం అడుగగా.. నేను మా ఆయన ఆటో నడుపుతూ గౌరవంగా ఉంటున్నామని రామలక్ష్మి చెప్తుంది. నీకు ఎన్నోసార్లు మీ అమ్మ గురించి చెప్పాను కానీ నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు నా కూతురిని కష్టపెడుతున్నావని మాణిక్యం అనగానే.. నా భర్త ని ఎవరు బాధపెట్టిన నేను ఊరుకోను.. అది తండ్రి అయినా సరే అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాత్రి సీతాకాంత్ భోజనం చేయకుండా మాణిక్యం అన్న మాటలకి బాధపడుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతుంది. మాణిక్యం ఒక తాగుబోతులాగా మాట్లాడితే పట్టించుకోకపోయేవాడిని కానీ ఒక తండ్రిలా నా కూతురుని కష్టపెడుతున్నావని అడిగాడని సీతాకాంత్ అంటాడు. దాంతో సీతాకాంత్ ఆ బాధ నుండి బయటకు వచ్చేలా డైవర్ట్ చేస్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత మరుసటిరోజు ధన, సందీప్, శ్రీవల్లి, శ్రీలత లు మాట్లాడుకుంటారు. అయిదు కోట్లకు రెట్టింపు వచ్చే ప్లాన్ లో ఉంటే సీతాకాంత్ వచ్చి పాడు చేసాడని అనుకుంటారు. వాళ్ళకి సిరి సెటైర్ వేస్తుంటుంది. ఆ ఐడియా ఏదో బావగారిని మనమే అడుగుదామని సీతాకాంత్ లైవ్ ప్రోగ్రాం కి కాల్ చేస్తుంది శ్రీవల్లి. వాళ్లకు రామలక్ష్మి, సీతాకాంత్ లు కౌంటర్ వేస్తారు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వెళ్తుంటే.. ఒక అమ్మాయి చదువుకోనని అంటుంటే పెద్దావిడ బ్రతిమిలాడుతుంది. వాళ్ళ దగ్గరికి రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని ఇరికించేసిన రుద్రాణి.. తనతో మాట్లాడొద్దన్న అత్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -621 లో.... కావ్య నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టిందని రుద్రాణికి చెప్తాడు రాహుల్. దాంతో దాన్ని నిరూపించే సాక్ష్యం తీసుకొని రమ్మని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్నని రెడీ చేస్తున్న దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. అదేంటి కావ్య మెడలో నగలు లేవు.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని అంటుంది. అసలు ఉన్నాయా నగలు అని రుద్రాణి అనగానే.. ఉన్నాయని కావ్య అంటుంది. నా కోడలిని ఇలా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చాదని అపర్ణ తన మెడలో ఉన్న బంగారం కావ్య మెడలో వేస్తుంది. దాంతో కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత స్వప్నకి శ్రీమంతం జరుగుతుంది. అందరు స్వప్నని ఆశీర్వదిస్తారు. కాసేపటికి అందరు భోజనం చేస్తుంటారు. మళ్ళీ రుద్రాణి వచ్చి నాన్న హాస్పిటల్ బిల్ కావ్య ఎలా కట్టిందో తెలుసా వదిన.. ఇంటి కోడలుకి ఇచ్చిన నగలు తాకట్టు పెట్టి డబ్బు కట్టుందని అనగానే అందరు షాక్ అవుతారు.  కావ్య అలా ఎప్పటికి చెయ్యదని ఇంట్లో వాళ్లు అనడంతో ఇదిగో రిసీప్ట్ అని ఫోన్ లో అందరికి చూపిస్తుంది‌. అది చూసి అందరు షాక్ అవుతారు. ప్రతీసారీ ఎందుకు అత్త ఎదో గొడవ చేయ్యాలని ట్రై చేస్తారని రుద్రాణిపై రాజ్ విరుచుకుపడతాడు. తరువాయి భాగంలో ఇప్పుడు అసలు నిజం చెప్పమని కావ్యని అపర్ణ అడుగుతుంది. కావ్య చెప్పకపోవడంతో ఇకనుండి నువ్వు నాతో మాట్లాడకని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu :  గదిలో ధీరజ్, ప్రేమల గొడవ.. తన ఇంటివైపు చూసి బాధపడుతుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం  నాటి ఎపిసోడ్ -57 లో.. ఇంట్లో అందరు డల్ గా కూర్చొని ఉంటారు. చందు ధీరజ్ దగ్గరికి వచ్చి.. మీరు మన గదిలోకి వెళ్ళండి. మేము వేరే గదిలో ఉంటామని అంటాడు. గదిలోకి ప్రేమ, ధీరజ్ లు వెళ్తారు. మీరు ఫ్రెషప్ అవ్వండి అని నర్మద ప్రేమకి బట్టలు ఇస్తుంది. ఆ తర్వాత నర్మదని సాగర్ పక్కకి పిలిచి.. ధీరజ్, ప్రేమల పెళ్లి గురించి నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అదేం లేదని నర్మద కవర్ చేస్తుంది. ఆ తర్వాత నర్మద, వేదవతిలు వంట చేస్తారు. నర్మద అందరిని భోజనానికి పిలుస్తుంది.  ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారు‌. వాళ్ళకి గదిలోకి భోజనం తీసుకొని వెళ్తుంది. మిగతా వాళ్లు భోజనం చేస్తుంటే గదిలో ప్రేమ, ధీరజ్ లు గొడవ పడుతుంటారు. అది విని వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఎందుకు అలా గొడవ పడుతున్నారని కామాక్షి వాళ్లు అనుకుంటారు. దాంతో వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారని నార్మద కవర్ చేస్తుంది. ఆ తర్వాత నార్మద, వేదవతిలు ప్రేమ, ధీరజ్ ల దగ్గరికి వెళ్లి మీ గొడవ బయటకు వినిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి.  రెండు కుటుంబాలా గురించి అలోచించి సర్దుకుపోండి అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ప్రేమ, ధీరజ్ లు సైలెంట్ అయిపోతారు‌. ధీరజ్ తన ప్లేట్ తీసుకొని తింటూ ప్రేమకి ఒక ప్లేట్ ఇస్తాడు. ప్రేమ  భోజనం చేస్తుంది. వేదవతి, రామరాజుల దగ్గరికి వస్తుంది. తను జరిగిన దానికి బాధపడుతుంటాడు. వేదవతి వెళ్లిపోతుంది. మరొకవైపు ప్రేమ తన ఇంటివైపు చూస్తూ బాధపడుతుంటే వేదవతి వెళ్తుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దాస్ ని కాపాడిన దశరథ్.. జ్యోత్స్న నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -256 లో..... దాస్ ఎక్కడ నేను అసలైన వారసురాలిని కాదన్న విషయం చెప్తాడేమోనన్న జ్యోత్స్న.. తన తలపైన కొడుతుంది. అది దశరత్ చూస్తాడు. ఎవరైనా చూస్తారేమోనని దాస్ ని బలవంతంగా జ్యోత్స్న తన కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంది. జ్యోత్స్న ఎందుకు కొట్టింది ఎక్కడికి తీసుకొని వెళ్తుందని దశరథ్ తననే ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు. జ్యోత్స్న ఒక దగ్గరికి దాస్ ని తీసుకొని వెళ్లి.. వీడు ఇంకా చావలేదు. వీడు బ్రతికుంటే నా గురించి నిజం చెప్తాడని రాయితో కొట్టబోతుంటే దశరథ్ చాటు నుండి హారన్ సౌండ్ చేస్తాడు. దాంతో ఎవరో వస్తున్నారని జ్యోత్స్న పారిపోతుంది. వెంటనే దశరథ్ వచ్చి దాస్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు డాక్టర్ అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు కార్తీక్. దీపకి ఏం చెప్పాలో ఏంటోనని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు సుమిత్రని గదిలో ఉండగా బయట నుండి జ్యోత్స్న గడియపెడుతుంది. సుమిత్ర డోర్ కొట్టడంతో పారిజాతం డోర్ తీస్తుంది. ఎవరు గడియ పెట్టారని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే జ్యోత్స్న కంగారుగా ఇంటికి వస్తుంది. మరొకవైపు జ్యోత్స్న చేసిన పనికి దశరథ్ ఇంకా షాక్ లోనే ఉంటాడు. అపుడే డాక్టర్ వచ్చి తన కండిషన్ బాగోలేదు. సీరియస్ అని చెప్తాడు. ఒరేయ్ వాడు నా తమ్ముడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాడు బాగుండాలని దశరథ్ తన ఫ్రెండ్ అయిన డాక్టర్ కి చెప్తాడు. దాస్ దగ్గరికి దశరథ్ వెళ్లి.. నువ్వు నాతో చెప్పాలనుకున్న విషయమేంటి.. జ్యోత్స్న ఎందుకు నిన్ను చంపాలనుకున్నది.. నువ్వే చెప్పాలి అప్పటి వరకు ఎవరిని అడగనని దశరత్ అనుకుంటాడు. మరొకవైపు శౌర్యకి ఏమైందని దీప అడుగుతుంది. ఏం లేదని కార్తీక్ కవర్ చేస్తాడు. ఆపరేషన్ కి యాభై లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు కార్తీక్. మరొకవైపు జ్యోత్స్న కంగారుగా డాడ్ ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడే దశరథ్ వస్తాడు. డాడ్ ఏంటి నావైపు కోపంగా చూస్తున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అక్కడ భద్రాన్ని చూసి సీతాకాంత్ షాక్.. పాష్ గా రెడీ అయిన శ్రీవల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -303 లో.... సీతాకాంత్, రామలక్ష్మి ల దగ్గరికి సన్నీ వస్తుంది. మీరు చేసిన ప్రోగ్రామ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేద్దామని అంటుంది. దాంతో రెడీ అయి వస్తామని సీతాకాంత్ అంటాడు కానీ ఈ లైవ్ ప్రోగ్రాం రోజులో ఒక అరగంట మాత్రమే ఉంటుందని చెప్పు సన్నీ అని రామలక్ష్మి చెప్పగానే.. ఎందుకలా అని సీతాకాంత్ అడుగుతాడు. రోజు అంత ఇలా లైవ్ చేస్తూ వాళ్ళకి సమాధానం చెప్తుంటే వాల్యూ ఉండదు.. పైగా టైమ్ పాస్ కి కూడా కాల్ చేస్తుంటారని రామలక్ష్మి అంటుంది. దాంతో సరేనని సన్నీ అంటుంది. రామలక్ష్మి నీకు ఎంత తెలివి ఉందని సీతాకాంత్ పొగుడుతాడు. ఆ తర్వాత సీతాకాంత్ లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఫేమస్ అవుతాడు. దాంతో ఒకతను ఫోన్ చేసి మీరు మంచి సలహాలు ఇస్తున్నారు. మీరు మా ఆఫీస్ కి రండీ అని అడుగుగా సీతాకాంత్ సరే అంటాడు. అదే విషయం రామలక్ష్మికి చెప్పగా తను చాలా హ్యాపీగా ఫీల్ అయి ఆఫీస్ కి మీరు ఇలా వెళ్తారా మంచి షర్ట్ ఉందేమో చూస్తానని ఒక షర్ట్ తీసుకొని వచ్చి చెంబుతో ఐరన్ చేసి ఇస్తుంది. సీతాకాంత్ ని ఆఫీస్ కి రెడీ చేసి పంపిస్తుంది. తనే స్వయంగా అటోలో ఆఫీస్ వరకు దింపి అల్ ది బెస్ట్ చెప్తుంది. మరొకవైపు సీతాకాంత్ కోసం మురళి అనే వ్యక్తి సందీప్, భద్రమ్ ధన వాళ్ళతో కలిసి వెయిట్ చేస్తుంటాడు. సీతాకాంత్ రావడం చూసి ధన వాళ్లు షాక్ అవుతారు. మీరు అన్న వ్యక్తి అతనేనా అని మురళితో భద్రం అంటాడు. ఆ తర్వాత ఒరేయ్ భద్రం నీకు డబ్బు ఎలా వచ్చిందో తెలుసురా.‌. మర్యాదగా డబ్బు అందరికి తిరిగి ఇచ్చేయ్ అని సీతాకాంత్ అంటాడు. సీతాకాంత్ నా ముందే నా మనిషిని తిడుతావా వెళ్ళమని సీతాకాంత్ ని పంపిస్తాడు మురళి. మరొకవైపు శ్రీవల్లి పాష్ గా రెడీ అవుతుంది. దాంతో శ్రీలత ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆ నగలు చూసి స్వప్న హ్యాపీ.. రుద్రాణి కొత్త ప్లాన్ అదేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -620 లో.....రాజ్ ఏదో కవర్ లో పట్టుకొని వస్తుంటే కావ్య తన కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాడేమోనని మురిసిపోతుంది. నాకు గిఫ్ట్ ఎందుకు అండి చిన్న చాక్లెట్ ఇచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతానని రాజ్ తో కావ్య అనగానే.. అంత ఉహించుకోకని రాజ్ ఆ కవర్ ఇస్తాడు. అది కావ్య ఓపెన్ చేస్తుంది. ఇవి స్వప్న అక్క వద్దన్న నగలు కదా అని కావ్య అంటుంది. అవును నువ్వు ఆ రోజు కోప్పడ్డందుకు స్వప్న మనసు చిన్నబుచ్చుకుంది. నువ్వు ఈ రోజు ఇవి తీసుకొని వెళ్లి ఇవ్వమని రాజ్ అంటాడు. అవునా అందరి బాధలు అర్థం చేసుకుంటావ్ నా బాధ తప్ప అని కావ్య అంటుంది. మరొకవైపు రుద్రాణి విరిగిన కుర్చీలో కూర్చొబోతుంటే అప్పుడే శ్రీమంతం శ్రీను వచ్చి వద్దని అంటాడు. నువ్వు ఆపితే నేనెందుకు ఆగాలని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు అతనిపై కోప్పడతారు. అప్పుడే కనకం వచ్చి వాడు వద్దని అంటున్నాడు కదా వద్దు అని అంటుంద.  అయినా రుద్రాణి కూర్చొని కిందపడుతుంది. దాంతో నేను చెపితే విన్నారా అంటూ శ్రీమంతం శ్రీను అంటాడు. ఆ తర్వాత స్వప్నని అపర్ణ రెడీ చేస్తుంటే.. కావ్య నగలు తీసుకొని వచ్చి ఇవ్వడంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది రుద్రాణి చూసి ధాన్యలక్ష్మికి చెప్తుంది. మాకు టీ టిఫిన్ లు కూడా కంట్రోల్ చేసావ్.. ఇప్పుడు ఏకంగా మీ అక్కకి నగలు తీసుకొని వచ్చావని గొడవ పడుతుంటే రాజ్ వచ్చి ఆ నగలు తీసుకొని వచ్చింది నేను అని గొడవ సర్దుమనుగుతాడు. ఆ తర్వాత రుద్రాణిని రాహుల్ పక్కకి పిలిచి.. కావ్య నగలు తాకట్టు పెట్టి తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టిందట అని చెప్తాడు. ఇప్పుడు చూడు ఎలా గొడవ చేస్తానోనని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణి కావాలనే కావ్యకి అపర్ణ ఇచ్చిన నగలు గురించి అడుగుతుంది. అవి జాగ్రత్తగానే ఉన్నాయా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: కన్నతండ్రిని ఇనుపరాడ్ తో కొట్టిన కూతురు.. ప్రమాదపు అంచున దశరథ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం-2 (Karthika Deepam2)'.. దీప, కార్తీక్‌ల మాటలు విని.. జ్యోత్స్నని క్షమించకూడదని దాస్ నిర్ణయించుకుంటాడు. దీప టిఫెన్ బండిని కాల్సించింది జ్యోత్స్న అని దాసు చాటుగా వినేస్తాడు. జ్యోత్స్నా.. నీ పాపాలు ఇక పండిపోయాయి. నిన్ను క్షమించను.. దీపే వారసురాలు అనే నిజాన్ని వెంటనే అన్నయ్యా వదినలకు చెప్పి తీరతానని దాస్ బయలుదేర్తాడు. అనుకున్నట్లే జ్యోత్స్న రగిలిపోతుంటే రాత్రి అయ్యేసరికి దాసు ఆ ఇంటికి వస్తాడు. దాసు రావడం జ్యోత్స్న చూస్తుంది. గ్రానీ కొడుకు వచ్చాడంటే ఏదో కారణం ఉంది.. ఎందుకు వచ్చి ఉంటాడని మనసులో అనుకుంటూ జ్యోత్స్న బయటకి పరుగుతీస్తుంది. అయితే ఆమెతో పాటు ఉన్న పారిజాతం కూడా వెనుకే వెళ్తుంది. అయితే అనుకున్నట్లే.. దాసు.. శివనారాయణ కంటపడతాడు. ఎందుకొచ్చావంటూ దాస్ ని నిలదీస్తాడు.. శివనారాయణ. ఇంతలోనే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కిందకు వస్తారు. దాసు ఈ వేళ ఎందుకొచ్చావయ్యా అని అప్పుడే వచ్చిన సుమిత్ర అంటుంది. మాట్లాడాలి వదినా అనేలోపు ఇక శివనారాయణ రెచ్చిపోతాడు. పోతావా లేదా బయటికి అంటూ ఫైర్ అవుతాడు. దాంతో దాసు.. మౌనంగా వెళ్లిపోతాడు. శివనారాయణ కోపంగా లోపలికి వెళ్లగానే.. దాస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పాపం దాసు మంచివాడండి అని దశరథ్‌తో సుమిత్ర అంటే.. అందుకే అందరికీ దూరం అయ్యాడని దశరథ్ లోపలికి వెళ్లిపోతాడు బాధగా. ఇక సుమిత్ర కూడా వెళ్లగానే జ్యోత్స్న.. ఈ గ్రానీ కొడుకు నిజం చెప్పడానికే వచ్చినట్లున్నాడు. ఈ రెండు రోజులు మమ్మీ డాడీలను ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని జ్యోత్స్న మనసులో ఫిక్స్ అవుతుంది. మరునాడు శివన్నారాయణ‌ బయటకు వెళ్ళాక దాస్ వస్తాడు. ఎదురుగా దాసుని చూసిన జ్యోత్స్న బిత్తరపోతుంటే.. లోపల ఉన్నారు.. తలుపు ఎందుకు వేస్తున్నావంటూ నిలదీస్తాడు దాసు. ఎవరు లేరు నాన్నా.. నాతో రా.. ప్లీజ్ నాతో రా అంటూ దాస్ ని బలవంతంగా బయటికి దాకా లాక్కునిపోతుంది జ్యోత్స్న. ఇక దశరథ్ ఏమో పై వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సుమిత్ర ఏమో లోపల స్నానం చేస్తుంటుంది. ఇక బయటికి వచ్చాక చాలా సేపు.. చెప్పొద్దని జ్యోత్స్న.. చెబుతానని దాసు గొడవకు దిగుతారు. జ్యో చాలా రిక్వస్ట్ చేస్తుంది. ఇంతలో సుమిత్ర స్నానం చేసి.. చీర కట్టుకుని.. బయటికి వచ్చేసరికి తలుపు రాదు.. ఫోన్ వెతుక్కుంటూ ఉంటుంది. తలుపు కొడుతుంటుంది. ఇక జ్యోత్స్న మాట వినడు దాస్. సుమిత్రేమో బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ లోపు దశరథ్ వాష్ రూమ్‌కి వెళ్తి వస్తాడు. ఇక బయట రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక జ్యోత్స్నని దాస్ తోసేసి మరీ లోపలికి నడుస్తుంటాడు. నేను చచ్చినా ఈ నిజాన్ని దాచను.. చెప్పే తీరతానని దాస్ వెళ్తుంటాడు. ఇక అప్పుడే చేతికి దొరికిన ఇనుప రాడ్‌తో వెనుక నుంచి దాసుని తలమీద కొట్టేస్తుంది జ్యోత్స్న. దాంతో దాస్.. ఆ అని పెద్ద అరుపు అరిచి అన్నయ్యా అని తలపట్టుకుంటాడు. ఆ అరుపుకి దశరథ్ పైన బాల్కనీలోకి వచ్చి చూసి.. ఎవరు అంత గట్టిగా అరిచారంటూ చూస్తుంటాడు. అప్పుడే దశరథ్ అరే దాసు అంటూ ఉంటాడు. తరువాయి భాగంలో దాసు వెనుక జ్యోత్స్న ఇనుపు రాడ్‌తో రగిలిపోతూ చూస్తున్నట్లు దాన్ని దశరథ్ చూస్తున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పొట్టి డ్రెస్ తెచ్చిన తంటా..భాస్కర్ కి క్లాస్ పీకేసిన లేడీస్!

బులెట్ భాస్కర్ కి ప్రియాంక జైన్ కి బాగా గొడవ జరిగింది. ఫామిలీ స్టార్స్ ఈ రాబోయే వీక్ ఎపిసోడ్ ప్రోమోలో ఈ గొడవ కనిపిస్తుంది. దాంతో ప్రియాంక జైన్ కాస్తా స్టేజి మీద నుంచి కిందకి దిగి వెళ్ళిపోయింది. అసలేమయ్యిందో చూద్దాం. స్టేజి మీద షో మామూలుగానే జరుగుతూ ఉండగా బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో ప్రియాంక స్టేజి మీదకు వచ్చింది. ఇక వెంటనే బులెట్ భాస్కర్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో డ్యూయెట్ సాంగ్ వచ్చేసరికి ఆమెతో కలిసి డాన్స్ చేసాడు. ఐతే స్టెప్స్ వేసేవాడు కాస్తా ఆమెను రెండు చేతుల మీద ఎత్తి గిరగిరా తిప్పేసాడు. ఆ హఠాత్పరిణామానికి ప్రియాంక కూడా షాకయ్యింది. వెంటనే ఆమెను దింపేసాడు భాస్కర్. "చూసుకోవచ్చు కదా డ్రెస్ బాలేదు, లిఫ్ట్ చేయొద్దు అని చెప్పాను కదా" అంది సీరియస్ గా. దానికి భాస్కర్ షాకయ్యాడు. "అదేదో ముందు చెప్పాలండి..వచ్చిన తర్వాత కంఫర్టబుల్ గా లేదు అంటే ఎలా ఉంటుంది" అన్నాడు రివర్స్ లో సీరియస్ గా. "లిఫ్ట్ చేస్తారని తెలీదు కదా మాకు" అంది ప్రియాంక. వాళ్ళ మాటలకు మధ్యలో పాగల్ పవిత్ర ఎంట్రీ ఇచ్చి..."నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. తన డ్రెస్ కంఫర్ట్ గా లేదు" అని చెప్పింది. ఇక లేడీస్ అందరూ తగులుకునేసరికి భాస్కర్ పరువు పోయింది అని భావించి ఎం మాట్లాడాలో అర్ధం కాక "వేసుకునే వాళ్లకు తెలుస్తుంది..చూసేవాళ్లకు ఎం తెలుస్తుంది కంఫర్ట్ గా ఉందో లేదో అని" అంటూ రివర్స్ లో ఆన్సర్ చెప్పాడు. ఆ మాటకు ప్రియాంక జైన్ సమాధానం చెప్పకుండా స్టేజి మీద నుంచి కిందకి దిగి వెళ్ళిపోయింది.

Brahmamudi: రుద్రాణి తిన్న ప్లాస్టిక్ పండు.. ఒక్కో చెంపదెబ్బకి వంద అంటూ సీమంతం శ్రీను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-619 లో.. ఇక రుద్రాణి ఎప్పుడైతే నగలు తేవడానికి రాజ్‌ని పంపించు అందో వెంటనే రాజ్ కంగారుపడతాడు. ఈ మాత్రానికి ఆయన్ని అంతదూరం పంపించడం దేనికీ.. ఏం ఫర్వాలేదు.. నేను బాగానే ఉన్నానని కవర్ చేసి ముందుకు నడుస్తుంది కావ్య. ఇక దాంతో ఆ రచ్చ అక్కడితో ఆగుతుంది. ఇక కనకం, సీమంతం శ్రీనుతో మంతనాలు జరుపుతుంటే.. కృష్ణమూర్తి వచ్చి వాళ్లతో మాట్లాడుతుంటారు. కాసేపటికి దుగ్గిరాల వారు నడుచుకుంటూ అక్కడికి వస్తారు. ఇక రుద్రాణి, రాహుల్ ఇద్దరూ కలసి కనకం చేసిన ఏర్పాట్లను ఛీప్‌గా మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటారు. ఆ మాటలకు తన సీమంతం అంత ఛీప్‌గా జరుగుతున్నందుకు స్వప్న ఏడుపు ముఖం పెట్టుకునే ఉంటుంది. చాలా బాధపడుతుంది. ఇక రుద్రాణి, రాహుల్‌లకు ఎప్పటిలానే మిగిలిన వాళ్లంతా గడ్డి పెడతారు. హూ.. ఇక్కడ సీమంతం చేస్తానన్నప్పుడే నా ఆశలు సగం చచ్చిపోయాయి.. ఇక్కడకి వచ్చాక పూర్తిగా చచ్చిపోయాయి. నాకు అసలు నచ్చలేదు.. ఏంటమ్మా ఇలా చేశావ్.. ఛీ అని ఆవేశంగా స్వప్న బాధగా బయటికి వెళ్లిపోతుంది. వెనుకే కావ్య పరుగుతీస్తుంది. నా పెద్దకూతురిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా.. అది అంతా.. ముందు గొడవ చేస్తుంది.. తర్వాత అర్థం చేసుకుంటుంది.. రండి కూర్చోండి.. లోపలికి రండి అంటూ కనకం అందరిని ఆహ్వానిస్తుంది. రండి అని కృష్ణమూర్తి కూడా పిలవడంతో అంతా లోపలికి నడుస్తారు. ఇక స్వప్న ఏడుస్తుంటే కావ్య వెనుకే వచ్చి.. అక్కా ఏంటిది చిన్న పిల్లలా అందరి ముందు అలా అలిగి వచ్చావేంటని అంటుంది. ఈ ఇంట్లో అలగడానికి కూడా లేదా? అంతా నా కర్మ అని స్వప్న అంటుంది. లేదు ఇది నీ అదృష్టం.. ఆస్తులుంటే అంగరంగ వైభవంగా సూపర్‌గా చేయగలం.. అంతేగా.. రిటర్న్ గిఫ్ట్ కోసం వచ్చే బంధువులు కాదు కదా మనకు కావాల్సింది.. అక్కడికి వచ్చేవాళ్లంతా మన దగ్గరున్న డబ్బుని చూసి వస్తారు. మనం ఎంత గ్రాంఢ్ గా చేసినా ఏదొక వంక పెట్టడానికి ఎదురుచూస్తారంటూ స్వప్నను ఆలోచింపచేస్తుంది కావ్య. అదే ఇక్కడనుకో నాన్న తాటకులతో పందిరి వేసినా.. మామిడి ఆకులతో తోరణాలు కట్టినా అది మన సంసృతిని సంప్రదాయాన్ని తెలియచేస్తుంది. మన దగ్గరకు వచ్చేవాళ్లు మన డబ్బుని చూసి రాకూడదు.. మనం పంచే అభిమానాన్ని ప్రేమల్ని అందుకోవడానికి అంతే అభిమానంగా రావాలి.. అది ఇక్కడ కావాల్సినంత దొరుకుతుంది. నేను చెబుతున్నాను కదా.. ఇక్కడ జరిగే సీమంతం చూసి నీ కడుపు నిండిపోతుంది చూస్తూ ఉండు.. అసలు నువ్వు ఒక విషయం మరిచిపోతున్నావ్ అక్కా.. మనం ఇక్కడే పుట్టి పెరిగామని స్వప్న చేతులు పట్టుకుంటూ కావ్య చెప్తుంటే స్వప్న వింటుంది. కావ్య మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క గడప మనకు తెలుసు.. ప్రతి గడపకు మనమేంటో తెలుసు.. వచ్చేవాళ్లంతా నిన్ను చూసి ఆప్యాయంగా పలకరిస్తుంటే నీకు సంతోషంగా ఉండదా? మనం ఇదే ఇంట్లో ఎన్ని ఆటలు ఆడుకున్నాం అక్కా ఒక్కటి కూడా గుర్తులేదా’ అంటూ ప్రేమగా అడుగుతుంది కావ్య. దాంతో స్వప్న ముఖంలో నవ్వు వస్తుంది. ఎందుకు లేదు.. నాకు చాలా గుర్తున్నాయంటూ ప్రతి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటుంది. మనం చిన్నప్పుడు అలా చేశాం.. ఇలా చేశామంటూ జరిగిందంతా గుర్తు చేసుకుని స్వప్న నవ్వుతూ చెప్తుంది. సారీ కావ్యా నేను ఇదంతా ఆలోచించలేదు.. అమ్మ బాధపడి ఉంటుంది కదా.. సరే నేను చాలా సంతోషంగా ఈ సీమంతం చేసుకుంటానని స్వప్న అంటుంది. థాంక్స్ అక్కా అని ప్రేమగా చూసి కావ్య వెళ్లిపోతుంది. ఇక రుద్రాణీ, ధాన్యలక్ష్మి కలసి అటుఇటు తిరుగుతూ.. మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా ఇంట్లో ఖర్చుల పేరుతో నాలుగు రకాల టిఫిన్స్ దొరకడం లేదు. కనీసం ఇక్కడైనా తిందామంటే మన వియ్యపురాలు కనకం ఉప్మా పెట్టింది.. ఛ అంటూ విసుగ్గా చెబుతుంటుంది. ధాన్యలక్ష్మి కూడా అవునన్నట్లు తలాడిస్తుంది. ఇంతలో రుద్రాణీకి సీమంతానికి పెట్టిన పండ్లు కనిపిస్తాయి. వెంటనే హమ్మయ్యా కనీసం పండు అయినా తినొచ్చని ఆ పండ్లలో ఒకదాన్ని అందుకోబోతుంది. అది చూసిన సీమంతం శ్రీను.. మేడమ్ అవి మీరు తినకూడదని అంటాడు. నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి అంటూ రుద్రాణి మళ్లీ పండు అందుకోబోతుంటే.. ఆపడానికి చేయి పట్టుకుంటాడు సీమంతం శ్రీను. నా చెయ్యి పట్టుకుంటావారా అని అతడిని లాగిపెట్టి కొట్టేస్తుంది రుద్రాణి. ఇక శ్రీను నోరెళ్లబెట్టి... దవడ మీద చేయి పట్టుకుని.. నన్నే కొడతావా అనేలోపు.. కనకం ఎంట్రీ ఇచ్చి.. శ్రీను మరో చేతిలో సైలెంట్‌గా వంద రూపాలు పెట్టేస్తుంది. దాంతో ఆవేశాన్ని తగ్గించుకుంటాడు శ్రీను. ఇక అవి తినొద్దు వదినగారు అని మర్యాదగా కనకం కూడా చెప్పినా వినకుండా.. నేను తింటానని కొరికి బిత్తరపోతుంది రుద్రాణి. ఇవి ప్లాస్టిక్ పండ్లు కదా.. వీటిని పెట్టారేంటీ.. ఇలా మాయ చేస్తున్నారా అది ఇది అంటూ రుద్రాణి రచ్చ చేయబోతుంటే.. అబ్బే ఇవి సీమంతం కోసం పెట్టిన పండ్లు కాదు.. అలంకరణ కోసం పెట్టాం అంతే అంటూ కవర్ చేసి రుద్రాణీని కనకం కూల్ చేసి పంపిస్తుంది. ధాన్యలక్ష్మి కూడా వెళ్లిపోతుంది. అయితే చెంప దెబ్బకు వంద.. ఫర్వాలేదు.. ఓ నాలుగు ఐదు కొట్టించుకుని డబ్బులు సంపాధించాలని శ్రీమంతం శీను ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: నిజం తెలిసి జ్యోత్స్నని ఉతికారేసిన దీప.. అంతా వినేసిన దాస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం-2. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-254లో.. నా సాయం మీరు తీసుకోవాల్సిందే.. మీ కష్టం నేను చూడలేనంటూ జ్యోత్స్న తెలివిగా మాట్లాడి.. కారు మీద వెళ్లిపోతుంది. అప్పుటికే కార్తీక్‌ని బాగా కోపంగా ఉంటుంది. జ్యోత్స్నలో ఇంత మార్పేంటని దాసు అనుకుంటాడు. ఇంతలో బావా.. బండి కాలడానికి కారణం అయిన వాళ్లను మాత్రం అసలు వదిలిపెట్టకూడదని కాశీ అంటాడు. వెంటనే కార్తీక్ రగిలిపోతూ.. టవల్ మెడలో వేసుకుని.. కాశీ నీ బండి తాళం ఇవ్వు అంటాడు. కాశీ ఇవ్వగానే.. బండి స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్లి.. దీపా.. కొన్నే కదా ఉన్నాయి.. అమ్మ అనసూయగారు అమ్ముతారులే.. నాతో రా అంటాడు కోపంగా. ఇప్పుడు ఎందుకు బాబు అని దీప అనగా.. ఎక్కు దీపా.. త్వరగా సరుకులు తెచ్చుకుందామని అంటాడు. ఇక కార్తీక్ బండి చాలా వేగంగా నడుపుతూ ఉంటాడు. ఇంత వేగం దేనికి బాబు.. కాస్త స్లోగా వెళ్లొచ్చుగా అని దీప అంటుంది. నీకు భయం వేస్తే నన్ను పట్టుకో. అంతే కానీ స్లోగా వెళ్లమని చెప్పకని కార్తీక్ అంటాడు. ఇక ఓ మలుపు దగ్గర జ్యోత్స్న కారుకి కార్తీక్ అడ్డం కొట్టి.. ఆ కారుని ఆపుతాడు.  ఇక కార్తీక్ ఆవేశంగా బండికి స్టాండ్ వేసి.. జ్యోత్స్న కారు ముందుకు వెళ్ళి.. హేయ్ కారు దిగు అంటూ అరుస్తాడు. ఏమైంది బాబు అంటూ ఉంటుంది దీప అనగానే.. ఇక జ్యోత్స్న కారు దిగకుండానే.. కొంపదీసి నేనే బండి కాల్పించిన విషయం బావకు తెలిసిందా అని జ్యోత్స్న కంగారుపడుతుంది. ఎందుకు చేశావ్ అని అంటాడు. ఏంటి బావా’ అంటుంది జ్యోత్స్న. దీపకు ఏం అర్థం కాదు. ఆవేశాన్ని సగం ఆపుకుని అడుగుతున్నాను.. చెప్పు ఎందుకు చేశావ్ అని కార్తీక్ అనగా.. ఏమైంది కార్తీక్ బాబు అని దీప అంటుంది. నాకు టూ మినిట్స్ టైమ్ ఇవ్వు దీపా.. రాత్రి నుంచి ఏం చెయ్యాలో తెలియక.. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక.. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేక నాకు నేనే చాలా ఇబ్బంది పడుతున్నాను.. ఈ టైమ్‌లో ఈ మహాతల్లి ఓదార్పు యాత్ర మొదలుపెట్టింది. చెబుతావా లేక పళ్లు రాలగొట్టమంటావా అని జ్యోత్స్నని కార్తీక్ బెదిరిస్తూ ఉంటే.. దీప అడ్డం పడుతుంది. తన జోలికి మనకెందుకు బాబు అంటూ జ్యోత్స్న, కార్తీక్‌కి మధ్యలో దీప నిలబడుతుంది. ఏం జరిగిందో సరిగా చెప్పండి బాబు అని దీప అడుగుతుంది. ఏం జరిగిందా.. మన టిఫెన్ బండి కాలిపోవడానికి కారణం తనే.. ఆ రౌడీ గాడి ఫోన్‌లో జ్యోత్స్న నంబర్ ఉంది. లిఫ్ట్ చేసి మాట్లాడే లోపు ఫోన్ తీసుకుని వాడు పారిపోయాడంటూ జరిగింది మొత్తం కార్తీక్ చెప్తాడు. అలా చెప్పగానే దీపలో ఆవేశం మొదలైపోతుంది. దీప అలా షాక్‌లో ఉండగానే కార్తీక్.. చెప్పు దీపా ఏం చెయ్యాలి ఈ మనిషిని.. ఆ బండి మన అమ్మ అన్నావ్.. కాల్చేసింది తనే అన్నప్పుడు తనని ఏం చెయ్యాలని కార్తీక్ అంటాడు. దాంతో దీప లాగిపెట్టి కొట్టేయగా.. జ్యోత్స్న బిత్తరపోయి చూస్తుంది. దీప ఆవేశంగా తాళిని చూపిస్తూ.. నా తాళిని బేరం పెట్టావ్.. వార్నింగ్ ఇచ్చి వదిలేశాను.. నా కారణంగా కార్తీక్ బాబుని ఇబ్బంది పెట్టావ్.. మారతావ్‌లే అని వదిలేశాను.. టిఫెన్ సెంటర్ క్లోజ్ చెయ్యాలని అధికారులని పంపించావ్.. అప్పుడూ వదిలేశాను.. వదిలేశాను కదా అని తగలపెట్టేస్తావా? ఎందుకు చేశావ్.. చెప్పవే.. ఇంత దుర్మార్గమైన దానిలా ఎలా తయారయ్యావే నువ్వు అంటూ దీప లాగిపెట్టి కొడుతూనే ఉంటుంది. ఎలా పుట్టావే.. ఆ మహా ఇల్లాలు కడుపునా అంటూ దీప, కార్తీక్ ఇద్దరూ జ్యోత్స్నని తిడుతుంటే.. నేను నిజంగానే ఆమె కడుపున పుట్టలేదని జ్యోత్స్న అనుకుంటుంది. నిజం తెలిస్తే ఇప్పుడు అమ్మ ఏడుస్తుంది దీపా.. వదిలేసెయ్ తనని అంటూ దీపను ఆపుతాడు కార్తీక్. ఇక మరోసారి ఇలా జరిగితే బట్టలు ఉతికినట్లు ఉతికి దండానికి ఆరేయడమే అని జ్యోత్స్నకి దీప వార్నింగ్ ఇస్తుంది. ఇక కార్తీక్ కూడా వార్నింగ్ ఇచ్చి.. దీపను బండి ఎక్కించుకుని వెళ్లిపోతాడు. ఇక అప్పటికే దాసు, కాంచన, అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లి ఏది అంటాడు కార్తీక్. ఇప్పుడే స్వప్న, కాశీ ఎక్కడికో వెళ్లాలని.. క్యాబ్‌కి వెళ్లారని దాస్ అంటాడు. సరే మావయ్యా వెళ్లేప్పుడు ఈ బండి తీసుకుని వెళ్లు అని అంటాడు. వాళ్లముందు నిజం చెప్పలేక కాస్త తడబడి.. కార్తీక్ ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటే.. బాబు మీరు లోపలికి పదండి బాబు అని దీప సముదాయించి లోపలికి తీసుకుని వెళ్తుంది. అమ్మకు ఈ నిజం చెప్పేయడమే కరెక్టేమో దీపా అని కార్తీక్ అనగా వద్దు బాబు అని దీప మాట్లాడుకోవడం దాసు వినేస్తాడు. అంటే టిఫెన్ బండిని కాల్పించింది జ్యోత్స్నా..? ఎంత పాపం.. జ్యోత్స్నా నీ పాపాలు పండిపోయాయి.. వస్తున్నా అని ఆవేశంగా అక్కడి నుంచి దాసు బయలుదేర్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: ప్రేమని పెళ్లి చేసుకుంది ధీరజ్ అని తెలుసుకున్న రామరాజు.. షాక్ లో ఇరు కుటుంబాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-55లో.. ప్రేమ తిరిగి ఇంటికి రావడంతో భద్రవతి అండ్ కో బ్యాచ్ తలో మాట అంటుంటారు. మా బాధని కడుపుకోతని అర్థం చేసుకుని వెనక్కి తిరిగి వచ్చావ్.. అది చాలు అని కూతుర్ని దగ్గరకు తీసుకోబోతూ.. ప్రేమ మెడలో తాళిని చూస్తుంది తల్లి రేవతి. మెడలో ఈ తాళి ఏంటే.. అంటే నీకు పెళ్లైపోయిందా? మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? ఇంతకి తెగించావే అని ప్రేమ చెంపలు చెల్లుమనిపిస్తుంది రేవతి. నీ మేనత్త నీకు బంగారం లాంటి సంబంధం చూస్తే.. ఇలా దొంగతనంగా పెళ్లిచేసుకోవాల్సిన అవసరం నీకేంటే?? పెళ్లి చేసుకుని వచ్చి ఈ కుటుంబాన్ని బజారుకి లాగాలని చూస్తావా? అని అంటుంది. ఇంతలో విశ్వ.. మా చెల్లి అమాయకురాలు.. ఎవరో దీన్ని మాయచేశారు. మాయ మాటలు చెప్పి తాళి కట్టారు? ఎవడాడు? నీ మెడలో తాళి కట్టింది ఎవరు? రేయ్.. ఎవడ్రా నువ్వు రారా బయటకు దిగరా కారు అని అరుస్తాడు. వాడు ఎవడని? ఎదురింటి నుంచి రామరాజు కూడా కోపంగా చూస్తుంటాడు. ఇక వేదవతి అయితే.. శ్రీరామా శ్రీరామా అని దేవుడ్ని మొక్కుకుంటూ ఉంటుంది. రేయ్ కారు దిగరా అనేసరికి ధీరజ్.. కారు దిగుతాడు. కొడుకుని చూసి రామరాజు షాక్ అయిపోతాడు. అతనితోపాటు అక్కడున్న వాళ్లంతా స్టన్ అయిపోతారు. భద్రవతి అయితే నోరెళ్లబెట్టేస్తుంది. రేయ్ నువ్వా?? నా చెల్లెలి మెడలో తాళి కట్టింది నువ్వా.. ప్రేమ పేరుతో నా చెల్లెలి వెంట పడుతున్నావని నా చెల్లెలు చెప్పినప్పుడే నిన్ను చంపేయాల్సిందిరా.. తప్పు చేశాను. నా చెల్లెల్ని మోసం చేసి మెడలో తాళి కడతావా? నిన్ను చంపేస్తానంటూ వెళ్లి ధీరజ్ పీక పట్టుకుంటాడు విశ్వ. తమ్ముడు మీద చేయి పడేసరికి ధీరజ్ అన్నలు ఉరుక్కుంటూ వస్తారు. వేదవతి కూడా రేయ్.. ఆగండ్రా అంటూ వస్తుంది. రామరాజు మాత్రం షాక్‌లోనే ఉండిపోతాడు. ఇక సేనాపతి అయితే.. మన శత్రువు కొడుకు లేచిపోయి వాడి ముందు తలదించుకునేట్టు చేశావ్. మా పరువుని రోడ్డున పడేశావ్. తల ఎత్తకుండా చేశావ్ అని అంటాడు. అది కాదు నాన్నా అని ప్రేమ నోరు విప్పేసరికి.. మాట్లాడకు.. ప్రేమించడానికి ఈ అనాధ గాడి కొడుకే దొరికాడా నీకు అని రెచ్చిపోతుంది భద్రవతి. నిన్ను ఈ చేతులతో పెంచి పెద్ద చేసింది.. ఈ అవమానం పొందడానికా? పాతికేళ్ల క్రితం అది ఎలాగైతే చేసిందో.. నువ్వు కూడా అలాగే చేసి నా గుండెలపై తన్నావ్ కదే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది భద్రవతి. దాంతో సేనాపతి.. అక్కా నా కూతురు అమాయకురాలు.. ఇదంతా ఆ రామరాజుగాడి కుట్ర.. వాడి కొడుకుతో కావాలనే ఇదంతా చేయించాడు. వాడి రెండో కొడుకు లేపుకుని వెళ్లిపోయాడని మనం నవ్వాం కదా.. దానికి ప్రతికారం తీర్చుకుంటున్నాడు. అందుకే వాడి చిన్న కొడుకుతో నా కూతుర్ని లేపుకుని వెళ్లిపోమని చెప్పాడు. మనపై పగసాధిస్తున్నాడని అంటాడు. ఆ మాటతో వేదవతి.. అన్నయ్యా.. నోరు ముయ్.. దేవుడు లాంటి మనిషిపై నిందలు వేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు.. తనకి ద్రోహం చేసిన వాళ్లని కూడా క్షమించే గొప్ప మనసున్న మనిషి మా ఆయన అని అంటుంది వేదవతి. ఏయ్ నీకు మాట్లాడే అర్హత లేదు.. వీడేంటో వీడి నీఛమైన బతుకేంటో పాతికేళ్ల క్రితమే చూశాం.. అన్నంపెట్టిన ఇంటికే వెన్నుపోటు పొడవడం వాడికి వెన్నతో పెట్టిన విద్య అని అంటాడు సేనాపతి. ఇక భద్రవతి అందుకుని.. రామరాజుని నానా మాటలు అంటుంది. నీదీ ఒక బతుకేనా.. ఇలాంటి బతుకు బతకడానికి సిగ్గుగా లేదా.. అని అంటుంది. ఆమాటతో ధీరజ్‌కి కోపం తన్నుకొస్తుంది. ఏయ్ నోరు నోరు.. అదుపులో పెట్టుకో.. నన్ను అనండి భరిస్తా... కానీ మా నాన్న ఎవరైనా ఏమైనా అంటే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావ్.. మీ నాన్న పెద్ద మహాత్ముడా? మీ నాన్న నా చెల్లెల్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మీ అన్న దాన్ని లేపుకొచ్చాడు.. నువ్వు నా మేనకోడల్ని లేపుకెళ్లావ్.. అలాంటి మీరు మంచి మర్యాద గురించి మాట్లాడుతున్నారా? అని అంటారు. దాంతో ధీరజ్.. ప్రేమ వైపు చూస్తూ.. ఏయ్.. మీ వాళ్లు మా నాన్నని అన్ని మాటలు అంటుంటే అలా బొమ్మలా చూస్తున్నావ్ ఏంటే.. సమాధానం చెప్పు.. మన పెళ్లి వెనుక మా నాన్న ఉన్నారా.. నేను నిన్ను బలవంతంగా లేపుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నానా.. ఏం జరిగిందో చెప్పవే అని అంటాడు. ఏంట్రా నా చెల్లెల్ని లేపుకుని వెళ్లి మా ముందే బెదిరిస్తున్నావ్ అని ధీరజ్ పీక పట్టుకుంటాడు విశ్వ. ఇంతలో సేనాపతి లోపలికి వెళ్లి గన్ తెచ్చి.. ధీరజ్‌కి గురిపెడతాడు. రామరాజుని వేదవతి ఎంత వేడుకున్నా అడుగుముందుకు వేయడు. సేనాపతి గన్ గురిపెట్టి ధీరజ్‌ని కాల్చేస్తుండగా.. ఆపండి నాన్నా అంటూ ధీరజ్‌కి అడ్డుగా నిలబడుతుంది ప్రేమ. ధీరజ్ నన్ను బలవంతంగా తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోలేదు. నా ఇష్టంతోనే వెళ్లిపోయాను. ఎవరూ కుట్రలు చేయలేదు. నా ఇష్ట ప్రకారమే ఇదంతా జరిగిందని ప్రేమ అంటుంది. ఆ మాటతో అంతా షాక్ అవుతారు. చేసేది లేక.. భద్రవతితో పాటు సేనాపతి వాళ్లంతా లోపలికి వెళ్లిపోతారు. ఇక శారదాంబ అయితే ఆ కొత్త జంటని చల్లగా చూడు స్వామీ అని దేవుడ్ని వేడుకుంటుంది. మరోవైపు రామరాజు అయితే ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. జీవితాంతం తల ఎత్తుకోకుండా చేశావ్ కదరా.. గుండెలపై తన్నే పని చేశావ్ కదరా అని ఆవేశపడతాడు. అయితే దీనంతటికి కారణం అయిన వేదవతి.. అయ్యో.. మీ పెంపకాన్ని నిందించొద్దు.. దీనికి బలమైన కారణమే ఉండి ఉంటుంది.. వాడు మీ పరువుతీసే పని చేయడు అని అంటుంది. ఏంటి బుజ్జమ్మా.. ప్రేమ పెళ్లి చేసుకోవద్దని చెప్పాను కదా.. కానీ నా మాటని ఒక్కడైనా విన్నాడా.. పాతికేళ్లుగా నరకం చూస్తున్నా.. వీళ్లకి అర్థం కాదా.. అని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వీళ్ళ పెళ్లి ఎప్పుడో తెలుసా?

బుల్లితెర మీద నటీనటులు, యాంకర్ ల వయసుల గురించి తెలుసుకోవాలని చాలామంది ఆడియన్స్ తెగ ఆరాటపడిపోతుంటారు. ఐతే కొంతమంది చెప్తారు. కానీ మాగ్జిమం వాళ్ళు   వయసును చెప్పడానికి అస్సలు ఇష్టపడనే ఇష్టపడరు. ఐతే ఇప్పుడు హోస్ట్ ప్రదీప్, శ్రీముఖి వయసులు ఓపెన్ గా చెప్పేసారు. అది విన్న ఆడియన్స్ ఇంత చిన్న వయసా అనుకుంటున్నారు. సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ గా స్టార్ మాలో మా సంక్రాంతి వేడుక జరిగింది. ఈ షోకి యాంకర్ గా చేసిన ప్రదీప్ తాను నటించిన "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" మూవీ ప్రమోషన్ కి వచ్చాడు. అందులో శ్రీముఖి ప్రదీప్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది. దాంతో అసలు విషయం బయటపడింది. "ప్రదీప్ మాచిరాజు గారి అసలైన వయసు ఎంత" అని అడిగింది. "12 ఏళ్ళు . అదే నేను టీవీకి వచ్చి ఇన్నేళ్లు అయ్యింది" అన్నాడు. "అది కాదు మేము అడిగింది ఈ ప్రపంచంలో మీరు అడిగి పెట్టి ఎన్నేళ్లు అయ్యింది" అని అడిగింది. "నీ ఏజ్ చెప్పు" అని శ్రీముఖిని అడిగాడు. "నా ఏజ్ ఎందుకు" అంది శ్రీముఖి. "వయసు చెప్తే దాని నుంచి మైనస్ చేసుకుంటా" అన్నాడు. "నా వయసు 31 " అని చెప్పింది శ్రీముఖి. "ఐతే నా వయసు 35 . నేను ఎంత పెరిగినా నేను ఈ సీనియర్ యాక్టర్స్ ముందు చిన్నపిల్లాడిని  " అని చెప్పాడు ప్రదీప్. " ఇక నా లైఫ్ లో చాలా బ్రేకప్స్ జరిగాయి. కానీ వాటిని బ్రేకప్స్ గా తీసుకోలేదు. ఒక ట్రాఫిక్ సిగ్నల్ లా ఫీలవుతాను.  నా లైఫ్ లో బొచ్చెడు యుటర్న్ లు, డివైడర్లు, రెడ్ లైట్ లు. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. ఛి పో అంటే పక్కకు పోతాం అంతే..ఇక నా పెళ్లి ఎప్పుడు అంటే మా బాచిలర్స్ అధ్యక్షురాలు శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు" అంటూ సరదాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు.

మొదటి సారి బుల్లితెర షోలో గారెలేసిన వెంకీ మామ

"ఈ సంక్రాంతికి వస్తున్నాం" అనే మూవీ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఆడియన్స్ అందరినీ తెగ అలరించేసింది. ఇక ఈ మూవీ టీమ్ మొత్తం కూడా స్టార్ మాలో ప్రసారమైన "ఈ సంక్రాంతి వేడుక" షోకి వచ్చారు. మొదటిసారి బుల్లితెర మీద ఇలాంటి ఒక షోకి వచ్చి వెంకటేష్ ఆడియన్స్ ని అలరించారు. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోల్ కూడా వచ్చారు. ఇక వెంకీ మామతో శ్రీముఖి ఎన్నో విన్యాసాలు చేయించింది. వెంకీ మామ కూడా ఫుల్ ఎంజాయ్ చేసారు. అలాగే సీనియర్ నటులు, ట్రెండింగ్ నటులు చెప్పిన తీన్ మార్ డైలాగ్స్ ని వెంకీ మామ చాల శ్రద్దగా విని మరీ ఎంజాయ్ చేశారు. ఇక దీపికా రంగరాజు వెంకీ మామనే ఆట పట్టించింది. అలాగే వెంకీ మామ ఐశ్వర్య రాజేష్ ఫేస్ కి కళ్ళు పెయింట్ చేసి డాన్స్ చేశారు. ఆ తర్వాత వెంకీ మామతో శ్రీముఖి గారెలేయించేసింది. వెంకటేష్ కూడా చాలా స్పోర్టివ్ గా వచ్చి గారెలు వేశారు. ఇక స్టేజి మీద ఉన్న అందరి ఆనందం అంతా ఇంతా కాదు. "ఆన్ స్క్రీన్ లో గారెలేస్తున్నారు కానీ ఇంట్లో ఎప్పుడైనా గారెలు వేసారా" అని శ్రీముఖి అడిగింది. " గారెలు వేయడం ఇదే మొదటి సారి. కానీ నేను ఇంట్లో కోడి కూర, కోడి పులుసు, కీమా చేస్తాను" అని చెప్పారు వెంకటేష్. ఇక వెంకీ మామ వేసిన గార్లకు అవినాష్ వేలం పాట పెట్టాడు. ఫైనల్ గా పది లక్షలకు బేరం కుదిరేసరికి వెంకీ మామ ఐతే ఆ పది లక్షలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఎక్స్ ప్రెస్ హరి ఐతే లక్షల మంది అభిమానం మీకు ఉండగా లక్షలు ఎం చేసుకుంటారు అని పంచ్ వేసాడు. వెంటనే వెంకీ మామ అమ్మో అందరూ పంచులు మీద పంచులు వేస్తున్నారుగా అంటూ ఫుల్ ఎనెర్జీతో మాట్లాడారు. ఇక ఆ గారెలు ఐశ్వర్య రాజేష్ కి, అనిల్ రావిపూడి, హరికి, అవినాష్ కి, దీపికాకు  ముక్కలు చేసి మరీ తినిపించారు. దాంతో అందరూ ఫిదా ఇపోయారు. ఇంతలా ఏ హీరో కూడా స్టేజి మీదకు వచ్చి ఇలా గారెలు వేసి తినిపించిన వాళ్ళు లేరు అంటూ శ్రీముఖి చెప్పేసరికి అందరూ చప్పట్లు కొట్టారు.

Karthika Deepam2: దీప, కార్తీక్ ల పొట్టకొట్టిన జ్యోత్స్న.. బండి కాల్చేసిన బ్రతకగలం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం-2(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-253 లో.. ఇద్దరు రౌడీలు (వారిలో ఒకడు దీప కొట్టిన వాడు) దీప, కార్తీక్‌ల ఇంటి వైపు పెట్రోల్, అగ్గిపెట్టి పట్టుకుని వస్తారు. దీప కొట్టిన రౌడీ .. జ్యోత్స్నకు వీడియో కాల్‌లో కాంటాక్ట్‌లో ఉంటాడు. రేయ్.. తగలెట్టెయ్యండ్రా అని ఆర్డర్ వేస్తుంది జ్యో. ఇక ఆ రౌడీలు రగిలిపోతూ ఉంటారు. ఒకడు వీడియో కాల్‌లో జరిగేది చూపిస్తుంటే.. మరొకడు పెట్రోల్ పోసి.. దీప వాళ్ల టిఫెన్ బండిపై పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తూ ఉంటాడు. అయితే దీప వాళ్ల ఇంట్లో దీప, కార్తీక్, శౌర్య వరసుగా పడుకుంటారు. అనుకోకుండా దీపకు ఏదో ఉలికిపాటు మొదలై మెలువ వస్తుంది. జరిగేది అంతా వీడియో కాల్‌లో చూస్తూ.. జ్యో చాలా సంబరపడుతుంది. దీపా.. నీ జీవినాధారం కాలి బూడిద చేయబోతున్నా.. నీ మీద బోలెడంత నమ్మకంతో ఉంది కదా మీ అమ్మ.. అదే మా మమ్మీ.. అన్ని అన్ని ముక్కలవుతాయి ఈ దెబ్బతో’ అంటూ తగలెట్టేయండ్రా అంటుంది. ఇక నిప్పు అంటించేస్తాడు ఆ రౌడీలో ఒకడు. అయితే మంట పెద్దది కావడంతో.. ఆ వెలుగు ఇంట్లో మెలువగా ఉన్న దీప కంట పడుతుంది. అనుమానం వచ్చి కిటికీ దగ్గరకు వెళ్లి చూస్తుంది. ఇక తలుపు శబ్దం కాగానే.. మేడమ్ ఇంట్లో ఎవరో వస్తున్నారనంటూ పరుగు తీయబోయేలోపే.. దీప బయటికి వచ్చేస్తుంది. రేయ్ రేయ్ అంటూ ఉండగానే వాళ్లు పరుగు అందుకుంటారు. ఇక కాలిపోతున్న బండిని చూసి దీప కార్తీక్ బాబు కార్తీక్ బాబు అంటూ ఏడుస్తూనే పెద్దపెద్దగా అరుస్తుంది. ఉలిక్కిపడి లేచిన కార్తీక్.. దీప అరుపులా ఉందేంటని లేచి బయటికి పరుగున వస్తాడు. కాలిపోతున్న బండిని చూసి అల్లాడిపోతాడు. దీప ఏడుస్తూ.. వాళ్లు బండిని కాల్చేశారు బాబు అనడంతో.. వాళ్ల వెనుక కార్తీక్ పరుగుతీస్తాడు. దీప అక్కడే కూలబడి ఏడుస్తుంది. దీప అరుపులు, ఏడుపు విని.. అనసూయ ఆ తర్వాత కాంచన బయటికి వస్తారు. దీప ఏడుస్తూనే నేను తట్టుకోలేకపోతున్నాను.. ఇది మన జీవనాధారం కదా అత్తయ్యా అంటూ కుమిలికుమిలి ఏడుస్తుంది. ఇక కార్తీక్ ఆ రౌడీల వెంట పడి ఒకడ్ని పట్టుకుంటాడు. వాడు వెనక్కి తిరగేసరికి.. కార్తీక్ వాడ్ని గుర్తుపట్టి.. నువ్వా అంటాడు. అవునురా నేనే.. నన్ను ఆ రోజు కొట్టి పంపించారు కదా.. ఇప్పుడు నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది అంటాడు ఆ రౌడీ.  ఎలా ఉందో చూపిస్తానురా అని కార్తీక్ వాళ్లని బాగా కొడుతూ ఉంటాడు. కార్తీక్ ఫైట్ చేస్తుంటే ఆ రౌడీగాడి ఫోన్ కిందపడిపోతుంది. అయితే జ్యోత్స్న.. ఏమైంది.. ఎవరో వస్తున్నారు అన్నాడు.. తర్వాత ఏమైందో ఏంటో అని ఆ రౌడీ గాడికి కాల్ చేస్తుంటుంది. అయితే కార్తీక్ ఆ కింద పడిన ఫోన్ తీసుకుని జ్యోత్స్న నంబర్ గుర్తుపడతాడు. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే.. రేయ్ ఏమైందిరా.. పని అయ్యిందా అనే జ్యోత్స్న మాట విని.. బిత్తరపోతాడు కార్తీక్. ఇంతలో ఆ రౌడీలు పారిపోతూ.. పారిపోతూ ఆ ఫోన్ లాక్కుని వెళ్లిపోతారు. మొత్తానికి కార్తీక్‌కి జ్యోత్స్న క్రూరత్వం స్పష్టమైంది.దీప అలానే కాలిపోతున్న బండిని ఆపలేక.. నిలబడి చూడలేక.. ఏడుస్తూ అక్కడే కూలబడి ఏడుస్తుంటే.. కార్తీక్ వెనక్కి పరుగున వస్తాడు. దీపను ఓదారుస్తాడు. చుట్టూ జనాలు మూగుతారు. అయ్యో పాపం అంటుంటారు. కార్తీక్ బాబు.. మన జీవనాధారం బాబు.. అన్నం పెట్టే అమ్మ కాలిపోతుందని ఏడుస్తుంటుంది. ఇక అనసూయ కాంచన కూడా బాగా ఏడుస్తారు. కార్తీక్ మనసులో జ్యోత్స్న మాటల్ని ఆమె చేసిన పనిని తలుచుకుని విలవల్లాడతాడు కానీ ఎవరికి చెప్పడు. మరునాడు దాసు, కాశీ, స్వప్న అంతా కార్తీక్ ఇంటికి వస్తారు. ఆ తర్వాత జ్యోత్స్న కూడా వస్తుంది. బావా బండి కాలిపోయిందట కదా.. ఎవరో కాల్చేశారు అట కదా.. అలాంటి వాళ్లని ఊరికే వదిలేయకూడదు.. అవును దీప ఏది ఏడుస్తూ కూర్చుందా పాపం అంటూ నటిస్తూ మాట్లాడుతుంది జ్యోత్స్న. కార్తీక్‌కి కోపం వస్తున్నా ఆపుకుంటాడు. అప్పడే దీప వస్తుంది. ఏడుస్తూ కూర్చోవడానికి పోయింది బండి మాత్రమే.. బండిపోతే బల్ల పెడతాం..అంతే.. అంటూ దీప ఎంట్రీ ఇచ్చి.. అందరిని బయటికి తీసుకుని వెళ్తుంది. బల్ల మీద టిఫెన్స్ అన్నీ సర్దిపెట్టి ఉంటాయి. అనసూయ పచ్చడి పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. విన్నావ్‌గా నా భార్య మాట.. నీ సానుభూతి మాకు అవసరం లేదు.. వెళ్లు.. బండి పోతే బల్ల పెట్టాం.. బల్లపోతే సైకిల్ మీద ఇంటికి తిరిగి అమ్ముకుంటాం.. అది కూడా పోతే డబ్బాల్లో నింపుకుని నేను నా భార్య తిరుగుతూ అమ్ముకుంటామంటూ కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: ధీరజ్ కి గన్ గురిపెట్టిన సేనాపతి.. అడ్డుగా నిలబడ్డ ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-54లో.. ప్రేమని దగ్గరకు తీసుకున్న నర్మద.. ఒక గండం గట్టెక్కింది ఇప్పుడు ఇంకో గండం ఉంది. ఇప్పుడు ప్రేమని తీసుకుని ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి? అంటుంది. ఆ మాటతో వేదవతి.. ‘మా వాళ్లకి పంతమే ముఖ్యం నాలాగే దీన్ని కూడా ఇంట్లోకి రానివ్వరు’ అని అంటుంది. వాళ్ల సంగతిసరే.. మరి మామయ్య గారు ఏమంటారు? ఆయన ఎలా రియాక్ట్ అవుతారో’ అని అడుగుతుంది నర్మద. వీళ్ల పెళ్లి చేసినందుకు ఆయనకి నాపై చాలా కోపం వస్తుంది.. నా మొహం కూడా చూడరు నాతో మాట్లాడరు’ అని ఏడుస్తుంటుంది వేదవతి. అది కాదు అత్తయ్యా.. ప్రేమని కళ్యాణ్ అనేవాడు మోసం చేశాడు.. అందుకే ధీరజ్‌తో పెళ్లి చేయాల్సి వచ్చిందని చెప్తే.. అర్థం చేసుకుంటారు కదా అని అంటుంది నర్మద. దాంతో వేదవతి.. ‘లేదు.. లేదు... ప్రేమ ఒకడ్ని నమ్మి వచ్చి మోసపోయిందని అందరికీ తెలిస్తే.. ఆ అవమానాన్ని ప్రేమ తట్టుకోలేదు. కాబట్టి.. ప్రేమ.. బావని ప్రేమించింది. పెద్దవాళ్లు ఒప్పుకోరు కాబట్టి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందని చెప్తే.. దాని వల్ల ఎవరికీ బాధ ఉండదు. మా ఆయన నాపై కోపం చూపించినా.. నా మేనకోడలి గురించి నేను భరిస్తాను’ అని అంటుంది. ఆ మాటతో ధీరజ్.. వద్దమ్మా నాన్న దృష్టిలో నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు’ అని అంటాడు. అదేంట్రా అలా అంటున్నావ్ వేదవతి అంటే.. ‘అవునమ్మా.. ఈ పాతికేళ్లలో మీ ఇద్దరి మధ్య చిన్న మాట పట్టింపుకూడా రాలేదు. ఏ కుటుంబం అయితే నాన్నని అవమానిస్తూ వస్తున్నారో.. ఆ కుటుంబానికి చెందిన అమ్మాయితో నువ్వు పెళ్లిచేశావ్ అంటే నాన్న తట్టుకోలేరమ్మా.. ఆబాధని భరిస్తూ బతకలేరు. నీతో మాట్లాడకుండా నీపై కోపం చూపించడం అంటే.. నాన్నకి అంతకంటే నరకం ఉండదు. దయచేసి నాన్నకి ఆ నరకం ఇవ్వొద్దమ్మా’ అని అంటాడు ధీరజ్. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంట్రా.. ఈ బాధ్యతని ఎవరు తీసుకుంటారు మరి అని అడుగుతుంది వేదవతి. ఆ బాధ్యత నేను తీసుకుంటానమ్మా.. ఆ నిందని నేను భరిస్తా.. నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని నాన్నకి నేను చెప్తాను అని అంటాడు ధీరజ్. ‘రేయ్ వద్దురా.. ఇప్పటికే నీపై మీ నాన్నకి కోపం ఉంది.. ఆకోపం ఇప్పుడు ద్వేషంగా మారుతుంది అని అంటుంది వేదవతి. పర్లేదమ్మా.. నాన్న కోపం నాకు కష్టం కాదు.. ద్వేషాన్ని భరిస్తాను. కానీ.. నాన్న నీతో మాట్లాడకపోతే ఇటు నువ్వే కాదు.. నాన్నకి కూడా నరకమే.. నాన్న నువ్వు ఎప్పటివరకూ ఎలా ఉన్నారో.. ఇకపై కూడా అలాగే ఉండాలి.. అందరికీ ఆదర్శంగా నిలవాలి’ అని అంటాడు ధీరజ్. ఈ అమ్మ మాటకోసం దాని మెడలో తాళి కట్టావ్.. మీ అమ్మ బాధపడకూడదని.. ఆ నిందని నువ్వు భరిస్తానని అంటున్నావ్.. నువ్వు నిజంగా గొప్ప కొడుకువిరా.. నువ్వు నా కడుపున పుట్టడం నా అదృష్టం’ అని కొడుకుని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక భద్రవతి.. ప్రేమని తీసుకుని వెళ్లిన వాడు ఎవడో దొరికాడా?? వాడు ఎక్కడున్నా చావు భయం కనిపించాలి. వాడ్ని మన ఇంటి ముందే వాడ్ని ముక్కలు ముక్కలుగా నరకాలి’ అని అంటుంది. అవును అత్తా.. వాడి చావు మామూలుగా ఉండదు’ అని అంటాడు విశ్వ. పాతికేళ్ల క్రితం ఆ రామరాజుగాడు వేదవతిని ఎత్తుకెళ్లినప్పుడే వాడ్ని చంపాలని అనుకున్నాను. కానీ ఆరోజు వేదవతి అడ్డుపడటం వల్ల ఆ రామరాజు బతికిపోయాడు.ఇప్పుడు ఆ ప్రేమ అడ్డుపడినా.. చివరికి ఆ దేవుడే అడ్డుపడినా వాడ్ని బతకనిచ్చేది లేదు అని అంటుంది భద్రవతి. ఇంతలో వేదవతి, నర్మదలు వస్తారు. వాళ్లు వచ్చేసరికి.. వీధి బయట భద్రవతి, సేనాపతిలు బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు.. ‘పిల్లలపై ఎంత ఎక్కువ ప్రేమను పెంచుకుంటే అత ఎక్కువ బాధపడాల్సి వస్తుంది’ అని అంటాడు. ఇంతకీ చిన్నోడు ఎక్కడున్నాడు? అని అడుగుతాడు రామరాజు. ఆ మాట అనగానే.. వేదవతి కంగారు పడుతుంది. ఇక నర్మద కూడా కంగారు పడటం చూసి.. ‘వాడు ఏమయ్యాడు? వాడి గురించి అడుగుతుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? అని అడుగుతాడు రామరాజు. కాలేజ్‌కి వెళ్లాడు మామయ్యా... అని కవర్ చేస్తుంది నర్మద. దాంతో రామరాజు.. ‘వాడికి చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి? మీతో పాటు వెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని రమ్మని చెప్పాను. కానీ వాడేం చేశాడో చూశాం కదా.. వాడు ఇక మారడు.. కుక్కతోక వంకరే.. వాడు జన్మలో మారడు. బాధ్యత లేని వాడ్ని తోడుగా పంపిస్తే ఇలాగే ఉంటుంది. వాడ్ని నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి.. ఛ ఛ అని ధీరజ్‌ని తిట్టి కోపంగా వెళ్లిపోతాడు రామరాజు. ఇక నర్మద.. ధీరజ్‌కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇక ధీరజ్.. ప్రేమతోమాట్లాడకుండానే కారు హారన్ కొట్టి.. వెళ్దాం పదా అని ఇండికేషన్ ఇస్తాడు. ఇంతవరకూ వచ్చినా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇక విశ్వ.. ‘వాడు దొరికాడా.. మా చెల్లెల్ని తీసుకుని వెళ్లిన వాడి చావు మేం కళ్లారా చూడాలి’ అని ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఎదురింట్లో వేదవతి, నర్మదలు.. ధీరజ్, ప్రేమల కోసం ఎదురుచూస్తూ కంగారు పడుతుంటారు. ఇక రామరాజు బయటకు వెళ్తుండగా.. సరిగ్గా అప్పుడే ధీరజ్ ప్రేమలు వస్తారు. శారదాంబ.. ప్రేమను చూసి ‘మన ప్రేమ ఇంటికి వచ్చేసింది భద్రవతి’ అని అంటుంది. ఈ ఇంటి వాళ్లు ఈ ఇంటి వాళ్లూ అంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు. భద్రవతి, సేనాపతిలు పరుగుపరుగున ప్రేమ దగ్గరకు వస్తారు. ప్రేమ మెడలో తాళని చూస్తారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ధీరజ్‌కి గన్ గురి పెడుతున్నాడు సేనాపతి. దాంతో ప్రేమ.. అడ్డుగా నిలబడి.. ధీరజ్‌‌పై ఇష్టంతోనే వెళ్లి పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ధీరజ్‌ చెంప చెల్లుమనిపించాడు రామరాజు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:  రుద్రాణి కోసం కుర్చీ ప్లాన్ వేసిన కనకం.. స్వప్న మనసులో విషబీజం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-618లో.. అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. నువ్వు అన్నింటిని భరిస్తావని నాకు తెలుసు.. కానీ అసలెందుకు చేస్తున్నావ్ ఇదంతా.. ఏం సాధిద్దామని.. నువ్వు తప్పు చేయకుండా ఎవరైనా ఏదైనా అంటే సహించవు. ముఖం మీదే సమాధానం చెప్పేస్తావ్.. అలాంటి నువ్వు ఎందుకు మారిపోయావ్? దీనికి కూడా కారణాలు ఉన్నాయా అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య అల్లాడుతుంటుంది. కంగారుపడొద్దు.. నీ అంతట నువ్వు చెప్పే వరకూ నేనేం అడుగను.. నేను వచ్చింది కేవలం రేపు సీమంతం లిస్ట్ నీతో రాయిద్దామని.. ఇంతలో స్వప్న వచ్చిందని అక్కడే ఆగాను.. నీ పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చేసెయ్ అని కావ్యతో అపర్ణ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కనకం ఒక వ్యక్తిని కూర్చోబెట్టుని.. రేయ్ సీమంతం శ్రీను.. సీమంతానికి కావాల్సినవి లిస్ట్ చెబుతాను రాసుకోమంటూ అన్నీ రాయిస్తుంది. మొత్తం నలభై వేలు ఖర్చు అయ్యింది కనకం అయ్యాయ్ అని శ్రీను అంటాడు. రేయ్ అంత ఎందుకు అవుతుందిరా అంటూ లెక్కలు మార్చడానికి.. ప్లాస్టిక్ పళ్లు, ప్లాస్టిక్ పువ్వులూ లాంటివి ఎవరికి తెలియకుండా సెట్ చెయ్యాలి అని కింద వాటిని పెట్టి.. పైన అసలు పళ్లు, పూలు పెట్టాలని శ్రీనుతో కలిసి ప్లాన్ చేస్తుంది కనకం. ఇక స్వప్న దగ్గరికి రాహుల్, రుద్రాణిలు వస్తారు. తనవైపుకి తిప్పుకోవాలని ఇద్దరు ట్రై చేస్తారు. అయ్యో స్వప్న.. ఇప్పటి దాకా ఏదో జరిగింది. ఖర్చు మిగల్చాలని.. నిన్ను సీమంతానికి పుట్టింటికి తీసుకెళ్తుంది సరే.. రేపు పుట్టబోయేవాడు పెద్దగా ఖర్చు ఉండకూడదని.. నిన్ను డెలివరీకి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్తుందేమో.. నువ్వే బాగా ఆలోచించుకోమని స్వప్న మనసులో అనుమానాన్ని నింపేసి.. సైగలు చేసుకుని బయటికి వెళ్లిపోతారు రుద్రాణి, రాహుల్. ఇక బయటికి వచ్చాక రుద్రాణీ కొడుకుతో.. ఇక్కడ నిప్పు రాజేశాం.. రేపు అక్కడంతా తగలెట్టేద్దాం పదా అని అంటుంది. మరునాడు కనకం, సీమంతం శ్రీను కలసి.. స్వప్న సీమంతం ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక సీమంతం శ్రీను.. ఇంటి ముందు కూర్చీలు వేయిస్తుంటే.. ఒక కుర్చీకి ఒక కాలు ఉండదు. ఏంట్రా ఇలాంటి కుర్చీ వేయించావంటుంది కనకం. అంటే అక్కా మొన్న జరిగిన సీమంతంలో ప్లాస్టిక్ అరటిపండ్లు పెట్టారని.. కుర్చీలతోనే కొట్టుకున్నారు. అప్పుడు ఇరిగిపోయింది. దీన్ని తీయించేస్తానులే అక్కా.. దీనిలో కూర్చుంటే నడుము విరిగిపోతుందంటూ తీయించేయబోతాడు. వెంటనే నాకు అలాంటి శత్రువులు ఎవరున్నారని రుద్రాణీని తలుచుకుని.. లేదు లేదు.. ఈ కుర్చీని ఇక్కడే ఉంచు.. అంటుంది కనకం. బాలేదు కదా అక్కా కూర్చీ అని శ్రీను అనగానే.. ఒక్క నిమిషం అని శాలువా తెచ్చి కుర్చీకి కాలు లేదన్న విషయం తెలియకుండా కప్పేస్తుంది కనకం. ఇంతలో కృష్ణమూర్తి వచ్చి.. ఏంటి కనకం.. ప్లాస్టిక్ పళ్లు కూడా పెట్టావ్.. పరువు పోగొట్టే పని ఏదైనా జరిగితే ఊరుకోను చెబుతున్నానంటూ అదే కూర్చీలో కూర్చోబోతాడు. దాంతో శ్రీను, కనకం ఇద్దరూ కెవ్వమని.. కూర్చోకుండా చేసి.. అతడ్ని పంపేస్తారు. ఇక రుద్రాణీ కోసం అయితే ఆ విరిగిన కుర్చీ సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.