Jayam serial: గంగని తీసుకురమ్మని చెప్పిన పెద్దసారు.. రుద్ర ఏం చేయబోతున్నాడు?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -143 లో... నన్ను ఇంత మోసం చేసావ్.. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని గంగతో రుద్ర అంటాడు. గంగ వెళ్ళబోతుంటే తనపై ఏదో పడిపోతుంటుంది అది చూసి రుద్ర ఆపుతాడు. నాకు మీకు సంబంధం లేదని అన్నావ్ కదా ఏమైతే ఏంటని గంగ అంటుంది. గంగ కార్ వచ్చింది వెళ్ళమని రుద్ర అనగానే నేను వెళ్తానని గంగ అంటుంది. ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లే సంస్కారం కాదని గంగని తన వెంట తీసుకొని వెళ్లి వాళ్ళ ఇంటి ముందు దింపి వస్తాడు.   ఆ తర్వాత రుద్ర ఇంటికి వస్తాడు. ఒంటరిగా రావడం చూసి అంటే నువ్వు ప్రీతీతో చెప్పింది నిజమేనా.. అసలు గంగ ఏం తప్పు చేసింది అని వదిలేసి వచ్చావని పెద్దసారు అడుగుతాడు. తప్పు చేసింది సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసింది తనే.. తన ఇంట్లో ట్రైపాడ్ దొరికిందని రుద్ర అంటాడు. అదంతా నిజం అయి ఉండదు ఎందుకంటే గంగకి అంత నాలెడ్జ్ లేదని వంశీ, సూర్య అంటే వాళ్ళపై రుద్ర అరుస్తాడు. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు.. ఇక ఈ విషయం గురించి డిస్కషన్ వద్దని రుద్ర అంటాడు.    పెద్దసారు నచ్చజెప్పబోతుంటే ఫోర్స్ చెయ్యకండి పెద్దనాన్న అని రుద్ర అంటాడు. అంతా చేసింది నువ్వు.. తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చి తనకి దగ్గర అయింది నువ్వు.. ఇప్పుడు ఆయన్ని ఫోర్స్ చెయ్యకు అంటావేంటని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత రుద్ర పైకి వెళ్తాడు. మరొకవైపు నా గురించి టెన్షన్ పడకు అమ్మ అని లక్ష్మీకి గంగ దైర్యం చెప్తుంది.   ఆ తర్వాత గంగని వెళ్లి తీసుకొని వస్తానని పెద్దసారు అంటాడు. వద్దని చెప్తున్నాను కదా ఇక వెళ్లిన దరిద్రం మళ్ళీ తీసుకొని రావద్దని శకుంతల అంటుంది. ఇక ఇషిక, పారు కలిసి టాపిక్ డైవర్ట్ చేస్తారు.    తరువాయి భాగంలో గంగ దగ్గరికి పెద్దసారు వెళ్లి రమ్మని అడుగుతాడు. రానని గంగ చెప్తుంది. ఆ తర్వాత పెద్దసారు ఇంటికి వెళ్లి రుద్రతో గంగని తీసుకొని రమ్మని చెప్తాడు. గంగ వస్తే నేను వెళ్ళిపోతానని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu Pillalu: మందు అనుకొని కూల్ డ్రింక్ తాగిన శ్రీవల్లి.. ఇచ్చిపడేసిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-342 లో... అమూల్య, విశ్వ గురించి చందు చెప్పకుండా శ్రీవల్లి ఆపిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను డ్యాన్స్ చేస్తుంటే వెనకాల నుండి ప్రేమ వచ్చి.. ఏంటి ఈ రోజు తేడాగా బిహేవ్ చేస్తున్నావ్.. చందు బావ ఏదో చెప్తానంటే వద్దని దెబ్బ తాకినట్లు యాక్టింగ్ చేసావ్ ఎందుకని ప్రేమ అడుగుతుంది. అదేం లేదని శ్రీవల్లి అనగానే నీకు ఈ రోజు ఉందని ప్రేమ కోపంగా అంటుంది. అమ్మో మళ్ళీ తాగేసి వచ్చి కొడుతుందా ఏంటని శ్రీవల్లి భయపడుతుంది.    మరొకవైపు ఇంట్లో రామరాజు లేడని తిరుపతి సిట్టింగ్ ఎరేంజ్ చేస్తాడు. ధీరజ్, సాగర్, చందు ముగ్గురు లుంగీ కట్టుకొని వస్తారు. మందుకి లుంగీకి మంచిగా సెట్ అయిందని తిరుపతి అంటాడు. చందు డల్ గా ఉంటాడు. ఏమైందని వాళ్ళు అడుగగా అమూల్య విషయం చెప్పలేక.. నాన్న తాగితే ఏమైనా అంటాడేమోనని కవర్ చేస్తాడు.      ఆ తర్వాత శ్రీవల్లి భయపడుతూ.. ప్రేమ ఎక్కడ తాగేసి వచ్చి కొడుతుందోనని తిరుపతి దగ్గర ఉన్న కూల్ డ్రింక్ తీసుకుంటుంది. అందులో మందు కలిపి ఉంటాడని అనుకొని ప్రేమ కంటే ముందే తాగాలని శ్రీవల్లి తాగి ప్రేమ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తుంది.   ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి తిరుపతి వచ్చి నా కూల్ డ్రింక్ తెచ్చుకొని నువ్వు తాగావని అడుగుతాడు. అది మందు కాదా అని శ్రీవల్లి అనగానే లేదని తిరుపతి అంటాడు. దాంతో మళ్ళీ శ్రీవల్లిలో భయం మొదలవుతుంది. అప్పుడు ప్రేమ తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.    ఆ తర్వాత సాగర్ డ్రింక్ చేసి నర్మద దగ్గరికి వస్తాడు. తనని అందంగా ఉన్నావని పొగుడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: శ్రీధర్ కి మాటివ్వని దీప.. కార్తీక్, కాశీ కలిసిపోయారా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -541 లో... కాంచన ఎలాగూ కావేరి ఇంటికి రాదని శ్రీధర్, కాంచన కోసం టిఫిన్ పంపిస్తాడు. తిని ఎలా ఉందో చెప్పు.. నా చేత్తో నేనే చేసానని శ్రీధర్ ఫోన్ లో కాంచనకి చెప్తాడు.    మరొకవైపు కార్తీక్, దీప టిఫిన్ చేస్తారు. అన్ని స్వయంగా మీ నాన్న గారు చేశారని కావేరి చెప్తుంది. అందరు టిఫిన్ చేస్తారు. మరొకవైపు శ్రీధర్ పంపించిన టిఫిన్ ని కాంచన తింటూ ఎమోషనల్ అవుతుంది. మీకేనా ప్రేమ నాకూ కూడా ఉందని అనుకుంటుంది.    ఆ తర్వాత దీపతో శ్రీధర్ మాట్లాడతాడు. దీప నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి.. మీ అత్తగారి పక్కన నన్ను నిలబెడుతావా.. నాకు మాటివ్వు అని శ్రీధర్ అడుగుతాడు. ఇప్పుడు ఇవ్వలేను మావయ్య అత్తయ్య మనసులో ఏముందో తెలియాలంటే మీరు కొన్ని రోజులు అత్తయ్యకి దూరంగా ఉండాలి ఎదురుపడకూడదని దీప అనగానే అది నా వల్ల కాదని శ్రీధర్ అంటాడు.    మరొకవైపు కాశీ దగ్గరికి కార్తీక్ వెళ్లి అసలు ఏమైందని అడుగుతాడు. ఇలా ఉండకూడదని మోటివేట్ చేస్తాడు. అప్పుడే స్వప్న వస్తుంది. తనకి కూడా క్లాస్ తీసుకుంటాడు. భర్తకి తోడుగా ఉండమని చెప్తుంది.   ఆ తర్వాత కాశీ, దీపలని శివన్నారాయణ కార్ లో ఇంటికి తీసుకొని వస్తాడు. కార్ లో అలా వస్తున్నారంటే విఐపి లు అయి ఉంటారని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. తీరా చూస్తే దీప ఉంటుంది. పనిమనిషికి కూడా డ్రైవర్ ఉంటారా అని పారిజాతం అంటుంది.    మరొకవైపు స్కూటీపై కార్తీక్, శ్రీధర్ వెళ్తారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఒకదగ్గర ఆగి టీ తాగాలని అనుకుంటారు. అప్పుడే ఫోన్ లో జ్యోత్స్న ఫుడ్ ట్రక్ కి బాగా క్రేజ్ ఉందని చూసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. టీ లో షుగర్ ఎక్కువ వెయ్యండి అని కార్తీక్ అనగానే ఎందుకురా అని శ్రీధర్ అంటాడు. నోరు తీపి చేసుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: రాహుల్ వెన్నుపోటు.. రాజ్, కావ్య నిజం తెలుసుకుంటారా?

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -904 లో... కేరళ నుండి రాజ్, కావ్య ఇంటికి వస్తారు. మీరు మమ్మల్ని ఎందుకు మోసం చేసారు, కావ్యకి ప్రాబ్లమ్ లేదని ఎందుకు చెప్పారని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇప్పుడు కావ్యకి ఏం ప్రాబ్లమ్ లేదని కేరళ వైద్యం గురించి చెప్తాడు. దాంతో ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.    అప్పుడే ఒకతను ఫోన్ చేసి బిజినెస్ ఎక్సలెంట్ అవార్డు ఏ టైమ్ కి వస్తున్నారని అడుగుతారు. అవార్డు ఏంటని ఆశ్చర్యంగా అడుగుతాడు రాజ్. ఆ తర్వాత నేను చెప్తాను రాజ్ అని  స్వప్న అంటుంది. చాలా తక్కువ టైమ్ లోనే రాహుల్ మంచి పేరు సంపాదించి అందరి ద్రుష్టిని తనవైపుకి తిప్పుకున్నాడని చెప్తుంది. దాంతో రాజ్, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.    మరొకవైపు అప్పు కేసు గురించి బయటకు వెళ్ళాలని కళ్యాణ్ కి చెప్తుంది. ఇద్దరం వెళ్తే డౌట్ వస్తుంది. నువ్వు ఒక్కదానివే వెళ్ళు.. నేను ఇంట్లో కవర్  చేస్తానని అంటాడు. అప్పుని ఎవరు చూడకుండా కార్ ఎక్కించి పంపిస్తాడు. అది ప్రకాష్ చూస్తాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, అప్పు కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంటే కళ్యాణ్ ఆపి.. అప్పు బాత్రూంలో ఉంది. నేను తీసుకొని వెళ్తానని అంటాడు. సరే అని ధాన్యలక్ష్మి వెళ్తుంది. అదేంట్రా అప్పుని కార్  ఎక్కించి పంపించావని ప్రకాష్ అనగానే కళ్యాణ్ టెన్షన్ పడుతూ అతన్ని డైవర్ట్ చేస్తాడు.   ఆ తర్వాత రాజ్, కావ్య ఇంకా స్వప్న, రాహుల్ నలుగురు అవార్డు ఫంక్షన్ కి వెళ్తారు. నువ్వు ఇంత త్వరగా బిజినెస్ లో సక్సెస్ సాధించావ్ కాబట్టి నీకు గిఫ్ట్ అని రాహుల్ కి రాజ్ వాచ్ ఇస్తాడు. ఇంత ఖరీదైనది ఎందుకని రాహుల్ అంటాడు. ఆ తర్వాత నలుగురు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9 Telugu winner : బిగ్ బాస్ సీజన్-9 విజేత పవన్ కళ్యాణ్.. రన్నరప్ గా తనూజ!

    బిగ్ బాస్ సీజన్-9 ముగియడానికి చివరి వారం మిగిలి ఉంది. హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేషన్ అయ్యాడు. గత వారం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉండగా.. సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఇప్పుడు అయిదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.      ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ కూడా టాప్-5 ఉంటారని బిగ్ బాస్ మామ కన్ఫమ్ చేశాడు. డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇక నిన్న అర్థరాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉన్నాయి. ఎవరు మీ ఫెవరెట్ కంటెస్టెంటో వారికి ఓట్ వేసుకోమని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఇక నిన్న మొదలైన ఓటింగ్ పోల్ రసవత్తరంగా సాగుతోంది.   అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ లో.. పవన్ కళ్యాణ్ పడాలకి అత్తధిక ఓటింగ్ నమోదవ్వగా.. సంజనకి లీస్ట్ ఓటింగ్ పడింది‌. 45.69 శాతం ఓటింగ్ తో పవన్ కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉండగా, 27.92 శాతం లో ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 11.84 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉన్నాడు.  ఇక లీస్ట్ లో సంజన, డీమాన్ పవన్ ఉన్నారు. 8.41 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. 6.14 శాతం ఓటింగ్ తో సంజన లీస్ట్ లో ఉంది.      ఇక ఓటింగ్ కి మరో నాలుగు రోజులు ఉంది. శుక్రవారం వరకు జరిగే ఓటింగ్ ప్రక్రియలో ఎవరికి అత్యధిక ఓటింగ్ వస్తుందో వారే బిగ్ బాస్ సీజన్-9 విజేత అవుతారు. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ పోల్ అనాలిసిస్ ప్రకారం కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పవన్ కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నాడు. అతడే ఈ సీజన్-9 విజేత అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే తనూజకి కూడా ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే తనని బిగ్ బాస్ దత్తపుత్రిక అంటారు. అంటే తనకి సపోర్ట్ ఎక్కువగా ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు కానీ కామన్ మ్యాన్ రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మరి టాప్-5 లో ఉన్నవారిలో ఎవరికి మీ ఓట్ కామెంట్ చేయండి.        

Bharani Buzz interview: బజ్ ఇంటర్వ్యూలో తనూజ మీద షాకింగ్ కామెంట్స్ చేసిన భరణి!

    బిగ్ బాస్ సీజన్-9 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక పద్నాలుగో వారం వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ లో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ నుండి ఎలిమినేషన్ అయిన భరణి ఎమోషనల్ అయ్యాడు. ఇక ఎలిమినేషన్ అయ్యాక శివాజీతో బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు భరణి.     బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్ వస్తుంది కానీ మీకు రెండుసార్లు వచ్చింది. ఎందుకు సద్వినియోగం చేసుకోలేదని శివాజీ అడుగగా.. నేను బాగానే ఆడాను కానీ నా కన్నా మిగిలిన అయిదుగురు బాగా ఆడారు అని నేను అనుకుంటున్నానని భరణి సమాధానమిచ్చాడు. మెడిసిన్స్ దాచిపెట్టినప్పుడు పర్లేదు అని అన్నారు కానీ తర్వాత నామినేషన్ చేశారని శివాజీ అడుగగా.. మెడిసిన్ దాచేసి ఫన్ అంటే ఎలా.. అది ఏమైనా ఫన్ ఆ అంటూ సంజన మీద భరణి సీరియస్ అయ్యాడు. రీఎంట్రీ తర్వాత దివ్యని దూరం పెట్టారు.     ఎందుకని శివాజీ అడుగగా.. నా వల్ల తన గేమ్ డిస్టబ్ అవుతది అని ఎంత దూరం పెట్టినా అది అవ్వలేదని గేమ్ అనేది మైండ్ తో ఆడాలి.. నా హార్ట్ నా మైండ్ ని డామినేట్ చేసిందని భరణి అన్నాడు. తనూజ తన గేమ్ తను ఆడుకుందని మీకెప్పుడైనా అనిపించిందా అని శివాజీ అడుగగా.. కొన్ని సందర్భాలలో అలా‌ అనిపించిందని భరణి అన్నాడు. అవన్నీ ఇప్పుడు మాట్లాడాలో లేదో తెలియదు కానీ ఐ వాంట్ టూ టాక్ అని భరణి అన్నాడు.    బజ్ ఇంటర్వ్యూ ప్రోమో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఒక్క రోజులోనే మూడు లక్షల పై చిలుకు వ్యూస్ వచ్చాయి. ఇక దానికి ఫుల్ కామెంట్లు వచ్చాయి. ఆటలో మీరు గెలవకపోవచ్చు కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా  ఎప్పుడో గెలిచారు భరణి గారు అని ఒకరు కామెంట్ చేయగా.. భరణి గారికి కప్ అనేది చాలా చిన్న విషయం.. ఆయన వ్యక్తిత్వానికి మంచి మనసుకి నిజాయితీకి అందరి గుండెల్లో నిలిచిపోయారు.. లయన్ అని మరొకరు కామెంట్ చేసారు. హౌస్ లోనే కాదు బయట కూడా భరణికి పాజిటివిటి ఎక్కువగా ఉంది.  మరి భరణి హౌస్ లో టాప్-5 కి డిజర్వ్ అవునా కాదా కామెంట్ చేయండి.  

Bharani Remuneration: భరణి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

      బిగ్ బాస్ సీజన్-9 నిన్నటితో పద్నాలుగు వారాలు పూర్తయింది. ఇక ఈ సీజన్ ముగియడానికి మరో వారం మిగిలి ఉంది. ఇక నిన్నటి సండే ఎపిసోడ్ భరణి హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యాడు. హౌస్ లో రేలంగి మామయ్యలాగా అందరితో మంచిగా మాట్లాడుతూ ఎవరినీ నొప్పించకుండా గేమ్ ఆడాడు భరణి. తను హౌస్ కి పెద్దదిక్కులాగా ఉన్నాడు. అయితే నాలుగు వారాల క్రితం భరణి ఎలిమినేషన్ అయ్యాడు. కానీ అనూహ్యంగా రీఎంట్రీ ఇచ్చాడు. హౌస్ నుండి బయటకు వెళ్ళేముందు వరకు బాండింగ్ తో ఉన్న భరణి.. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక దివ్య, తనూజలకి కాస్త దూరంగా ఉన్నాడు.      ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన భరణికి భారీ రెమ్యునరేషన్ అందింది. వారానికి మూడు లక్షల అయిదు వేల పైగానే భరణికి బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరో వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆరు వారాలకు గాను ఇరవై లక్షలకు పైగానే రెమ్యునరేషన్ అందింది. భరణి ఎనిమిదవ వారంలో హౌస్ లో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో ఆరువారాల పాటు కొనసాగాడు. దీంతో అదే లెక్కన మరో ఇరవై లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది.    మొత్తంగా చూస్తే నలభై రెండు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. భరణి హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే ఫినాలే వీక్ కి మరో వారం ఉండగా ఎలిమినేషన్ అవ్వడం ఆడియన్స్ కాస్త నిరాశని మిగిల్చింది. హౌస్ లో భరణి ఎలిమినేషన్ మీకెలా అనిపించిందో కామెంటో చేయండి.  

Bigg Boss 9 Telugu Bharani Elimination: భరణి ఎలిమినేషన్.. సూపర్ ట్విస్ట్!

    బిగ్ బాస్ సీజన్-9 లో పద్నాలుగో వారం పూర్తయింది. నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ అయింది. ఇందులో భరణి ఎలిమినేటెడ్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో డీమాన్ పవన్ థర్డ్ ఫైనలిస్ట్ అయ్యాడు.  ఇక ఎలిమినేషన్ రౌండ్ సంజన మరియు భరణి మధ్య సాగింది.  పక్షి రెక్కల్లో లిమినేషన్, ఫైనలిస్ట్ బోర్డ్‌లు ఉన్నాయి. వాటిని లాగాలని చెప్పడంతో భరణి వైపు ఎలిమినేషన్ ఉండగా.. సంజన వైపు ఫైనలిస్ట్ అని ఉంది. దాంతో భరణి ఎలిమినేట్ కాగా సంజన ఫైనలిస్ట్ అయ్యింది. భరణి ఎలిమినేషన్ కాగానే తనూజ ఎమోషనల్ అయింది.      ఇక సంజన అయితే పాజిటివ్ గా మాట్లాడింది. ఇక అందరికి బై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చేశాడు భరణి. ఇక భరణి జర్నీ వీడియోలో తనూజ, దివ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. సరే అయితే వెళ్లే ముందు వాళ్ల గురించి ఓ మంచి మాట చెప్పేసి వెళ్లమని నాగార్జున అనగానే అందరు ఫైటర్స్ అని చెప్పాడు నాగార్జున.     ఇక అందరి గురించి రేలంగి మావయ్య లాగా బానే చెప్పాడు. డీమాన్ పవన్ స్ట్రాంగ్ అతడి డ్రీమ్స్ నెరవేరాలని భరణి చెప్పుకొచ్చాడు. సెల్యూట్ టూ సైనికా అని కళ్యాణ్ తో భరణి అన్నాడు. ఇక తనూజ గురించి చెప్తుండగా.. ఒకే టైమ్ అయిపోయింది.. ఎడిట్ లో లేపేస్తారు.. వెళ్దాం పదా అని నాగార్జున అనగా.. సర్ తనూజ గురించి మాట్లాడినా ఎడిట్ చేస్తారా అని భరణి ఆశ్చర్యపోయాడు. జోక్ చేశానని నాగార్జున అన్నాడు.        తనూజా.. నిన్ను బాధపెట్టాను.. వేరే వాళ్లతో క్లోజ్‌గా ఉన్నా నీకు ఇచ్చే విలువ నీకు ఇచ్చాను. దానికి బాండింగ్ అని పేరు పెట్టినా వేరే పేరు పెట్టినా కూడా నా ఆట నేను ఆడుకుంటూనే ఉన్నాను. సారీ.. ఇక తనూజకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు భరణి. అందరికి బై చెప్పేసి హౌస్ నుండి బయటకు వచ్చేశాడు భరణి.   

Suman Shetty Remuneration: సుమన్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-9 లో శనివారం నాటి ఎపిసోడ్ ఆకట్టుకునేలా సాగింది. 14వ వారం ఎవరూ ఊహించని విధంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ దత్తపుత్రుడు సుమన్ శెట్టి అని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా అతనే ఎలిమినేషన్ అయ్యాడు. టాప్-7 కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి నిన్న హౌస్ నుండి బయటకొచ్చాడు‌. (Suman Shetty Remuneration)   సుమన్‌ శెట్టికి రోజుకు 45 వేల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అంటే వారానికి మూడు లక్షల పదిహేను వేల వరకు సుమన్ శెట్టి రెమ్యునరేషన్ అందుకున్నాడు. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి నిలిచాడు. బిగ్‌ బాస్‌ ట్రోఫీ విన్నర్‌ కి యాభై లక్షలు ఇస్తారు. టాక్స్ లు కట్‌ అయితే ఆయనకు దక్కేది నలభై లక్షలు ఉండొచ్చు. అలాంటిది సుమన్ శెట్టికి ఇప్పటివరకు 40 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందింది. పైగా మధ్యలో ఎవరికైనా సూట్‌ కేసు ఆఫర్‌కి టెంప్ట్ అయితే విన్నర్‌కి ఆ మాత్రం కూడా రాదు. చాలా తగ్గిపోతుంది. దీంతో సుమన్‌ శెట్టికి ఇప్పుడు విన్నర్‌కి మించిన పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. అయితే ఇందులోనూ కొంత టాక్స్ కట్ అవుతుందని చెప్పొచ్చు.   సుమన్ శెట్టి హౌస్ లో పద్నాలుగు వారాలు ఉన్నాడు. ఇందులో టాస్క్ లో రెండు, మూడు సార్లు గెలిచాడు అంతే. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అంతగా ఏం లేదు. కానీ అతడికి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అతడు ఇన్ని వారాలు హౌస్ లో ఉన్నాడు.  

Suman Shetty Buzz Interview:  చాలా పెద్ద తప్పు చేశావ్.. సుమన్ ని నిలదీసిన శివాజీ..!

  బిగ్ బాస్ సీజన్-9 లో 14వ వారం వీకెండ్ వచ్చేసింది‌. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయ్యాడు. ఇది ఎవరు ఊహించని విధంగా జరిగింది.    ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చేసిన సుమన్ శెట్టి బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక సుమన్ శెట్టి వచ్చీ రాగానే.. జయం సినిమాలోని 'శబ్బాసి శబ్బాసే' అనే బిజిఎమ్ తో అదరగొట్టాడు ఎడిటర్. ఇంటర్వ్యూలో ఏది అడిగినా దానికి నిజమే చెప్తానని అబద్ధం చెప్పనని ప్రమాణం చేస్తున్నానని శివాజీ అనగా.. ఏది అడిగినా అబద్ధం చెప్పనని సుమన్ శెట్టి అన్నాడు.    ఇక ఇంటర్వ్యూ మొదలెట్టాడు శివాజీ. కళ్యాణ్ , ఇమ్మాన్యుయేల్ కి బ్యాంకాక్ కి తీసుకెళ్తానని మాటిచ్చావంట కదా అని శివాజీ అడుగగా.. అన్నా అవన్నీ ఇప్పుడెందుకు అన్నా అని సుమన్ శెట్టి అన్నాడు. మనలో మన మాట.. అసలు నువ్వు ఈ హౌస్‌లో ఇన్ని రోజులు ఉంటావని అనుకున్నావా? అని శివాజీ అడుగగా.. లేదన్నా అని సుమన్ శెట్టి అన్నాడు. నువ్వే కాదు.. మేం కూడా అనుకోలేదని శివాజీ అన్నాడు.    ఎందుకని నీ పిలకని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టావంటూ శివాజీ అడుగగా.. సుమన్ శెట్టి ఆశ్చర్యపోయాడు. చాలా పెద్ద తప్పు చేశావ్ సుమన్ నువ్వు.. ఎవరూ చేయకూడని తప్పు చేశావ్.. ఎందుకు చేశావ్ అలా.. ఏమీ ఆలోచించవా.. ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా అని శివాజీ అడిగాడు. ముందు తప్పేంటే చెప్తే.. చేశానో లేదో చెప్తానని సుమన్ శెట్టి అన్నాడు.   సుమన్ శెట్టి హౌస్ లో పెద్దగా ఆడకపోయినా 14వ వారం వరకు బిగ్ బాస్ ఉంచాడు అనేది కొందరి అభిప్రాయం. అలాంటిది చేయకూడదని తప్పు అంటే అదేం ఉండదు.. ఏదో హైప్ ఇవ్వడం కోసం.. టీఆర్పీ కోసం శివాజీ చేత అడిగించినట్టున్నారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.    మరి సుమన్ శెట్టి నిజంగానే తప్పు చేశాడా? ఒకవేళ చేస్తే అదేంటో తెలియాలంటే బజ్ ఇంటర్వ్యూ (Suman Shetty Buzz interview) ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.  

Jayam serial: గంగ ఎప్పటికీ రాదని చెప్పిన రుద్ర.. పెద్దసారు ఏం చేయనున్నాడు?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -141 లో... రుద్ర మాటలు గంగ గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు లక్ష్మీ స్పృహలోకి వస్తుంది. అసలు ఏమైందని అడుగుతుంది. రుద్ర సర్ కి, నీకు గొడవ ఏంటని అడుగుతుంది. ఈ హాస్పిటల్ బిల్ ఎవరు కట్టారని లక్ష్మీ అడుగగా అవన్నీ నీకెందుకని శ్రీను వాళ్ళు అంటారు.   ఆ తర్వాత లక్ష్మీని డిశ్చార్జ్ చేసి ఆటోలో తీసుకొని వెళ్తుంటే అక్కడ పక్కన రుద్ర కార్ కన్పిస్తుంది. అది చూసి ఆగుతారు. రుద్ర సర్ కార్ ఇక్కడ ఉందేంటని అనుకుంటారు కానీ రుద్ర అందులో ఉండడు. నాకు తెలిసి సర్ వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడని గంగ అంటుంది. గంగ నువ్వు, రుద్ర సర్ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే మీ గొడవలు అన్నీ దూరం అవుతాయని శ్రీను, బంటి అంటారు.    ఆ తర్వాత రుద్ర, గంగ మాట్లాడుకుంటారు. నేను ఏ తప్పు చెయ్యలేదని రుద్రకి గంగ చెప్తుంది. చేయకుంటే ఆ వస్తువు నీ దగ్గర ఎందుకు ఉందని రుద్ర అడుగుతాడు. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఈ మంటపై ఒట్టు అని గంగ ఒట్టేస్తుంటే రుద్ర తన చేయి పక్కకి లాగుతాడు.    మరొకవైపు ఇంకా రుద్ర ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు ఎదురుచూస్తారు. శకుంతలతో పెద్దసారు మాట్లాడుతాడు. గంగ ఈ ఇంటికి రాదని రుద్ర ఫోన్ లో చెప్పాడని శకుంతల చెప్పగానే.. పెద్దవాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి కదా అని సీరియస్ అవుతాడు. అందరు రుద్ర కోసం ఎదురుచూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: సినిమాకి వెళ్ళిన రామరాజ, వేదవతి.. చందుని శ్రీవల్లి డైవర్ట్ చేసిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-341 లో... ప్రేమ, నర్మద తనని ముసలివాళ్ళు అన్నారని వేదవతి కోపంగా రామరాజు దగ్గరికి వెళ్లి ఏవండి మనం సినిమాకి వెళదామని అంటుంది. దానికి రామరాజు ఒప్పుకుంటాడు. చూసావా అక్క అత్తయ్య సినిమాకి అనగానే ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందోనని నర్మదతో ప్రేమ అంటుంది.‌    ఆ తర్వాత రామరాజు సినిమాకి వెళ్ళడానికి రెడీ అయి వస్తాడు. వేదవతి అద్దాలు పెట్టుకొని వస్తుంది. అది చూసి తిరుపతి షాక్ అవుతాడు. సినిమాకి ఇలాగే వెళ్లాలండి అని రామరాజుతో వేదవతి చెప్తుంది.    మరొకవైపు శ్రీవల్లి టెన్షన్ పడుతూ గేట్ దగ్గర ఉంటుంది. అది చూసి ఏదో చేస్తుంది.. అది ఏంటో తెలుసుకోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. చందు రాగానే తనని గేట్ దగ్గర ఆపుతుంది. నేను నాన్నతో మాట్లాడాలని చందు కోపంగా వెళ్తాడు. చందు లోపలికి వెళ్లి నాన్న మీకు ఒక విషయం చెప్పాలి.. అది మన పరువుకి సంబంధించినదని అమూల్య గురించి చెప్పబోతుంటే శ్రీవల్లి పడిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. అది చూసి చందు వాళ్ళు వచ్చి తనని గదిలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత రామరాజు, వేదవతి సినిమాకి వెళ్తారు.   అదంతా శ్రీవల్లి కావాలని చేస్తుందని ప్రేమ, నర్మదలకి అర్థం అవుతుంది. అసలు ఏమైంది బావ ఎందుకు అలా కోపంగా ఉన్నావ్.. నీకు సంబంధించినవి నాకూ చెప్పకూడదా అని శ్రీవల్లి అంటుంది. దాంతో అమూల్య, విశ్వ పార్క్ లో కన్పించిన విషయం శ్రీవల్లికి చెప్తాడు. మీరు ఆ విషయం మావయ్యకి‌ చెప్తే ఇంట్లో పరువు పోతుందని అమూల్య ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటని శ్రీవల్లి అనగానే చందు కూడా ఆలోచనలో పడతాడు. హమ్మయ్య అని శ్రీవల్లి అనుకుంటుంది. శ్రీవల్లి దగ్గరికి ప్రేమ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: కూతురికి పెళ్ళి అవ్వడం లేదని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తల్లి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -540 లో... జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పారిజాతం కల కంటుంది. వద్దు నా మనవరాలిని అరెస్ట్ చెయ్యకండి అని పారిజాతం అంటుంటే జ్యోత్స్న తనని లేపి ఏమైందని ఆడుగుతుంది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారే అని అంటుంటే.. ఎప్పుడు అలాగే ఆలోచిస్తావా అని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది.   మరుసటిరోజు ఉదయం సుమిత్ర ఇంకా నిద్ర లేవకపోయేసరికి దశరథ్, సుమిత్రని లేపుతుంటే.. అసలు లేవదు. దాంతో భయపడి శివన్నారాయణకి చెప్తాడు. నాన్న సుమిత్ర లేవట్లేదని చెప్పడం జ్యోత్స్న విని.. పారిజాతం దగ్గరికి వెళ్లి గ్రానీ మమ్మీ చనిపోయిందని చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది.   అందరు కలిసి సుమిత్రని లేపుతారు. సుమిత్ర మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. హమ్మయ్య సుమిత్రకి ఏం కాలేదని పారిజాతం అంటుంది. ఏమైందని సుమిత్ర ని దశరథ్ అడుగుతాడు. నిద్ర పట్టడం లేదని స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నానని సుమిత్ర చెప్తుంది. నిద్ర పట్టనంత ఏం టెన్షన్ ఉందని పారిజాతం అడుగుతుంది. పెళ్లికి ఎదిగిన కూతురు ఉంటే నిద్ర ఎలా పడుతుందని శివన్నారాయణ అంటాడు. ఏం టెన్షన్ జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది కదా అని పారిజాతం అనగానే జ్యోత్స్నకి జాతకాలు కలవక పెళ్లి ఫిక్స్ అవ్వడం లేదని శివన్నారాయణ చెప్తాడు. అది దశరథ్ చెప్పి ఉంటాడు. అందుకే సుమిత్రకి టెన్షన్ అని శివన్నారాయణ అంటాడు.   మరొకవైపు కావేరి ఇంటికి దీప, కార్తీక్ వస్తారు. వాళ్ల టిఫిన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాంచన రాలేదని తెలిసి శ్రీధర్ డిజప్పాయింట్ అవుతాడు. కాంచనకి శ్రీధర్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. అప్పుడే ఒకతను టిఫిన్ తీసుకొని వచ్చి కాంచనకి ఇస్తాడు. నువ్వు రావని తెలిసి నేను పంపించానని కాంచనకి శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss Telugu 9 Top 5: బిగ్ బాస్ సీజన్-9 టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, సంజన టాప్-7 మిగిలారు. ఇక వీరి నుండి ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసాడు.   శనివారం నాటి ఎపిసోడ్ లో.. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున చెప్పేశాడు. ప్రస్తుతం హౌస్ లో భరణి, సంజన, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్ ఆరుగురు మిగిలారు. వీరిలో ఆడియన్స్ ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటే వాళ్ళే ఎలిమినేట్ అవుతారు.    అయితే సోషల్ మీడియా బిగ్ బాస్ లీక్స్, అప్డేట్స్ ని బట్టి చూస్తే ఆదివారం ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్(Bharani Elimination)  అయినట్టు తెలుస్తోంది.    ఇక ప్రస్తుతం డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్, సంజన, ఇమ్మాన్యుయేల్ ఈ అయిదుగురు హౌస్ లో ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వగా.. ఇమ్మాన్యుయేల్ సెకెండ్ ఫైనలిస్ట్ అయ్యాడు.  

Brahmamudi: రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు.. డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -903 లో... కావ్యకి ఇక ఏ ప్రాబ్లెమ్ లేదని ఆయుర్వేద వైద్యం చేసిన అతను చెప్తాడు. దాంతో రాజ్, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.   మరొకవైపు సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇంత కోపంగా ఉన్నారని అడుగుతుంది. ఎందుకంటే మన కంపెనీకి పది కోట్లు నష్టం వచ్చిందని సుభాష్ అంటాడు. కానీ రాహుల్ ఆ డిజైన్స్ తియ్యలేదు అంటున్నాడు.. పైగా స్వప్న కూడ సపోర్ట్ చేస్తుంది. తెలుసుకుంటా అన్నీ తెలుసుకుంటానని సుభాష్ అంటాడు.   మరొకవైపు ఇంట్లో పనిమనిషికి కావ్య రిపోర్ట్స్ కన్పిస్తాయి. అవి చూసి రుద్రాణి షాక్ అవుతుంది.. అంటే కావ్యకి ప్రాబ్లమ్ ఇంకా ఉంది అన్నమాట అనుకుని హాల్లో ఉన్న అందరికి రిపోర్ట్స్ చూపిస్తుంది. అవి సుభాష్ చూసి షాక్ అవుతాడు. ఏమైందని అపర్ణ అడుగగా మనకి కావ్య ప్రాబ్లమ్ తగ్గిపోయిందన్నారు కానీ తగ్గలేదని చెప్పగానే అందరు షాక్ అవుతారు.      అప్పుడే రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేసారని అపర్ణ కోప్పడుతుంది. మా దగ్గర ఎందుకు నిజం దాచారని అడుగుతుంది. కావ్యకి తన కడుపులో పెరుగుతున్న బేబీని చంపుకోవడం ఇష్టం లేదు.. అందుకే ఇలా.. కానీ దీనికి పరిష్కారం దొరికింది.. గుళ్లో పంతులు కావ్య సమస్య విని కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించమని చెప్పారు.. దాంతో క్షణం ఆలస్యం చేయకుండా మీతో టూర్ కి వెళ్తున్నామని చెప్పి వెళ్లిపోయామని రాజ్ అంటాడు. అక్కడ వైద్యం చేసి కావ్యకి ప్రాబ్లమ్ లేదని చెప్పారనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.    తరువాయి భాగంలో రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు వస్తుంది. రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Suman Shetty Elimination: సుమన్ శెట్టి ఎలిమినేషన్.. కన్నీళ్ళతో బయటకు వచ్చాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో పద్నాలుగో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక అందరు ఎదురుచూస్తున్నట్టుగానే ఈ వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. నాగార్జున గ్లామరెస్ గా రెడీ అయి వచ్చేశాడు. హౌస్ మేట్స్ అందరిని మాట్లాడించాడు.   ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం ముందే చెప్పేశాడు. ఇక నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని సేవ్ చేశాడు నాగార్జున. ఇక చివరి ఎలిమినేషన్ రౌండ్ కలర్ బోర్డ్‌ టాస్క్‌తో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశాడు నాగార్జున. సుమన్ శెట్టి ఎలిమినేషన్ అనగానే అందరు షాక్ అయ్యారు. భరణి అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. యూ ఆర్ ది బెస్ట్.. నీది మంచి మనస్సు.. నేను బయటకు రాగానే కచ్చితంగా మనం వర్క్ చేద్దామని మాటిచ్చాడు భరణి. ఇక ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్, సంజన, డీమాన్ ఎమోషనల్ అయ్యారు. 'అధ్యక్షా వెళ్ళిపోతున్నా' అంటు బిగ్ బాస్ కి బై చెప్పేసి బయటకు వచ్చేశాడు. ఇక హౌస్ ని వీడి స్టేజ్ మీదకి వచ్చాడు నాగార్జున.    ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యావ్ కదా.. ఎలా ఉందని నాగార్జున అడుగగా.. హ్యాపీగానే ఉంది సర్.. ఒక్కవారం ఉంటే టాప్-5కి వెళ్లేవాడ్ని అని సుమన్ శెట్టి అన్నాడు. నేనూ అదే అనుకున్నా.. అరెరే సుమన్ వెళ్లిపోతున్నాడే అనిపించింది.. నీ ఆటతోనే కాదు.. మాటలతోనూ ఆకట్టుకున్నావ్... ఇప్పుడు నీ జర్నీ వీడియో సుమన్ శెట్టి ప్రభంజనం చూద్దామని చెప్పాడు.    అసలు బిగ్ బాస్ హౌస్‌ని వీడిన ఏ కంటెస్టెంట్‌కి దక్కని గుర్తింపు, గౌరవం సుమన్ శెట్టికి దక్కింది. సుమన్ శెట్టి తన ఆటతో ప్రభంజనం సృష్టించాడు అని నాగార్జున గర్వంగా, ఫుల్ ఎలివేషన్ ఇస్తూ చెప్పాడు. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కి ఇంతటి ఎలివేషన్ ఇవ్వలేదు. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి.   

ఇంద్రజ, సుధీర్ మీద ఆది కౌంటర్స్...అమ్మాకొడుకులిద్దరే పోతారు అంటూ కామెంట్స్

డిసెంబర్ 31 కి ఇంకా ఎన్నో రోజులు లేదు. బుల్లితెర రకరకాల ఈవెంట్స్ తో షోస్ లో అలరించడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. అదే "కం టు ఢీ పార్టీ..2026 ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్" పేరుతో ఒక లేటెస్ట్ టీజర్ వచ్చింది. ఇక ఈ ప్రోగ్రాం 31 వ తేదీ రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఈ షోకి  హోస్ట్ గా సుధీర్ కనిపించాడు. "సుధీర్ గాడి పార్టీ అంటే వినడమే కానీ సూసిందే లేదు కదా..ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో" అంటూ చెప్పాడు సుధీర్. ఈ షోలో ఇంద్రజ, ఆలీ, కావ్య, పండు, జాఫర్, ఆది వంటి వాళ్లంతా వచ్చారు. డాన్స్ లు చేసారు. "మీ అమ్మకు చెప్పు నీ సంగతి తెలుస్తాయి ఇవ్వాళ" అన్నాడు ఆది. "అమ్మను ఎమన్నా అంటే గనక బాగోదు" అంటూ సుధీర్ వార్నింగ్ ఇచ్చాడు. "ఒక్కసారి నాకు ఊపొచ్చాకా అమ్మ కొడుకులిద్దరినీ ఊపేస్తా" అన్నాడు ఆది.  "నీకు ఊపు రావాలేమో నేనెప్పుడూ ఊపు మీదే ఉంటా" అన్నాడు సుధీర్. "పోతారు మొత్తం పోతారు" అని సుధీర్ ఆదిని అన్నాడు. "ఎవరు పోరు మీ అమ్మాకొడుకులిద్దరే బయటకు పోతారంతే" అన్నాడు ఆది. ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నాడు "ఆది - ఇంద్రజ కాంబినేషన్ సూపర్, రష్మీ లేదా పుష్ప, సుధీర్ ఫాన్స్ ఇక్కడ, ఆది ఫాన్స్ ఇక్కడ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బిబి జోడి సీజన్ 2 త్వరలో...జోడీలు వీళ్ళే ?

బిగ్ బాస్ ఐపోగానే ఈ కంటెస్టెంట్స్ అందరితో కలిసి బిబి జోడి పేరుతో ఒక డాన్స్ షో తీసుకురావడం ఆనవాయితీగా మారింది. ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బిబి జోడి సీజన్ 1 ఐపోయింది. ఇక త్వరలో  బిబి  జోడి సీజన్ 2 రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో కొన్ని జోడీలను తీసుకొచ్చి ఒక బంగ్లాలో బంధించి "వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్" అనే వాయిస్ వినిపించింది. తర్వాత అమరదీప్ వచ్చి "మళ్ళీ 100 డేసా" అని అడిగాడు. తర్వాత ప్రదీప్ వచ్చి "కాదు అదిరిపోయే డాన్స్" అన్నాడు. తర్వాత కీర్తి భట్ వచ్చి "సోలోనా" అని అడిగింది. శేఖర్ మాష్టర్ వచ్చి "కాదు జోడి" అన్నాడు. తర్వాత శ్రీదేవి విజయకుమార్ నవ్వుతూ వచ్చింది. ధన్ రాజ్ - భానుశ్రీ, ఆర్జే చైతు - కీర్తి భట్, విశ్వ - నేహా, మణికంఠ - ప్రియాంక సింగ్, అమరదీప్ - నైనికా, సాయి శ్రీనివాస్ - నయనిపావని, మానస్ - స్రష్టి వర్మ, అఖిల్ సార్థక్ - వాసంతి, శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్ జోడీస్ రాబోతున్నారు. "క్లాసైనా, మాస్ ఐనా ఈ స్టేజి దద్దరిల్లిపోవాల్సిందే" అని చెప్పుకొచ్చాడు శేఖర్ మాష్టర్. "ఇది వన్ టైం ఛాన్స్, ఎప్పుడూ చూడని డాన్స్" అంటూ శ్రీదేవి చెప్పింది. "వెల్కమ్ టు ది విశ్వరూపం ఆఫ్ ఎంటర్టైన్మెంట్" అంటూ హోస్ట్ ప్రదీప్ చెప్పాడు.

Bigg Boss 9 Telugu Tanuja: చివరి టాస్క్ లో ఓడిన ఇమ్మాన్యుయేల్.. తనూజ ఎమోషనల్!

బిగ్ బాస్ హౌస్ లో రెండో ఫైనలిస్ట్ కోసం జరిగే పోరులో అందరు ఎలిమినేట్ అవ్వగా రేస్ లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. స్కోర్ బోర్డుపై పాయింట్స్ పెంచుకునేందుకు నెక్స్ట్ టాస్క్ లో పాల్గొనవద్దన్న వాళ్ళని సెలెక చెయ్యండి అని బిగ్ బాస్ చెప్పాడు. అందరు సంజన పేరు చెప్తారు. ఈ టాస్క్ లో తనూజ,ఇమ్మాన్యుయేల్ మాత్రమే ఆడుతారు. సంఛాలక్ గా సంజన ఉంటుంది. బజర్ మోగినప్పుడు బెలూన్ ని చేతితో కాకుండా గాల్లో ఎగిరెస్తూ జాలిలోకి పడెయ్యాలి. అలా టాస్క్ మొదలు అయినప్పుడే ఇమ్మాన్యుయేల్ కాలు బెనుకుతుంది. టాస్క్ ని పాజ్ చేసి ఇమ్మాన్యుయేల్ ని మెడికల్ రూమ్ కి తీసుకొని వెళ్తారు. తన కాలికి పట్టికట్టి పంపిస్తారు. టాస్క్ మళ్ళీ మొదలవుతుంది. టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విన్ అవుతాడు. లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిందని  తనూజ ఎమోషనల్ అవుతుంది. ఇదే నా జీవితం ఎప్పుడు ఇలాగే జరుగుతుందని అంటుంది. ఆ తర్వాత స్కోర్ బోర్డులో ఇమ్మాన్యుయేల్,  తనూజ లీడ్ లో ఉంటారు. మళ్ళీ ముగ్గురికి టాస్క్ ఉంటుంది. నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి ఇస్తున్న చివరి టాస్క్ అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ టాస్క్ లో ముగ్గురు పాల్గొంటారు. అందులో తనూజ విన్ అవుతుంది  ఓడిపోయినందుకు ఇమ్మాన్యుయేల్ ఏడుస్తాడు. ఈ వారం ఒక్క టాస్క్ కూడా ఓడిపోలేదు కానీ ఇక జరిగిందంటూ ఎమోషనల్ అవుతాడు. లీడర్ బోర్డులో తనూజ టాప్ లో ఉంటుంది. దాంతో తనని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. మీరు నామినేషన్ నుండి సేవ్ అవ్వాలంటే.. మీ దగ్గరున్న మనీ పాయింట్స్ ప్రైజ్ మనీ నుండి కట్ అవుతుందని బిగ్ బాస్ చెప్తాడు. వద్దు బిగ్ బాస్ నేను ఆడియన్స్ ద్వారా వెళ్తానని తనూజ చెప్తుంది. అంటే మీరు ఇప్పుడు నామినేషన్ నుండి సేవ్ అవ్వకుండా మీ భవిష్యత్తును ప్రేక్షకుల చేతిలో పెడుతున్నారా అని బిగ్ బాస్ అడుగగా.. అవును బిగ్ బాస్ అని తనూజ చెప్తుంది. దాంతో సరే అని చెప్పి తనూజని వెళ్ళమని చెప్తాడు. మరి తనూజ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా కామెంట్ చేయండి.