బిగ్ బాస్ 9 కి వెళ్లాలనుకునే వాళ్లకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన...శ్రీముఖి
బిగ్ బాస్ సీజన్ 8 రీసెంట్ గా కంప్లీట్ ఐన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు కానీ ఒక వేళ స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ అనుకుంటే మాత్రం మంచి కంటెస్టెంట్స్ అంతా కూడా రెడీ ఉన్నారు. ఐతే ఎక్కడా ? ఏంటి అనుకుంటున్నారా ? రీసెంట్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రసారమయ్యింది. ఐతే ఈ షోలో బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియల్ నటీనటులంతా వచ్చారు.
ఇక శ్రీముఖి కూడా వీళ్లందరినీ టు టీమ్స్ గా విడదీసింది. మధ్యాహ్నం మెగాస్టార్స్ అంటే మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే సీరియల్ టీమ్ వాళ్ళు అలాగే సాయంత్రం సూపర్ స్టార్స్ అంటే సాయంత్రం ప్రసారమయ్యే సీరియల్ టీమ్ వాళ్లంతా వచ్చారు. వాళ్ళల్లో మానస్ (బ్రహ్మముడి), సుహాసిని (మామగారు), బాలు (గుండె నిండా గుడి గంటలు) , ప్రిన్సి, నిరుపమ్ (కార్తీక దీపం), కుట్టి (పాపే మా జీవన జ్యోతి) , డెబీజాని మొదక్ (సత్యభామ)నర్మదా (ఇల్లు ఇల్లాలు పిల్లలు) కృష్ణ (వంటలక్క), ప్రిన్సి (మల్లి) వచ్చారు. తర్వాత వీళ్లందరినీ రెండు టీమ్స్ గా విడదీసి బల్లూన్స్ ని పగలగొట్టించే టాస్క్ ఇచ్చింది. అందులో అందరూ పోటాపోటీగా టాస్క్ కంప్లీట్ చేశారు. ఈ టాస్క్ ఆడిన విధానం చూసిన శ్రీముఖి ఒక మాట అంది..ఈరోజు ఈ టాస్క్ ఆడిన విధానం చూస్తుంటే మీరంతా కూడా బిగ్ బాస్ మెటీరియల్ అని అర్ధమయ్యింది. బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్లంతా ఓకే కానీ వెళ్లని వాళ్ళు వెళ్ళాలి అని కోరుకుంటూ బిగ్ బాస్ ప్రాప్తిరస్తూ అంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఐతే బిగ్ బాస్ టీమ్ గనక ఈ షో ఎపిసోడ్ చూస్తే గనక కచ్చితంగా బిగ్ బాస్ 9 కి వీళ్లల్లో ఎవరో ఒకరిని పిలిచే అవకాశం ఉంటుంది.