ఆరియానా ఇలాంటిదా ? అష్షుని అంతలా హర్ట్ చేసిందా ?

  ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి. లేదంటే ఆ బాధ ఎన్నాళ్లయినా, ఎంతమంది చెప్పిన అది పోదు. ఇప్పుడు ఆరియానా, అష్షు మధ్య జరిగింది అదే. ఫామిలీ స్టార్స్ షో వేదికగా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ అన్నీ బయట పడ్డాయి. "లాస్ట్ ఇయర్ నాకో హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక కాల్ చేస్తారేమో లేదంటే మా ఇంటికి వచ్చి నన్ను చూస్తారేమో అని చెప్పి..ఆ ఫ్రెండ్ ఎవరో కాదు ఆరియానానే... బాగున్నప్పుడు ఏ ఎదవన్నా వస్తాడు..బాలేనప్పుడే కదా రావాలి  " అని అష్షు తన మనసులో బాధను బయటపెట్టింది. " ఇన్ని రోజులు దీన్ని నీ మనసులో పెట్టుకున్నావా.. నేను కాల్ చేస్తే నీ హెయిర్ డ్రెస్సర్ రవి కాల్ తీసాడు. ఆంటీకి నేను మూడు నాలుగు సార్లు కాల్ చేశా. నేను మాట్లాడిస్తాను అన్నారు." అంటూ ఆరియానా ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేసింది. "నాకు తెలీదు..సర్జరీ ఐన పేషెంట్ నుంచి నువ్వు కాల్ ఎక్స్పెక్ట్ చేస్తావని." అని అష్షు అంది. "సర్జరీ ఐన పేషేంట్ వీడియొ కాల్ లో ఒకరికి  అవైలబుల్ గా ఉండి ఇంకో ఫ్రెండ్ కాల్ ని ఇగ్నోర్ చేసిందంటే అర్ధం ఏంటి ..ఎవరు ఇంపార్టెంట్ అనుకోవాలి..నువ్వు నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే చెయ్యి" అంది ఆరియానా.."నిన్ను బ్లేమ్ చేస్తే నాకేం వస్తుంది" అంటూ అష్షు కూడా ఫైర్ అయ్యింది. ఇక ఆరియానా తన పక్కనే ఉన్న డాన్సర్ పండుతో "అరేయ్..అష్షుకి నచ్చినప్పుడు మాట్లాడుతుంది నచ్చనప్పుడు ఇగ్నోర్ చేస్తుందిరా..ఆమెకెన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయో నాకు తెలుసు" అని అరియానా అనేసరికి "ఓకే థాంక్యూ" అని మూతి ముడుచుకుంది అష్షు. ఇలా ఫామిలీ స్టార్స్ షోలో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య అందులోనూ ఎప్పటినుంచి ఫ్రెండ్స్ గా వాళ్ళ మధ్య గట్టిగా ఫైట్ ఐతే జరిగింది.  

Illu illalu pillalu : కళ్యాణ్ కోసం ప్రేమజంట.. స్వయంవరంలో భాగ్యం అతడిని దక్కించుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియస్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -92 లో..... ప్రేమ ధీరజ్ లు కళ్యాణ్ ని వెతకడానికి బస్ లో వెళ్తారు. బస్ పడకతో ప్రేమ వాంథింగ్ చేసుకుంటుంది. అక్కడ పక్కనున్న బామ్మా ప్రేమ నాడీ పట్టుకొని చుస్తుంటే ఎందుకు ఆలా చూస్తున్నావని ప్రేమ అడుగగా.. నెల తప్పావేమోనని చూస్తున్నా కానీ ఇది ఆ వంథింగ్ కాదని బామ్మ అంటుంది. మరొకవైపు రామరాజు పేపర్ పట్టుకొని ఇంట్లోకి వస్తాడు. ఎందుకు ఇంత సంతోషం గా ఉన్నారని వేదవతి అడుగుతుంది. ఏం లేదు రేపు స్వయంవరం ఉంది. అక్కడికి అందరు పెళ్లి సంబంధం కోసం వస్తారు. మనం కూడా చందుని తీసుకొని వెళదామని రామరాజు అంటాడు. చందుకి కావాల్సిన మంచి జోడిని మనం సెలక్ట్ చెయ్యచ్చని రామరాజు అంటాడు. మరొకవైపు భాగ్యం కూతురు వల్లి తనని పెళ్లి చేసుకుంటానంటూ వల్లి వెంట పడుతుంటే.. వల్లి భాగ్యంకి వెళ్లి చెప్పడంతో ఆతన్ని భాగ్యం ఉతికారేస్తుంది. మీరేదో డబ్బున్నోళ్లు అయినట్లు ఎందుకు అంత బిల్డప్.. ఇంత వరకు నీ కూతురుకి పెళ్లి చెయ్యలేదు అంటూ వాడు భాగ్యంతో అంటాడు. అప్పుడే స్వయంవరం అడ్వైటైజ్ మెంట్ వచ్చిన పేపర్ భాగ్యం చూస్తుంది. రేపు ఎలాగైనా ఈ స్వయంవరానికి వెళ్లి అక్కడ గొప్పింటికి కోడలిని చేసి అందరిని నీ గ్రిప్ లో పెట్టుకునేలా  అత్తారింట్లో నువ్వు చక్రం తిప్పేలా చేస్తానని భాగ్యం అంటుంది. ఇప్పుడు మనం స్వయంవారానికి వెళ్ళాలా అని వేదవతి ఇబ్బందిగా అడుగుతుంటే.. వెళ్ళాలి కంపుల్సరీ అని రామరాజు చెప్తాడు. మరోకవైపు భాగ్యం కుటుంబం బట్టల షాప్ కి వెళ్తారు. స్వయంవరానికి వెళ్ళడానికి బట్టలు అద్దెకు తీసుకుంటారు. చందు స్వయంవరానికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే.. రామరాజు వచ్చి మాట్లాడతాడు. మరొకవైపు ప్రేమ వాళ్ళు బస్ దిగి కళ్యాణ్ ఉన్న దగ్గరికి వెళ్తుంటారు. తరువాయి భాగంలో చందుని భాగ్యం చూసి బకరా దొరికాడు.. నీకు నచ్చాడా అంటూ శ్రీవల్లితో అంటుంది. చందు కూడా శ్రీవల్లి వంక చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్, దీపల హ్యాపీనెస్ చూసి జ్యోత్స్న జెలస్.. దశరథ్ కి నిజం తెలుస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారకమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -291 లో...జ్యోత్స్నకి పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. నాకు జ్యోత్స్న చూడగానే నచ్చిందని అబ్బాయి అనగానే నీకు అలా చూడగనే నచ్చితే చిన్నప్పటి నుండి నా బావే ప్రాణం అనుకుంటున్నా.. బావ ఎంత నచ్చాలని జ్యోత్స్న అంటుంది. అతనికి పెళ్లి అయింది అంట కదా అని అతను అంటాడు. అతనికి అన్ని విషయలు చెప్పి తీసుకొని వచ్చానని శివన్నారాయణ అంటాడు. అంటే ఇప్పటికి నా మనసులో నా బావ ఉన్నాడు. కార్తీక్ నా పక్కన ఉన్నాడని ఊహించుకొని పడుకుంటాననగానే శివన్నారాయణ కోప్పడతాడు. దాంతో అబ్బాయి వెళ్ళిపోతు.. మా తాతయ్యకి నాకే అమ్మాయి ఇష్టం లేదని చెప్తానని వెళ్ళిపోతాడు. కార్తీక్ నే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న మూర్ఖంగా మాట్లాడుతుంటే.. సుమిత్ర కోప్పడుతుంది. అయిన మనం ఏం చెయ్యలేం.. అలాంటి కూతురుని కన్నందుకు బాధపడడం తప్ప అని దశరథ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీప, శౌర్యలు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటే.. ఆటో రిపేర్ వస్తుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. నేను మీ రెస్టారెంట్ కోసం చాలా హెల్ప్ చేసానని శౌర్యతో జ్యోత్స్న చెప్తుంది. అవునా చాలా థాంక్స్ అని శౌర్య అంటుంది. పదండి నా కార్ లో వెళదామని జ్యోత్స్న అనగానే.. శౌర్య వెళ్లి కార్ ఎక్కుతుంది. దాంతో దీప కూడా కార్ ఎక్కుతుంది. రెస్టారెంట్ లో కస్టమర్స్ వస్తున్నారంటూ కాంచనతో కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తాడు. అప్పుడే జ్యోత్స్న వాళ్ళు వస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ జ్యోత్స్న.. ఇప్పుడే మీ అమ్మ ఫోన్ చేసి చెప్పిందని కాంచన అంటుంది. బావనే నా భర్త అని జ్యోత్స్న అంటుంటే.. కార్తీక్ కి కోపం వస్తుంది. కాంచన మాత్రం ముందు వెనకాల ఆలోచించకుండా జ్యోత్స్న ని తిడుతుంది. వచ్చావ్ కదా మా రెస్టారెంట్ లో కస్టమర్స్ పెరగడానికి ఒకరకంగా నువ్వు కూడా కారణం కదా అందుకే స్వీట్ తీసుకోమని కార్తీక్ అంటాడు. దీప స్వీట్ తీసుకొని జ్యోత్స్నకి ఇస్తుంది. దీప చేసింది కావాలంటే ఆన్లైన్ ఫెసిలిటి ఉందని కార్తీక్ అనగానే జ్యోత్స్న కి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిని చూసి శ్రీలత షాక్.. ఆ వేలంపాటలో గెలిచేదెవరంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో.... రామలక్ష్మి చీకట్లో ఒంటరిగా నడుస్తూ సీతాకాంత్ తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. సీతా సర్ వేరొకరిని పెళ్లి చేసుకొని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అనుకుంటుంది. సీతాకాంత్ వచ్చి తనని పిలిచినట్లు నువ్వే నా రామలక్ష్మివి నాపై ఒట్టేసి చెప్పమని అన్నట్లు.. దాంతో రామలక్ష్మి నేనే నీ రామలక్ష్మిని అయితే ఏంటి పెళ్లి చేసుకున్నావ్ బాబు ఉన్నాడు.. మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వచ్చావంటు అడిగినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత రామ్ కాళ్ళు సీతాకాంత్ నొక్కుతూ ఉంటాడు. ఈ రోజు మేడమ్ అమ్మ గురించి అడగలేదు.. ఇంకా రోషన్ వాళ్ళ మమ్మీపై అరిచింది.. తనకేమైనా స్క్రూ లూసా అని రామ్ అనగానే అలా అనొద్దు మేడమ్ చాలా మంచిదని సీతాకాంత్ అంటాడు. నేను రేపు వచ్చి మాట్లాడుతానని సీతాకాంత్ అనగానే.. ఎందుకు నాకు అమ్మని సెట్ చెయ్యాలని చెప్పి, నీ భార్యని సెట్ చేసుకుంటున్నావా అని రామ్ అంటాడు. మరోవైపు రామలక్ష్మి భోజనం చేస్తుంటుంది. నీ భర్త రెండో భార్యని చూసావా అని ఫణీంద్ర అడుగుతాడు. చూసాను కానీ అయన తను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో వాళ్లే బలవంతంగా చేసి ఉంటారు. అయిన తన జీవితంలోకి ఇక వెళ్ళనని ఎప్పుడో అనుకున్నాను.. ఇక తన గురించి నాకెందుకని రామలక్ష్మి అంటుంది. నేను ఎప్పుడు ఇక మైథిలీగానే ఉంటాననే ఫణింద్ర వాళ్ళతో రామలక్ష్మి చెప్తుంది. మాక్కవాల్సింది కూడ అదే అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు వేలంపాటకి వస్తారు. తక్కువ పాటకీ కొని సీతా బావకి తెలియకుండా కొంత డబ్బు మన పేరున వేసుకుందామని శ్రీవల్లి అంటుంది.... మీరేందుకు వచ్చారు మైథిలి మేడంతో ఎవరు పోటీ పడలేరని అక్కడున్నా వాళ్ళు అంటారు. అప్పుడే రామలక్ష్మి ఫణీంద్ర వాళ్లు వస్తారు. రామలక్ష్మిని చూసి శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఆవిడే మైథిలి గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని చెప్తారు. వాల్లే నన్ను సీతా సర్ ని విడగొట్టాలని ట్రై చేసిందని ఫణీంద్రతో రామలక్ష్మి అంటుంది.. సరే నువ్వు రామలక్ష్మి అన్న విషయం ఎక్కడా బయటపడ్డనివ్వమని ఫణీంద్ర అంటాడు. రామలక్ష్మితో తగ్గకుండా శ్రీలత వేలంపాట పాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కీలక ఆధారం కనిపెట్టిన అప్పు.. రాజ్ ని కావ్య బయటకు తీసుకొస్తుందా!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -655 లో అందరు కావ్యని నిందిస్తుంటే తన భర్త జైల్లోకి వెళ్తే ఒంటరిగా ఉండేది తనే రాజ్ ని ఎలా కాపాడుకోవాలని కావ్య ఒక యుద్ధమే చేస్తుంది. ఎందుకు అందరు తనని అర్థం చేసుకోవడం లేదని ఇందిరాదేవి అనగానే కావ్యని అపర్ణ హగ్ చేసుకుంటుంది. నేను కూడా నిన్ను అర్ధం చేసుకోలేకపోయానని అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఒకవైపు కావ్య, మరొకవైపు అప్పు లు రాజ్ ని ఎలా బయటకు తీసుకొని రావాలని ఆలోచిస్తుంటారు. అప్పుడే అప్పుకి ఏదో మెసేజ్ వస్తుంది. వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి సామంత్ ని చంపడానికి ఉపయోగించిన ఆయుధం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తే ఎవరు చంపారో తెలుస్తుందని అప్పు అంటుంది. మరొకవైపు రుద్రాణి, అనామిక లు ఫోన్ మాట్లాడుకుంటారు. నువ్వు చాలా గ్రేట్ అనామిక, అనుకున్నది చేసావ్ కానీ నీ పగ కోసం నీకు కాబోయే భర్తని త్యాగం చేసావని రుద్రాణి అనగానే కనిపెట్టేశారా అని అనామిక అంటుంది. మరుసటి రోజు కావ్య, అప్పులు రాజ్ ఆ రోజు రాత్రి వెళ్ళిన ఆఫీస్ కి వెళ్లి అక్కడ సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడతారు..... అతను రౌడీలు వచ్చి ఎటాక్ చేస్తుంటే రాజ్ కి ఫోన్ చేసిన విషయం చెప్తాడు. కాని స్టేబుల్స్ చుట్టుపక్కల అంతా వెతుకుతుంటారు. అక్కడ ఒక రాడ్ దొరుకుతుంది. దానికి బ్లడ్ ఉంటుంది. అది అప్పు చూసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తుంది. మరోవైపు ఇంట్లో ఉన్న అపర్ణ బాధపడుతూ తిండి తిప్పలు లేకుండా ఏడుస్తుంటుంది. అప్పుడే ఇందిరాదేవి అపర్ణకి జ్యూస్ తీసుకొని వస్తుంది. వద్దని అపర్ణ అంటుంది. అప్పు, కావ్యలు వస్తారు. రాజ్ బావ ని బయటకు తీసుకొని వచ్చే ఆధారం ఒకటి దొరికింది. అది ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాం..  ఆ రిపోర్ట్ లో ఎవరు హత్య చేసారో తెలుస్తుందని అప్పు అనగానే అపర్ణ సంతోషపడి జ్యూస్ తాగుతుంది. స్టేషన్ కి కావ్య భోజనం తీసుకొని వెళ్లి రాజ్ కి తినిపిస్తుంది. చాలా కష్టసమయాల్లో నన్ను ప్రాబ్లమ్ నుండి బయటకు పడేసావ్ ఇప్పుడు కూడా నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావని అనుకుంటున్నానని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కే డబ్బులొస్తాయ్

సోషల్ మీడియా కానీ బుల్లితెర మీద షోస్ కానీ ఈరోజున ఎలా ఉన్నాయి అంటే డబుల్ మీనింగ్ థంబ్ నెయిల్స్ లేకపోయినా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకపోయినా వ్యూయర్ షిప్ రావట్లేదు...పైసలు కూడా రావట్లేదు. ఇప్పుడు ఇదే విషయాన్నీ ఇంద్రజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "నేను ఒక షోలో పని చేస్తున్నాను. అది నా షో కాదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కోసం సీన్స్ కోసం చూసేవాళ్ళే ఈరోజున ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాటికే ట్రిపుల్ టైం వ్యూస్ వస్తున్నాయి. ఒక షోలో చెడ్డ విషయం వస్తోంది అనుకున్నప్పుడు ఎవరైనా చూడడం ఆపేయాలి కానీ ఈరోజున అలా జరగడం లేదు. ఒకపక్కన అలా మాట్లాడతారేంటి అంటారు మరో వైపు అలాంటివే చూస్తారు. అంటే ఈరోజు ఛీ అనిపించే వాటికే వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్ బిజినెస్. అలాంటప్పుడు  ఎంటర్‌టైన్‌మెంట్ షో చేసేవాళ్లు ఏం చూస్తారు..ఏ కంటెంట్ కి డబ్బులొస్తున్నాయో ఆ కంటెంట్ మాత్రమే చేస్తారు కదా. ఇక షోలో అంటే  వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు.. మన పని మనం చేస్తున్నాం అనుకుంటా అంతే. నా  వరకూ నేను అంటే మాట్లాడే పద్ధతి, నా డ్రెస్సింగ్ స్టైల్, నేను ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలి అనుకున్నప్పుడు.  పరిస్థితిని బట్టి నేను కొన్ని జోక్స్ ని లైట్ తీసుకుంటా..కాకపోతే అంతకు మించి ఉంటే అది పద్దతి కాదండి అని పక్కకు తీసుకొచ్చి పర్సనల్ గా చెప్తాను..ఏ మీనింగ్ లో చెప్తున్నారో గమనిస్తాను..కొన్ని విషయాల్లో వాళ్ళు చేశారని మనం కూడా చేయకూడదు..ఎందుకంటే మనకు మన సంస్కారం అడ్డుపడుతుంది..కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏదైనా ఉందంటే ఎవరినీ హర్ట్ చేయకుండా చెప్తాను. ఇక మూవీస్ విషయానికి వస్తే కొంచెం ప్రాధాన్యత ఉన్న రోల్స్ వస్తే చేద్దామని చూస్తున్నా. రజాకార్ మూవీలో చాకలి ఐలమ్మ రోల్ కి గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు అందుకున్న. ఇదివరకు ఎక్కడికి వెళ్లిన జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రోల్ గురించి మాట్లాడుతున్నారు.. అలాంటి రోల్స్ చేయాలి అలాంటి రోల్స్ కూడా వస్తున్నాయి " అని చెప్పింది ఇంద్రజ.

Brahmamudi: సామంత్ బాడీపై రాజ్ ఫింగర్ ప్రింట్స్.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -654 లో.....అనామిక తరుపున లాయర్ కావ్యని బోన్ లోకి పిలుస్తాడు. మీరు సామంత్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారా అని అడుగగా.. ఇచ్చామని కావ్య అంటుంది. నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు కదా అని లాయర్ అడుగుతాడు. ఇచ్చామని కావ్య అంటుంది. చూసారా తనే చెప్తుంది.. చంపేస్తామని తన భర్త బెదిరించాడు. అది అందరి ముందు జరగదు కాబట్టి తనే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి చంపాడని అనామిక లాయర్ అటు తిప్పి ఇటు తిప్పి రాజ్ హత్య చేశాడని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత రాజ్ తరుపున లాయర్ అప్పుని బోన్ లోకి పిలుస్తాడు. మీరు రాజ్ హత్య చెయ్యడం దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా కనిపెట్టారా అని అడుగగా.. లేదు అనామిక కంప్లైంట్ ఇవ్వగానే వెళ్లి సెర్చ్ చేస్తే రాజ్ గారి కార్ లో బాడీ దొరికింది అని అప్పు చెప్తుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నా క్లయింట్ ని హత్య చేసాడనడం కరెక్ట్ కాదు.. కాస్త టైమ్ ఇవ్వండి.. బెయిల్ ఇవ్వండి అని రాజ్ లాయర్ జడ్జ్ ని కోరుతాడు. పేరు పలుకుబడి ఉన్న అతను బయటకు పంపిస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని అనామిక లాయర్ అంటాడు. దాంతో జడ్జ్ రాజ్ బెయిల్ ని రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత రాజ్ ని చూసి అపర్ణ ఎమోషనల్ అవుతుంది. అనామిక వచ్చి మీకు శిక్ష తప్పదంటూ మాట్లాడుతుంది. కావ్య వాళ్లందరు ఇంటికి వస్తారు. ఇన్ని రోజులు నువ్వు తీసుకునే నిర్ణయాలు సరైనవి అనుకున్న కానీ ఈ రోజు నా కొడుకు విషయంలో తప్పు చేసావ్.. నా కొడుకుకి వ్యతిరేకంగా మాట్లాడావని కావ్యతో అపర్ణ అంటుంది. ఇక దొరికిందే ఛాన్స్ అని ధాన్యలక్ష్మి, రుద్రాణిలు కావ్యపై విరుచుకుపడతారు. దాంతో అందరు తనని ఎందుకు అంటున్నారు. తనకి ఎంత బాధ ఉందో తెలుసా కుటుంబాన్ని ముక్కలు కాకుండా కాపాడింది.. తన భర్త జైలుకు వెళ్తే బాధపడేది తనే.. రాజ్ ని ఎలా కాపాడుకోవాలో ఒక యుద్ధమే చేస్తుందని ఇందిరదేవి అంటుంది. అపర్ణ అర్థం చేసుకొని కావ్యని హగ్ చేసుకొని బాధపడుతుంది. తరువాయి భాగంలో రాజ్ కోసం కావ్య స్టేషన్ కి భోజనం తీసుకొని వెళ్లి రాజ్ కి తినిపిస్తుంది. ఆ తర్వాత సామంత్ బాడీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ రాజ్ వే అని నిర్ధారణ అయిందని జడ్జ్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : పెళ్లిచూపుల్లో కార్తీక్ గురించి చెప్పేసిన జ్యోత్స్న.. షాక్ లో శివన్నారాయణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -290 లో......జ్యోత్స్న, కార్తీక్ వాళ్ల దగ్గరికి వచ్చి రెస్టారెంట్ కి కస్టమర్స్ రాకుండా చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు దాస్ దగ్గరికి డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. మళ్ళీ ఏదైనా పేపర్ పై రాస్తున్నాడా అని అడుగుతాడు. ఏం లేదని స్వప్న, కాశీలు డాక్టర్ కి చెప్తారు. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళిపోయాక బెడ్ కింద స్వప్నకి ఒక పేపర్ కన్పిస్తుంది. అందులో దీపం వెళుగుతున్నట్లు ఉండే బొమ్మ గీసి ఉంటుంది. మావయ్య గారు ఇది ఎందుకు రాసారని స్వప్న అంటుంది. ఇది వరకు కొన్ని పదాలు రాసాడు కదా.. వాటికి వీటికి జత చేసి చూద్దామని స్వప్న అంటుంది. అలా స్వప్న చెప్తుంటే నాన్న గుర్తులేక ఏదో ఒకటి రాస్తే నువ్వు ఇలా చెప్తున్నావని కాశీ అంటాడు.ఆ తర్వాత శౌర్యా అద్దంలో చూసుకుంటూ నేను చాలా బాగున్నా కదా అంటుంది. అవును మీ అమ్మ చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదని అనసూయ అంటుంది. దాంతో శౌర్య, దీప చిన్నప్పటి ఫోటోని చూసి ఇది నాన్నకి చూపిస్తాను అంటూ వెళ్తుంది. కార్తీక్ కాంచన తో మాట్లాడుతుంటే.. శౌర్య వెళ్తుంది. కార్తీక్ బాబు ని విసిగించకని దీప వెనక్కి పంపిస్తుంది. శౌర్య ఫోటో గదిలో పడేస్తుంది. కార్తీక్ కాలికి తగులుతుంది. ఫోటో తీస్తాడు.. చూడబోతుంటే అప్పుడే కార్తీక్ కి ఫోన్ వస్తుంది. ఫోటో చూడడు. మరుసటి రోజు కార్తీక్ రెస్టారెంట్ కి జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్న వచ్చేసరికి కార్తీక్ రెస్టారెంట్ కస్టమర్స్ తో నిండిపోతుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. చాలా థాంక్స్ సీఈఓ గారు మీ వల్లే మా రెస్టారెంట్ కి జనాలు ఎగబడ్డారంటూ ముందు రోజు కార్తీక్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు జ్యోత్స్నకి వీడియో చూపిస్తాడు‌. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. జ్యోత్స్న రెస్టారెంట్.. సీఈఓ సత్య రాజ్ రెస్టారెంట్ లో అంటూ టైటిల్ అంటూ కార్తీక్ చూపిస్తాడు. మీకు ఇలా చెయ్యడం సిగ్గు అనిపించడం లేదా అని జ్యోత్స్న కోప్పడుతుంది. ఈ వీడియో మేం తియ్యలేదు ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారని కార్తీక్ అనగానే.. జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. జ్యోత్స్న ఇంటికి వెళ్లేసరికి శివన్నారాయణ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అబ్బాయితోనే డైరెక్ట్ కార్తీక్ గురించి జ్యోత్స్న చెప్పేస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : ఆమె రామ్ తల్లి అని ఫ్రస్టేట్ అయిన రామలక్ష్మి.. సీతాకాంత్ కనిపెట్టగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -337 లో..... సీతాకాంత్ సిరి ఫోటో చూస్తూ.. తన బాధని చెప్పుకుంటాడు. రామలక్ష్మి ఏమైనా నన్ను తప్పుగా అర్థం చేసుకుందేమో వెళ్లి అర్ధమయ్యేలా చెప్పాలి. తనే రామలక్ష్మి అని చెప్పించాలని సీతాకాంత్ అనుకుంటాడు. అలా సీతాకాంత్ సిరి ఫోటో దగ్గర ఏదో మాట్లాడుకోవడం.. శ్రీవల్లి, శ్రీలత లు చూస్తారు. ఎన్నడు లేనిది బావగారు ఈ రోజు ఇలా ఉన్నారని శ్రీవల్లి అంటుంది. సిరి అన్న నేనన్న ఇష్టం కదా అందుకే అలా అని శ్రీలత అనగానే.. మీ కంటే ఎక్కువ ఆ రామలక్ష్మి అని శ్రీవల్లి అంటుంది. రామ్ అమ్మ కావాలంటున్నాడు మళ్ళీ మనకేదో కష్టాలు మొదలవుతన్నాయనిపిస్తుందని శ్రీవల్లి అంటుంది. ఎందుకు అలా అంటావంటూ శ్రీలత కోప్పడుతుంది. సీతాకాంత్ రామ్ ని స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడే రామ్ ఫ్రెండ్ వాళ్ల మమ్మీ వస్తుంది. తను తన అబ్బాయి టీసీ కోసం వస్తుంది. రామ్ తనని అంటీ అంటుంటే నన్ను అంటీ అనకు.. నా పేరు మమత కదా.. మామ్ అని స్టైల్ గా అను అని ఆవిడ అంటుంది. మమత, రామ్ సీతాకాంత్ ముగ్గురు కలిసి వస్తుంటే రామలక్ష్మి చూసి రామ్ వాళ్ల మమ్మీ తనేనేమో అని అనుకు.టుంది. మమతకి కంట్లో ఏదో పడితే సీతాకాంత్ తీస్తాడు. దాంతో రామలక్ష్మి కోపం వచ్చి లోపలికి వెళ్తుంది. సీతాకాంత్ ఫోన్ వస్తే పక్కకి వెళ్తాడు. రామలక్ష్మి దగ్గరికి రామ్ వెళ్ళగానే మీ మామ్ ని రమ్మని చెప్పు అంటుంది. ఈవిడ కూడా మామ్ అని పిలుస్తుందా అని రామ్ అనుకుంటాడు. మీ అబ్బాయి ఏం చేసాడో తెలుసా అంటూ రామ్ గురించి రామలక్ష్మి మమతకి చెప్తుంది. మా అబ్బాయి అలాంటి వాడు కాదని మమత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. రామ్ మమత చీర కొంగుపై నిలబడి ఉంటే.. రామ్ ని పక్కకి జరిపి కొంగు దులిపి మమతకి ఇస్తాడు. దాంతో రామలక్ష్మికి ఇంకా కోపం వస్తుంది. మా అబ్బాయికి టీసీ ఇవ్వమని మమత తన అబ్బాయి రోషన్ గురించి మాట్లాడుతుంటే.. రామలక్ష్మి మాత్రం రామ్ అనుకొని టీసీ ఇవ్వడం కుదరదంటూ కోపంగా వెళ్లిపోతుంది. ఇంకొక టీచర్ కి మాకూ బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది టీసీ అడిగితే ఆవిడేంటి అలా కోపంగా వెళ్తుందని మమత చెప్పాగానే.. నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని మమతని పంపిస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి పక్కకి వచ్చి ఫ్రస్ట్రేషన్ అవుతుంటే.. రామ్, సీతాకాంత్ చూస్తారు. మా మేడం ఎందుకు చాలా కోపంగా ఉందని రామలక్ష్మి దగ్గరికి వెళ్లి తనకి స్ట్రస్ బాలు చేతిలో పెడతాడు. ఎందుకు రామలక్ష్మి ఇంత కోపంగా ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒంటరిగా నడుచుకుంటూ సీతా సర్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారంటూ తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. అప్పుడే వెనకాల నుండి రామలక్ష్మి అంటూ సీతాకాంత్ పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : వాడి లొకేషన్ దొరికేసింది.. ప్రేమ, ధీరజ్ కలిసి కళ్యాణ్ ని వెతికి పట్టుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -91 లో..... ప్రేమ, ధీరజ్ లు కలిసి కళ్యాణ్ గాడిని పట్టుకోవాలని ట్రై చేస్తారు. ప్రేమ పేరున సిమ్ తీసుకొని అందులో ఉన్న నంబర్స్ బ్యాకప్ చేసి కళ్యాణ్ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తారు. అందరు తమకి తెలియదని అంటారు. దాంతో ధీరజ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి కళ్యాణ్ నెంబర్ చెప్పి ట్రేస్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు అలిసిపోయి గుమ్మం ముందే ఒకరి భుజాలపై ఒకరు పడుకుంటారు. ప్రొద్దున లేచేసరికి కూడా అలాగే ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ వాళ్లిద్దరి చుట్టూ చేరతారు. ఇద్దరు నిద్ర లేచి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ధీరజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి కళ్యాణ్ అడ్రెస్ తెలిసిందని చెప్తాడు. ప్రేమ, ధీరజ్ లు ఇద్దరు వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నారని వేదవతి అడుగగా.. కాలేజీకీ అంటూ కవర్ చేస్తారు. మరొకవైపు రామరాజు, తిరుపతి లు బయటకు వెళ్తుంటారు. మిల్ కి వెళ్ళాలని లేదంటూ రామరాజు ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగాలని అనుకుంటాడు. అక్కడున్న జనాలు అందరు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారట అని అనగానే అవమానంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ, ధీరజ్ లు కళ్యాణ్ ని పట్టుకోవడానికి వెళ్తారు. ఇద్దరు బస్ లో వెళ్తారు. ప్రేమ వంథింగ్ చేసుకుంటుంటే ధీరజ్ వెళ్లి వాటర్ ఇస్తాడు. ప్రేమ, ధీరజ్ లు లోపలకీ వచ్చాక బస్ లో ఒక బామ్మ ప్రేమ నాడి పట్టుకొని చూస్తుంది. ఎందుకు ఇలా చూస్తున్నారని ప్రేమ అడుగుతుంది. నెల తప్పవేమో అని బామ్మా అనగానే.. ప్రేమ, ధీరజ్ లు షాకింగ్ గా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆర్జే కాజలా మాజాకానా..ఆస్కార్ అవార్డుకె గేలం వేసింది..

ఆర్జే కాజ‌ల్ అంటే తెలియని వాళ్లుండరు. ఆర్జేగా రేడియోలో గ‌ల గ‌ల మాట్లాడుతూ శ్రోత‌ల‌ను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. అంతే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంక‌ర్ గా షోస్ చేస్తూ ఉంది. అలాగే  బిగ్ బాస్ సీజ‌న్ - 5కి వెళ్లి ఫేమ‌స్ అయ్యింది. ఎన్నో సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పింది. అలాగే ఎక్స్పోజ్డ్ అనే వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించింది. అలాంటి కాజల్ బుల్లితెర మీద ఎన్నో షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. రీసెంట్ గా సుమ అడ్డా షోకి కూడా వచ్చింది. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. రాగానే అందరికీ పులిహోర ఇచ్చింది సుమా. ఇక ఈ షోకి మహేష్ విట్టా, శ్వేతా వర్మ, నటరాజ్ మాష్టర్, ఆర్జే కాజల్ వచ్చారు. వీళ్లందరినీ ఒక ప్రశ్న కూడా అడిగింది. "ఒకవేళ శివుడు  ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం కోరుకోమంటే మీరేం కోరుకుంటారు" అని అడిగింది. "ఒక వీక్ వరకు నేను ఎవరికీ కనబడకూడదు" అని నటరాజ్ మాష్టర్ చెప్పేసరికి "దానికి దేవుడు ఎందుకు సెల్ పట్టుకుని కూర్చుంటే మీరు ఎవరికీ కనపడరు" అంటూ కాజల్, సుమ చెప్పారు. తర్వాత కాజల్ తన కోరిక చెప్పింది.."అంటే ఇప్పుడిప్పుడే యాక్టింగ్ లోకి అరంగేట్రం చేసాను కాబట్టి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటాను" అని చెప్పింది. దానికి సుమ "చూసారా రాజమౌళి గారు..మీరు ఒక జనరేషన్ ని ఎలా పాడు చేసారో..మీకు అర్ధమవుతోందా ఇదంతా మీరు చేసిందే అని" అంటూ రాజమౌళి మీద సెటైర్స్ వేసింది సుమ . అంటే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన  ఆర్ఆర్ఆర్ మూవీస్లోని "నాటు నాటు" సాంగ్ కి  ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక సుమ కూడా ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ చెప్పింది. ఇక మహేష్ విట్టా ఐతే "దేవుడు నాకు డే అండ్ నైట్ షూట్స్ వచ్చేలా చేయాలి..కళ్ళు తిరిగి కింద పడిపోయేలా చేతినిండా షూట్స్ ఉండాలి" అన్నాడు. "మంచి కొరికే కానీ కళ్ళు తిరిగి పడిపోవాలి అన్న లైన్ మాత్రమే దేవుడు వింటే ప్రాబ్లమ్ అవుతుంది" అని సెటైర్ వేసింది సుమ. ఇక శ్వేతా వర్మ ఐతే తన ఫాదర్ తో కలిసి వరల్డ్ టూర్ కి వెళ్ళాలి అని కోరుకుంది.    

రోజాతో ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాల్తాయి

  జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4  మార్చ్ 2 నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఇక దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో రోజా డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఈ షోకి హోస్టస్ గా యాంకర్ రవి, అష్షు రెడ్డి వ్యవహిస్తున్నారు. ఇక ఈ షోకి అందాల నటుడు శ్రీకాంత్ ఆయనకు అటు రాశి, ఇటు రోజా నిలబడి చిన్న స్టెప్స్ వేశారు. ఇక శ్రీకాంత్ ఐతే వీళ్ళ మీద కామెంట్స్ కూడా చేసాడు. "రాశి నవ్వితే ముత్యాలు రాల్తాయి..రోజా దగ్గర ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాల్తాయి" అని చెప్పేసరికి రోజా, అష్షురెడ్డి నవ్వేశారు. ఇక ఈ సీజన్ ఛాంపియన్ షిప్ కి శ్రీకాంత్, రోజా, రాశి జడ్జెస్ గా వ్యవహరించబోతున్నారు. ఇక జీ తెలుగులో ప్రసారమయ్యే 16 సీరియల్స్ ఇప్పుడు ఒక ఛాంపియన్ షిప్ కోసం ఫైట్ చేసే ఒక రియాల్టీటీ షో ఇప్పుడు ఆడియన్స్ ని సరికొత్తగా ప్రతీ ఆదివారం అలరించడానికి రాబోతోంది. రోజా పాలిటిక్స్ లోకి వెళ్ళాక బుల్లితెర షోస్ కి బైబై చెప్పింది. ఇక ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఫ్రీ అయ్యాక ఆమె చేస్తున్న మొదటి రియాలిటీ షో ఇది. ఇక నటి  రాశి సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నో మూవీస్ చేసింది. ఇక ఇప్పుడు బుల్లితెర మీద కూడా కొన్ని సీరియల్స్ లో చేసింది. గిరిజా కల్యాణం, జానకికలగనలేదు వంటి హిట్  సీరియల్స్ లో నటించింది. ఇక శ్రీకాంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి నెమ్మదిగా హీరోగా మారారు. సురేశ్ ప్రొడక్షన్‌‌లో వచ్చిన తాజ్‌మహల్ సినిమా శ్రీకాంత్ కెరీర్‌ను మలుపుతిప్పింది. తర్వాత రాఘవేంద్రరావు పెళ్లిసందడి మూవీతో కథానాయకుడిగా సెటిల్ అయ్యాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో శ్రీకాంత్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇలా త్రి లెజెండరీ నటులు ఈ షోకి జడ్జెస్ గ వ్యవహరించబోతున్నారు.   

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కాకుండా రష్మీ చేసే ఇంకో పార్ట్ టైం జాబ్ ఏంటో తెలుసా ?

  శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం శివరాత్రి స్పెషల్ గా శంభో శివ శంభో కాన్సెప్ట్ తో వచ్చింది. ఇందులో డాన్స్, సాంగ్స్, ఇంకా స్పెషల్ సెగ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇక నాటీ నరేష్ సెగ్మెంట్ ఫుల్ జోష్ తో నవ్వు తెప్పించింది. ఈ సెగ్మెంట్ లో ఇంకో విషయం కూడా బయటపడింది. రష్మీ పార్ట్ టైం జాబ్ చేస్తుందన్న విషయాన్నీ నరేష్ చెప్పేసాడు. అదేంటో చూద్దాం. ఐతే ఈ మధ్యకాలంలో మహాకుంభ మేళాకు మోనాలిసా అనే తేనే కళ్ళ అమ్మాయి పూసలమ్ముతూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె గెటప్ తో నాటీ నరేష్ వచ్చి ఈ సెగ్మెంట్ లో అందరినీ నవ్వించాడు. ఆ అమ్మాయిలాంటి డ్రెస్ పూసలు వేసుకొచ్చి "నాలో ఊహలకు " అనే సాంగ్ పాడుతూ కింద పడి డాన్స్ చేస్తూ నవ్వించాడు నరేష్. ఇక పూసల దండల్ని  కూడా తనకు నచ్చిన ఇంద్రనీల్ కి , సింగర్ ధనుంజయ్ మెడలో వేసాడు. తరవాత నరేష్ తో కలిసి రామ్ ప్రసాద్ పంచ్ ప్రసాద్ కూడా జోక్స్ వేశారు. "మోనాలిసా నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో పూసలమ్ముతున్నావ్ కదా...మరి మహాకుంభా మేళాలో ఎవరు అమ్ముతున్నారు" అంటూ పంచ్ ప్రసాద్ నరేష్ ని అడిగాడు. "మహాకుంభ మేళాలో రష్మీ పూసలమ్ముతుంది." అనేసరికి ప్రసాద్ షాకయ్యాడు. "రష్మీ పూసలమ్ముతుందా" అన్నాడు. "అవును ఇంతకు ముందు ఇద్దరం పూసలమ్మేవాళ్ళం తెలుసా"? అన్నాడు వంకర్లు తిరుగుతూ. "హే అట్లాంటివి బయటకు చెప్పకూడదు.. అది నా పార్ట్ టైం జాబ్" అని సీరియస్ ఫేస్ తో చెప్పింది రష్మీ . "సరే మోనాలిసా నీకు ఈ ముత్యాలు ఎక్కడినుంచి వస్తాయి" అని పంచ్ ప్రసాద్ అడిగేసరికి "నవ్వితే ముత్యాలు రాలతాయి అంటారు అవన్నీ నా నవ్వుల ముత్యాలే" అన్నాడు నరేష్. "ఇలాంటి జోక్స్ వేస్తె పళ్ళు రాల్తాయి" అన్నాడు నూకరాజు. ఇలా ఈ సెగ్మెంట్ లో రష్మీ పూసలమ్ముతూ పార్ట్ టైం జాబ్ చేస్తోందన్న విషయం తెలిసింది. అంటే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే బీడ్స్ సేల్స్ మంచి సంపాదనే అంటున్నారు నెటిజన్స్.

Illu illalu pillalu : కలిసిపోయిన ప్రేమ జంట.. మురిసిపోయిన అత్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -90 లో..... ప్రేమ కన్పించకపోవడంతో రెండు కుటుంబాలు టెన్షన్ పడతాయి. ప్రేమని ధీరజ్ తీసుకొని రావడంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. రేవతి ప్రేమ దగ్గరికి వచ్చి ఎమోషనల్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళావ్ చెప్పి వెళ్ళాలి కదా అంటూ దిష్టి తియ్యాలంటూ ప్రేమ చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్తుంటే ప్రేమ ఆపుతుంది. రేవతి ఆ మధ్యలో ఉన్న గీతని చూసి చెయ్ వదిలిపెట్టి బాధపడుతూ వెళ్ళిపోతుంది.  ఆ తర్వాత ప్రేమని వేదవతి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఎందుకు ఇలా చెప్పకుండా వెళ్ళావ్.. ఎంత కంగారు పడ్డామో తెలుసా అని వేదవతి అంటుంది. ప్రేమ అసలు విషయం చెప్పబోతుంటే ధీరజ్ ఆపుతాడు. ఆ తర్వాత ఎందుకు అలా వెళ్ళావని ధీరజ్ తిడుతుంటే అప్పుడే నర్మద, వేదవతి లు ప్రేమ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతారు. నగల కోసం వెళ్ళాను.. ఈ దీరజ్ నన్ను మాటలతో టార్చర్ పెడుతున్నాడు.. నీ వల్లే మా నాన్న ఇలా స్టేషన్లో ఉన్నాడంటూ నన్ను తిడుతున్నాడు.. అది భరించలేక నగల కోసం కళ్యాణ్ ని వెతుక్కుంటూ వెళ్ళానని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. వాడేదో బాధలో అన్నాడని  వేదవతి సర్ది చెప్పుతుంది. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ కొట్టినందుకు సారీ చెప్తాడు. ప్రేమ కూడా ధీరజ్ ని కొట్టినందుకు సారీ చెప్తుంది. ఇద్దరు కలిసి నగలు తీసుకొని రావాలనుకుంటారు. ప్రేమ దగ్గర ఫోన్ లేకపోవడంతో తన పేరుపై సిమ్ తీసుకొని నెంబర్స్ అన్ని బ్యాక్ అఫ్ చెయ్యాలనుకుంటారు. వెంటనే ప్రేమని ధీరజ్ తీసుకొని వెళ్తాడు. వాళ్ళు అలా వెళ్లడం చూసి వేదవతి, నర్మదలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ పేరున సిమ్ తీసుకొని మళ్ళీ ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్నని అర్థం చేసుకున్న శివన్నారాయణ.. కార్తీక్ వార్నింగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -289 లో.... జ్యోత్స్నతో పారిజాతం మాట్లాడుతుంది. రాను రాను మీ తాతయ్య దృష్ణిలో నీ మీద ఇంప్రెషన్ పోతుందని పారిజాతం అనగానే.. సత్యరాజ్ రెస్టారెంట్ విషయంలో అంతా ఒకే అయిపోయింది కానీ ఆ దీప వెళ్లి ఏదో మాయ చేసిందని జ్యోత్స్న అంటుంది. అప్పుడే జ్యోత్స్న అంటూ శివన్నారాయణ గట్టిగా పిలుస్తుంటాడు. మళ్ళీ ఏం చేసావే అంటూ పారిజాతం కంగారుపడుతుంది. ఎందుకు ఇలా చేశావ్.. అబద్ధాలతో ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావ్.. అడిట్ లో ఎందుకు తప్పుడు ప్రాఫిట్ చుపించావంటూ శివన్నారాయణ గట్టిగా నిలదీస్తాడు. దాంతో పారిజాతం జ్యోత్స్న టెన్షన్ పడతారు. నువ్వు ఎంప్లాయిస్ విషయంలో ఫెయిల్ అయ్యావ్.‌ రెస్టారెంట్ కొనడంలో, ప్రాఫిట్ లో ఇలా అబద్ధాలని చెప్పడంలో కూడా ఫెయిల్యూర్ అయ్యావ్.. ఇదంతా ఆ కార్తీక్ వల్లే... కార్తీక్ కార్తీక్ అంటూ వాడి వెంటపడి ఇలా చేస్తున్నావ్.. ఇక నేనొక నిర్ణయం తీసుకున్నాను.. నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నానని శివన్నారాయణ అనగానే.. నో నేను ఒప్పుకోను.. బావనే నా భర్త అంటూ మొండిగా మాట్లాడుతుంది. దాంతో కోపంగా జ్యోత్స్న వెళ్ళిపోతే.. వెళ్లి పెళ్లికి ఒప్పించమని పారిజాతాన్ని శివన్నారాయణ పంపిస్తాడు. అడిట్ విషయంలో ఏం అనకండి.. తప్పు మనది కూడా ఉంది. అది అలా తయారవ్వడానికి కారణం మనమే అని  సుమిత్ర, దశరత్ లతో శివన్నారాయణ అంటాడు. మావయ్య జ్యోత్స్నని బాగా అర్థం చేసుకున్నాడు అలాగే అందరిని అర్ధం చేసుకుంటే బాగుండని సుమిత్ర అనుకుటుంది. ఆ తర్వాత కార్తీక్, దీపలు కలిసి సత్యరాజ్ రెస్టారెంట్ ఓపెన్ చేసి పూజ చేస్తారు. ఆ తర్వాత అక్కడున్న చెఫ్ లతో కార్తీక్ మాట్లాడతాడు. మళ్ళీ ఏ విధంగా నెంబర్ వన్ కి తీసుకొని రావాలని క్లియర్ గా చెప్తాడు. స్పెషల్ డిష్ గా ఉప్మా బిర్యానీ అంటూ బోర్డు పెడతారు. కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత రెస్టారెంట్ కి జ్యోత్స్న వస్తుంది. ఎందుకు వచ్చావని కార్తీక్ అడుగుతాడు. నేను కస్టమర్.. తినడానికి వచ్చానని అంటుంది. ఆ తర్వాత ఉప్మా బిర్యానీ ఆర్డర్ చేస్తుంది. అది తిన్న జ్యోత్స్న.. బాగుంది అంటుంది కానీ ఏం బాగోలేదంటూ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను.. అప్పుడు ఈగలు, దోమలు కొట్టుకుంటూ ఉండాలని అనగానే.. కార్తీక్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అమ్మని తీసుకొని రమ్మని చెప్పిన రామలక్ష్మి.. రామ్ తీసుకొస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -336 లో..... సీతాకాంత్ స్కూల్ కి రావడం చూసిన శ్రీవల్లి, శ్రీలతకి చెప్తుంది. మనం వచ్చాము కదా స్కూల్ కి వాడేందుకు వచ్చాడు.. వాడి వెనకాలే వెళ్లి కనుక్కోవాలని శ్రీలత వాళ్ళు అనుకుంటారు. సీతాకాంత్ మాత్రం రామలక్ష్మి కోసం వెతుకుతుంటాడు. రామలక్ష్మి ఎదరుపడి కిందపడిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకుంటాడు. మళ్ళీ ఎప్పటిలాగే నువ్వు నా రామలక్ష్మివి అంటుంటాడు. కాదని రామాలక్ష్మి అంటుంది. అదంతా దూరం నుండి శ్రీలత వాళ్ళు చూస్తుంటారు కానీ సీతాకాంత్ అడ్డుగా ఉండడంతో రామలక్ష్మి మొహం కన్పించదు. రామలక్ష్మి అక్కడ నుండి రామ్ ఉన్న క్లాస్ లోకి వెళ్తుంది. క్లాస్ లోకి వెళ్ళేటప్పుడు.. రామ్ ఆయిల్ పోస్తాడు. అది రామలక్ష్మి చూస్తుంది.  రామలక్ష్మిపై రివెంజ్ తీర్చుకోవడానికి రామ్ ప్లాన్ చేసినవి అన్ని రామలక్ష్మి కనిపెడుతుంది. ఈ చాక్లెట్ ఈ డ్రాయింగ్ వేసిన వాళ్ళకిద్దామనుకున్నా.. అయ్యో ఎవరు లేరా.. ఈ చాక్లెట్ నేనే తింటానని రామలక్ష్మి అనగానే.. దాక్కొని ఉన్న రామ్ బయటకు వస్తాడు. ఇదంతా నాపై రివెంజ్ ప్లాన్ చేసావా.. మీ నాన్నని పిలవమని చెప్తాననగానే వద్దని రామ్ అంటాడు. అయితే మీ అమ్మని రేపు తీసుకొనిరా అని రామలక్ష్మి చెప్తుంది. రామ్ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ.. రేపు మా మేడమ్ అమ్మని తీసుకొని రమ్మంది. నాకు రేపు ప్రొద్దున కల్లా అమ్మ కావాలంటు రామ్ చెప్తాడు. మరుసటి రోజు రామలక్ష్మి ధ్యానం చేస్తుంటుంది అయిన సీతాకాంత్ గుర్తుకు వస్తుంటాడు. అప్పుడే సుశీల, ఫణింద్రలు వచ్చి రామలక్ష్మి తో మాట్లాడతారు. నువ్వు మైథిలిగా ఉండడం మా అదృష్టం అంటారు. ఆ తర్వాత సీతాకాంత్ సిరి ఫోటో దగ్గరికి వెళ్లి బాధపడతాడు. ఒకవేళ రామలక్ష్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో.. వెళ్లి ఆ బాబు నీ బాబు అని చెప్తానంటూ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కోర్టులో భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన భార్య.. బెయిల్ రద్దు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -653 లో... అనామిక కుట్రలో భాగంగా రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాజ్ ని అప్పు అరెస్ట్ చెయ్యడంతో ఇంట్లో వాళ్ళందరు అప్పుపై కోపంగా ఉంటారు. అప్పు రాగానే ఎందుకు రాజ్ ని అరెస్ట్ చేసావంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మిలు తనపై విరుచుకుపడతారు. బావని అరెస్ట్ చెయ్యడానికి నేను ఏంత ఇబ్బంది పడ్డానో మీకేం తెలుసని అప్పు అంటుంది. అప్పు తన డ్యూటీ తను చేసిందని కళ్యాణ్ అంటాడు. ఇంట్లో అందరు రాజ్ స్టేషన్లో ఉన్నాడని బాధపడుతుంటారు. అపర్ణకి కావ్య భోజనం తీసుకొని వస్తుంది. నేను తిననంటూ అపర్ణ బాధపడుతుంటే.. నేను తప్పకుండా ఆయన్ని బయటకు తీసుకొని వస్తాను.. అప్పు ఆయన్ని అరెస్ట్ చేసినందుకు ఎంత బాధపడుతుందో నాకు తెలుసని అపర్ణతో కావ్య అంటుంది. అదంతా అప్పు విని తన గదిలోకి వెళ్లి బాధపడుతుంది. కళ్యాణ్ వచ్చి నువ్వేం కావాలని చెయ్యలేదు.. నీ డ్యూటీ నువ్వు చేసావని అంటాడు. నేను పోలీస్ అవ్వకుండా ఉంటే బాగుండు.. ఇలా నా వాళ్ళని నేనే బాధపెడుతున్నానని అప్పు బాధపడుతుంది. మరుసటిరోజు రాజ్ ని కోర్ట్ కి తీసుకొని వస్తారు. రాజ్ తరుపున లాయర్ రాజ్ కి పాజిటివ్ గా మాట్లాడుతుంటే.. అనామిక లాయర్ అతను తప్పు చేసాడంటూ వాదిస్తాడు. ఇప్పుడు ఒక సాక్షిని ప్రవేశపెట్టాలని అనామిక లాయర్ కావ్యని రప్పిస్తాడు. సామంత్ మా కంపెనీని నాశనం చెయ్యాలని చూసాడు.. కేవలం వార్నింగ్ మాత్రమే రాజ్ ఇచ్చాడు అని కావ్య చెప్తుంది. తరువాయి భాగం లో రాజ్ కి బెయిల్ రద్దు అవుతుంది. ఆ తర్వాత భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావని కావ్యపై కోప్పడుతుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రష్మీకి కొత్త బాయ్ ఫ్రెండ్ ...అతనేనా ?

  శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. శంభో శివ శంభో పేరుతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఇందులో ఒక ఇంటరెస్టింగ్ విషయం ఐతే బయట పడింది. ఇంతకు అదేంటో చూద్దాం. నూకరాజు ఈ షోకి కాషాయ వస్త్రాలు వేసుకుని కమండలం పట్టుకుని దేశముదురులో గడగడా గుడుంబా శంకర్ అంటూ ఆలీ ఎలా ఉంటాడో ఆ గెటప్ లో వచ్చాడు. తర్వాత రామ్ ప్రసాద్ ని నూకరాజు పిలిచాడు. "రామ్ ప్రసాద్ గారు మీరొస్తే ఒకరి గురించి చెప్పాలి" అన్నాడు. తర్వాత రాంప్రసాద్ వచ్చి "స్వామి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా రష్మీకి పెళ్లవుతుందా" అని అడిగాడు. దానికి రష్మీ "ఇది ఒక ఎపిసోడ్ పడుతుందిలే" అంటూ కామెడీగా చెప్పింది. తర్వాత నూకరాజు నేల మీద కూర్చుని ఏదో ముగ్గు వేస్తూ "ఓం సుడిగాలిం..సుడిగాలిం" అన్నాడు దానికి రష్మీ ఓ రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. తర్వాత నూకరాజు మళ్లీ  "కాదు కాదు..ఆది గాలిం" అన్నాడు. దానికి రష్మీ "ఎహ్" అంటూ చిరాగ్గా ముఖం పెట్టింది. "ఆది ఈ మధ్య మీకు ట్రై చేస్తున్నాడు. కానీ మీకు తెలియట్లేదు" అనేశాడు ఫ్లోలో. దానికి రష్మీ కూడా షాకయ్యింది. ఆ తర్వాత జడ్జ్ ఇంద్రజ ఐతే "అవునా" అంది. "ఒక్క నిమిషం రష్మీకి పెళ్లవుతుందో లేదో చెప్తాను" అంటూ మంత్రించిన నిమ్మకాయను వదిలాడు. అది రష్మీకి కొంచెం ముందుగా వచ్చి ఆగింది. "కష్టం ఈ నిమ్మకాయతో జ్యూస్ చేయడం కష్టం" అని చెప్పాడు "రష్మీ పెళ్లెప్పుడవుతుందో తెలుసా ..సరిగ్గా పది సంవత్సరాల తర్వాత" అన్నాడు. "అప్పటికి రష్మీ ముసల్ది ఐపోతుంది కదా" అన్నాడు రాంప్రసాద్. "ఏ ఏంటి మీరు అవుతారు ముసలోళ్ళు" అని రష్మీ కౌంటర్ వేసేసరికి ఇంద్రజ ఊరుకోలేదు.. "అసలు పదేళ్ల తర్వాత ఆ నూకరాజు ఉంటాడో లేదో చూడండి" అంది అంతే నూకరాజు ఫేస్ మాడిపోయింది.

హాస్పిటల్ కి వెళ్లిన శోభా...డాక్టర్స్ ఎం చెప్పారంటే ?

    శోభా శెట్టి కొద్దీ రోజుల నుంచి హెల్త్ అప్ సెట్ అవడంతో వీడియోస్ చేయలేకపోతోందట. ఐతే ఈ విషయాన్నీ తన యూట్యూబ్ వీడియొ ద్వారా ఎక్స్ప్రెస్ చేసింది. ఐతే తేజ వాళ్ళ ఫామిలీ హైదరాబాద్ రావడంతో వాళ్ళను కలవాలని అది కూడా ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ చేయడానికి వెళ్లాలనుకుందట. కానీ వాళ్ళే శోభాకు సర్ప్రైజ్ చేసినట్టు చెప్పింది. శోభా వెళ్తున్న విషయమ్  తెలియకపోవడం వలన వాళ్ళు వేరే చోటికి వెళ్లిపోయారట. దాంతో అక్కడికి కాకుండా ఫైనల్ గా హాస్పిటల్ కి వెళ్లినట్లు చెప్పింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అని చెప్పింది. కొద్దీ రోజుల నుంచి తనకు థ్రోట్ పెయిన్ బాగా వస్తోందని చెప్పింది. అసలు తగ్గకపోవడంతో తాను తెలియక కొన్ని టాబ్లెట్స్ వేసుకోగా అది ఇంకా తగ్గలేదన్న భయంతో హాస్పిటల్ కి వెళ్లిందట. ఐతే తనకు ఎసిడిటీ బాగా పెరిగిపోయింది... లైఫ్ స్టైల్ మార్చాలని డాక్టర్స్ సలహా ఇచ్చారట. దాంతో అలా హాస్పిటల్ కి వెళ్లి రావాల్సి వచ్చిందని చెప్పింది. ఇక వాళ్ళ అమ్మకు కూడా హెల్త్ సరిగా లేదని ఈ ఇయర్ ఇలా బ్యాడ్ గా స్టార్ట్ అయ్యిందని పాపం తెగ ఫీలైపోయింది. ఈ అన్ని కారణాల వలన అసలు వీడియోస్ చేయట్లేదని కానీ ఇక మీద అందరికీ నచ్చే మెచ్చే వీడియోస్ ఎంత చేయగలదో అంతా చేసి చూపిస్తానని చెప్పింది శోభా శెట్టి. ఇక నెటిజన్స్ ఐతే జాగ్రత్త హెల్త్ , రెస్ట్ తీసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   బిగ్‌బాస్ తెలుగు సీజన్-7లో దాదాపు 14 వారాల పాటు అందరికీ చుక్కలు చూపించింది శోభా. శోభాశెట్టి బిగ్‌బాస్ కన్నడ సీజన్ 11లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హెల్త్ బాలిక తిరిగొచ్చేసింది. ఇక శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.