ఎవరింట్లోకి తొంగి చూడొద్దు ..బుద్దిగా మీ పెళ్లాలతో కాపురం చేసుకోండి

ఈ వారం జబర్దస్త్ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ గా సాగింది. అందులోనూ ఇమ్ము వర్ష స్కిట్ లో ఆ మెసేజ్ ఇవ్వడం కనిపించింది. వర్షతో పాటు మరో ఇద్దరు లేడీ కమెడియన్స్ అలాగే ఇమ్ము, పండు, దుర్గారావు కలిసి ఈ స్కిట్ లో చేశారు. ఐతే దుర్గారావు వర్షను పెళ్లి చేసుకుంటాడు. ఇక వర్ష సిస్టర్స్ ని పండు, ఇమ్ము పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు వాళ్ళ భార్యలు నచ్చరు. అలా ముగ్గురూ కూడా వర్ష మీదనే కన్నేశారు. ఐతే ఏమీ తెలియని దుర్గారావుకు వర్ష లాంటి మంచి భార్య వచ్చేసరికి పండు, ఇమ్ము కుళ్లిపోయి దుర్గారావును చంపేసి వర్షను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఐతే ఇమ్ము మూడు విషయం కలిపినా బాటిల్స్ తెచ్చి మిగతా ఇద్దరికీ ఇస్తాడు. అలా ముగ్గురు తాగేసాక పండు, ఇమ్ము కూడా గొంతు పట్టుకుంటారు. ఐతే వర్ష ఎవరికీ తెలీకుండా పండుని, ఇమ్ముని వేసేయాలని వాళ్ళ బాటిల్స్ విషం కలిపేసింది. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరూ షాకయ్యారు. ఇక ఇమ్ము, వర్ష కాదు ఇప్పటి నుంచి దుర్గారావు-వర్షా మాత్రమే అని చెప్పింది. రష్మీ కూడా గట్టిగ అరుస్తూ "ఇమ్ము వర్ష వద్దు..దుర్గారావు - వర్ష ముద్దు" అంది. ఇక సొసైటీకి మెసేజ్ ఇచ్చింది. ఇప్పటికైనా మీ పెళ్లాలతో బుద్దిగా కాపురం చేసుకోండి. ఎవరింట్లోకి తొంగి చూడొద్దు అంటూ మెసేజ్ ఇచ్చింది. తర్వాత శివాజీ ఐతే "ఆమ్మో మెసేజ" అన్నాడు. వెనక నుంచి ఇమ్ము "ఆ మెసేజ్ కూడా ఇది ఇస్తోంది" అంటూ వర్ష మీద కామెంట్ చేసాడు.  

దీపికా టాలెంట్ అది మరి.. డాన్స్ రాకపోయినా డాన్స్ షోకి మెంటార్ అయ్యింది

      ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి చిన్ని వెర్సెస్ బ్రహ్మముడి సీరియల్స్ వాళ్ళు వచ్చారు. ఐతే చిన్నిని చూసిన శ్రీముఖి "అమ్మా అని పిలిపించుకోవడానికి నీకు ఎవరూ లేరు..ఎవరూ రారు" అని బాధపడుతూ చెప్పింది. ఇంతలో బ్రహ్మముడి కావ్య నేను ఉన్నాను అంటూ వచ్చేసింది. అలా ఈమె గురించి  అవినాష్ , హరి మధ్య మాటల యుద్ధం జరిగింది. "ఐనా కొత్త సంవత్సరంలో నీ పెత్తనమేంటి" అని అవినాష్ అడిగాడు.   "ఐనా నీకు దీపికా గురించి ఎం తెలుసు...ఒక్క డాన్స్ స్టెప్ రాకపోయినా ఒక డాన్స్ షోకి మెంటార్ అయ్యింది" అని హరి దీపికా గురించి అవినాష్ కి అర్థమయ్యేలా చెప్పాడు. తర్వాత దీపికా "ఈ చిన్నిని నేను తీసుకెళ్తాను" అంది. "హలో అలా ఎలా తీసుకెళ్తారు..నేను ఆమె టీచరమ్మను..తాను నా ఫామిలీ" అంటూ కావ్య గట్టిగా చెప్పింది. ఇక దీపికను- మానస్ ని పిలిచి "బుజ్జితల్లి" అంటూ ఒకసారి పిలువు అంటుంది శ్రీముఖి. "ఆయన బుజ్జితల్లి కాదు పిచ్చితల్లి" అని పిలుస్తాడు అని చెప్పింది దీపికా. ఇక దీపికా డాన్స్ ఐకాన్ సీజన్ 2 షోలో విపుల్ అనే డాన్సర్ కి మెంటార్ గా చేస్తోంది. ఎప్పటిలాగే ఆ షోలో కూడా నవ్వులు పండిస్తోంది దీపికా. ఇప్పుడు ఎక్కడ చూసినా టైమింగ్ ఉన్న కామేడీ చేయడం నవ్వించడం వంటివి చేస్తోంది. ఏ షో చూసినా దీపికనే కనిపిస్తోంది.

Illu illalu pillalu : గొప్పింటి వాళ్ళమంటూ భాగ్యం అబద్దపు మాటలు.. డౌట్ పడిన నర్మద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -94 లో......రామరాజు కుటుంబం చందుకి మంచి సంబంధం దొరుకుందేమోనని స్వయంవరానికి వస్తారు. భాగ్యం కుటుంబం కూడా స్వయంవరానికి ఎవరైనా కోటీశ్వరులు వస్తారేమో చూద్దామని వస్తారు. స్వయం వరం లో భాగ్యం అందరి అబ్బాయిలని రిజెక్ట్ చేస్తుంది. చందు స్టేజ్ పైకి వెళ్లి తన గురించి చెప్తూ ఇంట్లో వాళ్ళను పరిచయం చేస్తాడు. నాకు కాబోయే పెళ్ళాం అందంగా ఉండాలంటూ నాకూ కోరికలు ఏం లెవ్వు కానీ నా పేరెంట్స్ ని వాళ్ల పేరెంట్స్ గా చూడాలని చందు చెప్తాడు. అదంతా వింటున్న భాగ్యం వీడెవడో బకరా దొరికాడు.. నువ్వు స్టేజ్ పైకి వెళ్లి వాళ్లకు నచ్చేలా మాట్లాడమని శ్రీవల్లిని భాగ్యం పంపిస్తుంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం.. అత్తామామలని అమ్మనాన్నలుగా చూసుకుంటానని శ్రీవల్లి అంటుంటే.. రామరాజు కుటుంబం ఇంప్రెస్స్ అవుతుంది. ఈ అమ్మాయే చందుకి కాబోయే భార్య అని రామరాజు చెప్తాడు. ఆ తర్వాత రామరాజు కుటుంబం భాగ్యం కుటుంబాలు కూర్చొని సంబంధం మాట్లాడుకుంటారు. సాగర్, ధీరజ్ , ప్రేమ వివాహల గురించి రామరాజు చెప్తాడు. తన ఆస్తుల గురించి చెప్పగానే భాగ్యం షాక్ అవుతుంది. బానే సంపాదించారని అంటుంది. మేమ్ కూడా రిచ్ అంటు భాగ్యం అబద్దం చెప్తుంది. ఫైనాన్స్ చేస్తాం మాకు సంతకాలు చెయ్యడానికే టైమ్ ఉండదని గొప్పలు చెప్తుంది. మీ ఆస్తుల గురించి చెప్పండి అని నర్మద అంటుంది. ఈ పిల్ల తెలివైనా పిల్లలాగా ఉందంటూ భాగ్యం డైవర్ట్ చేస్తుంది. మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలని భాగ్యం చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలు ఏదో తేడాగా ఉన్నాయని నర్మద అనుకుంటుంది. మరొకవైపు ధీరజ్, ప్రేమలు కలిసి కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : తల్లి దగ్గర జ్యోత్స్న కపటనాటకం.. తన ప్రాణధాత దీపే అని తెలుసుకున్న కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.... దశరథ్ అన్న మాటలు జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. ఆ దాస్ ఎప్పుడైనా నిజం చెప్పేలా ఉన్నాడు.. ఇన్ని రోజులు చెప్పకుండా ఆపాగలిగానంటే అది నా లక్.. నిజం తెలిసేలోపు ఎలాగైనా దీపని చంపెయ్యాలని జ్యోత్స్న అనుకొని ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను చెప్పిన దగ్గరికి రా అంటూ మాట్లాడుతుంది. దీప ఇలా చెయ్యక తప్పడం లేదంటూ తనలో తను మాట్లాడుకుంటుంది. దీప కుబేర్ ఫోటో దగ్గర దీపం పెడుతుంది. ఆ దీపం ఆరిపోవడం తో దీప బాధపడుతుంటుంది. అది చూసిన కార్తీక్.. గాలికి పోయిందని సర్దిచెప్తాడు. దాంతో దీప మళ్ళీ దీపం పెడుతుంది. జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి లేపుతుంది. నాకు తలనొప్పిగా ఉందని పంపిస్తుంది. దాంతో పారిజాతం వెళ్తుంటుంది. అప్పుడే తనకి సుమిత్ర ఎదరుపడుతుంది. జ్యోత్స్న కి తలనొప్పిగా ఉందట అని చెప్తుంది. దాంతో జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వెళ్తుంది. మమ్మీ మిమ్మల్ని చాలా బాధపెడుతున్న సారీ అంటూ జ్యోత్స్న చెప్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందామని సుమిత్ర అనగానే.. పడుకుంటున్నా గ్రానిని రానివ్వకని జ్యోత్స్న అంటుంది. నా గదిలో పడుకో ఎవరు డిస్టబ్ చెయ్యరని జ్యోత్స్నని తన గదిలోకి తీసుకొని వెళ్లి పడుకొపెడుతుంది. నా కూతురిలో మార్పు మొదలు అయిందని సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఇలా కొన్ని రోజులు నమ్మించాలి మమ్మీ అని జ్యోత్స్న అనుకొని బెడ్ పై ఫిల్లో స్ పెట్టి తను పడుకున్నట్లు సెటిల్ చేసి  గోడ దూకి బయటకు వెళ్తుంది జ్యోత్స్న. మరొకవైపు కార్తీక్ ఏదో పేపర్స్ చూస్తుంటే.. కింద దీప చిన్నప్పటి కనపడుతుంది. ఈ అమ్మాయి నా ప్రాణధాత కదా.. నాకు ఇంకా గుర్తుందంటూ కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ ఫోటో ఎవరు తీసుకొని వచ్చారంటూ అనసూయ దగ్గరకు వెళ్లి.. ఈ ఫోటో ఎవరిదని అడుగుతాడు. 'ఈ ఫోటో దీపది.. మొన్న శౌర్య నీకు చూపిస్తానన్న ఫోటో ఇదే' అని అనసూయ చెప్తుంది. దీప నా ప్రాణధాత అంటూ కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీపకి గుర్తు లేదా గుర్తు ఉంటుంది కానీ బయటపడడం లేదు.. మొన్న నేను గొప్ప స్థాయికి వెళ్లాక ఒక విషయం చెప్తానంది. అది ఇదేనేమో అని కార్తీక్ అనుకుంటాడు. ఇప్పుడు దీపతో మాట్లాడాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అమ్మని గుర్తు చేసుకొని రామ్ ఎమోషనల్.. తనని స్కూల్ కి పిలిపించిన రామలక్ష్మి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -340 లో.... రామలక్ష్మి క్లాస్ చెప్తుంటే రామ్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రామలక్ష్మికి ఏం చెయ్యాలో అర్ధం కాదు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రామ్ అలా చెప్తే వినడు అంటూ ఎలా చెప్తే వింటాడో సీతాకాంత్ చెప్తాడు. రామ్ ఇప్పుడు మనం గేమ్ ఆడుదామా అని రామలక్ష్మి అంటుంది. దాంతో రామ్ సరదాపడుతూ ఆడుదామని అంటాడు. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ లు దాగుడుమూతలు ఆడుతారు. రామలక్ష్మి సీతాకాంత్ లు దగ్గరగా వచ్చి తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు.  నువు నా రామలక్ష్మివి అని సీతాకాంత్ అనగానే.. లేదు నేను మైథిలి ని అని రామలక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు సుశీల, ఫణీంద్ర లు మైథిలి ఫోటో చూస్తూ బాధపడతారు. ఈ బాధని పోగొట్టడానికే రామలక్ష్మి రూపం లో మన మైథిలి మన దగ్గరికి వచ్చింది అని ఫణీంద్ర అంటాడు. పాపం తన భర్త తన ముందున్నా చెప్పుకోలేని పరిస్థితి అని రామలక్ష్మి గురించి సుశీల బాధపడుతుంటే అదంతా రామలక్ష్మి చూస్తుంది. ఒకవైపు రామలక్ష్మి మరొకవైపు సీతాకాంత్ లు చందమామని చూస్తూ మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి రామ్ కి క్లాస్ చెప్తుంది. రామలక్ష్మిని ఇంప్రెస్ చేసేలా సేమ్ సీతాకాంత్ లాగా మాట్లాడుతాడు రామ్. సేమ్ మీ నాన్న లాగే మాట్లాడుతున్నావంటు రామ్ ని హగ్ చేసుకుంటుంది రామలక్ష్మి. రామ్ ఎమోషనల్ అవుతూ నేను మా మామ్ ని చాలా మిస్ అవుతున్నానని అనగానే.. అంటే వీళ్ళ అమ్మ రామ్ తో సరిగా ఉండడం లేదా తన సంగతి చెప్తాననుకోని రోషన్ వాళ్ల అమ్మ మమతని స్కూల్ కి పిలిపించి మాట్లాడుతుంది. రామ్ చాలా బాధపడుతున్నాడని రామలక్ష్మి అనగానే రోషన్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాడని బాధపడుతున్నాడని మమత అనుకుటుంది. రామలక్ష్మి అసలు సంబంధం లేకుండా మాట్లాడేసరికి మమతకి ఏం అర్ధం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కీలక ఆధారం సేకరించిన అప్పు, కావ్య‌‌.. రాజ్ కి శిక్ష పడుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -657 లో..... మీ వల్ల కాకపోతే చెప్పు మేమ్ చూసుకుంటామంటూ రుద్రాణి అప్పు, కావ్యలతో రుద్రాణి అంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ రుద్రాణిని సుభాష్ కోప్పడతాడు.ఆ తర్వాత కావ్య రాజ్ కి భోజనం తీసుకొని వెళ్తుంది. అసలేం జరిగిందని కావ్య అడుగుతుంది. హత్య జరిగిన కోణంలో ఆలోచిద్దాం.. మీరు రాత్రి అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీస్ బయట ఎవరైనా ఉన్నారా అని కావ్య అడుగుతుంది. అక్కడ బయట ఒక తాగుబోతు మందుకి డబ్బుల కోసం నా దగ్గరికి వచ్చాడు.. అతని పేరు లిక్కర్ కమలేష్ అని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్ భోజనం తినేస్తాడు. కావ్య ఇంటికి వచ్చాక అప్పు దగ్గరికి వెళ్తుంది. కేసు విషయంలో ఇంకొక క్లూ దొరికిందని రాజ్ చెప్పిన విషయం అప్పుకీ చెప్తుంది. దాంతో ఇద్దరు కలిసి ఆధారాలు సంపాదించాలనుకుంటారు. మరుసటి రోజు ఇంట్లో అందరు రాజ్ గురించి బాధపడుతుంటారు. అపర్ణని సుభాష్ తీసుకొని కోర్ట్ కి వెళ్తాడు. వాళ్ళతో పాటు కళ్యాణ్ కూడా వెళ్తాడు. నిజం గానే అప్పు కావ్యలు ఆధారాలు తీసుకొని వస్తారా అని రాహుల్ అంటాడు. అలా ఏం జరగదు రాజ్ కి శిక్ష పడడం ఖాయమని రుద్రాణి అనగానే.. ఆస్తి మన చేతికి రావడం ఖాయమని రాహుల్ అంటాడు. మరొకవైపు అప్పు, కావ్యలు ఒక వైన్స్ దగ్గర కి వస్తారు. అక్కడ లిక్కర్ కమలేష్ గురించి అడుగుతారు. వాడెప్పుడు వస్తాడో ఎవడికి తెలియదు.. వాడికి మందు తాగాలనిపించినప్పుడు వస్తాడని ఒకతను కావ్య, అప్పు లతో అంటాడు. మరొకవైపు కోర్ట్ లో రాజ్ నోటి మాటల ద్వారా.. నేనేం తప్పు చెయ్యలేదని చెప్తాడు. అంత అనామిక చేసిందని రాజ్ అంటాడు. రాజ్ తమ్ముడు ఒకప్పటి మాజీ భార్య అనామిక..వాళ్లపై కోపంతో ఇలా చేస్తుందని రాజ్ తరుపున లాయర్ అంటాడు. తరువాయి భాగంలో రాజ్ హత్య చేసాడు.. శిక్ష వెయ్యాలని జడ్జ్ తీర్పు ఇచ్చే టైమ్ కొ కావ్య, అప్పులు లిక్కర్ కమలేష్ ని తీసుకొని వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కలర్ ఫుల్ అమ్మాయిని చూసుకోవాలంటూ రాజీవ్ కి దీపికా సలహా

  బుల్లితెర మొత్తం కూడా కొత్త కొత్త షోస్ తో ఫుల్ కలర్ ఫుల్ గా మారిపోయింది. అలాగే ఓటిటి ప్లాట్ఫామ్ కూడా కొత్త షోస్ తో మెరిసిపోతున్నాయి. ఇక కొత్తగా ఆహా ప్లాట్ఫామ్ మీద "చెఫ్ మంత్ర  ప్రాజెక్ట్ కే" పేరుతో ఒక కొత్త వంటల షో రాబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో జిగేల్ డ్రెస్సులతో అంబటి అర్జున్, అమర్ దీప్ వచ్చారు. ఆ తర్వాత  యాంకర్ విష్ణు ప్రియా -పృథ్వీ, సుప్రీత-యాదమ్మ రాజు, యూట్యూబర్స్ ఐన ప్రశాంత్-ధరణి ఈ షోలోకి వచ్చేశారు. హోస్ట్ గా సుమ, జడ్జ్ గా జీవన్ వచ్చారు. ఇక వంటగాళ్లందరికీ మైసూర్ బోండా చేయాలంటూ టాస్క్ ఇచ్చాడు. తర్వాత జీవన్ దీపికా దగ్గరకు వచ్చి "ఇందాకటి నుంచి ఇలా తిప్పుతూనే ఉన్నావ్" అన్నాడు. "మీకోసం శానిటైజర్ కలిపి మరీ మైసూర్ బొండాలు వేస్తున్నాను" అనేసరికి జీవన్ షాకయ్యాడు. తర్వాత సుమ ఈ మైసూర్ బొండాలు రుచి చూసే పనిలో పడింది. వెంటనే తన భర్త రాజీవ్ కనకాల ఫోన్ చేసి "రాజా నేను సమీరా భరద్వాజ్- దీపికా చేసిన బొండాలు తినబోతున్నాను. లాస్ట్ కాల్ నీతో ఒకసారి మాట్లాడదామని చేశా" అని చెప్పింది. "ఏమైనా నీ ఆఖరి కోరిక" అన్నాడు రాజీవ్. "అంటే ఇదే నా ఆఖరి కోరిక అని నమ్ముతున్నావ్ కదా" అంది సుమ సీరియస్ గా. తర్వాత రాజీవ్ కానుకలతో దీపికా "రాజా గారు ఇక మీరు మంచి కలర్ ఫుల్ అమ్మాయిని చూసుకోండి" అని చెప్పేసరికి సుమ షాకయ్యింది. ఇక విష్ణు ప్రియా చేసిన బొండాలు రుచి చూడాలంటె కష్టం అని జీవన్ అనేసరికి "వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారుగా కచ్చితంగా టేస్ట్ చేయాలి" అంటూ విష్ణుప్రియ సెటైర్ వేసింది. ఇక జీవన్ మీద దీపికా వేసిన పంచ్ మాములుగా లేదు " సిక్స్ తర్వాత వస్తుంది సెవెన్..జీవన్ గారు ఎక్కడ ఉంటె అక్కడ వస్తుంది హెవెన్" అనేసరికి జీవన్ అలా షాకై చూసాడు.

ఫిష్ ఫ్రైకి కాంబినేషన్ పెరుగన్నం తాలింపా...ఎవ్వరైనా తింటారా ?

  ఆహా ఓటిటి ప్లాట్ఫారం మీద "ప్రాజెక్ట్ కే" పేరుతో ఒక కుకింగ్ షో రాబోతోంది. ఇక ఈ షో మార్చి 6నుంచి  రాత్రి 7గంటలకు ప్రతి గురువారం ప్రసారం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని సుమ హోస్ట్ చేయబోతుంది. ఆమెకి హెల్పర్‌గా కమెడియన్ జీవన్ కనిపించబోతున్నారు. ఇందులో బుల్లితెర స్టార్స్  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్ దీప్, అంబటి అర్జున్‌  "అల్టిమేట్ బ్రదర్స్‌ ఆఫ్ ది కిచెన్" గాళ్ కనిపించి మంచి కామెడీని అందించబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అయ్యింది. ఈ ప్రోమోలో అంబటి అర్జున్ చేతిలో ప్లేట్ పట్టుకుని  ‘అరేయ్ అమర్‌గా... ఫిష్ ఫ్రై తెచ్చానూ.. దీనికి కాంబినేషన్‌గా పచ్చి పులుసు తీసుకునిరా" అంటాడు. "పచ్చి పులుసు కాదు కానీ.. ఇప్పుడే తాలింపు వేసిన  పెరుగన్నం తీచినా. తింటే మైమరచిపోతావ్ తిను"  అని అంటాడు అమర్ దీప్. దాంతో అంబటి అర్జున్.. ‘రేయ్ అంటే అన్నానంటావ్ కానీ ఎవ్వడైనా చేపల పులుసులో పెరుగు అన్నం తింటాడారా.. అని ఫన్నీగా ఫైర్ అవుతాడు. దాంతో అమర్ దీప్ నెమ్మదిగా ‘ట్రై చేయి ఒకసారి’ అన్నా అని అంటాడు. "ట్రై చేయడాల్లేవ్.. పైకి పోవడాలే"  అని కౌంటర్ ఇస్తాడు అంబటి అర్జున్. దాంతో అమర్ దీప్ అలిగి.. ‘సర్లే అన్నా.. నీకు నాతోనే ప్రాబ్లమ్ అయితే చెప్పు నే వెళ్లిపోతా’ అని లేచి వెళ్లిపోతుంటాడు. అతన్ని ఆపి  ‘ఏయ్ ఇందుకె..నిన్ను ఏదన్నా అనాలంటేనే... నాకేదో డౌట్ గా ఉందిరా. మనం  ఫస్ట్ రౌండ్‌లో వెళ్లిపోతాం అనిపిస్తుంది’ అని అంటాడు అంబటి. "నిన్ను చూస్తే నాకూ అదే అనిపిస్తుంది" అని  కౌంటర్ ఇస్తాడు అమర్ దీప్. "చూశారు కదా.. మా కాంబినేషన్ చెఫ్ మంత్రాలో ఇలా తగలడింది. మీరు కూడా చూసి తగలడండి..కాదు కాదు చూసి ఎంజాయ్ చేయండి ’ అని ఫుల్ ఫన్నీ డైలాగ్స్ తో ఆడియన్స్ ని మెప్పించారు ఇద్దరూ. అయితే మొదట్లో ఫిష్ ఫ్రై అన్నారు  తర్వాత చేపల పులుసు ఎలా అయ్యింది భయ్యా అంటూ నెటిజన్స్ కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  

అంట్లు తోమడాలు, వంట చేయడాలు... ఓంకార్ షో అంటే ఆ మాత్రం ఉంటది  

  బుల్లితెర మీద ఓంకార్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్మార్ట్ జోడి 3 హోస్ట్ గా చేస్తూ ప్రతీ వారం మంచి మంచి కంటెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఇక ఈ వారం ప్రోమో చూస్తే మాములుగా లేదు. ఇంటింటి రామాయణం పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ షోలో జోడీస్ తో అంటే మొగుడు పెళ్లాలతో అంట్లు తోమిచ్చేసాడు. ప్రదీప్-సరస్వతి, రాకేష్-సుజాత, ప్రేరణ-శ్రీపాద్ జోడీలతో దగ్గరుండి మరీ హింట్స్ ఇచ్చి తోమించాడు. కొంతమందికి  బూడిద, కొందరికి ఇటుక పొడి ఇచ్చాడు. అంట్లను నీట్ గా తోమమని చెప్పాడు. "అన్నా ఇంత బతుకు బతికి ఈ పని చేస్తే బాగోదేమో అన్నా ఆలోచించావా" అన్నాడు రాకేష్. "ఇంటరెస్ట్ లేకపోతె రండయ్యా మేము కడుక్కుంటాం" అంటూ ఆదిరెడ్డి సెటైర్ వేసాడు. "అంట్లు తోముతుంటే ఏమనిపిస్తోంది" అన్నాడు ఓంకార్. "నాలుగిళ్ళు ఒప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది" అన్నాడు రాకేష్. ఇక అన్నీ జోడీలతో చపాతీలు కూడా చేయించాడు ఓంకార్. ఆదిరెడ్డి చేసిన చపాతీ ముద్దల్ని పట్టుకుని "ఇది ఉండలా లేదు రాయిలా ఉంది. ఇక్కడ క్రికెట్ బాల్స్ చేస్తున్నాడు" అంటూ కౌంటర్లు వేసాడు ఓంకార్. ఇక నోటితో భార్యల కాలి గోళ్లకు నెయిల్ పోలిష్ కూడా వేయించాడు. ఇక ఫైనల్ గా నామినేషన్స్ లో  ఆదిరెడ్డి-కవితకె ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక తర్వాత ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఆదిరెడ్డి-కవిత, అభయ్ నవీన్-భవానీ, అనిల్ గీలా- ఆమనికి ఓ టాస్క్ పెట్టాడు. ఒక పెన్సిల్‌ని షార్పనర్ తో చెక్కి చిన్న ముక్కలా చేయాలని ఇచ్చిన టైం జోన్ లో పూర్తి చేయాలని అప్పుడు  రెండు జోడీలు సేఫ్ అయి ఒక జంట ఎలిమినేట్ అవుతుందని చెప్పాద్దు. ఎవరు సేఫ్ అవుతారో ఈ వారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.  

మోటివేట్ చేసే శత్రువైనా పర్లేదు కానీ నాశనం చేసే మంచి మిత్రుడిని ఎంచుకోకు...గీతోపదేశం

  మనం కొన్ని కొన్ని చూసినప్పుడు కొన్ని భావాలు ఆటోమేటిక్ గా మనసులో వచ్చేస్తూ ఉంటాయి...రీసెంట్ గా గీతామాధురి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. "మనం డిప్రెషన్ లో ఉన్నపుడు కానీ, బాధపడినప్పుడు కానీ ఎదురు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ద్రుష్టి మన మీద ఉండాలని..మనల్ని వాళ్ళు చూడాలని విపరీతమైన తాపత్రయపడిపోతూ ఉంటాం.. కానీ వేరే మనిషి కోసం పడే ఆ  తాపత్రయమే మనకు మన జీవన విధానానికి, మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది..అదొక ట్రాప్ అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం...కాబట్టి మనం చివరి శ్వాస విడిచేటప్పుడైనా కానీ జాగ్రత్తగా మనిషిని ఎంచుకోవాలి...మనం మన డిప్రెషన్ హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే జాగ్రత్తగా ఉండాలి. అంటే మనల్ని మోటివేట్ చేసే శత్రువైనా పర్లేదు కానీ మనల్ని నాశనం చేసే మంచి మిత్రుడిని మాత్రం ఎంపిక చేసుకోకూడదు" అని చెప్పింది." అలాగే  ఈ మధ్య కాలంలో ఏ పోస్ట్ పెట్టినా అది తమ కోసమే అన్నట్టు అన్వయించేసుకుంటారని భయపడిపోయిన గీతామాధురి ఇలా కూడా పెట్టింది. "ఎవరిని, దేనికి ఉద్దేశించింది కాదు..కొన్ని సోషల్ గ్యాదరింగ్స్ ని చూసినప్పుడు వచ్చిన ఆలోచన మాత్రమే" అంటూ రాండమ్ థాట్స్ హ్యాష్ టాగ్ ని జత చేసింది. ఇక నెటిజన్స్ ఐతే గీత చెప్పిన ఈ ఉపదేశాన్ని నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ అభినందిస్తున్నారు.

రోజా-రాశి మధ్య శ్రీకాంత్...ఉప్మా ఛాలెంజ్ లో ఎక్కడో కాలినట్టుంది

  సూపర్ సీరియల్ ఛాంపియన్‌‌‌‌షిప్ సీజన్ 4 ప్రోమో రీసెంట్ కొత్తది వచ్చేసింది. ఇందులో ఉప్మా ఛాలెంజ్ మాములుగా లేదు భయ్యో.  ఇందులో రాశి-రోజా  మధ్య "ఉప్మా మేకింగ్ ఛాలెంజ్" పెట్టారు. ఇక రాశి ఉప్మా చేస్తోంది. శ్రీకాంత్ ఆమెకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో  ఏదో సాయం చేద్దామనుకొని శ్రీకాంత్ కప్పుతో రవ్వ వేయబోతుండగా హోస్ట్ రవి మధ్యలో వచ్చి అయ్యయ్యో కప్పుతో కాదు చేత్తో వేయాలి అన్నాడు. దీంతో అవాక్కయిన రాశి "చాలు చాలు" అంటూ వేసే రవ్వను కూడా ఆపించేసారు. ఇక ఇంకో వైపు ఉప్మా ఛాలెంజ్ కోసం పోటీ పడుతున్న రోజా దగ్గరికెళ్లి గిన్నెలో ఉన్న ఉప్మా రవ్వను చూపించి వేసేయ్యనా  అని అడిగాడు. వేసేయండి అంది రోజా. తర్వాత నాకు సంబంధం లేదంటూ మొత్తం రవ్వ బాండీలో వేసేశాడు శ్రీకాంత్. ఇక రాశి గారు  చేసిన ఉప్మా రెడీ అని రవి చెప్పేసరికి  టేస్ట్ చేద్దామని శ్రీకాంత్ గరిటెతో నోట్లో వేసుకున్నాడో లేదో నోరు కాలిపోయింది.  దీంతో రోజా కూలిపోయింది  "బాగా కాలింది..బాగా కాళింది"  అంటూ నడుము ఊపుతూ డాన్స్ చేసింది. తర్వాత  రోజా చేసిన ఉప్మా కూడా రుచి చూసి ఇద్దరు చేసిన ఉప్మాలు బాగున్నాయని చెప్పాడు. ఇక  రోజా తానూ చేసిన ఉప్మా అందరికీ పంచగా చాలా మిగిలిపోయింది. "రోజా గారి ఉప్మా ఇంత మిగిలిపోయింది" అంటూ రవి చూపించాడు. "మా దగ్గరేమో మొత్తం రవ్వ వేసేసారు" అని శ్రీకాంత్ మీదకు తప్పు నెట్టేద్దామని చూసింది రోజా. ఇక శ్రీకాంత్ "నీళ్లు పోసాక కదా రవ్వ వేయాలి అంటే లేదు లేదు  మా ఊళ్లో ఇట్లాగే వేస్తారు" అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్ తో రోజాకు కౌంటర్ ఇచ్చాడు. ఇక ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్‌ మొదటి ఎపిసోడ్‌కి డైెరెక్టర్ అనిల్ రావిపూడి, బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్  కూడా రానున్నారు. ఇక ఈ షోలో భాగ్యవతి, గుండమ్మ కథ, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, పడమటి సంధ్యారాగం, చామంతి, ప్రేమ ఎంత మధురం, మేఘ సందేశం, అమ్మాయి గారు, ఎన్నోళ్లో వేచిన హృదయం, జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం, ముక్కు పుడక, సీతే రాముడి కట్నం, ఉమ్మడి కుటుంబం వంటి 16 సీరియల్స్ వాళ్ళు పోటీ పడుతున్నారు.

Illu illalu pillalu: ప్రేమ, ధీరజ్ ల సావాసం.. స్వయంవరంలో బకరా అతడేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-93లో.. పెద్దోడి వివాహ పరిచయ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో సరిగ్గా అదే ప్రాంతానికి కళ్యాణ్‌ని పట్టుకోవడానికి ప్రేమ, ధీరజ్ వెళ్తారు. ఇక భద్రాద్రిలో దిగిన తరువాత వాళ్ళిద్దరు ఆటో ఎక్కుతారు. ప్రేమ ఆటో సీటు వెనుక కూర్చుని ఇబ్బంది పడుతూ ఉంటుంది. గట్టిగా నా చేయి పట్టుకుని కూర్చో లేదంటే పడతావ్ అని ధీరజ్ అంటే.. మాకు తెలుసులే అని ఓవరాక్షన్ చేస్తుంది. ఇంతలో డ్రైవర్.. ఆటోని గోతిలో పెడతాడు. దాంతో ప్రేమ తల టంగుమంటుంది. ఇక ఇరుకు ఇరుకుగా కూర్చోవడంతో.. ధీరజ్ వచ్చి ప్రేమపై పడుతుంటాడు.. ప్రేమ వెళ్లి ధీరజ్‌పై పడుతుంటుంది. అయిన ప్రేమ మాత్రం ధీరజ్‌కి టచ్ కాకుండా ఉండాలని చిరాకుపడుతుంటుంది. దాంతో ఆటో డ్రైవర్‌‌పై అరుస్తుంది. ఆటోని రోడ్డుపై నడుపుతున్నావా? ఇంకెక్కడైనా నడుపుతున్నావా? సరిగా చూసుకోమని ప్రేమ అరుస్తుంది. ఏయ్.. ఓవరాక్షన్ చేయకు.. నీతో జర్నీ అంటే నాకూ చిరాకే.. మనం వెళ్తున్నది కళ్యాణ్ గాడి కోసం.. ఎక్స్ ట్రాలు చేయకుండా చేయి పట్టుకో లేదంటే.. కిందపడతావ్.. మూతిపళ్లు రాలతాయని ధీరజ్ అనగా.. ఇక వేరే ఆప్షన్ లేకుండా చేయిపట్టుకుంటుంది. మరోవైపు నర్మద అద్దం ముందు నిలబడి తెగ రెడీ అవుతుంటుంది. వెనుక నుంచి సాగర్ వచ్చి.. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ అంటూ సాంగ్ వేసుకుంటాడు. ఇక కాసేపు నర్మద, సాగర్ లు రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారు. మరోవైపు రామరాజు అండ్ కో కలిసి స్వయంవరానికి వెళ్తారు. ఇంతలో వేదవతి.. చందును చూస్తూ.. రేయ్ పెద్దోడా.. ఇంతమందిలో నీకు కాబోయే భార్య ఎక్కడుందో మన ఇంటి పెద్ద కోడలిగా ఎవరికి రాసిపెట్టి ఉందోనని అంటుంది. ఇంతలో వల్లి ఎంట్రీ ఇచ్చేస్తుంది. గెటప్పూ సెటప్పూ మొత్తం మార్చేసి మారువేషంలో ఎంట్రీ ఇస్తారు. మొదటిసారి కారు ఎక్కడంతో.. కనీసం కారు డోరు కూడా తీయడం రాదు భాగ్యం. అది గమనించిన డ్రైవర్.. కారు ఎక్కడం ఫస్ట్ టైమా అని గాలి తీసేస్తాడు. అమ్మోయ్.. మనం నిజంగానే డబ్బున్న వాళ్లలాగే ఉన్నామే అని తెగ మురిసిపోతుంది. వామ్మో వామ్మో ఇంతమంది ఉన్నారేంటే... మన బస్తీలో చేపల సంతకంటే బీభత్సంగా ఉందే.. మనకి కావాల్సిన పెళ్లికొడుకు దొరుకుతాడా అని వల్లి అంటుంది. నీకు ఒకటో నెంబర్ పెళ్లి కొడుకుని చూస్తానే.. నువ్వు ఏది చెప్పినా గొర్రెలా తలాడించేవాడ్నే చూస్తాను. అత్తారింటిని ఆ ఇంటి పెత్తనాన్ని నీ గుప్పెట్లో పెడతాను.. వాళ్ల ఆస్తిని మెల్లి మెల్లిగా మన ఇంటికి తరలించేస్తాను.. మరి నువ్వేం అంటావని భాగ్యం అంటుంది. నువ్వు ఏంటంటే నేనూ అదే అంటానని వల్లి అంటుంది. ఇక శ్రీవల్లికి రిజిస్టర్ చేయించి లోపలికి వస్తుంది భాగ్యం. వామ్మో ఇంతమంది ఉన్నారేంటి? వీళ్లల్లో మనకి కాబోయే బకరా ఎక్కడున్నాడో ఏంటోనని శ్రీవల్లి అంటుంది. ఆ బకరా ఎక్కడో కాదు.. శ్రీవల్లి వెనుకే ఉంటాడు. ఇక్కడున్న బకరాగాళ్లలో ఏ క్లాస్ బకరా గాడ్ని బయటకు తీయాలి మనం. ఎక్కడున్నాడోనని భాగ్యం వెతుకుతుంటుంది. ఇంతలో స్వయంవర వివాహ పరిచయ వేదిక పరిచయ కార్యక్రమం మొదలౌతుంది. తరువాయి భాగంలో ఎతకబోయిన రైస్ కుక్కర్ ఈల వేసుకుంటూ వచ్చేసినట్టుగా.. మనం వెతుకుతున్న ఆ బకరాగాడు వీడే అదిగో మనకి కావాల్సిన పప్పు సుద్దగాడు అంటూ చందుని సెలెక్ట్ చేసేస్తుంది భాగ్యం. నాకు కాబోయే అత్తమామల్ని అమ్మనాన్నలుగా చూసుకుంటానంటూ ఒక్క మాటతో రామరాజు ఫ్యామిలీని పడేస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: రొమాన్స్ లో కార్తీక్ బాబు, దీపక్క.. ఒకరిపై ఒకరు పడి మరీ!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2)..ఈ సీరియల్  గురువారం నాటి ఎపిసోడ్-292లో.. శివనారాయణ, సుమిత్ర, దశరథ్, పారిజాతంలు జ్యోత్స్న భవిష్యత్ గురించే మాట్లాడుకుంటారు. జ్యోత్స్నను ఇండియాలో ఉండకూడదు.. ఏ అమెరికానో పంపించేయండి అంటూ పారిజాతం సలహా ఇస్తుంది. అయితే దశరథ్‌కి అది ఇష్టం ఉండదు. దాసు పూర్తిగా కోలుకుని నిజం ఏంటో తెలిసే వరకూ జ్యోత్స్న ఇక్కడే ఉండాలని మనసులో అనుకుంటాడు. శివనారాయణ బాధగా.. సరే ఇవన్నీ కాదు దాని తల్లిదండ్రులుగా మీరిద్దరూ ఏం అంటారో చెప్పండి అని  సుమిత్ర, దశరథ్‌లతో అంటాడు. వద్దు నాన్నా.. మనం ఉంటేనే ఇలా ఉంటుంది అంటే.. మనం కళ్లముందు లేకుంటే ఇంకెలా తయారవుతుందో కదా అంటూ దశరథ్ అంటాడు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. మళ్లీ పెళ్లి గురించి గొడవ జరుగుతుంది. నీ పెళ్లి చేస్తానని మీ అమ్మకు మాటిచ్చాను.. నీ పెళ్లి చేసే నేను చస్తానని శివనారాయణ ఫైనల్‌గా చెప్పి వెళ్లిపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక సుమిత్ర కూడా బాధతో లోపలికి వెళ్లిపోతుంది. వెంటనే జ్యోని దశరథ్ ప్రేమగా పిలిచి.. పక్కనే కూర్చోబెట్టుకుని..జ్యోత్స్న ఏదొకరోజుకి నువ్వు పెళ్లి అయితే చేసుకోవాలి కదా.. ఎప్పటికైనా ఇవే పరిస్థితులు ఉంటాయి. ఏది మారదు.. అందుకే నువ్వే మారి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమ్మా.. మమ్మల్ని ఇంకా బాధపెట్టకు.. దాసు కోలుకోగానే నీకు పెళ్లి చేస్తామని దశరథ్ అనగా.. జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. దాసు కోలుకోవడానికి దీని పెళ్లికి సంబంధం ఏంటి దశరథా అని అంటుంది. నా తమ్ముడు పెళ్లిలో లేకుండా నేను నా కూతురు పెళ్లి ఎలా చేస్తాను పిన్నీ అని దశరథ్ అనగా.. దశరథ్ కి డౌట్ ఉందని జ్యోత్స్నకి అర్థమవుతుంది. మరోవైపు దీప భాదపడుతుంటే కార్తీక్ వస్తాడు. దీప.. మన సత్యరాజ్ గారికి కాల్ చేసి రెస్టారెంట్ అప్‌డేట్స్ అన్నీ ఇచ్చాను.. చాలా హ్యాపీ ఫీలయ్యారు.. ఎక్కడికే వెళ్తున్నారట. వచ్చాక కలుస్తా అన్నారని అంటాడు. సరే బాబు అంటూ తన ఆలోచనల్లో తాను ఉంటుంది దీప. అదేంటి ఇంత హ్యాపీ న్యూస్ చెబితే చెప్పింది చాల్లే వెళ్లు అన్నట్లు సర్లే బాబు అంటావ్ అని కార్తీక్ అంటాడు. ఇక వాళ్ళ గురించి ఆలోచించకు మన గురించి ఆలోచించమని కార్తీక్ అనగా... ఏదో అనాలనుకుంటున్నారు అదేంటో చెప్పండని దీప అంటుంది. సరే అయితే ముందు నువ్వు ఇలా కూర్చో అని కార్తీక్ అంటాడు. తను మంచం మీద కూర్చుని. చెప్పండి కార్తీక్ బాబు అంటుంది. చెప్పండి బాబు ఫర్వాలేదని దీప అంటుంది. వెంటనే కార్తీక్ కూర్చో అన్నట్లుగా చేయి పట్టుకుని లాగుతాడు. అదుపు తప్పిన దీప.. కార్తీక్ మీద పడిపోతుంది. ఇద్దరు కలిసి మంచం మీద పడిపోవడంతో.. నీ శ్వాసే నను తాకగా అంటూ పాట మొదలైపోతుంది. ఇక రొమాంటిక్ లుక్స్, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇటు దీప, అటు కార్తీక్ హీటెక్కించారు. ఇక దీప కాస్త తేరుకుని కార్తీక్ మీద నుంచి పైకి లేచి.. నిలబడుతుంది. సారీ దీపా బలమైన మనిషివి కదా అని కాస్త బలంగా లాగానని కార్తీక్ అంటాడు. ఆదమరుపులో ఉన్నాను కదా.. అందుకే పట్టానని దీప అంటుంది. పడింది మొగుడు మీదే కదా ఫర్వాలేదులే అని కార్తీక్ అంటాడు. హా.. ఏదో చెబుతాను అన్నారని దీప అంటుంది. కష్టసుఖాలు మాట్లాడాలి ముందు నువ్వు ఇలా కూర్చోమని దీపను మళ్లీ ప్రేమగా ఎదురుగా కూర్చోబెట్టుకుని..చేయి నొప్పి వస్తుంది. కాస్త నొక్కుతావా అంటాడు. ఇక మళ్లీ మొదలవుతుంది రొమాంటిక్ సీన్. దీప నొక్కుతుంటే కార్తీక్.. దీప కళ్లల్లోకి చూడటం.. అబ్బో.. మామూలుగా లేదు. ఇక కార్తీక్ దీప కళ్లల్లోకి కొంటెగా చూస్తూ.. కాసేపు మనం అన్నీ పక్కన పెట్టి భార్యభర్తల్లా మాట్లాడుకుందామా అని కార్తీక్ అంటాడు. దీప గుండెల్లో జల్లుమంటుంది. కార్తీక్ చేతిని దీప నొక్కుతుంటే అతడి చేయి దీప తొడ మీదకు ఆనుకుంటుంది. మళ్లీ మరో రొమాంటిక్ సాంగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : తను మైథిలి అని తెలుసుకున్న శ్రీలత.. సీతాకాంత్ కంటపడకుండా చూస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -339 లో....రామలక్ష్మి వేలంపాటకి వస్తుంది. తనపై ఓడిపోవద్దని శ్రీలత ఎక్కువ అమౌంట్ కి వేలం వేస్తుంది. దాంతో శ్రీలతనే ఆ ల్యాండ్ సొంతం చేసుకుంది. అప్పుడే ఆ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ వచ్చి రామలక్ష్మికి థాంక్స్ చెప్తాడు. ఎక్కువ అమౌంట్ కి శ్రీలత వాళ్ళే అమౌంట్ తీసుకునేలా రామలక్ష్మి చేస్తుంది. దాంతో శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత సుశీల, ఫణీంద్రల దగ్గరికి శ్రీవల్లి వెళ్లి రామలక్ష్మినే మైథిలినా కన్ఫమ్ చేసుకోవడానికి వెళ్తుంది. దాంతో సుశీల ఏ మాత్రం డౌట్ రాకుండా మాట్లాడుతుంది. నువ్వు నాతో మాట్లాడడమేంటి? మా ఇంట్లో పని మనుషుల స్థాయి మీది అని సుశీల అనగానే.. శ్రీవల్లి వెళ్లిపోతుంది.ఆ తర్వాత రామ్ ని తీసుకొని సీతాకాంత్ స్కూల్ కి వెళ్లి రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. సీతా సర్ నా నోటితో నేనే రామలక్ష్మి అని చెప్పించాలని చాలా ట్రై చేస్తున్నాడు. బయటపడొద్దని రామలక్ష్మి అనుకొని వెళ్లి రామ్ తో సీతాకాంత్ తో మాట్లాడుతుంది. సీతాకాంత్ కి రామలక్ష్మి షేక్ హ్యాండ్ ఇస్తుంది. సీతాకాంత్ అదంతా ఉహా అనుకుంటాడు. అప్పుడే సీతాకాంత్ ని రామ్ గిల్లగానే ఇది నిజామా అనుకుంటాడు. మరొకవైపు శ్రీలత వాళ్ళు.. తను రామలక్ష్మినా  మైథిలినా అని ఆలోచిస్తుంటే.. సందీప్ వచ్చి రామలక్ష్మి చనిపోయిందన్నట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని వస్తాడు. రామలక్ష్మి చనిపోయింది తను మైథిలీ.. మొన్ననే లండన్ నుండి వచ్చిందని కనుకున్నానని సందీప్ చెప్పగానే.. శ్రీలత రిలాక్స్ అవుతుంది. కానీ ఆ మైథిలి సీతాకి ఎదరుపడకుండా చూడాలని శ్రీలత అంటుంది. మరోవైపు రామలక్ష్మి రామ్ కి క్లాస్ చెప్తుంటే.. అసలు వినకుండా రామలక్ష్మికి చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాజ్ కి సపోర్ట్ గా కావ్య.. ఒకరోజు వాయిదా వేసిన కోర్టు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -656 లో.... రాజ్ కి కావ్య భోజనం తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత రాజ్ కి భోజనం తినిపిస్తుంది. కావ్య బాధపడుతుంటే నువ్వు ఇలా బాధపడితే.. నన్ను ఎవరు బయటకు తీసుకొని వస్తారని  రాజ్ అంటాడు. కావ్య ఎమోషనల్ గా హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కోర్ట్ లో రాజ్ తరుపున లాయర్ వాదిస్తాడు. ఫింగర్ ప్రింట్ ఆధారంగా చూస్తే ఆ రాడ్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ రాజ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని జడ్జ్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. రాజ్ రౌడీలని రాడ్ పట్టుకొని వెంబడించిన విషయం గుర్తుచేసుకుంటాడు. అసలేం జరిగిందో చెప్తానంటూ రాజ్ ఆ రోజు రాడ్ పట్టుకొని రౌడీలని బెదిరించి అది పక్కకి పడేసానని చెప్తాడు. రాజ్ కీ సపోర్ట్ గా తన లాయర్ మాట్లాడతాడు. నిజాలు నిరూపించేందుకు కొంత టైమ్ కావాలని లాయర్ అడుగగా.. కేసుని మరుసటి రోజుకి జడ్జ్ వాయిదా వేస్తాడు. రాజ్ ని చూసి అపర్ణ బాధపడుతుంది. ఆ హత్య మీరు చెయ్యలేదని నాకు తెలుసు ఆ నమ్మకం తోనే ఆ రాడ్ తీసుకొని వచ్చాను కానీ వాటిపై మీ వేలి ముద్రలు ఉండడం నాకు ఆశ్చర్యంగా ఉందని అప్పు అంటుంది. ఆ తర్వాత అనామిక వచ్చి ఏదో చేస్తానని ఏదో చేసావని అప్పుతో అంటుంది. మా బావని తెలివిగా ఇరికించాను అనుకుంటున్నావా అని అప్పు అంటుంది. మేం ఎలాగైనా బావని బయటకు తీసుకొని వస్తామని అప్పు అంటుంది. ఆ తర్వాత కావ్య, అప్పులు ఇంటికి వచ్చాక రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కలిసి విరుచుకుపడతారు. తరువాయి భాగంలో అప్పు, కావ్యలు రౌడీని వెతుక్కుంటూ వెళ్తారు. మరొకవైపు రాజ్ కి ప్రతికూలంగా జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పాప కాదు మాష్టర్ పప్పా....అరేయ్ ఏంట్రా ఈ డైలాగ్స్ ...

  సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కొరియోగ్రాఫర్లు యశ్వంత్ - భూషణ్ , భాను - విజయ్ వచ్చారు. ఐతే ఈ షోలో సుమ ఎలాంటి గేమ్స్ ఆడించలేదు..అన్ని పంచ్ డైలాగ్స్ వేసింది, వేయించింది. ఈ షోలో "జానీ జానీ ఎస్ పాప" అనే ఇంగ్లీష్ రైమ్ ని డిస్ ప్లే చేసి పాడింది సుమ. ఐతే విజయ్ మాష్టర్ ఐతే "పాపను చూపియ్యండి" అన్నాడు సీరియస్ గా.. దానికి రిప్లైగ భాను మాష్టర్ "మాష్టర్ పాప కాదు పప్పా" అని సరిచేసాడు. అసలు షోస్ లో ఈ బూతులేంటో అర్ధం కావడమే లేదు. సరే ఇక తర్వాత బోర్డు మీద చిన్న చిన్న గుణకారాలు వేసి అందరినీ అడిగింది సుమ. వాళ్ళు కూడా చెప్పారు. ఇక ఫైనల్ లో యష్ మాష్టర్ వాళ్ళ అమ్మతో కలిసి ఉన్న ఫోటో చూపించి విషయం అడిగింది. "అమ్మ నన్ను చాలా ఎంకరేజ్ చేసేది..ఆమె లేకపోతె ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాణ్ణే కాదు. నేను ఎక్కడికి వెళ్లిన కూడా మా అమ్మ నాతో వచ్చేది " అని చెప్పాడు. ఇక ఫైనల్ గా విజయ్ మాష్టర్ అల్లు అర్జున్ తో ఉన్న రిలేషన్ చెప్పాడు. పుష్ప టైటిల్ సాంగ్ లోని షూ స్టెప్ కంపోజ్ చేసింది మాత్రం విజయ్ పోలాకి మాస్టర్. ఆ స్టెప్ బాగా ఫేమస్ అయ్యింది. "బన్నీ గారు నెక్స్ట్ లెవెల్ లో ఉంటారు. ఆయన హార్డ్ వర్క్ కి సెల్యూట్ చేయాలి" అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఇలా ఈ వారం ఈ షో అలరించబోతోంది.  

పాకిస్తాన్ వాళ్ళు మా ఆయన్ని చంపేస్తారేమో అని భయపడ్డాను...

  తండేల్ మూవీకి ఇన్స్పిరేషన్ గా నిలిచినా రియల్ లైఫ్ జోడి ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చారు. వాళ్ళే రామారావు-నూకమ్మ. రష్మీ అసలు వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీని చెప్పించింది. "మా ఆయన పాకిస్తాన్ బోర్డర్ దాటేసి వాళ్లకు  దొరికి పోయాడు అని తెలిసేసరికి నాకు చాలా భయమయ్యింది. ఎందుకంటే ఇండియా - పాకిస్తాన్ మధ్య పగ ఉంది కాబట్టి ఆ కోపంతో చంపేస్తారని చాలా భయపడ్డాను. మా 22  కుటుంబాలు కూడా చాలా షాకయ్యాము. ఎం చేయాలో అర్ధం కాలేదు." అని చెప్పింది నూకమ్మ. ఇక ఈ షోలో సోల్జర్ చక్రపాణి "బుజ్జి తల్లి" సాంగ్ పాడి అందరినీ మెస్మరైజ్ చేసాడు. తర్వాత పంచ్ ప్రసాద్, నటీ నరేష్ కలిసి చీరలమ్మేవాళ్ళ గెటప్స్ లో వచ్చారు. ఇక ఫైమా ఐతే "చిలకల చీర ఉందా" అనేసరికి "ఎలుకల చీర ఉంది..మొత్తం ఎలకలు కొట్టేసిన చీరలవి" అని కౌంటర్ వేసాడు పంచ్ ప్రసాద్. ఇక "రష్మీ గారు వేసుకునే డ్రెస్ కావాలి" అంటూ శ్రీదేవి అడిగింది. దానికి ప్రసాద్ చిన్న పీలిక చూపించాడు. "అదేంటి ఇంత కురచగా ఉన్నవి వేసుకుంటారా" అని శ్రీదేవి అనేసరికి "ఇది కూడా లూజ్ ఐపోయింది" అని పక్కన పెట్టేసారు అని అన్నాడు ప్రసాద్. ఇక ఫైనల్ గా రవి కిరణ్ భావన ఇంకొంతమంది పిల్లలు కలిసి ఒక ఫ్యామిలీగా స్కిట్ చేశారు. హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో రవి కిరణ్ మందు తాగడం అలవాటు చేసుకుని చివరికి చనిపోయిన తీరును కళ్ళకు కట్టినట్టు చూపించారు. దాంతో స్టేజి మీద ఉన్న అందరితో కన్నీళ్లు పెట్టించారు.    

జాను మీద డైలాగ్ వేసిన కావ్య

  బుల్లితెర మీద కొంతమంది హోస్ట్స్ తెలుగులో ఎం మాట్లాడినా బూతులైపోతాయి. అంటే తెలుగు భాష తెలియకపోవడమే దానికి కారణం. అలాంటి తెలుగును మాట్లాడేవారిలో   కొంతకాలం క్రితం వరకు రష్మీ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఆ తర్వాత కన్నడ  నుంచి వచ్చిన సౌమ్య  రావు కూడా తెలుగు మాట్లాడితే బూతులైపోయేవి..ఆ తర్వాత సౌమ్యని తీసేసారు. రష్మీ ఐతే తెలుగు ఇప్పుడు చాలా వరకు బూతులు లేకుండా స్పష్టంగా మాట్లాడుతోంది. ఇక సౌమ్య కూడా తెలుగు షోస్ లో కంటిన్యూ కావడం కోసం తెలుగు నేర్చుకుంటోంది. ఇక వీళ్ళ బాటలో కొత్తగా వచ్చింది మరో పోరి. ఆమె బ్రహ్మముడి కావ్య. అటు సీరియల్ లో ఇటు ప్రతీ షోలో కనిపించేస్తోంది. ఇప్పుడు డాన్స్ ఐకాన్ షోకి ఒక మెంటార్ గా తన కంటెస్టెంట్ విపుల్ తో వచ్చింది. ఇక ఈ షో లేటెస్ట్ ప్రోమోలో ఆమె మాట్లాడినట్టు తెలుగు డైలాగ్ బూతు మాములుగా లేదు. విషయం ఏంటంటే. జాను తన కంటెస్టెంట్ సోనాలి షా వేసిన సాంగ్ కి శారీలో డాన్స్ చేయమని ఓంకార్ అడిగేసరికి జాను డాన్స్ చేసింది. ఐతే ఆమె శారీ వేసుకున్నా కూడా ఆ స్వింగ్స్ అనేవి కరెక్ట్ గా తెలిసాయి. ఇక కావ్య ఆమెను పొగిడేసింది. "జాను ఇంత శారీ వేసుకున్నాక కూడా అంటే ఫుల్ క్లోజ్డ్ గా ఉన్న శారీ వేసుకున్నాక కూడా నీ స్వింగ్స్ తెలుస్తున్నాయి. అప్పుడు బట్టలు అవసరం లేదు." అనేసరికి అందరూ గట్టిగ అరిచేశారు..ఎం మాట్లాడుతున్నావ్ అంటూ మానస్ ఆమె అన్న డైలాగ్ ని సరి చేసాడు. ఇక ఓంకార్ ఆ డిస్కషన్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ఐదుగురు కంటెస్టెంట్స్ కి 12 లక్ష 20 వేల 162 ఓట్లు వచ్చాయని చెప్పాడు. ఇక నెటిజన్స్ ఐతే "దీపికా అలియాస్ కావ్య మాటలను తప్పు పట్టకండి" అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.

డాన్స్ ఐకాన్ లో మానస్ - ప్రకృతి మధ్య ఫైట్...కంటెస్టెంట్ చేంజ్

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ వారం షోలో ఒక కంటెస్టెంట్ ప్లేస్ లో మరో కంటెస్టెంట్ వచ్చింది. లాస్ట్ వీక్ షోలో మెంటార్ ప్రాకృతి కంటెస్టెంట్ బర్కత్ అరోరా అనే చిన్న పాప వచ్చింది. ఐతే మరి ఏమయ్యిందో ఏమో కానీ ఆ చిన్నారి ప్లేస్ లో కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె ఎవరో కాదు వర్థికా ఝా. ఇక ఈ వారం ప్రోమోలో ఆమె డాన్స్ ఇరగదీసేసింది. బర్కత్ అరోరా రావట్లేదు అన్న విషయాన్నీ ఓంకార్ చెప్పేసరికి ప్రాకృతి ఏడ్చేసింది. ఐతే లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూస్తే గనక చిన్న స్టెప్ సరిగా చేయలేదు అంటూ ప్రాకృతి మానస్ కంటెస్టెంట్ సాధ్విని నామినేట్ చేసింది దాంతో తట్టుకోలేక మానస్ కూడా ప్రాకృతిని తన కంటెస్టెంట్ బర్కత్ అరోరాని నామినేట్ చేసాడు. ఇక చిన్నారి బర్కత్ అరోరా సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలా ఫేమస్. 7 ఇయర్స్ చైల్డ్ ప్రాడిజీగా నేషనల్ మీడియా కూడా ఆమె గురించి వార్తా కథనాలను ప్రసారం చేసింది. బర్కత్ అసలు స్టెప్ వేస్తె క్రిస్టల్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే బర్కత్ పార్టిసిపేట్ చేస్తున్న ఫస్ట్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఐకాన్ అంటూ కూడా చెప్పాడు యాంకర్ ఓంకార్. మరి లాస్ట్ వీక్ మానస్ - ప్రకృతి మెంటార్స్ మధ్య జరిగిన నామినేషన్స్ ఇష్యూ కారణంగా బర్కత్ ఈ వారం మాత్రమే రాదా అసలుకే ఈ సీజన్ కి రాదా అన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె ప్లేస్ లో మాత్రం కొత్త కంటెస్టెంట్ వచ్చేసింది. ఆల్రెడీ నామినేషన్స్ లోకి కూడా వెళ్ళిపోయింది.