Brahmamudi : రాజ్ బయటకు రావడంతో సంబరాల్లో ఫ్యామిలీ.. యామిని రాకతో అతను షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -660 లో..... రాజ్ కోర్ట్ లో గెలిచి ఇంటికి రాగానే కావ్య హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది. ఇక అందరు హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే.. అది ఓర్వలేకపోతుంది. మొన్న ఇలాగే సంతోషంగా ఉన్నాం రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇలా ఉంటే ప్రాబ్లమ్ ఏ రూపం లో వస్తుందోనని భయంగా ఉందని రుద్రాణి అనగానే..నీ నోటికి మంచిమాటలు రావా అంటూ ఇంట్లో వాళ్లు కోప్పడతారు. మరొకవైపు యామిని ఒక్కప్పుడు రాజ్ ని ప్రేమించిన అమ్మాయి.. తను అమెరికా నుండి ఇంటికి వస్తుంది. యామిని రాకతో తన తల్లితండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు ఇంత లేట్ అయిందని యామిని తల్లిదండ్రులు అడుగుతారు. దారిలో ఫ్రెండ్ కనిపిస్తే ఆగానని యామిని అంటుంది. ఇన్ని రోజుల తర్వాత పేరెంట్స్ కాకుండా ఫ్రెండ్ కి ఇంపార్టెంట్ ఇచ్చావ్.. ఇదేం బాలేదు అని వాళ్ల డాడ్ అంటాడు. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధపెట్టాను.. ఇక బాధపెట్టనని యామిని అంటుంది. అయితే పెళ్లి చేసుకుంటావా అని వాళ్ల అమ్మ అడగ్గానే.. ఎందుకు చేసుకోనంటూ రాజ్ ఫోటో చూపిస్తుంది. వాళ్ళు అది చూసి షాక్ అవుతారు. ఏంటి రాజ్ ఫోటో చూపిస్తున్నావ్.. తను వద్దన్నుందుకే కదా చావు అంచుల వరకు వెళ్లి వచ్చావని వాళ్ల డాడ్ అంటాడు. నేను అమెరికా వెళ్ళింది నా అలవాట్లు మార్చుకోవడానికి.. ప్రేమని కాదు అని యామిని అంటుంది. సరే రాజ్ పేరెంట్స్ తో మాట్లాడుతామని వాళ్ళ అమ్మ అనగానే మాట్లాడాల్సింది వాళ్ళ పేరెంట్స్ తో కాదు.. రాజ్ భార్య కావ్యతో అనగానే వాళ్ళు షాక్ అవుతారు. నాకు రాజ్ కావాలి.. తనని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తానని యామిని అంటుంది. మరొకవైపు కన్పించింది యామినీనే అని రాజ్ డైలామాలో ఉంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్య చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు రాజ్. ఎవరైనా వస్తారని కావ్య అంటుంది. ఎవరు రారు ఒకవేళ వచ్చిన యముడికి అయినా అడ్డం తిరిగి మళ్ళీ నన్ను సొంతం చేసుకుంటావ్ కదా అని రాజ్ అంటాడు. యామిని పేరెంట్స్ డాక్టర్ తో మాట్లాడతారు. తను సెట్ అయింది అనుకుంటే మళ్ళీ రాజ్ అంటుందని అనగానే చిన్నప్పటి నుండి తనేం కావాలని అనుకుంటుందో అది దక్కకపోతే భరించలేదు. తనకి కావల్సింది పొందడానికి ఏం అయినా చేస్తుంది లేదా చచ్చిపోతుంది ఇప్పుడు మీరు చెయ్యాల్సింది తనని అర్థం చేసుకున్నట్లు ఉండి మెల్లగా తనలో మార్పు తీసుకొని రావాలని యామిని పేరెంట్స్ తో డాక్టర్ చెప్తాడు. మరోవైపు కావ్య ఫోటో కాల్చేస్తుంది యామిని. మరుసటి రోజు రాజ్ కి యామిని వాయిస్ మెసేజ్ చేస్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. కోర్ట్ దగ్గర చూసాను‌ అలా చూస్తూ ఉండాలనిపించిందని యామిని అంటుంది. ఒక సర్ ప్రైజ్ హాల్లో ఉంది.. నువ్వు తప్ప ఎవరు చూడకూడదు.. వెళ్ళు త్వరగా అని యామిని అంటుంది. తరువాయి భాగం లో రాజ్ హాల్లో ఉన్న కవర్ తీసుకుంటాడు. అందులో యామిని, రాజ్ కలిసి ఉన్న ఫొటోస్ ఉంటాయి. అది ఎవరు రాకముందే రాజ్ త్వరగా తీసుకుంటాడు. అదే సమయంలో ఎవరో ఫోన్ చేసి రాజ్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రియాంక గురించి ఓంకార్..వైల్డ్ కార్డు ఎంట్రీ

  ఇస్మార్ట్ జోడి సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలా ఇంటరెస్టింగ్ విషయాలను ఎపిసోడ్ లో మిక్స్ చేయబోతున్నాడు ఓంకార్ అన్న విషయం అర్ధమవుతోంది. ఇక ఈ షోకి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లాస్య- మంజునాథ్ ని మళ్ళీ తీసుకొచ్చాడు.  ఇక లాస్య మాట్లాడుతూ "లక్ లేక ఎలిమినేట్ అయ్యాను ఐతే అదే లక్ తో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది" అని చెప్పింది.  ఎందుకంటే లాస్ట్ వీక్ షో ఎలిమినేషన్స్ లో అనిల్ గీలా - ఆమనీ ఎలిమినేట్ ఇపోయారు. అలాగే రీల్ అండ్ రియల్ జోడీఎస్ ని ఈ షోలోకి తీసుకొచ్చాడు ఓంకార్. ఇక ఆడియన్స్ కి నెక్స్ట్ వీక్ షో అంతా కూడా ఫుల్ ఫన్ లా డిజైన్ చేశారు. ఏఏ సీరియల్స్ నుంచి ఎవరెవరు వస్తున్నారో చూద్దాం. నువ్వుంటే నా జతగా.. సీరియల్ నుంచి టాప్ లీడ్స్ అర్జున్ కళ్యాణ్, అనుమిత దత్త, మామగారు.. సీరియల్ నుంచి  సుహాసిని , ఆకర్ష్ బైరాముడి, మగువ ఓ మగువ.. సీరియల్ నుంచి  శ్రవణ్ కుమార్ , కృతిక ఉమాశంకర్, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్, శివ కుమార్, చిన్ని.. సీరియల్ నుంచి  కావ్య, వీరేన్ శ్రీనివాస్, పలుకే బంగారమాయెరా.. సీరియల్ నుంచి  నిఖిల్ నాయర్ , సంధ్య రామచంద్రన్ , ఇక సీరియల్ నటుడు మహేష్ వీళ్లంతా వచ్చారు. ఇక ప్రియాంక జైన్ - శివ కుమార్ వచ్చినప్పుడు ఓంకార్ ఒక ప్రశ్న అడిగాడు "పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయాల్సినవన్నీ కూడా పెళ్ళికి ముందే అంటే" అని చెప్తూ లాస్య వాళ్ళను చూసి "మీరు కూడా ఏదో గుర్తు చేసుకుంటున్నారనుకుంటా" అన్నాడు. "అన్నా మీరు ఏది అనుకున్నారో మేము కూడా అదే అనుకున్నాం" అని చెప్పింది లాస్య. తర్వాత కావ్య వచ్చేసరికి ఆమెను కూడా అడిగాడు "లవ్ డెఫినిషన్" అనేసరికి "లవ్ అంటే లవ్ అంతే..మళ్ళీ ట్రస్ట్ అది ఇది అంటూ నేను చెప్పను" అంది కావ్య.  

కిరణ్ అబ్బవరం ప్రెగ్నెంట్...ఎం మాట్లాడుతున్నావు దీపికా..

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బ్రహ్మముడి కావ్య వేసే ఏ కంటెంట్ కామెడీ డైలాగ్స్ మాములుగా లేవు. ఎవర్రా దీపికాని ఈ షోకి తెచ్చింది అంటూనే ఆమె డైలాగ్స్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం రాబోతున్నాడు. ఇక స్టేజి మీదకు రాగానే ఓంకార్ బొకే ఇచ్చి ఇన్వైట్ చేసాడు. ఇక్కడి వరకు బానే ఉంది. తర్వాతే దీపికా టార్చర్ మొదలయ్యింది. "రహస్యంగా మిమ్మల్ని ఒకటి అడగాలి..రహస్య గారు ఎలా వున్నారు" అంది గుసగుసలాడుతూ.."బాగున్నారండి బాగున్నారు" అంటూ కిరణ్ కూడా రిప్లై ఇచ్చాడు. "మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా" అని అడిగేసింది. ఇక శేఖర్ మాష్టర్ ఐతే "ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్" అన్నాడు. "నేను కాదండి. తను ప్రెగ్నెంట్" అన్నాడు కిరణ్. తర్వాత మళ్ళీ దీపికా "సర్ మీరిప్పుడు చూడలేదా..కపుల్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉంటే వి ఆర్ ప్రెగ్నెంట్ అని పెడుతున్నారు" అంటూ ఉన్న నిజాన్ని కామెడీగా చెప్పేసింది. "అవునా అండి...నేను చూడలేదు" అని చెప్పాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ ప్రోమోలో మాష్టర్లు, మెంటార్లు కలిసి డాన్స్ చేశారు. దానికి కిరణ్ "మాష్టర్ షో నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఎక్కడైనా డాన్స్ స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ అవుతా మాష్టర్ " అనేసరికి అందరూ నవ్వేశారు. "సర్ ఆ మాత్రం నాతో డాన్స్ చేయకుండా మీరు వెళ్ళిపోతే ఎలా" అని అడిగింది దీపికా. "అదొక్కటి వద్దమ్మా" అంటూ దీపికా డాన్స్ కి కిరణ్ అబ్బవరం కూడా భయపడిపోయారు. తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్ చేసారు.  

కుర్రాళ్ళకి మతిపోగెట్టేలా...బికినీలో సురేఖా వాణి

  అటు కూతురు.. ఇటు తల్లి ఇద్దరు సోషల్ మీడియాని షేక్ చేస్తుంటారు. వారానికో బోల్డ్ ఫోటో షూట్ వదులుతూ ఇన్ స్టాగ్రామ్ లో మోస్ట్ వైరల్ కంటెంట్ ఇస్తుంటారు. వారే తల్లి సురేఖా వాణి, కూతురు సుప్రిత.  సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఆమె నటించింది. సహాయ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నారామె. అయితే, ప్రస్తుతం ఆమెకు అంత గొప్ప పాత్రలైతే రావడం లేదు. అన్నీ చిన్న చిన్న పాత్రలే. నిజానికి సురేఖా వాణి కెరీర్ ప్రారంభమైందే బుల్లితెరపై. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సురేఖకు డైరెక్టర్ సురేష్ తేజ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’, ‘హార్ట్ బీట్’ వంటి షోలలో అవకాశం ఇచ్చారు. వీటితో ఆమె పాపులర్ అయ్యింది. ఇక తాజాగా బీచ్ ఒడ్డున బ్లాక్ కలర్ లాంగ్ బికినీతో ఫోజులిచ్చింది సురేఖా వాణి. ఆ ఫోటలతో ఓ వీడియో క్లిప్ ని ఎడిట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆయితే ఆ డ్రెస్ లో సురేఖా వాణిని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ కామెంట్ల కంటే నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో కుర్రాళ్ళకి మతిపోగెట్టేలా చేస్తుంది.   

బ్రహ్మముడి సీరియల్  లో కీలక మలుపు.. రాజ్ జీవితంలో ఆమె పాత్ర ఏంటి?

  బ్రహ్మముడి సీరియల్‌కి కథానాయికైన కనకం రెండో కూతురు కావ్య.. సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె దుగ్గిరాల వారి ఇంటికి ఆరిపోని దీపం. అలాంటి దీపాన్ని ఆర్పేయడానికి, తరిమేయడానికి కొత్త విలన్‌ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె పేరు ఇంకా రివీల్ కాలేదు కానీ.. ఆమెను ఆమె ముద్దుగా ‘బేబీ.. బేబీ’ అని పిలుస్తోంది. అయితే ఈ విలన్‌ని చూసి రాజ్‌ ఎందుకు కంగారుపడ్డాడు అనేది కథలో కీలకంగా మారింది. బ్రహ్మముడి సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమెను చూసి రాజ్ కంగారుపడటం చూసిన ఎవరికైనా తనకి రాజ్ కి గతంలో ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది. అయితే ఆమెనే గుర్తుచేసుకుంటూ కావ్యతో మాట్లాడిన మాటలు వింటే ఏదో ఉందనే భావనే కల్గుతుంది. నిన్ను నన్ను ఎవరు దూరం చేయలేరు.. ఒకవేళ దూరం చూసిన నువ్వు నన్ను దక్కించుకుంటావని కావ్యతో రాజ్ అంటాడు. అలాగే ఆ కొత్త అమ్మాయి కూడా తన ఫ్యామిలీతో మాట్లాడుతుంది. ఇతని పేరు రాజ్.. ఇతన్నే పెళ్ళి చేసుకుంటా అని అనడంతో ఆమె తల్లిదండ్రులు ఒకే అంటారు. ఆయితే రాజ్ భార్యని పెళ్లికి ఒప్పించాలని ఆమె చెప్పగా వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. దీంతో బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటిదాకా రుద్రాణి, అనామిక కలిసి విలన్ రోల్స్ చేయగా.. ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి రాజ్ ని దక్కించుకోవడం కోసం ఎన్ని కుట్రలు చేస్తుందో.. కావ్య, రాజ్ లని విడదీస్తుందా లేక రాజ్ ని బ్లాక్ మెయిల్ చేస్తుందా చూడాలి మరి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరనేది తెలియాలంటే నేటి కథనం వచ్చేవరకు వేచిఉండాల్సిందే.  

Illu illalu pillalu : రామరాజుని తీసుకెళ్ళిన పోలీసులు.. వాళ్ళ ఆస్తులని చూడటానికి వెళ్ళిన భాగ్యం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -96 లో..... కళ్యాణ్ గురించి వచ్చిన ప్రేమ, ధీరజ్ లకి నిరాశ ఎదురవుతుంది. దంతో ఒక దగ్గర ప్రేమ ధీరజ్ లు ఆగుతారు. తెల్లవారితే నాన్నని పోలీసులు తీసుకొని వెళ్తారు. దీనంతంటికి కారణం నువ్వే నువ్వే కనుక ఆ కళ్యాణ్ గాడితో వెళ్ళిపోకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు.. మా అమ్మ నా మేనకోడలు ఏం అవుతుందోనని నీ గురించి ఆలోచిందని ధీరజ్ తన ఫ్రస్ట్రేషన్ బయట పెడతాడు. మరొక వైపు రేపు ఆ రామరాజు ఇంటికి వెళ్ళాలని భాగ్యం అంటుంటే.. వాళ్ళకి మనం ఫైనాన్స్ చేస్తాం. ఆస్తులున్నాయని అబద్ధం చెప్పాము కదా అని తన భర్త అంటాడు. మనకి లాగే వాళ్ళు అబద్దాలు చెప్పరేమో ఎవరికి తెలుసని భాగ్యం అంటుంది. ధీరజ్ ప్రొద్దున లేచేసరికి ప్రేమ కన్పించదు. దాంతో ధీరజ్ కంగారుగా వెతుకుతాడు. ఇక భద్రవతి సీఐకి ఫోన్ చేసి గడువు పూర్తయింది కదా వచ్చి రామరాజుని తీసుకొని వెళ్ళండి అని చెప్తుంది. మరొకవైపు ధీరజ్ చేసిన తప్పు వళ్ల ఈ రోజు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది. వాడిని చిన్నప్పటి నుండి భయంలో ఉంచితే బాగుండు .. నగలని తీసుకొని రాకుంటే నన్ను పోలీసులు తీసుకొని వెళ్తారని తెలుసు.. అయినా వాడు ఇంకా ఇంటికి రాలేదంటే అర్ధమేంటి.. అరెస్ట్ చేస్తే నాకేంటి అనేగా అని రామారాజు అంటాడు. అప్పుడే రామరాజుకి భాగ్యం ఫోన్ చేస్తుంది.. మేమ్ వస్తున్నామని భాగ్యం అనగానే వద్దు తర్వాత ఎప్పుడైనా రండి అని రామరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి నిన్న రమ్మని చెప్పారు. ఇవ్వాళ్ల వద్దని అంటున్నారు. వీళ్ళపై ఏదో డౌట్  ఉంది.. వెళ్లి వాళ్ల రైస్ మిల్ ఆస్తులు చూసి వస్తానని భాగ్యం బయల్దేరుతుంది.రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. పై నుండి భద్రవతి వాళ్ళు చూస్తుంటారు.రామరాజు బయటకు వస్తుంటే అందరు ఆపుతారు. ఇది నా చిన్న కొడుకు నాకు ఇచ్చిన బహుమానమని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న అలా చేసిందని కనుక్కున్న కార్తీక్.. దీప చెంపచెల్లుమనిపించిన సుమిత్ర!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -295 లో... టైమ్ కి కార్తీక్ వచ్చి దీపని సేవ్ చేస్తాడు. శౌర్యని కాపాడడానికి వెళ్తాడు. అక్కడ రౌడీ లు శౌర్యపై ఎటాక్ చేయబోతుంటే కార్తీక్ వాళ్ళని కొడుతాడు. ఎవరు ఇలా చెయ్యమన్నారని కార్తీక్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు చెప్పకుండా పారిపోతారు. శౌర్యని తీసుకొని దీప దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని తీసుకొని కార్తీక్ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు సుమిత్ర జ్యోత్స్న కి పాలు తీసుకొని వస్తుంది. ఆ లోపు జ్యోత్స్న గోడదూకి సుమిత్ర గదిలోకి వెళ్తుంది. సుమిత్ర వెళ్లేసరికి జ్యోత్స్న ఎప్పటిలాగే పడుకుంటుంది. జ్యోత్స్నని సుమిత్ర లేపి పాలు ఇస్తుంది. ఆ తర్వాత దీప, శౌర్యలని కార్తీక్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్లపై ఎటాక్ చేసింది నర్సింహా అనుకుంటారు. వాడికి తగిన బుద్ది చెప్పాలని అనసూయ అంటుంది. దీపని రెస్ట్ తీసుకోమని చెప్పి కార్తీక్ వాళ్ళు బయటకు వెళ్తారు. అమ్మ మనల్ని కొట్టింది బూచోళ్లతో పాటు జ్యో కూడా.. నీ మొహంపై కర్చీఫ్ పెట్టింది జ్యో అనగానే.. దీప కోపంగా జ్యోత్స్న దగ్గర వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్నకి పెళ్లి సంబంధం గురించి ఇంట్లో మాట్లాడుకుంటారు. అప్పుడే దీప ఎంట్రీ ఇస్తుంది గట్టిగా అరుస్తూ జ్యోత్స్న అని పిలుస్తుంది. ఏమైందని దీపని పారిజాతం అడుగుతుంది. ఆల్రెడీ దీప వస్తుందేమోనని జ్యోత్స్న భయంతో వణుకుతుంది. శౌర్య దగ్గరికి కార్తీక్ వస్తాడు. మీ అమ్మ ఎక్కడ అని అడుగగా.. అమ్మ మొహంపై జ్యో కర్చీఫ్ పెట్టింది.. అదే విషయం అమ్మకి చెప్పాను అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇప్పుడు జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్ళిందని కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు జ్యోత్స్నని దీప తీసుకొని వచ్చి.. నీకేం అన్యాయం చేశామని నా కూతురిని నన్ను చంపాలని చూస్తున్నావని జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది దీప. అమ్మ నువ్వు చెప్పు ఇప్పటివరకు.. నీ గదిలో పడుకున్నా కదా అని జ్యోత్స్న అంటుంది. మళ్ళీ జ్యోత్స్నని దీప కొట్టబోతుంటే సుమిత్ర ఆపి.. నా కూతురిని ఎందుకు కొడుతున్నావంటూ దీప చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మినే ప్రిన్సిపల్ అని చెప్పిన సందీప్.. సీతాకాంత్ తెలుసుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -342 లో..... సీతాకాంత్ రామ్ దగ్గరికి వస్తాడు. రాగానే ఈ రోజు నీలాగా మిస్ ముందు చేసాను. దాంతో మిస్ నన్ను దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుందని సీతాకాంత్ తో రామ్ చెప్పగానే.. నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు రామలక్ష్మివే అని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ పడుకోపెడతాడు. సీతాకాంత్ రామలక్ష్మితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ ఈ విధంగా చేస్తే రామలక్ష్మి బయటపడుతుందని సీతాకాంత్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ అందరిని గుడికి తీసుకొని వస్తాడు. ఎందుకు సడన్ గా తీసుకొని వచ్చావని శ్రీలత అడుగుతుంది. రేపు రామ్ పుట్టిన రోజు కదా.. ఏదో దోషం ఉందట పూజ చెయ్యాలని పంతులు గారు చెప్పారని అందుకే అని సీతాకాంత్ అంటాడు. ఆ మైథిలి రూపంలో రామ్ కి దోషం ఉందేమోనని శ్రీవల్లి అంటుంటే.. నువ్వు సైలెంట్ గా ఉండు మైథిలి గురించి సీతాకాంత్ కి తెలియకుడదని సందీప్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ అటుగా వస్తున్న రామలక్ష్మి కార్ కి పంచర్ చేయిస్తాడు. పంచర్ అయ్యేలోపు గుడికి వెళ్తానంటూ రామలక్ష్మి గుడికి వెళ్తుంది. రామలక్ష్మి లోపలికి వెళ్లి మొక్కుకుంటుంది. ఇప్పుడు మా వాళ్ళని చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలని సీతాకాంత్ అంటాడు. శ్రీలత వాళ్ళని రామలక్ష్మి చూస్తుంది. మరొక వైపు సీతాకాంత్ ని చూస్తుంది. ఇప్పుడేం చెయ్యాలంటూ బయటకు వెళ్ళిపోతుంది. సీతాకాంత్ ఎదురుపడి.. ఏంటి ఎందుకు బయపడి వెళ్తున్నావ్.. రామలక్ష్మి అయితే వెళ్ళిపోతావ్.. మైథిలివి అయితే ఉంటావని సీతాకాంత్ అనగానే.. నేను మైథిలి అని రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. రామలక్ష్మిని శ్రీలత వాళ్ళు చూసి.. ఎక్కడ సీతాకాంత్ చూస్తాడోనని టెన్షన్ పడతారు. రామలక్ష్మి లోపలికి వెళ్లి మళ్ళీ దేవుడికి మొక్కుకుంటుంటే.. అప్పుడే రామ్, సీతాకాంత్ లు వెళ్తారు. మిస్ ఈ రోజు ఇక్కడ పూజ ఉంది.. మీరు ఉండండి అని రామ్ అంటాడు. వాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుకోవడం శ్రీలత వాళ్ళు చూస్తారు. ఏంటి సీతాకి మైథిలి ముందే పరిచయం ఉన్నట్లు ఉంది.. రామ్ తనని మిస్ అంటున్నాడంటే వాళ్ల ప్రిన్సిపల్ తనేనేమో అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అనామిక శపథం అదే.. రాజ్ వెతుకుతున్న అమ్మాయి ఎవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -659 లో...... లిక్కర్ కమలేష్ చూపించిన ఆధారంలో అనామికనే నేరస్తురాలని తెలిసిపోతుంది. అనామికనే సామంత్ ని హత్య చేసినట్లు జడ్జ్ ముందు ఒప్పుకుంటుంది. దాంతో పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనామికకి విధిస్తారు. ఏ తప్పు చెయ్యలేదని రాజ్ ని వదిలిపెడతారు. రాజ్ ని చూసి కావ్య అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే అనామికని తీసుకొని వెళ్తుంటారు కళ్యాణ్ , కావ్య ఇద్దరు అనామికని తిడతారు. మిమ్మల్ని ఎప్పటికి వదిలిపెట్టనంటూ అనామిక శపథం చేసి వెళ్తుంది. అప్పుడే రాజ్ కి ఒక అమ్మాయి కన్పిస్తుంది. రాజ్ తనని టెన్షన్ పడుతూ ఎక్కడ ఉందని వెతుకుతాడు. ఏమైందని కావ్య అడుగగా.. ఏం లేదని రాజ్ అంటాడు. అందరు కలిసి ఇంటికి వస్తారు. దుగ్గిరాల కుటుంబం రాజ్ కి హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు. జైలు కీ వెళ్ళాల్సినోడు ఇంటికి వచ్చాడు. అంతేగా అందుకు హారతి ఇవ్వడం ఏంటని రుద్రాణి అంటుంటే.. ప్రకాష్ తనకి కౌంటర్ ఇస్తాడు. ఆస్తులు తిరిగి వచ్చాయి. రాజ్ ఇంటికి వచ్చాడు. ఇక మనం ఆస్తులు ఎలా వస్తాయని రాహుల్ , రుద్రాణిలు డిస్సపాయింట్ అవుతారు.  ఆ తర్వాత అందరు హ్యాపీగా ఉండడంతో అన్నయ్యపై నేనొక కవిత చెప్తానని కళ్యాణ్ కవిత చెప్తాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి.. ఇక ముందు కూడ ప్రాబ్లమ్ ఏ రూపంలో వస్తాయో ఎవరికి తెలుసని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో రాజ్ ని ప్రేమించిన అమ్మాయి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి రాజ్ ఫోటో చూపిస్తుంది. వెళ్లి తన పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించాలని వాళ్ళు అనగానే ఒప్పించాల్సింది పేరెంట్స్ ని కాదు రాజ్ భార్యని అనగానే వాళ్ళు షాక్ అవుతారు. కావ్యని రాజ్ దగ్గరికి తీసుకొని.. నిన్ను, నన్ను ఎవరు దూరం చేసినా మళ్ళీ నన్ను దక్కించుకుంటావని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో అష్షు హాట్ ముద్దులు, హగ్గులు

  అష్షు రెడ్డి స్పీడ్ మాములుగా లేదు. ముద్దులు, హగ్గులు అదరగొడుతోంది. రీసెంట్ జీ ఛానల్ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 మొదలైన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనే సీరియల్స్ వాళ్లందరితో కర్టైన్ రైజర్ ఎపిసోడ్ ప్రసారమైంది. ఇక ఈ షోకి అష్షు రెడ్డి, యాంకర్ రవి  హోస్ట్ చేస్తున్నారు. ఇక అష్షు దూకుడు మాములుగా లేదు. చామంతి సీరియల్ నుంచి సీనియర్ నటుడు ప్రభాకర్ వచ్చేసరికి ఇక అష్షు పాపా స్పీడ్ చూడాలి..ఒక తీన్ మార్ డైలాగ్ వదిలింది. "సినిమాల్లో నాకు క్రష్ ఆ మెగాస్టార్...టీవిలో నాకు క్రష్ ఈ మెగాస్టార్" అంటూ ప్రభాకర్ ని చిరంజీవితో పోల్చి ముద్దులు పెట్టి భుజం మీద వాలిపోయింది. ఇదంతా చూస్తున్న రవికి ప్రభాకర్ సర్ది చెప్పాడు. "నీ మనసులో ఏమనిపించిందో నువ్వు చేసావ్...తన మనసులో ఏమనిపించిందో తను చేసింది" అని చెప్పి వేల్లిపాయాడు. తర్వాత "ఎన్నాళ్ళో వేచిన హృదయం" సీరియల్ నుంచి చందు గౌడ, విశ్వా వచ్చి డాన్స్ వేశారు. ఇక అష్షు చందు గౌడాని చూసేసరికి పిచ్చ హ్యాపీగా ఫీలైపోయింది. ఇక చందు గౌడ కండలు లెక్కపెట్టి పక్కన నిలబడి కొత్త పెళ్లి కూతురిలా సిగ్గు పడిపోయింది. చందు కోసం తను ఒకటి ప్లాన్ చేసినట్టు చెప్పింది అష్షు. అలా చందు మీద ఒక కవిత చెప్పింది. " చందు తాగుదామా మనిద్దరం మందు..పెడతాను మీకు పెద్ద విందు...షూటింగ్ అయ్యాక వెల్దామా ఏదొక సందు" అనేసరికి అందరూ షాకయ్యారు. ఇక రవికి కోపం వచ్చి "ఇంకొక్క మాట మాట్లాడితే నీ నోట్లో కొడతా పురుగుల మందు" అన్నాడు. తర్వాత చందు గౌడా, అష్షు ఇద్దరూ కలిసి పీలింగ్స్ సాంగ్ కి డాన్స్ వేశారు.

షోలో నిఖిల్ మీద పంచులు..ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు అంటూ కౌంటర్లు  

బుల్లితెర మీద నిఖిల్ - కావ్య జోడి ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు..ఐతే ఎవరి దిష్టి కొట్టిందో వాళ్ళ మధ్య ఎం జరిగిందో కానీ ఇద్దరూ విడిపోయారు. పెళ్లి వరకు కూడా వెళ్ళిపోతారు అని ఆడియన్సు అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిఖిల్ బిగ్ బాస్ 8 కి వెళ్లే సమయానికి ఇద్దరూ విడిపోయారు. ఎవరికి వాళ్ళు సింగల్ గా షోస్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి శ్రీముఖి కావ్యని ఇన్వైట్ చేసి ఎన్నో విషయాలు అడిగింది. ఈ షోలో కావ్య తనకు కాబోయే అబ్బాయి ఎలా ఉండాలో అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా రాసి మరీ చూపించింది.వెనక నుంచి 'బుజ్జితల్లి వచ్చేత్తనానే" అనే డైలాగ్ వస్తూనే ఉంది. ఇక శ్రీముఖి పెద్ద కౌంటర్ వేసింది. " బిగ్ బాస్ 8 ఐన దగ్గర నుంచి చెప్తున్నాడు..కానీ ఇంతవరకు బయటకే రావట్లేదు.." అంది.."అవసరమే లేదు" అంటూ కావ్య కూడా చెప్పేసింది. "ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎం చెప్పినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు కానీ ఇక్కడికి రారు" అని లైఫ్ లో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా చాలా సీరియస్ గా చెప్పింది. "నీ లైఫ్ లో కూడా ఎవరన్నా అబ్బాయి బుజ్జితల్లి అని పిలిచి వచ్చేస్తున్నా కదే..కాసేపు ఆగే ..కాసేపు నవ్వే...అని అంటే నువ్వు ఒప్పుకుంటావా" అని శ్రీముఖి అడిగింది. దానికి కావ్య "నమ్మకం లేదు" అని చెప్పేసింది కావ్య. ఇక బ్రహ్మముడి కావ్య కూడా చెప్పింది "ఒక్కసారి ఆడపిల్లకు నమ్మకం పొతే..మనసు బ్రేక్ ఐతే ఆ మనసును అతికించడానికి అదేం బోన్ కాదు గుండె" అని పెద్ద డైలాగ్ చెప్పింది. అండ్ ఫైనల్ గా చూస్తే నిఖిల్ కావ్య వాళ్ళ వాళ్ళ కోపాన్ని ఇలాంటి షోస్ లో తీర్చేసుకుంటున్నారు.  

మా ఆయన ఆరడుగులు ఉండాలి...నటుడు కాకూడదు...ఎవరైనా ఉన్నారా ?    

  ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఫుల్ జోష్ తో సాగింది. ఐతే ఈ షోలో కావ్య తనకు కాబోయే వాడి గురించి చెప్పింది.. 30 ఏళ్ళ వయసుండాలని చెప్పింది. ఎందుకంటే కావ్య తన వయసు ఇప్పుడు 27 అని చెప్పింది. ఇక హైట్ ఐతే 6.2 అడుగులు ఉండాలని, 100 కేజీల బరువుతో, నటుడు కాకుండా ఎవరైనా పెళ్ళికి పర్లేదు అని చెప్పింది. తర్వాత  "కావ్య మీ ఆయనకు శాలరీ ఎంత ఉండాలి" అని శ్రీముఖి అడిగింది" దానికి హరి "అన్ లిమిటెడ్ లవ్" అనేసరికి "మరి ఫుడ్డు ఎవరు పెడతారు" అంటూ కావ్య అడిగింది. అలాగే మంచి మనసు ఉండాలి ...నెలకు 3 లక్షల జీతం సంపాదించాలని ఆ డబ్బు మొత్తం  తనకే ఇవ్వాలని చెప్పింది. ఇంతలో శ్రీముఖి "నెలకు మూడు లక్షలు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు కదా" అనేసరికి "అడ్రెస్ పంపండి" అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపించింది. "అడ్రస్ తెలుసు ఎక్కడ ఉంటారో తెలుసు అన్నీ తెలిసీ రావడం లేదు" అని శ్రీముఖి వెతకరించింది. "కానీ డబ్బు ఉండాలి ఇవ్వడానికి" అంటూ కావ్య కూడా అనేసింది..దానికి శ్రీముఖి "డబ్బు లేదా" అని అడిగింది "ఉన్నా వద్దులే" అని కావ్య చెప్పేసింది. అలాగే "నాకు కాబోయే వాడు క్లాసీగా ఉండాలి ..గడ్డం లైట్ గా ఉంటే బాగుంటుంది. చిల్లరగా బిహేవ్ చేయకుండా ఉండాలి. పాస్ట్ లో ఎన్ని స్టోరీస్ ఐనా ఉండనివ్వండి కానీ మేము అతని లైఫ్ లోకి వెళ్ళాక మళ్ళీ అవి రిపీట్ కాకూడాదు కొత్తవి క్రియేట్ అవ్వకూడదు...ఇక నన్ను చేసుకోబోయేవాడు తానూ మాత్రమే కాదు వాళ్ళ ఫామిలీ కూడా అమ్మాయికి అమ్మాయి ఫామిలీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి.." అంటూ చెప్పింది కావ్య.

ఇంద్రజ నోటా పవన్ కళ్యాణ్ మాటా...డొక్కా సీతమ్మ నిజంగా అన్నపూర్ణాదేవినే..

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కళ్ళు చెమ్మ కాక మానవు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఉమెన్స్ డే. ఈరోజున ఈ షో లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ గా రాబోతోంది. అలాగే అందరికీ ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ తల్లిని అందరూ స్మరించుకున్నారు. నిజంగా ఆమె గురించి పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయన ఆ తల్లిని ఎన్నో సార్లు స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రతీ ప్రసంగంలో ఆమెను తలుచుకోకుండా ఉండరు...ఏ దానానికి ఆ దానం గొప్పది కానీ  అలాంటి దానాల్లోకెల్లా అన్నదానం ఇంకా గొప్పది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వచ్చిన వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఆ మహనీయురాలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆమె గురించి తెలిసేలా చేసారు. ఆ తరువాత ఇంద్రజ ఆ విషయాన్ని ప్రస్తావించారు. "డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరుతో అన్నదానం జరిపించాలని అని చెప్పిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆవిడ మీద అందరికీ ఒక అవగాహన వస్తోంది" అని చెప్పారు. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అన్నా క్యాంటిన్లతో  పాటు డొక్కా సీతమ్మ క్యాంటిన్లు రావాలి అంటూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఆకలి అంటూ తన ఇంటికి ఎవరు వచ్చినా ఆమె కాదు, లేదు, పెట్టలేను అనే వారు కారట. ఈ అన్నదానం కార్యక్రమం వలన ఆమె ఆస్తులన్నీ కరిగిపోయి కష్టాలొచ్చినా కూడా ఆమె వెనకడుగు వేయకుండా  నిత్యాన్నదానం చేస్తూనే ఉన్నారట. అందుకే ఆమె పేరు తలచుకున్నా ఆమె దాన గుణం  గురించి స్మరించుకున్నా ఎక్కడా లేని ధైర్యం వస్తుంది అంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఆమె గురించి ప్రసంగించినప్పుడల్లా ఆయన మాటల్లో ఎదో తెలియని ధైర్యం కనిపిస్తుంది. ఇక ఇలా  ఈ వారం షో మహిళల కోసం రూపొందించారు.

ఓంకార్ అన్నతో చిన్న జర్నీనే...ఫస్ట్ ఎపిసోడ్ కె ఎలిమినేట్ కావడం కొంచెం బాధాకరమే

డాన్స్ ఐకాన్ సీజన్ 2 షో ఈ వారం ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. మెంటార్ జానులూరి ఆమె కంటెస్టెంట్ షోనాలి ఎలిమినేట్ ఇపోయారు. దాంతో వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసారు. ఐతే ఈసారి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటే గనక తిరిగి షోలోకి వస్తాం ఇచ్చి పడేస్తాం అని చెప్పింది జాను లూరి. "ఫస్ట్ ఎపిసోడ్ లో సోనాలికి హెల్త్ బాలేదు. దాంతో డాన్స్ చేసే ఎనర్జీ ఆమెలో ఎక్కువగా లేదు. సోనాలి హెల్త్ బాగుండి ఉంటే ఫైనల్స్ కొట్టేసే వాళ్ళం అంది జాను. చూసేవాళ్లకు ఎలిమినేషన్ అనేది అన్ ఫేర్ అనుకోవచ్చు కానీ తప్పు మా వైపే ఉంది. మేము కరెక్ట్ గ చేయకుండా అన్ ఫేర్ అనలేము. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఎలిమినేట్ అయ్యానేమో కానీ ఓంకార్ అన్న నన్ను మెంటర్ గా తీసుకుందాం అనుకున్నప్పుడే నేను గెలిచాను. అన్నతో జర్నీ చిన్నదే కానీ ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఫోక్ డాన్సర్ ని తీసుకొచ్చి ఒక మెంటార్ ప్లేస్ లో కూర్చోబెట్టారు. ఇంతకుముందు నేను డాన్సర్ ని మాత్రమే..మాష్టర్ డాన్స్ నేర్పిస్తే వెళ్లి వేయడమే..కానీ మెంటార్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. ఆ డాన్స్ చూడడం, మార్క్స్ వేయడం ఆ టెన్షన్ ఆమ్మో. ఇప్పుడు నాకు మెంటర్ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమో ఒకవేళ అవకాశం కూడా రావొచ్చేమో మళ్ళీ...షోలో సెకండ్ టైం వెళ్ళొచ్చేమో. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఈసారి కచ్చితంగా ఇచ్చి పడేస్తాం అని చెప్పారు సోనాలి, జానులూరి.  

లైమ్‌లైట్‌ కోసం మాట మారుస్తోంది..ఇండియాలో క్లాసికల్‌ డాన్సెస్‌ ఎన్నున్నాయో చెప్పు ?

డాన్స్ ఐకాన్ సీజన్ 2 మంచి కలర్ ఫుల్ డాన్స్ లతో ఫుల్ జోష్ తో మద్యమద్యలో బ్రహ్మముడి కావ్య కామెడీతో షో నిండుగా వెళ్తోంది. ఐతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో మెంటర్ జానులూరి ఆమె కంటెస్టెంట్ సోనాలి ఎలిమినేట్ ఐన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో కూడా రిలీజయింది. ఇంకా సెకండ్ ఎలిమినేషన్ కూడా వచ్చేసింది. ఈ సెకండ్ ప్రోమోలో కూడా ప్రాకృతి- వర్తిక జా, మానస్ - సాధ్వి మధ్యలో ఫుల్ ఫైట్ ఐతే జరిగింది. "నేను మానస్ -సాధ్విని" ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పింది ప్రాకృతి. "సాధ్వి క్లాసికల్ లో చాలా బాగా చేసింది. అది ఆర్ట్ ని మాష్టర్ చేసింది" అని చెప్పింది. దానికి సాధ్వి ఫుల్ ఫైర్ అయ్యింది. " నీకు ఎలా తెలుసు క్లాసికల్ డాన్సర్ లో మాష్టర్ ని అని...ఇండియాలో ఎన్ని రకాల క్లాసికల్ డాన్సస్ ఉన్నాయో చెప్పగలవా నాకు" అని సాధ్వి అడిగేసరికి ప్రాకృతి ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. తర్వాత మానస్ అందుకున్నాడు "ఆఫ్ ది స్టేజిలో ఒకలా ఉండడం ఆన్ ది స్టేజికి వచ్చాక లైంలైట్ కోసం ఒకలా బిహేవ్ చేస్తోంది" అని నాకు అనిపిస్తోంది అంటూ ప్రకృతి మీద మండిపడ్డాడు. "ఎక్కడ నామినేషన్ వస్తుందో నేను అన్ బయాస్ గా అందరినీ ఈక్వల్ గా చూసి ఇవ్వాలి కదా " అని ప్రాకృతి రివర్స్ కౌంటర్ వేసింది. "అన్ బయాస్డ్ అనే పదం మీరు వాడకండి..ప్లీజ్ ప్లీజ్" అంటూ మానస్ - సాధ్వి వెటకారంగా నవ్వేశారు. "నేను మీతో మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను...కానీ మీరు ఫేస్ చూసి రెస్పెక్ట్ లేకుండా నవ్వుతున్నారు" అంటూ ప్రకృతి చెప్పింది.

అనిల్ రావిపూడి ఎఫ్ 4 మూవీ..సుమ కాళ్ళు పట్టుకుని బ్రేకప్ కి ఒకే చెప్పాలంటూ...

అనిల్ రావిపూడి మూవీస్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఫుల్ ఫన్నీ బేస్డ్ ఉంటాయి, ఫామిలీ ఎంటర్టైనర్స్ కూడా...ఐతే ఇప్పుడు అనిల్ ఇప్పుడు సుమతో ఎఫ్ 4 తీయబోతున్నారు అనే విషయం తెలుస్తోంది. ఐతే ఇంతలో ఏమయ్యిందో ఏమో కానీ అనిల్ రావిపూడి తాగొచ్చి సుమకి ఫోన్ చేసి "బ్రేకప్" అని చెప్పేసరికి సుమ షాకయ్యింది. "అసలు సుమా నీకోసం ఎంత చేసినా...అట్లెట్ల వదిలేసావ్ నన్ను.. వంద సార్లు చెప్తా బ్రేకప్...నేను నీకు ఇచ్చిన గిఫ్తులన్నీ పంపీ..వెనక్కి పంపావా..వద్దులే మళ్ళీ నీకు పంపించేస్తా..నువ్వే ఉంచుకో..నీ గిఫ్టులు నాకెందుకు..బ్రేకప్.. అసలు లైఫ్ లో నీతో మాట్లాడితే, నీకు ఫోన్ చేస్తే అడుగు..ఏంటో ఫోన్ చేయొద్దంటావా..మళ్ళీ మళ్ళీ చేస్తా నా ఇష్టం. నీ పేరు పొడిపించుకున్నా కదే చేతి మీదా..ఆ టాటూ పోదు..లైఫ్ టైం పర్మనెంట్ గా ఉంటుంది. బ్రేకప్ అని నీ కాళ్ళు పెట్టుకుంటా ఓకే చెప్పొచ్చుగా..ప్లీజ్ ప్లీజ్ ఇంకొక్క ఛాన్స్ ..ఇంకెప్పుడూ ఇలా చెయ్య...హే పోవే ఎవడిక్కావాలి నువ్వు ..బ్రేకప్ " అని అనిల్ రావిపూడి అంటే   "సరే ఎన్ని సార్లు చెప్తావ్ బ్రేకప్ అసలు నాకోసం ఎం చేసావ్.. బ్రేకప్ చెప్పి నా ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫాలో అవుతున్నావ్. ఐనా నీ గిఫ్తులన్నీ నీకు వెనక్కి పంపేసినా..చూసుకో..ఐనా ఎందుకు ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నావ్. ఎవరు పొడిపించుకోమన్నారు పచ్చబొట్టు. అది మూడు నెలల్లో పోయే టాటూ అని నాకు తెలీదా...ఐనా లైఫ్ టైం పరిమెంట్ టాటూ ఎవరు వేయించుకోమన్నారు తీసేయ్..బ్రేకప్ ఎన్ని సార్లు చెప్తావ్..వంద సార్లు చెప్పావ్..." అంటూ సుమ కౌంటర్లు వేసింది.

డాన్స్ ఐకాన్ కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్

డాన్స్ ఐకాన్ సీజన్ 2 మంచి రేటింగ్ తో బాగా సాగుతోంది డాన్స్ ఎపిసోడ్. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా మెంటార్ జాములూరి ఆమె కంటెస్టెంట్ షోనాలి ఇద్దరూ ఎలిమినేట్ ఇపోయారు. సోనాలికి బ్రౌన్ స్టార్ వచ్చినా కూడా ఎలిమినేట్ అయ్యింది..అంటే పంచ భూతాలుగా ఇక్కడ మెంటార్స్ ని రిప్రెజెంట్ చేసాడు యాంకర్ ఓంకార్. అంటే ఇప్పుడు జాను లూరి వాళ్ళు "వాటర్" ని రిప్రెజెంట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళ ప్లేస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా కొత్త పెయిర్ ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఈ కొత్త జంటను చూపించారు. వాళ్ళు ఎవరో కాదు బుల్లితెర మీద సీరియల్స్ లో కనిపించే, బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్లిన ప్రియాంక జైన్ . ఇక ప్రియాంక జైన్ గురించి చెప్పక్కర్లేదు బుల్లితెర మీద "మౌనరాగం" సీరియల్‌లో తన హవభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్.. మాటలు రాని మూగ అమ్మాయి పాత్రలో జీవించేసి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. కన్నడలో రూపొందించిన ‘రంగి తరంగి’ ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.  ప్రియాంక జైన్, తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించింది.  బుల్లితెర మీద  జానకి కలగనలేదు సీరియల్ లో నటించింది. ఇక ఇప్పుడు డాన్స్ ఐకాన్ కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది మరి ఎలా చేస్తుందో చూడాలి.  

రోబోటిక్ స్టైల్ డాన్స్ కి కాంచి షా పెట్టింది పేరు...డాన్స్ ఐకాన్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ..

ఆహా ఓటిటి వేదిక మీద ఓంకార్ నిర్వహిస్తున్న డాన్స్ ఐకాన్ సీజన్ 2 మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో అద్భుతమైన కంటెస్టెంట్స్ తో దూసుకుపోతోంది. ఇక ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ మెంటార్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె కంటెస్టెంట్ గా కాంచి షా అనే డాన్సర్  వచ్చింది. ఇక ఆ అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే 20 సంవత్సరాల వయసులో ముంబై లో డాన్సర్ గా ఒక ఊపు ఊపేసింది. అలాగే ఈమె ఫిట్నెస్ ట్రైనర్ గా తన జర్నీ కంటిన్యూ చేస్తోంది. చిన్న వయసు నుంచి ఆమెకు డాన్స్ అంటే ఇష్టం.  ఆ ఇష్టమే  ఆమెను పూర్తిస్థాయి డాన్సర్ గా , కొరియోగ్రాఫర్ గా,  ఫిట్‌నెస్ గురువుగా ఎదిగేలా చేసింది.. ఆమె బ్యాలె, జాజ్, హిప్ హాప్, బాలీవుడ్, బెల్లీ డ్యాన్స్ , ఇంకా లేటెస్ట్ ట్రెండింగ్ డాన్స్ స్టైల్స్ చేస్తుంది. ఈమె తండ్రి హేమంత్ షా ఒక బిజినెస్ మ్యాన్, తల్లి చేతనా షా హౌస్ వైఫ్ గా ఉంటారు. రోబోటిక్ డాన్స్ స్టైల్ కి ఆమె పెట్టింది పేరు. కాంచీ షా 2016లో జీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ షో సిరీస్ "సో యు థింక్ యు కెన్ డ్యాన్స్" ద్వారా బుల్లితెరపైకి  అరంగేట్రం చేసింది.  ఆమె ఆ షోలో టాప్ 10 గా నిలిచింది..  తరువాత, 2019లో, కాంచి షా ఇండియన్ డ్యాన్స్డ్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ "డాన్స్ దీవానే" సీజన్ 2  షోస్ లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. 2021లో, కాంచి షా సోనీ ఎంటర్టైన్మెంట్   డ్యాన్స్ రియాలిటీ షో అయిన "ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ " లో పార్టిటిసిపేట్ చేసింది. మలైకా అరోరా, గీతా కపూర్ , టెరెన్స్ లూయిస్ వంటి వాళ్ళు  ఆమె డాన్స్ స్టైల్ కి మెస్మోరైజ్ అయి  టాప్ 12 కంటెస్టెంట్స్ లో  ఒకరిగా ఎంపిక చేశారు. ఈమె యూట్యూబ్ కంటెంట్ కూడా  క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆమె తన డాన్స్ వీడియోస్ ని  "కాంచి షా యానిమేషన్ డాల్" అనే తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తుంది. కాంచి షా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంది స్టూడెంట్స్ కి డిఫెరెంట్ డాన్స్ స్టైల్స్ ని నేర్పిస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈమె ఇప్పుడు తెలుగు డాన్స్ ఐకాన్ సీజన్ 2 కి వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ గా వచ్చేసింది.  

వాడు నా కూతురిని పొట్టన పెట్టుకున్నాడు.. అలిగి వెళ్ళిపోయిన రామ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -341 లో....సీతాకాంత్ వెళ్తుంటే దారిలో కార్ ఆగిపోతుంది. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి ఎలా ఏదైనా లిఫ్ట్ అడుగుదామనుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి కార్ అటుగా వస్తుంది. దాంతో ఆ కార్ అపి లోపల కూర్చుంటాడు సీతాకాంత్. వెనకాల రామలక్ష్మిని చూసి ఆశ్చర్యపోతాడు. స్కూల్ కి వచ్చి నిన్ను చూసే అవకాశం ఈ రోజు లేదని.. నిన్నే ఇలా కన్పించేలా చేసాడు ఆ దేవుడు అని సీతాకాంత్ అంటాడు. ఇప్పుడు సీతా సర్ కి లిఫ్ట్ ఇవ్వకపోతే నేనే రామలక్ష్మిని అని తెలుస్తుందని రామలక్ష్మి లిఫ్ట్ ఇస్తుంది. వెళ్తు దారిలో అక్కడ టీ తాగి వెళదామా అని సీతాకాంత్ అడుగుతాడు. వద్దని రామలక్ష్మి అంటుంది. వస్తే నువ్వే రామలక్ష్మివి అని బయటపడతావని భయమా అని సీతాకాంత్ అనగా.. అంత లేదని టీ స్టాల్ దగ్గర ఆగి ఇద్దరు టీ తాగుతారు. పక్కన పెద్దావిడ వెళ్తుంటే.. బస్తీ లోని బామ్మ అని సీతాకాంత్ తన దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావని పెద్దావిడ అంటుంది. మీరేం చెసిన నేను బయటపడనని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు రామ్ కి శ్రీవల్లి భోజనం తినిపిస్తుంది. రామ్ కి వాటర్ ఇవ్వమని శ్రీలతని శ్రీవల్లి అడుగుతుంటే.. వాడేమైన చిన్న పిల్లాడా అంటూ తను కోప్పడుతుంది. దాంతో నిన్ను ఏమైనా వాటర్ అడిగానా అంటూ రామ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏంటి అత్తయ్య అలా అన్నారని శ్రీవల్లి అనగానే.. వాడు నా కూతురిని పొట్టన పెట్టుకున్నాడు. నాకు ఆ బాధ ఉంటుంది కానీ సీతా కోసం బయటపడనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు నాన్న నీతో ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య మిస్ నాతో డిఫరెంట్ గా ఉంటుంది. నీలా యాక్టింగ్ చేసినందుకు బాగా చేసావంటూ మెచ్చుకుంది. ఎందుకు అలా చేసింది. నాకు అర్ధం కాలేదని రామ్ అనగానే నాకు తెలుసని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.