Illu illalu pillalu : అమ్మకి శుభలేఖ ఇచ్చిన వేదవతి.. కాల్చేయబోయిన భద్రవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -123 లో.. చందుని శ్రీవల్లి ఇంటికి రమ్మని చెప్తుంది. చందు ఒక్కడే కాకుండా తన తమ్ముళ్లని వెంటపెట్టుకొని వస్తాడు. వాళ్ళ ముందు మాట్లాడడం కుదరదని భాగ్యం వాళ్లని బయటకు పంపిస్తుంది‌. ఇక భాగ్యం చెప్పినట్టుగా శ్రీవల్లి తన నటన మొదలుపెడుతుంది. మీకొక విషయం చెప్పాలి కానీ అది ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదండి.. నాకు టెన్షన్ గా ఉందని అంటుంటే ఏం పర్లేదు చెప్పండి అని చందు అంటాడు. అదంతా భాగ్యం దూరం నుండి చూస్తుంటుంది. ఈ పెళ్లి ఒక పది రోజులు వాయిదా వెయ్యండి అని శ్రీవల్లి చెప్తుంది. ఎందుకని చందు అడుగుతాడు.. మా వాళ్ళు డబ్బులు ఎవరికో అవసరం అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు.. ఈ విషయం మా వాళ్ళు మీ వాళ్ళతో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకే మీతో చెప్తున్నానని శ్రీవల్లి అంటుంది. అదంతా విని చందు షాక్ అవుతాడు. పెళ్లిపత్రికలు పంచాకా ఇప్పుడు వాయిదా అంటున్నారు. ఈ విషయం మా నాన్న కి తెలిస్తే తట్టుకోలేడు. నా వాళ్ళ మా నాన్న బాధపడకూడదని చందు  ఎమోషనల్ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి వేరే ఆప్షన్ లేదని శ్రీవల్లి ఏడుస్తుంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఆలోచించాలి.. డబ్బు ఎంత కావాలి అని చందు అడుగుతాడు. ఒక పది లక్షలు అని శ్రీవల్లి చెప్తుంది. పది లక్షలు సరే నేను ట్రై చేస్తానమని చందు చెప్పగానే శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా వెనకుండి నడిపిస్తున్న భాగ్యం చూసి ఖుషి అవుతుంది. మరొకవైపు వేదవతి తన గుమ్మం ముందు నిలబడి వాళ్ళ అమ్మ బయటకు వస్తుందా అని చూస్తుంటుంది. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటి అత్తయ్య అని అడుగుతుంది. మా అమ్మ కోసం మొదటి శుభలేక తనకి ఇవ్వాలని చూస్తున్న కానీ తను బయటకు రావట్లేదని వేదవతి అంటుంది దాంతో మీకు ఇష్టమైన సాంగ్ ఉంది కదా అది ప్లే చేస్తే బయటకు వస్తుందని ప్లే చేస్తుంది. అది వినగానే వేదవతి వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది. మొదటి శుభలేఖలు నీకే నువ్వు చందు పెళ్లికి తప్పకుండా రావాలని వేదవతి అనగానే.. నా మనవడి పెళ్లికి తప్పకుండా వస్తానని తను లోపలికి వెళ్తుంది. మరొకవైపు పది లక్షల గురించి చందు ఆలోచిస్తుంటాడు. అప్పుడే సాగర్ ధీరజ్ ఇద్దరు స్వీట్ తీసుకొని భాగ్యం ఇంటికి వస్తారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటని ధీరజ్ అంటాడు. అదేం లేదని భాగ్యం కవర్ చేస్తుంది. సాగర్ ధీరజ్, చందు, శ్రీవల్లి అందరు సెల్ఫీ తీసుకుంటారు. ఇక వాళ్ళు వెళ్లిపోతుంటే డబ్బుల విషయం వాళ్లకి చెప్పకని శ్రీవల్లితో భాగ్యం అనగానే.. చందుని పిలిచి డబ్బుల గురించి మీ వాళ్ళకి చెప్పకండి అని చెప్తుంది. దానికి చందు సరే అంటాడు. ఈ అన్నదమ్ముల మ్యాటర్ చూడాలి.... మా అల్లుడు వాళ్ళ మాట వింటే నా కూతురు మాట ఎలా వింటాడని భాగ్యం అనుకుటుంది. తరువాయి భాగంలో రామరాజు శుభలేఖలు ఇస్తుంటాడు. మరొకవైపు వేదవతి వాళ్ళ అమ్మకి ఇచ్చిన కార్డు చూసి ఆ ఇంటి శుభలేఖ మన ఇంట్లో ఏంటని భద్రవతి కాల్చేయబోతుంటే విశ్వ వచ్చి ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : శ్రీధర్ మాటలకి చొక్కా పట్టుకున్న కార్తీక్.. బోరున ఏడ్చేసిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -322 లో.. దీప ఇంటికి రాగానే కార్తీక్ ఎక్కడికి వెళ్ళావంటూ అడుగుతాడు. తనెందుకు చెప్తుంది.. నేను చెప్తానంటూ శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. నువ్వెందుకు వచ్చావ్.. అర్జెంట్ గా ఇల్లు ఖాళీ చెయ్యాలి.. ఎప్పుడు ఈ దరిద్రం ఏంటోనని శ్రీధర్ ని చూసి కార్తీక్ చిరాకుపడతాడు. మార్చాల్సింది ఇల్లు కాదు.. ఇల్లాలిని అని శ్రీధర్ అంటాడు. దాంతో కార్తీక్ శ్రీధర్ చొక్కా పట్టుకుంటాడు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి అని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. నీ భార్య ఎక్కడి నుండీ వచ్చిందో తెలుసా. శివన్నారాయణ ఇంటి నుండి అని శ్రీధర్ అనగానే కార్తీక్, కాంచన షాక్ అవుతారు. నా భార్య వాళ్ళింటికి వెళ్ళదని కార్తీక్ చెప్తాడు. నీ భార్య గౌతమ్ మంచివాడు కాదని ఒక అమ్మాయి ని తీసుకొని వెళ్లి తన కడుపులో పెరిగే బిడ్డకి గౌతమ్ తండ్రి అని డబ్బు ఇచ్చి చెప్పించాలని చూసింది కానీ ప్లాన్ ఫెయిల్ అయింది. తన భర్త వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. ఇక అక్కడున్న వాళ్ళు ఊరుకుంటారా దీపని కుక్క తిట్లు తిట్టారని శ్రీధర్ చెప్పగానే దీప ఏడుస్తుంది. నాకు ఇప్పుడు అర్ధమైంది అమ్మ తనది ఏ తప్పు లేదని నిరూపించుకోవాలనుకుంది కానీ మళ్ళీ అక్కడే ఏదో తప్పు జరిగిందని కాంచనతో కార్తీక్ అంటాడు.ఆ తర్వాత రాత్రి కార్తీక్   సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు. ఎక్కడ చూసినా దీప కన్పించదు. ఒక దగ్గర కూర్చొని బాధపడుతుంటే దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఆ గౌతమ్ గాడే ఇలా చేసాడని దీప అంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళిన విషయం మా నాన్నకి తెలుసు ఆయనే గౌతమ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడని కార్తీక్ అంటాడు. శ్రీధర్ గారికి నాపై కోపం.. స్వప్న, కాశీల పెళ్లి చేసాను. తన రెండో పెళ్లి గురించి బయటపెట్టానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఫణీంద్రతో గొడవకి దిగిన శ్రీలత.. అతను పెళ్ళికి ఒప్పుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో  వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -369 లో..... మాణిక్యం ఇంటినుండి రామలక్ష్మి ని తీసుకొని వస్తాడు సీతాకాంత్. తన అమ్మ నాన్న ప్రేమ చూసి ఎమోషనల్ అవుతుంది. ఏంటి వాళ్లు మీ అమ్మ నాన్ననా అని సీతాకాంత్ అనగానే.. లేదు కానీ నాకు చిన్నప్పటి నుండి అమ్మనాన్న లేరు.. వాళ్ళు అలా ప్రేమ చూపించగానే నేను కనెక్ట్ అయ్యానని రామలక్ష్మి అంటుంది. నీ బిహేవియర్ చూస్తుంటే రామలక్ష్మి అనిపిస్తుంది. అలా చెప్పేలోపే కాదు మైథిలీ అంటున్నావని సీతాకాంత్ అనుకుంటాడు. రామలక్ష్మి ఇంటికి సంతోషంగా వెళ్తుంది. నీ ఆనందానికి కారణం ఏంటని ఫణీంద్ర అడుగుతాడు. మా అమ్మనాన్నలని కలిసాను.. పైగా వాళ్ళ పెళ్లి రోజు దగ్గర ఉండి జరిపించానని రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. జరిగింది మొత్తం ఫణీంద్ర, సుశీల ఇద్దరికి రామలక్ష్మి చెప్తుంది. సీతాకాంత్ కావాలనే నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు నీకు రామలక్ష్మి అని ఉచ్చు బిగిస్తున్నాడు.. ఇక నువ్వు రామలక్ష్మిగా ఉంటావో లేక మైథిలీగా ఉంటావో నువ్వే తేల్చుకో అని ఫణీంద్ర అంటాడు. అవును సీతా సర్ కావాలనే చేస్తున్నాడు. నేను మైథిలీగానే ఉంటానని రామలక్ష్మి అనుకుటుంది. మరొకవైపు శ్రీలత పంతులు గారిని పిలిపిస్తుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. నీకు రమ్యకి పెళ్లి ముహూర్తం పెట్టాడానికి అని శ్రీలత అంటుంది. నాకు వద్దని చెప్పాను కదా అని సీతాకాంత్ అంటాడు. నన్ను స్వామి పంపాడని పంతులు చెప్తాడు. మీ జీవితంలో రెండు పెళ్లిళ్లు ఉన్నాయ్.. పెళ్లి చేసి పిల్లలతో కుటుంబంతో హ్యాపీగా ఉండమని అతను చెప్తాడు. ఏదైనా ఉంటే మళ్ళీ కాల్ చేస్తామని పంతులిని పంపిస్తాడు. నాకు పెళ్లి వద్దని శ్రీలతతో గొడవ పెట్టుకుంటాడు సీతాకాంత్. దాంతో శ్రీలత కోపంగా సీతాకాంత్ ని తీసుకొని మైథిలి దగ్గరికి వెళ్తుంది. నీ మనవరాలు నా కొడుకు జీవితం ప్రశాంతంగా లేకుండా చేస్తుందని ఫణీంద్రతో శ్రీలత గొడవపడుతుంది. నీ కొడుకే నా మనవరాలు వెంట పడుతున్నాడని శ్రీలతతో ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రుద్రాణి ప్లాన్ ఫెయిల్.. ఇబ్బందిగా ఉందని చెప్పిన రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -686 లో.. రాజ్ తో కావ్య అలా పరాయిదానిలాగా మాట్లాడడం భరించలేకపోతుంది. నేను మళ్ళీ కలుస్తానంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. కావ్య వెళ్ళిపోగానే యామిని వస్తుంది. బావ కాఫీ తాగుదామా అంటుంది. వద్దు నేను వెళ్తున్నానంటూ రాజ్ వెళ్ళిపోతాడు. మరొకవైపు యామిని గురించి అప్పు ఎంక్వయిరీ చేయిస్తుంది. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. నాకు కావ్య మాటలతో ఆశ కలుగుతుందని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది. కావ్య తనలో తను మాట్లాడుకుంటున్న వీడియోని రుద్రాణి అందరికి చూపించాలనుకుంటుంది. అందరి దృష్టిలో కావ్యని పిచ్చిదాన్ని చెయ్యాలనుకుంటుంది. రుద్రాణి ఇంటికి వచ్చి కావ్య మాటలు నమ్మి మీరు మోసపోతున్నారు.. అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ వీడియోని టీవీలో ప్లే చేస్తుంది. అదంతా చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు. అప్పుడే కావ్య కూడా వస్తుంది. తనలో తాను భ్రమలో బ్రతుకుతున్న కావ్యని చూసి అపర్ణ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అయిన మీరు నన్ను ఫాలో అవుతు ఎందుకు వచ్చారని రుద్రాణిని కావ్య అడుగుతుంది. ఫాలో అయింది మ్యాటర్ కాదు.. ఆ వీడియోలో ఉంది నిజమని రుద్రాణి అంటుంది. నాలో నేను ఏం మాట్లాడుకోవడం లేదు.. ఫోన్ మాట్లాడుతున్నా చూడు చెవిలో బ్లూ టూత్ పెట్టుకున్నానని వీడియో జూమ్ చేసి చూపిస్తుంది. క్లయింట్స్ ఎక్కడ వరకు వచ్చారో కనుకుంటున్నానని కావ్య చెప్తుంది. రాహుల్ , రుద్రాణి ఇద్దరు తమని ఫాలో అవుతూ వచ్చారని గమనించి కావాలనే బ్లూ టూత్ పెట్టుకుంటున్న విషయం గుర్తు చేసుకుంటుంది కావ్య. దాంతో ఇంట్లో అందరూ రుద్రాణి వంక కోపంగా చూస్తారు. ప్లాన్ ఫెయిల్ అయిందా అని రుద్రాణిపై స్వప్న విరుచుకుపడుతుంది. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రాకు.. నాకు చాలా ఇబ్బందిగా ఉందని యామినీతో రాజ్ చెప్తాడు. నువ్వు రాజ్ కి కోపం తెప్పించే పని చెయ్యకు విసుగొచ్చి ఎక్కడికైనా వెళ్తే పరిస్థితి ఏంటని యామినితో వైదేహి అంటుంది. మరొకవైపు కావ్య ఇలా భ్రమలో బ్రతుకుతుందని అపర్ణ బాధపడుతుంటే.. ఇందిరాదేవి, సుభాష్ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. అపర్ణ లిఫ్ట్ చేయబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అబద్దం చెప్పి డబ్బులు తీసుకుని సైకిల్ కొన్నా...అమ్మంటే భయం..

  లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ గురించి చెప్పక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ మీద ఒక సీనియర్ స్టార్ గా ఆమె ఒక జూనియర్ స్టార్ గా ఈయన  అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే మూవీ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బుల్లితెర మీదకు అడుగుపెట్టారు. ఉగాది సందర్భంగా స్టార్ మాలో ప్రసారమైన "మా ఇంటి పండగ" షోలోకి వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు.   ఇక బుల్లితెర లేడీ స్టార్స్ అంతా కలిసి విజయశాంతి మూవీస్ కి సంబంధించిన సాంగ్స్ తో మంచి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇక కళ్యాణ్ రామ్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు యాంకర్స్ విష్ణు ప్రియా, అంబటి అర్జున్. "ఎప్పుడైనా ఏ విషయంలో ఐనా అబద్దం చెప్పి ఇంట్లో దొరికిపోయారా" అని అడిగేసరికి "హా దొరికిపోయాను. అబద్దం చెప్పి దొరికిపోయాను. సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు తక్కువయ్యాయి. దానికోసం స్కూల్ లో ఒక సోషల్ యాక్టివిటీ ఉందని చెప్పి స్కూల్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని సైకిల్ కొనుక్కున్నా.. ఆ సైకిల్ కొనుక్కుని ఇంటికెళ్ళినందుకు సాయంత్రం చెంప మీద గట్టి దెబ్బ పడింది మా నాన్న దగ్గర నుంచి. అది ఎప్పటికీ మర్చిపోలేదు." అని చెప్పాడు. "ఏదైనా కోతి పని చేసి ఇంట్లో దెబ్బలు తిన్నారా" అని అడిగేసరికి "స్కూల్ లో ఫ్రీ పీరియడ్ వచ్చింది అని నన్ను క్లాస్ ని మానిటర్ చేయమన్నారు. అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పాను. కానీ అల్లరి చేసిన పిల్లల జుట్టు కత్తిరించేసాను." అని చెప్పాడు. ఇక ఫైనల్ గా "ఇంట్లో అమ్మకా లేదా నాన్నకా ఎక్కువగా బయపడింది" అని అడిగేసరికి "ఇద్దరూ అంటే చాలా భయం. కానీ మా అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అంటే 100  కి 89 మార్క్స్ వచ్చిన అమ్మ కొట్టేవారు. ఎందుకు 90 కంటే ఎక్కువ రాలేదు అని. ఒంటి మీద స్కేల్స్ విరిగిపోయేవి." అంటూ చెప్పాడు కళ్యాణ్ రామ్. ఏదేమైనా ఇంట్లో మాత్రం స్ట్రిక్ట్ వాతావరణం ఉండేది అన్న విషయం తెలుస్తోంది.

భర్తకు పనిష్మెంట్ ఇచ్చిన అనసూయ

  బుల్లితెర మీద అనసూయ గురించి అందరికీ తెలుసు. ఫైర్ బ్రాండ్ అని. ఐతే ఆమె భర్త భరద్వాజ్ గురించి ఎవరికీ తెలీదు. కానీ నెక్స్ట్ వీక్ వచ్చే ఫామిలీ స్టార్స్ షోలో ఆ విషయం తెలియబోతోంది. ఆయనొక సెటైరికల్ కామెడీ పర్సన్ అని. శ్రీరామనవమి సందర్భంగా ఫామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అనసూయ గోల్డెన్ కలర్ చీరలో తన భర్త భరద్వాజ్ తో కలిసి వచ్చింది. అలాగే ఈ షోకి ఆట సందీప్ - జ్యోతిరాజ్, శ్రీవాణి - విక్రమాదిత్య, లాస్య - మంజునాథ్, జ్యోతక్క - గంగూలీ, సిద్దార్ధ్ వర్మ - విష్ణు జోడీస్ వచ్చారు. ఇక ఇందులో వీళ్ళు అడిగిన ప్రశ్నలకు అనసూయ భరద్వాజ్ బాగా ఆన్సర్స్ ఇచ్చారు. "ఎందుకు కుకింగ్ అంటే ఆడాళ్లే చేయాలి" అని జ్యోతక్క అడిగింది. దానికి అనసూయ " ఖైదీలకు ఫుడ్ పెట్టే బాధ్యత జైలర్ దే కదా. నా భర్త నా ప్రేమ ఖైదీ కాబట్టి అలా చెప్పాను" అంది. "ఎప్పుడూ భార్య భర్తకు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఎందుకు ఉంటుంది" అని విక్రమాదిత్య అడిగాడు..దానికి భరద్వాజ్ "ఎందుకంటే వాళ్ళు వాళ్లెప్పుడూ రైట్ వేలో ఆలోచించారు కదా" అని సెటైర్ వేసేసరికి అనసూయ ముఖం మాడిపోయింది. "సరే ఈరోజు పిల్లలతో పడుకో" అంటూ పాపం భరద్వాజ్ కి గట్టి పనిష్మెంట్ ఇచ్చింది. "ఏంటండీ ఇది.. ఇదేం పనిష్మెంట్ ..పాపం ఆయన జస్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. ఎందుకు ఆయన్ని ఇలా చేస్తారు" అంటూ సుడిగాలి సుధీర్ భరద్వాజ్ గురించి మాట్లాడాడు. తర్వాత  "పెళ్లయ్యాక  అబ్బాయిలకు మాత్రమే పొట్టోస్తుంది కదా ఎందుకు" అని అడిగాడు ఆట సందీప్. " అన్ని కష్టాలు మనమే తీసుకుంటాం కదా అది పొట్టలో ఉండిపోయి పొట్ట పెరిగిపోతుంది" అంటూ భరద్వాజ్ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో అనసూయ కన్నీళ్లు పెట్టుకుని "అమ్మో ఈ షోకి వచ్చాక మా ఆయన ఎంత మారిపోయాడో" అంటూ సరదాగా కామెడీ చేసింది.

డ్రామా జూనియర్స్ సీజన్ 8 కి సెలెక్ట్ ఐన గుడిసేటి ఎదవ...

   సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగాక గుడిసేటి ఎదవలు, బడి చాటు బడితెలు బాగా పెరిగిపోయారు. ఈ గుడిసేటి ఎదవ అంటే తిట్టు అనుకునేరు ఆ పిల్లాడి ఇన్స్టాగ్రామ్ పేజీ పేరన్నమాట..ఆ  పేరుతో ఒక బుడతడు గోదారి యాసతో ఆయ్ అంటూ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ ఐపోయాడు. ఈ గుడిసేటి ఎదవ గోదారి జిల్లాల్లో ఎన్నో యాడ్స్ , ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ పిల్లాడి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఐతే 77 .9 కే మంది ఉన్నారు. ఇక ఈ పిల్లాడు జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8కి సెలెక్ట్ అయ్యాడు. జీ తెలుగులో ఈ సీరిస్ ఇప్పటి వరకు 7 సీజన్స్ పూర్తయ్యాయి. ఐతే త్వరలో జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 8  స్టార్ట్ అవుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెలలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో, సారధి స్టూడియో, అమీర్ పెట్ లోని స్టూడియోస్ లో  టాలెంట్ ఉన్న 4-12 ఏళ్ల వయసున్న పిల్లల కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్ కి చాలా మంది పిల్లలు వచ్చారు. ఈ ఆడిషన్స్ కాకినాడలో కూడా జరగడంతో రాజమండ్రికి చెందిన గుడిసేటి ఎదవ అలియాస్ హరీష్ సెలెక్ట్ అయ్యాడు. ఇక ఈ పిల్లాడు ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇక వాళ్ళ వాళ్ళ స్కూల్ లోని టీచర్స్, ఫ్రెండ్స్ కూడా గుడిసేటి ఎదవకి విషెస్ చెప్పారు. కొంతమంది నెటిజన్స్ ఐతే సెలెక్ట్ అయ్యావని చదువు మానేయకు చదువుకుంటూనే స్కిట్స్ చెయ్యి అంటూ సలహాలు ఇస్తున్నారు.  

రోహిణి చదువులో ఎంతో గ్రేట్... తలెత్తుకునేలా చేసింది

  కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కాలేజీ స్పెషల్ పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇక ఈ షోకి ఒక స్పెషల్ గెస్ట్ గా ఒక ప్రొఫెసర్ వచ్చారు. రావడంతో లేడీ కమెడియన్ రౌడీ రోహిణి లేచి నిలబడింది. ఆయన ఎవరో కాదు రోహిణికి చదువు చెప్పిన ప్రొఫెసర్ అన్న విషయం అర్థమైపోతుంది. ఆయనకు రోహిణి వినమ్రంగా రెండు చేతులు జోడించి నమస్కరించింది. ఆయన రాగానే "షీ కంప్లీటెడ్ డిప్లొయ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్.. ఒక స్టూడెంట్ గా చూసాను. ఇప్పుడు ఈ స్టేజి మీద చూడడం నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్" అంటూ తన స్టూడెంట్ గురించి ఆ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలు విన్న వాళ్లంతా వ్వావ్  అంటూ చప్పట్లు కొట్టి రోహిణి టాలెంట్ ని మెచ్చుకున్నారు. రౌడీ రోహిణి చిన్న చిన్నగా ఎదుగుతూ ఇంత దూరం వచ్చింది. బుల్లితెర లేడీ కమెడియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్ లో రోహిణి ఉంటుంది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళింది అలాగే మూవీస్ లో నటిస్తోంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ఐతే రోహిణి నటన చూస్తే పొట్ట చెక్కలయ్యేంత కామెడీ ఉంటుంది. ఆమె టైమింగ్ కామెడీతోనే ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. రాకింగ్ రాకేష్ స్కిట్స్ లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే బంగార్రాజు మూవీలో హీరోయిన్ కృతి శెట్టి వెంట ఉండే రోల్ లో నటించింది రోహిణి.

సుధీర్ ఆ ఒక్కటి అడక్కు...ఆర్ అంటే ఎందుకు ఇష్టమో కూడా నాకు తెలుసు

  హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే రంభ ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఏ సినిమాల్లోనూ నటించడం లేదు. ఫామిలీతో పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ కనిపిస్తోంది. ఐతే రంభ ఇప్పుడు బుల్లితెర మీద కనిపించబోతోంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి రంభ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ షోకి ప్రతీ వారం అలనాటి  అందాల నాయకులను తీసుకొచ్చి వాళ్లకు సముచిత గౌరవాన్ని అందిస్తోంది. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. రంభ రావడంతోనే యాంకర్ రవి పులిహోర కలిపాడు.. ఆర్ ఫర్ రవి , ఆర్ ఫర్ రంభ, ఆర్ ఫర్ రావిషింగ్ అనేసరికి రంభ వెంటనే సెటైర్ వేసింది. మొన్నటి ఎపిసోడ్ కి రమ్య కృష్ణ వచ్చినప్పుడు ఆర్ ఫర్ రమ్య కృష్ణ, ఆర్ ఫర్ రవి అన్నారు అనేసరికి పరువు పోయింది. ఆర్ తో పేర్లు స్టార్ట్ ఐనా హీరోయిన్స్ మి..మేమేం తప్పు చేసాం ? అని అడిగింది. ఇంతలో సుధీర్ వచ్చి "ఆర్" అంటే ఇష్టం మేడం అనేసరికి "మీకు ఆర్ అంటే ఇష్టం అని తెలుసు అది నాకు గురించి కాదని కూడా నాకు తెలుసు" అనేసరికి సుధీర్ వెంటనే "మీరు అక్కడ కూర్చుంటే మీ దగ్గర" అనబోయాడు. అంతే రంభ వేలు చూపించి "ఆ ఒక్కటి అడక్కు" అని సెటైర్ వేసింది. "నా పేరు రంభ. ఎపిసోడ్ రంజుగా ఉంటుంది" అంటూ ఆ ఎపిసోడ్ లింక్ ని చాల క్యూట్ గా చెప్పేసింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో రంభ " ఆ ఒక్కటి అడక్కు" అనే మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చిరంజీవితో కలిసి చేసిన "హిట్లర్" మూవీతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దేశముదురు, యమదొంగ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన రంభ 2010 తర్వాత సినిమాలకు దూరమై ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆ వీడియోస్ ని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేస్తూ ఉంది.    

అనసూయ ఒక్క ఛాన్స్...హైట్ చూస్తే కత్తిలా ఉన్నాడు..

    కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్ క్లాస్ రూమ్ ఐతే అందులో స్టూడెంట్స్ ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చూపించబోతున్నారు. కాలేజ్ స్పెషల్ థీమ్ లో భాగంగా కొన్ని స్కిట్స్ వేశారు. ఐతే ఇందులో యాదమ్మ రాజు - అనసూయ మధ్య ఒక స్కిట్ నడిచింది. "మీలాంటి అమ్మాయి ఎదురుగా ఉంటే ఒక్క స్టెల్లాని ఏమిటి ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తా...ఒక్క చాన్సు ఇస్తే మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా మేడం " అంటూ అనసూయ గురించి ఒక హార్ట్ టచ్చింగ్ డైలాగ్ చెప్పాడు. దానికి అనసూయ ఫిదా ఐపోయింది కానీ తర్వాత ఇంకో డైలాగ్ వేసింది. "సరిపోను రాజు" అంటూ అనసూయ నవ్వేసింది. ఆ డైలాగ్ కి తేజు మడివాడ ఐతే పడీపడీ నవ్వింది. ఇక మరో వైపు బుల్లితెర నటి డెబ్జాన్ కి ప్రొపోజ్ చేసాడు ఆరుగుడుల అందగాడైన దిలీప్. "ఇలాంటి ఒక అబ్బాయికి లైఫ్ లోకి వస్తే ఆయనకు ఛాన్స్ ఉందా లేకపోతే లేదా" అని శ్రీముఖి అడిగింది. దానికి డెబ్జాన్ ఐతే "ఎందుకు అవకాశం ఉండదు. హైట్ చూస్తే కత్తి లాగా ఉన్నాడు." అని చెప్పేసరికి దిలీప్ కూడా ఫుల్ ఖుషీ ఐపోయాడు దాంతో డెబ్జాన్ ని గిరగిరా అంటూ రొమాంటిక్ గా తిప్పేసాడు. ఇక నెటిజన్స్ ఐతే డెబ్జాన్ పక్క దిలీప్ ని ఒప్పుకోవడం లేదు. డెబ్జాన్ పక్కన నిరంజన్ కరెక్ట్ ఆయన తప్ప ఆమె పక్కన ఎవరూ సూట్ కారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డెబ్జాన్ - నిరంజన్ కలిసి "ఎన్నెన్నో జన్మల బంధం" అనే సీరియల్ లో కలిసి నటించారు. ఈ సీరియల్ తో వీళ్లకు బాగా పేరు కూడా వచ్చింది. మొదట్లో డెబ్జాన్ ఐతే షోస్ కి వచ్చేటప్పుడు తెలుగు రాని కారణంగా అంతగా మాట్లాడేది కాదు. కానీ ఇప్పుడు అన్ని షోస్ లో కూడా వచ్చి రాని తెలుగుతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.

Illu illalu pillalu : పెళ్ళికి ముందే పది లక్షలు అడిగిన శ్రీవల్లి.. భాగ్యం ప్లాన్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ', ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-122 లో.....భాగ్యం చెప్పినట్టుగా చందుకి శ్రీవల్లి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి.. త్వరగా రమ్మని చెప్తుంది సరేనని చందు బయలుదేర్తుంటే సాగర్, ధీరజ్ వచ్చి చందుని ఆటపట్టిస్తారు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగగా.. శ్రీవల్లి రమ్మంది ఏదో మాట్లాడాలని చెప్పిందని చందు చెప్తాడు. సరే మేం కూడ వస్తామని సాగర్, ధీరజ్ లు వెళ్ళబోతుంటే అప్పుడే తిరుపతి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడ్డుపడతాడు. శ్రీవల్లి దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతారు. మరొకవైపు భాగ్యం ఒక ఇంటిని రెంట్ కి తీసుకొని చెక్కు ఇస్తుంది. అతను చెక్కు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ చెక్కు పై సంతకం చూడకుండానే తీసుకున్నాడని భాగ్యం చిన్న కూతురు అంటుంది. వాడు బుర్ర తక్కువోడు కాబట్టే మనకి ఇంటిని ఇచ్చాడని భాగ్యం అంటుంది. నేను చెప్పినట్టు అల్లుడు గారితో మాట్లాడమని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. అప్పుడే సాగర్, చందు, ధీరజ్ ముగ్గురు వస్తారు. అదేంటీ ఒక్కడినే రమ్మంటే ముగ్గురు వచ్చారని భాగ్యం టెన్షన్ పడుతుంది. ఇక ముగ్గురిని లోపలికి పిలిచి స్వీట్స్ తీసుకొని రమ్మని సాగర్ , ధీరజ్ లని పంపిస్తారు. భాగ్యం తన భర్త కూతురు వెళ్ళిపోతారు. చందు, శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటారు. మరొకవైపు చందు, శ్రీవల్లీల పెళ్లి పత్రికలో తమ పేర్లు రాసుకొని నర్మద మురిసిపోతుంది. అప్పుడే ప్రేమ వచ్చి అలా ఎందుకు రాసావని అడుగుతుంది. ఇదొక జ్ఞాపకం మనకి ఇలాంటి జ్ఞాపకాలు లెవ్వు.. మన పెళ్లిళ్లు పెద్దవాళ్ళు చేస్తే అన్ని జ్ఞాపకాలు ఉండేవి అని నర్మద ఎమోషనల్ అవుతుంటే ప్రేమ బాధపడుతుంది. అదంతా వేదవతి చూస్తుంది. తరువాయి భాగంలో పెళ్లి ఖర్చుకి డబ్బు కావాలని చందుని శ్రీవల్లి అడుగుతుంది. ఎంత అని చందు అడుగగా పది లక్షలు అని శ్రీవల్లి చెప్తుంది. దాంతో చందు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2: ప్లేట్ తిప్పేసిన రమ్య.. అడ్డంగా బుక్కైన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -321 లో......గౌతమ్ మంచి వాడు కాదని నిరూపించడానికి రమ్యని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తుంది దీప.. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమ్ అని దీప చెప్తుంది. ఆ మాట తను చెప్పాలి కదా అని పారిజాతం అంటుంది. నా కడుపులో పెరుగుతున్నా బిడ్డ కి తండ్రి అని రమ్య టెన్షన్ పడుతుంటే.. అప్పుడే నేనే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని అంటూ సత్తిపండు ఎంట్రీ ఇస్తాడు. దాంతో రమ్యతో పాటు దీప కూడా షాక్ అవుతుంది. ఏయ్ నువు అబద్ధం చెప్తున్నావని దీప సత్తి పండుని దబాయిస్తుంది. ఏంటి నేను అబద్దం చెప్పేది.. నువ్వే నా భార్యకి డబ్బిచ్చి అబద్దం చెప్పిస్తున్నావ్.. ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళు మా గల్లీలో ఇంటికి ఒకరు ఉంటారండి.. ఇప్పుడు మా ఆవిడ కూడా డబ్బుకి ఆశపడే ఇలా చేసిందని అతను చెప్తాడు. రమ్య అతను చెప్పేది అబద్ధమని చెప్పు అని దీప అంటుంది. ఆమ్మో వాడు మా వీధి రౌడీ.. వాడికి అడ్డు చెప్తే మా వాళ్ళని బ్రతకనివ్వడు అని రమ్య భయపడుతుంది. ఆ తర్వాత రమ్యని తీసుకొని సత్తిపండు వెళ్ళిపోతాడు. ఇక అందరు దీపని తిడతారు. సుమిత్ర అయితే దీప మనసు ముక్కలు అయ్యేలా మాట్లాడుతుంది. దీప ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అదంతా శ్రీధర్ కిటికిలో నుండి చూస్తాడు. గౌతమ్ మంచివాడు కాదా.. అందుకే దీప నిరూపించే ప్రయత్నం చేసింది. మళ్ళీ అతను ఎందుకు వచ్చాడు.. ఇందులో జ్యోత్స్నకి ఏమైనా సంబంధం ఉందా అని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న వంక చూస్తుంటే.. జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్యోత్స్న సత్తి పండుకి కాల్ చేసి డబ్బు పంపించాను.. ఆ రమ్య నోరు తెరావడానికి వీల్లేదని జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు దాస్ కి గతం గుర్తు వచ్చి పేపర్ పై అసలైన వారసురాలు అంటూ రాస్తుంటాడు. అప్పుడే కాశీ, స్వప్న డాష్ ఇచ్చుకుంటారు. దాంతో స్వప్న చేతిలో గ్లాస్ కిందపడిపోగా దాస్ మళ్ళీ గతం మర్చిపోతాడు. ఆ పేపర్ కింద పడేస్తాడు. దీప ఎక్కడకి వెళ్ళిందని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే దీప వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని కార్తీక్ అడుగగా.. ఎక్కడికి వెళ్ళిందో నీ భార్య చెప్పదు, నేను చెప్తానంటూ శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఎమోషనల్ అయిన రామలక్ష్మి.. సీతాకాంత్ కనిపెడతాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -368 లో.... రామలక్ష్మిని సీతాకాంత్ తన పుట్టింటికి తీసుకొని వెళ్లి తన చేతే నిజం బయటపెట్టించాలనుకుంటాడు కానీ రామలక్ష్మి మాత్రం తన తల్లితండ్రులు ప్రేమని చూపిస్తున్న కానీ తనే రామలక్ష్మి అని అసలు బయటపడదు.. సుజాత వంట చేస్తుంటే రామలక్ష్మి వెళ్తుంది. నా పెద్ద కూతురు ఇలా అలా అంటూ గొప్పగా చెప్తుంది. అందరి గురించి చెప్తున్నారు కానీ మీ అబ్బాయి గురించి చెప్పడం లేదని రామలక్ష్మి అడుగగానే.. నాకూ కొడుకున్న విషయం నీకెలా తెలుసని సుజాత అడుగుతుంది. అంటే నాకు సీతా గారు చెప్పారని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. మా కూతురు రామలక్ష్మి కూడా ఇలాగే తింటుందని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి మాణిక్యం వచ్చి రామలక్ష్మి డైరీ ఇస్తాడు. ఇది నా కూతురు డైరీ ఇందులో నీ పేరు రాయ్ గుర్తు గా ఉంచుకుంటామని  మాణిక్యం అనగానే.. నా చేతి వ్రాత ద్వారా నేను ఎవరో కనిపెట్టాలి అనుకుంటున్నావు కదా నాన్న అని రామలక్ష్మి అనుకొని లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్లిపోతూ సుజాత, మాణిక్యం దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ వెళ్లి కార్ లో కూర్చుంటాడు. రామలక్ష్మితో సుజాత, మాణిక్యం మాట్లాడుతారు. మాకైతే నువ్వు మా కూతురివే అనిపిస్తుంది. ఏదైనా అది నీకే తెలుసని సుజాత ఎమోషనల్ అవుతుంది. సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు బయల్దేరి వెళ్ళిపోతారు. అమ్మ నాన్న ప్రేమ అంటూ రామలక్ష్మి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఏంటి నా అత్తమామ నీకు అమ్మ నాన్ననా అని సీతాకాంత్ షాక్ అవుతాడు. అంటే చిన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోయారు కదా.. ఆ ప్రేమ నాకు తెలియదని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : సమాధుల దగ్గరికి వెళ్లిన యామిని.. అతనేమో కావ్యతో మీటింగ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -685 లో.... కావ్య రెడీ అయి వెళ్తుంటే రాహుల్, రుద్రాణి ఇద్దరు తనని ఫాలో అవుతుంటారు. కావ్య నిజంగానే రాజ్ ని కలవడానికి వెళ్తుందా.. ఎక్కడికి వెళ్తుందని అనుకుంటారు. మరొకవైపు రాజ్ కోసం యామిని వెతుకుతుంటుంది. బావ ఎక్కడ అని వాళ్ళ డాడ్ ని అడుగుతుంది యామిని‌‌. నువ్వు స్పృష్టించిన రాజ్ పేరెంట్స్ సమాధుల దగ్గరికి వెళ్ళాడని వైదేహి చెప్తుంది. ఎందుకు వెళ్ళనిచ్చారు.. తనకి ఎవరైనా ఎదరుపడితే పరిస్థితి ఏంటని వైదేహిపై యామిని కోప్పడుతుంది. నేను వెళ్తానంటూ యామిని బయల్దేర్తుంది. కావ్య రెస్టారెంట్ దగ్గర లోపలికి వెళ్తుంది. తన వెనకాలే రాహుల్, రుద్రాణి వెళ్తారు. కావ్య కూర్చొని ఉంటుంది. తనలో తాను మాట్లాడుకుంటుంది. అదంతా రాహుల్ వీడియో తీస్తాడు. ఈ బ్రాహ్మస్త్రం చాలు దాని సంగతి చెప్పడానికి అని రుద్రాణి అంటుంది. రాహుల్, రుద్రాణి బయటకు వెళ్లిపోతుంటే అప్పుడే రాజ్ వస్తాడు. ఒకరికొకరు ఎదరు పాడబోతుంటే అప్పుడే రాజ్ ని పక్కకి లాగుతుంది కావ్య. ఏంటని రాజ్ అడుగతాడు. మిమ్మల్ని పిలుస్తున్నా మీరు పట్టించుకోవడం లేదని లాగానంటూ కావ్య అంటుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుటుంటారు. అప్పుడే యామిని ఫోన్ చేస్తుంది. బావ ఎక్కడున్నావని అడుగుతుంది. అమ్మనాన్నల సమాధుల దగ్గరికి వచ్చానని రాజ్ అంటాడు. నేను ఇక్కడే ఉన్నానని యామిని అనగానే అంటే అక్కడ నుండి ఇప్పుడే పక్కన ఉన్న కేఫ్ కి వచ్చిన అని రాజ్ చెప్తాడు. దాంతో వస్తున్న అని యామిని ఫోన్ కట్ చేస్తుంది. రాజ్ తన ముందున్నా.. ఎవరో పరాయి వ్యక్తితో ఉన్నట్టు ఉండడం కావ్య భరించలేక ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే ఉంటే ఎక్కడ నిజం చెప్పేస్తానెమోనని రాజ్ ఫోన్ మాట్లాడి రాగానే వెళ్తున్నానంటూ వెళ్ళిపోతుంది. తరువాయి భాగంలో కావ్య తనలో తను మాట్లాడుకునే వీడియోని రుద్రాణి ఇంట్లో టీవీలో ప్లే చేస్తుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడే కావ్య వస్తుంది. ఇన్ని రోజులు నేను చెప్తే ఎవరు నమ్మలేదు కదా.. ఇకనైనా ఆలోచించండి అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

టీవీ షోస్ లో ఎనెర్జీతో కనిపించే దీపికా సంతోషం వెనక ఉంది ఇదా

దీపికా రంగరాజు బుల్లితెర మీద అల్లరి చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య రోల్ లో డీసెంట్ లుక్ లో కనిపిస్తుంది కానీ మిగతా షోస్ లో చూస్తే ఆమె అల్లరి మాములుగా ఉండదు. డాన్స్ ఐకాన్ లో ఐతే కంటెస్టెంట్స్ కి ఇచ్చే కామెంట్స్ , చేసే డాన్స్ లు, వచ్చే గెస్టులను భయపెట్టడాలు చేస్తూ ఉంటుంది. అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో చెఫ్ జీవన్ ని ఆట పట్టించడం, హోస్ట్ సుమతో పరాచికాలు ఆడుతూ కనిపిస్తుంది. అలాంటి దీపికా ఇప్పుడు తన నవ్వు వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఒక ఇన్స్టా రీల్ ద్వారా చెప్పేసింది. పుష్పలో శ్రీవల్లి గెటప్ లో కనిపించిన దీపికా 100 రూపాయల నోటును మడత పెట్టి గాంధీ తాత బొమ్మను చూపిస్తూ "నేను ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు నన్ను నవ్వించే వ్యక్తి ఈయనే. నా మూడ్ స్వింగ్స్ ని హ్యాపీ మూమెంట్స్ గా మార్చే వ్యక్తి కూడా ఈయనే" అంటూ చెప్పుకొచ్చింది. ఇక నెటిజన్స్ ఐతే దీపికా అందాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఒక నెటిజన్ ఐతే "మేడం సర్ మేడం అంతే. నిజాన్ని  అంగీకరించినందుకు ధన్యవాదాలు డబ్బు మూడ్ స్వింగ్స్‌ను సంతోషంగా, చిరునవ్వుగా మార్చేయగలదు. " అంటూ కామెంట్ చేశారు. టీవీ షోస్ లో దీపికను కానీ ఆమె కౌంటర్స్ ని ఆమె తెలుగుని ఆమె డైలాగ్స్ ని తట్టుకోవడం చాలా కష్టం. అలుపులేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైములో లేడీ కమెడియన్ గా దీపికా చాలా పేరు సంపాదించేసింది. దీపికా లేకపోతె ఆ షోకి రేటింగ్ రాదేమో అన్న స్థాయికి వెళ్ళిపోయింది. ఏదేమైనా ఎవరికైనా ఎనెర్జీ రావాలంటే అది కేవలం డబ్బు వల్లే అంటూ దీపికా ఈ రీల్ ద్వారా చెప్పేసింది.

లక్ష రూపాయలతో జుట్టు పెట్టించాను జాగ్రత్త

ఉగాది వెళ్ళిపోగానే శ్రీరామ నవమి వచ్చేస్తుంది. ఇక బుల్లితెర మీద శ్రీరామనవి కొత్త షోస్ రెడీ అయ్యాయి. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో  రిలీజ్ అయ్యింది. ఇందులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చాడు. ఐతే రాంప్రసాద్, ప్రదీప్, గెటప్ శీను కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ తో తెలుగు కాదు ఒక కొరియా సినిమా ప్లాన్ చేసాం అన్నాడు ప్రదీప్. వెంటనే రాంప్రసాద్ "ఏంటి మన డైరెక్టర్ నాకంటే ఎక్కువ గ్లామర్ గా ఉన్నాడు. కొంచెం గ్లామర్ తగ్గించుకో" అన్నాడు ప్రదీప్ ని . వెంటనే ప్రదీప్ గుండ్రంగా తిరిగి ముఖం మీద కొంచెం మేకప్ ని చెరిపేసుకున్నాడు. దానికి రాంప్రసాద్ శాటిస్ఫై అయ్యాడు. "నీకు గ్లామర్ తగ్గింది సరే మరి నాకు గ్లామర్ పెరగాలంటే ఎం చేయాలి" అని అడిగాడు. దానికి ప్రదీప్ వెంటనే రాంప్రసాద్ జుట్టును పట్టుకుని వెంట్రుకలను మెలేస్తూ నుదురు మీదకు ఎగిరేలా ట్రై చేసాడు. దానికి రాంప్రసాద్ ఫీలయ్యాడు. వద్దొద్దు అనేసరికి "ఇంకొంచెం గ్లామర్ పెంచుతా...అసలే మీకు మొహమాటం ఎక్కువ అంటూ ఇంకో వెంట్రుక తీసి దాన్ని నుదుటి మీదన మెలేసి ఉమ్ము తీసి ఆ వెంట్రుకకు నుదుటికి అంటించాడు. శోభన్ బాబు రింగ్ లా అన్నమాట. లక్ష రూపాయలతో పెట్టించానయ్యా ఈ జుట్టును అంటూ తెగ బాధపడ్డాడు రాంప్రసాద్. "అందులో ఈ శోభన్ బాబు రింగ్ 50 వేలులా ఉంది" అన్నాడు నవ్వుతూ. తర్వాత రాంప్రసాద్ ఆల్మోస్ట్ పాతిక అంటూ జుట్టు గురించి ఏదో చెప్పబోతుంటే గెటప్ శీను వచ్చి రాంప్రసాద్ ను లాగిపెట్టి కొట్టి "బాగుందని చెప్తుంటే చల్ " అంటూ అరిచిపడేశాడు. దానికి రాంప్రసాద్ కొంచెం ఎక్కువగానే హర్ట్ ఐనట్టు కనిపించాడు.

తెలంగాణ ప్రభుత్వానికి ఆ పశుపక్ష్యాదుల ఏడుపులు వినిపించడం లేదా ....ప్రశ్నించిన రష్మీ

  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఎంతలా వైరల్ అవుతోందో మనందరం చూస్తూనే ఉన్నాం. అక్కడ చనిపోతున్న పశువులు, పక్షుల హాహాకారాలు కూడా వింటూనే ఉన్నాం. దీనిపై ప్రకృతి ప్రేమికులు కూడా స్పందిస్తున్నారు. అలాగే రీసెంట్ గా యాంకర్ రష్మీ కూడా స్పందిస్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నేను డెవలప్మెంట్ కి విరుద్ధంగా ఈ వీడియోని పోస్ట్ చేయడం లేదు. హెచ్సియులో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఇన్ హెచ్సియు అని సోషల్ మీడియాలో చాలామంది  పోస్ట్ చేస్తున్నారు. నేనిప్పుడు కంఫర్టబుల్ గా నా అపార్ట్మెంట్ లో కూర్చుని ఈ వీడియో చేస్తున్నాను. ఐతే నాకు తెలుసు..ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని చెట్లను నరికేసి ఉంటారో అని ఎన్ని జంతువులకు హాని చేశారో అని. ఇక్కడ కూర్చుని నేను ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడం ఈజీనే. ఐతే నాకు ఈ యూనివర్సిటీ వివాదం ఏంటో లీగల్ గా ఇష్యూస్ ఏంటో నాకు అవగాహన లేదు. ఒక సామాన్య పౌరురాలిగా నేను రాత్రి డెవలప్మెంట్ వీడియో చూసాను అందులో ఎన్నో పక్షులు, మూగజీవాల ఏడుపులు చూసాను. అక్కడ నెమళ్ళు, లేళ్ళు, పక్షులే కాకుండా ఆ అడవిని అంటి పెట్టుకుని ఎన్నో జీవజాతులు నివసిస్తున్నాయి. అసలు ఎండాకాలం ఇలాంటి సమయంలో మనం కూడా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటి ఇంటి నుంచి వాటినే తరిమేయడం ఎంతవరకు న్యాయం. ఒకసారి మీరే ఆలోచించండి. వాటికి పునరావాసం కల్పించే శక్తిసామర్ద్యాలు ఉన్నది మీ ఒక్కరికే సర్. మీరు ఆ పశుపక్ష్యాదులను దృష్టిలో పెట్టుకుని ఒక పాజిటివ్ అప్ప్రోచ్ తో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ బాధాతప్త హృదయంతో చెప్పింది రష్మీ.

నాకు 44 ...రేపోమాపో పోతాను..ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు గాలి, నీరు అవసరం

  అడవి అంటే చిన్నప్పుడు చెప్పుకున్న చందమామ కథలే గుర్తొస్తాయి.. అడవిలో ఉండే పక్షులు, పశువులు, జింకలు, లేళ్ళు, నెమళ్ళు, చిలకలు వాటి గురించి విన్నప్పుడు మనం కూడా అలా స్వేచ్ఛగా ఉంటె బాగుంటుంది కదా అని అనుకోని పిల్లలు, పెద్దలు ఎవరూ ఉండరు. కానీ ఇప్పుడు అలాంటి ఒక అడవి ఆపదలో పడింది. నెమళ్ళ హాహాకారాలు చేస్తున్న వీడియో చూస్తున్న గుండెలు పగిలిపోయేంత బాధాగా ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. అదే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నా విషయం మీద సినీ సెలబ్రిటీస్ అంతా గళం విప్పుతున్నారు. రష్మీ దీని గురించి మాట్లాడగా ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన మాటలు వింటే ఉఫ్...ఎవరికైనా మనసు చలించక మానదు. "ఒక తల్లిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఎలాగో నా వయసు 44 ..రేపో మాపో పోతాను. కానీ నా పిల్లలు ఉన్నారు. వాళ్ళ లాంటి పిల్లలు ఎందరో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు చాలా ఉంది. ఆక్సిజన్, నీళ్లు చాలా అవసరం అవుతాయి. డెవలప్మెంట్ అవసరం లేదు అని చెప్పడం లేదు..చాల అవసరం. మనకు మన బిల్డింగ్స్ కావాలి, ఐటి పార్కులు కావాలి..వీలయితే ఈ ఒక్క 400 ఎకరాలు వదిలేయమని మీ రాష్ట్ర పౌరురాలిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మన దగ్గర చాలా బంజరు భూమి ఉంది డెవలప్ చేసుకోవడానికి. మీకు చెప్పేంత దాన్ని కాదు. మీరంతా ఎక్స్పర్ట్స్ ఇందులో. ఒక తల్లిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ముసలిదాన్ని ఐపోయాను. ఒక్కసారి మీరు మళ్ళీ దీని గురించి ఆలోచించండి. మనల్ని కాపాడుతున్న ఆ భూమి ఆ ఎకో సిస్టం ఎంతో అవసరం మనకు. మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మంత్రులకు, నేతలకు మరొకసారి రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను...అది ఫాసిల్ ఐతే గనక ఆ భూమిని వదిలేయండి దయచేసి. మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాము." అంటూ రేణు దేశాయ్ ఎంతో హృదయవిదారకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి వేడుకుంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రిలీజ్ చేసింది.

Brahmamudi: కూతరు కోసం మాట మార్చుకున్న యామిని తండ్రి.. రాజ్, కావ్య కలుస్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-684లో.. రాజ్, కావ్య కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలోనే యామిని వాళ్ళ నాన్న దగ్గరికి రాజ్ వస్తాడు. అంకుల్ నా జీవితంలో ఇంకెవరినైనా నేను మిస్ అవుతున్నానా.. అంతకముందు నా గతంలో ఇంకెవరైనా ఉన్నారా.. అని అడిగినప్పుడు యామినీ తండ్రి నిజం చెప్పబోతాడు కానీ వైదేహి అడ్డుపడి.. ఎవరుంటారు బాబు.. యామినీతోనే నువ్వు ఎక్కువ తిరిగే వాడివి.. ఎక్కువగా ఉండేవాడివి. మాకు తెలియకుండా ఎవరుంటారని అబద్దం చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత భర్తవైపు కోపంగా చూసిన వైదేహి‌.. నిజం చెప్పబోయాడని యామినీతో చెప్తుంది. ఏంటి డాడీ ఇది.. నా లైఫ్‌ని ఏం చెయ్యాలి అనుకుంటున్నావ్.. నేను ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానో తెలిసి కూడా నాకే ద్రోహం చెయ్యాలనుకుంటున్నావా అని యామినీ రెచ్చిపోతుంది. నేను నీ తండ్రిని బేబీ.. నీకు నేను ద్రోహం చేస్తానా అని అతను అంటాడు. మరి రామ్ అలా అడగ్గానే కావ్య గురించి ఎందుకు చెప్పాలనుకున్నావని అంటుంది. రాజ్ అలా బాధపడుతుంటే అని యామినీ తండ్రి చెప్తాడు. రాజ్ కాదు రామ్.. గుర్తు పెట్టుకో డాడీ.. రాజ్ కాదు రామ్ అంటూ అరుస్తుంది. అదే బేబీ.. అబ్బాయి వచ్చి నా ముందు అలా బాధపడుతూ అడుగుతుంటే ఏదో తప్పు చేసినా ఫీలింగ్ వచ్చింది. భార్యభర్తలను విడదీయడం పాపమనిపించింది. తనకు గతం గుర్తులేకపోయినా కావ్యను చూడగానే ఏదో తెలిసిన మనిషిలా ఫీల్ అవుతున్నాడంటే తన భార్యను ఎంతగా ప్రేమించి ఉండాలి. అందుకే గిల్టీగా అనిపించి అని యామినీ తండ్రి నసుగుతుంటే.. నిజం చెప్పేద్దామనుకున్నావ్ అంతే కదా.. రామ్ కళ్లల్లో ప్రేమని చూశావ్.. మరి నా పరిస్థితి నీకు కనిపించడం లేదా అని యామిని కోప్పడుతుంది. వెంటనే ఆవేశంగా చుట్టూ చూసి కత్తి చేత్తో పట్టుకుని.. డాడీ.. నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా.. నా రామ్‌ని నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నించినా.. వాళ్లను నేను క్షమించనంటూ యామిని ఊగిపోతుంది. బేబీ ఏం చేస్తున్నావ్ నువ్వు.. ఆయన మీ నాన్నా అని వైదేహి అంటుంది. కంగారు పడకు మమ్మీ.. తండ్రిని చంపేంత శాడిజం నాలో లేదు.. కానీ రామ్ దక్కకపోతే నన్ను నేను చంపుకోవడానికి కూడా అసలు ఆలోచించనని యామిని అంటుంది. నాకంటే ఆ రాజ్, కావ్యల ప్రేమే ఎక్కువ అనుకుంటున్నారుగా.. నన్ను చావనివ్వండి అని యామినీ అంటుండగా.. వెంటనే యామినీ తండ్రి ఆవేశంగా యామినీ చేతిలోని కత్తిలాక్కుని కిందపడేస్తాడు.  నాకు నా కూతురుకంటే ఏది ఎక్కువ కాదు బేబీ అని అరుస్తాడు. వెంటనే యామినీ ముఖంలో నవ్వు వస్తుంది. అవును బేబీ.. నీ తర్వాతే ఎవరైనా.. నీ మీద ఒట్టు.. రామ్‌తోనే నీ పెళ్లి అనేసి యామినీ తలపై ఒట్టు వేస్తాడు. దాంతో యామినీ సైకోలా నవ్వుకుంటుంది. మరోవైపు రేపు ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. ఏం అడగాలి?’ అని రాజ్ తపిస్తుంటే.. రేపు ఆయన ఏం అడుగుతారు.. ఏం మాట్లాడతారని కావ్య ఆలోచిస్తుంది. ఇక తెల్లారి రాజ్ రెడీ అయిపోయి మెల్లగా ఇంట్లోంచి జారుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ యామినీ తండ్రి, తల్లి రాజ్‌ని చూసి ఎక్కడికి బాబు అని అడుగుతారు. యామినీ ఏది ఆంటీ అని రాజ్ అడుగగా.. ఇంకా లేవేలేదు బాబు అని వైదేహీ అంటుంది. హమ్మయ్యా.. అని మనసులో అనుకున్న రాజ్.. నిన్నటి నుంచి మనసు ఏదోలా ఉంది ఆంటీ.. అమ్మ నాన్న గుర్తొచ్చారని అంటాడు. యామిని తల్లి షాక్ అవుతుంది. కాసేపు వెళ్లి సమాధుల దగ్గర కూర్చుని వచ్చేస్తానని రాజ్ అనగానే.. గతం గుర్తు రాలేదులే అని యామిని పేరెంట్స్ కూల్ అవుతారు. ఇక మరోవైపు కావ్య అందంగా రెడీ అయ్యి, మల్లెపూలు పెట్టుకుని ఆఫీస్‌కి వెళ్లొస్తానని అబద్దం చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేర్తుంది. అయితే కావ్య అబద్దం చెప్పిందేమోనని రాజ్ దగ్గరకు వెళ్తుందేమోననే అనుమానంతో రుద్రాణీ, రాహుల్ మరో కారులో కావ్యను ఫాలో చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.